నేను, సందీప్ కలిసి చేసిన మూడో సినిమా ‘నగరం’. ఈ చిత్రానికి ఇంత మంచి ఆదరణ రావడం హ్యాపీ. ప్రేక్షకులు మా సినిమాను ఎంతగానో ఆదరిస్తున్నారు.
‘‘నేను, సందీప్ కలిసి చేసిన మూడో సినిమా ‘నగరం’. ఈ చిత్రానికి ఇంత మంచి ఆదరణ రావడం హ్యాపీ. ప్రేక్షకులు మా సినిమాను ఎంతగానో ఆదరిస్తున్నారు. విమర్శకులు సైతం బాగుందని ప్రశంసిస్తున్నారు. దర్శకుడు లోకేష్ ఈ మూవీని చక్కగా తెరకెక్కించారు. చిత్రాన్ని ఆదిరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని రెజీనా అన్నారు. సందీప్ కిషన్, రెజీనా, శ్రీ ముఖ్యపాత్రల్లో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో అశ్వనీకుమార్ సహదేవ్ సమర్పణలో ఏకెఎస్ ఎంటర్‌టైన్‌మెంట్, పొటెన్షియల్ స్టూడియోస్ నిర్మించిన ‘నగరం’ గత శుక్రవారం విడుదలైంది.
సందీప్ కిషన్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా విడుదల టైమ్‌లో నేను, రెజీనా వేరే సినిమా షూటింగ్ కోసం మలేసియాలో ఉన్నాం. ప్రేక్షకులు సినిమాని ఆదరిస్తున్నారని తెలిసి, ఆనందపడ్డాం. కథ బాగుండటంవల్లే ఈ విజయం. కొన్ని కారణాల వల్ల ‘నగరం’ ఆలస్యంగా విడుదలైంది. అయినా తెలుగు, తమిళంలో పెద్ద హిట్ అయ్యింది. తెలుగు హీరోకు తమిళంలో ఇంత పెద్ద సక్సెస్ రావడం, రెండో వారంలో మరిన్ని థియేటర్స్ పెరగడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు.