వీర్రాజుకు టీడీపీ నేత వార్నింగ్‌ | tdp leader given warning to somu veerraju | Sakshi
Sakshi News home page

సోము వీర్రాజుకు టీడీపీ నేత హెచ్చరిక

Feb 5 2018 3:48 PM | Updated on Oct 22 2018 8:57 PM

tdp leader given warning to somu veerraju - Sakshi

సోము వీర్రాజు, బచ్చుల అర్జునుడు

సాక్షి, విజయవాడ : బీజేపీ నేత సోము వీర్రాజుకు టీడీపీ నేతల నుంచి హెచ్చరికలు ఎక్కువయ్యాయి. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఇలాంటి హెచ్చరికలే జారీ చేశారు. ఇలాంటి వాగుడు వాగితే.. ఆయన బయట తిరగలేడని ఘాటుగా హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తల ఆగ్రహానికి సోము వీర్రాజు గురవుతాడన్నారు.

తమ దయాదాక్షిణ్యాలతో ఎమ్మెల్సీ అయ్యాడని అట్లాంటి సోము వీర్రాజు, ఇప్పుడు డబ్బా వాగుడు.. చెత్త వాగుడు మాటలు మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సోము వీర్రాజుకు వ్యతిరేకంగా బందరు రోడ్డులో టీడీపీ నేతలు ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. వీర్రాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కాగా, టీడీపీ నాయకులు అవినీతికి వారసులంటూ సోము వీర్రాజు ఆదివారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండెకరాల నుంచి లక్షల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. కేంద్ర నిధులు రాష్ట్రంలో స్వార్థపరులకు ఆదాయ వనరులుగా మారాయని ఆరోపించారు. స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో భారీ అవినీతి జరిగింది నిజం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబుపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడ్డానని వీర్రాజు ప్రకటించారు. తన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement