
కేబుల్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరిస్తా
కేబుల్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరిస్తామని.. వారి డిమాండ్లు నెరవేరుస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు.
- ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ
సాక్షి, హైదరాబాద్: కేబుల్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరిస్తామని.. వారి డిమాండ్లు నెరవేరుస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. కులదీప్ సహానీ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు గురువారం సీఎంను సచివాలయంలో కలిసి, తమ సమస్యలను విన్నవించారు. సెట్‌టాప్ బాక్సులను తప్పనిసరి చేస్తూ వచ్చిన నిబంధనలు తమకు నష్టదాయకంగా ఉన్నాయని వారు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యను పరిష్కరించడానికి అనువైన మార్గాల్ని అన్వేషించాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో పోల్ టాక్స్ రద్దు చేస్తామని సీఎం ప్రకటించారు.