మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్‌కి తప్పిన ప్రమాదం  | Peddireddy Ramachandra Reddy Convoy misses Road Accident | Sakshi
Sakshi News home page

మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్‌కి తప్పిన ప్రమాదం 

Published Mon, Aug 29 2022 4:33 AM | Last Updated on Mon, Aug 29 2022 2:29 PM

Peddireddy Ramachandra Reddy Convoy misses Road Accident - Sakshi

చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి నడింపల్లి వద్ద మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. తన నియోజకవర్గంలోని కార్యక్రమాలను ముగించుకుని మంత్రి పెద్దిరెడ్డి ఆదివారం సాయంత్రం తిరుపతికి పయనమయ్యారు.

ఈ క్రమంలో మంత్రికి కాన్వాయ్‌గా వస్తున్న వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని, రోడ్డుకు అటువైపున దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు అవ్వలేదు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సమీక్షించి అనంతరం మంత్రి కాన్వాయ్‌కు మరమ్మతులను నిర్వహించి, అక్కడ నుంచి తిరుపతికి తరలించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement