దూసుకెళుతోన్న హంపి, హారిక | Humpy And Harika In Second Spot After 8th Round | Sakshi

దూసుకెళుతోన్న హంపి, హారిక

Dec 28 2019 10:12 AM | Updated on Dec 28 2019 10:12 AM

Humpy And Harika In Second Spot After 8th Round - Sakshi

మాస్కో: ప్రపంచ మహిళల ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. టోర్నీలో ఎనిమిది రౌండ్ల అనంతరం వీరిద్దరూ 6 పాయింట్లతో సమంగా నిలిచినప్పటికీ... ర్యాంకుల్ని వర్గీకరించగా హంపి ఐదో స్థానంలో, హారిక ఎనిమిదో స్థానంలో ఉన్నారు. 6.5 పాయింట్లతో రొమేనియా ప్లేయర్‌ బల్మగ ఇరినా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

 శుక్రవారం మొత్తం నాలుగు రౌండ్లు జరుగగా హంపి ఐదో గేమ్‌లో గిర్యా ఓల్గాపై గెలుపొంది, ఆరో గేమ్‌లో బల్మగ ఇరినా చేతిలో ఓడిపోయింది. ముజిచుక్‌ అనాతో ఏడో గేమ్‌ను డ్రా చేసుకున్న ఆమె.. ఎనిమిదో గేమ్‌లో జనిజె ననాపై గెలుపొందింది. మరోవైపు హారిక మూడు గేమ్‌ల్ని డ్రా చేసుకొని ఒక గేమ్‌లో గెలుపొందింది. గలియామోవా అలీసా (ఆరో గేమ్‌)పై గెలుపొందిన హారిక... కశ్‌లిన్‌స్కాయా అలీనా (ఐదో గేమ్‌), పొగోనినా నటలిజా (ఏడో గేమ్‌), లగ్నో కాటెరినా (ఎనిమిదో గేమ్‌)లతో మ్యాచ్‌ల్ని డ్రా చేసుకుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement