లంబో‘ధర’ లడ్డు
లంబోధరుడి లడ్డు భారీ ధర పలుకుతోంది. మండలంలోని వెల్మల్ గ్రామంలో
నందిపేట :
లంబోధరుడి లడ్డు భారీ ధర పలుకుతోంది. మండలంలోని వెల్మల్ గ్రామంలో గణేశ్ మండలి నిర్వాహకులు ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూ ధర రూ.60 వేలు పలికింది. 101 కిలోల లడ్డుకు మంగళవారం వేలం పాట నిర్వహించగా, లక్కంపల్లి గ్రామానికి చెందిన మహేందర్ రూ.60 వేలు పాడి లడ్డును చేజిక్కించుకున్నారు. అంతకు ముందు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. వేలంలో ఎక్కువ పాట పాడిన మహేందర్‌కు లడ్డు అందజేశారు.