డ్రోన్లలో కీటకాల టెక్నాలజీ | london university developing new technology in drones | Sakshi

డ్రోన్లలో కీటకాల టెక్నాలజీ

Apr 8 2016 12:03 PM | Updated on May 25 2018 1:14 PM

ఎంతో వేగంతో దూసుకొచ్చే కీటకాలు చెట్లకుండే చిన్ని రంధ్రాల్లోకి అంత నేరుగా ఎలా దూసుకుపోతాయి?

లండన్: ఎంతో వేగంతో దూసుకొచ్చే కీటకాలు చెట్లకుండే చిన్ని రంధ్రాల్లోకి అంత నేరుగా ఎలా దూసుకుపోతాయి? దట్టమైన అడవుల్లో ఎగురుతున్నా వేటికీ తాకకుండా అంత కచ్చితంగా తమ ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తాయి? ఈ ప్రశ్నలే శాస్త్రవేత్తల్లో కొత్త ఆలోచనలకు పురుడుపోస్తున్నాయి. డ్రోన్లలో కూడా ఇటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తే ఇక వాటిని మనిషి ఆపరేట్ చేయాల్సిన అవసరమే ఉండదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకోసం కీటకాల కళ్లపై పరిశోధనలు చేసి ఎన్నో కొత్త విషయాలను కనుగొన్నారు. దట్టమైన అడవుల్లో ఎంత వేగంగా దూసుకుపోయినా చిన్నపాటి ప్రమాదాన్ని కూడా కీటకాలు ఎదుర్కోకపోవడానికి కారణం వాటి కంటి నిర్మాణమేనని గుర్తించారు.

కాంతి తీవ్రతను వేగంగా అంచనా వేయగలశక్తి కీటకాల కళ్లకు ఉందని, అందుకే అవి తమ గమ్యాన్ని అంత కచ్చితంగా చేరతాయని చెబుతున్నారు. 360 డిగ్రీలు చూడగల కీటకాల కంటి నిర్మాణాన్ని పోలిన కెమెరాలను డ్రోన్లకు అమర్చి, వాటి సంకేతాల సాయంతో అవి ప్రయాణించేలా చేయగలిగితే డ్రోన్లు సైతం మనుషుల సాయం లేకుండానే కచ్చితమైన వేగంతో గమ్యాన్ని చేరతాయంటున్నారు. అయితే ఇది సాకారం కావడానికి పది నుంచి పదిహేనేళ్లు పట్టొచ్చని స్వీడన్‌లోని లండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement