25న జిల్లాకు రాహుల్ రాక | on25th rahul arrival in district | Sakshi

25న జిల్లాకు రాహుల్ రాక

Apr 21 2014 4:15 AM | Updated on Aug 17 2018 6:00 PM

వరంగల్ ఇస్లామియా కళాశాల మైదానాన్ని పరిశీలిస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల - Sakshi

వరంగల్ ఇస్లామియా కళాశాల మైదానాన్ని పరిశీలిస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ నెల 25న వరంగల్‌కు రానున్నారు.

భారీ సభకు కాంగ్రెస్ ఏర్పాట్లు
స్థలాలను పరిశీలించిన పొన్నాల

వరంగల్, న్యూస్‌లైన్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ నెల 25న వరంగల్‌కు రానున్నారు. రాహుల్ రాక సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వెల్లడించారు.

జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులను సమీకరించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. టీ పీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత జిల్లా కేంద్రానికి తొలిసారి వచ్చిన పాన్నాలకు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఆదివారం రాత్రి హన్మకొండలో జరిగిన ఎన్నికల ప్రచార సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన రాహుల్ ఈ నెల 25న వరంగల్ వస్తున్నట్లు ప్రకటించారు.

 సభా స్థలాల పరిశీలన

 రాహుల్ రాక సందర్భంగా ఏర్పాటు చేయనున్న సభాస్థలాలను టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల ఆదివారం సాయంత్రం పరిశీలించారు. పొన్నాలతో పాటు మాజీ మంత్రి బస్వరాజు సారయ్య తదితరులు వరంగల్‌లోని ఇస్లామియా కళాశాల మైదానం, హన్మకొండలోని జేఎన్‌ఎస్ గ్రౌండ్, బాలసముద్రంలోని హయగ్రీవాచారి మైదానం, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానాలను పరిశీలించారు.

సభకు హాజరయ్యే జనం, భద్రత ఇతరత్రా ఏర్పాట్లపై చర్చించారు. వరంగల్ ఉర్సులోని రంగలీల మైదానాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. సభ నిర్వహణకు అనువైన స్థలాన్ని ఎంపిక చేయనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో నాయిని రాజేందర్‌రెడ్డి, తాడిశెట్టి విద్యాసాగర్, డాక్టర్ బండా ప్రకాష్, వరదరాజేశ్వర్‌రావు, మంద వినోద్‌కుమార్, రాజనాల శ్రీహరి, ఈవీ.శ్రీనివాసరావు  తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement