
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు రమేష్ నాయుడు
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికలలోపే కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు రమేష్ నాయుడు అన్నారు. విభజన హామీలను పూర్తిగా నెరవేర్చాకే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కడప ఉక్కు పరిశ్రమకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తారని, మరో నెల రోజుల్లో తేదీ కూడా ప్రకటిస్తామని తెలిపారు.
బీజేపీకి క్రెడిట్ రాకూడదనే విధంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోందన్నారు. స్టీల్ ప్లాంట్ వస్తే తెలుగుదేశం మనుగడ కష్టమని ప్లాంట్ రాకుండా అడ్డుపడుతోందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారాయన.