
గోపవరపు సత్యనారాయణ
అన్నీ ఉన్నా అనాథగా మారిన సత్తెనపల్లి వాసి గోపవరపు సత్యనారాయణ దుస్థితిపై శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఆ వృద్ధుడి ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించి అవసరమైతే మెరుగైన వైద్యం అందించాలని నాన్ జ్యుడీయల్ ఏపీ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు సూచించారు.
సత్తెనపల్లి: అన్నీ ఉన్నా అనాథగా మారిన సత్తెనపల్లి వాసి గోపవరపు సత్యనారాయణ దుస్థితిపై శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఆ వృద్ధుడి ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించి అవసరమైతే మెరుగైన వైద్యం అందించాలని నాన్ జ్యుడీయల్ ఏపీ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు సూచించారు. ఆ పెద్దాయన సంతానంతో మాట్లాడాలని గుంటూరు ఆర్డీవో ఎస్.భాస్కర్‌రెడ్డిని ఆదేశించారు. తనకు ఎక్కడ ఇష్టముంటే అక్కడ చేర్చాలని పేర్కొన్నారు. సత్యనారాయణకు కల్పించిన సౌకర్యాలపై ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కథనాన్ని ప్రచురించిన ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు.
మేమున్నామంటూ..
గుంటూరు, నరసరావుపేటకు చెందిన అనాథాశ్రమ నిర్వాహకులు సత్యనారాయణను తాము చేర్చుకుంటామంటూ ముందుకొచ్చారు. చివరి మజిలీ వేళ తాము అండగా ఉంటామని, ఆయనకు ఊతకర్రగా మారుతామని హామీ ఇచ్చారు. కరోనా చీకట్లు అలుముకున్న వేళ మానవత్వపు దీపాన్ని వెలిగించి ఆ వృద్ధుడి మోములో బోసి నవ్వులు చూస్తామని ప్రకటించారు.
చదవండి: సీనియర్ జర్నలిస్టు గోపి హఠాన్మరణం
భార్యను చంపి.. ఆపై సెల్ఫీ తీసుకుని..