decorative objects
-
Makara Thoranam మకర తోరణం,రాక్షస ముఖం కథ ఏమిటి?
వివిధ దేవాలయాలలో ద్వారతోరణ మధ్యభాగంలో కనుగుడ్లు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక రాక్షసముఖం కనబడుతుంది. దానికే మకరతోరణమని పేరు. ఈ రాక్షసముఖాన్ని తోరణమధ్యంలో అలంకరించటానికి గల కారణం గురించి స్కంద మహాపురాణంలో ఒక కథ ఉంది.పూర్వం ‘కీర్తిముఖుడ‘నే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేక వరాలు పొంది అలా వచ్చిన బలపరాక్రమాలతో సమస్త భువనాలలోని సంపదలను తన సొంతం చేసుకున్నాడు. చివరకు నారదుని ప్రేరణతో శివపత్ని జగన్మాతను కూడా పొందాలని ఆశపడ్డాడు. అతని దురాశను చూసి కోపించిన మహేశ్వరుడు అతనిని మింగివేయమని అతిభీకరమైన అగ్నిని సృష్టించాడు. లోకాలను అన్నింటినీ మింగివేస్తూ ఆ అగ్ని ఆ రాక్షసుణ్ణి తరమసాగింది. మరణం లేకుండా వరం పొందిన కీర్తిముఖుడు ఆ అగ్ని తనను ఎక్కడ దహించివేస్తుందో అని భయంతో పరుగులు తీస్తూ అన్నిలోకాలూ తిరిగి ఆ అగ్ని ప్రతాపానికి తట్టుకోలేక చివరకు పరమశివుని శరణు వేడాడు. భక్తవశంకరుడైన శివుడు ఆ రాక్షసుణ్ణి రక్షించటంకోసం ఆ అగ్నిని ఉపసంహరించి తన నుదుట మూడవకన్నుగా ధరించాడు. ఆ తరువాత కీర్తిముఖుడు తనకు తట్టుకోలేనంత ఆకలిగా ఉందని, తను తినటానికి ఏదైనా పదార్థాన్ని చూపమని మహాదేవుని కోరాడు. యుక్తిగా శివుడు ‘నిన్ను నువ్వే తిను‘ అని చెప్పాడు. శివుని వచనానుసారం మొసలి రూపును ధరించి ఆ కీర్తిముఖుడు తనను తాను ముందుగా తోకభాగం నుంచి తినటం మొదలు పెట్టాడు. తన శరీరాన్ని అలా తింటూ తింటూ కంఠం వరకూ తిన్నాడు. తన తలను తానే ఎలా తినాలో అతనికి తెలియలేదు. అతని ఆకలి ఇంకా తీరలేదు. శివుని ప్రార్థించాడు. నీవు ఈ నాటినుంచి సమస్త దేవాలయాలలో తోరణాగ్రభాగాన్ని అలంకరించు. దేవతా దర్శనానికి వచ్చే ప్రజలందరిలో ఉండే దుష్టమైన అహంకారాన్ని, ఆశను తింటూ ఉండు. నీవు అందరికీ పూజనీయుడవు అవుతావు ‘అని వరమిచ్చాడు. ఆ నాటినుంచి కీర్తిముఖుడు దేవాలయాలలోని తోరణ మధ్యభాగాన్ని తన రాక్షస మకర ముఖంతో అలంకరించి భక్తులలో ఉండే వికారాలను, అహంకారాన్ని, దురాశను కబళిస్తూ విరాజిల్లుతున్నాడు. అందుకనే దేవతామూర్తుల వెనుకనుండే తోరణానికి మకర తోరణం అని పేరు వచ్చింది. -
తాటి ఆకుల కళ..! 75 ఏళ్ల బామ్మ..
అవసరం ఒక ఆవిష్కరణకు దారి వేసింది. ఆర్థిక అవసరాలే తనను హ్యాండీక్రాఫ్ట్ కళాకారిణిగా తీర్చిదిద్దాయని చెప్పారు బాల త్రిపుర సుందరి. తాటి ఆకులతో గృహోపకరణాలు, అలంకరణ వస్తువులు తయారు చేస్తారామె. వీటి తయారీలో మహిళలకు శిక్షణనిస్తారు కూడా. తాటి ఆకు కళారూపాల తయారీలో యాభై ఏళ్ల అనుభవం ఆమెది. ఒక నిర్ణయం జీవితాన్ని మార్చేసింది! త్రిపుర సుందరికి 75 ఏళ్ల వయసు. ఆమెది తూర్పుగోదావరి జిల్లాలో ఓ కుగ్రామం. చదువుకు నోచుకోని త్రిపుర సుందరి 1972లో ముంబయికి వెళ్లి హస్తకళాకృతుల తయారీలో సర్టిఫికేట్ కోర్సు చేశారు. అక్కడ నేర్పించిన కళారూపాల తోపాటు తన క్రియేటివిటీతో మరికొన్ని రూపాలను తయారు చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో హస్తకళాకృతుల ఎగ్జిబిషన్లలో స్టాల్ పెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజాలో పామ్ క్రాఫ్ట్ కళాకృతులను ప్రదర్శిస్తున్నారు. పనిలోనే ఆనందం ‘‘మా ఊరిలో తెలిసిన వాళ్ల ద్వారా ముంబయిలో శిక్షణ కోర్సు గురించి తెలిసింది.. మూడు నెలల కోర్సు, బస భోజన వసతులు వాళ్లే ఏర్పాటు చేస్తారని చెప్పారు. చదువు లేదు, భాష ఇబ్బందవుతుందేమోనని భయంతోనే వెళ్లాను. కానీ అక్కడ తెలుగు వాళ్లు కూడా ఉండడంతో ఇబ్బంది కలగలేదు. క్రమంగా హిందీలో చెప్తున్న విషయాలు అర్థం కాసాగాయి. కోర్సు పూర్తయిన తర్వాత మా ఊరికి వచ్చి, నిడదవోలులో ఉన్న తాటిబెల్లం ఫెడరేషన్ లో ట్రైనర్‌గా ఉద్యోగంలో చేరాను. బదలీ మీద 1983లో హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కి వచ్చాను. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్‌తో కూడా పని చేశాను. ఆ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు కూకట్పల్లి, హౌసింగ్ బోర్డులో మా ఇంటి దగ్గర నాకు నచ్చిన కళారూపాలు అల్లుకుంటూ, ఎగ్జిబిషన్లలో స్టాల్ పెడుతున్నాను. వీటితోపాటు తుక్కుగూడలోని నీరా యూనిట్లో శిక్షణనిస్తున్నాను. బంధువులు, స్నేహితులు ఇంకా పని చేయడం ఎందుకని అడుగుతుంటారు. పిల్లల బాధ్యతలు పూర్తయ్యాయి, నేను పని చేయకపోతే అడిగేవాళ్లు కూడా లేరు. కానీ నాకు పని చేయకుండా కూర్చుని తినడం ఇష్టం ఉండదు. ఆరోగ్యం బాగున్నప్పుడు పని మానేయడం ఎందుకు?’’ అంటూ స్టాల్లో ఆమె బొమ్మల ధరలు అడుగుతున్న వారికి బదులివ్వడంలో మునిగిపోయారామె. -విఎమ్ఆర్ఫోటోలు: ఎస్ఎస్ ఠాకూర్(చదవండి: నగదు రహిత చెల్లింపుల్లో అంతకుమించి..!వాట్ ఏ టెక్నాలజీ..?) -
ఫెస్టివ్ జోష్
క్రిస్మస్ కలర్స్‌తో సిటీ కళకళలాడుతోంది. గోథె జంత్రమ్లో శనివారం ఏర్పాటు చేసిన క్రిస్మస్ మార్కెట్.. ఫెస్టివ్ జోష్‌ను మరింత పెంచింది. అలంకరణ వస్తువులు, చాక్లెట్ హౌస్‌లు, స్టార్స్ వంటి కలెక్షన్ ఆకట్టుకుంది. క్రిస్మస్ కోసం తయారుచేసిన సరికొత్త డిజైన్ దుస్తులు విదేశీ వనితల మనస్సును దోచుకున్నాయి. సిటీకి చెందిన రాక్ బాండ్ విట్నెస్వైడ్-గ్లోరియా బృందం పాటలకు మ్యూజిక్ లవర్స్ స్టెప్పులేశారు.