Ganesh
-
కౌన్సెలింగ్.. గైడెన్సే కీలకం
సాక్షి, ఎడ్యుకేషన్: ప్రస్తుత విద్యా వ్యవస్థ కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి సమస్యను పరిష్కరించాలంటే... వారికి పాఠశాల స్థాయిలోనే కెరీర్ గైడెన్స్, వారి నైపుణ్యాలపై కౌన్సెలింగ్ ఇవ్వడం వంటి చర్యలు తీసుకోవాలని ఐసీ3 (ఇంటర్నేషనల్ కాలేజ్ అండ్ కెరీర్ కౌన్సెలింగ్) మూవ్మెంట్ వ్యవస్థాపకులు, ప్రముఖ కెరీర్ కౌన్సిలర్, టెడెక్స్ స్పీకర్ గణేశ్ కోహ్లి చెప్పారు. పోటీ వాతావరణం, పరీక్షల్లో మార్కులనే ప్రతిభకు కొలమానంగా భావించడం, ఇతరులతో పోల్చుకోవడం వంటి పలు కారణాలతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారన్నారు.దీంతో వారి మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటోందని, ఈ కారణంగానే ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యలకు పాఠశాల స్థాయి నుంచే పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. ‘కౌన్సెలింగ్ ఇన్ ఎవ్రీ స్కూల్’అనే ఉద్దేశంతో ఐసీ3 మూవ్‌మెంట్‌కు రూపకల్పన చేసి, దాదాపు 90 దేశాల్లో విద్యార్థులకు కౌన్సెలింగ్, కెరీర్ గైడెన్స్ నిర్వహిస్తున్న గణేశ్ కోహ్లి.. విద్యార్థుల మానసిక ఒత్తిడి అందుకు కారణాలు, పరిష్కార మార్గాలపై పలు సూచనలు ఇచ్చారు.మానసిక ఒత్తిడికి ఎన్నో కారణాలువిద్యార్థుల్లో నెలకొంటున్న మానసిక ఒత్తిడి సమస్యలు చివరికి వారు ఆత్మహత్యలకు పాల్పడే స్థాయికి చేరుకుంటున్నాయి. 2012లో 6,654గా ఉన్న విద్యార్థుల ఆత్మహత్యలు, 2022 నాటికి 13,044కు చేరాయి. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కావడానికి అకడమిక్స్‌తో పాటు మరెన్నో అంశాలు కారకాలుగా నిలుస్తున్నాయి. ఆర్థిక అస్థిరత, వ్యక్తిగత ఆహార్యం, సహచరులు– బంధువుల ఒత్తిడి, వైఫల్యం అంటే విపరీతమైన భయం వంటివి వీటిలో ముఖ్యమైనవిగా చెప్పొచ్చు.సంపూర్ణ వికాసం కల్పించడం కంటే అత్యున్నత గ్రేడ్లకే విలువనిచ్చే విద్యావ్యవస్థ ఇందుకు మరో ముఖ్యమైన కారణం. మరోవైపు చిన్నతనం నుంచే పిల్లలను వారి సహచరులతో పోల్చడం వల్ల తమ సామర్థ్యంపై అపనమ్మకం ఏర్పడి దీర్ఘకాలిక ఒత్తిడికి గురవుతున్నారు. దీన్ని గుర్తించకపోవడం వల్ల ఎన్నో ప్రతికూల పరిణామాలు చూడాల్సి వస్తోంది.విదేశాల్లో ఇప్పటికే నివారణ చర్యలుఇతర దేశాల్లోనూ విద్యార్థుల మానసిక ఆరోగ్యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే పలు దేశాలు ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఫిన్లాండ్, కెనడా, నెదర్లాండ్స్ తదితర పాశ్చాత్య దేశాల్లో పరీక్షల్లో మార్కుల కంటే సామర్థ్య ఆధారిత అభ్యసనానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కౌన్సెలింగ్, మెంటార్íÙప్, ప్రయోగాలతో కూడిన అభ్యసనం వంటి మార్గాల ద్వారా కెరీర్‌పై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.కానీ మన దేశంలో అకడమిక్‌గా పొందిన ఘనతనే విజయంగా గుర్తిస్తున్నారు. సక్సెస్ అంటే మార్కులే అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి, మానసిక సమస్యల విషయంలో కౌన్సెలింగ్ కార్యక్రమాలు ఎంతో సత్ఫలితాలనిస్తాయి. పలు దేశాల్లో ఇది నిరూపితమైంది. మన దేశంలోనూ కౌన్సెలింగ్ సమ్మిళిత సాధనాలను అందుబాటులోకి తెస్తే మానసిక దృఢత్వాన్ని సొంతం చేసుకుని సవాళ్లను స్వీకరించే స్థాయికి విద్యార్థులు ఎదుగుతారు. సవాళ్లను ఎదుర్కొనేలా సంసిద్ధుల్ని చేయాలి నేటి విద్యా వ్యవస్థను పరిశీలిస్తే పాఠశాలలు విద్యార్థులకు కేవలం అకడమిక్ అభ్యసన కేంద్రాలుగానే ఉంటున్నాయి. వాటిని విద్యార్థుల భావోద్వేగాలను, సామాజిక, మానసిక సమస్యలను తీర్చే ప్రాంగణాలుగా రూపొందించాల్సిన ఆవశ్యకత నెలకొంది. విద్యార్థుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు తరగతి గదిలో, బాహ్య ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా సంసిద్ధులను చేసేందుకు చర్యలు తీసుకోవాలి.పిల్లల మాట తల్లిదండ్రులు వినాలి విద్యార్థుల మానసిక ఒత్తిడి విషయంలో తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. పిల్లలు తమ సమస్యలను, ఆలోచనలను తమతో పంచుకునే వాతావరణాన్ని కల్పించాలి. దీనికి భిన్నంగా పిల్లల మాటలను తీసిపారేసేలా ప్రవర్తిస్తే వారు మరింత న్యూనతకు గురవుతారు. సక్సెస్ అంటే ఒక ప్రతిష్టాత్మక కాలేజీలో చేరడం మాత్రమే కాదని పిల్లల బలాలు, ఆకాంక్షలను నెరవేర్చుకునేలా వ్యవహరించడం అని గుర్తించాలి.పరీక్ష విధానంపై పునరాలోచన చేయాలి దేశంలోని పరీక్షల విధానంపైనా పునరాలోచన చేయాల్సిన ఆవశ్యకత నెలకొంది. కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్‌నే పరీక్షించే విధంగా ఉండడంతో విద్యార్థులపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. దీంతో విద్యార్థులు కూడా ఆయా పాఠ్యాంశాలకు సంబంధించిన భావనలను, నిజ జీవిత పరిస్థితుల్లో వాటిని అన్వయించే నైపుణ్యాలను పొందడంపై దృష్టి పెట్టకుండా..మార్కుల కోసం బట్టీ పట్టి చదువుతున్నారు. పర్యవసానంగా వాస్తవ పరిస్థితుల్లో ఆయా పాఠ్యాంశాల ప్రాధాన్యత ఏంటో తెలియట్లేదు. సామర్థ్య ఆధారిత మూల్యాంకనం దిశగా అడుగులు వేయాలని జాతీయ విద్యా విధానం సూచించిన సంగతి తెలిసిందే.పాఠశాలల పాత్ర కీలకంప్రస్తుత పరిస్థితుల్లో మార్పు తేవాలంటే పాఠశాలలు ముందు నిలవాలి. మానసిక పరిపక్వత, భావోద్వేగ స్థిరత్వం వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వాలి. అదే విధంగా విద్యార్థులు ఆత్మవిశాసం పెపొందించుకోవడానికి కెరీర్ కౌన్సెలింగ్ తోడ్పడుతుంది. నిర్దిష్టమైన కెరీర్ గైడెన్స్ పొందిన విద్యార్థులు వారి భవిష్యత్తు గురించి ఎంతో ఆత్మ విశ్వాసంతో ఉంటారని.. ఆనిశి్చతి, ఆందోళనలను తగ్గించుకుంటారని పలు పరిశోధనల్లో తేలింది.ఏం చేయాలి..⇒ పిల్లల్లోని ఒత్తిడి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించేలా టీచర్లకు శిక్షణనివ్వాలి. ⇒ విద్యార్థులు భావోద్వేగాలను నియత్రించుకోవడం, స్వీయ అవగాహన పెంపొందించుకోవడంపై బోధించాలి. ⇒ మాధ్యమిక పాఠశాల స్థాయి నుంచే కెరీర్ కౌన్సెలింగ్‌ను కరిక్యులంలో భాగం చేయాలి. ⇒ విద్యార్థులు సహచరులతో మానసిక సమస్యల గురించి చర్చించుకునే పరిస్థితిని, ఎక్స్ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాల్గొనే వాతావరణాన్ని కల్పించాలి. -
యాసిడ్ దాడి నిందితుడు గణేష్ ఎక్కడ?
అన్నమయ్య, సాక్షి: పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతిపై ఉన్మాదంతో నాశనం చేయాలని చూసిన నిందితుడు గణేష్ ఇంకా పరారీలోనే ఉన్నాడు!. నేరం జరిగిన కాసేపటికే నిందితుడి ఆచూకీ గుర్తించినట్లు తొలుత పోలీసులు ప్రకటించినా.. ఆ వెంటనే మాట మార్చేశారు. దీంతో.. ఈ కేసులో పోలీసుల అలసత్వంతో పాటు, రాజకీయ నేతల జోక్యం ఉందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతి భద్రతలు ఘోరంగా క్షీణించాయి.మరీ ముఖ్యంగా చిన్నారులు, మహిళలలపై అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయి. నంద్యాల ముచ్చుమర్రి బాలిక కేసులో ఇప్పటికీ న్యాయం జరగలేదు. వీటికి తోడు ఉన్మాద ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నా.. కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలైతే కనిపించడం లేదు.తాజాగా.. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం నడిమికండ్రిగ పంచాయతీ పరిధిలోని ప్యారంపల్లెలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. త్వరలో వివాహం కావాల్సిన ఓ యువతిపై.. ప్రేమ పేరుతో వేధిస్తున్న ఓ యువకుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. బాధితురాలిని గ్రామానికి చెందిన గౌతమిగా గుర్తించగా.. నిందితుడు అమ్మచెరువుమెట్టకు చెందిన గణేశ్‌గా పోలీసులు ప్రకటించారు. ఘటన జరిగిన 15 నిమిషాల్లోపే నిందితుడి ఆచూకీ గుర్తించినట్లు తొలుత పోలీసులు ప్రకటించినా.. తర్వాత అతని జాడ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. చివరకు.. అతను పరారీలో ఉన్నాడని, గాలింపు కోసం ప్రత్యేకంగా నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు ప్రకటించారు. దీంతో బాధితురాలి బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా.. నిందితుడు గణేష్ తండ్రి సుంకారపు మురళి టీడీపీ నేత. మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషాకు ప్రధాన అనుచరుడు. అంతేకాదు.. కదిరి టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా సన్నిహితుడే. దీంతో నిందితుడిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అని బాధితురాలి బంధువులు నిలదీస్తున్నారు. అయితే ప్రభుత్వ పెద్దలు ఈ కేసులో న్యాయం జరిపిస్తామని హామీ ఇస్తున్నా.. ఇంత వరకు కేసులో ఎలాంటి పురోగతి చోటు చేసుకోలేదు. ఉన్మాది దాడి ఇలా..యువతి డిగ్రీ వరకు చదువుకుని మదనపల్లెలోని ఓ బ్యూటీ పార్లర్లో పనిచేస్తోంది. పట్టణంలోని అమ్మచెరువుమెట్టకు చెందిన గణేశ్ అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో తరచూ వేధింపులకు గురిచేసేవాడు. యువతికి ఈనెల 7న బంధువుల అబ్బాయితో నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 29న ఆమె పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న గణేశ్.. శుక్రవారం ఉదయం 6 గంటలకు గ్రామానికి చేరుకున్నాడు. యువతి తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన సమయంలో ఆమె వద్దకు వెళ్లి ముఖంపై యాసిడ్ పోసి కత్తితో దాడి చేశాడు. యువతి కేకలు వేయడంతో చుట్టు పక్కలవాళ్లు వచ్చారు. అప్పటికే నిందితుడు పరారయ్యాడు. కుటుంబ సభ్యులు యువతిని 108 వాహనంలో మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యాసిడ్ దాడి వల్ల బాధితురాలి ముఖంపై గాయాలయ్యాయి. దీంతో బెంగళూరు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమెకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు ప్రకటించారు. బాధిత కుటుంబ ఫిర్యాదుతో కొండ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. స్థానిక న్యాయమూర్తి బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న బాధితురాలి తల్లిదండ్రులకు ఇద్దరు సంతానం కాగా కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అంతా సవ్యంగా జరుగుతోందని సంతోషంగా ఉన్న సమయంలో తమ కుమార్తె పరిస్థితిని తలుచుకుని తల్లడిల్లిపోతున్నారు.దుశ్చర్యను ఖండించిన వైఎస్ జగన్ఇది దిగజారిన శాంతి భద్రతలు, రెడ్‌బుక్ పాలనకు పరాకాష్టఅన్నమయ్య జిల్లాలో ఓ యువతిపై ప్రేమోన్మాది యాసిడ్‌తో దాడి చేయటాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించి ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలకు ఇదొక నిదర్శనమని, రెడ్‌బుక్ పాలనకు పరాకాష్ట అని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, ఇకనైనా వారి భద్రతపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. యువతిపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. రాష్ట్రంలో నిత్యం మహిళలపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హోంమంత్రులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని మండిపడుతున్నారు. -
యాసిడ్ తాగించి.. కత్తితో పొడిచి!
గుర్రంకొండ (అన్నమయ్య జిల్లా), మదనపల్లె, పీలేరు: అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండతో కామ పిశాచాలు వరుసగా అఘాయిత్యాలకు తెగబడుతున్నాయి. ఒకరు కాదు.. ఏకంగా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు తమ కుటుంబం వెనుక ఉన్నారని.. రెడ్‌బుక్ రాజ్యాంగ పాలనలో తమను ఏమీ చేయలేరనే ధీమాతో అన్నమయ్య జిల్లాలో ఓ ఉన్మాది నిశ్చితార్థం జరిగిన యువతిపై అత్యంత కిరాతకంగా యాసిడ్‌తో దాడి చేసి కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. మరి కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన బాధితురాలు ఆస్పత్రిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. వారం క్రితం నిశ్చితార్థం.. మరో రెండు నెలల్లో పెళ్లి.. ఇక జీవితమంతా ఆనందంగా సాగుతుందని కలలు కన్న ఆ యువతి జీవితంలో ప్రేమికుల రోజు రోజే ఈ విషాద ఘటన చోటు చేసుకొంది. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం నడిమికండ్రిగ పంచాయతీ ప్యారంపల్లెలో శుక్రవారం ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితుడి తండ్రి సంకారపు మురళి మదనపల్లె, కదిరి టీడీపీ ఎమ్మెల్యేలకు సన్నిహితుడు కావడం గమనార్హం. మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా ప్రధాన అనుచరుడైన మురళికి టీడీపీలో క్రియాశీల సభ్యత్వం కూడా ఉంది.వేధింపులతో ఉద్యోగం మానేసి..ప్యారంపల్లెకు చెందిన దాసరి జనార్దన్, రెడ్డెమ్మల కుమార్తె గౌతమి (21) డిగ్రీ తరువాత బ్యూటీషియన్ కోర్సు చేసి మదనపల్లెలోని ఓ బ్యూటీ పార్లర్లో పని చేస్తోంది. మదనపల్లెలోని అమ్మచెరువు మిట్ట ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు మురళీ కుమారుడు గణేష్ (24) ప్రేమ పేరుతో బాధితురాలిని తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడు. అతడి ఆగడాలు భరించలేక బాధితురాలు మూడు నెలల కిందట ఉద్యోగం వదిలేసి సొంత గ్రామమైన ప్యారంపల్లెలో తల్లిదండ్రుల వద్దే నివసిస్తోంది. పీలేరుకు చెందిన మేనత్త కుమారుడితో ఆమెకు తల్లిదండ్రులు వివాహం నిశ్చయం చేశారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్‌తో ఈనెల 7వ తేదీన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. వచ్చే ఏప్రిల్ 29 తేదీన వీరిద్దరికీ వివాహం చేయాలని నిర్ణయించారు. ఏడాదిగా బాధితురాలిని వేధిస్తున్న నిందితుడు గణేష్ ఆమెను అంతమొందించేందుకు 15 రోజుల కింద ప్యారంపల్లెకు వెళ్లి రెక్కీ నిర్వహించాడు. శుక్రవారం ఉదయం బాధితురాలి తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లిన సమయంలో ఇంట్లోకి చొరబడి గడియ వేశాడు. తనతోపాటు తెచ్చుకున్న యాసిడ్ బాటిల్‌తో ఆమెపై దాడి చేసి బలవంతంగా తాగించాడు. తలపై కూడా పోశాడు. పథకం ప్రకారం తన వెంట తెచ్చుకొన్న కత్తితో ఆమెపై దాడి చేసి పలుచోట్ల కత్తితో పొడిచాడు. అనంతరం ఆమె వద్ద నుంచి సెల్‌ఫోన్ లాక్కుని పరారయ్యాడు. పొలం నుంచి పరుగులు తీస్తూ..బాధితురాలి ఇల్లు గ్రామం చివరిలో ఉండటం, అందరూ పొలం పనులకు వెళ్లడంతో ఈ దాష్టీకం ఎవరి కంట పడలేదు. అయితే తన తల్లి సెల్‌ఫోన్‌ను ఇంటి వద్దనే ఉంచి వెళ్లడంతో తండ్రికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. పొలం నుంచి పరుగులు తీస్తూ ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో ఉన్న తమ కుమార్తెను చూసి కుప్పకూలిపోయారు. తొలుత 108 వాహనంలో గుర్రంకొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ ఎవరూ లేకపోవడంతో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం బెంగళూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక న్యాయమూర్తి బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న బాధితురాలి తల్లిదండ్రులకు ఇద్దరు సంతానం కాగా కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అంతా సవ్యంగా జరుగుతోందని సంతోషంగా ఉన్న సమయంలో తమ కుమార్తె పరిస్థితిని తలుచుకుని తల్లడిల్లిపోతున్నారు.దుశ్చర్యను ఖండించిన వైఎస్ జగన్ఇది దిగజారిన శాంతి భద్రతలు, రెడ్‌బుక్ పాలనకు పరాకాష్టఅన్నమయ్య జిల్లాలో ఓ యువతిపై ప్రేమోన్మాది యాసిడ్‌తో దాడి చేయటాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించి ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలని సూచించారు.రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలకు ఇదొక నిదర్శనమని, రెడ్‌బుక్ పాలనకు పరాకాష్ట అని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, ఇకనైనా వారి భద్రతపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. –సాక్షి, అమరావతినిత్యం మహిళలపై దాడులు..యువతిపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు. రాష్ట్రంలో నిత్యం మహిళలపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హోంమంత్రులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. బాధిత కుటుంబాన్ని సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, మంత్రి లోకేశ్ ఫోన్లో పరామర్శించారు. మంత్రి రాంప్రసాద్, ఎమ్మెల్యే షాజహాన్‌బాషా బాధితురాలిని పరామర్శించేందుకు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఘటన జరిగిన 15 నిమిషాల్లోనే పోలీసులు స్పందించి నిందితుడి ఆచూకీ గుర్తించినట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చెప్పారు. నిందితుడిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. నిందితుడి కోసం నాలుగు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. -
యూట్యూబర్ ఇంట్లో శుభకార్యం.. నిహారిక, ప్రదీప్‌తో పాటు వాళ్లంతా (ఫొటోలు)
-
మితిమీరిన టీడీపీ ఇసుక దందా..ఉమా శంకర్ గణేష్ ఫైర్
-
Khairatabad ganesh : ఘనంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో ఘనంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర (ఫోటోలు)
-
నిఘా నీడలో.. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం
-
టీడీపీ బరితెగింపు.
-
గణేష్ విగ్రహ నిమజ్జనంలో గలాటా
లక్నో: యూపీలోని మహోబాలో గణేష్ విగ్రహం నిమజ్జనం సందర్భంగా గలాటా జరిగింది. ఒక ఇంటిపై బాణసంచా పడటంతో రెండు వర్గాల మధ్య గొడవ చోటుచేసుకుంది. అది తోపులాటకు దారితీసింది. చూస్తుండగానే అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసు స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కసౌరాటోరి ప్రాంతంలో గణేష్ నిమజ్జనం కోసం రెండు విగ్రహాలు ఊరేగింపుగా బయలుదేరాయి. ఇంతలో ఒక వర్గంవారు వెలిగించిన బాణసంచా మరోవర్గం ఇంటిపై పడడంతో వివాదం చెలరేగింది. దీంతో ఇరువర్గాలకు చెందినవారు బకెట్లతో దాడి చేసుకోవడంతోపాటు, రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడివారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయితే ఇరువర్గాలవారు పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ గణేష్ నిమజ్జనంలో భక్తులపై రాళ్లు రువ్విన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఇరువర్గాలను అతి కష్టంమీద శాంతింపజేసి, నిమజ్జనం సవ్యంగా జరిగేలా చూశారు. ఇది కూడా చదవండి: గణేశ్ లడ్డూల తయారీలో జడేజా భార్య -
గణేశ్ లడ్డూల తయారీలో జడేజా భార్య
జామ్‌నగర్: దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గణేష్ మండపాలలో భక్తుల రద్దీ నెలకొంది. గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రివాబా జడేజా తన నియోజకవర్గం జామ్‌నగర్ నార్త్‌లోని గణేశుని మండపంలో లడ్డూలు తయారు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.రివాబా జడేజా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య. ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘దేశవ్యాప్తంగా గణేష్ మహోత్సవాలను వైభవంగా జరుపుకుంటున్నాం. మా గణేశుడికి 4,000 లడ్డూలు నైవేద్యంగా పెడుతున్నాం. లడ్డూలను 50 మందికి పైగా మహిళలు తయారు చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. #WATCH | Gujarat | BJP MLA Rivaba Jadeja says, "Ganesh Mahotsav is being organised and celebrated across the country... Here, 4,000 Laddus are being offered to lord Ganesh and for it, more than 50 of our sisters are working. I extend my greetings to all on this occasion and I… https://t.co/TytG9H0ii0 pic.twitter.com/bgjmgrznCB— ANI (@ANI) September 14, 2024ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 2024 టీ 20 ప్రపంచ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు. రవీంద్ర జడేజా కూడా తన భార్యలాగే రాజకీయాల వైపు దృష్టి సారిస్తూ బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. రవీంద్ర గతంలో తన భార్య రివాబా కోసం ఎన్నికల ప్రచారం చేశారు. పలు రోడ్ షోలలో కూడా కనిపించారు. ఆయన భార్య రివాబా ఐదేళ్ల క్రితం బీజేపీలో చేరారు. 2022లో ఆమె జామ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.ఇది కూడా చదవండి: ఒకే ఈతలో 13 కుక్కపిల్లలు -
వినాయక నిమజ్జనాలకు కర్నూల్ ముస్తాబు
-
Surat: వినాయక మండపంపై రాళ్ల దాడి.. పలువురు అరెస్ట్
సూరత్: గుజరాత్‌లోని సూరత్‌లోని ఒక గణేష్ మండపంపై అల్లరి మూకలు రాళ్ల దాడి చేశాయి. ఈ నేపధ్యంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అల్లరిమూకలు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని శాంతింపజేశారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం పోలీసులు వినాయక మండపం దగ్గర నెలకొన్న పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీచార్జీ చేయడంతో పాటు బాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది. గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ స్వయంగా ఆ గణేశ్ మండపం దగ్గరకు వచ్చి, పరిస్థితులను అధికారులతో సమీక్షించారు. సూరత్ పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గెహ్లాట్, సూరత్ మేయర్ దాఖేష్ మవానీ ఆయన వెంట ఉన్నారు.సూరత్‌లోని సయ్యద్‌పురా ప్రాంతంలోని గణేష్ మండపంపై ఆరుగురు వ్యక్తులు రాళ్లు రువ్వారని మంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు. వీరితో పాటు వీరికి సహకరించిన మరో 27 మందిని కూడా పోలీసులు అరెస్టు చేశారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హర్ష్ సంఘ్వీ తెలిపారు. -
సెలబ్రిటీల రూపంలో గణనాథులు.. పుష్ప వినాయకుడిని చూశారా? (ఫోటోలు)
-
సినీ తారల ఇళ్లలో చవితి వేడుకలు.. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కోలా (ఫోటోలు)
-
దూర్వాయుగ్మపూజ అనగా..? గరికతోనే ఎందుకంటే..?
వినాయక చవితి వ్రతవిధానంలో దూర్వాయుగ్మపూజ విశేషమైనది. గరికతో వినాయకుని ప్రత్యేకంగా పూజించటమే దూర్వాయుగ్మపూజ. ఏకవింశతిపత్ర పూజలో భాగంగా, వినాయకచవితి వ్రతవిధానంలో దూర్వాయుగ్మంతో పూజ తప్పనిసరి. గణనాథుని దశనామాలను స్మరిస్తూ గరికను దేవునికి అర్పించటం ఈపూజలో భాగం.వంద యజ్ఞాలు ఇవ్వలేని ఫలితాన్ని ఒక్క గరికపోచ ఇస్తుంది. గరికలేని వినాయక పూజ వ్యర్థమని సాక్షాత్తు ఆ గణపతే పేర్కొన్నాడు. అందుకే, వినాయక చవితినాడు గరికకు అంతటి ప్రాధాన్యం. గరిక మహిమను తెలిపే కథలు మనకు గణేశ పురాణంలో కనిపిస్తాయి.పూర్వం సులభుడనే ఒక గంధర్వరాజు ఉండేవాడు. ఆయన భార్య సముద్ర. ఒకసారి ఆ దంపతులు పురాణశ్రవణంలో ఉండగా, అక్కడకు మధుసూదనుడనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు. అతనిని చూడగానే సులభుడికి పేద, గొప్ప అనే తారతమ్యం గుర్తొచ్చి నవ్వాడు. పేదవాడైన మధుసూదనుడి అహం దెబ్బతినటంతో కోపగించిన అతను, గంధర్వరాజును చూసి ‘రాజా! గర్వాంధుడవైన నీవు పొలం దున్నే ఎద్దుగా జన్మిస్తావు’ అని శపించాడు. అతని శాపాన్ని విని కోపగించిన గంధర్వరాజు భార్య సముద్ర ‘దరిద్రుడా! నువ్వు చెత్తాచెదారం తినే గాడిదగా జన్మించు‘ అని మధుసూదనుడికి ప్రతిశాపం ఇచ్చింది. ఆమె శాపానికి ఆగ్రహోదగ్రుడైన మధుసూదనుడు ఆమెను ‘చండాలురాలివి కమ్ము’ అని శపించాడు.ఆవిధంగా శాపగ్రస్తులైన ఆ ముగ్గురూ, శాపకారణాన శరీరాలను త్యజించారు. చండాలినిగా మారిన సముద్ర దిక్కుతోచక అటు ఇటు తిరుగుతూ గణపతి ఆలయాన్ని చూసింది. ఆరోజు చతుర్థి. గుడిలో గణేశారాధన జరుగుతోంది. బయట కుండపోతగా వర్షంకురుస్తోంది. వానకు తట్టుకోలేని చండాలిని ఇళ్ళవైపుకు పోగా, అక్కడివాళ్ళు ఆమెను తరిమారు. వేరే గత్యంతరంలేని ఆమె గణేశాలయ ప్రాకారం కిందకు వచ్చి, గడ్డీగాదం పోగుచేసి మంటవేసి చలి కాచుకోసాగింది. ఇంతలో శాపానికి గురైన ఎద్దు, గాడిదలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె పోగుచేసిన గడ్డిని తినసాగాయి. గడ్డి కోసం ఎద్దు, గాడిదలు కుమ్ములాడుకోగా, కొన్ని గడ్డిపరకలు గాలికి కొట్టుకెళ్ళి గుడిలోని వినాయకుని శిరస్సుపై పడ్డాయి. ఇంతలో చండాలిని తన చేతిలోని దుడ్డుకర్రతో వాటిని బాదసాగింది. అవి రెండూ పరుగెత్తుకుంటూ, గుడిలోకి ప్రవేశించి అక్కడున్న ఖాద్య వస్తువులన్నిటినీ తినసాగాయి. అక్కడున్న పూజారులు వాటిని తరమసాగారు. ఈ కలకలం చెవినబడ్డ చండాలిని ఏమిటన్నట్టుగా ఆలయంలోకి ప్రవేశించింది. అప్పుడామె చేతిలోని గడ్డిపోచలు వినాయకుని తలపై పడ్డాయి. అటుగా వచ్చిన భక్తులు ఆమెను అక్కడి నుంచి తరిమి, తలుపులు మూసేశారు. అలా బయటపడిన ఆ మూడు జీవుల పరిస్థితి దుర్భరంగా మారింది. అయితే, తెలియక వారు వినాయకునికి సమర్పించిన గడ్డిపోచలు తన శిరస్సును అలంకరించినందుకు సంతసించిన గణపతి వారిని కరుణించాడు.వెంటనే గణపతి భృత్యులు విమానంలో దిగివచ్చి వారు ముగ్గురినీ ఉత్తమ లోకాలకు తీసుకువెళ్లసాగారు. ఆ వింతదృశ్యం చూసిన ఋషులు చేతులు జోడించి, ఓ దేవతలారా! వీరికి ఎలా శాశ్వత గతులు లభించాయి. ఈ జీవులు పూజలు పునస్కారాలు చేసినవారు కారే! ఇందుకు ఏదైనా సులభోపాయం ఉంటే సెలవివ్వగలరు’ అంటూ వినమ్రంగా ప్రశ్నించారు. వారి ప్రశ్నలను ఆలకించిన గణేశ దూతలు గరిక మహిమను తెలియచేసే ఇంద్ర–నారద సంవాదంలోని ఆసక్తికరమైన కథను ఇలా వివరించారు:పూర్వం స్థావరం అనే పట్టణంలో కౌండిన్యుడు అనే ముని పరమ గణేశ భక్తుడు. ఆయన భార్య ఆశ్రమ. ఆమె ఒకరోజు తన భర్తను, ‘స్వామీ! మీరు గణపతి విగ్రహం శిరస్సు మీద గరిక పెట్టి పూజించటంలో ఆంతర్యమేమిటి?’ అని ప్రశ్నించింది.అందుకు కౌండిన్యుడు ఈవిధంగా చెప్పాడు. పూర్వం ధర్మ అనే నగరంలో జరిగిన ఒక మహోత్సవానికి, సిద్ధులు, చారులు, యక్షులు, నాగులు, మునులు అంతా విచ్చేశారు. అక్కడ తిలోత్తమ నాట్యమాడుతుండగా, ఆమె ధరించిన పైవస్త్రం జారి కిందపడింది. అప్పుడు ఆ సభలో ఉన్న యముడు ఆమెను చూసి మదన తాపానికి గురై ఆమెను కౌగిలించుకునేందుకు ప్రయత్నించాడు. ఆయన అలా ప్రవర్తించటం సభా గౌరవానికి భంగం అని అందరూ భావించటంతో ఆ విషయాన్ని గ్రహించిన యముడు సభ నుంచి బయటకు వచ్చాడు. అలా వచ్చిన యముని రేతస్సు స్ఖలితమై భూమిపై పడింది. ఆ రేతస్సు నుంచి వికృతాకారుడైన రాక్షసుడు ఉద్భవించాడు. ఆ రాక్షసుడి జటలు ఖగోళాన్ని ఆక్రమించినట్లుగా ఉన్నాయి. ఆ రాక్షసుడు పెద్దపెద్ద అరుపులతో అందరినీ భయపెట్టసాగాడు. అప్పుడు దేవతలు, ఋషులు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి శరణు వేడగా, ఆయన వారిని గణపతి వద్దకు వెళ్లమని సూచించాడు. దాంతో వారందరూ గణపతి వద్దకు వెళ్ళి వివిధ స్తోత్రాలు చేశారు. అప్పుడు పద్మంవంటి నేత్రాలతో కోటిసూర్యుల తేజస్సుతో మల్లెపువ్వుల కంటే తెల్లనైన పలువరుసతో, శంఖంవంటి కంఠంతో, నానాలంకారాలతో దివ్యాంబరాలను ధరించి రత్నసింహాసనంపై కూర్చొని దేవతలకు బాలగణపతిగా దర్శనమిచ్చాడు. దేవతల కోరిక మేరకు బాలగణపతి ఆ అనలాసురుడనే రాక్షసుడిని చంప నిశ్చయిస్తాడు. బాలగణపతిని చూసిన అనలాసురుడు కాలాగ్నిలా మండిపడుతూ ముందుకురాగా, తన యోగమాయా బలంతో అనలాసురుడిని మింగుతాడు. కాని అనలాసురుడు కడుపులోకి వెళితే, తన కడుపులో ఉన్న భువనాలు దగ్ధమవుతాయని తలచిన స్వామి, ఆ రాక్షసుడిని తన కంఠంలోనే నిలుపుకున్నాడు. ఆ తాపాన్ని ఉపశమింప చేయటానికి ఇంద్రుడు చంద్రకళను గణపతికి ప్రసాదించాడు. అప్పటి నుంచి స్వామివారు ఫాలచంద్రుడయ్యాడు. బ్రహ్మదేవుడు సిద్ధి, బుద్ధి అనే మానవకన్యలను సృష్టించి స్వామికి ప్రసాదించాడు. వారిని ఆలింగనం చేసుకోవటం వల్ల స్వామివారి తాపం కొంతమేరకు శాంతించింది. విష్ణువు పద్మాలను ప్రసాదించటంతో స్వామి పద్మహస్తుడు అయ్యాడు. అప్పటికీ అగ్నిని శాంతింప చేయడానికి వరుణదేవుడు నీటితో స్వామిని అభిషేకించాడు. పరమేశ్వరుడు ఆదిశేషుడిని ప్రసాదించాడు. దానితో స్వామివారి ఉదరం బంధింపబడటం వల్ల ఆయనకు వ్యాళబద్ధుడనే పేరు వచ్చింది. అప్పటికీ తాపం శాంతించలేదు. అప్పుడు ఎనభైవేలమంది ఋషులు వచ్చి ఒకొక్కరు, ఇరవై ఒక్క దుర్వాంకురాలు (గరికపోచలు) చొప్పున స్వామికి ప్రసాదించటంతో స్వామివారి తాపం పూర్తిగా ఉపశమించింది. అందుకే గణపతికి గరిక ప్రీతిపాత్రమైనది. అప్పటి నుంచి గణపతి పూజలో గరికకు విశిష్ట స్థానం దక్కింది. – కప్పగంతు వెంకటరమణమూర్తి(చదవండి: పూరి జగన్నాథుడిని గణనాథుడిగా ఆరాధిస్తారని తెలుసా..!) -
అడుగుతో మొదలై.. లడ్డూతో ఘనమై.. ఖైరతాబాద్ మహాగణపతికి తుది మెరుగులు (చిత్రాలు)
-
ఆషాఢ గజానన సంకష్ట చతుర్థి : విశిష్టత, లాభాలు
ఆషాఢ మాసంలో వచ్చే సంకష్ట చతుర్థి వ్రతాన్ని గజానన సంకష్ట చతుర్థి అంటారు. ఎంతో భక్తితో జరుపుకునే పండుగ. ఆషాఢ మాసంలోని కృష్ణ పక్షం (క్షీణించే దశ) చతుర్థి (నాల్గవ రోజు) నాడు వస్తుంది. సంకష్ట చతుర్థి అంటే కష్టాలను నాశనం చేసేదని అర్థం. ప్రతి నెల కృష్ణ పక్ష చతుర్థి తిథిని సంకష్ట చతుర్థి అంటారు. ఈ రోజు వినాయకుడిని పూజించడం వల్ల శివుడు, పార్వతి, గణపతి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢ మాసంలో యోగ నిద్రలోకి వెళ్లే ముందు విష్ణువు సృష్టి బాధ్యతను శివుడికి అప్పగిస్తాడట. అందుకే ఈ మాసంలో శివుడితోపాటు, ఆయన కుమారుడైన వినాయకుడిని పూజిస్తారు. ఈ వ్రతాన్ని సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఆచరిస్తారు. సంకష్ట చతుర్థి నాడు సాయంత్రం వేళలో మహిళలు గణపతిని పూజించి, రాత్రి చంద్రునికి అర్ఘ్యం సమర్పించి ఈ ఉపవాసాన్ని ముగిస్తారు. అత్యంత భక్తిశ్రద్దలతో గణేశుని పూజించి రోజంతా ఉపవాసం ఆచరిస్తారు. గణపతి వ్రత కథను చదువుకుని సాయంత్రం పూజలు చేసిన తర్వాత ఉపవాసం విరమిస్తారు. ఈ వ్రత మహిమ వల్ల అదృష్టం కలిసివస్తుందని అన్ని అడ్డంకులను విఘ్ననాయకుడు తొలగిస్తాడని భక్తుల విశ్వాసం. గజానన సంకష్ట చతుర్థి నాడు దానధర్మాలు చేస్తారు. అన్నార్తులకు అవసరమైన ఇతర బహుమతులు అందించడం శుభప్రదంగా భావిస్తారు. తద్వారా కష్టనష్టాలు తొలగి ఆ గణుశుని ఆశీస్సులు లభిస్తాయని, సకల సంపదలు, శుభాలు కలుగుతాయని మంచి సంతాన ప్రాప్తి కలుగుతుందని కూడా భావిస్తారు. -
టీడీపీ ఫ్రీ ఇసుకపై వైఎస్సార్సీపీ ఉమా శంకర్ గణేష్ ఫైర్
-
ఖైరతాబాద్ గణేశ్.. ఈసారి 70 అడుగుల ఎత్తు
సాక్షి,హైదరాబాద్: గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈసారి 70 అడుగుల వినాయకుడి విగ్రహాన్నిపెట్టనున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. సోమవారం(జూన్17) గణేశ్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన కర్రపూజ పూర్తయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఖైరతాబాద్‌లో పర్యావరణహిత విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. సంప్రదాయం ప్రకారం కర్రపూజ చేసి విగ్రహ ఏర్పాటు ప్రారంభించామని చెప్పారు. గతంలో కంటే మెరుగ్గా గణేశ్ ఉత్సవాలు నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారన్నారు. ఈసారి ఖైరతాబాద్ గణేశుడిని సందర్శించుకోవడానికి వచ్చిన ప్రతి భక్తుడికి ప్రసాదం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే
-
బరితెగించిన ఎర్రచందనం స్మగ్లర్లు
కేవీపల్లె/పీలేరు: ఎర్రచందనం స్మగ్లర్లు బరితెగించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన టాస్‌్కఫోర్స్ పోలీసులను కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. వివరాలు.. తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు బృందాలుగా ఏర్పడి సోమవారం రాత్రి కేవీపల్లె, సుండుపల్లె మండలాల సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టారు. ఆర్ఎస్ఐ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఆరుగురు సిబ్బంది కేవీ పల్లె మండల సరిహద్దు వద్ద గస్తీ కాస్తుండగా.. మంగళవారం తెల్లవారుజామున కేఏ 02 ఎంజీ 2847 నంబర్ కలిగిన స్విఫ్ట్ కారు అటుగా దూసుకువచ్చింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు కారును ఆపేందుకు ప్రయత్నించారు. కానీ కారు వేగంగా వచ్చి కానిస్టేబుల్ బి.గణేశ్(40)ను ఢీకొట్టింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే గణేశ్ మృతి చెందాడు. టాస్‌్కఫోర్స్ పోలీసులు కారును చుట్టుముట్టేసరికి ముగ్గురు స్మగ్లర్లు పారిపోగా.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కారులో ఏడు ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులిద్దరూ తమిళనాడుకు చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ కృష్ణారావు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. వివరాలను తెలుసుకున్నారు. కానిస్టేబుల్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. గణేశ్ కుటుంబానికి అండగా ప్రభుత్వం విధి నిర్వహణలో గణేశ్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలుసుకున్న సీఎం జగన్ మానవత్వంతో స్పందించారు. గణేశ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం నుంచి తక్షణ సాయంగా రూ.30 లక్షలు ప్రకటించారు. ఈ విషయాన్ని అనంతపురం డీఐజీ వెంకటేశ్వర్లు, అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు చెప్పారు. పీలేరు ప్రభుత్వాస్పత్రి వద్ద గణేశ్ మృతదేహానికి డీఐజీ, ఎస్పీ, టాస్‌్కఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ నివాళులర్పించారు. గణేశ్ కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గణేశ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. గణేశ్‌కు నివాళులర్పించిన వారిలో డీఎస్పీ మహబూబ్‌బాషా, డీఎఫ్‌వో వివేక్, ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌వో సుబ్బారెడ్డి, ఎఫ్ఆర్వో రామ్లానాయక్, సీఐలు మోహన్‌రెడ్డి, శ్రీనివాసులు తదితరులున్నారు. శోకసంద్రంలో కుటుంబసభ్యులు శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గుట్టకిందపల్లెకు చెందిన గణేశ్.. 2013 బ్యాచ్‌లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. తిరుపతి టాస్‌్కఫోర్స్‌లో కొన్నేళ్లుగా విధులు నిర్వర్తిస్తూ.. తిరుపతిలోనే నివాసం ఉంటున్నారు. గణేశ్‌కు భార్య అనూషతో పాటు కుమారులు రాజకిశోర్(6), వేదాన్‡్ష(3) ఉన్నారు. పీలేరు ప్రభుత్వాస్పత్రికి వచ్చిన గణేశ్ కుటుంబసభ్యులు.. అతని మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. -
బండ్ల బాజాతో మూడు గుళికలు.. ఎంత ఊదినా అంతే!
