
టామ్ క్రూజ్ నటించిన 'ఎడ్జ్ ఆఫ్ టుమారో' చిత్రాన్ని ప్రశంసిస్తూ.. ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. సినిమా ట్వీట్స్ అనే ఎక్స్ యూజర్ చేసిన ట్వీట్‌పై టెస్లా సీఈఓ స్పందిస్తూ 'గ్రేట్ మూవీ' అని అన్నారు.
''ఎడ్జ్ ఆఫ్ టుమారో అనేది మరోమారు చూడాల్సిన సినిమా అనేదానికి సరైన నిర్వచనం. ఈ మూవీ ఫిల్మోగ్రఫీలో ఏ స్థానంలో ఉందో నాకు తెలియదు. కానీ క్రూజ్ ఇప్పటివరకు తీసిన ఒరిజినల్ చిత్రాలలో ఇది ఖచ్చితంగా ఒకటి. ఎమిలీ బ్లంట్‌తో క్రూజ్ కెమిస్ట్రీ కూడా చాలా ప్రత్యేకమైనది. నాకు ఈ సినిమా చాలా ఇష్టం'' అని సినిమా ట్వీట్స్ యూజర్ అన్నారు. దీనిపై మస్క్ స్పందిస్తూ.. గ్రేట్ మూవీ అని అన్నారు.
డగ్ లిమాన్ దర్శకత్వం వహించిన ఎడ్జ్ ఆఫ్ టుమారో అనేది 2014లో విడుదలైన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం. భవిష్యత్తులో భూమిని మిమిక్స్ అనే గ్రహాంతర జాతి దాడి చేస్తుంది. టామ్ క్రూజ్ మేజర్ విలియం కేజ్ పాత్రను పోషిస్తాడు. దీనిని హిరోషి సకురాజాకా రాసిన జపనీస్ నవల "ఆల్ యు నీడ్ ఈజ్ కిల్" ఆధారంగా తెరకెక్కించారు.
Great movie
— Elon Musk (@elonmusk) April 19, 2025
ఇండియాకు ఎలాన్ మస్క్
ప్రపంచకుబేరుడు 'ఎలాన్ మస్క్' ఈ ఏడాది చివర్లో భారతదేశాన్ని సందర్శిస్తానని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. శుక్రవారం మోదీతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత మస్క్ ఈ ప్రకటన చేశారు.
ఇదీ చదవండి: బంగారం, వెండి కొని ధనవంతులు కండి: రిచ్‌డాడ్ పూర్ డాడ్ రచయిత
సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణల్లో అమెరికాతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌తో ఈ ఏడాది ప్రారంభంలో వాషింగ్టన్ డీసీలో జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించినట్లు మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు.