

భారతదేశంలో వేలకోట్ల రూపాయల కొంభకోణానికి పాల్పడి దేశం దాటిపోయిన విజయ్ మాల్యాకు ఖరీదైన అన్యదేశ కార్ల సేకరణ అంటే చాలా ఇష్టం.

ఈ కారణంగానే ఈయన గ్యారేజిలో రోల్స్ రాయిస్, బెంజ్, పోర్స్చే మొదలైన బ్రాండ్ కార్లు ఉండేవి.

ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ కారు ఫెరారీ 328 జీటీఎస్. ఈ కారును ఈ మధ్య కాలంలోనే మళ్ళీ కొత్తగా రీస్టోర్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

భారత్ నుంచి ఇతర దేశాలకు పారిపోయిన తరువాత విజయ్ మాల్యా ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, కొన్నింటిని వేలంలో విక్రయించింది.

ఈ కారు ఇప్పుడు మాల్యా ఫెరారీ 328 జీటీఎస్.. గైక్వాడ్ రాజు 'సంగ్రామ్‌సిన్హ్ ప్రతాప్‌సిన్హ్' ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారుకు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ఉండటం చూడవచ్చు.

ఫెరారీ 328 జీటీఎస్ 1985లో మార్కెట్లో అడుగుపెట్టింది.అప్పట్లో వేగవంతమైన కార్ల జాబితాలో ఇది కూడా ఒకటిగా ఉండేది.


ఇండియాలో ఉన్నప్పుడు విజయ్ మాల్యా.. అనేక ఖరీదైన కార్లను వినియోగించేవారు. ఇందులో మెర్సిడెస్ 220ఎస్ఈ, ఫెరారీ 512M & లంబోర్ఘిని కౌంటాచ్, 1903 హంబర్, బెంట్లీ ఫ్లయింగ్ స్పర్, మెర్సిడెస్ 300SL గుల్వింగ్ మొదలైనవి ఉన్నట్లు సమాచారం.