తెదేపా అధినేత చంద్రబాబు హైదరాబాద్‌ను ఏదో చేసి 25 సంవత్సరాలైందని గచ్చిబౌలి స్టేడియంలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రస్తుత పరిస్థితిలో మామూలు సభలకే జనాలు రావడం లేదు. అలాంటిది ఈ సభకు జనాలను తరలించడంలో మ్యూజికల్ నైట్ అనేది ఒకటి ఏర్పాటు చేసి మొత్తానికి కాస్త జనాలను రప్పించారు నిర్వాహకులు. ఇదే సభలో ఏతా వాతా లేని టాలీవుడ్ నిర్మాత అయిన బండ్ల గణేష్ చంద్రబాబు గురించి బాకా ఊదుతూ ఓ రెండు, మూడు బ్రాండింగ్ గుళికలను వదిలారు. అదేమిటో ఇప్పుడు చూద్దాం. వాటిలో మొదట ప్రముఖంగా చెప్పుకోదగినది బండ్లగణేష్ చేసిన విచిత్ర ప్రతిపాదన.. అదే ఖైదీ మార్పిడి... అదేంటని విస్తుపోయారా? మీరే కాదు సభలో ఉన్న వారితో పాటు ఈ విషయం విన్న వారందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రస్తుతం అవినీతి కేసులో జైల్లో ఉన్న చంద్రబాబుకు బదులు తనను జైల్లో పెట్టమని అభ్యర్ధించాడు. చంద్రబాబు వీరాభిమానిగా చెప్పుకుని బాకాలూదే బండ్ల గణేశుడు. జైల్లో పెట్టడం సరే అభిమానంతో అన్నాడని అనుకోవచ్చు. కానీ ఆ తరువాత అన్న మాటే విన్న వారందరూ విస్తుపోయారు. తనను జైల్లో పెట్టినా నా భార్య ఏమీ అనుకోదు అని గొప్ప గుళిక వదిలారు బండ్ల గణేశ్. ఇక బండ్ల గణేష్ వదిలిన రెండో గుళిక ఏంటంటే.. ఊర్లలో ఉన్న వాళ్లందరూ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ జాబులకు వెళ్తూ ఉంటే మన బండ్లకు కడుపు తరుక్కుపోయిందట. ఎందుకంటే చంద్రబాబు అనే వాడు లేకపోతే సాఫ్ట్వేర్ అనేది లేకుండా లక్షలాది మందికి ఇప్పటికీ ఉద్యోగాలు వచ్చేవి కాదట. అసలు హైదరాబాదే ఉండేది కాదంట. అంతేకాదు వీరందరికీ చంద్రబాబు ఆదర్శప్రాయుడని బాగా బజాయించాడు బాకాలూదే బండ్లగణేశుడు. చిట్టచివరి బండ్ల గుళిక ఏంటంటే... మహానటి సినిమా మీకందరికీ గుర్తు ఉండే వుంటుంది. ఆ సినిమా మొదట్లో దర్శకుడు సావిత్రి వేషధారికి ఓ సన్నివేశం వివరిస్తూ ఈ సీన్లో ఓ కంట మాత్రం కన్నీరు రావాలి అని చెబితే మహానటి సావిత్రి ఆ సన్నివేశంలో ఓ కంట మాత్రం కన్నీరు కార్చి యూనిట్ సభ్యులనందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదే విధంగా చంద్రబాబు సభలో బండ్ల గణేష్ ఆవేదనతో గొంతు వణుకుతూ తన ఏడుపును వినిపించాడు కాని కనిపించలేదు. అదేమిటి ఏడుపు కనిపించలేదు అనుకుంటున్నారా? మీరే చెప్పండి ఎదుటి వ్యక్తి ఏడుస్తున్నాడు అని మనం ఎప్పుడు అనుకుంటాం? వచ్చే కన్నీళ్లని బట్టి అని కచ్చితంగా ఎవరైనా చెప్తారు. కాని మన నటనిర్మాత అయిన బండ్ల గణేష్ తన ఏడుపును గొంతుతోనే వినిపించి కంట చుక్క కన్నీరు కూడా కనిపించకుండా చేసిన ఆయన నిజంగా మహానటుడు. ఆఖరుగా ఒక్క మాట బండ్ల బాకా ఊదినా.. గచ్చిబౌలిలో గోల రేగినా.. అవినీతి కేసులో ఇరుక్కున్న చంద్రబాబు మీద జనాలకి వచ్చేది సింపతీకాదు, సీ(చి)రాకు మాత్రమే. -
జక్కంపూడి గణేష్ వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్
-
జక్కంపూడి గణేష్ వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను సీఎం జగన్ ఆశీర్వదించారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి రాజానగరం మండలం దివాన్‌చెరువుకు చేరుకున్న సీఎంకు వైఎస్సార్సీపీ నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. చదవండి: ‘పేదల బతుకులు బాగుచేసిన ఘనత సీఎం జగన్‌దే’ -
Ganesh Nimajjanam 2023: హైదరాబాద్‌లో ఘనంగా గణేశ్ శోభాయాత్ర (ఫొటోలు)
-
బొజ్జ గణపయ్య నిమజ్జనంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ (ఫొటోలు)
-
దేశంలో తొలి సామూహిక గణేశ ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? అంతకుముందు ఏం జరిగింది?
మన దేశంలో ప్రస్తుతం అంగరంగ వైభవంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. అయితే దేశంలో తొలిసారి గణేష్ ఉత్సవాల బహిరంగ వేడుకలు ఎప్పుడు జరిగాయి. ఎక్కడ జరిగాయి? ఆ ఉత్సవాలకు ఎవరు సారధ్యం వహించారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో తొలిసారిగా 1893లో మహారాష్ట్రలోని పూణేలో గణేశ్ ఉత్సవాలు బహిరంగంగా ప్రారంభమయ్యాయి. లోకమాన్య బాలగంగాధర తిలక్ గణేశోత్సవానికి జాతీయ గుర్తింపు ఇవ్వడంలో కీలకపాత్ర పోషించారు. నాటి నుండి వినాయక నవరాత్రులు మహారాష్ట్రను దాటి భారతదేశమంతటా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఇది మతపరమైన పండుగే అయినా నాటికాలంలో స్వాతంత్ర్య పోరాట బలాన్ని పెంచడానికి, స్వాతంత్ర్యంపై అవగాహనను పెంపొందించడానికి, కులతత్వం, అంటరానితనాన్ని రూపుమాపడానికి ఒక మాధ్యమంగా ఉపయోగపడింది. ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు కూడా గణేశ్ ఉత్సవాల నిర్వహణకు హిందువులకు మద్దతుగా నిలుస్తుంటారు. 1893వ సంవత్సరానికి ముందు గణేష్ ఉత్సవాలను ప్రైవేట్‌గా లేదా చిన్న స్థాయిలో జరుపుకునేవారు. బ్రిటీష్ బానిసత్వం, మొఘల్‌లతో సహా ఇతర విదేశీ ఆక్రమణదారుల అణచివేత మొదలైనవి దీని వెనుకగల కారణాలని చెబుతుంటారు. హిందువులు నాటిరోజుల్లో తమ ఇళ్లలోనే గణపతిని పూజించేవారు. స్వాతంత్య్ర పోరాట విప్లవ నాయకుడు లోకమాన్య బాలగంగాధర తిలక్ దేశప్రజల ఐక్యతను, సామూహిక స్ఫూర్తిని పెంపొందించేందుకు గణేశ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ముందడుగు వేశారు. నిమజ్జనం సందర్భంగా గణపతి పందాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలను బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి తిలక్ శాంతియుత ఆయుధంగా మలచుకున్నారు. నాటి రోజుల్లో స్వరాజ్యం కోసం లోకమాన్య తిలక్ ఐక్యతా సందేశాన్ని ప్రజలకు తెలియజేయాలనుకున్నారు. ఇందుకోసం ఆయన గణపతి ఉత్సవాలను ప్రజా వేదికగా ఎంచుకున్నారు. తిలక్ ప్రారంభించిన గణేశ్ ఉత్సవాలు గజాననుని జాతీయ సమైక్యతకు చిహ్నంగా మార్చివేశాయి. పూణే తర్వాత మహారాష్ట్ర అంతటా జరిగిన గణేశ్ ఉత్సవాలు ఆ తర్వాత దేశ విదేశాలకు సైతం వ్యాపించాయి. స్వాతంత్ర్య పోరాటంలో ప్రజా ఐక్యతకు గణేశ్ ఉత్సవాలు దోహదపడ్డాయి. ఇది కూడా చదవండి: ఊహించని పరిస్థితుల్లో నాగసాకిపై అణుబాంబు? అమెరికా అసలు ప్లాన్ ఏమిటి? -
గణేష్ మండపంలో బుర్ఖాతో డ్యాన్సులు.. అరెస్టు
చెన్నై: గణేష్ చతుర్థి ఉత్సవాల్లో ఓ యువకుడు బుర్ఖా ధరించి డ్యాన్సులు వేయడం వివాదాస్పదంగా మారింది. బుర్ఖా ధరించి డ్యాన్సులు వేయడాన్ని ఆక్షేపిస్తూ ఫిర్యాదులు రావడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. తమిళనాడులోని వెల్లూరులో ఈ ఘటన జరిగింది. గణేష్ చతుర్థి ఉత్సవాల్లో ఓ యువకుడు డ్యాన్సులు చేస్తున్న వీడియో సోషల్ మీడియోలో వైరల్ అయింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. బుర్ఖా ధరించి డ్యాన్సులు వేయడాన్ని తప్పుబడుతూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు యువకున్ని అరుణ్ కుమార్‌గా గుర్తించి అరెస్టు చేశారు. రెండు వర్గాల మధ్య ఘర్షణకు కారణమయ్యేలా ఉందని పోలీసులు తెలిపారు. వినాయక ఉత్సవాల్లో మతపరమైన భావాలను దెబ్బతీస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. డ్యాన్స్‌లో పాల్గొన్న ఇతర యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి: కెనడాలో పిల్లలు.. భారతీయ తల్లిదండ్రుల్లో ఆందోళన -
క్యూఆర్ కోడ్ బందోబస్త్
సాక్షి, సిటీబ్యూరో: వినాయక నిమజ్జనానికి రాచకొండ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలోని చెరువులు, రూట్ మ్యాప్‌లను సిద్ధం చేసిన పోలీసులు.. సాంకేతిక వినియోగంపై దృష్టిసారించారు. ఈసారి గణేష్ బందోబస్తు ప్రక్రియను క్యూఆర్ కోడ్ ద్వారా పరిశీలించనున్నారు. దీని కోసం కమిషనరేట్ పరిధిలో దాదాపు 10 వేల వినాయక మండపాలకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌ను ఇచ్చారు. ఇందులో విగ్రహ ప్రతిష్టాపన తేదీ, నిమజ్జనం తేదీ, రూట్ మ్యాప్ వంటి వివరాన్నీ ఈ కోడ్‌లో భధ్రపరిచారు. నిమజ్జనానికి సిద్ధం చేసిన చెరువుల వద్ద ఏర్పాటు చేసిన 500 సీసీటీవీ కెమెరాల లొకేషన్స్‌ను జియో ట్యాగింగ్ చేశారు. వీటిని ఈ క్యూఆర్ కోడ్‌కు జత చేశారు. విశేషంగా ఈ క్యూఆర్ కోడ్‌లో ఏ వినాయక మండపం వద్ద ఏ తరహా వినాయకుడిని నిలబెట్టారు? ఎన్ని విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ఇంకాఎన్ని ఉన్నాయనేవి రియల్ టైంలో తెలిసిపోతాయి. ఆకతాయిలపై షీ టీమ్స్ నిఘా.. సాధారణ ప్రయాణికులు, భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిమజ్జన ఏర్పాట్లు సాగేలా గట్టి చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకించి నిమజ్జనానికి వచ్చే మహిళ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించారు. అలాగే ఆకతాయిలపై నిఘా పెట్టేందుకు 10 షీ టీమ్స్ బృందాలు మఫ్టీలో తిరుగుతుంటాయి. వీటితో పాటు రాచకొండలో ఉన్న 1.83 లక్షల సీసీటీవీ కెమెరాలతో శాంతి భద్రతల పరిస్థితులను పోలీసు ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షణతో పాటు విశ్లేషిస్తున్నారు. కమిషనర్ డీఎస్ చౌహాన్ నిమజ్జన బందోబస్తుతో పాటు నిరంతరం మండపాల వద్ద తనిఖీలను చేస్తూ పరిస్థితులను తెలుసుకుంటున్నారు. -
రూ.500 కోట్ల ఖరీదైన వినాయకుడు.. ఎక్కడుందో తెలుసా?
Most Expensive Ganesha Idol: వినాయక చవితి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. చాలామంది ప్రజలు తమ స్తోమతను బట్టి విగ్రహాలను కొనుగోలు చేసి ఆరాధిస్తూ ఉంటాడు. అయితే సూరత్ వ్యాపారవేత్త వద్ద ఉన్న గణేష్ ప్రతిమ మాత్రం చాలా ప్రత్యేకం, అంతే కాకుండా ఇది చాలా ఖరీదైనది కూడా. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి ఇది ఒక వజ్రం ముక్క. వినాయకుడిని పోలి ఉండటం వల్ల ప్రతి ఏటా దీనికి పూజలు చేసి, నిమజ్జం కార్యక్రమంలో భాగంగా తాపీ నది జలాలను విగ్రహం మీద చల్లుతారు. దీనిని 2005వ సంవత్సరంలో రూ. 29,000లతో కాంగోలోని మ్బుజీ గని నుంచి వేలంలో భాగంగా రాజేష్ పాండవ్ అనే వజ్రాల వ్యాపారి కొనుగోలు చేసాడు. ఈ వజ్రం ఇండియాకు తీసుకువచ్చిన తరువాత వినాయకుని రూపంలో ఉండటం గమనించి దానికి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఈ విగ్రహం పొడవు 24.11 మిమీ, వెడల్పు 16.49 మిమీ వరకు మాత్రమే ఉంది. ఇది 27.74 క్యారెట్స్ డైమండ్. దీనిని 2016లో వజ్రాల పరిశ్రమకు సంబంధించిన వార్షిక ప్రదర్శనలో కూడా ప్రదర్శించాడు. అప్పటి నుంచి దీనికి విస్తృత ప్రచారం లభించింది. ఇదీ చదవండి: ఏటా వినాయక చవితి బిజినెస్ ఇన్ని కోట్లా? విగ్రహాల ఖర్చే.. ఈ ప్రతిమను కొనుగోలు చేయడానికి చాలామంది ముందుకు వచ్చారని. అయితే దానిని విక్రయించే ఆలోచన తనకు లేదని వజ్రాల వ్యాపారి స్పష్టం చేసాడు. సంవత్సరటం మొత్తం దానిని జాగ్రత్తగా ఉంచి, పండుగ సమయంలో మాత్రమే బయటకు తీస్తామని తెలిపాడు. దీని విలువ ఇప్పుడు సుమారు రూ. 500 కోట్లు వరకు ఉంటుందని అంచనా. -
ప్రతి సంవత్సరం కొత్త వినాయక విగ్రహాన్ని పెట్టడం వెనుక కారణమేంటి?
-
గాజువాక ఆటోనగర్ లో 112 అడుగుల ఆయుష్ గణపతి
-
కొబ్బరికాయలతో గణనాథుడు
-
వినాయకుడి పూజలోని ఏకవింశతి పత్రాల విశిష్టత ఏంటో తెలుసా!
గణపతి పూజావిధానంలోనే ‘...పత్రం సమర్పయామి’ అని వల్లిస్తాం. పత్రం మాత్రమే పూజలో చోటుచేసుకున్న ప్రత్యేక పండుగ వినాయక చవితి. ఆ రోజున మాత్రమే ఏకవింశతి (21) పత్రాలను పూజలో వినియోగిస్తాం. ఆ పత్రిలో ఒక్కో ఆకుకు ఒక్కో విశిష్టత ఉంది. అవేమిటో తెలుసుకుందాం. మాచీ పత్రం (దవనం ఆకు): ఈ ఆకును తాకడం, సువాసన పీల్చడంద్వారా నరాల బలహీనతలు, ఉదరకోశ వ్యాధులు నెమ్మదిస్తాయి. మనోవైకల్యం, అలసట తగ్గుతాయి. ఆస్తమా నియంత్రణలో ఉంటుంది. వ్రణాలకు, కుష్టువ్యాధికి మందులా పనిచేస్తుంది. తలనొప్పి, వాతం నొప్పులను తగ్గిస్తుంది. కళ్లకు చలువ చేకూర్చి మానసిక వికాసం కలుగజేస్తుంది. ఉదరానికి మాచీపత్రం చాలా మంచిది. బృహతీ పత్రం (నేల మునగ ఆకు): దీనినే ‘వాకుడు ఆకు’ అని అంటారు. ఇది అత్యుత్తమ వ్యాధి నిరోధిని. దగ్గు, ఉబ్బసం వంటివి తగ్గుముఖం పడతాయి. హృదయానికి చాలా మంచిది. వీర్యవృద్ధిని కలుగజేస్తుంది. మూత్రం సాఫీగా కావడానికి, తాప నివారణకు, హృద్రోగ శాంతికి నేల మునగాకు సహకరిస్తుంది. బిల్వ పత్రం (మారేడు ఆకు): దీనికే మరో పేరు ’బిలిబిత్తిరి’. ’త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం, త్రిజన్మపాప సంహారం, ఏక బిల్వం శివార్పణం’ అని పూజిస్తాం. బిల్వ పత్రమంటే శివునికి ఎంత ప్రీతికరమో ఈ శ్లోకంద్వారా తెలుస్తోంది. ఈ మారేడు ఆకువల్ల నెమ్మదించే రోగగుణాలను పరిశీలిస్తే... బంక విరోచనాలు కట్టడిపోతాయి. అతిసార, మొలలు, చక్కెర వ్యాధిగ్రస్తులకు మేలైనది. నేత్రసంబంధమైన రుగ్మతలను అరికడుతుంది. శ్రీమహాలక్ష్మి తపస్సువల్ల ఈ వక్షం జన్మించినదట. మారేడు దళంలో మూడు ఆకులు, ఐదు, ఏడు, తొమ్మిది చొప్పున ఆకులుంటాయి. ఎక్కువగా మూడు ఆకుల దళమే వాడుకలో ఉంది. దూర్వాయుగ్మం (గరిక): చర్మరోగాలకు, మానసిక రుగ్మతలకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. అజీర్తిని నివారించడంలో, అంటువ్యాధులు నిరోధించడంలో, వాంతులు, విరోచనాలు అరికట్టడంలో గరిక చక్కటి గుణాన్నిస్తుంది. గజ్జిని నియంత్రిస్తుంది. గాయాలకు కట్టుకడితే క్రిమి సంహారిణి లా పనిచేసి మాడ్చేస్తుంది. దత్తూర పత్రం (ఉమ్మెత్త ఆకు): దీనిలో నల్ల ఉమ్మెత్త చాలా శ్రేష్టమైనది. ఉబ్బసం, కోరింత దగ్గు తగిస్తుంది. ఉదరకోశ వ్యాధులకు, చర్మరోగాలకు, కీళ్ల నొప్పులకు, లైంగిక సంబంధ సమస్యలకు, గడ్డలు, ప్రణాలకు ఉమ్మెత్త ఆకు చాలా బాగా పనిచేస్తుంది. బదరీ పత్రం (రేగు ఆకు): జీర్ణకోశ వ్యాధులను అరికడుతుంది. వీర్యవద్ధికి దోహదపడుతుంది. రక్త దోషాలను రూపుమాపి రుచిని కలిగిస్తుంది. శరీరానికి సత్తువను చేకూరుస్తుంది. అరికాళ్ల మంటలు, అరిచేతుల దురదలు తగ్గుతాయి. అపామార్గ పత్రం (ఉత్తరేణి): పంటి జబ్బులకు వాడితే మంచి గుణం లభించగలదు. ఆరోగ్య సంరక్షిణిగా చెప్పవచ్చు. కడుపు శూల, అజీర్తి, మొలలు, వేడిసెగ గడ్డలు, చర్మపుపొంగుకు ఉత్తరేణి చాలా మంచిది. దీనితో పళ్లు తోముకున్నట్టయితే దంతాలు గట్టిపడతాయి. దీనికే పాపసంహారిణి, రాక్షస సంహారిణి అనికూడా పేర్లున్నాయి. తులసీ పత్రం: ఇందులో చాలా రకాలున్నాయి. జలుబు, దగ్గు, చర్మరోగాలు, గొంతు సంబంధ వ్యాధులు, అజీర్ణ వ్యాధులు తగ్గించగలదు. రక్తస్రావాన్ని, అతిసారను అదుపుచేస్తుంది. వాంతులు, కడుపుశూల అరికడుతుంది. విషాన్ని హరించే గుణంకూడా తులసి ఆకులో ఉంది. యాంటిసెప్టిక్‌గా పనిచేస్తుంది. కలియుగ కల్పతరువుగా కశ్యపాయ పత్రాన్ని చెప్పాలి. చూత పత్రం (మామిడి ఆకు): దీనిని ఏ శుభకార్యమైనా, పర్వదినమైనా గుమ్మానికి తోరణంలా అలంకరించడం పరిపాటి. మామిడాకు తోరణం కడితే ఆ ఇంటికి వింత శోభ చేకూరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మామిడి ఆకులతో విస్తరి కుట్టుకుని భోజనం చేస్తే ఆకలిని పెంచుతుంది. శరీరంలో మంటలు, రక్త అతిసార, నోటిపూత, చిగుళ్ల బాధలు, పాదాల పగుళ్లు వంటివి మామిడాకుతో నివారించుకోవచ్చు. చక్కెర వ్యాధికి ఉపశమనమిస్తుంది. దీని పండ్ల రసం డిప్తీరియా నుంచి విముక్తి కలిగిస్తుంది. కరవీర పత్రం (ఎర్ర గన్నేరు ఆకు): పేలను నివారించి శిరోజాలకు రక్షణనిస్తుంది. గుండె జబ్బులు, మూత్రవ్యాధులు, కుష్టు రోగం, దురదల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కణుతులను కరిగించే గుణం పుష్కలంగా ఉంది. విష్ణుక్రాంత పత్రం (విష్ణు క్రాంతి): జ్ఞాపకశక్తిని పెంచుతుంది. నరాల బలహీనతను అరికడుతుంది. జ్వరం, పైత్యం, కఫం, వాపులకు ఈ ఆకు చాలా మంచిది. ఉబ్బసపు దగ్గు, రొమ్ము పడిశం, దగ్గు తగ్గించగలదు. దాడిమి పత్రం (దానిమ్మ ఆకు): రక్తవద్ధి కలుగజేస్తుంది. పిత్తహరిణి, అతిసార, మలేరియా, ఇతర జ్వరాలనుంచి ఉపశమనం కలిగిస్తుంది. నోటిపూత, జీర్ణకోశ, మలాశయ వ్యాధులను నివారిస్తుంది. పిల్లలకు కడుపులో నులిపురుగులను, నలికెల పాములను చేరనివ్వదు. దేవదారు పత్రం (దేవదారు ఆకు): జ్ఞానవద్ధి, జ్ఞాపక శక్తి పెంపుదలకు దోహదకారి. పుండ్లు, చర్మవ్యాధులు, జ్వరాలు, విరోచనాలు తగ్గించగలదు. దీని తైలం కళ్లకు చలువనిస్తుంది. 14. మరువక పత్రం (మరువం) : శ్వాసకోశ వ్యాధులు, కీళ్ల నొప్పులను నివారిస్తుంది. జీర్ణ శక్తిని పెంచుతుంది. ఇంద్రియ పుష్టి చేకూరుస్తుంది. దీని నూనె తలకు పట్టిస్తే మెదడుకు చలువనిచ్చి జుట్టు రాలనివ్వదు. సిందూర పత్రం (వావిలాకు) : తలనొప్పి, జ్వరం, కాలేయ వ్యాధులు, గుండె జబ్బులు, పంటి నొప్పులు, వాతపు నొప్పులు, బాలింత నొప్పులకు బాగా పనిచేస్తుంది. కలరాను తగ్గుముఖం పట్టించగలదు. కీళ్ల వాపులు తగ్గించి కీళ్ల నొప్పులను అరికడుతుంది. జాజి పత్రం (జాజి ఆకు) : తలనొప్పి, చర్మవ్యాధులు, నోటి పూత, నోటి దుర్వాసన, వాతం, పైత్యం వంటివాటికి చాలా మంచిది. బుద్ధిబలాన్ని పెంపొందిస్తుంది. కామెర్లు, శరీరంపై మచ్చలు, పక్షవాతం, కాలేయం సమస్యలు నివారిస్తుంది. గవద బిళ్లలకు జాజి ఆకు మంచి మందు. జాజికాయ, జాపత్రికి చెందినదీ ఆకు. సన్నజాజి ఆకు కాదు. గండకి లేదా గానకి ఆకు (సీతాఫలం ఆకు) : ఇది రక్తశుద్ధి చేసి వీర్యవృద్ధిని కలుగజేస్తుంది. శమీ పత్రం (జమ్మి ఆకు) : చర్మ వ్యాధి, అజీర్ణం, దగ్గు, ఉబ్బసం, ఉష్ణం వంటి రుగ్మతలనుంచి విముక్తి చూపించి ప్రశాంతతను చేకూరుస్తుంది. జీర్ణశక్తిని వృద్ధి చేయగలదు. కుష్టువ్యాధిని నియంత్రిస్తుంది. అశ్వత్థ పత్రం (రావి ఆకు) : కంటివ్యాధులు, అతిసార, సంభోగ రోగాలు, ఉన్మాదం వంటివి నిర్మూలిస్తుంది. జీర్ణకారిగా పనిచేస్తుంది. చర్మం పగుళ్లు, చర్మ రోగాలు, పుండ్లు తగ్గిస్తుంది. స్త్రీ పురుషుల్లో ఉత్తేజాన్ని రగిలించి సంతానలేమిని నివారిస్తుంది. జ్వరాలకు, నోటిపూతకు, ఆస్తమాకు ఇది మంచి మందుగా పనిచేస్తుంది. అర్జున పత్రం (తెల్లమద్ది ఆకు) : దీనిలో నల్లమద్ది ఆకుకూడా ఉంది. తెల్లమద్ది ఆకునే ఎక్కువగా పూజలకు వినియోగిస్తారు. వ్రణాలకు, శరీరంలో మంటలకు, చెవిపోటుకు పనిచేస్తుంది. గుండెకు బలాన్ని చేకూరుస్తుంది. శ్వాసకోశ వ్యాధులను దరిచేరనివ్వదు. వాత పిత్త కఫాలకు మంచిది. పితకర్మలలో వినియోగిస్తారు. దీని రసం రుమాటిజమ్ను అరికడుతుంది. నల్లమద్ది ఆకు కడుపులో నులిపురుగులను నివారిస్తుంది. అర్క పత్రం (జిల్లేడు ఆకు) : సూర్యునికి ప్రీతికరమైన ఆకు ఇది. పక్షవాతం, కుష్టు, చర్మవ్యాధులు, ఉబ్బసం, వాతం, కడుపు శూల వంటి దీర్ఘరోగాలను నివారిస్తుంది. అమిత ఉష్ణతత్వంనుంచి విముక్తి కలిగిస్తుంది. రథసప్తమినాడు ఆత్మకారకుడైన సూర్యభగవానుడి ప్రీతికోసం జిల్లేడు ఆకులను తల, భుజాలపై పెట్టుకుని తలారా స్నానంచేయడం ఆనవాయితీ. – డి.వి.ఆర్. (చదవండి: వినాయకుని పూజలో చదవాల్సిన కథ) -
విఘ్నేశ్వరుని పూజ తరువాత వాయనదానం మంత్రం
శో‘‘ గణేశః ప్రతిగృహ్ణాతు గణేశో వైదదాతి చ గణేశః తారకోభాభ్యాం గణేశాయ నమోనమః (ఈ శ్లోకము వాయనమిచ్చువారు చెప్పవలెను) మంత్రము – దేవస్యత్యాసవితుః ప్రసవేశ్వినోర్బాహుభ్యాం పూషోహస్తాభ్యామా దదా! (ఈ మంత్రము వాయనము పుచ్చుకొనువారు చెప్పవలెను) ఉద్వాసన మంత్రము: (ఈ కింది మంత్రంతో గణపతి ప్రతిమ ఈశాన్యదిశగా మూడుసార్లు కదపవలెను) యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః‘ తాని ధర్మాణి ప్రథమాన్యాసన్‘‘ తేహనాకం మహిమానస్యచంతే‘ యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయకస్వామిన్ యథాస్థాన ముద్వాసయామి‘‘ పూజా విధానం సంపూర్ణమ్. (వ్రతకల్ప పూజా విధానం సమాప్తం) -
వినాయకుడి నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే!
వినాయకుడు అంటే విఘ్నేశ్వరుడు. అంటే.. మనం ఏ పని చేయ తలపెట్టినా.. ముందు వినాయకున్ని పూజిస్తే మనకు ఆ పనిలో ఎలాంటి అవరోధాలు ఏర్పడవన్నమాట. అందుకనే ఎప్పుడూ తొలి పూజ వినాయకుడికే చేస్తారు. చదువు దగ్గర నుంచి కళల వరకు ఏది మొదలుపెట్టాలన్న ఆయన అనుగ్రహం ఉంటేనే సాధ్యం. ఇవాళే గణనాథుని జన్మదినోత్సవం ఈ సందర్భంగా ..ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటో చూద్దామా! విధి నిర్వహణే ముందు.. పార్వతి గణేషుడి బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోసి తన ఇంటికి ఆయన్ను కాపలా ఉంచి స్నానానికి వెళ్తుంది కదా. అప్పుడు శివుడు ఇంటికి వచ్చి లోపలికి వెళ్లబోతే గణేషుడు అడ్డుకుంటాడు. శివుడు తాను ఫలానా అని చెప్పినా గణేషుడు వినడు. తన కర్తవ్యం ఇంట్లోకి ఎవరినీ రాకుండా చూసుకోవాలి. అదే విషయం పార్వతి కూడా వినాయకుడికి చెబుతుంది. కనుకనే సాక్షాత్తూ శివుడే వచ్చినా సరే… గణేషుడు తన ప్రాణాలు పోయినా విధి నిర్వహణను పూర్తి చేసి తీరుతాడు. ఆయనలో ఉన్న ఆ గుణాన్ని నిజంగా మనం కూడా అలవాటు చేసుకుంటే లక్ష్యసాధనలో, కెరీర్లో మనం దూసుకెళ్లవచ్చు. ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులకు వర్తిస్తుంది. ఎలా పని తప్పించుకుని తిరగాలనే చూసే ఉద్యోగులు ప్రమోషన్లు, బోనస్‌లు మాత్రం కావాలని గోల చేస్తుంటారు. ముందు మీ డ్యూటీ సంక్రమంగా చేస్తే మనం కచ్చితంగా ఉన్నత పదవులను పొందగలుగుతాం. తల్లిదండ్రుల కన్నా ఎవరూ ఎక్కువ కాదు.. గణేషుడు, కుమారస్వామిలలో ఎవరిని గణాధిపతిగా చేయాలని ఆలోచిస్తూ శివపార్వతులు వారికి ఒక పరీక్ష పెడతారు. వారిద్దరిలో ఎవరు ముందుగా ముల్లోకాల్లో ఉన్న పుణ్య క్షేత్రాలను చుట్టి వస్తారో వారే గణాధిపతి అంటారు. దీంతో కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనంపై యాత్రలకు బయల్దేరతాడు. కానీ గణేషుడు మాత్రం తల్లిదండ్రులైన శివపార్వతులనే దేవుళ్లుగా భావించి వారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి గణాధిపతి అవుతాడు. నిజంగా సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను దైవంగా భావించి జాగ్రత్తగా చూసుకోవాలనే విషయాన్ని మనకు గణేషుడి జీవితంలో జరిగిన ఈ సంఘటన చెబుతుంది. పూజలు అనగానే ఆర్భాటాలు పలికే మనం తల్లిదండ్రుల వద్దకు వచ్చేటప్పటికి ఎంతమంది వినాయకుడిలా అనుసరిస్తున్నారో ఆలిచిస్తే మంచిది. దేవుడు కూడా తల్లిదండ్రులను సేవ తర్వాతే దేవుడు పూజ అని నర్మగర్భంగా చెబుతున్నాడని అర్థం చేసుకోవాలి. తప్పుచేసిన వారిని క్షమించడం.. వినాయకుడు ఒకసారి సుష్టుగా భోజనం చేసి ఆపసోపాలు పడుతూ వెళ్తుంటే అతన్ని చూసి చంద్రుడు నవ్వుతాడు. దీంతో వినాయకుడు కోపోద్రిక్తుడై చంద్రున్ని ఆకాశంలో నుంచి పూర్తిగా కనిపించకుండాపొమ్మని చెప్పి శాపం పెడతాడు. అయితే వెంటనే తన తప్పు తెలుసుకున్న గణేషుడు చంద్రుడికి ఆ శాపం నుంచి విముక్తి కలిగిస్తూ కేవలం ఒక్క రోజు మాత్రమే కనిపించకుండా పొమ్మని శాపాన్ని మారుస్తాడు. అలా ఎవరు ఏ తప్పు చేసినా క్షమించాలన్న విషయాన్ని వినాయకుడి జీవితం చెబుతుంది. చేపట్టి పనిని వెంటనే పూర్తిచేయడం.. వేద వ్యాసుడు చెప్పిన మహాభారతాన్ని వినాయకుడు తాళపత్ర గ్రంథాలపై రాశాడన్న సంగతి తెలిసిందే. అయితే తాను ఆ పురాణం మొత్తాన్ని చెప్పడం పూర్తి చేసే వరకు మధ్యలో ఆగకూడదని వ్యాసుడు చెబుతాడు. దీంతో వినాయకుడు మధ్యలో కనీసం విశ్రాంతి అయినా లేకుండా నిరంతరాయంగా అలా మహాభారత గ్రంథాన్ని వ్యాసుడు చెప్పింది చెప్పినట్లుగా రాస్తూనే ఉంటాడు. ఓ దశలో గ్రంథం రాసేందుకు ఉపయోగించే ఘంటం (పెన్ను లాంటిది) విరుగుతుంది. అయినా గణేషుడు తన దంతాల్లోంచి ఒక దాన్ని విరిచి గ్రంథం రాయడం పూర్తి చేస్తాడు. కానీ మధ్యలో ఆగడు. దీన్ని బట్టి మనకు తెలుస్తుందేమిటంటే.. ఏ పనిచేపట్టినా, ఎన్ని అవరోధాలు వచ్చినా వెంటనే ఆ పనిని పూర్తి చేయాలి. మధ్యలో ఆగకూడదన్నమాట..! చేపట్టిన పనిని చాలా త్వరగా పూర్తి చేయాలని తెలుపుతోంది ఆత్మ గౌరవం కోల్పోకూడదు.. ఒకసారి శ్రీమహావిష్ణువు ఇంట్లో జరిగే శుభ కార్యానికి దేవతలందరూ వెళ్తారు. స్వర్గలోకానికి గణేషున్ని కాపలా ఉంచి అందరూ వెళ్తారు. అయితే వినాయకుడి ఆకారం తమకు నచ్చనందునే ఆయన్ను అక్కడ ఉంచి వారు వెళ్లిపోయారన్న సంగతి గణేషుడికి తెలుస్తుంది. దీంతో దేవతలకు ఎలాగైనా గుణపాఠం చెప్పాలనుకున్న గణేషుడు వారు వెళ్లే దారిలో అన్నీ గుంతలు ఏర్పడేలా చేయమని మూషికాన్ని ఆదేశిస్తాడు. మూషికం దేవతలు వెళ్లే దారినంతా తవ్వి గుంతలమయం చేస్తుంది. దీంతో ఆ దారిలో వెళ్తున్న దేవతల రథం ఒకటి ఒక గుంతలో దిగబడుతుంది. వారు ఎంత ప్రయత్నించినా ఆ రథాన్ని బయటకు లాగలేకపోతారు. అటుగా వెళ్తున్న ఓ రైతును పిలిచి సహాయం చేయమంటారు. అతను వచ్చి గణేషున్ని ప్రార్థించి ఒక్క ఉదుటున గుంతలో దిగబడి ఉన్న రథాన్ని బయటకు లాగుతాడు. దాంతో దేవతలు ఆశ్చర్యపోతారు. వినాయకుడు అన్ని అవరోధాలను తొలగించే దైవం కనుక ఆయన్ను ప్రార్థించి రథాన్ని లాగానని రైతు చెప్పగానే దేవతలు సిగ్గుతో తలదించుకుంటారు. వారు చేసిన తప్పు వారికి అర్థమవుతుంది. దీంతో వినాయకుడి వద్దకు వెళ్లి క్షమాపణలు కోరతారు. అయితే దేవతలు అందరూ తన ఆకారం పట్ల అయిష్టతను ప్రదర్శించినా వినాయకుడు మాత్రం అందుకు ఏమీ బాధపడకుండా ఆత్మ గౌరవంతో అలా వ్యవహరించడం.. మనకూ ఆదర్శనీయమే. ఆయనలోని ఆ గుణాన్ని కూడా మనమూ అనుసరించాల్సిందే. ఎవరేమన్నా.. ఏ పరిస్థితిలోనైనా ఆత్మ గౌరవాన్ని మనం కోల్పోకూడదని వినాయకుడి జీవితంలో జరిగిన ఆ సంఘటన మనకు ఆ సత్యాన్ని తెలియజేస్తుంది..! ---ఆర్ లక్ష్మీ లావణ్య (చదవండి: వినాయకుని పూజకు ముఖ్యంగా అవి ఉండాల్సిందే!) -
వినాయకుని పూజలో చదవాల్సిన కథ
విఘ్నేశుని కథ ప్రారంభం (కథ చదివేవారు వినేవారు అందరూ అక్షతలు చేతిలో వుంచుకొని కథ వినాలి) సూతమహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తియు, చంద్రదర్శన దోషకారణంబును, దాని నివారణను ఇలా చెప్పెను. పూర్వము గజరూపముగల రాక్షసేశ్వరుండు శివుని గూర్చి ఘోర తపస్సు చేసెను. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఒక వరము కోరుకోమనెను. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా యుదరమందు నివసించియుండమని కోరెను. భక్త సులభుండగు నా పరమేశ్వరుండు అతని కోర్కెదీర్చి గజాసురుని ఉదరమందు ప్రవేశించెను. కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలు ప్రదేశములలో అన్వేషించుచూ కొంత కాలమునకు గజాసురుని గర్భంలో వున్నాడని తెలుసుకొని రప్పించుకొను మార్గం తెలియక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతం తెలిపి, ‘‘మహాత్మా! నీవు పూర్వము భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు యొసంగితివి, ఇప్పుడు కూడా ఉపాయాంతరముచే నా పతిని రక్షింపుము’’ అని విలపింప, శ్రీహరి పార్వతిదేవిని ఓదార్చి ధైర్యము చెప్పి పంపెను. అంత హరి బ్రహ్మాదిదేవతలను పిలిపించి, పరమేశ్వరుని రప్పించుటకై గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే సరియైనదిగా నిశ్చయించి, నందిని గంగిరెద్దుగా ముస్తాబుచేసి, బ్రహ్మాది దేవతలందరిచేత తలొక వాద్యమును ధరింపజేసి, తానును కూడా చిరుగంటలు, సన్నాయిలు తీసుకుని గజాసురపురానికి వెళ్ళి జగన్మోహనంబుగా వాయిద్యాలతో నందిని ఆడించుచుండగా, గజాసురుండు విని వారిని తన చెంతకు పిలిపించి తన భవనమందు ఆడింపమని కోరెను. బ్రహ్మాదిదేవతలు వాద్య విశేషంబుల బోరు సలుప జగన్నాటక సూత్రధారియగు హరి చిత్రవిచిత్రముగా గంగిరెద్దును ఆడించగా, గజాసురుండు పరమానందభరితుడై ‘‘మీకేమి కావలయునో కోరుకోండి’’ ఇచ్చెదను అనిన పిదప, విష్ణుమూర్తి వానిని సమీపించి, ‘‘ఇది శివుని వాహనమగు నంది. శివుని కనుగొనుటకై వచ్చెను. కావున శివునొసంగు’’ అనెను. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి, అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరిగా గ్రహించి, తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని ‘‘నా శిరసు త్రిలోకపూజ్యముగా జేసి, నా చర్మము నీవు ధరింపు’’మని ప్రార్థించెను. విష్ణుమూర్తి అంగీకారము తెలిపి నందిని ప్రేరేపించెను. నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించెను. అంత శివుడు గజాసురగర్భము నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని స్తుతించెను. అంత నా ‘‘హరి దుష్టాత్ములకిట్టి వరంబు లీయరాదు. ఇచ్చినచో పామునకు పాలుపోసినట్లగు’’నని ఉపదేశించి బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు తెలిపి తాను వైకుంఠమునకు వెళ్ళెను. పిదప శివుడు నందినెక్కి కైలాసమునకు వేగంగా వెళ్ళెను. వినాయకోత్పత్తి కైలాసంబున పార్వతీదేవి భర్త రాకను దేవాదుల వలన విని సంతోషించి పరమేశ్వరుని స్వాగతసన్నాహానికై అభ్యంగన స్నానాలంకార ప్రయత్నంలో తనకై వుంచిన నలుగుపిండితో ఒక ప్రతిమను చేయగా అది చూడముచ్చటైన బాలుని రూపముగా వుండెను. ఆ రూపానికి ప్రాణప్రతిష్ఠ చేయాలనిపించి అంతకుపూర్వం తన తండ్రి నుండి పొందిన మంత్ర ఫలముతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసెను. ఆ దివ్యస్వరూపుడైన బాలుడ్ని వాకిటముందు కాపుగా వుంచి ఎవ్వరినీ లోనికి రానీయవద్దని తెలిపెను. స్నానానంతరము పార్వతి సర్వాభరణములు అలంకరించుకొనుచు పతి ఆగమనమును నిరీక్షించుచుండెను. అపుడు పరమేశ్వరుడు నందినధిరోహించి వచ్చి లోపలికి పోబోవ వాకిలి ద్వారముననున్న బాలుడు అడ్డగించెను. బాలుని ధిక్కారానికి కోపం వచ్చిన శివుడు తనమందిరమున తనకే ధిక్కరింపా అని రౌద్రరూపంలో తన త్రిశూలముతో బాలుని కంఠంబు తొలగించి లోపలికి వెళ్ళెను. అంత పార్వతీదేవి భర్తను చూసి, ఎదురువెళ్ళి అర్ఘ్యపాద్యాదులచే పూజించె, వారిరువురును పరమానందమున ప్రియసంభాషణములు ముచ్చటించుకొనుచుండగా ద్వారం దగ్గరవున్న బాలుని ప్రస్తావన వచ్చెను. అంత ఆ మహేశ్వరుండు తాను చేసిన పనికి చింతించి, గజాసురుని శిరస్సును బాలునికి అతికించి ప్రాణంబు ప్రసాదించి ‘‘గజాననుడు’’ అని పేరుపెట్టెను. అతనిని పుత్ర ప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి. గజాననుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండెను. అతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడను నొక ఎలుక రాజును వాహనముగా జేసికొనెను. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వురులకు కుమారస్వామి జనియించెను. అతడు మహాబలశాలి. అతని వాహనరాజము నెమలి. దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతిగాంచి యుండెను. విఘ్నేశాధిపత్యము ఒకనాడు దేవతలు, మునులు పరమేశ్వరుని ప్రార్థిస్తూ తమకు ఏ పని చేసినా విఘ్నాలు కలుగకుండా ఒకరిని అధిపతిగా నియమించమని కోరిరి. గజాననుడు తాను పెద్దవాడు గనుక అయ్యాధిపత్యము ఇవ్వమని కోరెను. గజాననుడు మరుగుజ్జువాడు, అసమర్థుడు గనుక అయ్యాధిపత్యము తనకే ఇవ్వమని కుమారస్వామి కూడా తండ్రిని వేడుకొన్నాడు. సమస్య పరిష్కారానికి శివుడు ఇరువురు కుమారులను చూచి, ‘‘మీలో ఎవ్వరు ముల్లోకములలోని పుణ్యనదులలో స్నానంచేసి ముందుగా నా వద్దకు వచ్చెదరో, వారికి ఈ ఆధిపత్యం ఇచ్చెదను’’ అని మహేశ్వరుడు తెలిపిన వెంటనే కుమారస్వామి నెమలి వాహనము ఎక్కి వాయు వేగముగా వెళ్ళెను. అంత గజాననుడు ఖిన్నుడై, తండ్రిని సమీపించి ప్రణమిల్లి ‘‘అయ్యా! నా అసమర్థత మీకు తెలిసి కూడా ఈ పరీక్ష తగునా! నీ పాదసేవకుడను నాయందు కటాక్షించి తగు ఉపాయయు తెలిపి రక్షింపవే’’ యని ప్రార్థించగా మహేశ్వరుడు దయతో, కుమారా! ఒకసారి ‘‘నారాయణ మంత్రం పఠించు’’ మని ఆ నారాయణ మంత్రాన్ని ఉపదేశించెను. ‘‘సకృత్ నారాయణేత్యుక్త్యాపుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక’’ అంత గజాననుడు సంతోషించి, అత్యంత భక్తితో ఆ మంత్రం జపించుచూ తల్లిదండ్రులకు మూడుసార్లు ప్రదక్షిణములు చేయుచూ కైలాసమున వుండెను. ఆ మంత్ర ప్రభావముతో∙అంతకు పూర్వము గంగానదికి స్నానానికి వెళ్లిన కుమారస్వామికి తన అన్న గజాననుడు ఆ నదిలో స్నానమాడి తన కెదురుగా వస్తున్నట్లుగా కనిపించెను. ఆ విధముగా అతడు మూడు కోట్ల యాభై లక్షల నదులలో కూడా అలాగే చూచి ఆశ్చర్యపడుచూ, కైలాసమునకు వెళ్ళి తండ్రి సమీపంలోవున్న గజాననుని చూసి, నమస్కరించి, తన బలమును నిందించుకుని ‘‘తండ్రీ! అన్నగారి మహిమ తెలియకట్లంటిని క్షమింపుము. ఈ ఆధిపత్యంబు అన్నగారికే ఇవ్వము’’ అని ప్రార్థించెను. అంత పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధచతుర్థినాడు గజాననుడు విఘ్నాధిపత్యం స్వీకరించడం ద్వారా విఘ్నేశ్వరునిగా కీర్తింపబడుచున్నాడు. ఆనాడు సర్వదేశçస్థులు విఘ్నేశ్వరుని తమ విభవముల కొలది కుడుములు, అప్పములు మున్నగు పిండివంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పండ్లు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించగా, విఘ్నేశ్వరుడు సంతోషంతో కుడుములు మొదలైనవి భుజించి, కొన్ని తన వాహనమైన ఎలుకకు ఇచ్చి, కొన్ని చేత ధరించి భుక్తాయాసంతో సూర్యాస్తమయం వేళకు కైలాసమునకు వెళ్ళి తల్లిదండ్రులకు వంగి నమస్కారము చేయబోగా ఉదరము భూమికి ఆని, చేతులు భూమి అందవయ్యే, ఈ విధంగా ప్రణామము చేయుటకు శ్రమించుచుండగా శివుని శిరంబున వున్న చంద్రుడు జూచి వికటంబుగ నవ్వెను. అంత ‘రాజదృష్టి’ సోకిన రాలుకూడ నుగ్గగును అన్న సామెత నిజమగునట్లు విఘ్నదేవుని ఉదరము పగిలి అందున్న కుడుములు తదితరములన్నియు బయటకు దొర్లెను. అతడు మృతుండయ్యె, పార్వతి శోకించుచు చంద్రుని జూచి, ‘‘పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను కావున, నిన్ను చూచినవారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక’’ అని శపించెను. చంద్రునికి కలిగిన శాపము లోకానికి కూడా శాపమైంది. ఋషిపత్నులకు నీలాపనిందలు ఆ సమయంబున సప్తమహర్షులు యజ్ఞంబు చేయుచు తమ భార్యలతో అగ్నిప్రదక్షిణము చేయుచున్నారు. అగ్నిదేవుడు ఋషి పత్నులను చూచి మోహించాడు, కానీ ఋషులు శపిస్తారని భయపడ్డాడు. ఈ విషయం గ్రహించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి ఒక్క అరుంధతీ రూపం తప్ప తక్కిన ఋషిపత్నుల రూపాలను తానే ధరించి పతికి ప్రియంబు చేసెను. ఇది చూసిన ఋషులు అగ్నిదేవునితో వున్నవారు తమ భార్యలేయని శంకించి తమ భార్యలను విడనాడిరి. పార్వతీ శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వారికట్టి నీలాపనింద కలిగినది. ఋషిపత్నుల యాపద పరమేష్టికి విన్నవించుకొన్న పిదప ఆయన సర్వజ్ఞుడగుటచే అగ్నిహోత్రుని భార్య(స్వాహాదేవి)యే ఋషిపత్నుల రూపము దాల్చి వచ్చుట తెలియపరచి సప్తఋషులను సమాధానపరచెను. వారితో కూడా బ్రహ్మ కైలాసంబున కేతెంచి, ఉమామహేశ్వరుల సేవించి, మృతుడై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబుగూర్చె. అంత దేవాదులు, ‘‘ఓ పార్వతీ దేవి! నీవిచ్చిన శాపము వలన లోకములకెల్ల కీడు వాటిల్లుచున్నది. దానిని ఉపసంహరింపు’’మని ప్రార్థించగా, పార్వతీదేవి అంగీకరించి, ‘‘ఏ రోజున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో ఆ రోజున చంద్రుని చూడరాదు’’ అని శాపమునకు ఉపశమనము చెప్పెను. అంత బ్రహ్మాదులు çసంతోషించి తమ గృహములకేగి, భాద్రపద శుద్ధచతుర్థియందు మాత్రము చంద్రుని చూడకుండ జాగ్రత వహించి సుఖముగా ఉండిరి. శమంతకోపాఖ్యానము యదువంశమునందు సత్రాజిత్తు, ప్రసేనుడు అను సోదరులుండిరి. వారు నిమ్నుని కుమారులు. సత్రాజిత్తునకు సూర్యభగవానుడు మిత్రుడు. ఒకనాడు సత్రాజిత్తు సూర్యభగవానుని స్తుతించెను. తదేక మనస్కుడై సత్రాజిత్తు చేసిన స్తుతికి ప్రసన్నుడై సూర్యభగవానుడు అతనికి ప్రత్యక్షమయ్యెను. అంతట సత్రాజిత్తు సూర్యునకు ప్రణామములు చేసి స్తుతించెను. ప్రసన్నుడైన సూర్యుడు వరమును కోరుకొనమనెను. అంతట సత్రాజిత్తు సూర్యుని నుండి ‘‘శ్యమంతకమణి’’ని కోరెను. సూర్యభగవానుడు శ్యమంతకమణిని తన కంఠం నుండి తీసి సత్రాజిత్తునకు ఇచ్చెను. ఆ సమయమున సూర్యుడు సత్రాజిత్తుతో ఇట్లు పలికెను. ఆ దివ్యమణిని పవిత్రుడై ధరించినచో ప్రతిదినమా మణి ఎనిమిది బారువుల బంగారము అనుగ్రహించును. ఆ మణియున్ను దేశమున అనావృష్టి, ఈతి బాధలు, అగ్ని, వాయు, విషక్రిములచే ఉపద్రవములు, దుర్భిక్షము మొదలగునవి వుండవు. కానీ అశుచిౖయె ధరించినచో అది ధరించిన వానిని చంపును. ఈ విషయములను తెలిసికొని, సత్రాజిత్తు సూర్యుని నుండి మణిని గ్రహించి, ధరించి, పురవీధులలో నడిచి వచ్చుచుండగా చూసిన పౌరులు దాని కాంతికి భ్రమించి సూర్యభగవానుడే శ్రీకృష్ణ దర్శనమునకై వచ్చుచున్నాడని భావించి, ఆ విషయము శ్రీకృష్ణునకు తెలియజేసిరి. శ్రీకృష్ణుడు అట్టి రత్నము ప్రభువు వద్ద ఉన్నచో దేశాభివృద్ధికి, ప్రజా సంక్షేమమునకు ఉపయోగపడునని ఆ మణిని ప్రభువైన ఉగ్రసేనునికి ఇప్పింప సంకల్పించెను. అది తెలిసిన సత్రాజిత్తు ఆ దివ్యమణిని తన తమ్ముడైన ప్రసేనునకిచ్చెను. ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై అరణ్యానికి వెళ్ళెను. కొంత సమయమునకు శరీరశోధన కారణంగా ప్రసేనుడు అశౌచమును పొందెను. ఈ కారణముచే ప్రసేనుడు సింహం దాడిలో మరణించెను. ఆ సింహాన్ని జాంబవంతుడను భల్లూకము సంహరించి మణిని తీసుకొనిపోయి దానిని గూహలో ఊయలలోనున్న తన కుమారునకు ఆట వస్తువుగా ఇచ్చెను. ఆ పిల్లవాని పేరు సుకుమారుడు. ప్రసేనుడు అరణ్యములోనికి వేటకై వెళ్ళినపుడు శ్రీ కృష్ణుడు కూడా వేటకై వెళ్ళివుండెను. ఆనాడు భాద్రపద శుక్ల చవితి. ప్రదోష వేళలో ప్రసేనుడు సంహరింపబడెను. వానికై అడవిలో శ్రీకృష్ణుడు వెదుకుచూ తలెత్తి చూడగ ఆకాశమున శుక్లపక్ష చవితినాటి చంద్రబింబము కనపడెను. చీకట్లు బాగుగా ముసురుకున్న కారణముచే శ్రీ కృష్ణుడు తన మందిరమునకు తిరిగి వచ్చెను. దానికి పూర్వము, దేశ ప్రయోజనాల కొరకై ఆ మణిని శ్రీకృష్ణుడు కోరిన కారణము చేత, అతడే ప్రసేనుని చంపి మణిని అపహరించెనని సత్రాజిత్తు, పౌరులు భావించిరి. అంతట ఆ అపవాదును పోగొట్టుకోవాలనే సంకల్పంతో శ్రీకృష్ణుడు మరునాడు సపరివారంగా అడవిలో వెదుకగా ఎముకలు, చిరిగిన బట్టలు, తెగిపడిన ఆభరణములు కనబడెను. శ్యమంతకమణి మాత్రము దొరకలేదు. కాని కృష్ణుని వెంట వచ్చిన సత్రాజిత్తు సన్నిహితులు, కృష్ణుడే ముందటి రోజు ప్రసేనుని సంహరించి, శ్యమంతకమణిని అపహరించెననియు రాత్రి వేళ సింహము ప్రసేనుని, అతని గుర్రమును తిని యుండునని నిష్ఠురముగా పలికిరి. ఈ అపవాదు నుండి తప్పించుకొనుటకై శ్రీ కృష్ణుడు మరింత ప్రయత్నము ప్రారంభించెను. కొంత దూరము వెళ్ళగా అచట సింహపు కళేబరము కనబడెను. అచ్చటినుండి భల్లూకపు పాదముద్రలు కనబడెను. వాని ననుసరించి వెళ్ళి ఒక గుహలోనికి ప్రవేశించెను. అచ్చట యవ్వనమునందున్న ఒక యువతి ఊయలలో çపడుకున్న బాలుని ఊపుచుండెను. ఊయలపై ఆటవస్తువుగా శ్యమంతకమణి కట్టబడి ఉండెను. ఊయల ఊపుచున్న ఆ ఆమెయే జాంబవతి. ఆమె కృష్ణుని చూచి ఆయన సౌందర్యమునకు వశపడి, బహుశః ఆయన శ్యమంతకమణికై వచ్చెనని భావించి, గట్టిగా మాట్లాడినచో తనతండ్రి జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణునకేమైనా ఆపద కల్పించునేమోనని భయపడి, పాటపాడుచున్న దానివలె ఆ శ్యమంతకమణి వచ్చిన విధమునిట్లు చెప్చెను. శ్లో‘‘ సింహః ప్రసేనమవధీః సింహో జాంబవతాహతాః సుకుమారక మారోధీః తవ హ్యేష శ్యమంతకః (తా‘‘ ప్రసేనుని వధించిన సింహమును జాంబవంతుడు వధించి, శ్యమంతకమణిని తెచ్చెను. ఓ సుకుమారుడా! ఈ మణి నీకే ఏడవకుము.) అంతలో లోపల నిద్రించుచున్న జాంబవంతుడు లేచి వచ్చి, శ్యమంతకమణి కొరకై వచ్చెనని శంకించి శ్రీకృష్ణునితో ద్వంద్వ యుద్ధమునకు తలపడెను. ఆ కృష్ణుడే రామావతార కాలమున జాంబవంతునికి చిరంజీవిగా వరమిచ్చెను. ఆ కాలమున జాంబవంతునకు రాముని ఆలింగన మొనర్చు కొనవలెనని కోర్కె యుండెడిది. కాని కృష్ణుడు ఆ కోర్కెనిప్పుడు తీర్చుటకై జాంబవంతునితో ఇరవైయొక్క (21) రోజుల పాటు యుద్ధమొనర్చెను. క్రమముగా జాంబవంతుని బలము క్షీణించసాగెను. అప్పుడు తనతో యుద్ధం చేస్తున్నది ఎవరో కాదు త్రేతాయుగంలో రావణాసురుని సంహరించిన శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు. వెంటనే చేతులు జోడించి దేవాదిదేవా! ఆర్తజనరక్షకా! నిన్ను త్రేతాయుగంలో భక్తజనపాలకుడైన శ్రీరామచంద్రునిగా గుర్తించాను. ఆ జన్మంలో నీవు నామీద అభిమానంతో కోరిక కోరమంటే నేను తెలివితక్కువగా మీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను. నీవు ముందుముందు నా కోరిక తీరుతుందన్నావు. అప్పటినుంచి నీ నామస్మరణ చేస్తూ నీకోసం ఎన్నో యుగాలుగా ఎదురుచూస్తున్నా. నా ఇంటికే వచ్చి నా కోరిక నెరవేర్చావు. ధన్యుడను స్వామీ! నా అపచారమును మన్నించి నన్ను కాపాడుమని పలువిధాల అభ్యర్థించాడు. శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుని శరీమంతా తన చేతితో నిమిరి జాంబవంతా! శ్యమంతకమణి అపహరించానన్న నింద నాపై వచ్చినది. దాని రూపుమాపుకొనుటకు వచ్చాను. నువ్వు ఆ మణి ఇస్తే వెళ్ళివస్తాను అన్నాడు. జాంబవంతుడు సంతోషంగా శ్యమంతకమణితో పాటుగా తన కుమార్తె అయిన జాంబవతిని శ్రీ కృష్ణునికిచ్చి సాగనంపెను. ద్వారాకానగర పౌరులకు ఈ సత్యము తెలిసి, శ్రీకృష్ణుడు శ్యమంతకమణిని సత్రాజిత్తునకిచ్చివేసెను. అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలిసికొనిరి. శ్రీ కృష్ణుని క్షమింపమని ప్రార్థించి, తన కుమార్తె కన్యారత్నమైన సత్యభామను, మణిరత్నమైన శ్యమంతకమణిని గోపాలరత్నమైన శ్రీకృష్ణునకు సమర్పించెను. శ్రీకృష్ణుడు భూదేవి అవతారమైన సత్యభామను గ్రహించి శ్యమంతకమణి సత్రాజిత్తునకే తిరిగి ఇచ్చివేసెను. ఈలోగా పాండవులు, కుంతీదేవి, లక్క ఇంటిలో కాలి మరణించిరను వార్త వచ్చెను. శ్రీ కృష్ణునకు వారు సజీవులై ఉన్నారని తెలిసినప్పటికీ, కుటుంబపెద్ద అయిన ధృతరా్రçష్టుని అనునయించుట, లౌకిక మర్యాదగా భావించి, హస్తినాపురమునకు వెళ్ళెను. యాదవుల యందే శతధన్వుడు, కృతవర్మ, అక్రూరుడను ముగ్గురు ప్రముఖులుండెడివారు. సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి పరిణయము చేయుటకు పూర్వము, వీరు ముగ్గురు ఆమెను తమకిచ్చి వివాహము చేయమని సత్రాజిత్తునడిగిరి. వారిలో ఒకరికి సత్యభామ నిత్తునని సత్రాజిత్తు వాగ్దానమొనర్చెను. కానీ అనుకోని పైన పరిణామములతో సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహం జరిపెను. దానిచే కక్ష పెంచుకొనిన ఈ ముగ్గురూ ఏకమై కృష్ణుడు లేని సమయమెరిగి, సత్రాజిత్తును సంహరించి శ్యమంతకమణిని అపహరింపమని శతధన్వుని ప్రేరేపింపగా, అతడట్లే చేసి ఆ మణిని అక్రూరుని వద్ద వదలి పారిపోయెను, ఇది తెలిసి శ్రీ కృష్ణుడు హస్తినాపురము నుండి వచ్చి, సత్యభామను ఓదార్చి శతధన్వుని సంహరించుటకై బలరామునితో కలిసి రథములో బయల్దేరెను. గుర్రంపై పారిపోవుచున్న శతధన్వుడు, అది అలసి పడిపోగా, దానిని వదిలి పరుగిడుచుండెను. అంతట కృష్ణుడు బలరాముని రథమందుండమని, తాను దిగి శతధన్వుని వెంబడించి, పట్టి ద్వంద్వయుద్ధంలో అతనిని సంహరించి ఒడలంతయు వెదుకగా, మణి దొరకదయ్యే అంతట కృష్ణుడు తిరిగి వచ్చి బలరామునకా విషయము తెలుపగా, అతడు కృçష్ణునితో నీవు బాల్యమునుండియూ చోరుడవు, ఇప్పుడు ఆ మణిని నేనడిగెదనని శంకించి, దానిని దాచివైచి నీవిట్లు చెప్పుచున్నావని శ్రీ కృష్ణుని నిందించి, నీతో కలిసి యుండనని, విదేహ రాజ్యమునకు వెడలిపోయెను. బాహ్యశౌచము లేక మణిని ధరించి ప్రసేనుడు మరణించెను. అంతఃశౌచము లేక (శ్రీకృష్ణుని అనుమానించుటచే) సత్రాజిత్తు మరణించెను. పరమ భక్తుడైనప్పటికినీ, తాత్కాలికంగా భగవద్విరోధ భావమునొందిన అక్రూరుడు మనఃశాంతికై తీర్థయాత్ర చేయుచూ, కాశీ పట్టణమునకు చేరెను. అచ్చటికి పోగానే మనఃశాంతిని పొంది శ్యమంతకమణి వలన ప్రతిదినము వచ్చు బంగారమును ధైవకార్యములకు ఉపయోగించెను. అక్రూరుడు బాహ్యభ్యంతర శౌచమును పొంది యుండుటచే అచ్చట అతివృష్టి, అనావృష్టి రోగబాధలు లేక ప్రశాంతముగా వుండెను. ఇచ్చట శ్రీ కృష్ణుడు బలరామునిచే నిందింపబడి ఒక్కడే తిరిగి ద్వారక నగరమునకు చేరెను. ఈ మణి విషయమై తమ దండ్రులకు కీర్తి కలుగరాదని శ్రీకృష్ణుడు ఏదో మాయ చేసెనని, జాంబవతి, సత్యభామలు అనుమానించిరి. శ్రీకృష్ణుడు ఈ అపనిందలకు కారణమేమిటాయని విచారవదనంతో ఆలోచించుచుండగా నారదుడు ప్రతక్షమై ఆ అపనిందలకు కారణం భాద్రపద శుక్ల చవితినాటి రాత్రి వేటకై అడవికి వెళ్ళినపుడు చంద్రుని చూచుటయేయని, ఆ విశేషముల గురించి ఇట్లు చెప్పెను. శశివర్ణుడను పేరుగల మహాగణపతి, అన్ని లోకములలో విహరించుచూ ఒకనాడు చంద్రలోకమునకు చేరెను. బాహ్యమున వినాయకుడు మరుగుజ్జు, లంబోదరుడు అయినప్పటికీ హృదయమున మిక్కిలి కారుణ్యమూర్తి. కానీ చంద్రుడు పైకి అందగాడైనప్పటికీ, కవులచే వర్ణింపబడినప్పటికీ నడవడియందు దోషములున్నవాడు. అట్టి చంద్రుడు వినాయకుని చూచి వికటముగా నవ్వెను. అప్పుడు చంద్రుని అహంకారమును తగ్గించుటకై వినాయకుడు, ఎవ్వరేని చంద్రుని చూసినచో అపనిందలు పొందెదరని శపించెను. దానిచే జనులెవ్వరు చంద్రుని చూడరైరి. దానితో కుంగినవాడై చంద్రుడు తాను జన్మించిన క్షీరసాగరములోనికి వెళ్ళిపోయెను. చంద్రకాంతి లేమిచే ఓషధులు ఫలించుట మానెను. ప్రజలకు ఆహ్లాదము కరువాయెను. దీనిచే దయతలిచి, దేవతలు, ఋషులు, బ్రహ్మ వద్దకు పోయి నివారణోపాయము కొరకు ప్రార్థించిరి. అంతట బ్రహ్మ భాద్రపద శుక్ల చవితినాడు నక్తవ్రత మొనరింపవలెననీ (పగటి ఉపవాసము) విఘ్నేశ్వరుని పూజించి, మోదకములు, పండ్లు, కుడుములు, ప్రత్యేకించి దోసపండు నివేదన మొనరింపవలెనని సూచించెను. అప్పుడు చంద్రుడు కూడా ఆ వ్రతమొనర్చి వినాయకుని అనుగ్రహమును పొందెను. అంతట వినాయకుడు, ఒక్క తన అవతారదినమైన భాద్రపద శుక్ల చవితినాటి రాత్రి తప్ప మిగిలిన రోజులలో చంద్రుని చూచినను ఎట్టి నిందలు కలగవని శాపావకాశమిచ్చెను. అంతట భాద్రపద శుక్ల చవితినాటి చంద్రబింబము చూచుటవలన జరిగిన విపరీతములను స్వయముగా అనుభవించిన శ్రీకృష్ణ పరమాత్మ తనకు కలిగిన నిందలను పోగొట్టుకొనుటకై నారదుని సలహా మేరకు శ్రీకృష్ణుడు వినాయక వ్రతమాచరించెను. వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై శ్రీకృష్ణునికి వచ్చిన అపనిందలు తొలగిపోవునని మంగళవాక్కులు పలికెను. అంతట శ్రీకృష్ణుడు తాను సమర్థతతో ఇంత కష్టపడితిని గాని, సామాన్యులకది ఎట్లు సాధ్యమగుననీ, కావున లోకమంతటినీ అనుగ్రహింపమని కోరెను. భాద్రపద శుక్ల చవితినాడు ఉదయం తనను ఫూజించి, శ్యమంతకోపాఖ్యానమును చదివిన.. విన్నా.. చంద్రుని చూచిననూ ఎటువంటి అపనిందలు కలగవని వినాయకుడు వరమిచ్చెను. ఈ వృత్తాంతంలో దేవతలు, మహర్షులు, ప్రజలెల్లరు వినాయకుని యథాశక్తి పూజించి, కోర్కెలు నెరవేర్చుకుంటూ సుఖముగా వున్నారని సూతమహాముని శౌనకాదిమునులతో ఈ వృత్తాంతం తెలిపెను. దీనిలో ఏ మాత్రం ఏమరుపాటు తగదని శ్యమంతకోపాఖ్యానములో శ్రీకృష్ణపరమ్మాత వృత్తాంతం ద్వారా స్పష్టమైనది. అందువలన ఈ శ్యమంతోకాపాఖ్యానమును అనగా అందులో హితబోధను చెప్పుకొని గణేశతత్వంపట్ల భక్తి, వినయములతో శిరమున అక్షతలు ధరించిన యెడల చవితి చంద్రుని చూచిననూ నిష్కారణంగా నిందాభయం ఉండదని లోకులకు వరము ఇచ్చినారు. అది మొదలు శ్యమంతోకాపాఖ్యాన గాథను చదువుట, వినుట సంప్రదాయమైనది. ద్వారకా నగరమునందు కలిగిన క్షామ నివారణకు మాహా భక్తుడైన అక్రూరుని రాక అవసరమని భావించి, శ్రీకృష్ణుడు అక్రూరునకు కబురుపంపెను. పరమభక్తుడైన అక్రూరుడు ద్వారక నగరమునకు వచ్చుటచే, అందరికీ శ్యమంతకమణి వృత్తాంతము తెలిసి శ్రీకృష్ణునిపై వచ్చిన అపనిందలు తొలగిపోయినవి. లోపల, బయట శౌచము కల అక్రూరుని వద్ద శ్యమంతకమణి శుభ పరంపరలిచ్చుచుండెను. ‘‘మంగళం మహత్’’ చేతిలో వున్న అక్షతలను కొన్ని విఘ్నేశ్వరుని పాదాల చెంత కొన్ని వుంచి కొన్ని మీ శిరస్సుపై వేసుకొని మిగిలినవి మీ పిల్లల శిరస్సుపై వేసి దీవించవలెను. – కథ సమాప్తం – పునఃపూజ: ఛత్రమాచ్ఛాదయామి‘ చామరేణ వీచయామి‘ నృత్యం దర్శయామి‘ గీతం శ్రావయామి‘ ఆందోళికా నారోహయామి‘ గజానారోహయామి‘ అశ్వానారోహ యామి‘ సమస్త రాజోపచార, భక్త్యోపచార, శక్త్యోపచార పూజాన్ సమర్పయామి‘‘ (స్వామిపై పుష్పాక్షతలు వేయాలి) -
బెర్లిన్‌లో ‘గణేశ్ మహరాజ్ కీ జై’.. దీపావళికి కుంభాభిషేకం!
యూరప్ దేశమైన జర్మనీలో 20 ఏళ్లపాటు సాగిన విశేష కృషి అనంతరం హిందూ దేవాలయ నిర్మాణం పూర్తయింది. రాజధాని బెర్లిన్‌లో నిర్మితమైన ఈ గణేశ దేవాలయం 70 ఏళ్ల విల్వనాథన్ కృష్ణమూర్తి సాగించిన అవిశ్రాంత కృషి ఫలితం. కాగా ఈ ఆలయంలో ఇంకా దేవుని విగ్రహం ప్రతిష్ఠితం కాలేదు. ఈ ఏడాది (2023)దీపావళి సందర్భంగా బ్రహ్మాండమైన పూజాకార్యక్రమాలను నిర్వహిస్తూ వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. మీడియాతో మాట్లాడిన విల్వనాథన్ కృష్ణమూర్తి తాను 50 సంవత్సరాల క్రితం జర్మనీకి వచ్చానని తెలిపారు. ఆయన బెర్లిన్‌లో ఉంటున్నప్పుడు ఒక ఎలక్ట్రికల్ కంపెనీలో పనిచేశారు. జర్మనీకి వచ్చినప్పటి నుండి అతని కల దేవాలయం నిర్మించడం. ఈ కల సాకారం అయ్యేందుకు 2004లో ఆయన ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. అనంతర కాలంలో బెర్లిన్ జిల్లా యంత్రాంగం ఆలయ నిర్మాణానికి హాసెన్హైడ్ పార్క్ వెలుపల ఒక ప్లాట్‌ను కేటాయించింది. అదిమొదలు విల్వనాథర్ ఆలయ నిర్మాణానికి నిధులు సేకరించడం మొదలుపెట్టారు. 2007లోనే ఆలయ నిర్మాణం ప్రారంభించాలని ప్లాన్ చేశారు. కానీ 2010 వరకు కూడా ప్రారంభం కాలేదు. రుణాలు తీసుకువచ్చి ఆలయం నిర్మించడం తనకు ఇష్టం లేదని కృష్ణమూర్తి తెలిపారు. అందుకే ఆయన విరాళాల సేకరణలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో బెర్లిన్‌లో భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చిందని, దీంతో విరాళాలు అందడం కూడా పెరిగిందని ఆయన తెలిపారు. బెర్లిన్‌లో చాలా మంది భారతీయులు పనిచేస్తున్నారని, వారంతా విరాళాలు అందజేస్తున్నారన్నారు. ముఖ్యంగా యువత హృదయపూర్వకంగా విరాళాలు అందజేస్తున్నారన్నారు. రాబోయే దీపావళి సందర్భంగా 6 రోజుల పాటు కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించాలనుకుంటున్నట్లు విల్వనాథన్ కృష్ణమూర్తి తెలిపారు. ఇది కూడా చదవండి: అది శత్రువును నిలువునా చీల్చే శివాజీ ఆయుధం.. త్వరలో లండన్ నుంచి భారత్‌కు.. Germany's largest #Hindutemple is set to open in Berlin in November 2023. Sri-Ganesha Hindu Temple will be located in the tallest high-rise building currently under construction in Berlin, known as the "Amazon Tower." Opening of the temple is expected to coincide with the… pic.twitter.com/qwkq5SQ7IH — Centre for Integrated and Holistic Studies (@cihs_india) September 4, 2023 -
తీన్మార్ డ్యాన్సులు, స్టెప్పులతో గణేషుడికి వీడ్కోలు
-
భాగ్యనగరం నలుమూలలా గణనాథుల సందడి
-
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర
-
దర్శకురాలు కావాలనుకుంది..కానీ తండ్రి హఠాన్మరణం ఆమెను ..
ముంబైలో గణేశ్ నిమజ్జనం రోజున వేలాది విగ్రహాలు సముద్రం వైపు కదులుతాయి. వాటిలో భారీ విగ్రహాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆ విగ్రహాల్లో దాదాపు సగం రేష్మ ఖాతు తయారు చేసినవే. తండ్రి మరణించాక గణేశుడి విగ్రహాల తయారీ పరంపరను భుజానికెత్తుకుంది రేష్మ. ఇవాళ ముంబైలో ఆమె నంబర్ 1 గణేశ శిల్పి. ‘మనల్నందరిని దేవుడు తయారు చేశాడు. కాని ఆ దేవుణ్ణి తయారు చేసే అవకాశం ఎంతమందికి వస్తుంది’ అంటుంది రేష్మ ఖాతు. నలభై ఏళ్ల రేష్మ ఖాతును ముంబైలో ‘మూర్తికార్’ అని పిలుస్తారు. అంటే దేవుని మూర్తుల రూపశిల్పి అని అర్థం. ‘ఇవాళ మా నాన్న నన్ను చూస్తే చాలా ఆశ్చర్యపోయి ఉండేవాడు’ అంటుందామె తండ్రి విజయ్ ఖాతును తలుచుకుని. ఎందుకంటే తండ్రి జీవించి ఉండగా ఆమె ఎప్పుడూ ఆయన వర్క్‌షాప్‌లోకి పెద్దగా అడుగు పెట్టేది కాదు. ఇవాళ ఆ వర్క్‌షాప్‌కు ఆమే సర్వస్వం. ‘ముంబైలోనే కాదు దేశ విదేశాల్లోనే మా నాన్న విజయ్ ఖాతు చాలా ప్రఖ్యాతుడు. ఇవాళ మనం చూస్తున్న గణేశ్ విగ్రహాల భిన్న రూపాలకు ఆయనే ఆద్యుడు. గతంలో గణేశుడు విగ్రహం అంటే అందరూ కూర్చుని ఉన్న మూర్తే తయారు చేసేవారు. మా నాన్న గణేశుడి చేతులకు, కాళ్లకు కదలికలు తెచ్చాడు’ అంటుంది రేష్మ. 2017లో విజయ్ ఖాతు మరణించాక ఆయన శిల్ప సామ్రాజ్యాన్ని రేష్మ సమర్థంగా నిర్వహిస్తోంది. సినీ దర్శకురాలు అవుదామని రేష్మ ఖాతు కుటుంబం తాతల కాలం నుంచి గణేశ్ విగ్రహాల తయారీలో ఉంది. ఆ శిల్పాల తయారీ రేష్మకు సర్వం తెలిసినా తాను మాత్రం సినీ దర్శకురాలు కావాలని ఆ కోర్సులు చేసింది. అయితే తండ్రి హఠాత్ మరణంతో మొత్తం కార్ఖానా స్తంభించింది. ‘మా నాన్న చనిపోయాక ఆయన విలువ మరింత తెలిసింది. ఎందరో మండపాల నిర్వాహకులు నా దగ్గరకు వచ్చి ప్రతి ఏటా వినాయక చవితికి మీ దగ్గరే విగ్రహాలు తీసుకెళ్లేవాళ్లం... ఇక మీదట కూడా అలాగే చేస్తాం అని చెప్పేవారు. ముంబైలో ప్రఖ్యాతమైన లాల్బాగ్, ఖేత్వాడి, చందన్వాడి, తులసివాడి మంటపాల్లో ప్రతి ఏటా మేము తయారు చేసిన విగ్రహాలే పెడతారు. వీరందరినీ చిన్నబుచ్చడం నాకు నచ్చలేదు. మా మేనమామ నాతో– నువ్వు చేయగలవమ్మా అన్నాడు. ధైర్యంగా మా నాన్న సీట్లో కూచున్నాను’ అంటుంది రేష్మ. మగవాళ్లకు నచ్చలేదు గత ఐదారేళ్లుగా రేష్మ విజయవంతంగా గణేశ్ విగ్రహాల తయారీని కొనసాగిస్తున్నా ఇంకా ఆ సంగతి మింగుడుపడని మగవారు ఉన్నారు. ‘మా ఫ్యాక్టరీలో శిల్పులు, మౌల్డర్లు, మేనేజర్లు అందరూ నేను బాస్‌గా రావడం చూసి ఆశ్చర్యపోయారు. కొందరు చాలా ఏళ్లుగా మా నాన్న సీట్ మీద కన్నేసి ఉంచారు. వారంతా నేను రావడంతో సహాయ నిరాకరణ చేశారు. నేను శిల్పి కూతురిని. శిల్పం చేయడం నా జీన్స్‌లో ఉంది. నేనే రంగంలో దిగి కొత్త విగ్రహాలు ఎలా చేయాలో సూచనలు ఇస్తూ సరైన దారిలో కార్ఖానాను పెట్టేసరికి తల వొంచారు’ అంటుంది రేష్మ. పార్వతీదేవి చేతుల్లో గణేశుడు తయారైన చందాన ముంబైలో ఒక స్త్రీ చేతుల మీదుగా ప్రతి వినాయక చవితికి విగ్రహాలు తయారవుతాయి. పూజలు అందుకుంటాయి. గణేశుడి మూర్తుల తయారీలో ఒక స్త్రీ ఈ విధాన ముందుండటం తప్పక సంతోషపడాల్సిన విషయం. ---శభాష్ రేష్మ. (చదవండి: బీర్‌ని బేషుగ్గా తాగొచ్చట!అందులో ప్రోటీన్, విటమిన్ బీ..) -
మహిళలపై దాడి చేసినా పట్టించుకోరా?
ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ నడి బొడ్డున టవర్ సర్కిల్లో ఇద్దరు మహిళలపై నలుగురు హత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై పోలీసుల నిర్లక్ష్యం విమర్శలపాలవుతోంది. బాధితులు ఫిర్యాదుపై కనీసంగా పట్టించుకోకపోవడం, నలుగురు నిందితులను కనీసం విచారించకుండా వదిలేయడం వివాదాస్పదమవుతోంది. ఆర్మూర్ పట్టణంలోని నిజాంసాగర్ కెనాల్‌పై నివాసం ఉండే శివరాత్రి అరుణ, వింజ శోభ వరసకు అక్కా చెల్లెళ్లు. వీరిద్దరూ ఇళ్లలో కూలీ పనులు ముగించుకుని నడుచుకుంటూ తమ ఇళ్లకు వెళ్తుండగా వారి సామాజిక వర్గానికే చెందిన సంపంగి రమేష్, సంపంగి గణేశ్, సంపంగి బబ్లు, సంపంగి నాగమణి రాళ్లతో దాడి చేశారు. పాత కక్షల నేపథ్యంలో జరిగిన దాడిలో అరుణ తల పగిలి రక్తం కారడంతో తల్లి యాదమ్మ సహాయంతో ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌కు పరిగెత్తుకొని వెళ్లారు. వెంటనే పోలీసులు బాధిత మహిళలిద్దరినీ చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించి ఘటనా స్థలానికి వెళ్లి దాడికి పాల్పడిన నలుగురిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. కానీ ఆ తర్వాత వారిని వదిలి వేయడంపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని తిరిగి పోలీస్ స్టేషన్‌కు బాధిత మహిళలు వచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. గత రెండు రోజులుగా తిరుగుతున్నా పట్టించుకోకపోగా.. ఇదే పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్సై ఏకంగా మీపైనే కేసు పెడతాం అంటూ తమనే బెదిరించారని బాధిత మహిళలు చెబుతున్నారు. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ అంటూ ప్రచారం చేస్తుండగా ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో మాత్రం నిరుపేద మహిళలపై దాడి చేసిన వారిని కేసులు పెట్టడానికి కూడా పోలీసులు మీనమేషాలు లెక్కించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆలస్యంగా ఎఫ్ఐఆర్ ఎందుకంటే: సురేష్ బాబు, ఎస్‌హెచ్‌వో, ఆర్మూర్ ’’ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఇతర కేసుల ఒత్తిడిలో ఇద్దరు మహిళలపై దాడి చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఆలస్యం అయింది. దాడి చేసిన నలుగురిపై శుక్రవారం రాత్రి 324 సెక్షన్ కేసు నమోదు చేశాము. బాధిత మహిళలపై సైతం కౌంటర్ కేస్ ఫైల్ చేశాము.’ -
నిజామాబాద్ ఎంపీగా గెలుస్తా
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తాను నిజామాబాద్ ఎంపీ గానే పోటీ చేస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఎంపీగా గెలుస్తా నని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్యే గణేష్ బిగాల, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్‌తో కలిసి గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ధర్మపురి అర్వింద్ ఓ దౌర్భాగ్యుడు అని, ఆయన ఎంపీగా గెలవడంతో నిజామాబాద్ అభివృద్ధిలో ఇరవై ఏళ్లు వెనక్కి పోయిందని ధ్వజమెత్తారు. అర్వింద్ కోరుట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కూడా పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ ఐటీ హబ్ గురించి అర్వింద్ దారుణంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. గత పదేళ్లలో నిజామాబాద్ జిల్లాలో జరిగిన అభివృద్ధిలో బీజేపీ భాగస్వామ్యం సున్నా అని విమర్శించారు. నిజామాబాద్ ఐటీ హబ్ తో జిల్లా దశ దిశ మారబోతోందని, ఉద్యోగాల కల్పనపై అర్వింద్ మాట్లాడినవన్నీ అబద్ధాలేనన్నారు. సీఎంకు సవాల్ విసిరే స్థాయి ఆయనకు లేదన్నారు. స్విచ్‌లో వేలు పెట్టి చూస్తే కరెంటు వస్తుందో లేదో తెలుస్తుంది తెలంగాణలో కరెంటు 24 గంటలు వస్తుందో లేదో ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ బీజేపీ కార్యాలయంలోని స్విచ్‌లో వేలుపెట్టి చూడాలని కవిత సలహా ఇచ్చారు. పార్లమెంటులో ఏం మాట్లాడుతారో సంజయ్‌కే తెలియదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని కాళేశ్వరం సహా ఏ ప్రాజెక్టుకూ కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని, మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు ఉండడంతో అక్కడున్న ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడమే కాక, రూ.22వేల కోట్లు మంజూరు చేశారని చెప్పారు. రెండురోజుల కిందట కేంద్ర మంత్రి నిషికాంత్ దూబే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.86 వేల కోట్లు ఇచ్చామని అబద్ధాలు మాట్లాడారని, దానికి కొనసాగింపుగా బండి సంజయ్ అదే మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథకు రూ. 24 వేల కోట్లు ఇవ్వమంటే ఇవ్వలేదని గుర్తు చేశారు. తమ నాయకుడిని వ్యక్తిగతంగా దూషించిన బండి సంజయ్ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కాళేశ్వరంపై బీజేపీ ఎంపీ తప్పుడు ప్రచారం చేయగా, బీఆర్ఎస్ ఎంపీలు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారని కవిత పేర్కొన్నారు. -
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ రాజకీయ చరిత్ర
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన గణేష్ బిగాల మరోసారి విజయం సాదించారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి తాహిర్ బిన్ హమదాన్పై 26055 ఓట్ల ఆదిక్యత సాదించారు. గణేష్ గుప్తాకు 71397 ఓట్లు రాగా, తాహిర్ బిన్ కు 45342 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే ఇ.లక్ష్మీనారాయణకు సుమారు ఇరవై మూడువేల ఓట్లు వచ్చాయి. లక్ష్మినారాయణ 2009 ఎన్నికలలో గెలిచిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో బాగంగా ఆయన తన పదవికి రాజీనామా చేసి, తిరిగి ఉప ఎన్నికలో గెలుపొందారు. ఈ ఉప ఎన్నికలో అప్పటి పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను ఆయన ఓడిరచారు. కాని తదుపరి జరిగిన ఎన్నికలలో లక్ష్మినారాయణ గెలవలేక పోయారు. గణేష్ బిగాల వైశ్య సామాజికవర్గానికి చెందిన వారు. తెలంగాణ అసెంబ్లీలో ఈ సామాజికవర్గం నుంచి ఈయన ఒక్కరే గెలిచారు. ఈ నియోజక వర్గంలో మున్నూరుకాపు వర్గం నేతలు ఎక్కువగా గెలిచినా, ఇతర సామాజిక వర్గాల వారికి కూడా అవకాశం రావడం విశేషం.11 మంది బిసి నేతలు ప్రదానంగా మున్నూరు కాపు సామాజికవర్గం వారు ఎన్నికవుతూ వచ్చారు.రెండుసార్లు ముస్లింలు, రెండుసార్లు వైశ్య, ఒకసారి ఇతరులు కూడా ఎన్నికయ్యారు. సీనియర్ నేత డి.శ్రీనివాస్ 1989, 1999, 2004లలో ఇక్కడ నుంచి మూడుసార్లు గెలుపొందారు. ఈయన 1989-94 మధ్యకాలంలో, అలాగే 2004లో వై.ఎస్.మంత్రివర్గంలోను సభ్యునిగా ఉన్నారు. రెండుసార్లు పిసిసి అద్యక్షుడు అయ్యారు. శాసనమండలిలో కాంగ్రెస్ ఐ పక్షాన ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు. కాని ఆ తర్వాత టిఆర్ఎస్లో చేరి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. తదుపరి రాజ్యసభకు టిఆర్ఎస్ పక్షాన ఎన్నికయ్యారు. కాని కొంతకాలానికి టిఆర్ఎస్ లో అసమ్మతి నేతగా మారారు. ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ బిజెపిలో చేరి నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో ముఖ్యమంత్రి కెసీఆర్ కుమార్తె కవితను ఓడిరచి సంచలనం సృష్టించారు. నిజామాబాదులో 16సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐలు కలిసి ఆరుసార్లు, టిడిపి మూడుసార్లు, బిజెపి రెండుసార్లు, టిఆర్ఎస్ రెండుసార్లు గెలవగా, ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా ఇక్కడ నుంచి గెలుపొంద గలిగారు. టిడిపి పక్షాన డి. సత్యనారాయణ రెండుసార్లు, కాంగ్రెస్ నేత డి.హుస్సేన్ రెండుసార్లు గెలిచారు. డి. సత్యనారాయణ ఎన్.టి.ఆర్. క్యాబినెట్లో ఉన్నారు. నిజామాబాద్ అర్బన్‌లో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ఆపద్బాంధవి 108
చౌడేపల్లె: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైద్య స్వరూపమే మారిపోయింది. పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగానే 108 వ్యవస్థను మరింతగా బలోపేతం చేసింది. ఫోన్ వస్తే చాలు నిమిషాల్లో ఘటనా స్థలానికి సిబ్బంది చేరిపోతున్నారు. రోగులకు కావాల్సిన సహాయం అందించి మన్ననలు అందుకుంటున్నారు. ఇలాంటిదే చిత్తూరు జిల్లాలో జరిగింది. చౌడేపల్లె మండలం, పందిళ్లపల్లె పంచాయతీ, ముదిరెడ్డిపల్లెకు చెందిన రాజశేఖర్, వసంత దంపతులు సోమల మండలం, పెద్ద ఉప్పరపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న మామిడితోటలో కాపలా ఉన్నారు. ఇక్కడకు ఎలాంటి దారి వసతి లేదు. సెల్‌ఫోన్ సిగ్నల్ కూడా అందదు. వసంత నిండు గర్భిణి కావడంతో ఆదివారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. రాజశేఖర్ సెల్ సిగ్నల్ ఉన్న ప్రాంతానికి వచ్చి 108కు ఫోన్ చేశారు. సమాచారం అందుకొన్న 108 సిబ్బంది గణేష్, ప్రసాద్ అతికష్టం మీద మామిడి తోటకు చేరారు. అక్కడి నుంచి రోడ్డు మార్గానికి కిలోమీటరు దూరం ఉండటంతో స్ట్రెచర్‌పైనే గర్భిణిని మోసుకువచ్చారు. మార్గమధ్యంలో పురిటి నొప్పులు అధికమవడంతో మామిడితోటలోనే సుఖ ప్రసవం చేశారు. వసంత మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను అటవీ ప్రాంతం నుంచి చౌడేపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సిబ్బంది సేవలను గ్రామస్తులు, అధికారులు అభినందించారు. -
గిన్నిస్‌లోకి భాగ్య‘నగ’లు!
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఓ ఆభరణాల సంస్థ రూపొందించిన ఆభరణాలకు ఏకంగా 8 గిన్నిస్ రికార్డులు లభించాయి. 11,472 వజ్రాలతో పొదిగిన, అత్యంత బరువైన (1,011.150 గ్రాములు) బంగారు గణేశ్ పెండెంట్, అత్యధికంగా 54,666 వజ్రాలతో పొదిగిన, అత్యంత బరువుగల (1,681.820 గ్రాములు) బంగారు రామ్‌దర్బార్ పెండెంట్, 315 పచ్చలు, 1,971 వజ్రాలతో పొదిగిన ద సెవన్ లేయర్ నెక్లస్, 63.65 క్యారట్ల పచ్చలు, 29.70 క్యారట్ల వజ్రాలు ఉపయోగించి తయారు చేసిన అత్యంత ఖరీదైన (సుమారు రూ. 90 లక్షల) భూతద్దం గిన్నిస్‌లో చోటుదక్కించుకున్నాయి. ఆదివారం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివ్‌నారాయణ్ జ్యుయలర్స్ ఎండీ తుషార్ అగర్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో మరే ఆభరణాల సంస్థకు ఈ ఘనత లభించలేదన్నారు. హైదరాబాద్ నిజాం ఆభరణాల వైభవంలో కీలకపాత్ర పోషించిన తమ పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగిస్తూ నగర ప్రతిష్టను ఇనుమడింపజేసినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ నటి దిశాపటాని ఆయా ఆభరణాలను ధరించి ప్రదర్శించింది. -
రెండేళ్లు.. బాధితులు 6 వేలు
హిమాయత్‌నగర్: నిరుద్యోగులకు డేటా ఎంట్రీ ఉద్యోగాలు ఇస్తామంటూ పంజాగుట్ట కేంద్రంగా నడుస్తున్న ఓ నకిలీ కాల్ సెంటర్‌పై హైదరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు, వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. దాదాపు రెండేళ్లుగా మోసానికి పాల్పడుతున్న ప్రధాన నిర్వాహకుడు గడగోని చక్రధర్, సహకారులు గణేష్, శ్రావణ్‌లతో పాటు మరో 32మంది టెలికాలర్స్(వీరిలో అమ్మాయిలు 11మంది)ని అరెస్టు చేసినట్లు సైబర్ క్రైం డీసీపీ స్నేహా మెహ్రా తెలిపారు. వారివద్ద నుంచి 14 ల్యాప్‌టాప్‌లు, 148 సెల్ఫోన్లు, రూ.1లక్షా 3వేలు నగదు, బీఎండబ్ల్యూ, ఫార్చునర్, ఇన్నోవా, మహేంద్ర కారులను స్వాదీనం చేసుకున్నట్లు చెప్పారు. శనివారం బషీర్‌బాగ్‌లోని సైబర్ క్రైం కార్యాలయంలో టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్‌రావు, సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు రఘునా«థ్, శ్రీనాథ్‌రెడ్డిలతో కలసి స్నేహా మెహ్రా వివరాలను వెల్లడించారు. ప్రతి 45రోజులకు సిమ్‌లు మార్పు డబ్బులు వసూలు చేసిన తర్వాత ప్రతి 45 రోజులకోసారి ఫోన్ నెంబర్లను చక్రధర్‌గౌడ్ మార్చేసేవాడు. ఫేక్ కేవైసీల ఆధారంగా వందల కొద్దీ సిమ్‌లను అనంతపురం వాసి కృష్ణమూర్తి నుంచి కొనుగోలు చేసేవాడు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు డేటా ఎంట్రీ జాబ్ ఇస్తానంటూ మాయమాటలు చెప్పి వారి నుంచి రూ.2500 చొప్పున వసూళ్లు చేసి ఉద్యోగం ఇవ్వలేదు. దీంతో ఆ ఇద్దరూ సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి మొత్తం నిర్వాకాన్ని వెలికితీశారు. వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్, సైబర్‌క్రైం పోలీ సులు ఈ కాల్‌సెంటర్ గుట్టును రట్టు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్‌రావు తెలిపారు. రెండేళ్లు..6వేల మంది బాధితులు నగరంలోని బాచుపల్లిలో స్థిరపడ్డ సిద్దిపేటకు చెందిన గడగోని చక్రధర్‌గౌడ్‌కు గతంలో కాల్సెంటర్లలో పనిచేసిన అనుభవం ఉండటంతో 2021లో పంజాగుట్టలో రూ.1లక్షా 30వేల విలువ గల ఫ్లాట్‌ను తీసుకుని కాల్‌సెంటర్‌ను ప్రారంభించాడు. ఏపీ, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులకు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇస్తానంటూ వల వేశాడు. ఆయా రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులతో మాట్లాడేందుకు ఆ రాష్ట్రాలకు చెందిన వారినే టెలీకాలర్స్‌గా రూ.15వేల జీతానికి నియమించుకున్నాడు. ఈ రెండేళ్లలో ఒక్కో బాధితుడి నుంచి రూ.3వేల నుంచి రూ.5వేల వరకు దాదాపు 6వేల మంది నుంచి వసూలు చేశారని గుర్తించారు. కొంతమంది నుంచి పెద్దమొత్తంలో కూడా వసూళ్లు చేశారు. -
" స్వాతి ముత్యం " టీం చిట్ చాట్
-
నా నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్ర ఇది: వర్ష బొల్లమ్మ
‘‘నాకు సహజత్వానికి దగ్గరగా ఉండే కథలంటే ఇష్టం. ‘స్వాతిముత్యం’ కథలో కొత్తదనం ఉంది. ప్రేమ, వినోదంతో కూడిన కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని హీరోయిన్ వర్ష బొల్లమ్మ అన్నారు. గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘స్వాతిముత్యం’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ.. ‘‘సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అవకాశం అనగానే చేయాలనుకున్నాను. అలాగే కథ నచ్చడంతో ‘స్యాతిముత్యం’ చేయాలని ఫిక్స్ అయ్యాను. నా నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్ర ఇది. ఇందులో భాగ్యలక్ష్మి అనే టీచర్ పాత్ర చేశాను. బయట సరదాగా ఉంటాను, కానీ విద్యార్థుల ముందు కాస్త కఠినంగా ఉంటాను. నిజ జీవితంలోని నా గురువుల స్ఫూర్తితో ఈ సినిమాలో సహజంగా నటించాను. ఇందులో గణేష్ పాత్ర చాలా అమాయకంగా ఉంటుంది. నా పాత్ర కొంచెం డామినేటింగ్‌గా ఉంటుంది. ప్రేక్షకులు మధ్యతరగతి అమ్మాయిగా నన్ను చూడటానికి ఇష్టపడుతున్నారనుకుంటున్నాను. అందుకే అలాంటి పాత్రలు ఎక్కువ పేరు తీసుకొస్తున్నాయి. లక్ష్మణ్‌గారి రచన నాకు చాలా నచ్చింది. టాప్ హీరోయిన్ అవ్వాలనే ఆలోచన నాకు లేదు.. నటిగా మంచి పేరు తెచ్చుకోవాలనుంది. కమర్షియల్ సినిమాల్లోనూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తాను. ప్రతినాయిక ఛాయలున్న సైకో పాత్ర బాగా చేయగలననే నమ్మకం ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ లో ‘కొమురం భీముడో..’ పాటలో ఎన్టీఆర్‌గారి నటన చాలా నచ్చింది. ఆయన నటనకు నేను ఫ్యా¯Œ . ప్రస్తుతం సందీప్ కిషన్‌తో ఓ సినిమాలో నటిస్తున్నాను. మరో రెండు తెలుగు, తమిళ సినిమాలు కూడా ఉన్నాయి’’ అన్నారు. -
ఆకట్టుకుంటున్న 'స్వాతి ముత్యం' ట్రైలర్
గణేశ్ ,వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న చిత్రం 'స్వాతిముత్యం'. ఈ చిత్రాన్ని 'సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవున్నారు. వినోద భరితమైన ఈ కుటుంబ కథా చిత్రం విజయ దశమి కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో ట్రైలర్ విడుదల చేసింది చిత్రబృందం. "నిన్న నైట్ ఒక మూవీ చూశానండీ.. దాంట్లో కూడా హీరో, హీరోయిన్ మనలాగే కాఫీ షాప్‌లో కలుస్తారు" అంటూ కథానాయిక వర్ష బొల్లమ్మ పలికే సంభాషణతో ట్రైలర్ మొదలవుతుంది. ఓవరాల్‌గా ప్రేమకథ సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్ చూస్తుంటే దసరాకు కుటుంబ సమేతంగా చూసేలా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. "ముందుగా నేను గణేశ్‌కు థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ స్టోరీ రాశాక నేను ముందు కలిసింది అతన్నే. ఈ కథ అంగీకరించినందుకు బిగ్ థాంక్స్. ఈ సినిమాలో కొత్త పాయింట్ ఉంది. చిన్న టౌన్లో ఒకబ్బాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చిన వెంటనే పెళ్లి, ఆ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఈ చిత్రంలో చూపించబోతున్నాం. ఈ కథ చాలా విచిత్రంగా ఉంటుంది' అని అన్నారు. హీరో గణేశ్ మాట్లాడుతూ.. '2020లో కరోనా టైంలో ఒక సినిమా స్టార్ట్ చేద్దామనుకుంటుండగా లక్ష్మణ్ వచ్చి ఈ కథ చెప్పాడు. కథ వినగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒప్పుకున్నాను. నన్ను నేను మొదటిసారి బిగ్ స్క్రీన్ మీద చూసుకుంటున్నాను. కానీ ట్రైలర్ లాగే సినిమా చాలా సరదాగా ఉంటుంది. ఈ సినిమాను థియేటర్స్ లో మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాన' అని అన్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
ట్రూ లవ్ నెవర్ ఎండ్స్.. నేనూ నీ దగ్గరకే వస్తున్నా..
నాది కాని జీవితానికి నన్ను బానిసను చేశావు నన్ను నన్నుగా మెచ్చి నాలో ఆశలు రేపావు నా నవ్వులో దాగిన నువ్వు.. నన్ను నలుగురిని కలిపింది నువ్వున్నావన్న నమ్మకమే.. నన్ను నన్నుగా నిలిపింది నీవు లేని జీవితం వ్యర్థమని.. నిన్ను విడిచి వెళ్లనని అంతులేని కలగా మిగిలిపోయావు నువ్వు లేని ఈ బతుకు వ్యర్థం... అందుకే నేనూ వస్తున్నా... అంటూ భార్య మృతిని జీర్ణించుకోలేని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయవిదారక ఘటన గురువారం సాయంత్రం కళ్యాణదుర్గంలో చోటు చేసుకుంది. కళ్యాణదుర్గం(అనంతపురం జిల్లా): స్థానిక శంకరప్ప తోటకు చెందిన నాగరాజు, యశోదమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడు గణేష్ (23) బేల్దారి పనులతో జీవనం సాగించేవాడు. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం బేల్దారి పని కోసం కర్ణాటకలోని వైఎన్‌హెచ్ కోటకు వెళ్లాడు. ఆ సమయంలో గగనశ్రీ (24)తో అతనికి పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారింది. అనంతరం గగనశ్రీని తల్లిదండ్రులు మంగళూరులోని ఏజే ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ కోర్సులో చేర్పించారు. విషయం తెలుసుకున్న గణేష్ కూడా మంగళూరుకు వెళ్లాడు. ఆ సమయంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం అక్కడే కాపురమున్నారు. పెద్దలకు తెలియకుండా గగనశ్రీ బీటెక్ ద్వితీయ సంవత్సరం మధ్యలో ఆపేసి ఐదు నెలల క్రితం భర్తతో కలసి కళ్యాణదుర్గానికి వచ్చేసింది. జ్వరం బారిన పడి... ఇటీవల గగనశ్రీ జ్వరం బారిన పడింది. స్థానికంగా చికిత్స చేయించినా ఫలితం లేకపోవడంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ క్లినిక్‌లో చేర్పించారు. అప్పటికి ఆమె మూడు నెలల గర్భిణి. జ్వరం తీవ్రత పెరుగుతుండడంతో పరీక్షించిన వైద్యులు ఆమె డెంగీతో బాధపడుతున్నట్లు ఈ నెల 6న గుర్తించారు. విషయాన్ని గణేష్‌కు తెలపడంతో వెంటనే మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళుతుండగా మార్గ మధ్యంలో ఆమె మృతి చెందింది. దీంతో ఆమె మృతదేహాన్ని కళ్యాణదుర్గానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. దీనిపై గణేష్ కుటుంబసభ్యులే తమ కుమార్తెను చంపేశారంటూ గగనశ్రీ తల్లిదండ్రులు నాగరాజు, హనుమక్క కళ్యాణదుర్గం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: (‘ఎందుకమ్మ ఇట్ల చేసినవ్..?.. మమ్మీ.. డాడీ గుర్తుకు రాలేదా..?') ట్రూ లవ్ నెవర్ ఎండ్స్ నిజమైన ప్రేమ ఎప్పటికీ అంతం కాదు అనే నానుడిని గణేష్ నిజం చేశాడు. తన భార్య అనారోగ్యంతో మృతి చెందిదన్న విషయాన్ని జీర్ణించుకోలేని అతను గురువారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులతో ఆస్పత్రి ఆవరణం కిక్కిరిసింది. రోదనలు మిన్నంటాయి. ఒక్క రోజు వ్యవధిలోనే ఇద్దరినీ తీసుకెళ్లావా.. దేవుడా ఎంత పని చేశావంటూ రోదిస్తుండడం అందరినీ కలిచివేసింది. మృతుని తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు సీఐ తేజమూర్తి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
డుం డుం డుం.. మోగింది మేళం.. ఆకట్టుకుంటున్న పెళ్లి పాట
గణేష్ ,వర్ష బొల్లమ్మ జంటగాప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం 'స్వాతిముత్యం'. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వెడ్డింగ్ సాంగ్‌ని విడుదల చేశారు మేకర్స్. ‘డుం డుం డుం డుం డుం మోగింది మేళం’ ....అంటూ మొదలయ్యే ఈ పాటకి సాహిత్యాన్ని కె కె అందించగా, మహతి స్వర సాగర్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చాడు. దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ..‘చిత్ర కథాంశం ప్రకారం నాయక, నాయికల పెళ్లి గీతం ఇది. వీరి నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకూ జరిగే వివిధ వ్యవహారాలు,సందర్భాలు, సన్నివేశాల సమాహారం ఈ పాట. పట్టణం నేపథ్యంలో చిత్రీకరించిన దీనిని రచయిత కె కె ఎంతో చక్కగా రచించారు. ప్రేక్షకుడు కూడా సహజంగా అనుభూతి చెందేలా చిత్రీకరించడం జరిగింది’ అన్నారు. దసరా శుభాకాంక్షలతో ప్రేక్షకుల ముందుకు "స్వాతిముత్యం" ను అక్టోబర్ 5 న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. -
గణేష్ నిమజ్జనం ఆంక్షల వివాదంపై తలసాని స్పందన
-
13వ శతాబ్దానికి చెందిన అతి చిన్న రాతి వినాయక విగ్రహం
సాక్షి, హైదరాబాద్: కాకతీయుల కాలానికి చెందిన వినాయకుడి అతి చిన్న రాతి విగ్రహం వెలుగు చూసింది. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం, పరడ గ్రామ శివార్లలో గుట్టమీద కొత్త రాతియుగం, ఇనుపయుగపు ఆనవాళ్లు, గుట్ట దిగువన తూర్పు వైపున్న బౌద్ధ స్థూప శిథిలాలను పరిశీలిస్తుండగా ఈ విగ్రహం లభించిందని పురావస్తు శాఖ విశ్రాంత అధికారి, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి సోమవారం మీడియాకు వెల్లడించారు. ‘కాకతీయుల కాలం 13వ శతాబ్దానికి చెందిన ఈ రాతి విగ్రహం 4 సెంటీమీటర్ల ఎత్తు, 3 సెంటీమీటర్ల వెడల్పు ఉంది. తలపైన కాకతీయ శైలి జటామకుటం, ఎడమ వైపు తిరిగి ఉన్న తొండం, చేతుల్లో దంతం, మోదకం, బొజ్జమీదుగా నాగయజ్ఞోపవీతం ఉన్న ఈ వినాయకుడు లలితాసన భంగిమలో కూర్చుని ఉన్నాడు. మెత్తడి రాతితో చెక్కిన ఈ విగ్రహం అప్పట్లో ఇళ్లలో పూజలందుకుని ఉంటుంది. నాటి ఊరు కాలగర్భంలో కలిసిపోయాక విగ్రహం కూడా మట్టిలోనే ఉండిపోయింది. గతంలో కర్నూలు జిల్లా వీరాపురంలో క్రీ.శ.3వ శతాబ్దికి చెందిన ఇదే పరిమాణంలో ఉన్న మట్టి వినాయకుడి విగ్రహం, కీసరగుట్టలో 5వ శతాబ్దానికి చెందిన గణేశుడి రాతి శిల్పం బయటపడ్డాయి. ఇప్పుడు కాకతీయ కాలానికి చెందిన ఇప్పటివరకు వెలుగు చూసిన వాటిల్లో అతి చిన్న విగ్రహం గుర్తించాం’అని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. ఔత్సాహిక పరిశోధకులు రాగి మురళితో కలిసి జరిపిన అన్వేషణలో ఈ విగ్రహం కనిపించిందని, వినాయకచవితి ముందురోజే ఈ విగ్రహం వెలుగు చూడటం విశేషమని తెలిపారు. -
దసరా శభాకాంక్షలతో రానున్న 'స్వాతిముత్యం'
Ganesh Varsha Bollamma Swathi Muthyam Release Date Announced: ‘గణేష్‘ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం 'స్వాతిముత్యం'. ‘వర్ష బొల్లమ్మ' ఈ చిత్ర కథానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కంటెంట్ బలంతో దసరా శుభాకాంక్షలతో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటానికి విడుదల తేదీ ఖరారు చేస్తూ పోస్టర్‌ను బుధవారం (ఆగస్టు 10) విడుదల చేశారు. "స్వాతిముత్యం" సినిమాను అక్టోబర్ 5 న విడుదల చేస్తున్నట్లుగా చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ అధికారికంగా ప్రకటించారు. 'స్వాతిముత్యం' లాంటి ఓ యువకుడు కథే ఈ చిత్రం. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల, ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ చిత్రం. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు తప్పనిసరి. ప్రధానంగా ఇవన్నీ వినోదాన్ని పుష్కలంగా పంచుతాయి. సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి. ప్రేమతో కూడిన వినోద భరిత కుటుంబ కథా చిత్రం 'స్వాతిముత్యం'. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా 'స్వాతిముత్యం'ను దర్శకుడు లక్ష్మణ్ తీర్చిదిద్దారని యూనిట్ పేర్కొంది. చదవండి: ఎప్పుడూ మీరే కరెక్ట్.. ప్రతిసారి మాదే తప్పు: తాప్సీ చీరకట్టులో రమ్యకృష్ణ ఇబ్బందులు.. అయినా ఫొటోలకు పోజులు గణేష్ , వర్ష బొల్లమ్మ జంటగా జోడీ కట్టిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు. చదవండి: నా సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నించారు: అమలా పాల్ The date is set!! A Beautiful tale of our Bhagyalakshmi & Balamurali is ready to take you on a fun & exquisite ride on OCT 5th, in theatres near you! 🤩❤️#SwathimuthyamOnOct5th ✨#Ganesh @VarshaBollamma @Lakshmankkrish2 @mahathi_sagar @dopSURYAA @vamsi84 @adityamusic pic.twitter.com/jFIWocdzmS — Sithara Entertainments (@SitharaEnts) August 10, 2022 -
పెళ్లి చేసుకుందామని అడిగితే.. కడుపు మీద తన్నడంతో..
మైసూరు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెండు సార్లు అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకోమని కోరితే కులం పేరుతో తిరస్కరించాడు. మూడేళ్ల క్రితం విజయనగరకు చెందిన యువతికి, స్థానికుడైన గణేశ్ అనే యువకునికి పరిచయమై ప్రేమ ఏర్పడింది. ఇటీవల యువతి గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోమని కోరింది. ప్రియుడు అబార్షన్ చేయించి, పెళ్లికి నిరాకరించాడు. దీంతో యువతి విజయనగర పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గణేశ్‌పై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఒక నెల జైలు వాసం తర్వాత బెయిల్‌పై వచ్చిన నిందితుడు యువతికి మళ్లీ మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. యువతి తిరిగి గర్భం దాల్చగా ఈసారైనా పెళ్లి చేసుకుందామని అడిగింది. దీంతో అతడు కోపంతో ఆమె కడుపు మీద తన్నడంతో గర్భస్రావం కూడా జరిగింది. గణేశ్‌తో తనకు పెళ్లి చేయకపోతే బతకనని యువతి చెబుతోంది. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. చదవండి: (ఆ ఇంట్లో అద్దెకు దిగడమే వారి పాలిట శాపం) -
కంటి చూపు సరిగా లేకున్నా.. క్రికెటర్‌గా క్లిక్ అయ్యాడు!
పుట్టుకతోనే దృష్టి లోపం.. దానికి తోడు కటిక పేదరికం.. సమస్యను సవాల్‌గా స్వీకరించాడు... కృషి, పట్టుదలతో అంధత్వాన్ని జయించాడు. అన్నీ బాగుండి.. ఆర్ధికస్తోమత సహకరించి.. ఏ కళలోనైనా, క్రీడలోనైనా రాణించడం పెద్ద విషయమేమీ కాదు. కంటి చూపు సరిగా లేకపోయినా చదువుతో పాటు క్రికెట్లోనూ రాణిస్తూ పేరుతెచ్చుకున్న గణేష్ విజయ ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం నల్లమాడ: సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం గంగాపురం గ్రామానికి చెందిన సరస్వతి, ప్రభాకర్ దంపతులు వ్యవసాయ కూలీలు. అరకొర సంపాదనతో అతి కష్టంపై కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరి రెండో కుమారుడు గణేష్.. పుట్టుకతోనే దృష్టి లోపంతో బాధపడుతుండేవాడు. తల్లిదండ్రులు పలు ఆస్పత్రుల్లో చూపించారు. శస్త్రచికిత్స చేస్తే చూపు మెరుగుపడుతుందన్న వైద్యుల సూచన మేరకు ఆపరేషన్‌నూ చేయించారు. అయినా ఫలితం లేకపోయింది. 30 శాతం కంటి చూపుతో ఉన్న కుమారుడి భవిష్యత్తు తలచుకుని నిరుపేద తల్లిదండ్రులు మరింత కుంగిపోయారు. చదువుల్లో టాప్.. గణేష్ విద్యాభ్యాసం ఆద్యంతం బ్రెయిలీ లిపిలోనే సాగింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ కదిరి సమీపంలోని మొటుకుపల్లి ఆర్డీటీ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాడు. ఆరు నుంచి పదో తరగతి వరకూ అనంతపురం సమీపంలోని పంగల్ రోడ్డులో ఉన్న ఆర్డీటీ సమ్మిళిత ఉన్నత పాఠశాలలో, ఇంటర్ తిరుపతిలోని ఎస్వీ జూనియర్ కళాశాలలో, అక్కడే ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ, ఎస్వీ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశాడు. కృషి, పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చునని నిరూపించిన గణేష్ ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. క్రికెట్ అంటే మక్కువ.. గణేష్‌కు చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే ఆసక్తి ఎక్కువ. ఐదో తరగతిలో ఉన్నప్పుడే తోటి విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడడం ప్రారంభించాడు. ఈ క్రమంలో పాఠశాల స్థాయి, జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది. ఆయా పోటీల్లో ప్రతిభ చాటుకోవడంతో అతని క్రీడా ప్రస్థానం మలుపు తిరిగింది. 2012లో తిరుపతి జట్టు తరఫున ఆడి బీ2 (30 శాతం కంటి చూపు ఉన్నవారు) విభాగంలో ఆంధ్రా ప్రాబబుల్స్‌కు ఎంపికయ్యాడు. అనంతరం ఆంధ్రాజట్టులో స్థానం దక్కించుకుని ఆల్‌రౌండర్‌గా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇప్పటివరకూ తాను ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ అత్యధిక వికెట్లు, పరుగులు చేసిన క్రీడాకారుడిగా ఖ్యాతి గడించాడు. కెప్టెన్ అజయ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో వరుసగా మూడు రంజీ ట్రోఫీలు గెలిచిన జట్టులో గణేష్ ఆటతీరు కీలకంగా మారింది. అజయ్‌కుమార్‌రెడ్డి తనకు స్ఫూర్తి అని, ఇండియా జట్టుకు ఆడాలన్నదే తన లక్ష్యమని గణేష్ తెలిపాడు. సాధారణ క్రికెటర్లలాగే అంధ క్రికెటర్లను కూడా ప్రభుత్వాలు గుర్తించి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకోవాలని కోరుతున్నాడు. గణేష్ సాధించిన విజయాలు 2018 చెన్నైలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ఏపీ నుంచి పాల్గొని జట్టు విజయంలో కీలకంగా మారాడు. 2018లో కోల్‌కత్తాలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచి బంగారు పతకం అందుకున్నాడు. 2019, 2020లో కేరళలో జరిగిన జాతీయ స్థాయి నగేష్ ట్రోఫీని ఆంధ్ర జట్టు కైవసం చేసుకోవడంలో కీలకంగా మారాడు. ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో ఆంధ్రా జట్టును విజయ తీరాలకు చేర్చాడు. -
అత్యాచార బాధితురాలికి ఎమ్మెల్యే పరామర్శ
నర్సీపట్నం: అత్యాచారానికి గురై విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాలికను ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ శనివారం పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. తక్షణ సాయంగా ఎమ్మెల్యే, పార్టీ నాయకులు సమకూర్చిన రూ.2 లక్షల నగదును బాధిత కుటుంబానికి అందజేశారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ వైస్‌చైర్మన్ గొలుసు నర్సింహమూర్తి, కౌన్సిలర్ బోడపాటి సుబ్బలక్ష్మి, కోఅప్షన్ సభ్యులు షేక్ రోజా, పార్టీ నాయకులు చింతకాయల వరుణ్, గుడబండి నాగేశ్వరరావు, మామిడి శ్రీనివాసరావు, అయ్యరక కార్పొరేషన్ డైరెక్టర్ కర్రి శ్రీనివాసరావు, పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు బయపురెడ్డి గణమ్మ, మాజీ కౌన్సిలర్లు సత్యనారాయణ, బుజ్జి, లలిత ఉన్నారు. -
గణేష్ ఉత్సవాన్ని ఆరెంజ్ గణపతితో జరుపుకుంటుంది..
-
మట్టి గణపతులకు పెరిగిన ప్రాధాన్యత
-
మరో పాటతో దూసుకుపోతున్న మంగ్లీ
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ గాయని మంగ్లీ వినాయక చవితి సందర్భంగా మరో చక్కటి పాటను తన యూట్యూబ్ఛానల్లో అప్లోడ్ చేశారు. ప్రతీ పండుగకు ఒక ప్రత్యేక పాటను రిలీజ్ చేసే ఆమె తాజాగా ‘లంబోదరా’ అంటూ మరో గీతాన్ని ఆలపించి అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ఈ పాటలో మట్టి గణపతికి ప్రాధాన్యతనుగురించి చెప్పారు. అంతేకాదు ఎప్పటిలాగానే పచ్చటి ప్రకతి, పల్లె వాతావరణాన్ని హైలైట్ చేయడం విశేషం. దీంతో అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి పాటలు పాడుతూ చరిత్రలో నిలిచిపోవాలని కోరుకుంటున్నారు. (Ganesh Chaturthi 2021: మట్టి గణపతి! మహా గణపతి!!) రచయిత లక్క్ష్మణ్ ఈ గీతాన్ని రాయగా, సురేష బొబ్బులి సంగీతంలో మంగ్లి, మరికొంతమంది బాల గాయకులు ఈ గీతాన్ని ఆలపించారు. ఇప్పటికే పదకొండు లక్షలకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. -
ఆ స్ఫూర్తిని మర్చిపోతున్నామా?
చరిత్రలోని అతి గొప్ప సంఘటనలన్నీ మౌనంలోంచే పుట్టుకొచ్చాయి. తిరిగి అవి నిశ్శబ్దంగా వెనక్కు వెళ్లిపోతున్నాయి. ఒక శతాబ్దం క్రితం అంటే 1920–21లో జరిగిన, చరిత్రను మలుపుతిప్పిన అనేక ఘటనలను ఈ 2021 ఆగస్ట్ నెల మళ్లీ అందరికీ గుర్తు చేస్తోంది. భారతీయ చరిత్రలోని ఆ విశిష్ట దశ అనేక ఘటనల కూర్పుతో నిండి ఉంది. వీటిలో కొన్నింటికి ఈనాటికీ ప్రాధాన్యం ఉండగా, మరికొన్ని తమ విశిష్టతను కోల్పోతున్నాయి. పైగా ఒక వైవిధ్యపూరితమైన సమాజంగా మనుగడ సాధించడం అనే భావనకు ఇప్పటికీ దేశం పూర్తిగా సిద్ధం కాలేదు. అదే సంవత్సరం జమ్షెడ్పూర్లో టాటా స్టీల్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ స్థాపన భారతీయ పారిశ్రామిక నగరీకరణ శకం ప్రారంభాన్ని నిర్వచించింది. నాగరికతా సంస్కృతికి ఉక్కు వెన్నెముకగా ఉంటూ వస్తోంది. 1921లో కోహినూర్ ఫిల్మ్ కంపెనీ కోసం కనాజీభాయ్ రాథోడ్ తీసిన భక్త విదుర్ సినిమాపై నిషేధం ఎంత గొప్ప జ్ఞాపకంగా ఉంటోందో.. అదేరకంగా బాబూరావ్ పెయింటర్ తీసిన సురేఖా హరణ్ సినిమాలో వి. శాంతారాం కీలక పాత్ర పోషిస్తూ నటనా జీవితంలోకి అడుగుపెట్టడం కూడా మర్చిపోని జ్ఞాపకమే.. జాతి అనే చారిత్రక ఆకాంక్షకు ప్రాతినిధ్యం వహించడంలో, భారత్ అనే సామూహిక భావనలోంచి పుట్టుకొచ్చిన సెల్యులాయిడ్ స్వప్నాలను దేని తోనూ పోల్చి చూడలేం. జాతీయ ఆకాంక్షను ముందుకు తీసుకుపోవడానికి రెండు మూకీ చిత్రాలు కూడా ఆ సంవత్సరమే ప్రారంభమయ్యాయి. ఈ రెండు సినిమాలు ఏకకాలంలోనే దేశాన్ని అటు కాల్ప నికత వైపు, ఆధునికతవైపు తీసుకుపోయాయి. వీటికి మించిన గొప్ప ఘటన డాక్టర్ భీమ్రావ్ అంబేడ్కర్ తీసుకొచ్చిన ‘మూక్‌నాయక్’ పత్రిక. ప్రగతిశీలుడైన కొల్హాపూర్ రాజు సాహు అందించిన ఆర్థిక సహాయంతో ఈ ప్రచురణ వెలుగులోకి వచ్చింది. దళితులు రాసిన కథనాలను ప్రచురించడానికి ఆనాడు ప్రముఖ దినపత్రికలు ఏవీ సుముఖత చూపకపోవడంతో మూక్ నాయక్ ఒక ప్రత్యామ్నాయ మీడియాగా వచ్చింది. ఇది కొద్దికాలం మాత్రమే నడిచినా, అణగారిన వర్గాల హక్కుల పోరాటానికి ఇది నాంది పలికింది. నిశ్శబ్దంగా మొదలైన మరొక మూడు ఘటనలను కూడా ఈ సందర్భంగా పేర్కొనాలి. పరివర్తనా స్థలంగా ఆశ్రమ జీవితం అనే ప్రాచీన భారతీయ భావనను ఇవి వెలుగులోకి తీసుకొచ్చాయి. వేదకాలపు రుషులను మళ్లీ గుర్తుకు తెచ్చే ఈ ముగ్గురు విశిష్ట వ్యక్తులను ప్రపంచం గురుదేవ్, మహాత్మా, మహర్షి అని గుర్తించింది. వారు ఎవరో కాదు. రవీంద్రనాథ్ టాగూర్ (1861–1941), ఎం.కె. గాంధీ (1869–1947), అరబిందో ఘోష్ (1872–1950). వీరిలో చిన్నవాడు ఘోష్. 1947కి 75 సంవత్సరాల ముందు జన్మించిన ఘోష్ బెంగాల్ విభజన తర్వాత బ్రిటిష్ పాలనకు వ్యతిరేక పోరాటంలో కీలకపాత్ర పోషించారు. ఈ క్రమంలో రాజద్రోహ ఆరోపణలకు గురై సంవత్సరం పాటు జైలుశిక్షను అనుభవించారు. అనంతరం భారతీయ తత్వశాస్త్రంలోని పలు ప్రాపంచిక దృక్పథాలను పునర్నిర్వచిం చడం వైపుగా తన శక్తియుక్తులను మళ్లించారు. పాండిచ్చేరికి తరలి వెళ్లాక, సంప్రదాయాలకు కొత్త భాష్యం చెబుతూ అసమాన శక్తితో వ్యాసాలు రాశారు. ఉనికిలో ఉన్న ప్రతి సంప్రదాయాన్ని ప్రశ్నిస్తూ అతిగొప్ప తాత్విక రచనలను సృష్టిం చారు. ఆయన వ్యాసాలు తొలుత తాను ప్రారంభించిన ‘ఆర్య’ పత్రికలో ప్రచురితమయ్యాయి. ఆ తర్వాత ది డివైన్ లైఫ్, ది సింథసిస్ ఆఫ్ యోగా, ఎస్సేస్ ఆన్ ది గీతా, ది సీక్రెట్స్ ఆఫ్ ది వేదా, హైమ్స్ టు ది మిస్టిక్ ఫైర్, ది రినైజాన్స్ ఆఫ్ ఇండియా, ది హ్యూమన్ సైకిల్ అండ్ ఫ్యూచర్ పోయెట్రీ వంటి పుస్తకాలు రాసి ప్రచురించారు. తన తాత్విక రచనా కృషి అద్భుతంగా కొనసాగుతుండగా 1920లో ఘోష్, ఆర్య పత్రిక ప్రచురణను నిలిపివేశారు. ఉత్కృష్టమైన ధ్యాన యోగ మహాకావ్యం ‘సావిత్రి’పై కేంద్రీకరించేందుకు తన రచనా కృషిని మొత్తంగా నిలిపివేశారు. తర్వాత మూడు దశాబ్దాల తన జీవితాన్ని మానవ జాతి మహా పరివర్తన కోసం, తన యోగ కృషి ద్వారా భూమ్మీదికి అత్యున్నత చైతన్యాన్ని తీసుకు రావడానికి అంకితం చేశారు. ఈ త్రిమూర్తులలో పెద్దవాడైన రవీంద్రనాథ్ టాగూర్ 1921 నాటికి నోబెల్ అవార్డు కూడా పొందారు. ప్రపంచమంతటా రుషిలాగా కీర్తిపొందిన టాగూర్ 1921లోనే విశ్వభారతి విద్యా సంస్థను ప్రారంభించారు. విశ్వమానవ భావనను పెంపొందించే లక్ష్యంతో నేర్చుకునే, సృజనాత్మక కృషిని సాగించే మౌలిక సంస్థ విశ్వభారతి. ఘోష్ లాగే టాగూర్ కూడా ఒక వర్గం మనుషులకోసం, ఒకే జాతి కోసం కాకుండా యావత్ ప్రపంచాన్ని పరిరక్షించేందుకోసం జీవి తాన్నే ప్రయోగశాలగా మార్చుకున్నారు. అయితే గాంధీ ప్రయత్నిం చిన ఆత్మ పరివర్తన మరింత మౌలికమైనది. 1920 ఆగస్టులో తిలక్ మృతితో లాల్ బాల్ పాల్ (లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్) శకం ముగిసిపోయింది. ఆ శూన్యంలోకి ఎం.కె. గాంధీ ఒక శతఘ్నిలా దూసుకొచ్చారు. దేశవ్యాప్తంగా పర్యటనలు చేసి కాంగ్రెస్‌లోని వేరువేరు బృందాలను ఒకటి చేశారు. ముస్లింలు, హిందువులు, క్రైస్తవులను భాగం చేసి సేవా దళ్ ఏర్పర్చి జాతీయ స్వాతంత్య్ర పోరాటంలో యువతకు ప్రేరణగా నిలిచారు. 1920 అక్టోబర్‌లో గాంధీ గుజరాత్ విద్యాపీఠాన్ని నెలకొల్పారు. ఇది కమ్యూనిటీ శ్రమజీవుల విశ్వవిద్యాలయం. ఇక 1921 డిసెంబర్లో కలకత్తా సమావేశాల్లో కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతను చేపట్టారు. తర్వాత జరిగిందంతా చరిత్రే. భారత్‌లో గాంధీ ఆశ్రమం తొలి సంవత్సరాలు సాదాసీదాగా మొదలయ్యాయి. ప్రారంభంలో కొచార్బ్లో ఒక ఆశ్రమాన్ని ఏర్పర్చారు. తర్వాత అహ్మదాబాద్ నగరానికి సమీపంలో సబర్మతి నది ఒడ్డుకు దాన్ని మార్చారు. మొదట్లో దీనికి సత్యాగ్రహ ఆశ్రమం అని పేరు పెట్టారు. నది ఒడ్డున ఏర్పర్చిన ఈ ఆశ్రమం తర్వాత సబర్మతి ఆశ్రమంగా పేరొందింది. ఒక దశాబ్దం తర్వాత దండికి మహాత్ముడు తలపెట్టిన పాదయాత్ర బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కదలించివేసింది. సబర్మతి ఆశ్రమ వాతావరణం, అక్కడ పాటించిన సిద్ధాంతాలు, నిరాడంబరత్వానికి మహా త్ముడి జీవితమే కీలక శక్తిగా పనిచేసింది. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకున్నా లేదా విస్మరించినా సరే ఈ మూడు ఆశ్రమాల విశిష్ట గాథలు భారత చరిత్రలోనే అత్యంత కీలక అంశాలుగా ఉంటున్నాయి. అయితే 2021లో సబర్మతి ఆశ్రమాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక ఆకర్షణగా మార్చడం రూపంలో అది పెను ప్రమాదాన్ని ఎదుర్కొం టోంది. దీని కోసం ప్రభుత్వం రూ. 1200 కోట్ల మొత్తాన్ని కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలో వివాదాస్పదమైన సెంట్రల్ విస్టా నిర్మాణాన్ని చేపట్టిన సంస్థే సబర్మతి ఆశ్రమ శిబిరాన్ని ఆధునీకరించే బాధ్యతలు చేపట్టింది. గాంధీ అసాధారణమైన నిరాడంబరత్వం ద్వారానే ప్రపంచంలోనే అత్యంత విశిష్టమూర్తిగా నిలిచి ఉంటున్నారు. ఆయన నిర్మించిన ఆశ్రమం వద్ద ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపాదించిన వీఐపీ గెస్ట్ హౌస్, ఆడిటోరియం వంటివి గాంధీని, ఆయన నిరాడంబరత్వాన్ని మనం మర్చిపోయేలా చేస్తాయి. సబర్మతి ఆశ్రమ ఆధునీకరణ పథకాలు గాంధీ ఆదర్శాలను గుర్తుకు తీసుకురావడం కాకుండా వాటిని అందరూ మర్చిపోయేలా చేస్తున్నాయి. మన స్వాతంత్య్ర పోరాటాన్ని, టాగూర్ ప్రవచించిన బౌద్ధిక స్వాతంత్య్రాన్ని, అరబిందో ఘోష్ దార్శనికత ప్రబోధించిన ఆధ్యాత్మిక స్వాతంత్య్రాన్ని మొత్తంగా మర్చిపోవాలంటూ తన సమాచార ఫ్యాక్టరీల ద్వారా మనకు చెప్పడంలో క్షణం తీరిక లేకుండా ఉంటున్న ప్రస్తుత పాలనా వ్యవస్థ నుంచి ఇంతకు మించి మనం ఆశించేది ఏమీ ఉండదు. జీఎన్ డెవీ వ్యాసకర్త సాహితీ విమర్శకుడు, సాంస్కృతిక కార్యకర్త -
ఖైరతాబాద్ గణేష్ చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమంలో ఉద్రిక్తత
-
పది తలలతో ఏకాదశి రుద్ర మహాగణపతిగా ఖైరతాబాద్ గణేశుడు
-
దుమారం రేపుతోన్న రిహన్నా టాప్‌లెస్ ఫోటో
భారతీయ మీడియాలో గత కొన్ని రోజులుగా హాలీవుడ్ పాప్ ఐకాన్ రిహన్నా పేరు మార్మోగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో ఉద్యమం చేస్తోన్న రైతులకు రిహన్నా మద్దతు తెలిపారు. నాటి నుంచి ఈ పాప్ ఐకాన్ పేరు దేశంలో మార్మోగిపోతుంది. ఈ క్రమంలో తాజాగా రిహన్నా చేసిన ఓ ఫోటో షూట్ సంచలనం సృష్టించడమే కాక విమర్శలు ఎదుర్కొంటుంది. రిహన్న తాజా ట్వీట్‌పై నెటిజనులు.. ముఖ్యంగా భారతీయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంత దూమారం రేపిన ఆ ఫోటో షూట్ వివరాలు.. తాజాగా రిహన్నా తన లో దుస్తుల బ్రాండ్ ‘‘సెవేజ్ ఎక్స్ ఫెంటీ’’ ప్రమోషన్ కోసం షూట్ చేసిన ఓ ఫోటోని ట్విట్టర్లో షేర్ చేశారు. టాప్‌లెస్‌గా దిగిన ఈ ఫోటోలో రిహన్నా తన మెడలో వినాయకుడి పెండెంట్ ఉన్న చైన్ ధరించారు. ఇలాంటి అశ్లీల ఫోటో షూట్ కోసం రిహన్నా తన మెడలో గణేషుడి లాకెట్ ధరించడం పట్ల నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. ‘‘రిహన్నా దయచేసి ఇలాంటి చెత్త పనులు ఆపు. నా మతాన్ని నీవు అలంకరణ వస్తువుగా.. అది కూడా ఇలాంటి అసభ్య ఫోటో కోసం వాడటం కరెక్ట్ కాదు. నీ చైన్ చివర్లో ఉన్న గణేష్ పెండెంట్‌ని మా దేశంలో ఎంతో పవిత్రమైనదిగా భావిస్తాం. దయచేసి మా దేవుళ్లని నీవు ఇలాంటి పనికి మాలిన ఫోటోల కోసం వాడి అవమానించడం మానుకో’’ అని కోరారు. మరో ట్విట్టర్ యూజర్ ‘‘మా దేశంలో ప్రతి ఏడాది కొన్ని మిలియన్ల మంది ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక చవితిని జరుపుకుంటారు. అలాంటి పవిత్రమైన గణేషుడి పెండెంట్‌ని నీవు ఇంత అసభ్యకరమైన ఫోటో కోసం ధరించడం కరెక్ట్ కాదు. నీవు మమ్మల్ని చాలా అవమానించావు.. నిరాశ పరిచావు. నీ నుంచి ఇలాంటి పనులు ఊహించలేదు’’ అంటూ కామెంట్ చేస్తున్నారు. మా సెంటిమెంట్లను హర్ట్ చేశావ్: షెహజాద్ పూనవాలా ఇక రిహన్నా టాప్‌లెస్ ఫోటోషూట్‌పై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు షెహజాద్ పూనవాలా స్పందించారు. మా సెంటిమెంట్లను హర్ట్ చేశావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ‘‘నేను ముస్లింని. అయినప్పటికి ఓ భారతీయుడిగా.. ముఖ్యంగా మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా నేను వినాయకుడిని ఎంతో ప్రేమిస్తాను. అలాంటి గణేష్ పెండెంట్‌ని నీవు ఇలాంటి అసభ్య ఫోటో కోసం వాడటం సరైంది కాదు. నీ చర్యలు నా మనోభావాలను, సెంటిమెంట్లను గాయపరిచింది. భారతదేశంలో రిహన్నాకు మద్దతిచ్చేవారు దీన్ని అంగీకరిస్తారా?’’ అంటూ ట్వీట్ చేశారు. I am a Muslim but as an Indian and Maharashtrian I love Lord Ganesha ji - sorry this misuse of Ganesha ji image hurts my feelings & sentiments - will Rihanna Backers in India accept this also? #GaneshaInsulted pic.twitter.com/ueHOS9UMZF — Shehzad Jai Hind (@Shehzad_Ind) February 16, 2021 చదవండి: రిహన్నా ట్వీట్.. గూగుల్‌లో ఏం సెర్చ్ చేశారంటే? -
అమ్మా.. నాన్నా..! నన్ను క్షమించండి..
‘అమ్మా.. నాన్నా..! నన్ను క్షమించండి.. నేను దేవుడి దగ్గరికి వెళ్లిపోతున్నా.. ఇలా చేసినందుకు బాధపడకండి.. మీ అంత గొప్ప తల్లిదండ్రులకు బిడ్డగా ఉండే హక్కు నాకు లేదు’ అంటూ మండలంలోని మార్జేపల్లెకు చెందిన గణేష్ (20) లేఖ రాసి అదృశ్యమైన సంఘటన గంగవరం మండలంలో కలకలం రేపింది. వారం కిందట జరిగిన ఈ ఉదంతం బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. విద్యార్థి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు గాలిస్తున్నారు. గంగవరం: మండలంలోని మార్జేపల్లెకు చెందిన డిగ్రీ విద్యార్థి గణేష్ తాను దేవుడి దగ్గరికి పోతున్నానని లేఖ రాసి అదృశ్యమైన ఘటన తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచింది. గ్రామస్తులు, పోలీసుల కథనం.. మార్జేపల్లెకు చెందిన శివశంకర్, పద్మజ దంపతులకు గణేష్ మొదటి సంతానం. ఇతను మండల కేంద్రానికి సమీపంలోని ఓ కళాశాలలో బీకాం డిగ్రీ ఫైనల్ చదువుతున్నాడు. చదువుపై బాగా శ్రద్ధ పెట్టి మంచి ఫలితాలు సాధించేవాడు. ఇతర సాంఘిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేవాడు. వ్యవసాయం, ఇంటి పనుల్లో తల్లిదండ్రులకు తోడ్పడుతూ చక్కగా మసలుకునేవాడు. ఈనెల 21వ తేదీ రాత్రి నోట్‌బుక్‌లో రెండు పేజీల లేఖను రాసి అదృశ్యమయ్యాడు. మోటార్ సైకిల్, సెల్‌ఫోన్, కళాశాల పుస్తకాల బ్యాగ్ కూడా కనిపించలేదు. అప్పటి నుంచి అతడు ఎక్కడున్నాడో..ఏమయ్యాడోనని నిద్రాహారాలు మాని తల్లిదండ్రులు, బంధువులు పలుప్రాంతాల్లో గాలించారు. ఆచూకీ తెలియక పోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా ద్వారా కూడా ఫొటో పోస్టు చేశారు. కుమారుడు లేని ఇంట్లో తల్లిదండ్రులు నరకయాతన అనుభవిస్తున్నారు. వాళ్లను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. అతడు రాసి రెండు పేజీల లేఖ చర్చనీయాంశమైంది. అన్నికోణాల్లో దర్యాప్తు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. సెల్ ఫోన్ ఐఎంఏ ద్వారా ఆచూకీ కోసం చర్యలు తీసుకుంటున్నాం. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. –సుధాకర్‌రెడ్డి, ఎస్ఐ లేఖలోని ముఖ్య సారాంశం ‘నాన్న! నన్ను క్షమించండి. నేను దేవుని దగ్గరకు వెళ్లిపోతున్నా.. నేను ఎంత మరిచిపోదామనుకున్నా ఈ బాధ రోజురోజుకూ నరకం చూపిస్తోంది. నటించడం ఇక నావల్ల కాదు. మళ్లీ జన్మంటూ ఉంటే మీ కడుపునే పుట్టాలని ఉంది. మరో జన్మలో అయినా మీరు చెప్పినట్టు నడుచుకునేట్టు ఆ దేవుడిని వరం అడుగుతా. అమ్మా.. నా కోసం మీరు ఎంత ఏడ్చినా నేను ఎక్కడా ఆనందంగా ఉండలేను. నేను అసలు పుట్టనే లేదనుకో. మా తమ్ముడు జాగ్రత్త. వాడే నేననుకో. నాన్నా.. నీకు ఒకవేళ నేను తలవంపులు తెచ్చింటే నన్ను క్షమించు. తమ్ముడికి కొడుకుగా పుడతా.. మళ్లీ నువ్వే నన్ను పెంచి పెద్ద చేయాలి. అప్పుడే నువ్వు చెప్పినట్టు వింటాను. నేను ఎవరినీ సాధించడానికి ఈ పని చేయలేదు.త మ్ముడూ.. అమ్మానాన్నకు ఇక అన్నీ నువ్వే.’ అంటూ రాసిన ఆ రెండు పేజీల లేఖ ఆ కన్నవారికి తీరని వ్యథ మిగిల్చింది. -
నటి జయచిత్రకు భర్త వియోగం
సీనియర్ నటీమణి, దర్శకురాలు, నిర్మాత జయచిత్ర భర్త గణేశ్ (62) శుక్రవారం ఉదయం తిరుచ్చిలో గుండెపోటుతో కన్నుమూశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి జయచిత్ర తెలుగునాట జన్మించినా తమిళనాడులో నటిగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. 200 పైగా చిత్రాల్లో కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో నటించిన జయచిత్ర 1970–80 ప్రాంతంలో అగ్రకథానాయికగా వెలుగొందారు. కథానాయికగా రాణిస్తున్న సమయంలోనే జయచిత్రకు కుంభకోణంకు చెందిన గణేశ్‌తో 1983లో వివాహం జరిగింది. గణేశ్ నటుడిగా ఓ చిత్రంలో నటించారు. ఈ దంపతుల సంతానమే యువ సంగీత దర్శకుడు అమ్రేష్. గణేశ్ శుక్రవారం ఉదయం తిరుచ్చిలో కన్నుమూయగా ఆయన భౌతికకాయాన్ని చెన్నై, పోయెస్ గార్డెన్‌లోని స్వగృహానికి తరలించారు. గణేశ్ పార్థివదేహానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. గణేశ్ అంత్యక్రియలను శనివారం నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. -
సత్తార్ మా కుటుంబానికి ఆప్తుడు: జక్కంపూడి
సాక్షి, కాకినాడ: తన కుమార్తెపై లైంగిక దాడికి యత్నించిన కేసులో నిందితులను శిక్షించాలని కోరుతూ ఆత్మహత్యకు యత్నించిన రాజమహేంద్రవరం బొమ్మూరుకు చెందిన సత్తార్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ నేత జక్కంపూడి గణేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'సత్తార్ కుమార్తె కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గత రెండు రోజులుగా పలు పార్టీల నేతలు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అవి పూర్తిగా అవాస్తవం. సత్తార్ మా కుటుంబానికి ఆప్తుడు. మేము నిర్వహించిన పలు కార్యాక్రమాల్లో సత్తార్ పాల్గొన్నారు. టీడీపీ అనుకూల మీడియాను అడ్డుపెట్టుకుని కొందరు నేతలు వారి స్వప్రయోజనా కోసం మాపై ఆరోపణలు చేస్తున్నారు. మా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు, నా సోదరుడు రాజా గెలుపుకు ఎస్సీలు, మైనార్టీలే కారణం. వారికెప్పుడు మా కుటుంబం అండగా ఉంటుంది. అల్లా దయవల్ల సత్తార్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను' అని గణేష్ పేర్కొన్నారు. సత్తార్ భార్య సమీరా బేగం మాట్లాడుతూ.. 'నా భర్త ఆత్మహత్యయత్నాన్ని కొందరు రాజకీయ పార్టీల పెద్దలు రాజకీయం చేస్తున్నారు. జక్కంపూడి గణేష్ మా కుటుంబానికి అన్యాయం చేశాడని నేను ఎక్కడా చెప్పలేదు. ఆయన మాకు ఎటువంటి అన్యాయం చెయ్యలేదు. గణేష్ తల్లి విజయలక్ష్మీ మాకు జరిగిన అన్యాయంపై స్పందించి వెంటనే యాక్షన్ తీసుకోవాలని పోలీసులకు ఫోన్ చేశారు. గణేష్ అన్న మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఓదార్చి.. మా పిల్లల్ని చదిస్తానని భరోసా ఇచ్చారు. వైఎస్సార్సీపీకి మా కేసుకు ఎలాంటి సంబంధం లేదు. చేతనైతే నా భర్తను కాపాడండి. అంతే కానీ రాజకీయాలు చేయవద్దని ఇతర పార్టీల నేతల్ని కోరుతున్నా' అని సమీరా బేగం అన్నారు. వైఎస్సార్సీపీ మైనార్టీ నేతలు హబీబ్ బాషా, మహ్మద్ ఆరీఫ్‌లు మాట్లాడుతూ.. 'మా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పట్ల వేరే జిల్లాకు చెందిన అనామకులు అవాకులు చవాకులు పేలుతున్నారు. ద్వారంపూడికి ముస్లింలకు మధ్య ఎంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన ముస్లింలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. సత్తార్ కుమార్తె విషయంలో టీడీపీ నేతలు కెమెరాలతో వచ్చి హడావిడి చేసి వెళ్ళిపోయారు. ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుంటూ నిందితులను అరెస్టు చేసింది. తన నియోజకవర్గంలో జరిగిన ఘటనపై రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంత వరకు ఎందుకు స్పందించలేదు' అని మైనార్టీ నాయకులు ప్రశ్నించారు. -
ఖైరతాబాద్ వినాయకుడు వద్ద సందడి
-
గణేష్ విగ్రహాలపై కరోనా ఎఫెక్ట్..
-
27 అడుగులతో ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం
-
ప్రాణభిక్ష పెట్టండి
శ్రీకాకుళం, జి.సిగడాం: భవిష్యత్తుపై ఎన్నో కళలు కన్న ఆ యువకుడిని రోడ్డు ప్రమాదం మంచానికి పరిమితం చేసింది. తల్లిదండ్రులకు తీరని వేదనను మిగిల్చింది. ఇప్పటికే 20 లక్షల రూపాయలు అప్పు చేసి చికిత్స చేసినా మరో రూ.30 లక్షలు అవసరం కావడంతో కుటుంబ సభ్యులు దాతల సాయం ఆశగా ఎదురుచూస్తున్నారు. జి.సిగడాం మండలం నిద్దాం గ్రామానికి చెందిన చౌదరి వెంకటరమణ, వరలక్ష్మి దంపతుల కుమారుడు గణేష్. రాజాంలోని ఓ ప్రయివేట్ కళాశాలలో ఇంటర్ చదువుతుండగా 2018 ఏప్రిల్ 3న ఆమదాలవలస వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే జెమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో విశాఖకు తరలించారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో మెదడుకు శస్త్రచికిత్స చేశారు. అయితే మెదడులో కొంత భాగం రక్తం ప్రసరించకపోవడంతో మాట, నడక లేక మంచానికే పరిమితమయ్యాడు. తల్లిదండ్రులు కూలి పని చేసి, అప్పులు చేసి, అర ఎకరా పొలం కూడా అమ్మి సుమారు రూ.20 లక్షలు వైద్యం కోసం ఖర్చు చేశారు. యువకుడి చికిత్సకు మరో రూ.30 లక్షలు అవసరమవుతాయని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు అంత సొమ్ము తీసుకురాలేక తల్లడిల్లుతున్నారు. దాతలే కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదుకోవాలి.. మాది రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం. గణేష్‌ను కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. రోజువారీ కూలీ డబ్బులు కుటుంబ పోషణకే చాలడం లేదు. ఇంకా చికిత్స ఎలా చేయించగలం. దాతలు, ప్రభుత్వం స్పందించి నా కుమారుడ్ని ఆదుకోవాలి.– చౌదరి వరలక్ష్మి(గణేష్ తల్లి) సాయం చేయాలనుకుంటే చౌదరి వెంకటరమణ, స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా, రాజాం ఖాతా నంబరు : 20397702441, ఐఎఫ్ఎస్ కోడ్: ఎస్బీఐఎన్ 0006216, సెల్:9505875335 -
‘నేను నా రాక్షసి’ సినిమా తరహాలో బలవన్మరణం
బంజారాహిల్స్: ‘చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉంది’ అంటూ బీటెక్ విద్యార్థి గణేష్ సూసైడ్ నోట్ రాసి.. నైట్రోజన్ ఆక్సిజన్ కలిగి ఉన్న సిలిండర్ పైపులను బిగించుకొని.. ముఖంపై పాలిథిన్ కవర్‌తో కప్పుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటనలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. సోమవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిలింనగర్ వినాయకనగర్‌లో జరిగిన అతని ఆత్మహత్య తీరు కుటుంబ సభ్యులను నివ్వెరపోయేలా చేసింది. యూ ట్యూబ్‌లో చూసి.. వారం పది రోజులుగా తేలికగా ఎలా చనిపోవాలో గణేష్ యూట్యూబ్ సెర్చ్ చేసినట్లుగా సమాచారం. ఇందులో భాగంగానే ఎర్రగడ్డలోని ఓ గ్యాస్ ఏజెన్సీస్‌లో ఈ నెల 14న రూ.3,154 వెచ్చించి సిలిండర్‌ను, పైపులు, పాలిథిన్ కవర్లు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకున్నాడు. ఇంట్లోని స్టోర్ రూంలో వీటిని భద్రపరిచాడు. నైట్రోజన్ ఆక్సిజన్ సిలిండర్ పైపులను ముక్కులోకి పెట్టుకొని రసాయన వాయువులు బయటికి రాకుండా తన శరీరంలోకి వెళ్లేలా ముఖాన్ని పాలిథిన్ కవర్లతో గట్టిగా చుట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘నేను నా రాక్షసి’ సినిమాలో ఇలాగే తేలికగా చనిపోయే కొన్ని దృశ్యాలు చూసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఆ సినిమాలో బండరాళ్లు కట్టుకొని నీటిలో దూకడం, ఇంజక్షన్లు తీసుకొని శరీరం బండబారేలా చేసుకోవడం వంటివి చూసినట్లుగా కూడా తెలుస్తోంది. స్మార్ట్ ఫోనే కారణమా..? గణేష్ వద్ద స్మార్ట్ ఫోన్ లేకుంటే ఇలాంటి పని చేసి ఉండేవాడు కాదని గణేష్ అతని స్నేహితులు చెబుతున్నారు. స్మార్ట్ పోన్ ఉండటంతోనే ఇంటి వద్ద సెర్చ్ చేసి మరీ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. బండ్లగూడలోని మహవీర్ కాలేజీలో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్న గణేష్ మొదటి సంవత్సరంలోనే పరీక్షలు సరిగా రాయకపోవడంతో డిటెండయ్యాడు. మరోసారి పరీక్షలు రాసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మూడు రోజులుగా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మాట్లాడకుండా అన్యమనస్కంగా ఉంటున్నాడు. ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టాడు. ఈ నెల 14నే ఆత్మహత్య చేసుకోవాలని పథకం రచించుకున్నాడు. ఇందులో భాగంగానే మూడు రోజుల ముందే సామగ్రిని తెచ్చి ఇంట్లో పెట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మాత్రమే ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. సోమవారం కుటుంబ సభ్యులు బయటికి వెళ్లడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘నేను చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నా’నంటూ సూసైడ్ నోట్ రాశాడు. ఒక్కగానొక్క కుమారుడు ఇలా అర్ధంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
సినిమాల్లో హీరోగా భువనగిరి గణేష్
సాక్షి, భువనగిరి(నల్గొండ) : సినీ హీరో కావాలనే లక్ష్యంతో ఓ యువకుడు విభిన్న పాత్రలు పోషిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇందుకోసం అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని లఘుచిత్రాల్లో సైడ్హీరోగా నటించి అనంతరం హీరోగా నటించాడు. ప్రస్తుతం టీవీ సీరియల్లో విభిన్నపాత్రలు పోషిస్తున్నాడు. భువనగిరి మండలం బండసోమారం గ్రామానికి చెందిన సుర్పంగ రాములు, లక్ష్మి దంపతుల కుమారుడు గణేష్. చిన్నప్పటి నుంచి సినిమాలో నటించాలనే సంకల్పంతో ఆదిశగా ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఎప్పటికైనా సినిమాలో హీరోగా నటించాలనే కోరిక అతడిలో కలిగింది. అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుండేవాడు. ఈక్రమంలోనే యాదగిరిగుట్టకు చెందిన లఘుచిత్ర దర్శకుడు రాజు గణేష్‌లో ఉన్న నటన ప్రతిభను గుర్తించి అవకాశం కల్పించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విశ్రాంతి లేకుండా లఘుచిత్రాల్లో నటిస్తూ ప్రస్తుతం టీవీ సీరియల్లో సైతం నటిస్తున్నాడు. ప్రస్తుతం టీవీ సీరియళ్లలో.. గణేష్ ప్రారంభంలో రియల్ లవ్ నెవర్ డై, ల్యాజిక్ ఆఫ్ లైవ్ డిషిసన్, రెండు లఘు చిత్రాల్లో నటించాడు. ఈచిత్రా లు 2013లో విడుదలయ్యాయి. వీటితోపాటు బర్త్‌డే బాయ్ చిత్రం కూడా నటించాడు. ఆ తర్వాత వదిలేసి వెళ్తున్నా, సైలెంట్ లవ్ స్టోరీ, కాలేజీ పొరగాళ్లు, శాంతాభాయ్, నాకు నీనే తోపు తురుము, తను క్లాస్మెంట్ వంటి చిన్న సినిమాల్లో విభిన్న పాత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఇందిరానో కంప్రమైజ్ సినిమాలో నటిస్తున్నాడు. వీటితోపాటు బంగారు పంజారం, మనస్సు మమత వంటి టీవీ సీరియల్లలో నటించాడు. సినీ హీరో కావాలన్నదే నా కోరిక అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. లఘుచిత్రంతో ప్రారంభమైన నా చిన్న సినిమాల వరకు తీసుకువచ్చాను. ప్రస్తుతం టీవీ సీరియళ్లలో నటిస్తున్నాను. పెద్ద సినిమాల్లో అవకాశం వస్తే తప్పనిసరిగా నటిస్తా. జీవితంలో హీరోగా ఒక సినిమాలో నటించాలని నా కోరిక. – గణేష్, నటుడు -
ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్న గవర్నర్
-
స్నేహితుడిని కసితీరా కత్తితో నరికేసింది..
మానవత్వం మంటగలిసింది... బంధాలు బరి తెగిస్తున్నాయి.. స్నేహాలు చెడుమార్గంలో నడుస్తున్నాయి.. సంబంధాలు అవసరాలకు పరిమితమవుతున్నాయి.. క్షణక్షణం అనుమానంతోనే స్నేహం.. ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం పాకులాట.. అంతిమంగా ప్రాణం తీసేందుకు వెనకాడని తత్వం.. అందులోనూ ఓ మహిళ కక్ష కట్టింది.. నమ్మకంగా స్నేహితుడిని ఇంటికి తీసుకెళ్లింది.. కసితీర కత్తితో నరికి దారుణంగా హత్య చేసింది. ఘటన తంగిళ్లబీడులో గురువారం సంచలనం రేపింది. సాక్షి, తిరువూరు(కృష్ణా) : వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తిని స్నేహితురాలు అతిదారుణంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్ తెలిపిన వివరాలు.. విజయవాడ పోరంకికి చెందిన అవనిగడ్డ గణేష్ (46) గతలో ఆగిరిపల్లి మండలంలో గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేశాడు. అప్పట్లో తిరువూరు సమీపంలోని తంగిళ్లబీడుకు చెందిన రేణుకతో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. కొంతకాలం ఇద్దరు బాగానే ఉన్నారు. అయితే ఇటీవలే గణేష్‌కు బదిలీ కావడంతో ఉద్యోగానికి సెలవు పెట్టి ఇంటి వద్ద ఉంటున్నాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలతో దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. ఏడాదిన్నరగా సంబంధం కొనసాగుతోంది. అయితే జనవరి నుంచి రేణుకకు డబ్బులు ఇవ్వడం లేదని సమాచారం. దీనికితోడు అనారోగ్యంతో గణేష్ మెడికల్ లీవ్‌లో ఉన్నాడు. పథకం ప్రకారమే హత్య ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వని గణేష్ మీద రేణుక కక్షపెంచుకుంది. తరుచూ ఫోన్లో డబ్బులు ఇవ్వాలని కోరుతోంది. అయితే జనవరి నుంచి డబ్బులు సర్దుబాటు చేయకపోగా గణేష్ కనిపించకుండా తిరుతున్నాడు. ఫోన్లో సంప్రందించినా పట్టించుకోవడం లేదని రేణుక భావించింది. దీంతో తోటి వారి సాయం తీసుకుంది. విస్సన్నపేట నుంచి ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు యువకులను కారులో ఎక్కించుకుని విజయవాడ పోరంకి వెళ్లింది. గణేష్‌ను మాయమాటలు చెప్పి తీసుకురావాలని వారికి పని అప్పగించింది. అందరు కలసి పథకం ప్రకారం ఇంటికి వెళ్లి కారులో గణేష్‌ను ఎక్కించుకున్నారు. తరువాత కారును నేరుగా తిరువూరు తంగిళ్లబీడులోని తన ఇంటికి తీసుకెళ్లింది. విస్సన్నపేట నుంచి తీసుకొచ్చుకున్న కిరాయి వ్యక్తులతో కలసి గణేష్‌ను కత్తితో నరికి చంపేశారు. నిందితులు పరయ్యారు. విస్సన్నపేటకు చెందిన కారు డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. గతంలోనూ రేణుక పలు హత్యానేరాల్లో నిందితురాలు. ఆమె భర్తను కూడా హత్య చేసిన కేసులో నిందితురాలుగా ఉంది. ఆమెపై తిరువూరు పోలీసుస్టేషన్ రౌడీషీటు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. -
విశాల్‌తో ఐసరి గణేశ్ ఢీ
సాక్షి, చెన్నై : దక్షిణ భారత నటీనటుల సంఘం(నడిగర్‌సంఘం) ఎన్నికల నగారా ఇప్పటికే మోగిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న సంఘ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి పద్మనాభన్ నేతృత్వం వహిస్తున్నారు. 2015లో నటుడు శరత్‌కుమార్, రాధారవిల జట్టును ఢీకొని గెలిచిన విశాల్, నాజర్, కార్తీల పాండవర్ జట్టు మళ్లీ బరిలోకి దిగుతోంది. మహాజట్టు ప్రయత్నం గత ఎన్నికల్లో విశాల్ జట్టు విజయం కోసం కృషి చేసిన పలువురు ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మారారు. వారంతా కలిసి ఈ సారి విశాల్ జట్టును ముఖ్యంగా విశాల్‌ను ఓడించాలన్న కసిగా ఉన్నారు. దీంతో విశాల్ జట్టుకు వ్యతిరేకంగా మహా జట్టును ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అందులో భాగంగా బిగ్‌షాట్ అయిన ఐసరి గణేశ్‌ను రంగంలోకి దింపారు. ఈయన విద్యా సంస్థల అధినేత, సినీ నిర్మాతగా తెలిసిందే. నటుడిగానూ చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తుంటారు. విశేషం ఏంటంటే ఐసరిగణేశ్ కూడా గత ఎన్నికల్లో విశాల్ జట్టుకు మద్దతుగా నిలిచారు. ఈ ఎన్నికల్లో ఆయన్నే ఢీకొనడానికి సిద్ధం అయ్యారన్నది గమనార్హం. విశాల్ జట్టు.. విశాల్ జట్టులో నాజర్ అధ్యక్షుడిగానూ, విశాల్ కార్యదర్శిగానూ, కార్తీ కోశాధికారిగానూ, ఉపాధ్యక్షులుగా కరుణాస్, పూచి మురుగన్ పోటీ చేస్తున్నారు. కార్యవర్గ సభ్యులుగా నటి కుష్భూ, కోవైసరళ, లతా సభాపతి, సోనియా, మనోబాలా, పశుపతి, ఎస్డీ.నందా, హేమచంద్రన్, రమణ, వాసుదేవన్, ఎస్ఎం.కాళిముత్తు, రత్నప్ప, జరాల్డ్, జూనియర్ బాలయ్య, రాజేశ్, దళపతి, దినేశ్, వెంకటేశ్, ఎంఎస్.ప్రకాశ్, సరవణన్ మొదలగు 19 మంది పోటీలో ఉన్నారు. గణేశ్ జట్టు.. వీరికి వ్యతిరేకంగా గణేశ్ జట్టులో అధ్యక్ష పదవికి దర్శక, నటుడు కే.భాగ్యరాజ్‌ను బరిలోకి దించారు. కార్యదర్శి పదవికి ఐసరిగణేశ్ పోటీ చేస్తున్నారు. నటి కుట్టి పద్మిని, నటుడు ఉదయ ఉపాధ్యక్ష పదవులకు, కోశాధికారి పదవికి జయంరవి బరిలోకి దిగుతున్నట్లు సమాచారం. అయితే ఈ జట్టు వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కాగా ఎన్నికలకు మరో రెండు వారాలే గడువు ఉండడంతో పోటీ వర్గాలు ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో అధిక స్థానాలను కైవసం చేసుకున్న డీఎంకే అధినేత ఎంకే.స్టాలిన్‌ను నటుడు విశాల్ మర్యాదపూర్వకంగా కలిసి అభినంధించారు. దీంతో ఇటీవల ఆయనకు పోటీగా నటుడు ఉదయ కూడా స్టాలిన్‌ని కలిశారు. నడిగర్‌సంఘం రాజకీయ రంగు పులుముకుంటుందనే ఆరోపణలు వస్తున్నాయి. కే.భాగ్యరాజ్, ఐసరిగణేశ్ జట్టు విశాల్ జట్టు దూకుడు గత ఎన్నికల మాదిరిగానే ఈ సారి రసవత్తరంగా జరగనున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల పర్వం శుక్రవారం నుంచే ప్రారంభం కావడంతో విశాల్ జట్టు ముందుగానే తన సభ్యుల పట్టికను ప్రకటించడంతో పాటు శనివారం నామినేషన్ కూడా దాఖలు చేసి దూకుడుని ప్రదర్శించారు. భవన నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పాండవర్ జట్టు మీడియా ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ నడిగర్ సంఘ నూతన భవన నిర్మాణాన్ని కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అయితే వారి ప్రయత్నాలను తాము సాగనివ్వమని అన్నారు. మరో 4 లేదా 6 నెలల్లో సంఘ భవన నిర్మాణం పూర్తి అయ్యే స్థాయిలో ఉన్నాయని, వాటిని కచ్చితంగా పూర్తి చేసి తీరతామన్నారు. తమ కార్యవర్గం గత ఎన్నికల్లో చేసి వాగ్ధానాలన్నీ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా విశ్రాంత సభ్యులకు పెన్షన్‌ను పెంచడం లాంటి పలు సంక్షేమ కార్యక్రమాలను నెరవేర్చాయన్నారు. తనకు బెదిరింపులు వస్తున్నాయని, అలాంటివి తనకు కొత్త కాదన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడాన్ని ఎవరూ అడ్డుకోలేరని, పోటీ చేసే హక్కు ఎవరికైనా ఉంటుందన్నారు. అదే విధంగా నడిగర్ సంఘం రాజకీయాలకు అతీతం అన్నారు. ఇందులో ఉన్న వారెవరూ రాజకీయ పార్టీలకు చెందిన వారు కాదన్నారు. త్వరలో నిర్వహించనున్న సంఘ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఉపముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలవనున్నట్లు విశాల్ తెలిపారు. -
నంబర్ వన్ రేస్‌లో...
గణేశ్, రష్మికా మండన్నా కథానాయికలుగా సుని దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం ‘చమ్మక్’. దివాకర్ సమర్పణలో మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్ నిర్మాతలుగా ‘గీతా..ఛలో: వీకెండ్ పార్టీ’ పేరుతో ఈ సినిమాను ఈ నెల 3న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘సినిమా తీయడమే కాదు. రిలీజ్ విషయంలోనూ సరైన ప్రణాళిక ఉండాలి. నిర్మాతలు పంపిణీరంగంలో అనుభవజ్ఞులు. ఈ సినిమాతో నిర్మాతలకు డబ్బు, పేరు రావాలి’’ అన్నారు. ‘‘డబ్బింగ్ సినిమాలు ఎన్ని విడుదలైనా టేస్ట్‌ఫుల్ సినిమాలకు ప్రేక్షకాదరణ ఉంటుంది. కన్నడలో హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా విజయం సాధించాలి’’ అన్నారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్. ‘‘గీత గోవిందం’ సినిమాలో వందకోట్ల క్లబ్లో చేరారు రష్మిక. నంబర్ 1 రేస్‌లో ఉన్నారు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు ఈ చిత్రసమర్పకుడు దివాకర్. ‘‘కన్నడలో ఈ చిత్రం దాదాపు 30కోట్లు వసూలు చేసింది. మంచి చిత్రాన్ని అందరూ చూడాలనే వాయిదా వేసి మే 3న విడుదల చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. -
వీకెండ్ పార్టీ ఛలో ఛలో
‘‘మామిడాల శ్రీనివాస్‌ది ఎప్పుడూ పోరాటమే. ఇప్పుడాయన శ్రీనివాస్‌తో కలిసి ‘గీతా.. ఛలో’ వంటి మంచి సినిమా చేశారు. ఫైర్‌బ్రాండ్ హీరోయిన్ రష్మికా మండన్నా ఉండటం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. ‘గీతా.. ఛలో’ టైటిల్ క్యాచీగా ఉంది. కన్నడలో కంటే ఇక్కడ ఇంకా పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే రష్మికకు ఇక్కడ అంత మంచి మార్కెట్ ఉంది’’ అని నిర్మాత సి.కల్యాణ్ అన్నారు. ‘గోల్డెన్‌స్టార్’ గణేశ్, రష్మికా మండన్నా జంటగా నటించిన చిత్రం ‘గీతా... ఛలో’. ‘వీకెండ్ పార్టీ’ అనేది ట్యాగ్‌లైన్. కన్నడలో ‘చమక్’ పేరుతో విడుదలై సూపర్ సక్సెస్ అందుకున్న ఈ సినిమాని శ్రీ రాజేశ్వరి ఫిల్మ్ పతాకంపై డి.దివాకర్ సమర్పణలో మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్ తెలుగులో ‘గీతా.. ఛలో’ పేరుతో ఈ నెల 26న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో సీడీలను సి.కల్యాణ్ ఆవిష్కరించారు. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్, దర్శకుడు వీఎన్ ఆదిత్య, నిర్మాతలు శ్రీధర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, బాలాజీ నాగలింగం తదితరులు ఈ సినిమాలోని ఒక్కో పాటను విడుదల చేశారు. మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం మేం చాలా కష్టపడ్డాం. కన్నడలో ఈ చిత్రం రూ.30 కోట్లు వసూలు చేసింది. ‘గీతగోవిందం’ సినిమాలో ఎలాంటి ఎమోషన్స్, కామెడీ ఉందో ఈ సినిమాలోనూ ఉన్నాయి. యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే సినిమా ఇది’’ అన్నారు. దుగ్గివలస దివాకర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాను ముందుగా తెలుగులో రీమేక్ చేద్దామనుకున్నాం. కుదరలేదు. ఈ సినిమాలో రష్మిక పాత్రకు ఆమె తప్ప ఎవరూ సరిపోరని డబ్ చేస్తున్నాం. ఈ నెల 21న విశాఖలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తున్నాం’’ అన్నారు. -
స్నేహితుడిని రక్షించబోయి యువకుడి మృతి
సాక్షి, నెల్లూరు(క్రైమ్): స్నేహితుడిని రక్షించబోయి యువకుడు నీటిలో మునిగి మృతిచెందిన ఘటన పెన్నానదిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. నెల్లూరులోని జెండావీధికి చెందిన తంగరాజు గోల్డ్‌స్మిత్ వ్యాపారి. ఆయన కుమారుడు గౌరినాథ్ (17) సంతపేటలోని పీఎంఆర్ హైస్కూల్లో పదోతరగతి వరకు చదువుకున్నాడు. అదే స్కూల్లో గోపి సెంటర్‌కు చెందిన గణేష్ సైతం పదో తరగతి చదివాడు. ఇద్దరూ స్నేహితులు. గతేడాది జరిగిన 10వ తరగతి పరీక్షల్లో ఇద్దరూ మ్యాథ్స్ సబ్జెక్టులో ఫెయిలయ్యారు. ఈ ఏడాది పరీక్ష ఫీజు కట్టి మంగళవారం పరీక్ష రాసి ఇంటికి వెళ్లారు. కొద్దిసేపటికి ఇద్దరూ కలిసి బైక్‌పై నగరంలో చక్కర్లు కొట్టారు. బహిర్బూమికి పెన్నావారధి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో గణేష్ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన గౌరినాథ్ స్నేహితుడిని రక్షించే ప్రయత్నంలో తాను నీటిలో మునిగిపోయాడు. అటుగా వెళుతున్న వారు గుర్తించి గణేష్‌ను రక్షించగా గౌరినాథ్ నీటిలో మునిగి అప్పటికే చనిపోయాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న సంతపేట ఇన్స్పెక్టర్ సీహెచ్ కోటేశ్వరరావు, ఎస్సై సుబహానీలు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో గౌరినా«థ్ మృతదేహాన్ని వెలికి తీయించారు. అతని వద్ద లభ్యమైన ఆధారాల మేరకు బాధిత కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని గౌరినా«థ్ విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం పోలీసులు ప్రభుత్వ ప్రధానాస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
గణేష్‌ది ముమ్మూటికి హత్యే..
గుంటూరు ఈస్ట్: తమ కుమారుడిది ఆత్మహత్య కాదని హత్యేనని, నిందితులకు కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని మేకల గణేష్ తల్లిదండ్రులు నాగేశ్వరరావు, నాగమల్లేశ్వరి డిమాండ్ చేశారు. వడ్లమూడి సమీపంలోని రైలు పట్టాల వద్ద అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన బీటెక్ విద్యార్థి గణేష్ తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు జీజీహెచ్ మార్చురి వద్ద ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ ఫిరంగిపురం ఎర్రగుంట్లపాడులో తాము వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. తమ మూడో కుమారుడు గణేష్ శుక్రవారం మధ్యాహ్నం మిత్రుడైన రవి కళాశాల నుంచి బయటకు తీసుకువెళ్లాడన్నారు. గణేష్ క్లాసులకు హాజరుకాకపోవడంతో కళాశాల యాజమాన్యం కూడా సెల్ ద్వారా మెసేజ్ పంపిందన్నారు. అయితే, శనివారం గణేష్ మృతదేహం వడ్లమూడి సమీపంలోని రైలుపట్టాలపై ఉన్న విషయం తమకు పోలీసులు తెలిపారన్నారు. తమ కుమారుడిని తీసుకువెళ్లిన రవిని పట్టుకు పోలీసులకు అప్పగించామని చెప్పారు. తనతో పాటు మరో ముగ్గురు ఉన్నారని, అంతా కలసి మద్యం తాగినట్లు ఒప్పుకున్నాడని వివరించారు. గణేష్ అస్థిపంజరం బొమ్మ చుట్టూ పుర్రెల బొమ్మలు పెట్టిన పోస్టింగ్‌ను గణేష్ సెల్‌కు రవి శనివారం పంపించాడని చెప్పారు. ఘటనా స్థలం సమీపంలో కర్రలకు రక్తం మరకలు ఉన్నాయని, దీన్ని బట్టి తన కుమారుడిది హత్యేనని ఆరోపించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. నవ్యాంధ్ర స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.అయ్యస్వామి, బీసీ విద్యార్థి సంఘ జిల్లా అధ్యక్షుడు కర్రం శ్రీనివాస్ మాట్లాడుతూ గణేష్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని ,సమగ్ర విచారణ జరిపి నిందితులను అరెస్టు చేయాలని డిమాండు చేశారు. పోలీసులు ఇప్పటికైనా గణేష్ మృతికి కారణాలను తల్లిదండ్రులకు స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. -
చనిపోతాడని గెంటేసిన అద్దింటి యజమాని
ఒక కాకి చనిపోతే.. వంద కాకులు చేరుతాయి.. అది జాతి ప్రీతి. అదే మనిషి చనిపోతే.. చేరదీయడం కాదు.. కనీసం ఇంట్లో కూడా ఉండనివ్వరు ఇది మా‘నవ’నీతి. ఇక్కడ ఓ నేత కార్మికుడు చనిపోలేదు.. పక్షవాతంతో మంచానపడి బాధపడుతున్నాడు. అతడు చనిపోతే.. అశుభంగా భావించి.. ఇంట్లోంచి వెళ్లగొట్టారు ఓ ఇంటి యజమాని. ఇంకో ఇంట్లోకి వెళ్లడానికి బయానా ఇచ్చినా.. విషయం తెలిసి వారు కూడా నిరాకరించారు. మలిసంధ్యలో కాపాడాల్సిన కొడుకు కూడా తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. దీంతో ఓ అద్దెబతుకు బస్టాండుపాలైంది. ఈ అమానవీయ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. సిరిసిల్లటౌన్: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కట్టలింగంపేటకు చెందిన చెన్న ఆనందం బతుకు దెరువు కోసం పదిహేనేళ్ల క్రితం సిరిసిల్ల పట్టణానికి వచ్చాడు. ఇక్కడ సాంచాలు నడిపిస్తూ భార్య నిర్మల, కొడుకు రాజు, ఇద్దరు కూతుళ్లను సాకాడు. ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లు చేయడానికి నిర్మల బీడీలు చుడుతూ భర్త సంపాదనకు తోడుగా నిలిచింది. రెండో కూతురు లతను భర్త గొడవపడి పుట్టింటికి పంపించగా.. తల్లిదండ్రుల వద్దే ఆరేళ్ల బాబు గణేష్‌తో ఉంటోంది. వీరికి సొంతిల్లు లేకపోవడంతో పదిహేనేళ్లుగా అక్కడా.. ఇక్కడా అద్దె ఇళ్లలో ఉంటూ కాలం నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం బీవైనగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. రెండేళ్ల క్రితం ఆనందంకు పక్షవాతం వచ్చి కాళ్లు చచ్చుబడి మంచానికి పరిమితమయ్యాడు. దీంతో అతడు చనిపోతే.. ఇంటికి అరిష్టంగా భావించిన అద్దింటి యజమాని ఇంట్లోంచి వెళ్లిపోవాలని చెప్పాడు. రెండ్రోజుల క్రితం అదే ప్రాంతంలో మరో ఇంట్లో ఉండటానికి ఆనందం కుటుంబసభ్యులు బయానా ఇచ్చారు. గురువారం రాత్రి ఇంటి యజమాని బలవంతంగా ఖాళీ చేయించగా.. బయానా ఇచ్చిన కొత్తింటికి వెళ్లారు. వారికి అక్కడా పరాభవమే ఎదురైంది. ఆ ఇంటి యజమాని కూడా ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో దిక్కుమొక్కులేని స్థితిలో ఆ నేతన్న కుటుంబం అర్ధరాత్రి పూట కొత్త బస్టాండుకు చేరి చెట్టుకింద తలదాచుకుంది. చెప్పలేని ఆవేదన.. కష్టజీవులైన ఆ కుటుంబం బతుకు బస్టాండు పాలు కావడంతో చెప్పలేని ఆవేదనతో రగిలిపోయారు. ప్రయోజకుడైన కొడుకు కూడా మలిసంధ్యలో ఉన్న తల్లిదండ్రులను వదిలి అత్తింటివారితో ఉండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచానికి పరిమితమైన ఆనందం, నిలువనీడ లేకుండా బస్టాండు వద్ద చెట్టుకింద ఉన్న విషయంపై స్థానికులు స్పందించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. తమ కష్టాలను మీడియా ముందు కన్నీరు పెట్టుకుంటూ చెప్పిన వైనం అందరినీ కంటతడి పెట్టించింది. అభాగ్య బతుకును ఆదుకోవాలని పోస్టింగులు చేయడంతో మానవతావాదులు స్పందించి విషయాన్ని స్థానిక తహసీల్దార్‌కు సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించారు. విద్యాశాఖ అ«ధికారులతో మాట్లాడి ఎమ్మార్సీ భవనంలో ఉండటానికి ఆశ్రయం ఇవ్వాలని సూచించడంతో అధికారులు వారిని అక్కడకు తరలించారు. చంద్రంపేటకు చెందిన వీరబోయిన చందు బాధితులకు రూ.2వేలు ఆర్థిక సాయం చేశాడు. -
తుపాకీతో కాల్చబోయాడు
బొమ్మనహళ్లి/శివాజీనగర: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, గణేశ్‌ల మధ్య గత శనివారం ఈగల్టన్ రిసార్టులో జరిగిన ఘర్షణపై పోలీసు దర్యాప్తు ఆరంభమైంది. ఇది ముందు అనుకున్నంత చిన్న కేసు కాదని తెలుస్తోంది. తుపాకులు, హత్యాయత్నం వరకు వెళ్లిందని బాధిత ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్ ఖాకీల ముందు పేర్కొన్నారు. ఆ దాడిలో తలకు తీవ్ర గాయాలతో నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆనంద్‌సింగ్‌ను కలిసి బిడది పోలీసులు వివరాలను సేకరించారు. తాజా వివరాలతో దాడి కేసులో హత్యాయత్నం అభియోగంగా మార్చారని తెలిసింది. ఈ దాడి కేసులో ఎమ్మెల్యే గణేశ్ పైన ఆనంద్‌సింగ్ కుటుంబీకులు కేసు పెట్టడం, ఎఫ్ఐఆర్ నమోదు కావడం తెలిసిందే. మంగళవారం ఆస్పత్రికి వెళ్ళిన పోలీసులు ఐసీయూ వార్డులోనే ఆనంద్‌సింగ్‌ను కలిశారు. దాడి గురించి పలు కోణాల్లో సమాచారాన్ని తీసుకున్నారు. మరోపైన తనపైన కేసు నమోదు కావడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఎమ్మెల్యే గణేశ్ ముందుజాగ్రత్తగా అజ్ఞాతంలో వెళ్లిపోయారని సమాచారం. దాడి కేసులో ఆయనను కలవడానికి బిడది పోలీసులు ప్రయత్నింగా ఆయన అందుబాటులోకి రావడం లేదని తెలిసింది. ఆనంద్‌సింగ్ ఏం చెప్పారంటే ఆనంద్‌సింగ్ పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం... ఈగల్టన్ రిసార్టులో రానున్న లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్రంలో ఉన్న కరువు సమస్యపైన పార్టీ పెద్దలు సమావేశం జరిపారు. ఈ సమావేశానికి నేను హాజరయ్యాను. అందరితో కలిసి భోజనం చేసి వెళుతున్న సమయంలో కంప్లి ఎమ్మెల్యే గణేశ్ వచ్చారు. ఎన్నికల సమయంలో నీవుడబ్బులు సరిగా ఖర్చు పెట్టలేదు. నిన్ను, మీ అక్క కొడుకు సందీప్ కథను ముగించేస్తానని నన్ను హెచ్చరించాడు. నేను వెంటనే.. మా కుటుంబం గురించి మాట్లాడుతున్నావు అని అడిగా. గణేశ్ స్పందిస్తూ మొదట వారిని కాదు, నిన్ను ముగిస్తే అన్ని సమస్యలు సరిపోతాయని ఒక్కసారిగా నాపైన దాడి చేశాడు. నోటికి వచ్చినట్లు తిడుతూ అక్కడ ఉన్న కట్టెతోను, పూలకుండీతోను గట్టిగా కొట్టాడు. తుపాకీ ఇవ్వండి, వీడిని ఇక్కడే ముగించేస్తానని కేకలు వేశాడు. నా తల, ముఖం పైన తీవ్రంగా కొట్టాడు’ అని పేర్కొన్నట్లు తెలిసింది. దాడిని అక్కడే ఉన్న మంత్రి తుకారాం, తన్వీర్ సేఠ్, ఎమ్మెల్యేలు రఘుమూర్తి, రామప్పలు అడ్డుకొన్నారని తెలిపారు. ఆనంద్ సింగ్ వద్ద సమాచారం తీసుకొన్న పోలీసులు ఎమ్మెల్యే గణేశ్‌పై హత్యాయత్నం కేసుగా మార్చినట్లు సమాచారం. గణేశ్ తనపై దాడిచేసి హత్యకు యత్నించాడని, తనను చంపడానికి తుపాకీ ఇవ్వకపోవటంతో ఆగ్రహించి గన్‌మ్యాన్ చెయ్యిని కొరికాడని ఆనంద్ సింగ్ పోలీసులకు ఫిర్యాదులో తెలిపారు. గణేశ్ ఎక్కడ ఎమ్మెల్యే గణేశ్ ఆచూకీ దొరక్కపోవడం సంచలనం కలిగిస్తోంది. అరెస్టు భయంతోనే గణేశ్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది. గణేశ్ ఏం చేయాలో దిక్కుతోచక అదృశ్యమయ్యాడని తెలిసింది. ఆయన మొబైల్ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్‌లో ఉందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. దాడి ఘటన తరువాత సొంత నియోజకవర్గానికి కూడా వెళ్లలేదు. ముందస్తు బెయిల్ పొందే యత్నాల్లో ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. -
కర్నాటక హైడ్రామాలో మరో ట్విస్ట్
-
రిసార్టులో ఎమ్మెల్యేల బాహాబాహీ
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు శివార్లలో ఉన్న ఈగల్టన్ రిసార్టులో కలకలం చెలరేగింది. ఈ రిసార్టులో శనివారం రాత్రి కాంగ్రెస్ నేతలు భోజనం చేస్తుండగా కంప్లి ఎమ్మెల్యే జె.ఎన్.గణేశ్, హోసపేటె ఎమ్మెల్యే, గనుల వ్యాపారి ఆనంద్ సింగ్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సహనం కోల్పోయిన గణేశ్ టేబుల్‌పై ఉన్న మద్యం బాటిల్‌తో ఒక్కసారిగా ఆనంద్‌సింగ్‌పై దాడిచేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆనంద్‌సింగ్‌ను నేతలు అపోలో ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయనకు 12 కుట్లు వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఆసుపత్రి ముందు మోహరించిన పోలీసులు ప్రస్తుతం రాజకీయ నేతలెవరినీ లోపలకు వెళ్లనివ్వడం లేదు. ఈ గొడవ విషయమై కాంగ్రెస్ అధికార ప్రతినిధి మధుయాష్కి మాట్లాడుతూ..‘బళ్లారి జిల్లాకు చెందిన గణేశ్, ఆనంద్ సింగ్ ఇద్దరూ పలు వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యాపారానికి సంబంధించి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అదికాస్తా ముదరడంతో గణేశ్, ఆనంద్ సింగ్‌పై దాడి చేశారు. ఈ దాడికి, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు’ అని స్పష్టం చేశారు. రహస్య సమాచారం లీక్ చేశాడనే.. ఈగల్టన్ రిసార్టులో రెండ్రోజులుగా గణేశ్, ఆనంద్ సింగ్ మధ్య వాగ్వాదం కొనసాగుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో భాగంగా బీజేపీ నేతలు గణేశ్‌ను సంప్రదించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు తనను సంప్రదించిన విషయాన్ని, ఇస్తామన్న ఆఫర్‌ను గణేశ్ ఆనంద్‌సింగ్‌తో పంచుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ సీఎల్పీ భేటీకి విప్ జారీచేయడంతో గణేశ్ గత్యంతరం లేక హాజరయ్యారు. సమావేశం అనంతరం సీనియర్లు ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యేలను నేరుగా రిసార్టుకు తరలించారు. ఈ సందర్భంగా గణేశ్‌ను బీజేపీ ప్రలోభపెట్టిన విషయాన్ని ఆనంద్‌సింగ్ సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య చెవిన వేశారు. ఈ విషయం తెలుసుకున్న గణేశ్ ఆగ్రహంతో ఊగిపోయారు. చివరికి మాటామాటా పెరగడంతో ఆనంద్‌సింగ్ తలపై మద్యం బాటిల్‌తో దాడిచేశారు. కాగా, తన భర్తపై దాడిచేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆనంద్‌సింగ్ భార్య ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని బిదాది పోలీసులు తెలిపారు. బీజేపీ విమర్శలు ఈగల్టన్ రిసార్టులో జరిగిన ఘటన ప్రజాస్వామ్యానికే కళంకమని బీజేపీ విమర్శించింది. ఈ గొడవను రాష్ట్ర పీసీసీ చీఫ్ గుండూరావు ఆపలేకపోవడం నిజంగా దురదృష్టకరమని ఎద్దేవా చేసింది. ఇన్నాళ్లూ ప్రతీ సమస్యకు బీజేపీనే కారణమని ఆరోపించిన గూండూరావు ఇప్పుడేం చేస్తారని ప్రశ్నించింది. మరోవైపు కర్ణాటక బీజేపీ చీఫ్ యాడ్యూరప్ప ఆదేశాల మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా రాష్ట్రానికి తిరిగివస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే గవర్నర్ వజూభాయ్ వాలాను కలిసి కుమారస్వామి సర్కారును బలనిరూపణకు ఆదేశించాల్సిందిగా కమలనాథులు కోరే అవకాశమున్నట్లు సమాచారం. -
‘99’ పేరుతో ‘96’
సెన్సేషనల్ కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి, సీనియర్ హీరోయిన్ త్రిష జంటగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ 96. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు అద్భుతమైన రివ్యూస్ రావటంతో పాటు కలెక్షన్ల పరంగా కూడా రికార్డ్‌లు సృష్టించింది. దీంతో ఇతర భాషల్లో 96ను రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు రీమేక్ హక్కులు సొంతం చేసుకోగా గోపిచంద్ హీరోగా నటించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. కన్నడ దర్శకనిర్మాతలు మరో అడుగు ముందుకేసి ఈ రీమేక్ ప్రీ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. గణేష్, భావన హీరో హీరోయిన్లుగా ప్రీతం గబ్బి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 99 అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
పండగవేళ
-
పెళ్లైన ఆనందం తీరక ముందే..
శ్రీకాకుళం, నరసన్నపేట: పెళ్లైన ఆనందం తీరకముందే ఓ యువకుడ్ని డెంగీ మహమ్మారి బలితీసుకుంది. కట్టుకున్న యువతిని కన్నీరు పాల్జేసింది. వివరాల్లోకి వెళితే.. రేగిడి ఆమదాలవలస మండలం పుర్లికి చెందిన బూరాడ గణేష్ (26) నరసన్నపేట గాంధీనగర్‌లో నివసిస్తున్నాడు. అతనికి ఈ ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన లుకలాం గ్రామానికి చెందిన గౌతమితో వివాహం అయింది. ప్రస్తుతం గౌతమి గర్భిణి. గడిచిన వారం రోజులుగా గణేష్ జ్వరంతో బాధపడుతూ స్థానిక వైద్యుల వద్ద చికిత్స పొందాడు. అయితే జ్వరం తగ్గక పోగా ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని విశాఖలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించాడు. ఈ సమాచారం తెలుసుకున్న కుటంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఎంతో భవిష్యత్తు ఉన్న గణేష్ తన వైవాహిక జీవతంపై ఎన్నో కలలు కన్నాడు. పుట్టిన పిల్లలను బాగా చదివించాలని, ఆదర్శంగా పెంచాలని భార్యతో అంటుండేవాడు. గణేష్‌ది వ్యవసాయక కుటుంబం. స్వశక్తితో జీవనం సాగించాలనే ఆశయంతో వెల్డింగ్ పనులు చేస్తూ తల్లిదండ్రులకు కొంత డబ్బు పంపిస్తూ తన భార్యను అపురూపంగా చూసుకొంటూ వస్తున్నాడు. ఈ దశలో అతన్ని డెంగీ వ్యాధి బలితీసుకుంది. భర్త ఆకస్మిక మృతితో భార్య గౌతమి కన్నీరు మున్నీరవుతోంది. విధివంచితురాలు.. కాగా పదేళ్ల క్రితం విద్యుత్ షాక్‌తో గౌతమి తండ్రి రామారావు మృతి చెందారు. వివాహానికి కొద్దిరోజుల ముందు తల్లి రాజేశ్వరి కిడ్నీ వ్యాధితో మరణించింది. తాజాగా భర్త గణేష్ మృతితో గౌతమి తీవ్ర విషాదంలో ఉంది. -
‘రోషగాడు’గా బిచ్చగాడు
బిచ్చగాడు సినిమాతో తెలుగులోనూ ఘనవిజయం అందుకున్న కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని. వైవిధ్యమైన కథా చిత్రాలకు, రియలిస్టిక్ క్యారక్టరైజేషన్స్‌తో ఆకట్టుకున్నంటున్న విజయ్ మరో ఇంట్రస్టింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇన్నాళ్లు ప్రయోగాత్మక చిత్రాలు చేసిన ఈ హీరో త్వరలో ఓ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్తో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. తమిళ్లో ‘తిమిరపుడిచవాన్’ పేరుతో తెరకెక్కుతోన్న సినిమాకు తెలుగులో రోషగాడు అన్న టైటిల్ ను ఎనౌన్స్ చేశారు. ఈ రోజు (బుధవారం) సాయంత్రం 5గం.లకు ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న రోషగాడు సినిమాలో నివేథా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తున్నారు. గణేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిలిం కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఫాంతిమా ఆంటోని నిర్మిస్తున్నారు. -
నాపై దుష్ప్రచారం చేస్తున్నారు : హీరో భార్య
యశవంతపుర: సోషల్ మీడియాలో తన ఫొటో ఉంచి నాడుప్రభు కెంపేగౌడకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలను పోస్టు చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సినీహీరో గణేశ్ భార్య శిల్ప నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘కెంపేగౌడ కంటే గొప్పపనులు చేసినవారు అనేక మంది ఉన్నారు. సిల్క్ వర్శిటీకి కెంపేగౌడకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు’ అని రాసి శిల్ప ఫొటోను జతచేసి ఫేస్బుక్లో కొందరు పోస్టు చేశారు. దీంతో శిల్పపై సోషల్‌మీడియాలో ఆగ్రహం వ్యక్తమైంది. నాడుప్రభు కెంపేగౌడపై తనకు అపారమైన గౌరవం ఉందని, అయనను అవమానించాల్సిన అవసరం లేదని పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. కొందరు కావాలనే తనకు చెడ్డపేరు తేవడానికి ఇలాంటి పోస్టులు చేసిన్నట్లు, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శిల్ప పేర్కొన్నారు. -
అందరూ ఆ కాలేజీ పక్షులే!
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణంలో మరో కీలకమైన లింకు బయటపడింది. ఈ కేసుకు సంబంధించి శ్రీచైతన్య కాలేజీలో డీన్‌గా పని చేసిన వాసుబాబు ఇప్పటికే అరెస్ట్ కాగా.. తాజాగా అదే కాలేజీలో చదువుకుని వైద్య విద్య ఫైనలియర్ చదువుతున్న విజయవాడకు చెందిన డాక్టర్ గణేశ్ ప్రసాద్ అరెస్టవడం సంచలనం రేపు తోంది. ప్రస్తుతం కర్ణాటక ధావనగిరిలోని మెడికల్ యూనివర్సిటీలో గణేశ్ చదువుతున్నాడు. ఇతడి సోదరుడు శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ పూర్తి చేయ గా, ఎంసెట్ రాసేందుకు సిద్ధమయ్యాడు. గణేశ్ తన స్నేహితులతో కలసి ఎంసెట్ ప్రశ్నపత్రంపై భువనేశ్వర్‌లో క్యాంపు నిర్వహించాడు. తన సోదరుడితోపాటు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ విద్యార్థి, డోర్నకల్‌కు చెందిన మరో విద్యార్థిని క్యాంపునకు తీసుకెళ్లాడు. వారితో రూ.30 లక్షలకు డీల్ కుదుర్చుకుని.. అడ్వాన్స్‌గా రూ.10 లక్షలు వసూలు చేసినట్టు సీఐడీ విచారణలో బయటపడింది. డాక్టర్లు సందీప్, ధనుం జయ్‌లతో వాసుబాబుకు లింకు బయటపడటం, వాసుబాబుతో గణేశ్ లింకు బయటపడటంతో అధికారులకు క్లారిటీ వచ్చినట్లు సమాచారం. ర్యాంకుల వెనుక గుట్టు శ్రీచైతన్య మాజీ డీన్ వాసుబాబు, నారాయణ కాలేజీ ఏజెంట్ శివనారాయణ అరెస్ట్‌తో.. తీగ లాగితే డొంక కదిలినట్టు చిట్టా బయటపడుతోంది. శివనారాయణ లింకులో బిహార్‌కు చెందిన మరో డాక్టర్, ఇద్దరు బ్రోకర్ల పాత్ర వెలుగులోకి రావాల్సి ఉందని సీఐడీ భావిస్తోంది. దీంతో వాసుబాబుతోపాటు శివనారాయణను మూడు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గణేశ్ అరెస్ట్‌తో నిందితుల జాబితా 90కి చేరింది. -
అప్పులతోనే చిన్నాభిన్నం
జయనగర : వ్యాపారంలో వచ్చిన నష్టాలతోనే పారిశ్రామికవేత్త గణేశ్ సహనం కోల్పోయి భార్యపై తుపాకీతో కాల్పులు జరిపిన ఘటనకు సంబంధించి పోలీసులు నిందితుడిని ముమ్మరంగా విచారణ చేపడుతున్నారు. హాసన్ జిల్లాకు చెందిన గణేశ్ కాఫీ తోటలు విక్రయించి వచ్చిన డబ్బుతో కెంగేరిలో హెర్బల్ ఉడ్ ఫామ్ హౌస్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల వ్యాపారంలో నష్టాలు ఎక్కువ కావడంతో రిసార్టు అమ్మకానికి పెట్టాడు. ఇదే సమయంలో భార్య సహాన ఆస్తి విక్రయానికి సమ్మతించకపోవడంతో తీవ్ర ఆవేశానికి లోనైన గణేశ్ తుపాకీతో ఆమెపై కాల్పులు జరి పాడు. తనకు హత్య చేసే ఉద్దేశ్యం లేదని, క్షణికావేశంలో జరిగిన హత్యతో పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో కారులో పారిపోతూ పిల్లలతో పాటు తాను ఆత్మహత్యకు యత్నించడంలో భాగంగా పిల్లలపై కూడా తుపాకీతో కాల్పులు జరిపినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. కాగా సహనా, గణేశ్‌లది ప్రేమ వివా హం. గురువారం ఉదయం 11.30 గంటలకు సహనాను హత్య చేసి, స్కూల్లో చదువుతున్న పిల్లలను తీసుకుని కారులో ఉడాయించాడు. పిల్లలను రాత్రంతా రిసార్టులో ఉంచుకున్నాడు. శుక్రవారం పిల్లలను కారులో తీసుకుని వెళ్లి ఓ నిర్జన ప్రదేశంలో వారిపై కాల్పులు జరిపాడు. దీంతో పిల్లలు సిద్ధార్థ (15), సాక్షి (9)లు ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టండి
రొంపిచెర్ల: ‘మతిస్థిమితం లేని నా బిడ్డకు ప్రాణ భిక్ష పెట్టండి’ అంటూ రొంపిచెర్ల మండలం గానుగచింత గ్రామ పంచాయతీ దాసరిగుడెంకు చెందిన ఓ తల్లి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బుధవారం మొరపెట్టుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలు.. దాసరి గూడెంకు చెంది న కె.ప్రతాప్, కుమారి దంపతుల కుమారుడు గణేష్(3)కు 45 రోజుల కిందట మెదడువాపు జ్వరం వచ్చింది. దీంతో తల్లిదండ్రులు తిరుపతిలోని ప్రయివేటు ఆస్పత్రులలో సుమారు రూ.2 లక్షలు ఖర్చు చేసి చికిత్సలు చేయించారు. అయితే జ్వరం తీవ్ర ప్రభావం చూపడంతో చిన్నారికి పూర్తిగా మతిస్థిమితం లేకుండా పోయిందని వైద్యులు తెలిపారు. చైన్నైలో ఆపరేషన్ చేయించుకోవాలని, అందుకు లక్షల్లో ఖర్చవుతుందని డాక్టర్లు స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతం చేతిలో డబ్బు లేక బిడ్డను కాపాడుకోలేక చిత్రవధ అనుభవిస్తున్నామని గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే రామచంద్రారెడ్డికి తన కుమారుడికి ప్రాణ భిక్ష పెట్టాలని వేడుకొన్నారు. స్పందించిన పెద్దిరెడ్డి చిన్నారి ఆపరేషన్‌కు తన వంతు ఆర్థికసాయం హామీ ఇచ్చారు. చిన్నారిని స్విమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాలని తల్లిదండ్రలకు సూ చించారు. అక్కడ డాక్టర్లతో తాను మాట్లాడి తక్కువ ఖర్చుతో ఆపరేషన్ చేసేలా చర్యలు తీసుకోంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చా రు. గణేష్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పుటికప్పు డు తనకు తెలియజేయాలని సర్పంచ్ జయరామయ్య, ఎంపీటీసీ బాబును ఎమ్మెల్యే ఆదేశించారు. -
నీ నిమ్మ సల్లంగుండ..
