resignations
-
బంగ్లాలో హిందూ టీచర్లపై దాడులు
ఢాకా: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత హిందూ ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మైనారిటీలైన హిందూ ఉపాధ్యాయులతో విద్యార్థులు, స్థానికులు బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు. ఇలా 50 మంది దాకా రాజీనామా చేశారు. వెలుగులోకి రాని ఉదంతాలు చాలా ఉన్నాయని చెబుతున్నారు. ఆఫీసును ముట్టడించి... బరిషాల్లోని బేకర్‌గంజ్ ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపల్ శుక్లా రాణి హాల్దర్ కార్యాలయాన్ని ఆగస్టు 29న మూకలు ముట్టించాయి. వీరిలో బయటి వ్యక్తులతో పాటు ఆ కాలేజీ విద్యార్థులూ ఉన్నారు! తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గంటల తరబడి బెదిరింపులకు దిగారు. దాంతో వేరే మార్గం లేక ఖాళీ కాగితం మీదే ‘నేను రాజీనామా చేస్తున్నాను’ అంటూ సంతకం చేసిచ్చారామె. అజీంపూర్ బాలికల పాఠశాల, కళాశాల విద్యార్థులు ప్రిన్సిపల్ గీతాంజలి బారువాతో పాటు అసిస్టెంట్ హెడ్ టీచర్ గౌతమ్ చంద్ర పాల్ తదితరులతో బలవంతంగా రాజీనామా చేయించారు. వారంతా తన కార్యాలయంపై దాడి చేసి తనను అవమానించారని గీతాంజలి వాపోయారు. వైరలవుతున్న వీడియోలు... బంగ్లావ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. రాజీనామా లేఖలపై సంతకాలు చేయాలంటూ హిందూ టీచర్లను, ఇతర సిబ్బందిని బలవంతం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వేధింపుల దెబ్బకు ప్రొక్టర్ పదవికి రాజీనామా చేయాల్సి వచి్చందని కాజీ నజ్రుల్ వర్సిటీ పబ్లిక్ అసోసియేట్ ప్రొఫెసర్ సంజయ్ కుమార్ ముఖర్జీ తెలిపారు. ఖండించిన తస్లీమా ఈ ఘటనలపై బంగ్లాదేశ్ బహిష్కృత రచయిత్రి తస్లీమా నస్రీన్ మండిపడ్డారు. మహమ్మద్ యూనస్ ప్రభుత్వం మైనారిటీలకు రక్షణ కల్పించడం లేదని ఆరోపించారు. ‘‘హిందూ ఉపాధ్యాయులను బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారు. గత ప్రభుత్వంలోని మంత్రులు, అధికారులు హత్యలకు, వేధింపులకు గురవుతున్నారు. జైలుపాలవుతున్నారు. దర్గాలను కూలి్చవేస్తున్నారు. అయినా యూనస్ నోరు విప్పడం లేదు’’ అంటూ ఎక్స్‌లో దుయ్యబట్టారు. టీచర్లపై వేధింపులను బంగ్లా ఛత్ర ఐక్య పరిషత్ ఖండించింది. -
మాలీవుడ్ సూపర్ ‘హీట్’.. ‘అమ్మ’ రాజీనామా!
కేరళ సినిమా రంగంలో భూకంపం పుట్టింది. నటీనటుల సంఘం ‘అమ్మ’ కార్యవర్గం పూర్తిగా రాజీనామా చేసింది. వీరిలో మోహన్‌లాల్ ఉన్నారు. గత కొన్ని రోజులుగా కేరళ సినిమా రంగంలో మహిళలపై దురాగతాలు బయటికి వస్తుండటంతో పరిశ్రమ వణుకుతోంది. కొందరు తమ పదవులకు రాజీనామాలు చేస్తుంటే మరికొందరు ముఖం చాటేస్తున్నారు. ఈ దావానలం బాలీవుడ్ వరకు పాకితే మరింత ప్రక్షాళనం జరగవచ్చు.మలయాళ సినీ పరిశ్రమలో గొలుసుకట్టు ఘటనలు జరుగుతున్నాయి. 2017లో మలయాళ నటి భావనా మీనన్‌పై లైంగిక దాడి జరగడం (కొచ్చి శివార్లలో కారులో కొందరు వ్యక్తులు చేశారని ఆరోపణ) వెనుక సూత్రధారి మలయాళ హీరో దిలీప్ అని రేగిన కార్చిచ్చు అక్కడి ప్రభుత్వం చేత జడ్జి హేమ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేయించింది. అయితే ఆ కమిటీ రి΄ోర్టు ఆలస్యంగా 2024 ఆగస్టులోగాని బయటకు రాలేదు. అది వచ్చిన వెంటనే మలయాళ పరిశ్రమలో కొంతమంది మహిళలు తమ అనుభవాలను బయటకు చెప్పసాగారు. దాంతో మలయాళ పరిశ్రమ కుదుపులకు లోనవుతోంది.నటుడు సిద్దిఖీ పై ఆరోపణమలయాళంలో టాప్ కేరెక్టర్ ఆర్టిస్ట్, అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ)కు జనరల్ సెక్రటరీ అయిన సిద్దిఖీ పై రేవతి సంపత్ అనే జూనియర్ ఆర్టిస్ట్ అత్యాచార ఆరోపణలు చేసింది. హేమా కమిషన్ బయటకు వచ్చాక ఆమె తన ఆరోపణలను మరోసారి మీడియా ముందుకు తెచ్చింది. ‘2016లో అతను కొచ్చిలోని ఒక హోటల్లో నా పై అత్యాచారం చేశాడు. అప్పుడు నాకు 21 ఏళ్లు ఉంటాయి. నాకు సినిమా రంగం ఆసక్తి ఉందని తెలిసి హోటల్‌కు పిలిపించి హఠాత్తుగా లైంగికదాడి చేశాడు’ అని ఆమె చెప్పింది. ఈ ఆరోపణలు ఆమె 2019లో చేసినా ఇప్పుడు మళ్లీ శక్తి పుంజుకుని సిద్దిఖీని విమర్శల వలయంలో నిలబెట్టాయి. దాంతో అతడు ‘అమ్మ’ పదవికి రాజీనామా చేశాడు. అయితే అతడు తాజాగా ఆ జూనియర్ ఆర్టిస్టు తనపై లేని΄ోని అభాండాలు వేస్తోందని కేరళ డి.జి.పికి ఫిర్యాదు చేశాడు.ఎం.ఎల్.ఏ పేరుమరోవైపు నటుడు ముకేష్ (ఇతను సి.పి.ఎం ఎం.ఎల్.ఏ) పై కూడా టెస్ జోసఫ్ అనే కాస్టింగ్ డైరెక్టర్ అమర్యాదకరంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసింది. ‘అతను ఔట్‌డోర్‌లో తన రూమ్ పక్కన నా రూమ్ ఉండేలా కుట్ర చేశాడు. నా రూమ్ తలుపు పదే పదే కొట్టాడు’ అని ఆమె తెలియచేసింది. అయితే ముకేష్ ఇదంతా రాజకీయ కుట్ర అని అంటున్నాడు. ఈ దుమారం ఇలా ఉంటే ప్రభుత్వ చలచిత్ర అకాడెమీ ప్రస్తుత చైర్మన్, దర్శకుడు రంజిత్‌పై ఇలాంటి ఆరోపణలు రావడంతో అతనూ రాజీనామా చేశాడు. దీంతో ప్రభుత్వం సినిమా పరిశ్రమలో వస్తున్న ఫిర్యాదులపై విచారణకు 4 మహిళా ముగ్గురు పురుష ఐపిఎస్‌లతో ‘సిట్’ ఏర్పాటు చేసింది. ఈ ‘సిట్’ తనకు తానుగా ఫిర్యాదులు నమోదు చేయదని, ఫిర్యాదులను పరిశీలిస్తుందని ప్రభుత్వం చెప్పడంతో అంతా మసిపూసి మారేడుకాయ చేసే వ్యవహారంగా ఇది మిగలనుందని విమర్శలు వస్తున్నాయి.మేము న్యాయపోరాటాలు చేయలేంఫిర్యాదులు చేస్తున్న మహిళలు ‘మేము కేసులు పెట్టి కోర్టులు చుట్టు తిరగలేం’ అని చెప్పడం గమనార్హం. ‘మేం అంత పెద్దవారిని ఎదుర్కోలేం’ అని వారు అంటున్నారు. మలయాళ ఇండస్ట్రీలో ఉన్న 15 మంది శక్తిమంతులు పరిశ్రమలో ఎవరో పైకి రావాలో, ఎవరు వెనుక ఉండిపోవాలో నిర్ణయిస్తున్నారని హేమ కమిషన్ తెలియచేసింది. వీరు చెప్పినట్టు వినకపోతే ఇండస్ట్రీలో మనలేని పరిస్థితి ఉందని కమిషన్ పేర్కొంది. ‘స్త్రీలను ఎందుకు ఇబ్బంది పెడతారు? అని ప్రశ్నించే పురుషులను కూడా బ్యాన్ చేస్తున్నారు’ అని తెలపడం విశేషం. రాబోయే రోజుల్లో ఈ కందిరీగల తుట్టె ఏ మేరకు ఎవరిని కుట్టనుందో వేచి చూడాలి.కాంప్రమైజ్ – అడ్జస్ట్ఒక నటి సినిమా చేయడానికి అంగీకరించే ముందు మలయాళ పరిశ్రమలో వినిపించే రెండు పదాలు కాంప్రమైజ్, అడ్జస్ట్. వేషం తె ప్రొడక్షన్ మేనేజర్లు ‘రాజీ పడాలని’, ‘సర్దుకుపోవాలని’ కోరుతారు. ‘సరే’ అంటే వేషం. లేకుంటే లేదు. అంతటితో వదిలితే ఫరవాలేదు. కాని హేమా కమిషన్ ప్రకారం ఏ మహిళా ఆర్టిస్ట్ అయినా నో అంటే వెంటనే ఇండస్ట్రీ అంతటా వ్యాపిస్తుంది. ఆమెను ‘దారి’కి తెచ్చే పని ఇండస్ట్రీ అంతా తీసుకుంటుంది. ‘మా సారు (ఏ పెద్ద స్టారో దర్శకుడో ప్రొడ్యూసర్) అడిగితే కాదంటావా?’ అని ఎవరూ వేషం ఇవ్వరు. పస్తులతో మాడేలా చేస్తారు. అందుకే మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ముందుకొచ్చి‘మహిళలు చేసే ఏ ఫిర్యాదునైనా సీరియస్‌గా తీసుకోవాలి’ అని బహిరంగంగా మాట్లాడాడుఫ్యాన్స్ ఆర్మీలైంగిక దుశ్చర్యలు ఎదుర్కొన్న మహిళలు బయటకు చెప్పేందుకు భయపడటానికి మరో కారణం ఈ పెద్ద నటులు ఫ్యాన్స్ ఆర్మీలను దాడికి పురిగొల్పుతుండటమే. ఏ హీరోను ఎవరేమన్నా వారి అభిమానులు సోషల్ మీడియాలో బూతులు జోడిస్తూ మీమ్స్ తయారు చేస్తుండటంతో బాధితులు బెంబేలెత్తుతున్నారు. కొన్నిసార్లు భౌతికంగా దాడి చేస్తారనే భయం కూడా సృష్టిస్తున్నారు. అందుకే హేమా కమిషన్ ఫ్యాన్స్‌ను కట్టడి చేయాలని ప్రభుత్వానికి ప్రత్యేకంగా సూచించింది.తలుపు విరిగేలా బాదుతారు‘ఔట్‌డోర్ షూటింగ్లో అర్ధరాత్రి తాగేసి వచ్చి తలుపు విరిగేలా బాదుతారు. అందుకే ఔట్‌డోర్‌లో కుటుంబ సభ్యులను తోడు తీసుకొని వెళ్లాల్సి వస్తోంది’ అని చాలామంది మహిళా ఆర్టిస్టులు హేమా కమిషన్‌కు చెప్పారు. వేషం ఇచ్చేటప్పుడే ‘అడిగితే అంగీకరించాలనే’ డిమాండ్ ప్రోడక్షన్ మేనేజర్ చల్లగా చెపాడని తెలియచేశారు.మోహన్‌లాల్ రాజీనామా30 ఏళ్ల చరిత్ర కలిగిన ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్’ (అమ్మ) అధ్యక్ష పదవికి నటుడు మోహన్‌లాల్ రాజీనామా చేశారు. మలయాళ పరిశ్రమలో స్త్రీలపై సాగుతున్న లైంగిక దోపిడిని జస్టిస్ హేమా కమిషన్ బయట పెట్టాక వినవచ్చిన ఆరోపణల్లో ‘అమ్మ’ జనరల్ సెక్రటరీ సిద్దిఖీతో పాటు మరికొందరి పేర్లు ఉన్న దరిమిలా నైతిక బాధ్యత వహిస్తూ మొత్తం 17 మంది సభ్యులున్న కార్యవర్గం రాజీనామా చేసింది. హడావిడిగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ మీటింగ్‌లో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ‘మమ్మల్ని విమర్శకు, దిద్దుబాటుకు లోను చేసినందుకు కృతజ్ఞతలు’ అని రాజీనామా లేఖలో కమిటీ సభ్యులు పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకూ మోహన్‌లాల్, మమ్ముట్టి తదితర సూపర్స్టార్లు హేమా కమిషన్ గురించి ఏమీ మాట్లాడక΄ోవడాన్ని ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ (డబ్లు్యసిసి) తప్పుబట్టింది. మలయాళ రంగంలోని మహిళా నటీమణులు ‘అమ్మ’తో విభేదించి ఈ గ్రూపును నియమించుకున్నారు. హేమా కమిషన్ రిపోర్టును బయటపెట్టమని ΄ోరాడింది వీరే. ‘తంగలాన్’ నటి ΄ార్వతి తిరువోతు ఈ గ్రూప్‌లో చురుగ్గా పని చేస్తోంది. మెంబర్‌షిప్‌కు వెళ్లినా‘మూడు సినిమాల్లో నటిస్తే అమ్మలో మెంబర్షిప్ తీసుకోవచ్చు. దానికోసం నేను ఫోన్ చేస్తే ఆ పనులు చూసే సభ్యుడు తన ఫ్లాట్‌కు రమ్మన్నాడు. నేను ఫ్లాట్‌కు వెళ్లి ఫామ్ ఫిలప్ చేస్తుంటే వెనుక నుంచి వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఔట్‌డోర్ షూటింగ్ లో ఒక నటుడు నా రూమ్‌కు వచ్చి తలుపు తీసిన వెంటనే మంచం మీదకు లాగే ప్రయత్నం చేశాడు. ఇంకో నటుడు రెస్ట్రూమ్ నుంచి బయటకు వస్తున్నప్పుడూ వదల్లేదు. కావలించుకున్నాడు. ‘అడ్జస్ట్’ అవమని అందరూ చెప్పడమే. ఎంత అడ్జస్ట్ అవుదామని చూసినా ఇది భరించలేనంతగా ఉండటం వల్ల మలయాళ ఇండస్ట్రీ వదిలిపెట్టి చెన్నైకి మారి΄ోయాను’ అని నటి మీను మునీర్ ఫేస్బుక్లో రాసింది. హేమా కమిషన్ బయటకు వచ్చాక ఈమె ఈ వివరాలు తెలిపింది. – ఫ్యామిలీ డెస్క్ -
ఏసీఏ పాలకవర్గం రాజీనామా
విజయవాడ స్పోర్ట్స్: రాష్ట్రంలో అధికార మార్పు తర్వాత వ్యవస్థలను స్వా«దీనం చేసుకునే పనిలో నిమగ్నమైన ‘పచ్చ ముఠా’ క్రీడా సంఘాల్లోకి కూడా చొరబడుతోంది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ)ను హస్తగతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) కేంద్రంగా ఈ క్రీడా రాజకీయం కొనసాగుతోంది.ప్రస్తుతం ఏసీఏ అధ్యక్ష, కార్యదర్శులు శరత్‌చంద్రారెడ్డి, గోపినాథ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు రోహిత్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి రాకేశ్, కోశాధికారిగా ఎ.వి.చలం, అపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా పురుషోత్తం వ్యవహరిస్తున్నారు. వీరికి ఇంకా ఏడాది సమయముంది. కానీ ఆదివారం విజయవాడలోని ఓ హోటల్లో ఎంపీ చిన్ని ఆధ్వర్యంలో ఏసీఏ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి 13 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, క్రికెట్ అకాడమీల ప్రతినిధులు కలిపి మొత్తం 33 మంది హాజరయ్యారు. గోపినాథ్‌రెడ్డి, రాకేశ్, చలం తమ రాజీనామా పత్రాలతో పాటు మిగిలిన వారివి కూడా తీసుకొని సమావేశానికి వచ్చారు. ఎలాంటి చర్చ లేకుండానే పాలకవర్గం రాజీనామాలను ఆమోదించినట్లు విశాఖ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజుతో ఎంపీ కేశినేని చిన్ని ప్రకటింపజేశారు. ఆ వెంటనే గోపీనాథ్‌రెడ్డి, చలం వెళ్లిపోయారు. ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేశ్.. ఏసీఏకు ఎన్నికలు జరిగే వరకు రాష్ట్రంలో క్రికెట్ కార్యకలాపాలు నిలిచిపోకూడదనే ఉద్దేశంతో త్రీ మెన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు విష్ణుకుమార్‌రాజు మీడియాకు వెల్లడించారు. ఈ కమిటీలో ఆర్.వి.ఎస్.కె.రంగారావు, మాంచో ఫెర్రర్, మురళీమోహనరావును నియమించినట్లు తెలిపారు. వారిలో ఇద్దరికి చెక్ పవర్ ఇచ్చామన్నారు. ఎన్నికలు జరిగే వరకు ఈ కమిటీ కొనసాగుతుందని తెలిపారు. పాలకవర్గానికి ఉన్న మిగిలిన ఏడాది కాలానికి ఎన్నికలు నిర్వహించాలని తీర్మానించామన్నారు. సెపె్టంబర్ 8న ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల అధికారిగా మాజీ ఐఏఎస్ నిమ్మగడ్డ రమేశ్ వ్యవహరిస్తారని వెల్లడించారు. ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. అన్ని జిల్లాల్లోని క్రికెట్ సంఘాలను సందర్శించి క్రికెట్ సంఘాల్లో ఉన్న సమస్యలను, క్రీడాకారుల ఇబ్బందులను పరిష్కరిస్తామన్నారు. -
17 వర్సిటీలకు ఇన్చార్జ్ వీసీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 17 యూనివర్సిటీలకు ఇన్చార్జ్ వైస్ చాన్సలర్ల(వీసీల)ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని యూనివర్సిటీల వీసీలపై తీవ్రస్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయి. బలవంతంగా రాజీనామాలు చేయించారనే ఆరోపణలు బలంగా వినిపించాయి.యూనివర్సిటీల్లో టీఎన్ఎస్ఎఫ్, కూటమి అనుకూల ఉద్యోగులు వీసీలను బెదిరిస్తూ.. రాజీనామాలు చేసి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో జూలై 2 నాటికే వీసీలంతా రాజీనామాలు చేశారు. ఈ రాజీనామాలను గవర్నర్ ఆమోదించడంతో తాజాగా ఆయా వర్సిటీలకు ఇన్చార్జ్ వీసీలను నియమిస్తూ ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్ ఉత్తర్వులిచ్చారు. -
రాజీనామాలు వలంటీర్ల వ్యక్తిగతం
సాక్షి, అమరావతి: రాజీనామాలు వలంటీర్ల వ్యక్తిగత వ్యవహారమని, అందువల్ల వారి రాజీనామాలను ఆమోదించకుండా తాము ఆదేశాలివ్వడం సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం హైకోర్టుకు నివేదించింది. రాజీనామా చేయడానికి వీల్లేదని నియామక నిబంధనల్లో ఉంటే తప్ప ఎవ్వరినీ రాజీనామా చేయవద్దంటూ ఆదేశాలు ఇవ్వలేమని ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వివరించారు.వలంటీర్ పోస్టులో ఉన్నంత వరకే వారిపై తమకు అధికారం ఉంటుందని స్పష్టం చేశారు. రాజీనామాల తరువాత వలంటీర్లు ప్రైవేటు వ్యక్తులు అవుతారని, నచ్చిన విధంగా ఉండే స్వేచ్ఛ వారికి ఉందని వివరించారు. పిటిషనర్ అభ్యర్థన చాలా విచిత్రంగా ఉందని, వలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వాన్ని తాము ఆదేశించాలని కోరుతున్నారని, ఆ పని తామెలా చేయగలమని ప్రశ్నించారు.ఈ వివరాలన్నింటితో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ నెల 22 వరకు 62,571 మంది వలంటీర్లు రాజీనామా చేశారుఎన్నికలు పూర్తయ్యేంత వరకు వలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ బుధవారం మరోసారి విచారణ జరిపారు. కేంద్ర ఎన్నికల సంఘం తరఫున అవినాష్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. గత నెల 18 నుంచి ఈ నెల 22వ తేదీ వరకు 62,571 మంది వలంటీర్లు రాజీనామా చేశారని తెలిపారు.ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు 929 మంది వలంటీర్లను తొలగించామన్నారు. వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచుతూ ఉత్తర్వులిచ్చామని, పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించకుండా సర్క్యులర్లు జారీ చేశామన్నారు. ఇప్పుడు వారి రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వాన్ని తాము ఆదేశించాలని పిటిషనర్ కోరుతున్నారని, ఇదెలా సాధ్యమని అన్నారు.ఇప్పుడు వలంటీర్లు ఖాళీగా ఉన్నారుప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వలంటీర్లకు ఎలాంటి పనులు అప్పగించలేదన్నారు. వారు ఖాళీగా ఉన్నారని, అయినా వారికి గౌరవ వేతనం చెల్లిస్తూనే ఉన్నామన్నారు. దీని వల్ల ఖజానాపై భారం పడుతోందని వివరించారు.పిటిషనర్ తరఫున న్యాయవాది పీవీజీ ఉమేష్ వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగంలోని అధికరణ 324 కింద ఎన్నికల సంఘం ఎలాంటి ఆదేశాలైనా ఇవ్వొచ్చన్నారు. వలంటీర్లు రాజీనామా చేసి అధికార పార్టీకి సహకరిస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. -
మీ దూకుడూ ...సాటెవ్వరు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీల నుంచి వలసలు ఊపందుకున్నాయి. టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలంతా రాత్రికి రాత్రే పార్టీలు మారిపోతున్నారు. నిన్నటిదాకా తిట్టిపోసిన పార్టీల్లోనే దర్జాగా చేరుతూ తమను అక్కున చేర్చుకున్న పార్టీలను ఆకాశానికెత్తేస్తున్నారు. అదే సమయంలో నిన్నటిదాకా తమకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీలను దుమ్మెత్తిపోస్తున్నారు. అధికార బీఆర్ఎస్తోపాటు విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. రేఖా నాయక్, మైనంపల్లితో మొదలు... బీఆర్ఎస్ దాదాపు రెండున్నర నెలల కిందటే అభ్యర్థుల జాబితాను ప్రకటించగా అప్పట్లో ఒకరిద్దరు నేతలు మినహా మరెవరూ ఆ పార్టీని వీడలేదు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు కేసీఆర్ టికెట్ నిరాకరించడంతో ఆమె అధికార పార్టీపై దుమ్మెత్తి పోశారు. ఎస్టీ మహిళనైన తనను పార్టీ బలిపశువు చేసిందని , మహిళలను గౌరవించని పార్టీలో కొనసాగలేనంటూ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ తాజా జాబితాలో రేఖానాయక్ భర్త శ్యాం నాయక్‌కు టికెట్ కేటాయించింది. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రెండు టికెట్లు ఆశించి భంగపడటంతో ఏకంగా మంత్రి హరీశ్‌రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరడమే కాకుండా తనకు, తన కుమారునికి టికెట్లు ఖాయం చేసుకున్నారు. రాజగోపాల్‌రెడ్డి యూటర్న్...: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 2022లో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ సందర్భంలో ఆయన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఓడించే పార్టీ బీజేపీయేనని... అందుకే ఆ పార్టీలోకి చేరినట్లు ప్రకటించారు. మునుగోడు ఉపఎన్నిక తరుణంలో రేవంత్‌రెడ్డి కూడా రాజగోపాల్‌రెడ్డిని దూషించారు. అదే రాజగోపాల్‌రెడ్డి ఇప్పుడు తన అభిమానులు, కార్యకర్తలంతా కలసి బీఆర్ఎస్ను ఓడించడం ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్‌కే సాధ్యమవుతుందని పేర్కొంటూ బీజేపీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్‌లో చేరిన కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగి మునుగోడు టికెట్ తెచ్చుకున్నారు. ఆల్ పార్టీ నేత నాగం...: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఒక్కప్పుడు టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి ఆ తర్వాత వరుసగా పార్టీలు మారుతూ వస్తున్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2011లో టీడీపీకి రాజీనామా చేశాక సొంత పార్టీ పెట్టిన ఆయన 2013లో బీజేపీలో చేరిపోయారు. 2018లో ఆ పార్టీ నుంచి బయటకొచ్చి కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా కాంగ్రెస్ ఆయనకు నాగర్‌కర్నూల్ టికెట్ నిరాకరించడంతో ఆ పార్టీని దుర్భాషలాడుతూ అధికార బీఆర్ఎస్లో చేరిపోయారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారంటూ గతంలో ఏకంగా కోర్టుకెక్కిన నాగం... తాజాగా అదే కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరిదీ అదే దారి... ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అధికార పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన వెంటనే టికెట్లు పొందారు. మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం తనకు టికెట్ లభించే అవకాశం ఉన్న బీజేపీలో జాయిన్ అయ్యారు. జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా నామినేట్ అయిన కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్, ఆయన సతీమణి బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరగా ఆ వెంటనే ఆయనకు శేరిలింగంపల్లి టికెట్ లభించింది. రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకునిగా ఉన్న మనోహర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరిన వెంటనే ఆయనకు తాండూరు టికెట్ లభించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లోకి జంప్ కాగానే ఆయనకు కల్వకుర్తి సీటు ఖరారైంది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వీరేశం కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరగానే ఆయనకు టికెట్ కేటాయించిందా పార్టీ. నేరేడుచర్ల మున్సిపల్ వైస్–చైర్పర్సన్ శ్రీలతారెడ్డి బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. ఆమెకు హుజూర్నగర్ టికెట్ దక్కే అవకాశం ఉంది. కొందరికి భవిష్యత్ పై హామీలు... కాంగ్రెస్, బీజేపీలో టికెట్ల రగడతో బీఆర్ఎస్లోకి సైతం భారీగానే మాజీ ఎమ్మెల్యేలు చేరుతున్నారు. అయితే వారికి ఇప్పటికిప్పుడు సీట్లు కేటాయించే అవకాశం లేకపోవడంతో భవిష్యత్తులో మంచి స్థానం కల్పిస్తామని అధికార పార్టీ హామీలు ఇస్తోంది. ఇలా చేరిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు/మంత్రులు విష్ణువర్ధన్‌రెడ్డి, ఎ.చంద్రశేఖర్, ఎర్ర శేఖర్, గద్వాల డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్‌రెడ్డి, మెదక్ డీసీసీ అధక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, రాగిడి లక్ష్మారెడ్డి, నిర్మల్ బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి, పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, కొత్తగూడెం బీజేపీ అధ్యక్షుడు కోనేరు చిన్ని తదితరులు ఉన్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి టీడీపీ అధినేత చంద్రబాబు నిరాకరించడంతో టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తాజాగా పదవికి రాజీనామా చేశారు. ఆయన బీఆర్ఎస్లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. -
దమ్మూ ధైర్యముంటే నిరూపించండి
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.86 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే పార్లమెంట్ సాక్షిగా చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎంపీలు ఖండించారు. దమ్మూ ధైర్యముంటే కేంద్రం ఈ విషయాన్ని నిరూపించాలని వారు డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు వేల కోట్ల రూపాయలు కాదు.. ఒక్క రూపాయి, కనీసం ఒక్క పైసా ఇచ్చినట్లు బీజేపీ నిరూపిస్తే రాజీనామాలు సహా దేనికైనా రెడీ అని సవాల్ విసిరారు. బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే పార్లమెంట్‌ను తప్పుదారి పట్టించారన్న బీఆర్ఎస్ ఎంపీలు, ఆయనపై చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చామన్నారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని వారు ఆరోపించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో గురువారం మధ్యాహ్నం బీఆర్ఎస్ ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్రలు మీడియాతో మాట్లాడుతూ, గత తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ సాయం లేకుండానే తెలంగాణ అభివృద్ధి జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని ఎన్నిసార్లు అడిగినా ఎలాంటి లాభం లేకపోయిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రధాని, హోంమంత్రిని కలిసి విన్నవించారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చులతో నిర్మించిందన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలో అడిగిన ప్రశ్నోత్తరాల్లోనే ఒప్పుకుందన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు, నవోదయ విద్యాలయాల మంజూరు విషయంలోనూ జరిగిన నష్టాన్ని అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో దేశం దృష్టికి తీసుకెళ్లామన్నారు. అంతేగాక కేంద్రానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పును మాఫీ చేయాలన్నారు. రేవంత్‌రెడ్డి రాజకీయంగా పోరాడాలే తప్ప లిక్కర్, నిక్కర్ అంటూ పిచ్చి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ల గురించి మాట్లాడేటప్పుడు రేవంత్ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. -
టీడీపీకి బీసీలు బైబై..! కారణం ఇదే..
నాడు: గత టీడీపీ ప్రభుత్వం బీసీలను రాజకీయాలకే వాడుకుంది. కేవలం ఓటు బ్యాంక్‌గానే ఉపయోగించుకుంది. చట్టసభల్లోగానీ, రాజకీయ పదవుల్లోగానీ తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా అణగదొక్కింది. నామమాత్రంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తూతూమంత్రంగా నిధులు విదిల్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే కూరలో కరివేపాకులా వాడుకుని పక్కనబెట్టింది. చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన అన్యాయం బీసీలకు బాగా అర్థమైంది. ఏళ్ల తరబడి మోస్తున్నా.. అడుగడుగునా అవమానాలే ఎదురవుతుండడంతో ఒక్కొక్కరుగా పార్టీని వీడుతూ బాబుకు బైబై చెప్పే పరిస్థితి వచ్చింది. నేడు: ‘బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు.. వారు సమాజానికి బ్యాక్ బోన్లాంటి వారు’ అని నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో ఉచ్ఛరిస్తూ వారికి అండదండగా నిలుస్తున్నారు. చట్టసభల్లో సైతం వారికి సముచిత స్థానం కల్పించారు. రిజర్వేషన్ల ప్రాతిపదికన రాజకీయ పదవులు కట్టబెట్టారు. కార్పొరేషన్లకు కావాల్సిన నిధులు సమకూర్చారు. ఆర్థిక అసమానతలు తొలగించేందుకు అనేక పథకాలు తీసుకొచ్చారు. బీసీల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి వేల కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలోనే పలువురు బీసీలు వైఎస్సార్సీపీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. గతంలో ఎప్పుడూ తమను ఇంతలా ఆదరించలేదని గొప్పగా చెప్పుకుంటున్నారు. సాక్షి, తిరుపతి: జిల్లాలోని బీసీ నాయకులు టీడీపీకి గుడ్‌బై చెబుతున్నారు. పార్టీలో సముచిత స్థానంలేక కొందరు.. బాబు సామాజికవర్గం దాడులకు భయపడి మరికొందరు.. చులకన చేసి మాట్లాడడంతో ఇంకొందరు రాజీనామాలు చేస్తున్నారు. ఆ పార్టీలో తగిన గుర్తింలేక ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మంచి పేరున్న వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం టీడీపీకి, పార్టీ ఇచ్చిన పదవికి రాజీనామా చేశారు. తాజాగా చిత్తూరుకు చెందిన బీసీ నాయకుడు, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి పి షణ్ముగం శుక్రవారం ఉదయం టీడీపీకి, తన పదవికి గుడ్‌బై చెప్పారు. ఇదివరకే చిత్తూరు నగర పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన మాపాక్షి మోహన్ టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బీసీలే అధికం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బీసీ సామాజికవర్గం వారే అధికం. మొత్తంగా 15 లక్షలకుపైగా ఓటర్లుండగా వీరిలో వన్నెకుల క్షత్రియ సామాజికవర్గానికి చెందిన ఓటర్లే సుమారు 40 శాతం ఉన్నారు. కుప్పం, నగరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో వన్నెకుల క్షత్రియ సామాజికవర్గం ఓట్లే కీలకం. అందుకే వారిలో ముఖ్యమైన కొందరిని ఎంపిక చేసుకుని టీడీపీ నేతలు ఇప్పటికీ ఎన్నికల వరకే వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దాడులు చేస్తూ.. చులకనగా చూస్తూ బాబు సామాజికవర్గం నేతలు బీసీలను చులకన చేయడం, పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పించకపోవడం వారిని మరింత కుంగదీస్తోంది. మరో వైపు దాడులకు తెగబడుతున్నట్లు బాధితలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరుకు చెందిన పీ షణ్ముగంపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు దాడిచేసినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే షణ్ముగం ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆ పార్టీ నాయకులే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఏకమవుతున్న బీసీలు టీడీపీలో బీసీలకు జరుగుతున్న అవమానాలను జీర్ణించుకోలేక ఆ సామాజికవర్గ నేతలంతా ఏకమవుతున్నారు. తిరుపతికి చెందిన డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం ఆధ్వర్యంలో వన్నెకుల క్షత్రియులతో పాటు మిగిలిన బీసీ సామాజికవర్గం నాయకులు, కార్యకర్త లు రోజూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ స మావేశాల్లో టీడీపీ చేసిన అన్యాయాలు, ఆగడాలను ఎండగడుతున్నారు. శివరాత్రితర్వాత ఉమ్మడి చిత్తూ రు జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీలు సమావేశం ఏర్పా టు చేసి కార్యాచరణ ప్రకటించనున్నట్టు సమాచారం. బీసీల సాధికారత ఎక్కడ? బీసీల సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. చంద్రబాబు పార్టీని లాక్కున్న తర్వాత ఆ లక్ష్యాన్ని నీరుగార్చారు. బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్నానని ప్రకటనలు చేసేవారే తప్ప క్షేత్రస్థాయిలో వారికి చేసింది శూన్యం. చంద్రబాబు హయాంలో బీసీలు దగాపడ్డారు. స్థానిక సంస్థల నుంచి పార్లమెంట్ అభ్యర్థి వరకు వారి సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారు. బీసీలను ఓట్ల కోసం వాడుకుని వదిలేశారు. టీడీపీలో ఎంత కష్టపడినా బీసీలకు న్యాయం, తగిన గౌరవం, గుర్తింపు లభించదు. 15 ఏళ్ల తన రాజకీయ జీవితంలో నన్ను నమ్మిన బీసీల కోసం నేను ఏమీ చేయలేకపోయాను. అందుకే టీడీపీకి రాజీనామా చేశాను. –డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, తిరుపతి బీసీలను అణగదొక్కేందుకు కుట్ర టీడీపీ కోసం కష్టపడ్డాను. 32 ఏళ్లుగా పార్టీని నమ్మాను. చంద్రబాబు, లోకేష్, ముఖ్యనాయకులు వస్తే వారి కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు అహర్నిశలు శ్రమించాను. అయితే పారీ్టలో నాకు తగిన గుర్తింపు ఇవ్వలేదు. మొన్న లోకేష్ పర్యటనలో పులివర్తి నాని నాపై దాడిచేసేందుకు వచ్చారు. ఈ విషయాన్ని లోకేష్‌కు ఫిర్యాదు చేశాను. నానిపై చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకే టీడీపీకి రాజీనామా చేశాను. చిత్తూరులో బీసీలను అణగదొక్కేందుకు కుట్రపన్నుతున్నారు. బీసీల దెబ్బ ఎలా ఉంటుందో టీడీపీ వారికి రుచిచూపిస్తాం. – పీ షణ్ముగం, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్, చిత్తూరు మొదలైన బుజ్జగింపుల పర్వం బీసీలు ఒక్కొక్కరుగా పార్టీని వీడితుండడంతో చంద్రబాబు దిద్దుబాటు చర్యలకు దిగారు. పలువురు మాజీ మంత్రులను బీసీ నాయకుల నివాసాలకు పంపుతున్నారు. చేసిన తప్పులను సరిదిద్దుతామని చెబుతున్నట్టు ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. అయితే టీడీపీకి ఇప్పటి వరకు చేసిన సేవలు చాలని, తమకు ఏ పార్టీ ప్రాధాన్యత కల్పిస్తుందో వారి వెంట నడుస్తామని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయాలు బయటకు రాకుండా ఉండేందుకు పార్టీకి రాజీనామా చేసిన వారిని టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధిష్టానం నుంచి లేఖలు విడుదల చేయడం గమనార్హం. చదవండి: రామోజీ దిగులు ‘ఈనాడు’ రాతల్లో కనపడుతోంది.. -
టీడీపీలో కల్లోలం.. కొనసాగుతున్న రాజీనామాల పర్వం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కైకలూరు నియోజకర్గ టీడీపీలో కల్లోలం రేగింది. ప్రస్తుతం ఇన్చార్జిగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ టీడీపీకి రాజీనామా చేసి అధికార వైఎస్సార్సీపీ తీర్ధం పుచ్చుకోనుండటంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. టీడీపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్న కేడర్ అధిష్టానాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శనస్త్రాలు సంధించింది. మరోవైపు ఇన్చార్జిగా ఎవరినైనా కొంతకాలం పెట్టి పార్టీని నడపడానికి సన్నాహాలు చేస్తున్నా, ఇన్చార్జి పదవికి ముఖ్యులంతా ముఖం చాటేస్తుండటంతో తెలుగుదేశం పార్టీ డైలామాలో పడింది. ఇప్పటికే టీడీపీ రాజీనామా చేసిన జయమంగళ వెంకటరమణ గురువారం వైఎస్సార్సీపీలో చేరనున్నారు. హడావుడిగా టీడీపీ నేతల భేటీ దాదాపు మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో జయమంగళ వెంకటరమణ క్రియాశీలకంగా కొనసాగుతున్నారు. బీసీ నేతగా నియోజకవర్గంలో పట్టు ఉండటంతో 1998లో కైకలూరు జెడ్పీటీసీగా గెలుపొందారు. అనంతరం 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో పార్టీ అంతర్గత వెన్నుపోట్లతో టికెట్ కోల్పోయారు. మళ్ళీ 2019లో చివరి నిమిషంలో టికెట్ ఇచ్చినా నియోజకవర్గంలో వెన్నుపోటు రాజకీయాలతో ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో అనేక హామీలు, పార్టీపరంగా రాజకీయ ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు పలు పర్యాయాలు చెప్పినప్పటికీ ఆయనను పూర్తిగా విస్మరించారు. దీంతో టీడీపీ తీరుపై విరక్తి చెంది పార్టీకి రాజీనామా ప్రకటించడంతో టీడీపీ అంతర్మథనంలో పడింది. బుధవారం హడావుడిగా నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని మాజీ ఎంపీ మాగంటి బాబు నివాసంలో ఏర్పాటు చేశారు. అది కాస్తా రసాభాసగా సాగింది. నేతలతో వాగ్వాదం: దీంతో కేడర్‌ను కాపాడుకోడానికి మాగంటి బాబు, ఏలూరు పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, బొర్రా చలమయ్యలు సమావేశానికి హాజరయ్యారు. ప్రారంభంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు జానీకి కనీసం వేదికపై చోటు ఇవ్వకపోవడంతో నిలదీశారు. అతనికి మద్దతుగా రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి జె.ఎస్.మాల్యాద్రి వేదికపై నాయకులను ప్రశ్నించారు. దీంతో గన్ని వీరాంజనేయులు సర్ధిచెప్పారు. సమావేశం అనంతరం జానీ, మాల్యాద్రిలు మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావుకు ఈ విషయాన్ని చెప్పారు. ఈ నేపధ్యంలో కమ్మిలి విఠల్, జానీ, మాల్యాద్రిల మధ్య మాటల యుద్ధం జరిగింది. పోటీ కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిక వైఎస్సార్సీపీలోకి చేరుతున్న జయమంగళ ప్రధాన అనుచరులను పొమ్మనలేక పొగబెడుతున్నారని జానీ, మల్యాద్రి మండిపడ్డారు. ఇన్నాళ్లు పార్టీ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తే ఇప్పుడు గెంటేయడానికి ప్రయత్ని స్తున్నారన్నారు. ఇలాగైతే టీడీపీలో విడిగా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు మాట్లాడుతూ.. మీది నాతో మాట్లాడే స్థాయి కాదని, నా మాటలను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావుతో వాగ్వాదానికి దిగిన టీడీపీ నేతలు జానీ, మాల్యాద్రి కొనసాగుతున్న రాజీనామాల పర్వం తెలుగుదేశం పార్టీకి కైకలూరు నియోజకవర్గంలో కాలం చెల్లే పరిస్థితి దాపరించింది. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ టీడీపీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ పారీ్టకి రాజీనామా చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నాయకత్వంలో పనిచేస్తానని మంగళవారం ప్రకటించిన విషయం విధితమే. అదే బాటలో టీడీపీ రైతు అధికార ప్రతినిధి సయ్యపురాజు గుర్రాజు పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చంద్రబాబుకు లేఖ పంపారు. జయమంగళతో పాటు వైఎస్సార్సీపీలోకి వెళుతున్నట్లు స్థానికలతో చెప్పారు. గుర్రాజు బాటలోనే మరికొందరు నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలోకి త్వరలో రానున్నట్లు సమాచారం. డీఎన్నార్‌ను కలిసిన జయమంగళ వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా కృషి చేస్తానని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ స్పష్టం చేశారు. కైకలూరులో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్)ను బుధవారం ఆయన మర్వాదపూర్వకంగా కలిశారు. డీఎన్నార్‌కు జయమంగళ పూలమాల వేసి ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. ముందుగా డీఎన్నార్ మాట్లాడుతూ జయమంగళ వెంకటరమణ టీడీపీ పాలనలో అణచివేతకు గురైన బీసీ నాయకుడన్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి సీఎం జగన్ మోహన్‌రెడ్డికి జయమంగళ పేరును ఎమ్మెల్సీగా సూచించామన్నారు. కొల్లేరు అభివృద్ధికి సీఎం జగన్ చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. జయమంగళ రాకతో కొల్లేరు ప్రజలకు మరింత చేరువగా పథకాలను అందిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే జయమంగళ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు మాట విని టిక్కెట్టును కామినేని శ్రీనివాస్‌కు త్యాగం చేశానన్నారు. తనకు మొదటి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పిన చంద్రబాబు మోసం చేశారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి కొల్లేరు కాంటూరు కుదింపుపై అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు. నేడు సీఎం జగన్ కొల్లేరు రీసర్వే, రెగ్యులేటర్ల నిర్మాణం, పెద్దింట్లమ్మ వారధి నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. భవిష్యత్తులో డీఎన్నార్ భారీ మెజారి్టఈతో ఎమ్మెల్యేగా విజయం సాధించడానికి కృషి చేస్తానని చెప్పారు. కొల్లేరులంక గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ప్రజల్లోకి వైఎస్సార్సీపీ చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తానని చెప్పారు. గురువారం మధ్యాహ్నం సీఎం జగన్ మోహన్‌రెడ్డిని కలిసి ఆయన సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు జయమంగళ తెలిపారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే డీఎన్నార్ కుమారులు వినయ్, శ్యామ్‌కుమార్, టీడీపీకి రాజీనామా చేసిన రాష్ట్ర నాయకుడు సయ్యపురాజు గుర్రాజు ఉన్నారు. -
Meghalaya: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఐదుగురు ఎమ్మెల్యేల రాజీనామా
అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో మేఘాలయలో అయిదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. బుధవారం తమ రాజీనామాను గవర్నరకు సమర్పించి యూనైటెడ్ డెమోక్రటిక్ పార్టీలో(యూడీపీ) చేరేందుకు సిద్ధమయ్యారు. రాజీనామా చేసిన వారిలో కేబినెట్ మంత్రి హిల్ స్టేట్ పిపుల్ డెమోక్రటిక్ పార్టీ(హెచ్ఎస్పీడీపీ) ఎమ్మెల్యే రెనిక్టన్ లింగ్డో టోంగ్కార్, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే షిత్లాంగ్ పాలే, సస్పెండెడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మైరల్బోర్న్ సియోమ్, పిటి సాక్మీతో పాటు ఓ స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. అయితే ఈ పరిణామంతో రాష్ట్రంలో కాంగ్రెస్, హెచ్ఎస్పీడీపీ పార్టీలకు ఎమ్మెల్యేలు లేకుండా పోయారు. కాగా మేఘాలయలో ఈమధ్య కాలంలో పార్టీ ఫిరాయింపులు అధికమయ్యాయి. ఇప్పటి వరకు దాదాపు 18 మంది శాసనసభ్యులు సంబంధిత పార్టీలకు రాజీనామాలు సమర్పించారు. ఇదిలా ఉండగా మార్చి 15తో మేఘాలయ 11వ అసెంబ్లీ కాలం ముగియనుంది. ఈ క్రమంలో మూడు ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ ప్రకటించనుంది. ఇక మేఘాలయ డెమోక్రటిక్ అలయెన్స్ పేరుతో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన బీజేపీ ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. దీనికితోడు తాము కూడా ఈసారి ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్లు నేషనల్ పీపుల్స్ పార్టీ పేర్కొంది. 60 అసెంబ్లీ స్థానాలున్న మేఘాలయలో మెజార్టీ మార్కును దాటగలమని ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా 2018లో ఎన్సీపీ (20), యూడీపీ (8), పీడీఎఫ్ (4), హెచ్ఎస్పీడీపీ (2), బీజేపీ (2), ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి(మొత్తం 39) సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. నేషనల్ పీపుల్స్ పార్టీ అధినేత కాన్రాడ్ సంగ్మా ప్రస్తుతం మేఘాలయ సీఎంగా ఉన్నారు. చదవండి: ట్రైన్లో గర్భిణీకి పురిటి నొప్పులు.. ప్రసవం చేసిన హిజ్రాలు. -
ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ ఆఫీసులు మూసివేత
-
ఎలాన్ మస్క్‌కు భారీ ఝలక్.. ఇప్పుడేం చేస్తావ్!
టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విటర్‌ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి ఆ సంస్థలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఖర్చుని తగ్గించడం కోసం మస్క్ ట్విటర్ సిబ్బందిని తగ్గిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వందలాది మంది ఉద్యోగులు తమకీ పని వద్దురా బాబో అంటూ రాజీనామా చేసినట్లు సీఎన్‌బీసీ తన నివేదికలో తెలిపింది. ట్విటర్లో ఏం జరుగుతోంది.. ట్విటర్‌కు సీఈఓ బాధ్యతలు చేపట్టిన ఎలాన్ మస్క్ సంస్థలో భారీ మార్పులకు పూనుకున్నాడు. పైగా ఇటీవల ఉద్యోగులతో జరిపిన సమావేశంలో మస్క్ మాట్లాడుతూ.. ఉద్యోగులంతా ఎక్కువ గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ఫ్రీ ఫుడ్ తొలగింపు, ఉద్యోగుల పనితీరును బట్టి సంస్థలు అందించే ప్రోత్సాహకాల తగ్గింపు, వర్క్ ఫ్రమ్ హోమ్‌ను రద్దు చేస్తున్నట్లు తెగేసి చెప్పారు. సంస్థ దివాలా తీసే పరిస్థితిలో ఉందంటూ సిబ్బందిలో మార్పు రాకపోతే తొలగింపులు తప్పవని స్పష్టం చేశారు. నివేదికల ప్రకారం.. ట్విటర్ బాస్ జారీ చేసిన అల్టిమేటంకు సంస్థలోని ఇంజనీర్లతో సహా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో రాజీనామ చేశారు. అయితే అనుహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో ట్విట్టర్ సోమవారం వరకు ఆ ప్రాంతంలోని తన కార్యాలయాలను మూసివేసింది. మరో వైపు, సామూహిక రాజీనామాలో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారన్న వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ముగ్గురు ట్విటర్ ఉద్యోగులు తాము కంపెనీకి వీడ్కోలు పలుకుతున్నట్లు పంచుకున్నారు. చదవండి: త్వరలోనే తప్పుకుంటా, అమెరికా కోర్టులో మస్క్ సంచలన ప్రకటన -
జాబ్‌కు రిజైన్ చేస్తున్నారా? ఆ పని మాత్రం చేయకండి! ఎందుకంటే?
ఉదయం తొమ్మిదింటికల్లా తయారై టిఫిన్ బాక్సు సర్దుకుని ఆఫీసుకు బయల్దేరడం. రాత్రికల్లా ఉసూరంటూ ఇల్లు చేరడం. కుటుంబీకులతో గడపాలన్నా, పెళ్లిళ్ల వంటి వాటికి వెళ్లాలన్నా సెలవు రోజుల్లోనే! ఇదంతా ఒకప్పటి ఉద్యోగి జీవితం. కానీ కరోనాతో అంతా మారిపోయింది. ఇంటినుంచే పని. నచ్చిన ఉద్యోగం. కావాల్సినంత జీతం. ఇంతకంటే ఏం కావాలి’ అంటూ చేస్తున్న ఉద్యోగాలకు ఉన్న పళంగా రాజీనామాలు (ది గ్రేట్ రిజిగ్నేషన్) చేసి కొత్త ఉద్యోగాలు వెతుక్కున్నారు. ఫలితం? ఉద్యోగులు ఊహించింది వేరు. అక్కడ జరుగుతుంది వేరంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. బ్యూరో ఆఫ్ లేబర్ గణాంకాల ప్రకారం.. గతేడాది అమెరికాకు చెందిన 4.7 కోట్ల మంది ఉద్యోగాలు మారారు. ఈ ఏడాది ఒక్క మార్చిలోనే ఏకంగా 45 లక్షల మంది ఉద్యోగాలు మానేశారు. మన దేశంలోనూ ఐటీ, టెలికాం రంగాల్లో ఏకంగా 86 శాతం మంది ఉద్యోగం మారాలనుకుంటున్నారని మైకెల్ పేజ్ సర్వేలో తేలింది! 2022 మార్చి త్రైమాసికంలో టీసీఎస్ కంపెనీలో 17.4 శాతం, హెచ్‌సీఎల్‌లో 21.9 శాతం, విప్రోలో 27.7 శాతం మంది ఉద్యోగులు మానేశారు! నచ్చిన పనివిధానం కోసం జీతం తక్కువైనా, ప్రమోషన్లు లేకున్నా పర్లేదని మన దేశంలో ఏకంగా 61 శాతం మంది ఉద్యోగులు కోరుకుంటున్నారట! చదవండి👉 ‘ట్విటర్లో నా ఉద్యోగం ఊడింది’, 25 ఏళ్ల యశ్ అగర్వాల్ ట్వీట్ వైరల్ అయితే తాజాగా ఉద్యోగుల రిజైన్లపై ఇండీడ్ హైరింగ్ ల్యాబ్ ఎకనామిక్స్ రీసెర్చ్ డైరెక్టర్ నిక్ బంక్ స్పందించారు. నచ్చిన పనిగంటలు, ఎక్కువ జీతం కోసం ఆశపడి ఉద్యోగాలకు రాజీనామాలు చేసిన ఉద్యోగులు అసంతృప్తిలో ఉన్నట్లు తెలిపారు. ఎందుకంటే? ఈ ఏడాది జులైలో రిజైన్ చేసి వేరే సంస్థలో చేరిన ఉద్యోగి జీతం వృద్ధి 8.5శాతంగా ఉంది. కానీ మూడు నెలలు తిరక్కుండా ఉద్యోగుల శాలరీ వృద్ధి రేటు గణనీయంగా పడిపోయింది. ఆగస్ట్‌లో శాలరీ వృద్ధి రేటు ఆగస్ట్‌లో 8.4శాతం, సెప్టెంబర్‌లో 7.9శాతం, అక్టోబర్‌లో 7.6శాతం, నవంబర్‌లో 6.4శాతం కంటే ఎక్కువగా ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. తొందరపడకండి మరోవైపు గ్లాస్‌డోర్ ఎకనమిస్ట్ డేనియల్ జావో మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో దిగ్రేట్ రిజిగ్నేషన్ అంశం ముగియలేదు. జాబ్ మార్కెట్లో ఉద్యోగాల రాజీనామా సంఖ్య ఎక్కువగానే ఉంది. కానీ ఆర్ధిక మాద్యం ముప్పు కారణంగా తగ్గే అవకాశం ఉంది. ఇక జాబ్ మారే ఉద్యోగులు ఇంతకు ముందులా..మాకు ఇంత శాలరీ కావాలని డిమాండ్ చేయడం సాధ్యం కాదన్నారు. అందుకే ఉద్యోగులు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిదని అన్నారు. వచ్చే ఏడాది వచ్చే ఏడాది ఉద్యోగులపై ఆర్ధిక మాంద్యం ప్రభావం తక్కువే. అయినప్పటికీ ఉద్యోగం చేస్తున్న వారు. లేదంటే ఉద్యోగం మారాలని ప్రయత్నిస్తున్న వారికి 2023 కొంచెం గడ్డు కాలమని అని అన్నారు. జాబ్ సెక్యూరిటీ, జీతాల నెగోషియేషన్లు ఉద్యోగికి సంతృప్తిని ఇవ్వకపోవచ్చని తెలిపారు. చదవండి👉 వేలాది మంది ఉద్యోగుల తొలగింపు, ‘యాపిల్ సంస్థను అమ్మేయండి’! -
Twitter layoffs: ఉద్వాసన తప్ప దారి లేదు: మస్క్
న్యూయార్క్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలో భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్లో పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. సంస్థను ప్రక్షాళన చేసే పనిలో మస్క్ నిమగ్నమయ్యారు. సంస్థకు రోజూ 4 మిలియన్ డాలర్ల (రూ.32.79 కోట్లు) నష్టం వస్తోందని మస్క్ శనివారం ట్వీట్ చేశారు. అందుకే ఉద్యోగుల సంఖ్య తగ్గించుకోవాలని నిర్ణయించామని తెలిపారు. రాజీనామా చేసేవారికి 3 నెలల ప్యాకేజీ ఇస్తున్నామని, పట్టప్రకారం ఇవ్వాల్సిన దానికంటే ఇది 50 శాతం ఎక్కువ అని చెప్పారు. ట్విట్టర్‌ను మస్క్ గత నెలలో 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సంస్థలో నిత్యం వందలాది మందికి పింక్ స్లిప్పులు అందుతున్నాయి. భారత్‌లో 200 మందికి పైగా ఉద్యోగులను ట్విట్టర్ తొలగించింది. ఇంజనీరింగ్, సేల్స్, మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ తదితర విభాగాల్లో లేఆఫ్‌లు అమలు చేస్తోంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో పలువురు ట్విట్టర్ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. ట్విట్టర్ యజమాన్యం కార్మిక చట్టాలను ఉల్లంఘింస్తోందని, చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. -
ఈ నిర్ణయం ఘోర తప్పిదం...రిషి సునాక్‌పై విమర్శలు!
లండన్: బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ ఉన్నప్పుడూ హోం సెక్రటరీగా ఉన్న సుయోల్లా బ్రేవర్ మాన్ భద్రతా ఉల్లంఘనల విషయమై పదవి నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. బ్రేవర్ మాన్ రాజీనామ చేసిన కొద్దిరోజుల్లోనే లిజ్ ట్రస్ కూడా అనుహ్యాంగా ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐతే ఇప్పుడు బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్ మళ్లీ సుయోల్లా బ్రేవర్‌మాన్‌ని తిరిగి హోమంత్రిగా నియమించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని సునాక్ తీసుకున్న అతిపెద్ద తప్పుడు నిర్ణయంగా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. భద్రతా నియమావళిని ఉల్లంఘించిన ఒక మంత్రి మళ్లీ తిరిగి నియమించడం బాధ్యతారహితమైన నిర్ణయం అంటూ రిషిపై వ్యతిరేకత వెల్లువెత్తింది. మరోవైపు లేబర్ నాయకుడు కైర్ స్టార్మర్, కూపర్లు కూడా ఆమెని తొలగించాలని పట్టుపట్టారు. బ్రేవర్ మాన్ అత్యంత మితవాద టోరీ ఎంపీలకు ప్రాతినిథ్యం వహిస్తుందంటూ ఆరోపణలు చేశారు. ఆమె యూకేకు అక్రమంగా వచ్చిన వలసదారులను రువాండ్కు పంపించేందుకు మద్దతు ఇచ్చిందంటూ ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అదీగాక ఆమె ఒక ప్రైవేట్ ఇ-మెయిల్‌కు సెన్సిటివ్ డాక్యుమెంట్‌ని పంపించిన వివాదాన్ని ఎదుర్కొంటోంది. అలాంటి ఆమెను దేశీయ భద్రతా సమస్యలకు బాధ్యత వహించే ప్రముఖ స్థానానికి మళ్లీ తిరిగి నియమించడంపై బ్రిటన్ అంతటా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు రిషి సునాక్ కూడా ఆ వివాదానికి పూర్తి బాధ్యత వహించాల్సిందేనని అంటున్నారు. (చదవండి: బ్రిటన్ మాజీ ప్రధాని ఫోన్ హ్యాక్ చేసిన పుతిన్ ఏజెంట్లు.. రష్యా చేతికి కీలక రహస్యాలు!) -
ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ రవి కుమార్ ఎస్ రాజీనామా
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ రవి కుమార్ ఎస్ రాజీనామా చేశారు. అయితే, ఇందుకు గల కారణాలను కంపెనీ వెల్లడించలేదు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇన్ఫోసిస్ గ్లోబల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ విభాగానికి ఆయన సారథ్యం వహించారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో న్యూక్లియర్ సైంటిస్టుగా కెరియర్ ప్రారంభించిన రవి కుమార్ 2002లో ఇన్ఫీలో చేరారు. 2016లో ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 2017లో డిప్యుటీ సీవోవోగా నియమితులైన రవి .. ఆ తర్వాత సీవోవోగా పదోన్నతి పొందుతారనే అంచనాలు ఉండేవి. అయితే, అప్పటి సీవోవో యూబీ ప్రవీణ్ రావు రిటైర్మెంట్ తర్వాత ఇన్ఫీ ఆ పోస్టునే తీసివేసింది. -
పదాధికారులు ప్రచారంలో పాల్గొనొద్దు
న్యూఢిల్లీ: రెండు వారాల్లో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమంలో పాటించాల్సిన నియమాలను కాంగ్రెస్ పార్టీ వెలువరించింది. ‘ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయాలనుకుంటే ముందుగా పదాధికారులు(ఆఫీస్ బేరర్లు) తమ పదవికి రాజీనామా చేయాలి. పార్టీ ప్రతినిధులు(డెలిగేట్స్) తమకు నచ్చిన అభ్యర్థికి బ్యాలెట్ పేపర్ విధానంలో ఓటు వేయవచ్చు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జ్‌లు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, పార్టీలో పలు విభాగాల అధ్యక్షులు, పార్టీ సెల్స్‌లో ఉన్న వారు, అధికార ప్రతినిధులు... అభ్యర్థికి అనుకూలంగా/వ్యతిరేకంగా ప్రచారం చేయకూడదు. ప్రచారం చేయాలనుకుంటే ముందుగా పార్టీలో మీ పదవికి రాజీనామా చేయండి’ అని పార్టీ కేంద్ర ఎన్నికల ప్రాధికార విభాగం మార్గదర్శకాల్లో పేర్కొంది. అభ్యర్థులు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నపుడు ఆయా రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు మర్యాదపూర్వకంగా కలవవచ్చని స్పష్టంచేసింది. ‘ప్రచారానికి సంబంధించిన సమావేశ మందిరాలు, చైర్లు, ప్రచార ఉపకరణాలు సమకూర్చవచ్చు. డెలిగేట్స్‌ను ఓటింగ్ స్థలానికి వాహనాల్లో తరలించకూడదు. మార్గదర్శకాలను మీరితే చర్యలు తప్పవు’ అని పార్టీ పేర్కొంది. -
‘కొలువుకు టాటా’.. ప్రపంచవ్యాప్తంగా రాజీనామాల ట్రెండ్
ప్రపంచాన్ని గడగడలాడించి 65 లక్షల మందిని కబళించిన కరోనా దిగ్గజ కంపెనీలకూ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కోవిడ్ విజృంభన మొదలైనప్పటి నుంచీ లక్షల మంది ఉద్యోగాలు మానేస్తున్నారు. ప్రపంచమంతటా ఇదే ట్రెండ్ నడుస్తోంది. కరోనా కల్లోలం సద్దుమణిగినా రాజీనామాల జోరు మాత్రం తగ్గడం లేదు. గత ఫిబ్రవరి– ఏప్రిల్ మధ్య అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇండియా, సింగపూర్లలో 13,382 మంది ఉద్యోగులపై మెకిన్సే సర్వే చేసింది. రాజీనామాలకు కారణాలతో పాటు ఏం చేస్తే ఉద్యోగం మానకుండా ఉంటారో తెలుసుకోవడం దీని ఉద్దేశం. కనీసం 40 శాతం మంది తమ ఉద్యోగం పట్ల అసంతృప్తితో ఉన్నట్టు తేలింది. వీరంతా మూడు నుంచి ఆర్నెల్లలో రాజీనామా యోచనలో ఉన్నారట. చేస్తున్న ఉద్యోగం కంటే మెరుగైన, మరింత తృప్తినిచ్చే పనులు చేయాలని కోరుకుంటున్నారట. ఎదుగుదలకు అవకాశాల్లేక మానేసినట్టు 41 శాతం మంది చెప్పారు. మొత్తమ్మీద ఆశించిన వేతనం, ఇతరత్రా తగినన్ని లాభాలు లేకపోవడం రాజీనామాలకు ప్రధాన కారణమని సర్వే తేల్చింది. ఈ ఏడాదిలో ఒక్క అమెరికాలోనే ఇప్పటిదాకా దాదాపు 40 లక్షల మంది ఉద్యోగాలు మానేసినట్లు తేలింది. 2022 అంతా ఇదే ట్రెండ్ కొనసాగొచ్చన్నది నిపుణుల అంచనా. ఇందుకు కరోనా కొంతవరకే కారణమని మెకిన్సే నివేదికను సిద్ధం చేసిన వారిలో ఒకరైన బోనీ డౌలింగ్ అన్నారు. ‘‘ఉద్యోగమనే భావనే సమూలంగా మారుతున్న వైనం కొన్నాళ్లుగా స్పష్టంగా కన్పిస్తోంది. జీవితంలో ప్రాథమ్యాల విషయంలో ఆలోచనా శైలిలోనే మార్పు కనిపిస్తోంది. ఏ ఉద్యోగం చేసినా తమకు నచ్చినట్లు ఉండాలని ఆశిస్తున్నారు’’ అని వివరించారు. ఉద్యోగుల మార్కెట్ ఇప్పుడిప్పుడే కరోనా ముందునాటి స్థితికి చేరుకోవడం కష్టమేనన్నారు. నచ్చని రంగాలకు గుడ్‌బై... కరోనా తరువాత రాజీనామా చేసిన వాళ్లలో సగం ఇతర రంగాలకు మళ్లుతున్నట్లు మెకిన్సే చెబుతోంది. సర్వేలో భాగంగా గత రెండేళ్లలో ఉద్యోగాలు మానేసిన ఐటీ, ఫార్మా, హాస్పిటాలిటీ, నర్సింగ్ రంగాలకు చెందిన 2,800 మందిని ఇందుకోసం ప్రత్యేకంగా ప్రశ్నించింది. వీరిలో 48 శాతం ఇతర రంగాల్లో అవకాశాలను వెతుక్కుంటున్నట్లు తేలింది. ‘‘కరోనా వేళ విపరీతమైన ఒత్తిడికి గురై శక్తివిహీనంగా మారిపోయిన భావన తట్టుకోలేక పలువురు ఉద్యోగాలు మానేశారు. ఉన్న రంగంలో మెరుగైన ఆదాయం కష్టమని కొందరు ఇతర రంగాల వైపు మళ్లారు. రిటైల్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల్లో మానేసిన వారిలో ఏకంగా 60 శాతం రంగం మారడమో, పూర్తిగా మానేయడమో చేశార’’ని తేల్చింది. భారత్‌లోనూ... భారత ఐటీ కంపెనీల్లో ఈ ఏడాది వేలకొద్ది రాజీనామాలు జరిగాయి. గత ఏప్రిల్– జూన్ మధ్య కాలంలో ఇన్ఫోసిస్‌కు ఏకంగా 28.4 శాతం మంది రాజీనామా చేశారు. తర్వాత స్థానాల్లో విప్రో (23.3), టెక్ మహీంద్రా (22), టీసీఎస్ (19.7) ఉన్నాయి. ‘‘ఒకే కంపెనీలో మూడేళ్ల కంటే ఎక్కువ ఉంటే ఎదుగుదలకు అవకాశాలు బాగా తగ్గుతున్నాయి. కెరీర్ కోసం అవసరమైతే ఏడాదిలో రెండు ఉద్యోగాలు కూడా మారతాం’’ అని ఓ ఐటీ కంపెనీలో సీనియర్ మేనేజర్ రఘురామ మంచినేని అన్నారు. భారత ఐటీ పరిశ్రమలో ఉద్యోగులు భారీగా ఉండటమూ రాజీనామాలకు ఓ కారణమని ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ టి.వి.మోహన్‌దాస్ పాయ్ అభిప్రాయపడ్డారు. ‘‘వాళ్లంతా పెద్ద కంపెనీల్లో చేరి కెరీర్‌ను నిర్మించుకోవాలని కోరుకుంటున్నారు’’అని సాక్షి ప్రతినిధితో అన్నారు. స్వయం ఉపాధే బెటర్... మరో ఉద్యోగం చూసుకోకుండానే రాజీనామా చేసిన వారిలో 29 శాతమే మళ్లీ సంప్రదాయ కొలువుల్లో చేరారు. మిగతా వారిలో చాలామంది సొంత వ్యాపారాలకు మొగ్గారు. కొందరు పార్ట్‌టైం కొలువులకు జై కొట్టారు. కరోనా సమయంలో అమెరికాలో సొంత వ్యాపారాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 30 శాతం పెరిగిందట. 2021లోనే 54 లక్షల దరఖాస్తులు వచ్చాయని వైట్‌హౌస్ వెల్లడించింది. మనోళ్లు అక్కడలా... అమెరికాలోని భారత సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోం కాసులు కురిపించింది. ఓవైపు వేలాది మంది రాజీనామాలు చేస్తుంటే మనవాళ్లేమో ఫుల్ టైం కొలువుకు తోడు రెండు, మూడు కాంట్రాక్టు ఉద్యోగాలు కూడా చేశారు. ఇది వారికీ, అటు ఉద్యోగుల కొరతతో అల్లాడిన పలు కంపెనీలకూ కలిసొచ్చింది. కానీ యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ఇకపై వారానికి కనీసం 3 రోజులు విధిగా ఆఫీసుకు రావడం తప్పనిసరి చేయడంతో చాలామంది పార్ట్ టైం కొలువులకు స్వస్తి పలకాల్సి వస్తోంది. - కంచర్ల యాదగిరిరెడ్డి -
కాంగ్రెస్‌కు ఆజాద్ గుడ్‌బై
సాక్షి, న్యూఢిల్లీ: వరుస పరాజయాలు, నేతల నిష్క్రమణతో నీరసించిన కాంగ్రెస్‌కు మరో భారీ షాక్. గాంధీల కుటుంబానికి విధేయుడైన సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ (73) కాంగ్రెస్‌ను వీడారు. పార్టీతో ఐదు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్నారు. అన్ని పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. రాహుల్‌గాంధీపై ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు. ఇప్పటిదాకా పార్టీ వీడిన ఏ నాయకుడూ చేయని రీతిలో తీవ్ర విమర్శలు చేశారు. ‘‘రాహుల్‌వి పిల్ల చేష్టలు. సీనియర్లను గౌరవించని తత్వం’’ అంటూ దుయ్యబట్టారు. అలాంటి అపరిపక్వ వ్యక్తి నాయకత్వంలో పనిచేయలేనంటూ అధినేత్రి సోనియాగాంధీకి ఐదు పేజీల లేఖ రాశారు. ‘‘పార్టీలో సంప్రదింపుల యంత్రాంగాన్ని రాహుల్ పూర్తిగా కుప్పకూల్చారు. ప్రశ్నించిన సీనియర్లపై కోటరీతో వ్యక్తిగత దాడి చేయించారు. శవయాత్రలు చేయించారు. పార్టీని అన్నివిధాలుగా పతనావస్థకు చేర్చారు. ఏమాత్రం సీరియస్‌నెస్ లేని అలాంటి వ్యక్తికే పగ్గాలిచ్చేందుకు నాయకత్వం ఎనిమిదేళ్లుగా విఫలయత్నం చేస్తూ వచ్చింది. తద్వారా జాతీయ స్థాయిలో బీజేపీని, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను చేజేతులారా అందలమెక్కించింది’’ అని ఆరోపించారు. అందుకే బరువెక్కిన హృదయంతో పార్టీతో నా 50 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చానన్నారు. భారత్ జోడో యాత్ర ప్రారంభించడానికి ముందు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ జోడో అంటూ కార్యాచరణ చేపట్టాలని సూచించారు. కాంగ్రెస్‌లో అసమ్మతి నేతలతో కూడిన జీ23 గ్రూప్‌లో ఆజాద్ కీలక నేతగా వ్యవహరించడం, పార్టీ తీరును కొన్నేళ్లుగా విమర్శిస్తూ ఉండటం తెలిసిందే. ఆయన రాజీనామాను దురదృష్టకరంగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. బీజేపీతో పోరు కీలక దశకు చేరిన సమయంలో ఇలా చేయడం దారుణమంటూ వాపోయింది. ఆజాద్ డీఎన్ఏ ‘మోడీ’ఫై అయిందంటూ దుయ్యబట్టింది. ఏడాది కాలంలో దాదాపు15 మంది దాకా నేతలు కాంగ్రెస్‌ను వీడారు! రాహుల్ రాకతో సర్వం నాశనం సోనియాకు రాసిన లేఖలో రాహుల్ తీరును ఆజాద్ తూర్పారబట్టారు. ‘‘పార్టీ అధినేత్రిగా కేంద్రంలో యూపీఏ1, 2 ప్రభుత్వాల ఏర్పాటులో మీరు కీలక పాత్ర పోషించారు. సీనియర్ల సలహాలను పాటించడం, వారి తీర్పును విశ్వసించడం, వారికి అధికారాలప్పగించడం అందుకు ప్రధాన కారణాలు. దురదృష్టవశాత్తు 2013లో రాహుల్ ఉపాధ్యక్షుడయ్యాక పార్టీలో సంప్రదింపుల యంత్రాంగాన్నే కుప్పకూల్చారు. సీనియర్లు, అనుభవజ్ఞులైన నాయకులందరినీ పక్కన పెట్టారు. ఏ అనుభవమూ లేని కొత్త కోటరీయే పార్టీ వ్యవహారాలను నడుపుతోంది. కాంగ్రెస్ కోర్ గ్రూప్‌లో పొందుపరిచి, కేంద్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించి, రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేసిన ఆర్డినెన్స్‌ను రాహుల్ మీడియా ముందు చించిపారేశారు. ఇలాంటి చిన్నపిల్లల ప్రవర్తన వల్లే 2014లో అధికారానికి దూరమయ్యాం. ముందు సోనియా, తర్వాత రాహుల్ నాయకత్వంలో 2014–22 మధ్య 49 అసెంబ్లీ ఎన్నికలకు గాను ఏకంగా 39సార్లు ఘోరంగా ఓడిపోయాం. వరుసగా రెండు లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవం పాలయ్యాం. పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యవర్గ సభ్యునిగా నేనిచ్చిన ప్రతిపాదనలన్నీ స్టోర్ రూమ్‌కే పరిమితమయ్యాయి. 2013 జైపూర్ చింతన్‌శిబిర్‌లో పార్టీ పునరుజ్జీవం కోసం చేసిన సిఫార్సులదీ తొమ్మిదేళ్లుగా అదే గతి! రాహుల్‌కు వ్యక్తిగతంగా పదేపదే గుర్తు చేసినా వాటిని పట్టించుకోలేదు. పార్టీని గాడిలో పెట్టేందుకు 23మంది సీనియర్లం లేఖలు రాస్తే రాహుల్ కోటరీ నేతలు మాపై వ్యక్తిగత దాడి చేసి అవమానించారు. కోటరీ ఆదేశాల మేరకు జమ్మూలో నా శవయాత్ర చేశారు. ఇంకో సీనియర్ ఇంటిపైకి గూండాలను పంపారు. వారిని రాహుల్ వ్యక్తిగతంగా సన్మానించారు’’ అని ఆరోపించారు. రిమోట్ కంట్రోల్ మోడల్ ద్వారా యూపీఏ ప్రభుత్వ సమగ్రతను కుప్పకూల్చారంటూ సోనియాపైనా ఆజాద్ విమర్శలు గుప్పించారు. ‘‘మన ఓటమికి కారణమైన అదే మోడల్‌ను పార్టీకీ వర్తింపజేసి రాహుల్ సర్వనాశనం చేశారు. కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రహసనం, బూటకం. దేశవ్యాప్తంగా ఎక్కడా ఏ స్ధాయిలోనూ ఎన్నికలు జరగలేదు. ఏఐసీసీ కార్యాలయంలో కూర్చున్న కోటరీ తయారు చేసిన కమిటీ జాబితాలపై సంతకం చేయాల్సిందిగా బలవంతపెట్టారు’’ అంటూ దుయ్యబట్టారు. కోటరీ గుప్పెట్లో బందీ కోటరీ గుప్పెట్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బందీ అయిందని ఆజాద్ ఆరోపించారు. ‘‘తద్వారా పోరాట పటిమను, కాంక్షను పూర్తిగా కోల్పోయింది. పుంజుకునే అవకాశమే లేనంతగా పతనావస్థకు చేరింది. ఇప్పుడు కూడా అసమర్థులకు పగ్గాలు అప్పగించే ఫార్సు మొదలవబోతోంది’’ అని కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ఉద్దేశించి ఆరోపించారు. ‘‘ఇదీ విఫల ప్రయోగంగా మిగిలిపోతుంది. ఎందుకంటే మళ్లీ ఓ కీలుబొమ్మనే గద్దెనెక్కిస్తారు’’ అన్నారు. స్వాతంత్య్రం అమృతోత్సవాల వేళ పార్టీకి ఇంతటి దురవస్థ ఎందుకు ప్రాప్తించిందో ఏఐసీసీ నాయకత్వం తనను తాను ప్రశ్నించుకోవాలని సూచించారు. తను, తన సహచరులం జీవితాంతం నమ్మిన విలువల కోసం కృషి చేస్తామని చెప్పారు. కపిల్ సిబల్, అశ్వనీకుమార్ తదితర నేతలు కాంగ్రెస్‌ను వీడటం తెలిసిందే. రాహుల్‌పై ఆజాద్ ఆరోపణలు... ► రాహుల్ ఏ మాత్రం పరిపక్వత లేని వ్యక్తి. అన్నీ పిల్లచేష్టలే. ఆయన రంగప్రవేశంతో, ముఖ్యంగా 2013లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడయ్యాక పార్టీ సర్వనాశనమైంది. ► అనుభవజ్ఞులైన సీనియర్లందరినీ రాహుల్ పక్కన పెట్టారు. తొత్తులతో కూడిన కోటరీ ద్వారా పార్టీని నడుపుతూ భ్రష్టు పట్టించారు. ► సోనియా పేరుకే పార్టీ చీఫ్. ముఖ్య నిర్ణయాలన్నీ రాహుల్‌వే. కొన్నిసార్లు ఆయన సెక్యూరిటీ గార్డులు, పీఏలూ నిర్ణయాలు తీసేసుకుంటున్న దారుణ పరిస్థితి నెలకొంది! ► ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను మీడియా సాక్షిగా చించేయడం రాహుల్ అపరిపకత్వకు పరాకాష్ట. ప్రధాని అధికారాన్ని పూర్తిగా పార్టీ ముందు మోకరిల్లేలా చేసిన ఈ పిల్లచేష్టే 2014 లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏ ఘోర ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. ► కాంగ్రెస్‌ను పూర్తిగా చెప్పుచేతల్లో పెట్టుకునే క్రమంలో రాహుల్ నేతృత్వంలోని చెంచాల బృందం పార్టీకి చెప్పలేనంత ద్రోహం తలపెట్టింది. జాతీయోద్యమానికి నాయకత్వం వహించి దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టిన పార్టీ వారివల్లే ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. ► 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత సారథ్య బాధ్యతల నుంచి తప్పుకునే ముందు పార్టీ కోసం జీవితాలను ధారపోసిన సీనియర్ నాయకులందరినీ వర్కింగ్ కమిటీ భేటీలోనే రాహుల్ తీవ్రంగా అవమానించారు. ఆజాద్ నైజం బయటపడింది: కాంగ్రెస్ దశాబ్దాల పాటు అన్ని పదవులూ అనుభవించి కీలక సమయంలో పార్టీని వీడటం ద్వారా ఆజాద్ తన అసలు నైజం బయట పెట్టుకున్నారంటూ కాంగ్రెస్ మండిపడింది. పదవి లేకుండా ఆజాద్ క్షణం కూడా ఉండలేరంటూ ఏఐసీసీ మీడియా హెడ్ పవన్ ఖేరా చురకలు వేశారు. ‘‘అందుకే రాజ్యసభ సభ్యునిగా పదవీకాలం ముగియగానే పార్టీ వీడారు. పార్టీని బలహీనపరిచేందుకు నిత్యం ప్రయత్నించారు. ఇప్పుడేమో పార్టీ బలహీనపడిందని విమర్శలు చేస్తున్నారు’’ అంటూ ఆక్షేపించారు. రాహుల్‌పై ఆజాద్ విమర్శలను కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ కొట్టిపారేశారు. ‘‘మోదీని పార్లమెంటులోనే ఆజాద్ ఆకాశానికెత్తారు. పద్మభూషణ్ స్వీకరించారు. ఆయన రిమోట్ మోదీ చేతిలో ఉందనేందుకు ఇవన్నీ నిదర్శనాలు’’ అంటూ ట్వీట్ చేశారు. ఆజాద్‌కు కాంగ్రెస్ అన్నీ ఇచ్చిందని ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే గుర్తు చేశారు. రాహుల్‌పై ఆయనా చేసిన విమర్శలు దారుణమన్నారు. పార్టీలో పదవులు అనుభవించి ఇప్పుడిలాంటి విమర్శలు చేయడం ఆజాద్ దిగజారుడుతనానికి నిదర్శనమని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. -
ఆజాద్ బాటలో మరో ఐదుగురు.. కాంగ్రెస్‌కు షాక్ మీద షాక్!
శ్రీనగర్: కాంగ్రెస్ పార్టీకి ఒక షాక్ నుంచి కోలుకునే లోపే మరో షాక్ తగులుతోంది. సీనియర్లు, యువనేతలు అనే తేడా లేకుండా చాలా మంది పార్టీని వీడుతున్నారు. పార్టీతో దశాబ్దాల అనుబంధం ఉన్న గులాం నబీ ఆజాద్ శుక్రవారం రాజీనామా చేయగానే.. కశ్మీర్‌కు చెందిన మరో ఐదుగురు కాంగ్రెస్ నాయకులు కూడా పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆజాద్‌కు అత్యంత సన్నిహితులైన వీరంతా.. ఆయన బాటలోనే నడుస్తామని తేల్చి చెప్పారు. ఆజాద్ తర్వాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కశ్మీర్ నేతల్లో జీఎం సరూరి, హజి అబ్దుల్ రషీద్, మొహమ్మద్ ఆమిన్ భట్, గుల్జర్ అహ్మద్ వాని, చౌదరి మహ్మద్ అక్రమ్ ఉన్నారు. వీరితో పాటు సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ఆర్ఎస్ చిబ్ కూడా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. జమ్ముకశ్మీర్ అభ్యన్నతి కోసమే తాను ఆజాద్‌తో కలిసి ముందుకుసాగాలనుకుంటున్నట్లు చిబ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ కేంద్ర, రాష్ట్ర స్థాయిలో నిర్ణయాత్మక నాయకత్వాన్ని కోల్పోయిందన్నారు. అందకే పార్టీ గ్రాఫ్ అంతకంతకూ పడిపోతూ వస్తోందని చెప్పారు. చదవండి: బీజేపీతో టచ్‌లో లేను.. ఆజాద్ క్లారిటీ -
పార్టీకి గుడ్‌బై! గులాం నబీ ఆజాద్‌పై కాంగ్రెస్ సీనియర్ నేతల సెటైర్లు
సాక్షి, న్యూఢిల్లీ: సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పార్టీని వీడటం దురదృష్టకరం, బాధాకరం అని కాంగ్రెస్ తెలిపింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి కీలక అంశాలపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా పార్టీ పోరాడుతున్న సమయంలో ఆయన రాజీనామా చేయడంపై విచారం వ్యక్తం చేసింది. ఆజాద్ రాజీనామా అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేతలు అజయ్ మాకెన్, జైరాం రమేశ్ మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయంపై స్పందించారు. ఆజాద్ రాజీనామా లేఖలో చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని జైరాం రమేశ్ అన్నారు. అనంతరం ట్విట్టర్ వేదికగా ఆజాద్‌పై విమర్శలు గుప్పించారు జైరాం రమేశ్. గులాం నబీ ఆజాద్ డీఎన్ఏ 'మోడీ-ఫై' అయిందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ నాయకత్వం ఆయనను ఎంతో గౌరవించిందని అన్నారు. కానీ అతను మాత్రం ద్రోహం చేశారని మండిపడ్డారు. రాజీనామా లేఖలో ఆజాద్ చేసిన వ్యక్తిగత విమర్శలు ఆయన అసలు రంగుకు నిదర్శనమన్నారు. 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించి ఐదు పేజీల లేఖను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు. 2013లో రాహుల్ గాంధీ ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ నాశనమైందని ఆరోపించారు. సీనియర్లకు సముచిత స్థానం కల్పించడం లేదని పేర్కొన్నారు. అంతేకాదు రాహుల్ త్వరలో చేపట్టబోయే 'భారత్ జోడో యాత్ర'పైనా విమర్శలు గుప్పించారు. భారత్ జోడో యాత్రకు ముందు 'కాంగ్రెస్ జోడో యాత్ర' చేపట్టాల్సిందని సైటెర్లు వేశారు. పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని లేఖ రాసిన జీ-23 నేతలను అవమానాలకు గురి చేశారని ఆరోపించారు. గౌరవం ఉండదు.. మరోవైపు ఆజాజ్‌కు ఇకపై గౌరవం దక్కకపోవచ్చని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. ఆయనపై గతంలో ఎంతో ప్రేమ చూపించామన్నారు. కాంగ్రెస్‌కు గతంలోనూ ఇలా జరిగిందని, ఆ తర్వాత మళ్లీ పుంజుకుందని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో బలమైన ప్రతిపక్షం అవసరమని పేర్కొన్నారు. బీజేపీ ఆహ్వానం.. కాంగ్రెస్ తనను తానే నాశనం చేసుకుంటోందని ఆజాద్ అన్నదాంట్లో తప్పేంలేదని బీజేపీ నేత కుల్దీప్ బిష్ణోయ్ అన్నారు. ఆయనను కమలం పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. పార్టీ ఆదేశిస్తే తానే ఆజాద్‌తో సంప్రదింపులు జరిపి తీసుకొస్తానని చెప్పుకొచ్చారు. చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పార్టీకి ఆజాద్ రాజీనామా.. రాహుల్‌పై ఫైర్ -
కాంగ్రెస్‌కు యువనేత గుడ్‌బై.. సోనియా, రాహుల్, ప్రియాంకపై విమర్శలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు మరో యువనేత షాక్ ఇచ్చారు. పార్టీ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ రాజీనామా చేశారు. కొంతకాలంగా పార్టీ మీడియా సమావేశాలకు దూరంగా ఉంటున్న 39 ఏళ్ల ఈ యువనేత.. పార్టీకి, అధికార పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు బుధవారం తెలిపారు. ఈమేరకు రాజీనామా లేఖను సోనియాకు పంపారు. అంతేకాదు పార్టీని వీడుతూ గాంధీలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలు ప్రస్తుత యువత, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ఉండటం లేదని జైవీర్ ఆరోపించారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీల అపాయింట్మెంట్ కోసం ఏడాదిగా ప్రయత్నిస్తున్నా.. అనుమతి దొరకడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని వ్యక్తిపూజ చెదపురుగులా తినేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో జరిగే విషయాలకు పార్టీ నిర్ణయాలకు పొంతన ఉండట్లేదన్నారు. గత ఎనిమిదేళ్లుగా పార్టీ నుంచి తాను ఏమీ తీసుకోలేదని షెర్గిల్ అన్నారు. తానే పార్టీ కోసం చాలా చేశానని చెప్పుకొచ్చారు. లాయర్ అయిన జైవీర్ కాంగ్రెస్‌కు కీలక అధికార ప్రతినిధుల్లో ఒకరు. ఈ నెలలో ఇప్పటికే గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ వంటి సీనియర్ నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో సంస్కరణలు తీసుకురావాలని అసంతృప్తి వ్యక్తం చేసిన జీ-23 నేతల్లో ఈ ఇద్దరూ ఉన్నారు. చదవండి: ఐదారేళ్లలో బీజేపీ కనుమరుగవుతుంది.. బిహార్ నుంచే పతనం మొదలైంది.. -
పీకల్లోతు కష్టాల్లో కాంగ్రెస్.. ఆ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు
కాంగ్రెస్ పార్టీని కష్టాలు వెంటాడుతునే ఉన్నాయి. రోజుకొక పరిణామం ఆ పార్టీ నాయకత్వానికి కునుకులేకుండా చేస్తోంది. సీనియర్ నేతలు బాధ్యతలు మాకొద్దు బాబో అని తప్పుకుంటున్నారు. పార్టీ కీలక పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. మరికొందరు సీనియర్లు ఏకంగా పార్టీనే వీడుతున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్‌శర్మ రాజీనామా చేయడం పార్టీలో చర్చనీయంగా మారింది. ఈ ఏడాది చివర్లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇంతలోనే ఆనంద్ శర్మ ముఖ్యమైన బాధ్యతల నుంచి తప్పుకోవడం పార్టీకి పెద్ద షాకే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే జమ్మూకశ్మీర్ ప్రచార కమిటీ చైర్మన్ పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుడి ఎన్నిక షెడ్యూల్ కు కాంగ్రెస్ సిద్ధం మవుతున్న దశలోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం ఆపార్టీకి కోలుకోలేని దెబ్బేనని చెబుతున్నారు. ఆనంద్‌శర్మ, ఆజాద్ ఇద్దరూ... జీ-23 గ్రూపులో కీలక సభ్యులుగా ఉన్నారు. పార్టీలో అంతర్గత సంస్కరణలు తేవాలని.. బ్లాక్ స్థాయి నుంచి సీడబ్ల్యూసీ వరకు ఎన్నికైన కార్యవర్గాలు ఉండాలని కొంతకాలంగా జీ-23 గ్రూప్ అధిష్ఠానంపై ఒత్తిడి పెంచింది. ఈమేరకు రెండేళ్ల క్రితమే పార్టీ చీఫ్ సోనియాగాంధీకి ఈ గ్రూపు నేతలు లేఖలు కూడా రాశారు. పార్టీలో అవమానం జరిగిందని.. తన గౌరవానికి భంగంకలిగితే సహించేదిలేదంటూ... సోనియాకు రాసిన రాజీనామా లేఖలో ఆనంద్‌శర్మ పేర్కొన్నట్టు తెలిసింది. అయితే హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని ఆయన ప్రకటించడం కొసమెరుపు. అయితే పార్టీని ధ్వంసం చేయడానికి కాంగ్రెస్‌లోనే అంతర్గత కుట్ర జరుగుతోందని ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనంద్‌శర్మ చేసిన వ్యాఖ్యలపైనా పెద్ద చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఇద్దరు గాంధీలకు మాత్రమే కాంగ్రెస్ పరిమితం కావాలా? అంటూ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలపై ఎటాక్ చేశారు. గత కొన్నాళ్లుగా ఎంతోమంది సీనియర్ నేతలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతున్నారు. సుమారు 30 ఏళ్లపాటు కాంగ్రెస్‌తో అనుబంధమున్న కపిల్ సిబల్ లాంటి వారు కూడా ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు. ఎస్పీ మద్దతులో స్వతంత్ర అభ్యర్ధిగా ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైయ్యారు. కాంగ్రెస్ పంజాబ్ రాష్ట్రశాఖ చీఫ్ సునీల్ జాఖడ్ కూడా 50 ఏళ్ల అనుబంధాన్ని తెగతెంపులు చేసుకుని బీజేపీలో చేరారు. కేంద్ర న్యాయశాఖ మాజీమంత్రి అశ్వనీకుమార్, కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్ కూడా హస్తం పార్టీలో ఇమడలేమంటూ బయటకు వచ్చేశారు. కాంగ్రెస్ గుజరాత్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ కూడా పార్టీతో కటీఫ్ చేసుకున్నారు. ప్రజల సెంటిమెంట్లను కాంగ్రెస్ గౌరవించలేదని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చదవండి: కాంగ్రెస్‌లో కుమ్ములాట.. పీసీసీని మార్చాలంటూ నేతల ఫైటింగ్ గత ఏడాది పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పడం ఆపార్టీకి కోలుకోలేని దెబ్బతీసింది. పంజాబ్ లో కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకుంది. అధికారాన్ని కూడా కోల్పోవలసి వచ్చింది. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న జితిన్ ప్రసాద కూడా కాంగ్రెస్ నుంచి బయటకొచ్చారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ లాంటి కీలక రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ ఏడాది చివర్లో, వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. 2024లో లోక్‌సభకు ఎన్నికలున్నాయి. కీలకమైన ఈ తరుణంలో పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలవరపెడుతున్నాయి. పార్టీని ఎలా దారిలో పెట్టాలో కూడా కాంగ్రెస్‌కు సమస్యగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. కొన్నాళ్లుగా జరిగిన అన్ని ఎన్నికల్లో ఘోరంగా విఫలమవుతుండడం కూడా కాంగ్రెస్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని అంటున్నారు. -బొబ్బిలి శ్రీధరరావు, సాక్షి ప్రతినిధి -
Narinder Batra: మూడు పదవుల నుంచి అవుట్
న్యూఢిల్లీ: గత కొన్నేళ్లుగా భారత ఒలింపిక్ క్రీడల పరిపాలనా వ్యవహారాల్లో కీలక ముద్ర వేయడంతో పాటు ప్రపంచ హాకీ నిర్వహణలో కూడా ప్రధాన పాత్ర పోషించిన సీనియర్ అడ్మినిస్ట్రేటర్ నరీందర్ బత్రా కథ ముగిసింది. ఇటీవల తనపై వచ్చిన విమర్శలు, వివాదాల నేపథ్యంలో ఆయన అన్ని పదవుల నుంచి తప్పుకున్నారు. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు బత్రా ప్రకటించారు. దీంతో పాటు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యత్వానికి, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్ష పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. మూడు వేర్వేరు రాజీనామా లేఖల్లో ‘వ్యక్తిగత కారణాలతో’ తప్పుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఎఫ్ఐహెచ్ అధ్యక్షుడిగా 2016లో తొలిసారి ఎంపికైన బత్రా... గత ఏడాది జరిగిన ఎన్నికల్లో గెలిచి 2024 వరకు పదవిలో సాగేలా అవకాశం దక్కించుకున్నారు. ‘హాకీ ఇండియా’ అధ్యక్షుడిగా రూ. 35 లక్షలు దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో బత్రాపై సీబీఐ విచారణ జరుగుతోంది. సోమవారం కూడా బత్రా ఇళ్లపై సీబీఐ దాడులు చేసింది. ఇది జరిగిన కొన్ని గంటలకే ఆయన రాజీనామాలు వచ్చాయి. నిజానికి ఐఓఏ అధ్యక్ష పదవి నుంచి గత మే నెలలోనే ఢిల్లీ కోర్టు తొలగించినా... కోర్టులో సవాల్ చేసిన ఆయన అధికారికంగా రాజీనామా చేయలేదు. 2017లో ఐఓఏ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యేందుకు బత్రా తప్పుడు పద్ధతిని అనుసరించారు. తనను తాను హాకీ ఇండియా జీవితకాల సభ్యుడిగా నియమించుకొని ఐఓఏ ఎన్నికల్లో గెలిచారు. దాంతో కోర్టు జోక్యం చేసుకుంది. మరోవైపు ఐఓఏ అధ్యక్షుడైన కారణంగానే లభించిన ఐఓసీ సభ్యత్వ పదవికి సహజంగానే రాజీనామా ఇవ్వాల్సి వచ్చింది. -
లంకకు 20న కొత్త అధ్యక్షుడు
కొలంబో/ఐరాస: కనీవినీ ఎరగని సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో అధికార మార్పిడికి రంగం సిద్ధమవుతోంది. అధ్యక్షుడు గొటబయ రాజపక్స (73) పలాయనం, ప్రధాని రణిల్ విక్రమసింఘె (73) రాజీనామా ప్రకటన నేపథ్యంలో అన్ని పార్టీల కలయికతో ప్రభుత్వం ఏర్పాటు కానుండటం తెలిసిందే. త్వరలో అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆ వెంటనే మంత్రివర్గం రాజీనామా చేస్తుందని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. తాను కూడా బుధవారం రాజీనామా చేస్తానని గొటబయ పునరుద్ఘాటించారు. ప్రభుత్వ ఏర్పాటుపై అఖిలపక్ష సమావేశం సోమవారం కూడా మల్లగుల్లాలు పడింది. దేశాన్ని సంక్షోభం నుంచి బయట పడేసేందుకు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని ప్రధాన ప్రతిపక్షం సమాగి జన బలవేగయ (ఎస్‌జేబీ) ప్రకటించింది. జూలై 20న కొత్త అధ్యక్షుని ఎన్నిక జరుగుతుందని స్పీకర్ ప్రకటించారు. శ్రీలంక పరిణామాలపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వెలిబుచ్చారు. పరిస్థితిని అదుపు చేసేందుకు లంకకు భారత్ సైన్యాన్ని పంపనుందన్న వార్తలను కేంద్రం ఖండించింది. అధ్యక్ష భవనాన్ని ఆక్రమించిన నిరసనకారులు అందులోని విలాసవంతమైన బెడ్రూముల్లో సేదదీరుతూ కన్పించారు. పలువురు తమకు దొరికిన నోట్ల కట్టలను ప్రదర్శించారు. -
బీచ్‌లో ఎంజాయ్ చేసేందుకే..రూ.5లక్షల కోట్ల కంపెనీకి సీఈవో రాజీనామా!
వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకులే పట్టించుకోవడం లేదు. నిట్ట నిలువునా నడిరోడ్డు మీద వదిలిస్తున్నారు. కానీ లక్షల కోట్ల విలువైన ఓ దిగ్గజ కంపెనీ సీఈవో అలా చేయలేదు. తల్లిదండ్రుల కోసం సీఈవో జాబ్‌ను తృణ ప్రాయంగా వదిలేశారు. ప్రస్తుతం ఆయన తీసుకున్న నిర్ణయం తల్లిదండ్రుల పట్ల కాఠిన్యం ప్రదర్శించే కొడుకులకు కనువిప్పును కలిగిస్తుంటే..తోటి సీఈవోలగా ఆదర్శంగా నిలుస్తోంది. బ్లూం బర్గ్ కథనం ప్రకారం..యూకేకి చెందిన జూపిటర్ ఫండ్ మేనేజ్మెంట్ సంస్థ సీఈవోగా ఆండ్రూ ఫార్మికా విధులు నిర్వహిస్తున్నారు. జూపిటర్ ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీ వ్యాల్యూ అక్షరాల 5లక్షల కోట్లు. ఆ సంస్థ సీఈవోగా ఉన్న ఆండ్రూ తన జాబ్‌కు రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన రిజైన్ కార్పొరేట్ దిగ్గజాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుండగా.. సీఈవో పదవి నుంచి తప్పుకోవడంపై ఆండ్రూ బ్లూంబర్గ్‌కు వివరణిచ్చారు. బీచ్‌లో కూర్చొని ప్రకృతిని ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నా. నా రాజీనామాకు ఇంతకు మించిన కారణాలు ఏం లేవని అనుకుంటున్నట్లు చెప్పారు. కంపెనీ బోర్డ్‌కు ఏం చెప్పారంటే సీఈవో పదవి నుంచి వైదొలగడంపై ఇప్పటికే ఆ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు ఆండ్రూ స్పష్టత నిచ్చినట్లు (అంచనా మాత్రమే) పలు నివేదికలు చెబుతున్నాయి. వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంరక్షణ చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, వారి కోసం ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ నివేదికలు పేర్కొన్నాయి. మరోవైపు అతను చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వైదొలిగినప్పటికీ, ఆండ్రూ ఫార్మికా జూన్ 2023 వరకు వ్యాపారంలో కొనసాగుతారు. కొత్త నాయకత్వంలో వ్యాపార కార్యకలాపాలు సజావుగా ఉండేలా ఆసియా వ్యాపారానికి మద్దతు ఇవ్వడం, ఆస్ట్రేలియన్ మార్కెట్‌పై పట్టసాధించేలా నిర్దేశించిన వ్యూహాత్మక లక్ష్యాల్ని చేరుకునేందుకు సహాయ పడనున్నట్లు జూపిటర్ ఫండ్ మేనేజ్మెంట్ బోర్డ్ సభ్యులు తెలిపారు. ఆండ్రూ వారసుడిగా మాథ్యూ బిస్లీ "మార్కెట్లో మనం చేస్తున్న వ్యాపారం నిలుపుకోవడం సవాలుతో కూడుకుంది. సీఈవో హోదాలో అదే పనిని నేను అద్భుతంగా,అంకితభావంతో చేసినందుకు గర్వపడుతున్నాను" అని ఆండ్రూ తెలిపారు. బోర్డు నా వారసుడిగా మాథ్యూ బీస్లీని నియమించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. చదవండి👉 ఎలన్ మస్క్ కొంపముంచిన చైనా.. లక్షల కోట్లు హాంఫట్! -
Great resignation: కొలువుకు టాటా
ఉదయం తొమ్మిదింటికల్లా తయారై టిఫిన్ బాక్సు సర్దుకుని ఆఫీసుకు బయల్దేరడం. రాత్రికల్లా ఉసూరంటూ ఇల్లు చేరడం. కుటుంబీకులతో గడపాలన్నా, పెళ్లిళ్ల వంటి వాటికి వెళ్లాలన్నా సెలవు రోజుల్లోనే! ఇదంతా ఒకప్పటి ఉద్యోగి జీవనక్రమం. కానీ కరోనాతో అంతా మారిపోయింది. ఇంటినుంచే పని. భార్యాబిడ్డలతో గడుపుతూనే, ఇంటి పనులూ చేసుకుంటూనే, బయటికెళ్లి సరదాగా గడుపుతూనే ఆఫీసు పని కూడా చేసుకునే కొత్త ట్రెండు. ఇంతకాలంగా కోల్పోయిందేమిటో సగటు ఉద్యోగికి తెలిసొచ్చేలా చేసింది కరోనా. అందుకే మళ్లీ ఎప్పట్లా ఆఫీసుకు వెళ్లి పని చేయాలంటే ఎవరికీ ఓ పట్టాన మనసొప్పడం లేదు. ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా పని చేసే వీలున్న కొలువు చూసుకొమ్మంటోంది. ఫలితం? ఉద్యోగుల రాజీనామా వెల్లువ... కరోనా తర్వాత ఉద్యోగుల రాజీనామాలు కొంతకాలంగా ప్రపంచమంతటా పెరుగుతూనే ఉన్నా, అమెరికాలో మాత్రం ఈ పోకడ పలు చిన్నా పెద్దా కంపెనీలను మరీ కుదిపేస్తోంది. గతేడాది అక్కడ 4.7 కోట్ల మంది ఉద్యోగాలకు రాంరాం చెప్పినట్టు బ్యూరో ఆఫ్ లేబర్ లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఒక్క మార్చిలోనే ఏకంగా 45 లక్షల మంది ఉద్యోగాలు మానేశారట. ‘వీళ్లంతా నచ్చిన వేళల్లో తమకు నచ్చినట్టు పనిచేసే వెసులుబాటున్న ఉద్యోగాలు వెదుక్కుంటున్నారు. ఒకరకంగా చరిత్రలో తొలిసారిగా ఉద్యోగుల్లో ఒక ధీమా వంటివి వచ్చింది. ఉన్న ఉద్యోగం మానేసినా నచ్చిన పని వెదుక్కోవడం కష్టమేమీ కాదన్న భావన పెరిగింది’అని స్టాన్‌ఫర్డ్ వర్సిటీ ప్రొఫెసర్ నికోలస్ బ్లూమ్ అన్నారు. నచ్చిన పనిలో ఇప్పుడున్న జీతం కంటే తక్కువ వచ్చినా పర్లేదనే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని ఆయన చెబుతున్నారు. ఉద్యోగుల్లో ఏకంగా 57 శాతం వృత్తిగత, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత కోరుతున్నట్టు మైక్రోసాఫ్ట్ తాజా సర్వే తేల్చింది. కరోనా కాలంలో విపరీతమైన ఒత్తిడికి లోనైన టెక్, హెల్త్‌కేర్ కంపెనీల ఉద్యోగులే ఇప్పుడు ఎక్కువగా కొత్త ఉద్యోగాల వైపు చూస్తున్నారు. వీరిలో చాలామంది ఐదు నుంచి పదేళ్ల అనుభవమున్నవారే. మొత్తానికి వర్క్ ఫ్రం హోం ఉద్యోగులకు కొత్త జీవిత పాఠాలు నేర్పిందంటారు టెక్సాస్ ఎం–ఎం వర్సిటీ ప్రొఫెసర్ ఆంటోనీ క్లోజ్. 2021 నుంచీ పెరిగిపోయిన రాజీనామాల పోకడకు ‘ది గ్రేట్ రిజిగ్నేషన్’అని పేరు పెట్టారాయన. మన దేశంలోనూ అదే ధోరణి మన దేశంలోనూ ఐటీ, టెలికాం రంగాల్లో ఏకంగా 86 శాతం మంది ఉద్యోగం మారాలనుకుంటున్నారని మైకెల్ పేజ్ సర్వేలో తేలింది! 2022 మార్చి త్రైమాసికంలో టీసీఎస్ కంపెనీలో 17.4 శాతం, హెచ్‌సీఎల్‌లో 21.9 శాతం, విప్రోలో 27.7 శాతం మంది ఉద్యోగులు మానేశారు! నచ్చిన పనివిధానం కోసం జీతం తక్కువైనా, ప్రమోషన్లు లేకున్నా పర్లేదని మన దేశంలో ఏకంగా 61 శాతం మంది ఉద్యోగులు కోరుకుంటున్నారట!! సర్వేలు ఏం చెప్తున్నాయి.. ► ప్రతి ఐదుగురు ఉద్యోగుల్లో ఒకరు సాధ్యమైనంత త్వరలో ఉద్యోగం మారాలనుకుంటున్నట్టు ప్రైస్‌వాటర్‌కూపర్ ఇటీవల 44 దేశాల్లో నిర్వహించిన మెగా సర్వేలో తేలింది ► అధిక జీతం కోసం వేరే ఉద్యోగం చూసుకుంటున్నామని వీరిలో 44 శాతం మంది చెప్పగా, వృత్తి–వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యత లోపించడం వల్ల జాబ్ మారుతున్నట్టు మరో44 శాతం మంది చెప్పారు. ► ప్రపంచవ్యాప్తంగా కేవలం 29 శాతం మంది ఐటీ ఉద్యోగులు మాత్రమే ప్రస్తుత ఉద్యోగంలో కొనసాగేందుకు ఇష్టపడుతున్నట్టు గార్టర్ అనే సంస్థ సర్వేలో తేలింది. ► తమకు నచ్చిన పనివిధానం, పని గంటలుండే ఉద్యోగాల్లో చేరాలనుకుంటున్నట్టు ఈ సర్వేలో పాల్గొన్న వారిలో ఏకంగా 79 శాతం మంది చెప్పారు. కంపెనీల తీరూ మారుతోంది రాజీనామాల నేపథ్యంలో కంపెనీలను ఉద్యోగుల కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులను కాపాడుకునేందుకు, కొత్తవారిని ఆకర్షించేందుకు అమెజాన్, గూగుల్ వంటి భారీ సంస్థలు కూడా అనేక వెసులుబాట్లు కల్పిస్తున్నాయి. పని విధానాన్నే మార్చేస్తున్నాయి. అధిక జీతాలను ఆశగా చూపుతున్నాయి. చాలా కంపెనీలు ఇంటినుంచి కొంత, ఆఫీసులో కొంత సమయం పని చేసేలా హైబ్రిడ్ విధానాన్నీ తెస్తున్నాయి. పింట్రెస్ట్ సంస్థ అయితే ఏకంగా బిడ్డల సంరక్షణ కోసం ఉద్యోగులకు సెలవులతో పాటు అనేక సౌకర్యాలిస్తోంది. జర్మనీకి చెందిన ఇన్సూరెన్స్ కంపెనీ డాబే అయితే ఇంటర్వ్యూలకు హాజరైన వారికీ నగదు బహుమతులిస్తోంది! తొలి రౌండ్లో 550 డాలర్లు, రెండో రౌండ్ చేరితే 1,100 డాలర్లు ముట్టజెబుతోంది! -
పనిలో మజా లేదు.. నేను వెళ్లిపోతున్నా..
దేశంలో చాప కింద నీరులా నిరుద్యోగం విస్తరిస్తోంది. అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా చెలరేగుతున్న ఆందోళన హింస నిరుద్యోగ సమస్యకు అద్దం పడుతున్నాయి. ఉద్యోగాల కోసం ఇంతలా యువత ఎదురు చూస్తుంటే మరోవైపు చేస్తున్న పనిలో మజా రావడం లేదంటూ ఉద్యోగాలను వదిలేస్తున్న ట్రెండ్ కూడా కనిపిస్తోంది. ఒకే సమయంలో రెండు భిన్నమైన దృశ్యాలు ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి. కరోనా సంక్షోభ సమయంలో ఎడ్యుటెక్ కంపెనీలు తామరతంపరలా పుట్టుకొచ్చాయి. ఆన్లైన్ క్లాసుల పద్దతి ఏడాదికి పైగా కొనసాగడంతో వీటికి మంచి ఊపు లభించింది. దేశం నలుమూలల అనేక మంది ఈ ఎడ్యుటెక్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. తమ భవిష్యత్తుకి బంగారు బాటలు పడ్డాయనే భావనలో మునిగిపోయారు. కానీ కొద్ది రోజులకే పరిస్థితి తారుమారైంది. రెగ్యులర్ క్లాసులు ప్రారంభంకాగానే ఎడ్యుటెక్ కంపెనీల పునాదులు కదిలిపోవడం మొదలైంది. ఫలితంగా అనేక కంపెనీల్లో కొత్తగా పుట్టుకొచ్చిన ఉద్యోగాలు గోవిందా అయ్యాయి. అలా పని చేయలేం కోవిడ్ 19 కారణంగా సోషల్ డిస్టెన్స్ అనేది తప్పనిసరి వ్యవహారంగా మారిపోయింది. దీంతో అనేక కంపెనీలు వర్క్ ఫ్రం హోం / రిమోట్ వర్క్ కల్చర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ముఖ్యంగా ఐటీ ఆధారిత కంపెనీలు అయితే వర్క్ ఫ్రం హోంను తమ భుజాలపై మోశాయి. కానీ కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టగానే ఉద్యోగులను ఆఫీసులకు రమ్మంటున్నాయ్. దీనిపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తోంది. బలవంతంగా ఆఫీసుకు రమ్మంటే ఉద్యోగాలు మానేస్తామనే ప్రొఫెషనల్స్ పెరిగిపోతున్నారు. సరికొత్త సమస్య కరోనా తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగాల విషయంలో కొత్త సమస్యలు పుట్టుకువస్తున్నాయి. ఉద్యోగాలు లేక కొందరు వెతలు అనుభవిస్తుంటే తమకు కంఫర్ట్ మిస్ అవుతున్నామంటూ మరికొందరు బాధను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఆర్థిక అంశాలు, లాజిస్టిక్స్, భౌతిక అంశాలతో ముడిపడిన అంశాలు. కానీ వీటికి భిన్నంగా సరికొత్త సమస్యను మన ముందుకు మోసుకు వచ్చారు ఆర్పీజీ గ్రూపు చైర్మన్ హార్ష్ గోయెంకా. మజా లేదంటూ సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ సమాకాలిన అంశాలపై స్పందించే హార్ష్ గోయెంకా మరో అంశాన్ని మన ముందుకు తెచ్చారు. రాజేశ్ అనే ఉద్యోగి ఇటీవల తన రాజీనామా చేశారు. పని చేస్తున్న చోట మజా దొరకడం లేదు కాబట్టి రిజైన్ చేస్తున్నట్టు సింపుల్‌గా తేల్చేశాడు అతను. సుత్తి లేకుంటా సూటిగా రెండంటే రెండు రెండు ముక్కల్లో విషయం చెప్పేశాడు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది. This letter is short but very deep. A serious problem that we all need to solve… pic.twitter.com/B35ig45Hhs — Harsh Goenka (@hvgoenka) June 19, 2022 సీరియస్ ఇష్యూ మజా లేదనే కారణంతో ఉద్యోగాన్ని వదులుకోవడాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నారను హార్ష్ గోయెంకా. పని చేసే చోట ఉత్సాహం, ప్రోత్సాహాం, స్ఫూర్తి లాంటివి కరువైపోవడం సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం అంటూ తేల్చిచెప్పారు. ఇతర కంపెనీల్లో కూడా ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించుకుని ఉద్యోగుల్లో ఉత్సాహం నింపుతూ ఎక్కువ ప్రొడక్టివిటీ తీసుకు వచ్చేలా వ్యూహాలు రూపొందించాలనే విధంగా హెచ్చరికలు జారీ చేశారు. చదవండి: మీ పర్ఫార్మెన్స్ బాగలేదయ్యా! కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు! -
మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల జీతాలు ఎందుకు భారీగా పెరుగుతున్నాయంటే!
మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు ఆ సంస్థ సీఈవో సత్యనాదెళ్ల బంపరాఫర్ ప్రకటించారు. త్వరలో ఉద్యోగుల శాలరీలను డబుల్ చేస్తున్నట్లు తెలిపారు. సత్య నాదెళ్ల ప్రకటనతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. "కరోనా కష్టకాలంలో ఉన్నప్పుడు మమ్మల్ని నట్టేట ముంచారు. మీరొద్దు. మీరిచ్చే జీతాలొద్దు. కరోనా పేరు చెప్పి ఉద్యోగాలు ఊడబీకారు. నష్టాలంటూ శాలరీల్లో కోత విధించారు. డబుల్ హైక్‌లు, ప్రమోషన్లు ఇస్తామంటే మేం ఎందుకు పనిచేస్తాం. కరోనా తెచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నామంటూ..ఉద్యోగస్తులు.. వారు చేస్తున్న ఉద్యోగాలకు స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తున్నాం". ఇదిగో ఇలా పుట్టుకొచ్చిందే ఈ దిగ్రేట్ రిజిగ్నేషన్. ఇప్పుడీ ఈ అంశం ప్రపంచ దేశాలకు చెందిన అన్నీ సంస్థల్ని కలవరానికి గురిచేస్తుండగా..మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కీలక ప్రకటన చేస్తూ ఉద్యోగులకు మెయిల్ పెట్టారు. 'నియర్లీ డుబల్డ్ ది గ్లోబల్ మెరిట్'. ముఖ్యంగా మిడ్ కెరియర్ (35 నుంచి 45 మధ్య వయస్సు) ఉద్యోగుల శాలరీలు మరింత పెరగనున్నాయి. అంతేకాదు క్లయింట్లకు, భాగస్వాములకు మీరందించిన అసమాన సేవలతో మన నైపుణ్యాలకు అధిక డిమాండ్ ఉందని మరోసారి నిరూపణ అయింది. నా తరుపున మీ అందరికి కృతజ్ఞతలు.అందుకే మీ అందరిపై దీర్ఘకాల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యామని సత్య నాదెళ్ల తన ఉద్యోగులకు రాసిన ఈమెయిల్స్‌లో పేర్కొన్నారు. చదవండి👉నాకొద్దీ ఉద్యోగం.. భారత్‌లో 'ది గ్రేట్ రిజిగ్నేషన్' సునామీ! -
ఇదేం పద్దతి.. జీతం పెంచకుండా ఆఫీస్‌కి రమ్మంటే ఎలా?
కోవిడ్ సంక్షోభం సమయంలో ఒక రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్న కార్పొరేట్ కంపెనీలను ఇప్పుడు మరో రకమైన చిక్కులు పలకరిస్తున్నాయి. ఉద్యోగులు కోరుతున్న సహేతుకమైన డిమాండ్లు నెరవేర్చేలేక.. ఇటు పరిస్థితులకు తగ్గట్టు వ్యూహాలు రచించలేక కార్పోరేట్ ‘హెచ్ఆర్’లు నెత్తి బొప్పి కడుతోంది. ఎడ్టెక్ యూనికార్న్ సంస్థ బైజూస్‌కి చెందిన వైట్‌హ్యాట్ జూనియర్‌కు ఆ సంస్థకు చెందిన ఉద్యోగులు గుడ్‌బై చెబుతున్నారు. నువ్వు వద్దు.. నీ జాబు వద్దు.. నీకో దండం అంటూ ఒక్కొక్కరుగా ఆ సంస్థను వీడి వెళ్లిపోతున్నారు. ఇంతకీ ఆ సంస్థ చేసిన తప్పేంటి అంటే వాళ్లని ఆఫీసుకు వచ్చి పని చేయండి అని అడగడం! వర్క్ ఫ్రం హోం కంప్యూటర్ కోడింగ్, మ్యాథమేటిక్స్ బోధించే ఎడ్టెక్ కంపెనీగా వైట్‌హ్యాట్ జూనియర్ ప్రారంభమైంది. కోవిడ్ సంక్షోభం మొదలైన తర్వాత ఒక్కసారిగా ఎడ్టెక్ కంపెనీలకు గిరాకీ పెరిగింది. అప్పుడే దీన్ని బైజూస్ సంస్థ 300 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకుంది. విస్తరణలో భాగంగా భారీ ఎత్తున ఉద్యోగులను చేర్చుకుంది. వారంతా వర్క్‌ఫ్రం హోంలో పని చేస్తున్నారు. ఆఫీసులకు వచ్చేయండి వైట్‌హ్యాట్ జూనియర్ సంస్థ నుంచి మార్చి 18న ఉద్యోగులకు ఈమెయిళ్లు వెళ్లాయి. కోవిడ్ తగ్గుముఖం పట్టినందు వల్ల నెలరోజుల్లోగా అంటే ఏప్రిల్ 18లోగా మీరంతా ఆఫీసులకు వచ్చి పని చేయాలంటూ తేల్చి చెప్పింది. ఈ సంస్థకు బెంగళూరు, గురుగ్రామ్, ముంబైలలో ఆఫీసులు ఉన్నాయి. కాబట్టి మీకు కేటాయించిన ఆఫీసులకు నెలరోజుల్లోరా రావాలంటూ ఉద్యోగులకు హుకుం జారీ చేసింది. రాజీనామాల పర్వం హెచ్ఆర్ నుంచి లెటర్ రావడం ఆలస్యం మాకు నువ్వు వద్దు. నీ ఉద్యోగం వద్దంటూ ఉద్యోగులు రాజీనామా చేయడం మొదలు పెట్టారు. తొలి గడువు ఏప్రిల్ 18 ముగిసే నాటికే ఏకంగా 800ల మంది ఉద్యోగులు రాజీనామా చేశారు. మరో నెల గడిస్తే ఈ సంఖ్య రెట్టింపు అయ్యే ఛాన్స్ ఉంది. ఉద్యోగులు చెబుతున్న కారణాలు - మాకంటూ కొన్ని కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. తల్లిదండ్రులను చూసుకోవాలి, పిల్లల చదువులు మధ్యలో ఉన్నాయి. ఉన్నపళంగా నెల రోజులు టైం ఇచ్చి సొంతూళ్లను వదిలి రావాలని చెప్పడం సరికాదు. అలా చేయలేం కాబట్టే రిజైన్ చేస్తున్నాను - ఇంటర్వ్యూ చేసినప్పుడు రెండేళ్ల పాటు వర్క్ ఫ్రం హోం ఉంటుందని చెప్పారు. దానికి తగ్గట్టుగానే మా జీతభత్యాలు ఫైనల్ అయ్యాయి. ఇప్పుడు రెండేళ్లు పూర్తి కాకుండానే లివింగ్ కాస్ట్ ఎక్కువగా ఉండే బెంగళూరు, గురుగ్రామ్ లాంటి నగరాలకు రమ్మంటే ఎలా ? మా జీతాలు అక్కడి ఖర్చులకు సరిపోవు అందుకే వైట్‌హ్యాట్ జూనియర్‌కి గుడ్‌బై చెబుతున్నాం - మరికొందరు నష్టాల్లో ఉన్న వైట్హ్యట్ కంపెనీ.. వాటిని తగ్గించుకునేందుకు తెలివిగా వేసిన ఎత్తుగడనే వర్క్ ఫ్రం హోంకి మంగళం పాడటం అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నపళంగా ఉద్యోగులను రమ్మని చెప్పడం ద్వారా.. ఉద్యోగులు వాళ్లంత వాళ్లే బయటకు వెళ్లి పోయేలా ప్లాన్ చేశారని అంటున్నారు. మినహాయింపు ఉంది ఉద్యోగుల రాజీనామా పర్వంపై వైట్‌హ్యాట్ జూనియర్ సిబ్బంది స్పందిస్తూ.. మా ఆదేశాలను అనుసరించి చాలా మంది బెంగళూరు, గురుగ్రామ్ వంటి ప్రాంతాల్లో రిపోర్టు చేశారు. మెడికల్, ఇతర అవసరాలు ఉన్నాయన్న ఉద్యోగుల విషయంలో.. పరిశీలించి పలువురికి మినహాయింపులు కూడా ఇచ్చామని తెలిపారు. చదవండి: అప్పడు వర్క్ ఫ్రం హోం అడిగితే.. దారుణంగా... -
వందల మంది రాజీనామా..దెబ్బకి దిగొచ్చిన కంపెనీ..వారానికి 4 రోజులే పని!
కోవిడ్ మహమ్మారి ఉద్యోగులకు కొత్త పాఠం నేర్పిచ్చింది. సుదీర్ఘమైన షిఫ్ట్‌లు, లే ఆఫ్‌లు, వేతనాల కోతలతో తమని కంపెనీలు వాడుకుంటున్నాయనే భావన నెలకొంది. అయితే ఇప్పుడు వైరస్ తగ్గుముఖం పట్టి వ్యాపారాలు పుంజుకోవడంతో కంపెనీలు ఆకర్షణీయమైన వేతనాలు, ప్యాకేజీలు ఇస్తామన్న ఉద్యోగులు ఉండడం లేదు. రాజీనామా చేసి కొత్త మార్గంలో పని వెతుక్కునే పనిలో పడ్డారు. భవిష్యత్తును భద్రం చేసుకునేందుకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ కంపెనీలో పనిచేస్తున్న వందల మంది ఉద్యోగులు రిజైన్ చేశారు. చివరికి ఏమైందంటే. అమెరికా బ్యూరో ఆఫ్ ల్యాబర్ స్టాటిస్టిక్స్ వివరాల ప్రకారం..గతేడాది నవంబర్‌లో 4.5మిలియన్ల మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా తమ ఉద్యోగులకు రాజీనామా చేశారు. డిసెంబర్ నెల నుంచి ఈ ఏడాది మొత్తం వరకు 23శాతం మంది కొత్త ఉద్యోగులకోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ 'హెల్త్ వైజ్'ను దిగ్రేట్ రిజిగ్నేషన్ వణికిచ్చింది. అందులో పనిచేస్తున్న 200 మంది ఉద్యోగులు రాజీనామా చేశారు. అప్పుడే జూలియట్ షోర్ చేసిన రీసెర్చ్ ఆధారంగా..కంపెనీ తీసుకున్న నిర్ణయం ఉద్యోగులు సంస్థను వదిలి పెట్టి వెళ్లి పోకుండా ఆపింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సంస్థకు భారీ లాభాలు తెచ్చిపెట్టేలా చేసింది. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటని అనుకుంటున్నారా? 'జూలియట్ షోర్' ఎవరు? బోస్టన్ కాలేజీలో జూలియట్ షోర్ ఎకనమిస్ట్ అండ్ సోషియాలజిస్ట్ విభాగంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే జూలియట్ షోర్ లేబర్ ఎకనమిస్ట్పై చేసిన రీసెర్చ్‌లో భాగంగా 1990ల నుంచి ఉద్యోగులు,వారి విధుల గురించి పలు ఆసక్తికర విషయాల్ని గుర్తించింది. ఈ రీసెర్చ్‌లో జూలియట్ షోర్ ప్రస్తుతం ప్రపంచ దేశాల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న ది గ్రేట్ రిజిగ్నేషన్‌ను అరికట్టేందుకు ఉద్యోగులు కోరుకున్న జీతాలు, డిజిగ్నేషన్‌తో పాటు పని దినాల్ని కుదించాలని, వారంలో 4రోజుల పాటు విధులు నిర్వహిస్తే సత్ఫలితాలు వస్తాయని గ్రహించింది. అందుకే తన నిర్ణయాన్ని హెల్త్ వైజ్ కంపెనీకి సూచించింది. అప్పటికే జూలియట్ షోర్ ప్రొఫెసర్‌గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించడం, ఆథర్‌గా ఆమె రాసిన బుక్స్ ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందడంతో హెల్త్ వైజ్ ఆమె నిర్ణయాన్ని అంగీకరించింది. ప్లాన్ వర్కౌట్ అయ్యింది! గతేడాది ఆగస్ట్ నుంచి హెల్త్ వైజ్ సంస్థ జూలియట్ షోర్ చెప్పినట్లు వారానికి 4రోజుల పనిదినాలపై ట్రయల్స్ నిర్వహించింది. ఈ ట్రయల్స్‌లో ఉద్యోగులు పనితీరు బాగుంది. సంస్థకు మంచి లాభాల్ని తెచ్చిపెట్టింది. ఉద్యోగులకు ఎలా ఉపయోగపడింది? వారంలో 4రోజుల పనితో ఉద్యోగుల్లో ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఒత్తిడి తగ్గడంతో ప్రొడక్టివిటీ పెరిగింది. ఎక్కువ గంటల పనిచేసేలా ప్రోత్సహిస్తుంది. వారంలో మిగిలిన 3రోజుల పాటు ఉద్యోగులు వారి వ్యక్తి గత జీవితాల్ని కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతున్నట్లు హెల్త్ వైజ్ సంస్థ గుర్తించింది. ఆ పని విధానాన్ని కంటిన్యూ చేయడంతో రాజీనామా చేసేందుకు సిద్ధమైన వందల మంది ఉద్యోగులు తమ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు హెల్త్‌వైస్ సీఈఓ ఆడమ్ హుస్నీ వెల్లడించారు. చదవండి👉ఉద్యోగం వద్దు బాబోయ్! లక్షల్లో రాజీనామాలు! భారత్‌లో 'ది గ్రేట్ రిజిగ్నేషన్' సునామీ! -
AP: గవర్నర్ కార్యాలయానికి మంత్రుల రాజీనామాలు
సాక్షి, విజయవాడ: ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో మంత్రులు చేసిన రాజీనామాలు గవర్నర్ కార్యాలయానికి చేరాయి. కాసేపట్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ 24 మంది మంత్రుల రాజీనామాలను ఆమోదించనున్నారు. కాసేపట్లో గెజిట్ విడుదల కానుంది. చదవండి: (రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు) -
పార్టీని గెలిపించే బాధ్యత మీదే: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మంత్రులుగా ఉన్న 24 మంది స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు. గుంటూరు జిల్లా వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అజెండా అంశాలపై చర్చ పూర్తయ్యాక మంత్రులు తమ రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు సమర్పించారు. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడే రెండున్నరేళ్ల తర్వాత మంత్రులను మార్చి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని.. కొత్తవారికి మంత్రులుగా అవకాశం కల్పిస్తామని చెప్పారని.. కానీ తమకు 34 నెలలపాటు మంత్రివర్గంలో ఉండే అవకాశం ఇచ్చారని సీఎం జగన్‌కు మంత్రులంతా కృతజ్ఞతలు తెలిపారు. కరోనాతో రాష్ట్ర ఆదాయం తగ్గినా.. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా పేదల ఖాతాల్లో రూ.1.34 లక్షల కోట్లు జమ చేయడం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే నిర్ణయాలు తీసుకోవడంలో తమను కూడా భాగస్వాములు చేయడాన్ని ఎప్పటికీ మరువబోమన్నారు. రాజీనామాలపై ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని.. ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధి.. అంకితభావంతో పనిచేస్తామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘మీరు సమర్థులు, అనుభవం ఉన్నవారు కాబట్టే 2019, జూన్ 8న మిమ్మల్ని మంత్రివర్గంలోకి తీసుకున్నాను. వెయ్యి రోజులు మంత్రులుగా అద్భుతంగా పనిచేశారు. రెండేళ్లలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో మీకున్న అనుభవాన్ని, సమర్థతను పార్టీకి వినియోగించుకోవాలన్నదే నా ఆలోచన.. 700 రోజులు పార్టీ కోసం పనిచేయండి. మంత్రులుగా మీలో కొందరిని మార్చి.. కొందరిని కొనసాగిస్తున్నంత మాత్రాన ఎవరినీ తక్కువ చేసినట్టు కాదు. మంత్రులుగా పనిచేయడం కంటే.. ప్రజల్లో ఉంటూ పార్టీకి సేవ చేయడాన్నే నేను గొప్పగా చూస్తాను. 2024 ఎన్నికల్లో మీరు పార్టీని గెలిపించుకురండి.. మళ్లీ మీరు ఇవే స్థానాల్లో కూర్చుంటారు’ అంటూ ఉద్భోదించారు. దీనిపై మంత్రులంతా బల్లచరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేయడం అదృష్టంగా భావిస్తామని.. 2024 ఎన్నికల్లో పార్టీని రికార్డు స్థాయి మెజారిటీతో గెలిపిస్తామని చెప్పారు. మీరంతా అద్భుతంగా పనిచేశారు.. ఈ సందర్భంగా మంత్రులుగా మీరంతా అద్భుతంగా పనిచేశారని సీఎం వైఎస్ జగన్ వారిని ప్రశంసించారు. ‘మనపై ఎన్నో ఆశలు పెట్టుకుని 2019 ఎన్నికల్లో ప్రజలు మనల్ని గెలిపించారు. వారి ఆశలు నెరవేర్చేలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అన్నిరకాలుగా ప్రజలకు తోడుగా నిలిచాం. వారి అభిమానాన్ని సంపాదించుకున్నాం. ఈ ప్రక్రియలో మీరు భాగస్వాములు కావడం చాలా గొప్ప విషయం’ అని అన్నారు. చరిత్రలో ఏ ప్రభుత్వం చూపని గొప్ప పనితీరుతో.. మళ్లీ మనం ప్రజల దగ్గరకు వెళ్తున్నామని చెప్పారు. ఇలాంటప్పుడు 2019లో మనకు 151 సీట్లు వచ్చినట్టుగా 2024లో ఎందుకు రావు!? కచ్చితంగా వస్తాయనే నేను విశ్వాసంతో ఉన్నాను’ అని సీఎం వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. గడపగడపకూ వెళ్లగలిగి.. ప్రజల మధ్య ఉంటే మరింత ఎదుగుతామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మంత్రులకు సూచించారు. జిల్లాల అభివృద్ధి మండళ్ల అధ్యక్షులుగా.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో.. మంత్రులుగా తప్పించినవారికి భవిష్యత్తులో ఏమాత్రం గౌరవం తగ్గకుండా చూస్తానని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. వైఎస్సార్సీపీ బాధ్యతలతోపాటు కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాల అభివృద్ధి మండళ్ల అధ్యక్షులుగానూ అవకాశమిస్తామని సీఎం వైఎస్ జగన్ చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేయడం జిల్లా అభివృద్ధి మండళ్ల బాధ్యత. ఈ బాధ్యతను నిర్వర్తిస్తూనే.. మీ అనుభవాన్ని, సమర్థతను వినియోగించి.. పార్టీని మరింత బలోపేతం చేయాలని వారిని సీఎం కోరారు. 2024లో జిల్లాల్లో అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేసేలా చూడాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 11న మంత్రులందరూ అందుబాటులో ఉండాలని సూచించారు. -
ఏపీ కేబినెట్ చివరి భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన గురువారం ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 11న మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో కేబినెట్లోని 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. మంత్రులంతా తమ రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు. చివరి మంత్రి వర్గసమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. అందులో ముఖ్యమైనవి.. ►జిల్లాల పునర్విభజన ప్రక్రియను ప్లానింగ్ సెక్రటరీ విజయకుమార్ సహా, అధికారులందరూ సమర్ధవంతంగా నిర్వహించారని ప్రశంసించిన మంత్రిమండలి సభ్యులు. అధికారులను అభినందిస్తూ చేసిన తీర్మానానికి ఆమోదం తెలిపిన కేబినెట్. ►2021–22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హులైన స్వయం సహాయక సంఘాలకు వైయస్సార్ సున్నావడ్డీ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం. ►రాష్ట్రంలో కొత్త రెవిన్యూ డివిజన్లు ఏర్పాటుచేస్తూ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌కు చేసిన స్వల్పసవరణలకు కేబినెట్ ఆమోదం. ►కొత్తగా కొత్తపేట, పులివెందుల రెవిన్యూ డివిజన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ►7 మండలాలతో కొత్తపేట రెవిన్యూ డివిజన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ►ఆత్రేయపురం, ఆలమూరు, రావులపాలెం, కొత్తపేట, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాలతో కొత్తపేట రెవిన్యూ డివిజన్ ఏర్పాటు. ►8 మండలాలతో పులివెందుల రెవిన్యూ డివిజన్‌కు కేబినెట్ ఆమోదం. ►చక్రాయపేట, వేంపల్లె, సింహాద్రిపురం, లింగాల, పులివెందుల, వేముల, తొండూరు, వీరపునాయనిపల్లె మండలాలతో పులివెందుల డివిజన్. ►విభజించిన తర్వాతకూడా వైయస్సార్ కడప జిల్లాలో 36 మండలాల నేపథ్యంలో కొత్తగా పులివెందుల డివిజన్. ►12 పోలీసు సబ్డివిజన్లు, 16 పోలీస్ సర్కిళ్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ►పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించిన ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం. ►జిల్లాల విభజన నేపథ్యంలో ఇప్పుడున్న జిల్లా పరిషత్‌లను మిగిలిన కాలానికి కొనసాగిస్తూ ఆర్డినెన్స్. ►చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కళాశాలలో 12 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం. ►చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన మిల్లెట్మిషన్ (2022–23 నుంచి 2026–27 వరకూ)కు కేబినెట్ ఆమోదం. ►ఐచ్ఛికంగా వచ్చిన ఎయిడెడ్ డిగ్రీకాలేజీల సిబ్బందికి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పోస్టులు. ►దాదాపు 253 పోస్టులు (23 ప్రిన్సిపల్, 31 టీచింగ్, 199 నాన్‌టీచింగ్ పోస్టులకు కేబినెట్ ఆమోదం. ►ప్రకాశంజిల్లా దర్శిలో కొత్తగా ఏర్పాటుచేసిన ప్రభుత్వ డిగ్రీకాలేజీలో 24 టీచింగ్ పోస్టులు, 10 నాన్‌టీచింగ్ పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం. ►శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస తొగరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 24 టీచింగ్, 10 నాన్ టీచింగ్ పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం. ►పీఆర్సీకి సంబంధించి ఆర్థికశాఖ జారీచేసిన ఉత్తర్వులకు కేబినెట్ ఆమోదం. ►సర్వే సెటిల్మెంట్స్ మరియు ల్యాండ్ రికార్డుల డిపార్ట్మెంట్ను మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్. ►రాష్ట్రంలో హెల్త్ హబ్స్ ఏర్పాటుకు సంబంధించి కీలక అడుగులు. ►ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేసే దిశగా జిల్లాకేంద్రాలు, కార్పొరేషన్లలో అత్యాధునిక వైద్యసేవలు అందించనున్న ఆస్పత్రులకు భూముల కేటాయింపు. ►దీంట్లో భాగంగా, కాకినాడ అర్బన్ మండలం సూర్యారావుపేటలో మల్టీ/సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి ఏర్పాటు చేసేందుకు 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం. ►కర్నూలు జిల్లా కల్లూరు గ్రామంలో అత్యాధునిక ఆస్పత్రికోసం 5 ఎకరాల భూమి కేటాయింపు. ►విజయనగరం మండలం సంతపేటలో 4.5 ఎకరాల భూమి హెల్త్ హబ్ కింద అత్యాధునిక ఆస్పత్రికి ఏపీఐఐసీ ద్వారా కేటాయింపు. ►అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ గ్రామంలో 4 ఎకరాల భూమి హెల్త్ హబ్ కింద ఏర్పాటయ్యే ఆస్పత్రికి కేటాయింపు. ►శ్రీకాకుళం మండలం పాత్రుని వలసలో 4.32 ఎకరాల భూమిని హెల్త్ హబ్ కింద ఏర్పాటయ్యే అత్యాధునిక ఆస్పత్రికి కేటాయింపు. ►ఏపీ టూరిజం డిపార్ట్మెంట్కు హోటల్ మరియు కన్వెన్షన్ సెంటర్ కోసం రాజమండ్రి అర్భన్ లో 6 ఎకరాల భూమి కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం. ►కర్నూలు జిల్లా బేతంచర్లలో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేసేందుకు ఏపీఐఐసీకి 100 ఎకరాల కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ►కొయ్యూరు మండలం బలరాం గ్రామంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు 15.31 ఎకరాల భూమిని కేటాయించిన ప్రభుత్వం, కేబినెట్ ఆమోదం. ►ప్రభుత్వ ఐటీఐని ఏర్పాటు చేసేందుకు హుకుంపేట మండలం గడుగుపల్లిలో 5.10 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్. ►అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కడమలకుంట, రాగులపాడుల్లో 15 ఎకరాల భూమి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు కేటాయింపు. ►విండ్ టర్బైన్ జనరేటర్లను ఏర్పాటుచేయనున్న ఐఓసీఎల్. ►కర్నూలు జిల్లా డోన్ మండలం ఉడుములపాడులో ఆగ్రోకెమికల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ విస్తరణకు 10.06 ఎకరాలు కేటాయింపు. ►కాకినాడ జిల్లా జగ్గంపేటలో బస్‌స్టేషన్ నిర్మాణానికి 1.57 ఎకరాల భూమిని ఏపీఎస్ఆర్టీసికి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం. ►రంపచోడవరం మండలం పెద గడ్డాడలో ఏకలవ్య మోడల్ స్కూల్ నిర్మాణానికి 15 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం. ►నిజాపంపట్నం మండలం దిండిలో పరిసవారిపాలెంలో 280 ఎకరాలను ఏపీ మత్స్యశాఖకు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం. ►మడ్క్రాప్ హేచరీస్ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్న ఏపీ మత్స్యశాఖ. ►కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు 82.34 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ►ముత్తుకూరు మండలం ఈపూరు సమీపంలో ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి ఏపీఐఐసీకి 84.29 ఎకరాలను కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం. ►గూడూరులో ప్రభుత్వ ఆస్పత్రిక విస్తరణకోసం 0.89 ఎకరాలను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం. ►నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాన్పూరులో 5.05 ఎకరాల భూమిని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, మైసూరుకు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం. ►ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం విధించే తీర్మానానికి కేబినెట్ ఆమోదం. -
మంత్రి పదవికి రాజీనామా అనంతరం కొడాలి నాని స్పందన ఇదే..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. సీఎం నిర్ణయానికి ప్రతి ఒక్కరం కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఏపీ కేబినెట్ బేటీ ముగిసిన అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. మొత్తం 24 మంది మంత్రులు రాజీనామా సమర్పించినట్లు తెలిపారు. ఏప్రిల్ 11వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక అశయం, సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారని కొడాలి నాని ప్రశంసించారు. సీఎం సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు సంతృప్తి ఉందన్నారు. ఇకపై శక్తి వంచన లేకుండా పార్టీ బలోపేతం అందరం కలిసి పనిచేస్తామని తెలిపారు. చదవండి: మంత్రుల రాజీనామా: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు కాగా సామాజిక సమీకరణాల కారణంగా పాత మంత్రుల్లో అయిదారుగురు కేబినెట్లో కొనసాగే అవకాశం ఉందని అన్నారు. అనుభవం రీత్యా కొంతమందిని కొనసాగిస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారని పేర్కొన్నారు. కొత్త కాబినేట్‌లో మీరు కొనసాగే అవకాశం ఉందా అని ప్రశ్నించగా..తనకు తక్కువ అవకాశాలు ఉన్నట్లు కొడాలి నాని తెలిపారు. చదవండి: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. రాజీనామా చేసిన మంత్రులు -
మంత్రుల రాజీనామా: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన గురువారం సమావేశమైన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఏప్రిల్ 11న మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో కేబినెట్లోని 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. మంత్రులంతా తమ రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. 'మీరు సమర్థులు, అనుభవం ఉన్నవారు కాబట్టే ఆరోజు మిమ్మల్ని క్యాబినెట్లోకి తీసుకున్నాను. ఇవాళ కూడా మీకున్న అనుభవాన్ని, సమర్థతను పార్టీకి వినియోగించుకోవాలన్నది నా ఆలోచన. మంత్రులుగా మీలో కొందర్ని తొలగించి, కొందర్ని కొనసాగిస్తున్నంతమాత్రాన ఎవ్వరినీ తక్కువ చేసినట్టుకాదు. మంత్రులుగా కన్నా, పార్టీకి సేవచేయడాన్ని, పార్టీకి పనిచేయడాన్ని నేను గొప్పగా భావిస్తాను. పార్టీ కోసం పనిచేసేవారినే గొప్పగా చూస్తాను. 2024 ఎన్నికల్లో మీరు గెలిపించుకు రండి.. మీరు మళ్లీ ఇవే స్థానాల్లో కూర్చుంటారు. 2024 ఎన్నికలు కూడా మనకు అత్యంత కీలకం. 2019లో మనమీద ఎన్నో ఆశలు పెట్టుకుని ప్రజలు మనల్ని గెలిపించారు. వారి ఆశలు నెరవేర్చేలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అన్నిరకాలుగా ప్రజలకు తోడుగా నిలిచాం. వారి అభిమానాన్ని సంపాదించుకున్నాం. చరిత్రలో ఏ ప్రభుత్వం చూపని గొప్ప పనితీరుతో మళ్లీ మనం ప్రజల దగ్గరకు వెళ్తున్నాం. ఇలాంటి సందర్భంలో 2019లో మనకు 151 సీట్లు వచ్చినట్టుగా ఎందుకు రావు? కచ్చితంగా వస్తాయనే నేను విశ్వాసంతో ఉన్నాను. ఈ ప్రక్రియలో మీరు భాగస్వాములు కావడం చాలా గొప్ప విషయం. గడపగడపకూ వెళ్లగలిగినప్పుడు, ప్రజల మధ్య ఉన్నప్పుడు మరింత ఎదుగుతామనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ప్రజల్లో ఉండి పార్టీకోసం పనిచేయడాన్ని నేను గొప్పగా భావిస్తాను కూడా. మంత్రులుగా మీరంతా చాలా చక్కగా పనిచేశారని' ప్రస్తుత మంత్రులతో నిర్వహించిన కేబినెట్ భేటీలో సీఎం జగన్ అన్నారు చదవండి: (ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. రాజీనామా చేసిన మంత్రులు) కాగా, మూడేళ్లపాటు ప్రభుత్వంలో మా బాధ్యతలను మేం నిర్వహించామని మంత్రులు ఈ సందర్భంగా సీఎం జగన్‌కు వివరించారు. అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లామన్న సంతృప్తి మాలో ఉందని మంత్రులు తెలియజేశారు. ఇక మిగిలిన రెండేళ్లపాటు పార్టీ కోసం పనిచేసి.. పార్టీని పటిష్టం చేస్తామని మంత్రులు సీఎం జగన్‌తో అన్నారు. చదవండి: (Perni Nani: మంత్రి పేర్ని నాని వీడ్కోలు విందు) -
ఎవరెడీకి చైర్మన్, ఎండీలు బైబై
న్యూఢిల్లీ: డ్రై సెల్ బ్యాటరీలు, ఫ్లాష్లైట్ల తయారీ కంపెనీ ఎవరెడీ ఇండస్ట్రీస్ నాన్‌ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అదిత్య ఖైతాన్, ఎండీ అమృతాన్షు ఖైతాన్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఎవరెడీ వాటాదారుల నుంచి 26 శాతం వాటా కొనుగోలుకి ఎఫ్ఎంసీజీ దిగ్గజం డాబర్ ప్రమోటర్లు బర్మన్ గ్రూప్ ఓపెన్ ఆఫర్ ప్రకటించిన నేపథ్యంలో వీరిరువురూ పదవులకు గుడ్‌బై చెప్పినట్లు కంపెనీ పేర్కొంది. షేరుకి రూ. 320 ధరలో 1.89 కోట్ల ఎవరెడీ షేర్ల కొనుగోలుకి వివిధ సంస్థల ద్వారా సోమవారం నుంచి బర్మన్ గ్రూప్ ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నేటి(3) నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఆదిత్య, అమృతాన్షు బోర్డుకి రాజీనామాలు సమర్పించినట్లు ఎవరెడీ ఇండస్ట్రీస్ వెల్లడించింది. తద్వారా కొత్త యాజమాన్యం నేతృత్వంలో కంపెనీ లబ్ధి్ద పొందేందుకు వీలు కల్పించాలని వీరిరువురూ నిర్ణయించుకున్నట్లు తెలియజేసింది. తాత్కాలిక ఎండీగా.. ఆదిత్య, అమృతాన్షు ఖైతాన్‌ల రాజీనామాలను ఆమోదించిన బోర్డు కంపెనీ జేఎండీగా వ్యవహరిస్తున్న సువమాయ్ సాహాకు మధ్యంతర ఎండీగా బాధ్యతలు అప్పగించినట్లు ఎవరెడీ వెల్లడించింది. వివిధ సంస్థల ద్వారా ఎవరెడీలో 19.84 శాతం వాటా కలిగిన బర్మన్ గ్రూప్ గత వారం 5.26 శాతం అదనపు వాటాను సొంతం చేసుకోవడం ద్వారా సోమవారం ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించిన విషయం విదితమే. బీఎం ఖైతాన్ గ్రూప్ నిర్వహణలోని ఎవరెడీ కొనుగోలుకి డాబర్ ప్రమోటర్లు బర్మన్ కుటుంబం ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎవరెడీలో బర్మన్ కుటుంబ వాటా 25.11 శాతానికి చేరింది. దీంతో నిబంధనల ప్రకారం ఓపెన్ ఆఫర్‌కు డాబర్ తెరతీసింది. ప్రస్తుతం ఎవరెడీలో ఖైతాన్ కుటుంబానికి 4.84 శాతం వాటా మాత్రమే ఉంది. ఈ వార్తల నేపథ్యంలో ఎవరెడీ షేరు ఎన్ఎస్ఈలో 2.2% బలపడి రూ. 357 వద్ద ముగిసింది. -
ఖద్దరు చొక్కాకై ఖాకీ తహతహ!
దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో అనేకమంది బ్యూరోక్రాట్లు తమ రెండో ఇన్సింగ్స్‌ను రాజకీయాల్లో మొదలు పెట్టేందుకు తహతహలాడుతున్నారు. ఖద్దరు చొక్కా వేసుకొని ప్రజలకు మరింతగా సేవ చేసుకోవాలని ఎన్నికల కదన రంగంలోకి దిగుతున్నారు. యూపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా ఇటీవలే ఐపీఎస్ పదవికి రాజీనామా చేసినా ఆశిమ్ అరుణ్ రెండ్రోజుల కిందటే బీజేపీలో చేరడం, ఆయనతో పాటు మారో మాజీ ఐఏఎస్ రామ్ బహదూర్ సైతం బీజేపీ నుంచి పోటీ చేసేందుకు సిధ్దపడుతుండటం ప్రస్తుతం ఆసక్తి రేపే అంశంగా మారింది. అఖిలేష్ అడ్డా నుంచే ఆశిమ్ పోటీ... 1994 బ్యాచ్‌కు చెందిన 51 ఏళ్ల ఆశిమ్ అరుణ్ పదిరోజుల కిందటే స్వచ్చంద పదవీ విరమణ ప్రకటించారు. 2017 ఎన్నికల్లో గెలిచిన అనంతరం యూపీ సీఎం యోగి ఆదిత్యనా«థ్ ఆశిమ్ను కాన్పూర్ మొదటి పోలీస్ కమిషనర్‌గా నియమించారు. ఇక్కడ రౌడీ మూకల ఆట పట్టించి ఆశిమ్ తన సామర్థ్యాన్ని చాటుకున్నారు. అంతకుముందు ఆశిమ్ అలీఘర్, గోరఖ్‌పూర్, ఆగ్రా వంటి జిల్లాల్లో పోలీసు బలగాలకు నాయకత్వం వహించడమే కాకుండా, ఉత్తరప్రదేశ్‌లోని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌కు నేతృత్వం వహించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతికి చెందిన దళిత ఉపకులం ‘జాతవ్’ వర్గానికి చెందిన ఆశిమ్ అరుణ్ యూపీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజే వీఆర్ఎస్ ప్రకటించి ఈ నెల 16న బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆయన తన సొంత నియోజకవర్గం కన్నౌజ్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ గతంలో ఎంపీగా గెలిచారు. ఇక్కడి నుంచే ఆశిమ్ అరుణ్ పోటీ చేస్తుండటంతో అప్పుడే ఆయన చేరికపై అఖిలేష్ ఘాటుగా స్పందించారు. ‘ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు ఆశిమ్ అరుణ్ సహాయపడుతున్నారని నేను ఆరోపించాను. బీజేపీలో చేరికతో అది నిజమైంది’ అని విమర్శలు గుప్పించారు. ఇక ఆశిమ్ అరుణ్‌తో పాటే మాజీ ఐఏఎస్ అధికారి రామ్ బహదూర్ సైతం ఆదివారం బీజేపీలో చేరారు. 2017కు ముందే బీఎస్పీలో చేరి మోహన్‌లాల్‌గంజ్ నుంచి పోటీ చేసి ఓడిన రామ్ బహదూర్ ప్రస్తుతం అదే స్థానం నుంచి బీజేపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. బ్రిజ్‌లాల్ స్ఫూర్తితో.. యూపీ మాజీ డీజీపీ బ్రిజ్‌లాల్ స్ఫూర్తితోనే ఆశిమ్ అరుణ్ బీజేపీలో చేరారని తెలుస్తోంది. మాజీ ఐపీఎస్ అయిన బ్రిజ్లాల్లో 2017లో యూపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే బీజేపీలో చేరారు. పాసీ దళితుడైన బ్రిజ్‌లాల్ 2010–12లో బీఎస్పీ అధినేత్రి మాయావతి హయాంలో యూపీ డీజీపీగా పనిచేసిన సమయంలో ‘ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‘గా పేరు గడించారు. బీజేపీలో చేరాక ఆయన్ను రాజ్యసభకు పంపడంతో పాటు యూపీలో నేరస్థులు, మాఫియాల అణిచివేతలో ఆయన సహాయాన్ని యోగి ప్రభుత్వం తీసుకుంటోంది. ఇక 1988 బ్యాచ్‌కు చెందిన గుజరాత్ క్యాడర్ ఐఏఎస్ అధికారి ఏ.కే. శర్మ గత ఏడాది బీజేపీలో చేరేందుకు వీఆర్ఎస్ తీసుకున్నారు. నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా పనిచేసిన సమయంలో, ఆ తర్వాత ప్రధాని అయ్యాక ఆయన కార్యాలయంలో పని చేసిన ఏ.కే. శర్మ, వీఆర్ఎస్ తీసుకున్నాక బీజేపీ ఆయన్ను శాసనమండలికి పంపింది. గత ఏడాది మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మోదీ ఆశీస్సులతో యోగి కేబినెట్లో చేరతారనే అంతా భావించారు. కానీ ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా ఎదుగుతారనే భయంతో ఏకే శర్మను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి యోగి సుముఖత చూపలేదు. యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా నియమితులైన శర్మ... మోదీ నియోజకవర్గం వారణాసితో పాటు తూర్పు యూపీలో క్రియాశీలంగా వ్యహరిస్తున్నారు. ఇక 2014 ఎన్నికల సంందర్భంగా మరో ఐపీఎస్ అధికారి, ముంబాయి పోలీస్ కమిషనర్‌గా ఉన్న సత్యపాల్‌సింగ్‌ను యూపీలోని భాగ్‌పట్ నుంచి పార్లమెంట్‌కు పోటీ పెట్టిన విషయం తెలిసిందే. ఆయన ఆర్ఎల్డీ చీఫ్ అజిత్‌సింగ్‌ను ఓడించి వార్తల్లో నిలిచారు. అనంతరం 2019 ఎన్నికల్లో ఆయన అజిత్‌సింగ్ కుమారుడు జయంత్ చౌదరీని ఓడించారు. గతంలోనూ అనేకమంది... యూపీలో బ్యూరోక్రాట్ల నుంచి పొలిటీషియన్లుగా మారిన వారి లిస్టు పెద్దదిగానే ఉంది. మాజీ ఐఏఎస్ అధికారులు కున్వర్ ఫతే బహదూర్, పన్నా లాల్ పునియా, అహ్మద్ హసన్, శిరీష్ చంద్ర దీక్షిత్, దేవేంద్ర బహదూర్ రాయ్, దేవి దయాల్, ఐసీఎస్ అధికారులు మహేంద్ర సింగ్ యాదవ్, బీపీ సింఘాల్ తదితరులు ఉన్నారు. వీరిలో చాలామంది ఎస్పీ, బీఎస్పీ ప్రభుత్వాల్లో రాష్ట్ర మంత్రులగానూ పనిచేశారు. – సాక్షి, న్యూఢిల్లీ -
‘బోనస్‌లు తిరిగి ఇచ్చేయండి’.. ఉద్యోగులకు కంపెనీ షాక్!
దేశంలోనే నాలుగవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కంపెనీని ఏడాది మధ్యలో వీడుతున్న ఉద్యోగులను.. బోనస్ కింద చెల్లించిందంతా తిరిగి ఇచ్చేయమంటూ వేధిస్తోందన్న ఆరోపణలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గినట్లు ప్రకటన ఇచ్చుకుంటున్నప్పటికీ.. అది ఉద్యోగులకు పూర్తి ఊరట ఇచ్చేదిగా లేదని తెలుస్తోంది!. తాజాగా భారత ఐటీ కంపెనీలు డిసెంబర్ క్వార్టర్ ఫలితాల్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హెసీఎల్పై సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. రిజైన్లు చేసి కంపెనీని వీడుతున్న ఉద్యోగులను ‘పర్ఫార్మెన్స్ బోనస్’ ఇచ్చిందంతా.. తిరిగి చెల్లించాకే బయటకు వెళ్లాలని కోరుతోంది. ఈ మేరకు హెచ్ఆర్ పాలసీలోని రూల్‌ను చూపించడంతో ఉద్యోగులు ఖంగుతింటున్నారు. ఈ విషయంపై ఐటీ ఎంప్లాయిస్ యూనియన్లను ఉద్యోగులు ఆశ్రయించినట్లు సమాచారం. లేబర్ మినిస్టర్ భూపేందర్ యాదవ్‌కి, హెచ్‌సీఎల్ చైర్‌పర్సన్‌కి సైతం లేఖలు రాశారు పుణే ఐటీ యూనియన్ ప్రతినిధి హర్మీత్ సలూజ. డబ్బులు తిరిగి చెల్లించని ఉద్యోగుల ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికెట్లు, రిలీవింగ్ లెటర్లు ఇవ్వకుండా కంపెనీ వేధిస్తోందని సలూజ ఆ లేఖలో ప్రస్తావించారు. హెచ్‌సీఎల్ ప్రకటన అయితే హెచ్‌సీఎల్ మాత్రం ఈ ఆరోపణల్ని తోసిపుచ్చుతోంది. ఉద్యోగులకు తెలియకుండా తామేం చేయట్లేదని పేర్కొంది. మంత్లీ బేసిస్ మీద చెల్లించే అడ్వాన్స్ విషయంలో హెచ్ఆర్ పాలసీ ప్రకారం.. అదీ ఉద్యోగులు సంతకాలు చేసిన కాలమ్ ప్రకారమే ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేసింది. నవంబర్ 2021న ఉద్యోగులకు పంపిన మెయిల్ ప్రకారం.. సెప్టెంబర్ 1, 2021 నుంచి మార్చ్ 31, 2022 మధ్య కంపెనీని వీడే ఉద్యోగులు ఎవరైనా సరే వాళ్ల నుంచి.. ఎంప్లాయి పర్ఫార్మెన్స్ బోనస్ (EFB) రికవరీ చేస్తామని తెలిపింది. ఇక వివాదాస్పదం కావడంతో ఆఘమేఘాల మీద ఆ పాలసీని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది. వెనక్కి తగ్గలేదు! వివాదాస్పద ఈ పాలసీ విషయంలో హెచ్‌సీఎల్ ఒక స్పష్టమైన ప్రకటనంటూ ఇవ్వకపోవడం గమనార్హం. దశాబ్దానికి పైగా జూనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులు జీతం కాకుండా.. అడ్వాన్స్‌గా చెల్లింపులు అందుకుంటున్నారు. అలాగే ఇకపై కంపెనీ మా ఉద్యోగుల కోసం ముందస్తు వేరియబుల్ చెల్లింపును కొనసాగిస్తుంది. అంతేకాదు డిసెంబర్ 22, 2021 నుంచి రికవరీలను కూడా మాఫీ చేసిందని హెచ్‌సీఎల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కానీ, ఇక్కడే గందరగోళం నెలకొంది. ఈఎఫ్‌బీ రికవరీ పాలసీని మాత్రమే హెచ్‌సీఎల్ వెనక్కి తీసుకుందని.. ఏపీఎంబీ (Advance Monthly Performance Bonus) విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సలూజ చెప్తున్నారు. ఈఎఫ్‌బీ అనేది ఉద్యోగులందరికీ వర్తించే బోనస్ కాగా.. ఏఎంపీబీ మాత్రం ప్రత్యేకించి ప్రాజెక్టుల కోసం పని చేసే ఉద్యోగులందరికీ జారీ చేస్తున్న బోనస్. సో.. రిజైన్ చేసిన ఉద్యోగులు ఇంకా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్న మాట!. -
Nellore: టీడీపీలో ‘కార్పొరేషన్’ బ్లో అవుట్.. రాజీనామాల బాట
నెల్లూరు (టౌన్): కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫలితాలపై సమీక్ష సందర్భంగా పార్టీకి వీర విధేయులుగా ఉన్న పలువురు సీనియర్ నేతలను సస్పెండ్ చేయడం, మరి కొందరిని పార్టీ నుంచి తొలగించడం, ఇంకొందరిని సంజాయిషీ కొరడంతో ఆ పార్టీలో నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. పార్టీ అధినేత ఎన్నికల్లో తప్పులు చేసిన పెద్దలను వదిలి చిన్నచిన్న నాయకుల మీద చర్యలు తీసుకోవడం, ఆగ్రహం వ్యక్తం చేయడంపై తమ్ముళ్లు మండి పడుతున్నారు. అధినేత తీరును నిరసిస్తూ ఆదివారం టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ఒట్టూరు సంపత్‌యాదవ్ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మంగళవారం మంగళగిరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో 25వ డివిజన్ నుంచి 54వ డివిజన్ వరకు పార్టీ జిల్లా నాయకులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ లోపే మరి కొంత మంది మాజీ కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. అభ్యర్థుల విషయంలో ఎవరిని సంప్రదించకుండానే ఇళ్లల్లో కూర్చొని ప్రకటించారని డివిజన్ నాయకులు చెబుతున్నారు. కనీసం పోటీ ఇచ్చే వారిని కూడా బరిలో నిలపకుండా డబ్బులు తీసుకుని డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారని ఆరోపిస్తున్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోకుండా ఎలాంటి సంబంధం లేని తమపై చర్యలు తీసుకోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా పార్టీ ఇంతగా భ్రష్టుపట్టడానికి కారణమైన సిటీ, రూరల్ నియోజకవర్గాల ఇన్చార్జిల తీరు నిరసిస్తూ ఇటీవల ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఏకమై నినదించిన విషయం తెలిసిందే. మంగళవారం తర్వాత వీరిపై వేటు పడే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒక వేళ వారిపై చర్యలు తీసుకోకపోతే సిటీ, రూరల్ నియోజకవర్గాల్లోని టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలతో పాటు క్యాడర్ మొత్తం మూకుమ్మడిగా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. -
భారత్ ఫైనాన్షియల్ ఎండీ, ఈడీల రాజీనామా
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఇండస్ఇండ్ బ్యాంక్‌లో భాగమైన భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ (బీఎఫ్ఐఎల్) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), సీఈవో శలభ్ సక్సేనా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.. సీఎఫ్‌వో ఆశీష్ దమానీ తమ పదవులకు రాజీనామా చేశారు. పోటీ కంపెనీ అయిన సూక్ష్మ రుణాల సంస్థ స్పందన స్ఫూర్తిలో (ఎస్‌ఎస్‌ఎఫ్‌ఎల్) వారు చేరనున్నట్లు సమాచారం. సక్సేనా, దమానీ నవంబర్ 25న తమ తమ పదవులకు రాజీనామా చేసినట్లు ఎక్సే్చంజీలకు బీఎఫ్ఐఎల్ సోమవారం తెలియజేసింది. తాత్కాలికంగా ఈడీ హోదాలో జే శ్రీధరన్‌ను, రోజు వారీ కార్యకలాపాల పర్యవేక్షణకు శ్రీనివాస్ బోనం ను నియమించినట్లు పేర్కొంది. సక్సేనా, దమానీల విషయంలో కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోంది. సక్సేనాను ఎండీ–సీఈవోగా, దమానీని ప్రెసిడెంట్–సీఎఫ్‌వోగా నియమించినట్లు ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ఎల్ నవంబర్ 22న ప్రకటించింది. అయితే, వారు తమ సంస్థలో రాజీనామా చెయ్యలేదంటూ ఆ మరుసటి రోజైన నవంబర్ 23న బీఎఫ్ఐఎల్ తెలిపింది. ఒకవేళ చేస్తే.. నిర్దిష్ట షరతులకు అనుగుణం గా వారు వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొంది. నోటీసు పీరియడ్, పోటీ సంస్థలో చేరకూడదు వంటి నిబంధనలు పాటించాల్సి ఉంటుందని వివరించింది. అప్పటికైతే మాత్రం వారిద్దరూ తమ సంస్థలోనే కొనసాగుతున్నారని బీఎఫ్ఐఎల్ స్పష్టం చేసింది. కస్టమర్ల సమ్మతి లేకుండా సాంకేతిక లోపం వల్ల 84,000 రుణాలు మంజూరైన అంశంపై సమీక్షలో సహకరిస్తామంటూ వారు చెప్పినట్లు పేర్కొంది. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో సక్సేనా, దమానీకి వర్తింపచేసే నిబంధనల అమలుపై బీఎఫ్ఐఎల్ వివరణ ఇవ్వలేదు. -
రోజుకో ట్విస్ట్.. మంచు విష్ణు యాక్షన్ ప్లాన్ ఏంటి?
Maa Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు ముగిసినా రోజుకో ట్విస్ట్ తెరమీదకి వస్తుంది. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి మా ఎన్నికలు చాలా ఉత్కంఠను రేపాయి. అదే స్థాయిలో ఎన్నికల తర్వాత కూడా పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్, నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేయడం, అనంతరం ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన 11మంది సభ్యులు మూకుమ్మడిగా రాజీనామాలను ప్రకటించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. చదవండి: ఆ విషయం గురించి నేను చెప్పకూడదు: 'మా' ఎన్నికల అధికారి మా ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయన ముందు అనేక సవాళ్లు వచ్చి పడ్డాయి. దీంతో మా అధ్యక్షుడిగా ఎన్నికైన విష్ణు ఈ మూకుమ్మడి రాజీనామాలను ఆమోదిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సాధారణంగా మా అసోసియేషన్‌లో ఏదైనా ఒక పదవి ఖాళీ ఏర్పడితే, దాన్ని భర్తీ చేసే అధికారి మా అధ్యక్షుడికే ఉంటుంది. ‘మా’ బైలాస్ నిబంధన ప్రకారం.. మా సభ్యుడి పోస్ట్‌కు ఖాళీ ఏర్పడితే.. ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకొని దాన్ని భర్తీ చేస్తారు. దీనికి జనరల్ బాడీ సభ్యులందరి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మరి మూకుమ్మడి రాజీనామాలను సైతం ఆమోదించి ఆ స్థానంలో కొత్తవారిని నామినేట్ చేస్తారా? లేక బుజ్జగింపులు చేసి రాజీనామాలను వెనక్కి తీసుకునేలా ఒప్పిస్తారా అన్నది చూడాల్సి ఉంది. చదవండి: కొత్త కుంపటిపై ప్రకాశ్‌రాజ్ క్లారిటీ -
పంజాబ్ లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు
-
Amarinder Singh: కెప్టెన్ కథ కంచికి చేరిందిలా!
ఒకప్పుడు పంజాబ్ కాంగ్రెస్‌ను విజయతీరాలకు నడిపించిన సింగ్ సాబ్ చివరకు అవమానకరంగా నిష్క్రమించారు. కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లు అమరీందర్ రాజీనామాకు కూడా చాలా కారణాలున్నాయి. కానీ ఎన్ని కారణాలున్నా, పట్టుమని ఎన్నికలకు 5 నెలల సమయం కూడా లేని ఈ సమయంలో అమరీందర్‌ను తొలగిస్తారని చాలామంది ఊహించలేదు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. రాబోయే ఎన్నికల్లో గెలిచి పంజాబ్‌లో పాగా వేయాలని ఆప్, పునర్వైభవం దక్కించుకోవాలని ఆకాళీదళ్, ఒంటరిగా సత్తా చూపాలని బీజేపీ.. మల్లగుల్లాలు పడుతుంటే, ఇవేమీ పట్టనట్లుగా ఉన్నట్లుండి సీఎంను మార్చాలని కాంగ్రెస్ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. పార్టీ లో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోవడంతో తప్పక ఈ నిర్ణయం తీసుకున్నామని పార్టీ వర్గాలు చెప్పాయి. పంజాబ్ రాజకీయాలు తెలిసి కూడా కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకోవడం దుస్సాహసమేనని రాజకీయ పండితుల అభిప్రాయం. మరి ఉన్నట్లుండి అమరీందర్‌ను తొలగించారా? కాంగ్రెస్ హైకమాండ్‌ను ఇందుకోసం ప్రేరేపించిన అంశాలేంటి? అనేవి శేష ప్రశ్నలు. వీటికి సమాధానంగా కొందరు రాజకీయ విశ్లేషకుల అంచనాలు ఇలా ఉన్నాయి... ► మసకబారుతున్న ప్రభ: సంవత్సరాలుగా పంజాబ్ కాంగ్రెస్‌లో ఎదురులేని నేతగా ఉన్న అమరీందర్ ప్రతిష్ట క్రమంగా మసకబారుతోందని కొన్ని సర్వేలు ఎత్తి చూపాయి. ఉదాహరణకు 2019లో ఆయన రేటింగ్ 19శాతం ఉండగా, 2021 ఆరంభంలో 9.8శాతానికి పడిపోయింది. కాంగ్రెస్ సొంతంగా రాష్ట్రంలో నిర్వహించిన సర్వేలో కూడా కెపె్టన్ పట్ల ప్రతికూలత కనిపించినట్లు సమాచారం. ► డ్రగ్ మాఫియా: పంజాబ్ యువతను పీలి్చపిప్పి చేస్తున్న డ్రగ్ మాఫియాపై అమరీందర్ ఉక్కుపాదం మోపుతారని, ఆయన గురు గ్రంధ్ సాహిబ్‌పై ప్రమాణం చేయగానే అంతా ఆశించారు. కానీ గత ప్రభుత్వ హయంలో లాగానే డ్రగ్స్, ఇసుక మాఫి యాపై ఎలాంటి తీవ్ర చర్యలు కెప్టెన్ తీసుకోలేదు. ► బాదల్స్తో సంబంధాలు: 2015లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో గొడవలకు బాదల్స్ కారణమని ప్రజలు భావించారు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశించారు. కానీ బాదల్స్‌పై ఆరోపణలను హైకోర్టు తోసిపుచి్చంది. దీంతో కెప్టెన్‌పై ప్రజల్లో వ్యతిరేకత ప్రబలింది. పైగా సిక్కు యువత ఎక్కువగా ఉపా కేసుల్లో అరెస్టు కావడం అమరీందర్‌కు ప్రతికూలించింది. ► నెరవేరని ఆశలు: ఎన్నికల హామీల్లో కీలకమైన ఉద్యోగ కల్పన, నిరుద్యోగ భృతి వంటివాటిని అమరీందర్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. పెద్దల పింఛను సక్రమంగా అందడం లేదన్న ఆరోపణలు వచ్చాయి. ► ఆందోళనలు: అమరీందర్ పదవీ కాలంలో రాష్ట్రంలో పలు విషయాలపై ఆందోళనలు పెరిగాయి. ప్రభుత్వ ఉద్యోగులు, పారా టీచర్లు, రైతులు, ఆశా వర్కర్లు, నిరుద్యోగులు, దళితులు.. ఇలా అనేక వర్గాలు వారి బాధలు తీరడంలేదంటూ ఆందోళనలు ముమ్మరం చేశాయి. రైతు ఆందోళనలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తున్నాయన్న కెప్టెన్ వ్యాఖ్యలు ఆయనపై విముఖత పెంచాయి. ► అందుబాటులో ఉండరు: అమరీందర్ అందుబాటులో ఉండరనేది ఆయనపై ఎంఎల్ఏల ఆరోపణ. ఎక్కువగా మొహాలీ ఫామ్‌హౌస్‌లో ఉంటారని, ప్రజలను, పారీ్టనేతలను కలవరని, అధికారులపై అతిగా ఆధారపడతారని చాలామందిలో అసంతృప్తి ఉంది. ► సిద్ధూ బ్యాటింగ్: గతంలో కూడా అమరీందర్‌పై పార్టీలో అసంతృప్తులుండేవారు. కానీ వారి గొంతు పెద్దగా వినిపించేది కాదు. ఈసారి సిద్ధూ రూపంలో కెపె్టన్‌కు అతిపెద్ద అసమ్మతి ఎదురైంది. ఇతర అసంతృప్తి నేతల అండ దొరకటం, మంత్రి పదవి పోవటంతో సిద్దూ చూపంతా అమరీందర్‌ను దింపడంపైనే ఉంది. చివరకు తన బ్యాటింగ్ ఫలించి కెపె్టన్ ఇంటిబాట పట్టారు. కానీ అంతమాత్రాన కెప్టెన్‌ను తక్కువగా తీసిపారేయడానికి వీల్లేదు. ఆయన మద్దతుదారులు రాబోయే ఎన్నికల్లో ఏం చేస్తారన్నది పంజాబ్‌లో కాంగ్రెస్ పరిస్థితిని డిసైడ్ చేస్తుందని విశ్లేషకుల భావన. – నేషనల్ డెస్క్, సాక్షి -
మోదీ కేబినెట్లో భారీ ప్రక్షాళన
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ తాజా కేబినెట్లో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. దాదాపు 15 మంది మంత్రులకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికినట్లు సమాచారం. ఈ మేరకు పలువురు మంత్రులు రాజీనామా చేశారు. వీరిలో కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్, కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్, విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్, ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానందగౌడ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దేవశ్రీ చౌదరి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మంత్రి సంజయ్ ధోత్రే, కేంద్ర అటవీశాఖ మంత్రి బాబుల్ సుప్రియోలు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. 12 మంది కేంద్ర మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు. వరుసగా.. 1.సదానందగౌడ 2.రవిశంకర్‌ప్రసాద్ 3.థావర్‌చంద్ గెహ్లాట్ 4.రమేశ్ పోఖ్రియాల్ 5.హర్షవర్థన్ 6. ప్రకాశ్ జవదేకర్ 7.సంతోష్‌కుమార్ గాంగ్వార్ 8.బాబుల్ సుప్రియో 9.సంజయ్ దోత్రే 10.రతన్‌లాల్ కతారియా 11.ప్రతాప్‌చంద్ర సారంగి 12.దేవశ్రీ చౌదరి -
Aisha Sultana: అయిషాపై దేశద్రోహం కేసు.. అదిరిపోయే ట్విస్ట్
లక్షద్వీప్ ఫిల్మ్ మేకర్ అయిషా సుల్తానాపై దేశ ద్రోహం కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో అదిరిపోయే ట్విస్ట్ చోటు చేసుకుంది. బీజేపీ అధ్యక్షుడి తీరును ఎండగడుతూ.. ఆమెకు మద్ధతుగా బీజేపీ నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. న్యూఢిల్లీ: లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్‌తో పాటు కేంద్ర ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిందన్న ఆరోపణలపై కేరళ ఫిల్మ్ మేకర్. నటి అయిషా సుల్తానాపై దేశ ద్రోహం కేసు నమోదైంది. లక్షద్వీప్ బీజేపీ యూనిట్ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ హాజీ ఫిర్యాదుతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమెకు మద్దతుగా బీజేపీ నేతలు మూకుమ్మడి రాజీనామా చేశారు. అయిషాకు మద్దతుగా లక్షద్వీప్ బీజేపీ ప్రధాన కార్యదర్శితో పాటు కీలక నేతలు, కార్యకర్తలు మొత్తం 15 మంది రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖల్ని అబ్దుల్ ఖాదర్ హాజీకి పంపించారు. ‘‘లక్షద్వీప్‌లో ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ చేపడుతున్న చర్యలు బీజేపీకి కూడా తెలుసు. ఆయన విధానాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రఫుల్ వ్యవహారంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేసిన వాళ్లలో మీరూ(హాజీ) కూడా ఉన్నారు. ప్రఫుల్, జిల్లా కలెక్టర్ తప్పులను ఎండగట్టిన బీజేపీ నేతలు చాలామందే ఉన్నారు. ఇదే తరహాలో చెట్లాట్ నివాసి అయిన అయిషా.. తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకుంద’ని ఆ నేతలంతా అయిషాకు మద్దతుగా లేఖలో వ్యాఖ్యలు చేశారు. ఆమెపై(అయిషా) ఫిర్యాదు చేయడం తప్పు. ఒక సోదరి భవిష్యత్తును, ఆమె కుటుంబాన్ని నాశనం చేయాలని మీరు ప్రయత్నిస్తున్నారు.ఈ తీరును మేం తట్టుకోలేకపోతున్నాం. అందుకే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాం అని బీజేపీ కార్యదర్శి అబ్దుల్ హమీద్ తదితరులు ఆ లేఖలపై సంతకాలు చేశారు. కాగా, ఓ మలయాళ టీవీ చర్చాకార్యక్రమంలో పాల్గొన్న ఆయిషా.. లక్షద్వీప్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం కోవిడ్ -19ను ఒక జీవాయుధంగా ప్రయోగించిందని, ఇందుకోసం అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్‌ను వాడిందని పేర్కొంది. ప్రఫుల్ పటేల్ రాకముందు లక్షద్వీప్‌లో కరోనా కేసులు లేవని, ఆయన నిర్లక్క్ష్యం వల్లే కేసులు పుట్టుకొచ్చాయని ఆమె ఆ డిబెట్లో మాట్లాడింది. అయితే ఇవి కేంద్ర ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలంటూ లక్షద్వీప్ బీజేపీ యూనిట్ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ హాజీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అయిషాపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. చదవండి: నీటి అడుగున నిరసన చదవండి: హీరో పృథ్వీకి భారీ మద్ధతు -
Etela Rajender: ఈటలతో పాటే తుల ఉమ రాజీనామా?!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఊహించినదే జరిగింది. నెలరోజుల ఉత్కంఠకు ముగింపు లభించింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తనకు రాజకీయ జీవితాన్నిచ్చిన టీఆర్ఎస్ పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు. తన మద్దతుదారులతో కలిసి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు. ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకుంటానని ప్రకటించారు. దీంతో 19 సంవత్సరాల పాటు టీఆర్ఎస్తో ఉన్న అనుబంధానికి ఫుల్స్టాప్ పడింది. ఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకులను కలిసి వచ్చిన తరువాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ను వదిలి బీజేపీలో చేరాలని ఈటల నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తరువాతే బీజేపీలో చేరాలనే నిబంధన మేరకే ఆయన శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. ఒకటి రెండు రోజుల్లో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి తన రాజీనామా లేఖను పంపించనున్నారు. ఈ వారం రోజుల్లోనే ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉంది. 11వ తేదీ వరకు మంచిరోజులు లేకపోవడంతో బీజేపీలో చేరిక కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు ఈటల వర్గాల ద్వారా తెలిసింది. ఈటల రాజీనామా ఆమోదం పొందితే మరోసారి హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక అనివార్యం కానుంది. పార్టీ కార్యకర్త నుంచి మంత్రిగా ఎదిగి.. తెలంగాణ రాష్ట్ర సమితి చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు టీఆర్ఎస్ స్థాపించిన తరువాత 2002లో ఈటల రాజేందర్ గులాబీ కండువా కప్పుకున్నారు. ఉద్యమాల ఖిల్లాగా పేరొందిన కరీంనగర్ జిల్లా నుంచి టీఆర్ఎస్లో చేరిన కొద్దిమంది ముఖ్య నాయకుల్లో ఆయన ఒకరు. బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకొని పౌల్ట్రీ పరిశ్రమను స్థాపించిన ఈటలను కేసీఆర్ ప్రోత్సహించారు. అందులో భాగంగానే సామాన్య కార్యకర్తగా పార్టీలో చేరిన ఆయనకు రాజకీయంగా అవకాశాలు కల్పించారు. కేసీఆర్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొనడం, బీసీ నాయకుడిగా గొంతెత్తడం ఉత్తర తెలంగాణలో ఆయన కీలక నేతగా ఎదిగేందుకు దోహదపడ్డాయి. ఈ క్రమంలోనే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పార్టీ ముఖ్య నాయకుల్లో ఒకరిగా, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పలు పదవులు నిర్వర్తించారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కమలాపూర్ నుంచి పోటీ చేసి అప్పటి టీడీపీ నేత, మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డిపై తొలిసారి విజయం సాధించారు. నాటి నుంచి వెనుదిరిగి చూడని ఈటల 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2009లో శాసనసభ స్థానాల పునర్విభజనలో హుజూరాబాద్‌కు వెళ్లిన ఈటల మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు. 2010లో తెలంగాణ ఆత్మగౌరవ నినాదంతో జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి గెలిచారు. శాసనసభలో టీఆర్ఎస్ ఎల్పీ నాయకుడిగా 2014 వరకు కొనసాగారు. 2014లో రాష్ట్ర అవతరణ అనంతరం జరిగిన ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి కేసీఆర్ కేబినెట్లో ఏకంగా ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2018 ఎన్నికల్లో గెలిచి టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు హుజూరాబాద్ ఎమ్మెల్యేగానే రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తరువాత జరిగిన పరిణామాలతో నెలరోజుల క్రితం మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన ఈటల ఇప్పుడు పార్టీకి రాజీనామా చేశారు. రేపోమాపో ఎమ్మెల్యే పదవికి గుడ్‌బై చెప్తారు. నియోజకవర్గంలోని ప్రతీ మండలం నుంచి కనీసం 50 మందికి తగ్గకుండా స్థానిక నాయకులు శుక్రవారం శామీర్‌పేటలోని ఈటల నివాసానికి వెళ్లి మద్దతు ప్రకటించారు. కాగా.. ఈటల టీఆర్ఎస్కి రాజీనామా చేసి హుజూరాబాద్‌కు రానున్న నేపథ్యంలో టీఆర్ఎస్ కౌంటర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఉప ఎన్నిక అనివార్యం అని తేలడంతో మాజీ మంత్రిపై ముప్పేట దాడికి టీఆర్ఎస్ రంగం సిద్ధం చేస్తోంది. ఈనెల 11, 12 తేదీల్లో మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్ తదితర ముఖ్య నాయకులతో హుజూరాబాద్‌లో పర్యటన ఖరారైంది. మొత్తంగా మండలాల్లో ఈటలకు మద్దతుగా ని లిచిన పార్టీ కేడర్‌ను కూడా ఆయనకు దూరం చేసే ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఈటల రాజీ నామా ప్రకటన తరువాత ఆయన సొంత మండలం కమలాపూర్‌లో టీఆర్ఎస్ నాయకులు శుక్రవారం సంబరాలు చేసుకోవడం, కేసీఆర్ ఫొటో కు క్షీరాభిషేకం చేయడం వంటి చర్యలు గులాబీ పార్టీ వ్యూహాన్ని బహిర్గతం చేస్తోంది. ఈటల రాజీనామాతో రాజకీయం మరింత వేడెక్కింది. ముప్పేట దాడికి టీఆర్ఎస్ ప్రణాళిక మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైనప్పటి నుంచే ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ అధిష్టానం నజర్ పెట్టింది. కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్‌ను ఇన్చార్జిగా నియమించింది. హుజూరాబాద్ నుంచి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులెవ్వరూ ఆయన వెంట వెళ్లకుండా ‘కట్టుదిట్టమైన’ ఏర్పాట్లు చేయించింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఈటల వెంట జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తుల ఉమతోపాటు హుజూరాబాద్‌కు చెందిన కొందరు నాయకులు మినహా ఎవరూ వెళ్లలేదు. ప్రజాబలం తనకు ఉందని చెపుతున్న ఈటలను ప్రజాప్రతినిధులను కట్టడి చేయడంతో ఇరుకున పెట్టి విజయం సాధించారు. ఈ క్రమంలో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. చదవండి: ఈటల వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతల కౌంటర్ -
కమల్ హాసన్ పార్టీకి బీటలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు కమల్‌హాసన్ అధ్యక్షుడుగా ఉన్న మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) చవిచూసిన ఘోర పరాజయం ఆ పార్టీ బీటలు వారేలా చేసింది. ఉపాధ్యక్షుడు సహా మొత్తం కార్యవర్గం రాజీనామా చేసింది. తాజా ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకు గాను 154 స్థానాల్లో పోటీచేసిన ఎంఎన్ఎం మిగిలి న స్థానాలను కూటమి పార్టీలకు కేటాయించింది. ఇండియ జననాయక కట్చి కూటమికి సారథ్యం వహిస్తూ ముఖ్యమంత్రి అభ్యర్దిగా కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్‌హాసన్ బీజేపీ అభ్యర్ది చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతోపాటు ఆ పార్టీ అభ్యర్దులెవరూ గెలవలేదు. ఈ ఓటమిపై కమల్ వైఖరి ఎలా ఉన్నా పార్టీ శ్రేణు లు మాత్రం జీర్ణించుకోలేక పోయాయి. పార్టీ అధ్యక్షుడైన కమల్ సైతం ఓటమిపాలు కావడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. అనేక నియోజకవర్గాల్లో మక్కల్ నీది మయ్యం నాలుగో స్థానంలో నిలిచింది. ఓటమికి దారితీసిన కారణాలను విశ్లేషించుకునేందుకు కమల్ పార్టీ కార్యవర్గంతో ఈనెల 6వ తేదీ న సమావేశంకాగా, కార్యనిర్వాహక వర్గంలోని డాక్టర్ ఆర్ మహేంద్రన్ (ఉపాధ్యక్షుడు) సహా 10 మంది రాజీనామా లేఖలను కమల్‌కు సమర్పించా రు. పార్టీలో ప్రజాస్వామ్యం లేకపోవడాన్ని నిరసి స్తూ ఉపాధ్యక్ష పదవితోపాటూ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు మహేంద్రన్ మీడియాకు చెప్పారు. ఈ నేపథ్యంలో కమల్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మహేంద్రన్ ఒక ద్రోహి అని దుయ్యబట్టారు. ‘ఓటమికి భయపడి పారిపోయే పిరికిపందలను పెద్దగా పట్టించుకోను. నా లక్ష్యంలో మార్పు లేదు, మాతృభూమి, ప్రజల కోసం ముందుకు సాగుతాం’అని స్పష్టం చేశారు. పరాజయ భారాన్ని మోయలేక రాజకీయా ల నుం చి కమల్ నిష్క్రమిస్తారని మక్కల్ నీది మయ్యం నేతలు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
టీడీపీలో రాజీనామాల పర్వం..
టీడీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ జిల్లాలోని కీలక నేతలు పార్టీని వీడుతుండడంతో కార్యకర్తలు, నాయకుల్లో నైరాశ్యం ఆవహించింది. ఇప్పటికే ప్రాభవం కోల్పోయిన పార్టీలో కొనసాగాలా.. వద్దా అన్న సందిగ్ధం నెలకుంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: తెలుగుదేశం పార్టీకి జిల్లాలో గడ్డు పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత ఎన్నికల్లో ప్రజాదరణ కోల్పోయిన పార్టీ ప్రతిష్ట క్రమక్రమంగా క్షీణిస్తోంది. అవసరం తీరిన తరువాత తన, మన అనే తేడా లేకుండా... సీనియర్లనే కనీస గౌరవం లేకుండా పూచిక పుల్లను వాడిప డేసినట్లు పక్కన పడేయడం ఆ పార్టీ అధినేతల సంప్రదాయం. దశాబ్దాలుగా అక్కడ అదే జరుగుతోంది. దీనిని జీర్ణీంచుకోలేని కొందరు సీనియర్లు పార్టీని వీడుతున్నారు. మరికొందరు పార్టీలోనే ఉంటూ తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి పడాల అరుణ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు శనివారం ప్రకటించారు. చదవండి: టీడీపీకి అభ్యర్థులు కరువు.. బాబు హైరానా.. గజపతినగరంలోని తన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు హయాంలో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల 1985లో రాజకీయ రంగ ప్రవేశం చేశానని, ఎన్నో పదవులు చేపట్టి ప్రజలకు ఎంతో సేవ చేశానని, కానీ వాటిని ఈ రోజు తెలుగు దేశం పార్టీ కనీసం గుర్తించక పోవడం వల్లనే రాజీనామా చేస్తున్నానని అరుణ వివరించారు. మూడు దశాబ్దాలుగా ఆమెకు టీడీపీతో అనుబంధం ఉంది. చదవండి: పంచాయతీ ఎన్నికలు: టీడీపీ నేతల బరితెగింపు.. 1987లో బొండపల్లి మండల అధ్యక్షురాలిగా, 1989, 1994లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1996లో మంత్రి పదవి చేపట్టారు. 1999 నుంచి చాలా పదవులు నిర్వహించారు. అంతటి క్రియాశీలకంగా ఉండే పడాల అరుణకు 2013 నుంచి పారీ్టలో ప్రాధాన్యం తగ్గడం మొదలైంది. ‘‘పార్టీ కోసం అంకిత భావంతో పని చేసిన నన్ను రోజురోజుకు గుర్తింపు లేనివిధంగా చేశారు’’... అంటూ ఆమె విలేకరుల ఎదుట కన్నీటిపర్యంతమవ్వడం టీడీపీలో సీనియర్లు, పారీ్టకి కట్టుబడి ఉన్నవారి పరిస్థితికి అద్ధం పట్టింది. అందిరిదీ అదే వేదన... ఒక్క అరుణకే ఈ పరిస్థితి కాదు. జిల్లాలో అనేక మంది టీడీపీ నాయకులు, సీనియర్ల పరిస్థితి కూడా ఇదే. మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావును కూడా ఇదే విధంగా పార్టీని వీడేలా చేశారు. ఆయన కూడా చాలా కాలం పాటు టీడీపీకి సేవచేసి, చివరికి తనకు పారీ్టలో కనీస గుర్తింపు లేదని మదనపడి రాజీనామా చేసి ఇటీవలే బయటకు వచ్చేశారు. ఆ తరువాత మరో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత తిరుగుబావుటా ఎగురవేశారు. ఆమెకు ఇంకో ఎమ్మెలే కె.ఎ.నాయుడు జతకలిశారు. విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్ష పదవిని జూనియర్ అయిన కిమిడి నాగార్జునకు ఇవ్వడాన్ని నిరసిస్తూ గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కె.ఎ. నాయుడు తానే వేరుగా విజయనగరం పార్లమెంటరీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేశారు. ఆయన బాటలోనే విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కొందరు నేతలతో కలిసి ప్రత్యేక వర్గాన్ని ఏర్పరచుకుని విజయనగరం పార్టీ కార్యాలయాన్ని స్థాపించారు. అప్పటికే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు బంగ్లాలో నగరపార్టీ కార్యాలయం నడుస్తోంది. ఈ పంచాయితీ టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు వెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదు. మీసాల గీతకు లభించాల్సిన గుర్తింపు ఇప్పటికీ దక్కలేదన్న వాదన వినిపిస్తోంది. పోనీ అశోక్ పెద్దరికమైనా నిలిచిందా అంటే అదీ లేదు. అశోక్మీద అమిత గౌరవం ఉందని చెప్పుకునే చంద్రబాబు పార్టీ కార్యాలయం విషయంలో అశోక్ పెద్దరికాన్ని స్థానిక నేతలు ధిక్కరిస్తున్నా ఏమీ చేయలేదు. ఆయన గౌరవాన్ని కాపాడలేదు. ఈ విషయంలో సీనియర్‌గా అశోక్ తన అనుచరుల వద్ద వాపో యారు. టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడైన మహంతి చిన్నంనాయుడు పార్టీ కార్యకలాపాలకు దాదాపుగా దూరంగా ఉంటున్నారు. ఇలా సీనియర్లకు, ముఖ్య నేతలకు టీడీపీలో విలువ ఉండకపోవడంతో ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. కొందరు వేరు కుంపట్లు పెట్టుకుంటున్నారు. -
ఇద్దరు మంత్రుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజీనామాలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. ఇటీవల రాజ్యసభకు ఎంపికైన నేపథ్యంలో వీరిద్దరు తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వాటిని ఆమోదిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఈ నెల 22న పిల్లి సుభాష్‌చంద్రబోష్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేయనున్నారు.(కరోనా నివారణకు సీఎం జగన్ కీలక నిర్ణయాలు) -
గుజరాత్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ
అహ్మదాబాద్: రాజ్యసభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్లో పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు రాజీనామా చేశారు. గుజరాత్ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు జూన్ 19న ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆక్షయ్ పటేల్, జితు చౌధరి బుధవారం తనకు రాజీనామా పత్రాలు ఇచ్చారని అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేదీ వెల్లడించారు. వీరిద్దరితో పాటు మార్చి నుంచి గుజరాత్లో మొత్తం ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడం గమనార్హం. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించగానే.. మార్చిలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 182 కాగా, అధికార బీజేపీకి 103 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్‌కు ప్రస్తుతం 66 మంది సభ్యులున్నారు. జూన్ 19న ఎన్నికలు జరగనున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో మూడు బీజేపీ సిటింగ్ స్థానాలే. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ముగ్గురు అభ్యర్థులను నిలిపింది. ఎంపీల పీఏలకు ప్రవేశం లేదు కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు పార్లమెంట్‌లోకి ఎంపీల వ్యక్తిగత సిబ్బందిని అనుమతించకూడదని లోక్‌సభ సచివాలయం గురువారం నిర్ణయించింది.సమావేశాలు జరుగుతున్న సమయంలో సుమారు 800 మంది ఎంపీల పీఏలను ప్రాంగణంలోకి అనుమతిస్తే కరోనా సమస్య మరింత జటిలమవుతుందని లోక్‌సభ సెక్రటేరియట్ సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీవాస్తవ పేర్కొన్నారు. -
'అవమానం భరించలేకపోయాం'
కోల్‌కతా : కరోనా కట్టడికి వైద్య సిబ్బంది చేస్తున్న కృషి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డాక్టర్ల తర్వాత కరోనా రోగులను కంటికి రెప్పలా కాపాడే బాధ్యత ఆసుపత్రిలో నర్సుల పైనే ఉంటుంది. రోగులు పెట్టే ఇబ్బందులను సైతం పక్కనపెట్టి నర్సులు వారి విధులు నిర్వర్తిసుంటారు. మరి అలాంటి వారికి ఎంత కష్టం వచ్చిందో కానీ దాదాపు 300 మంది నర్సులు తమ ఉద్యోగానికి రాజీనామా సమర్పించారు. ఈ ఘటన కోల్‌కతాలో చోటుచేసుకుంది. (ఉద్యోగం పోయినా లాటరీలో కోట్లు వచ్చాయి) ఈ విషయాన్ని కోల్‌కతాలోని మణిపూర్ భవన్ డిప్యూటీ రెసిడెన్సీ కమిషనర్ జెఎస్ జెయ్రితా వెల్లడించారు. ఇప్పటికే 185 మంది నర్సులు ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంఫాల్‌కు వెళ్లిపోయారని ఆమె తెలిపారు. ఇదే విషయమై క్రిస్టెల్లా అనే నర్సు తన భావోద్వేగాన్ని పంచుకుంది.' ఈ ఉద్యోగం వదిలిపెట్టి వెళుతున్నందుకు మేము సంతోషంగా లేము. కరోనా రోగులకు సేవ చేస్తున్న సమయంలో వారి నుంచి తాము వివక్ష, జాత్యంహంకారం ఎదుర్కొన్నాం. అప్పుడప్పుడు కరోనా రోగులు మాపై అనుచితంగా ప్రవర్తిస్తూ ఉమ్మి వేసేవారు. ఇంత కఠిన సమయంలోనూ మా విధులు నిర్వర్తించాం. మాకు సరైన పీపీఈ కిట్లు లేకపోవడంతో వారంతా మమ్మల్ని అనుమానంగా చేసేవారు. అందుకే ఉద్యోగానికి రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నాం' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కరోనా నేపథ్యంలో మణిపూర్‌కు చెందిన దాదాపు 300 మంది నర్సులను డిప్యూటేషన్‌పై కోల్‌కతాకు రప్పించారు. ఈ నేపథ్యంలో వారందరిని కరోనా పేషంట్లు చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రులకు అటాచ్ చేశారు. (కరోనా : 40 మిలియన్ డాలర్ల విరాళం) కాగా ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్లో 2961 కరోనా కేసులు నమోదవ్వగా, 1074 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో 259 మంది మృతి చెందారు. ఇక దేశ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,12,359కి చేరింది. కరోనా నుంచి కోలుకున్న 45,229 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా, 3,435 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 63,624 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. -
మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ రాజీనామా
-
రిక్త హస్తం
-
స్పీకర్ నిర్ణయమే కీలకం
రరాజకీయ సంక్షోభ సమయాన మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ పాత్ర కీలకంగా మారనుంది. ప్రస్తుత స్పీకర్ ఎన్పీ ప్రజాపతిపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. చట్ట ప్రకారం శాసనసభ్యులు తమ రాజీనామా పత్రాలను సభాపతికి పంపించాల్సి ఉంటుంది. అయితే రాజీనామా పత్రాలు స్పీకర్‌కి సమర్పించినంత మాత్రాన సరిపోదు. వాటిని స్పీకర్ ఆమోదించినప్పుడే ఆ రాజీనామాలను అధికారికంగా గుర్తిస్తారు. ►రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 ఒక శాసనసభ్యుడు ఎలా రాజీనామా చేయొచ్చు అనే విషయాన్ని చర్చిస్తుంది. ఎమ్మెల్యేలు తమ రాజీనామా పత్రాలను స్పీకర్‌ని ఉద్దేశించి రాయాల్సి ఉంటుంది. దాన్ని కేవలం స్పీకరే మాత్రమే ఆమోదించాల్సి ఉంటుంది. (గవర్నర్ కాదు). ►శాసనసభ్యులు సమర్పించిన రాజీనామాలు ఎవరి ఒత్తిడి వల్ల చేసినవి కావనీ, అవి వారి వారి ఇష్టపూర్వకంగా చేసినవేననీ స్పీకర్ భావించాలి. స్పీకర్‌కి విశ్వాసం కలగకపోతే దానిపైన స్వతంత్రంగా విచారణ జరిపే అధికారాన్ని కూడా ఈ ఆర్టికల్ స్పీకర్‌కి ఇచ్చింది. ►ఒకవేళ రాజీనామా స్వతంత్రంగా చేసింది కాదనీ, ఎవరి ఒత్తిడితోనైనా చేసిన రాజీనామా అని స్పీకర్ నమ్మినట్టయితే రాజీనామాని ఆమోదించకుండా ఉండే అవకాశం కూడా సభాపతికి ఉంటుంది. ►శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించడం కూడా స్పీకర్‌పైనే ఆధారపడి ఉంటుంది. కర్ణాటకలో సైతం ఇలాంటి ఘటనే జరిగింది. ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పీకర్ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు సమ్మతించింది. ►స్పీకర్ ఆమోదముద్ర వేయకుండానే ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరిపోతే వారు పార్టీ ఫిరాయింపు చట్ట పరిధిలోకి వస్తారు. -
యాక్సిస్ బ్యాంకుకు 15వేలమంది గుడ్‌బై
ముంబై: ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకులో ఉద్యోగస్థుల రాజీనామాల పరంపర కొనసాగుతోంది. గత కొద్ది నెలలుగా యాక్సిస్ బ్యాంక్‌లో 15వేల మంది ఉద్యోగాలకు రాజీనామా చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కంపెనీ వర్గాల ప్రకారం..ఎక్కువగా సీనియర్, మధ్య స్థాయి, వినియాగదారులకు సేవలందించే శాఖకు సంబంధించిన ఉద్యోగులే కంపెనీని వీడుతున్నారు. బ్యాంకులో ఇటీవల తీసుకొచ్చిన నిర్మాణాత్మక, కార్యనిర్వాహక సంస్కరణలు ఈ రాజీనామాలకు దోహదం చేసినట్టుగా భావిస్తున్నారు. బ్యాంక్‌కు సుదీర్ఘకాలం సేవలందించిన సీఈవో శిఖా శర్మ రాజీనామా తర్వాత కొత్త ఎండీ, సీఈవోగా అమితాబ్ చౌదరి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. నూతన మేనేజ్మెంట్ సరికొత్త సంస్కరణలకు నాంది పలికిన విషయం తెలిసిందే. కొత్తగా నైపుణ్యాలను స్వీకరించేవారు అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందని, స్వీకరించని వారే సంస్కరణలను వ్యతిరేకిస్తున్నారని కంపెనీ వర్గాలు తెలిపాయి. కాగా రాజీనామాలు పరంపర కొనసాగుతున్నప్పటికి ఈ ఆర్థిక సంవత్సరంలో 28వేల మంది కొత్త ఉద్యోగులను నియమించుకున్నామని, రాబోయే రెండేళ్లలో 30 వేల మందిని నియమించుకోనున్నామని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్‌లో 72 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపింది. కొత్త ఉద్యోగాల వల్ల బ్యాంకింగ్ సేవలు మరింత మెరుగయ్యాయని యాక్సిస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ రాజేష్ దహియా అన్నారు. ఆయన స్పందిస్తూ..వృద్ది, ఆదాయ పురోగతి, స్థిరత్వం అంశాలలో పురోగతి సాధించే విధంగా తమ ప్రణాళిక ఉంటుందని, తమ ఉద్యోగులే నిజమైన ఆస్థి అని తెలిపారు. కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్) వల్ల కొత్త నైపుణ్యాలను అలవర్చుకున్న వారికి ఎలాంటి నష్టం లేదని, ప్రతిభను మెరుగుపర్చుకోని వారికి ఉద్వాసన తప్పదని తెలిపారు. -
ఈ ఉద్యోగం కన్నా ప్రైవేట్ కొలువే మేలు
సాక్షి, ఖమ్మం: ఎన్నో ఆశలతో ఉద్యోగ బాధ్యతలు తీసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శు(జేపీఎస్)లు విధి నిర్వహణలో నెట్టుకు రాలేకపోతున్నారు. పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటి..కొలువు కొట్టి భరించలేని ఒత్తిడి నడుమ విధులు నిర్వహించలేక, వచ్చే వేతనం చాలక అవస్థలు పడుతున్నారు. ఆఖరుకు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్న దయనీయ పరిస్థితి జిల్లాలో నెలకొంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల కోసం ఎంతగానో ఎదురు చూసిన వీరు, ఆ పోస్టులో చేరిన కొద్ది రోజుల్లోనే తమకు ఈ జాబ్ సరిపడదని కొందర, ఇతర ఉద్యోగాలు రావడంతో మరికొందరు గుడ్‌బై చెబుతున్నారు. ఇలా..ఆరునెలల కాలంలోనే 20మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ ఉద్యోగాలను వీడారు. 2018 అక్టోబర్‌లో ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాల భర్తీకి పరీక్ష నిర్వహించింది. ప్రతిభ కనబర్చిన వారికి 2019 ఏప్రిల్‌లో నియామక పత్రాలు అందించారు. జిల్లాలో 584 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటిలో 422మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా కొలువు దీరారు. ఉద్యోగాలు రావడంతో ఆనందపడ్డారు. మొదట్లో ఉన్న సంతోషం మెల్లమెల్లగా సన్నగిల్లింది. ప్రతి నెలా రావాల్సిన వేతనాల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు పని ఒత్తిడి ఎక్కువ కావడం.. జీతాల్లో తీవ్ర జాప్యంతో ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో 20మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రాజీనామా చేసి వెళ్లిపోగా, ఒకరు మరణించగా, మరొకరు ఇప్పటి వరకు విధులకు హాజరుకావట్లేదు. ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం సైతం అందించలేదు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా విధుల్లో చేరిన వారికి కనీస ఉద్యోగ భద్రత లేదు. రూ.15వేల రూపాయల వేతనంతో మూడేళ్ల పాటు పని చేయాలని ఒప్పందం ఉండడంతో చాలా మంది ఉద్యోగాలకు మంగళం పాడుతున్నట్లు తెలుస్తోంది. వివిధ శాఖల్లో ఉద్యోగాలు రావడంతో కొందరు ఉద్యోగాలు మానివేయగా, మరికొందరు మాత్రం ఉద్యోగాలకు భద్రత లేకపోవడంతో పాటు కనీస వేతన స్కేలు అమలు చేయకపోవడం వల్లే విధుల నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. లక్ష్యం చేరుకోలేక.. జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైన వారు అధికారులు నిర్ణయించిన లక్ష్యాన్ని చేరుకోవడంలో తీవ్ర జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికార యంత్రాంగం హరితహారం, మరుగుదొడ్ల నిర్మాణాలు, తదితర పనులు వేగవంతం చేసేందుకు లక్ష్యంగా నిర్ణయిస్తారు. ఇలాంటి వాటిని చేసేందుకు వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగంలో అనుభవం తక్కువగా ఉండటం, పనిభారం ఎక్కువగా ఉండడం, అన్ని రకాల పనులు ఒకేసారి మీద పడడంతో ఉద్యోగాలను వదులుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు యువతలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు చర్యలు తీసుకుంటేనే రాజీనామాలు తగ్గే అవకాశం ఉంది. వేతనాల జాప్యం.. ప్రభుత్వ ఉద్యోగంలో చేరుతున్నాం.. జీతం ఆలస్యం కాదనే ఉద్దేశంతో అనేక మంది విధులు స్వీకరించారు. అయితే ఉద్యోగాల్లో చేరిన తర్వాత మాత్రం పరిస్థితి మరోలా ఉంది. విపరీతమైన పని ఒత్తిడి ఉండడం, నెల ముగిసిన అనంతరం వేతనాలు రాకపోవడంతో ఉద్యోగులు మానసికంగా, శారీరకంగా అలసిపోయారు. ఈ ఉద్యోగం కన్నా ప్రైవేట్ కొలువే మేలు అనే స్థితిలో అనేకమంది ఉద్యోగాన్ని వదులుకునేందుకు సిద్ధమయ్యారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా ఎన్నికైన వారు నెలనెలా వేతనాలు వస్తాయని తొలుత ఆశించారు. కానీ ఆ స్థాయిలో వేతనాలు అందని పరిస్థితి నెలకొంది. దీంతో ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడిన సందర్భాలు సైతం ఉన్నాయి. కాగా సుమారు ఆరు నెలలకు సంబంధించిన వేతనాలు గత రెండు రోజుల క్రితం విడుదలయ్యాయి. తిరిగి మళ్ళీ విధుల్లో ఉంటే తమకు వేతనాలు ఎప్పుడు వస్తాయోననే ఆందోళనలో సైతం ఉన్నారు. -
ఎమ్మెల్యేల్ని ఆదేశించలేరు!
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో 15 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాతో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు బుధవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన ఈ 15 మందిని విశ్వాసపరీక్షకు హాజరుకావాల్సిందిగా ఆదేశించలేరని సీజేఐ జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. విశ్వాసపరీక్షకు హాజరుకావాలా? వద్దా? అన్నది ఎమ్మెల్యేల ఇష్టమంది. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామా విషయంలో స్పీకర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 190, 208 కర్ణాటక అసెంబ్లీ నియమ నిబంధనలు (రెడ్‌విత్ 202ను) అనుసరించి నిర్ణయం తీసుకుంటారని చెప్పింది. ఈ వ్యవహారంలో స్పీకర్ తన విచక్షణాధికారం మేరకు, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చనీ, నిర్ణీత కాలపరిమితిలోగా నిర్ణయం తీసుకోవాలని తాము ఆదేశించబోమనితేల్చిచెప్పింది. 15 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై ఓసారి నిర్ణయం తీసుకున్నాక ఆ వివరాలను స్పీకర్ తమకు సమర్పించాలని ఆదేశించింది. స్పీకర్ తొలుత రెబెల్ ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలా? లేక రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలా?లేక రెండింటిని ఒకేసారి పరిశీలించాలా? అనేది తర్వాతి దశలో విచారణ చేపడతాం’ అని కోర్టు తెలిపింది. అసెంబ్లీలో అడుగుపెట్టబోం: ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ విషయమై రెబెల్ ఎమ్మెల్యే బీసీ పాటిల్ మాట్లాడుతూ.. ‘రాజీనామాల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మేమంతా కలసికట్టుగా తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నాం. మేం విశ్వాసపరీక్ష కోసం గురువారం అసెంబ్లీలో అడుగుపెట్టబోం’ అని స్పష్టం చేశారు. సుప్రీం తీర్పును తప్పుపట్టిన కాంగ్రెస్.. తిరుగుబాటు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ప్రజాతీర్పును తుంగలోతొక్కిన ఎమ్మెల్యేలకు రక్షణ కవచంలా సుప్రీం తీర్పుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సూర్జేవాలా విమర్శించారు. ఈ ఉత్తర్వులతో రాజకీయ పార్టీలు జారీచేసే విప్‌లు చెల్లకుండాపోతాయనీ, దేశంలోని కోర్టుల ముందు ప్రమాదకరమైన ఉదాహరణను అత్యున్నత న్యాయస్థానం ఉంచిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి ఓటేస్తా: రామలింగారెడ్డి కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి తన రాజీనామాపై వెనక్కి తగ్గారు. ఎమ్మెల్యే పదవికి తాను చేసిన రాజీనామాను ఉపసంహరించుకుంటాననీ, గురువారం జరిగే విశ్వాస పరీక్షలో కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పటికీ రామలింగారెడ్డి ముంబైలో రెబెల్ ఎమ్మెల్యేల క్యాంప్‌కు వెళ్లలేదు. తీర్పును స్వాగతిస్తున్నా: స్పీకర్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్లు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్.రమేశ్ కుమార్ తెలిపారు. ‘అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. సుప్రీంకోర్టు నాపై అదనపు భారాన్ని ఉంచింది. రాజ్యాంగంలోని నియమనిబంధనలకు అనుగుణంగా>, బాధ్యతతో ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటాను’ అని స్పీకర్ చెప్పారు. మరోవైపు సుప్రీం తీర్పు నేపథ్యంలో సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య స్పీకర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మద్దతును కూడగట్టుకునేందుకు విశ్వాసపరీక్షను కొద్దికాలం వాయిదావేయాలని కోరినట్లు సమాచారం. కాగా, ఈ భేటీ అనంతరం బీజేపీ నేతలు బోపయ్య, మధుస్వామి తదితరులు స్పీకర్‌ను కలుసుకుని విశ్వాసపరీక్షను వాయిదా వేయొద్దని విజ్ఞప్తి చేశారు. అయితే గురువారం బలపరీక్ష జరుగుతుందనీ, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని స్పీకర్ రమేశ్ ప్రకటించారు. విశ్వాస పరీక్ష నేడే కర్ణాటక అసెంబ్లీలో నేడు విశ్వాసపరీక్ష జరగనుండటంతో ఉత్కంఠ నెలకొంది. అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలు వెనక్కిరాకపోవడంతో కుమారస్వామి ప్రభుత్వం కొనసాగడంపై నీలినీడలు అలుముకున్నాయి. 225 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో అధికార కూటమికి 117 ఎమ్మెల్యేల బలం ఉంది. బీజేపీకి 105 మంది సభ్యులు ఉండగా, ఇటీవల ఇద్దరు స్వతంత్రులు మద్దతు ప్రకటించడంతో అది 107కు చేరుకుంది. ప్రస్తుతం రామలింగారెడ్డిని మినహాయించి 15 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించినా లేక వారు గైర్హాజరైనా అసెంబ్లీలో అధికార కూటమి బలం 102కి పడిపోనుంది. రాజీనామాల ఆమోదంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 106కు చేరుకుంటుంది. ఈ పరిస్థితుల్లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో కొనసాగడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ 107 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని వ్యాఖ్యానిస్తున్నారు. -
సుప్రీంకు చేరిన కర్ణాటకం
న్యూఢిల్లీ: శాసనసభ స్పీకర్ తమ రాజీనామాలను ఉద్దేశపూర్వకంగానే ఆమోదించడం లేదంటూ కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన పది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు బుధవారం సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ గురువారం అత్యవసర విచారణకు వచ్చేలా చూస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ ఎమ్మెల్యేలు ఇప్పటికే రాజీనామా చేశారని, ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది రోహత్గి కోర్టుకు తెలిపారు. తమ రాజీనామాల విషయంలో స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, మైనారిటీలో పడిపోయిన ప్రభుత్వాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో కావాలనే తమ రాజీనామాలను ఆమోదించడం లేదని తిరుగుబాటు ఎమ్మెల్యేలు పిటిషన్లో ఆరోపించారు. తమ రాజీనామాలను ఆమోదించాల్సిందిగా స్పీకర్‌ను ఆదేశించాలని వారు ధర్మాసనాన్ని కోరారు. అంతేకాకుండా తమను అనర్హులుగా ప్రకటించకుండా స్పీకర్‌ను నిరోధించాలని కూడా వారు కోరారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ కాంగ్రెస్ పార్టీ స్పీకర్‌కు పిటిషన్ సమర్పించిందని వారు పేర్కొన్నారు. తమను అనర్హులుగా ప్రకటించడం పూర్తిగా చట్టవిరుద్దమన్నారు. రాజ్యసభలో రభస కర్ణాటకలో రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో రాజ్యసభలో వరసగా రెండో రోజు బుధవారం కార్యకలాపాలకు అంతరాయం కలిగింది.భోజన విరామం తర్వాత బడ్జెట్‌పై చర్చ మొదలవగానే కాంగ్రెస్ ఎంపీలు సభ మధ్యకు దూసుకొచ్చి నినాదాలు చేశారు. చర్చను ప్రారంభించాల్సిన కాంగ్రెస్ నేత చిదంబరం ఈ గొడవ కారణంగా మాట్లాడలేకపోయారు. గందరగోళం మధ్య చర్చించలేమంటూ సమాజ్‌వాదీ ఎంపీలు వాకౌట్ చేశారు. గందరగోళం కారణంగా సభ మూడు సార్లు వాయిదా పడింది. తర్వాత అధికార, విపక్ష సభ్యులు మాట్లాడుకుని గురువారం బడ్జెట్‌పై చర్చను కొనసాగించాలని నిర్ణయించారు. దాంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్టు ఉపాధ్యక్షుడు హరివంశ్ ప్రకటించారు. -
టీడీపీలో మొదలైన రాజీనామాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయంతో తెలుగు పార్టీలో రాజీనామాల పర్వం మొదలైంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోవడంతో నాయకులు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. వైస్సార్ కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి రెడప్పగారి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేశారు. సామాన్య కార్యకర్తగా కొనసాగుతానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి రెండుసార్లు జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శితో పాటు ప్రాధమిక సభ్యత్వానికి తిరుపతికి చెందిన నీలం బాలాజీ రాజీనామా చేశారు. మరికొంత మంది నాయకులు కూడా రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. -
కిడారి శ్రావణ్ రాజీనామా... ఆమోదం
సాక్షి, అమరావతి: గిరిజన, కుటుంబ సంక్షేమ శాఖ మం త్రి కిడారి శ్రావణ్ కుమార్ రాజీనామాను గవర్నర్ ఆమో దించారు. ఈ మేరకు గవర్న ర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. గురువారం ఉదయం కిడారి శ్రావణ్ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తూ ఆ పత్రాన్ని సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్రకు అందజేశారు. సీఎం చంద్రబాబు అనుమతితో దాన్ని సీఎంవో గవర్నర్ నరసింహన్‌కు పంపించింది. అరకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కిడారి సర్వేశ్వరరావు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఎన్నికయ్యారు. ఆ తరువాత చంద్రబాబు ప్రలోభాలకు లోనై టీడీపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేశారు. దీంతో సర్వేశ్వరరావు కుమారుడు శ్రావణ్ కుమార్‌ను గత ఏడాది నవంబర్ 11న చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే కిడారి శ్రావణ్‌కుమార్ ఏ చట్టసభకు ఎన్నిక కాలేదు. దీంతో శుక్రవారం నాటికి కిడారి మంత్రి పదవి చేపట్టి ఆరు నెలలు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో కిడారి శ్రావణ్ కుమార్ చేత మంత్రి పదవికి రాజీనామా చేయించాల్సిందిగా సీఎంవో కార్యాలయానికి బుధవారం గవర్నర్ కార్యాలయం సూచించింది. ఈ నేపథ్యంలో గురువారం కిడారి శ్రావణ్ కుమార్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజ్యాంగ నిబంధనల మేరకు మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు శ్రావణ్ కుమార్ తెలిపారు. -
కాంగ్రెస్‌కు మాజీ మంత్రి ఝలక్!
పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతల నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తప్పుకోవడంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చినట్లయింది. పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుని అభ్యర్థి గెలుపు కోసం పనిచేసే బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానం ఇన్చార్జులకు అప్పగించింది. ఈ నేపథ్యంలో సుదర్శన్ రెడ్డితో అభ్యర్థి మధుయాష్కి, అసెంబ్లీ ఇన్చార్జులు గత అర్ధరాత్రి వరకు సమాలోచనలు జరిపారు. అయితే శనివారం తెల్లవారుజామునే సుదర్శన్ రెడ్డి ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. మరోవైపు టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకు పోతున్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఆ పార్టీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పగా, తాజాగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జిగా ఉన్న మాజీ మంత్రి పి సుదర్శన్‌రెడ్డి ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు అధిష్టానానికి లేఖ పంపినట్లు శనివారం ఆయన ప్రకటించారు. నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుని అభ్యర్థి గెలుపు కోసం పనిచేసే బాధ్యతను అధిష్టానం ఈ ఇన్చార్జులకు అప్పగించింది. పార్లమెంట్ స్థానం పరిధిలోని ప్రచార బాధ్యతలను ఇన్చార్జి పర్యవేక్షించాల్సి ఉంటుంది. అలాగే అగ్రనేత ప్రచార సభల నిర్వహణ వంటి బాధ్యతలనూ ఇన్చార్జికి పార్టీ అప్పగించింది. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కో సీనియర్ నేతను ని యమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన సందర్భంగా ఈ ఇన్చార్జులను ప్రకటించింది. అయితే ఇప్పటికే నామినేషన్ల పర్వం పూర్తయింది. మరోవైపు అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సభలు, సమావేశాలు, రోడ్‌షోలు, పార్టీలో చేరికలు ఇలా ప్రతి ఓటరును కలిసేలా ప్రణాళికాబద్ధంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ అన్ని నియోజకవర్గాల్లో గ్రామ గ్రామాన్ని చుట్టి వచ్చేలా చేస్తున్నారు. ఇటు బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ప్రచారం కూడా ఊపందుకుంది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూనే రోడ్‌షోలతో ఓటర్ల వద్దకు వెళ్తున్నారు. ఇటు కాంగ్రెస్‌లో మాత్రం ఈ స్థాయి ఊపు కనిపించడం లే దు. పార్టీ నాయకులను, శ్రేణులను సమన్వయం చేయడంలో కీలకమైన పార్టీ ఇన్చార్జి ఇప్పుడు బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీ యాంశంగా మారింది. ఇప్పటికే బోధన్‌కు చెందిన కాంగ్రెస్ కేడర్ దాదాపు అంతా టీ ఆర్ఎస్ పార్టీలో చేరింది. ఇటీవల గెలిచిన సర్పంచ్‌లు, ద్వితీయ శ్రేణి నాయకులు కూ డా ఈ ఎన్నికల సందర్భంగా గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో సు దర్శన్‌రెడ్డి పార్టీ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అర్ధరాత్రి వరకు సమాలోచనలు.. కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు శుక్రవారం అర్ధరాత్రి వరకూ సమాలోచనలు జరిపారు. పార్టీ అభ్యర్థి మధుయాష్కిగౌడ్ రాత్రి 11 గంటల ప్రాంతంలో నగరంలోని కంఠేశ్వర్‌లోని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్‌రెడ్డి, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జులు తాహెర్‌బిన్ హందాన్, ఈరవత్రి అనీల్, ఆర్మూర్‌కు చెందిన ఒకరిద్దరు నేతలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. అభ్యర్థిత్వం ప్రకటించిన వెంటనే మధుయాష్కి హైదరాబాద్‌లో సుదర్శన్‌రెడ్డితో సమావేశమైన విషయం తెలిసిందే. తాజాగా గత అర్ధరాత్రి మరోసారి సమావేశమయ్యారు. శనివారం తెల్లవారుజామున తాను ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సుదర్శన్‌రెడ్డి ప్రకటించడం ఎన్నికల వేళ ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. -
కాంగ్రెస్ పార్టీకి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ రాజీనామా
-
జెడ్పీకి గుడ్‌బై..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవికి గడిపల్లి కవిత రాజీనామా చేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. 2014 ఆగస్టు 7వ తేదీన బాధ్యతలు చేపట్టిన ఆమె సుమారు 54 నెలలపాటు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. కవిత రాజీనామా జిల్లా రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ద్వారా టీడీపీలో రాజకీయ అరంగేట్రం చేసిన ఆమె గతంలో కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పోటీ చేసి ఓటమి చెందారు. టీడీపీలో ఉన్నంతకాలం తుమ్మల అనుచరురాలిగా ఉన్న కవిత.. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వెంకటాపురం(ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా) జెడ్పీటీసీగా గెలుపొందారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి ఎస్సీ మహిళలకు రిజర్వ్ కావడంతో.. టీడీపీలో అప్పుడు కీలకంగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఆశీస్సులతో అనూహ్యంగా కవితను ఆ పదవి వరించింది. తన రాజకీయ గురువుగా భావించే తుమ్మల నాగేశ్వరరావుతోపాటే ఆమె 2014 సెప్టెంబర్‌లో టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మధిర ‘అసెంబ్లీ’పై ఆసక్తి చూపి.. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మధిర నుంచి పోటీ చేయడానికి ఆమె ఆసక్తి ప్రదర్శించారు. అయితే టీఆర్ఎస్ అభ్యర్థిత్వం లింగాల కమల్రాజుకు ఖరారైంది. శాసనసభ ఎన్నికల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటమి చెందడాన్ని జీర్ణించుకోలేక తనకు రాజకీయ అండదండలు అందించిన వ్యక్తి ఓటమి చెందడంతో మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు కవిత శనివారం తనను కలిసిన విలేకరులకు వివరించారు. వెంకటాపురం జెడ్పీటీసీ పదవికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవికి తాను రాజీనామా చేశానని, అయితే టీఆర్ఎస్ పార్టీలో ఇక మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తానని రాజీనామా చేయడానికి రాజకీయ కారణాలతోపాటు కొన్ని వ్యక్తిగత కారణాలు సైతం ఉన్నాయని ఆమె వివరించారు. భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి సాధారణ కార్యకర్తగా నిరంతరం కృషి చేస్తానన్నారు. చైర్‌పర్సన్‌గా తనను ఆదరించి జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడా పదవి ఎవరికి..? జెడ్పీ చైర్పర్సన్ పదవికి కవిత ఆకస్మికంగా రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ పదవి ఎవరిని వరిస్తుంది..? ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీ వరకు జిల్లా పరిషత్ పాలక వర్గ పదవీ కాలం ఉంది. ఈలోపే జెడ్పీ చైర్పర్సన్ పదవికి కవిత రాజీనామా చేయడంతో పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా ఉన్న వారు చైర్మన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. అయితే ఈ అంశంపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్‌గా వ్యవహరిస్తున్న బరపటి వాసుదేవరావు పాల్వంచ జెడ్పీటీసీ సభ్యుడిగా టీడీపీ తరఫున ఎన్నికై తుమ్మల నాగేశ్వరరావుతోపాటు టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. తుమ్మల సన్నిహితుడిగా పేరొందిన బరపటి వాసుదేవరావును జిల్లా పరిషత్ చైర్మన్ పదవి వరించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. నిబంధనల ప్రకారం జిల్లా పరిషత్ పదవీ కాలం ముగిసే లోపు చైర్మన్ రాజీనామా చేస్తే వైస్ చైర్మన్‌కు బాధ్యతలు అప్పగించడం ఆనవాయితీనేనని.. అదే తరహా సంప్రదాయం కొనసాగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 2014లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను టీడీపీ గెలుపొందడంతో గడిపల్లి కవిత చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యే అవకాశం లభించింది. 2014లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన సత్తాను చాటుకుంది. పలు కీలక మండలాల జెడ్పీటీసీ పదవులను కైవసం చేసుకుంది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి పై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి కరమైన చర్చ కొనసాగుతోంది. మిగిలిన పదవీ కాలం రెండు నెలలే.. రెండునెలల్లో జిల్లా పరిషత్ పదవీకాలం ముగుస్తుండటంతో కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా.. వైస్ చైర్మన్‌కు చైర్మన్‌గా బా§ధ్యతలు అప్పగించే అవకాశం సైతం లేకపోలేదని చర్చ జరుగుతోంది. 2014లో 46 మండలాల జెడ్పీటీసీ పదవులకు ఎన్నికలు జరగ్గా.. రాష్ట్ర విభజన అనంతరం ఐదు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలవడంతో 41 మండలాల జెడ్పీటీసీలు జెడ్పీ చైర్‌పర్సన్‌ను ఎన్నుకున్నారు. వివిధ రాజకీయ పార్టీల నుంచి పలువురు జెడ్పీటీసీలు టీఆర్ఎస్లో చేరడంతో జిల్లా పరిషత్‌లో టీఆర్ఎస్ మెజార్టీ కలిగి ఉంది. వాసుకు చైర్మన్ గిరి దక్కేనా? పాల్వంచరూరల్: జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవికి గడిపల్లి కవిత రాజీనామా చేయడంతో వైస్ చైర్మన్‌కు ఆ పదవి దక్కుతుందనే చర్చ సాగుతోంది. పాల్వంచ జెడ్పీటీసీ సభ్యుడు బరపటి వాసుదేవరావు ప్రస్తుతం జెడ్పీ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. 2014లో పాల్వంచ జెడ్పీటీసీగా టీడీపీ నుంచి విజయం సాధించిన ఆయన తుమ్మల నాగేశ్వరరావుతోపాటే టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. తుమ్మలకు సన్నిహితుడనే పేరు కూడా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఈ అంశం ఆధారపడి ఉంటుంది. -
టీడీపీలో మూకుమ్మడి రాజీనామాలు
ప్రకాశం,కంభం: టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే కొత్తగా పార్టీలో చేరిన నాయకులు తమను వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన చెందిన కంభం మండలంలోని పలువురు నాయకులు శుక్రవారం ఆ పార్టీ సభ్యత్వానికి మూకుమ్మడి రాజీనామాలు చేశారు. మాజీ మార్కెట్‌యార్డ్ చైర్మన్ నెమలిదిన్నె చెన్నారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో నిజమైన కార్యకర్తలకు విలువలేదని కొత్తగా పార్టీలో చేరిన వారికి గౌరవంతో పాటు పథకాలు అందుతున్నాయన్నాయన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల అవినీతి ఎక్కువైందని గతంలో ఉన్న టీడీపీకి నేటి పార్టీకి పోలిక లేదన్నారు. పార్టీలోకి ఎవరైనా రావచ్చు ఎవరైనా వెళ్లవచ్చని కానీ గిద్దలూరు శాసన సభ్యుడు టీడీపీలోకి వచ్చిన తర్వాత నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరిగిందన్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానానికి ఎన్ని సార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. నిజమైన కార్యకర్తలు లబ్ధి పొందక పోగా అవమానాలకు గురవుతున్నారన్నారని తెలిపారు. అందుకే టీడీపీకి మూకుమ్మడిగా రాజీనామా చేసేందుకు నిర్ణయించుకొని.. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి జిల్లా పార్టీ అధ్యక్షుడికి పంపిస్తున్నట్లు తెలిపారు. అన్నారాంబాబుతో కలిసి వైఎస్సార్సీపీలోకి టీడీపీకి మూకమ్మడి రాజీనామా చేసిన నాయకులంతా గిద్దలూరు మాజీ శాసనసభ్యుడు అన్నావెంకట రాంబాబుతో కలిసి శనివారం శ్రీకాకుళంలో వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలోకి చేరనున్నట్లు తెలిపారు. రాజీనామా చేసిన నాయకులతో పాటు మరికొందరు నాయకులు పలు వాహనాల్లో కంభం నుంచి బయలు దేరి వెళ్లారు. వీరు కూడా జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. మొత్తం ఖాళీ.. కంభం ఎంపీపీ కొత్తపల్లి జ్యోతి శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యుడు సయ్యద్ జాకీర్ హుస్సేన్, వైస్ ఎంపీపీ సంకతాల వెంకటేశ్వర్లు, మండల కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ హుస్సేన్‌బాషా, కంభం–2 ఎంపీటీసీ షేక్ జరీనా, కందులాపురం ఎంపీటీసీ కటికల భాస్కర్, కంభం –1 ఎంపీటీసీ సూరేప్రవీణ, చిన్నకంభం ఎంపీటీసీ గజ్జల పార్వతితో పాటు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నెమలిదిన్నె చెన్నారెడ్డి, మాజీ ఎంపీపీ మామిళ్ల పుల్లయ్య, మాజీ సర్పంచ్‌లు మేడూరి రాజేశ్వరరావు, కల్వకుంట మెర్సీకమలా ఆనంద్, మాజీ నీటి సంఘం అధ్యక్షుడు బాలకోటయ్య, మాజీ కోఆప్షన్ సభ్యులు ఫజుల్లా రహమాన్, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు గంగారపు ఓబయ్య, జిల్లా తెలుగుయువత మాజీ కార్యదర్శి షేక్. జాకీర్ హుస్సేన్, మాజీ జన్మభూమి కమిటీ సభ్యులు, మండల పార్టీ ఉపాధ్యక్షులు, గ్రామపార్టీ అధ్యక్షులు అయిన యన్. చంద్రశేఖర్, రఫి, వెంకటేశ్వర్లు, గుర్రం శ్రీరాములు, యస్.ఎ.సత్తార్, నంద్యాల ఖాదర్‌బాష, భువనగిరి శ్రీనివాసులు, నాగార్జునరెడ్డి, దేశిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, యం.అస్లాంబేఘ్, జె. శ్రీనివాసులు, కె.రాజశేఖర్‌రెడ్డి, కె.ఇమ్మానియేలు, అంగం నాగేశ్వరరావు, మునగాల శేఖర్, సయ్యద్ గౌస్‌బాష రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. టీడీపీ నుంచి 210 కుటుంబాలు వైఎస్సార్ సీపీలోకి చేరిక.. యర్రగొండపాలెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఉన్న ప్రజాభిమానాన్ని ఓర్వలేక టీడీపీకి చెందిన కీలక నాయకులు హత్య చేయించటానికి ప్రయత్నించారని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, ఎస్ఎన్ పాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. అయితే రాష్ట్ర ప్రజల దీవెనలు ఆయనకు పునర్జన్మను ప్రసాదించాయన్నారు. శుక్రవారం స్థానిక రాజీవ్ అతిథి గృహం వద్ద వివిధ వర్గాలకు చెందిన 210 కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న టీడీపీ అధికార పార్టీ హత్యా రాజకీయాలను చేస్తోందని విమర్శించారు. అధికార పార్టీ ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకొని పోయిందని, జరగబోయే ఎన్నికల్లో వారిని ఆ భగవంతుడు కూడా రక్షించలేడన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తానంటూ ప్రధాన వాగ్దానంచేసి గద్దెనెక్కి మరిచారని విమర్శించారు. తిరిగి అధికారంలోకి రావటానికి బాబు మళ్లీ అబద్ధపు వాగ్దానాలు చేయటానికి వెనకంజవేయడని వ్యంగ్యంగా అన్నారు. నాలుగున్నర సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల పక్షాన నిలిచి అలుపెరగని యోధుడుగా సమస్యలపై పోరాటాలు చేస్తున్నారన్నారు. ఓట్లకోసం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భావజాలాన్ని ఉచ్ఛరిస్తున్న సీఎం డబ్బు మూటలు సమకూర్చి జగన్ చరిష్మాతో గెలుపొందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడని తెలిపారు. వైఎస్సార్ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలకు ఆకర్షితులై, టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు తట్టుకోలేక అనేక మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటం హర్షణీయమన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు దొంతా కిరణ్‌గౌడ్, పార్టీ సీనియర్ నాయకుడు ఒంగోలు మూర్తిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు మెడబలిమి రాజశేఖర్, గౌడ సంఘం నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు కంచర్ల వెంకటయ్య గౌడ్, కార్యదర్శి సుందరగౌడ్, రిటైర్డ్ హెడ్మాస్టర్ జి.రంగనాయకులు, మాజీ పంచాయతీ ఉపాధ్యక్షుడు షేక్ మస్తాన్, వార్డు సభ్యులు షేక్ మహమ్మద్, జి.మస్తాన్, చెంచుసంఘం నాయకుడు డి.వీరయ్య, బీసీ సంఘం నాయకులు రాంబాబు, నాయిబ్రాహ్మణ సంఘం నాయకుడు పాలూరి శ్రీను, గిరిజన మహిళలు బొజ్జా అంకమ్మ, జంపాని కొండమ్మలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిని ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ పార్టీ కండువకప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ముందుగా పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మహాత్మగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, పొట్టి శ్రీరాములు, గౌతులచ్చన్న, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
పెద్దపల్లి: బీజేపీలో ముసలం!
మంథని బీజేపీలో ముసలం చోటుచేసుకుంది. అభ్యర్థి ఎంపికలో అధిష్టానం అందరికి ఆమోదయోగ్యమైన వ్యక్తిని కాకుండా కొత్త వ్యక్తికి అవకాశం కల్పించడంతో సీనియర్లు అలకబూనారు. సాక్షి, పెద్దపల్లి: మంథని నియోజకవర్గంలో బీజేపీకి అసలే క్యాడర్ తక్కువ. మరోవైపు ఉన్న క్యాడర్లోని కొంతమంది ఎన్నికల వేళ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. అయితే పార్టీ నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారని కమాన్‌పూర్ జెడ్పీటీసీ సభ్యుడు మేకల సంపత్ యాదవ్, మంథని నియోజకవర్గ ఇన్చార్జి బోగోజు శ్రీనివాస్‌ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. రామగిరి మండలాధ్యక్షుడు పొన్నం సదానందం, యూవమోర్చా మండలాధ్యక్షుడు రాముతో పాటు కమాన్‌పూర్ మండలానికి చెందిన సీనియర్ నాయకుడు శ్రీనివాస్ ఇటీవల టీఆర్ఎస్లో చేరారు. మంథని మండల పార్టీ ప్రధానకార్యదర్శి పార్వతి కిరణ్ గతవారం పదవి, పార్టీకి రాజీనామా చేశారు. బీజేవైఎం మండలాధ్యక్షుడు చిప్ప సత్యనారాయణసహా గుండోజు ప్రవీణ్, దూడం సాయి, దాడి రమేష్, బెజ్జం శ్రీనివాస్, కాళ్ల సతీష్ రాజీనామా చేశారు. తాజాగా ఆదివారం జిల్లా అధికార ప్రతినిధి చిదురాల మధూకర్‌రెడ్డి, కిసాన్‌మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు నాంపల్లి రమేష్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు నారమల్ల కృష్ణ రాజీనామా చేశారు. రాజీనామా ప్రతులను పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ. సుభాష్‌కు పంపారు. అభ్యర్థి వైఖరిపై అసంతృప్తి మంథని బీజేపీ అభ్యర్థి సనత్‌కుమార్ వ్యవహార శైలిపై బీజేపీ, అనుబంధ విభాగాల్లో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న సీనియర్లు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. పార్టీ నుంచి మంథని అసెంబ్లీ టికెట్ కోసం 8 మంది దరఖాస్తు చేసుకోగా తమని కాదని కొత్త వ్యక్తిని ఎంపిక చేసిందని సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే సీనియర్లను కలుపుకొని పార్టీని ముందుకు నడిపించాల్సిన సదరు అభ్యర్థి పట్టించుకోవడంలేదని వారు పేర్కొంటున్నారు. పార్టీని పట్టుకొని ఇంతకాలం ఉన్న తమపట్ల అభ్యర్థి వైఖరి ఏ మాత్రం బాగా లేదని, ఎన్నికల తర్వాత పార్టీ పరిస్థితి ఇక్కడ ఏంటని, తమని పట్టించుకునే వారెవరని వారు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా కొద్దిపాటి క్యాడర్ మాత్రమే ఉన్న మంథని బీజేపీలో అసమ్మతి రాగం ఈ ప్రాంతంలో హాట్‌టాపిక్‌గా మారింది. -
దానం రాజీనామా కాంగ్రెస్‌లో కలకలం
-
ఇకపై ప్రజాక్షేత్రంలోకి..
రాజీనామాల ఆమోదంతో ప్రత్యేకహోదా పోరాటంలో తమ చిత్తశుద్ధి మరోసారి రుజువైందని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీలు చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షను దేశవ్యాప్తంగా తెలిపామన్నారు. ఉప ఎన్నికలు ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. హోదా, విభజన హామీల కోసం ఇకపై ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామన్నారు. ఇకనైనా టీడీపీ నేతలకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ల ఎంపీలు రాజీనామాలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాల్ చేశారు. రాజీలేని పోరాటం చేశాం: మేకపాటి ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో నాలుగేళ్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని నెల్లూరు పార్లమెంట్ మాజీ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ చెందిన ఐదుగురు ఎంపీల రాజీనామాలను స్పీకర్ ఆమోదించారని చెప్పారు. రాష్ట్ర ప్రజల హక్కు అయిన హోదా ఉద్యమాన్ని దేశప్రజలందరికీ తెలిసేలా ఢిల్లీ వేదికగా పోరు సాగించామని చెప్పారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, హోదాతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. హోదా కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజీలేని పోరాటం చేశామన్నారు. హోదా ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాజీనామాలు చేశామని తెలిపారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని దేశ ప్రజలందరికీ వివరించామని, ఢిల్లీలో ఆమరణ దీక్షలు కూడా నిర్వహించామని చెప్పారు. స్పీకర్ ధర్మాన్ని నెరవేర్చారని, రెండు మూడు సార్లు తమతో మాట్లాడి రాజీనామాలు ఉపసంహరించే ప్రయత్నం చేశారని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతోందని వివరించి తమ రాజీనామాలు ఆమోదించాల్సిందిగా కోరామన్నారు. మార్చి 15న అవిశ్వాసానికి నోటీసు ఇచ్చామని, దానిపై చర్చ జరగకపోవటంతో వరుసగా 13 సార్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చామని తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పనిచేసే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం మనందరి ఖర్మ అని మేకపాటి ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా విషయంలో రోజుకో రకంగా మాట్లాడి, డ్రామాలాడిన చంద్రబాబుకు ప్రజలే గట్టిగా బుద్ధి చెబుతారన్నారు. టీడీపీ ఎంపీలు డ్రామాలు వేయకుండా చిత్తశుద్ధితో రాజీనామాలు చేసుంటే కచ్చితంగా కేంద్రం దిగి వచ్చేదన్నారు. తమకు ఉప ఎన్నికలను ఎదుర్కొంటామని సృష్టం చేశారు. నిత్యం ప్రగల్భాలు పలికే చంద్రబాబుకు అందరు కలిసి బుద్ధి చెప్పాలన్నారు. నీత్ ఆయోగ్ సమావేశానికి వెళ్లిన చంద్రబాబు.. మోదీ ఎడమచేతి కరచాలనం కోసం ఎంతగానో తపించిపోయి వంగివంగి మరీ కరచాలనం చేశారన్నారు. ఉప ఎన్నికల్లో ప్రత్యేక హోదానే ప్రధానాంశం..: వైవీ ఉప ఎన్నికల్లో ప్రత్యేక హోదానే ప్రధాన అంశమని వైఎస్సార్ కాంగ్రెస్ నేత వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఎంపీల రాజీనామా ఆమోదిస్తున్నట్టు లోక్‌సభ సచివాలయం నుంచి ప్రకటన వెలువడిన కొద్దిసేపటికి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ రోజైనా మా రాజీనామాలు ఆమోదించడాన్ని స్వాగతి స్తున్నాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించడం కోసం ఏప్రిల్ 6న రాజీనామాలు చేశాం. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశాం. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా స్పందించకుండా కేంద్రం, స్పీకర్ రాష్ట్రానికి అన్యాయం చేశారు. వీటన్నింటికీ నిరసనగా మేం మా పార్లమెంటు సభ్యత్వానికి ఏప్రిల్ 6న అంటే లోక్‌సభకు ఇంకా 14 నెలల సమయం ఉందనగా రాజీనామాలు చేశాం. త్వరలోనే ఈ ఐదు పార్లమెంటు స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయి. ప్రత్యేక హోదాయే మా ప్రధాన అంశం. ప్రజలు తమ ఆకాంక్షలను ఈ ఎన్నిక ద్వారా కేంద్రానికి తెలియపరుస్తారు. మేం ఇక ప్రజల్లోకి వెళతాం. రాష్ట్రానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవిధంగా అన్యాయం చేశాయో వివరిస్తాం. వాళ్ల మద్దతు కూడగడతాం..’ అని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాలు డ్రామాలని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా.. ‘‘మావి కాదు డ్రామాలు.. టీడీపీ వాళ్లవి డ్రామాలు’ అని ధ్వజమెత్తారు. బీజేపీతో కుమ్మక్కయ్యారని వస్తున్న విమర్శలను వైవీ ఖండించారు. ‘‘13సార్లు అవిశ్వాస తీర్మానం ఎవరు పెట్టారు? మీరు పెట్టారా? మేమా? కుమ్మక్కయ్యేవాళ్లమయితే అవిశ్వాస తీర్మానం పెడతామా? కలసి కాపురం చేసి ఇప్పుడొచ్చి మేం కుమ్మక్కయ్యామని అంటావు? అమరావతిలో ఉన్నప్పుడేమో మోదీ దాడి చేస్తున్నాడని అంటావు. ఢిల్లీ వచ్చి కాళ్లూ గడ్డాలు పట్టుకుంటావు. నిజంగా రాష్ట్రప్రయోజనాలపై చిత్తశుద్ధి ఉంటే నీతిఆయోగ్ సమావేశంలో మన వాదన వినిపించి వాకౌట్ చేసి ఉండాల్సింది. నువ్వు ఆ పనిచేశావా? ’’ అంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఎన్నికలు కావాలని తాము ఆశిస్తున్నామని, ఎన్నికలు వద్దని చంద్రబాబు అనుకుంటున్నారని చెప్పారు. ఎన్నికలు వస్తేనే మా రాజీనామాలకు సార్థకత వస్తుందన్నారు. మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం: వరప్రసాదరావు ప్రత్యేకహోదా సాధన కోసం రాజీనామా చేసి చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని తిరుపతి మాజీ ఎంపీ వి.వరప్రసాదరావు అన్నారు. రాజీనామాలు ఆమోదించటం సంతోషంగా ఉందన్నారు. దమ్ము ధైర్యం ఉంటే టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. రాజీనామాలు ఆమోదం పొందిన సందర్భంగా ఎంపీ వరప్రసాద్ సాక్షితో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రత్యేకహోదాను హేళన చేశారని, హోదా సంజీవిని కాదన్నారని చెప్పారు. ధైర్యముంటే, మనస్సాక్షి ఉంటే టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలన్నారు. వైఎస్సార్ సీపీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతూ ముందుకు వెళ్తోందని, రాబోయే ఎన్నికల్లో పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఏదోరకంగా ప్రజల్ని మోసం చేసి తాము కూడా పోరాడుతున్నామని చెప్పుకునేందుకు టీడీపీ డ్రామాలాడుతోందని మండిపడ్డారు. టీడీపీ ఎంపీల డ్రామాలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. లోక్‌సభ మూసివేశాక లోపలకు వెళ్లి ఫొటోలు, వీడియోలు తీసి.. ప్రత్యేక హోదా కోసం ఏదో చేశామని చెప్పుకునేందుకు హడావుడి చేశారని, రాబోయే రోజుల్లో మరిన్ని డ్రామాలు ఆడబోతున్నారని చెప్పారు. తాము ఎన్నికలను సవాల్‌గా తీసుకుంటున్నామన్నారు. ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డికి పెద్దఎత్తున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటే.. ఆయన ప్రత్యేకహోదా కోసం చూపిస్తున్న ప్రాధాన్యతను బట్టే అని చెప్పారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లి ఏమీ తీసుకురాలేని అసమర్థుడు చంద్రబాబు అని విమర్శించారు. రాష్ట్రం కోసం పదవీత్యాగం సంతోషదాయకం రాష్ట్రం కోసం పదవులు వదులుకోవడం సంతోషదా యకంగా ఉందని కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి పదేళ్లు కాదు, పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలంటూ బీజేపీ, టీడీపీ కలసి కోరాయని, అదే నినాదంతో 2014 ఎన్నికలకు వెళ్లారని, అధికారంలోకి వచ్చిన ఆ రెండు పార్టీలు హోదా మాటే మరిచాయని విమర్శించారు. ప్రత్యేక హోదా సంజీవిని కాదు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అంటూ సీఎం ప్రకటనలు చేశారని, ఇలాంటి తరుణంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ప్రత్యక్ష పోరాటం చేశామని చెప్పారు. అన్నీ ప్రయత్నాలు చేసి తుదకు పదవులకు రాజీనామాలు చేశామని వివరించారు. రాజీనామాలు ఆమోదించడంలో కూడా ఆలస్యం చేశారని చెప్పారు. ఇకపై ప్రజల మధ్యనే ఉంటూ ప్రత్యక్ష పోరాటం చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలుపుకోవడంలో రెండు పార్టీలు విస్మరించిన వైనాన్ని దేశవ్యాప్తం చేశామన్నారు. బీజేపీ, టీడీపీలకు బుద్ధిచెప్పేలా అడుగులు ఇక బీజేపీ, టీడీపీలకు బుద్ధిచెప్పేలా తమ అడుగులు ఉంటాయని మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తెలిపారు. రాజీనామా ఆమోదం పొందిన నేపథ్యంలో ‘సాక్షి’తో మిథున్‌రెడ్డి మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటాలను మరింత ఉధృతం చేస్తామన్నారు. హోదా కోసం తాము చేసిన రాజీనామాలను ఆమోదించేందుకు కూడా ఇంతో సమయం తీసుకున్నారంటే ప్రత్యేక హోదా ఆకాంక్ష ప్రజల్లో ఎంత బలీయంగా ఉందో అర్థమవుతుందన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రత్యేక హోదాను సాధించి తీరుతామన్నారు. ఇక ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు రెండు నాల్కల ధోరణి వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. ఎన్నికలంటే బాబుకు ఫీవర్ వస్తుందన్నారు. ప్రత్యేక హోదాను సాధించేందుకు రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు. – సాక్షి, నెట్వర్క్ -
పదవీ త్యాగానికి ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా సాధన పోరాటంలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ లోక్‌సభ సభ్యులు చేసిన రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ గురువారం ఆమోదించారు. దీంతో లక్ష్య సాధన కోసం నాలుగేళ్లుగా అన్ని వేదికలపై అలుపెరుగని పోరాటం కొనసాగిస్తున్న వైఎస్సార్సీపీ మరో అడుగుముందుకు వేసినట్ల యింది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలను కాపాడే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదంటూ వైఎస్సార్సీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌పై పదేపదే ఒత్తిడి తెచ్చి రాజీనామాలను ఆమోదింపజేసు కున్నారు. రాష్ట్ర సర్వతోముఖా భివృద్ధికి దోహదపడే హోదా తప్ప ఇంకేదీ తమకు ఆమోదయోగ్యం కాదంటూ పదవులను తృణప్రాయంగా త్యజిం చారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ఆదేశాల మేరకు... పదవీ కాలం మరో ఏడాదిపాటు ఉన్నప్పటికీ లోక్‌సభ నుంచి వైదొలిగారు. ఇక ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టి, ప్రత్యేక హోదా వచ్చేదాకా ఉప్పెనలా ఉద్యమిస్తామని ప్రకటించారు. నాలుగేళ్లు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి ఉండి, అధికారం అనుభవించిన తెలుగుదేశం పార్టీ చేయలేని పనిని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ చేసి చూపిందంటూ ప్రజాస్వామ్యవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హోదా సాధన విషయంలో ఏ పార్టీ చిత్తశుద్ధి ఏమిటో దీంతో తేలిపోయిందని అంటున్నారు. ఎంపీల రాజీనామాల ఆమోదంతో ప్రత్యేక హోదా అంశంపై జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విభజన వల్ల అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకోవడానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ వైఎస్సార్సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి దేశ పార్లమెంటరీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. రాజీనామాలను ఆమోదింపజేసుకోవడం ద్వారా హోదా ఆకాంక్షను జాతీయస్థాయిలో ఎలుగెత్తి చాటారు. పదవులను వదులుకుని, హోదా సాధన పట్ల తమ చిత్తశుద్ధిని చాటుకున్నారు. వైఎస్సార్సీపీ లోక్‌సభ సభ్యులు ఏప్రిల్ 6న స్పీకర్ ఫార్మాట్లోనే తమ రాజీనామాలను సమర్పించిన సంగతి తెలిసిందే. వాటిని ఆమోదిస్తూ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ జూన్ 21న(గురువారం) తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఒక రోజు ముందు నుంచే.. అంటే జూన్ 20(బుధవారం) నుంచే ఈ రాజీనామాలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. రాజీనామాల ఆమోదం కోసం ఎంపీల పట్టు ఎంపీల రాజీనామాల ఆమోదానికి ముందు స్పీకర్ ఒకటికి రెండుసార్లు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎంపీలు మాత్రం తమ పదవుల కంటే ప్రత్యేక హోదాయే ముఖ్యమని తెగేసి చెప్పారు. రాజీనామాలకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఎంపీలు మే 29న స్పీకర్‌ను ఆమె పిలుపు మేరకు వెళ్లి కలిశారు. రాజీనామాలను ఆమోదించాలంటూ పట్టుబట్టారు. స్పీకర్ వారం రోజులు జాప్యం చేయడంతో మళ్లీ జూన్ 6న వారు తమంతట తామే ఆమెను కలిసి రాజీనామాల ఆమోదం కోసం పట్టుబట్టారు. దాంతో మరోమార్గం లేక నిబంధనల ప్రకారం ఎంపీల రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. ఈ విషయాన్ని లోక్‌సభ బులెటిన్ ద్వారా సెక్రటరీ జనరల్ స్నేహలతా శ్రీవాస్తవ వెల్లడించారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు, రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి రాజీనామాలను ఆమోదించినట్టు విడివిడిగా ఉత్తర్వులను గురువారం బులెటిన్‌లో ప్రచురించారు. హోదా కోసం ఎందాకైనా... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజల హితం కోరి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పార్టీ ఎంపీలు పార్లమెంట్లో ప్రత్యేక హోదా కోసం పోరాడారు. హోదా డిమాండ్‌ను గట్టిగా వినిపించారు. నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేశారు. తమ అధినేత వైఎస్ జగన్ రాసిన లేఖను పార్లమెంట్‌లోని ఇతర జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలకు అందజేసి, వారి మద్దతు కూడగట్టారు. పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం వచ్చినప్పుడల్లా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల న్యాయమైన హక్కు అంటూ గొంతెత్తి నినదించారు. ప్యాకేజీలతో ప్రయోజనం శూన్యమని తేల్చిచెప్పారు. ప్రతి దశలోనూ హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కేంద్రంపై 13 సార్లు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్యనేతలంతా ఢిల్లీకి వెళ్లి జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేశారు. ఎంపీలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆఖరి క్షణం దాకా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించారు. తమ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 6న పదవులకు రాజీనామాలు చేసి, ఢిల్లీలోని ఏపీ భవన్లో అమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఏప్రిల్ 6 నుంచి 11వ తేదీ వరకూ ఎంపీలు చేసిన నిరాహార దీక్ష యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. జాతీయ, ప్రాంతీయ పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. పలువురు జాతీయ పార్టీల నేతలు దీక్షా శిబిరానికి హాజరై వైఎస్సార్సీపీ ఎంపీలకు సంఘీభావం తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీని సాధించుకోవడం హక్కు అని వారంతా ప్రకటించారు. హోదా పోరాటాన్ని ఉధృతం చేయాలని సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘వంచనపై గర్జన’ పేరుతో ఇప్పటికే రాష్ట్రంలో రెండు దీక్షలు చేసింది. ఏప్రిల్ 30న విశాఖపట్నంలో, జూన్ 2న నెల్లూరులో వంచనపై గర్జన సభలు నిర్వహించింది. వృథా కాబోదు మీ త్యాగం ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ ఎంపీలు చేసిన పదవీ త్యాగం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, వారి త్యాగం వృథా కాబోదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఖాళీ అయిన ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించడమనేదిఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. ఎంపీల రాజీనామాల ఆమోదంతో ప్రత్యేక హోదా పోరాటం ఇక తీవ్రతరం కావడం ఖాయమని చెబుతున్నారు. ఎంపీల రాజీనామా పర్వం ♦ ప్రత్యేక హోదా సాధన కోసం తమ పార్టీ ఎంపీలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆఖరి క్షణం పోరాటం చేస్తారని, కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే వారంతా తమ పదవుల నుంచి వైదొలుగుతూ రాజీనామా లేఖలను సమర్పించి వస్తారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన నెల్లూరు జిల్లా కలిగిరిలో బహిరంగ సభలో ప్రకటించారు. ♦ హోదా సాధన పోరాటంలో భాగంగా మార్చి 1వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు ధర్నాలు నిర్వహించాయి. ♦ వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు మార్చి 5న ఢిల్లీలో ధర్నా చేపట్టారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా తమ పార్టీ తరపున ఎన్డీయే ప్రభుత్వంపై మార్చి 22న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. ♦ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను కుదిస్తారనే వార్తలు రావడంతో వైఎస్సార్సీపీ ఎంపీలు నిర్ధేశిత తేదీ కంటే ముందుగానే మార్చి 15న లోక్‌సభ స్పీకర్‌కు అవిశ్వాస తీర్మానం నోటీసు అందించారు. ♦ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ వరుసగా ఇచ్చిన 13 అవిశ్వాస తీర్మానం నోటీసుల్లో 12 నోటీసులను స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్‌సభలో ప్రస్తావించారు. సభలో గందరగోళ పరిస్థితులు ఉన్నందువల్ల వాటిపై చర్చ చేపట్టలేకపోతున్నట్లు తెలిపారు. ♦ అవిశ్వాసం తీర్మానంపై పార్లమెంట్లో చర్చించాలని గొడవ జరుగుతున్న తరుణంలోనే వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకు వేసి తమ ఎంపీల పోరాటం అవిశ్వాసం, రాజీనామాలతో ఆగదని, రాజీనామాలు సమర్పించిన వెంటనే అమరణ నిరాహార దీక్షకు పూనుకుంటారని మార్చి 31న పేరేచర్లలో ప్రకటించారు. ♦ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజైన ఏప్రిల్ 6 వరకూ ప్రత్యేక హోదా కోసం లోక్‌సభలో పోరాటం సాగించిన ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాదరావు, వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి సమావేశాలు వాయిదా పడగానే నేరుగా స్పీకర్ చాంబర్‌కు వెళ్లి, స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా లేఖలను సమర్పించారు. ♦ అక్కడి నుంచి ఏపీ భవన్‌కు వచ్చి అమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆరు రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ♦తమ రాజీనామాలను ఆమోదించాలని మే 29న స్పీకర్‌కు ఎంపీలు మరోసారి విన్నవించారు. ♦ అయినప్పటికీ ఆమోదించకపోవడంతో జూన్ 6న మరోసారి స్పీకర్‌ను కలిశారు. తమ రాజీనామాలను ఆమోదించేందుకు స్పీకర్ సంసిద్ధత వ్యక్తం చేశారని ఎంపీలు తెలిపారు. ♦ వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదిస్తున్నట్లు జూన్ 21న స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ రాజీనామాలు జూన్ 20వ తేదీ నుంచే అమల్లోకి వస్తాయని లోక్‌సభ బులెటిన్‌లో పేర్కొన్నారు. పదవులు వదులుకోవడం అభినందనీయం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చుక్కానిలా నిలిచే ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు లోక్‌సభ సభ్యులు పదవులకు రాజీనామా చేయడమే కాకుండా.. వాటిని ఆమోదింపజేసుకోవడం అభినందనీయం. ప్రజల మనోభిప్రాయాలను గౌరవించి ఏడాది పదవీకాలాన్ని తృణప్రాయంగా వదులుకోవడాన్ని ఆహ్వానిస్తున్నాం. మిగిలిన 20 మంది కూడా తక్షణమే రాజీనామా చేయాలి. – లక్ష్మణరెడ్డి, అధ్యక్షులు, జనచైతన్య వేదిక హోదా ఉద్యమం మరింత ఉధృతం రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైఎస్సార్సీపీతో కలిపి ప్రత్యేక హోదా సాధన సమితి ఉద్యమిస్తోంది. కేంద్రంపై తీవ్ర ఒత్తిడి పెంచి ప్రత్యేక హోదా సాధించడం కోసం వైఎస్సార్సీపీ లోక్‌సభ సభ్యులు రాజీనామా చేసి ఆమోదింపజేసుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి సంపూర్ణంగా మద్దతు ఇస్తాం. – చలసాని శ్రీనివాస్ ఆ ఐదుగురు రియల్ హీరోలు ప్రజల మనోభిప్రాయాలను గౌరవించి పద వులను త్యాగం చేయడం ద్వారా ఐదుగురు వైఎ స్సార్ సీపీ మాజీ ఎంపీలు రియల్ హీరోలు అయ్యారు.ప్రత్యేక ఆర్థిక సాయం కోసం అంగీకరించి సీఎం చంద్రబాబు రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. ప్రత్యేక హోదా సాధించే వరకూ పోరాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. – షబ్బీర్ అహ్మద్, దళిత, మైనార్టీ ఐక్య వేదిక రాష్ట్ర నేత ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధించిన కథనాల కోసం ఈ కింది లింక్స్ క్లిక్ చేయండి : ఒకటే మాట.. ఒకటే బాట ‘టీడీపీకి కచ్చితంగా చెప్పుదెబ్బ’ వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం మీ త్యాగం వృథా కాదు : వైఎస్ జగన్ చిత్తశుద్ధి నిరూపించుకున్నాం.. చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి.. వైఎస్ జగన్‌కు, చంద్రబాబుకు అంత వ్యత్యాసమా! ఉప ఎన్నికలు: చంద్రబాబు పోటీకి రారు! ‘వంచన’పై వైఎస్సార్ సీపీ గర్జన! -
ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల రాజీనామా
-
అందుకే బాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు : ఘట్టమనేని
సాక్షి, గుంటూరు జిల్లా : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆ పార్టీ నాయకుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు విమర్శించారు. గుంటూరులో నిర్వహించిన బూత్ లెవెల్ కమిటీ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. వైఎస్ జగన్‌ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేకనే కాంగ్రెస్‌తో చంద్రబాబు చేతులు కలిపారని ఎద్దేవా చేశారు. బీజేపీ, జనసేనతో కలిసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఇప్పుడు వారి గురించి ఎలా మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని ఆదిశేషగిరిరావు వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ఆయన తనయుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ ఎంపీలు తమ రాజీనామాలను ఆమోదింప చేసుకోవడం గొప్ప విషయమని అన్నారు. నాలుగేళ్లు రాజధాని కోసం చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు. టీడీపీని ఎంత తొందరగా గద్దె దింపితే ప్రజలకు అంత మంచిదని అన్నారు. -
ఉప ఎన్నికల్లో మా ఎంపీలు విజయం సాధిస్తారు
తూర్పు గోదావరి జిల్లా: ఉప ఎన్నికల్లో మా ఎంపీలు కచ్చితంగా విజయం సాధిస్తారని ఒంగోలు వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. విలేకరులతో మాట్లాడుతూ..వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్‌ను కోరామని, ఆమోదించిన వెంటనే ఉప ఎన్నికలకు వెళతామని, విజయం సాధించి ప్రత్యేక హోదా ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వానికి చాటుతామని తెలిపారు. చంద్రబాబు నాయుడికి హోదాపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో ఈ నెల 12న ప్రారంభమవుతుందని తెలిపారు. 16 నియోజకవర్గాల్లో 275 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుందని చెప్పారు. -
రాజీనామాల పై వెనక్కి తగ్గేది లేదు
-
స్పీకర్ నుంచి వైఎస్సార్ సీపీ ఎంపీలకు పిలుపు
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులకు రాజీనామాలు సమర్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు లోక్ సభ స్పీకర్ కార్యాలయం నుంచి పిలుపువచ్చింది. ఈ నెల 29న లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను స్పీకర్ కార్యాలయంలో కలవనున్నట్లు హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్ వైఎస్సార్ సీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదిస్తారని తెలిపారు. రాజీనామా చేసిన ఎంపీలు అందరూ తిరిగి ప్రజల్లోకి వెళ్లి చిత్తశుద్ధిని నిరూపించుకుంటారని పేర్కొన్నారు. ఉప ఎన్నికలు వస్తే గెలిచి తీరుతామని మిథున్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసిన విషయం విదితమే. పార్లమెంట్ నివరధిక వాయిదా పడిన అనంతరం ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డిలు స్పీకర్‌ను కలుసుకుని, రాజీనామా పత్రాలను సమర్పించారు. స్పీకర్ ఫార్మాట్లో రూపొందించిన రాజీనామాలను పరిశీలించిన సుమిత్రా మహాజన్.. నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీలకు సూచించారు. అందుకు సున్నితంగా తిరస్కరించిన ఎంపీలు.. రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని స్పీకర్‌ను కోరారు. ఎంపీ పదవులకు రాజీనామాలు చేసిన అనంతరం ఢిల్లీలోని ఏపీ భవన్లో వైఎస్సార్ సీపీ ఎంపీలు ఆమరణ దీక్ష చేసిన విషయం తెలిసిందే. -
కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి మమతాకు ఆహ్వానం
-
వైఎస్సార్ సీపీ ఎంపీలకు సంఘీభావం
కువైట్: ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కువైట్ మద్దతు తెలిపింది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో చెప్పినట్లుగానే మంత్రులు తమ పదవులను తృణ పాయంగా భావించి రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. ఆమరణ దీక్షకు కూర్చున్న ఎంపీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కువైట్ సభ్యులు సంఘీభావం తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కన్వీనర్ బాలిరెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సంజీవని కాదని చెప్పిన టీడీపీ నాయకుల చేతనే వైఎస్ జగన్ ప్రత్యేక హోదా నినాదం పలికించారు. వైఎస్ జగన్ వల్లనే నేటికి ప్రత్యేక హోదా సజీవంగా ఉందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కోసం లోక సభ సభ్యత్వానికి రాజీనామాలు చేసిన పార్లమెంట్ సభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కువైట్ సభ్యుల తరఫున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, ఎంవీ నరసారెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రకు ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు అవసరమని పార్లమెంట్ సాక్షిగా ఒక నాయకుడు అన్నారు. అంతేకాక తిరుపతిలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని కూడా వారు గుర్తు చేశారు. నాటకాల రాయుడు సీఎం చంద్రబాబు ఒక అడుగు ముందుకేసి 10 సంవత్సరాలు కాదు.. 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని ఆనాడు అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉసారవెల్లి రంగులు మార్చినట్లు మాటలు మారుస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మన రాష్ట్రానికి సీఎం కావడం మన రాష్ట్ర ప్రజల దురదృష్టమని కో కన్వీనర్లు ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డి, ఇంఛార్జ్‌లు కె. రమణ యాదవ్, రవీంద్ర నాయడు, సలహాదారుడు నాడిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, యూత్ ఇంచార్జ్ మర్రి కల్యాణ్, ఎస్సీ, ఎస్టీ ఇంచార్జ్ బి.ఎన్ సింహా, కోశాధికారి పిడుగు సుబ్బారెడ్డి, యూత్ సభ్యుడు బాలకృష్ణ రెడ్డి, సేవాదళ్ వైఎస్ ఇంచార్జ్ కె. నాగసుబ్బారెడ్డి, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
మేడం గారు.. ఇవిగో రాజీనామాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. శుక్రవారం పార్లమెంట్ నివరధిక వాయిదా పడిన అనంతరం ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డిలు స్పీకర్‌ను కలుసుకుని, రాజీనామా పత్రాలను సమర్పించారు. స్పీకర్ ఫార్మాట్లో రూపొందించిన రాజీనామాలను పరిశీలించిన సుమిత్రా మహాజన్.. నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీలకు సూచించారు. అందుకు సున్నితంగా తిరస్కరించిన ఎంపీలు.. రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని స్పీకర్‌ను కోరారు. రాజీనామాల తర్వాత నేరుగా ఏపీ భవన్‌కు బయలుదేరిన ఎంపీలు నిరవధిక నిరాహార దీక్షలో కూర్చోనున్నారు. ప్రజల ఆకాంక్షల మేరకే రాజీనామాలు: ఎంపీ పదవులకు రాజీనామాలపై పునరాలోచించుకోవాలన్న లోక్‌సభ స్పీకర్ సుమిత్రాకు వైఎస్సార్సీపీ ఎంపీలు ఏపీ పరిస్థితులను వివరించారు. ‘‘మేడం, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదానే సంజీవని. హోదా లేకుండా రాష్ట్రం మనలేదు. అందుకే విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా హోదా ఇస్తామని ప్రకటించారు. కానీ ప్రభుత్వాలు తమ హామీలను నెరవేర్చలేదు. హోదా కోసం గడిచిన నాలుగేళ్లలో వైఎస్సార్సీపీ చేయని పోరాటంలేదు. మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సైతం ఆమరణ దీక్ష చేశారు. చివరికి కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం కూడా చర్చకు రాకుండాపోయింది. మేడం, ఏపీ ప్రజల ఆకాంక్షల మేరకే మేం రాజీనామాలు చేశాం. దయచేసి మా రాజీనామాలను ఆమోదించండి..’ అని వైఎస్సార్సీపీ ఎంపీలు అన్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీల రాజీనామా లేఖలు ఇవే.. -
హాస్తినాలో అఖరి పోరాటం
-
ప్రాణాలైనా అర్పిస్తాం: వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ప్రాణాలైనా అర్పిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ప్రకటించారు. బడ్జెట్ మలివిడత సమావేశాల్లోపు కేంద్రం దిగి రాకపోతే వైఎస్సార్సీపీ ఎంపీలందరూ మూకుమ్మడిగా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు సమర్పిస్తామని.. అనంతరం ఏపీ భవన్లో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని చెప్పారు. ఢిల్లీలో ఆ పార్టీ లోక్‌సభ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గురువారం ఇక్కడి కానిస్టిట్యూషన్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. మేకపాటి మాట్లాడుతూ.. ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం మా ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. బడ్జెట్ మలివిడత సమావేశాల్లోపు కేంద్రం దిగి రాకపోతే వైఎస్సార్సీపీ ఎంపీలందరూ రాజీనామాలు చేస్తారని మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుగానే ప్రకటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మా పదవులకు రాజీనామాలు చేసి ఏపీ భవన్లో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతాం. అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగట్టే పేరుతో ఢిల్లీ వచ్చిన చంద్రబాబు గాంధీ విగ్రహం వద్ద, పార్లమెంటు ప్రధాన ద్వారం మెట్ల వద్ద ఫొటోలకు పోజులు ఇచ్చి వెళ్లారు. ఎన్నికల సమయంలో 10 ఏళ్లపాటు హోదా ఇస్తామన్న బీజేపీ.. కాదు 15 ఏళ్లు కావాలన్న చంద్రబాబు కలిసి రాష్ట్రానికి ద్రోహం చేశారు. వీటిని ప్రజలు గమనిస్తున్నారు..’ అని వివరించారు. టీడీపీ, బీజేపీ నిందారోపణలు: వైవీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నాయి. హోదాను విస్మరించిన చంద్రబాబు ఇప్పుడు కొత్తగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని ఎలా అడుగుతారు. ప్రత్యేక హోదా రాష్ట్ర ఊపిరి.. ఆ ఊపిరిని సాధించుకొనేందుకు మా ఊపిరినైనా వదిలేస్తాం..’ అని చెప్పారు. మోసం చేశారు: వరప్రసాదరావు ‘తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ, టీడీపీలు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మోసగించాయి. ప్రత్యేక హోదా వస్తుందని ఆకాంక్షించి ప్రజలు వారిని గెలిపించారు. నాలుగేళ్లు కాపురం చేశారు. కానీ, ఒక్క సందర్భంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా కావాలని అడగలేదు. పార్లమెంటు సమావేశాల్లో రోజుకు ఏడెనిమిది గంటలపాటు మా కాళ్లపై నిలబడి హోదా కోరుతూ నిరసన తెలిపాం. అయినా ఎన్డీయే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోయేసరికి మా నాయకుడు జగన్మోహన్రెడ్డి ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. అందులో భాగంగానే కేంద్రంపై అవిశ్వాసం పెట్టాల్సి వచ్చింది. దీంతో టీడీపీ కూడా మమ్మల్ని అనుసరించాల్సి వచ్చింది’ అని వెలగపల్లి ప్రసాదరావు వివరించారు. దర్యాప్తు జరపాలి: మిథున్‌రెడ్డి ‘అవినీతిలో కూరుకుపోవడం వల్ల చంద్ర బాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయారు. అనేక ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడ్డారని కాగ్ నివేదిక చెబుతోంది. మరి బీజేపీ ఎందుకు చర్య తీసుకోలేదు? అసలు బీజేపీకి, టీడీపీకి మధ్య తేడాలు ఎందుకు వచ్చాయో ప్రజలు తెలుసుకోవాల నుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలపై దర్యాప్తు చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం. టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే మాతో కలిసి రావాలి. రాజీనామా చేసి దీక్షకు కూర్చోవాలి..’ అని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రానిదే బాధ్యత: అవినాష్‌రెడ్డి ‘ప్రత్యేక హోదా కోసం మా నాయకుడు జగన్మోహన్రెడ్డి ఒక కార్యాచరణ రూపొందించారు. దానిలో భాగంగానే అవిశ్వాస తీర్మానాలకు నోటీసులు ఇచ్చాం. కేంద్రం ప్రభుత్వం దానిని చర్చకు, ఓటింగ్‌కు తీసుకురాకుండా తప్పించుకునే ప్రయత్నం ఏ విధంగా చేస్తోందో చూస్తున్నాం. ఇందుకు కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలి. ప్రధాని పార్లమెంటుకు వచ్చినా లోక్‌సభకు రారు. రేపైనా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతి వస్తుందో రాదో తెలియదు. శుక్రవారం సభ నిరవధిక వాయిదా పడిన తరువాత రాజీనామా చేసి ఆమరణ దీక్ష ప్రారంభిస్తాం.’.. అని అవినాష్‌రెడ్డి చెప్పారు. -
ఢిల్లీ ఎందుకెళుతున్నాడో బాబుకు క్లారిటీ లేదు..
విజయవాడ : అమరావతి రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ప్రజలను, ఎన్నారైలను అప్పు అడుగుతున్నారని, బాబును నమ్మిఆయనకు అప్పు ఇస్తే విజయమాల్యాకు, అగ్రీగోల్డ్‌కు, కేశవరెడ్డిలకు ఇచ్చినట్లేనని వైఎస్ఆర్సీపీ విజయవాడ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు పెట్టకుండా పార్లమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేస్తే... వైఎస్ఆర్సీపీ ఎంపీలు వెంటనే రాజీనామాలు చేసి, ఢిల్లీలో అమరణదీక్షలకు దిగితారని మా అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. వారికి మద్దతుగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు నిరాహారదీక్షలు ప్రారంభిస్తారు. హోదాకోసం వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తున్నారు మరి మీ ఎంపీలకు మీరు ఏ ఆదేశాలు ఇస్తున్నారు? అని చంద్రబాబును ప్రశ్నించారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ప్రజల నుంచి రుణాలను కోరుతున్నారు, ఎన్నారై లను కూడా అప్పులు అడుగుతున్నారు. కానీ ఎఫ్ఆర్బీఎం ప్రకారం ఇది చట్ట వ్యతిరేకం. ఇది ఆచరణ సాధ్యం కాదని ఎపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు వంటి అధికారులే చెబుతున్నారు అన్నారు. గత 60 ఏళ్ళ కాలంలో పదమూడు జిల్లాలకు గాను పాత ప్రభుత్వాలురూ. 96 వేల కోట్లు అప్పు తీసుకున్నాయి. కానీ చంద్రబాబు ఈ నాలుగేళ్ళ పాలనలో చేసిన అప్పు రూ. 1.20 లక్షల కోట్లు. తాత్కాలిక రాజధాని పేరుతో పెద్ద ఎత్తున ప్రైవేటు సంస్థలకు నిధులు కట్టబెట్టి, ఎంతో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మాత్రమే చిత్తశుద్ధి తో పోరాటం చేస్తున్నారన్నారు. ఢిల్లీకి వెడుతున్న చంద్రబాబుకు అసలు ఎందుకు వెళ్తున్నాడో క్లారిటీ లేదని,ఏం చేయడానికి మీరు ఢిల్లీకి వెడుతున్నారు మీ ఉద్యమ కార్యాచరణ ఏమిటి బాబూ? అంటూ ప్రశ్నించారు. -
అవిశ్వాసంపై కొనసాగుతున్న ఉత్కంఠ
-
రాజీనామా బాటలో అన్నాడీఎంకే ఎంపీలు
సాక్షి, చెన్నై: కావేరీ అంశంలో కేంద్రం తీరుకు నిరసనగా తమిళనాడులో కొందరు అన్నా డీఎంకే ఎంపీలు రాజీనామాకు సిద్ధమవుతు న్నారు. కావేరి ట్రిబ్యునల్ తీర్పును తుంగలో తొక్కేలా కేంద్రం వ్యవహరిస్తోందంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వారు రాజీనామాల బాట పడుతున్నట్లు తెలుస్తోంది. సోమవారం తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు సమర్పిస్తానని ఎంపీ ముత్తుకరుప్పన్ ప్రకటించారు. ఆయన బాటలోనే మరికొందరు ఎంపీలూ ఉన్నారు. మరోవైపు అన్నాడీఎంకే సీనియర్ ఎంపీ, తంబిదురై మాట్లాడుతూ.. కాంగ్రెస్ మద్దతిస్తే కేంద్రంపై అవిశ్వాసం పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మద్దతిస్తామని సోనియా, రాహుల్ ప్రకటించాలని, కాంగ్రెస్ జత కలిస్తేనే అవిశ్వాసం పెట్టేందుకు సరిపడా సంఖ్యాబలం సాధ్యమవుతుందని, అందుకు సిద్ధమేనా? అని ఆయన పేర్కొన్నారు. -
‘సైన్యాన్ని వీడుతున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : పారామిలటరీ బలగాల నుంచి గతంలో ఎన్నడూ లేనంతగా అత్యధికంగా 2017లో స్వచ్ఛంద పదవీవిరమణ, రాజీనామాలు చోటుచేసుకున్నాయని ప్రభుత్వం బుధవారం లోక్‌సభలో వెల్లడించింది. ముఖ్యంగా సరిహద్దు భద్రతా దళం, కేంద్ర రిజర్వు పోలీస్ బలగాల్లో ఎక్కువ మంది సిబ్బంది వైదొలిగారని పేర్కొంది. 2015లో 909 మంది బీఎస్ఎఫ్ నుంచి నిష్ర్కమించగా, 2017లో ఈ సంఖ్య ఏడు రెట్లు అధికంగా 6415కు పెరిగిందని తెలిపింది. సీఆర్పీఎఫ్లో 2015లో 1376 మంది వైదొలగా, 2017లో అత్యధికంగా 5123 మంది వైదొలిగారని వెల్లడించింది. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, సహస్త్ర సీమా బల్లోనూ ఇదే ధోరణి కనిపించిందని పేర్కొంది. ఇక అస్సాం రైఫిల్స్, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళంలోనూ పెద్దసంఖ్యలో సిబ్బంది వైదొలిగారని తెలిపింది. వ్యక్తిగత, కుటుంబ, ఆరోగ్య కారణాలతో పాటు 20 ఏళ్ల సర్వీస్ అనంతరం పెన్షన్ ప్రయోజనాలు పెరగడంతో సిబ్బంది పెద్దసంఖ్యలో స్వచ్ఛంద పదవీవిరమణ లేదా రాజీనామా చేయడానికి మొగ్గుచూపుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. -
రాజీనామాలపై వైఎస్సార్సీపీ ఎంపీల ముందడుగు
-
రాజీనామా లేఖలపై వైఎస్సార్సీపీ ఎంపీల సంతకాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా పోరాటం చేస్తోన్న వైఎస్సార్సీపీ.. చివరి అస్త్రమైన రాజీనామాలపై ముందడుగువేసింది. పార్లమెంట్ నిరవధికంగా వాయిదాపడ్డ మరుక్షణమే రాజీనామాలు చేస్తామన్నా ఆ పార్టీ ఎంపీలు బుధవారం రాజీనామా లేఖలపై సంతకాలు చేశారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి.. సంతకాలు చేసిన రాజీనామా లేఖలతో లోక్‌సభకు బయలుదేరారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఎనిమిదో సారి ఇచ్చిన నోటీసులు నేడు సభ ముందుకు రానుంది. అయితే నోటీసులపై స్పీకర్ చర్చ చేపడతారా, లేదా అనేది తేలాల్సిఉంది. అవిశ్వాసాన్ని తప్పించుకునే క్రమంలో కేంద్రం.. ఏఐఏడీఎంకే ఎంపీల నిరసనలను సాకుగా చూపి పార్లమెంట్ సమావేశాలను నిరవధికంగా వాయిదావేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎంపీలు ముందస్తుగా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖలను సిద్ధంచేశారు. -
కాంగ్రెస్‌లో రాజీనామాలు.. ఇంకా ఎందరు?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో పెద్ద తలలు పక్కకు తప్పుకునే ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ముఖ్యనాయకులకు-కార్యకర్తలకు మధ్యనున్న గోడలు కూల్చేయడంతోపాటు యువతకు పెద్దపీట దక్కాలన్న రాహుల్ గాంధీ సూచన మేరకు సీనియర్లు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. నిన్న గోవా, గుజరాత్ పీసీసీ అధ్యక్షులు తమ పదవులకు రాజీనామాలు చేయగా.. నేడు ఉత్తరప్రదేశ్ పార్టీ చీఫ్ రాజ్‌బబ్బర్ కూడా అదే నిర్ణయాన్ని ప్రకటించారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేయడంలో భాగంగా మరిన్ని సంస్థాగత మార్పులు తప్పవని ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికి రాజీనామాలు చేసిన ముగ్గురే కాకుండా ఇంకొందరు పీసీసీ చీఫ్‌లు కూడా స్వచ్ఛందంగా తప్పుకోవచ్చని తెలిపాయి. ఏపీ, తెలంగాణలోనూ మార్పులు? : సార్వత్రిక ఎన్నికలతో పాటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లను మారుస్తారా, లేదా అనేది చర్చనీయాంశమైంది. రాజీనామాల విషయంలో ‘వయసు’ ప్రధానాంశం కాబట్టి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిలకు ఎలాంటి ఢోకా ఉండబోదని సమాచారం. -
ఉపఎన్నికలు వచ్చే అవకాశాల్లేవు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపఎన్నికలు వస్తాయని తాను అనుకోవడం లేదని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత కె.జానారెడ్డి అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ ఉపఎన్నికల్లో ఆ రాష్ట్ర సీఎం యోగి సొంత నియోజకవర్గం లోనే ప్రజలు బీజేపీని ఓడించారన్న విషయా న్ని సీఎం కేసీఆర్ గ్రహించాలని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో గెలుపొంది రాష్ట్రంలో అధికారం చేపడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో ఆయన బుధవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ప్రస్తు తం అసెంబ్లీ నడిచే తీరును చూసి బాధపడుతున్నానన్నారు. గతంలో అసెంబ్లీ ఎంతో హుం దాగా నడిచేదని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ఏర్పాటుకు తానేం చేయలేదన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ తానేమీ చేయకపోతే ఆయన తన ఇంటికి ఎందుకొచ్చా రని ప్రశ్నించారు. తెలంగాణను కాంగ్రెస్ ఏర్పా టు చేసి ఉండకపోతే కేసీఆర్ సీఎం హోదాలో మాట్లాడగలిగేవారా అని ప్రశ్నించారు. తిట్టడం మానుకుని ప్రజలకు వాస్తవాలు చెప్పాలని సూచించారు. ఐడీపీఎల్, ఈసీఐఎల్ వంటి సంస్థలనూ కేసీఆరే తీసుకువచ్చారా అని ప్ర శ్నించారు. ఎమ్మెల్యేలంతా మూకుమ్మడి రాజీనామాలు చేసే అవకాశాలను కొట్టిపారేశారు. రాజనీతిజ్ఞుడిగా మాట్లాడుతా తాను కేసీఆర్ లాంటి వాడిని కాదని, మానవతావాదిగా, రాజనీతిజ్ఞుడిగా మాట్లాడుతానని అన్నారు. నాలుగేళ్లపాటు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉన్నా ప్రభుత్వంలో వివేచన కనిపించ డం లేదని, అసెంబ్లీలో ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలో కి రావడం ఖాయమన్నారు. తమ ప్రభుత్వం లో మీడియాపై ఆంక్షలు ఉండబోవన్నారు. -
రాజీనామాల యోచనలో కాంగ్రెస్?
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లకు మద్దతుగా మూకుమ్మడి రాజీనామాలు చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఈ అంశంపై మంగళవారం జరిగిన సీఎల్పీ సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది. ఇద్దరు సభ్యులకు మద్దతుగా రాజీనామాలు సమర్పిస్తే ఎలా ఉంటుంది? ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధపడుతుందా? అన్న కోణంలో చర్చ జరిగింది. కానీ ఏకాభిప్రాయం రాకపోవడంతో ప్రస్తుతానికి నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ముందు ఆ ఇద్దరు సభ్యుల విషయంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో స్పష్టమయ్యాక అవసరమైతే మూకుమ్మడి రాజీనామాలకు వెళ్దామన్న అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేశారు. మొత్తమ్మీద తమ ఎమ్మెల్యేలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేసే దిశలో కాంగ్రెస్ పకడ్బందీ వ్యూహం రచిస్తోంది. దీనిపై రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేయాలని, పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావనకు తీసుకురావాలని యోచిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లిన టీపీసీసీ.. ప్లీనరీ సమావేశాలకు వెళ్లి ఢిల్లీ పెద్దలతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయాలని నిర్ణయించింది. కుంతియాతో మంతనాలు ఇద్దరు సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయడంతోపాటు ఇతర సభ్యులను సస్పెండ్ చేస్తూ అధికార పక్షం నిర్ణయం తీసుకున్న తర్వాత అసెంబ్లీ లాబీల్లోని సీఎల్పీ నేత జానారెడ్డి చాంబర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. తర్వాత సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియాతో పీసీసీ చీఫ్ ఉత్తమ్, జానారెడ్డి మాట్లాడారు. సభ్యుల సలహాలను తీసుకున్న తర్వాత ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇద్దరు సభ్యుల సభ్యత్వాన్ని రద్దు అంశాన్ని.. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చర్చనీయాంశం చేయాలని నిర్ణయించారు. అధికార పక్షం అనుకున్నదే తడువుగా ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి గెంటేస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని, ఈ విషయాన్ని దేశంలోని అన్ని రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఏఐసీసీ ప్లీనరీలో దీనిపై చర్చించి.. భవిష్యత్తులో ఏ రాష్ట్రంలోనూ, ఏ పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా తీర్మానాన్ని ఆమోదింపజేయాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయి ఆందోళనలు పార్టీ కేడర్‌ను ఇదే అదనుగా సమాయత్తం చేసే కార్యాచరణను సీఎల్పీ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్ని మండల కేంద్రాల్లో, నియోజకవర్గాల్లో కేసీఆర్ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కాంగ్రెస్ కేడర్ ఆందోళనకు దిగింది. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గాంధీభవన్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమం రసాభాసగా మారింది. -
కాంగ్రెస్ సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : తమపై శాసనసభ సభ్యత్వాల రద్దు, సస్పెన్షన్ల వేటును విపక్ష కాంగ్రెస్ తీవ్రంగా పరిగణించింది. స్పీకర్ చర్యలను తీవ్రంగా నిరసిస్తూ ఈమేరకు సంచలన నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు ప్రకటించింది. అందరికీ అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని సీఎల్పీ నేత జానారెడ్డి చెప్పారు. ‘ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తున్నది. ఏ నిబంధన ప్రకారం మా సభ్యుల సభ్యత్వాలు రద్దు చేస్తారు? ఏం తప్పు చేశామని సస్సెన్షన్ విధించారు? కనీసం వివరణ తీసుకోకుండా ఇంత తీవ్ర నిర్ణయం తీసుకుంటారా? ఇక మీతో మాట్లాడి ప్రయోజనం లేదు. ప్రజాక్షేత్రంలోనే అమీతుమీ తేల్చుకుంటాం..’ అని కాంగ్రెస్ పక్షనేత జానా రెడ్డి అన్నారు. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ తర్వాతే.. : మంగళవారం శాసన సభ ప్రారంభమైన వెంటనే 11 మంది ఎమ్మెల్యేలపై వేటు వేయాలన్న తీర్మానం ఆమోదం పొందింది. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ల సభ్యత్వాల రద్దు, ఇతర సభ్యులపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో సభ నుంచి బయటికొచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీ ఆఫీసులో అత్యవసరంగా సమావేశమయ్యారు. మెజారిటీ ఎమ్మెల్యేలు ‘‘వాళ్లు సస్పెండ్ చెయ్యడం కాదు.. మనమే మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం..’ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఢిల్లీ అధిష్టానానికి కూడా తెలియజేశామని, అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే రాజీనామాలు చేస్తామని నేతలు చెప్పారు. -
కేంద్రం సత్యం
అన్ని దేశాల వాస్తుకి సరిపోయేలా 33 వేల ఎకరాల నేలని చూపిస్తే అది హాట్ కేక్ అవుతుందని బాబు కలలు కన్నారు. అదంత వీజీ కాదని తేలింది. చంద్రబాబు బాగా ఇరుకున పడ్డాడని కొందరు అనుకుంటున్నారు. సమస్యే లేదు, వ్యతిరేక పరిస్థితుల్ని అనుకూలంగా మలచుకొనే సామర్థ్యం ఉంది. పొలస చేపలా వరద గోదారికి ఎదురీదగలడని ఇంకొందరంటున్నారు. పొత్తిళ్లనాటి నించి చంద్రబాబు గంపెడాశలతో మోదీ వెనకాల ఆవు వెంట దూడ వలె తిరుగుతున్న మాట నిజం. ఆఖరికి మోదీ చాటపెయ్యని చూపించి, చేపించి పాలు పిండుకున్నారని కొందరు వ్యాఖ్యా నిస్తున్నారు. కొన్ని బిల్లులు ఇవ్వకపోయినా, చాలా బిల్లులకు ప్రధానికి బాబు సహకరించారని ఇంకొందరు విశ్లేషిస్తున్నారు. మోదీకి చంద్రబాబు పాలనమీద పూర్తి నమ్మకం ఉంది. ఘటనాఘటన సమర్థుడని విశ్వాసం ఉంది. అందుకే చంద్రబాబు భుజంమీద మోది చెయ్యి వేశారని చెబుతారు. అవసరమైతే ఏ భాష సభ్యులనైనా ఓ గొడుగు కిందికి చేర్చగల పనితనం చంద్రబాబుకి ఉందని పెద్దాయనకి గట్టి నమ్మకం. ఇక ఇట్నించి చూస్తే– వాజ్‌పేయి హయాంలోలాగే ఆవకాయ వాటంగా, నల్లేరుమీద బండి చందంగా నడిచి పోతుందనుకున్నారు. బాబుకి ప్రమాణ స్వీకారం దగ్గర్నించి మోదీ హయాం గతుకుల రోడ్డుగానే అనిపిస్తోంది. కుదుపులు, మలుపులు బాగానే ఇబ్బంది పెడుతున్నాయ్. ఎన్టీఆర్ ‘కేంద్రం మిథ్య’ అని ప్రతిపాదిస్తే చంద్రబాబు ‘కేంద్రం సత్యం’ అని విభేదించారు. మనం కేంద్రంతో గొడవపడితే, కష్టాతికష్టం అది నష్టాతినష్టం అని తాను నమ్మి ఏపీతో నమ్మించారు. మనం తెలివిగా స్నేహ భావంతో ఉన్నట్టే ఉండి మనక్కావల్సిన నిధులు రాబట్టుకోవాలి. నేనేదో చేస్తున్నానని ఎన్నోసార్లు నొక్కి వక్కాణించారు. సరిగ్గా మోదీ కూడా స్నేహ భావం విషయంలో అదే వ్యూహంతో ఉన్నారు. మిత్రపక్షం కుంపట్లో చంద్ర బాబు పప్పులు ఉడకలేదు. గోలవరం తప్ప పోలవరం కదల్లేదు. ప్రపంచ ప్రసిద్ధ కాపిటల్‌లో మొదటి అక్షరం కూడా పడలేదు. ప్రధాని ప్రత్యేక విమానంలో ఉదారంగా తెచ్చిన మృత్తికలు, గంగాజలం మాత్రం ప్రజకి బాగా గుర్తుంది. 33 వేల ఎకరాల నేలని అన్ని దేశాల వాస్తుకి సరిపోయేలా చూపిస్తే అది హాట్ కేక్ అవుతుందని బాబు కలలు కన్నారు. అదంత వీజీ కాదని తేలింది. గుగ్గిళ్ల మూటని చూస్తూ పరిగెత్తిన గుర్రంలా నాలుగేళ్లు చంద్రబాబు భ్రమలో ఉన్నమాట నిజం. ఇప్పుడు మార్గాంతరం లేదు. గేరు మార్చి ప్రత్యేక హోదా జిందాబాద్! ప్యాకేజి డౌన్ డౌన్ అని అరుస్తున్నారు. మిత్రపక్షంలో ఉంటామంటూనే ఒకటిన్నర మంత్రి పదవుల్ని త్యాగం చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమం చేజారి ఇంకోరి చేతుల్లోకి పోతుందేమోనని టీడీపీకి భయం. వైఎస్సార్సీపీ వైపు బీజేపీ మొగ్గుతుందేమోనని తెలుగుదేశంకి పీడకలలు వస్తున్నాయి. తృతీయఫ్రంట్ అనే ఓ గడి ఖాళీగా ఉంది. చంద్రబాబు ఆ గడిలోకి రాకుండా కేసీఆర్‌తో మోదీయే కర్చీఫ్ వేయించాడని ఓ వదంతి ప్రచారంలో ఉంది. ఈ గందరగోళాల్లో వేలకోట్ల బ్యాంకు స్కాంలు, ఏపీ బడ్జెట్ పక్కకి వెళ్లి పోయాయి. ఇంతా చేసి అంతా ఒకటే. మోదీ, చంద్రబాబు, కేసీఆర్– ఎవరెవరితోనూ విభేదించరు. అనంత విశ్వంలో గ్రహాల్లా ఎవరి కక్ష్యలో వాళ్లు తిరుగుతూ ఉంటారు. అప్పుడప్పుడు మాత్రం గ్రహణాలు తెప్పించుకుంటూ ఉంటారు. తర్వాత సంప్రోక్షణలు జరుగుతాయ్. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు -
ఇది ప్రజా విజయం: కోటంరెడ్డి
సాక్షి, నెల్లూరు : ప్రజల ఒత్తిడి, ప్రతిపక్ష పోరాట పటిమ వల్లే ఆలస్యంగానైనా టీడీపీ కేంద్ర మంత్రులు రాజీనామా చేయడం అభినందించదగ్గ విషయమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. కేవలం రాజీనామాలతో సరిపెట్టకుండా, అవిశ్వాసం పెట్టడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ఈ అంశంలో వైఎస్ఆర్ సీపీ కూడా మద్దతిస్తుందని తెలిపారు. ‘ప్రతీ గొంతుకలో ప్రత్యేక హోదా ఆకాంక్షను వినిపిద్దాం.. హోదా కోసం కలిసి అడుగులు వేద్దామ’ని కోటంరెడ్డి పిలుపునిచ్చారు. -
అశోక్, సుజనా రాజీనామాలు ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: ఇద్దరు కేంద్ర మంత్రుల రాజీనామాలకు ఆమోదముద్ర పడింది. కేంద్ర మంత్రి పదవులకు అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి చేసిన రాజీనామాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం ఆమోదం తెలిపారు. ప్రధానమంత్రి సిఫారసు మేరకు వీరి రాజీనామాలను ఆమోదం లభించిందని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. పౌర విమానయాన శాఖను ప్రధాని పర్యవేక్షిస్తారని వెల్లడించింది. సుజనా చౌదరి నిర్వహించిన శాస్త్ర, సాంకేతిక సహాయ శాఖను ఎవరికీ అప్పగించలేదు. గురువారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వీరిద్దరూ రాజీనామాలు అందజేసిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లుగా టీడీపీ ఎంపీల నిరసనలకు దూరంగా ఉన్న అశోక్‌గజపతిరాజు ఈరోజు పార్లమెంట్ వద్ద ఆందోళనలో పాల్గొన్నారు. సహచర ఎంపీలతో కలిసి నినాదాలు చేశారు. -
ఎన్డీఏలోనే కొనసాగుతాం: టీడీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ అధిష్టానం నిర్ణయం మేరకే మంత్రి పదవులకు రాజీనామా చేశామని, అయితే ఎన్డీఏలోనే కొనసాగుతామని ఆ పార్టీ ఎంపీలు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి అన్నారు. ప్రధాని మోదీని కలుసుకుని రాజీనామా లేఖలు సమర్పించినట్లు ఎంపీలు తెలిపారు. అనంతరం అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 'దేశానికి సేవచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. మంత్రి పదవికి రాజీనామా చేసినా ఎన్డీఏలోనే కొనసాగుతాం. పార్టీ ఆదేశాల మేరకే రాజీనామ లేఖలు సమర్పించాం. త్వరలో ఏపీలో సమస్యలకు పరిష్కారం వస్తుందని ఆశిస్తున్నాం. కాంగ్రెస్, బీజేపీ మద్ధతుతోనే రాష్ట్ర విభజన జరిగింది, ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయాలని కోరుకుంటున్నామని' అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. ఏపీ ప్రజల ఒత్తిడికి తలొగ్గే మేం రాజీనామాలు చేశామని సుజనా చౌదరి అన్నారు. 'రాజీనామాల నిర్ణయం నిజంగా దురదృష్టకరం, కానీ అంతకంటే మాకు ప్రత్యామ్నాయం లేదు. విభజ హామీలు అమలు చేయాలనే ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రత్యేక ప్యాకేజీలో ఒక్క అంశాన్ని కూడా కేంద్రం అమలు చేయలేదు. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఏపీని మోసం చేశాయి. ఏపీ ప్రజలు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. విభజన సమయంలో ఉభయ సభల్లో బిల్లు ఎలా పాస్ అయిందో అందరికీ తెలుసు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు. ఇప్పటికే ఏపీ ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారు. 16వ లోక్‌సభ కాలపరిమితి ముగిసేలోపు విభజన హామీలు నెరవేర్చాలనేది మా డిమాండ్. కేంద్ర మంత్రులుగా కంటే కూడా పార్లమెంట్లో ఎంపీలుగా ఏపీ ప్రయోజనాల కోసం పోరాడతాం. ఏపీ ప్రజలకు అండగా ఉంటానని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని' టీడీపీ ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. -
కేంద్ర మంత్రులు సుజనా, అశోక్ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలు తమ రాజీనామా లేఖలను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించారు. పార్టీ అధిష్టానం సూచనల మేరకు టీడీపీ ఎంపీలు తమ పదవుల నుంచి వైదొలిగారు. నేటి సాయంత్రం దాదాపు 6 గంటల సమయంలో అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలు ప్రత్యేక వాహనాల్లో ప్రధాని మోదీ నివాసానికి చేరుకున్నారు. అనంతరం ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చించిన అనంతరం తమ రాజీనామా లేఖలను మంత్రులు ప్రధానికి సమర్పించారు. కాగా, ఏపీకి జరిగిన అన్యాయంపై కేంద్రం సరైన రీతిలో స్పందించని కారణంగా కేంద్రం నుంచి తమ ఎంపీలు తప్పుకుంటారని గురువారం సాయంత్రం టీడీపీ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకుముందు రాజస్థాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి రాగానే ప్రధాని మోదీ, మిత్రపక్ష సీఎం చంద్రబాబుకు ఫోన్ చేశారు. నేటి సాయంత్రం 6 గంటలకు టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజులు తనను కలుసుకునేందుకు అపాయింట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏపీలో రాజకీయ పరిస్థితులపై చంద్రబాబుతో మోదీ చర్చించారు. అపాయింట్మెంట్ సమయంలో మోదీని కలుసుకున్న టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రి పదవుల నుంచి వైదొలగుతున్నట్లు రాజీనామా లేఖలను ప్రధానికి సమర్పించారు. కాగా, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన గురువారం ఏపీ రాజకీయాల్లో చిచ్చురేపింది. హోదా సాధ్యం కాదని జైట్లీ ప్రకటన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు తమ పార్టీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్‌లో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. నేటి ఉదయం కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలు తమ లేఖల్ని అందించాలని చూడగా.. ప్రధాని మోదీ రాజస్తాన్ పర్యటనలో ఉండటంతో వీలుకాలేదు. సాయంత్రం తమ రాజీనామా పత్రాలు మోదీకి అందజేశారు. కాగా, నేటి ఉదయం ఏపీ బీజేపీ నేతలు మాణిక్యాల రావు, కామినేని శ్రీనివాస్‌లు తమ మంత్రి పదవుల రాజీనామా లేఖల్ని సీఎం చంద్రబాబుకు సమర్పించిన విషయం తెలిసిందే. -
చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్!
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీఏ సంకీర్ణ భాగస్వామి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబుతో ఫోన్లో మోదీ చర్చించినట్లు సమాచారం. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ పోరాటం ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మరోసారి చలనం రాగా, మంత్రుల రాజీనామాలపై ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. రాజస్థాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి రాగానే ప్రధాని నరేంద్ర మోదీ, మిత్రపక్ష సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. కాగా, నేటి సాయంత్రం 6 గంటలకు కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు ప్రధాని మోదీని కలుసుకునేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నారు. ప్రధానితో ప్రత్యేక హోదాపై చర్చించిన తర్వాత ఈ ఇద్దరు మంత్రులు తమ రాజీనామా లేఖలను మోదీకి సమర్పించనున్నట్లు సమాచారం. మోదీకి రాజీనామా లేఖలు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మాట తప్పినందున తాము రాజీనామాలు చేస్తామని, ప్రధానిని కలిసి తమ రాజీనామా లేఖలు ఇస్తామని కేంద్ర మంత్రి సుజనా చౌదరి నేటి ఉదయం వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో ప్యాకేజీ అమలులో జాప్యం వల్లే ఏపీలో ఈ పరిస్థితి ఏర్పడిందని సుజనా పేర్కొన్న విషయం తెలిసిందే. -
రాజీలేని పోరుకు చిరునామా
సాక్షి, విశాఖపట్నం: ‘ప్రత్యేక హోదా మన హక్కు–ప్యాకేజీతో మోసపోవద్దు’అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహోద్యమానికి సిద్ధమవుతోంది. రాష్ట్ర శ్రేయస్సు కోసం నాలుగేళ్లుగా అలుపెరగని పోరు సాగిస్తున్న ప్రధాన ప్రతిపక్షం ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తోంది. ప్యాకేజీ పేరిట కపట నాటకమాడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించేందుకు పూనుకుంటోంది. నాలుగేళ్లుగా మౌనంగా ఉన్న టీడీపీ పెద్దలు నాలుగు రోజుల పాటు పార్లమెంటులో ఆడిన నాటకంపై ఇప్పటికే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హోదా సాధనే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచే దిశగా ఏప్రిల్ 6న తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తామని వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి చేసిన ప్రకటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ నెల 8న వామపక్షాలతో వైఎస్సార్ సీపీ తలపెట్టిన బంద్‌కు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష మద్దతు లభించింది. అదే రీతిలో ఎంపీల రాజీనామా ప్రకటనతో అధికార టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేంద్ర కేబినెట్లో కొనసాగుతున్న మంత్రులు, ఎంపీలు రాజీనామా చేయకుండా ఒత్తిడి చేయడం వల్ల ప్రయోజనం ఉండదన్న భావన టీడీపీలో సైతం వ్యక్తమవుతోంది. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. ఇదిగో.. అదిగో.. అంటూ రెండేళ్ల పాటు ఊరించిన పాలకవర్గాలు చివరకు చేతులెత్తేశాయి. ఐదు కోట్ల మంది ఆంధ్రులు హోదా కావాలని ఘోషిస్తుంటే.. ప్యాకేజీ ముద్దు అంటూ టీడీపీ పెద్దలు ప్రకటనలు చేయడాన్ని అంతా జీర్ణించుకోలేకపోయారు. దీంతో హోదా కోసం వైఎస్సార్సీపీ ఎప్పుడు ఏ పిలుపు ఇచ్చినా స్వచ్ఛందంగా విశాఖవాసులు ముందుండి కదం తొక్కారు. ప్రస్తుతం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మార్చి 1న జిల్లా కేంద్రంలో మహాధర్నాను విజయవంతం చేసేందుకు పార్టీ జిల్లా శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. మరో వైపు మార్చి 5న జంతర్‌మంతర్ వద్ద తలపెట్టిన మహాధర్నాకు కూడా తరలి వెళ్తామని ప్రతినబూనుతున్నారు. ఇక నాటకాలు కట్టిపెట్టాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా నాటకాలు కట్టిపెట్టాలి. ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి. హోదా ఒక్కటే ఏపీకి సంజీవిని. అది లేకపోతే రాష్ట్రం అధోగతే. హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీయే. విభజన నాటి నుంచి నేటి వరకు హోదా కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ధర్నాలు.. బంద్‌లు చేసి హోదా కోసం పోరాడుతోంది. మా పార్టీ ఎంపీల రాజీనామాలతో టీడీపీ, బీజేపీ ప్రజాప్రతినిధులపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. కచ్చితంగా వాళ్లు కూడా రాజీనామా చేసి హోదా కోసం పోరాడాలి. – మళ్ల విజయప్రసాద్, మాజీ ఎమ్మెల్యే,విశాఖ నగర అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ హోదా కోసం అలుపెరగని పోరు ప్రత్యేక హోదాపై నమ్మకద్రోహం చేయడమే కాకుండా.. పార్లమెంటు సాక్షిగా రెండు పార్టీలు కపట నాటకమాడుతున్నాయి. హోదా కోసం కడవరకు పోరాడతాం. ఇందు కోసం మా పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని మా అధినేత ఎప్పుడో ప్రకటించారు. ఏప్రిల్ 6న చేసి తీరుతారు. హోదా ఇవ్వకపోతే కాంగ్రెస్‌కు పట్టిన గతే టీడీపీ, బీజేపీలకు పడుతుంది. – గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్సీపీఅనకాపల్లి పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు చంద్రబాబువి సన్నాయి నొక్కులు ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తామని మా అధినేత జగన్ ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఆఖరి ప్రయత్నంలో ఇందుకు వెనుకాడం. ఇప్పటికే అలుపెరుగని పోరాటం సాగిస్తూనే ఉన్నాం. ఐదు బడ్జెట్లు చూశారు. నెల రోజుల పాటు అల్టిమేటం ఇచ్చి ఏప్రిల్ 6న రాజీనామా చేస్తారని ప్రకటించారు. చంద్రబాబు మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. హోదా కోసం ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఇప్పుడు కొత్త నాటకమాడుతున్నాడు. – తైనాల విజయకుమార్, విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ సరైన సమయంలో ఎంపీలు రాజీనామా నిర్ణయం వైఎస్సార్ సీపీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ చేసిన ప్రకటనను వామపక్షాలు స్వాగతిస్తున్నాయి. బలమైన నిరసన తెలియజేయడం ఇదొక మార్గం. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు దోహదం చేస్తుంది. ఏపీ ప్రజల కోరిక.. విభజన చట్టంలో కూడా ఉంది. వామపక్షాలు చేపట్టిన బంద్‌లో కూడా హోదా డిమాండ్ కీలకం. హోదా ఇచ్చి తీరాల్సిందే. రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేయాలి. హోదా కోసం వారు చేపట్టే ఆందోళనలకు మా మద్దతు ఉంటుంది. – సీహెచ్ నరసింగరావు,సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు -
నాలుగేళ్ల తర్వాత రాజకీయాల నుంచి తప్పుకొంటా..
నారాయణపేట రూరల్: ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడానికే ఎమ్మెల్యేగా గెలిచానని.. మరో నాలుగేళ్లలో ప్రతీ ఎకరాకు సాగునీరు అందించి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశాక రాజకీయాల నుంచి తప్పుకుంటానని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నారాయణపేట మండలం శ్యాసన్‌పల్లిలో జరిగిన ఎన్ఎస్ఎస్ క్యాంపు ముగింపు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తొలుత చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శేఖర్‌రెడ్డి ఉపన్యసిస్తూ నియోజకవర్గాల విభజన జరిగినా మరో ప్రాంతానికి పోకుండా చివరి వరకు నారాయణపేట ప్రజలకు సేవ చేయాలని ఎమ్మెల్యేను కోరారు. దీనికి స్పందనగా ఎమ్మెల్యే నారాయణరెడ్డి స్పందిస్తూ ఇప్ప టి వరకు బహిర్గతం చేయని ప లు అంశాలను చెబుతానంటూ మాట్లాడారు. 2009 సాధారణ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మె ల్యే ఎల్కొటి ఎల్లారెడ్డి కోయిలకొండలో ప్రచారం కోసం తనని పిలిపించుకోగా 16 గ్రామాల్లో తాగు, సాగునీరు అజెండాతో ఓట్లు వేయించి 7,800 ఓట్ల మెజార్టీతో గెలిపించానన్నారు. ఆయన హామీ నెరవేర్చకపోవడంతో తన ప్రజల కోసం ఎమ్మెల్యేగా స్వయంగా పోటీచేసి అసెంబ్లీకి వెళ్లానని.. అధికార పార్టీలోకి మారి ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తున్నానని తెలిపారు. ఇప్పటికే మిషన్ భగరథ కింద ఇంటింటికి తాగునీరు అందించే దిశగా పనులు వేగవంతం అయ్యాయని, ఇక మరో నాలుగేళ్లలో ప్రతీ ఎకరానికి సాగునీరు కూడా అందాక రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. రోడ్లు లేని నియోజకవర్గాల్లో రెండో స్థానం తెలంగాణ ఏర్పాటు తర్వాత రోడ్లు లేని నియోజకవర్గాలపై సర్వే చేస్తే 37శాతంతో తెలంగాణలోనే రెండో స్థానంలో నారాయణపేట నియోజకవర్గం ఉందని తేలినట్లు ఎమ్మెల్యే తెలిపారు. దీంతోపట్టుబట్టి పీఆర్, ఆర్ఈండ్బీ, ట్రైబల్ వెల్పేర్ తదితర శాఱల ద్వారా రాష్ట్రంలోనే అత్యధిక నిధులు తీసుకుని వచ్చి వంద శాతం రోడ్లు మంజూరు చేయించి మొదటి స్థానంలో నిలిపానన్నారు. ఇప్పటి వరకు మిషన్ భగీరథలో 406 వాటర్‌ట్యాంకులు, మిషన్ కాకతీయ కింద 331 చెరువుల మరమ్మత్తులు చేయించానన్నారు. ఎస్ఎల్డీసీ ప్రభుత్వ పరం కోసం 16 ఏళ్లుగా తిరిగినా కాకపోతే తాను పట్టుబట్టి చేయించానన్నారు. ఇక దశాబ్దాలుగా బ్ధాలుగా ఎదురుచూస్తున్న పట్టణ రోడ్డు వెడల్పు నష్టపరిహారం చెలిస్తూ పూర్తిచేస్తున్నామన్నారు. ముప్పై ఏళ్లలో చేయలేని అభివృద్ధిని నాలుగేళ్లలో చేసి చూపించానని.. త్రాసుతో కొలిచినా అభివృద్ధి సూచి తనవైపే నిలుస్తుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. జాయమ్మ పేరుతో మోసం జాయమ్మ చెరువు విషయమై ప్రతీ ఎన్నికల్లో హామి ఇచ్చిన నాయకులు ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి దుయ్యబట్టారు. వాస్తవానికి చెరువును సైతం చూడని నాయకులు 0.6 టీఎంసీల సామర్ధ్యం ఉందని అబద్ధాలు చెప్పారని ఎద్దేవా చేశారు. రికార్డుల ప్రకారం కేవలం 0.01 టీఎంసీల సామర్థ్యంతో 90 ఎకరాల ఆయకట్టు మాత్రమే ఉన్న ఈ చెరువు డివిజన్ ప్రజల సాగు, తాగునీటిని తీరుస్తుందని కల్లబొల్లి మాటలతో మోసం చేశారని విమర్శించారు. సంగంబండ నుంచి పేరపళ్ల వరకు ప్రాజెక్టు నిర్మాణానికి రూ.180కోట్లు ప్రతిపాదనలు ఉన్నాయని, తక్కువ ఆయకట్టుకు అంత ప్రజాధనం దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. పాలమూర్ – రంగారెడ్డి పథకంలో భాగంగా 103 కిలోమీటర్ల కాల్వ నారాయణపేట శివారులోని కొండారెడ్డిపల్లి చెరువుతో ముగుస్తుందని, మార్గమధ్యలో ఉన్న జాయమ్మకు నీరు మళ్లించేలా అనుమతి కోరుతామని తెలిపారు. ఈ విషయమై 17వ తేదీన రానున్న మంత్రి హరీష్‌రావుతో చర్చించి ప్రకటన చేయిస్తామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా వివరించారు. -
కలకలం; ఐటీ ఉద్యోగుల గెంటివేత
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ ఐటీ కారిడార్‌లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వాకం హైదరాబాద్‌లో కలకలం రేపింది. 200 మంది ఉద్యోగులను బలవంతంగా తొలగించడం ఆందోళన రేకెత్తించింది. తమను భయపెట్టి బలవంతంగా ఉద్యోగాలకు రాజీనామాలు చేయించిందంటూ వెరిజాన్ డాటా సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(వీడీఎస్) కంపెనీపై పలువురు ఉద్యోగులు ఈ నెల 4న పోలీసులను ఆశ్రయించారు. బౌన్సర్లతో భయపెట్టి.. కంపెనీ యాజమాన్యం 2017 డిసెంబర్ 12, 13 తేదీల్లో మీటింగ్ రూమ్‌కు ఒక్కొక్కరిని పిలిపించి తాము ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నట్లు సంతకాలు చేయాలని ప్రింటెడ్ పేపర్లు తమ ముందు ఉంచిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఉద్యోగులు వాపోయారు. అప్పటికే ఆ గదిలో బౌన్సర్లతో హెచ్ఆర్ మేనేజర్ కూడా ఉన్నారని తెలిపారు. ఇందుకు కొంత సమయం కావాలని తాము అడగగా హెచ్ఆర్ మేనేజ్మెంట్ నిరాకరించిందని, రాజీనామా పత్రాలపై సంతకం పెట్టడం తప్ప మరో మార్గం లేదని తేల్చి చెబుతూ బౌన్సర్లకు సైగలు చేసిందని ఆరోపించారు. తమలో కొందరు సీట్లలోంచి లేచి బయటకు రాబోగా బౌన్సర్లు తమను కదలనీయకుండా అదిమిపెట్టారన్నారు. తమను మానసికంగా, భౌతికంగా హింసించి రాజీనామా పత్రాలపై సంతకాలు తీసుకున్నారని, తమంతగా తాము రాజీనామాలు చేయలేదని వివరించారు. అనంతరం బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బంది తమను కార్యాలయం నుంచి బయటకు గెంటేశారని, కనీసం తమ సొంత వస్తువులు తీసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బౌన్సర్ల, సెక్యూరిటీ సిబ్బంది దురుసు చర్యలు ఆ భవనంలోని, చుట్టుపక్కల భవనాల్లో సీసీ కెమెరాల్లో రికార్డు అయి ఉన్నాయన్నారు. కంపెనీ యాజమాన్యం వాటిని ధ్వంసం చేయకముందే స్వాధీనం చేసుకుని పరిశీలించాల్సిందిగా పోలీసులను బాధితులు కోరారు. తమ ఫిర్యాదును పరిశీలించి కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కాగా, చెన్నై కార్యాలయంలోనూ పలువురు ఉద్యోగులను తొలగించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్, చెన్నైలో మొత్తం 1250 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్టు గత డిసెంబర్లోనే వార్తలు వచ్చాయి. దీనిపై వెరిజాన్ డాటా కంపెనీ స్పందించలేదు. ఉద్వాసనలు- ఆందోళనలు ఐటీ రంగంలో ఉద్యోగుల ఉద్వాసనలు పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఆటోమేషన్, అప్డేట్ కాకపోవడం వంటి కారణాలు చూపుతూ ఇటీవల కాలంలో చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. సీనియర్ ఉద్యోగులను తీసేసి వీరి స్థానంలో తక్కువ వేతనాలకు కొత్తగా సిబ్బందిని తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఐటీ ఉద్యోగులు కోరుతున్నారు. ఐటీ ఉద్యోగుల హక్కులు కాపాడేందుకు ఫోరమ్ ఫర్ ఐటీ ఎంప్లాయిస్(ఫైట్) కూడా పనిచేస్తోంది. గతేడాది కాగ్నిజెంట్‌లో ఉద్యోగులను తొలగించినప్పుడు ‘ఫైట్’ గట్టిగా పోరాడింది. -
మేఘాలయ కాంగ్రెస్‌కు షాక్
షిల్లాంగ్: త్వరలో ఎన్నికలు జరగనున్న మేఘాలయలో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం 8 మంది ఎమ్మెల్యేలు తమ సభ్యత్వానికి రాజీనామా సమర్పించగా వారిలో ఐదుగురు కాంగ్రెస్ పార్టీ వారే కావడం గమనార్హం. త్వరలో వీరు ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ)లో చేరనున్నారు. మరో రెండు నెలల్లో ఎన్నికలుండగా రాజీనామాలతో ముకుల్ సంగ్మా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలినట్లయింది. -
బీజేపీ ఎంపీల రాజీనామా ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముగ్గురు ఎంపీల రాజీనామాను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సోమవారం ఆమోదించారు. బీజేపీకి చెందిన ఆదిత్యానాథ్ యూపీ సీఎం ఎంపిక కావటం.. మరో ఎంపీ కేశవ్ ప్రసాద్ మౌర్య యూపీ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టడం, ఇక మహారాష్ట్రకు చెందిన నానా పటోలే పార్టీపై అసంతృప్తితో ఈ మధ్యే తన పదవికి రాజీనామా చేయటం తెలిసిందే. ఈ క్రమంలో వారి వారి రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. -
దొంగ రాజీనామాల సంస్కృతి కాంగ్రెస్‌దే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో దొంగ రాజీనామాలు, దొంగ దీక్షలు చేసిన చరిత్ర కాంగ్రెస్ నాయకులదేనని, అది వారి సంస్కృతి అని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌పై కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నా మన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఉద్యమ సమయంలో కేంద్ర మంత్రిగా ఉన్న జైపాల్‌రెడ్డి ఒక్కరోజు కూడా ఉద్యమకారులకు అండగా నిలవలేదని ఆరోపించారు. ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన సమయంలో విద్యార్థుల ఆత్మహత్య లు పెరిగి, ఉద్యమకారులపై అక్రమ కేసులు, పోలీసు నిర్బంధం పెరిగినప్పుడు కూడా ఆయన స్పందించక పోగా అవహేళన చేయలేదా అని ప్రశ్నించారు. జాతీయవాదిని, దేశ మంత్రిని అని చెప్పుకునే ఆ పెద్ద మనిషికి తెలంగాణను సాధించిన కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. -
రాజన్ రాజీనామా ‘చిదంబర’ రహస్యం!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా రాజన్ వైదొలగడం వెనుక కారణంపై కేంద్ర మాజీ ఆర్థికమంత్రి,కాంగ్రెస్ నేత పి. చిదంబంర సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన పెద్దనోట్ల రద్దును వ్యతిరేకించినందు వల్లే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆరోపించారు. వాస్తవానికి రాజన్ ఆర్బీఐ గవర్నర్ గా కొనసాగాలనుకున్నారనీ, కానీ పరిస్థితులు ఆయనను రాజీనామా వైపు నడిపించాయని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ పెద్దనోట్లను తీవ్రంగా వ్యతిరేకించిన రాజన్ పదవీకాలం పొడించలేదని ఆరోపించారు. అలాగే రాజన్ రాజీనామా సందర్బంగా ఆర్బీఐ తరపున రాజన్ డీమానిటైజేషన్‌ను వ్యతిరేకిస్తూ 5 పేజల లేఖను ప్రభుత్వానికి సమర్పించారని పేర్కొన్నారు. డీమానిటైజేషన్ ప్రక్రియను ఎందుకు చేపట్టకూడదో వాదిస్తూ ఈ ఐదు పేజీల లేఖను రాసినట్టు తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ లేఖను బహిర్గతం చేయాలని ఆయన సవాల్ చేశారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోంటే రాజన్ లేఖను బైటపెట్టగాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా గత ఏడాది సెప్టెంబర్ 4తో రాజన్ పదవీకాలం ముగియనుండగా... రాజన్ పదవీకాలాన్ని పొడిగిస్తారా లేదా అనే చర్చ ఒక పక్క జోరుగా సాగుతుండగానే రాజన్ తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ ను ప్రభుత్వం నియమించింది. అలాగే నవంబర్ 8 న ప్రధాని మోదీ 80శాతం చలామణిలోఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి ప్రకంపనలు రేపారు. మరోవైపు అప్పట్లో ఆర్బీఐ గవర్నర్ పదవినుంచి తొలగించాలంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణియన్ స్వామి పలుమార్లు రాజన్ పై దాడికి దిగినపుడు కూడా చిదంబరం రాజన్‌కు మద్దతుగగా నిలిచిన సంగతి తెలిసిందే. -
కేంద్ర మంత్రులు నజ్మా, సిద్దేశ్వర రాజీనామా
- నజ్మా స్థానంలో ముక్తార్ అబ్బాస్ నఖ్వీ - సిద్దేశ్వర బాధ్యతలు బాబుల్ సుప్రియోకు న్యూఢిల్లీ : కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి నజ్మా హెప్తుల్లా, భారీ పరిశ్రమల సహాయమంత్రి జీఎం సిద్దేశ్వర మంగళవారం మంత్రి పదవులకు రాజీనామా చేశారు. రాష్ట్రపతి భవన్‌కు పంపిన వీరి రాజీనామాలు ఆమోదం పొందాయి. వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు వీరు ప్రకటించారు. గతవారం జరిగిన కేబినెట్ విస్తరణలో 75 ఏళ్లు దాటిన నజ్మా, మిశ్రాలకు విశ్రాంతి ఇస్తారనిప్రచారం జరిగింది. అయితే.. దీనిపై ఎలాంటి నిర్ణయం లేకుండానే పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఈ నేపథ్యంలోనే నజ్మా రాజీనామా ఆసక్తిగా మారింది. జూలై 5నే వీరి ద్దరూ రాజీనామా చేయాలనుకున్నా.. నజ్మా విదేశీ పర్యటనలో, సిద్దేశ్వర వేరే చోట ఉన్నం దున మంగళవారం రాజీనామా చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. నజ్మా స్థానం లో.. మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి పూర్తి బాధ్యతలు అప్పగించారు. కర్ణాటక ఎంపీ సిద్దేశ్వరను కూడా జూలై 5నే రాజీనామా చేయమని కోర గా.. ఆ రోజున తన పుట్టినరోజువల్ల రాజీనామాను వాయిదా వేశారు. అయితే బాబుల్ సుప్రియోను పట్టణాభివృద్ధి సహాయ మంత్రినుంచి తప్పించి భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ప్రైజ్ శాఖ భాధ్యతలు అప్పగించారు. అయితే.. మిశ్రాకు 75 ఏళ్లు వచ్చినా.. యూపీ ఎన్నికల నేపథ్యంలో(బ్రాహ్మణ నేత) ఆయన్ను తప్పించలేదని తెలిసింది. -
దమ్ముంటే 24 గంటల్లో రాజీనామా చేయండి
ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వైఎస్సార్సీపీ నేత అంబటి సవాలు సాక్షి, హైదరాబాద్: టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు 24 గంటల సమయమిస్తున్నామని, వారికి సిగ్గు, లజ్జ, దమ్మూ ఉంటే పదవులకు రాజీనామాలు చేసి సైకిల్ గుర్తుపై గెలుపొందాలని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ప్రతి సవాలు విసిరారు. అంబటి గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చేసిన సవాలుపై తీవ్రంగా ప్రతిస్పందించారు.చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు చదివితే సరిపోదని, అమ్ముడుపోయినవారికి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించిగానీ, వైఎస్సార్సీపీ గురించిగానీ మాట్లాడే నైతిక హక్కు లేనేలేదన్నారు. తమకున్న 67 మంది ఎమ్మెల్యేల్లో 20 మంది టీడీపీలోకి పోయినంతమాత్రాన వైఎస్సార్సీపీ వన్నె ఏమాత్రం తగ్గలేదని, రోజురోజుకూ ఇంకా ప్రజాభిమానం చూరగొంటూ తిరుగులేనిశక్తిగా ఎదుగుతోందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయమన్నారు. ‘‘పార్టీ మూసేసుకుంటారా? అని మాట్లాడుతున్నవారికి ఏమాత్రం నైతిక విలువల్లేవు. వారు ఎవరి గుర్తుమీద, ఏ జెండాతో, ఎవరి ఫోటో పెట్టుకుని గెలిచారో... ఇపుడు ఏ పార్టీ జెండా కిందకు చేరి మాట్లాడుతున్నారో ఆత్మను ప్రశ్నించుకోవాలి’’ అని అన్నారు. -
మరిన్ని రాజీనామాలు ఆశించవచ్చు..
బెర్లిన్ : జర్మనీ కార్ల తయారీ దిగ్గజం ఫోక్స్ వాగన్ కంపెనీ బోర్డు నుంచి మరికొంత మంది రాజీనామా చేసే అవకాశం ఉందని బోర్డు సభ్యుడొకరు అభిప్రాయపడ్డారు. కాలుష్య కారకాలను గుర్తుపట్టకుండా ఉండేలా ఇంజిన్లను అమర్చి భారీ కుంభకోణానికి ఆ సంస్థ పాల్పడిన విషయం విదితమే. అమెరికాలో జరిపిన కాలుష్య పరీక్షలలో కొన్ని కొత్త విషయాలు బయటపడటంతో సంస్థ కుంభకోణం వెలుగుచూసింది. ఈ కుంభకోణానికి బాధ్యులెవరన్నది ఇంకా తేలలేదు. సంస్థపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బోర్డు సభ్యులు ఐదు మంది ఆయనపై ఒత్తిడి తీసుకురావడంతో ఫోక్స్ వాగన్ సీఈఓ మార్టిన్ వింటర్ కార్న్ బుధవారం రాజీనామా చేసిన విషయం విదితమే. జర్మనీకి చెందిన న్యాయవాదులు ఈ కంపెనీపై ఫిర్యాదుచేశారు. కుంభకోణానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. అమెరికాలోనే సుమారు 5లక్షల కార్లు విక్రయాలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా 1.1కోట్ల డీజిల్ కార్లలో కాలుష్యాన్ని గుర్తించని విధంగా ఉండే అమర్చి భారీ మోసాలకు ఆ కంపెనీ పాల్పడింది. జర్మనీ రవాణాశాఖ మంత్రి అలెగ్జాండర్ డోబ్రింట్ ఈ మోసాలపై విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. 1.1 కోట్ల కార్లలో 1.6 లీటర్లు, 2లీటర్ల ఇంజిన్ కార్లు యూరప్‌లో ఎన్ని ఉన్నాయో కచ్చితంగా తెలియదని, ఫోక్స్ వాగన్ సంస్థకు చెందిన ఏ మోడల్ కార్లలో ఇటువంటి పరికరాలు అమర్చారన్న వివరాలు ఇంకా తెలియరాలేదని మంత్రి వివరించారు. ఈ కుంభకోణం విలువ భారత కరెన్సీలో అక్షరాలా 42వేల కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. -
రాజీనామాలు అస్సల్లేవ్
న్యూఢిల్లీ: లలిత్ గేట్ వ్యవహారం, వ్యాపం కుంభకోణానికి సంబంధించి ఎవరి రాజీనామాలు ఉండబోవని మరోసారి కేంద్ర ప్రభుత్వం విపక్షాలకు స్పష్టం చేసింది. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ కూడా ఆధార రహితమైనవి అయినందున కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్గానీ, బీజేపీ ముఖ్యమంత్రులుగానీ రాజీనామాలు చేయబోరని పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పష్టం చేశారు. ప్రతి పక్షాలు చేస్తున్న దుష్ప్రచారానికి సరైన సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, వివరణ ఇచ్చి వారి ఆరోపణలు తప్పని రుజువుచేయాలని నిర్ణయించామని తెలిపారు. బీజేపీ పార్లమెంటరీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేవలం సభా వ్యవహారాలను భంగపరిచే ఆలోచన తప్ప ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ఒక అంశంపై చర్చించాలన్న ఆలోచన, ఉద్దేశం లేదని ఆయన ఆరోపించారు. అందుకే తాము ఎంత చెబుతున్నా వినకుండా అనవసర రాద్ధాంతం సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు భయపడాల్సిన అవసరం లేదని, మనం చేస్తున్న మంచిపనులు చూసి గర్వపడండంటూ మోదీ తమకు మరోసారి సమావేశంలో గుర్తు చేశారని తెలిపారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కూడా విపక్షాలను విమర్శించారు. చర్చకు తాము సిద్ధమని చెప్తున్నా కావాలనే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని ఆరోపించారు. -
తొమ్మిదో వికెట్ కూడా పడింది!!
నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. వరుసగా తొమ్మిదో వికెట్ పడింది. అవును.. మరో గవర్నర్ రాజీనామా చేశారు. మణిపూర్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న వీకే దుగ్గల్ తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపారు. యూపీఏ హయాంలో ఉన్న గవర్నర్లంతా ఒకరి తర్వాత ఒకరుగా రాజీనామాలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడటంతో.. ఇప్పటికి ఎనిమిది మంది గవర్నర్లు తమ పదవుల నుంచి స్వచ్ఛందంగానో, బలవంతంగానో తప్పుకోవాల్సి వచ్చింది. యూపీఏ గవర్నర్లు రాజీనామా చేయాలన్న సంకేతాలు వెలువడగానే ముందుగా బీఎల్ జోషి, శేఖర్ దత్, అశ్వనీకుమార్ రాజీనామాలు చేశారు. ఆ తర్వాత బీవీ వాంఛూ, ఎంకే నారాయణన్ అగస్టా వెస్ట్‌లాండ్ వ్యవహారంలో సీబీఐ ప్రశ్నించడంతో కలత చెంది పదవుల నుంచి తప్పుకొన్నారు. ఆ తర్వాత తనను నాగాలాండ్‌కు బదిలీ చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ బి.పురుషోత్తమన్ తప్పుకొన్నారు. ఇలా వరుసపెట్టి రాజీనామాల పర్వం కొనసాగింది. చిట్టచివరగా రెండు రోజుల క్రితం కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ సైతం రాజీనామా చేశారు. ఇప్పుడు దుగ్గల్ వంతు వచ్చింది. -
మోడీ వచ్చాక ఆరో వికెట్!!
నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కారణాలు ఏవైనా ఇప్పటికి వరుసపెట్టి ఆరుగురు గవర్నర్లు రాజీనామా చేశారు. మరికొందరు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. తాజాగా.. తనను నాగాలాండ్ గవర్నర్‌గా బదిలీ చేసినందుకు తీవ్రంగా అసంతృప్తి చెందిన మిజొరాం గవర్నర్ పురుషోత్తమన్ తన పదవికి రాజీనామా చేసిపారేశారు. ఈయనతో కలిపి రాజీనామా చేసిన గవర్నర్ల సంఖ్య ఆరుకు చేరుకుంది. వీళ్లంతా యూపీఏ హయాంలో నియమితులైనవాళ్లే. తనను ఏమాత్రం సంప్రదించకుండానే, తన అభిప్రాయం తెలుసుకోకుండానే తనను బదిలీ చేశారన్నది పురుషోత్తమన్ ఆక్రోశం. కేరళలలో ఒకప్పుడు మంత్రిగా పనిచేసిన ఈ 86 ఏళ్ల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు 2011లో గవర్నర్ అయ్యారు. వాస్తవానికి మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి నుంచి చాలామంది గవర్నర్లకు ఇక చాలు.. దిగిపొండి అంటూ ఫోన్లు వెళ్లాయి. పదవీకాలం చివరకు వచ్చేసినవాళ్లను మాత్రం ఉండమన్నారు. ఈ జాబితాలో గుజరాత్ గవర్నర్ కమలా బేణీవాల్ ఒకరు. మోడీ సీఎంగా ఉన్న సమయంలో ఆయనకు, గవర్నర్‌కు చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఆమెకు పదవీకాలం కేవలం నాలుగు నెలలే ఉన్నా, ఆమెను మిజొరాం గవర్నర్‌గా బదిలీ చేశారు. ఇక కేరళ గవర్నర్‌గా ఉన్న షీలా దీక్షిత్.. రాజీనామా చేసేందుకు నిరాకరించారు. ప్రధాన మంత్రిని, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన తర్వాత.. వాళ్లెవరూ తనను రాజీనామా చేయాలని కోరలేదని షీలా అన్నారు. ఇక గోవా, పశ్చిమబెంగాల్ గవర్నర్లు వాంఛూ, ఎంకే నారాయణన్ మాత్రం అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణంలో సీబీఐ ప్రశ్నించడంతో వాళ్లిద్దరూ టపటపా రాజీనామాలు చేసి పారేశారు. కానీ ఇదే కేసులో సీబీఐ ప్రశ్నించిన మరో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మాత్రం ఇంకా రాజీనామా నిర్ణయం ఏమీ తీసుకోలేదు. ఆయన ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఇక, వీళ్లందరికంటే ముందు ఉత్తరప్రదేశ్ గవర్నర్ బీఎల్ జోషి, ఛత్తీస్‌గఢ్ గవర్నర్ శేఖర్ దత్, నాగాలాండ్ గవర్నర్ అశ్వనీకుమార్ రాజీనామాలు చేశారు. కర్ణాటక గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్, త్రిపుర గవర్నర్ దేవానంద్ కొన్వర్ మాత్రం వాళ్ల పదవీకాలం ముగిసేవరకు ఉన్నారు. -
రాజీనామా చేయను
స్పష్టంచేసిన గవర్నర్ సాక్షి, ముంబై: తన పదవికి రాజీనామా చేసేందుకు మహారాష్ట్ర గవర్నర్ కె. శంకర్నారాయణన్ నిరాకరించారు. పదవికి రాజీనామ చేయాలంటూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి నుంచి ఫోన్ వచ్చిందని, రాష్ట్రపతి కోరేదాకా తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆయన బుధవారం స్పష్టం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యూపీఏ హయాంలో నియమితులైన ఏడుగురు గవర్నర్లను రాజీనామ చేయించాలని కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హోంశాఖ కార్యదర్శి ద్వారా నేరుగా గవర్నర్లకు రాజీనామ చేయాలంటూ పంపుతున్నారు. వీటిపై స్పందించిన ఉత్తరప్రదేశ్ గవర్నర్ బి.ఎల్.జోషి వెంటనే రాజీనామ చేసిన విషయం తెలిసిందే. మిగిలినవారిలో కొందరు రాజీనామ బాటలో ఉండగా మరికొందరు గవర్నర్లు తమ పదవులకు రాజీనామ చేయడానికి సిద్ధంగా లేమని ప్రకటించారు. దీంతో మోడీ ప్రభుత్వం, గవర్నర్ల మధ్య వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలాఉండగా తాను రాజీనామ చేయాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి నుంచి ఫోన్ వచ్చిన విషయాన్ని శంకర్నారాయణన్ ధ్రువీకరించారు. గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైనదని, ఆ అధికారమున్న వ్యక్తి(రాష్ట్రపతి) చెబితే తప్ప తాను రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. తన పదవి కాలం 2017 మే ఏడో తేదీ వరకు ఉందని, అంతవరకు కొనసాగుతానన్నారు. పంజాబ్ గవర్నర్ శివ్‌రాజ్ పాటిల్, కేరళ గవర్నర్ షీలాదీక్షిత్ కూడా శంకర్నారాయణన్ బాటలోనేనడుస్తున్నారు. వారు కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా లేరు. అయితే రాజీనామ చేయాలని డిమాండ్ చేస్తూ తమకు ఇంతవరకు ఫోన్ ఎవరి నుంచి రాలేదని వారు చెబుతున్నారు. -
రాజస్థాన్‌లో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల రాజీనామా
రాజస్థాన్ అసెంబ్లీ నుంచి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వారు ముగ్గురూ ఎంపీలుగా ఎన్నికవడంతో వారు తమ ఎమ్మెల్యే పదవులను వదులుకున్నారు. ఓం బిర్లా, బహదూర్ కోలి, సంతోష్ అహ్లావత్ అనే ఈ ముగ్గురూ వరుసగా కోట, భరత్పూర్, ఝున్ఝును లోక్‌సభ స్థానాల నుంచి విజయం సాధించారు. దీంతో ఆ ముగ్గురూ తమ రాజీనామా పత్రాలను రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ కైలాష్ మేఘ్వాల్కు సమర్పించారు. వీళ్లలో బిర్లా గతంలో కోటా దక్షిణ అసెంబ్లీ స్థానానికి, కోలీ వైర్ స్థానానికి, అహ్లావత్ సూరజ్‌గఢ్ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. మరో బీజేపీ ఎమ్మెల్యే సన్వర్‌లాల్ జాట్ కూడా అజ్మీర్ స్థానం నుంచి బీజేపీ తరఫున ఎంపీగా గెలిచారు. ఆయన ఇంకా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. -
పొత్తుల చిచ్చు: బిజెపికి రాజీనామాలు
ఆదిలాబాద్: టిడిపితో పొత్తు బిజెపికి అన్నివిధాల నష్టం చేకూరుస్తోంది. ఈ పొత్తు ఆ పార్టీలో చిచ్చుపెట్టింది. తెలంగాణలో నేతలు గానీ, కార్యకర్తలు గానీ మొదటి నుంచి టిడిపితో పొత్తు వద్దని చెబుతూనే ఉన్నారు. అధిష్టానం వారి మాటలను పెడచెవిన పెట్టి పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు తెలంగాణలో బిజెపి నేతల రాజీనామాల పర్వం మొదలైంది. అక్కడ సీమాంధ్రలో పొత్తుకు విఘాతం ఏర్పడింది. తెగతెంపులు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. టిడిపితో పొత్తు ఇష్టంలేని ఆదిలాబాద్ జిల్లా బీజేపీ నేతలు ఒకరి వెంట ఒకరు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి దుర్గం రాజేశ్వర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నివేదితవజే, గిరిజన మోర్చ రాష్ట్ర కార్యదర్శి సీడాం రామ్‌కిషన్, గిరిజన మోర్చ జిల్లా అధ్యక్షుడు గెడాం మనోహర్, యువజన మోర్చా జిల్లా కార్యదర్శి ఉదయ్‌కుమార్, మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు ఉమ రాజీనామాలు చేశారు. -
సొంతపార్టీ ఎంపీలపై పనబాక లక్ష్మి ధ్వజం
ఒంగోలు : కేంద్రమంత్రి పనబాక లక్ష్మి సొంత పార్టీ ఎంపీలపైనే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి రాజీనామాలు చేసేవారే అసలు దొంగలు అని ఆమె విమర్శించారు. స్వలాభం కోసం పార్టీలో కొనసాగుతున్న నేతలు బయటకు వెళితేనే పార్టీ బాగుపడుతుందని పనబాక లక్ష్మి వ్యాఖ్యానించారు. శనివారం ఆమె ప్రకాశం జిల్లా కలెక్టరేట్లో విజిలెన్స్ మానిటరింగ్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ పనబాక లక్ష్మి ఎదుట సమైక్య నినాదాలు చేసి తమ నిరసన తెలిపారు. -
రాజీనామాలపై వెనక్కి తగ్గిన సీమాంధ్ర మంత్రులు
-
రాజీనామాలపై వెనక్కి తగ్గిన సీమాంధ్ర కేంద్రమంత్రులు
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించనందుకు నిరసనగా రాజీనామాలు అంటూ హడావుడి చేసిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాలపై వెనక్కి తగ్గారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామాలపై కొత్త నాటకానికి తెర తీశారు. ప్రధానమంత్రిని కలిసి గతంలో ఇచ్చిన రాజీనామాలు ఆమోదించాలని మాత్రం కోరాలని నలుగురు కేంద్రమంత్రులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. మిగిలిన కేంద్ర మంత్రులు మాత్రం రాజీనామాలపై నోరు మెదపటం లేదు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు చర్చకు వచ్చేవరకూ రాజీనామాలు అవసరం లేదని సీమాంధ్ర ఎంపీలు కొత్త పల్లవి అందుకున్నారు. కాగా కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో నిన్న సమావేశమైన మంత్రులు పళ్లంరాజు, చిరంజీవి, పురందేశ్వరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన గురించి చర్చించుకున్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అధినాయకత్వం నిరాకరించటం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. ఈ నలుగురు మంత్రులు గతంలో తమ రాజీనామా లేఖలను ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అందజేయటం తెలిసిందే. మన్మోహన్ సింగ్ ఈ మంత్రుల రాజీనామాలను ఇంతవరకు తిరస్కరించలేదు. అవి ఇప్పటికీ ఆయన వద్దే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించనందుకు నిరసనగా తమ రాజీనామాలను మన్మోహన్‌కు అందజేయటం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి నేరుగా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసి రాజీనామా పత్రాలను ఆందజేసి ఆమోదింపజేసుకోవాలని సీమాంధ్ర మంత్రులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
రాజీనామాల ఆమోదం కోసం ఢిల్లీ కోర్టులో జగన్ పిటిషన్
-
రాజీనామాల ఆమోదం కోసం ఢిల్లీ కోర్టులో జగన్ పిటిషన్
హైదరాబాద్: లోక్‌సభ స్పీకర్ తమ రాజీనామాలు తిరస్కరించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి, ఆ పార్టీకే చెందిన మరో ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారితోపాటు నంద్యాల ఎంపి ఎస్పివై రెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఎస్పివై రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వీరు ముగ్గురూ రాష్ట్ర విభజనకు నిరసన తెలుపుతూ లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన 13 మంది ఎంపీలు తమ లోక్‌సభ సభ్యత్వాలకు సమర్పించిన రాజీనామాలను స్పీకర్ మీరాకుమార్ గత శుక్రవారం తిరస్కరించారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ సీపీలకు చెందిన లోక్‌సభ సభ్యుల రాజీనామాలు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వచ్ఛందంగా చేసినవి కావని స్పీకర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో ఏర్పడిన తీవ్రమైన భావోద్వేగాల నడుమ తీసుకున్న రాజీనామా నిర్ణయాలను ఆమోదించటం సాధ్య కాదన్న అభిప్రాయంతో స్పీకర్ ఉన్నట్లు లోక్‌సభ సచివాలయ వర్గాలు వెల్లడించాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 101(3), లోక్‌సభ నియమావళిలోని 204 నిబంధనను అనుసరించి స్పీకర్ ఆయా ఎంపీల రాజీనామాలను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. కాంగ్రెస్‌కు చెందిన ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, ఎ.సాయిప్రతాప్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కనుమూరి బాపిరాజు, జి.వి.హర్షకుమార్, రాయపాటి సాంబశివరావు, సబ్బం హరి, ఎస్.పి.వై.రెడ్డి, టీడీపీ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజీనామాలను తిరస్కరించారు. ఈ 13 మందిలో జగన్, మేకపాటి, ఎస్పివై రెడ్డి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాము రాజీనామ చేసినట్లు వారు చెప్పారు. తమ రాజీనామాలు ఆమోదించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని వైఎస్ఆర్ సిపి నేతలు ముందే చెప్పారు. ఆ విధంగా వారు ఈరోజు ఢిల్లీ హైకోర్టులో రిట్‌పిటిషన్ దాఖలు చేశారు. -
13 మంది ఎంపీల రాజీనామాల తిరస్కరణ
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 13 మంది ఎంపీలు చేసిన రాజీనామాలను స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన సీమాంధ్ర ప్రాంత ఎంపీలు రాజీనామా లేఖలను సమర్పించిన విషయం తెలిసిందే. తామంతా స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామాలు సమర్పించినట్లు వీరు గతంలోనే ప్రకటించారు. వీరిలో కొంతమంది స్వయంగా స్పీకర్ వద్దకు వెళ్లి ఆమెకు తమ రాజీనామాకు గల కారణాలేంటో వెల్లడించారు. స్పీకర్ వద్దకు వెళ్లిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మేకపాటి రాజమోహన రెడ్డి కూడా ఉన్నారు. అయినా.. ఇప్పుడు స్పీకర్ మీరాకుమార్ మాత్రం అందరి రాజీనామాలను మూకుమ్మడిగా తిరస్కరించారు. రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించడంతో గత ఆగస్టు 2వ తేదీ తర్వాత రాష్ట్రానికి చెందిన ఎంపీలు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ), ఉండవల్లి అరుణకుమార్, లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, ఎ.సాయి ప్రతాప్, జి.వి.హర్షకుమార్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాయపాటి సాంబశివరావు, కనుమూరి బాపిరాజు, సబ్బం హరి, ఎస్.పి.వై.రెడ్డి (ఇటీవల వైఎస్సార్సీపీలో చేరారు), కొనకళ్ల నారాయణరావు (టీడీపీ), రాజీనామాలు సమర్పించారు. వీరిలో ఏడుగురు - ఉండవల్లి, లగడపాటి, అనంత, సాయిప్రతాప్, సబ్బం హరి, రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి మాత్రమే విడివిడిగా స్పీకర్‌ను స్వయంగా కలిశారు. స్పీకర్ విచారణలో వీరిలో కొంతమంది రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రజానీకంలో పెల్లుబుకిన ఆగ్రహావేశాల కారణంగా తాము నియోజకవర్గాలకు కూడా వెళ్లలేకపోతున్నామని, రాజీనామా చేయాల్సిందిగా తమపై ప్రజల నుండి తీవ్రమైన ఒత్తిడి వస్తున్నదని అంగీకరించిన ట్లు తెలిసింది. వైఎస్సార్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పీకర్‌ని కలిసినప్పుడు తన రాజీనామాను, తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి రాజీనామాను వెంటనే ఆమోదించాల్సిందిగా స్పీకర్‌ను కోరారు. షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నందున జగన్మోహన్రెడ్డి స్వయంగా రాలేకపోయారని, ఆయన తరఫున తాను ఆయన రాజీనామాను కూడా ఆమోదించాల్సిందిగా కోరుతున్నానని స్పష్టంచేశారు. -
రాజీనామాల్ని ఆమోదించాలని ప్రధానికి సీమాంధ్ర కేంద్ర మంత్రుల విన్నపం
-
రాజీనామాల్ని ఆమోదించాలని ప్రధానికి నలుగురు కేంద్ర మంత్రుల విన్నపం
తమ రాజీనామాల్ని ఆమోదించాల్సిందిగా సీమాంధ్ర కేంద్ర మంత్రులు ప్రధాని మన్మోహన్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. తాము మంత్రులుగా కొనసాగలేమని, మంగళవారం నుంచి విధులకు హాజరుకాబోమని చెప్పారు. సోమవారం సాయంత్రం కేంద్ర మంత్రులు చిరంజీవి, పళ్లంరాజు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, దగ్గుబాటి పురంధేశ్వరి ప్రధానితో సమావేశమయ్యారు. అనంతరం చిరంజీవి, పురంధేశ్వరి విలేకరులతో మాట్లాడారు. పార్టీకి, ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదని పురంధేశ్వరి తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో పదవులకు రాజీనామాలు చేసినట్టు వివరించారు. ఈ విషయంపై పునరాలోచించాల్సిందిగా ప్రధాని సూచించినట్టు చిరంజీవి చెప్పారు. సమస్యలపై కేంద్ర మంత్రుల బృందంతో మాట్లాడాల్సిందిగా చెప్పారని వెల్లడించారు. సీమాంధ్ర ప్రాంతంలో నెలకొన్న ఉద్రికత్త పరిస్థితుల గురించి ప్రధానికి వివరించినట్టు చిరంజీవి తెలిపారు. -
మా రాజీనామాలు ఆమోదించండి: వైఎస్సాఆర్ సీపీ ఎంపీలు
-
రాజీనామాల ఆమోదం స్పీకర్ నైతిక బాధ్యత
రాజీనామాలపై స్పీకర్ ఈరోజే నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నలుగురు కాంగ్రెస్ ఎంపీలు చెప్పారు. రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్, రాజంపేట ఎంపీ సాయిప్రతాప్, అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి శనివారం మధ్యాహ్నం స్పీకర్ మీరాకుమార్ను విడివిడిగా ఆమె ఛాంబర్లో కలిసి, తమ రాజీనామాలు ఆమోదించాలని కోరారు. ప్రజల కోరిక మేరకే తాము రాజీనామాలు చేస్తున్నామని, సీమాంధ్రుల మనోభావాలు అధిష్ఠానం దృష్టికి తెచ్చామని చెప్పారు. రాజీనామాలు చేస్తే విభజన ప్రక్రియ ఆగుతుందని ప్రజలు చెప్పబట్టే వాటి ఆమోదానికి వచ్చామని ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు. తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాలని అందరూ వ్యక్తిగతంగా చెప్పామని, వాటిని ఆమోదించడం స్పీకర్ నైతిక బాధ్యత అని ఆయన అన్నారు. సాధారణంగా స్పీకర్ శని, ఆదివారాల్లో పార్లమెంటుకు రారని, కానీ తమ ఒత్తిడి మేరకు ఆమె వచ్చి.. తమ నలుగురితో మాట్లాడారని సాయిప్రతాప్ చెప్పారు. తాము ఎంతమంది, ఎవరెవరు వచ్చామో కూడా టిక్ పెట్టుకున్నారని, గతంలోనే చేసిన రాజీనామాలు ఆమోదించాలని మరోతూరి కోరామని ఆయన అన్నారు. ప్రజలు ఉద్యమిస్తున్నారని, వారికి అండగా ఉండాల్సిన బాధ్యత తమపై ఉందని, మా కర్తవ్యాన్ని స్పీకర్ ముందు చెప్పామని అన్నారు. ఇదే సందర్భంగా లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ, ''స్పీకర్‌ను వ్యక్తిగతంగా చాంబర్లో కలిశాం. ఆగస్టు 2న రాజీనామాలు చేశాం. గతంలోనూ ఓసారి చెప్పాం. ఇప్పటికి 57 రోజులైపోయింది, అయినా సమాధానం లేదు. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయొద్దని కోరాం. రాతపూర్వకంగా మరోసారి ఇచ్చాం. సాయంత్రంలోగా ఆమోదిస్తారని ఆశిస్తున్నాం. భవిష్యత్ కార్యాచరణ ఏంటో చెబుతాం'' అని అన్నారు. ఎంపీలు రాజీనామా చేయండి, ఎమ్మెల్యేలు రాజీనామా చేయొద్దని ఉద్యమిస్తున్న ప్రజలు చెప్పడంతో తాము ఆలోచించుకుని.. ఆమోదానికి పట్టుబట్టామని ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. సాయంత్రానికి లెక్కలన్నీ తేలిపోతాయని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం యథార్థ పరిస్థితిని చెప్పారని, ఈ రాష్ట్రాన్ని విడదీయాలనే ప్రయత్నంలో ఎన్ని చిక్కుముడులున్నాయో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన విశ్లేషించారని అన్నారు. తెలంగాణ ప్రజలు విడిపోతామంటే, సీమాంధ్రులు పట్టుకుని వదలట్లేదన్న అపోహ సరికాదని, రాజధాని అక్కడే ఉంది. విడదీయలేనంత బలమైన లింకులున్నాయని, అందుకే సమైక్యంగా ఉండాలంటున్నామని ఆయన చెప్పారు. -
సమైక్యానికి అండగా నిలవండి : అశోక్‌బాబు
రాయచోటి, న్యూస్‌లైన్ : తెలంగాణపై కేంద్రం నోట్ సిద్ధం చేస్తోంది.. ఎంపీలు, కేంద్రమంత్రులు రాజీనామాలు చేసి దానిని అడ్డుకోవాలని, ఒకవేళ అది అసెంబ్లీ ఆమోదానికి వస్తే తిప్పికొట్టేందుకు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండాలని ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు కోరారు. రాజకీయ స్వార్థంతోనే విభజన అంశంపై తెరపైకి వచ్చిందని, తెలంగాణలో 60శాతం మంది రాష్ర్టం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారన్నారు. వైఎస్సార్ జిల్లా రాయచోటిలో గురువారం జరిగిన ‘రాయచోటి రణభేరి’లో ఆయన మాట్లాడుతూ సమైక్య ఉద్యమం ప్రారంభమయ్యేనాటికి, నేటికీ పరిస్థితులు మారిపోయాయని, ఇప్పుడు ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌తోపాటు, అన్ని పార్టీల నేతలు విభజనను వ్యతిరేకిస్తున్నారన్నారు. అయితే, ఆ విషయాన్ని బాహాటంగా ప్రకటిస్తే పార్టీలకు ఇబ్బందనే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. మేం చెప్పినప్పుడు ఎంపీలు రాజీనామాలు చేసిఉంటే యూపీఏ సర్కార్ కూలిపోయేదని, కానీ ఆ పనిచేయలేదని మండిపడ్డారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందకుండా ఉండాలంటే ఎమ్మెల్యేలు పదవుల్లో ఉండాలని, అందుకే అన్ని పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామాలు వెనక్కి తీసుకోవాలన్నారు. విప్ ధిక్కరించైనా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామని ప్రమాణం చేయాలన్నారు. అందరూ తలుచుకుంటే ఏమవుతోందో ఆలోచించండని సూచించారు. మాకు పదవులు అక్కర్లేదు, కేవలం సమైక్యాంధ్ర కోసమే పోరాడుతున్నాం, 2014 ఎన్నికల్లోగా రాజకీయ బలంగా మారుతామని స్పష్టంచేశారు. ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ ఇప్పటికే 5వేల కోట్ల రూపాయల నష్టంలో ఉందని, రాష్ట్రం విడిపోతే సంస్థ మనుగడే ప్రశ్నార్థకమవుతుందన్నారు. విభజనతో ఆర్టీసీకే ఇన్ని కష్టాలు ఉంటే మిగిలిన సంస్థలకు ఎన్ని సమస్యలుంటాయో ఆలోచించాలని సూచించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. సీమ, దక్షిణ తెలంగాణ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీటి కష్టాలు తీవ్రమవుతాయన్నారు. మిగులు జలాలపై ఆధారపడి నిర్మించిన హంద్రీనీవా, గాలేరు-నగరి, నెట్టెంపాడు, కల్వకుర్తి, వెలిగొండతోపాటు సోమశిల, తెలుగుగంగకు చుక్కనీరు రాదని చెప్పారు సమైక్యంగా ఉంటేనే సాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఢిల్లీలో కొంతమంది భజనపరులు సమైక్య ఉద్యమాన్ని కించపరుస్తున్నారని, వారి నాలుకలు చీల్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఏజేసీ సుదర్శన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో హైదరాబాద్ కీలకమైందని, దీంతో పాటు ఎన్నో చిక్కుముడులు ఉన్నాయని, వాటి పరిష్కారం అంత సులభం కాదని ఏపీ ఎన్జీవో రాష్ట్ర ప్రధానకార్యదర్శి చంద్రశేఖరరెడ్డి అన్నారు. కార్యక్రమంలో డీఆర్వో ఈశ్వరయ్య, జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2014 ఎన్నికల్లోగా రాజకీయ నిర్ణయం సాక్షి ప్రతినిధి, కడప : 2014 ఎన్నికల్లోగా తాము రాజకీయ నిర్ణయం తీసుకుంటామని, అప్పటివరకు సమైక్యరాష్ట్రం కోసం పోరాడేవారికే తమ మద్దతు తెలుపుతామని ఏపీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. రాజకీయపార్టీల పట్ల స్పష్టమైన వైఖరిని వెల్లడించేందుకు ఈనెల 30న సమావేశం ఏర్పాటుచేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. కడపలోని ప్రభుత్వ అతిథి గృహంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీబ్ల్యూసీ నిర్ణయం వెలువడగానే కేంద్రమంత్రులు, ఎంపీలు రాజీనామాలు చేసి ఉంటే కేంద్రం దిగి వచ్చేదన్నారు. రాజకీయ స్వార్థంతోనే విభజన అంశం తెరపైకి వచ్చిందని, పదిమంది పార్లమెంటు సభ్యుల గొడవ కారణంగా సీడబ్ల్యుసీ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. హైదరాబాద్ ప్రధాన ఎజెండాగా మాత్రమే సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ఉద్యమిస్తుంటే ఏపీఎన్జీవోలు సమైక్యాంధ్ర ఏకైక లక్ష్యంగా రాష్ట్రవ్యాప్త ఉద్యమం నిర్వహిస్తున్నారని పార్టీల నిర్ణయం ఒకటైతే, సీమాంధ్రలో వ్యక్తుల నిర్ణయం మరోలా ఉందని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు కేంద్రానికి లేఖరాయాలని, దానిపై అన్ని పార్టీల అధ్యక్షులతో సంతకాలు చేయించాలని, తాను తొలి సంతకం చేస్తానని చెప్పిన వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనపై అడిగిన ప్రశ్నకు అశోక్‌బాబు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. వచ్చే ఎన్నికల్లోగా రాష్ట్ర విభజన అసాధ్యమన్నారు. ఉద్యమకారులపై టీడీపీ దాడి సినీనటుడు మురళీమోహన్ సమక్షంలోనే దాష్టీకం ద్వారకా తిరుమల, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సమైక్యవాదులపై టీడీపీ నాయకులు దాడి చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడులో గురువారం సినీనటుడు, టీడీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి మాగంటి మురళీమోహన్ సమక్షంలోనే ఇదంతా జరిగింది. సమైక్య ఉద్యమంలో భాగంగా మల్లేశ్వరం వద్ద రహదారిపై వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. సంఘీభావంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పల్లెపల్లెకు సమైక్యాంధ్ర పేరిట యూత్ర చేపట్టిన మురళీమోహన్ అటుగా వచారు. యూత్రకు దారి ఇవ్వాలని టీడీపీ నేతలు కోరారు. సమైక్యాంధ్ర విషయంలో టీడీపీ విధానాన్ని స్పష్టం చేయకుండా యాత్రలు నిర్వహించడం ఏమిటని నిలదీశారు. దీంతో టీడీపీ నేతలు వారిని గెంటివేశారు. దీనిని వైఎస్సార్ సీపీ నాయకులు అడ్డు కోవడంతో వారిపైనా దాడికి తెగబడడంతో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బుసనబోయిన సత్యనారాయణ, అక్కాబత్తుల కుటుంబరావు తదితరులకు తీవ్ర గాయాలయ్యాయి. -
ఇటు రాజీనామాలు.. అటు 'రాజీ' డ్రామాలు!!
ఇరుప్రాంతాలకు సమన్యాయం చేయాలని, అలా చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు, పార్టీ అధ్యక్షుడు జగన్, ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి అందరూ రాజీనామాలు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ఏకైక డిమాండుతో సీమాంధ్ర ప్రాంతంలో 57 రోజులుగా ఉధృతంగా సమ్మె సాగుతోంది. ఇంత జరుగుతున్నా.. అటు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు గానీ, ఇటు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులకు గానీ చీమ కుట్టినట్లు కూడా లేదు. వాళ్లు రాజీనామాల ఊసెత్తితే ఒట్టు!! విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వైద్యులు.. ఇలా అన్ని వర్గాలకు చెందినవారు ఉవ్వెత్తున ఉద్యమిస్తున్నారు. రెండు నెలల నుంచి జీతాలను సైతం వదులుకుని, జీవితాలను పణంగా పెట్టి రోడ్లమీదే ఉంటున్నారు. ఆర్టీసీ బస్సులు రెండు నెలల నుంచి కదలట్లేదు. రవాణా వ్యవస్థ దాదాపుగా స్తంభించింది. ఇంత జరుగుతున్నా.. నాయకుల్లో మాత్రం చలనం లేదు. జాతీయస్థాయిలో పదవులు అనుభవిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరు పట్ల సీమాంధ్ర ప్రాంతంలో ఏహ్యభావం కలుగుతోంది. వారి దిష్టిబొమ్మలను రకరకాల రూపాల్లో తయారుచేస్తూ, ఎంతగా విమర్శలు కురిపిస్తున్నా నాయకులలో స్పందన కనిపించడంలేదు. తాము రాజీనామాలు సమర్పించేశామని, అయితే వాటిని ఆమోదించేందుకు స్పీకర్ మీరాకుమార్ అందుబాటులో లేరని ఒకసారి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వద్దని చెప్పడం వల్లే రాజీనామాలు చేయడంలేదని మరోసారి.. ఇలా నోటికి వచ్చిన అబద్ధాలన్నీ చెబుతూ అధిష్ఠానంతో 'రాజీ' పడిపోయి డ్రామాలు ఆడుతున్నారు. సమైక్యాంధ్రకు బహిరంగంగా మద్దతు పలికే పార్టీలను మాత్రమే తాము ఉద్యమంలోకి సాదరంగా ఆహ్వానిస్తామని, ఒకవైపు సమైక్యం అన్న మాట చెబుతూ మరోవైపు అధిష్ఠానం మాటలకు గంగిరెద్దుల్లా తలాడించేవారిని తరిమి తరిమి కొడతామని ఉద్యోగులు, సమైక్యంధ్ర ఉద్యమకారులు స్పష్టం చేస్తున్నారు. ఇంకెంత కాలం ఈ నాయకులు 'రాజీ'డ్రామాలు ఆడుతారంటూ మండిపడుతున్నారు. ఇప్పటికైనా నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని స్పష్టం చేస్తున్నారు. -
మీరు రాజీనామాలు చేయండి.. మేం విరమిస్తాం!
సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా సీమాంధ్ర ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేస్తే సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నామని ఏపీ ఎన్జీవోలు స్పష్టం చేశారు. అదేసమయంలో రాజకీయ భవిష్యత్ ఉండాలంటే తమ పదవులకు రాజీనామాలు చేసి సమైక్య ఉద్యమంలో చేరాలని సీమాంధ్ర ఎంపీలకు సూచించారు. సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డిలు స్థానిక ఏపీ ఎన్జీవో కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘రాజీనామాలు చేస్తే చేసుకోండి’ అన్న రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ మాటకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందకుండా ఉండేందుకు యూపీఏ సర్కారు, లోక్‌సభ స్పీకర్‌ను అందుబాటులో లేకుండా చేసిందని విమర్శించారు. రాజీనామాలకు యూపీఏ భయపడుతోందని విమర్శించారు. ‘సీమాంధ్ర ఎంపీలు ఇప్పుడు ఢిల్లీలో దాక్కోవచ్చు. 2014 ఎన్నికల్లో ప్రజల ముందుకు రాకతప్పదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి’ అని హెచ్చరించారు. ఉద్యమం నుంచి తప్పించుకుంటున్న నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ నెల 30 తర్వాత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణ వాళ్లే హైదరాబాద్ విడిచిపెట్టాలన్న వాఖ్యలపై.. హైదరాబాద్ అందరిదీ అని చెప్పడమే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. సీమాంధ్రలో మంగళవారం జరిగిన బంద్ విజయవంతమైందన్నారు. -
రాజీనామాలపై సీమాంధ్ర ఎంపీల వెనకడుగు?
సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేస్తారా.. లేదా అన్నది పెద్ద బ్రహ్మ పదార్థంగా మారిపోయింది. వాస్తవానికి ఈరోజు (మంగళవారం) ఉదయమే స్పీకర్ మీరాకుమార్ను ఏడుగురు ఎంపీలు కలవాల్సి ఉంది. ఆమె వారికి ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్, రాజంపేట ఎంపీ సాయిప్రతాప్, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. వీరంతా తమ రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్‌కు గతంలోనే లేఖలు రాశారు. అయితే.. వారిలో కొంతమంది మళ్లీ వెనకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. మెజారిటీ ఎంపీలు రాజీనామాలకు వ్యతిరేకంగానే ఉన్నారని, ఈరోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చర్చించిన తర్వాతే రాజీనామాలపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. రాజీనామాలు చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండబోదని, ఎంపీలుగా కొనసాగితేనే పార్లమెంట్లో తెలంగాణ బిల్లును వ్యతిరేకించవచ్చని ఆయన చెప్పారు. దీన్ని బట్టి చూస్తే.. మళ్లీ ఎంపీలు వెనకడుగు వేసినట్లే కనిపిస్తోంది. -
నేతల తీరు పై సమైక్యవాదుల ఆగ్రహం
-
అందరూ రాజీనామా చేయాలి: విజయమ్మ డిమాండ్
హైదరాబాద్: సమైక్య రాష్ట్రం కోసం రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశ ముగింపు సందర్భంగా ఆమె ప్రసంగించారు. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, కేంద్రరాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుతో సహా టీడీపీ ఎంపిలు, ఎమ్మెల్యేలంతా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేద్దామని పిలుపు ఇచ్చారు. ఓట్లు, సీట్ల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పోరాటాలు చేయదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీడీపీలే ఆ పని చేస్తాయన్నారు. సమైక్య ఉద్యమాన్ని కార్యకర్తలు, నేతలు, అభిమానులు బాగా చేశారన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత ఉద్దృతం చేద్దామని పిలుపు ఇచ్చారు. చంద్రబాబు తన లేఖను వెనక్కు తీసుకోవాలని గట్టిగా ఒత్తిడి తెద్దామని చెప్పారు. ప్రజలందరి బాగు కోసం వైఎస్ఆర్సీపీ ఎప్పటికీ పాటుపడుతుందన్నారు. మనమంతా కలిసి వైఎస్ఆర్ కలలుకన్న సువర్ణయుగం సాధిద్దామని చెప్పారు. వైఎస్ విజయమ్మ అధ్యక్షత వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేంద్ర పాలక మండలి సభ్యులు, జిల్లా, మండల నేతలు హాజరయ్యారు. -
ఇది మరో డ్రామానా?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించి 50 రోజులు గడిచిన తరువాత ఎట్టకేలకు సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపిలు రాజీనామాలు చేయడానికి సిద్ధపడ్డారు. మరో పక్క ఎంపి లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ పార్లమెంటులో తెలంగాణ బిల్లును వ్యతిరేకించడానికి రాజీనామాలు చేయకుండా ఉండాలని అంటున్నారు. వారి మాటలలో స్పష్టత లోపించినట్లు కనిపిస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు 2009 డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటించారు. దానికి కొనసాగింపుగా ఈ ఏడాది జులై 30న రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ రోజు నుంచి సీమాంధ్రలో సమైక్యాంధ్ర ప్రజా ఉద్యమం ఊపందుకుంది. అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసేశారు. ఉద్యమం మొదటి నుంచి ఇప్పటి వరకు ఏ రాజకీయ నేత అండలేకుండా ప్రజలే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ఆ తరువాత ఎన్జీఓలు, వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలు మొదలు పెట్టారు. దాంతో ఉద్యమం ఉధృతమైంది. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్, టిడిపి ఎంపిలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని సమైక్యవాదులు డిమాండ్ చేస్తున్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఎదోఒకటి చెబుతూ ఇప్పటి వరకు నెట్టుకొచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై కేంద్ర మంత్రి మండలి నోట్ సిద్ధమైనట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఈ రోజు ప్రకటించడంతో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపిలలో కలకలం మొదలైంది. వాస్తవానికి షిండే మొదటి నుంచి విభజన ప్రక్రియ ఆగదని చెబుతూనే ఉన్నారు. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో సమైక్యోద్యమం ఉధృతంగా సాగుతున్నప్పటికీ రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను మరో 20 రోజుల్లోగా కేంద్ర మంత్రివర్గ పరిశీలనకు సమర్పించబోతున్నట్లు ఈ నెల 3న ప్రకటించారు. నోట్ రూపకల్పనలో ఎలాంటి జాప్యం జరగదని కూడా చెప్పారు. ఆ ప్రకారంగా 20 రోజులు కూడా కాక ముందే నోట్ సిద్దమైనట్లు ప్రకటించారు. హైదరాబాద్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కూడా షిండే చెప్పారు. అయితే రేపు జరిగే మంత్రి మండలి సమావేశంలో ఈ అంశం చర్చకు రాదని చెప్పారు. నోట్‌ను పరిశీలించిన తరువాత న్యాయశాఖ పరిశీలనకు పంపుతామన్నారు. షిండే ప్రకటనతో సీమాంధ్ర ప్రజాప్రతినిధులలో కదలిక వచ్చింది. నోట్‌పై మంత్రి మండలి చర్చిస్తే పరిస్థితి విషమించుతుందన్న ఆందోళన వారిలో మొదలైంది. అందరితో చర్చలు జరిపి సమస్యను కేంద్రం పరిష్కరిస్తుందని భావించారు. కాని ఇప్పుడు అలాంటి అవకాశాలు కనిపించడం లేదు. సీమాంధ్ర ప్రజలలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తమ అభ్యంతరాలను, నిరసనలను అధిష్టానం బేఖాతరు చేయడంతో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపిలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. వారందరూ కలిసి ఈరోజు సమావేశమై ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం ఒక్క అడుగు ముందుకు వేసినా రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నారు. కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, దగ్గుబాటి పురంధేశ్వరి, జెడి శీలం, పల్లం రాజు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కిల్లి కృపారాణిలు ఒక అడుగు ముందుకు వేసి రాజీనామా లేఖపై సంతకాలు కూడా చేశారు. ఆ లేఖను పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ ద్వారా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించాడానికి సిద్ధపడ్డారు. ఈ నెల 24న లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్‌ను కూడా కలవాలని వారు నిర్ణయించుకున్నారు. ఆ తరువాత ఎంపి లగడపాటి మాట్లాడుతూ అంతిమ విజయం సమైక్యవాదానిదేనన్నారు. సమైక్యాంధ్ర మినహా హైదరాబాబ్ కేంద్ర పాలిత ప్రాంతం గానీ, మరే ఇతర ప్రత్యామ్నాయానికి తాము అంగీకరించం అని చెప్పారు. విభజన దిశగా ఒక్క అడుగు ముందుకేసినా తమ రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్ వద్ద మొండికేసుకొని కూర్చుంటామన్నారు. ఆంటోనీ కమిటీ నివేదిక ఇవ్వకుండా ముందుకు ఎలా వెళతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో 80 శాతం మంది సమైక్యవాదులేనన్నారు. శిలాశాసనానికి చోటులేదు-ప్రజా శాసనానికే చోటు అన్నారు. తమని గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటామని, పార్టీ అధిష్టానాన్ని వ్యతిరేకిస్తామని చెప్పారు. తెలంగాణ అంశంలో కేంద్రం ముందుకెళ్లదని భరోసా కల్పిస్తేనే రాజీనామా ప్రతిపాదన విరమించుకుంటామని చెప్పారు. షిండే కేబినెట్ నోట్ నిజమని తేలితే రాజీనామా చేస్తామని చెప్పారు. ఇన్ని మాటలు చెప్పిన లగడపాటి చివరగా పార్లమెంటులో బిల్లును అడ్డుకోవడానికి తాము ఉండి తీరాలన్నారు. లగడపాటి చూస్తే స్పష్టత లేకుండా మాట్లాడుతున్నారు. మంత్రులు తమ రాజీనామా పత్రాలు స్పీకర్ ఫార్మాట్లో ఇవ్వలేదు. దాంతో ఈ వ్యవహారం అంతా పలు అనుమానాలకు తావిస్తోంది. ఇవన్నీ ఉత్తుత్తి రాజీనామా ప్రకటనలుగా భావించవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనిని మరో డ్రామాగా పలువురు భావిస్తున్నారు. -
రాజీనామాలు చేయకండి: కిరణ్ కుమార్ రెడ్డి
సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలతో కిరణ్ సాక్షి, హైదరాబాద్: రాజీనామాలు చేయొద్దని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించారు. వారు రాజీనామా చేస్తే ఆ ప్రభావం రాష్ట్ర నేతలపై కూడా పడుతుందని, దానివల్ల కొత్త సమస్యలు తలెత్తుతాయని అన్నట్టు సమాచారం. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు శనివారం ఇక్కడి మంత్రుల క్వార్టర్లలో సమావేశమయ్యారు. అనంతరం కిరణ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజీనామాల అంశాన్ని ఎంపీలు ప్రస్తావించగా చేయొద్దని కిరణ్ చెప్పారు. రాజీనామాలపై ఇప్పటికిప్పుడే తాము ముందుకెళ్లడం లేదని, కేంద్రం రూపొందించే నోట్ చూశాక ఆలోచిస్తామని నేతలు చెప్పారు. విభజనతో రాయలసీమ ఎడారిగా మారుతుందని ఒక పక్క భయపడుతుంటే కొత్తగా జూరాల, శ్రీశైలం మధ్య కృష్ణా నదిపై మరో కొత్త ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేశారని వార్తలు వచ్చాయని అనంత అన్నట్టు తెలిసింది. ‘‘ఇది సరైన నిర్ణయం కాదు. 70 టీఎంసీల సామర్థ్యమున్న ఆ ప్రాజెక్టుతో శ్రీశైలానికి నీళ్లు తగ్గిపోతాయి. పోతిరెడ్డిపాడు ద్వారా శ్రీశైలం జలాలపై ఆధారపడి ఉన్న సీమ ఎడారవుతుంది’’ అని కిరణ్‌తో అన్నట్టు సమాచారం.మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమంలో ఏపీ ఎన్జీవోలకు సంఘీభావంగా తమ సంఘాలు కూడా పాల్గొననున్నాయని పరిశ్రమలు, యూనివర్సిటీల సిబ్బంది సంఘం తదితర ఉద్యోగ నేతలు శైలజానాథ్‌కు తెలిపారు. -
రాజీనామాల్లేవ్!
* రాజీనామా డిమాండ్ మీడియా సృష్టే.. సీమాంధ్ర కేంద్రమంత్రుల అసహనం * పదవుల నుంచి వైదొలగమని ప్రజలెవరూ అడగడం లేదు.. * ఎప్పుడు ఏం చేయాలనే తెలివితేటలు మాకున్నాయి * మా ఒత్తిడితోనే ఆంటోనీ కమిటీ వచ్చింది.. త్వరలో మంత్రుల కమిటీ వేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు * సమైక్యంగా ఉంచాలని సోనియా, రాహుల్‌గాంధీలను కోరతాం * హైకమాండ్ పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది * పరిణామాలను చూస్తే విభజన ప్రక్రియ ఆగినట్లే కనిపిస్తోంది * హైదరాబాద్‌లో సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీల భేటీ ‘‘సీమాంధ్ర మంత్రులు పదవుల నుంచి తప్పుకోవాలని, ఎంపీలు రాజీనామా చేయాలని ప్రజలు కోరుతున్నారని మీడియా కాకమ్మ కథలు అల్లుతోంది. ప్రజాభిప్రాయుంపై మీడియా స్పందించటం లేదు. ప్రజల పేరుతో, మీడియానే స్పందిస్తోంది.’’ - కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు ‘‘మేం రాజీనామా చేయాలని ఏ ప్రజలు అడిగారు? పేర్లు చెప్పండి? రాజీనామా ఎవరూ అడగటం లేదు. ఇదంతా మీడియా సృష్టి. చానళ్లు, పత్రికల మధ్యనున్న పోటీ, ఇతర కారణాలవల్లే ఇదంతా జరుగుతోంది.’’ - మరో కేంద్రమంత్రి జె.డి.శీలం ‘‘కావూరి సాంబశివరావు మాటపైనే మేమంతా నిలబడ్డాం. అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకుంటాం తప్ప మాకు పదవులు ముఖ్యం కాదు. ప్రజల ఆందోళన, ఆకాంక్షల ముందు మా పదవులు చాలా చిన్నవి. ఏదో ఒక కారణంతో పదవులను చంకలో పెట్టుకుని తిరిగే గాడిదలు ఎవరూ లేరిక్కడ.’’ - టీటీడీ చైర్మన్ బాపిరాజు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాజీనామాలకు సిద్ధపడ్డారంటూ జరిగిన ప్రచారమంతా వట్టిదేనని తేలింది. సీమాంధ్ర కేంద్రమంత్రులు శనివారం హైదరాబాద్‌లో మీడియా ముందు చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. రాజీనామాలు చేసే ఉద్దేశమే వారికి లేదని తేటతెల్లమవుతోంది. తమ రాజీనామాల డిమాండ్ అనేది మీడియా సృష్టేనంటూ వారంతా కొట్టిపారేశారు. తమను ఎవరూ రాజీనామాలు అడగటం లేదన్నారు. సీడబ్ల్యూసీ విభజన నిర్ణయంపై తమ ఒత్తిడితోనే ఆంటోనీ కమిటీ వచ్చిందని చెప్పారు. ఆ కమిటీ సీమాంధ్రలో పర్యటించి ప్రజల ఆందోళనలు చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరతామన్నారు. ఢిల్లీలో తాజా పరిస్థితులను చూస్తే విభజన నిర్ణయంపై తమ పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడ్డట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు సహా మొత్తం 16 మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు శనివారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో భేటీ అయ్యూరు. ఢిల్లీ పరిణామాలు, సమైక్యాంధ్ర ఉద్యవుం, రాజీనామాలు, భవిష్యత్ కార్యాచరణపై రెండు గంటలకుపైగా చర్చించారు. ఆ తర్వాత కేంద్రవుంత్రి కావూరి సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. రాజీనామాలపై ప్రజల ఒత్తిళ్ల గురించి, విలేకరులు ప్రస్తావించగా ఆయున అసహనం వ్యక్తంచేశారు. రాజీనామాల డిమాండ్ మీడియా సొంత అభిప్రాయమేనని.. ప్రజా స్పందనను మీడియా పేర్కొనటం లేదని తప్పుపట్టారు. తాము ఏ త్యాగాలకైనా సిద్ధవుని, ఎప్పుడు ఏం చేయాల నే తెలివితేటలు, సమర్ధత తమకున్నాయన్నారు. పార్టీ మా సర్వస్వం.. ప్రజలే ముఖ్యం... టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ఆనాడు ఇంకా దీక్ష కొనసాగిస్తే చనిపోతారనే భయంతోనే కేంద్ర ప్రభుత్వం విభజన ప్రకటన చేసిందని, కేసీఆర్ దీక్ష నటనేనని తాము చెప్పినా కేంద్రం వినలేదని కావూరి వ్యాఖ్యానించారు. అప్పట్లో కేంద్రం ప్రకటనతో సీమాంధ్రలో తలెత్తిన ప్రజాందోళన, ప్రజాప్రతినిధుల రాజీనామాలతో డిసెంబర్ 23న కేంద్రం మరో ప్రకటన చేయాల్సి వచ్చిందన్నారు. ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ క్షేత్రస్థారుు అధ్యయనంతో ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకోకుండా విభజన నిర్ణయం తీసుకోవటం దురదృష్టకరమన్నారు. దీనిపై తాము ఒత్తిడి తేవటం వల్లే ఆంటోనీ కమిటీ వచ్చిందని.. మంత్రుల కమిటీ ఏర్పాటుకు ప్రధాని కూడా హామీ ఇచ్చారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను పట్టింటుకోకుండా పదవులను అంటిపెట్టుకోవాలన్న ఆశ తమకు లేదన్నారు. తామంతా మళ్లీ ఢిల్లీ వెళ్తావుని, రాష్ట్రంలో పర్యటించి, సీమాంధ్ర ఆందోళనలను చూసి నిర్ణయం తీసుకోవాలని ఆంటోనీ కమిటీకి చెప్తామని పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్‌ను నమ్ముకుని ఉన్నాం. పార్టీయే వూకు సర్వస్వం. పార్టీ కంటే ప్రజలే ముఖ్యం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం తప్ప మరేదీ సమ్మతం కాదని సోనియూగాంధీ, రాహుల్‌గాంధీలకు చెప్తాం’’ అని తెలిపారు. రాజీనామా చేస్తామంటే పెద్దలు వద్దన్నారు... హైకమాండ్ పెద్దలకు వాస్తవాలు తెలిసి వస్తున్నాయని, వారిలో మార్పు వస్తుందని మరో కేంద్రమంత్రి చిరంజీవి పేర్కొన్నారు. రాష్ట్ర పరిస్థితిని గురించి ఆంటోనీ కమిటీతోనే హైకమాండ్‌కు చెప్పిస్తామన్నారు. ఎంపీలు ఇప్పటికే రాజీనామా చేశారని, తాము కూడా రాజీనామా చేస్తామంటే హైకమాండ్ పెద్దలు వద్దన్నారని మరో మంత్రి పురందేశ్వరి పేర్కొన్నారు. విభజన ఆగుతుందనుకుంటే రాజీనావూలకు సిద్ధమేనన్నారు. రాజీనామా చేయాలని ఏ ప్రజలు అడిగారంటూ వుంత్రి శీలం మీడియాను ఎదురు ప్రశ్నించారు. పదవుల్లో ఉంటే, ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటంతోపాటు ప్రభుత్వంలో జరిగేది తెలుసుకోవచ్చన్నారు. సోనియా, రాహుల్ అపాయింట్మెంట్ కోసం మంత్రి పళ్లంరాజు ప్రయత్నిస్తున్నారని టీటీడీ చైర్మన కనుమూరి బాపిరాజు చెప్పారు. రాజీనామాలపై సమష్టి నిర్ణయం తీసుకుంటామని, కావూరి మాటపైనే తావుు నిలబడ్డామని పేర్కొన్నారు. ఏకాభిప్రాయంలేని విభజన నిర్ణయంతో దేశం అల్లకల్లోలం అవుతోందని, ప్రస్తుత పరిణామాలను చూస్తే, విభజన ప్రక్రియ ఆగినట్టే కనిపిస్తోందని ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. విభజన ఆగినట్టేనని, కేంద్రం పునరాలోచనలో పడిందని ఎంపీలు సాయిప్రతాప్, అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం మినహా మరో ప్రత్యామ్నాయానికి ఒప్పుకోబోవుని హైకమాండ్‌కు చెప్పాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. ధైర్యం ఉంటే రాజీనామా చేయబోమని చెప్పండి సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు ఏపీఎన్జీవోల నేత అశోక్‌బాబు సవాల్ సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ఎంపీలు, మంత్రులకు ధైర్యం ఉంటే, తాము రాజీనామాలు చేయబోవుంటూ ప్రజలకు చెప్పాలని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు సవాల్ విసిరారు. సీమాంధ్ర ఎంపీలు రాజీనామాల డిమాండ్‌తోనే ఉద్యోగుల, ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలైందన్నారు. రాజీనామాలకు ఏపీఎన్జీవోలు ఒత్తిడి తేలేదన్న ఎంపీల వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. కాగా, సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ నుంచి తిరిగి వెళ్తూ, బస్సులపై జరిగిన దాడిలో గాయపడి, అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందున్న రాజమండ్రి ఉద్యోగి సత్యనారాయణను ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, ఇతర నేతలతో కలిసి అశోక్ బాబు శనివారం పరావుర్శించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని సంఘం హైదరాబాద్ నగరశాఖ అధ్యక్షుడు ఇ.వి.వి.సత్యనారాయణ తెలిపారు. చికిత్సకు ఇప్పటికే రూ.3 లక్షలు ఖర్చయ్యాయని, వైద్య ఖర్చులను తమ సంఘమే భరిస్తోందని చెప్పారు. -
మావి ఉత్తుత్తి రాజీనామాలు కాదు: గాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ శాసనసభ్యత్వాలకు తాము చేసిన రాజీనామాలు ఉత్తుత్తివి కాదని టీడీపీ శాసనసభాపక్ష ఉప నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. స్పీకర్ ఫార్మాట్లోనే లేఖలు ఇచ్చామని చెప్పారు. బుధవారం టీ డీఎల్‌పీలో గాలి విలేకరులతో మాట్లాడారు. తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తూ స్పీకర్‌కు రాసిన లేఖను ప్రదర్శించారు. తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ స్పీక ర్ ఫార్మాట్లోనే రాజీనామాలు చేశారన్నారు. తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలు కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు వస్తున్న వార్తలపై పార్టీ అధ్యక్షుడు స్పందిస్తారన్నారు. ఈ విలేకరుల సమావేశానికి సాక్షి ప్రతినిధిని అనుమతించలేదు. వివిధ రూపాల్లో సేకరించిన సమాచారం మేరకు ఈ వార్త ఇస్తున్నాం. ఒకవేళ అనుమతించి ఉంటే గాలికి ఈ క్రింది ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టేది. 1. మీరు, మీ పార్టీ ఎంపీలు నిబంధనల మేరకే రాజీనామాలు సమర్పిస్తే ఒక్క హరికృష్ణ రాజీనామా మా త్రమే ఎందుకు ఆమోదం పొందింది. మిగతా ఎంపీల రాజీనామాలు ఎందుకు ఆమోదం పొందలేదు? అంటే ఒక్క హరికృష్ణ మాత్రమే నిబంధనల మేరకు రాజీనామా చేసినట్టు కదా? 2. మీ పార్టీ ఎంపీలు రాజీనామాలు ఆమోదం పొందని విధంగా షరతులతో కూడిన లేఖలు ఇచ్చారని హరికృష్ణ చెప్పిన విషయంపై మీరేమంటారు? 3. మీలో కొందరు రాజీనామా చేశామని చెబుతున్నారు. మరి మీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రాజీనామా చేయరా? చేయమని మీ పార్టీ నేతలెవరూ కోరడం లేదా? -
బుగ్గకారు.. వదులుకోరు!
రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో తమ పదవులకు మంత్రులు చేసిన రాజీనామాలన్నీ ఒట్టి డ్రామానేనని స్పష్టమవుతోంది. రాజీనామాలు చేశామని పైకి ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నా.. ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. రాజీనామాలు చేసిన మంత్రులంతా అధికార దర్పాన్నే ఒలకబోస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారు. అధికారిక సమీక్షలు, ఫైళ్లపై సంతకాలు యథావిధిగా సాగిపోతున్నాయి. అధికారిక నివాసాలను వదల్లేదు.. ప్రభుత్వం సమకూరుస్తున్న మందీమార్బలాన్నీ వెనక్కు పంపలేదు.. బుగ్గ కార్లను అసలే వదలడం లేదు. ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో జరిగిన సీమాంధ్ర ఎమ్మెల్యేలు, మంత్రుల సమావేశంలో రాజీనామాలపై తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ భేటీ తర్వాత మంత్రులు శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేశ్, మహీధర్‌రెడ్డి, విశ్వరూప్, తోట నర్సింహం, కొండ్రు మురళి, శత్రుచర్ల విజయరామరాజు, సి.రామచంద్రయ్య తదితరులు సీఎంకు రాజీనామాలు సమర్పించారు. రాజీనామాలు చేసినందున వారంతా పదవులకు దూరంగా ఉండాలి. కానీ అలా ఏ ఒక్కరూ కనిపించడం లేదు. తాము రాజీనామాలు చేసినా సీఎం ఆమోదించలేదు కనుక అప్పటివరకు తాము మంత్రులమే అని చెబుతున్నారు. చిత్తశుద్ధితో రాజీనామాలు చేసి ఉంటే నైతికంగా వాటికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత మంత్రులకు ఉంటుందనీ, కానీ మంత్రులు మాత్రం సీఎం ఆమోదించలేదు కనుక తాము మంత్రులమేనన్నట్లుగా అధికారిక కార్యక్రమాల ను యథావిధిగానే కొనసాగిస్తుండటంపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మున్సిపల్ శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి మంత్రిగా అధికారిక హోదాలో పర్యటనలు సాగించడంతో పాటు మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశాలూ కొనసాగిస్తున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావుదీ ఇదే తీరు. మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించినా ఆయన అధికారిక హోదాలో పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల విశాఖలోని పలు కార్యక్రమాల్లో ఆయన మంత్రి హోదాలోనే భాగస్వాములయ్యారు. ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేశ్ కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు. వీరిద్దరూ కర్నూలు జిల్లాలో చేసే పర్యటనల్లో, రాజధానిలో జరిగే కార్యక్రమాల్లో అధికారిక హోదాల్లోనే పాల్గొంటున్నారు. కొంతమంది మంత్రులు సచివాలయంలోని తమ కార్యాలయాలకూ హాజరవుతున్నారు. మరికొందరు మంత్రులు సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల జేఏసీ నిరసనలకు భయపడి రావడం లేదు. కానీ తమ నివాసాలకే అధికారులను పిలిపించుకుని.. ఫైళ్లను తెప్పించుకుని సమీక్షలు నిర్వహిస్తునట్నారు. ఉద్యోగులు సమ్మెలో ఉన్నా అధికారులతోనే ఫైళ్లను రూపొందించి మరీ సంతకాలు చేస్తున్నారని తెలుస్తోంది. వారు అలా.. వీరు ఇలా.. మంత్రుల తీరు చూసి సమ్మెలో ఉన్న సీమాంధ్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవరకు తాము ఏ త్యాగానికైనా సిద్ధమని, ప్రాణాలైనా అర్పిస్తామని ప్రకటనలు చేసిన మంత్రులు ఇప్పుడు కనీసం వారి రాజీనామా లేఖలకు కూడా కట్టుబడటం లేదని మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు సమర్పించిన సమయంలో టీ-మంత్రులు సైతం రాజీనామాలు చేశారు. అయితే ఆ సమయంలో వారెవరూ సచివాలయం ముఖం కూడా చూడలేదు. సీఎం నిర్వహించిన అధికారిక సమీక్షలకు కూడా దూరంగా ఉన్నారు. చివరకు సీఎం కేబినెట్ సమావేశాన్ని తన నివాసంలో పెట్టుకోవాల్సి వచ్చింది. సీమాంధ్ర మంత్రులు రాజీనామాలు చేసినా సచివాలయంలో సమావేశాలు, జిల్లాల్లో అధికారిక కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తున్నారు. సమైక్యవాదం పట్ల గానీ, సీమాంధ్ర ప్రయోజనాల పట్ల గానీ సీమాంధ్ర మంత్రులకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, అంతా డ్రామాలు ఆడుతూ మభ్యపెట్టడానికే వారు చూస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
మా రాజీనామాలు స్పీకర్ ఫార్మాట్లో లేవు: తెదేపా ఎంపీలు
-
కుమ్ములాట లో కృపారాణి,ధర్మాన
-
రాజీనామాలు పరిశీలనలో ఉన్నాయి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను నిరసిస్తూ లోక్‌సభ సభ్యులు చేసిన రాజీనామాలు తమ పరిశీలనలో ఉన్నాయని లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ చెప్పారు. ఇప్పటివరకు ఎనిమిది రాజీనామాలు వచ్చాయని, వాటిని పార్లమెంటు సచివాలయం పరిశీలిస్తోందని వెల్లడించారు. బ్రిటిష్ పాలనలోని సేవకుల ఫోటోల ఆధారంగా మీరాకుమార్ కుమార్తె దేవాంగన కుమార్ గీసిన చిత్రాల ప్రదర్శన శనివారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటైంది. ఈ ప్రదర్శనకు హాజరైన మీరాకుమార్ మీడియాతో మాట్లాడారు. ఎంపీల రాజీనామాల విషయంలో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తామని, అయితే ఇందుకు ఎలాంటి కాలపరిమితి లేదని చెప్పారు. ఈ అంశంలో ఎంపీలను వ్యక్తిగ తంగా పిలిపించి మాట్లాడవచ్చని, లేకపోవచ్చని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. లోక్‌సభలో సభ్యుల ఆందోళనల కారణంగా సభకు అంతరాయం కలుగుతున్న మాట వాస్తవమేనని, సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని తాను అన్ని పార్టీల నేతలనూ కోరుతున్నానని వివరించారు. ‘పెజెంట్స్ ఆఫ్ ది రాజ్ - ది వర్క్‌ఫోర్స్’ పేరిట స్పీకర్ మీరాకుమార్ కుమార్తె దేవాంగన ఏర్పాటు చేసిన ప్రదర్శనకు రాష్ట్రంలోని రాజకీయ ప్రముఖులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. కేంద్ర మంత్రులు జైపాల్‌రెడ్డి, కావూరి సాంబశివరావు, పురందేశ్వరి, రాష్ట్ర గవర్నర్ నరసింహన్, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర మంత్రులు గీతారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, సునీతా లక్ష్మారెడ్డి, ప్రసాదకుమార్, ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, నంది ఎల్లయ్య, హర్షకుమార్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, వి. హనుమంతరావు, సుబ్బిరామిరెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, రేణుకా చౌదరి, కనుమూరి బాపిరాజు, సీఎం.రమేశ్, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జ్యోతిష్య నిపుణుడు దైవజ్ఞశర్మ తదితరులు హాజరయ్యారు. బ్రిటిష్ పాలనలోని సేవకుల ఫోటోల ఆధారంగా దేవాంగన గీసిన అప్పటి కార్మికులు, కూలీలు, సేవకులు, వివిధ వృత్తికారుల చిత్రాలు ఆకట్టుకున్నాయి. నో కామెంట్స్ ఆన్ పాలిటిక్స్ : జైపాల్ రాజకీయాలపై తాను ఏమీ మాట్లాడనని కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మాట్లాడాలని మీడియా ప్రతినిధులు కోరగా, అందుకు ఆయన నిరాకరించారు. దేవాంగన పెయింటింగ్స్ బాగున్నాయని ప్రశంసించారు. భద్రాచలం గురించి మాట్లాడితే.... ప్రదర్శనకు హాజరైన ఏఐసీసీ అధికార ప్రతినిధి, ఎంపీ రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడుతూ, భద్రాచలం జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. ‘భద్రాచలంపై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు. ఇప్పుడు అది ఎక్కడ ఉందో భవిష్యత్తులోనూ అక్కడే ఉంటుంది. ఖమ్మం జిల్లాలో భాగంగా ఉంటుంది. దానిని మాకు కావాలి అని అంటే ముందు నాతో కొట్లాడాల్సి వస్తుంది’ అని అన్నారు. తెలంగాణలో ఉత్తరాంధ్ర జిల్లాలను కలపాలన్న డిమాండ్‌కు తాను కట్టుబడి ఉన్నానని, ఈ మేరకు ఆంటోనీ కమిటీకి నివేదిక ఇస్తానని ఆమె చెప్పారు. రెండు రాష్ట్రాలైనా ఇలానే కలిసుంటాం: ఎంపీలు స్పీకర్ మీరాకుమార్ కుమార్తె చిత్ర ప్రదర్శనకు హాజరైన తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలు పరస్పరం ఛలోక్తులు విసురుకున్నారు. కేంద్రమంత్రి కావూరి, ఎంపీలు గుత్తా, హర్షకుమార్, కోమటిరెడ్డిలతో పాటు డిప్యూటీ సీఎం రాజనర్సింహ, మంత్రి పొన్నాల లక్ష్మయ్యలు సరదాగా మాట్లాడుకున్నారు. ‘రెండు రాష్ట్రాలు ఏర్పడినా మేమంతా ఇలానే కలిసి ఉంటాం’ అని గుత్తా అనడంతో అందరూ నవ్వులు చిందించారు. టీటీడీ చైర్మన్ బాపిరాజు స్పీకర్ మీరాకుమార్‌కు తిరుపతి ప్రసాదాన్ని అందజేశారు. -
ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు జగన్, విజయమ్మ రాజీనామా
అందరికీ సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచండి విభజనకు ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారు? అధికారం ఉందని కోట్లాది తెలుగువారి జీవితాలతో ఆటలాడతారా? హైదరాబాద్ సంగతేమిటి.. సాగునీటి సమస్యలను ఎలా పరిష్కరిస్తారు? మీ నిరంకుశ వైఖరికి నిరసనగా రాజీనామా చేస్తున్నాం వైఎస్ జగన్, విజయమ్మ బహిరంగ లేఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తమ ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు శనివారం రాజీనామా చేశారు. జగన్ కడప లోక్‌సభ స్థానానికి తాను చేసిన రాజీనామాను జైలు అధికారుల ద్వారా లోక్‌సభ స్పీకర్‌కు ఫ్యాక్స్‌లో పంపించారు. విజయమ్మ పులివెందుల శాసనసభ్యత్వానికి రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్‌కు పంపించారు. వారిద్దరూ స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖలు పంపారు. ఈ సందర్భంగా జగన్, విజయమ్మ బహిరంగ లేఖ విడుదల చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దలు నియంతృత్వ పోకడతో విభజన నిర్ణయం తీసుకుని రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినందుకు నిరసనగా పదవులకు రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల జరిగే కష్టనష్టాలను బేరీజు వేసుకోకుండా సమస్యను కాంగ్రెస్ పార్టీ మరింత జటిలం చేస్తోందని ఆరోపించారు. కేంద్రంలో అధికారాన్ని చలాయిస్తున్న వారు అన్ని ప్రాంతాల వారికి న్యాయం చేయలేని పరిస్థితి ఉంటే రాష్ట్రాన్ని యథాతథంగా వదిలేయాలని డిమాండ్ చేశారు. ‘‘కేంద్రం ముందుగా తన వైఖరిని ఇక్కడి పార్టీల ముందుంచి, ఆ తర్వాత అన్ని ప్రాంతాల వారికీ ఆమోదయోగ్యంగా, ఎవరికీ అన్యాయం జరగకుండా నిర్ణయం తీసుకోవాలని మేం పదేపదే విజ్ఞప్తి చేశాం. అయినా కాంగ్రెస్ అలాంటి వాతావరణాన్ని కల్పించలేదు. పైగా ఈ రోజు పరిస్థితి చూస్తుంటే, నెత్తిన తుపాకీ పెట్టి ‘ఒప్పుకుంటారా... చస్తారా?’ అని కాంగ్రెస్ ప్రభుత్వం బెదిరిస్తున్నట్టుగా ఉంది. సీట్లు, ఓట్ల కోసం కాంగ్రెస్ చేస్తున్న అనాలోచిత విభజన రాజకీయం వల్ల వచ్చే సమస్యలేమిటో అందరికీ తెలిసేలా మరోసారి చెప్పకపోతే కోట్లాది మందికి తరతరాల పాటు అన్యాయం జరిగిపోతుందేమోననే భావనతో మా పదవులకు రాజీనామా చేస్తున్నాం’’ అని వివరించారు. ఇప్పటికైనా అధికారంలో ఉన్నవారు కళ్లు తెరవాలని జగన్, విజయమ్మ సూచించారు. రాష్ట్ర విభజన తప్పదని కేంద్రం భావిస్తే, తెలుగు ప్రజలను విభజించడం కంటే వేరే దారి లేదని వారనుకుంటే... ఒక రాజకీయ నాయకుడు తన వ్యక్తిగత లాభాల కోసమో... ఒక పార్టీ రాజకీయ లాభాల కోసమో... రాజకీయ కోణాలతోనో ఆ పని చేయకూడదన్నారు. తెలంగాణ అనేది... కేంద్ర ప్రభుత్వం ఒక తండ్రిలా, ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా, ఇరు ప్రాంతాలు అన్నదమ్ముల్లా ఇకముందు కూడా ఎప్పుడూ కలిసుండేలా పంపకాలు చేయాల్సిన సున్నితమైన అంశమని పేర్కొన్నారు. అలా అందరికీ న్యాయం చేయకపోతే, కేంద్రంలో అధికారం చలాయిస్తున్నవారు రాష్ట్రాన్ని విభజించే అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోనే కూడదనివారు కుండబద్దలు కొట్టారు. ‘‘రాష్ట్రంలో వివిధ ప్రాంతాల చారిత్రక నేపథ్యాన్ని, ఆ తర్వాత మార్పుచేర్పులను, ఆయా ప్రాంతాల అవసరాలను, ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని ఎవరికీ అన్యాయం జరగకుండా పరిష్కారం చూపాలి. ప్రధానంగా నీటి సమస్య, హైదరాబాద్ అంశాలపై పరిష్కారం కావాలి’’ అని లేఖలో కోరారు.రాజ్యాంగంలోని 3వ అధికరణం ప్రకారం రాష్ట్ర విభజనకు సంబంధించి సర్వాధికారాలూ కేంద్ర ప్రభుత్వానికే ఉన్న నేపథ్యంలో, ఆ అధికారం సాయంతో రాష్ట్రంలోని కోట్లాది మంది జీవితాలతో కాంగ్రెస్ చెలగాటమాడుతోందని దుయ్యబట్టారు. అందరికీ న్యాయం చేయలేకపోతే విడగొట్టే అధికారాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇక్కడి ప్రజల స్థానంలో ఉండి ఆలోచించాలని సూచించారు. తమ రాజీనామాలకు దారి తీసిన అంశాలను వివరిస్తూ రాసిన 7 పేజీల బహిరంగ లేఖను జగన్, విజయమ్మ పత్రికలకు విడుదల చేశారు. -
బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించండి: సమైక్యాంధ్ర జేఏసీ
సాక్షి, గుంటూరు: ‘ఇక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించండి.. లేదంటే రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనండి’ అని సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు సమైక్యాంధ్ర జేఏసీ సూచించింది. ఉద్యమ కార్యాచరణపై విశ్వవిద్యాలయాలు, జిల్లాస్థాయి సమైక్యాంధ్ర జేఏసీల సమావేశం మంగళవారం ఇక్కడి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగింది. జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఆచార్య ఎన్.శామ్యూల్ అధ్యక్షత వహించిన సమావేశంలో గౌరవాధ్యక్షుడు ఆచార్య పి.నరసింహారావు మాట్లాడుతూ, ఎంపీలు ఆహార భద్రత బిల్లు ఓటింగ్‌ను బహిష్కరిస్తే కేంద్ర ప్రభుత్వం దిగొస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి ఉద్యమం లో పాల్గొనాలని, ఈనెల 12వ తేదీని డెడ్‌లైన్‌గా ప్రకటించారు. రాజీనామా డ్రామాలు ఆపి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సూచించారు విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆడారి కిషోర్ మాట్లాడుతూ,సమైక్యాంధ్ర ఉద్యమం తన పేటెంట్ హక్కుగా చెప్పుకున్న కావూరి సాంబశివరావు. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని కేంద్రమంత్రి పదవి పొందడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి వారిని చిత్తుగా ఓడించి బుద్ధి చెబుతామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు అప్పిరెడ్డి మాట్లాడుతూ, సమైక్యాంధ్రకు విఘాతం కలిగించే ఏ నాయకుడినైనా నిలదీయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఏపీ ఎన్జీవోస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు టీవీ రామిరెడ్డి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జి.వి. ఎస్.ఆర్.ఆంజనేయులు, నరేంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ గుంటూరు జిల్లా కన్వీనర్ సదాశివరావు, గుంటూరు జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆంజనేయులు ప్రసంగించారు. అనంతరం సమావేశం తీర్మానాలను సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆడారి కిషోర్, భవిష్యత్ కార్యాచరణను విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎం. వెంకటరమణ వెల్లడించారు. సమావేశం తీర్మానాలు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఈనెల 12లోగా రాజీనామాలు చేయాలి సమైక్య రాష్ట్రాన్ని కొనసాగిస్తున్నామని కేంద్రం {పకటించేవరకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలి పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు ఉద్యమంలో భాగస్వాములు కావాలి ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి ఆత్మహత్యలు చేసుకోకుండా ఆత్మస్థయిర్యంతో పోరాడాలి భవిష్యత్ కార్యాచరణ ఈ నెల 7,8 తేదీల్లో కేంధ్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాల్లో బంద్ పాటించాలి 9, 10 తేదీల్లో సీమాంధ్ర ప్రాంతంలో రైల్బంద్ 11, 12 తేదీల్లో విశ్వవిద్యాలయాలు, అన్నిప్రాంతాల్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహించాలి -
రాజీనామాలన్నీ డ్రామాలే
సమైక్య ఉద్యమంలో భాగంగా ప్రజాప్రతినిధులు రాజీమాలు చేయడం అంతా డ్రామానేనని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం విమర్శించారు. సూళ్లూరుపేటలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు రాజీనామా చేసిన ప్రజాప్రతినిధులు సంబంధిత లేఖలను తమ పార్టీ అధ్యక్షులకు మాత్రమే పంపుతున్నారన్నారు. ఏ ఒక్కరూ స్పీకర్ వద్దకు వెళ్లి అయ్యా..సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ప్రజల ఒత్తిడితో రాజీనామా చేస్తున్నాం..ఆమోదించండి..అని ఎవరైనా కోరారా అని ప్రశ్నించారు. ప్రజాగ్రహం భయంతో రాజీనామా డ్రామాలు చేస్తున్నారు తప్ప, అన్ని పార్టీల నేతల్లోనూ చిత్తశుద్ధి కరువైందన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు తెలంగాణలో తెలంగాణ వాదం, సీమాంధ్రలో సమైక్య వాదం వినిపిస్తున్నాయన్నారు. తెలంగాణ కోసం అక్కడి ప్రజాప్రతినిధులు రాజీ లేని పోరాటం చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, సకలజనులు రాజీలేని పోరాటం చేయాల్సిన సమయం అసన్నమైందన్నారు. పార్టీలకతీతంగా అఖిలపక్ష కమిటీ వేసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఎవరికి వారు జెండాల కోసమో, పార్టీ మనుగడ కోసమో మోసపూరిత పోరాటం చేస్తే ఫలితం ఉండదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీపీఎం, ఎంఐఎం తప్ప మిగిలిన అన్ని పార్టీలు తమకు అభ్యంతరం లేవని చెప్పాయన్నారు. తెలంగాణ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో పెట్టడం లేదని, శీతాకాలం సమావేశంలో పెట్టే అవకాశం ఉన్నందున, అప్పటి వరకు విరామం లేకుండా పోరాటం చేయాలని సూచించారు. సీపీఎం మాత్రమే నిజమైన సమైక్య పార్టీ అని అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన అనంతరం సీమాంధ్ర అగ్నిగుండంలా భగ్గుమంటుంటే చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మీరు ఎప్పుడు రాజీనామా చేస్తారని విఠపును విలేకరులు ప్రశ్నించగా, ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తే శాసనమండలి కూడా రద్దు అవుతుందని సమాధానమిచ్చారు. ఆయన వెంట యూటీఎప్ రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు సి.చంద్రశేఖర్ ఉన్నారు. -
నేడు సీమాంధ్ర ఎంపీల రాజీనామా