Islamabad United
-
PSLతో పోలికా?.. ఐపీఎల్‌కు ఏదీ సాటి రాదు: ఇచ్చి పడేసిన ఇంగ్లండ్ స్టార్
పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో పోలుస్తూ పాక్ రిపోర్టర్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఈ రెండింటిలో గొప్ప లీగ్ ఏదో చెప్పాలంటూ అతడు అడిగిన ప్రశ్నకు లాహోర్ ఖలందర్స్ స్టార్, ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ బిల్లింగ్ దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు.సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ సత్తాకాగా ప్రపంచంలోని అత్యంత ఆదరణ పొందిన, ఖరీదైన టీ20 లీగ్‌గా ఐపీఎల్ వెలుగొందుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్లో భాగమైన ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీలు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ జట్లను కొనుగోలు చేసి.. అక్కడా సత్తా చాటుతున్నాయి. ఇక ఐపీఎల్ ద్వారా ఎంతో మంది యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.ఐపీఎల్‌తో పోటీకి దిగిపదిహేడేళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న ఐపీఎల్‌కు ఇంత వరకు ప్రపంచంలోని ఏ టీ20 లీగ్ కూడా పోటీ ఇవ్వలేకపోతోంది. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మాత్రం ఈసారి ఐపీఎల్‌తో ఢీకొట్టింది. మార్చి 22న మొదలైన ఐపీఎల్-2025 మే 25న ముగియనుండగా.. పీఎస్ఎల్ను ఏప్రిల్ 11- మే 18 వరకు నిర్వహించేందుకు పీసీబీ షెడ్యూల్ ఖరారు చేసింది.ఫలితంగా.. ఐపీఎల్‌తో పోటీ కారణంగా ప్రేక్షక ఆదరణ లేక పీఎస్ఎల్ వెలవెలబోతోంది. అయితే, కొంత మంది పాక్ జర్నలిస్టులు మాత్రం ఐపీఎల్‌తో పీఎస్ఎల్ను పోలుస్తూ విదేశీ ఆటగాళ్లను తికమకపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా లాహోర్ ఖలందర్ స్టార్ క్రికెటర్ సామ్ బిల్లింగ్స్‌ను ఓ రిపోర్టర్.. ప్రపంచంలోని ఇతర లీగ్‌లతో పోలిస్తే పీఎస్ఎల్ స్థానమేమిటి? అంటూ ప్రశ్నించారు.PSLతో పోలికా?.. ఐపీఎల్‌కు ఏదీ సాటి రాదుఈ ప్రశ్నను అర్థం చేసుకున్న సామ్ బిల్లింగ్స్.. ‘‘నా నుంచి మీరేదో చిలిపి సమాధానం ఆశిస్తున్నారు.. అంతే కదా!.. ప్రపంచంలో ఎక్కడైనా ప్రేక్షకులను కలిగి ఉండటం క్రికెట్‌కు ఉన్న ప్రత్యేకత. ఇండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్.. ఇలా ఎక్కడ క్రికెట్ ఆడినా అక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా మారిపోవడం క్రికెటర్లుగా మా బాధ్యత.కాబట్టి వివిధ దేశాల్లో నిర్వహిస్తున్న లీగ్‌లను పోల్చి చూస్తూ.. ర్యాంకులు ఇవ్వడం కాస్త కష్టంతో కూడుకున్న పని. అయితే, ఇతర లీగ్‌లతో పోలిస్తే.. ఐపీఎల్ ప్రీమియర్ కాంపిటిషన్ అన్న మాట వాస్తవం. ఐపీఎల్‌తో పోలిస్తే ప్రతి లీగ్.. దానికంటే వెనుబడి ఉన్నట్లే.ఇంగ్లండ్‌లో మేము.. ఇక్కడ పీఎస్ఎల్ మాదిరే ప్రపంచంలోని రెండో అత్యుత్తమ టీ20 లీగ్‌గా పేరొందాలనే ప్రయత్నాలు చేస్తున్నాము. ఆస్ట్రేలియాకు చెందిన బిగ్‌బాష్ లీగ్ పరిస్థితి కూడా ఇంతే.ఏదేమైనా ప్రతీ లీగ్ దానికదే ప్రత్యేకం. నేనైతే ప్రపంచంలోని అత్యుత్తమ లీగ్‌లలో భాగమైనందుకు సంతోషంగా ఉన్నా’’ అని సామ్ బిల్లింగ్ పేర్కొన్నాడు. పీఎస్ఎల్ కంటే ఐపీఎల్ కచ్చితంగా బెటర్ అంటూ పరోక్షంగా తన మనసులో మాటను వెల్లడించాడు.గతంలో ఐపీఎల్లో ఆడిన బిల్లింగ్స్కాగా 33 ఏళ్ల సామ్ బిల్లింగ్స్ 2015-16లో ఇస్లామాబాద్ యునైటెడ్ తరఫున పీఎస్ఎల్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అంటే.. 2023 నుంచి లాహోర్ ఖలందర్స్కి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక 2016లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్ ఆడిన బిల్లింగ్స్.. 2018, 2019లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగాడు. చివరగా 2022లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. చదవండి: Rohit Sharma: కమిన్స్, స్టార్క్ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం -
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన పాక్ వికెట్ కీపర్
పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ 2025లో ఆ దేశ జాతీయ జట్టు వికెట్‌కీపర్ సాహిబ్జాదా ఫర్హాన్ విధ్వంసకర శతకంతో విరుచకుపడ్డాడు. పెషావర్ జల్మీతో నిన్న (ఏప్రిల్ 14) జరిగిన మ్యాచ్‌లో అతను 49 బంతుల్లోనే శతకొట్టాడు. ఓవరాల్‌గా 52 బంతులు ఎదుర్కొన్న ఫర్హాన్ 13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. ఫర్హాన్ రెచ్చిపోవడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇస్లామాబాద్ యునైటెడ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.ఇస్లామాబాద్ ఇన్నింగ్స్‌లో కొలిన్ మున్రో (27 బంతుల్లో 40; 6 ఫోర్లు, సిక్స్), సల్మాన్ అఘా (15 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆండ్రియస్ గౌస్ 0, ఆజమ్ ఖాన్ 16, జేసన్ హోల్డర్ 20 నాటౌట్, డ్వార్షుయిస్ 18 నాటౌట్ పరుగులు చేశారు. పెషావర్ బౌలర్లలో అల్జరీ జోసఫ్, తలాత్ తలో రెండు వికెట్లు తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పెషావర్.. ఇస్లామాబాద్ బౌలర్లు ఇమాద్ వసీం (4-0-26-3), షాదాబ్ ఖాన్ (4-0-29-2), డ్వార్షుయిస్ (2.2-0-23-2), నసీం షా (3-0-14-1), జేసన్ హోల్డర్ (2-0-20-1), షాన్ మసూద్ (3-0-25-1) కలిసికట్టుగా రాణించడంతో 18.2 ఓవర్లలో 141 పరుగులకే కుప్పకూలింది. పెషావర్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ హరీస్ (47 బంతుల్లో 87; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరిపోరాటం చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. హరీస్‌తో పాటు పెషావర్ జట్టులో మిచెల్ ఓవెన్ (10), తలాత్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. పెషావర్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (1) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు.విధ్వంసకర ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరుఫర్హాన్.. పాక్ దేశవాలీ క్రికెట్లో పలు విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ ఏడాది అతను పాక్ నేషనల్ టీ20 కప్‌లో 72 బంతుల్లో 14 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 162 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పాక్ టీ20 క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోర్‌గా రికార్దైంది. ఓవరాల్‌గా చూసినా టీ20ల్లో ఇది మూడో అత్యధిక స్కోర్. టీ20ల్లో తొలి రెండు అత్యధిక స్కోర్లు క్రిస్ గేల్ (175 నాటౌట్), ఆరోన్ ఫించ్ (172) పేరిట ఉన్నాయి. ఫర్హాన్.. హ్యామిల్టన్ మసకద్జ (162 నాటౌట్), హజ్రతుల్లా జజాయ్‌తో కలిసి (162 నాటౌట్) సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. పీఎస్ఎల్ 2025లో భాగంగా పెషావర్‌పై ఫర్హాన్ చేసిన చేసిన 49 బంతుల సెంచరీ ఈ సీజన్లో మొదటిది. ఇస్లామాబాద్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. 2019 సీజన్లో సౌతాఫ్రికా ఆటగాడు కెమరూన్ డెల్పోర్డ్ కూడా ఇస్లామాబాద్‌కు ఆడుతూ లాహోర్ ఖలందర్స్‌పై 49 బంతుల్లోనే శతక్కొట్టాడు. -
PSL 2025: చప్పగా సాగిన తొలి మ్యాచ్.. ఇలా అయితే కష్టమే!
పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)-2025 సీజన్ శుక్రవారం (ఏప్రిల్ 11) మొదలైంది. తొలి మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ (ISU)- లాహోర్ ఖలందర్స్ (LHQ) తలపడ్డాయి. రావల్పిండి వేదికగా జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన ఇస్లామాబాద్ జట్టు.. లాహోర్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.అయితే, ఓపెనర్లు ఫఖర్ జమాన్ (1), మహ్మద్ నయీమ్ (8) త్వరత్వరగా పెవిలియన్‌కు చేరడంతో లాహోర్‌కు ఆరంభంలోనే వరుస షాకులు తగిలాయి. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ అబ్దుల్లా షఫీక్ (38 బంతుల్లో 66) ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అతడికి తోడుగా సికందర్ రజా (23) రాణించాడు.చెలరేగిన జేసన్ హోల్డర్అయితే, డారిల్ మిచెల్ (13) సహా మిగిలిన వాళ్లంతా పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో 19.2 ఓవర్లలో కేవలం 139 పరుగులు మాత్రమే చేసి లాహోర్ జట్టు ఆలౌట్ అయింది. ఇస్లామాబాద్ బౌలర్లలో పేసర్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జేసన్ హోల్డర్ నాలుగు వికెట్ల (4/26)తో చెలరేగగా.. కెప్టెన్, స్పిన్నర్ షాదాబ్ ఖాన్ (3/25) మూడు వికెట్లతో రాణించాడు.మిగిలిన వారిలో నసీం షా, రిలే మెరిడిత్, ఇమాద్ వసీం ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దిగిన ఇస్లామాబాద్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ ఆండ్రీ గౌస్ (4) సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరగగా.. మరో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (24 బంతుల్లో 25) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపుఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ కొలిన్ మున్రో, సల్మాన్ ఆఘా కాస్త వేగంగా ఆడి.. జట్టును విజయతీరాలకు చేర్చారు. మున్రో 42 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 59 పరుగులతో అజేయంగా నిలవగా.. సల్మాన్ 34 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 41 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా 17.4 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి ఇస్లామాబాద్ టార్గెట్ పూర్తి చేసింది. లాహోర్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి సీజన్‌ను ఘనంగా ఆరంభించింది.ఐపీఎల్‌తో ఢీ!కాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సాధారణంగా ఐపీఎల్‌తో పోటీ లేకుండా పీఎస్ఎల్ నిర్వహించేది. కానీ ఈసారి మాత్రం క్యాష్ రిచ్ లీగ్‌ను ఢీకొడుతూ ఏప్రిల్ 11- మే 18 వరకు షెడ్యూల్ ఖరారు చేసింది. మరోవైపు మార్చి 22న మొదలైన ఐపీఎల్-2025.. మే 25న ఫైనల్‌తో ముగియనుంది. ఈ నేపథ్యంలో చాలా మంది విదేశీ క్రికెటర్లు కూడా ఐపీఎల్ ఆడే నిమిత్తం పీఎస్ఎల్ నుంచి తప్పుకొన్నారు.చప్పగా సాగిన తొలి మ్యాచ్.. ఇలా అయితే కష్టమే!ఇక పరుగుల వరద పారే ఐపీఎల్‌తో పోటీకి వచ్చిన పీఎస్ఎల్ తొలి మ్యాచే చప్పగా సాగింది. కనీసం ఇరు జట్లు కలిసీ కనీసం మూడు వందల పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయాయి. దీంతో అభిమానులు ఉసూరుమంటున్నారు. పీఎస్ఎల్ ఇలాగే కొనసాగితే ఎవరూ చూడరని.. సొంత అభిమానులే పీసీబీని విమర్శిస్తున్నారు. టీ20 క్రికెట్ అంటేనే బౌండరీలు, సిక్సర్ల వర్షం ఉండాలని.. కాస్త బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లు తయారు చేయాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు.పీఎస్ఎల్-2025: ఇస్లామాబాద్ వర్సెస్ లాహోర్ స్కోర్లులాహోర్: 139 (19.2)ఇస్లామాబాద్: 143/2 (17.4)ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో లాహోర్‌ను ఓడించి ఇస్లామాబాద్.చదవండి: KKR Vs CSK: అతడిని ఎనిమిదో ఓవర్లో పంపిస్తారా? ఇంతకీ మెదడు పనిచేస్తోందా?!ఐపీఎల్‌కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్.. విదేశీ క్రికెటర్లు వీరే Agha goes BOOM! That’s a clean strike clearing the boundary! 🤩#HBLPSLX l #ApnaXHai l #IUvLQ pic.twitter.com/khDjmxyB57— PakistanSuperLeague (@thePSLt20) April 11, 2025