-
పురుగుల మందు తాగిన మహిళ మృతి
వట్పల్లి(అందోల్): పురుగుల మందు తాగిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆదివారం మండల పరిధిలోని కేరూర్ గ్రామంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఎస్ఐ గణేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పుల్కల్ మండలం పెద్దరెడ్డిపేట గ్రామానికి చెందిన కొత్తగడి సంగయ్య తన కూతురు మల్లమ్మ(30)ను వట్పల్లి మండలం కేరూర్ గ్రామానికి చెందిన చిన్నెల్లి నాగయ్యకు ఇచ్చి 15 సంవత్సరాల క్రితం పెళ్లి జరిపించాడు. వారికి ఇద్దరు మగ పిల్లలు. అదే గ్రామానికి చెందిన చిన్నెల్లి ఎల్లయ్య ఆరేళ్ల నుంచి ఆమెను వేధిస్తుండడం భార్య, భర్తల మధ్య గొడవలకు దారితీసింది. ఈ నెల 26న ఎల్లయ్య రాత్రి వారి ఇంటి వైపు వచ్చాడు. అది గమనించిన నాగయ్య తన భార్య కోసమే వచ్చాడని భావించి అతడిపై చేయిచేసుకున్నాడు. ఈ విషయమై మనస్తాపం చెందిన మల్లమ్మ ఈ నెల 27న పురుగుల మందు తాగింది. ఈ క్రమంలో వెంటనే జోగిపేట, సంగారెడ్డి ప్రభుత్వాస్రత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
నిత్య కర్షకుడు.. ఈ కండక్టర్
మంచాల: బస్ కండక్టర్ ఉద్యోగం చేస్తూనే వ్యవసాయంలో రాణిస్తున్నాడు మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన లా లగారి గణేష్. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన గ ణేష్కు రెండు ఎకరాల భూమి ఉంది. అందులో ఏళ్లతరబడి వివిధ పంటలు సాగుచేసినా ఆశించిన దిగుబడి రాలేదు. దిగుబడి వచ్చినా ధర లేక కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉండేది. అ యినా ఆయన సాగు బాటను వదల్లేదు. మధ్యలో బస్ కండక్టర్ ఉ ద్యోగం వచ్చినా వ్యవసాయం మీద ఆశ చంపుకోలేదు. సాధారణ పంటలతో లాభం లేదనుకుని ఏదైనా ప్రత్యేక పంటను సాగు చే యాలని గణేష్ ఆలోచించాడు. ఏ పంట వేస్తే లాభాలు ఉంటాయ నే విషయంపై చాలా రోజులు పరిశీలన చేశాడు. ఆ దశలో మా ర్కెట్లో మంచి డిమాండ్ ఉన్న గెర్కిన్ పంటపై ఆయన దృష్టిపడింది. దీంతో ఆ పంట సాగు వివరాలు తెలుసుకున్నాడు. సాగు కోసం విత్తనాలు సరఫరా చేసే కంపెనీ ప్రతినిధులను ఆశ్రయించాడు. వారు ఆరుట్లకు వచ్చి గణేష్ వ్యవసాయ భూమిని పరిశీలించారు. గ్లోబల్ గ్రీన్ కంపెనీ లిమిటెడ్ కంపెనీ వారు గెర్కిన్ పంట విత్తనాలు, క్రిమి సంహారక మందులు ఇవ్వడమే గాకుండా పంటను తామే కొనుగోలు చేస్తామని ఒప్పదం చేసుకున్నారు. 120 రోజుల పంట... గెర్కిన్∙ 120 రోజుల పంట. విత్తనాలు నాటిన మూడు నాలుగు రోజుల్లో మొలకలు వస్తాయి. 30 రోజుల వ్యవధిలో కాత వస్తుంది. మొదటి భీజం ఆకులు, పూత తీసి వేయాలి. అనంతరం వచ్చే కాతను కోసి మార్కెట్‌కు తరలించాలి. మొదట్లో ఎకరాకు ఐదు ను ంచి ఆరు క్విటాళ్ల దిగుబడి వస్తుంది. ఒకటి, రెండు కాతలు అనంతరం టన్ను వరకు వస్తుంది. గెర్కిన్ కాయలను కాసిన రెండవ రోజు కోసి మార్కెట్‌కు తరలించాలి. 120 రోజుల వ్యవధిలో 20కి పైగా కోతలు వస్తుంది. పంటను విత్తనాలు సరఫరా చేసిన కంపెనీ వారు కొనుగోలు చేస్తున్నారు. కాయ సైజును ఆధారంగా రేటు నిర్ణయిస్తారు. ‘ఎ’ రకం 14ఎం.ఎం, రూ.కిలో 30, ‘బి’ రకం 18 ఎం.ఎం. రూ.19, ‘సి’ రకం 25ఎం.ఎం. రూ.12, ‘డి’ రకం 33 ఎం.ఎం రూ.04 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వారే కంపెనీ వాహనాల ద్వారా తోట వద్దకు వచ్చి పంట తీసుకెళ్తున్నారు. ఉద్యోగం చేస్తూనే.. గణేష్ కొన్ని సంవత్సరాలుగా బస్ కండక్టర్ ఉద్యోగం చేస్తూనే.. వ్యవసాయాన్ని కూడా చూసుకుంటున్నాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కండక్టర్ ఉద్యోగం చేస్తాడు. మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తాడు. సాగులో తన భార్య శోభ సహకారం అందిస్తోంది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందడమే కాకుండా పది మందికి జీవనోపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. లాభదాయకమైన సాగు నాకు వ్యవసాయం అంటే మక్కువ. కండక్టర్ ఉద్యోగం వచ్చినా పంటల సాగు వదల్లేదు. గెర్కిన్ పంట చాలా లాభదాయకం. ఈ పంట సాగు చేయడం వల్లన 120 రోజుల వ్యవధిలో లక్ష రూపాయలు సంపాదించవచ్చు. ఈ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. విదేశాల్లో మందుల తయారీకి ఉపయోగిస్తారు. ప్రధానంగా ఉష్ణ మండల దేశాలకు ఎగుమతి అవుతుంది. నేను కష్టపడడమే కాకుండా నిత్యం పది మందికి ఉపాధి కల్పిస్తున్నందుకు సంతోషంగా ఉంది. – లాలగారి గణేష్, ఆరుట్ల -
సింగూరుకు జలసిరి
పుల్కల్: సింగూరు ప్రాజెక్టు నీటిమట్టం పూర్తి స్థాయికి చేరింది. సోమవారం ఉదయం వరకు ఎగువ ప్రాంతం నుంచి 2,966 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని ప్రాజెక్టు డిప్యూటీ ఇంజనీర్ బాలగణేష్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా సాంకేతిక కారణాలతో 29 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. సోమవారం ఉదయం ఎనిమిది గంటల వరకు 28.966 టీఎంసీల నీటి మట్టం ఉంది. 523.600 మీటర్లకుగాను 523.435 మీటర్లకు చేరింది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటిని మంగళవారం నుంచి దిగువకు విడుదల చేస్తామని బాలగణేష్ తెలిపారు. ఏ సమయంలోనైనా దిగువకు నీటిని వదిలే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే దండోరా వేయించినట్లు వివరించారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
గుత్తి/ కూడేరు: వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో జిల్లాకు చెందిన ఇద్దరు దుర్మరణం చెందారు. మృతుల్లో ఒకరు మెడికో, మరొకరు యువకుడు ఉన్నారు. ఈ ప్రమాదాల్లో మరో ఇద్దరు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. గుత్తికి చెందిన సుబ్బమ్మ కుమారుడు గణేష్ (30) కడపలోని ఫాతిమా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. మహాలయ పౌర్ణమి (మాల పున్నమి) పండుగ కోసం ఇటీవల గుత్తికి వచ్చాడు. బుధవారం రాత్రి తిరిగి కడపకు బయల్దేరాడు. అయితే నేరుగా అక్కడికి వెళ్లకుండా మార్గం మధ్యలోని యర్రగుంట్లలో గల తమ బంధువుల ఇంటికి వెళ్లాడు. గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో కడపకు ఆటోలో బయల్దేరాడు. కమలాపురం మండలం తప్పట్ల గ్రామం వద్ద ఆటోను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. గణేష్‌తోపాటు మరో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. వీరిని హుటాహుటిన కడప ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12 గంటల సమయంలో గణేష్ మృతి చెందాడు. శుక్రవారం గుత్తిలో అంత్యక్రియలు నిర్వహించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని.. విడపనకల్లు మండలం కరకముక్కలకు చెందిన వన్నూరుస్వామి (25) అత్తగారి ఊరు అయిన కూడేరు మండలం ఇప్పేరుకు వచ్చాడు. అక్కడి నుంచి శుక్రవారం ద్విచక్రవాహనంలో స్వగ్రామానికి బయల్దేరాడు. ముద్దలాపురం వద్ద అనంతపురం - బళ్లారి రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వన్నూరుస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. ఇతడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. -
బాలాపూర్ లడ్డూ సరికొత్త రికార్డు
సాక్షి, హైదరాబాద్: బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు ధరను సొంతం చేసుకుంది. లంబోధరుడి లడ్డూ ఈ ఏడాది ఏకంగా 15 లక్షల 60వేలు పలికింది. ఆది నుంచి హోరా హోరీగా సాగిన వేలం పాటలో నాగం తిరుపతి రెడ్డి పెద్ద మొత్తంలో వేలం పాట పాడి బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకున్నారు. వెయ్యి నూట పదహార్లతో ప్రారంభమైన వేలం పాట.. చివర వరకూ ఉత్కంఠగా కొనసాగింది. లడ్డూను సొంతం చేసుకునేందుకు 21మంది భక్తులు పోటీ పడ్డారు. గత ఏడాది వేలంలో పాల్గొన్న 17 మందితో పాటు కొత్తగా మరో 4 మంది లడ్డూను సొంతం చేసుకునేందుకు వేలంలో పాల్గొన్నారు. చివరకు అత్యధికంగా పాట పాడిన గణేష్ లడ్డూ నాగం తిరుపతి రెడ్డిని వరించింది. గత ఏడాది రూ.14.65 లక్షల పలికిన లడ్డూ ఈ సారి 95 వేలు అధికంగా పలికింది. ఈ లడ్డూను సొంతం చేసుకునేందుకు ఏటా పోటీ పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. బాలాపూర్ గణపతికి, ఆయన చేతి లడ్డూకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నగరానికి దక్కిన ఈ ఖ్యాతి, ప్రపంచం నలుమూలా ఆసక్తిని రేకెత్తించింది. ఏటా వచ్చే వినాయక చవితి పేరు చెబితే మొదటగా గుర్తొచ్చేది బాలాపూర్ గణేశుని లడ్డూనే. మరి ఈ లడ్డూకు అంత క్రేజెందుకంటారా...! ‘కోరిన కోర్కెలు నెరవేర్చే లడ్డూ’గా పేర్కొంటుంటారు బాలాపూర్ వాసులు. లడ్డూ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేశారు. 1980లో మొదలై... గణేశునిపై బాలాపూర్‌వాసులకున్న భక్తి, సేవాతత్పరతను చాటి చెబుతూ 36 ఏళ్ల సుదీర్ఘ యానంతో చరిత్రను సృష్టించింది. గణేష్ నవరాత్రులు ముగిసేవరకు బాలాపూర్ వాసులు మద్య, మాంసాలను ముట్టకుండా గణేశునితో పాటు లడ్డూను కూడా ప్రత్యేకంగా పూజిస్తారు. 1994 నుంచి బాలాపూర్ లడ్డూను వేలం వేస్తున్నారు. లడ్డూను వేలంలో దక్కించుకున్న వారే కాకుండా ఆ లడ్డూను దర్శించి పూజించిన వారు కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నామని భక్తులు తమ అనుభవాలను వెల్లడిస్తుంటారు. -
గణేష్ నిమజ్జనానికి భద్రత కట్టుదిట్టం చేశాం డీజీపీ
-
బాలాపూర్ లడ్డూ సరికొత్త రికార్డు
-
ఏకదంతాయ..
-
వినాయుకుడి రూపంలో రిక్షాపై కూర్చొని ప్రచారం
-
పర్యావరణ పరిరక్షక దేవుడు గణనాథుడు
ముఖ్యమంత్రి చంద్రబాబు వినాయక చవితి శుభాకాంక్షలు సాక్షి, అమరావతి : వినాయకుడు ప్రకృతికి ప్రతీకగా నిలిచే ఆరాధ్యదైవమని, గణేశ్ పూజలకు మట్టి ప్రతిమలనే ఉపయోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు, దేశ, విదేశాల్లోని తెలుగు వారికి ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర పురోభివృద్ధికి విఘ్నాలన్నీ తొలగిపోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. విఘ్నేశ్వురుణ్ణి 21 రకాల చెట్ల ఆకులతో పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయని, ఔషధ గుణాలున్న అటువంటి వృక్ష జాతులను రక్షించి, భావితరాలకు అందించాలన్న సందేశం ఇందులో ఇమిడి ఉందని ముఖ్యమంత్రి అన్నారు. -
బీటెక్ విద్యార్థి అదృశ్యమా.. డ్రామాలా!
వలిగొండ: గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన ఇంజనీరింగ్ విద్యార్థి గణేష్ కేసులో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు బీటెక్ స్టూడెంట్ కిడ్నాప్ అయ్యాడా.. అదృశ్యమయ్యాడా.. లేక ఎక్కడో తలదాచుకుంటూ కావాలనే డ్రామాలు ఆడుతున్నాడా అనే కోణంలో విచారణ చేపట్టారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఏరియాలో గణేష్ ఉన్నట్లు ఫోన్ సిగ్నల్స్ ద్వారా గుర్తించినట్లు ఎస్ఐ ప్రకాశ్ తెలిపారు. నేటి సాయంత్రంలోగా అతడిని వెతికి పట్టుకుని తల్లిదండ్రులకు అప్పచెబుతామని చెప్పారు. ఓ వైపు ఈ నెల 6వ తేదీ నుంచి తమ కుమారుడు గణేష్ కనిపించడం లేదని విద్యార్థి తండ్రి ఫిర్యాదు చేయగా, మరోవైపు గణేష్ మాత్రం తరచుగా బంధువులతో ఫోన్లో మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే వారు కేసును పక్కదోవ పట్టిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏం జరిగిందంటే... యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్లకు చెందిన గణేష్ ఘట్కేసర్ లోని వీబీఐటీ బీటెక్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. గణేష్ అదే కాలేజీకి చెందిన తన ప్రియురాలితో కలసి భద్రాచలం వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 6వ తేదీన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మణుగూరు రైలు ఎక్కి మధ్యలో దిగారు. తాము తీసుకున్న లాడ్జి రూములోనే ఆత్మహత్య చేసుకుందామని సూచించాడు. ప్రియురాలు వద్దని చెప్పినా సూసైడ్ చేసుకునేందు క్రిమిసంహారక మందు తెచ్చేందుకు వెళ్లాడు. చెప్పా పెట్టకుండ ఆ యువతి హైదరాబాద్‌కు చేరుకుని అనంతరం కాలేజీకి వెళ్లి విషయాన్ని చెప్పింది. గణేష్ మాత్రం ఇంటికి తిరిగిరాలేదని, అదృశ్యమయ్యాడని అతడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. -
ఇంజనీరింగ్ విద్యార్థి అదృశ్యం
- ప్రియురాలితో కలసి భద్రాచలం పయనం - మార్గమధ్యలో చనిపోవాలని నిర్ణయం.. తప్పించుకొని వచ్చిన ప్రియురాలు - గణేష్ ఆచూకీ కోసం గాలింపు వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్లకు చెందిన వరికుప్పల గణేష్ ఈనెల 6 నుంచి కనిపించకుండా పోయాడు. ఆందోళన చెందిన అతడి తండ్రి.. ఆదివారం ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఘట్కేసర్ సమీప కళాశాలలో గణేష్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అదే కళాశాలలో చదువుతున్న సహవిద్యార్థినితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ కలసి భద్రాచలం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 6న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. వారి దగ్గర డబ్బులు లేకపోవడంతో గణేష్ తన మొబైల్‌ను విక్రయించాడు.ఆ డబ్బులతో మణుగూరు రైలు ఎక్కి మధ్యలో దిగారు. అక్కడ లాడ్జి తీసుకున్నారు. ఈ సమయంలో ఇద్దరం చనిపోదామని గణేష్ చేసిన ప్రతిపాదనను ప్రేమికురాలు వ్యతిరేకించింది. అయినప్పటికీ గణేష్ వినకుండా క్రిమిసంహారక మందు కొనడానికి ఆమె చేతి ఉంగరాన్ని తీసుకుని అమ్మడానికి బయటకు వెళ్లాడు. ఈ సమయంలో ఆమె లాడ్జి నుంచి బయటకు వచ్చి ఎలాగోలా హైదరాబాద్‌కు చేరుకుంది. ఎప్పటిలాగే కాలేజీకి వెళ్లి జరిగిన విషయాన్ని ప్రిన్సిపాల్‌కు చెప్పింది. ఈ విషయాన్ని కళాశాలకు చెందిన అధ్యాపకుడు గణేష్ తండ్రికి సమాచారం అందించాడు. ఆయన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సోమవారం తెల్లవారు జామున గణేష్ తండ్రి కుమారుని వెతికేందుకు భద్రాచలం వెళ్లారు. -
లీకైన జై లవ కుశ స్టిల్స్
భారీ చిత్రాలకు లీకుల బెడద తప్పటం లేదు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న స్టార్ హీరోల సినిమాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ జై లవ కుశ కూడా లీకు వీరుల బారిన పడింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ ఫోటోలు ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ కు సంబంధించినవిగా తెలుస్తున్నాయి. రావణ దహనం బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ పై తెరకెక్కించిన ఫైట్ సీన్ కు సంబంధించిన స్టిల్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ స్టిల్స్ కువైట్ నుంచి లీక్ అయినట్టుగా భావిస్తున్నారు. ఈ సినిమాకు ఆన్ లైన్ ఎడిటర్ పనిచేస్తున్న గణేష్ అనే వ్యక్తి లీక్ చేశాడని అనుమానిస్తున్నారు. గణేష్ తన ఫ్రెండ్స్ ద్వారా కువైట్ నుంచి ఈ ఫోటోలు పోస్ట్ చేయించాడు. ఇప్పటికే చిత్ర నిర్మాత కళ్యాణ్ రామ్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గణేష్ ను అరెస్ట్ చేశారు.కేవలం స్టిల్స్ మాత్రమే లీక్ అయ్యాయా.. లేక సీన్స్ కూడా ఏమైన లీక్ అయ్యాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థి ఆత్మహత్య
పెద్దవడుగూరు (తాడిపత్రి) : పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లిలో తొమ్మిదో తరగతి చదివే గణేశ్(14) అనే విద్యార్థి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. లక్ష్ముంపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికొచ్చాడు. కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ఉరేసుకుని తనువు చాలించాడన్నారు. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న గణేశ్ పలు ఆస్పత్రుల్లో చూపించుకున్నా నయం కాకపోవడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు వివరించారు. విషయం తెలిసిన వెంటనే ఎంఈఓ రాముడు గ్రామానికి చేరుకున్నారు. విద్యార్థి మృతదేహాన్ని సందర్శించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. -
పెళ్లైన నాలుగు నెలలకే..
యాడికి (తాడిపత్రి రూరల్) : అనంతపురం జిల్లా యాడికి మండలం నగరూరుకు చెందిన గణేశ్(21) పురుగుల మందు తాగి శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం అంక్కిరెడ్డిపల్లికి చెందిన శిరీషాతో నాలుగు నెలల కిందటే అతనికి పెళ్లైంది. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న గణేశ్ జీవితంపై విరక్తితో ఈ అఘాయ్యితానికి ఒడిగట్టినట్లు వివరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
అన్నాచెల్లికి అంతర్జాతీయ గుర్తింపు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ‘అనంత’ నగరానికి చెందిన వర్షిత్‌కుమార్, హారిక షటిల్లో సత్తా చాటి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. షటిల్ క్రీడా ప్రపంచంలోకి అడుగిడిన రెండేళ్లలోనే అంతర్జాతీయ ఆటలో పాల్గొని ఔరా అనిపించారు. టేబుల్‌టెన్నిస్‌లో జాతీయస్థాయి క్రీడాకారుడిగా గుర్తింపు సాధించిన వాళ్ల మేనమామ శ్రీధర్‌బాబే వారికి రోల్ మోడల్. ప్రారంభం కానున్న విద్యా సంవత్సరంలో వర్షిత్‌కుమార్ 9వ తరగతికి, హారిక 5వ తరగతికి వెళ్లనున్నారు. ఒలంపిక్సే లక్ష్యంగా వర్షిత్ 2014లో స్థానిక ఇండోర్ స్టేడియంలో కోచ్ జీవన్‌కుమార్ వద్ద షటిల్ పాఠాలు నేర్చుకున్న వర్షిత్ తన మొదటి టోర్నీలోనే రెండవ స్థానంలో నిలిచాడు. అండర్ - 13 స్కూల్ గేమ్స్‌లో డబుల్స్ విన్నర్‌గా ఒకసారి, సింగల్స్ రన్నర్‌గా రెండుసార్లు నిలిచాడు. రూరల్ చాంపియన్‌షిప్‌లో మూడవ స్థానంలో నిలిచి జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌కు ఎదిగాడు. అందులో మూడవ స్థానం సాధించి జాతీయస్థాయి టోర్నీకి ఎంపికయ్యాడు. హర్యానాలో నిర్వహించిన జాతీయస్థాయి టోర్నీలో వెండి పతకం తెచ్చాడు. దీంతో ఇండో - నేపాల్ అంతర్జాతీయ టోర్నీలో పాల్గొనే వచ్చింది. అక్కడ బంగారు పతకం సాధించాడు. వర్షిత్ భారతదేశం తరపున ఒలంపిక్స్‌లో రాణించాలనేది తల్లిదండ్రుల ఆకాంక్ష. దానిని నెరవేర్చేందుకు శ్రమిస్తున్నాడు. రెండింటా రాణిస్తున్న హారిక సోదరునితో కలిసి ఇండోర్ స్టేడియంలోనే షటిల్ నేర్చుకున్న హారిక చదువులోనూ దిట్ట. ఇంటర్నేషనల్ మ్యా«థ్స్ ఒలంపియాడ్లో బంగారు పతకం సాధించింది. జిల్లాస్థాయి టోర్నీలో 2015లో విన్నర్‌గాను, 2016లో రన్నర్‌గానూ నిలిచింది. రాష్ట్రస్థాయి పోటీల్లో మూడవ, రెండవ స్థానాల్లో నిలిచింది. జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో జాతీయస్థాయి టోర్నీలో రెండవ స్థానం సాధించి, యూత్ రూరల్ గేమ్స్ జాతీయస్థాయి టోర్నీలో బంగారు పతకం తెచ్చింది. అంతర్జాతీయ స్థాయి ఇండో - నేపాల్ టోర్నీలోనూ బంగారు పతకం సాధించింది. గత నెలలో నిర్వహించిన జోన్ - 1 గ్రిగ్స్‌లో డబుల్స్ విన్నర్‌గా నిలిచింది. క్రీడలతోపాటు చదువులోనూ రాణిస్తూ రెండింటా సత్తా చాటుతోంది. కుటుంబ నేపథ్యం తండ్రి గణేష్‌కుమార్‌ది వ్యాపారం. తల్లి సురేఖ వైద్యశాఖలో పని చేస్తున్నారు. పిల్లలిద్దరూ ఆటల్లో రాణించడం వారికి చాలా ఆనందాన్నిస్తోంది. సింధు స్ఫూర్తితో ఒలంపిక్స్ లక్ష్యంగా బాబును, చదువులో రాణించే విధంగా పాపను ముందుకు తీసుకెళ్తున్నారు. కోచ్ జీవన్‌కుమార్ సహకారం వల్లే తమ పిల్లలు ఈ స్థాయికి వచ్చారని చెబుతున్న గణేష్, సురేఖ వారు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. -
నన్ను ‘సార్’ అనొద్దు... ‘ఓకే సార్’!
న్యూఢిల్లీ: క్రికెట్లో ఎవరెస్ట్ అంతటోడు సచిన్. తన సుదీర్ఘ ప్రస్థానంలో వేలకొద్దీ పరుగులు... లెక్కలేనన్ని రికార్డులున్నట్లే... ఎన్నో విశేషాలు, గమ్మత్తు అనుభవాలూ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఈ బ్యాటింగ్ దిగ్గజం చెబుతుంటే సరదాగానే ఉండొచ్చు కానీ... అయనకు అప్పుడు ఎదురైనవి మాత్రం ఇబ్బందికర పరిస్థితులే మరి! బుధవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన తను సారథ్యం వహించిన రోజుల్లో హిందీ, ఇంగ్లీష్ భాష రాని సహచరులతో ఎలా వేగాడో ఇలా చెప్పుకొచ్చారు. 1997లో సచిన్ సేన దక్షిణాఫ్రికాలో పర్యటించింది. ఈ క్రమంలో కర్ణాటక బౌలర్ దొడ్డ గణేష్‌కు కన్నడ తప్ప ఇంకే భాష రాదు. ఇలాంటి సందర్భంలో సచిన్ పడరాని పాట్లే పడ్డారు. అయితే గణేష్ మాత్రం సచిన్ ఏమని అడిగిన... ఏం చెప్పినా... ‘ఓకే సార్’ అనేవాడు. ‘దీంతో నాకు అర్థమైందేమిటంటే... నేనేం చెప్పిన అతనిచ్చే సమాధానం ‘ఓకే సార్’. పదేపదే అలా అనడంతో నేనోసారి... నన్ను సార్ అని పిలవొద్దని చెప్పా. విచిత్రంగా దానిక్కూడా అతనిచ్చిన సమాధానం ‘ఓకే సార్’! ఏం చేయను.. ఒక దేశానికి చెందిన మేమిద్దరమే భాష అర్థం కాక సతమతమవుతుంటే... ఓ రోజు డొనాల్డ్‌తో పెట్టుకున్నాడు. వెంటనే నేను వెళ్లి నీవు ఎం చెప్పాలనుకున్నా ముందు నాకు అర్థమయ్యేలా చెబితే... నేను డొనాల్డ్‌కు వివరిస్తాను అని చెప్పా! దీనికీ ఓకే సార్ అనే సమాధానమే’ అని సచిన్ వివరించారు. గణేష్ -
వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని..
సూర్యాపేట: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెల్దండలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మంగలగిరి గణేష్ భార్య(35)తో అదే గ్రామానికి చెందిన మండవ కృష్ణ(40) వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై పలుమార్లు హెచ్చరించిన తీరు మార్చుకోకపోవడంతో.. ఆగ్రహానికి గురైన గణేష్ శుక్రవారం రాత్రి కృష్ణ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అతని పై గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో కృష్ణ అక్కడికక్కడే మృతిచెందగా.. అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనను పోలీసులకు తెలిపిన స్థానికులు గాయపడిన కృష్ణ భార్యను ఆస్పత్రికి తరలించారు. హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
సనప ఉత్సవాల్లో అపశ్రుతి
కోనేటిలోకి జారిపడి చిన్నారి మృతి ఆత్మకూరు (రాప్తాడు) : ఆత్మకూరు మండలం సనప గ్రామంలో శుక్రవారం జరిగిన మాధవరాజుల ఉత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. పదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు కోనేటిలోకి జారిపడి మృత్యువాతపడ్డాడు. ఎస్ఐ ధరణి కిషోర్ తెలిపిన మేరకు వివరాలు ఇలా... ధర్మవరంలోని రైతు నారాయణస్వామి, చెన్నమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు గణేష్ (10)ఉన్నారు. సనప మాధవరాజుల ఉత్సవాలకు శుక్రవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి నారాయణస్వామి వచ్చారు. సాయంత్రం మూడు గంటలకు గణేష్ ఒంటరిగా కోనేరు వద్దకు చేరుకుని అక్కడ నీటిలో ఆడుకుంటున్న పిల్లలను గమనిస్తూ మెట్లపై నుంచి అదుపుతప్పి నీటిలో పడిపోయాడు. దీన్ని ఎవరూ గుర్తించలేకపోయారు. చాలా సేపటి తర్వాత తమతో పాటు గణేష్ లేడనే విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు అతడి కోసం వెదకడం మొదలుపెట్టారు. కోనేరు వద్ద చేరుకుని అనుమానంతో నీటిలో వెదకగా బాలుడి మృతదేహం లభ్యమైంది. ఘటనస్థలాన్ని ఎస్ఐ పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు. -
నేడు 5 రాష్ట్రాల్లో మావోల బంద్
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోని కటాఫ్ ఏరియాలో ఇటీవల 30 మంది మావోయిస్టులపై పోలీసుల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం 5 రాష్ట్రాల్లో బంద్ జరగనుంది. బంద్‌ను విజయవంతం చేసేందుకు మావోలు ఇప్పటికే మన్యంలో బ్యానర్లు, కరపత్రాలతో ప్రచారం చేస్తుండగా, విఫలం చేయడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దయ, గణేష్ వంటి స్టేట్ కమిటీ సభ్యులతో పాటు డివిజన్ కమిటీ, ఏరియా కమిటీ సభ్యులను, అమాయక గిరిజనులను ప్రభుత్వ ప్రోద్బలంలో పోలీసులు పట్టుకుని కాల్చి చంపేసి ఎదురుకాల్పుల్లో చనిపోయారంటున్నారని ఇటీవల మావోయిస్టు కేంద్ర కమిటీ ఆరోపించింది. ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్రలో బంద్ చేపట్టనున్నట్లు ప్రకటించింది. సురక్షిత ప్రాంతాలకు ప్రజా ప్రతినిధులు బంద్ నేపథ్యంలో ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశాలున్నాయనే సంకేతాలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బంద్ ప్రభావం ఉండే ప్రాంతాల్లోని ప్రజా ప్రతినిధులను, మావోల హిట్ లిస్టులో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రభుత్వ కార్యాలయాలు, సెల్ టవర్లకు భద్రత కల్పించారు. మన్యంలో అనుమానితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. -
డై..లాగి కొడితే....
సినిమా : గణేష్ రచన: పరుచూరి బ్రదర్స్, దర్శకత్వం: తిరుపతి స్వామి ఆరోగ్యశాఖ మంత్రి అయిన సాంబశివుడు (కోట) తన పలుకుబడితో అక్రమాలు చేస్తుంటాడు. ఆయన చేస్తున్న అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా ఒక ఫైల్ తయారు చేస్తాడు గణేష్ (వెంకటేష్). ఆ ఫైల్ కోసం సాంబశివుడు గొడవ చేస్తుంటాడు. ఆయన దగ్గరకు వచ్చిన గణేష్... ‘పెన్నుతో చచ్చే బచ్చాగాడివి నీకెందుకురా బుల్లెట్లు. ముచ్చు మొహం చచ్చు వెధవ. అసలు ఫైల్ ఎక్కడుందా అని చవటలాగా చమటలు తుడుచుకుంటున్నావా? ఆ ఫైల్ నా దగ్గర ఉందిరా. ఆడపిల్ల దగ్గర చూపించడం కాదురా నీ చచ్చు మగతనం. నీకు దమ్ముంటే.. ఒక అబ్బకు పుట్టినవాడివైతే రారా నా ఇంటికి. లేదా చెప్పు.. చౌరస్తాలో గిరి గీసి ఫైల్ అక్కడ పెడతాను’ ‘ఎనీ సెంటర్.. సింగిల్ హ్యాండ్ గణేష్’ అని సాంబశివుడికి వార్నింగ్ ఇస్తాడు గణేష్. అప్పట్లో ఈ డైలాగ్‌ను చాలామంది ఇమిటేట్ చేసేవాళ్లు. -
బాలికపై లైంగిక దాడి..పలువురి అరెస్టు
బండ్లగూడలోని రామకృష్ణ ఓల్డేజ్ హోం ఉద్యోగి ఓ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. హోం సూపర్వైజర్గా విధులు నిర్వహించే గణేష్ అనే యువకుడు ఇటీవల ఓ బాలిక(16)ను బలవంతంగా కారులో తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీనిపై బాధితురాలు చైల్డ్ వెల్ఫేర్ కమిటీని ఆశ్రయించింది. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఎల్బీనగర్ పోలీసులు గణేష్‌ను అరెస్టు చేసి, కారును సీజ్ చేశారు. దీంతోపాటు గణేష్‌కు సహకరించిన వెంకటేశ్, సుబ్బారావుతోపాటు ఓల్డేజ్ హోం నిర్వాహకుడు శ్రీనివాస్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
అమలాపురం మున్సిపల్ చైర్మన్‌గా గణేష్
ఏకగ్రీవంగా ఎన్నిక అనంతరం ప్రమాణ స్వీకారం హాజరైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అమలాపురం టౌన్ : అమలాపురం మున్సిపల్ చైర్మన్‌గా సీనియర్ కౌన్సిలర్ చిక్కాల గణేష్ గురువారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నిక అధికారి, ఆర్డీవో జి.గణేష్‌కుమార్ ఆధ్వర్యంలో చైర్మన్ అభ్యర్థిగా గణేష్ ఒక్కరే కావడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 29 కౌన్సిలర్లకు 21 మంది టీడీపీవారే కావడంతో ఐదు నిమిషాల్లో ఈ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. పాలక పక్షానికి చెందిన రెండో వార్డు కౌన్సిలర్ ఆశెట్టి ఆదిబాబు చైర్మన్ అభ్యర్థిగా చిక్కాల గణేష్‌ను ప్రతిపాదించగా 23వ వార్డు కౌన్సిలర్ దంగేటి విజయగౌరి గణేష్ పేరును బలపరిచారు. అలాగే ఎన్నికల అధికారి, ఆర్డీవో గణేష్‌కుమార్ ప్రతిపక్ష కౌన్సిలర్లను కూడా మీలో ఎవరి పేరైనా ప్రతిపాదన ఉందా...? అని ప్రశ్నించగా కౌన్సిల్ ప్రతిపక్ష నేత చెల్లుబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ అలాంటదేమీ లేదని స్పష్టం చేశారు. అంతకు ముందు ఎన్నికల నిబంధనలను ఆర్డీఓ వివరించారు. ఎక్స్ అఫీషియో సభ్యుని హోదాలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఎమ్మెల్సీ కె.రవికిరణ్‌వర్మ ఎన్నిక ప్రక్రియలో పాల్గొన్నారు. అనంతరం ఎన్నికల అధికారి గణేష్‌కుమార్ గణేష్ చేత మున్సిపల్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్‌ను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతోపాటు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పెచ్చెట్టి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరి, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ మెట్ల రమణబాబు తదితర టీడీపీ నాయకులు, పట్టణ ప్రముఖలు అభినందించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో చైర్మన్ గణేష్‌ను పుర వీధుల్లో భారీ ఎత్తున ఊరేగించారు. -
గణనాథుడికి వీడ్కోలు
విజయవాడ (అజిత్‌సింగ్‌నగర్) : వైఎస్సార్ సీపీ నాయకుడు కంచి ధనశేఖర్ ఆధ్వర్యాన వాంబే కాలనీలో నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకలు సోమవారం వైభవంగా ముగిశాయి. వినాయకుడి విగ్రహం నిమజ్జనం సందర్భంగా తీన్మార్, డప్పు వాయిద్యాలు, భేతాళశెట్టి నృత్యాలతో నిర్వహించిన ఊరేగింపు ఆకట్టుకుంది. తొలుత వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి బొప్పన భవకుమార్, పారిశ్రామికవేత్త కోగంటి సత్యం తదితరులు స్వామివారికి పూజలు చేశారు. ఆకట్టుకున్న వైఎస్సార్, రంగా చిత్రపటాలు వినాయక నిమజ్జన కార్యక్రమంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, వంగవీటి రంగా చిత్రపటాలను పూలతో అలంకరించి ఊరేగించారు. స్వామి వారితోపాటుగా వైఎస్, రంగా చిత్రపటాలకు స్థానికులు పూజలు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు జానారెడ్డి, శ్రీనివాసరెడ్డి, టెక్యం కృష్ణ, గోపి, శివ తదితరులు పాల్గొన్నారు. గీతామందిరం రోడ్డులో... చట్టుగుంట(భవానీపురం) : నగరంలోని చుట్టుగుంట గీతామందిరం రోడ్డులో విజయవాడ ఫైర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 13 రోజులుగా విశేష పూజలు అందుకున్న గణనాథునికి సోమవారం ఘనంగా వీడ్కోలు పలికారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం కాలనీలో వినాయకుడి విగ్రహాన్ని ఊరేగించిన అనంతరం కృష్ణలంక సీతమ్మవారి పాదాల వద్ద నిమజ్జనం చేశారు. నిర్వాహకుడు వాసు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా నిమజ్జనం
శాంతినగర్: వినాయక చవితి సందర్బంగా ప్రతిష్టించిన గణేషుని నిమజ్జన వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా కొనసాగాయి. శాంతినగర్, రాజోలి గ్రామాల్లో పదకొండు రోజులపాటు పూజలందుకున్న గణనాథుల మండపాల వద్ద రాజోలి అడేవేశ్వరస్వామి, కప్పలబావి గణేషుని వద్ద గురువారం మధ్యాహ్నం లడ్డూల వేలంపాటలు నిర్వహించారు. అనంతరం వాహనాల్లో విగ్రహాలను ఉంచి ఊరూవాడా ఊరేగించారు. ఈసందర్బంగా భక్తులు, నిర్వాహకులు టపాసులు కాల్చుతు, రంగులు చల్లుకుంటూ డప్పుల మోతల మధ్య చిందులువేశారు. అనంతరం సమీపంలోని తుంగభద్రనదిలో నిమజ్జనంగావించారు. దీంతో గణేషుని ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. రూ.21 వేలు పలికిన లడ్డూ వినాయక చవితి సందర్బంగా గణపతి చేతిలోని లడ్డూలు వేలంపాటలు నిర్వహించారు. రాజోలి అడివేశ్వరస్వామి ఆలయం ముందు ప్రతిష్టించిన వినాయకుని చేతిలోని లడ్డూను గ్రామానికి చెందిన బోయ మహేంద్రబాబు రూ.21 వేలకు వేలంపాటల్లో కైవసం చేసుకున్నాడు. -
బైబై.. గణేశా!
చవితి ఉత్సవాల్లో భాగంగా కణేకల్లులో గురువారం వినాయక నిమజ్జనం వైభవంగా జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 18 అడుగుల ఎత్తు ఉన్న కాణిపాకం వినాయకుడు,15 అడుగుల ఎత్తు ఉన్న సిద్ధేశ్వరస్వామి వినాయకుడు ఆకట్టుకున్నారు. -
గణనాథుడికి ఘన వీడ్కోలు
పుంగనూరు టౌన్: విఘ్ననాయకుడైన లంబోధరుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. గురువారం పట్టణంలోని ఎన్ఎస్పేటలోని రామునిగుడి వీధి, అలగన్నగారివీధి, దాసరివీధి, వినాయకులను నిమజ్జనానికి తరలించారు. నిమజ్జనానికి తరలించే ముందు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు. మఠంవీధి బాలవిద్యాగణపతి సేవాసంఘం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం, తీర్థప్రసాదాలు అందించారు. రామునిగుడి వీధిలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూను వేలంపాటలో రూ.7,800కి సురేంద్రరాజు సొంతం చేసుకున్నారు. లడ్డూను భక్తులందరికీ పంచిపెట్టారు. అనంతరం విఘ్ననాయకులను ట్రాక్టర్లలో ఉంచి పిల్లనగ్రోవి, చెక్కభజనలు, కోలాటాలు, బళ్లారి వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకు వెళ్లారు. యువకులు కాషాయవస్త్రాలు ధరించి రంగులు చల్లుకొంటూ, నత్యాలు చేస్తూ నిమజ్జనానికి తీసుకెళ్లారు. దారి పొడవునా మహిళలు ముగ్గులు వేసి మంగళ హారతులతో స్వామివారికి వీడ్కో లు పలికారు. సామూహికంగా బొజ్జగణపయ్యలు పురవీధుల్లో ఊరేగింపుగా రావడంతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఘనంగా వినాయక నిమజ్జనం జాండ్రపేట(సదుం): మండలంలోని జాండ్రపేటలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి గురువారం సాయంత్రం నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. వినాయకునికి వైఎస్ఆర్ సీపీ యువనాయకుడు పెద్దిరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వినాయకుని లడ్డూని వేలం వేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో స్వామివారిని మేళతాళాలతో గ్రామంలో ఊరేగించారు. యువకులు రంగులు చల్లుకుంటూ కోలహలం చేశారు. కార్యక్రమంలో విజయ్, విక్రమ్, రవి, నరసింహులు, శ్రీనివాసులు, భరత్, మణి, ఈశ్వరయ్య, పవన్ తదితరులు పాల్గొన్నారు. చౌడేపల్లెలో... చౌడేపల్లె: గాంధీవీధి, బత్తలాపురం రోడ్డులో నెలకొల్పిన వినాయకుడికి గురువారం ఘనంగా వీడ్కోలు పలికారు. 11 రోజులపాటు నెలకొల్పిన బొజ్జగణపయ్యకు ప్రత్యేకపూజలు చేశారు. వినాయకుడిని ట్రాక్టర్లో పూల నడుమ ముత్యాల పల్లకిలో స్వామివారిని ముస్తాబు చేశారు. పిల్లనగ్రోవులు, కళాబందాల నడుమ ఊరేగింపు సాగింది. ఊరేగింపు అనంతరం గ్రామానికి సమీపంలోని చెరువులో నిమజ్జనం చేశారు. -
బైబై గణేశా!
-
భక్తా.. మళ్లీవస్తా..
-
బై బై గణేశా !
వైభవంగా వినాయక శోభాయాత్ర రెండు చోట్ల అపశ్రుతులు.. ఇద్దరి మృతి జిల్లా అంతటా బుధవారం ఆధ్యాత్మిక శోభ సంతరించకుంది. డప్పు చప్పుళ్లు .. బాజాబజంత్రీలు.. డ్యాన్సులు.. కోలాట నృత్యాలతో గణనాథుల శోభాయాత్ర వైభవంగా కొనసాగింది. నవరాత్రులు పూజలందుకున్న పార్వతీ తనయుడిని భక్తులు నిమజ్జనానికి తరలించారు. నల్లగొండ పట్టణంలోని 1వ వార్డులో కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభించారు.14వ మైలు, వల్లభరావు చెరువు, వాడపల్లి, నాగార్జునసాగర్ వద్ద విఘ్నేశ్వరుల విగ్రహాలను నిమజ్జనం చేశారు. అంతకుముందు మండలపాల వద్ద లడ్డూ వేలం పాటలు నిర్వహించారు. మునుగోడు మండలం కల్వకుంట్ల గ్రామానికి చెందిన సురేష్(24) చెరువులో మునిగి, భువనగిరిలో నేరెల్ల రాజు(30) అనేయువకుడు కత్తిపోట్లకు గురై మృత్యువాత పడ్డారు. -
శోభాయాత్రలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
– పలువురికి గాయాలు – మునుగోడు మండలం కొంపెల్లిలో ఘటన కొంపెల్లి(మునుగోడు): గణేశ్ శోభాయాత్రలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని కొంపెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బాధితులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని గౌడ, యాదవ సంఘాల ఆధ్వర్యంలో వేర్వేరుగా వినాయకుల విగ్రహాలను ప్రతిష్టించారు. అయితే ఆ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ట్రాక్టర్లపై సౌండ్ సీస్టంమ్‌తో వేర్వేరుగా ఊరేగిస్తూ ఒక కాలనీలో ఎదురు పడ్డారు. మీరు పక్కకు తొలగాలంటే మీరని వాగ్వాదానికి దిగారు. అది తారస్థాయికి చేరుకోవడంతో ఇరువర్గాలు కర్రలతో దాడులు చేసుకున్నారు. అయితే ఈ దాడుల్లో గౌడ సంఘానికి చెందిన వీరమళ్ల క్రాంతి కుమార్, పరమేష్, యాదవ సంఘంలోని జూకంటి శ్రీశైలం, దావ చంద్రమ్మ, దాం మహేష్, సైదులకు, అంజమ్మ, చంద్రమ్మకు తీవ్రమైన గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. ఇరువర్గాల వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. -
బాలగణం చేసింది.. బొజ్జ గణపతి నిమజ్జనం..
పి.గన్నవరం : నవరాత్ర మహోత్సవాలు ముగిశాయి. ఆలయ ప్రాంగణాల్లో, పందిళ్లలో నిత్యం పూజలందుకున్న పార్వతీతనయుడు గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. మేళతాళాలతో, బాణసంచా ఆర్భాటంతో, ఆటపాటల తుళ్లింతలతో భక్తులు గణపతిని నీటిపట్టులకు తరలించి నిమజ్జనం చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఈ వేడుకకు నిర్వాహకులు పెద్దలూ, యువకులే. అయితే.. పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి శివారు చాకలిపాలెంలో మాత్రం చిన్నారులే ఈ సంరంభానికి సారథ్యం వహించారు. చాకలిపాలేనికి చెందిన న్యాయవాది మొల్లేటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 30 కుటుంబాల వారు ఏటా వినాయక చవితి ఉత్సవాలను సామూహికంగా జరుపుకొంటారు. వారి ఇళ్లవద్ద పూజలో ఉంచినగణనాథులను చిన్నారులే ఊరేగింపుగా రాజోలు మండలం సోంపల్లికి తరలించి వశిష్ట నదిలో నిమజ్జనం చేస్తారు. ఈ ఏడాది కూడా 42 గణపయ్య ప్రతిమలను 11 ట్రాలీలపై కార్లు, బైక్‌ల బొమ్మలపై ఉంచి ఊరేగించారు. ఆ ట్రాలీలన్నింటికీ కలిపి ఓ తాడు కట్టి, చిన్నారులే దాన్ని లాగుతూ, ‘గణపతి బొప్పా మోరియా’ అని నినదిస్తూ వశిష్టకు తరలిస్తుంటే.. దారి పొడవునా అందరూ సంభ్రమంగా తిలకించారు. ఊరేగింపులో ఒకవైపున ‘సేవ్ పెట్రోల్’, మరోవైపున ‘బక్రీద్ శుభాకాంక్షలు’ అనే నినాదాలున్న కాగితాలను అతికించారు. -
గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి
విద్యుత్ షాక్‌తో విద్యార్థి మృతి పెద్దపల్లిరూరల్ : పెద్దపల్లి మండలం చందపల్లి గ్రామంలో గణేష్ నిమజ్జనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. గ్రామంలో ప్రతిష్టించిన గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు అలంకరించిన వాహనానికి విద్యుత్ లైట్లు అమర్చారు. విద్యుత్ తీగలను సరిచేస్తుండగా వాహనంపైనే ఉన్న గాండ్ల అఖిల్(15) అనే విద్యార్థిపై పడింది. షాక్‌కు గురైన బాలుడిని స్థానికులు పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే అఖిల్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న బంధువులు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యహరించారంటూ ఆందోళనకు దిగారు. ఎస్సై శ్రీనివాస్ తన సిబ్బందితో చేరుకుని సముదాయించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అఖిల్ మరణంతో చందపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
గణేశుడికి ఘనంగా వీడ్కోలు
– 200కుపైగానే భారీ విగ్రహాలు – మధ్యాహ్నం 2.30 గంటల వరకు సాగిన నిమజ్జనోత్సవం కర్నూలు(హాస్పిటల్): వినాయక చవితి సందర్భంగా కొలువుదీరిన గణనాథులు తొమ్మిదిరోజుల ప్రత్యేక పూజల అనంతరం మంగళవారం గంగమ్మ ఒడి చేరిపోయాడు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన వినాయక నిమజ్జనోత్సవం బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల వరకు కొనసాగింది. కుమ్మరివీధిలోని రాంబొట్ల దేవాలయం వద్ద కొలువుదీరిన వినాయకుడు మంగళవారం మధ్యాహ్నం 11 గంటలకే చివరి పూజలు అందుకుని నిమజ్జనానికి బయలుదేరాడు. అయితే ముస్లింల బక్రీదు ప్రార్థనల నేపథ్యంలో ఊరేగింపు నెమ్మదిగా సాగింది. కేసీ కెనాల్ వద్ద ఉన్న వినాయక్ఘాట్లో మధ్యాహ్నం 3 గంటలకు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పూజలు చేసి నిమజ్జనోత్సవాన్ని ప్రారంభించారు. అయితే సాయంత్రం 5 గంటల వరకు విగ్రహాలు ఘాట్‌కు చేరుకోలేకపోయాయి. ఈసారి అత్యధిక సంఖ్యలో విగ్రహాల వెంట డీజే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసి భక్తులు కేరింతలు, కోలాటాలు, నృత్యాల మధ్య ప్రదర్శన నెమ్మదిగా సాగింది. గణేష్ ఉత్సవ సమితి అంచనా మేరకు బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల వరకు నిమజ్జన కార్యక్రమం కొనసాగింది. మొత్తం 1200కుపైగా విగ్రహాలుండగా 25 అడుగులకు మించి ఉన్నవి 200కు పైగా ఉన్నాయి. వీటి నిమజ్జనానికి ఎక్కువ సమయం తీసుకోవడం, భారీ క్రేన్లు నాలుగు తెప్పించినా వాటికి గంటకోసారి పావు గంట విరామం ఇవ్వాల్సి ఉండడంతో ఈ ఏడాది నిమజ్జన కార్యక్రమం ఆలస్యమైంది. చివరిగా బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బుధవారపేట శక్తి వినాయకయూత్ వారు ఏర్పాటు చేసిన విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. కాస్త ఆలస్యమైనా, వర్షం పడుతున్నా లెక్క చేయకుండా సమితి సభ్యులు, కార్యకర్తలు, భక్తులు కార్యక్రమాన్ని నిర్వఘ్నంగా జరిపించారని గణేశ్ ఉత్సవ సమితి జిల్లా కార్యాధ్యక్షులు కపిలేశ్వరయ్య కొనియాడారు. ఆర్గనైజింగ్ సెక్రటరి ఎం. నాగఫణిశాస్త్రి, నగర కార్య అధ్యక్షుడు కె. క్రిష్ణన్న, ప్రధాన కార్యదర్శి రంగస్వామి, హరీష్‌బాబు, నరసింహవర్మ, భాస్కర్ తదితరుల సేవలను ఆయన అభినందించారు. -
లంబో‘ధర’ లడ్డు
నందిపేట : లంబోధరుడి లడ్డు భారీ ధర పలుకుతోంది. మండలంలోని వెల్మల్ గ్రామంలో గణేశ్ మండలి నిర్వాహకులు ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూ ధర రూ.60 వేలు పలికింది. 101 కిలోల లడ్డుకు మంగళవారం వేలం పాట నిర్వహించగా, లక్కంపల్లి గ్రామానికి చెందిన మహేందర్ రూ.60 వేలు పాడి లడ్డును చేజిక్కించుకున్నారు. అంతకు ముందు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. వేలంలో ఎక్కువ పాట పాడిన మహేందర్‌కు లడ్డు అందజేశారు. -
గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో అత్యుత్సాహం వద్దు
కర్నూలు(టౌన్): కర్నూలులో నిర్వహించే గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో యువకులు అత్యుత్సాహం ప్రదర్శించకుండా పోలీసుల ఆంక్షలను పాటించాలని ఎస్పీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. శనివారం రాత్రి స్థానిక కొత్తపేటలో సాయి విఘ్నేష్ భక్త బందం ఆధ్వర్యంలో వినాయక విగ్రహం వద్ద ఎస్పీ దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమ్మ అంధుల పాఠశాల విద్యార్థులకు, జొహరాపురం వద్ద ఉన్న మాతాశ్రీ అన్నపూర్ణేశ్వరి ట్రస్టు అనాథపిల్లలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతూ మతసామరస్యానికి పాటుపడాలన్నారు. జిల్లా పోలీసులు చేపట్టిన నేత్రదాన కార్యక్రమానికి సహకరించాలన్నారు. కార్యక్రమంలో రెండవ పట్టణ సీఐ ములకన్న, సాయి విఘ్నేష్ భక్త బందం నిర్వాహకులు అశోక్‌కుమార్, చరణ్, రాజేంద్ర, గంగాధర్, లోకేంద్ర, కొత్తపేట కాలనీ వాసులు పాల్గొన్నారు. -
ఎన్డీ దళ కమాండర్ గణేష్ అరెస్టు
గుండాల: ఖమ్మం జిల్లా గుండాల మండలం కాచనపల్లి గ్రామానికి చెందిన న్యూడెమోక్రసీ పార్టీ నేత గణేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆళ్లపల్లి ఏరియా దళ కమాండర్‌గా గణేష్ పనిచేస్తున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న గణేష్ బాటన్ననగర్లో ఆశ్రయం పొందుతుండగా శనివారం పోలీసులు పట్టుకున్నారు. అయితే, గణేష్‌ను వెంటనే కోర్టులో హాజరుపర్చాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య డిమాండ్ చేశారు. -
కరెన్సీ గణేషుడు
రూ.9,99,999లతో అలంకరణ సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండల కేంద్రంలోని స్వప్నకాలనీలోని వినాయకుడిని రూ.9,99,999 కరెన్సీతో ఉత్సవ కమిటీ సభ్యులు అలంకరించారు. కరెన్సీ నోట్లతో దండలు పేర్చి గణేషునితోపాటు మండపాన్ని చూడముచ్చటగా ముస్తాబు చేశారు. సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నగునూరి అశోక్‌కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు మాడూరి ప్రసాద్, మండల రైస్‌మిల్లర్స్ ప్రతినిధులు చకిలం మారుతి పలువురు పాల్గొన్నారు. -
విశ్వేశ్వరస్వామి ఆలయంలో శనగల గణపతి
రాజమహేంద్రవరం కల్చరల్ : గోదావరి గట్టున ఉన్న బాలాత్రిపుర సుందరీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామి ఆలయంలో చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారానికి Sఅధిపతిౖయెన గురునికి ప్రీతికరమైన శనగలతో గణపతిని అలంకరించారు. శుక్రవారం శుక్రునికి ప్రీతికరమైన బొబ్బర్లు, శనివారం శనికి ప్రీతికరమైన పత్తిగింజలు, ఆదివారం సూర్యునికి ప్రీతికరమైన గోధుమలు, సోమవారం చంద్రునికి ప్రీతికరమైన వెన్న, డ్రైఫ్రూట్స్, మంగళవారం రాహు కేతువులకు ప్రీతికరమైన ఉలవలు, మినుమలతో గణపతిని అలంకరించి పూజలు నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మండవిల్లి శివ తెలిపారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శోభారాణి ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
గణపతి బొప్పా మోరియా
-
లంబోధరుడి లడ్డూ రూ.1.2 లక్షలు
మిడుతూరు : చౌట్కూరులో వినాయక నిమజ్జనం సందర్భంగా గురువారం నిర్వహించిన వేలంలో గ్రామానికి చెందిన శ్వేత బోర్‌వెల్స్ అధినేత మధుసూదన్‌రెడ్డి స్వామి వారి లడ్డూను రూ.1.2 లక్షలకు దక్కించుకున్నారు. ఎస్ఐ చంద్రశేఖర్‌రెడ్డి లడ్డూను మధుసూదన్‌రెడ్డికి అందజేశారు. అంతకముందు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
నిమజ్జనంలో అపశ్రుతి
తుంగభద్ర నదిలో తెప్ప మునిగి 10మంది గల్లంతు ఒకరి మృతి మిగతా వారి కోసం కొనసాగుతున్న గాలింపు శివమొగ్గ: వినాయకవిగ్రహాల నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఉండ్రాల్లయ్యను సాగనంపేందుకు వెళ్లిన వారిలో 10 మంది తుంగభద్ర జలాల్లో గల్లంతయ్యారు. దీంతో జిల్లాలోని హాడోనహళ్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలు....జిల్లా కేంద్రం నుంచి 23 కిలోమీటర్ల దూరంలోనున్న హాడోనహళ్లి గ్రామంలో బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గౌరీ గణేశుల విగ్రహాలకు ఊరేగింపు నిర్వహించారు. మధ్యాహ్నం 2గంటలకు గ్రామంలోని తుంగభధ్ర నదిలో విగ్రహాలను నిమజ్జనం చేయడానికి 23 మంది యువకులు చిన్నపాటి తెప్పలో నదిలోకి వెళ్లారు. గౌరీవిగ్రహాన్ని నిమజ్జనం చేసిన అనంతరం వినాయక విగ్రహాల కోసం గట్టుకు చేరుకున్నారు. ప్రతిమలను తీసుకొని అదేతెప్పలో నదీ గట్టు నుంచి వంద అడుగుల దూరంలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా అనుకోని విధంగా తెప్పలోకి నీరు ప్రవేశించి మునగడం ప్రారంభించింది. కంగారుపడ్డ 23 మంది యువకుల్లో 12 మంది నదిలోకి దూకి ఈదుకుంటూ గట్టుకు చేరుకున్నారు. మిగిలిన 11 మంది యువకులు పడవతో పాటు నదిలో మునిగిపోయారని ఒడ్డుకు చేరుకున్న 12 మంది యువకుల్లో ఒకరైన సంతోష్, ఘటనా స్థలంలోని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాధితుల యువకుల కుటుంబీకులు, గ్రామస్థులు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గల్లంతైన యువకుల కోసం నదీ పరివాహక ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. సాయంత్రానికి ఒక మృత దేహం లభించగా అతన్ని ఇంజనీరింగ్ చదువుతున్న మంజునాథ్‌గా గుర్తించారు. గల్లంతైన మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.నిమజ్జనం కోసం నదిలోకి వెళ్లి గల్లంతైన యువకుల కుటుం సభ్యుల ఆక్రందనలతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
బైబై గణేశా..!
-
భాగ్యనగర్ వినాయకుడి లడ్డూ రూ.1.51 లక్షలు
వినాయకచవితి వేడుకల్లో భాగంగా భాగ్యనగర్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంలో 28వ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ మాల రంగన్న రూ.1.51 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. మహా కలశాన్ని రూ.43 వేలకు ట్యాంకర్ ఓనర్ శివశంకర్ దక్కించుకున్నారు. స్వామివారి పూజకు ఉంచిన రూ. 10 నాణేన్ని పెయింటర్ సత్య అనే వ్యక్తి రూ.23 వేలకు పాడి సొంతం చేసుకున్నారు. కౌన్సిలర్ రంగన్న, నిర్వాహకులు లస్కర్ శీనా, రామాంజనేయులు, సూరి, రంగా తదితరులు పాల్గొన్నారు. -
గణేశ్ ఉత్సవాలను విజయవంతం చేద్దాం
– గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి కార్యాధ్యక్షులు కపిలేశ్వరయ్య కర్నూలు(టౌన్): గణేశ్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిద్దామని గణేశ్ మహోత్సవ కే ంద్ర సమితి కార్యదక్షులు కపిలేశ్వరయ్య పిలుపు నిచ్చారు. బుధవారం స్థానిక వినాయక మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని కర్నూలు, ఆదోని, నంద్యాల ప్రాంతాల్లో వినాయక ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు హిందు, ముస్లిం ఐక్యతతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే కొన్ని మండల కేంద్రాల్లో నిమజ్జనం పూర్తయిందన్నారు. కేంద్ర సమితి సూచనలు పాటిస్తు ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఈ ఏడాది ఉత్సవాలను రామానుజాచార్యులకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి నగర కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శి కిష్టన్న, బాలసుబ్రమాణ్యంలు మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే ఈ సారి విగ్రహాల సంఖ్య పెరిగిందన్నారు. ఉత్సవాల విజయవంతానికి జిల్లా అధికారులు, పోలీసు అధికారులు సహకరించాలన్నారు. బక్రీద్ పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర సమితి కోశాధికారి సందడి సుధాకర్, నగర ప్రధాన కార్యదర్శి రంగస్వామి, నగర ఉపాధ్యక్షులు ప్రాణేష్, నగర కార్యదర్శి హరీష్‌బాబు, కాళింగి నరసింహవర్మ పాల్గొన్నారు. -
జై..జై.. గణేశా.. జయములివ్వు గణేశా..
-
గణనాధుడికి రాఖీ సావంత్ ప్రత్యేక పూజలు
-
జై బోలో గణేశ్ మహరాజ్ కీ జై
పండగ చేసుకోవడం అందరికీ ఇష్టమే. శిల్పా శెట్టిలాంటి వాళ్లకైతే మరీ మరీ ఇష్టం. ఒక్క పండగను కూడా మిస్సవకుండా వీలైనంత వైభవంగా జరుపుకుంటారామె. పండగ సమయాల్లో శిల్పా కట్టుకునే చీరలు, పెట్టుకునే నగలు, చేసుకునే హెయిర్ స్టైల్‌ని చూడ్డానికి రెండు కళ్లూ చాలవని బాలీవుడ్ వాళ్లు అంటారు. డ్రెస్సింగ్ వరకేనా! పూజలు కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారామె. పండగ ముందు రోజే అన్ని ఏర్పాట్లూ చేసేసుకుంటారు. సోమవారం వినాయక చవితి సందర్భంగా ఆదివారమే గణేశుణ్ణి ఇంటికి తెచ్చేసుకున్నారు. శిల్పా, ఆమె భర్త రాజ్ కుంద్రా, నాలుగేళ్ల కొడుకు వియాన్ ముంబైలోని ఓ ఫేమస్ మార్కెట్‌కి వెళ్లి గణపతి ప్రతిమను కొన్నారు. జై బోలో గణేశ్ మహరాజ్ కీ జై అంటూ ఎలుక వాహనుణ్ణి కారులో ఇంటికి తీసుకెళ్లారు. -
కేపీహెచ్బీలో గరికతో వినాయక ప్రతిమ
కేపీహెచ్‌బీ కాలనీ: గణపతికి గరిక అత్యంత ప్రీతిపాత్రమైనది. వినాయక చవితికి ఆ గడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగను పురస్కరించుకుని కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని సర్దార్ పటేల్‌నగర్ సంస్కృతి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు గరికతో వినాయక ప్రతిమను రూపొందించి ప్రత్యేకతను చాటుకున్నారు. మట్టి వినాయక ప్రతిమల తయారీలో విద్యార్థులు నిమగ్నమైన నేపథ్యంలో గరిక గడ్డితో వినాయక ప్రతిమను రూపొందించడం విశేషంగా ఆకట్టుకుంది. -
అమెరికాలో గణేశ్ మట్టి విగ్రహాలు
మిర్యాలగూడ అర్బన్ : పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతిఒక్కరూ మట్టి వినాయకుడి విగ్రహాలను తయారుచేసుకొని పూజించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ప్రజలకు సూచిస్తున్నారు. అయితే ఆయన మనవళ్లు నల్లమోతు విక్యాత్, విక్రాంత్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నా స్వదేశ సంస్కృతిని మరువకుండా తమ తాత అడుగుజాడల్లో నడవాలనే తపనతో మట్టి, పిండితో విగ్రహాలను తయారుచేసి పూజిస్తుండడం గమనార్హం. .. -
విశ్వవినాయకుడు
విఘ్నాలను తొలగించే వినాయకుడిని ఆరాధించే ఆచారం అనాదిగా వస్తోంది. లంబోదరుడిగా, హేరంబుడిగా, గజాననుడిగా, ఏకదంతుడిగా, గణాధిపతిగా, మూషికవాహనుడిగా, మోదకప్రియుడిగా వినాయకుడిని పూజిస్తూ ఉంటారు. ఏ పూజలోనైనా, ఏ వ్రతంలోనైనా, క్రతువులోనైనా, యజ్ఞయాగాదికాలలోనైనా తొలిపూజలు అందుకునేది వినాయకుడే! ముక్కోటి దేవతలలో వినాయకుడికి మాత్రమే దక్కే అరుదైన గౌరవం ఇది. బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం గణపతి గాథలను విపులంగా ప్రస్తావించాయి. ప్రాచీన గ్రంథాలను పరిశీలిస్తే, రుగ్వేదంలో గణపతి గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. ఇది క్రీస్తుపూర్వం రెండువేల సంవత్సరాల నాటిదని చరిత్రకారుల అంచనా. మన దేశంలో గుప్తుల కాలం నాటికి... అంటే, క్రీస్తుశకం నాలుగు, ఐదో శతాబ్దాల నాటికి వినాయకుడి ఆరాధన ప్రాచుర్యంలోకి వచ్చింది. క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్ది నాటికి ప్రత్యేకంగా గాణపత్య మతమే ఏర్పడింది. షణ్మతాలలో ఒకటిగా పేరుపొందింది. మన దేశంలో శైవ, వైష్ణవ, సౌర, శాక్తేయ, గాణపత్య, కౌమార మతాలు ఉండేవి. గాణపత్య మతస్థులు గణపతిని ప్రత్యేకంగా ఆరాధించేవారు. అయితే ఇతర మతాలలోనూ వినాయకుడిని ఆరాధించే సంప్రదాయం ఉంది. బౌద్ధ, జైన మతస్థులు కూడా గణపతిని ఆరాధించేవారు. గణపతి ఆరాధాన మన దేశానికి మాత్రమే పరిమితం కాదు, నేపాల్, భూటాన్, టిబెట్, చైనా, కంబోడియా, జపాన్, ఇండోనేసియా, సింగపూర్ వంటి దేశాలలోనూ ప్రాచీనకాలం నుంచే గణపతి ఆరాధన ఉండేది. పలు దేశాల్లో గణపతి ఆరాధన ఇప్పటికీ కొనసాగుతోంది. విదేశాలలో వినాయకుడు మన దేశానికి చెందిన వర్తకులు ప్రాచీన కాలంలోనే వివిధ దేశాలతో నౌకా వాణిజ్యం సాగించేవారు. వారి ద్వారా అప్పట్లోనే వినాయకుడు విదేశాలకూ వ్యాపించాడు. క్రీస్తుశకం పదో శతాబ్ది కాలంలో మన వర్తకులు దక్షిణాసియా ప్రాంతంలోని పలు దేశాలతో వర్తక వాణిజ్యాలు సాగించేవారు. జావా, బాలి, బోర్నియో, బర్మా, కంబోడియా, జపాన్, థాయ్‌లాండ్, టిబెట్, చైనా, సింగపూర్ వంటి తూర్పు, ఆగ్నేయాసియా దేశాలలో పురాతన కాలం నాటి గణపతి విగ్రహాలు ఇప్పటికీ దర్శనమిస్తాయి. ఇండోనేసియా కరెన్సీ నోటుపై కూడా గణపతి బొమ్మ కనిపిస్తుంది. మన దేశంపై ముస్లిం దండయాత్రలకు మునుపు అఫ్ఘానిస్థాన్ ప్రాంతంలో సైతం గణపతి ఆరాధన ఉండేది. బౌద్ధ, జైనాలలో వినాయకుడు గణపతి ఆరాధన హిందూమతానికి మాత్రమే పరిమితం కాలేదు. జైన, బౌద్ధమతాలు కూడా తమదైన రీతిలో గణపతిని ఆరాధించుకుంటాయి. జైనమతం కుబేరుడికి చెందిన కొన్ని కీలకమైన విధులను గణపతికి కేటాయించింది. ‘అభిదానచింతామణి’ అనే జైనగ్రంథంలో వినాయకుడి ప్రస్తావన కనిపిస్తుంది. ఆ గ్రంథం వినాయకుడిని హేరంబుడిగా, గణవిఘ్నేశుడిగా, వినాయకుడిగా ప్రస్తుతించింది. గుప్తుల కాలంలో బౌద్ధులు కూడా వినాయకుడిని ఆరాధించడం మొదలైనట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. తాంత్రిక బౌద్ధంలో మహారక్త గణపతిని పూజించేవారు. షడ్భుజాలు గల మహాకాలుడి రూపంలో బౌద్ధ తాంత్రికులు మహారక్త గణపతిని ఆరాధించేవారు. చైనా, జపాన్ ప్రాంతాల్లో బౌద్ధులు క్రీస్తుశకం ఏడు, ఎనిమిది శతాబ్దాల కాలంలోనే వినాయకుడిని ఆరాధించేవారు. ఇక ‘గణపతి పురాణం’ ప్రకారం బుద్ధుడిని గణపతి అవతారంగానే భావిస్తారు. గణేశ సహస్రనామాల ప్రకారం బుద్ధుడు సాక్షాత్తు గణపతి అవతారమేనని పదిహేడో శతాబ్దికి చెందిన పండితుడు భాస్కరరాయలు అభిప్రాయపడ్డారు. థాయ్‌లాండ్, కంబోడియా వంటి దేశాలలో వినాయకుడిని విజయానికి, అదృష్టానికి కారకుడిగా ఆరాధిస్తారు. వినాయకుడు బుద్ధిబలాన్ని అనుగ్రహించడమే కాకుండా, అదృష్టాన్ని కలిగిస్తాడని పలు దేశాలలో నమ్ముతారు. వినాయకుడు..వాహనాలు అత్యంత పురాతన కాలంలో వినాయకుడి విగ్రహాలు ఎలాంటి వాహనం లేకుండానే కనిపించేవి. వినాయకుడు మూషిక వాహనుడిగా ప్రసిద్ధి పొందినా, పలు ప్రాచీన విగ్రహాలలో వినాయకుడు వేర్వేరు వాహనాలపై కనిపిస్తాడు. వినాయకుడికి ఎనిమిది అవతారాలు ఉన్నట్లు ‘ముద్గల పురాణం’ వివరిస్తుంది. వాటిలోని ఐదు అవతారాలలో వినాయకుడు మూషికాన్నే వాహనంగా చేసుకున్నట్లు ఉంది. అయితే, మహోత్కటావతారంలో సింహాన్ని, మయూరేశ్వరావతారంలో నెమలిని, ధూమకేతు అవతారంలో అశ్వాన్ని వాహనంగా ఉపయోగించినట్లు ‘ముద్గల పురాణం’ చెబుతోంది. గణపతిని విఘ్నేశ్వరుడిగా పురాణాలు ప్రస్తుతించాయి. వినాయకుడు ఐహిక, ఆముష్మిక విఘ్నాలన్నింటినీ దూరం చేస్తాడని ప్రతీతి. విద్యలకు కూడా అధిపతి అయిన వినాయకుడు బుద్ధిని అనుగ్రహిస్తాడని ప్రతీతి. -
‘ఘన’పతి.. ప్రత్యేకత ఇదీ...
గిన్నిస్ రికార్డుపై కన్నేసిన గణనాథుడు గాజువాకలో 78 అడుగుల విగ్రహం ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం ప్రత్యేక అనుమతులు పొందిన నిర్వాహకులు గాజువాక : గాజువాక వినాయకుడు గిన్నిస్ రికార్డువైపు చూస్తున్నాడు. దేశంలోనే ఎల్తైన విగ్రహంగా రూపుదిద్దుకొంటున్న ఈ ‘ఘన’నాథుడు మొత్తం మట్టితోనే తయారవుతుండటం విశేషం. వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు గత ఎనిమిదేళ్లుగా ప్రసిద్ధి పొందిన గాజువాకలో నిర్వాహకులు ఈ ఏడాది లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఎల్తైన గణపతి విగ్రహంతోపాటు అత్యంత భారీ సైజులో లడ్డూ ప్రసాదాన్ని కూడా ఈ విగ్రహం వద్ద నైవేధ్యంగా ఉంచుతున్నారు. ఎన్నెన్నో ప్రత్యేకతలు... విశాఖ ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ (విశ్వ) ఆధ్వర్యంలో ప్రారంభించనున్న ఈ ఉత్సవాల్లో ప్రతిదీ ఒక ప్రత్యేకతగా రూపుదిద్దుతున్నారు. వినాయక విగ్రహాన్ని దశావతార గణపతిగా రూపొందిస్తున్నారు. – విగ్రహాన్ని 30 అడుగుల వెడల్పు, 78 అడుగుల ఎత్తులో తయారు చేస్తున్నారు. అన్ని అడుగుల ఎల్తైన ఈ విగ్రహం అత్యల్ప బరువుతో ఉండటం విశేషం. దీనికోసం టన్నునర ఎర్రమట్టి, 500 కేజీల ఊక, 500 కేజీల గోనె సంచులను ఉపయోగించడంతోపాటు, పర్యావరణానికి ఎలాంటి హాని తలపెట్టని సహజ సిద్ధమైన రంగులను ఉపయోగిస్తున్నారు. – ఈ విగ్రహం కోసం దాదాపు 95 నుంచి 100 అడుగుల ఎత్తయిన మండపం నిర్మిస్తున్నారు. వీటికోసం సరుగుడు కర్రలు, వెదురు కర్రలను మాత్రమే ఉపయోగిస్తున్నారు. దీనికోసం 150 టన్నుల కలపను ఉపయోగిస్తున్నారు. కేవలం కర్రలను ఉపయోగించి ఇంత ఎత్తయిన మండపం తయారు చేయడం కూడా ఇదే తొలిసారని నిర్వాహకులు చెబుతున్నారు. అందువల్లే ఈ మండపం కూడా ఈసారి గిన్నిస్, లిమ్కాబుక్ల రికార్డుల పరిశీలనకు వెళ్లనుంది. – ఈనెల 5 ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలు 21 రోజులపాటు కొనసాగనున్నాయి. విశాలమైన లంకా మైదానంలో ఉత్సవ ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. విగ్రహాన్ని ప్రతిష్ఠంచినచోటే నిమజ్జనోత్సవం కూడా నిర్వహించనున్నట్టు విశ్వ ప్రతినిధులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశంపై తొలిపూజతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. – భక్తులకు స్వామివారి దర్శనం కల్పించడంలో కూడా ప్రత్యేకత సంతరించుకొనే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పించనున్నారు. బాలింతలకు, చిన్నపిల్లలతో వచ్చినవారికి, గర్భిణులకు దర్శనం కల్పించడంలో అసౌకర్యం, ఆలస్యం లేకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. 12.5 టన్నుల లడ్డూ నైవేథ్యం వినాయక ఉత్సవాల్లో స్వామివారికి నైవేధ్యంగా 12.5 టన్నుల లడ్డూను తయారు చేయిస్తున్నారు. ఈసారి కూడా లడ్డూ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. లడ్డూను తయారు చేసే బాధ్యతను రాజమండ్రి ప్రాంతానికి చెందిన సురుచి స్వీట్స్ యాజమాన్యానికి అప్పగించారు. రూ.30లక్షల విలువైన ఈ భారీ లడ్డూను సురుచి స్వీట్స్ యాజమాన్యం ఉచితంగా అందజేసేందుకు ముందుకొచ్చింది. వినాయకలడ్డూల తయారీ కోసం స్వీట్స్ తయారీ సంస్థ యజమాని మల్లిబాబుతోపాటు మరో 20 మంది వినాయక మాలను ధరించారు. ప్రతి ఏటా పెరుగుతున్న లడ్డూ సైజు... గాజువాకలో తొలిసారిగా 2009లో ఏర్పాటు చేసిన భారీ వినాయక ఉత్సవాల సందర్భంగా లంబోదరుడికి కేవలం 50 కేజీల లడ్డూను మాత్రమే నైవేద్యంగా పెట్టారు. ఆ తరువాత ఏడాది 400 కేజీల లడ్డూ, ఆ మరుసటి ఏడాది 500 కేజీల లడ్డూ నైవేధ్యంగా పెట్టిన నిర్వాహకులు 2014 ఏకంగా ఎనిమిదిన్నర టన్నుల లడ్డూను నైవేధ్యంగా పెట్టారు. అంతవరకు ఖైరతాబాద్ వినాయకునివద్ద ఏర్పాటు చేసిన నాలుగు టన్నుల లడ్డు రికార్డును గాజువాక నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఎనిమిదిన్నర టన్నుల లడ్డూ అధిగమించింది. తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరంలోని భక్తాంజనేయ స్వీట్స్‌లో దీన్ని తయారు చేయించారు. గత ఏడాది విశ్వ ఆధ్వర్యంలో నిర్వహించిన 80 అడుగుల వినాయక ఉత్సవాల్లో పది టన్నుల లడ్డూను ప్రసాదంగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇదంతా స్వామి అనుగ్రహం... గత ఏడాది మేము వినాయక ఉత్సవాలను నిర్వహించాలని ముందుగా నిర్ణయించుకోలేదు. అప్పటికప్పుడు అనుకొని ప్రారంభించాం. పదిన్నర టన్నుల లడ్డూను స్వామివారికి నైవేధ్యంగా పెట్టగలిగాం. విగ్రహం రూపు కూడా పూర్తిస్థాయి దైవత్వంతో ఎంతో అందంగా వచ్చింది. ఇదంతా వినాయకుడి అనుగ్రహంవల్లే సాధ్యమైంది. ఈ ఏడాది ఉత్సవాలు నిర్వహించాలని ముందుగా అనుకోలేదు. అప్పటికప్పుడు అనుకొని మూడు వారాల క్రితం ప్రారంభించాం. ఆయన అనుగ్రహం ఉండడంవల్లే భారీ ఉత్సవాన్ని నిర్వహించడానికి అన్నీ కుదిరాయి. అంతపెద్ద లడ్డూను స్వామివారికి నైవేధ్యంగా పెట్టడానికి అవకాశం కలిగింది. – పల్లా రమణ యాదవ్, విశ్వ అధ్యక్షుడు ప్రత్యేక అనుమతితో విగ్రహ తయారీ... భారీ విగ్రహాల ఎత్తు విషయంలో హైకోర్టు పరిమితి విధించిన నేపథ్యంలో గాజువాకలో 78 అడుగుల విగ్రహ తయారీకి ప్రత్యేక అనుమతి తీసుకున్నట్టు విశ్వ అధ్యక్షుడు రమణ యాదవ్ తెలిపారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించినచోట కాకుండా వేరే ప్రాంతానికి తరలించి నిమజ్జనం చేసే విగ్రహాలకు మాత్రమే ఎత్తు విషయంలో పరిమితులున్నాయని చెప్పారు. తాము ప్రతిష్ఠించినచోటే విగ్రహాన్ని నిమజ్జనం కూడా చేస్తామని, అందువల్ల తమకు అనుమతి అవసరం లేదని చెప్పారు. అయినప్పటికీ ఐదు ప్రభుత్వ శాఖలనుంచి ప్రత్యేక అనుమతులు తీసుకున్నట్టు చెప్పారు. -
చవితికి సిద్ధమైన గణనాథులు
-
5 నుంచి గణేశ్ ఉత్సవాలు
– 13న నిమజ్జనం – బలవంతపు వసూళ్లు వద్దు – వేడుకలు రామానుజచార్యులకు అంకితం – జిల్లా ఆధికార యంత్రాగం సహకరించాలి – గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి అధ్యక్షుడు కపిలేశ్వరయ్య కర్నూలు(టౌన్): నగరంలో గణేశ్ ఉత్సవాలు 5 వ తేదీ నుండి ప్రారంభమవుతాయని గణేశ్ మహోత్సవ కేంద్రసమితి అధ్యక్షుడు కపిలేశ్వరయ్య పేర్కొన్నారు. బుధవారం స్థానిక వినాయక్ ఘాట్ ఆలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 5వ తేదీన గణేశులను ప్రతిష్టించి ఎనిమిది రోజుల పాటు పూజిస్తారన్నారు. తొమ్మిదో రోజు సెప్టెంబర్ 13వ తేదీ నిమజ్జనం చేస్తున్నట్లు చెప్పారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే గణేశుల వద్ద ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆధ్యాత్యిక వాతావరణాన్ని కల్పించాలాన్నరు. మహిళలు పెద్దసంఖ్యలో ఉత్సవాల్లో భాగస్వాములు కావాలన్నారు. ఉత్సవాల పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడ కూడదని స్థానిక కమిటీలకు సూచించారు. రికార్డు డ్యాన్స్‌లు చేయకూడదన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా మండపాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఏడాది ఉత్సవాలను రామానుజాచార్యులకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. మతసామరస్యనికి ప్రతీకగా నిలుస్తున్న కర్నూలులో వినాయక నిమజ్జనం ముందు రోజు వచ్చే బక్రీద్ పండుగను సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. వేడుకలు విజయవంతం అయ్యేందుకు జిల్లా అధికార యంత్రాగం సహకరించాలన్నారు. నిమజ్జనానికి ఇబ్బందులు లేకుండా ఇరిగేషన్ అధికారులు కేసీకి నీరు విడుదల చేయాలన్నారు. 10న విద్యార్థులకు పోటీలు గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ విద్యార్థులకు వ్యాసరచన, వక్తత్వ , చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నట్లు సమితి కార్యాధ్యక్షుడు కష్టన్న వెల్లడించారు. పాఠశాల విద్యార్థులకు రామానుజాచార్యులు జీవిత సందేశం, కళశాల విద్యార్థులకు ‘కల్లోల కశ్మీరం– పరిష్కారాలు,’ స్వచ్ఛభారత్‌పై వక్తత్వపు పోటీలు ఉంటాయన్నారు. చిత్రలేఖనానికి సంబంధించి గణేశ్ చిత్రాలు గీయాల్సి ఉంటుందన్నారు. శనివారం ఉదయం 11.30 నుంచి 1 గంట వరకు బుధవారపేటలోని కేశవ మెమోరియల్ ఇంగ్లిష్ మీడియం హై స్కూలులో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ నెల 8వ తేదీలోపు తమ పేర్లను గణేశ్ మహోత్సవ కేంద్ర సమతికి తెలియ జేయాలన్నారు. సమావేశంలో సమితి ప్రధాన కార్యదర్శి రంగస్వామి, ఉపాధ్యక్షుడు నాగరాజు, సంఘటన కార్యదర్శి హారీష్‌బాబు, సాంస్త్రతిక విభాగం కార్యదర్శి హనుమంతరావు పాల్గొన్నారు.