పురుగుల మందు తాగిన మహిళ మృతి | woman suicide in medak | Sakshi
Sakshi News home page

పురుగుల మందు తాగిన మహిళ మృతి

Published Mon, Jan 29 2018 8:09 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

woman suicide in medak

వట్‌పల్లి(అందోల్‌): పురుగుల మందు తాగిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆదివారం మండల పరిధిలోని కేరూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఎస్‌ఐ గణేష్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పుల్కల్‌ మండలం పెద్దరెడ్డిపేట గ్రామానికి చెందిన కొత్తగడి సంగయ్య తన కూతురు మల్లమ్మ(30)ను వట్‌పల్లి మండలం కేరూర్‌ గ్రామానికి చెందిన చిన్నెల్లి నాగయ్యకు ఇచ్చి 15 సంవత్సరాల క్రితం పెళ్లి జరిపించాడు. వారికి ఇద్దరు మగ పిల్లలు. అదే గ్రామానికి చెందిన చిన్నెల్లి ఎల్లయ్య ఆరేళ్ల నుంచి ఆమెను వేధిస్తుండడం భార్య, భర్తల మధ్య గొడవలకు దారితీసింది.

ఈ నెల 26న ఎల్లయ్య రాత్రి వారి ఇంటి వైపు వచ్చాడు. అది గమనించిన నాగయ్య తన భార్య కోసమే వచ్చాడని భావించి అతడిపై చేయిచేసుకున్నాడు. ఈ విషయమై మనస్తాపం చెందిన మల్లమ్మ ఈ నెల 27న పురుగుల మందు తాగింది. ఈ క్రమంలో వెంటనే జోగిపేట, సంగారెడ్డి  ప్రభుత్వాస్రత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement