ఏదో సరదాకోసం అలా చేశా! | FAKING it all along ‘to amuse herself’ | Sakshi
Sakshi News home page

ఏదో సరదాకోసం అలా చేశా!

Dec 6 2017 7:15 PM | Updated on Dec 6 2017 7:15 PM

FAKING it all along ‘to amuse herself’ - Sakshi

హీరోయిన్‌ మీద అభిమానంతో 50 సర్జరీలు చేయించుకుని.. దయ్యంలా మారిన యువతి గురించి మీకు తెలిసేఉంటుంది. ఏంజెలీనా జోలీ వీరాభిమానిగా చెప్పుకుంటూ.. అలా మారిపోయేందుకు 50 ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకుని.. గుర్తుపట్టలేనంత మారిపోయిన ఇరాన్‌ యువతి.. సహర్‌ తబర్‌ నిజానికి ఎటువంటి సర్జరీలు చేయించుకోలేదట. మోడ్రన్‌ మేకప్‌తో పాటు.. ఫొటోషాప్‌ టెక్నాలజీతో సహర్‌ తబర్‌ ఫొటోలను అలా మార్చుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసినట్లు తెలిసింది.


సహర్‌ ఒక పత్రికతో పాట్లాడుతూ.. నాకు నిజంగానే ఏంజెలినీ జోలీ అంటే ఇష్టం. నేను ఆమెలా ఉంటాను.. అనే నమ్మకం నాకుంది. నేను ఆమెలా మారితో ఎలా ఉంటుందోనన్న ఆకాంక్షతో ఈ ప్రయోగం చేసినట్లు చెప్పింది. మరో విషయం ఏమిటంటే.. ఆ ఫొటో కోసం 40 కేజీల బరువు తగ్గినట్లు పేర్కొంది. బరువు తగ్గడం కోసం చాలా కష్టపడ్డట్లు తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫొటోను చూసి చాలామంది షాక్‌గురయ్యారని సహర్‌ తబర్‌ చెప్పింది.


‘నేను అందవికారంగా లేనని.. ఇదిగో ఇలా ఉన్నానంటూ’ ప్రస్తుత ఫొటో ఒకటి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో మరోసారి పోస్ట్‌ చేసింది. ఇదిలా ఉండగా.. ఈ ఫొటో పోస్ట్‌ చేయడానికి ముందు.. సోషల్‌ మీడియాలో చాలా తక్కువగా ఫాలోవర్లు.. ఉండేవారు. ఇప్పుడు దాదాపు.. ఫాలోవర్ల సంఖ్య దాదాపు 8 లక్షలకు చేరింది.

1
1/5

2
2/5

3
3/5

4
4/5

5
5/5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement