రఘురామ, గంటాకు బిగ్‌ షాక్‌ | NCLT Indian Bank Serve Notices To TDP Ragurama, Ganta | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ.. రఘురామ, గంటాకు బిగ్‌ షాక్‌

Published Sat, May 11 2024 1:20 PM | Last Updated on Sat, May 11 2024 1:48 PM

NCLT Indian Bank Serve Notices To TDP Ragurama, Ganta

ఎన్నికల వేళ.. తెలుగు దేశం పార్టీ నేతలు రఘురామకృష్ణంరాజు, గంటా శ్రీనివాస్‌లకు భారీ షాక్‌ తగిలింది.

విశాఖపట్నం, సాక్షి: ఎన్నికల వేళ.. తెలుగు దేశం పార్టీ నేతలు రఘురామకృష్ణంరాజు, గంటా శ్రీనివాస్‌లకు భారీ షాక్‌ తగిలింది. బ్యాంకు రుణాల ఎగవేత కేసులో  ఈ ఇద్దరి ఆస్తుల వేలం కోసం వేరువేరుగా నోటీసులు జారీ అయ్యాయి.

తమిళనాడులోని థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌కు సంబంధించిన భూములు, ప్లాంట్‌ ఆస్తుల్ని విక్రయించేందుకు హైదరాబాద్‌కు చెందిన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT) నోటీసు జారీ చేసింది. జూన్ 13 2024 లోపు ఈ ఆస్తులకు సంబంధించిన కొనుగోలు చేసేటువంటి వారు బిడ్డు దాఖలు చేయాల్సిందిగా సదరు ప్రకటనలో NCLT తెలిపింది.  

ఈ ఆప్షన్ కు పిలిచిన వాటిలో 311 ఎకరాల ఇన్డ్ భారత్ థర్మల్ పవర్ భూములు, కర్ణాటకలో హంకోన్ గ్రామంలోని 129 ఎకరాల భూములు ఉన్నాయి.

అలాగే.. గంటా శ్రీనివాసరావుకు చెందిన  ప్రత్యూష రిసోర్సెస్ ఇన్ఫ్రా ఆస్తుల వేలం వేసేందుకు ఇండియన్ బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది. ప్రత్యూష కంపెనీ ఇండియన్ బ్యాంకు నుంచి 400 కోట్లు ఇన్ఫ్రా కంపెనీ రుణం తీసుకుంది. అయితే.. సకాలంలో రుణాలు చెల్లించకపోవడంతో ఈ కంపెనీకి  ఆస్తులు వేలం వేస్తున్నట్లు నోటీసులు జారీ చేసింది. బిడ్స్ దాఖలు చేసేందుకు జూన్ ఏడో తారీఖు ఆఖరి తేదీగా నిర్ణయించింది ఇండియన్ బ్యాంక్.

గంటా శ్రీనివాసరావు విశాఖ భీమిలి నుంచి, రఘురామ కృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement