
‘మాది బెన్నవరం గ్రామం. మా గ్రామానికి మంచి నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మంచి నీరు సరఫరా చేయాలని అధికారులకు చాలా సార్లు విన్నవించాం. అయినా పట్టించుకోవడం లేదు. నేను 2017లో డిగ్రీ పూర్తి చేశాను. బాబు వస్తే జాబు వస్తుందన్నారు. నేటికీ జాబు రాలేదు. ఒక్క నోటిఫికేషన్ కూడా చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వలేదు. జగన్ అన్నకు మా సమస్యలు తెలియజేశాం. మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి రోజులు వస్తాయన్నారు.’ అని పరవాడ దుర్గాభవానీ చెప్పారు.