ఏపీ సీఎం ఎందుకంత ఉలిక్కిపడుతున్నారు? | KTR Questions Why AP CM Chandrababu Naidu Responds IT Raids On Cm Ramesh And Revanth Reddy | Sakshi

ఏపీ సీఎం ఎందుకంత ఉలిక్కిపడుతున్నారు?

Oct 13 2018 7:25 PM | Updated on Oct 13 2018 7:47 PM

 KTR Questions Why AP CM Chandrababu Naidu Responds IT Raids On Cm Ramesh And Revanth Reddy - Sakshi

హైదరాబాద్‌ : సీఎం రమేష్‌, రేవంత్‌ రెడ్డిపై దాడులు జరుగుతుంటే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని తెలంగాణ తాజా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేత రేవంత్‌ ఇంట్లో సోదాలు జరిగితే బాబుకు సంబంధమేమిటని అన్నారు. ఎక్కడ ఐటీ సోదాలు జరిగినా.. కేబినెట్‌లో చర్చించి మరీ ఆవేదన తెలుపుతున్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

ఐటీ దాడులు జరుగుతుంటే చంద్రబాబుకు ఏమూలనో భయముందని అన్నారు. చంద్రబాబు చేతిలో కాంగ్రెస్‌ నేతలు తోలుబొమ్మల్లా మారుతున్నారని ఎద్దేవా చేశారు. 2009లో చంద్రబాబుతో పొత్తును కేసీఆర్‌ అయిష్టంగానే ఒప్పుకున్నారని చెప్పారు. నిరుద్యోగ భృతి పరిశీలనలో ఉందన్నారు. దసరా తర్వాత మేనిఫెస్టో ప్రకటన, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రచారం ఉంటుందని కేటీఆర్‌ తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement