Thailand Cricket Team
-
టీ20 క్రికెట్లో సంచలనం.. నాలుగు బంతుల్లో 4 వికెట్లు! వీడియో వైరల్
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో థాయ్‌లాండ్ మహిళా క్రికెట్ జట్టు స్పిన్నర్ తిప్చా పుట్టావాంగ్ అరుదైన ఘనత సాధించింది. నెదర్లాండ్స్‌తో శుక్రవారం జరిగిన టీ20 మ్యాచ్‌లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా ప్రపంచక్రికెట్లో ఈ ఘనత సాధించిన మూడో మహిళా క్రికెటర్‌గా పుట్టావాంగ్ నిలిచింది. ఈ అరుదైన మైలు రాయిని అందుకున్న జాబితాలో జర్మనీ స్పిన్నర్ అనురాధ దొడ్డబల్లాపూర్,బోట్స్వానా బౌలర్ షమీలా మోస్వీ ఉన్నారు. ఓవరాల్‌గా పురుషులు, మహిళల క్రికెట్లో ఈ అరుదైన ఫీట్ సాధించిన ఏడో క్రికెటర్‌గా పుట్టావాంగ్ నిలిచింది. ఇక 4 బంతుల్లో 4 వికెట్లు తీయడాన్ని డబుల్ హ్యాట్రిక్ అంటారు. పురుషల క్రికెట్లో ఈ ఘనత సాధించిన జాబితాలో శ్రీలంక క్రికెట్ దిగ్గజం లసిత్ మలింగా, ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్,ఐర్లాండ్ ఫాస్ట్ బౌలర్ కర్టిస్ కాంఫర్, వెస్టిండీస్ బౌలర్ జాసన్ హోల్డర్ ఉన్నారు. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాపై మలింగ ఈ డబుల్ హ్యాట్రిక్‌ను సాధించగా.. 2019లో రషీద్ ఖాన్ కూడా ఐర్లాండ్‌పై 4 బంతుల్లో 4 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం కర్టిస్ కాంఫర్ టీ20 వరల్డ్‌కప్-2021 క్వాలిఫయర్ మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. ఇక చివరగా గతేడాది ఇంగ్లండ్‌పై హోల్డర్ డబుల్ హ్యాట్రిక్ పడగొట్టాడు. చదవండి: Ind Vs WI: మీ గొయ్యిని మీరే తవ్వుకున్నట్లు అవుతుంది.. ఇకనైనా! ఎంత పెద్ద తప్పు చేశారో.. 4️⃣ wickets in 4️⃣ balls! Thipatcha Putthawong, take a bow🙇 The young sensation picks up five wickets propelling Thailand to victory against the Netherlands.#EuropeanCricket #StrongerTogether #Hattrick #Thailand #Netherlands pic.twitter.com/dwoS6GcfB1 — European Cricket (@EuropeanCricket) July 14, 2023 -
థాయ్‌లాండ్‌పై విజయం.. ఆసియాకప్ ఫైనల్లో టీమిండియా వుమెన్స్
మహిళల ఆసియా కప్ టి20 టోర్నీలో టీమిండియా వుమెన్స్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం థాయ్‌లాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా వుమెన్స్ 74 పరుగులతో ఘన విజయం సాధించింది. 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన థాయ్‌లాండ్ వుమెన్స్ భారత బౌలర్ల దాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 74 పరుగులే చేయగలిగింది. థాయ్‌లాండ్ బ్యాటర్లలో నరుమోల్ చవాయి 21, నట్టాయా బుచాతమ్ 21 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా.. రాజేశ్వరి గైక్వాడ్ రెండు, షఫాలీ వర్మ, స్నేహ్ రాణా, రేణుకా సింగ్‌లు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. షఫాలీ వర్మ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 36 పరుగులు, జేమీమా రోడ్రిగ్స్ 27 పరుగులతో రాణించారు. ఇక శ్రీలంక వుమెన్స్, పాకిస్తాన్ వుమెన్స్ మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో టీమిండియా వుమెన్స్ ఫైనల్లో తలపడనుంది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 15న(శనివారం) జరగనుంది. Women's Asia Cup: India beat Thailand by 74 runs in the first semifinal to enter the final. (Pic Source: BCCI Women) pic.twitter.com/VwWZl0gjkQ — ANI (@ANI) October 13, 2022 4⃣2⃣ Runs 1⃣ Wicket 1⃣ Catch@TheShafaliVerma bags the Player of the Match as #TeamIndia beat Thailand. 👍 👍 Scorecard ▶️ https://t.co/pmSDoClWJi #AsiaCup2022 | #INDvTHAI pic.twitter.com/Jidbc383eX — BCCI Women (@BCCIWomen) October 13, 2022 -
మరో విజయమే లక్ష్యంగా... థాయ్‌లాండ్‌తో భారత్ ఢీ
మహిళల ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న భారత జట్టు నేడు తమ చివరి లీగ్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్ జట్టుతో ఆడనుంది. బంగ్లాదేశ్ వేదికగా ఏడు జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం ఐదు మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలు సాధించి, ఒక మ్యాచ్‌లో ఓడింది. మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. తుది జట్లు(అంచనా) భారత్: స్మృతి మంధాన (కెప్టెన్), షఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), కిరణ్ నవ్‌గిరే, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, స్నేహ రాణా, రేణుకా సింగ్, రాజేశ్వరి గయక్వాడ్ థాయ్‌లాండ్: నన్నపట్ కొంచరోయెంకై (వికెట్ కీపర్), నత్తకన్ చంతమ్, నరుఎమోల్ చైవై (కెప్టెన్), సోర్నరిన్ టిప్పోచ్, చనిద సుత్తిరువాంగ్, రోసెనన్ కానో, ఫన్నిత మాయ, నట్టయ బూచతం, ఒన్నిచ కమ్‌చోంఫు, బంతిద లీఫత్తానా, తిపట్చా పుట్టావొంగ్ చదవండి: సెంచరీతో చెలరేగిన శ్రేయస్.. దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం -
పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన థాయ్‌లాండ్.. క్రికెట్ చరిత్రలో తొలి విజయం
మహిళల ఆసియాకప్-2022లో పాకిస్తాన్ జట్టుకు థాయ్‌లాండ్ గట్టి షాక్ ఇచ్చింది. షెల్లాట్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో థాయ్‌లాండ్ 4 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. తమ టీ20 క్రికెట్ చరిత్రలో పాకిస్తాన్‌పై థాయలాండ్కు ఇదే తొలి విజయం. 117 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన థాయ్‌లాండ్ మరో బంతి మిగిలూండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. థాయ్ ఓపెనర్ నటకన్ చంతమ్ 61 పరుగులు చేసి.. తమ జట్టు చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించింది. పాకిస్తాన్ బౌలర్లలో నిదా దార్, హసన్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా అంతకుముందు థాయ్‌లాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 116 పరుగులకే పరిమితమైంది. పాక్ బ్యాటర్లలో అమీన్ 56 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇక థాయ్ బౌలర్లలో టిప్పోచ్ రెండు, తిపట్చా పుట్టావాంగ్ ఒక్క వికెట్ సాధించారు. ఇక పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్ 7న భారత్ తలపడనుంది. The sheer happiness after scoring those winning runs ✨The Thailand🇹🇭 Team won our hearts and the match today@ThailandCricket #ACC #AsiaCup2022 #WomensAsiaCup pic.twitter.com/atJwwG7wfh — AsianCricketCouncil (@ACCMedia1) October 6, 2022 చదవండి: IND VS SA: లక్నోలో భారీ వర్షం.. తొలి వన్డేపై నీలినీడలు