demands
-
బడ్జెట్‌పై సామాన్యుల ఆశలు
-
ఆర్టీసీలో సమ్మె నోటీసు
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల విషయంలో ఆర్టీసీ(RTC) యాజమాన్యం, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ ఆర్టీసీలోని కొన్ని సంఘాలు, మరికొన్ని సంఘాల్లోని చీలిక వర్గాలు సోమవారం సాయంత్రం సమ్మె నోటీసు జారీ చేశాయి. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సెలవులో ఉండటంతో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్‌ను కలిసి నోటీసు, డిమాండ్ల జాబితాను అందజేశాయి. ఆర్టీసీ యాజమాన్యం స్పందించని పక్షంలో ఫిబ్రవరి 9 నుంచి లేదా, ఆ తర్వాత ప్రకటించే తేదీ నుంచి సమ్మెకు దిగుతామని ప్రకటించాయి. ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ థామస్‌రెడ్డి వర్గం, ఎన్ఎంయూ మౌలానా వర్గం, బీకేయూ, బీడబ్ల్యూయూ, కార్మిక పరిషత్‌లు సమ్మె నోటీసు జారీ చేశాయి. 21 డిమాండ్లతో.. పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ, బకాయిల చెల్లింపు, ఖాళీల భర్తీ జరగక ఉన్న సిబ్బందిపై అదనపు భారం, ఆర్టీసీలో అద్దె బస్సులు పెరిగి పోస్టుల సంఖ్య తగ్గిపోతుండటం, అద్దె ప్రాతిపదికన తీసుకునే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వాహకులకు డిపోలు అప్పగించే యోచన, ఆర్టీసీ సొంతానికి వాడుకున్న సహకార పరపతి సంఘం, పీఎఫ్ ట్రస్టు నిధులను తిరిగి చెల్లించకపోవటం... ఇలా మొత్తం 21 డిమాండ్లను సంఘాలు ఆర్టీసీ అధికారుల ముందుంచాయి. కార్మికుల్లో అయోమయం.. సమ్మె విషయంలో ఆర్టీసీలోని సంఘాలు ఐక్యంగా లేకపోవటం ఇప్పుడు కార్మికుల్లో అయోమయానికి కారణమైంది. ⇒ గతంలో ప్రధాన సంఘాలుగా ఉన్న ఎంప్లాయీస్ యూనియన్ నుంచి ముఖ్యనేత రాజిరెడ్డి వైదొలిగి కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్న ఎస్డబ్ల్యూయూలో ఉన్నారు. ఇప్పుడు ఆ సంఘం సమ్మెకు దూరంగా ఉంది. ⇒ మరో ప్రధాన సంఘం టీఎంయూలో అశ్వత్థామరెడ్డి, తిరుపతి వర్గం సమ్మెకు దూరంగా ఉంది. ⇒ ఎన్‌ఎంయూలో నరేందర్ వర్గం సమ్మెను వ్యతిరేకిస్తోంది. మిగతా సంఘాలు కూడా సమ్మెకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. ⇒ ఇప్పుడు సమ్మెకు దూరంగా ఉన్న ఎస్‌డబ్ల్యూయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌లు ఈనెల 24, 25 తేదీల్లో డిపోల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ⇒ ప్రస్తుతం సమ్మెకు దూరంగా ఉన్న సంఘాల ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యలను కలుస్తూ డిమాండ్ల పరిష్కారానికి వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. ఇలా రెండు వర్గాలుగా విడిపోయిన సంఘాలు, వాటి చీలిక వర్గాల నేతలు పరస్పరం విమర్శలు, ఆరోపణలతో కార్మికుల్లో కూడా చీలిక ఏర్పడుతోంది. వచ్చే నెల 9 తర్వాత ఎప్పుడైనా సమ్మె మొదలు ‘చాలాకాలంగా ఉన్న సమస్యల విషయంలో యాజమాన్యం తీరుతో విసిగిపోయి సమ్మె నోటీసు ఇచ్చాం. వచ్చే నెల 9 తర్వాత ఎప్పుడైనా సమ్మె ప్రారంభిస్తాం. ఇప్పటికే సగం డిపోల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాం. మిగతా డిపోల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తాం’అని ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వెంకన్న తెలిపారు. -
భర్త నుంచి.. వామ్మో ఇవేం కోరికలు.. కానుకలు!
దుబాయ్‌కి (Dubai) చెందిన ఒక మిలియనీర్ భార్య తాను గర్భిణిగా ఉన్నప్పుడు తన భర్తను కోరిన కోరికలను వింటే మతిపోతుంది. తన సంపన్నమైన, విలావంతమైన జీవనశైలిని తెలియజెప్పేలా ఫొటోలను, వీడియోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేరే లిండా ఆండ్రేడ్ (Linda Andrade) అనే మహిళ గర్భిణిగా ఉన్నప్పుడు తన భర్త నుంచి తాను ఏమేమి కోరిందో పేర్కొంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ లిస్ట్ విని వామ్మో ఇవేం డిమాండ్లు అని ముక్కున వేలేసుకోవడం నెటిజన్ల వంతైంది.ఎప్పుడూ షాపింగ్ చేస్తూ విలాసాల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసే లిండా, తనను తాను "అసలైన దుబాయ్ గృహిణి" అని అభివర్ణించుకుంటుంది. ఆమె రికీ అనే మిలియనీర్‌ను వివాహం చేసుకుంది. “ఇవి సరిపోతాయా?” అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన వీడియోలో లిండా తన భర్త నుంచి ఖరీదైన లంబోర్గిని కారు (Lamborghini), 9 క్యారెట్ల డైమండ్ రింగ్, కేజీలకొద్దీ బంగారం (gold), ఇతర వస్తువులను కానుకలుగా అడిగినట్లు వెల్లడించింది."దుబాయ్‌లో హాట్ మామ్స్ మాత్రమే ఉంటారు" అంటూ భర్త తన కోసం కొన్న సరికొత్త విల్లాను పరిచయం చేసింది. అలాగే ఇటీవల భర్త కొనిచ్చిన ఖరీదైన హీర్మేస్ క్రోకోడైల్ హ్యాండ్‌బ్యాగ్‌ను కూడా ఫాలోవర్లకు చూపించింది. అంతేకాదు భర్త నుంచి సరికొత్త లంబోర్ఘిని కారును బహుమతిగా పొందినట్లు పేర్కొంది. ఆమె డిమాండ్లు ఇక్కడితో ఆగలేదు. తొమ్మిది నెలల గర్భానికి సంకేతంగా 9 క్యారెట్ డైమండ్ రింగ్.. ప్రసవించే ముందు తన బిడ్డ బరువుకు సమానమైన బంగారం కూడా కానుకల జాబితాలో ఉన్నాయి.ఈ వీడియోకు 1.16 లక్షల లైక్‌లు, 2,700 పైగా కామెంట్లు వచ్చాయి. చాలా మంది ఆమె వీడియోకు ప్రతిస్పందించారు. లిండా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఇటువంటివి అనేక వీడియోలను పోస్ట్ చేస్తూ ఆమె కొనుగోలు చేసిన కొత్త ఉత్పత్తులను చూపుతుంటుంది. కొత్త సంవత్సరానికి ఒక రోజు ముందు షేర్ చేసిన వీడియోలో 2 లక్షల డాలర్ల వాచ్, 67,000 డాలర్ల విలువైన వైవ్స్ సెయింట్ లారెంట్ ఆర్కైవల్ పీస్తో సహా తాను కొన్న ఖరీదైన వస్తువులను పంచుకుంది. View this post on Instagram A post shared by Linda Andrade (@lionlindaa) -
గురుకుల టీచర్లకు సర్కార్ బెదిరింపులు
సాక్షి, అమరావతి: న్యాయమైన తమ డిమాండ్లు తీర్చాలని శాంతియుతంగా సమ్మె చేస్తున్న గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల పొట్ట కొట్టేందుకు కూటమి ప్రభుత్వం షోకాజ్ నోటీసు పేరుతో మరో అస్త్రాన్ని ప్రయోగించింది. డీఎస్సీ నుంచి గురుకుల టీచర్ల పోస్టులు మినహాయించాలని, కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్లు (సీఆర్టీ)గా గుర్తించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే తదితర ప్రధాన డిమాండ్లతో గత నెల 16 వ తేదీ నుంచి రాష్ట్రంలోని 1,656 మంది గురుకుల టీచర్లు సమ్మె బాట పట్టారు. రాష్ట్రంలోని విజయవాడ ధర్నా చౌక్‌తోపాటు సీతంపేట, పార్వతీపురం, పాడేరు గిరిజన సమీకృత అభివృద్ధి (ఐటీడీఏ) కార్యాలయాల వద్ద శాంతియుత ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయితే వారి డిమాండ్లను పరిశీలిస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రితో సహా ఉన్నతాధికారులు రెండు దఫాలుగా ఇచ్చిన హామీలు బుట్టదాఖలు చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 371 ఆశ్రమ పాఠశాలల నుంచి 550 మంది ఉపాధ్యాయులను గురుకులాల్లో బోధనకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. గురుకుల ఔట్ సోర్సింగ్ టీచర్లు గతంలో ఉన్న షరతులకు లోబడి మూడు రోజుల్లో విధుల్లో చేరాలని, లేదంటే విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు పరిగణించి తదుపరి చర్యలు తీసుకుంటామని తాజాగా గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ బెదిరింపులకు దిగారు. ఆయా గురుకుల కాలేజీల ప్రిన్సిపాళ్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ సంస్థలో పనిచేసే ఔట్ సోర్సింగ్ టీచర్లకు నోటీసులు అందిస్తున్నారు. కాగా, గిరిజన గురుకులాల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న జేఎల్, పీజీటీ, టీజీటీ, పీడీ, పీఈటీ, ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్లు 11 నుంచి 20 రోజులుగా అనుమతి లేకుండా సమ్మె చేస్తున్నారని ఆ షోకాజ్ నోటీసులో పేర్కొనడం గమనార్హం. -
Kolkata: వెనక్కి తగ్గని వైద్యులు.. ఆగని నిరసనలు
కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటనపై ఆగ్రహాజ్వాలలు, నిరసనలు చల్లారడం లేదు. బాధితురాలికి న్యాయ చేయాలని, నిందితులను కఠినంగాశిక్షించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ వైద్యులు, వైద్య సిబ్బంది చేపట్టిన ఆందోళనలు నిరంతరంగా కొనసాగుతూనేఉన్నాయి. నిరసన చేస్తున్న వైద్యులతో బెంగాల్ ప్రభుత్వం చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. వైద్యులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.మమతా బెనర్జీ సర్కార్ ఇప్పటికే కోల్‌కతా కమిషనర్‌తో సహాల పలువురు అధికారులను బదిలీ చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం తమ డిమాండ్లను అన్నీంటినీ నెరవేర్చేవరకు సమ్మె కొనసాగిస్తామని వైద్యులు స్పష్టం చేశారు. ఇంకా నెరవేర్చాల్సిన డిమాండ్లను వినిపించేందుకు దీదీ సర్కారుతో మరోసారి చర్చలు జరుపుతామని తెలిపారు.అయితే తమ నిరసనల ఉద్యమాన్ని కించపరిచేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయని పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్ల ఫ్రంట్ ఒక ప్రకటనలో తెలిపింది. తమ సమ్మె ఒత్తిడి కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం పోలీసు కమిషనర్, డిప్యూటీ కమిషనర్ నార్త్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లను తొలగించాల్సి వచ్చిందని తెలిపారు. అయితే ఇది తమ ఉద్యమానికి లభించిన పాక్షిక విజయం మాత్రమేనని పేర్కొన్నారు.కోల్‌కతా సీపీగా మనోజ్ వర్మసోమవారం ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ తొలగించాలన్న తమ డిమాండ్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వైద్యులు తెలిపారు. ముఖ్యమంత్రి మౌఖిక హామీ ఇచ్చారని.. ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు వేయలేదన్నారు. అంతేగాక ప్రభుత్వ ఆసుపల్లో సురక్షిత వాతావరణం కల్పించాలని కోరారు. ఆసుపత్రుల వద్ద భద్రతను పెంచి, హెల్త్‌కేర్ సేవలు మెరుగుపరిచే వరకు వైద్యుల భద్రతకు భరోసా ఉండదని చెప్పారు. ఆసుపత్రులలో ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, కౌన్సెలింగ్ సేవలను మరింత నియమించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి బెడ్ల కేటాయింపులో అవినీతి, ప్రాణాధార మందుల కొరత కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కావాలని కోరుతున్నామని వైద్యులు తెలిపారు.ఇదిలా ఉండగా మహిళా వైద్యులు నైట్ డ్యూటీలు చేయొద్దన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నిర్దేశాలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అలా చెప్పే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ‘‘పైలట్లుగా, సైనికులుగా మహిళలు రాత్రి విధులు నిర్వహించడం లేదా? మీ నిర్దేశాలు మహిళా వైద్యుల కెరీర్‌పై ప్రభావం చూపుతాయి. రాత్రి విధుల్లో సమస్యలు ఎదుర్కోకుండా వారికి అవసరమైన భద్రత కల్పింపంచడం ప్రభుత్వ బాధ్యత. అంతే తప్ప వాటిని మానుకోవాలని చెప్పడం సరికాదు’’ అంటూ సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం మందలించింది. దాంతో సదరు నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటామని బెంగాల్ సర్కారు విన్నవించింది. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టు: ఆందోళనకు దిగిన క్యాబ్ డ్రైవర్లు
సాక్షి,శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్ ముందు క్యాబ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఇతర రాష్ట్రాల క్యాబ్‌లను ఎయిర్‌పోర్టులోకి అనుమతించకూడదని డ్రైవర్లు నినాదాలు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న క్యాబ్‌ల వల్ల తమకు ఇబ్బంది కలుగుతోందని వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల క్యాబ్ లు నడవడంతో తమకు గిట్టుబాటు కావడం లేదని తెలిపారు. తమకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని క్యాబ్ డ్రైవర్లు పోలీసులకు తెగేసి చెబుతున్నారు. కాగా, నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు నడిచే ట్రిప్పులపైనే క్యాబ్ డ్రైవర్లు ఎక్కువగా ఆధారపడుతున్న విషయం తెలిసిందే. -
ఆక్వా రైతుల ఉద్యమ బాట
సాక్షి, అమరావతి: ఆక్వా రంగ సమస్యల పరిష్కారానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆక్వా రైతులు ఉద్యమ బాట పడుతున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే ప్రకటించేందుకూ సిద్ధమవుతున్నారు. ఈ నెల 3న తలపెట్టిన ‘ఛలో పాలకొల్లు’ ద్వారా భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. అకాడెమీ ఆఫ్ సస్టైనబుల్ ఇంటిగ్రేటెడ్ లివింగ్, జై భారత్ క్షీర రామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి తీర ప్రాంత జిల్లాల రైతులు పాల్గొంటున్నారు.ఈ సమావేశంలో చర్చించే అంశాలు, తీర్మానాల వివరాలను అకాడెమీ ఆఫ్ సస్టైనబుల్ ఇంటిగ్రేటెడ్ లివింగ్ డైరెక్టర్ షేక్ అలీ హుసేన్, ఆక్వా రైతు సంఘం అ«ధ్యక్ష, కార్యదర్శులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, బోనం చినబాబు సోమవారం మీడియాకు వివరించారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఆక్వా సాగుకు క్రాప్ హాలిడే ప్రకటిస్తామని హెచ్చరించారు.ఆక్వా రైతుల డిమాండ్లు ఇవీ.. ⇒ ఆక్వా రంగం బలోపేతానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఏటా కనీసం రూ.1000 కోట్లు కేటాయించాలి ⇒ జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా చేపలు, రొయ్యలకు కనీస మద్దతు ధర ప్రకటించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి ⇒ దేశంలోనే ఎక్కడా లేని విధంగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) చట్టాన్ని మరింత సమర్ధంగా అమలు చేయాలి ⇒ అప్సడా చట్టం ద్వారా హేచరీలను నియంత్రించాలి. నాణ్యత లేని వనామీ రొయ్యల మేత తయారు చేసే కంపెనీలను మూసివేయాలి. ⇒ అప్సడా చట్టం ద్వారా ఆక్వా రైతుల రిజి్రస్టేషన్‌ను మరింత సరళతరం చేసేందుకు మండల స్థాయిలో రిజి్రస్టేషన్ మేళాలు నిర్వహించాలి ⇒ వ్యవసాయ, ఉద్యాన పంటల మాదిరిగానే మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా ఏఏ ఆక్వా ఉత్పత్తులు ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలో ఏటా పంటల ప్రణాళిక ముందస్తుగా తయారు చేసి కచి్ఛతంగా అమలు చేయాలి ⇒ ఆక్వా సాగుకు ఉపయోగించే పెట్రో ఉత్పత్తులను జిల్లా పౌర సరఫరాల సంస్థ ద్వారా సబ్సిడీపై అందించాలి ⇒ ఆక్వా సాగుకు ఉపయోగించే విద్యుత్ పరికరాలు, ట్రాన్స్ఫార్మర్లలో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి విద్యుత్ శాఖ ద్వారా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి ⇒ ఆక్వా రైతుల ఫిర్యాదుల పరిష్కారానికి సింగిల్ విండో విధానం ప్రవేశÔ¶ పెట్టాలి. ⇒ దళారీల వల్ల మోసపోతున్న రైతుల కోసం తీర ప్రాంత జిల్లాల్లో ఆక్వా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి ⇒ నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్‌కు అనుబంధంగా మండలానికో ల్యాబ్, మండలానికో యాంటీ బయాటిక్ ల్యాబ్ ఏర్పాటు చేయాలి ⇒ గత ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఆక్వా యూనివర్శిటీని వేగంగా పూర్తి చేసేందుకు తక్షణమే రూ.350 కోట్లు కేటాయించాలి. యూనివర్సిటీ ద్వారా వనామీ రొయ్యల సాగులో మెళకువులపై రైతులకు శిక్షణ ఇవ్వాలి ⇒ ఆక్వా పరికరాలకు 90 శాతం సబ్సిడీ, రిటైల్ అవుట్లెట్లకు 90 శాతం ఆరి్ధక సాయం అందించాలి ⇒ ఎన్నికల్లో ఇచి్చన హామీ మేరకు తీరప్రాంత జిల్లాల్లో ఆక్వా ఉత్పత్తుల నిల్వకు 90 శాతం సబ్సిడీతో శీతల గిడ్డంగులు నిర్మించాలి ⇒ జోన్‌తో సంబంధం లేకుండా ఎకరాకు యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరా చేయాలి. హేచరీలు, ఆక్వా నర్సరీలు, ప్రాసెసింగ్ యూనిట్లకు కూడా సబ్సిడీపై విద్యుత్ అందించాలి. ⇒ తల్లి రొయ్యలు, లార్వా, పోస్ట్ లార్వా ఫీడ్లతో పాటు మేత తయారీలో ఉపయోగించే ముడి పదార్ధాల దిగుమతిపై సుంకం ఎత్తివేయాలి -
Farmers Protest: ‘రైల్‌రోకో’కు దిగిన రైతులు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఛలో నిరసన మార్చ్‌లో భాగంగా నాలుగు గంటల పాటు నిర్వహించే రైతుల రైల్‌రోకో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. ఇందులో భాగంగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌తో పాటు హర్యానాలోని పలు ప్రాంతాల్లో రైతులు రైల్‌రోకోకు దిగారు. సాయంత్రం 4 గంటల వరకు రైల్‌రోకో జరగనుంది. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా సంయుక్తంగా రైల్‌రోకోకు పిలుపునిచ్చాయి. పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) సహా తమ ఇతర డిమాండ్లను కేంద్రం ఆమోదించాల్సిందేనని రైతులు డిమాండ్ చేస్తున్నారు. #WATCH | Punjab: Farmers organisations hold 'Rail Roko' protest, in Amritsar. pic.twitter.com/kqmSYjd1z9 — ANI (@ANI) March 10, 2024 రైల్‌రోకోలో భాగంగా వందలాది మంది రైతులు రైల్వే ట్రాక్‌లపై కూర్చొని నిరసన తెలుపుతారని కిసాన్ మజ్దూర్ మోర్చా సర్వన్ సింగ్ పందేర్ చెప్పారు. రైతులు చేపట్టిన రైల్‌రోకో కార్యక్రమంతో పంజాబ్, హర్యానాల్లో 60 చోట్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. మరోవైపు మార్చ్ 6వ తేదీ నుంచి రైతులు చేపట్టిన ‘ఢిల్లీ ఛలో’ ర్యాలీ కొనసాగుతుండటంతో ఢిల్లీ సరిహద్దుల వద్ద పోలీసులు భద్రత పెంచారు. హర్యానాలోని అంబాల జిల్లాలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఫిబ్రవరిలో రైతులు ఢిల్లీ ఛలో నిరసన ర్యాలీ చేపట్టిన సందర్భంగా వారితో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. పలు పంటలకు ఐదేళ్లపాటు మద్దతు ధర ఇస్తామని ఈ చర్చల్లో కేంద్రం ప్రతిపాదించింది. కేంద్రం తీసుకువచ్చిన ఈ ప్రతిపాదన రైతులకు నచ్చకపోవడంతో వారు ఢిల్లీ ఛలో నిరసన ర్యాలీని మళ్లీ పునరుద్ధరించారు. ఇందులో భాగంగా రాస్తారోకోలు, రైల్‌రోకోలకు పిలుపునిచ్చి దశల వారిగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇదీ చదవండి.. హిట్లర్ అధికారం పదేళ్లకే ముగిసింది -
మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలి
హన్మకొండ/ ఎస్ఎస్ తాడ్వాయి: దక్షిణ భారత కుంభమేళా అయిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని భా రత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మేడారం వనదేవతల దర్శనానికి వెళ్తూ హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభు త్వం గిరిజన యూనివర్సిటీ మంజూరు చేసి సమ్మ క్క– సారక్క పేరు పెట్టడం గర్వకారణమన్నారు. కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీ లిచ్చిందని, రాష్ట్రంలో 45 లక్షల మందికి పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచుతామని చెప్పిన మేరకు జనవరి 1 నుంచి రూ.4 వేల చొప్పున చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. డిసెంబర్లో పెన్షన్, రైతుబంధు సకాలంలో అందించడంలో ప్రభు త్వం విఫలమైందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం నివేదిక రాకముందే ఆగమాగం చేస్తున్నారని, దీనిపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పటికే మాట్లాడారని గుర్తు చేశా రు. సమావేశంలో ఎంపీ పసునూరి దయాకర్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాక ర్రావు, మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, శంకర్ నాయక్ పాల్గొన్నారు. కాగా, ములుగు జిల్లా మేడారం సమ్మక్క– సారలమ్మలను ఎమ్మెల్సీ కవిత, ఎంపీ కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తదితరులు దర్శించుకున్నారు. -
ప్రభుత్వం సానుకూలంగా ఉంది.. సమ్మె విరమించండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అంగన్వాడీల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని, సమ్మె విరమించి బాలింతలు, తల్లులు, పిల్లలకు సేవలందించాలని ప్రభుత్వ బృందం విజ్ఞప్తి చేసింది. అంగన్వాడీల సంఘాల నేతలతో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కేఎస్ జవహర్‌రెడ్డితో కూడిన అధికారుల బృందం మంగళవారం రాష్ట్ర సచివాలయంలో మరోమారు చర్చించింది. ఈ చర్చల్లో మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. అంగన్వాడీల సమ్మె కారణంగా బాలింతలు, తల్లులు ఇబ్బంది పడుతున్నారని, అర్థం చేసుకుని సమ్మె విరమించి సహకరించాలని అన్నారు. జనవరి 5 నుండి అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణిలు, బాలింతలు, చిన్నారులకు టేక్ హోం రేషన్ కిట్లు, ఇతర సరుకులు పంపిణీ చేయాల్సి ఉన్నందున సంక్రాంతి వరకూ సమ్మెను వాయిదా వేయాలని విజ్ణప్తి చేశారు. సంక్రాంతి తర్వాత మరలా కూర్చుని చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకుందామని కోరారు. అంగన్వాడీల 11 డిమాండ్లలో ఒక్కటి తప్ప 10 డిమాండ్లు ప్రభుత్వం ఆమోదించిందని వివరించారు. వాటిని అమలు చేస్తూ జీవోలు కూడా జారీ చేశారని గుర్తు చేశారు. పదవీ విరమణ వయస్సు 60 నుండి 62 ఏళ్ళకు, పదోన్నతి వయస్సు 45 నుండి 50 ఏళ్ళకు పెంపు, టీఏ, డీఏలు, అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చే సేవా ప్రయోజనం రూ.50 వేల నుంచి రూ. లక్షకు పెంపు, సహాయకులకు ఇచ్చే సేవా ప్రయోజనాన్ని రూ.20 వేల నుండి రూ.40 వేలకు పెంచడం వంటి వాటికి సంబంధించిన జీవోలు ప్రభుత్వం ఇచ్చిందని వివరించారు. మిగిలిన వాటిపై కూడా రెండు, మూడు రోజుల్లో జీవోలు జారీ చేస్తుందని తెలిపారు. గౌరవ వేతనం పెంపు అంశం ఒక్కటే మిగిలి ఉందని, దీనిపై సంక్రాంతి తర్వాత చర్చించి, సానుకూల నిర్ణయం తీసుకుందాని చెప్పారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని, వేతనాల పెంపునకు కొంత సమయం కావాలని అడిగారు. అంగన్వాడీల గ్రాట్యుటీ అంశం తమ పరిధిలో లేదని, దీనికి సంబంధించి కేంద్రానికి లేఖ రాస్తామని చెప్పారు. తాము బెదిరించడం లేదని, సమ్మె విరమించాలని కోరుతున్నామని మంత్రి బొత్స వివరించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) చిరంజీవి చౌదరి, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, డైరెక్టర్ విజయ కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, వేతనాలు పెంచకపోతే ఆందోళన విరమించేది లేదని అంగన్వాడీ యూనియన్ నేతలు ప్రకటించారు. చర్చల్లో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సుబ్బరావమ్మ, రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబీరాణి, ఉపాధ్యక్షురాలు సుప్రజ, అంగన్వాడీ హెల్పర్ల సంఘం ఉపాధ్యక్షురాలు రమాదేవి, ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షురాలు గంగావతి, ఉపాధ్యక్షురాలు జి.భారతి, కార్యదర్శి వీఆర్.జ్యోతి, ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.ప్రేమ, ఉపాధ్యక్షురాలు ఫ్లారెన్స్, ప్రధాన కార్యదర్శి జె.లలిత తదితరులు పాల్గొన్నారు. -
కస్టమర్లకు అలర్ట్: దేశవ్యాప్త సమ్మెకు దిగనున్న ఉద్యోగులు
న్యూఢిల్లీ: డిసెంబరు నెలలో దేశవ్యాప్త సమ్మెకు దేశంలోని పలు బ్యాంకులు సిద్ద మవు తున్నాయి. దీంతో బ్యాంకింగ్ సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది. డిసెంబరు 4 నుంచి 11 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరగనుంది. ఈ మేరకు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు లక్షల ఉద్యోగాలను భర్తి , బ్యాంకుల్లో ఔట్ సోర్సింగ్ సిబ్బందికి స్వస్తి అనే ప్రధాన డిమాండ్లతో ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగనున్నాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీ అసోసియేషన్ (ఏఐబీఈఏ) నోటిఫికేషన్ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ రంగ పలు బ్యాంకులు సమ్మెలో భాగం కానున్నాయి. డిసెంబర్ 4 -11 వరకు బ్యాంకుల వారీగా సమ్మె కొనసాగుతుంది. బ్యాంకుల్లో తగినంత శాశ్వత సిబ్బందిఉండేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. బ్యాంకు ఉద్యోగాల అవుట్సోర్సింగ్ వల్ల దిగువ స్థాయిలో రిక్రూట్‌మెంట్‌ను తగ్గించడమే కాకుండా కస్టమర్ల గోప్యత , వారి డబ్బు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు. సమ్మెలో పాల్గొనే బ్యాంకుల వివరాలను ఆయన ట్విటర్లో షేర్ చేశారు. డిసెంబరు 4న ఎస్బీఐ, పీఎన్బీ, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ సమ్మె చేయనున్నాయి. అలాగే డిసెంబరు 5న బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, డిసెంబరు 6న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ ఉద్యోగులు సమ్మెను పాటిస్తారు.అలాగే డిసెంబరు 7న యూకో బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, డిసెంబరు 8న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, డిసెంబరు 11న ప్రైవేటు బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. #BankStrike#2lakhbankjobs #bankrecruitment #AIBEA pic.twitter.com/YkbNeE87kK — CH VENKATACHALAM (@ChVenkatachalam) November 14, 2023 -
ఇందూరుకు ఇవి కావాలి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉత్తర తెలంగాణలో కీలకమైన నిజామాబాద్ నగరంలో 4,70,152 మంది జనాభా ఉన్నారు. ఇందులో 2,86,766 మంది ఓటర్లు ఉన్నారు. నగరం వేగంగా విస్తరిస్తున్నా ఆ మేరకు సౌకర్యాల కల్పన మాత్రం జరగడం లేదన్న వాదనలున్నాయి. ఇక్కడ దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న భూగర్భ డ్రైనేజీ, ముంపు సమస్యల పరిష్కారంతో పాటు ప్రజల డిమాండ్లు ఇలా ఉన్నాయి. బస్తీ దవాఖానాల సేవలు అంతంతే.. నిజామాబాద్‌లో బస్తీ దవాఖానాలు సేవలు నామమాత్రమే. నగరంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఉన్నప్పటికీ సేవలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. సేవలను మెరుగుపరచాలి. భూగర్భ డ్రైనేజీ పనులకు మోక్షం ఎప్పుడు నగరంలో భూగర్భ డ్రైనేజీ పనులు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మొదలుపెట్టారు. ఇటీవల పనులు పూర్తయినా, మురుగునీరు ఇళ్ల నుంచి వెళ్లడానికి కనెక్షన్లు ఇవ్వలేదు. నగరం విస్తరించిన నేపథ్యంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఇతర ప్రాంతాలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ‘నుడా’ పరిధిలో డ్రైపోర్టు ఏర్పాటు చేయాలి నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) పరిధిలోని డిచ్పల్లి రైల్వేస్టేషన్ వద్ద లేదా జానకంపేట రైల్వేస్టేషన్ వద్ద 50 ఎకరాల్లో డ్రైపోర్టు ఏర్పాటు చేసేందుకు కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంసిద్ధత వ్యక్తం చేసింది. డ్రైపోర్టు ఏర్పాటైతే ఇక్కడి నుంచి వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా ఎగుమతి చేయవచ్చని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఛాంబర్ ఆప్ కామర్స్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఎకానమీ సైతం పెరుగుతుందంటున్నారు. ముంపు సమస్య నివారించాలి నగరం మధ్యలో ప్రవహిస్తున్న పులాంగ్ వాగు ఆక్రమణల కారణంగా ముంపు సమస్య ఉత్పన్నమవుతోంది. రామర్తి చెరువు 70 శాతం ఆక్రమణకు గురైంది. దీంతో బోధన్ రోడ్డుకు ఇరువైపులా వర్షాకాలంలో ముంపు తప్పడం లేదు. న్యాల్కల్ రోడ్డు లోని రోటరీనగర్ ముంపునకు గురవుతోంది. నగరం విస్తరించిన నేపథ్యంలో భూగర్భ డ్రైనేజీ విస్తరించాలని ప్రజలు కోరుతున్నారు. ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం కోరుతున్నారు. అంతర్గత రోడ్లు అధ్వానం.. కార్పొరేషన్ పరిధిలో ప్రధాన రోడ్లు మాత్రమే బాగున్నాయి. అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఈ రోడ్లను నిర్మించాలన్న డిమాండ్లున్నాయి. ఒక్క సర్కారీ ఇంజనీరింగ్ కళాశాల కూడా లేదు నగరంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లేదు. ఇక నగరానికి సమీపంలో తెలంగాణ వర్సిటీ ఉన్నా, దీని పరిధిలోనూ ఇంజనీరింగ్ కళాశాల లేదు. తెలంగాణ వర్సిటీలో కోర్సులు పెంచాలన్న డిమాండ్లు ఉన్నాయి. -
సీఎం నితీష్ కుమార్ క్షమాపణలు
ఢిల్లీ: జనాభా నియంత్రణ అంశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహిళలకు క్షమాపణలు చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. నితీష్ కుమార్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మ, ఢిల్లీ మహిళా ప్యానెల్ హెడ్ స్వాతి మలివాల్‌లు విరుచుకుపడ్డారు. నితీష్ వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. "నితీష్ కుమార్ వ్యాఖ్యలు మహిళల హక్కులను భంగపరిచేవిలా ఉన్నాయి. ఇంతటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆయన క్షమాపణలు చెప్పాలి" అని జాతీయ మహిళా కమిషన్ ట్విట్టర్లో పేర్కొంది. 'నితీష్ మాట్లాడిన చెత్త వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించాయి. అసెంబ్లీలో వాడిన ఇలాంటి అవమానకరమైన, చౌకబారు పదజాలం మన సమాజానికి ఓ మరక. ప్రజాస్వామ్యంలో సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే ఆ రాష్ట్రంలో మహిళల దుస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.' అని రేఖా శర్మ అన్నారు. నితీష్ కుమార్ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. స్త్రీద్వేషి, పితృస్వామ్య స్వభావం అంటూ మండిపడింది. రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. మహిళలపై అవమానకరమైన వ్యాఖ్యలతో నితీష్ కుమార్ ప్రజాస్వామ్యం గౌరవాన్ని కించపరిచారని కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే దుయ్యబట్టారు. స్త్రీలు చదువుకుంటే.. భర్తలను కంట్రోల్లో పెట్టి జనాభాను తగ్గిస్తారని జనాభా నియంత్రణపై మాట్లాడిన నితీష్ కుమార్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహిళలు విద్యావంతులైతే కలయిక వేళ భర్తలను అదుపులో పెడతారని, తద్వారా జనాభా తగ్గుతుందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. మహిళలు విద్యావంతులు అవుతున్నందువల్లే ఒకప్పుడు 4.3గా ఉన్న జననాల రేటు ప్రస్తుతం 2.9కు తగ్గిందని, త్వరలోనే 2కు చేరుతుందని నితీశ్ అసెంబ్లీలో అన్నారు. ఇదీ చదవండి: నోరుజారిన సీఎం నితీష్.. జనాభా నియంత్రణపై వివాదాస్పద వ్యాఖ్యలు -
గనులు తెచ్చి.. ఉపాధినిచ్చే...ఘనులెవరు..?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సింగరేణి కార్మికుల డిమాండ్లను పరిష్కరించి తమ బతుకుల్లో వెలు గులు నింపాలని అన్ని కార్మి క సంఘాలు డిమాండ్ చేశాయి. సింగరేణి కార్మి కుల ఎజెండాపై గురువారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన ‘సాక్షి చర్చా వేదిక’లో అన్ని గుర్తింపు, జాతీయ, విప్లవ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. కెంగర్ల మల్లయ్య– టీజీబీకేఎస్, వాసిరెడ్డి సీతారామయ్య– ఏఐటీయూసీ, జనక్ ప్రసాద్–ఐఎన్టీయూసీ, రియాజ్ అహ్మద్– హెచ్ఎంఎస్, యాదగిరి సత్తయ్య–బీఎంఎస్, తుమ్మల రాజారెడ్డి– సీఐటీయూ,జి.రాములు– ఏఐఎఫ్టీయూ, విశ్వనాథ్, నరేష్–ఐఎఫ్టీయూ పాల్గొన్నారు. కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ప్రైవేటీకరణ, యాంత్రీకరణ, కాంట్రాక్టు కార్మి కుల క్రమబద్దీకరణ, రెండుపేర్లకు చట్టబద్ధత, ఆదాయపు పన్ను మినహాయింపు, సొంతింటికల, డీఎంఎఫ్ నిధుల మళ్లింపు వంటి ప్రధాన సమస్యలపై ఎన్నికలు వచ్చిన ప్రతీసారి రాజకీయ పార్టీలు కేవలం వాగ్దానాలతో కాలయాపన చేయడమే తప్ప.. ఇంతవరకూ ఆ సమస్యలను పరిష్కరించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగనులు, ఉపాధి ఎక్కడ...? తెలంగాణ రాష్ట్రం వస్తే.. కొత్త గనులు వచ్చి స్థానికులకు ఉపాధి లభిస్తుందనుకున్న తమ ఆశలు అడియాసలయ్యాయని కార్మిక సంఘాల నేతలు వాపోయారు. ఇక్కడ మరో 180 ఏళ్లకు తగిన బొగ్గు నిల్వలు ఉన్నాయని తెలిపారు. యాంత్రీకరణ వల్ల ఉపాధి అవకాశాలు తగ్గినా.. ఏటా ఐదు కొత్త గనులు ప్రారంభించి, దాదాపు లక్ష మందికి కల్పించే వీలుందని సింగరేణి ఉన్నతాధికారులే ధ్రువీకరించారని గుర్తు చేశారు. కానీ 1.16 లక్షల మంది కార్మికులున్న సంస్థను ఇపుడు 40 వేలకు కుదించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సంస్థలో 40 వేలమంది కాంట్రాక్టు కార్మి కులు ప్రాణాంతక పరిస్థితుల్లో పనిచేస్తున్నా.. వారికి అత్తెసరు వేతనాలే ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవీ డిమాండ్లు ♦ కాంట్రాక్టు కార్మి కులను వెంటనే క్రమబద్దీకరించాలి. ♦ ఆదాయపు పన్ను మినహాయింపులో స్లాబ్ మార్చడం లేదా పార్లమెంటులో చట్టం ద్వారా శాశ్వత ఉపశమనం కల్పించాలి ♦ డీఎంఎఫ్టీ (డిస్ట్రిక్ట్ మిమినరల్ ఫౌండేషన్ ట్రస్ట్) నిధులను సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాలకు మళ్లించకుండా సింగరేణి ప్రభావిత గ్రామాల్లోనే ఖర్చు చేయాలి. ♦ ఇక రెండు పేర్ల చట్టబద్ధతపై విధానపరమైన నిర్ణయం తీసుకుని వారి వారసులకు 40 ఏళ్ల వయోపరిమితితో కారుణ్య నియామకాల్లో అవకాశం కల్పించాలి. ♦ బొగ్గు ఆధారిత పరిశ్రమలను నెలకొల్పి స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న డిమాండ్‌ను నిలబెట్టుకోవాలి ♦ సింగరేణి డిక్లరేషన్ తేవాలి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా డిక్లరేషన్ తరహాలో అన్ని పార్టీ లు సింగరేణి డిక్లరేషన్ చేసిన వారికే ఈ ఎన్నికల్లో ఓటేస్తామని స్పష్టం చేశారు. స్వరాష్ట్రంలో సింగరేణి మనుగడకు గతంలో పార్టీలు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఎవరైతే తమ డిమాండ్లను మేనిఫెస్టోలో చేరుస్తారో వారికే తమ సంఘాలు, కార్మి కులు మద్దతు తెలుపుతాయని నేతలు స్పష్టం చేశారు. -
రూఫ్‌టాప్ సోలార్ కిట్లకు తెగ డిమాండ్
న్యూఢిల్లీ: రూఫ్‌టాప్ సోలార్ కిట్లకు డిమాండ్ గణనీయంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గతేడాది ద్వితీయ ఆరు నెలల కాలంలో 5.2 మిలియన్ కిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది మొదటి ఆరు నెలల అమ్మకాలతో పోలిస్తే 20 శాతం పెరగ్గా, 2019 ద్వితీయ ఆరు నెలల కాలంతో పోలిస్తే 18 శాతం వృద్ధిని చూసినట్టు ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ డైరెక్టర్ జనరల్ అజయ్ మాథుర్ తెలిపారు. సోలార్ రూఫ్‌టాప్ మార్కెట్ గతేడాది బలమైన పనితీరు చూపించినట్టు పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన దక్షిణాసియా ఫోరమ్ సదస్సులో భాగంగా మాథుర్ మాట్లాడారు. ఈ సదస్సును కేంద్ర పునరుత్పాదక ఇంధనం, కెమికల్స్, ఫెర్టిలైజర్స్ శాఖల సహాయ మంత్రి భగవంత్ ఖుబా ప్రారంభించారు. సుస్థిర అభివృద్ధి, ఇంధన లభ్యత పెంపొందించడం తదితర అంశాలపై ఈ కార్యక్రమంలో భాగంగా చర్చలు జరిగాయి. 200 వరకు దేశీ, అంతర్జాతీయ భాగస్వాములు ఇందులో పాల్గొన్నారు. -
సంపద నిర్వహణ సేవలకు డిమాండ్
సంపద వృద్ధికి మెరుగైన అవకాశాల కోసం చిన్న పట్టణాల్లోని వారు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వెల్త్ మేనేజ్మెంట్ సేవల్లోని కంపెనీలు టైర్–2, 3 పట్టణాల వైపు చూస్తున్నాయి. సాధారణంగా చిన్న పట్టణాల్లోని అధిక ధనవంతులు (హెచ్ఎన్ఐలు) సంప్రదాయ సాధనాలైన బంగారం, రియల్ ఎస్టేట్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతుంటారు. ఇప్పుడు బంగారం, రియల్టీ కాకుండా ఇతర సాధనాల్లోకి తమ పెట్టుబడులను విస్తరించుకోవాలని అనుకుంటున్నారు. ఈ ధోరణి వెల్త్ మేనేజ్మెంట్ సేవలకు డిమాండ్‌ను తెస్తోంది. ముఖ్యంగా కరోనా తర్వాత చిన్న పట్టణాల్లో కొన్ని వ్యాపారాలకు కొత్త జీవం రావడాన్ని వెల్త్ మేనేజర్లు ప్రస్తావిస్తున్నారు. సంపద నిర్వహణ సేవలు అందించే సంస్థలు (వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీలు) ఆర్థిక ప్రణాళిక, పన్నుల కు సంబంధించిన సలహాలు, ఎస్టేట్ ప్లానింగ్ వంటి ఎన్నో సేవలు అందిస్తుంటాయి. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ, పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సంస్థలతో పోలిస్తే వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీలు విస్తృతమైన సేవలను ఆఫర్ చేస్తుంటాయి. అధిక శాతం మంది వెల్త్ మేనేజర్లు కనీసం రూ.కోటి నుంచి రూ.25 కోట్ల వరకు పెట్టుబడుల నిర్వహణ చూస్తుంటారు. కరోనా తర్వాతే.. కరోనా ముందు నాటికి మా మొత్తం క్లయింట్లలో ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని క్లయింట్లు 17 శాతంగా ఉంటే, ఇప్పుడు 22 శాతానికి పెరిగినట్టు ఆస్క్ ప్రైవేటు వెల్త్ వెల్లడించింది. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని ఈ సంస్థ క్లయింట్ల ఆస్తులు 13 శాతం నుంచి 22 శాతానికి చేరాయి. నువమా వెల్త్ క్లయింట్లలోనూ కరోనా ముందు టైర్–2 నుంచి 15 శాతంగా ఉంటే, కరోనా తర్వాత 20 శాతానికి పెరిగారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ప్రైవేటు వెల్త్ మేనేజ్మెంట్ సేవలు విస్తరించడానికి ఎక్కువ సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశిస్తుండడం కూడా ఒక కారణంగా చెప్పుకోవాలి. మరిన్ని సంస్థలు రావడంతో అవి ఎక్కువ మంది ధనవంతులను చేరుకోగలుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సేవల విస్తరణకు కొన్ని సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ‘‘కరోనా తర్వాత స్పెషాలిటీ కెమికల్స్ గొప్ప పనితీరు చూపించింది. దీంతో ప్రమోటర్లకు, ఈ వ్యాపారాల్లో ఉన్న వారి సంపద పెరిగింది. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని వారికి ఖర్చు చేయగల ఆదాయం అసాధారణంగా పెరిగింది’’అని మోతీలాల్ ఓస్వాల్ ప్రైవేటు వెల్త్ డైరెక్టర్ జయేష్ ఫరీదా వివరించారు. అంతేకాదు చిన్న పట్టణాల్లో స్టార్టప్‌లు ఏర్పాటు అవుతుండడాన్ని వెల్త్ మేనేజర్లు గుర్తు చేస్తున్నారు. 50 శాతం స్టార్టప్‌లు టైర్–2, 3 పట్టణాల నుంచి ఉన్నాయని 2022 మార్చిలో కేంద్ర సర్కారు పార్లమెంటుకు తెలియజేయడం గమనార్హం. ‘‘టైర్–2, 3 పట్టణాల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పడుతున్నాయి. దీంతో వ్యాపారాల నిర్వహణ సులభంగా మారుతోంది. పన్ను మినహాయింపులు, సబ్సిడీలు, ప్రోత్సాహకాలతో ప్రభుత్వం నుంచి మద్దతు కూడా తోడయింది’’అని నువమా ప్రైవేట్ ప్రెసిడెంట్ అలోక్ సైగల్ పేర్కొన్నారు. మెరుగైన రాబడుల కోసం.. చిన్న పట్టణాల్లో హెచ్ఎన్ఐలు పెరగడం ఒక్కటే కాకుండా, కరోనా తర్వాత పరిస్థితుల్లో వచ్చిన మార్పులను వెల్త్ మేనేజర్లు ప్రస్తావిస్తున్నారు. సంప్రదాయ సాధనాలైన బ్యాంక్ ఎఫ్డీలపై రాబడులు కనిష్ట స్థాయికి చేరడం ఇందులో ఒకటిగా ఉంది. కరోనా మహమ్మారి తర్వాత ఆర్బీఐ వడ్డీ రేట్లను కనిష్ట స్థాయికి తగ్గించడం గుర్తుండే ఉంటుంది. అంతేకాదు ఈ మహమ్మారి కారణంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా డల్‌గా మారింది. ఇది ఈక్విటీ, ఫిక్స్డ్ ఇన్కమ్ తదితర సాధనాల వైపు చూసేలా చేసినట్టు చెబుతున్నారు. తమ కొత్త క్లయింట్లలో ఎక్కువ మంది ఇంత కాలం బంగారం, ఎఫ్డీలు, రియల్ ఎస్టేట్ మినహా మరో సాధనంలో పెట్టుబడులు పెట్టని వారేనని వెల్త్ మేనేజర్లు వెల్లడించారు. ఆనంద్‌రాఠి వెల్త్ మేనేజ్మెంట్ కరోనా ముందు టైర్–2 పట్టణాల క్లయింట్లకు సంబంధించి రూ.814 కోట్ల ఆస్తులను నిర్వహిస్తుండగా, కరోనా అనంతరం రూ.3,500 కోట్లకు పెరిగిపోయాయి. జో«ద్‌పూర్,, నాగ్‌పూర్ తదితర పట్టణాల్లో వ్యాపారం రెట్టింపైది. దీంతో టికెట్ సైజు (పెట్టుబడి మొత్తం) తక్కువగా ఉన్నా, వెల్త్ మేనేజ్ మెంట్ కంపెనీలు చిన్న పట్టణాలపైనా ప్రత్యేక దృష్టి సారించాయి. 2022లో వెల్త్ మేనేజ్మెంట్ సేవలు ప్రారంభించిన ఎప్సిలాన్ మనీ తన క్లయింట్లలో 70 శాతం టైర్ 2, 3 పట్టణాలకు చెందిన వారేనని వెల్లడించింది. ‘‘చాలా మంది క్లయింట్లు సంప్రదాయ సాధనాలతోపాటు, వ్యాపారాలకే పెట్టుబడులు పరిమితం చేసుకుంటున్నారు. వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, బంగారం, ఎఫ్డీలు కాకుండా ఇతర సాధనాల పట్ల వారిలో అవగాహన కలి్పంచాల్సిన అవసరం ఉంది’’అని ఆస్క్ ప్రైవేటు వెల్త్ ఎండీ రాజేష్ సలూజా అభిప్రాయపడ్డారు. -
ఎల్ఏసీ వద్ద పరిణామాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. చైనాతో సరిహద్దు వివాదంపై పార్లమెంట్లో సమగ్రంగా చర్చ జరపాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘సరిహద్దులు దాటి మన భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదు. మన ఆర్మీ పోస్టులను ఎవరూ స్వాధీనం చేసుకోలేదని మూడేళ్ల క్రితం గల్వాన్ ఘర్షణలు జరిగాక అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ చెప్పారు. చైనా సైనికులు సరిహద్దులు దాటి చొచ్చుకొచ్చేందుకు, మన భూభాగంలో టెంట్లు వేసేందుకు ప్రయతి్నంచడంతో గల్వాన్ ఘటన జరిగిందంటూ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇవి రెండూ పరస్పర విరుద్ధ ప్రకటనలు’అని తివారీ తెలిపారు. అందుకే భారత్–చైనా సరిహద్దు వివాదంపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరపడంతోపాటు గత మూడేళ్లుగా ఎల్ఏసీ వెంట జరుగుతున్న వాస్తవ పరిణామాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బాధ్యతాయుత ప్రతిపక్షంగా కాంగ్రెస్ కోరుతోందన్నారు. ‘ఎల్ఏసీ వెంట ఉన్న 65 పెట్రోలింగ్ పాయింట్లకు గాను 26 వరకు మన ఆర్మీ నియంత్రణలో లేవన్న విషయం నిజమా? చైనా ఆక్రమణలను మనం ఎందుకు ఆపలేకపోయాం?’అని తివారీ కేంద్రాన్ని నిలదీశారు. -
పూణేలో భక్తులపై లాఠీచార్జ్.. ఉత్సవాల్లో అపశ్రుతి
ముంబై: మహారాష్ట్ర అలందిలోని శ్రీ క్షేత్ర దేవాలయంలో వార్కారీ భక్తులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. కేవలం 75 మంది భక్తులకు మాత్రం ప్రవేశమున్న ఆలయ ప్రాంగణంలోనికి ఒకేసారి 400 మంది భక్తులు ప్రవేశించడానికి ప్రయత్నం చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో లాఠీచార్జి చేశామని పూణే పోలీసులు తెలిపారు. దీంతో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మొఘలులు మళ్ళీ పునర్జన్మ పొందారా? అంటూ వ్యాఖ్యలు చేశారు. పూణే నగరానికి 22 కి.మీ దూరంలో ఉన్న శ్రీ క్షేత్రం దేవాలయంలో జరిగే తీర్థయాత్రలో ప్రతి ఏటా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటూ ఉంటారు. శ్రీ కృష్ణుడికి మరో రూపమైన విఠోబాకు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా ఘనంగా మొదలైన ఈ ఉత్సవాలకు అనేక మంది భక్తులు తరలివచ్చారు. ఆదివారం రోజున ఈ రద్దీ మరీ ఎక్కువైంది. ఇదే క్రమంలో కేవలం 75 మందికి మాత్రమే అనుమతున్న ఆలయ ప్రాంగణంలోకి సుమారు 400 మంది భక్తులు ఒకేసారి దూసుకొచ్చారు. వారిని నియంత్రించే క్రమంలో పోలీసులు తప్పని పరిస్థితుల్లో లాఠీచార్జి చేశారు. పోలీసులు లాఠీచార్జి చేస్తున్న ఈ వీడియో బయటకు రావడంతో విపక్షాలు ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తున్నారు. శివసేన సీనియర్ ఎంపీ సంజయ్ రౌత్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. అరెరె.. హిందూత్వ ప్రభుత్వం యొక్క అసలు రూపం బయటపడింది. ముసుగు తొలగిపోయింది. ఔరంగజేబు ఇంత భిన్నంగా ఎలా ప్రవర్తించాడు? మహారాష్ట్రలో మొఘలులు మళ్ళీ జన్మించారా?" అని రాసి పోలీసులు భక్తులపై లాఠీచార్జి చేస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఎన్సీపీ నేత ఛగన్ భుజ్ బల్ కూడా స్పందిస్తూ.. వార్కారీ సోదరులపై జరిగిన లాఠీచార్జి అమానుషం. వార్కారీల దైవస్వరూపం సాక్షాత్తు స్వామి జ్ఞానేశ్వర్ మహారాజ్ సమక్షంలో ఇలాంటి సంఘటన జరగడం ఖండించదగినది. వార్కారీల పట్ల ప్రభుత్వం ఏమైనా బాధ్యత తీసుకుంటోందా? అనడిగారు. మహారాష్ట్ర హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం ఆలయం వద్ద ఎటువంటి లాఠీచార్జి జరగలేదని అన్నారు. అక్కడ జరిగింది చిన్న గొడవ మాత్రమే. గతేడాది జరిగిన తొక్కిసలాట వంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. अरे अरे.. हिंदूत्ववादी सरकारचे ढोंग उघडे पडले.. मुखवटे गळून पडले..औरंगजेब यापेक्षा वेगळे काय वागत होता?वारकऱ्यांचा हिंदू आक्रोश सरकार असा चिरडून टाकतआहे. मोगलाई महाराष्ट्रात पुन्हा अवतरली आहे..@BJP4Maharashtra @Dev_Fadnavis @AUThackeray @ https://t.co/pnUc45IZ01 — Sanjay Raut (@rautsanjay61) June 11, 2023 श्री क्षेत्र आळंदी येथे वारकरी बांधवांवर पोलिसांनी लाठीमार केल्याचा प्रकार अत्यंत संतापजनक आहे. वारकरी संप्रदायाचा पाया रचणारे थोर संत ज्ञानेश्वर महाराज यांच्या आळंदीत वारकरी बांधवांचा झालेला हा अपमान अत्यंत निषेधार्ह आहे. वारकरी संप्रदाय, वारकरी बांधव यांच्याबद्दल सरकारची काही… pic.twitter.com/IDtIy1azn3 — Chhagan Bhujbal (@ChhaganCBhujbal) June 11, 2023 ఇది కూడా చదవండి: బీజేపీ సూపర్ స్ట్రోక్.. అరవింద్ కేజ్రీవాల్ షాక్.. -
కేంద్ర మంత్రితో రెజ్లర్ల భేటీ.. ఐదు డిమాండ్లు ఇవే..!
ఢిల్లీ:రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రెజ్లర్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో నేడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఐదు డిమాండ్లను కోరినట్లు సమాచారం. రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు గత కొంతకాలంగా నిరసన చేస్తున్నారు. ఇటీవలే ఈ విషయమై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు కూడా. ఆయనతో చర్చల అనంతరం రెజ్లర్లు తమ విధుల్లోకి చేరారు. ఐతే ఆందోళన మాత్రం విరమించలేదు. దీంతో రెజ్లర్లను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. రెజ్లర్ల సమస్యలపై చర్చలకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, దానికోసం రెజ్లర్లను మరోసారి ఆహ్వానించానని కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ రోజు అర్థరాత్రి ట్వీట్ చేశారు. కేంద్రంతో రెజ్లర్లు సమావేశమవడం ఇది రెండోసారి. రెజ్లర్ల ఐదు డిమాండ్లు ఇవే.. 1.భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవిని మహిళకు అప్పగించాలి. 2.అయితే కొత్తగా ఏర్పాటు చేసిన సమాఖ్యలో బ్రిజ్ భూషణ్, ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఉండకూడదు. 3. రెజ్లింగ్ పాలక మండలికి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి. 4. నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజున జరిగిన ఉద్రిక్తతలలో రెజ్లర్లపై నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలి. 5.లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలి. ఇదీ చదవండి:రెజ్లర్లను మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్రం.. ఈసారి.. -
రూ.270కి మూడు ఇళ్లు
రోమ్: ఇటలీలో నాలుగైదేళ్ల కిందటి వరకు కొన్ని గ్రామాలకు వెళితే కారు చౌకగా ఇళ్లు లభించేవి. ఒక డాలర్ ఇస్తే చాలు ఇక ఇల్లు వారి పేరు మీద రిజిస్టర్ అయిపోయేది. సిసిలీలో ఒక మారుమూల విసిరేసినట్టున్న ఇల్లు కొనడానికి ఒక డాలర్ ఖర్చు పెడితే చాలు. దీనికి కారణం ఆ ప్రాంతం నుంచి ప్రజల వలసలే. కాలిఫోర్నియాకు చెందిన రుబియా డేనియల్స్ అనే మహిళ 2019లో కేవలం 3.30 డాలర్లకి (రూ.270) మూడు ఇళ్లను కొనుగోలు చేసింది. ఈ నాలుగేళ్లలో పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రజలు మళ్లీ గ్రామాల బాటపడుతున్నారు. దీంతో ఆమె కొనుగోలు చేసిన ఇళ్లకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఆమె ఆ ఇళ్లను పునరుద్ధరించే పనిలో ఉన్నారు. ఒక ఇంట్లో తానుంటానని, మరొకటి ఆర్ట్ గ్యాలరీగా మార్చి, ఇంకొకటి అద్దెకిస్తానని చెబుతున్నారు. -
ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి ఆధ్వర్యంలో రైతుభరోసా ర్యాలీ
-
సీఈవో సుందర్ పిచాయ్‌కు ఉద్యోగుల బహిరంగ లేఖ: కీలక డిమాండ్లు
న్యూఢిల్లీ: ప్రపంచ టెక్ కంపెనీల్లో ఉద్యోగాల ఊచకోత తీవ్ర కలవరం పుట్టిస్తోంది. ముఖ్యంగా ట్విటర్, మెటా, గూగుల్ తదితర దిగ్గజ కంపెనీలు కూడా భారీగా లేఆఫ్స్ ప్రకటించడం ప్రస్తుత సంకక్షోభం పరిస్థితికి అద్దుపడుతోంది. ఈ ఆర్థిక సంక్షోభం ఉద్యోగాల తీసివేత నేపథ్యంలో గూగుల్ ఉ ద్యోగులు సీఈవోకు సుందర్ పిచాయ్‌కి బహిర లేఖ లేశారు. కొన్ని కీలక డిమాండ్లతో రాసిన ఈ లెటర్ హాట్ టాపిక్‌గా నిలిచింది. గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ ఇంక్.లో దాదాపు 1,400 మంది ఉద్యోగులు ఈ బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చేలా లేఆఫ్ ప్రక్రియలో మెరుగైన విధానాల్ని పాటించాల కోరుతూ పిటిషన్‌పై వీరంతా సంతకం చేశారు. ఈ సందర్భంగా కొన్ని కీలక డిమాండ్లను చేయడం గమనార్హం. అయితే ఈ లేఖపై ఆల్ఫాబెట్ ప్రతినిధి ఇంకా స్పందించలేదు. గూగుల్ సీఈవోకు ఉద్యోగులకు రాసిన లేఖలో ముఖ్యంగా కొత్త నియామకాలను స్తంభింప జేయడం, తొలగింపులకు ముందు స్వచ్ఛంద తొలగింపులను కోరడం, ఉద్యోగ ఖాళీల భర్తీకి తొలగించిన ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని, మెటర్నిటీ, బేబీ బాండింగ్ వంటి సెలవుల్లో ఉన్న వారిని అర్థాంతరంగా తొలగించకుండా, వారి షెడ్యూల్డ్ సెలవులను పూర్తి చేయడానికి అనుమతించడం వంటి అనేక డిమాండ్లను ఇందులో ఉద్యోగులు చేశారు. దీనికి తోడు ఉక్రెయిన్, రష్యా వంటి యుద్ధ సంక్షోభ ప్రాంతాలకు చెందిన తోటి ఉద్యోగులను తొలగించవద్దని కూడా విజ్ఞప్తి చేశారు. అలా చేయటంతో అక్కడి ఉద్యోగులు వీసా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. సంక్షోభ ప్రాంతాలకు చెందిన ఉద్యోగులకు అదనపు సహాయాన్ని కంపెనీ అందించా లన్నారు. లింగ, జాతి, కుల, వయస్సు, మతం, వైకల్యాలు లాంటి వివక్షలు లేకుండా ఉద్యోగుల పట్ల వ్యవహరించాలని ఉద్యోగులు తమ లేఖలో సుందర్ పిచాయ్ ని కోరారు. కంపెనీ 12వేల ఉద్యోగాలను తీసివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ లేఖ చర్చకు దారి తీసింది. -
క్షమాపణ చెప్పేదే లే! కాంగ్రెస్ బీజేపీల మధ్య కొనసాగుతున్న పోరు
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల యూకే పర్యటనలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోమవారం జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశం సైతం రసాభాసగ మారి ఉభయ సభల్లో ఎలాంటి కార్యక్రమాలు జరగకుండానే వాయిదాపడ్డాయి. అదే రగడ రెండో రోజు కూడా కొనసాగింది. లండన్‌లో రాహుల్ చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ పెద్ద ఎత్తున నిప్పులు చెరుగుతోంది. ఈ క్రమంలోనే రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ దాడిని పెంచుతూ..కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఒక సభ్యుడు విదేశాలకు వెళ్లి భారత ప్రజాస్వామ్యం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే పార్లమెంట్ చూస్తూ కూర్చొదన్నారు. గాంధీ క్షమాపణ చెప్పాల్సిందే, అన్ని పార్టీల ఎంపీలు ఆయన వ్యాఖ్యలను ఖండించాల్సిందే అని డిమాండ్ చేసింది బీజేపీ. ఐతే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ చేసిన ఆరోపణలన్నింటిని తోసిపుచ్చింది. పైగా ప్రజాస్వామ్యన్ని అణిచివేసేవారే రక్షించడం కోసం మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు కాంగ్రెస్ నాయకులు. దీంతో ఇరు పార్టీ మధ్య వాగ్వాదం సద్దుమణగకపోగా తీవ్రస్థాయికి చేరుకోవడంతో.. రెండో రోజు కూడా లోక్‌సభ, రాజ్యసభలు సమావేశమైన వెంటనే వాయిదాపడ్డాయి. ఈమేరకు మరో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు గురించి ప్రస్తావించారు. వారంతా మైనారిటీల దాడులు గురించి చెబుతున్నారు గానీ నాడు వేలాదిమంది సిక్కులు హత్యకు గురైనప్పుడు ఆ ఘటనలకు బాధ్యులైన వారిని సోనియా, రాజీవ్‌గాందీలు రక్షించారంటూ ఆరోపణలు గుప్పించారు. కాగా, కాంగ్రెస్‌కు చెందిన శక్తిసిన్హ గోహిల్ పీయూష్ గోయల్‌పై ప్రివలేజ్ ఉల్లంఘన నోటీసులు దాఖలు చేశారు. ఆ నోటీసుల్లో వాస్తవాలు తెలుసుకోకుండా గోయల్ లోక్‌సభ సభ్యుడిని ఉద్దేశపూర్వకంగానే విమర్శించారని పేర్కొన్నారు గోహిల్. అలాగే ఏ సభ్యుడు మరో సభలోని సభ్యునిపై ఆరోపణలు చేయరాదనే చైర్ నిబంధనను గుర్తు చేశారు. అంతేగాదు తాము ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ గడ్డపై చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలను ప్రతిపక్షాలు ఎప్పుడూ లేవనెత్తలేదని కూడా అన్నారు. అయినా రాహుల్ క్షమాపణ చేప్పే ప్రశ్నే లేదని లోక్‌సభలోని కాంగ్రెస్ ఉపనేత మాణికం ఠాగూర్ అన్నారు. అసలు ఆ ప్రశ్నకు తావేలేదు ఎందుకంటే రాహుల్ కరెక్ట్‌గానే చెప్పారు. అయినా ఆర్ఎస్ఎస్కు చెందినవారు క్షమాపణ చెప్పనప్పుడూ కాంగ్రెస్‌కు చెందినవారు మాత్రం ఎందుకు చెప్పాలి అని నిలదీశారు. ఈ మేరకు ఠాగూర్ విదేశాల్లో ప్రధాని మోదీ చేసి వ్యాఖ్యలను సైతం ట్విట్టర్లో ఉంచారు. మోదీ విదేశాల్లో భారత్‌ని అవమానించారు కాబట్టి ముందు ఆయన క్షమాపణ చెప్పాలి లేదంటే సావర్కర్ లాగా చేయగలరు అని మాణిగం ఠాగూర్ అన్నారు. (చదవండి: సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ) -
పుల్వామా అమర జవాన్ల భార్యల అరెస్ట్
జైపూర్: పుల్వామా ఉగ్ర దాడిలో మరణించిన అమరవీర జవాన్ల భార్యలను రాజస్థాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు డిమాండ్లతో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్ల భార్యలు జైపూర్‌లోని సచిన్ పైలట్ ఇంటి ఎదుట ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం దీక్షను భగ్నం చేసి.. స్థానిక స్టేషన్‌కు తరలించారు పోలీసులు. కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ నివాసం ఎదుట ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఈ ముగ్గురు మహిళలు నిరసన ప్రదర్శనకు దిగారు. ఈ క్రమంలో సచిన్ పైలెట్ ఆ ముగ్గురితో మాట్లాడినా కూడా స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయారు. దీంతో.. తమ దీక్షను ఆమరణ దీక్షగా మార్చుకున్నారు వాళ్లు. అయితే శుక్రవారం ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి స్థానిక పీఎస్‌కు తరలించారు. అరెస్ట్ క్రమంలో పోలీసులు ఆ మహిళలతో దురుసుగా ప్రవర్తించగా.. సచిన్ పైలట్ పోలీసుల తీరును తప్పుబట్టారు. మరోవైపు ఈ ఉదంతంపై జాతీయ మహిళా కమిషన్ మండిపడింది. వితంతువులపై భౌతిక దాడి జరిగిందంటూ రాజస్థాన్ డీజీపీ లేఖ రాసి.. ఘటనపై వివరణ కోరింది. ఇదిలా ఉంటే.. అమర వీరుల కుటుంబ సభ్యులకు సాధారణంగా ప్రభుత్వాలు ఉద్యోగాలను ప్రకటిస్తుంటాయి. అయితే తమ పిల్లలకు బదులుగా బంధువులకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఈ మేరకు అవసరమైతే రూల్స్ సవరించాలని ఈ ముగ్గురు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. తమ గ్రామాలకు రోడ్లు వేయించాలని, ఊరి నడిబొడ్డున తమ భర్తల విగ్రహాలు ఏర్పాటు చేయించాలని కోరారు. దీనిపై ట్విటర్ ద్వారా స్పందించిన సీఎం అశోక్ గెహ్లాట్.. ఈ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. అయితే రాతపూర్వకంగా స్పష్టమైన హామీ ఇస్తేనే దీక్ష విరమిస్తామని చెబుతూ.. తమ దీక్షను కొనసాగించారు వాళ్లు. మరోవైపు బీజేపీ ఈ పరిణామాల ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. అయితే దీనిని రాజకీయం చేయడం సరికాదని అంటున్నారు సీఎం గెహ్లాట్. జమ్ముకశ్మీర్ పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14వ తేదీన.. శ్రీనగర్ జాతీయ రహదారిపై పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRFP) సిబ్బంది కాన్వాయ్ మీద ఆత్మాహుతి దాడికి ఉగ్రవాదులు తెగబడ్డారు. ఈ దాడిలో 40 మంది జవాన్లు అమరులు కాగా, యావత్ దేశం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. -
ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలి: ఉద్ధవ్
న్యూఢిల్లీ/ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలని మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ‘శివసేన పేరు, విల్లు, బాణం గుర్తును మా వద్ద నుంచి దొంగిలించారు. కానీ, థాకరే పేరును మాత్రం దొంగిలించలేరు’ అని సోమవారం మీడియాతో అన్నారు. ఈసీ అంత హడావుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. దీనిపై తాము వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో బహుశా మంగళవారం విచారణకు రావొచ్చని అన్నారు. ‘‘ఎన్నికల సంఘం ఉత్తర్వులు తప్పు. సుప్రీంకోర్టే మా చివరి ఆశా కిరణం’’ అని ఉద్ధవ్ పేర్కొన్నారు. దేశంలోని ప్రజాస్వామిక వ్యవస్థలను బీజేపీ నాశనం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. ‘నేడు మాకు జరిగినట్లే రేపు మరొకరికి జరగొచ్చు. ఇలాగే కొనసాగితే 2024 తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు. ఎన్నికలూ ఉండవు’ అని హెచ్చరించారు. ఎన్నికల సంఘం ఉత్తర్వుల నేపథ్యంలో మమతా బెనర్జీ, శరద్ పవార్, నితీశ్ కుమార్, తదితర విపక్ష నేతలు తనకు ఫోన్ చేసి మద్దతు తెలిపారన్నారు. సుప్రీం తలుపుతట్టిన ఉద్ధవ్ వర్గం షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తిస్తూ, విల్లు, బాణం ఎన్నికల గుర్తు కేటాయించడాన్ని ఉద్ధవ్ వర్గం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం తిరస్కరించింది. ‘‘నిబంధనలు అందరికీ సమానంగా వర్తిస్తాయి. సరైన ప్రక్రియను అనుసరించి మంగళవారం న్యాయస్థానం ముందుకు రండి’’ అని సీజేఐ సూచించారు. -
ఈక్విటీల్లోకి మళ్లీ పెట్టుబడుల వరద
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు జనవరిలో తిరిగి డిమాండ్ ఏర్పడింది. రూ.12,546 కోట్లు నికరంగా ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. గత నాలుగు నెలల్లో ఈక్విటీ ఫండ్స్‌లోకి ఒకనెలలో వచ్చిన గరిష్ట పెట్టుబడులు ఇవి. 2022 డిసెంబర్లో ఈక్విటీల్లోకి రూ.7,303 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అదే ఏడాది నవంబర్‌లో రూ.2,258 కోట్లు, అక్టోబర్‌లో రూ.9,390 కోట్ల చొప్పున వచ్చాయి. ఇక 2022 సెప్టెంబర్‌లో వచ్చిన రూ.14,100 కోట్లు నెలవారీ గరిష్ట స్థాయిగా ఉంది. ఈక్విటీ పథకాల్లోకి వరుసగా 23వ నెలలోనూ నికరంగా పెట్టుబడులు రావడాన్ని గమనించొచ్చు. 2023 జనవరి గణాంకాలను ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. విభాగాల వారీగా.. అత్యధికంగా స్మాల్‌క్యాప్ పథకాల్లోకి రూ.2,256 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ పథకాల్లోకి రూ.1,902 కోట్లు, మల్టీక్యాప్ పథకాల్లోకి రూ.1,773 కోట్లు, మిడ్‌క్యాప్ పథకాల్లోకి రూ.1,628 కోట్లు, ఈఎల్ఎస్ఎస్ పథకాల్లోకి రూ.14,14 కోట్లు, ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోకి రూ.1,006 కోట్లు, సెక్టోరల్, థీమ్యాటిక్ పథకాల్లోకి రూ.903 కోట్లు, కాంట్రా ఫండ్స్‌లోకి రూ.763 కోట్లు, లార్జ్‌క్యాప్ పథకాల్లోకి రూ.716 కోట్లు, ఫోకస్డ్ ఫండ్స్‌లోకి రూ.183 కోట్ల చొప్పున నికరంగా పెట్టుబడులు వచ్చాయి. ఫిక్స్డ్ ఇన్కమ్ స్థిరాదాయ పథకాల (డెట్) నుంచి జనవరిలో నికరంగా రూ.10,316 కోట్లు బయటకు వెళ్లాయి. అత్యధికంగా లిక్విడ్ ఫండ్స్‌లో రూ.5,042 కోట్లు, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లో రూ.3,859 కోట్లు, ఓవర్‌నైట్ ఫండ్స్‌లో రూ.3,688 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు విక్రయించారు. మనీ మార్కెట్ పథకాలు రూ.6,460 కోట్లు ఆకర్షించాయి. ఇక హైబ్రిడ్ పథకాలు సైతం రూ.4,492 కోట్లు ఆకర్షించగా, మల్టీ అస్సెట్ పథకాల్లోకి రూ.2,182 కోట్లు, ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లోకి రూ.2,055 వచ్చాయి. ఇండెక్స్ ఫండ్స్‌లోకి రూ.5,813 కోట్లు వచ్చాయి. ఇన్వెస్టర్లలో నమ్మకం ‘‘స్టాక్ మార్కెట్లలో అస్థిరతలు నెలకొన్నప్పటికీ ఇన్వెస్టర్లు ఈక్విటీ పథకాలపై నమ్మకాన్ని ఉంచారు. దీనికి నిదర్శనమే రూ.12,546 కోట్లు రావడం. నెలవారీగా చూస్తే ఇది 72 శాతం అధికం’’అని ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి తెలిపారు. మార్కెట్లలో ఆటుపోట్లు ఉన్నా ఇన్వెస్టర్లు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులకు ఆసక్తి చూపించినట్టు మోతీలాల్ ఓస్వాల్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది పేర్కొన్నారు. సిప్ బలం సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో రూ.13,856 కోట్లు వచ్చాయి. డిసెంబర్లో వచ్చిన రూ.13,573 కోట్లతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. సిప్ పెట్టుబడులు రూ.13వేల కోట్లకు పైగా రావడం వరుసగా నాలుగో నెలలోనూ నమోదైంది. సిప్ ఖాతాల సంఖ్య 6.21 కోట్లుగా ఉంది. నికరంగా 9.20 లక్షల కొత్త సిప్ ఖాతాలు రిజిస్టర్ అయ్యాయి. ఒకవైపు ఎఫ్‌పీఐలు విక్రయాలు చేస్తున్నప్పటికీ మార్కెట్లు స్థిరంగా ఉండడానికి సిప్ పెట్టుబడులు మద్దతుగా నిలిచినట్టు యాంఫి సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ పేర్కొన్నారు. -
ఏ హీరో అయినా ఓకే.. శృతి హాసన్ కు రెమ్యూనరేషన్ ముఖ్యం
-
స్పెషల్ సాంగ్ కోసం భారీ రెమ్యూనరేషన్ అడుగుతున్న రష్మిక
-
పైలట్ల సమ్మె... లుఫ్తాన్సా విమానాలు రద్దు
న్యూఢిల్లీ: డిమాండ్ల సాధన కోసం పైలట్లు ఒకరోజు సమ్మెకు దిగడంతో జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ సంస్థ విమానాలు ప్రపంచమంతటా నిలిచిపోయాయి. వందలాది విమానాల రాకపోకలను లుఫ్తాన్సా యాజమాన్యం రద్దు చేసింది. వేతనాలు పెంచాలని, మెరుగైన సౌకర్యాలు కల్పిచాలన్న డిమాండ్లతో పైలట్లు తమ విధులను బహిష్కరించారు. శుక్రవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు విమానాలు రద్దయ్యాయి. టర్మినల్–3 వద్ద దాదాపు 700 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఎయిర్‌పోర్టు బయట ఆందోళన చేపట్టారు. ప్రయాణికులు కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, లేదంటే రుసుము తిరిగి చెల్లించాలని పట్టుబట్టారు. ప్రయాణికుల్లో చాలామంది విదేశాలకు వెళ్లాల్సిన విద్యార్థులు ఉన్నారు. తమకు న్యాయం చేయాలంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చాలాసేపు వేచి చూసి, చేసేది లేక ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లిపోయారు. అతిత్వరలో విమానాల రాకపోకలను పునరుద్ధరిస్తామని లుఫ్తాన్సా ప్రతినిధులు వెల్లడించారు. -
హౌసింగ్ బూమ్..! రేట్లు పెరిగినా తగ్గేదెలే!
న్యూఢిల్లీ: అధిక వడ్డీ రేట్లు ఇళ్ల కొనుగోలు డిమాండ్‌కు అవరోధం కాదని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) అధ్యయన నివేదిక తెలిపింది. రుణ కాల వ్యవధిలో వడ్డీ రేట్లు పెరగడం, తగ్గడం సహజమేనన్న విషయమై వారికి అవగాహన ఉంటుందని పేర్కొంది. రెండేళ్లుగా వడ్డీ రేట్ల పరంగా ఎటువంటి మార్పుల్లేని విషయం తెలిసిందే. కానీ, ఆర్బీఐ ఈ ఏడాది మే నుంచి మూడు విడతలుగా మొత్తం 1.4 శాతం మేర రేట్లను పెంచడంతో.. బ్యాంకులు సైతం రేట్లను సవరించాయి. ఈ నేపథ్యంలో బీవోబీ పరిశోధన నివేదిక ఇళ్ల డిమాండ్, వడ్డీ రేట్లపై దృష్టి సారించడం గమనించాలి. ‘భారత్‌లో గృహ రుణాల తీరు’ పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. కరోనా తర్వాత దేశంలో గృహ రుణ రంగం బలంగా నిలబడినట్టు తెలిపింది. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఇచ్చే గృహ రుణాల్లో మంచి వృద్ధి కనిపించడాన్ని ప్రస్తావించింది. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం ఈ రంగానికి ప్రకటించిన మద్దతు చర్యలు, దీనికితోడు ప్రాపర్టీల ధరలు తగ్గడం, తక్కువ వడ్డీ రేట్లు మార్కెట్‌కు కలిసొచ్చినట్టు వివరించింది. గృహ రుణాలకు డిమాండ్ ఆర్థిక కార్యకలాపాలు సాధారణంగా మారిపోవడం, వృద్ధి పుంజుకోవడం, గృహాలకు డిమాండ్‌ను గణనీయంగా పెంచనున్నట్టు ఈ నివేదికను రూపొందించిన బీవోబీ ఆర్థికవేత్త అదితి గుప్తా పేర్కొన్నారు. ఈ సానుకూలతలు మద్దతుగా గృహ రుణాలకు మరింత డిమాండ్ ఉంటుందని అంచనా వేశారు. ‘‘అధిక వడ్డీ రేట్లు కొద్ది మంది రుణ గ్రహీతలకు అవరోధం కావచ్చు. కానీ, ఇళ్లకు నెలకొన్న బలమైన డిమాండ్ దీన్ని అధిగమిస్తుంది. పైగా వ్యక్తిగత గృహ కొనుగోలుదారులు వడ్డీ రేట్ల ఆటుపోట్లపై అవగాహనతో ఉంటారు. కనుక అధిక రేట్లు వారి కొనుగోళ్లకు అవరోధం కాబోవు’’అని అదితి గుప్తా వివరించారు. జీడీపీలో పెరిగిన వాటాయే నిదర్శనం గడిచిన పదేళ్ల కాలంలో జీడీపీలో బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల గృహ రుణాల రేషియో పెరగడం గృహ రుణాలకు పెరుగుతున్న ప్రాధాన్యానికి నిదర్శనమని ఈ నివేదిక గుర్తు చేసింది. 2010–2011లో జీడీపీలో గృహ రుణాల రేషియో 6.8 శాతంగా ఉంటే, 2020–21 నాటికి అది 9.5 శాతానికి పెరిగినట్టు తెలిపింది. కరోనా మహమ్మారి విరుచుకుపడిన ఆర్థిక సంవత్సరంలోనూ జీడీపీలో గృహ రుణాల రేషియో 9.8 శాతానికి పెరిగినట్టు పేర్కొంది. కరోనా మహమ్మారి నుంచి రియల్ ఎస్టేట్ బలంగా కోలుకుందని, గత ఆర్థిక సంవత్సరంలో గృహ రుణాల రేషియో జీడీపీలో 11.2 శాతానికి పెరిగినట్టు తెలిపింది. ‘‘2020–11 నాటికి రూ.3.45 లక్షల కోట్లుగా ఉన్న బ్యాంకుల గృహ రుణాల పోర్ట్‌ఫోలియో 2020–21 నాటికి రూ.15 లక్షల కోట్లకు పెరిగింది. ఏటా 14.3 శాతం వృద్ధి నమోదైంది. గృహ రుణాల మార్కెట్లో ఇప్పటికీ ప్రభుత్వరంగ బ్యాంకుల ఆధిపత్యమే కొనసాగుతోంది. వీటి వాటా 61.2 శాతంగా ఉంది. 2022లో హౌసింగ్ బూమ్..! పరిశ్రమ వర్గాల అభిప్రాయాలు ఇళ్ల ధరలు పెరిగాయి. గృహ రుణాల రేట్లు కూడా పెరుగుతున్నాయి. అయినా సరే 2022లో ఇళ్ల విక్రయాలు కరోనా ముందు నాటిని మించి నమోదవుతాయని పరిశ్రమ భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఈ ఏడాది మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు.. కరోనా ముందు సంవత్సరం 2019లో నమోదైన 2.62 లక్షల యూనిట్లను మించుతాయని అంచనాతో ఉంది. డీమోనిటైజేషన్, రెరా, జీఎస్టీ, కరోనా మహమ్మారి కారణంగా గడిచిన ఆరేళ్లుగా ఈ పరిశ్రమ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవడం గమనార్హం. అయితే, రెరా చట్టం కారణంగా కొనుగోళ్ల సెంటిమెంట్ మెరుగుపడినట్టు గృహ కొనుగోలుదారుల మండలి ఎఫ్‌పీసీఈ అంటోంది అన్ని ప్రధాన రియల్ ఎస్టేట్ లిస్టెడ్ కంపెనీలు గత ఆర్థిక సంవత్సరానికి బుకింగ్‌ల పరంగా మంచి గణాంకాలను నమోదు చేయగా, 2022–23లోనూ మెరుగైన విక్రయాలు, బుకింగ్‌ల పట్ల ఆశాభావంతో ఉంది. అయితే, ఆర్బీఐ రెపో రేటును 1.4 శాతం మేర పెంచడం, బ్యాంకులు ఈ మొత్తాన్ని రుణ గ్రహీతలకు బదిలీ చేయడంతో స్వల్ప కాలంలో ఇళ్ల విక్రయాలపై ఈ ప్రభావం ఉంటుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. ఇళ్ల ధరల పెరుగుదల ప్రభావం కూడా స్వల్పకాలంలో ఉండొచ్చని అంగీకరించింది. జూన్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు సుమారు 5 శాతం మేర పెరగడం గమనార్హం. పండుగల జోష్ అయితే పండుగల సీజన్ నుంచి ఇళ్ల విక్రయాలు పుంజుకోవచ్చని రియల్ ఎస్టేట్ పరిశ్రమ అంచనాలతో ఉంది. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ సైతం ఈ ఏడాది ఇళ్ల విక్రయాలు ఏడు ప్రధాన పట్టణాల్లో (ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, పుణె) 2019లో నమోదైన 2,61,358 యూనిట్లను మించుతాయని అంచనా వేసింది. అయితే 2014లో నమోదైన గరిష్ట విక్రయాలు 3.43 లక్షల యూనిట్ల కంటే తక్కువే ఉండొచ్చని పేర్కొంది. దేశ హౌసింగ్ పరిశ్రమ నిర్మాణాత్మక అప్‌సైకిల్ ఆరంభంలో ఉందని మ్యాక్రోటెక్ డెవలపర్స్ ఎండీ, సీఈవో అభిషేక్ లోధా తెలిపారు. వచ్చే 10–20 ఏళ్ల కాలానికి వృద్ధిపై ఆశావహంగా ఉన్నట్టు చెప్పారు. -
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు డిమాండ్లు ఇవి
-
Lalu Prasad Yadav: కుల గణన చేయాల్సిందే
పట్నా(బిహార్): కేంద్ర ప్రభుత్వం కుల ప్రాతిపదికన జనాభా గణనను నిర్వహించాలని రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. కుల గణన తర్వాత మొత్తం జనాభాలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంఖ్య సగం కంటే ఎక్కువగా ఉందని తేలితే ఆ మేరకు రిజర్వేషన్లలో తగిన ప్రాధాన్యత దక్కాలని ఆయన అభిలషించారు. మొత్తం జనాభా కంటే ఈ వర్గాల జనాభా సగం కంటే ఎక్కువగా ఉంటే ఇప్పుడు అమలవుతోన్న 50 శాతం రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం ఆర్జేడీ పార్టీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో ఢిల్లీ నుంచి వర్చువల్ పద్ధతిలో ఆయన ప్రసంగించారు. ‘ స్వాతంత్య్రం రాక ముందు నాటి జనాభా ప్రాతిపదికనే రిజర్వేషన్ కోటాలను అప్పటి నుంచి ఇప్పటిదాకా కొనసాగిస్తున్నాం. వేర్వేరు సామాజిక వర్గాల తాజా జనాభాలను లెక్కించి 50 శాతం రిజర్వేషన్ల పరిమితిపై నిర్ణయాలు తీసుకోవాలి. కుల గణన చేపట్టాలని తొలిసారిగా డిమాండ్ చేసింది నేనే. ఈ డిమాండ్‌ను పార్లమెంట్ వేదికగా గతంలోనే నాటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. ఇప్పుడున్న కోటా ప్రస్తుత అవసరాలకు సరిపోదు. రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవట్లేదు’ అని లాలూ వ్యాఖ్యానించారు. లాలూ చిన్న కుమారుడు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సైతం కుల గణన అంశాన్ని ప్రధాని మోదీ వద్ద ఇటీవల ప్రస్తావించారు. ఆరోగ్యం కుదుటపడ్డాక త్వరలోనే బిహార్‌లో అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని లాలూ చెప్పారు. దాణా కుంభకోణం, తదితర కేసుల్లో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తూ, మరి కొన్ని కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్న సంగతి తెల్సిందే. అనారోగ్యం, మెరుగైన చికిత్స కారణాలతో బెయిల్ లభించడంతో ఈ ఏడాది జైలు నుంచి బయటికొచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో చికిత్స తీసుకుంటున్నారు. చదవండి: Farmers Protest: రైతు నిరసనలకు 300 రోజులు -
50 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి
సాక్షి, ముషీరాబాద్(హైదరాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 50 వేల టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యానగర్‌లోని బీసీ భవన్లో బుధవారం బీసీ సంఘం నేత గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన బీఈడీ, డీఈడీ, పీఈటీ పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్న మాదిరిగానే టీచర్ పోస్టులను భర్తీకి కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను తీ ర్చిదిద్ది పేద, బడుగు, బలహీన వర్గాలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను అందంగా తీర్చిదిద్దుతున్నారని, వేలకోట్లను వెచ్చిస్తున్నా రని తెలిపారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల ముందు నో వేకెన్సీ బోర్డులు దర్శనం ఇస్తున్నాయన్నారు. అదే పరిస్థితి తెలంగాణలో కూడా తీసుకురావాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో లాల్‌కృష్ణ, లక్ష్మణ్‌యాదవ్, అంజి, సత్యనారాయణ, అనంతయ్య, సతీశ్, చంటి ముదిరాజ్, సుచిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: దళితబంధును వదులుకున్న సిసలైన శ్రీమంతులు.. -
స్టీల్‌ప్లాంట్ అప్పులను ఈక్విటీలుగా మార్చాలని డిమాండ్
-
‘విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి’
ముషీరాబాద్ (హైదరాబాద్): రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించి, ఖాళీ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం విద్యానగర్‌లోని రాష్ట్ర బీసీ భవన్లో తెలంగాణ బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సంఘం వ్యవస్థాపకుడు సుతారపు వెంకట నారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడారు. విద్యారంగ సమగ్ర వికాసానికి ఉపాధ్యాయుల సహకారం చాలా అవసరమని పేర్కొన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీ గా ఉన్న 40 వేల టీచర్ల పోస్టులను వెంటనే భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయాలన్నారు. రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక.. తెలంగాణ బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సుతారపు వెంకట నారాయణ, ఉపాధ్యక్షుడిగా పరంకుశం కుమారస్వామి, ప్రధాన కార్యదర్శిగా ఉప్పు మధుకర్, సం యుక్త కార్యదర్శిగా కె.శ్రీనివాస్, కోశాధికారిగా నరేందర్‌లు ఎన్నికయ్యారు. -
కరోనా మూలాలు తేలాల్సిందే!
సిడ్నీ: కరోనా వైరస్ మహమ్మారి చైనాలోనే పుట్టిందన్న వాదనల మధ్య ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ మరోసారి చైనాపై తన దాడిని ఎక్కుపెట్టారు. కరోనా వైరస్ పుట్టుపూర్వోత్తరాలు తెలుసు కోవడానికి ప్రపంచ దేశాలు తమ వంతు కృషి చేయాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి మహమ్మారి విజృంభించకుండా, ఏం జరిగిందో అర్థం చేసుకునేందుకు మనం చేయగలిగినదంతా చేయాలని చెప్పారు. ఐక్యరాజ్యసమితి సమావేశంలో మోరిసన్ మాట్లాడుతూ శనివారం ఈవ్యాఖ్యలు చేశారు. కరోనా మూలలపై విచారణ చేస్తేనే మానవాళికి మరో ప్రపంచ మహమ్మారి ముప్పు తప్పుతుందన్నారు. (కరోనా మరణాలపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన) టెలికాన్ఫరెన్స్ వీడియో లింక్ ద్వారా ఐరాస్ 75 వ వార్షికోత్సవ సమావేశాల్లో ప్రసగించిన మోరిసన్ ప్రపంచ దేశాలను కరోనా వణికించిందని, మానవాళిని విపత్తులో ముంచిందని వ్యాఖ్యనిచారు. కోవిడ్-19 వైరస్ జెనెటిక్ మూలాన్ని, అది మానవులకు ఎలా వ్యాపించిందో గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఎవరు టీకాను కనుగొన్నారో వారు ప్రపంచ దేశాలతో తప్పక పంచుకోవాలని ఇది నైతిక బాధ్యత అని పేర్కొన్నారు. ఈ విషయంలో ఆస్త్రేలియా వాగ్దానం చేస్తోందిని అలాగే అన్ని దేశాలు అలా చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో చైనాపై ప్రధాని దాడి తరువాత ఆస్ట్రేలియా చైనా మధ్య సంబంధాలు, వాణిజ్య యుధ్దం సెగలకు మోరిసన్ తాజా వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. కాగా ప్రపంచవ్యాప్తంగా విలయాన్ని సృష్టించిన కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిపై సర్వత్రా ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తరువాత ఆస్ట్రేలియా డ్రాగన్‌ను టార్గెట్ చేసింది. అప్పటి నుండి చైనా ఆస్ట్రేలియాపై వాణిజ్య ఆంక్షలు విధించింది. బీఫ్ దిగుమతులను నిలిపివేసింది. వైన్ దిగుమతులపై యాంటీ డంపింగ్ దర్యాప్తును ప్రారంభించింది. చైనాలోని వుహాన్ సిటీలోని ఓ ప్రయోగశాలలో ఈ వైరస్ పుట్టిందంటూ ఇప్పటికే అమెరికాతో పాటు పలు పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో దీని పుట్టు పూర్వోత్తరాలపై ఓ స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్ధపై ఒత్తిడి పెరుగుతోంది. (కరోనాపై లాన్సెట్ తాజా హెచ్చరికలు) -
తప్పుడు కేసులు దుర్మార్గ చర్య
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రేరేపకులుగా ఆరోపిస్తూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జేఎన్‌యూ ప్రొఫెసర్ జయతీ ఘోష్, మరికొందరు మేధావులపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించాలని సీపీఐ నేత సురవరం సుధాకరరెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రధాన నిందితులైన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతరుల పేర్లు, వివరాలు పత్రికల్లో వచ్చినా వారిపై చర్యలు తీసుకోకుండా సంబంధం లేని వారిపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అని, ఈ తప్పుడు కేసులు పెట్టేందుకు కేంద్ర హోంశాఖ చేస్తున్న కుట్రను ఖండిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీమాకోరేగావ్‌లో జరిగిన అల్లర్లలో పాల్గొన్న సంఘ్‌పరివార్‌కు చెందిన నిందితులను వదిలేసి, ఈ ఘటనతో సంబంధం లేని మేధావులు, వామపక్ష భావాలు కలిగిన వారిని తప్పుడు కేసులతో అరెస్ట్ చేసి రెండేళ్లు అయినా ఎఫ్ఐఆర్ దాఖలు చేయకుండా, బెయిల్ ఇవ్వకుండా వేధిస్తున్నారని విమర్శించారు. సీపీఎం అగ్రనేత ఏచూరి, మరో 8 మంది మేధావులపై బీజేపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నట్టు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. నేడు నిరసనలు.. ఢిల్లీ అల్లర్ల కేసులో ఏచూరి తదితరులపై పోలీసులు చార్జిషీటును ఫైల్ చేయడంపై సోమవారం సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, టీజేఎస్, టీటీడీపీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నాయి. ఈ అక్రమ కేసులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపడుతున్న నిరసనల్లో భాగంగా హైదరాబాద్ ఆర్టీసి క్రాస్‌రోడ్డులో చేపడుతున్న కార్యక్రమంలో ఈ పార్టీల నాయకులు పాల్గొంటారని సీపీఎం తెలిపింది. -
అధికారికంగా ‘విమోచన’!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని తాము 22 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ వచ్చాక అధికారికంగా నిర్వహిస్తామన్న కేసీఆర్ కూడా విస్మరించారన్నారు. కేసీఆర్ సర్కార్.. మజ్లిస్‌పై ప్రేమతో తెలంగాణ అమరవీరుల త్యాగాలను విస్మరిస్తోందన్నారు. ఈనెల 17న అధికారికంగా కార్యక్రమం నిర్వహించాలని లేకుంటే.. బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామన్నారు. ఈనెల 7 నుంచి 17 వరకు పార్టీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఆదుకోవాలన్న సోయిలేదా?.. ఉపాధ్యాయుల దుస్థితి తలచుకుంటే గుండె తరుక్కుపోతుందని సంజయ్ పేర్కొ న్నారు. వారిని ఆదుకోవాలన్న సోయి ప్రభు త్వానికి లేకపోవడం దురదృష్టకరమన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. -
హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి
జనగామ: రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. జనగామలోని జిల్లా ఆస్పత్రిని గురువారం ఆయన సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితిని చూస్తుంటే ఆవేదన కలుగుతోందన్నారు. వైద్యులు, సిబ్బంది కొరతతో పాటు స్కానింగ్ సేవలు లేక దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. రోజువారీ కూలి చేసుకుంటేనే కడుపు నిండే పేదలు కరోనా బారిన పడితే ఆస్పత్రుల్లో ఐసోలేషన్ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఇంట్లో సౌకర్యాల లేమితో పాజిటివ్ రోగులు వేరుగా ఉండాలంటే బాధిత కుటుంబాలు నరకం చూస్తున్నాయని, దీంతో మిగతా వారికి సైతం వైరస్ వ్యాప్తి చెందుతోందని తెలిపారు. కరోనాపై కాంగ్రెస్ నేతలు మాట్లాడితే పారాసిటమాల్ సరిపోతుందని, మాస్క్ ఎందుకని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు మాస్క్ లేకుండా ఒక్క బాధితుడినైనా పరామర్శించారా అని నిలదీశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేసి, కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. -
ప్రతి బీసీ కులానికి ఒక కార్పొరేషన్: ఆర్. కృష్ణయ్య
ముషీరాబాద్ (హైదరా బాద్): ఏపీ ప్రభుత్వం మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతి బీసీ కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆయా కులాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఆదివారం బీసీ భవన్లో ఆయన మాట్లాడారు. బీసీ కార్పొరేషన్, 12 బీసీ కులాల ఫెడరేషన్ల ద్వారా మూడేళ్ల క్రితం తీసుకున్న 5.77 లక్షల దరఖాస్తులకు వెంటనే రుణాలు మంజూరు చేయాలని కోరారు. దరఖాస్తుదారులందరికీ రుణాలు మంజూరు చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఆ తర్వాత వాటిని పెండింగ్‌లో పెట్టారని విమర్శించారు. వెంటనే రుణాలు మంజూరు చేయకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కాగా, ఏపీ ప్రభుత్వం ప్రతి బీసీ కులానికి ఒక ప్రత్యేక కార్పొరేషన్ చొప్పున 52 బీసీ కుల కార్పొరేషన్లను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. సబ్సిడీ రుణాలు మంజూరు చేసిందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉన్న 12 బీసీ కుల ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. పాత ఫెడరేషన్లకు, కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్లకు పాలక మండళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. -
విద్యుత్ చట్ట సవరణలు వెంటనే ఉపసంహరించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా, రాష్ట్రాల హక్కులను హరించే విధంగా తీసుకువస్తున్న విద్యుత్ చట్ట సవరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని వివిధ వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. ప్రజలకు నష్టం చేసే ఈ సవరణలను వెనక్కు తీసుకోకపోతే గతంలో విద్యుత్ ఉద్యమ షాక్ తగిలి ఏపీ ప్రభుత్వం కూలిపోయిన మాదిరిగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కూడా షాక్ తగులుతుందని హెచ్చరించారు. కేంద్రం విద్యుత్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోకపోతే విద్యుత్ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో మరో ఉద్యమాన్ని చేపడతామని ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని షహీద్‌చౌక్ వద్ద విద్యుత్ ఉద్యమ అమరులు బాలాస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్‌లకు వామపక్షాల నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అమరవీరుల 21వ సంస్మరణ సభలో కేంద్ర విద్యుత్ చట్టాల సవరణకు వ్యతిరేకంగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు. గతంలో జరిగిన ‘బషీర్‌బాగ్ విద్యుత్ ఉద్యమం’మహత్తరమైన ఉద్యమమని, ఆ ఉద్యమం కారణంగానే ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు విద్యుత్ చార్జీలను పెంచే సాహసం చేయలేదని, పైగా వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ తదితర సదుపాయాలను కల్పించాయని వక్తలు పేర్కొ న్నారు. ఒకే దేశం–ఒకే పన్ను తదితర నినాదాలతో బీజేపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా చట్టాలను సవరిస్తూ రాష్ట్రాల హక్కులను హరిస్తోందని, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడేందుకు ముందుకు రావాలని సీపీఐ నేతలు కె.నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి కోరారు. నాడు ప్రపంచ బ్యాంకు విధానాల్లో భాగంగానే టీడీపీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలను అమలు చేసిందని, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అంతకంటే ఉధృతంగా ప్రపంచ బ్యాంకు, పెట్టుబడిదారీ విధానాలను అమలు చేస్తోందని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కార్యక్రమంలో అజీజ్‌పాషా, పశ్య పద్మ (సీపీఐ), జి.నాగయ్య, డీజీ నరసింహారావు, బి.వెంకట్, టి.సాగర్ (సీపీఎం), ఎం.సుధాకర్ (ఎంసీపీఐ–యూ), కె. మురహరి (ఎస్‌యూసీఐ–సీ), అచ్యుత రామారావు, ఎస్.ఎల్.పద్మ (న్యూడెమోక్రసీ) తదితరులు పాల్గొన్నారు. -
హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి
హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం కల్పించాలని, రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. సోమవారం అఖిలపక్ష నేతలు కోదండరాం, ఎల్.రమణ, చాడ వెంకట్‌రెడ్డి తదితరులు కింగ్‌కోఠి కోవిడ్ ఆసుపత్రిని సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఆసుపత్రిలో కోవిడ్ చికిత్సలపై సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కింగ్‌కోఠి ఆసుపత్రిలో సౌకర్యాలను మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ఆసుపత్రిలో 200 బెడ్లు ఖాళీగా ఉన్నాయని, అయినా అధికారులు బెడ్లు ఖాళీ లేవని రోగులను వెనక్కి పంపిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలతో ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పోతోందన్నారు. ప్రజా ప్రతినిధులు సైతం చికిత్సకోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరాలని ఆయన సూచించారు. టీటీడీపీ నేత ఎల్.రమణ మాట్లాడుతూ.. ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్లనే ప్రజలు సర్కారు ఆసుపత్రులపై నమ్మకం కోల్పోయారన్నారు. యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రజలను దోచుకుంటున్న ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలన్నారు. -
వీవీ ప్రాణాలు కాపాడాలి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ విప్లవకవి వరవరరావు(వీవీ)కు కోవిడ్ సోకిన నేపథ్యంలో వెంటనే ఆయనను జైలు నుంచి విడుదల చేసి, మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడాలని కేంద్ర ప్రభుత్వానికి వివిధ వామపక్ష పార్టీల నేతలు శుక్రవారం విజ్ఞప్తిచేశారు. వీవీతోపాటు 90 శాతం అంగవైకల్యమున్న ప్రొ.జీఎన్ సాయిబాబా, ఇతర రాజకీయ ఖైదీలను బెయిల్‌పై విడుదల చేయాలని కోరారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడే బెయిల్ ఇచ్చి ఉంటే ఆయనకు కోవిడ్ సోకేది కాదన్నారు. వెంటనే ఆయనను విడుదల చేసి డాక్టర్లు, కుటుంబసభ్యుల సంరక్షణలో హైదరాబాద్‌కు తరలించి మెరుగైన వైద్యాన్ని అందించడం ద్వారా ప్రాణాలను కాపాడొచ్చని పేర్కొన్నారు. శుక్రవారం మఖ్దూంభవన్‌లో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన జరిగిన సమావేశంలో చాడ వెంకటరెడ్డి, పశ్యపద్మ, ఎన్.బాలమల్లేష్ (సీపీఐ), డీజీ నర్సింహా రావు, బి.వెంకట్ (సీపీఎం), కె. గోవర్థన్. కె.రమాదేవి (న్యూడెమోక్రసీ రెండు గ్రూపులు), ఉపేందర్ రెడ్డి (ఎంసీపీఐ–యూ), సీహేచ్ మురహరి (ఎస్‌యూసీఐ–సీ),డి.రాజేశ్ (లిబరేషన్) పాల్గొన్నారు. ప్రజాసంఘాల ర్యాలీ విరసం నేత వరవరరావుతోపాటు దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని పీడీఎస్‌యూ, పీవోడబ్లు్య, ఐఎఫ్టీయూ, ఏఐకేఎంఎస్, ప్రజా సంఘాలు శుక్రవారం విద్యానగర్ నుంచి హిందీ మహావిద్యాలయ వరకు ర్యాలీ నిర్వహించాయి. పీవోడబ్లు్య జాతీయ అధ్యక్షురాలు వి.సంధ్య మాట్లాడుతూ వరవరరావు, సాయిబాబాలకు కరోనా సోకడంతో పాటు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి అచ్యుత రామారావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్, సహాయ కార్యదర్శి జి. అనురాధ, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పరశురామ్, నగర అధ్యక్షుడు రియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
విధుల్లోకి జూనియర్ డాక్టర్లు
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగులు, బంధువులు దాడికి పాల్పడటంతో నాలుగు రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు ఎట్టకేలకు శాంతించారు. డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావడంతో తిరిగి విధుల్లో చేరేందుకు అంగీకరించారు. తమ సమస్యలకు ఒక్కొక్కటిగా పరిష్కారం చూపుతామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో వెంటనే విధుల్లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జూనియర్ డాక్టర్ల సంఘం గాంధీ ఆస్పత్రి విభాగం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్నా... కరోనా రోగులకు చికిత్స అందించేందుకు ప్రాణాలు లెక్కచేయకుండా పనిచేస్తున్నామని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రోగుల బంధువులు తమపై దాడులకు దిగడం ఏమిటంటూ జూనియర్ డాక్టర్లు మంగళవారం రాత్రి నుంచి విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూనే విధుల్లో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బందికి ప్రత్యేక భద్రత అందించాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులతో పలుమార్లు చర్చలు జరిపారు. వైద్యులు, వైద్య సిబ్బంది భద్రతకు స్పెషల్ పోలీస్ ఫోర్స్ (ఎస్పీఎఫ్)ను ఏర్పాటు చేయడంతోపాటు ఏళ్లుగా ఖాళీగా ఉన్న పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేయాలనే డిమాండ్‌ను మంత్రికి వివరించారు. అలాగే సకల సౌకర్యాలున్న గాంధీ ఆస్పత్రిని కేవలం కరోనా చికిత్సకే పరిమితం చేయకుండా అన్ని రకాల రోగులను అనుమతించాలని కోరారు. ప్రస్తుతం పడకల సంఖ్య ఆధారంగా పోస్టులు మంజూరు చేసినప్పటికీ 30% అదనపు పోస్టులు మంజూరు చేసి వాటిని భర్తీ చేయాలన్నారు. రిజర్వ్ స్టాఫ్ ఉంటేనే వైద్యులు, సిబ్బందిపై ఒత్తిడి ఉండదని, దీనివల్ల రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందని జూనియర్ డాక్టర్ల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. కరోనా చికిత్సలను గాంధీ తదితర ఆస్పత్రులకే పరిమితం చేయకుండా జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లోనూ ప్రారంభిస్తే గాంధీ ఆస్పత్రిపై ఒత్తిడి తగ్గుతుందని కోరారు. వైద్యులు, సిబ్బందికి ఇచ్చే పీపీఈ కిట్లు, ఇతరాలను జూనియర్ డాక్టర్ల సమ్మతితో కొనుగోలు చేయాలని సూచించారు. పక్షం రోజుల్లో రోడ్‌మ్యాప్... జూనియర్ డాక్టర్ల సంఘం డిమాండ్లపై ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. కరోనా అత్యవసర పరిస్థితి కొనసాగుతున్న క్రమంలో ఆందోళన విరమించాలని సూచిస్తూనే వారి డిమాండ్ల పరిష్కారం కోసం 15 రోజుల్లో మార్గం చూపిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు మంత్రి ఈటల రాజేందర్ వారికి హామీ ఇచ్చినట్లు సమాచారం. చర్చల తాలూకూ అంశాలను సీఎం కేసీఆర్‌కు వివరించిన తర్వాత కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి వివరించారు. ఇందుకు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందని, ఈలోగా విధుల్లో చేరి వైద్యసేవలను ప్రారంభించాలని కోరారు. దీంతో సమ్మతించిన జూనియర్ డాక్టర్ల సంఘ ప్రతినిధులు విధుల్లో చేరేందుకు సముఖత చూపారు. పక్షం రోజుల్లో పరిష్కారం చూపకుంటే మాత్రం మళ్లీ ఆందోళన చేపడతామని జూనియర్ డాక్టర్ల సంఘం పేర్కొంది. -
ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు అనైతికం: ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్ (హైదరాబాద్): గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే 7,500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యానగర్‌లోని బీసీ భవన్లో శనివారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సత్యాగ్రహదీక్ష చేపట్టారు. ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంత్‌రావు, టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాములు, తెలంగాణ జనసమితి నగర అధ్యక్షులు ఎం.నర్సయ్యలతో పాటు వివిధ కుల, ప్రజా సంఘాల నాయకులు దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ...గత 14 ఏళ్లుగా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం తొలగించడం అనైతికమని, ఏ కారణం చేత వారిని తొలగించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. జీతాలు పెంచాలని సమ్మె చేస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తారా అని ప్రశ్నించారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు చేసే 7,500 మంది ఉద్యోగులలో 7,450 మంది అంటే 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందినవారని ఆయన గుర్తుచేశారు. ఈ అక్రమ తొలగింపుపై జాతీయ బీసీ,ఎస్సీ, ఎస్టీ కమిషన్లు జోక్యం చేసుకుని వారికి న్యాయం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్ తదితరులు సత్యాగ్రహదీక్షలో పాల్గొన్నారు. దీక్షకు జాతీయ బీసీ సేన అధ్యక్షులు బర్క కృష్ణతో పాటు ఇతర బీసీ నాయకులు మద్దతు తెలిపారు. బీసీ భవన్లో సత్యాగ్రహ దీక్ష చేస్తున్న ఆర్.కృష్ణయ్య. పక్కన చాడ వెంకట్‌రెడ్డి, ఎల్.రమణ తదితరులు -
ఉండలేము.. వెళ్లలేము!
సాక్షి, హైదరాబాద్: కరోనా సృష్టించిన కల్లోలంతో స్వరాష్ట్రానికి రావాలనుకుంటున్న గల్ఫ్ వలస కార్మికులకు విమాన ప్రయాణ ఖర్చు, క్వారంటైన్ ఖర్చు గుదిబండగా మారింది. విపత్కర పరిస్థితుల్లో ఉపాధి కోల్పో యి ఇంటి బాట పట్టిన వారికి ఆర్థికంగా భారంగా పరిణమించింది. ఇతర రాష్ట్రాలు ఉచిత క్వారంటైన్ సౌకర్యం కల్పిస్తుండగా.. తెలంగాణ రాష్ట్రం మాత్రం పెయిడ్ క్వారంటైన్ తప్పనిసరి చేయడంతో లబోదిబోమంటున్నారు. గల్ఫ్ నుంచి తిరుగుముఖం పట్టేవారి ఖర్చులను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జేఏసీ పోరుబాట పట్టింది. వలస కార్మికులకు సంఘీభావంగా వందేభారత్ గల్ఫ్ భరోసా దీక్షలు చేపడుతోంది.ఉచిత విమాన టికెట్టు, ఉచిత క్వారంటైన్‌ను కల్పించాలని కోరుతూ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి గల్ఫ్ జేఏసీ రంగం సిద్ధం చేస్తోంది. గల్ఫ్ యుద్ధ సమయంలో... గల్ఫ్ యుద్ధ సమయంలో అక్కడి నుంచి 1.70 లక్షల మంది భారతీయులను మన దే శానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. వీరి విమాన ప్రయాణ ఖర్చులను అప్పటి ప్రధాని వీపీ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వమే భరించింది. ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్న జేఏసీ.. రెక్కాడితేగానీ డొక్కాడని వలస కార్మికుల ప్రయాణ, క్వారంటైన్ ఖర్చులను కూడా ప్ర భుత్వాలే భరించాలని డిమాండ్ చేస్తున్నాయి. 3 రాష్ట్రాల్లో ఉచితంగానే క్వారంటైన్... విదేశాల నుంచి వచ్చే తమ రాష్ట్రాల వారికి ఆంధ్రప్రదేశ్, కేరళ, ఢిల్లీ ప్రభుత్వాలు ఉచితంగానే క్వారంటైన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. వలస కార్మికులకు ఉచిత క్వారం టైన్ కల్పిస్తామని, ఏర్పాట్లు కూడా చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఎందుకోగానీ పక్కనపెట్టేశారు. అంత ఎలా భరించాలి... ప్రవాసీలకు విమాన ప్రయాణం, క్వారంటైన్ ఫీజు భారంగా మారింది. విమాన టిక్కెట్ రెట్టింపు చేయగా, క్వారంటైన్‌కు రూ.15 వేల ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్‌లైన్స్ మాత్రమే విమానాలను నడుపుతోంది. ఇతర సంస్థలు నడపకపోవడంతో ఇండియన్ ఎయిర్‌లైన్స్ నే ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో ఆ సంస్థ నిర్దేశించిన భారీ చార్జీలను చెల్లించాల్సివస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతా ల్లో హోటళ్లలోగాకుండా.. స్వస్థలాలకు చేరువల్లోని హోటళ్లలో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల కొంతమేర భారం తగ్గుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రభుత్వాలు స్పందించే వరకు పోరాటం గల్ఫ్ నుంచి రావాలనుకుంటున్న కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగానే విమాన టికెట్లు, క్వారంటైన్ సౌకర్యం కల్పించాలి. ఈ అంశాలపై ప్రభుత్వాలు స్పందించే వరకు మా పోరాటం కొనసాగుతుంది. – గుగ్గిళ్ల రవిగౌడ్, గల్ఫ్ వర్కర్స్ జేఏసీ కన్వీనర్ ప్రవాసీయుల్లో చైతన్యం కోసం కృషి... గల్ఫ్ ప్రవాసీయుల సమస్యలపై అందరిలో చైతన్యం తీసుకురావడం కోసం జిందగి ఇమేజెస్ ఫేస్బుక్ పబ్లిక్ గ్రూప్‌ను ఏర్పాటు చేశాం. కార్మికుల సమస్యలపై ఫేస్బుక్ ద్వారా లైవ్ కార్యక్రమం నిర్వహించి సమస్యలపై చర్చలను కొనసాగిస్తున్నాం. – చేగొండి చంద్రశేఖర్, జిందగి ఇమేజెస్ ఫేస్బుక్ పబ్లిక్ గ్రూప్ వ్యవస్థాపకులు -
ఇడిసిపెడితే నేను పోత సారు..
గోల్కొండ/గచ్చిబౌలి/శంషాబాద్: వలస కార్మికులు రోడ్డెక్కారు. తమను స్వస్థలాలకు పంపించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం హైదరాబాద్‌లోని టోలిచౌకీ, గచ్చిబౌలి, శంషాబాద్‌లో ఆందోళనకు దిగారు. లాక్డౌన్ కారణంగా చేసేందుకు పని లేక పస్తులుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒడిశా, జార్ఖండ్, కర్ణాటకలతో పాటు బిహార్ రాష్ట్రాలకు చెందిన వేల మంది కార్మికులు హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. ప్రభుత్వం వలస కూలీలకు అందిస్తున్న సాయం తమకు అందడం లేదని, ఉండటానికి స్థలం లేక పడరాని పాట్లు పడుతున్నామని బిహార్‌కు చెందిన అభయ్ అనే భవన నిర్మాణ కార్మికుడు వెల్లడించాడు. రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడటంతో నో వర్క్, నో పే అంటూ వాటి యజమానులు తమను గెంటేశారన్నారు. పోలీసులు పుట్‌పాత్‌లపై పడుకోనివ్వడం లేదని, టోలిచౌకీ పరిసరాల్లో ఒక్క నైట్ షెల్టర్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. మరోవైపు గచ్చిబౌలిలోని ఎల్అండ్టీ లేబర్ కాలనీలో కార్మికులు సైతం ధర్నాకు దిగారు. తమకు జీతాలిచ్చి, బస్సులు ఏర్పాటు చేస్తే సొంతూళ్లకు వెళ్లిపోతామంటూ ఆందోళన చేశారు. అలాగే శంషాబాద్ విమానాశ్రయంలోని విస్తరణ పనులు చేస్తున్న వలస కార్మికులు కూడా తమను సొంతూళ్లకు పంపించాలంటూ ఆందోళన చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఆయాచోట్లకు వెళ్లి ఆందోళనకారులకు సర్దిచెప్పారు. కార్మికులకు కావాల్సిన ఏర్పాట్లు చేయిస్తామని.. త్వరలోనే ప్రత్యేక వాహనాల ద్వారా స్వస్థలాలకు పంపిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఇక్కడ ఉండలేం.. రోడ్డెక్కిన గ్రానైట్ కార్మికులు.. సర్దిచెప్పిన అధికారులు ‘లాక్‌డౌన్‌తో పనుల్లేక 40 రోజులుగా అవస్థలు పడుతున్నాం. ఇక ఇక్కడ ఉండలేం. మా రాష్ట్రాలకు తిరిగి వెళ్తాం. వెంటనే అనుమతి ఇవ్వండి’ అంటూ ఖమ్మం జిల్లా కేంద్రంలోని పారిశ్రామిక ప్రాంతంలో వందలాది మంది కార్మికులు ఆదివారం రోడ్డెక్కా రు. రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, మ ధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన 500 మందికి పైగా కార్మికులు రోడ్డుపై బైఠాయించారు. లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వందల సంఖ్యలో గ్రానైట్, వాటికి అనుబంధంగా ఉన్న అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో పనులు లేకపోవడంతో ప్రభుత్వం, దాతలు అందించే ఆహారం, వితరణతో నెట్టుకొస్తున్నారు. ఇక పరిశ్రమలు తెరుస్తారో.. లేదోనని కార్మికులు ఆందోళన చెందారు. తమ ప్రాంతాలకు ఎలాగైనా వెళ్లాలని నిర్ణయించుకున్న కార్మికులు ఖమ్మం–ఇల్లెందు ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. కార్పొరేటర్ నాగండ్ల కోటి, అర్బన్ తహసీల్దార్ శ్రీనివాసరావు, ఆర్ఐ రాజేష్, వీఆర్వో బాలయ్య, అర్బన్ సీఐ వెంకన్నబాబు, మైనింగ్ ఏజీ గంగాధర్ కార్మికులకు నచ్చజెప్పారు. గ్రానైట్ పరిశ్రమలను నడుపుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, సోమవారం నుంచి పనులు చేసుకోవచ్చని, ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదని సర్ది చెప్పారు. అప్పటి వరకు తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పడంతో శాంతించారు. ఖమ్మం–ఇల్లెందు ప్రధాన రోడ్డుపై ఆందోళనకు దిగిన గ్రానైట్ కార్మికులు -
రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ సోకి చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న రూ.1,500 సరిపోవట్లేదని, వారికి రూ.5 వేలు ఇవ్వాలని కోరారు. ఉత్తమ్ నేతృ త్వంలోని అఖిలపక్ష బృందం గురువారం స చివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలసి రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించింది. కోదండరాం (టీజేఎస్), చాడ వెంకటరెడ్డి (సీపీఐ), ఎల్.రమణ (టీడీపీ), చెరుకు సుధాకర్ (తెలంగాణ ఇంటి పార్టీ)లు సీఎస్‌ను కలసి పలు సూచనలతో కూడిన వినతిపత్రం అందించారు. అనంతరం మీడియాతో మా ట్లాడారు. 40 రోజుల లాక్డౌన్ కారణంగా రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, అనివార్యమైన ఇబ్బందులను స్ఫూర్తితో ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. అఖిలపక్ష నేతలు ఎవరేమన్నారంటే రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పని చేయట్లేదు. గాంధీ, ఉస్మానియాలో మిగతా ఆరోగ్య సేవలు పునరుద్ధరించాలి.’ –చెరుకు సుధాకర్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసిన వారికి కూడా రేషన్ బియ్యం ఇవ్వాలి. భవన నిర్మాణ కార్మికులకు రూ.5 వేలు ఇవ్వాలి. సంగారెడ్డిలో నిరసన తెలిపిన కార్మికులకు జీతం ఇప్పించాలి. చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ‘రేషన్‌లో బియ్యంతో పాటు, పప్పు, నూనె ఇవ్వాలి. వాహనాల పన్నును 3 నెలల పాటు రద్దు చేయాలి. కోదండరామ్, టీజేఎస్ ‘రైతు రుణమాఫీ చేయాలి. సూరత్, భివండి, ముంబైలలో ఉన్న వలస కార్మికులను సొంత రాష్ట్రానికి తీసుకురావాలి. – ఎల్.రమణ, టీటీడీపీ అధ్యక్షుడు -
గిట్టుబాటుకోసం.. రైతు కంటనీరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొం టున్న సమస్యలను పరిష్కరించాలని, గిట్టుబాటు ధరలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ఒక రోజు ఉపవాస దీక్షను చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు బీజేపీ కార్యాలయంలో దీక్షను నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన తన దీక్ష ప్రారంభించారు.«ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నందుకు, నిరసనగా రైతులకు మద్దతుగా ఈ దీక్ష చేపట్టినట్లు తెలిపారు. అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిన్న రైతుల విషయం, కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లపై కనీసం కేబినెట్లో చర్చించకపోవడం దారుణమన్నారు. తాము సూచనలు చేసినా, సలహాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. లాక్ డౌన్ కాలంలో ఐకేపీకి తెచ్చిన ధాన్యం తిరిగి తీసుకెళ్లాలంటే రైతు పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.ఎక్కడా ఎలక్ట్రానిక్ కాంటాలు లేవన్నారు. కొన్ని చోట్ల కొనుగోళ్లు ప్రారంభించనే లేదన్నారు. ఈ పరిస్థితులతో రైతులు లాభాలు ఆశించడం లేదని, పెట్టిన పెట్టుబడి వస్తే చాలు అంటున్నారని, గిట్టుబాటు లేక వారు కన్నీరు పెడుతున్నారన్నారు. రూ. 30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అంటున్న ప్రభుత్వం ఎందుకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రైతు సమన్వయ సమితులు,అధికారులు, మిల్లర్లకు కొమ్ము కాస్తున్నారని, బ్రోకరిజం చేస్తున్నారని ఆరోపించారు. అందుకే అన్ని జిల్లాల్లో బీజేపీ నేతలు ఒక్క రోజు ఉప వాస దీక్షలో పాల్గొన్నారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని రైతు సమస్యలు పరిష్కరించాలన్నారు. రాజకీయ నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారని మాట్లాడు తున్నారని, మోనార్క్ పాలన సాగుతోందన్నారు. సమస్యలు పరిష్కరించమంటే విమర్శలు చేస్తున్నారని, రైతులు ఆందోళన చెందవద్దని, బీజేపీ అండగా ఉంటుందన్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ ఎవరి చేతిలో అధికారం ఉండకూడదో వారి చేతిలోకి వెళ్లిందన్నారు. ప్రతీ గింజ కొంటా అన్న కేసీఆర్ క్షేత్రస్థాయి పరిస్థితి ఏందో చూడాలన్నారు. ఈ దీక్షలో మాజీ మంత్రులు విజయ రామారావు, పెద్దిరెడ్డి, బీజేపీ నేతలు పేరాల శేఖర్‌రావు, జి.ప్రేమేందర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కాజీపేట్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం అనుసరించి కాజీపేట్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స్థాపించాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం ఆయన పార్లమెంటు ఆవరణ లో మీడియాతో మాట్లాడారు. రైల్వే పద్దులపై జరిగిన చర్చలో ఈ అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించినట్టు తెలిపారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పా టు చేయాల్సి ఉన్నప్పటికీ, ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. ఏదైనా ఇబ్బందులుంటే స్పష్టత ఇవ్వా లని, కనీసం పీపీపీ పద్ధతిలోనైనా కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని కోరామని వివరించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహ దారి వెంట రైల్వే లైన్ వేస్తే ప్రయాణ సమయం చాలా తగ్గుతుందని పేర్కొన్నారు. రెండు రాజ ధానుల మధ్య హై స్పీడ్ ట్రైన్ వేస్తే 2 గంటల్లో ప్రయాణం చేయొచ్చని పేర్కొన్నారు. -
పసిడిపై దిగుమతి సుంకాలు తగ్గించాలి..
భారత్ ఏటా 800–900 టన్నుల పసిడి దిగుమతి చేసుకుంటోంది. 2018–19లో పసిడి దిగుమతులు 22.16 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. భారీగా పెరుగుతున్న కరెంటు అకౌంటు లోటును కట్టడి చేసే దిశగా పసిడిపై విధించిన సుంకాలతో.. దిగుమతులు కొంత తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో 7 శాతం క్షీణించి 20.57 బిలియన్ డాలర్లకు తగ్గాయి. అదే సమయంలో వజ్రాభరణాల దిగుమతులు కూడా 1.5 శాతం క్షీణించి 20.5 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో పసిడి, వజ్రాభరణాల వ్యాపార సంస్థలు కేంద్ర ప్రభుత్వం ముందు పలు విజ్ఞప్తులు ఉంచాయి. ►బంగారంపై 12.5 శాతం దిగుమతి సుంకాల (జీఎస్టీ అదనం)తో ఆభరణాల కొనుగోలు భారీ వ్యయాలతో కూడుకున్నదిగా మారిపోయింది. దీన్ని 6 శాతానికి తగ్గించాలి. కట్, పాలిష్డ్ డైమండ్స్‌పై సుంకాలను 7.5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించాలి. ►కొనుగోళ్లకు క్రెడిట్ కార్డును వినియోగించిన పక్షంలో బ్యాంక్ కమీషన్లు తొలగించాలి. లేదా ప్రస్తుతమున్న 1–1.5 శాతం నుంచి 0.20 శాతానికి తగ్గించాలి. ►ఆభరణాలను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని కొత్త ఆభరణాల్లో ఇన్వెస్ట్ చేసిన పక్షంలో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ నుంచి మినహాయింపునివ్వాలి. ►పసిడి పరిశ్రమ మరింత పారదర్శకంగా పనిచేసే విధంగా తగిన ఇన్ఫ్రా, ప్రమాణాలను నెలకొల్పాలి. భారీ స్థాయి గోల్డ్ స్పాట్ ఎక్సే్చంజ్, బులియన్ బ్యాంకింగ్ మొదలైనవి పటిష్టం చేయాలి. -
ఎల్టీసీజీ రద్దు చేయాలి...
ఎల్టీసీజీ ఎత్తివేత వంటి డిమాండ్లను కేంద్రం ఈసారైనా పరిగణనలోకి తీసుకోవాలని మ్యుచువల్ ఫండ్స్ పరిశ్రమ కోరుతోంది. వీటితో దేశీ ఎంఎఫ్ పరిశ్రమకు తోడ్పాటు లభించడంతో పాటు ఎకానమీని పటిష్టంగా చేసేందుకు, బాండ్ మార్కెట్ మరింతగా విస్తృతి చెందేందుకు, ఇన్ఫ్రా వృద్ధి కోసం దీర్ఘకాలిక ప్రాతిపదికన నిధుల లభ్యత పెరగగలదని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫీ పేర్కొంది. అలాగే, పెట్టుబడులను భౌతికరూపంలో పసిడి నుంచి గోల్డ్ ఈటీఎఫ్‌లకు కూడా మళ్లించేలా చర్యలు తీసుకుంటే ద్రవ్య లోటు కూడా కట్టడి కాగలదని తెలిపింది. ►తక్కువ వ్యయాలు, తక్కువ రిస్కులతో పాటు పన్ను మినహాయింపుల ప్రయోజనం ఉండే డెట్ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (డీఎల్ఎస్ఎస్) ప్రవేశపెట్టేందుకు ఫండ్స్‌ను అనుమతించాలి. ►పన్ను విషయంలో యులిప్స్, ఈక్విటీ మ్యుచువల్ ఫండ్స్‌ను సరిసమానంగా పరిగణించాలి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ (ఎల్టీసీజీ)ని రద్దు చేయాలి. రిడెంప్షన్ సమయంలో ఈక్విటీ ఫండ్స్‌పై విధిస్తున్న ఎస్టీటీని రద్దు చేయాలి. ఈక్విటీ ఓరియెంటెడ్ ఫండ్స్ చెల్లించే డివిడెండ్లపై డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌ను తొలగించాలి. మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో అటూ, ఇటూ మారేటప్పుడు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుంచి మినహాయింపునివ్వాలి. ►మ్యూచువల్ ఫండ్స్‌ను స్పెసిఫైడ్ లాంగ్ టర్మ్ అసెట్స్‌గా పరిగణించాలి. ఐటీ చట్టం 1961లోని సెక్షన్ 54 ఈసీ కింద ఎల్టీసీజీ నుంచి మినహాయింపునివ్వాలి. ►లిస్టెడ్ డెట్ సెక్యూరిటీల తరహాలోనే ఎల్టీసీజీ విధింపునకు సంబంధించి బంగారం, కమోడిటీ ఈటీఎఫ్‌లలో హోల్డింగ్ వ్యవధిని మూడేళ్ల నుంచి ఏడాదికి తగ్గించాలి. ►డెట్ స్కీమ్‌లపై డీడీటీని తగ్గించాలి. -
జనరల్ నర్సింగ్ కోర్సు ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ (జీఎన్ఎం) కోర్సుకు ప్రభుత్వం ముగింపు పలికింది. 2021–22 విద్యా సంవత్సరం నుంచి జీఎన్ఎం కోర్సు నిర్వహించేదిలేదని స్పష్టంచేసింది. ఈ మేరకు వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డి తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో 138 ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్ స్కూళ్లల్లో 6 వేలకు పైగా జీఎన్ఎం సీట్లు ఉన్నాయి. ఇన్ని వేల సీట్లను ఒకేసారి రద్దు చేస్తుండటంతో నర్సింగ్ విద్యను అభ్యసించే విద్యార్థుల సంఖ్య మరింత పడిపోయే ప్రమాదముంది. కొన్ని రాష్ట్రాల్లో జీఎన్ఎం కోర్సు రద్దు చేసినా, వాటి స్థానే బీఎస్సీ నర్సింగ్ కోర్సు నిర్వహించేందుకు అనుమతించారు. దీంతో జీఎన్ఎం సీట్లు పోయినా బీఎస్సీ నర్సింగ్ సీట్లు వచ్చాయి. కానీ మన రాష్ట్రంలో ఇప్పటివరకూ ఆ దిశగా చర్యలు ప్రారంభించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న నర్సుల్లో 80 శాతం జీఎన్ఎం అర్హత కలిగినవారే ఉన్నారు. ముఖ్యంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్లకంటే, జీఎన్ఎం చేసిన వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. బీఎస్సీ వాళ్ల కంటే తక్కువ వేతనాలకు పని చేయడమే ఇందుకు కారణమని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అంటున్నారు. నైపుణ్యం ఉండటం లేదు.. డీఎంఈ పరిధిలోకి జీఎన్ఎం కోర్సులు వస్తాయి. కాళోజీ హెల్త్ వర్సిటీ పరిధిలోకి బీఎస్సీ నర్సింగ్ కోర్సులు వస్తాయి. జీఎన్ఎం చేసినా చాలామంది నర్సుల్లో నైపుణ్యం ఉండటం లేదన్న ఆరోపణలున్నాయి. పైగా జీఎన్ఎం డిప్లొమా కోర్సుగా కొనసాగుతోంది. ఈ కోర్సుతో నైపుణ్యం రావడం లేదన్న ఆరోపణలతోనే కోర్సు రద్దు చేయాలని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిర్ణయించింది. ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. ఇక ‘నర్సింగ్’ వైపు కష్టమే.. ప్రస్తుతం రాష్ట్రంలో నర్సుల కొరత విపరీతంగా ఉంది. కానీ రాష్ట్రంలో 80 ప్రైవేటు, 6 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో కలిపి బీఎస్సీ నర్సింగ్ సీట్లు 5 వేల లోపే ఉన్నాయి. ప్రైవేటు బీఎస్సీ నర్సింగ్‌లో కన్వీనర్ కోటా సీట్లు రాని విద్యార్థులంతా జీఎన్ఎం కోర్సుల్లో చేరుతున్నారు. జీఎన్ఎం కోర్సు ఎత్తేస్తుండటంతో నర్సింగ్ చదివే విద్యార్థుల సంఖ్య మరింత తగ్గే అవకాశముందని నర్సింగ్ నిపుణులు చెబుతున్నారు. దీంతో జీఎన్ఎం కోర్సులు అందించే నర్సింగ్ స్కూళ్లను, బీఎస్సీ నర్సింగ్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయా లని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కోరుతోంది. -
ఐటీడీఏను ముట్టడించిన ఆదివాసీలు
ఉట్నూర్: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే ప్రధాన డిమాండ్‌తోపాటు తమ సమస్యలను ప్రభుత్వం వెంట నే పరిష్కరించాలంటూ ఆదివాసీ మహిళాలోకం కదంతొక్కింది. భారీగా తరలివచ్చిన ఆదివాసీలు సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. ఐదువేలకు పైగా ఆదివాసీలు ఆందోళనలో పాల్గొన్నారు. ఉట్నూర్ ప్రధానవీధుల్లో భారీ ప్రదర్శన చేపట్టారు. మధ్యా హ్నం 2 నుంచి సాయంత్రం ఐదున్నర వరకు మూడు కి.మీ. మేర ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ ఐటీడీఏ కార్యాలయానికి చేరుకుని వారి నుంచి వినతిపత్రం తీసుకున్నప్పటికీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. పోలీసులు బారికేడ్లు ఏర్పాట్లు చేయడం.. గేటుకు తాళం వేయడం తో ఆదివాసీలు కోపోద్రిక్తులయ్యారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికా రి రావాల్సిందేనంటూ.. లోపలికి చొచ్చుకెళ్లే యత్నం చేశారు. పోలీసులు అడ్డుకున్నా.. ఆదివాసీలు భారీ సంఖ్యలో ఉండటంతో చేతులెత్తేయాల్సి వచ్చింది. పలువురు ఆదివాసీలు గోడపై నుంచి దూకి కార్యాలయం లోపలికి వెళ్లారు. అదనపు ఎస్పీ రవికుమార్, డీఎస్పీ డేవిడ్ ఆదివాసీలకు నచ్చజెప్పే ప్రయ త్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆదివాసీ మహిళా సంఘం నాయకులు మాట్లాడుతూ.. ఐటీడీఏ ఉన్నది ఆదివాసీల కోసమేనని, తమను ఎందుకు అనుమతించట్లేదని ప్రశ్నించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు తమ పోరాటం ఆపబోమన్నారు. లంబాడీలకు ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వొద్దంటూ నినదించారు. ఇప్పటికే ధ్రువీకరణ పత్రాలిచ్చిన తహసీల్లార్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీఆర్టీలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన 25 మందిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివాసీ నేతలపై పెట్టిన కేసుల ను ఎత్తి వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ మహిళా సంఘం నాయకులు గోడం రేణుకాబాయి, సోయం లలితాబాయి, మర్సకోల సరస్వతి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం మొండివైఖరి విడనాడాలి: సురవరం
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ మొండివైఖరిని విడనాడి ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం ద్వారా సమ్మెకు తెరదించాలని సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమస్యను రెండు వారాల్లోగా ముగించాలని కార్మికశాఖను హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. న్యాయస్థానం చెప్పినా సీఎం వినడం లేదని, ఇందుకు కేసీఆర్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. సోమవారం మఖ్దూంభవన్‌లో పార్టీ నేతలు అజీజ్ పాషా, కూనంనేని సాంబశివరావులతో కలసి సురవరం మీడి యాతో మాట్లాడారు. సీఎం మూర్ఖంగా వ్యవహరిస్తూ కార్మికులపై పగ సాధిస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ విలీన అంశాన్ని జేఏసీ వాయిదా వేసుకుని, మిగతా సమస్యలు పరిష్కరించాలని కోరినా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. ప్రజారవాణా నిలిచిపోవడంతో పేదలు, విద్యార్థులు, మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారన్నారు. సీఎంకు నచ్చజెప్పి సమ్మె పరిష్కారానికి టీఆర్ఎస్ నేతలు చొరవ తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో పూర్తిస్థాయి మెజారిటీ ఉన్నాక కూడా ప్రభుత్వాన్ని కూల్చివేస్తారని సీఎం ఎందుకు భయపడుతున్నారని కూనంనేని ప్రశ్నించారు. సర్కార్‌ను కూల్చాల్సిన అవసరం ఎవరికీ లేదని, ఒకవేళ ప్రభుత్వాన్ని కూల్చే పరిస్థితి వస్తే టీఆర్ఎస్లోని నాయకుల ద్వారానే జరుగుతుందని చెప్పారు. -
ఆర్టీసీ విలీనంపై చర్చలు జరపాలి: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ను జేఏసీ పక్కన పెట్టిన నేపథ్యంలో వెంటనే చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్‌చేశారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియా తో మాట్లాడుతూ.. ప్రధాన డిమాండ్‌ను కార్మికులు పక్కన పెట్టినందున, హైకోర్టు సూచనలు గౌరవించి ప్రభుత్వం కూడా వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. -
గ‘లీజు’ !
భీంగల్ మండలంలో ఎంతో విలువైన కలర్ గ్రానైట్ నిల్వలున్నాయి. ఇక్కడే ప్రత్యేకంగా లభించే ఈ గ్రానైట్‌కు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. చైనా వంటి దేశాలకు గ్రానైట్ ఎగుమతి అవుతుంది. దీంతో మండలంలోని మెండోరా శివారులో గ్రానైట్ తవ్వకం లీజు కోసం 2012లో ఓ బడా కంపెనీ దరఖాస్తు చేసుకుంది. ఎన్ఓసీ ఇచ్చేందుకు స్థలాన్ని పరిశీలించిన రెవెన్యూ అధికారులు అక్కడ వ్యవసాయ భూములు, పంట పొలాలు దెబ్బతింటాయని, సమీపంలోనే గుడి, పాఠశాల కూడా ఉండటంతో గ్రానైట్ తవ్వకానికి వీలు లేదని నివేదిక ఇచ్చింది. దీంతో ఫైల్ పెండింగ్ పడిపోయింది. ఆరేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఇదే లీజు కోసం ఆ బడా గ్రానైట్ కంపెనీ పావులు కదుపుతోంది. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : గ్రానైట్ తవ్వకాల్లో రూ.కోట్లు దండుకోవడానికి అలవాటుపడిన బడా కంపెనీ లీజు కోసం పట్టు వదలని ప్రయత్నం చేస్తోంది. అక్కడ గ్రానైట్ తవ్వడానికి వీలు పడదని అధికారులు తేల్చి చెప్పి, నివేదిక ఇచ్చినప్పటికీ., అదే క్వారీ లీజు కోసం ఈ కంపెనీ ఆరేళ్ల తర్వాత కూడా మళ్లీ ప్రయత్నాలు సాగిస్తుండటం భూగర్భ గనుల శాఖలో అంతర్గతంగా చర్చనీయాంశంగా మారింది. రూ.కోట్లు విలువ చేసే కలర్ గ్రానైట్‌ను ఎలాగైనా తవ్వుకుని తీసుకెళ్లేందుకు కంపెనీ సామ, ధాన, దండోపాయాలను వినియోగిస్తోంది. జిల్లాలోని భీంగల్ మండలంలో ఎంతో విలువైన కలర్ గ్రానైట్ నిల్వలున్నాయి. కేవలం నిజామాబాద్ జిల్లాలోనే ప్రత్యేకంగా లభించే ఈ గ్రానైట్‌కు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. చైనా వంటి దేశాలకు గ్రానైట్ ఎగుమతి అవుతుంది. ఇప్పటికే జిల్లాలో పలు బడా కంపెనీలు ఏళ్ల తరబడి గ్రానైట్ తవ్వకాలు సాగిస్తున్నాయి. వీటికి తోడు మరికొన్ని కంపెనీలు కూడా కొత్త లీజుల కోసం ప్రయత్నాలు చేశాయి. ఇందులో భాగంగా భీంగల్ మండలం మెండోరా శివారులో ఉన్న ఓ లీజు కోసం 2012లో ఓ బడా కంపెనీ దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తును పరిశీలించిన భుగర్భ గనుల శాఖ అధికారులు ఎన్ఓసీ కోసం రెవెన్యూ అధికారులకు రాశారు. స్థలాన్ని పరిశీలించిన ఆ శాఖ అధికారులు అక్కడ గ్రానైట్ తవ్వకాలు జరపడానికి వీలులేదని (ఎఫెక్టెడ్) నివేదిక ఇచ్చారు. అలా తవ్వితే చుట్టుపక్కన ఉన్న వ్యవసాయభూములు, పంట పొలాలు దెబ్బతింటాయని నివేదికలో పేర్కొన్నారు. సమీపంలోనే గుడి ఉందని, తద్వారా గుడికి వచ్చే భక్తులకు ఇబ్బందులు వస్తాయని తేల్చింది. విద్యార్థులు చదువుకునే పాఠశాల కూడా ఉండటంతో ఇక్కడ తవ్వడం నిబంధనలకు విరుద్ధమని రెవెన్యూ అధికారులు తేల్చి చెప్పారు. సుమారు ఆరేళ్ల క్రితం నివేదిక ఇవ్వడంతో లీజు మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా ఇప్పుడు ఇదే లీజు కోసం బడా గ్రానైట్ కంపెనీ పావులు కదుపుతోంది. ఎలాగైనా తమకు లీజు మంజూరు చేసేందుకు గల మార్గాలను అన్వేషిస్తోంది. ఆరేళ్ల తర్వాత.. సుమారు ఆరేళ్ల క్రితం తిరస్కరించిన గ్రానైట్ లీజు దరఖాస్తు ఫైలును ఆ శాఖ అధికారులు పక్కనబెట్టేశారు. తాజాగా ఈ బడా కంపెనీ లీజు కోసం ప్రయత్నాలు ప్రారంభించడంతో ఫైలుకు కాల్లోచ్చాయి. కదలిక షురువైంది. గతంలో తిరస్కరించిన లీజును ఎలాగైనా మంజూరు చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఏదైనా దొడ్డి దారిన లీజు పొందేందుకు అవసరమైన మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ ఒత్తిడి.. ఈ గ్రానైట్ లీజు మంజూరు కోసం బడా కంపెనీ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు తెస్తోంది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ కీలక ప్రజాప్రతిని«ధి సహాయంతో లీజు పొందేందుకు పెద్ద స్థాయిలో పావులు కదుపుతోంది. మొత్తం మీద స్థానిక గ్రామ ప్రజల జీవనానికి ప్రశ్నార్థకంగా మారే ఈ గ్రానైట్ లీజు మంజూరు విషయంలో అధికారులు ఎలా వ్యవహరిస్తారో అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ విషయమై ‘సాక్షి’ప్రతినిధి భూగర్భ గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణను సమాచారం ఇవ్వాలని కోరగా ఆయన స్పందించేందుకు నిరాకరించారు. ఉన్నతాధికారుల అనుమతి లేనిదే కార్యాలయం సమాచారం ఇవ్వడం కుదరదని, ఈ విషయంలో తామేమీ మాట్లాడేందుకు వీలు లేదని, ఏదైనా ఉంటే జిల్లా కలెక్టర్‌ను సంప్రదించాలని సెలవిచ్చారు. -
ప్రైవేటు పాఠశాలలకు ఏబీవీపీ డిమాండ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు విద్యా సంస్థలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచి, ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాయని ఏబీవీపీ ఆరోపించింది. ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. నిబంధనలకు లోబడి ఫీజును నియంత్రణలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏబీవీపీ ప్రతినిధులు మంగళవారం తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ విజయ్ కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రైవేటు యాజమాన్యాలు అధికంగా ఫీజులు పెంచడం వల్ల ప్రైవేటు పాఠశాలల్లో చదవాలనుకునే పేద విద్యార్థులు ఆ కోరిక కలగానే మిగులుతోందని ఏబీవీపీ పేర్కొంది. ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేయడం అలవాటుగా మారిందని ధ్వజమెత్తింది. రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాల విద్యలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం ముందువుంచింది. ఏబివీపీ డిమాండ్లు ఇవి.. తరగతుల వారిగా ప్రైవేటు పాఠశాల ఫీజు వివరాలను వెల్లడించాలి. తప్పనిసరిగా ఫీజు నియంత్రణ చట్టం అమలుపరచాలి. ప్రతి పాఠశాలలో పేరెంట్స్ కమిటీలను ఏర్పాటు చేయాలి. వీటిని మండల, జిల్లా, రాష్ట్ర స్థాయికి కూడా విస్తరించాలి. విద్యా హక్కు చట్టాన్ని ఈ విద్య సంవత్సరం నుంచే పటిష్టంగా అమలుపరచాలి. పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలి. పాఠశాల ఆవరణలో విద్యార్థులను తప్పుదారి పట్టించే ఎలాంటి అమ్మకాలు లేకుండా చర్యలు తీసుకోవాలి. ప్రమాదాలు జరగకుండా పాఠశాల బస్సుల ఫిటినెస్ పరీక్షించే విధంగా చూడాలి. చదువుతో పాటు విద్యార్థులు శారీరకంగా దృఢంగా ఉండటానికి ప్రతి స్కూల్‌కు క్రీడా మైదానం ఉండేట్టు చూడాలి. లాబ్స్, అగ్నిప్రమాద నివారణ వ్యవస్థ, టాయిలెట్స్ తదితర కనీస సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డీఈఓ, ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలి. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి. పాఠశాలలు తప్పనిసరిగా అనుమతులు తీసుకునే విధంగా చూడాలి. అనుమతి తీసుకోని పాఠశాలల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆ లిస్ట్ ను బహిర్గతం చేయాలి. -
కేంద్ర నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి వచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. అలాగే ముఖ్యమంత్రి కేంద్రంపై నిందలు మోపడం మాను కోవాలని హితవు పలికారు. శాసనసభలో సీఎం కేసీఆర్ తన మాటలతో శాసనసభను, ప్రజలను తప్పు దారి పట్టించారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా ఖర్చుపెట్టలేని దీన స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. అందరి ఆరోగ్యం కోసం కేంద్రం ఆయుష్మాన్ భవ పథకాన్ని తీసుకువస్తే రాష్ట్రం ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం వల్లే భువనగిరిలో ఆలిండియా మెడికల్ సైన్సెస్ (ఏయిమ్స్) ఏర్పాటయిందన్నారు. రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన కేంద్రంపై నిందలు మోపడం మానుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజె క్టు, సీతారామ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అనతికాలంలోనే ఇచ్చిన విష యం సీఎం మర్చిపోయారా అని ప్రశ్నించారు. ప్రధాని రాష్ట్ర మంత్రులకు, పార్లమెంటు సభ్యులకు, సీఎంలకు అపాయింట్మెంట్లు ఇస్తుంటే...రాష్ట్ర సీఎం మంత్రులు, ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలకు, ఇతర పార్టీ నాయకులకు ఎన్ని అపాయింట్మెంట్స్ ఇచ్చారో చెప్పాలన్నారు. గత ఐదు సంవత్సరాల్లో మోడీ ఎన్ని నిధులు ఇచ్చారో చర్చకు రావాలని సవాల్ చేశారు. పదేళ్ల యూపీఏ హయాంలో తెలంగాణకు దాదాపు 16 వేల కోట్లు ఇస్తే, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక లక్ష 15 వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టిన చందంగా టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ వ్యవహారం ఉందని పేర్కొన్నారు. -
ఫిబ్రవరి నెలాఖరులో పీఆర్సీ నివేదిక!
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎదురుచూస్తున్న పీఆర్సీ నివేదికను ఫిబ్రవరి నెలాఖరులో ఇచ్చేందుకు కమిషన్ కసరత్తు చేస్తోంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇప్పటికే వివిధ ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించిన కమిషన్ గత నెల రోజులుగా పలు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలతో సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుతం ఆ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇందులో భాగంగా ప్రధాన సంఘాలైన టీఎన్జీవో, టీజీవో తదితర ఉద్యోగ సంఘాలతో గురువారం పీఆర్సీ చైర్మన్ సీఆర్ బీస్వాల్, సభ్యులు మహ్మద్ రఫత్‌అలీ, ఉమా మహేశ్వర్‌రావు సమావేశమై చర్చించారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన ఫిట్మెంట్, కనీస మూల వేతనం, ఇంటి అద్దె అలవెన్సులపై చర్చించారు. ఉద్యోగ సంఘాలు భారీ మొత్తంలో ఫిట్మెంట్ డిమాండ్ చేస్తున్నా దానికి సంబంధించిన ప్రతిపాదన పీఆర్సీ నివేదికలో ఉండే అవకాశం కన్పించట్లేదు. సాధారణంగా వేతన స్కేళ్లు, విభాగాల వారీగా ఉద్యోగులు, వారి వేతనాలు, వారు చేస్తున్న పని, వారికి ఇవ్వాల్సిన విభాగాల వారీ వేతనాలే పీఆర్సీ నివేదికలో పొందుపరుస్తారు. ముఖ్యమంత్రి ఆమోదం తర్వాతే ఫిట్మెంట్ నిర్ణయించి దానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేస్తారు. ప్రస్తుత కమిషన్ కూడా అదే బాటలో కసరత్తు చేస్తోంది. శాఖల వారీగా, కేడర్ వారీగా కనీస మూల వేతనం, గరిష్ట వేతనాలను, అలవెన్సులను పొందుపరిచేందుకు చర్యలు చేపడుతోంది. ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన వినతులన్నింటినీ క్రోఢీకరించి, నివేదిక సిద్ధం చేసి ఫిబ్రవరి నెలాఖరులో ప్రభుత్వానికి అందజేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం 43 శాతం మధ్యంతర భృతి (ఐఆర్), 63 శాతం ఫిట్మెంట్, రూ.24 వేల కనీస మూల వేతనాన్ని సిఫారసు చేయాలని కోరుతున్నాయి. తెలంగాణ మొదటి పీఆర్సీలో ఉద్యోగులకు ఫిట్మెంట్ 63 శాతం ఇవ్వాలని పీఆర్సీకి టీఎన్జీవో, టీజీవోలు విజ్ఞప్తి చేశాయి. సమావేశంలో టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కారెం రవీందర్‌రెడ్డి, మామిళ్ల రాజేందర్, టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.మమత, సత్యనారాయణ, ఎ.జగన్మోహన్రావు పాల్గొన్నారు. ఇవీ ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు.. ఉద్యోగుల కనీస మూల వేతనాన్ని రూ.24 వేలుగా, గరిష్ట మూల వేతనం రూ. 2.19 లక్షలుగా నిర్ణయించాలి. మొదటి పీఆర్సీలో 43 శాతం ఐఆర్ మంజూరు చేసి, 63 శాతం ఫిట్మెంట్ ఇచ్చేలా సిఫారసు చేయాలి. పీఆర్సీని 2018 జూలై 1 నుంచి అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలి. ఇంటి అద్దె అలవెన్సులు హైదరాబాద్‌లో 30 శాతం, జిల్లా కేంద్రంలో 25 శాతం, మండల/మున్సిపల్ కేంద్రాల్లో 20 శాతం, గ్రామాల్లో 15 శాతం సిఫారసు చేయాలి. రవాణా అలవెన్సులు, ఉచిత బస్‌పాస్ సదుపాయం కల్పించాలి. ఆటోమెటిక్ అడ్వాన్స్మెంట్ స్కీంలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి స్పెషల్ గ్రేడ్ మంజూరు చేయాలి. వార్షిక ఇంక్రిమెంట్ మూల వేతనంపై 3 శాతం చెల్లించాలి. పెన్షనర్లకు కనీస పెన్షన్ నెలకు రూ.12 వేలు ఉండాలి. గ్రాట్యుటీ రూ.12 లక్షలు చేయాలి. కమ్యుటేషన్ పీరియడ్‌ను 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించాలి. కమ్యుటేషన్ శాతాన్ని 40 శాతం నుంచి 50 శాతానికి పెంచాలి. కుటుంబ పెన్షన్‌ను 30 శాతం నుంచి 50 శాతానికి పెంచాలి. 20 ఏళ్ల సర్వీసు పూర్తయిన వారికి చివరగా పొందిన వేతనంలో 50 శాతాన్ని పెన్షన్‌గా ఇవ్వాలి. అడ్వాన్స్‌లు రెట్టింపు చేయాలి. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆ కేడర్‌లో ఉద్యోగులతో సమానంగా వేతనం, అలవెన్సులు చెల్లించాలి. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లకు పెంచాలి. -
జియో ఎఫెక్ట్: బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల నిరవధిక సమ్మె
సాక్షి,న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు నిరవధిక సమ్మకు దిగనున్నారు. అపరిష్కృతంగా వున్న తమ డిమాండ్ల సాధన కోసం బీఎస్ఎన్ఎల్ ఆఫీసర్ అసోసియేషన్లు, ఉద్యోగుల సంఘాల సమాఖ్య ఎయుఎబి నాయకత్వంలో డిసెంబరు 3నుంచి సమ్మె చేపట్టనున్నామని బిఎస్ఎన్ఎల్ యూనియన్లు ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి.. ఈ సందర్భంగా వారు రిలయన్స్ జియోపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. టెలికాం రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ముకేశ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న సానుకూల వైఖరే సంస్థ నష్టాలకు కారణమన్నారు. ముఖ్యంగా జియోకు పోటీని నివారించే ఉద్దేశంతోనే 4జీ సేవలు అందించే 4జీ స్పెక్ట్రమ్‌ను బీఎస్ఎన్ఎల్కు కేటాయించలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి. మరోవైపు 4జీ స్పెక్ట్రమ్ దక్కించుకునేందుకు ముఖేశ్ అంబానీ రిలయన్స్ జియో.. భారీ పెట్టుబడులు పెట్టి.. అతితక్కువ ధరకు సర్వీసులు అందజేస్తోందని, దీనివల్ల అనిల్ అంబానీ ఆర్కాంతోపాటు టాటా, ఎయిర్ సెల్ వంటి పెద్ద ప్రైవేట్ సంస్థలే కాక ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ తీవ్రనష్టాల్లో కూరుకుపోతోందని వారు ఆరోపిస్తున్నారు. ప్రత్యర్థి కంపెనీలను నష్టపరిచే దురుద్దేశంతోనే జియో టారిఫ్ ఎత్తుగడలు వేస్తోందనీ, ఒకసారి మార్కెట్లో పోటీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన అనంతరం జియో కస్టమర్లను భారీగా దోపీడీ చేయనుందని పేర్కొన్నాయి. ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ సహా,ఇతర ప్రధాన పోటీదారుల నష్టాలకు కారణమైన జియోకు నరేంద్ర మోదీ సర్కార్ బహిరంగంగా మద్దతు తీవ్ర ఆందోళనకలిగించే అంశమని ప్రకటించారు. పెన్షన్ కాంట్రిబ్యూషన్ పేరుతో కేంద్రం తమను దోచుకుంటోందని, తద్వారా మోదీ ప్రభుత్వం తమ స్వంత నియమాలను ఉల్లంఘించడం దారుణమని ఆరోపించాయి. ప్రతి సంవత్సరం సంస్థ నుంచి భారీ మొత్తంలో సొంతం చేసుకుంటోందని, ఇది సంస్థపై తీవ్ర ఆర్థిక ప్రభావాన్ని పడేవేస్తోందని ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. అంతేకాదు జియోకి వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారులపై వేటుపడిందని దుయ్యబట్టాయి. ముఖ్యంగా మాజీ టెలికాం సెక్రటరీ జేఎస్ దీపక్ లాంటి వారు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసాయి. 4జీ స్పెక్ట్రంను తక్షణమే కేటాయించాలని, బీఎస్ఎన్ఎల్ పెన్షన్ చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వ నిబంధనను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతేడాది జనవరి 1వ తేది నుండి ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన సిబ్బందికి వేతన సవరణ, తదితర డిమాండ్లతో వారు సమ్మె సైరన్ మోగించనున్నారు. -
ఫేస్బుక్ జుకర్‌బర్గ్‌కు మరో తలనొప్పి?
వాషింగ్టన్: డేటా లీక్‌తో ఇబ్బందుల్లో పడ్డ ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ను ఇపుడు మరో సమస్య వేధిస్తోంది. ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ రాజీనామా చేయాలంటూ వాటాదారులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారనే నివేదికలు ఇపుడు ప్రకంపనలు రేపుతున్నాయి. రిపబ్లికన్ పార్టీకి చెందిన పొలిటికల్ కన్సల్టింగ్ సంస్థ, పబ్లిక్ అఫైర్స్‌తో ఫేస్బుక్ ఒప్పందం కుదుర్చుకున్నారన్నవార్తలు ఇందుకు కారణంగా భావిస్తున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పెట్టుబడిదారులు జుకర్‌బర్గ్ తప్పుకోవాలని పట్టుబడుతున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఫేస్బుక్లో వాటా ఉన్న వైస్ ప్రెసిడెంట్ జానాస్ కూడా జుకర్‌బర్గ్‌ను బోర్డ్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారట. రిపబ్లికన్ పార్టీకి చెందిన పొలిటికల్ కన్సల్టింగ్ సంస్థ, పబ్లిక్ అఫైర్స్ సంస్థతో ఫేస్బుక్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేయడంతో జుకెర్‌బర్గ్‌పై ఒత్తిడి పెరిగినట్లు తెలిసింది. ఇది ఇలా ఉంటే ఫేస్బుక్లో అధిక వాటా ఉన్న ట్రిల్లియం అసెంట్ మేనేజ్మెంట్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జొనాస్ క్రాన్, జుకెర్‌బర్గ్‌ను బోర్డ్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసారంటూ ది గార్డియన్ మరో కథనాన్ని ప్రచురించింది. దీంతో పెట్టుబడిదారులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట. మరోవైపు ఈ వార్తలను జుకర్‌బర్గ్ ఖండించారు. పొలిటికల్ కన్సల్టింగ్ సంస్థ గురించి తనకు తెలియదని, ఆ సంస్థతో తామెప్పుడూ పని చేయలేదని జుకర్‌బర్గ్ స్పష్టం చేశారు. న్యూయార్క్ టైమ్స్ కథనం ద్వారా మాత్రమే ఈ విషయం గురించి తనకు తెలిసిందన్నారు. దీనిపై తన టీంతో చర్చించినట్టు తెలిపారు. ఫేస్బుక్ సీవోవో శ్రేయాల్ శాండ్‌బర్గ్ కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. తమ కంపెనీపై వ్యతిరేక ప్రచారం జరుగుతోందని, అందులో వాస్తవం లేదని చెప్పారు. భారీగా సంపదను కోల్పోయిన జుకర్‌బర్గ్ తాజా వివాదంతో శుక్రవారం ఫేస్బుక్ షేర్లు 3శాతం పడిపోయాయి. షేర్ విలువ 139.53 డాలర్లకు పడిపోవడంతో 2017 ఏప్రిల్ తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థాయిగా నిలిచింది. రష్యా ఎన్నికల్లో జోక్యం, డేటా లీక్‌తోపాటు తాజా వివాదం నేపథ్యంలో ఫేస్బుక్ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 17.4 బిలియన్ డాలర్లను కోల్పోయింది. అలాగే జుకర్‌బర్గ్ సంపద ఇప్పుడు 55.3 బిలియన్ డాలర్ల వద్ద ఉంది. జూలై 25నుండి ఆయన 31 బిలియన్ డాలర్లకు పైగా సంపదను కోల్పోయారు. -
పోరుబాటలో ప్రైవేటు విద్యా సంస్థలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థ లు తమ సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధనకు మళ్లీ పోరుబాట పట్టాయి. అన్ని రాజకీయ పార్టీలు తమ సమస్యల పరిష్కారం, డిమాండ్లను తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చేలా ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించాయి. తద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని భావిస్తున్నాయి. ఇప్పటికే కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీగా ఏర్పాటైన యాజమాన్య సంఘాలు ఈ నెల 29న మధ్యాహ్నం 12 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహణకు చర్యలు చేపట్టాయి. నగర సమీపంలోని గౌరెల్లిలో తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల పరిరక్షణ ఐక్య కార్యాచరణ సమితి (కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీ) ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం, ఆర్.కృష్ణయ్య తదితరులు పాల్గొంటారని పేర్కొంది. 3 వేల పాఠశాలలు మూతపడ్డాయి విద్యనే సామాజిక మార్పునకు ఏకైక సాధనం అన్న ఆలోచనతో విద్యారంగ వ్యాప్తికి కృషిచేస్తున్న తమను ప్రభుత్వం ఇబ్బందులపాలు చేస్తూ కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ముకాస్తోందని జేఏసీ చైర్మన్ రమణారెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ విధానాల వల్ల ఇప్పటికే 3 వేల సాధారణ పాఠశాలలు, 600 జూనియర్ కాలేజీలు, 300 డిగ్రీ కాలేజీలు, వందల్లో ఇతర వృత్తి విద్యా కాలేజీలు మూత పడ్డాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయనున్నట్లు వెల్లడించారు. మంత్రి కేటీఆర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమావేశం ఏర్పాటు చేసి, సమస్యలను పరిష్కరిస్తామని చెప్పినా ఫలితం లేకుండాపోయిందని వాపోయారు. ఈ నేపథ్యంలో తమ డిమాండ్ల సాధన కోసమే తాము ఆత్మగౌరవ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. -
డిమాండ్లు పరిష్కరించకపోతే.. ఎమ్మెల్యేలుగా పోటీ
సాక్షి, వరంగల్ అర్బన్: తెలంగాణ ఉద్యమ కారుల డిమాండ్లు నెరవేర్చాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమకారులు ఆందోళనలు చేపట్టారు. దీనిలో భాగంగా స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులకు న్యాయం చేయలేదంటూ మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో గ్రూప్ రాజకీయాలు చేసేవారు తప్పా ఉద్యమ కారుల గురించి పోరాడే నాయకుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యలయం ముందు ఆందోళనలు చేస్తుంటే మేయర్ చూసుకుంటూ వెళ్తున్నాడు.. కానీ సమస్యలేంటని ఆడగకపోవడం సిగ్గుచేటన్నారు. ‘ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసి ఉద్యమ కారులను గుర్తించి ప్రశంస పత్రం ఇవ్వాలి. అర్హత కలిగిన ఉద్యమ కారులకు పది వేల పింఛన్, వ్యాపారానికై పది లక్షల సబ్సిడీ లేక ఔట్ సోర్సింగ్ ఉద్యోగమైనా కల్పించాలి’అంటూ ఉద్యమకారుల కోరారు. ఒకవేళ టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో తమ డిమాండ్లు చేర్చకుంటే తామే ఎమ్మెల్యేలుగా పోటీచేస్తామని ఉద్యమకారులు స్పష్టం చేశారు. -
నేడు ఆర్టీసీ సమ్మె
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. మోటారు వాహన చట్టం సవరణ బిల్లు–2016కు వ్యతిరేకంగా మంగళవారం బంద్‌కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. బిల్లుకు వ్యతిరేకంగా భారత రోడ్డు రవాణా సంస్థల సమన్వయ కమిటీ దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చిన విష యం తెలిసిందే. ఇందులో భాగంగా ఆగస్టు 7న సమ్మె చేస్తున్నట్లు యాజమాన్యానికి జూలై 24న గుర్తింపు యూనియన్ తెలంగాణæ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) నోటీసులిచ్చింది. ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) తదితర 9 ఆర్టీసీ యూనియన్లు కూడా సమ్మెకు మద్దతు ప్రకటించాయి. అన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు బంద్‌కు మద్దతు ప్రకటించిన దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నిలిచిపోనున్నాయి. లారీల సంఘాలు కూడా బంద్‌కు మద్దతునిచ్చాయి. ఆటోరిక్షాలు, క్యాబ్ సర్వీసులు కూడా బంద్‌లో పాల్గొనే అవకాశం ఉంది. కోటిమందికి ఇబ్బందులు.. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 97 లక్షల మందిని ఆర్టీసీ గమ్యస్థానాలకు చేరుస్తోంది. 24 గంటల సమ్మెకు అన్ని యూనియన్లు మద్దతు ప్రకటించిన దరిమిలా.. రాష్ట్రంలోని 98 డిపోల వద్ద నిరసన ప్రదర్శనలకు కార్మికులు సిద్ధమవుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆర్టీసీ ఇంతవరకూ ప్రకటన చేయలేదు. సమ్మె డిమాండ్లు రాష్ట్రం పరిధిలోనివి కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమూ ఏమీ చేయలేని పరిస్థితి. కానీ బిల్లు వల్ల ఆర్టీసీ కార్మికుల, సంస్థ ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందని రవాణామంత్రి మహేందర్‌రెడ్డి గతంలోనే కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే రూ. 2,600 కోట్లు అప్పుల్లో ఉన్న ఆర్టీసీకి నేటి సమ్మెతో మరోసారి నష్టం తప్పేలా లేదు. డిమాండ్లు ఇవే! కొత్త మోటారు వాహన సవరణ బిల్లు–2016 ప్రకారం.. ప్రైవేటు వారు ప్రయాణ మార్గాలను కొనుక్కోవచ్చు. అంటే లాభాలొచ్చే.. బిజీగా ఉండే.. రూట్లను ఏ ప్రైవేటు కంపెనీ వారు కొనుక్కున్నా ఆ మార్గంలో ఆర్టీసీ బస్సు కనిపించకూడదు. దీనిపై అన్ని ప్రభుత్వ రవాణా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అలాగే టోల్ గేట్ల నుంచి ఆర్టీసీకి మినహాయింపు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ తగ్గింపు, కార్మికుల కనీస వేతనం రూ.24,000, డీజిల్‌పై అదనపు సుంకాలు తగ్గించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ‘గ్రేటర్’ రవాణా బంద్ గ్రేటర్ హైదరాబాద్‌లో రవాణా బంద్‌ను విజయవంతం చేసేందుకు కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ అనుబంధ రవాణా కార్మిక సంఘాలు, తెలంగాణ ఆటో డ్రైవర్ల సంక్షేమ సంఘం, తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్, జై డ్రైవరన్న క్యాబ్స్ అసోసియేషన్ తదితర కార్మిక సంఘాలు బంద్‌లో పాల్గొననున్నాయి. దీంతో సుమారు 3,560 సిటీ బస్సులు, 1.4 లక్షల ఆటోరిక్షాలు, 2 లక్షల క్యాబ్‌లు, ట్యాక్సీలు నిలిచిపోనున్నాయి. స్కూలు బస్సులు, వ్యాన్లు, ఆటోరిక్షాలనూ నిలిపివేయనున్నట్లు వివిధ సంఘాల నేతలు ప్రకటించారు. దీంతో నగర వ్యాప్తంగా రవాణా స్తంభించనుంది. సుమారు 50 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురికానున్నాయి. ఎంఎంటీఎస్, మెట్రో అదనపు సర్వీసులు బంద్ వల్ల నగర ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అదనపు సర్వీసులు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే, హైదరాబాద్ మెట్రో రైల్ చర్యలు చేపట్టాయి. నాగోల్–సికింద్రాబాద్–అమీర్‌పేట్–మియాపూర్ మార్గంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లు నడుపనున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఫలక్‌నుమా–సికింద్రాబాద్, నాంపల్లి–లింగంపల్లి, సికింద్రాబాద్–లింగంపల్లి, సికింద్రాబాద్–ఫలక్‌నుమా తదితర మార్గాల్లో ప్రస్తుతం 121 ఎంఎంటీఎస్ సర్వీసులు నడుస్తుండగా.. ప్రయాణికుల రద్దీ మేరకు సర్వీసులు పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సమ్మెకు సహకరించండి దేశంలోని అన్ని ఆర్టీసీల మనుగడకు మోటారు వాహన సవరణ బిల్లు–2016 ముప్పుగా మారింది. ఈ బిల్లు ఆర్టీసీ ఉనికికే ప్రమాదం. బిల్లు ఆమోదం పొందితే పేద విద్యార్థులకు రవాణా భారమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం పడిపోతుంది. కాబట్టి కేంద్రం వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలి. ఆటో, లారీలు, ఇతర రవాణా సంఘాలన్నీ మాతో కలసి రావాలని కోరుతున్నాం. – అశ్వథ్థామరెడ్డి, టీఎంయూ అధ్యక్షుడు, థామస్‌రెడ్డి, టీఎంయూ వర్కింగ్ ప్రెసిడెంట్ -
సీపీఎస్‌ను రద్దు చేయకుంటే గుణపాఠం చెబుతాం
ఒంగోలు టౌన్: రాష్ట్రంలోని లక్షా 86వేల మంది ఉద్యోగుల కోసం పనిచేస్తావా? షేర్ మార్కెట్ కోసం పనిచేస్తావా? ఈ విషయమై వెంటనే తేల్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) చైర్మన్ పీ బాబురెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. ఉద్యోగుల జీవితాలను షేర్ మార్కెట్లో పెట్టి ముఖ్యమంత్రి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉద్యోగుల ప్రయోజనాల కంటే షేర్ మార్కెటే ముఖ్యమనుకుంటే సీపీఎస్ ఉద్యోగులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం ఒంగోలు వచ్చిన సందర్భంగా స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సంస్కరణలో భాగంగా అమలుచేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌తో పాటు అనేక రాష్ట్రాల్లో ఉద్యోగులు ఉద్యమిస్తున్నా పాలకులకు చీమకుట్టినట్లు లేదని విమర్శించారు. సీపీఎస్ విధానం వల్ల రాష్ట్రంలోని లక్షా 86వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేసిన తరువాత నష్టపోతారన్నారు. 2003 డిసెంబర్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలుచేసిందన్నారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వామపక్షాలు పార్లమెంట్లో, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు బయట అడ్డుకోవడంతో పదేళ్లపాటు సీపీఎస్ బిల్లు ఆగిపోయిందన్నారు. 2013లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ కలిసి పీఎఫ్ఆర్డీఏ బిల్లు తీసుకువచ్చి దేశంలోని కోట్లాది మంది ఉద్యోగుల జీవితాలకు భద్రత లేకుండా చేశాయని ధ్వజమెత్తారు. రూ. 700కోట్లు మిగులుతాయి రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉందంటూ పదేపదే చెబుతున్న చంద్రబాబు సీపీఎస్ వల్ల 700 కోట్ల రూపాయలు షేర్ మార్కెట్లో ఎందుకు చెల్లించాలని బాబురెడ్డి ప్రశ్నించారు. వచ్చే ఏడాది రూ.1000కోట్లు, ఆ తర్వాత 1500కోట్లు, ఇలా 2000కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించడం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. పీఎఫ్ఆర్డీఏతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయల కోసం కేంద్రంతో కొట్లాడేందుకు సిద్ధపడాలన్నారు. సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ పునరుద్ధరిస్తూ ప్రభుత్వం తీర్మానం చేయాలన్నారు. సీపీఎస్ రద్దుకు కొన్ని పార్టీలు హామీలు ఇస్తున్నాయని, అది ఆచరణాత్మక హామీ అయితే అసెంబ్లీలో, పార్లమెంటులో సీపీఎస్ రద్దుకు బిల్లును ప్రతిపాదించాలని సూచించారు. క్విట్ సీపీఎస్‌తో జాతాలు సీపీఎస్ విధానాన్ని అమలు చేసుకునే, రద్దు చేసుకునే వెసులుబాటు కేంద్రం కల్పించిన నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు క్విట్ సీపీఎస్ నినాదంతో ఫ్యాప్టో ఆధ్వర్యంలో జాతాలు నిర్వహించనున్నట్లు బాబురెడ్డి వెల్లడించారు. ఈనెల 30 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు శ్రీకాకుళం, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి రాష్ట్రవ్యాప్తంగా జాతాలు ప్రారంభం అవుతాయన్నారు. సీపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టి ఉద్యోగల జీవితాల్లో చీకటి రోజు నింపిన సెప్టెంబర్ 1వ తేదీ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపా«ధ్యాయులంతా మాస్ క్యాజువల్ లీవ్‌లు పెట్టి అన్ని కలెక్టరేట్లను ముట్టడించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గుదిబండగా మారిన యాప్‌లు ప్రభుత్వ ఉపాధ్యాయులకు యాప్‌లు గుదిబండగా బాబురెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 21రకాల యాప్స్‌ను ప్రతిరోజూ ఉపాధ్యాయులు నిర్వహించాల్సి వస్తోందని, దీంతో ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాలా, యాప్స్‌కు సమాధానం పంపుతూ ఉండాలా అని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. విద్యార్థులకు సక్రమంగా పాఠాలు చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేందుకే ఇలాంటి విధానాలను అవలంభిస్తోందని మండిపడ్డారు. గతంలో యాప్‌లు లేకుండా పాఠశాలలు సక్రమంగా నిర్వహించలేదా, ఫలితాలు సాధించలేదా అని ప్రశ్నించారు. యాప్‌ల నుంచి ఉపాధ్యాయులకు విముక్తి కలిగించాలని డిమాండ్ చేశారు. -
పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
నారాయణపేట రూరల్: గ్రామాల్లో పనిచేస్తున్న పంచాయతీ వర్కర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఐఎఫ్టీయూ జిల్లా కోషాధికారి నర్సింహులు, జిల్లాఉపాధ్యక్షుడు బలరాం డిమాం డ్ చేశారు. 23 నుంచి నిర్వహించ తలపెట్టిన సమ్మెపై సోమవారం ఎంపీడీఓ వెంకటయ్యకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమాల్లో వెంకటయ్య, బాల్‌రెడ్డి, కృష్ణయ్య, రాజు, అశోక్, నర్సింహులు, కిష్టప్ప, దస్తప్ప పాల్గొన్నారు. ధన్వాడ: పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బల్రాం డిమాండ్ చేశారు. కార్మికులు సమ్మెకు దిగారు. ఇందులో కారోబార్ కృష్ణయ్య, బాలక్రిష్ణ, కృష్ణహరి, నూరోద్దిన్, తిప్ప య్య, తిరుపతమ్మ, బాల్‌నర్సింహులు, ఇసుఫ్, చంద్రయ్య, వెంకటయ్య, పెంటమ్మ, లక్ష్మిమ్మ, సునిత, బాలయ్య పాల్గొన్నారు. దామరగిద్ద: పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం అమలు చేసి వారి సమస్యలను పరిస్కరించాలని సీపీఎం నాయకులు గోపాల్ అన్నారు. ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోసీఐటీయూ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాస్త సమ్మేలో భాగంగా ధర్నా నిర్వహించారు. జోషి, భీమేష్, కార్మికులు వెంకటప్ప, మోహన్, లింగప్ప, శణప్ప, ఊషప్ప, ఎల్లప్ప, వెంకటేష్, చెన్నప్ప, తదిరులు పాల్గొన్నారు. మరికల్: పంచాయతీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని కార్మికులు కోరారు. సోమవారం డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులుకు వినతి పత్రానిచ్చారు. పంచాయితీ కార్యదర్శి పోస్టులను అర్హులైన ఉద్యోగ, కార్మికుల నుంచి భర్తీచేయాలని పేర్కొన్నారు. రాములు, శ్రీనివాసులు, వెంకటమ్మ పాల్గొన్నారు. కోయిల్‌కొండ: కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని ఐఎఫ్టీయూ అధ్యక్షుడు నర్సింహులు అన్నారు. కార్మికులతో కలిసి వివేకానంద చౌరస్తా నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం నిరసన తెలిపారు. చెన్నయ్య, గోపాల్, నారాయణ, రవి, బాలకిష్టయ్య, గాఫర్, బుచ్చమ్మ, అంజిలమ్మ, నాగమ్మ, లక్ష్మీమ్మ, కనకయ్య పాల్గొన్నారు. -
ఉద్యోగులకు ఉరితాడుగా సీపీఎస్
పెద్దదోర్నాల: సీపీఎస్ విధానం ఉద్యోగులకు ఉరితాడుగా మారిందని, ఈ విధానాన్ని రద్దు పరిచే వరకు ప్రతి ఒక్కరూ రాజీలేని పోరాటం చేయాలని ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాజీ పఠాన్ పిలుపు నిచ్చారు. శుక్రవారం స్థానిక ఎమ్మార్సీ భవన ప్రాంగణంలో ఆయన ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లోపభూయిష్టమైన వ్యవస్థలో ఉన్న లక్షా 84 వేల మంది ఉద్యోగులను రక్షించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నెట్టి వేస్తుందన్నారు. ఇలాంటి చర్యలను మానుకుని సీపీఎస్‌లో ఉన్న ఉద్యోగులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. 2019 ఎన్నికల లోపు ఈ విధానాన్ని రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలు పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రైల్వే జోన్లు కావాలంటున్న సచిన్, గడ్కరీ, అద్వానీ
న్యూఢిల్లీ : తమ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం మాములే. కానీ రైల్వే విషయంలో మాత్రం నేతల నుంచి కేంద్రానికి అధిక డిమాండ్లు వస్తున్నాయి. కేవలం మూడేళ్ల కాలంలో ఏకంగా 174 మంది ప్రముఖలు తమ పాంతాల్లో కొత్త రైల్వే జోన్లు, డివిజన్లు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరడం జరిగింది. అందులో మాజీ రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్, శశి థరూర్ వంటి ప్రముఖలు ఉన్నారు. ఇందులో 55 మంది కొత్త రైల్వే జోన్ల అంశాన్ని ప్రస్తావించగా, 119 మంది రైల్వే డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. వీరిలో రైల్వే శాఖ సహాయ మంత్రి రాజేన్ గోహేన్ కూడా ఉండటం విశేషం. ఈ డిమాండ్లపై రైల్వే బోర్డు మాజీ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ.. ‘రైల్వే జోన్లు ఏర్పాటు చేయడం రాజకీయాలతో ముడిపడిన అంశం. కమిటీలను ఏర్పాటు చేయడం.. వాటి అనుకూలతలను తెలుసుకోవడం జరుగుతుంది. కానీ అలా ఏర్పాటు చేసిన కమిటీలే రైల్వే జోన్ల సంఖ్యను తగ్గించాలని చెబుతున్నాయి. 2002-2003 మధ్య కాలంలో కొత్త రైల్వే జోన్ల ఏర్పాటు జరిగింది. ఆ తర్వాత రాజకీయ కారణాలతో నేతలు ఆయా ప్రాంతాల్లో రైల్వే జోన్లు, డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నారు. 2009-2013 మధ్య కాలంలో రైల్వే జోన్లకు సంబంధించి 92, డివిజన్లకు సంబంధించి 45 డిమాండ్లు వచ్చాయి. వీటిపై కమిటీ వేసి పరిశీలన జరపగా.. అందులో ఏ ఒక్క డిమాండ్ కూడా సముచితమైనది కాదని తేలిందని’ అన్నారు కొందరు ప్రముఖల డిమాండ్లు : 1. నితిన్ గడ్కరీ- నాగ్‌పూర్ కొత్త రైల్వే జోన్‌తో పాటు రైల్వే డివిజన్ 2. రాజేన్ గోహేన్- ఈశాన్య ప్రాంతాలకు కొత్త రైల్వే జోన్ 3. సచిన్ టెండూల్కర్- ముంబై సబ్ అర్బన్ రైల్వే జోన్ 4. శశి థరూర్- తిరువనంతపురం కొత్త రైల్వే జోన్, కానూర్ రైల్వే డివిజన్ 5. ఎల్కే అద్వానీ- గుజరాత్లో కొత్త రైల్వే జోన్ 6. యోగీ ఆదిత్యనాథ్- గోరఖ్‌పూర్ రైల్వే డివిజన్ 7. జితేంద్ర సింగ్- ఉదంపూర్‌లో రైల్వే డివిజన్ -
తపాలా ఉద్యోగులపై ప్రభుత్వ నిర్లక్ష్యం అన్యాయం
అనకాపల్లిటౌన్ : తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు పదహారు రోజులుగా తపాలా ఉద్యోగులు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని గ్రామీణ తపాలా ఉద్యోగుల జేఏసీ సంఘ ప్రతినిధి కె.మనోహర్ అన్నా రు. స్థానిక తపాలా కార్యాలయం వద్ద బుధవారం చేపట్టిన రిలే నిరాహారదీక్షల్లో ఆయన మాట్లాడారు. కమలేష్ చంద్ర కమిటీ నివేదికను తక్షణమే ప్రభుత్వం ఆమోదించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పీ త్రీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.నాగేశ్వరరావు, ఏఐజీడీఎస్ సంఘం డివిజన్ ఆర్గనైజర్ వి.ప్రకాశరావు, ఎఫ్‌ఎన్‌పీవో డివిజన్ కార్యదర్శి ఎ.లోవరాజు, అధికసంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. సీఐటీయూ మద్దతు గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి మళ్ల సత్యనారాయణ డిమాండ్ చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెల 22 నుంచి తపాలా ఉద్యోగులు సమ్మె చేపడతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయం అన్నారు. వారు చేపడుతున్న ఆందోళనకు సీఐటీయూ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. సంఘ నాయకులు పి.ఎన్.వి.పరమేశ్వరరావు, దాకారపు శ్రీనివాసరావు, ఎస్.బ్రహ్మాజీ, ఎం.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాత ఆగ్రహం
కేంద్రమంత్రులు కొందరు ‘ఫిట్నెస్ చాలెంజ్’ కార్యక్రమంలో తలమునకలై ఉండగా పలు రాష్ట్రాలు నాలుగు రోజులుగా రైతుల ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. ఆగ్రహంతో ఊగి పోతున్న రైతులు రోడ్లపై కాయగూరలు, పాలు పారబోస్తున్న ఉదంతాలు చానెళ్లలో చూస్తుంటే ఎలాంటివారికైనా మనసుకు కష్టం కలగక మానదు. ఆ ఉత్పత్తులన్నీ వారు ఎండనకా, వాననకా రాత్రింబగళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని, దొరికినచోటల్లా అప్పులు చేసి పండించినవి. రైతాంగ ఉద్యమం కారణంగా కూరగాయల ధరలు చుక్కలనంటుతున్నాయి. మార్కెట్లో 2 లక్షల లీటర్ల మేర పాల కొరత ఏర్పడిందని డెయిరీ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో నగరాలకు కూరగాయలు, పాలు ఆగిపోయాయి. ఈ ఆందోళన చివరి రోజైన జూన్ 10న ‘భారత్ బంద్’ కూడా జరపబోతున్నారు. ఈ స్ఫూర్తితో దేశంలోని ఇతరచోట్ల కూడా రైతాంగ ఉద్యమాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. రైతులేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని, కనీస ఆదాయ హామీ పథకం అమలు చేయాలని, ఎరువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు అధికారం చలాయిస్తున్న పార్టీలు ఎన్నికల సమయంలో వాగ్దానాలిచ్చినవే. సాగు యోగ్యమైన భూ విస్తీర్ణంలో ప్రపంచంలో అమెరికాది తొలి స్థానం కాగా, మన దేశానిది రెండో స్థానం. కానీ మన వ్యవసాయ భూముల్లో కేవలం 35 శాతానికి మాత్రమే నీటిపారుదల సదుపాయం ఉంది. మిగిలిందంతా వర్షాధారం. 2 లక్షల కోట్ల డాలర్ల దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం వాటా 15 శాతం. దేశంలో దాదాపు 70 శాతంమంది దానిపై ఆధారపడి బతుకుతున్నారు. ఇంతటి కీలకమైన రంగం మన పాలకులకు పట్టడం లేదు. అలాగని వారికి రైతు సమస్యలు తెలియవని చెప్పలేం. ఎన్నికల సమయంలో రైతులకు అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పడం ఎప్పటినుంచో వింటున్నదే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన పార్టీలు అధికారంలో కొచ్చాయి. ఇక కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ 2014 తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రైతు రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. పంజాబ్‌లో కాంగ్రెస్ కూడా రుణమాఫీ వాగ్దానం చేసి అధికారంలోకొచ్చింది. రుణమాఫీ చేశామని కొన్ని రాష్ట్రాలూ, ఆ ప్రక్రియ కొనసాగుతున్నదని మరికొన్ని రాష్ట్రాలూ చెబుతున్నాయి. మరి రైతుల్లో ఇంత అసంతృప్తి ఎందుకున్నట్టు? వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నట్టు? జాతీయ క్రైం రికార్డుల బ్యూరో గణాంకాల ప్రకారం ఏటా దాదాపు 6,000మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పరిస్థితులు ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు తమ విధానాలు సక్రమంగా లేవని, అవి సమస్య మూలాలను తాకడం లేదని పాలకులకు అర్ధమై ఉంటే వేరుగా ఉండేది. కానీ ఎవరూ ఈ దిశగా ఆలోచిస్తున్న దాఖలా లేదు. సామాన్య పౌరులు బియ్యం కొనాలంటే కిలోకు దాదాపు రూ. 50 వెచ్చించాల్సి ఉంటుంది. కానీ వరి ధాన్యానికి నిరుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వంద కిలోల బస్తా రూ. 1,550. ఈ ధరకు కొనేవారు కూడా దొరక్క చాలామంది రైతులు ఇంతకన్నా తక్కువకే అమ్ముకున్నారు. రైతు అమ్మినప్పుడు కనీస ధర రాని దిగుబడులు వ్యాపారుల దగ్గరకెళ్లేసరికి ఒక్కసారిగా విజృం భిస్తాయి. ఏటా ఇదే తంతు నడుస్తున్నా ప్రభుత్వాలకు పట్టదు. రుణమాఫీ వంటి పథకాలు ఎంత బాగా అమలవుతున్నాయన్నది పక్కనబెడితే అమలైన మేరకైనా నిజమైన రైతుకు చేరడం లేదు. మన దేశంలో వ్యవసాయంలో అధిక భాగం కౌలు రైతుల చేతులమీదుగానే నడుస్తోంది. కానీ ప్రభుత్వ పథకాలేవీ వారిని గుర్తించవు. ఫలితంగా నిజంగా వ్యవసాయం చేస్తూ తీవ్ర నష్టాలు చవిచూస్తున్న రైతులు దిక్కూ మోక్కూలేని స్థితిలో ఉండిపోతున్నారు. ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో సాగుతున్న రైతు ఉద్యమానికి ఈ నేపథ్యం ఉంది. తాము అప్పులు ఊబిలో కూరుకుపోతున్నా పట్టించుకోని పాలకులపై రైతుల్లో అసహనం అంతకంతకు పెరుగుతున్నదని ఈ ఉద్యమం నిరూపిస్తోంది. అదృష్టవశాత్తూ ఇంతవరకూ ఇది కట్టుతప్పలేదు. నిరుడు ఇదే రోజుల్లో ఉత్తరాదిన పెల్లుబికిన రైతుల ఆందోళన గుర్తుకు తెచ్చుకోవాలి. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా పలువురు ఉన్నతాధికారులపై దాడులు చేసి కొట్టడం, కర్ఫ్యూ ధిక్కరించి రాస్తారోకోలకు దిగడం, వాహనాలను ధ్వంసం చేయడం, చివరకు పోలీసు కాల్పుల్లో 8మంది మరణించడం వంటి ఉదంతాలు మరిచిపోకూడదు. కానీ ఇతర రాష్ట్రాల సంగతలా ఉంచి మధ్యప్రదేశ్ ప్రభుత్వమైనా రైతు సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు తీసుకున్న దాఖలా కనబడదు. ఆ రాష్ట్రంలో కూడా సాగుతున్న రైతు ఉద్యమాలే అందుకు రుజువు. దళారులు, గుత్త వ్యాపారుల హవా నడిచే హోల్‌సేల్ మార్కెట్ల స్థానంలో ప్రధాన మార్కెట్లతో అనుసంధానించే ఎలక్ట్రానిక్ ఆధారిత ఈ–మండీలు ప్రారంభిస్తామని రెండేళ్లక్రితం కేంద్రం ప్రకటించింది. అది అమల్లోకొచ్చి కూడా ఏడాది దాటుతోంది. కానీ అవి నామమాత్రంగా మిగిలాయని, యథాప్రకారం దళారులదే పైచేయి అవుతున్నదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఒకప్పుడు హరిత విప్లవం పేరుతో వ్యవసాయానికి అగ్ర ప్రాధాన్యమిచ్చిన ప్రభుత్వాలే ఇప్పుడు అంతకన్నా అధికాదాయం లభిస్తున్న సేవల రంగానికి, తయారీరంగానికి మళ్లాయి. వ్యవసా యాన్ని గాలికొదిలేశాయి. కనుకనే రైతుల వెతలు తీరడం లేదు. రైతులు కోరుతున్నట్టు స్వామి నాథన్ కమిటీ సిఫార్సులు సక్రమంగా అమలు చేసి, ఎక్కడికక్కడ కోల్డ్ స్టోరేజీలు నిర్మించి, దళా రుల్ని, గుత్త వ్యాపారుల్ని అరికట్టినప్పుడే రైతులు కష్టాలనుంచి గట్టెక్కుతారు. ఆ దిశగా ప్రభు త్వాలు చర్యలు ప్రారంభించాలి. -
సీపీఎస్ మినహా 17 అంశాలకు ఓకే
సాక్షి, హైదరాబాద్ : ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై అడుగు ముందుకు పడింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) రద్దు మినహా బదిలీలు, పీఆర్సీ, రిటైర్మెంట్ వయసు పెంపు సహా 17 అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. శుక్రవారం ఉదయం సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు ఈటల రాజేందర్, కె.తారక రామారావు, జి.జగదీశ్వర్‌రెడ్డి చర్చించారు. అనంతరం 17 అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. కేబినెట్ సబ్ కమిటీ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. అయితే తుది నిర్ణయం మాత్రం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీసుకుంటారని స్పష్టం చేసింది. సీపీఎస్ అంశాన్ని సైతం ఆర్థిక శాఖ ప్రత్యేకంగా పరిశీలిస్తుందని సబ్ కమిటీ పేర్కొన్నట్లు తెలిసింది. సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇవ్వకపోయినా, సానుకూలంగా ఉన్నట్లు, అన్నింటిపై సీఎంతో చర్చించాక నిర్ణయం ప్రకటిస్తామని మంత్రుల కమిటీ పేర్కొంది. మరోవైపు ఉపాధ్యాయులకు సంబంధించిన కీలకాంశాలపై శనివారం ఉదయం 8 గంటలకు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించనున్నట్లు కమిటీ వెల్లడించింది. అనంతరం అన్ని అంశాలను క్రోడీకరించి, శనివారం సాయంత్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదికను అందజేయనున్నట్లు తెలిపింది. మేమంతా ఒకే కుటుంబం: ఈటల ఉద్యోగుల సహకారంతోనే రాష్ట్ర ప్రభుత్వం దేశంలో నంబర్ వన్ స్థానానికి చేరుకుందని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ‘‘ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి గౌరవం ఉంది. భవిష్యత్‌లోనూ ప్రభుత్వం, ఉద్యోగులు ఒకే కుటుంబంగా కలిసి పని చేస్తాం. ఉద్యమ సమయంలోనూ ఉద్యోగులతోనే కలిసి పని చేశాం. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉద్యమకారులను వేరుగా చూడదు. గత నాలుగేళ్లలో ఉద్యోగుల సహకారంతోనే పథకాలు సక్సెస్ అయ్యాయి. ప్రభుత్వానికి ఎదురైన అనేక అవరోధాలు, ఆటంకాలు, కుట్రలు, కుతంత్రాలను ఉద్యోగుల సహకారంతోనే ఎదుర్కొన్నాం. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు శ్రమ దోపిడీకి గురయ్యారు. వారి రెగ్యులరైజేషన్ న్యాయ వివాదాల్లో చిక్కుకున్నందున సమాన వేతనాలు ఇస్తున్నాం’’అని చెప్పారు. సమావేశంలో ఉద్యోగులు 18 సమస్యలను చెప్పారని, వాటిన్నింటిని పరిశీలిస్తామని వివరించారు. టీచర్ల సమస్యలను కూడా తెలుసుకొని సీఎంకు నివేదిక అందజేస్తామన్నారు. బదిలీలపై స్పందిస్తూ.. ప్రస్తుతం రైతు బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉన్నందునా ఈ నెలలో బదిలీలు చేయడం సాధ్యం కాదని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో టీజీవో, టీఎన్జీవో నేతలతోపాటు జేఏసీ నేతలు, ఇంటర్ జేఏసీ చైర్మన్ పి.మధుసూదన్‌రెడ్డి, గ్రూప్–1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు గోలుకొండ సతీశ్, పెన్షనర్ల జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. సమస్యల పట్ల మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించడంతో టీఎన్జీవో నేతలు సచివాలయంలో ర్యాలీ నిర్వహించారు. పరిష్కరించేవేనని గుర్తించింది: కారెం రవీందర్‌రెడ్డి సమావేశం అనంతరం టీఎన్జీవో అధ్యక్షుడు కారెం రవీందర్ మాట్లాడారు. ‘‘మా సమస్యలు, డిమాండ్లను సబ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాం. వారు కూడా ఇవేవీ పెద్ద సమస్యలు కాదని, పరిష్కరించగలిగేవే అన్న నిర్ధారణకు వచ్చారు. బదిలీలు చేసేందుకు, హెల్త్ స్కీం పక్కాగా అమలుకు, ఏపీలోని ఉద్యోగులను తెలంగాణకు తీసుకువచ్చేందుకు సానుకూలంగా స్పందించారు. నాలుగేళ్లుగా బదిలీలు లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నాని చెప్పాం. ఆ బదిలీల ప్రక్రియను పది రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉంది. జూన్ 2లోగా ఏపీలో ఉన్నవారిని తెలంగాణకు తీసుకురావాలని చెప్పాం. పీఆర్సీని ఏర్పాటు చేయాలని, ఈ ఏడాది జూలై 1 నాటికి అమల్లోకి తేలేకపోతే ఐఆర్ ప్రకటించాలని కోరాం’’అని చెప్పారు. నిర్ణీత కాల పరిమితిలో పరిష్కరించాలన్నాం: మమత సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని టీజీవో అధ్యక్షురాలు మమత చెప్పారు. ‘‘సమస్యలను కమిటీ దృష్టికి తీసుకెళ్లాం. అవన్నీ సీఎం దృష్టిలో ఉన్నాయన్నారు. రిటైర్మెంట్ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని కోరాం. గ్రంథాలయ, మార్కెటింగ్ ఉద్యోగులకు 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని కోరాం. హౌజింగ్, మార్కెటింగ్ శాఖల్లో తొలగించిన కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నాం. నిర్ణీత కాల వ్యవధిలో సమస్యలను పరిష్కరించాలని కోరాం. మంత్రుల కమిటీ కూడా శాశ్వతంగా ఉండాలని, దీంతో ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చించే అవకాశం ఉంటుందని చెప్పాం’’అని వివరించారు. సీపీఎస్‌పై ప్రభుత్వం ఆలోచిస్తోంది: శ్రీనివాస్‌గౌడ్ సీపీఎస్ రద్దుపై ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు టీజీవో చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. ఇతర సమస్యల పట్ల కమిటీ సానుకూలంగా స్పందించిందని, పీఆర్సీ బకాయిల చెల్లింపు, హెల్త్‌కార్డుల వంటివెన్నో చేసిందని పేర్కొన్నారు. ఈ 18 అంశాల్లోనూ కొన్నింటిపై జీవోలు వచ్చినా, అధికారుల కారణంగా అమలుకు నోచుకోలేదన్నారు. అన్ని వర్గాల సమస్యలకు పరిష్కారం: దేవీప్రసాద్ అన్ని వర్గాల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కమిటీ కృషి చేస్తుందని బ్రూవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ చెప్పారు. ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతో ఉందని, ఇది కాలయాపన చేసే కమిటీ కాదని పేర్కొన్నారు. -
ఆశ..నిరాశ
ఒక రోజు కూలికి పోయినా కనీసం రూ.200లు సంపాదిస్తారు. అంటే నెలకు రూ.6 వేలు. కానీ గ్రామాల్లో వైద్య సేవలకు సహాయకులుగా ఉండే ఆశ కార్యకర్తలకు మాత్రం కనీస వేతనాలు అమలు కావడం లేదు. ఎంత చేసినా నెలకు రూ.2 వేలకు మించని వేతనాలు. వీటితో ఎలా బతకాలి, కుటుంబాలను ఎలా పోషించుకోవాలి. తమకు కూడా కనీస వేతనాలు ఇవ్వాలని ఆశ కార్యకర్తలు ఎన్నో పోరాటాలు సాగిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదు. కారంచేడు : గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్కరికీ పూర్తి స్థాయి ఆరోగ్య సేవలను అందించాలనే సంకల్పంతో 2006వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశ కార్యకర్తలను నియమించారు. వీరు గ్రామాల్లో ఉండే ఏఎన్ఎంలకు సహాయకులుగా ఉంటూ ప్రజలకు ఆరోగ్య సేవలు, సూచనలు అందిస్తుంటారు. అంతే కాకుండా గ్రామాల్లో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను గుర్తించి వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటుంటారు. ప్రభుత్వం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాలతో పాటు ప్రతి బుధ, శనివారాల్లో జరిగే ఇమ్యూనైజేషన్ కార్యక్రమాల్లోనూ సేవలందిస్తుంటారు. అయితే ఇటీవల పెరిగిన ఖర్చులు, నిత్యవసర వస్తువుల ధరలతో పోల్చుకుంటే సేవలకు తగిన ఫలితం అందడం లేదని, దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సేవలు ఫుల్.. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 వేల మంది ఆశ కార్యకర్తలు సేవలందిస్తున్నారు. జిల్లాలో 56 మండలాల్లో 2650 మంది నిత్యం ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారు. అంతే కాకుండా ఏజెన్సీ, ఆరు ఐటీడీఏల పరిధిలో 5262 మంది కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ (ఏజెన్సీ ఆశాలు) పని చేస్తున్నారు. వీరంతా చిన్నారులు, గర్భిణులకు విశేష సేవలందిస్తూ భవిష్యత్తు మానవ వనరుల వికాసానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న ఆశలకు కనీస వేతన సదుపాయాలు కల్పించాలని పోరాటాలు చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర స్థాయిలో చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టారు. కనీస వేతనాలు, యూనిఫాం అలవెన్స్ వంటి డిమాండ్లతో ధర్నా చేపట్టారు. గ్రామాల్లో డీఈసీ మాత్రల పంపిణీ, పలు టీకా కార్యక్రమాల్లో ఏఎన్ఎంలకు అండగా ఉంటున్నారు. ఇన్ని సేవలు అందిస్తున్నా తమకు తగిన ప్రతిఫలం దక్కడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం పనికి తగిన వేతనమని కేవలం కంటి తుడుపుగా ఇచ్చే పారితోషంతో తమ కుటుంబాలు ఎలా గడుస్తాయని వారు ప్రశ్నిస్తున్నారు. వారు ఇచ్చే పారితోషికాలు సేవలందించేందుకు ప్రయాణ ఖర్చులకు కూడా సరిపోని విధంగా ఉంటున్నాయని ఆరోపిస్తున్నారు. ఫలించని ధర్నాలు: ఆశ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి కనీస వేతనాలు అందించాలని వివిధ సంఘాల సహకారంతో చేస్తున్న ధర్నాలతో అయినా ప్రభుత్వం వేతనాలు పెంచాల్సి ఉందని వారంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. కనీస వేతనం రూ.5 వేలు అందించాలని వారు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.6 వేలకు పెంచారని, ఏపీలో కూడా వేతనాలు పెంచాలని కోరుతున్నారు. ఆశల ప్రధాన డిమాండ్లివే.. సేవకు కొలత వేసి డబ్బులిచ్చే పద్ధతి తీసివేయాలి. తెలంగాణ మాదిరిగా వేతనాలు చెల్లించాలి. మూడేళ్ల నుంచి ఇవ్వాల్సిన యూనిఫాం అలవెన్స్లతో పాటు బకాయిలు కూడా చెల్లించాలి. 104లో సేవలందించినందుకు గాను రోజుకు రూ.100ల వంతున ఇవ్వాల్సిన బకాయిలు కూడా వెంటనే ఇవ్వాలి. టీబీ కేసుల రోగులకు సేవలందించినందుకు రెండు సంవత్సరాలుగా పేరుకుపోయిన బకాయిలు విడుదల చేయాలి. ఆశ డే రోజున అందించే రూ.150లు బ్యాంక్‌లో కాకుండా చేతికివ్వాలి. పాఠశాలల్లో పిల్లలకు మింగించే ఐరన్ ట్యాబ్లెట్లు వేసినందుకు, పెంటావాలెంట్, రోటా వ్యాక్సిన్లకు పారితోషికం ఇవ్వాలి. పభుత్వం ఆదుకోవాలి: ఆశ కార్యకర్తలకు కనీస వేతన చట్టం అమలు చేయాలి. వీరికి కనీస వేతనాలివ్వాలని పలుమార్లు ఆందోళనలు చేపట్టాం. కార్యకర్తల శ్రమదోపిడీ జరగకుండా వారికి కనీసం రూ.5 వేలు వేతనం అందించి వారి కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడాలని కోరుతున్నాం. – బయ్య శంకర్, ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఉద్యోగ భద్రత కల్పించాలి కొన్నేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశ కార్యకర్తలు ఉద్యోగ భద్రత లేకుండా పని చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి నెలా అందించే ప్రోత్సాహకాలు కూడా అందడం లేదు. కనీస వేతనాలు అమలు చేయడమే కాకుండా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. – శింగమ్మ, ఆశా కార్యకర్త, స్వర్ణ సబ్ సెంటర్ -
‘చంద్రబాబుపై సీబీఐ విచారణ జరపాలి’
-
‘చంద్రబాబుపై సీబీఐ విచారణకు ఆదేశించాలి’
సాక్షి, అమరావతి : కాగ్ సూచనలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, కాగ్ రిపోర్ట్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ప్రజా సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన నిధులు దారి మళ్లిస్తున్నారని, తెలుగు తమ్ముళ్లకు ఉపయోగపడే పథకాలకు మాత్రమే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. బియ్యం సరఫరాలో కుంభకోణం జరిగిందన్న కాగ్ ఆరోపణలతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై సీబీఐ విచారణకు ఆదేశించిన తరహాలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కూడా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంటే చంద్రబాబు విదేశీ పర్యటనలు, భాగస్వామ్య సదస్సుల పేరుతో వృథా ఖర్చులు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాల తీసేలా ప్రభుత్వం వ్యవరిస్తోందని, కాగ్ నివేదికల ద్వారా అనేక కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు పెంచేసి దుబారా ఖర్చులు చేయడం సరికాదని, రోజువారి ఖర్చులకు అప్పుచేసి వృథా ఖర్చులు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ చేస్తున్న ఆరోపణలన్నీ కాగ్ రిపోర్ట్‌లో ఉన్నాయని, ఒక్క రూపాయి కూడా వృథా కాలేదంటూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పిన మాటలు అవాస్తవాలన్నారు. ప్రజాధనాన్ని సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఉపయోగించాలే తప్ప రోజువారీ ఖర్చులకు కాదని, 2.01 లక్షల కోట్ల రూపాయాల అప్పు రాష్ట్ర ప్రజలపై మోపారని మండిపడ్డారు. బడ్జెట్ మొత్తం అంకెల గారడిగా వర్ణిస్తూ, సబ్ ప్లాన్ నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయకుండా టీడీపీ మోసం చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో మూడు లక్షల మంది విద్యార్ధులు ఉంటే 1.8 లక్షల మందికి మాత్రమే ఫీజు రియెంబర్స్‌మెంట్ ఇస్తుందని, పూర్తి స్థాయిలో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలంటూ రాష్ట్ర పభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం నుంచి వస్తున్న నిధుల ఖర్చులో ప్రభుత్వంపై నమ్మకం లేదని... ఖర్చు చేశామని చెప్తున్నారే తప్ప వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు సరిగా లేవన్న కాగ్ నివేదికను గుర్తుచేశారు. కాగ్ రిపోర్టుపై ఏం సమాధానం చెప్తారని చంద్రబాబును ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. -
కేంద్రంపై తమిళనాడు కన్నెర్ర
సాక్షి ప్రతినిధి, చెన్నై: సుప్రీంకోర్టు తీర్పుననుసరించి కావేరీ నదీజలాల మేనేజ్మెంట్ బోర్డును వెంటనే ఏర్పాటుచేయాలన్న డిమాండ్లు తమిళనాడులో వెల్లువెత్తాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, ప్రధాని దిష్టిబొమ్మల దహనంతో తమిళనాడు ప్రజలు కేంద్రంపై తమ ఆగ్రహాన్ని చూపించారు. అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీల ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు మార్చి 30న ముగిసినా కేంద్రం స్పందించకపోవడంతో అన్నాడీఎంకే, ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆందోళనబాట పట్టాయి. చెన్నై, తిరువయ్యూరు, మదురై సహా తమిళనాడువ్యాప్తంగా 600 చోట్ల రాస్తారోకోలు నిర్వహించారు. కోయంబత్తూరు, తిరుచిరాపల్లి, పడుకొట్టాయ్సహా చాలాచోట్ల రైల్‌రోకో చేపట్టారు. కోయంబత్తూరులో ఇద్దరు డీఎంకే కార్యకర్తలు కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతికి ప్రయత్నించారు. తమిళనాడు విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరు కోర్టు ప్రాంగణంలో లాయర్లు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో పోలీసులు దాదాపు 1,000 మందిని అదుపులోకి తీసుకుని గొడవలు సద్దుమణిగాక వదిలేశారు. మంగళవారం రాష్ట్రబంద్‌కు రైతు సంఘాలు, వాణిజ్య సంఘాలు పిలుపునిచ్చాయి. కాగా, డీఎంకే నేతృత్వంలోని విపక్షపార్టీలు ఏప్రిల్ 5న బంద్ నిర్వహించనున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఒత్తిడి తేకుండా అన్నాడీఎంకే ప్రభుత్వం తమిళుల హక్కులను కాలరాస్తోందని డీఎంకే ఆరోపించింది. అన్నాడీఎంకే ఎంపీ రాజీనామా, ఉససంహరణ కావేరీ అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటులో కేంద్రం వైఖరిని వ్యతిరేకిస్తూ అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యులు ముత్తుకరుప్పన్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. అయితే, సీఎం పళనిస్వామి ఆదేశాలతో తన రాజీనామాను ముత్తుకరుప్పన్ ఉపసంహరించుకున్నారు. మరోవైపు, కావేరీ వాటర్ బోర్డు త్వరగా ఏర్పాటుచేయాలని కోరుతూ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. కావేరి అంశంపై మంగళవారం అన్నాడీఎంకే రాష్ట్రవ్యాప్త నిరాహారదీక్షలు చేపట్టనుంది. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, మంత్రులు ఈ దీక్షల్లో పాల్గొననున్నారు. కోర్టు ధిక్కార కేసు వింటాం: సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించని కేంద్రంపై తమిళనాడు దాఖలు చేసిన కోర్టు ధిక్కార కేసును విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఏప్రిల్ 9న ఈ కేసు విచారణకు రానుంది. నిరసనల నేపథ్యంలో తమిళనాడు గవర్నర్ పురోహిత్ ఢిల్లీకి వెళ్లారు. -
అసెంబ్లీ ముట్టడికి యత్నం, ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును ఉపసంహరించుకోక పోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. మంగళవారం ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును వ్యతిరేకిస్తూ తెలంగాణ వామపక్ష విద్యార్థి సంఘాలు అసెంబ్లీ ముట్టడిని చేపట్టాయి. ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే ఆలోచనను ప్రభుత్వం వెంటనే మానుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రైవేటు యూనివర్సిటీ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల అసెంబ్లీ ముట్టడిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ ముట్టడిలో పలు విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. -
హజారే డిమాండ్లకు అంగీకరించిన కేంద్రం
-
హజారే డిమాండ్లకు కేంద్రం ఓకే
న్యూఢిల్లీ: ఆమరణ దీక్ష చేస్తున్న అన్నా హజారే డిమాండ్లను నెరవేర్చేందుకు కేంద్రం అంగీకరించింది. లోక్‌పాల్ ఏర్పాటు సహా 11 డిమాండ్లపై స్పష్టత ఇచ్చినందున ఆమరణ దీక్షను విరమించాలని కోరింది. సోమవారం మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పక్షాన ఢిల్లీలో దీక్ష చేస్తున్న హజారేను కలిసి చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘హజారేతో జరిగిన చర్చల్లో ఆయన డిమాండ్లను అంగీకరిస్తామని చెప్పాం. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ఈ విషయంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇప్పటికే కేంద్ర బడ్జెట్లో చాలా అంశాలను పేర్కొన్నాం. మంగళవారం హజారే దీక్ష విరమిస్తారని అనుకుంటున్నాం’ అని మహాజన్ తెలిపారు. -
నేటి నుంచి జూడాల సమ్మె
సాక్షి, విశాఖపట్నం: పేదల వైద్యం బంద్ కానుంది. పేద, మధ్య తరగతి రోగులను ఆదుకునే పెద్దాస్పత్రి సహా ఇతర ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలగనుంది. మంగళవారం నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగనున్న నేపథ్యంలో ఈ పరిస్థితి తలెత్తనుంది. తమ డిమాండ్లు పరిష్కరించనందుకు, జీతాలు/స్టైఫండ్ చెల్లించనందుకు నిరసనగా కొద్దిరోజుల నుంచి ఆందోళనలు చేపడుతున్న వీరు.. ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మె బాట పట్టనున్నారు. మంగళవారం నుంచి ఆయా ఆస్పత్రుల్లో సేవలకు ఫుల్స్టాప్ పెడుతున్నారు. ఈ నెల 9 వరకూ వేచి చూసి అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే అప్పట్నుంచి అత్యవసర సేవలను కూడా బహిష్కరించాలని నిర్ణయించారు. 900 మంది జూనియర్ వైద్యుల విధులకు దూరం ఆంధ్ర మెడికల్ కాలేజీ పరిధిలోకి వచ్చే కేజీహెచ్‌తోపాటు విమ్స్, ప్రభుత్వ ఛాతి, ఊపిరితిత్తుల ఆస్పత్రి, మానసిక వైద్యశాల, చెవి, ముక్కు గొంతు (ఈఎన్టీ), రాణి చంద్రమణిదేవి (ఆర్సీడీ), ప్రాంతీయ కంటి ఆస్పత్రి (ఆర్ఈహెచ్), ఘోషా తదితర ఆస్పత్రుల్లో సుమారు 900 మంది జూనియర్ వైద్యులు (పోస్టు గ్రాడ్యుయేట్లు, హౌస్ సర్జన్లు, సీనియర్ రెసిడెంట్లు) విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఒక్క కేజీహెచ్‌లోనే 600 మంది సేవలందిస్తుండగా, మిగిలిన వారు ఆయా ఆస్పత్రుల్లో పనిచేస్తున్నారు. ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రోగులకు వైద్యం అందిస్తుంటారు. వారి సూచనల మేరకు జూనియర్ డాక్టర్లు రోగులకు ఇంజక్షన్లు ఇవ్వడం, సెలైన్లు ఎక్కించడం వంటి వైద్య సేవలు చూస్తారు. రోగులకు అందే వైద్యసేవల్లో జూనియర్ వైద్యులు కీలకపాత్ర పోషిస్తుంటారు. వీరు లేకపోతే ఎక్కడి వైద్య సేవలక్కడే నిలిచిపోయే పరిస్థితి తలెత్తుతుంది. ఓపీ సేవలకు కూడా తీవ్ర అంతరాయం కలిగే ప్రమాదం ఏర్పడనుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా సర్వీసు పీజీలు, అనాటమీ, ఫిజియాలజీ తదితర విభాగాల్లో ఉంటున్న 200 మంది వరకు ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లను అందుబాటులో ఉంచుతున్నారు. అంటే దాదాపు ఐదోవంతు మందిని మాత్రమే సర్దుబాటుకు వీలవుతోంది. ముందుగా డిశ్చార్జి.. ముందుజాగ్రత్తగా కేజీహెచ్ అధికారులు అంతగా ప్రాణాపాయం లేదనుకున్న రోగులకు డిశ్చార్జి ఇచ్చేస్తున్నారు. అత్యవసర రోగులను తప్ప ఇతరులను చేర్చుకోవడం లేదు. సోమవారం నుంచే దీనిని అమలులోకి తెచ్చారు. ఉదాహరణకు కేజీహెచ్ భావనగర్ వార్డులో 40 పడకలకు గాను పురుష వార్డులో నలుగురు, స్త్రీల వార్డుల ఏడుగురు, గ్యాస్ట్రో ఎంటరాలజీలో ముగ్గురు, పిల్లల వార్డులో 10 మందిని పంపించేశారు. మంగళవారం గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో 15 మందికి డిశ్చార్జి ఇవ్వనున్నారు. ఇలా మిగతా వార్డుల్లో చికిత్స పొందుతున్న వారిలో ప్రాణాంతక రోగాలతో చికిత్స పొందుతున్న వారిని మినహా పలువురిని ఇంటికి పంపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోకే.. ఏళ్ల తరబడి తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోనందువల్లే సమ్మెకు దిగుతున్నట్టు జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించామని, కొన్నాళ్లుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేపడుతున్నా స్పందించలేదని, దీంతో సమ్మె చేయక తప్పడం లేదని అంటున్నారు. ఐదు నెలల నుంచి స్టైపండ్, గౌరవ వేతనాలు చెల్లించడం లేదని, ఏటా బడ్జెట్లో దీనికోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని, ఎంబీబీఎస్, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసిన వెంటనే డిగ్రీలు జారీ చేసి రిజిస్ట్రేషన్లకు అనుమతించడం తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నామని ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.ముఖేష్‌కుమార్ ‘సాక్షి’కి చెప్పారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 9 నుంచి అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తామని హెచ్చరించారు. సమ్మె మరింత తీవ్రతరం పాతపోస్టాఫీసు: జూనియర్ వైద్యుల రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా మంగళవారం నుంచి కేజీహెచ్‌లో విధులు బహిష్కరిస్తాం. ఓపీ, వార్డుల సేవలను పూర్తిగా నిలిíపివేస్తాం. అత్యవసర, ఇంటెన్సివ్ కేర్ యూనిట్, క్యాజువాల్టీ కేసులను అటెండ్ అవుతాం. జూనియర్ వైద్యుల వేదనను అర్థం చేసుకోకుండా ప్రత్యేక వైఖరిని ప్రదర్శిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. –ఏపీ జూనియర్ వైద్యుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఆంధ్రవైద్య కళాశాల సంఘం కార్యదర్శి డాక్టర్ గంగాధర్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం.. జూనియర్ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. నాన్ క్లినికల్ (మైక్రో బయాలజీ, బయోకెమిస్ట్రీ, పేథాలజీ, ఫిజియాలజీ, అనాటమీ తదితర విభాగాల్లోని 40 మందిని ఓపీ సేవలకు డెప్యుటేషన్ పంపాలని కోరాం. శస్త్రచికిత్సలు నిలిచిపోకుండా చూస్తాం. వార్డుల్లో రోగులకు సేవలకు అంతరాయం కలగకుండా నర్సులకు తాత్కాలికంగా లీవులు రద్దు చేస్తున్నాం. మార్చి, ఏప్రిల్ నెలల్లో రోగుల తాకిడి ఎక్కువగా ఉంటున్నందున జూనియర్ వైద్యుల సమ్మె పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని డీఎంఈని కోరాం. సమ్మె దృష్ట్యా అత్యవసర వైద్య సేవలందించే వారినే ఆస్పత్రిలో చేర్చుకుంటున్నాం. –డాక్టర్ జి.అర్జున, సూపరింటెండెంట్, కేజీహెచ్ -
మాకూ సమాన హక్కు కల్పించండి
అనంతపురం అర్బన్: ‘సమాజంలో మేమూ ఒకరమే.. మమ్మల్ని దూరం పెట్టడం సమంజసం కాదు.. మాకూ సమాన హక్కు కల్పించాలని’ అని ట్రాన్స్జెండర్లు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను కలెక్టర్‌కు విన్నవించి, వినతిపత్రం అందజేసేందుకు ‘మనవిజయం’ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌కు మంగళవారం వచ్చారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు రమణమ్మ, మయూరి, హాసిని మాట్లాడారు. ప్రస్తుతం ఏదైనా సర్టిఫికెట్, రేషన్ కార్డు, తదితర వాటికి దరఖాస్తు చేసుకుంటే దానిలో పురుష, మహిళ కాలమ్ మాత్రమే ఉంచుతున్నారన్నారు. ఇక నుంచి ‘ఇతరులు’ అనే ఆప్షన్ కూడా ఉంచాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలనూ తమకు వర్తింపజేయాలన్నారు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. విద్యావంతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. చదువులేని వారికి ఉపాధి చూపించాలన్నారు. చదువు, ఉద్యోగంలోనూ ఆప్షన్ ఉంచుతూ రిజర్వేషన్లు కల్పించాలన్నారు. -
బదిలీలను నిలుపుదల చేయించాలి
జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను కోరిన నర్సులు కాకినాడ వైద్యం : ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని తమ బదిలీలను నిలుపుదల చేయించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వాసుపత్రి హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావును సోమవారం కలుసుకుని విపతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నమెంట్ నర్సుల సంఘం జిల్లా అధ్యక్షురాలు అనూరాధ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలోని జేడీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కౌన్సెలింగ్‌లో జీజీహెచ్‌కు చెందిన 76 మంది హెడ్, స్టాఫ్ నర్సులకు బదిలీలు జరిగాయన్నారు. భార్యాభర్తల ఉద్యోగం, అనారోగ్యం వంటి అంశాల్లో బదిలీల నిబంధనలకు ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపులను సైతం అధికారులు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. సూపర్ స్పెషాలిటీస్ సేవలు అందించేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకున్న వారికి బదిలీల్లో ప్రభుత్వం కొన్నిరకాల మినహాయింపులు ఇచ్చిందని వాటిని సైతం పరిగణనలోకి తీసుకోకపోవడం విచారణకరమన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పలువురి నర్సులకు మినహాయింపు ఇవ్వలేదని వాపోయారు. స్టాఫ్,హెడ్ నర్సుల కోసం గతంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌కి విజ్ఞప్తి చేశారు. కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న తమకు బదిలీలో మినహాయింపు ఇవ్వాలని కోరినా కౌన్సెలింగ్ అధికారులు పట్టించుకోలేదని ఓ స్టాఫ్ నర్సు కన్నీటి పర్యంతమైంది. ఈ విషయమై డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) దృష్టికి తీసుకెళతానని సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేంద్రరావు వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గవర్నమెంట్ నర్సుల యూనియన్ సభ్యులు ఆనీ, నర్సింగ్ సూపరింటెండెంట్లు జెసు ప్రియ, అక్కమ్మ, పలువురు ఏపీఎన్జీవో నేతలు పాల్గొన్నారు. -
పరువు హత్యలపై చట్టం చేయాలి
రాష్ట్ర ఐద్వా నేతల డిమాండ్ అమలాపురం రూరల్ (అమలాపురం) : రాష్ట్రంలో ఇటీవల కాలంలో పెరుగుతున్న పరువు హత్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రత్యేక చట్టం చేయాలని ఐద్వా రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతుల్లో పాల్గొన్న రాష్ట్ర మహిళా ప్రతినిధులు డిమాండ్ చేశారు. మండలంలోని భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తోన్న ఈ తరగతుల్లో ఆదివారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో చోటు చేసుకున్న పరువు హత్య కేసులను జిల్లాల వారీగా చర్చించారు. ఈ ప్రధాన సమస్యతో పాటు మహిళా సమస్యలను నిరసిస్తూ భట్లపాలెంలో ఐద్వా మహిళలు మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. పరువు హత్యలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి డిమాండ్ చేశారు. పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్న మహిళా బిల్లును ఆమోదించాలని కోరారు. ‘మహిళా సమస్యలు... పరిష్కార మార్గాలు’అంశంపై సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.స్వరూపరాణి ప్రసంగించారు. మహిళల సమస్యలు పోరాటాల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించారు. స్త్రీ, పురుషులకు సమాన హక్కుల కోసం ఆస్తుల చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐద్వా రాష్ట్ర నాయకురాలు నండూరి రూపావాణి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమయంలో మహిళలు కీలక పాత్ర పోషించారని... అలాంటి మహిళలను అణగదొక్కుతున్నారని ఆరోపించారు. మహిళల పట్ల వివక్ష కొనసాగుతోందన్నారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు కేవీవీ సత్యనారాయణ సమాజంలో మూఢ నమ్మకాలు...మద్యం అనర్ధాలపై మహిళలకు అవగాహన కల్పించారు. మెజీషియన్ సీహెచ్ శ్రీరాములు, జన విజ్ఞాన వేదిక జిల్లా కన్వీనర్ ఎ.కృష్ణశ్రీ, జిల్లా కార్యదర్శి వీఎస్ఎన్ రెడ్డి తదితరులు మహిళా చైతన్యం, విజ్ఞానం అంశాలపై వివిధ ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించారు. శిక్షణ తరగతులు సోమవారం కూడా ఇదే వేదికపై కొనసాగుతాయని ఐద్వా జిల్లా కార్యదర్శి సీహెచ్ రమణి చెప్పారు. నాలుగో రోజు మంగళవారం ముగింపు కార్యక్రమాన్ని అంతర్వేదిలో నిర్వహిస్తామన్నారు. ఐద్వా నాయకురాళ్లు విజయమ్మ, మాధవి, అలివేలు, ఇందిర, సావిత్రి, తులసి, అరుణ, ఆదిలక్ష్మి, కుడుపూడి రాఘవమ్మ తరగతుల్లో ప్రసంగించారు. సీపీఐ డివిజన్ కార్యదర్శి మోర్త రాజశేఖర్, కార్మిక నాయకుడు పచ్చిమాల వసంతకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో నిరుద్యోగ జేఏసీ ఆందోళన
-
రాయలసీమ సాగునీటిపై చర్చ
-
బడ్జెట్లో రూ.1,500 కోట్లు కేటాయించాలి
రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నేతల డిమాండ్ అమలాపురం టౌన్ : ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు బ్రాహ్మణుల సంక్షేమానికి ఏటా రూ.100 కోట్లు వంతున అయిదేళ్లలో రూ.500 కోట్లు కేటాయిస్తానని చెప్పి అధికారం చేపట్టాక మూడేళ్లలో రూ.185 కోట్లే కేటాయించారని రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్ (అనంతపురం జిల్లా), రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్‌శర్మ (గుంటూరు జిల్లా) తెలిపారు. మిగిలిన రెండేళ్లలో రూ.315 కోట్లు కేటాయించటం సాధ్యం కాదేమోనన్న సందేహం వ్యక్తం చేశారు. వారు అమలాపురంలోని రాష్ట్ర సంఘం కార్యవర్గ సభ్యుడు మాచిరాజు రవికుమార్ స్వగృహంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. బ్రాహ్మణుల సంక్షేమానికి ఇక నుంచి ఏ ప్రభుత్వమైనా బడ్జెట్లో రూ.1,500 కోట్లు కేటాయించాలని... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బ్రాహ్మణులు 50 వేల మందికి పైగా ఉన్నారని...2019 ఎన్నికల్లో రాష్ట్రంలో బ్రాహ్మణులకు ఒక ఎంపీ, అయిదు అసెంబ్లీ, రెండు ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ ప్రధాన రాజకీయ పార్టీ ఆ దామాషాలో బ్రాహ్మణులకు టిక్కెట్లు ఇస్తుందో ఆ పార్టీకే మద్దతిస్తారని చెప్పారు. అర్చక వ్యవస్థను పటిష్టం చేసింది వైఎస్సే వంశపారంపర్య అర్చక వ్యవస్థకు భరోసా ఇచ్చింది...పటిష్టం చేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డేనని రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ అన్నారు. టీడీపీ ప్రభుత్వం మిరాశీ వ్యవస్థను రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసిందని, రద్దు చేస్తే ఉద్యమబాట పడతామని హెచ్చరించారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు అనుబంధంగా నడుస్తున్న జిల్లా కో ఆర్డినేట్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కో ఆర్డినేటర్‌కు కార్పొరేషన్ నెలకు రూ.50 వేల వరకూ ఖర్చు చేస్తోందని..ఆ డబ్బును పేద బ్రాహ్మణుల సంక్షేమానికి వెచ్చించాలని సూచించారు. నియోజకవర్గ స్థాయి కో ఆర్డినేటర్ల వ్యవస్థ ఉండగా జిల్లా కో ఆర్డినేటర్ అనవసరమన్నారు. సమాఖ్య నాయకులు వైవీ జగన్నాథరావు, మాచిరాజు రవికుమార్, మంగళంపల్లి అంజిబాబు, ఎం.ఎల్.ఎన్.సురేష్‌బాబు పాల్గొన్నారు. -
పరిహారమా...? పరిహాసమా..?
-
రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాల్సిందే
-చంద్రబాబు హామీని నిలబెట్టుకోవాలి -రజక చైతన్య సేవాసంస్థ డిమాండ్ కాకినాడ రూరల్ : తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలంటూ ఏపీ రజక చైతన్య సేవా సంస్థ జిల్లా కార్యవర్గం డిమాండ్ చేసింది. ఆదివారం ఇంద్రపాలెంలోని రజక సంక్షేమ సంఘ భవనంలో జరిగిన జిల్లా రజక చైతన్య సేవా సంస్థ సమావేశంలో పలువురు నాయకులు ప్రసంగించారు. ఇప్పటికే 17 రాష్ట్రాల్లోనూ, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ రజకులు ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నారన్నారు. చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా రజకులను ఎస్సీల్లో చేరుస్తామని వాగ్దానం చేశారని, అదే విధంగా గవర్నర్ నరసింహన్ బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీల్లో చేర్చేందుకు ప్రకటన చేశారని నాయకులు గుర్తు చేశారు. గ్రామాల్లో రజకులు దుస్తులు ఉతికేందుకు ఉన్న చెరువులను ఆయా గ్రామపంచాయతీలు వేర్వేరు కులాలకు లీజుకు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలా కాక పూర్తిగా రజక సంఘాలకే ఆ చెరువులను కేటాయించాలని సమావేశం డిమాండ్ చేసింది. రాష్ట్ర రజక చైతన్య సేవా సంస్థ అధ్యక్షుడు కాకినాడ రామారావు మాట్లాడుతూ ప్రభుత్వం రజకులను చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దాట వేస్తోందని నిరసించారు. రజకులను ఎస్సీలలో చేర్చే విషయమై గ్రామాల వారీ ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేసేందుకు రజకులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉద్యమంలో భాగంగా మొదట జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద శాంతియుత ఆందోళన చేపట్టాలని సమావేశం నిర్ణయించింది. జిల్లా అధ్యక్షుడు వాడపర్తి కామేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మురమళ్ల రాజబాబు, గౌరవాధ్యక్షుడు ముంగళ్ల నాగసత్యనారాయణ తదితరులు సంఘ సభ్యులనుద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘాలకు చెందిన ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
సభలో సమరం
-
ఎర్రగడ్డ టీబీ ఆస్పత్రిలో దారుణం
-
వ్యవసాయ రంగానికి రూ.25 వేల కోట్లివ్వాలి
-
రేపు బ్యాంకు యూనియన్ల సమ్మె
కర్నూలు(అగ్రికల్చర్) డిమాండ్ల సాధన కోసం అన్ని బ్యాంకు యూనియన్లు మంగళవారం సమ్మె నిర్వహించనున్నాయి. దీంతో జిల్లాలోని అన్ని బ్యాంకుల కార్యకలాపాలు స్తంభించనున్నాయి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు సమ్మెను విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఏఐబీఈఏ జిల్లా కార్యదర్శి నాగరాజు తెలిపారు. ఇందులో భాగంగా ఎస్బీఐ మెయిన్ దగ్గర అన్ని బ్యాంకు యూనియన్లతో కలసి ఆందోళన నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సంస్కరణల్లో భాగంగా బ్యాంకుల విలీనం, బ్యాంకు ఉద్యోగాల ఔట్ సోర్సింగ్‌ను వ్యతిరేకించడంతో పాటు గ్రాట్యుటీ సీలింగ్‌ను పెంచి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని, బ్యాంకుల్లో కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నగదు ఉపసంహరణపై పరిమితులు ఎత్తి వేయాలని, గ్రామీణ ప్రాంతాలకు చెందిన బ్యాంకులను అవసరమైనంత నగదు ఇవ్వాలన్నారు. సమ్మెను విజయవంతం చేసేందుకు అన్ని బ్యాంకు యూనియన్లు సహకరించాలని ఆయన కోరారు. -
ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యే
మృతుడు రాంబాబు కుటుంబానికి రెండెకరాల భూమి ఇవ్వాల్సిందే వైఎస్సార్సీపీ నాయకుల డిమాండ్ పార్టీ తరఫున రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటన రాజమహేంద్రవరం సిటీ : చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటాలే తప్ప ప్రభుత్వ సంక్షేమాన్ని విస్మరించిందని, దాని పర్యవసానమే పుష్కరఘాట్‌లో రాంబాబు మృతి ఘటన అని వైఎస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు. రాంబాబు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, గ్రేటర్ రాజమహేంద్రవరం పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, సిటీ కోఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు ధ్వజమెత్తారు. శనివారం వైఎస్సార్సీపీ నగర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ శివరాత్రి పుణ్యస్నాన మాచరించేందుకు వచ్చిన రాంబాబు ప్రభుత్వ నిర్వాకం వల్లే మృత్యువాత పడ్డాడన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని అన్నారు. మృతుడి కుటుంబానికి రెండు ఎకరాల పంటభూమి, రూ.50 వేల సహాయం అందజేయాలన్నారు. భర్తను కోల్పోయిన బాధితురాలు న్యాయం కోసం రోడ్డెక్కితే ఆమెపై పోలీసులు వ్యవహరించిన తీరు హేయమన్నారు. గ్రేటర్ రాజమహేంద్రవరం పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ మాట్లాడుతూ విద్యుదాఘాతానికి గురైన రాంబాబుకు వెంటనే చికిత్స అందించి ఉంటే బతికేవాడన్నారు. రెండు గంటల పాటు నరక యాతన అనుభవించాడని, పుష్కరఘాట్‌లో కనీసం ప్రాథమిక చికిత్సా కేంద్రం ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. 108 రావడానికి రెండు గంటలపైనే పట్టిందన్నారు. గోదావరి పుష్కరాల సమయంలో 28 మంది ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం ఏర్పాట్ల విషయంలో ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా పోయిందన్నారు. సిటీ కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పుష్కరాలు నిదర్శనమన్నారు. శివరాత్రి సమయంలో సైతం అదే తప్పిదం బయట పడిందన్నారు. కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, మజ్జి నూకరత్నం, పిల్లి నిర్మల, మాజీ కార్పొరేటర్ పోలు విజయలక్ష్మి, సేవాదల్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని, యువజన విభాగం సహాయ కార్యదర్శి పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, పార్టీ నాయకులు మజ్జి అప్పారావు, పెంకే సురేష్, చిక్కాల బాబులు తదితరులు పాల్గొన్నారు. -
డిమాండ్ల సాధనకు అవిశ్రాంత పోరాటం
∙పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి చెన్నేకొత్తపల్లి : ఉపాధ్యాయులు, పట్టభద్రుల డిమాండ్ల సాధనకు అవిశ్రాంతంగా పోరాడతానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. ఆయన సోమవారం మండల కేంద్రంతోపాటు న్యామద్దెల తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఉపాధ్యాయులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. అలాగే గ్రామంలోని పలువురు పట్టభద్రులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు తనకు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన కోసం కృషి చేయడం ద్వారా రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ఉపాధ్యాయులకు, ఇతర ఉద్యోగులకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసేవరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు. మోడల్, గురుకుల పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు పీఆర్సీ, హెల్త్ కార్డులు, సర్వీసు రూల్సు, రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు పెంచడం వంటి వాటి అమలుకు పోరాడతామన్నారు. టీడీపీ ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఉద్యోగం, లేదా రూ.2 వేలు నిరుద్యోగ భృతి చెల్లించేవరకు పోరాడతామన్నారు. రెండున్నరేళ్లుగా నిరుద్యోగులకు చెల్లించని భృతిని బకాయిల కింద చెల్లించేలా ఉద్యమిస్తామన్నారు. తనను గెలిపిస్తే ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఆయా గ్రామాల్లోని నాయకులు, యువకులు ఉన్నారు. -
ఆ దుండగునికి దండన విధించాలి
-హోలీ ఏంజెల్స్ ‘మధు’ను అరెస్టు చేయాలి -‘రంప’లో గిరిజన విద్యార్థుల ప్రదర్శన రంపచోడవరం : న్యాయం కోసం గిరిజన విద్యార్థులు చేసిన నినాదాలతో రంపచోడవరం వీధులు మార్మోగాయి. గిరిజన విద్యార్థినులపై దౌర్జన్యానికి పాల్పడిన రాజమహేంద్రవరం హోలీ ఏంజెల్స్ పాఠశాల డైరెక్టర్ మధుసూదనరావును అరెస్టు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం స్థానిక డిగ్రీ కళాశాల నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. విచారణలో వాస్తవాలు తెలుస్తాయని, దోషులను వదిలే ప్రస్తకే లేదని పీవో దినేష్‌కుమార్ హామీ ఇచ్చారు. కాగా గిరిజన విద్యార్థినులను చితకబాదిన మధుసూదనరావును తక్షణం అరెస్టు చేయాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థినులను అమానుషంగా కొట్టిన రాజమహేంద్రవరం హోలీఏంజెల్ పాఠశాల డైరెక్టర్ మధుసూదనరావును తక్షణం అరెస్టు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన విద్యార్థులు బుధవారం రంపచోడవరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. డిగ్రీ కళాశాల నుంచి ర్యాలీగా అంబేడ్కర్ సెంటర్ మీదుగా ఐటీడీఏ పీఓ కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనకు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. ఆదివాసీ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు కుంజా శ్రీను, సీపీఐ డివిజన్ కార్యదర్శి జత్తుక కుమార్ ఆధ్వర్యంలో రంపచోడవరంలోని అన్ని యాజమాన్య పాఠశాలల విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో విద్యార్థులతో పీఓ ఏఎస్ దినేష్‌కుమార్ మాట్లాడారు. జ్యుడిషియల్ విచారణలో వాస్తవాలు తెలుస్తాయని దోషులను వదిలే ప్రస్తకే లేదన్నారు. పదో తరగతి పరీక్షలకు ఎంతో సమయం లేనందున శ్రద్ధగా చదువుకోవాలని, అక్కడ ఇబ్బందులు లేకుండా చూసేందుకు కేర్‌టేకర్‌ను నియమిస్తామన్నారు. విద్యార్థినులు భయపడాల్సిన పరిస్థితి లేదన్నారు. అక్కడి పరిస్ధితిపై విచారణ చేసేందుకు గిరిజన సంక్షేమ శాఖ డీడీ సుజాతను పంపినట్టు తెలిపారు. విచారణ చేయమని ఏటీడబ్ల్యూఓ ఆకుల వెంకటేశ్వరరావును ఆదేశించామని వివరించారు. దీంతో విచారణకు వచ్చిన ఏటీడబ్ల్యూఓ ఐటీడీఏ పీఓకు, విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియకుండానే సర్దుబాటు చేయాలని యాజమాన్యంతో మాట్లాడినట్టు పీఓ దృష్టికి విద్యార్థులు తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే రాజేశ్వరి డిమాండ్.. హోలిఎంజెల్స్లోని గిరిజన విద్యార్థినులను చావకొట్టిన పాఠశాల డైరెక్టర్ మధుసుదన్రావును తక్షణం అరెస్టు చేయాలని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి డిమాండ్ చేశారు. కులం పేరుతో దూషించిన డైరెక్టర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలన్నారు. గిరిజన విద్యార్థుల చదువు కోసం గిరిజన సంక్షేమ శాఖ రూ.లక్షలు ఖర్చు చేస్తుంటే అక్కడ వారికి కనీసం భోజనం కూడా సక్రమంగా పెట్టడడం లేదన్నారు. ఆడపిల్లలను డైరెక్టర్ కొట్టడం హేయమన్నారు. విద్యార్థినులకు న్యాయం చేసేవరకూ పక్షాన పోరాడతానని చెప్పారు. -
తెలంగాణ ఎందులో అగ్రస్థానంలో ఉంది?
కేసీఆర్‌కు సీపీఎం నేత సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏ రంగంలో అగ్రస్థానం లో ఉందో సీఎం కేసీఆర్ స్పష్టం చేయాలని సీపీఎం నేత, ఆల్ ఇండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రం 19.5 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని సీఎం చెబుతున్నారని, అయితే ఏ రంగంలో ఈ వృద్ధి రేటును సాధిం చిందో చెప్పకుండానే మన ఊరు–మన ప్రణాళిక కార్యక్రమాన్ని మరోసారి నిర్వహిం చాలని సీఎం ఆదేశించారని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల వృద్ధి రేట్లను ప్రజలకు తెలపాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ మూడు రంగాల వృద్ధి రేటునే ఎవరైనా పెరుగుదలగా గుర్తిస్తారని, ఇందులో ఒక రంగం పెరిగినా, మరొక రంగం లోటులో ఉన్నా, సగటున ఈ రంగాల స్థూల ఉత్పత్తి రేటుతో పాటు, జీవన ఆదాయం, వయో పరిమాణం పెరుగుదల, విద్య, ఆరోగ్యం, తాగునీరు, శానిటేషన్, పర్యావరణం వంటి రంగాలను మానవ వనరుల అభివృద్ధి శాఖ అంచనా వేస్తుందని తెలియజేశారు. ఇన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తే, ఆ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుందన్నారు. -
వివరణను డిమాండ్ చేసిన ఫోన్ పే
ముంబై: ఫ్లిప్ కార్ట్ కు చెందిన ఫోన్ పే తన సేవలను బ్లాక్ చేయడంపై ఆగ్రహం వక్తం చేసింది..ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే తమ సేవల్ని అడ్డుకోవడంపై ఐసిఐసిఐ బ్యాంక్ నుండి వివరణ కోరింది. బ్యాంక్ చర్యపై నిరసన వ్యక్తం చేసిన ఫోన్ పే వివరణ యివ్వాల్సిందిగా బ్యాంకును డిమాండ్ చేసింది. 20,000 లకుపైగా యూపీఐ ఆధారిత సేవల ద్వారా రూ. 5కోట్ల మేర ట్రాన్స్ క్షన్ విఫలమైనట్టు ఆరోపణలపై స్పందించినసంస్థ బ్యాంకింగ్ దిగ్గజం నుంచి సమాధానాన్ని కోరింది. కనీస వివరణ, ఎలాంటి ఫిర్యాదు లేకుండానే తమ వాలెట్ కస్టమర్ లింక్ ను బ్లాక్ చేసిందని మండిపడింది. ఎన్ పీసిఐ నిబంధనలను తాముపాటిస్తున్నామని వివరణ ఇచ్చింది. ఎన్పీసీఐ వివరణాత్మక మార్గదర్శకాలు, విధానాలను తాము అనుసరిస్తున్నామని 100 కు పైగా టెస్ట్ కేసులను పరిశీలించినట్టు ఫోన్ పే సీఈవో సీఈఓ సమీర్ నిగమ్ తెలిపారు. తాము యూపీఐ మార్గదర్శకాలను పాటించడంలేదని భావిస్తే కనీసం రెండు నెలల ముందు తమకు గానీ, ఎన్ పీసీఐ కిగానీ సమాచారం అందించాల్సిఉందని తెలిపారు. ఈ విషయంపై కూర్చుని నిర్ణయించుకుంటే బావుండేదన్నారు. ఇప్పటికైనా తమతో సమస్యలపై సంప్రదించాలని బ్యాంకు ను విజ్ఞప్తి చేసింది. తద్వారా వాటిని సమీక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ మేరకు సమీర్ నిగమ్ తన వినియోగదారులకు ఒక బహిరంగ లేఖ రాశారు వివరణాత్మక సర్టిఫికేషన్, బలహీనతల అంచనా, థర్డ్ పార్టీ అప్లికేషన్ టెస్టింగ్ తరువాత మాత్రమే వాలెట్ ను లాంచ్ చేసినట్టు నిగమ్ వినియోగదారులకు తన లేఖలో పేర్కొన్నారు. డిజిటల్ పేమెంట్ మిడియేటర్గా సేవలందిస్తున్న ఫోన్ పేను కొనుగోలు చేసిన ఫ్లిప్ కార్ట్, ఆపై దాన్ని యూపీఐగా మార్చింది. దీన్ని బ్యాంకు ఆధారిత వ్యాలెట్‌గా మార్చేందుకు యస్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. భద్రతా కారణాలు, నియంత్రణ పద్ధతుల కారణాలతో ఫోన్‌పే ఈ-వ్యాలెట్ ద్వారా లావాదేవీలను దేశీయ ప్రైవేట్ దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐ బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. -
బలిజలను తక్షణమే బీసీ జాబితాలో చేర్చాలి
-
దూకుడు పెంచుతున్న టీజేఎసీ
-
లెక్చరర్ల డిమాండ్లను నెరవేర్చాలి
ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి రొద్దం : కాంట్రాక్టు లెక్చరర్ల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని వైఎస్సార్ సీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాదాపు నెల రోజులుగా వారు సమ్మె చేస్తుంటే పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తగదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులను కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమ్మెలో ఉన్న కాంట్రాక్ట్ లెక్చరర్లను తొలగిస్తామంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం దారుణమన్నారు. వారి సమ్మెకు మద్దతు తెలుపుతూ కాంట్రాక్ట్ లెక్చరర్లను రూలాఫ్ రిజర్వేష¯ŒSలోకి తీసుకొచ్చి కొత్త పీఆర్సీ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే సీపీఎస్ రద్దుపై పోరాటం చేస్తామన్నారు. తాను సుదీర్ఘకాలం ఉద్యోగ సంఘాల నాయకుడిగా నిస్వార్థంగా పని చేశానన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అందరి సహకారంతో పోరాడినట్లు తెలిపారు. 10వ పీఆర్సీ కమిష¯ŒSను సకాలంలో నియమించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విజయం సాధించామన్నారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే రానున్న రోజుల్లో సమస్యలపై పోరాడేందుకు ముందుటానన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీరాములు, వైఎస్ఆర్ టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు అశోక్‌కుమార్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు గుర్రం గోవర్ధన్, ఉపాధ్యాయులు రామచంద్రరెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఒకే సారి నగదు చెల్లించాలి
ధాన్యం కొనుగోళ్లపై వైఎస్సార్ సీపీ డిమాండ్ నగదు విత్‌డ్రాకు బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు పెట్టాలి వచ్చే నెల పింఛను నగదు చేతికే ఇవ్వాలి లేదంటే ప్రత్యక్ష ఉద్యమాలు తప్పవు కిరోసిన్ పంపిణీ రద్దు ఓ అరాచక నిర్ణయం నగదు రహితం ఓ ప్రచార ఆర్భాటం విలేకర్లతో పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు సాక్షి, రాజమహేద్రవరం : ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన నగదును బ్యాంకుల్లో ఒకేసారి చెల్లించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. అసలే గిట్టుబాటు ధర లేక సతమతమవుతున్న రైతన్నకు నోట్ల రద్దు చిక్కుల్లోపడి విలవిలలాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల కూలీల చెల్లింపులకు, రెండో పంట పెట్టుబడికి నగదు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. బుధవారం పార్టీ కార్యాలయంలో రాజమహేద్రవరం కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాలతో కలసి ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రైతులు వారి కష్టార్జితాన్ని తీసుకుకోవడానికి కూడా బ్యాంకుల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. జిల్లాలో 284 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి 10,29,272 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 4,89,837 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారని తెలిపారు. దీనికి సంబంధించి రైతులకు రూ. 718 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 627 కోట్లు జమచేశారని వివరిచారు. ఏటీఎంలలో రోజుకు రెండువేలు, బ్యాంకుల్లో వారానికి రూ.24వేల చొప్పున ఇస్తే ఈ నగదంతా రైతులకు చేరాలంటే ఎంత సమయం పడుతుందని ప్రశ్నించారు. ఒక నిర్ణయం వల్ల ఎంలాంటి ఇబ్బందులు వస్తాయో ముందస్తు అంచనా లేకుండా అనాలోచితంగా పెద్దనోట్లను రద్దు చేశారని కన్నబాబు ధ్వజమెత్తారు. ధాన్యం నగదును తీసుకునే వీలులేక, సహకార బ్యాంకులు రుణాలు ఇవ్వక రైతులు రెండో పంట పెట్టుబడులను ఎలా సమకూర్చుకోవాలో ప్రభుత్వమే చెప్పాలని డిమాండ్ చేశారు. పింఛ¯ŒS నగదు చేతికి ఇవ్వకపోతే ఉద్యమాలు తప్పవు... సీఎం చంద్రబాబు అనాలోచిత నిర్ణయం వల్ల వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. జిల్లాలో ఆరు లక్షల మందికి సామాజిక పింఛన్లుండగా వీరిలో రెండు లక్షల మంది బ్యాంకు ఖాతాలు మనుగడలోలేవన్నారు. మరో లక్ష మందికి అస్సలు ఖాతాలే లేవని, ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం ’గుడ్డెద్దు చేలో పడినట్లు’గా ఉందన్నారు. వచ్చే నెల నుంచి పింఛ¯ŒSను లబ్ధిదారుల చేతికే ఇస్తామని సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలని, లేదంటే లబ్థిదారులతో కలిసి ప్రత్యక్షంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చిరించారు. గ్యాస్ ఉంటే దీపం వెలుగుతుందా? దీపం కనెక్షన్లు ఇస్తున్నామంటూ కిరోసి¯ŒS పింపిణీ రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం అరాచకంగా ఉందని కన్నబాబు ధ్వజమెత్తారు. జిల్లాలో విద్యుత్ లేని గ్రామాలు ఇంకా చాలా ఉన్నాయని, పలు గ్రామాల్లో విద్యుత్తు కోతలు కూడా ఉంటున్నాయన్నారు. ఆయా గ్రామాల్లో ఉండే ప్రజలు గ్యాస్ ద్వారా దీపాలు వెలిగించుకోవాలా అని ప్రశ్నించారు. నగదు రహితం అంతా ప్రచార ఆర్భాటం.. వాస్తవ పరిస్థితి తెలుసుకోకుండా సీఎం చంద్రబాబు ప్రచార ఆర్భాటం కోసం పాలన సాగిస్తున్నారని కన్నబాబు ఆరోపించారు. మోరీ గ్రామాన్ని నగదు రహితంగా చేస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటున్నారని, అసలు జిల్లాలో పెద్ద దుకాణాలు, పెట్రోల్ బంకుల్లో కూడా స్వైపింగ్ మిషన్లు లేని విషయం ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. వేల మంది వ్యాపారులు స్వైపింగ్ మిషన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నా ఇప్పటి వరకూ అందలేదని గుర్తు చేశారు. జన్మభూమి కమిటీలపై ఆ పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వాటిపై సీఎం ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టుకు ఎన్ని సార్లయినా శంఖుస్థాపనులు చేసినా ఫర్వాలేదుగాని, సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. 2018 నాటికి పోలవరం పూర్తయితే పురుషోత్తపట్నం ఎందుకో చంద్రబాబే చెప్పాలన్నారు. రూ.1981.54 కోట్ల నాబార్డు రుణాన్ని పోలవరం ప్రాజెక్టుకు కాకుండా పురుషోత్తపట్నం ఎత్తిపోతలకు ఉపయోగిస్తారేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. సమావేశంలో రాజమహేంద్రవరం రూరల్ కో ఆర్డినేటర్ గిరిజాల వీర్రాజు, ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్, కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, పిల్లి నిర్మల, మజ్జి నూకరత్నం, పార్టీ రాష్ట్ర, జిల్లా, పట్టణస్థాయి వివిధ విభాగాల నేతలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
డిమాండ్లు సాధించే వరకు ఉద్యమం ఆగదు
కాపు ఉద్యమనేత ముద్రగడ కాకినాడ రూరల్ : చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో కాపులకు ఇచ్చిన డిమాండ్లు అమలు చేసే వరకు తమ ఉద్యమం ఆగదని, నిరంతరం ఏదో ఒక రూపంలో ప్రభుత్వానికి తమ జాతి నిరసన వ్యక్తం చేస్తుందని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు. శుక్రవారం కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలోని జిల్లా కాపు సద్భావనా సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు నివాసంలో కాపు జేఏసీ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపులను బీసీలో చేర్చేస్తామని ప్రకటించి వారి ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు నేడు మాట మారుస్తున్నారని, దాన్ని ప్రశ్నించిన కాపులను తీవ్రవాదులుగా పరిగణిస్తున్నాడని ముద్రగడ అన్నారు. కాపులను బీసీల్లో చేర్చడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని ఆయన అన్నారు. తాము సత్యాగ్రహ యాత్ర చేపడితే దానిని అడ్డుకునేందుకు 9 వేల మంది పైచిలుకు పోలీసులను కాపుల ఇళ్ల వద్ద ఉంచి గృహనిర్భంధించడం ఎంతవరకు సమంజసమన్నారు. హైకోర్టు పాదయాత్రకు ఒప్పుకున్నా ప్రభుత్వం అడ్డుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. తాము సంఘవిద్రోహశక్తులం కాదని, మేమూ భారతదేశంలోనే పుట్టామని, భారత రాజ్యాంగం తమకూ వర్తిస్తుందన్నారు. అంతే తప్ప ప్రత్యేక చట్టం ఉన్నట్లు, ఈ దేశం కాదన్నట్లు చంద్రబాబు వ్యవహారశైలి కన్పిస్తున్నదని ముద్రగడ విమర్శించారు. ఏది ఏమైనా తమ జాతి సంక్షేమం కోసం చేపట్టిన ఉద్యమం ఎన్ని అడ్డంకులు కల్పించినా ఆగే ప్రసక్తేలేదని ముద్రగడ స్పష్టం చేశారు. కాపులంతా డిసెంబర్ 18 నుంచి అంచెలంచెలుగా ఉద్యమం చేపడతారని, తాను కూడా ఏదో ఒక జిల్లాలో ఉద్యమంలో పాల్గొంటానన్నారు. తాము ఉద్యమం చేసే తీరును కూడా ప్రభుత్వానికి వివరించామని, అవసరమైతే తమ చేతులకు బేడీలు వేసుకొని, కళ్లకు గంతలు కట్టాలని కూడా చెప్పామన్నారు. మంజునాథ కమిటీ ఎదుట బీసీ కులస్తుల వాదనలు అయిన తరువాత గాని, ముందుగాని తమకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే కోరామన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కాపు జేఏసీ ప్రతినిధులు వాసిరెడ్డి ఏసుదాసు, ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీ, కందుల దుర్గేష్, మలకల చంటిబాబు, నర్సే సోమేశ్వరరావు, ఆరేటి ప్రకాశరావు, కోట శ్రీనివాసరావు, పబ్బినీడి మణివిజయ్, రొక్కం సూర్యప్రకాశరరావు, సంజీవ్‌కుమార్, చిన్నమిల్లి రాయుడు తదితరులతో పాటు 13 జిల్లాల కాపు జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆ హామీ ఏమైంది?
శ్రీకాకుళం పాతబస్టాండ్: కాంట్రాక్టు లెక్చరర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు అధికారం కోసం ఇచ్చిన హమీలు ఏమయ్యావని ప్రశ్నించారు. ప్రభుత్వ కళాశాలల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులు కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ శిబిరాన్ని సందర్శించిన వైఎస్ఆర్ సీపీ నేతలు వారికి పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ కాంట్రాక్టు అధ్యాపకుల ఆవేదనలో న్యాయం ఉందన్నారు. ఎంతో సహనం, ఓర్పుతో ఇన్నాళ్లు ఉన్నారని, వీరి డిమాండ్ల పరిష్కారంతో ప్రభుత్వకి నష్టం ఉండదన్నారు. ఇప్పటికే గత ప్రభుత్వాలు మూడు దశల్లో వీరికి న్యాయం చేస్తూ కొంత భద్రత కల్పించుకుంటూ వచ్చాయన్నారు. ఈ ప్రభుత్వం కూడా పదో వేతన సవరణతో పాటు జీతాలు పెంచాల్సి ఉందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హమీల మేరకు వీరందరినీ క్రమబద్ధీకరణ చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా ముఖ్యమంత్రి ఖాతరు చేయకపోవడం దారుణమన్నారు. 16 ఏళ్లుగా సేవలు చేరుుంచుకొని ఇప్పటికీ రెగ్యులర్ చేయకపోతే ఈ వర్గాన్ని కూడా చంద్రబాబు మోసం చేసినట్టేనని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి ప్రజా సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేదన్నారు. అశలు పెట్టడం, తరువాత ఆర్థిక పరిస్థితి బాగోలేదని మోసపూరిత మాటలు చెప్పడం అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వంలో సంక్షేమాలన్నీ కిరికిరి (జన్మభూమి) కమిటీలకు అప్పజెప్పారని, కలెక్టర్, ఉన్నతాధికారులు సైతం పేదవాడికి పింఛను మంజూరు చేసే స్థితిలో లేరన్నారు. అధికారులు చేయలేక, లబ్ధిదారులను కిరికిరి కమిటీల వద్దకు వెళ్లాలని చెబుతున్నారని.. ఆ మాటలు చెప్పేందుకు ఐఏఎస్ అధికారి అవసరం లేదని క్లర్కు చాలన్నారు. ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి లేదు పండించిన ధాన్యాన్ని రైతులు అమ్ముకొనే పరిస్థితి జిల్లాలో లేదని ధర్మాన అన్నారు. మద్దతు ధర లేక బస్తా రూ. 800 చొప్పున దళారులకు అప్పగించాల్సిన దయానీయ పరిస్థితి ఉందన్నారు. పనికి మాలిన కార్యక్రమాలకు కొట్లాది రూపాయలు ఖర్చు చేసిన చంద్రబాబు మేధావుల బతుకు తెరువుకు ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు. రానున్న బడ్జెట్ సమావేశంలో ఈ ప్రస్తావనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తీసుకువచ్చేలా ఆయన దృష్టికి తీసుకెళ్తానని కాంట్రాక్టు లెక్చరర్లకు హామీ ఇచ్చారు. అలాగే జగన్‌ను కలిసేందుకు సహకరిస్తానన్నారు. మేధావులకు గౌరవం లేదు:రెడ్డి శాంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ జాతి గర్వపడే ఉద్యోగంలో ఉన్న మేధావులకు ఈ రాష్ట్రంలో కనీస గౌరవం లేదన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటీ నెరవేర్చకుండా అన్ని వర్గాలను మోసం చేశారన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంవీ పద్మావతి, పార్టీ డాక్టర్ సెల్ జిల్లా అధ్యక్షుడు పైడి మహేశ్వరరావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రధాన రాజేంద్రప్రసాద్, పొందూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ కె.సారుుకుమార్ మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి టి కామేశ్వరి, నాయకులు అందవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, మండవల్లి రవి, శ్రీకాకుళం పట్టణ పార్టీ అధ్యక్షుడు సాధు వైకుంఠరావు పాల్గొన్నారు. వచ్చే నెల 2న చలో విజయవాడ కాంట్రాక్టు లెక్టరర్ల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం దిగివచ్చే వరకూ పోరాటం ఆగదన్నారు. వచ్చే నెల రెండో తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్టు పేర్కొన్నారు. ధర్నాలో సంఘ ప్రతినిధులు కె.ఎస్.యాదవ్, హనుమంతు రాంమోహన్ దొర, కె.నర్సింగరావు, ఐ.వేణుగోపాలరావు, చౌదరి నగేష్, డి.లక్ష్మున్నాయుడు పాల్గొన్నారు. -
తుందుర్రులో 144 సెక్షన్ ఎత్తేయాలి: YSRCP
-
నేటి నుంచి ఎల్పీజీ డీలర్ల ఆందోళన
కల్లూరు : ఎల్పీజీ డీలర్లు శనివారం నుంచి ఆందోళన చేయనున్నారని ఫెడరేషన్ ఆప్ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ ఇండియా కర్నూలు జిల్లా శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. సరైన తూకం, కంపెనీ సీల్‌తో సిలిండర్‌ను పంపిణీ చేయాలనే డిమాండ్లను నెరవేర్చాలని ఆందోళన చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 5న నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయడం, 15న నల్ల బ్యాడ్జిలు ధరించడంతోపాటు ఒక రోజు ఇండెంట్ సప్లయ్‌ను నిలిపివేయడం చేస్తామని తెలిపారు. డిసెంబర్ 1వ తేదీన ఒక రోజు పూర్తి కాలం సమ్మె, డిసెంబర్ 15 నుంచి నిరవధి సమ్మె చేస్తామని పేర్కొన్నారు. -
హోంగార్డులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి
-
పోరాటాలతోనే హక్కులు సాధించుకోవాలి
కాకినాడ కల్చరల్: అ ణగారిన వర్గాల ప్రజ లు ప్రజా పోరాటాల తోనే హక్కులు సా ధించుకోవాలని అణగారిన కులాల సమా ఖ్య (డీసీఎఫ్) రాష్ట్ర అ ధ్యక్షుడు దోనం నీలకంఠం అన్నారు. స్థానిక ఆనంద భారతి గ్రౌండ్లో బొజ్జా తారకం ప్రాంగణంలో డీసీఎఫ్ ఆధ్వర్యంలో అణగారిన ప్రజాపోరు సభ సోమవారం జరిగింది. ముందుగా అంబేడ్కర్, పూలే, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సభకు డీసీఎఫ్ జిల్లా అధ్యక్షుడు డోకుబుర్ర భద్రం (మాస్టార్) అధ్యక్షత వహించారు. అంబేడ్కర్ లండన్ గ్రంథాలయంలో చదివి సముపార్జించిన జ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో దళితుల సంక్షేమానికి వినియోగించారని మరో అతి థిగా విచ్చేసిన రాషీ్ట్రయ దళిత సేవ జాతీయ నాయకులు జేబీ రాజు అన్నారు. దళితులకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదని దళిత బహుజన నేత నల్లా సూర్యప్రకాశరావు అన్నారు. ఐక్యతతో ప్రజా పోరాటం చేస్తేనే అణగారిన వర్గాలు ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తాయని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పంపన రామకృష్ణ అన్నారు. పలువురు ప్రముఖులకు సన్మానాలు చేశారు. ముందు భానుగుడి సెంటర్ నుంచి ఆనందభారతి వేదిక వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రజా గాయకులు జయరాజ్, బహుజన కళామండలి సభ్యుల నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. గుడాల కృష్ణ, కొత్తపల్లి కిషోర్‌కుమార్, నామాల సత్యనారాయణ పాల్గొన్నారు. -
అందరి డిమాండ్లు నెరవేర్చడం అసాధ్యం
♦ కోట్‌పల్లి మండలం ఏర్పాటుపై మరోసారి సీఎంకు విన్నవిస్తా ♦ ఆసరా ఫింఛన్ల అవకతవకల్లో బాధ్యులపై చర్యలు ♦ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తాండూరు: జిల్లాల పునర్విభజనలో భాగంగా అందరి డిమాండ్లను నెరవేర్చడం ప్రభుత్వానికి సాధ్యం కాదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. తాండూరులో శుక్రవారం జరిగిన ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి అభివృద్ధి సంఘం సమావేశానికి మంత్రి హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చేవెళ్లను జిల్లా కేంద్రం, మెయినాబాద్, షాబాద్ తదితర ప్రాంతాలను శంషాబాద్ జిల్లాలో విలీనం చేయాలని స్థానిక ప్రజలు చేస్తున్న ఆందోళనలపై విలేకరులు మంత్రిని ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లా కేంద్రం చేయాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉందని, దీనికి అనుగుణంగా ప్రభుత్వం జిల్లాగా ఏర్పాటు చేసిందన్నారు. చేవెళ్లను చేయాలని ప్రజలు కోరడం తప్పు కాదని, అందరి డిమాండ్లను నెరవేర్చడం సాధ్యం కాదన్నారు. కోట్‌పల్లిని మండలంగా చేయాలని మొదట తానే ప్రతిపాదించినట్టు చెప్పారు. 30-35 వేల జనాభా ఉంటే మండలంగా చేయడానికి వీలుందని, కోట్‌పల్లిలో 1 8వేల జనాభా మాత్రమే ఉందన్నారు. మండలం కాకుండా తాను అడ్డుపడ లేదన్నారు. బంట్వారం మండలం నుంచి చుట్టు పక్కల గ్రామాలను కలిపి కోట్‌పల్లిని మండలంగా ఏర్పాటు చేయడానికి మరోసారి సీఎం కేసీఆర్‌కు విన్నవిస్తానన్నారు. తాండూరు మున్సిపాలిటీలో ఆసరా పింఛన్ల అవకతవకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరున్నా తప్పకుండా చర్యలు ఉంటాయన్నారు. పక్కదారి పట్టిన ఫించన్ డబ్బులను రికవరీ చేయడంతోపాటు బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ వ్యవహారంపై సీబీసీఐడీ విచారణకు ప్రభుత్వానికి లేఖ రాస్తానని మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి ప్రకటించడాన్ని మంత్రి స్వాగతించారు. -
ఉద్యోగ భద్రత కల్పించాలి
ఏయూక్యాంపస్: విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భత్రద కల్పించాలని ఆంధ్రవిశ్వవిద్యాలయం బోధనేతర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వాక కోటిరెడ్డి అన్నారు. స్వార్వత్రిక సమ్మెలో భాగంలో శుక్రవారం ఉదయం ఏయూ పరిపాలనా భవనం వద్ద నిరసన వ్యక్తం చేశారు. పెన్షన్విధానంలో పాత పద్దతిని అనుసరించాలని డిమాండ్ చేశారు. టైంస్కేల్, 28 రోజుల విధానంలో పనిచేస్తున్న వారికి రెగ్యులర్ చేయాలన్నారు. కరువు భత్యాన్ని రాష్ట్ర్ర ప్రభుత్వం కాలానుగుణంగా ప్రకటించాలని కోరారు. వర్సిటీ ఉద్యోగులకు హెల్త్ కార్డులు అందించాలని, ఎల్‌టిసి సదుపాయం కల్పించాలని, జిఓ 90 రద్దు చేయాలని, ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇవ్వాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ వ్యతిరేక విధానాలు విడనాడాలన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేస్తూ, ప్రై వేటు విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయన్నారు. విద్య అందరికీ చేరువ కావాలంటే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు పరిపుష్టి సాధించాలన్నారు. విశ్వవిద్యాలలయలలో నూతన కోర్సులు ప్రవేశ పెడుతూ విద్యార్థుల సంఖ్య పెరుగుతోందన్నారు. దీనికి అనుగుణంగా బోధనేతర ఉద్యోగుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పాలక మండలి సభ్యులుగా బోధనేతర సిబ్బందికి ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. ఉద్యోగులు సమస్యను పరిష్కరించే దిశగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఏయూఈయూ చైర్మన్ శ్రీనివాస్, ఉపాద్యక్షుడు బి.తాతారావు, ప్రదీప్, బాబా, హాస్టల్ ఉద్యోగుల సంఖ్య అద్యక్షుడు ఓమ్మి అప్పారావు, చైర్మన్ చద్రశేఖర రెడ్డి, సి.హెచ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
డిమాండ్ల అంగీకారం అభినందనీయం
సిద్దిపేట జోన్: బీడీ కమీషన్‌దారుల డిమాండ్లను యాజమాన్యాలు అంగీకరించడం అభినందనీయమని ఆ సంఘం మెదక్ జిల్లా గౌరవ అధ్యక్షుడు సిరాజుద్దీన్ అన్నారు. గురువారం సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రెండు రోజులుగా నిజామాబాద్‌లో బీడీ కమీషన్ దారుల డిమాండ్లపై కార్మిక సంఘాలు, యాజమాన్యాల మధ్య చర్చలు జరిగాయన్నారు. ప్రస్తుతం ఇస్తున్న కమిషన్ కంటే అదనంగా చెల్లించేందుకు యాజమాన్యాలు ముందుకు రావడం జరిగిందన్నారు. అదేవిధగా గుర్తింపు కార్డులు అందజేయడానికి వారు ఒప్పు కోవడం జరిగిందన్నారు. సమావేశంలో సీపీఐ నాయకులు ఎక్బాల్, శోభన్, పాషా తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణాంతక వ్యాధులకు ఆరోగ్యశ్రీలో వైద్యసేవలందించాలి
రావులపాలెం: డెంగీ వంటి ప్రాణాంతక వ్యాధులకు ఆరోగ్యశ్రీలో వైద్యసేవలందించాలని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. కొత్తపేట నియోజకవర్గంలోని దేవరపల్లి, రావులపాలెం, నార్కెడిమిల్లి, వానపల్లి తదితర గ్రామాల్లో విషజ్వరాలు ప్రబలడంతో బాధితులు పలువురు రాజమహేంద్రవరంలోని వివిధ ప్రవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిని ఆదివారం ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆయా ఆస్పత్రుల్లో పరామర్శించారు. వారిS ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వారు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచిం చారు. రెండు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఎనిమిది మందిని ఆయన పరామర్శించారు. అనంతరం రావులపాలెం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలాంటి డెంగీ కేసులు నమోదు కాలేదని చెబుతున్న వైద్యులకు ఇంత మంది ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరుతున్నప్పటికీ విషయం తెలియడం లేదా అని ప్రశ్నించారు. గోపాలపురం, ఊబలంక, ర్యాలి, ఆత్రేయపురం, వానపల్లి, అవిడి పీహెచ్‌సీల పరిధిలో డెంగీ కేసులను గుర్తించలేదని వైద్యులు చెప్పడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. ప్లేట్లెట్ల సంఖ్య పడిపోయి ప్రాణాపాయ స్థితిలో చాలా మంది ప్రైవేట్ ఆస్పతుల్లో చేరుతున్నారన్నారు. ఒక్కొక్కరికీ సుమారు రూ.60 వేల వరకూ ఖర్చు అవుతోందన్నారు. బాధితుల్లో అధికశాతం పేద, మధ్యతరగతి వారే కావడంతో వారికి వైద్య ఖర్చులు తలకు మించిన భారంగా మారుతున్నాయన్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు జ్వరాల బారిన పడితే వారు అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. డెంగీ వంటి ప్రాణాంతక వ్యాధులకు ఆరోగ్యశ్రీలో చోటు కల్పించాలని కోరుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావుకు లేఖరాస్తానని ఆయన అన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం డెంగీ తదితర జ్వరాలకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్యసేవలు ప్రభుత్వాస్పత్రుల్లో అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో అంతాబాగుందని మంత్రి కామినేని చెబుతున్నారని, ఎవరూ రాకపోతే అంతా బాగానే ఉంటుందని అన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో జ్వరాల తీవ్రతపై ఆయన ఫోన్లో డీఎంఅండ్హెచ్ఓతో మాట్లాడారు. వెంటనే ఆయా గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి జ్వరాలను అదుపు చేయాలని సూచించారు. అధికారులు గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, ఎంపీపీ కోట చెల్లయ్య, పార్టీ జిల్లా కార్యదర్శి గొలుగూరి మునిరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు కొండేపూడి రామకృష్ణ, బొక్కా ప్రసాద్, అప్పారి విజయకుమార్, సీహెచ్ సూర్యనారాయణ తదితరులు ఉన్నారు. -
జర్నలిస్టులకిచ్చిన హామీలు నెరవేర్చాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : జర్నలిస్టులకిచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ అనుబంధం) జిల్లా అధ్యక్షుడు జి.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ల సాధన కోసం సోమవారం కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సా«దనలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందన్నారు. ఆందోళనలో భాగంగా త్వరలో జాతీయ రహదారిని దిగ్బంధిస్తామన్నారు. జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు, డబుల్బెడ్రూం ఇళ్లు, హె ల్త్కార్డులు మంజూరు చేయాలన్నారు. అనంతరం డీఆర్ఓ భాస్కర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు కిషన్‌రావు, వెంకటేశ్వర్లు, యాదగిరి, జకీ, సుభాశ్‌రెడ్డి, రఘు పాల్గొన్నారు. -
హామీలను విస్మరించిన సర్కార్
రెండో ఏఎన్ఎంల డిమాండ్లు పరిష్కరించాలి సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కరాములు సంగారెడ్డి జోన్: వైద్యశాఖలో పని చేస్తున్న రెండో ఏఎన్ఎంలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కరాములు అన్నారు. సంగారెడ్డిలోని డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట రెండో రోజు జరిగిన ముట్టడి కార్యక్రమానికి చుక్కరాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 18 నుంచి ఆందోళన నిర్వహిస్తున్నా పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. జీవో 14 ప్రకారం పెంచిన వేతనాలను రెండో ఏఎన్ఎంలకు వర్తింపజేయాలన్నారు. రెగ్యులరైజేషన్, వేతనాల పెంపు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లికార్జున్, జిల్లా అధ్యక్ష,ప్రధానకార్యదర్శులు మల్లేషం, రాజయ్య, బాలమణి, నర్సమ్మ, రెండవ ఏఎన్ఎం నాయకులు వినోద, విజయలక్ష్మి, పద్మ, కృష్ణవేణి, సంగీత తదితరుల పాల్గొన్నారు. -
మెడికల్ రిప్స్ నిరసన దీక్ష
భీమవరం: తమకు కనీస వేతనాలు నిర్ణయించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, దీంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్‌జీయూడీ కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. యూనియన్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం మెడికల్ రిప్స్ నిరాహార దీక్ష చేపట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, తమకు కనీస వేతనాలు నిర్ణయించాలని కోరారు. సేల్స్ ప్రమోషన్ చట్టాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భీమవరంశాఖ అధ్యక్షుడు సీహెచ్‌ఎన్‌ఎం మురళీ ప్రసాద్ మాట్లాడుతూ మెడికల్ రిప్స్‌లో మహిళలకు ప్రసూతి సెలవులు ఆర్నెల్లు ప్రకటించాలని, మేడే సెలవు ఇవ్వాలని కోరారు. దీక్షలో ఎస్.శిరీష్‌కుమార్, కెఎంఎస్‌సీ రాజు, బాలకృష్ణ, పవన్‌కుమార్ తదితరులు కూర్చున్నారు. సీఐటీయూ నాయకుడు వాసుదేవరావు, స్కూల్ బస్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ దీక్షకు మద్దతు తెలిపారు. -
డిమాండ్ల సాధనకు నిరాహారదీక్ష
మచిలీపట్నం సబర్బన్ : దీర్ఘకాలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆగస్టు 1వ తేదీ సోమవారం పెనమలూరులోని రాష్ట్ర మత్య్సశాఖ కమిషనర్‡ కార్యాలయం వద్ద ఒక్క రోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మత్య్స కార్మిక సంఘం మచిలీపట్నం డివిజన్ కార్యదర్శి ఒడుగు గంగాధరప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామంటూ ఎన్నికల్లో కల్లబొల్లి కబుర్లు చెప్పి గద్దెనెక్కిన తరువాత పాలకులు ఆ విషయాన్ని మర్చిపోతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి కోట్లాది రూపాయల ఆధాయాన్ని ఇచ్చే మత్య్సకారులను ఇబ్బందులకు గురి చేయటం తగదన్నారు. దీనికి నిరసనగా చేపట్టే నిరాహార దీక్షకు మత్య్సకారులందరూ హాజరై జయప్రదం చేయాలని ఆయన కోరారు. -
ప్రభుత్వాల దిమ్మ తిరగాలి
(విజయవాడ) గాంధీనగర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిమ్మ తిరిగేలా దేశవ్యాప్త సమ్మె చేపట్టాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. 12 డిమాండ్ల సాధన కోసం సెప్టెంబర్ 2న చేపడుతున్న దేశవ్యాప్త సమ్మెను బలపరుస్తూ కార్మిక సంఘాల జిల్లా సదస్సు తీర్మానం చేసింది. శుక్రవారం విజయవాడ స్థానిక హనుమంతరాయ గ్రంథాలయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 2న జరపతలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కార్మిక సంఘాల సన్నాహక సదస్సు జరిగింది. సదస్సులో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ కార్మికుల హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయన్నాయని, కనీస వేతనం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. సదస్సులో పాల్గొన్న వైఎస్సార్ ట్రేడ్‌యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి మాట్లాడుతూ కార్మికుల శ్రేయస్సును దెబ్బతీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. కార్మికులు సమ్మె చేస్తే వారికి రూ. 6లక్షల వరకు జరిమానా విధించేలా చట్టాలను సవరించడం దుర్మార్గమన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ. 18వేలు కావాలని డిమాండ్ చేస్తే పట్టించుకునే నాథుడే లేడన్నారు. ఎన్నికల తర్వాత బీజేపీ, టీడీపీ ప్రభుత్వాల నిజస్వరూపం బట్టబయలైందన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబు రెండేళ్లుగా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. పైగా నిరుద్యోగులు వ్యవసాయం చేసుకుందామనుకుంటే భూములు లేకుండా గుంజుకుంటున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15లక్షల ఎకరాల భూమిని లాక్కø్కవడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. కార్మికులు, నిరుద్యోగులు చంద్రబాబు ప్రభుత్వం మెడలు వంచి హక్కులు సాధించుకోవాలన్నారు. కార్మికుల సెస్సుతో సొంత ప్రచారమా..? ఎఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు చలసాని రామారావు మాట్లాడుతూ భవననిర్మాణ కార్మికుల సంక్షేమానికి వసూలు చేస్తున్న సెస్సును చంద్రన్నబీమా పేరుతో సొంత ప్రచారానికి విచ్చలవిడిగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఆగస్టు 9న జిల్లా కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలని కోరారు. ఈ సదస్సులో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, కె రామారావు (ఇఫ్టూ), మాదు శివరామకృష్ణ (వైఎస్సార్‌టీయూ) గర్రె వరప్రసాద్ (ఐఎన్టీయూసీ), పి ప్రసాద్ (ఇప్టూ), మీర్‌హుస్సేన్ (హెఎంఎస్), వెంకటసుబ్బయ్య, నరసింహారావు, ఎన్సీహెచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పదవికీ రాజీనామా చేయండి
పదవుల కోసం పార్టీమారే రకం ఎమ్మెల్సీ ఆదిరెడ్డి వైస్సార్ సీపీ నగర కోఆర్డినేటర్ రౌతు ధ్వజం సాక్షి, రాజమహేంద్రవరం : ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు నీతి, నిజాయితీతో పాటు విలువలకు కట్టుబడి ఉంటే తన పదవికి రాజీనామా చేసి, పార్టీ మారాలని వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం కోఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు డిమాండ్ చేశారు. ఆంధ్రకే సరి టంగుటూరి, ఏబీ నాగేశ్వరరావు వంటి నేతలు విలువలతో కూడిన రాజకీయం చేసిన చరిత్ర రాజమహేంద్రవరం నగరానిదని గుర్తు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడికి పంపారు. ఈ నేపథ్యంలో బుధవారం వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, నేతలతో కలసి రౌతు సూర్యప్రకాశరావు స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. అప్పట్లో మంత్రి పదవులకు రాజీనామా చేసిన కొండా సురేఖ, పిల్లి సుభాష్ చంద్రబోస్ వంటి సీనియర్ నేతలున్నా, బలహీన వర్గాలకు పార్టీలో పెద్దపీట వేయాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో నమ్మకంతో పార్టీ ఆవిర్భవించాక తొలి ఎమ్మెల్సీ పదవిని ఆదిరెడ్డికి ఇస్తే, నమ్మకద్రోహం చేశారని మండిపడ్డారు. ఆయన చెప్పిన వారికే జగన్మోహన్రెడ్డి పార్టీ పదవులు ఇచ్చారని, ఏం అన్యాయం చేశారో ఆదిరెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. మేయర్‌పదవి ఇచ్చిన టీడీపీని అప్పుడు, ఎమ్మెల్సీని చేసిన వైఎస్సార్ సీపీని ఇప్పుడు వదిలి, మరో పదవి కోసం తిరిగి టీడీపీలోకి వెళుతూ రాజకీయాలను భ్రష్టు పట్టించారని విమర్శించారు. పదవులు ఇస్తాన ంటే వెళ్లిపోతానన్నట్టుగా ఆయన తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఆదిరెడ్డి వెళ్లిపోవడం వల్ల పార్టీకి మేలు జరుగుతుందని, గ్రూపు రాజకీయాలకు ఇకపై తావుండదని పేర్కొన్నారు. ఆదిరెడ్డి రాకతో పార్టీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోతాయని టీడీపీలో సీనియర్ ఎమ్మెల్యే అయిన గోరంట్ల బుచ్చయ్యచౌదరి కంగారు పడుతుండడం ఆదిరెడ్డి వ్యవహార శైలికి నిదర్శనమన్నారు. కాల్‌మనీ వ్యవహారంలాగా తన వద్ద రుణం తీసుకున్న నేతలను పార్టీ మారేలా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పదవుల దాహంతో పరితపిస్తున్న అప్పారావుకు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారన్నారు. 2019లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నేతలందరినీ ఏకతాటిపై నడిపిస్తానని పేర్కొన్నారు. త్వరలోనే పార్టీ కార్యాలయం ప్రారంభిస్తామని చెప్పారు. నగరపాలక సంస్థలో పార్టీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ గుత్తుల మురళీ«దర్, కార్పొరేటర్లు బొంత శ్రీహరి, పిల్లి నిర్మల, మజ్జి నూకరత్నం, పార్టీలో వివిధ విభాగాల నేతలు అడపా హరి, మూర్తి నాగేశ్వరరావు, సుంకర చిన్ని, పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, గడ్డం రమణ, లంక సత్యనారాయణ, మజ్జి అప్పారావు, మూర్తి నాగేశ్వరావు, కానుబోయిన సాగర్, వాకచర్ల కృష్ణ, గారాల శ్రీను, కేబుల్ శ్రీను, తాతబ్బాయి, ముత్యాల పెదబాబు, రఘునరేష్ పాల్గొన్నారు. -
టీడీపీపై బీజేపీ యుద్ధం
-
దయ చూపని ఢిల్లీ ప్రభుత్వం!
న్యూఢిల్లీః సహాయం అడిగితే చీదరింపులు ఎదురయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి 'వీల్స్' అరిగేలా తిరిగినా ఉపయోగం లేకపోయింది. చివరికి సీఎంనే కలసి తన గోడు వెళ్ళబోసుకుందామనుకున్న వికలాంగ వ్యక్తికి... అక్కడా కనికరం కలుగలేదు. తన వీల్ ఛైర్ విరిగిపోయిందని, కొత్త ఛైర్ కొనిమ్మని ఢిల్లీ పెద్దల కాళ్ళా వేళ్ళా పడినా పట్టించుకున్నవారే లేకపోయారు. దేశ రాజధాని నగరంలో ఓ వికలాంగ వ్యక్తికి ఎదురైన ఛీత్కారాలు సాధారణ ప్రజలకు, చూపరులకు ఆందోళన కలిగించాయి. కొత్త వీల్ ఛైర్ కోసం ఆరు నెలలపాటు ఎక్కిన గుమ్మం ఎక్కకుండా తిరిగినా అధికారుల మనసు కరుగలేదు. రెండుకాళ్ళూ లేక వీల్ ఛైరే ఆధారంగా బతుకుతున్న రాజా.. తకు కొత్త వీల్ ఛైర్ కావాలంటూ సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్నో అర్జీలు పెట్టుకున్నాడు. అయతే ప్రభుత్వంనుంచి ఎటువంటి సమాధానం దొరకలేదు. చివరికి పెద్ద బాస్ (సీఎం కేజ్రీవాల్) నే కలసి తన బాధను వివరిద్దామనుకున్నాడు. అక్కడకూడా తీవ్ర అవమానాలను ఎదుర్కొన్న రాజా.. చివరికి చేసేది లేక వెనుదిరిగాడు. అనంతరం రాజా కష్టాలను విన్న ఓ మనసున్న మారాజు అతడికి వీల్ ఛైర్ ను బహూకరించాడు. ఢిల్లీ పౌరుడు, ఫిల్మ్ మేకర్.. గౌరవ్ ఆగ్రే బహూకరించిన ఛైర్ తో అతని కళ్ళలో చూసిన ఆనందాన్ని వర్ణిస్తూ అతడి ఫొటోలను గౌరవ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. -
ఆ న్యాయమూర్తులను ఏపీకి ఇవ్వండి
-ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ డిమాండ్ హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతానికి చెందిన న్యాయమూర్తులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలని ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ డిమాండ్ చేసింది. సీమాంధ్ర ప్రాంత న్యాయమూర్తులారా క్విట్ తెలంగాణ అనే నినాదంతో ఫెడరేషన్ బుధవారం పోస్టర్‌ను ఆవిష్కరించింది. తెలంగాణకు వెంటనే హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి న్యాయవాదికి ఆరోగ్య భద్రత కార్డు, ఇళ్ల స్థలాలు, జూనియర్ న్యాయవాదులకు ఐదేళ్ల వరకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం, సంక్షేమ నిధిని రూ.100 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పెంచాలని అన్నారు. నేర విచారణ చట్టం సెక్షన్ 41(ఎ) నేరస్తులకు మేలు చేకూర్చే విధంగా ఉందని, ఈ సెక్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ లను కలిసి వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. -
హోదా సాధించు లేదా వైదొలుగు: సీపీఐ
సీఎం చంద్రబాబు ఏదో ఒకటి తేల్చుకోవాలని సీపీఐ నారాయణ డిమాండ్ హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించకుండా తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీతో అధికారం పంచుకొని కులుకుతూ ఎంజాయ్ చేస్తూ రాష్ట్రానికీ, ప్రజలకు మూడు నామాలు పెట్టాలనుకుంటున్నారా? అని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె. నారాయణ ప్రశ్నించారు. ఏపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి కె. రామకృష్ణతో కలిసి శనివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘ హోదా విషయంలో టీడీపీ అవకాశవాదాన్ని మనం చూడాలి. ఒకరికొకరు పదవులు పంచుకుంటారు. దాంట్లో ఉన్న తేనేను బాగా రుచి చూస్తారు. పిప్పిని మాత్రం ప్రజల ముఖాన పడేస్తారని సీపీఐ నారాయణ ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏ మాత్రం ఆత్మాభిమానం ఉన్నా తెలుగుదేశం పార్టీ రాజకీయంగా బీజేపీతో కలిసి నిలబడాలనుకుంటే ప్రత్యేక హోదా తెప్పించండి తీసుకరాకపోతే రాష్ట్రప్రజలను మోసం చేసిన వారవుతారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మూడు కోతుల కథ మాదిరి ఒకరు చూడవద్దంటారు, ఇంకొకరు వినవద్దంటారు, మరొకరు మాట్లాడొద్దంటారని నారాయణ అన్నారు. విభజన సమయంలో రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని వెంకయ్యనాయుడు పట్టుబట్టారని.. ఈ రోజు ఆ పార్టీ ఇవ్వమని అంటుందని తప్పుబట్టారు. ఇప్పుడు మాట మార్చడానికి వెంచయ్యనాయుడుది నాలుకా, తాటి మట్టా అని ప్రశ్నించారు. హోదా విషయంలో కేంద్రాన్ని ఒప్పించని పక్షంలో వెంకయ్య రాజీనామా చేసి ప్రజలతో కలిసి పోరాడాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్రం నుంచి వైదొలగాలన్నారు. లేనిపక్షంలో చంద్రబాబుకు, వెంకయ్యనాయుడులకు తాటాకులు కట్టి ఊరేగించే రోజు వస్తుందని హెచ్చరించారు. బిచ్చం కాదు, హోదానే కావాలి ప్రత్యేక హోదా ఇవ్వంగానీ, ఏం కావాలన్న ఇస్తామంటున్నారని.. తెలుగు ప్రజలేమీ వాళ్లను బిచ్చం అడగటంలేదన్నారు. రాజకీయ హక్కుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్రానికి 1.43 లక్షల కోట్లు ఇచ్చామని బీజేపీ నేతలు చెబుతున్నారని.. వెంకయ్యనాయుడు, మోదీ వాళ్ల అబ్బసొత్తు ఏమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. పన్నును వాళ్లు కొంత తిని, ప్రజలకు కొంత ఇస్తున్నారని నారాయణ దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా అన్నది మోదీ- బాబు ఇద్దరి వ్యవహారంగా బీజేపీ నేతలు వ్యవహరించడం సరైంది కాదని.. తెలుగు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని రామకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 17న మోదీతో భేటీ సమయంలో ప్రత్యేకహోదా సహా రాష్ట్రానికి ఇచ్చిన హామీలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఐ, ప్రత్యేక హోదా సాధన సమితి హోదా కోసం కేంద్రంతో పోరాడుతన్నట్లు తెలిపారు. -
స్పాట్ తుస్..
బెంగళూరు: డిమాండ్ల పరిష్కారానికి అధ్యాపకులు చేపట్టిన ధర్నా కొనసాగడంతో పీయూసీ జవాబు పత్రాల మూల్యాంకనం(స్పాట్ వాల్యుయేషన్) శుక్రవారం కూడా మొదలు కాలేదు.ఎట్టి పరిస్థితుల్లోనూ శుక్రవారం మూల్యాంకనం ప్రారంభమవుతుందని ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కిమ్మెన రత్నాకర్ చెప్పిన మాటలు ఆచరణలోకి రాలేదు. వివరాలు... వేతనాల పెంపు ప్రధాన డిమాండ్‌గా రాష్ట్ర ప్రభుత్వ పీయూసీ కళాశాలల అధ్యపకులు కొన్ని రోజులుగా బెంగళూరులోని ఫ్రీడం పార్కులో ధర్నా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగుసార్లు ప్రభుత్వం వారితో సమస్య పరిష్కారం కోసం చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. ఈ విషయమై ప్రైవేటు, రిటైర్డ్ అధ్యాపకులను వినియోగించి శుక్రవారం మూల్యాంకన ప్రక్రియను ప్రారంభిస్తామని కిమ్మెన రత్నాకర్ గురువారం మీడియాతో పేర్కొన్నారు. అంతేకాకుండా ద్వితీయ పీయూసీ ఫలితాలను మే 2న విడుదల చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే ప్రైవేటు ద్వితీయ పీయూసీ అధ్యాపకులు కానీ, రిటైర్డ్ అధ్యాపకులు కాని మూల్యాంకనం చేసేందుకు ముందుకు రాకపోవడంతో శుక్రవారం ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఇదిలా ఉండగా ధర్నా చేస్తున్న కొంతమంది అధ్యాపకులు అస్వస్థతకు లోను కావడంతో సహచరులు బాధితులను దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స ఇప్పిస్తున్నారు. -
మహిళల పోరుకు దన్నుగా ఆరెస్సెస్
నాగౌర్(రాజస్థాన్): మహిళలకు ఆరెస్సెస్ దన్నుగా నిలిచింది. తమకు అన్ని ఆలయాల్లోకి ప్రవేశించేందుకు అనుమతించాలని వారు చేస్తున్న డిమాండ్‌కు ఆరెస్సెస్ మద్దతు తెలిపింది. గత కొన్ని రోజులుగా నానుతున్న ఈ సమస్యపై స్పందిస్తూ దీనికి చర్చలు, పరస్పర అవగాహన ఒప్పందాలే పరిష్కార మార్గమని స్పష్టం చేసింది. అంతేకాకుండా మతపరమైన అంశాల్లో మహిళలు, పురుషులు సమానమే అంటూ కూడా ఇటీవల ఒక నివేదిక ఇచ్చింది. అసలు శబరిమలవంటి ఆలయాల్లోకి వారిని ఎందుకు అనుమతించడం లేదో, ఆ ఆలయాలకు ఉన్న సాంప్రదాయాలేమిటో అనే కారణాలను కూడా ఆరెస్సెస్ సంబంధిత జర్నల్ తెలిపింది. -
‘మళ్లీ వేతన సవరణ డిమాండ్లు పంపవచ్చు’
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సిబ్బంది సంఘాలు చేసిన న్యాయమైన సూచనలను ఏడో వేతన సంఘం ఆమోదించలేదని గుర్తించిన పక్షంలో కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, విభాగాలు తాజాగా వేతన సవరణ డిమాండ్లను చేయవచ్చు. ఇటువంటి డిమాండ్లను కేబినెట్ కార్యదర్శి సారథ్యంలోని కార్యదర్శుల సాధికార కమిటీకి సచివాలయంగా పనిచేసేందుకు ఆర్థికశాఖ నియమించిన అమలు విభాగానికి నివేదించవచ్చు. ఇంప్లిమెంటేషన్ సెల్ తొలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వోద్యోగుల వేతనాలపై ఇటీవల ఏడో వేతన సంఘం సమర్పించిన నివేదికలోని సిఫారసులను పరిశీలించి కేబినెట్ ఆమోదం కోసం పటిష్టపరచేందుకు సీఓఎస్ ఏర్పాటైన విషయం తెలిసిందే. -
'వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలి'
విజయవాడ: వీఆర్ఏలు నెలన్నరగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. తక్షణమే వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. అర్హత ఉన్న చోట పూర్తి స్థాయి ఉద్యోగులుగా వీఆర్ఏలను నియమించాలన్నారు. -
నేను ఏ వ్యక్తినీ తప్పుబట్టలేదు
-
సీబీఐతో విచారణ జరిపించాలి : కారెం శివాజీ
హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ మోసాలకు 38 మంది లక్షలు డిపాజిటర్లు మోసపోయారని అన్నారు. మొత్తం 28 వేల కోట్ల కుంభకోణం జరిగిందని శివాజీ గురువారమిక్కడ ఆరోపించారు. ఖాతాదారుల జాబితాను హైకోర్టుకు ఎందుకు సమర్పించడం లేదో సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. వెంటనే అగ్రిగోల్డ్ ఛైర్మన్, డైరెక్టర్లను అరెస్ట్ చేయాలని కారెం శివాజీ డిమాండ్ చేశారు. వరుస మీడియా కథనాలతో అగ్రిగోల్డ్ ఆస్తులను కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదని అగ్రిగోల్డ్ యాజమాన్యం ఇవాళ కోర్టుకు తెలిపింది. హైకోర్టులో ఈ రోజు మధ్యాహ్నం 2.15 గంటలకు అగ్రిగోల్డ్ కేసు విచారణ జరగనుంది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. -
ఏపీలో హోరెత్తిన అంగన్వాడీల ఆందోళనలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా అన్ని జిల్లాల్లో శుక్రవారం అంగన్వాడీ వర్కర్ల ఆందోళనలు పెల్లుబికాయి. కొత్తగా పెంచిన జీతాల జీవో వెంటనే అమలు చేయాలని... పాత బకాయి వేతనాలను విడుదల చేయాలని కోరుతూ భారీ ర్యాలీలు నిర్వహించారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని అంగన్వాడీ వర్కర్లు హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా: తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీ వర్కర్లు టెక్కిలి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కొత్తగా పెంచిన జీతాల జీవో వెంటనే అమలు చేయడంతో పాటు... పాత బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా : పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని అంగన్వాడీ వర్కర్లు ముట్టడించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో వందల సంఖ్యలో అంగన్వాడీ వర్కర్లు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. పెంచిన వేతనాలకు సంబంధించి జీవోను వెంటనే విడుదల చేయాలని, పదవీ విరమణ, పింఛను సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కృష్ణాజిల్లా: తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీ వర్కర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్ దగ్గర ఆందోళనకు దిగారు. ఐసీడీఎస్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని, కొత్తగా పెంచిన జీతాల జీవో వెంటనే అమలు చేయాలన్నారు. వైఎస్సార్ జిల్లా: జమ్మలమడుగు మండలకేంద్రంలో అంగన్ వాడీ వర్కర్లు భారీ ర్యాలీ తీశారు. ఎండీఓ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కె.వినాయక్‌కు వినతి పత్రం సమర్పించారు. అనంతపురం జిల్లా: కదిరి ఆర్డీఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్లు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లను పరిష్కారించాలని లేనిచో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కదిరి ఆర్డీఓ రాజశేఖర్‌కు అంగన్వాడీ వర్కర్లు వినతి పత్రం సమర్పించారు. -
వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎంపీ అవినాష్‌రెడ్డి
పులివెందుల: వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి గురువారం పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న వరి పంటలను ఆయన పరిశీలించారు. చక్రాయపేట మండలంలో అకాల వర్షాలకు భారీగా పంట నష్టం సంభవించింది. మండలంలో రైతులు వేల ఎకరాల్లో వరి పంటను విస్తారంగా సాగు చేశారు. పంట కోతకొచ్చే దశలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పంట మొత్తం దెబ్బతింది. దీంతో రైతులు దెబ్బతిన్న పోలాలను ఎంపీ అవినాష్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే పంట నష్టపరిహారం చెల్లించి, రైతులను ఆదుకోవాలని ఎంపీ అవినాష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
'రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి'
కమలాపురం: వైఎస్సార్ జిల్లా లోని అన్ని మండలాలను తక్షణమే కరవు మండలాలుగా ప్రకటించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లాలోని కమలాపురం మండలం గొల్లపల్లి గ్రామంలో వర్షాభావంతో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే ఎకరానికి రూ.25 వేల చొప్పున ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని రవీంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. -
రుణమాఫీ కోసం రైతుల ఆందోళన
ఖమ్మం : ఖమ్మం జిల్లా కూసుమంచిలోని ఎస్బీహెచ్ బ్యాంకు ముందు బుధవారం రైతులు ధర్నాకు దిగారు. రుణాలను ఏకమొత్తంలో మాఫీ చేయాలని, పంటల సాగు కోసం తక్షణం రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాత్రమే తాము పని చేయాల్సి ఉంటుందని, ప్రభుత్వం ఇస్తే మాఫీ చేయడానికి తమకు అభ్యంతరం ఏమీలేదని బ్యాంకు అధికారులు రైతులకు తెలిపారు. -
'ఆ 8 మందికి ఉరిశిక్ష వేయండి'
-
ప్రత్యేక హోదా అంటే కూడా తెలీదు...
-
కోలీవుడ్‌లో బంపర్ ఛాన్స్ కొట్టేసిన సమంత
-
రెండుకోట్లు డిమాండ్ చేస్తున్న శృతి ?
-
108 సిబ్బందితో మంత్రి చర్చలు
రంగారెడ్డి: తమ డిమాండ్లని పరిష్కరించాలంటూ సమ్మె చేస్తున్న108 సిబ్బందితో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా 108 సిబ్బంది తమ డిమాండ్లని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. 'కనీస వేతనంగా రూ.20వేలు అందించాలి. 2014 సమ్మె సందర్భంగా ఉద్యోగాలు కోల్పోయిన వారిని విధుల్లోకి తీసుకోవాలి. 108లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడిపించాలి. రోజు వారీగా 8గంటల పని దినాలు మాత్రమే ఉండాలి' అనే డిమాండ్లను 108 ఉద్యోగులు మంత్రి ముందుంచారు. -
రైతులను ఆదుకోండి: జానారెడ్డి
-
1న సీఎం నివాసం ముట్టడి
- డిమాండ్ల పరిష్కారం కోసం మిల్లు కార్మికుల నిర్ణయం - గ్రాంట్ రోడ్ రైల్వే స్టేషన్ నుంచి ర్యాలీ చేపట్టనున్నట్లు వెల్లడి సాక్షి, ముంబై: డిమాండ్ల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధికార నివాసం వర్షా బంగ్లాను ముట్టడించాలని మిల్లు కార్మికులు నిర్ణయించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మే ఒకటిన గ్రాంట్రోడ్ రైల్వే స్టేషన్ నుంచి ర్యాలీ గా బయలుదేరి వెళ్లి వర్షా బంగ్లాను ఘేరావ్ చేయనున్నట్లు గిరిణ కామ్‌గార్ కృతి సమితి సభ్యులు తెలిపారు. మిల్లు కార్మికులకు ఇళ్లు నిర్మించాలని, వారి సమస్యలను పరిష్కరించాలని గత కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వ హ యాంలో ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు. అయితే అప్పటి ప్రభుత్వం ఏవిధమైన చర్యలు తీసుకోలేదు. ఆ సమయంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే కార్మికుల సమస్యలు పరిష్కారిస్తామని బీజేపీ తెలిపింది. సమస్యల పరి ష్కారానికి 2015 జనవరి 20న గృహనిర్మాణ శాఖ సహాయ మంత్రి రవీంద్ర వాయ్‌కర్, అనంతరం ఫడ్నవీస్‌తో కార్మిక సంఘాల ప్రతినిధుల బృందం సమావేశమై నివేదిక సమర్పించింది. అయితే అధికారంలోకొచ్చి ఏడునెలలు అవుతున్నా ఇంతవరకు ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న కార్మికులు ఎంహెచ్ఏడీఏ వద్ద అందుబాటులో ఉన్న మిల్లు స్థలాల్లో ఇళ్లు నిర్మించే పనులు ప్రారంభించింది. ఇక్కడ సుమారు ఎనిమిది వేల ఇళ్లు లభించనున్నాయి. అలాగే ముంబై మహానగర ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) 11 వేల ఇళ్లు నిర్మించింది. మొత్తం 19 వేలకుపైగా నివాసాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. అయితే వీటిని కార్మికులకు అందజేసే విషయంపై గాని, లాటరీ వేసే విషయం గానీ ప్రభుత్వం ఇంతవరకు స్పష్టం చేయలేదు. ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న 1.48 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని కార్మిక నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. -
పరిశ్రమల ఎంఓయూ బహిర్గత పర్చాలి : ధర్మాన
-
వ్యవసాయ ఎమర్జెన్సీ ప్రకటించాలి: షబ్బీర్ అలీ
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి: పొంగులేటి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరవు పరిస్థితులు, అకాల వర్షాలతో తీవ్ర నష్టం జరి గినందుకు వ్యవసాయ ఎమర్జెన్సీ ప్రకటించాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. పార్టీ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎం.కోదండ రెడ్డితో కలసి గాంధీభవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సాగు విస్తీర్ణం తగ్గడంతోపాటు వడగండ్ల వానతో వరి, మొక్కజొన్న, పండ్లతోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నా విపత్తుల నిర్వహణ కమిటీతో సీఎం కేసీఆర్ ఎందుకు సమావేశం కాలేదని ప్రశ్నిం చారు. 700 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నా ఎందుకు పరిహారం ఇవ్వడంలేదన్నారు. సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ నిధి కోసం రూ.500 కోట్లను విడుదల చేయాలని కోరారు. పంట బీమాపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని కాంగ్రెస్ కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి డిమాండ్ చేశారు. -
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
-
పోలీసులకు ఆధునిక ఆయుధాలనివ్వాలి : కిషన్‌రెడ్డి
-
భరోసా ఇవ్వండి
సిరిసిల్ల : వస్త్రోత్పత్తి కార్మికులు రేరుుంబవళ్లు రెక్కలుముక్కలు చేసుకుంటూ కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. అరకొర కూలితో దిక్కుతోచక శాశ్వత ఉపాధి మార్గాల కోసం దిక్కులు చూస్తున్నారు. మరోవైపు సిరిసిల్లలో ఏ కార్ఖానాలో ఎంతమంది పనిచేస్తున్నారో... ఎంత వస్త్రం ఉత్పత్తవుతుందో... ఎవరివద్దా లెక్కల్లేవు. భవిష్యత్‌పై భరోసా కోసం కార్మికులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వస్త్ర పరిశ్రమపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో జౌళిశాఖ అధికారులు, సిరిసిల్ల ప్రతినిధులతో సోమవారం ఉన్నతస్థారుు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కార్మికుల డిమాండ్లు వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు నమ్మకమైన ఉపాధికి భరోసా కావాలి. కార్మికులు పనిచేసే కార్ఖానాలో గుర్తింపు కార్డు విధిగా ఇవ్వాలి. కార్మిక చట్టాల ప్రకారం ప్రతీ కార్మికునికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. కార్మికుడి ఆదాయంలో ఎనిమిది శాతం మేర పొదుపు చేయాలి. ఒక్కో కార్మికుడు నెలకు రూ.6 వేలు ఆ దాయం పొందితే అందులో ఎనిమిది శాతం అంటే రూ.500 మినహాయించి పీఎఫ్ ఖాతా కు జమ చేయాలి. అంతే మొత్తంలో ప్రభుత్వం జమ చేస్తుంది. అంటే నెలకు రూ.వెయ్యి చొప్పున కార్మికుడి కి జమ అవుతుంది. ఏడాదికి రూ.12 వేల చొప్పున కార్మికునికి భవిష్య నిధి జమ అవుతుంది. ఐదారేళ్లలో పెద్దమొత్తంలో రూ.60 వేల నుంచి రూ.80 వేల వర కు కార్మికునికి ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. ఇలా పొదుపు చేసిన డబ్బు కార్మికుడి అవసరాల కు ఉపయోగపడుతుంది. గుర్తింపు కార్డు మూలంగా ప్రమాద బీమా, హెల్త్‌కార్డ్స్ వంటివి జారీ చేయడంతోపాటు కార్మికుడి భార్య, కూతురు ప్రసూతికి ఆర్థికసాయం అందుతాయి. మరోవైపు ఏటా బోనస్ ల భించేలా ఏర్పాటు చేయాలి. అసంఘటిత రంగంగా ఉన్న వస్త్ర కార్మికులను ఆసాముల యజమానులతో కలిపి సంఘటిత రంగంగా మార్చాలి. వేజ్‌బోర్డు, వెల్ఫేర్ బోర్డులను ఏర్పాటు చేసి ప్రభుత్వ అజమాయిషీలో వేతన ఒప్పందాలు జరగాలి. సిరిసిల్ల వస్త్రానికి గుర్తింపు రావాలి సిరిసిల్లలో తయారువుతున్న అన్ని రకాల వస్త్రాలను ముతక రకంగానే మార్కెట్‌కు తరలిస్తున్నారు. 34 వేల మరమగ్గాలున్న సిరిసిల్లలో 25 వేల మంది కార్మికులు పని చేస్తున్నా అధికారికంగా ఎక్కడా ఆ వివరా లు రికార్డు కాలేదు. ఉత్పత్తవుతున్న వస్త్రం వివరాలు ఎక్కడా నమోదు కావడం లేదు. టెక్స్టైల్ పార్క్ సహా ఏ కార్ఖానాలోనూ ఇంతమొత్తంలో వస్త్రం ఉత్ప త్తి చేస్తున్నామని రికార్డుల్లో రాయడం లేదు. ఎంతమేర జీతాలుగా చెల్లిస్తున్నారో నమోదు చేయడం లేదు. చట్టబద్ధంగా ఎగుమతులు, వచ్చే ఆదాయం, జరుగుతున్న ఖర్చుల వివరాలు రికార్డు చేయాల్సి ఉండగా, సిరిసిల్లలో అలా జరగడం లేదు. ఫలితంగా సిరిసిల్ల వస్త్రానికి గిట్టుబాటు లభించడం లేదు. సిరిసిల్లలోనే ప్రాసెసింగ్, డైయింగ్, ప్రింటింగ్ చేసి రెడీమేడ్ వస్త్రాల తయారీ, గార్మెంట్ పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. ఫలితంగా ఇక్కడి వస్త్రానికి ఇక్కడే పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావడం మూలంగా మధ్యవర్తులు మిగుల్చుకునే కమీషన్ లేకుండా నేరుగా అమ్ముకునే వీలుంటుంది. ఎంబ్రారుుడరీ వంటి నైపుణ్య పనులతో పూర్తిస్థాయిలో సిరిసిల్ల వస్త్రానికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఇక్కడే మార్కెట్ చేయడం మూలంగా వస్త్రాన్ని డిమాండ్‌గా అమ్మవచ్చు. ఫలితంగా కార్మికులకు సంతృప్తికరమైన వేతనాలు అందించే అవకాశం ఉంది. ఆకలి చావుల సిరిసిల్లలో కార్మికులకు మెరుగైన వేతనాలు అందించడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. హైదరాబాద్‌లో నేడు మంత్రి సమీక్ష రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కె.తారకరామారావు సోమవారం హైదరాబాద్ బేగంపేట హరిత హోటల్లో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి జౌళి శాఖ ఉన్నతాధికారులతో పాటు వస్త్ర పరిశ్రమ ప్రముఖులు, కార్మిక సంఘాల నాయకులు, జిల్లా అధికారులు పాల్గొంటున్నారు. సిరిసిల్ల నేతన్నల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. సిరిసిల్ల నేతన్నలకు ప్రయోజనం కలిగేలా స్వార్థంవీడి వాస్తవిక దృక్పథంతో ప్రభుత్వానికి నివేదికలిస్తే నేత సమాజానికి అట్టడుగులో ఉన్న కార్మిక వర్గానికి మేలు జరుగుతుంది. గతంలో లాగా సమస్య ఒకటైతే మరో అంశంపై చర్చించి మెజారిటీ వర్గానికి మేలు చేయకుండా కొద్దిమందికే లాభం జరిగేలా చర్చిస్తే సిరిసిల్ల సమస్యలకు ముగింపు ఉండదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకు 217 మందికి నేత కార్మికుల ఆత్మహత్యలుగా గుర్తించి రూ.1.50 లక్షల చొప్పున పరిహారం అందించారు. ఇంతకు మరో రెండింతలు వివిధ కారణాలతో నేతన్నలకు పరిహారం దక్కకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సిరిసిల్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ వాస్తవాలను ఇప్పటికే గుర్తించారు. ఈ మేరకు కార్మిక వర్గానికి ప్రయోజనం కలిగేలా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటే నేతన్నలకు దీర్ఘకాలిక ప్రయోజనం దరిచేరుతుంది. -
మావోయిస్టుల పేరుతో దందా.. అరెస్ట్
పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీ పరిధిలోని గోపాలపురం మండలం దొండపుడిలో మావోయిస్టుల పేరుతో ఇద్దరు వ్యక్తులు వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకుంటుండగా వారిలో ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారయ్యాడు. వారు ఇంతకు ముందే డబ్బులు డిమాండ్ చేశారని వ్యాపారి తెలిపాడు. పశ్చిమ ఏజెన్సీలో ఇటీవలి కాలంలో మళ్లీ మావోయిస్టుల కదలికలు కనిపిస్తున్నాయి. దాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది ఇలా మావోయిస్టుల పేర్లతో వసూళ్లకు కూడా పాల్పడుతున్నారు. అలాంటి గ్యాంగునే పోలీసులు ఇప్పుడు పట్టుకున్నారు. -
జూడాల నాలుగు డిమాండ్లకు సర్కారు ఓకే
సాక్షి, హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల (జూడాల)పై ప్రభుత్వం కరుణ చూపింది. వారి ఐదు కీలక డిమాండ్లలో నాలుగింటిని నెరవేర్చేందుకు అంగీకరించింది. జూడాలతో వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా, వైద్య విద్య సంచాలకుడు పుట్టా శ్రీనివాస్ శనివారం చర్చలు జరిపారు. అయితే ఏడాదిపాటు తప్పని సరిగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించాలన్న నిబంధనను తొలగించాలన్న డిమాండ్‌ను మాత్రం తిరస్కరించారు. ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉన్నందున తీర్పు అనంతరమే నిర్ణయం తీసుకుంటామని అధికారులు స్పష్టంచేశారు. ఆస్పత్రుల్లో ఖాళీలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఉద్యోగుల విభజన పూర్తయ్యాక వాటిని భర్తీ చేస్తామని స్పష్టం చేసింది. ఎంబీబీఎస్, పీజీ చదివే వారికి స్టైపెండ్‌ను రెండేళ్లకోసారి 15 శాతం పెంచాలన్న డిమాండ్‌ను, అసిస్టెంట్ సివిల్ సర్జన్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలన్న డిమాండ్‌ను అంగీకరించింది. అలాగే బోధనాసుపత్రుల్లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సును ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. -
కేబుల్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరిస్తా
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ సాక్షి, హైదరాబాద్: కేబుల్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరిస్తామని.. వారి డిమాండ్లు నెరవేరుస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. కులదీప్ సహానీ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు గురువారం సీఎంను సచివాలయంలో కలిసి, తమ సమస్యలను విన్నవించారు. సెట్‌టాప్ బాక్సులను తప్పనిసరి చేస్తూ వచ్చిన నిబంధనలు తమకు నష్టదాయకంగా ఉన్నాయని వారు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యను పరిష్కరించడానికి అనువైన మార్గాల్ని అన్వేషించాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో పోల్ టాక్స్ రద్దు చేస్తామని సీఎం ప్రకటించారు. -
మొదటిరోజు సమ్మె ప్రశాంతం
గోదావరిఖని/యైటింక్లయిన్‌కాలనీ/రామకృష్ణాపూర్/రుద్రంపూర్/ఇల్లెందు : సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఇఫ్టూ అనుబంధ సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన టోకెన్ సమ్మె మొదటి రోజు గురువారం ప్రశాంతంగా జరిగింది. కంపెనీ వ్యాప్తంగా ఉన్న అన్ని ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు, కోల్‌ట్రాన్స్‌పోర్టు, సివిక్, బెల్ట్‌క్లీనింగ్ తదితర విభాగాలలో పనిచేస్తున్న సుమారు 20వేల మందిలో 15వేల మంది కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. జేబీసీసీఐ ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ సూచించిన వేతనాలు అమలు, మెడికల్ సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్ల సాధన కోసం సమ్మె చేపట్టారు. ఆర్జీ పరిధి ఓసీపీ-3, ఓసీపీ-2లో సమ్మెను ఇప్టూ రాష్ట్ర అధ్యక్షుడు సాదినేని వెంకటేశ్వర్రావు, కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.విశ్వనాథ్ పర్యవేక్షించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోల్ఇండియాలో కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తుండగా సింగరేణిలో మాత్రం అమలు చేయడం లేదని, ప్రిన్సిపుల్ ఎంప్లాయర్‌గా ఉన్న సింగరేణి యాజమాన్యం ఈ విషయంలో పట్టింపులేకుండా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. డిమాండ్లు పరిష్కరించే వరకూ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. శుక్రవారం రెండో రోజు జరిగే సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులను కోరారు. సమ్మెకు హెచ్ఎంఎస్, టీఎస్‌ఈయూ, ఏఐసీటీయూ, ఏఐ ఎఫ్‌టీయూ, టీఏకెఎస్, ఏఐఎఫ్టీయూ(న్యూ), ఎస్‌ఓబీ డబ్ల్యుయూ, టీఎస్ఓబీఓసీడీ, డబ్లూఏ మద్దతు తెలిపాయి. ఓసీపీల్లో నిలిచిన ఓబీ పనులు కాంట్రాక్టు కార్మికుల టోకెన్ సమ్మె కారణంగా సింగరేణిలో దాదాపుగా అన్ని ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులలో ఓవర్‌బర్డెన్(ఓబీ) వెలికితీత పనులు నిలిచిపోయాయి. వాహనాలను క్యాంపు కార్యాలయాల వద్ద, ప్రాజెక్టుల సమీపంలో యాజమాన్యా లు నిలిపివేశాయి. రామగుండం, బెల్లంపల్లి రీజియన్ల పరిధిలో సంపూర్ణంగా సమ్మె కొనసాగింది. అయితే ఓసీపీ-2 వద్ద సమ్మెలో పాల్గొన్న కార్మికులు ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు విధులు నిర్వహిస్తారా? అని పరిశీలిస్తుండగా పోలీసులు వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేశా రు. దీంతో మంథని సర్పంచ్ పుట్ట శైలజ జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇల్లెందు జేకే ఓసీపీ-4, బెల్లంపల్లి ఏరియా ఖైరిగూడ ఓసీపీ వద్ద ఉదయం ప్రైవేట్ వ్యక్తులతో వాహనాలను నడిపించాలని యాజమాన్యాలు చూడగా కాంట్రాక్టు కార్మికులు అడ్డుకున్నారు. ఉదయం 11.00 గంటల నుంచి తిరిగి సమ్మె కొనసాగింది. ఇల్లెందులో 30 మంది కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలిపెట్టారు. ఓసీపీ-3 వద్ద పోలీసులు కార్మికులను వెళ్లిపోవాలని సూచించగా వారు వెనక్కి తగ్గలేదు. న్యాయమైన డిమాండ్లకోసం సమ్మె చేస్తున్నామని, మద్దతు తెలపాలని పోలీసులను విజ్ఞప్తి చేశారు. ఆర్జీ-2 పరిధిలో.. కాంట్రాక్టు డ్రైవర్లు సమ్మెలోకి వెళ్లడంతో ఆర్జీ-2 పరిధిలోని ఓసీపీ-3లో 35వేల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు ఆగిపోయాయి. సుమారు 600మంది కాంట్రాక్టు కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-2లోనూ కాంట్రాక్టు కార్మికులు పూర్తిగా సమ్మెలోకి వెళ్లారు. దీంతో 50వేల క్యూబిక్ మీటర్ల మట్టివెలికితీత పనులు స్తంభించి పోయాయి. -
కథ మారింది.. తప్పు తెలిసింది
బీజింగ్: అది 1996 ఏప్రిల్.. తీవ్రమైన నేరాలపై కఠి నంగా వ్యవహరించాలంటూ చైనాలో డిమాండ్లు వెల్లువెత్తుతున్న రోజులవి.. 18 ఏళ్ల హూగ్జిల్ట్ అతని స్నేహితుడు యాన్ ఫెంగ్ కలిసి ఓ రోడ్డు పక్కన వెళుతున్నారు.. ఇంతలో ఓ మహిళ అరుపులు, రక్షించాలంటూ కేకలు.. పక్కనే ఉన్న మహిళల టాయ్‌లెట్ నుంచి కేకలు వచ్చినట్లుగా గుర్తించిన ఆ స్నేహితులు ఏం జరిగిందో అని వెళ్లి చూశారు.. అక్కడ ఓ మహిళ రక్తపు మడుగులో చని పోయి ఉండడాన్ని చూసి బయటకు పరుగెత్తారు.. మనకెందుకులే వెళ్లిపోదామని యాన్ చెప్పినా హూగ్జిల్ట్ వినకుండా పోలీసులకు సమాచారమిచ్చాడు. కానీ దురదృష్టం హూగ్జిల్ట్ను వెన్నాడింది. కేసుల నమోదులో, కఠిన చర్యల డిమాండ్ల మత్తులో ఉన్న అధికారులు ఆ నేరానికి పాల్పడింది హూగ్జిల్టేనంటూ కేసు పెట్టారు.. తీవ్ర ఘట నగా పరిగణించిన హాహోట్ కోర్టు మరణశిక్ష విధిం చింది.. హూగ్జిల్ట్ అలాంటివాడు కాదు మొర్రో అత ని తల్లిదండ్రులు, స్నేహితులు మొత్తుకున్నా కోర్టు, అధికారులు వినలేదు.. 1996లో మరణశిక్షను అమలు చేశారు. హూగ్జిల్ట్ నిర్దోషి.. ఈ విషయాన్ని కోర్టే తేల్చింది.. అతని తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పింది.. కానీ మరణశిక్ష అమలైన 18 ఏళ్ల తర్వాత 2014 డిసెంబర్లో..! అసలు ఈ నేరం చేసింది ఝావో జిహోంగ్ అనే సీరియల్ రేపిస్టు, కిల్లర్.. అసలు విషయం ఎలా తేలిందో తెలుసా?.. తమ కుమారుడు నిర్దోషి అని తేల్చేందుకు హూగ్జిల్ట్ తల్లిదండ్రులు పెద్ద పోరాటమే చేశారు. 1996లోనే హూగ్జిల్ట్ చనిపోయినా.. పైకోర్టులకు అప్పీలు మీద అప్పీలు చేస్తూనే వచ్చారు.. అయితే పది మంది మహిళలను అత్యాచారం చేసి హతమార్చిన ఝావో పోలీసులకు దొరికిపోవడంతో విషయం బయటపడింది. చేయని నేరానికి శిక్ష అనుభవించిన తమ కుమారుడి ఆత్మకు శాంతి చేకూర్చేందుకు హూగ్జిల్ట్ తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. హూగ్జిల్ట్ను నిర్దోషిగా నిర్ధారిస్తూ, కోర్టు చెప్పిన క్షమాపణల పత్రాన్ని.. అతని సమాధి ముందు కాల్చి, నివాళి అర్పించనున్నారు. -
యాజమాన్యంతో కలిసి పనిచేస్తాం..
కార్మిక సంఘాన్ని గుర్తించాల్సిందే న్యాయమైన డిమాండ్లు మావి మేనేజర్ల కారణంగానే వివాదం ఓసీటీఎల్ కార్మిక సంఘం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యాజమాన్యంతో కలిసి పనిచేస్తామని, కంపెనీకి పునర్వైభవం తీసుకొస్తామని ఆయిల్ కంట్రీ ట్యూబ్యులార్ కార్మికులు ముక్తకంఠంతో చెబుతున్నారు. సంస్థకు అంతర్జాతీయ ఖ్యాతిని నిలబెడతామని ఓసీటీఎల్ కార్మిక సంఘం అధ్యక్షులు గోగుల యాదగిరి శుక్రవారం తెలిపారు. సంఘం నేతలతో కలిసి ఆయన హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఓసీటీఎల్ యాజమాన్యంతో కలిసి పనిచేసేందుకు కార్మికులు అంతా సిద్ధమని వారు వెల్లడించారు. అయితే కార్మిక సంఘాన్ని ఓసీటీఎల్ యాజమాన్యం గుర్తించాల్సిందేనని స్పష్టం చేశారు. న్యాయపరమైన హక్కుల సాధనకే సంఘాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సంఘం ఏర్పడ్డనాటి నుంచే వేధింపులు అధికమయ్యాయని వివరించారు. నూతన వేతన చట్టాన్ని.. ఓసీటీఎల్ కార్మిక సంఘం పలు డిమాండ్లను కంపెనీ యాజమాన్యం ముందు ఉంచింది. నూతన వేతన చట్టం 12/3 అమలు, ఈఎస్ఐ సౌకర్యం, 33 మంది కార్మికులపై పెట్టిన కేసుల ఎత్తివేత, కంపెనీ తొలగించిన 83 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం వీటిలో ప్రధానమైనవి. కొత్త వేతనం, ఈఎస్ఐ సౌకర్యం కార్మికులకు చెందాల్సిన న్యాయపరమైన హక్కులని సంఘం ఉపాధ్యక్షుడు కుసుమ చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి తాడూరి ఆంజనేయులు అన్నారు. 28 ఏళ్ల సర్వీసున్న ఒక కార్మికుడి బేసిక్ వేతనం రూ.8 వేలు మాత్రమే ఉందని సహాయ కార్యదర్శి జెనిగ చంద్రశేఖర్ తెలిపారు. వేతన ఒప్పందం సమయంలో మేనేజర్లదే తుది నిర్ణయమని చెప్పారు. ఇంకాస్త పెంచండి అని అడిగితే అధికారులు బెదిరిస్తారని వివరించారు. కార్మికులకు ఇస్తున్న వేతనం, కార్మిక శాఖకు చూపిస్తున్న లెక్కలకు పొంతన లేదన్నారు. వేతనం రూ.3-4 వేలైనా తేడా ఉంటుందని చెప్పారు. హాని తలపెట్టలేదు.. సంఘం ఏర్పాటుకు ముందు, ఏర్పడ్డాకా కూడా ఏ ఒక్క కార్మికుడు కంపెనీ ఆస్తులకు ఎటువంటి హాని తలపెట్టలేదని సంఘం సంయుక్త కార్యదర్శి నామా రాంప్రసాద్ తెలిపారు. సంఘంలో చేరిన 480 మంది కార్మికులపై వేధింపులు అధికమయ్యాయని చెప్పారు. కంపెనీ యాజమాన్యం, అధికారులు సమ్మె నోటీసును స్వీకరించలేదని ప్రచార కార్యదర్శి దొండ జంగయ్య తెలిపారు. సమ్మె చేస్తున్న ప్రతి సందర్భంలోనూ సమాచారం ఇచ్చామని అన్నారు. స్టాండింగ్ ఆర్డర్స్ పేరుతో వేధింపులు, జరిమానాలు వేస్తున్నారని కోశాధికారి ఆమనిగంటి ఉమామహేశ్వర్‌రెడ్డి వివరించారు. కంపెనీ రూల్స్ ఏమిటో చెప్పరు. రూల్స్ ఉల్లంఘన అంటారని తెలిపారు. మేనేజర్లదే ఇష్టారాజ్యం... ఓసీటీఎల్ మేనేజర్లదే ఇష్టారాజ్యమని ఓసీటీఎల్ కార్మిక సంఘం నేతలు ఆరోపించారు. కంపెనీ కార్యకలాపాల్లో యాజమాన్యం పాత్ర ఎక్కడా కనపడదని, అంతా మేనేజర్లే చక్కబెడతారని చెప్పారు. ఈ అధికారంతోనే కార్మికులను బెదిరించడం, చెప్పినట్టు చేయకపోతే జరిమానాలు విధిస్తున్నారని వెల్లడించారు. జరిమానాల పేరుతో లక్షలాది రూపాయలు పోగేసుకున్నారని చెప్పారు. కార్మిక సంఘం ఏర్పడితే వచ్చే సమస్య ఏమిటంటూ మేనేజర్లపై కామినేని గ్రూప్ డెరైక్టర్ అగ్రహం వ్యక్తం చేశారని సంఘ నాయకులు తెలిపారు. మీరు కలిసికట్టుగా ఉన్నప్పుడు కార్మికులు ఎందుకు ఉండకూడదంటూ మేనేజర్లను నిలదీసినట్టు తమకు తెలిసిందని చెప్పారు. నేరుగా కార్మికులతో మాట్లాడితే.... ఎనమిదేళ్ల సర్వీసులో తానెప్పుడూ కంపెనీ యజమానులను కలవలేదని సంఘం కార్యవర్గ సభ్యుడు చిట్టిమళ్ల కిరణ్ తెలిపారు. మా గోడు వెళ్లబోసుకుందామన్నా సెక్యూరిటీ సిబ్బంది యాజమాన్యాన్ని కలవనివ్వరని సంఘం నాయకులు నర్సింగ్ వెంకన్న, పోకల శ్రీకాంత్ తెలిపారు. కార్మికులతో నేరుగా మాట్లాడితే వాస్తవాలు యాజమాన్యానికి తెలిసేవని మీసాల గోపయ్య, షేక్ హకీం అన్నారు. -
సర్పంచులూ ఏకంకండి
ఇందూరు: పార్టీల భేదాలు లేకుండా సర్పంచుల మంతా ఏకమై సమస్యలు, డిమాండ్లను పరిష్కరించుకుందామని తెలంగాణ సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సోమిరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో సర్పంచుల చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ ‘‘సర్పంచులు ఒక కుటుంబం, ఒకే మాట, ఒకే బాణంతో ముందుకు వెళ్లాల్సి న అవసరం ఉంది. ఎన్నికలలో మనం పార్టీల పేరుతో గెలువలేదు. మనకున్న పేరుతో గెలి చాం. అందుకే మన సమస్యలను మనమే తీర్చుకోవాలి’’ అన్నారు. కష్టపడితే కాని ఏదీ సాధించలేమని, సమస్యలు తీరాలంటే ప్రభుత్వంతో పోరాడాలన్నారు. రాజ్యాంగంలోని 73,74 ఆర్టికల్ ప్రకారం సర్పంచులకు 29 అంశాలపై అధికారాలు దక్కాలన్నారు. ఈ డిమాండ్లు తీరాలి సర్పంచులకు రూ. 20 వేల వేతనం, ప్రమాదవశాత్తు మరణించినవారికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఎమ్మెల్సీ ఎన్నికలలో సర్పంచులకు ఓటు హక్కు కల్పించడం, పె న్షన్, రేషన్ కార్డుల లభ్ధిదారుల గుర్తింపు బాధ్యత, తది తర డిమాండ్లను సాధించుకోవడానికి ప్రభుత్వంతో నేరుగా మాట్లాడాల్సి ఉందన్నారు. ఇందుకోసం త్వరలోనే రాష్ట్రంలోని పది జిల్లా ల సర్పంచులతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. మొ త్తం 2,600 మంది సర్పంచులు ఆ రోజు స మావేశంలో పాల్గొంటారని తెలిపారు. ప్రభుత్వం ‘మన ఊరు- మన ప్రణాళిక’ ద్వారా గ్రామాలను అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకోవడాన్ని తాము స్వాగతిస్తున్నామని చె ప్పారు. వీలైనంత తొందరగా గ్రామాలకు నిధులు కేటాయించి పనులు ప్రారంభిస్తే బా గుంటుందన్నారు. గ్రామ పంచాయతీల కరెంట్ బిల్లు బకాయిలను ప్రభుత్వమే చెల్లిం చాలని పంచాయతీరాజ్ శాఖా మంత్రికి విన్నవించామన్నారు. ప్రధాని ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సర్పంచులకు సూచించారు. గాంధీజీ కలలుగన్నస్వరాజ్యాన్ని సాధిద్దాం సభకు అధ్యక్షత వహించిన ఫోరం జిల్లా అధ్యక్షుడు గోర్త రాజేందర్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ కలలుగన్న స్వరాజ్యం రావాలంటే గ్రామాలు అభివృద్ధి చెందాల న్నారు. ప్రభుత్వం సర్పంచులకు ప్రోత్సహం అందిస్తే కలలు నిజం చేసి చూపిస్తామన్నారు. ‘జై సర్పంచ్- జై గ్రామ పంచాయతీ’ అనే నినాధంతో ముందుకు వెళ్లాలని సూచించారు. గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలను అరికట్టాలని, వాటితో సర్పంచులు చాలా ఇబ్బం దులు ఎదుర్కుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర నాయకులు భూ మన్న, ఆశోక్, రామన్న, హరికృష్ణ, చారి, జిల్లా అధికార ప్రతినిధి సంతోష్‌కుమార్, జలంధర్ వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.