క్రికెట్... క్రికెట్... క్రికెట్...!
నేటినుంచి అందరి నోటా ఇదే మాట! అందరి కళ్లూ ఈ ఆట పైనే!
నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న ప్రపంచకప్ సమరం మొదలైంది. నేటినుంచి ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. గత ప్రపంచకప్‌లో వీరోచితమైన ఆటతీరుతో విశ్వవిజేతగా నిలిచిన భారత్ ఈసారి అదే స్ఫూర్తిని కనబర్చి.. మరోసారి విన్నర్‌గా నిలవాలని క్రికెట్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
- కరీంనగర్ స్పోర్ట్స్
ఈ ప్రపంచకప్‌లో తొలి సమరం మన చిరకాల ప్రత్యర్థి పాక్‌తో జరగనుండగా.. ఈ విజయంతో అన్ని జట్లకు రేసులో మనం ఉన్నామంటూ ఒక సంకేతాన్ని పంపాలంటున్నారు సగటు అభిమాని. ఇటీవల కాలంలో పేలవమైన ప్రదర్శన క నబర్చినా ఆత్మవిశ్వాసంతో ఆడాలంటున్నారు అభిమానులు. మార్చి 29 వరకు జరిగే ఈ టోర్నీలో ఎవరు విజేతగా నిలుస్తారో ఇప్పటినుంచే ఉత్కంఠ మొదలైంది. ఏదైతేనేం డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో దిగుతున్నాం.. విజయం కోసమే బరిలో దిగి సత్తా చాటాలంటున్నారు. ఇంకొందరైతే పూజలు సైతం చేస్తున్నారు. మళ్లీ విజేతలుగా మనమే గెలిచేలా చేయాలంటూ కోరుతున్నారు.
నేటి మ్యాచ్‌పై ఉత్కంఠ...
పాక్ ఇండియా మ్యాచ్ అంటే ఇంకేం చెప్పనక్కరలేదు. అందులో ప్రపంచకప్‌లో సమరం అంటే ఉత్కంఠే. మనం విన్నర్‌గా నిలవకున్నా ఫర్వాలేదుగానీ పాక్‌పై విజయం సాధించాలనుకుంటున్నారు. ఇప్పటికీ వరల్డ్‌కప్‌లో ఐదుసార్లు మన మే విజయం సాధించాం. డబుల్ హ్యాట్రిక్ సాదించాలంటున్నారు అభిమానులు. నేటి మ్యాచ్‌పై జిల్లాలో అభిమానులు ఇంటికే పరిమితం కానున్నారు. పనిదినాల్లో పాక్, ఇండియూ మధ్య మ్యాచ్ జరిగితే ఉద్యోగులు లీవ్ పెట్టి మరి చూసే వారు ఉన్నారు మరి.
నగరంలో బందోబస్తుపై దృష్టి పెట్టాలి...
గత ప్రపంచకప్‌లో ఇండియా పాక్ సెమీఫైనల్‌లో తలపడగా.. జిల్లాలో అల్లరి మూకల నిర్వాకంతో 144 సెక్షన్ విధించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో జిల్లాలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొందరు అల్లరి మూకల రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దాంతో లాఠీచార్జికి దారితీసింది. ఇప్పడు అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బందోస్తు ఏర్పాటుచేయూలని కోరుతున్నారు క్రికెట్ అభిమానులు.
పాక్‌ను చిత్తుచేయాలి
పాక్ జట్టును ఓడిస్తే మనలో రెట్టింపు ఉత్సాహం వస్తుంది. మొదటి విజయం మనకు కలిసొచ్చే అవకాశం. ఇక ఫెవరేట్ జట్టులో ఒకటిగా ఉన్న పాక్‌ను ఓడిస్తే మనం కప్ సాధించినట్లే. అందరు కలిసికట్టుగా 11 మంది ఆడే ఆట కాదు 120 కోట్ల ప్రజల సాకరం చేసే ఆటగా పరిగణించి ఆడాలి.
- రమణాచారి,
జిల్లా ట్వంటి 20 క్రికెట్ సంఘం అధ్యక్షుడు
ధోనీ సత్తా చాటాలి...
ధోనికి ఇదే చివరి ప్రపంచకప్ . భారత్‌కు ఎన్నో విజయాలు అందించిన ఆయన తన చిరకాల కోరిక వన్డే ప్రపంచ కప్‌ను భారత్‌కు తన హయూంలో మరోసారి అందివ్వాలని. మ్యాచ్ విన్నర్‌గా పేరు పొందిన ధోని అన్ని మ్యాచ్‌ల్లో ప్రతాపం చూపించాలి. జట్టుకు విజయాన్ని అందించాలి. భారత్‌కు కప్‌ను సాధించిపెట్టాలి.
- చందు, క్రికెట్ కోచ్
ఆరంభంలోనే అదరగొట్టాలి
భారత్ జట్టు ఫస్ట్ మ్యాచ్ పాక్‌తోనే. ఆరంభమ్యాచ్‌లోనే భారత్ అదరగొట్టాలి. ఫెవరేట్ జట్టుల్లో భారత్‌జట్టు కొంత వెనుకబడి ఉంది. ఈ విజయంతో అన్ని జట్లలో గుబులు పుట్టించాలి. మన జట్టులో వీరోచితమైన ఆటగాళ్లు ఉన్నారు. కప్ సాధించే సత్తా మనకే ఉంది. అందరు ఒకటిగా విజయంకోసం పాటుపడాలి. అన్ని విభాగాల్లో పకడ్బందీగా రాణించాలి.
- జనార్దన్‌రెడ్డి, జిల్లా ఒలింపిక్‌సంఘం కార్యదర్శి
కోహ్లి ప్రతాపం చూపించాలి..
నేడు భారత్ జట్టుకు ఆరాధ్య దేవుడు విరాట్ కోహ్లి. ఇప్పటి వరకు చాలా విజయాల్లో కోహ్లిదే కీలకపాత్ర. ఇప్పుడు ప్రపంచకప్‌లో సత్తా చాటాల్సిన అవసరముంది. అన్ని విజయాలు సాధించేది ఒక్కటి ప్రపంచకప్‌లో విజయం సాధించడం ఒక్కటి. కోహ్లి ఫామ్ లోకి వస్తే విజయం ముంగిట్లో ఉన్నట్టే.
- జగన్‌మోహన్ రావు, జిల్లా క్రికెట్ సంఘంకార్యదర్శి
మరోసారి విజయం సాధించాలి
గత వరల్డ్ కప్‌లో విన్నర్‌గా నిలిచాం. ఇప్పుడు అందరి దృష్టి భారత్‌పైనే ఉంది. మనల్ని ఓడించేందుకు ప్రయత్నాలు ఎన్నిచేసినా మన వీరులు పోరాటపటిమను ప్రదర్శించాలి. ఈసారి గెలిస్తే మూడుసార్లు విన్నర్ అయిన జట్టు మనదే అవడమేకాకుండా వరల్డ్ కప్ విన్నర్‌లలో రెండోస్థానంలో నిలుస్తాం.
- కౌశిక్ రెడ్డి,
రంజీ క్రికెటర్
ప్యార్‌సే ఖేలో..ఫిర్‌సే లావో
Published Sun, Feb 15 2015 3:05 AM | Last Updated on Sat, Sep 2 2017 9:19 PM
Advertisement