అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో థాయ్‌లాండ్ మహిళా క్రికెట్ జట్టు స్పిన్నర్ తిప్చా పుట్టావాంగ్ అరుదైన ఘనత సాధించింది. నెదర్లాండ్స్‌తో శుక్రవారం జరిగిన టీ20 మ్యాచ్‌లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా ప్రపంచక్రికెట్‌లో ఈ ఘనత సాధించిన మూడో మహిళా క్రికెటర్‌గా పుట్టావాంగ్ నిలిచింది. ఈ అరుదైన మైలు రాయిని అందుకున్న జాబితాలో జర్మనీ స్పిన్నర్ అనురాధ దొడ్డబల్లాపూర్,బోట్స్వానా బౌలర్ షమీలా మోస్వీ ఉన్నారు.
ఓవరాల్‌గా పురుషులు, మహిళల క్రికెట్‌లో ఈ అరుదైన ఫీట్ సాధించిన ఏడో క్రికెటర్‌గా పుట్టావాంగ్ నిలిచింది. ఇక 4 బంతుల్లో 4 వికెట్లు తీయడాన్ని డబుల్ హ్యాట్రిక్ అంటారు. పురుషల క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన జాబితాలో శ్రీలంక క్రికెట్ దిగ్గజం లసిత్ మలింగా, ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్,ఐర్లాండ్ ఫాస్ట్ బౌలర్ కర్టిస్ కాంఫర్, వెస్టిండీస్ బౌలర్ జాసన్ హోల్డర్ ఉన్నారు.
2007 టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాపై మలింగ ఈ డబుల్ హ్యాట్రిక్‌ను సాధించగా.. 2019లో రషీద్ ఖాన్ కూడా ఐర్లాండ్‌పై 4 బంతుల్లో 4 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం కర్టిస్ కాంఫర్ టీ20 వరల్డ్‌కప్-2021 క్వాలిఫయర్ మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. ఇక చివరగా గతేడాది ఇంగ్లండ్‌పై హోల్డర్ డబుల్ హ్యాట్రిక్ పడగొట్టాడు.
చదవండి: Ind Vs WI: మీ గొయ్యిని మీరే తవ్వుకున్నట్లు అవుతుంది.. ఇకనైనా! ఎంత పెద్ద తప్పు చేశారో..
4️⃣ wickets in 4️⃣ balls! Thipatcha Putthawong, take a bow🙇
— European Cricket (@EuropeanCricket) July 14, 2023
The young sensation picks up five wickets propelling Thailand to victory against the Netherlands.#EuropeanCricket #StrongerTogether #Hattrick #Thailand #Netherlands pic.twitter.com/dwoS6GcfB1
Comments
Please login to add a commentAdd a comment