double hatrick
-
సెన్సెక్స్ డబుల్ హ్యాట్రిక్..
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో దూసుకెళ్తున్నాయి. మంగళవారం లాభాలతో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్ల లాభాలతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా ఆరో ట్రేడింగ్ రోజు కూడా విజయ పరంపరను కొనసాగించాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 320 పాయింట్ల సానుకూల తేడాతో 79,728 వద్ద రోజును ప్రారంభించింది. కానీ కొంత సేపటికే లాభాలను కోల్పోయి 79,253 వద్ద ఎరుపులోకి జారుకుంది. తర్వాత పుంజుకుని పాజిటివ్ జోన్లో కన్సాలిడేట్ కాగా, ఇంట్రాడే గరిష్ట స్థాయి 79,824ను తాకింది. చివరకు సెన్సెక్స్ 187 పాయింట్ల లాభంతో 79,596 వద్ద స్థిరపడింది. ఈ ప్రక్రియలో సెన్సెక్స్ గత ఆరు వరుస ట్రేడింగ్ సెషన్లలో 7.8 శాతం లేదా 5,749 పాయింట్లు పెరిగింది.ఇక నిఫ్టీ 50 ఇండెక్స్ 24,072 వద్ద కనిష్టాన్ని తాకి తిరిగి 24,243 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరకు 0.2 శాతం లేదా 42 పాయింట్ల లాభంతో 24,167 వద్ద స్థిరపడింది. మంగళవారం 29వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ ఎన్ఎస్ఈ బెంచ్‌మార్క్ గత ఆరు రోజుల్లో 7.9 శాతం లేదా 1,768 పాయింట్లు పెరిగింది.సెన్సెక్స్‌లోని 30 షేర్లలో ఎఫ్ఎంసీజీ మేజర్ ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్ 2 శాతానికి పైగా లాభపడ్డాయి. అదేసమయంలో మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జొమాటో, కొటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. మరోవైపు, మైక్రోఫైనాన్స్ పోర్ట్‌ఫోలియోలో రూ .600 కోట్ల వ్యత్యాసంపై దర్యాప్తు చేయడానికి మరో రౌండ్ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించడానికి బ్యాంక్ ఈవైని రంగంలోకి దింపడంతో ఇండస్ఇండ్ బ్యాంక్ 5 శాతం నష్టపోయింది.పవర్ గ్రిడ్ కార్పొరేషన్, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్సర్వ్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ 1-2 శాతం మధ్య క్షీణించాయి. విస్తృత మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలను అధిగమించింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ రెండూ మంగళవారం 0.8 శాతం వరకు లాభపడ్డాయి. బీఎస్ఈలో 1,500 షేర్లు క్షీణించగా, దాదాపు 2,500 షేర్లు లాభాల్లో ముగిశాయి. రంగాలవారీ సూచీల్లో బీఎస్ఈ రియల్టీ ఇండెక్స్ 2.4 శాతం, ఎఫ్ఎంసీజీ 1.9 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 1.4 శాతం లాభపడ్డాయి. మరోవైపు ఐటీ, పవర్ సూచీలు భారీగా నష్టపోయాయి. -
టీ20 క్రికెట్లో సంచలనం.. నాలుగు బంతుల్లో 4 వికెట్లు! వీడియో వైరల్
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో థాయ్‌లాండ్ మహిళా క్రికెట్ జట్టు స్పిన్నర్ తిప్చా పుట్టావాంగ్ అరుదైన ఘనత సాధించింది. నెదర్లాండ్స్‌తో శుక్రవారం జరిగిన టీ20 మ్యాచ్‌లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా ప్రపంచక్రికెట్లో ఈ ఘనత సాధించిన మూడో మహిళా క్రికెటర్‌గా పుట్టావాంగ్ నిలిచింది. ఈ అరుదైన మైలు రాయిని అందుకున్న జాబితాలో జర్మనీ స్పిన్నర్ అనురాధ దొడ్డబల్లాపూర్,బోట్స్వానా బౌలర్ షమీలా మోస్వీ ఉన్నారు. ఓవరాల్‌గా పురుషులు, మహిళల క్రికెట్లో ఈ అరుదైన ఫీట్ సాధించిన ఏడో క్రికెటర్‌గా పుట్టావాంగ్ నిలిచింది. ఇక 4 బంతుల్లో 4 వికెట్లు తీయడాన్ని డబుల్ హ్యాట్రిక్ అంటారు. పురుషల క్రికెట్లో ఈ ఘనత సాధించిన జాబితాలో శ్రీలంక క్రికెట్ దిగ్గజం లసిత్ మలింగా, ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్,ఐర్లాండ్ ఫాస్ట్ బౌలర్ కర్టిస్ కాంఫర్, వెస్టిండీస్ బౌలర్ జాసన్ హోల్డర్ ఉన్నారు. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాపై మలింగ ఈ డబుల్ హ్యాట్రిక్‌ను సాధించగా.. 2019లో రషీద్ ఖాన్ కూడా ఐర్లాండ్‌పై 4 బంతుల్లో 4 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం కర్టిస్ కాంఫర్ టీ20 వరల్డ్‌కప్-2021 క్వాలిఫయర్ మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. ఇక చివరగా గతేడాది ఇంగ్లండ్‌పై హోల్డర్ డబుల్ హ్యాట్రిక్ పడగొట్టాడు. చదవండి: Ind Vs WI: మీ గొయ్యిని మీరే తవ్వుకున్నట్లు అవుతుంది.. ఇకనైనా! ఎంత పెద్ద తప్పు చేశారో.. 4️⃣ wickets in 4️⃣ balls! Thipatcha Putthawong, take a bow🙇 The young sensation picks up five wickets propelling Thailand to victory against the Netherlands.#EuropeanCricket #StrongerTogether #Hattrick #Thailand #Netherlands pic.twitter.com/dwoS6GcfB1 — European Cricket (@EuropeanCricket) July 14, 2023 -
ప్యార్‌సే ఖేలో..ఫిర్సే లావో
క్రికెట్... క్రికెట్... క్రికెట్...! నేటినుంచి అందరి నోటా ఇదే మాట! అందరి కళ్లూ ఈ ఆట పైనే! నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న ప్రపంచకప్ సమరం మొదలైంది. నేటినుంచి ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. గత ప్రపంచకప్‌లో వీరోచితమైన ఆటతీరుతో విశ్వవిజేతగా నిలిచిన భారత్ ఈసారి అదే స్ఫూర్తిని కనబర్చి.. మరోసారి విన్నర్‌గా నిలవాలని క్రికెట్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. - కరీంనగర్ స్పోర్ట్స్ ఈ ప్రపంచకప్‌లో తొలి సమరం మన చిరకాల ప్రత్యర్థి పాక్‌తో జరగనుండగా.. ఈ విజయంతో అన్ని జట్లకు రేసులో మనం ఉన్నామంటూ ఒక సంకేతాన్ని పంపాలంటున్నారు సగటు అభిమాని. ఇటీవల కాలంలో పేలవమైన ప్రదర్శన క నబర్చినా ఆత్మవిశ్వాసంతో ఆడాలంటున్నారు అభిమానులు. మార్చి 29 వరకు జరిగే ఈ టోర్నీలో ఎవరు విజేతగా నిలుస్తారో ఇప్పటినుంచే ఉత్కంఠ మొదలైంది. ఏదైతేనేం డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో దిగుతున్నాం.. విజయం కోసమే బరిలో దిగి సత్తా చాటాలంటున్నారు. ఇంకొందరైతే పూజలు సైతం చేస్తున్నారు. మళ్లీ విజేతలుగా మనమే గెలిచేలా చేయాలంటూ కోరుతున్నారు. నేటి మ్యాచ్‌పై ఉత్కంఠ... పాక్ ఇండియా మ్యాచ్ అంటే ఇంకేం చెప్పనక్కరలేదు. అందులో ప్రపంచకప్‌లో సమరం అంటే ఉత్కంఠే. మనం విన్నర్‌గా నిలవకున్నా ఫర్వాలేదుగానీ పాక్‌పై విజయం సాధించాలనుకుంటున్నారు. ఇప్పటికీ వరల్డ్‌కప్‌లో ఐదుసార్లు మన మే విజయం సాధించాం. డబుల్ హ్యాట్రిక్ సాదించాలంటున్నారు అభిమానులు. నేటి మ్యాచ్‌పై జిల్లాలో అభిమానులు ఇంటికే పరిమితం కానున్నారు. పనిదినాల్లో పాక్, ఇండియూ మధ్య మ్యాచ్ జరిగితే ఉద్యోగులు లీవ్ పెట్టి మరి చూసే వారు ఉన్నారు మరి. నగరంలో బందోబస్తుపై దృష్టి పెట్టాలి... గత ప్రపంచకప్‌లో ఇండియా పాక్ సెమీఫైనల్లో తలపడగా.. జిల్లాలో అల్లరి మూకల నిర్వాకంతో 144 సెక్షన్ విధించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో జిల్లాలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొందరు అల్లరి మూకల రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దాంతో లాఠీచార్జికి దారితీసింది. ఇప్పడు అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బందోస్తు ఏర్పాటుచేయూలని కోరుతున్నారు క్రికెట్ అభిమానులు. పాక్‌ను చిత్తుచేయాలి పాక్ జట్టును ఓడిస్తే మనలో రెట్టింపు ఉత్సాహం వస్తుంది. మొదటి విజయం మనకు కలిసొచ్చే అవకాశం. ఇక ఫెవరేట్ జట్టులో ఒకటిగా ఉన్న పాక్‌ను ఓడిస్తే మనం కప్ సాధించినట్లే. అందరు కలిసికట్టుగా 11 మంది ఆడే ఆట కాదు 120 కోట్ల ప్రజల సాకరం చేసే ఆటగా పరిగణించి ఆడాలి. - రమణాచారి, జిల్లా ట్వంటి 20 క్రికెట్ సంఘం అధ్యక్షుడు ధోనీ సత్తా చాటాలి... ధోనికి ఇదే చివరి ప్రపంచకప్ . భారత్‌కు ఎన్నో విజయాలు అందించిన ఆయన తన చిరకాల కోరిక వన్డే ప్రపంచ కప్‌ను భారత్‌కు తన హయూంలో మరోసారి అందివ్వాలని. మ్యాచ్ విన్నర్‌గా పేరు పొందిన ధోని అన్ని మ్యాచ్‌ల్లో ప్రతాపం చూపించాలి. జట్టుకు విజయాన్ని అందించాలి. భారత్‌కు కప్‌ను సాధించిపెట్టాలి. - చందు, క్రికెట్ కోచ్ ఆరంభంలోనే అదరగొట్టాలి భారత్ జట్టు ఫస్ట్ మ్యాచ్ పాక్‌తోనే. ఆరంభమ్యాచ్‌లోనే భారత్ అదరగొట్టాలి. ఫెవరేట్ జట్టుల్లో భారత్జట్టు కొంత వెనుకబడి ఉంది. ఈ విజయంతో అన్ని జట్లలో గుబులు పుట్టించాలి. మన జట్టులో వీరోచితమైన ఆటగాళ్లు ఉన్నారు. కప్ సాధించే సత్తా మనకే ఉంది. అందరు ఒకటిగా విజయంకోసం పాటుపడాలి. అన్ని విభాగాల్లో పకడ్బందీగా రాణించాలి. - జనార్దన్‌రెడ్డి, జిల్లా ఒలింపిక్‌సంఘం కార్యదర్శి కోహ్లి ప్రతాపం చూపించాలి.. నేడు భారత్ జట్టుకు ఆరాధ్య దేవుడు విరాట్ కోహ్లి. ఇప్పటి వరకు చాలా విజయాల్లో కోహ్లిదే కీలకపాత్ర. ఇప్పుడు ప్రపంచకప్‌లో సత్తా చాటాల్సిన అవసరముంది. అన్ని విజయాలు సాధించేది ఒక్కటి ప్రపంచకప్‌లో విజయం సాధించడం ఒక్కటి. కోహ్లి ఫామ్ లోకి వస్తే విజయం ముంగిట్లో ఉన్నట్టే. - జగన్మోహన్ రావు, జిల్లా క్రికెట్ సంఘంకార్యదర్శి మరోసారి విజయం సాధించాలి గత వరల్డ్ కప్‌లో విన్నర్‌గా నిలిచాం. ఇప్పుడు అందరి దృష్టి భారత్‌పైనే ఉంది. మనల్ని ఓడించేందుకు ప్రయత్నాలు ఎన్నిచేసినా మన వీరులు పోరాటపటిమను ప్రదర్శించాలి. ఈసారి గెలిస్తే మూడుసార్లు విన్నర్ అయిన జట్టు మనదే అవడమేకాకుండా వరల్డ్ కప్ విన్నర్లలో రెండోస్థానంలో నిలుస్తాం. - కౌశిక్ రెడ్డి, రంజీ క్రికెటర్