
అమెరికా 47వ అధ్యక్షుడిగా మరికొన్ని గంటల్లో డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ వేడుకలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani), ఆయన సతీమణి రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ(Nita Ambani) హాజరయ్యారు. 2025 జనవరి 20న(భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి) వాషింగ్టన్ డీసీలో జరిగే కార్యక్రమంలో ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ట్రంప్ కుటుంబంతో సుదీర్ఘ అనుబంధం ఉన్న అంబానీ దంపతులను ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ ఈవెంట్‌కు ఆహ్వానం అందుకున్న అతికొద్ది మంది ప్రపంచ ప్రముఖుల్లో అంబానీ దంపతులున్నారు. అంబానీ ఆధ్వర్యంలోని చాలా వ్యాపారాలు అమెరికాలోనూ ఉన్నాయి. దాంతోపాటు భారత్, యునైటెడ్ స్టేట్స్ మధ్య వ్యాపార, ఆర్థిక సహకార రంగాల్లో బలమైన సంబంధాలున్నాయి.
ఇదీ చదవండి: ఇంటి అద్దె చెల్లిస్తున్నారా.. ప్లాన్ చేసుకోండి..
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు అంబానీ దంపతులు ట్రంప్‌తో దిగిన ఫొటో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈమేరకు జనవరి 19న ఏర్పాటు చేసిన క్యాండిల్ లైట్ డిన్నర్‌లో వీరు పాల్గొన్నారు. ఉపాధ్యక్షుడిగా ఎన్నివైన జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్‌తో ముచ్చటించారు. టెక్ దిగ్గజాలు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్ బర్గ్, బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్ సహా పలువురు అమెరికాకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.