president
-
మూడు నెలల్లో తేల్చేయాల్సిందే.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను ఉద్దేశించి దేశసర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాలు రూపొందించే బిల్లుల నిలుపుదల విషయంలో గవర్నర్లకు, రాష్ట్రాలకు రాజ్యాంగ బద్ధమైన ప్రత్యేక అధికారాలేవీ ఉండబోవని స్పష్టం చేసింది. ఈ క్రమంలో గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.ఇంతకు ముందు గవర్నర్ల విషయంలోనూ ఇలాంటి గడువును నిర్దేశించిన సుప్రీం కోర్టు.. ఇప్పుడు రాష్ట్రపతి విషయంలోనూ ఈ తరహా సూచన చేయడం తెలిసిందే. తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవికుమార్ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సివస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో..ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను మూడు నెలలకు మించి ఉంచకూడదని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మహదేవన్ నేతృత్వంలోని తాజాగా బెంచ్ స్పష్టం చేసింది. ఒకవేళ జాప్యం జరిగితే గనుక సరైన రాష్ట్రపతి భవన్ ఆ కారణాలను రాష్ట్రాలకు వివరించాల్సి ఉంటుందని తెలిపింది. ఒకవేళ నిర్ణీత సమయంలోపూ రాష్ట్రపతి నుంచి సరైన స్పందన లేకుంటే మాండమస్ రిట్ పిటిషన్ దాఖలు చేయొచ్చని రాష్ట్రాలకు సుప్రీం కోర్టు సూచించింది.అంతకు ముందు గవర్నర్ విషయంలోనూ కాల నిర్దేశాన్ని పాటించని పక్షంలో ఆయన చర్యపై కోర్టులు న్యాయసమీక్ష జరపవచ్చని వెల్లడించింది. మంత్రి మండలి సలహా సూచనల మేరకు తప్పనిసరిగా పనిచేయడం తప్ప గవర్నర్‌కు విచక్షణాధికారాలేవీ లేవని, రాజ్యాంగంలోని 200వ అధికరణం కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేస్తోందని తెలిపింది. రెండోసారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వు చేసి ఉంచే అధికారం గవర్నర్‌కు లేదంది. ఇక.. తాజాగా ఆర్టికల్ 201 రాష్ట్రపతి విషయంలోనూ ఇదే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఒకవేళ బిల్లు గనుక రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే.. రాష్ట్రపతి ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీం కోర్టును సంప్రదించడానికి అవకాశం ఉందని స్పష్టం చేసింది. -
వక్ఫ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర
న్యూఢిల్లీ: వక్ఫ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. ఇప్పటికే పార్లమెంటు ఆమోదం పొందిన వక్ఫ్ (సవరణ) బిల్లు–2025 (ఉమీద్)పై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం సంతకం చేశారు. శనివారం రాత్రి ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంతో వక్ఫ్ బిల్లు చట్టరూపం దాల్చింది. తీవ్ర వాదోపవాదాలు, విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో వక్ఫ్ బిల్లుపై ఉభయ సభల్లోనూ ఓటింగ్ జరగడం, లోక్‌సభలో 288–232, రాజ్యసభలో 128–95 ఓట్ల తేడాతో బిల్లు గట్టెక్కడం తెలిసిందే.. -
వక్ఫ్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం
రెండు రోజుల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ, తీవ్రస్థాయి వాదోపవాదాల అనంతరం వక్ఫ్ (సవరణ) బిల్లు–2025పై పార్లమెంటు ఆమోదముద్ర పడింది. విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్యే లోక్‌సభ బుధవారం ఈ బిల్లును ఆమోదించడం తెలిసిందే. అది గురువారం రాజ్యసభ ఆమోదం కూడా పొందింది. 13 గంటలకు పైగా జరిగిన చర్చ అనంతరం అర్ధరాత్రి ఒంటి గంట దాటాక ఓటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా జరిగింది. దాదాపుగా ప్రతి సవరణపైనా ఓటింగ్‌కు విపక్షాలు పట్టుబట్టాయి. వాటి సవరణలన్నీ వీగిపోయాయి. చివరికి బిల్లు ఆమోదం పొందింది. దానికి అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు పడ్డాయి. వక్ఫ్ బిల్లును కేంద్రం ఇక రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. రాష్ట్రపతి సంతకం అనంతరం అది చట్టంగా రూపుదాల్చుతుంది. వక్ఫ్ బిల్లును లోక్‌సభ 288–232 ఓట్లతో ఆమోదించడం తెలిసిందే.సదుద్దేశమే: రిజిజు న్యూఢిల్లీ: వక్ఫ్ బిల్లుపై గురువారం అర్ధరాత్రి దాకా జరిగిన వాడివేడి చర్చ పెద్దల సభను వేడెక్కించింది. ఉమీద్ (యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్, ఎఫీషియన్సీ అండ్ డెవలప్మెంట్)గా పేరు మార్చిన వక్ఫ్ (సవరణ) బిల్లు–2025ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు సభలో ప్రవేశపెట్టారు. బిల్లుకు నిరసనగా పలువురు విపక్ష సభ్యులు నల్లదుస్తులు ధరించి సభకు వచ్చారు. బిల్లు రాజ్యాంగ విరుద్ధమంటూ మండిపడ్డారు. ముస్లింల భూములను లాక్కోవడమే మోదీ సర్కారు అసలు లక్ష్యమని ఆరోపించారు. విపక్షాల వాదనను రిజిజు ఖండించారు. వాటి అభ్యంతరాలను తోసిపుచ్చారు. ‘‘ముస్లింల హక్కులను ఎవరూ లాక్కోబోవడం లేదు. ఈ విషయమై విపక్షాలు చేస్తున్నదంతా దు్రష్పచారమే’’ అని పేర్కొన్నారు. ‘‘2004లో 4.9 లక్షలుగా ఉన్న వక్ఫ్ ఆస్తులు ఇప్పుడు ఏకంగా 8.72 లక్షలకు పెరిగాయి. తద్వారా దేశంలో వక్ఫ్ అతి పెద్ద ప్రైవేటు భూ యజమానిగా అవతరించింది’’ అని వివరించారు. ‘‘వక్ఫ్ వ్యవహారాల్లో పారదర్శకత, జవాబుదారీతనం తేవడం, వాటి ఆస్తులను మరింత సమర్థంగా నిర్వహించడం, ముస్లిం మహిళలకు సాధికారత కల్పించడం, ముస్లింలలోని అన్ని తెగల హక్కులనూ పరిరక్షించడమే బిల్లు లక్ష్యం. అంతే తప్ప మతంతో ఈ బిల్లుకు ఎలాంటి సంబంధమూ లేదు’’ అని పునరుద్ఘాటించారు. ‘‘అందుకే సున్నీలు, షియాలతో పాటు ముస్లింలలోని ఇతర వెనకబడ్డ వర్గాల వారు కూడా వక్ఫ్ బోర్డుల్లో సభ్యులుగా ఉంటారు. తద్వారా వారి ప్రయోజనాలకూ న్యాయం జరుగుతుంది. ఇందుకు ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు’’ అన్నారు. ‘‘కేంద్ర వక్ఫ్ మండలి సభ్యుల్లో అధిక సంఖ్యాకులు ముస్లిమేతరులే ఉంటారనడం అవాస్తవం. 22 మందిలో వారి సంఖ్య 4కు మించబోదు. వక్ఫ్ బోర్డులు చట్టపరమైన సంస్థలు. అంతే తప్ప కేవలం ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే సంస్థలు కాదు. వక్ఫ్ ట్రిబ్యునళ్ల ముందు 31,999 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వివాదాస్పద వక్ఫ్ భూముల్లో ఇప్పటికే కోర్టుల్లో పరిష్కారమైన వాటి జోలికి పోబోం. పసలేని ఆరోపణలు మాని బిల్లును ఆమోదించడంలో విపక్షాలు కూడా కలసి రావాలి’’ అని కోరారు. దురుద్దేశాలు: విపక్షాలు వక్ఫ్ (సవరణ) బిల్లు వెనక మోదీ సర్కారు దురుద్దేశాలు దాగున్నాయని ఆర్జేడీ సభ్యుడు మనోజ్ ఝా ఆరోపించారు. మోదీ ప్రభుత్వాన్ని ముస్లింలు విశ్వసించడం లేదని సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు రామ్‌గోపాల్ యాదవ్ అన్నారు. ప్రభుత్వం అన్ని మతాలనూ సమానంగా చూడాలన్నారు. బిల్లులో పలు అంశాలు పైకి బాగానే ఉన్నా దీని వెనక మోదీ సర్కారు ఉద్దేశమే అనుమానాలకు తావిస్తోందని బీఆర్ఎస్ సభ్యుడు కె.ఆర్.సురేశ్‌రెడ్డి అన్నారు. బిల్లులోని 75 శాతం అంశాలను బిల్లుతో నిమిత్తం లేకుండానే అమలు చేయొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తిరుచ్చి శివ (డీఎంకే), వై.వి.సుబ్బారెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్ట), అభిõÙక్ మను సింఘ్వీ, సయీద్ సనీర్ హుసేన్ (కాంగ్రెస్), సుష్మితా దేవి (టీఎంసీ), సంజయ్ రౌత్ (శివసేన–యూబీటీ), సంజయ్‌సింగ్ (ఆప్), ముజీబుల్లా ఖాన్ (బీజేడీ), జాన్ బ్రిటాస్ (సీపీఎం), పి.పి.సునీర్ (సీపీఐ), హరీస్ బీరన్ (ఐయూఎంఎల్), వైగో (ఎండీఎంకే) తదితర సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడారు. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ (జేడీఎస్) బిల్లుకు మద్దతుగా మాట్లాడారు. వక్ఫ్‌కు ముస్లిమేతరులూ విరాళాలు ఇవ్వొచ్చు: సిబల్ ముస్లిమేతరులకు కూడా వక్ఫ్ విరాళాలిచ్చే హక్కుందని స్వతంత్ర సభ్యుడు కపిల్ సిబల్ అన్నారు. ‘‘నా ఆస్తిని ఫలానా వారికి ఇవ్వొద్దని చట్టం చేయడానికి మీరెవరు? హిందువులు వక్ఫ్ విరాళాలు ఇవ్వడమే కాదు, స్వాతంత్య్రానికి ముందే వక్ఫ్ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. దీన్ని పలు హైకోర్టులూ సమరి్థంచాయి’’ అని చెప్పారు. దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో హిందూ మత సంస్థలకు 10 లక్షల ఎకరాలకు పైగా భూములున్నాయని ఆయన అన్నారు. ‘‘హిందూ మతంలో స్వార్జిత ఆస్తిని కుమారులకు మాత్రమే ఇవ్వగలరు. దాన్ని కూతుళ్లకూ ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ చట్టాన్ని మార్చండి’’ అని సూచించారు. చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ జోక్యం చేసుకుంటూ కూతుళ్లతో పాటు ఎవరికైనా ఇచ్చేందుకు మన చట్టాలు వీలు కల్పిస్తున్నాయని చెప్పారు. అయోమయం సృష్టిస్తున్నారు: రిజిజు సిబల్ తీరును మంత్రి రిజిజు తీవ్రంగా దుయ్యబట్టారు. హిందూ మత సంస్థలకు చెందిన భూమిని వక్ఫ్ భూములతో పోల్చడాన్ని ఖండించారు. ‘‘పలువురు సీనియర్ సభ్యులు ఏ అంశం పడితే అది లేవనెత్తడం ద్వారా అయోమయం సృష్టిస్తున్నారు. కానీ వాటిపై వివరణలు వినే దాకా కూడా సభలో ఉండటం లేదు’’ అంటూ అసహనం వెలిబుచ్చారు. కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే: ఖర్గే వక్ఫ్ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. దానిపై చర్చలో ఆయన పాల్గొన్నారు. బిల్లు ముసుగులో సమాజంలో విభజన బీజాలు నాటేందుకు, ముస్లింలను వేధించేందుకు, వారి భూమిని లాక్కొని కార్పొరేట్ మిత్రులకు పంచేందుకు మోదీ సర్కారు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. ‘‘ఈ బిల్లు ఆమోదం పొందితే ముస్లింల ఆస్తులను లాగేసుకుంటారు. వారి ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బ తింటాయి’’ అని ఆరోపించారు. అస్మదీయులను వక్ఫ్ బోర్డుల్లోకి చొప్పించేందుకు వీలుగా సవరణలు చేశారంటూ బిల్లులోని పలు అంశాలపై తీవ్ర అభ్యంతరాలు వెలిబుచ్చారు. ‘‘గత 11 ఏళ్లలో ముస్లింల సంక్షేమానికి కేటాయించిన రూ.18,274 కోట్ల నిధులనే పూర్తిగా వెచ్చించని చెత్త రికార్డు మోదీ సర్కారుది. అలాంటివాళ్లు పస్మాంద వంటి పేద ముస్లింల సంక్షేమంపై మొసలి కన్నీరు కారుస్తున్నారు’’ అంటూ తూర్పారబట్టారు. వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు ఉండాలన్న ప్రతిపాదనను ఖర్గే తీవ్రంగా తప్పుబట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం, రామమందిర్ ట్రస్ట్ వంటివాటిల్లో ఒక్కరైనా ముస్లిం ఉన్నారా అని ప్రశ్నించారు. ఆలయ ట్రస్టుల్లో కనీసం దళితులకు కూడా స్థానం కల్పించడం లేదని ఆక్షేపించారు. ‘‘‘దేశంలో శాంతి, సామరస్యాలను దెబ్బ తీయకండి. ప్రతిష్టకు పోకుండా ఈ తప్పులతడక బిల్లును తక్షణం వెనక్కు తీసుకోండి’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పాపమే: నడ్డా కాంగ్రెస్ తన దశాబ్దాల పాలనలో ముస్లిం మహిళల అభ్యున్నతికి చేసిందేమీ లేదని రాజ్యసభ నాయకుడు జేపీ నడ్డా ఆక్షేపించారు. వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చిన పాపం ఆ పారీ్టదేనంటూ దుయ్యబట్టారు. ‘‘ముస్లిం మహిళలను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది. ట్రిపుల్ తలాక్‌ను నిషేధించడంతో కోట్లాది మంది ముస్లిం మహిళలు గౌరవంగా జీవిస్తున్నారు. వక్ఫ్ బిల్లు జాతి ప్రయోజనాల కోసం ఉద్దేశించింది. వక్ఫ్ ఆస్తులు తీవ్రంగా దురి్వనియోగమవుతున్నాయి. దానికి పూర్తిగా అడ్డుకట్ట వేసి వక్ఫ్ వ్యవహారాల్లో జవాబుదారీతనం తేవడమే బిల్లు లక్ష్యం. వక్ఫ్ బిల్లులో సవరణలు సూచించేందుకు ఏకంగా 31 మంది సభ్యులతో జేపీసీ వేశాం. యూపీఏ హయాంలో కేవలం 13 మందితో జేపీసీ వేసి మమ అనిపించారు’’ అని నడ్డా ఆరోపించారు. ‘‘వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చి ప్రజా సంక్షేమానికి, అభివృద్ధి కార్యకలాపాలకు ఉపయోగించేందుకు వీలుగా సౌదీ అరేబియా, తుర్కియే వంటి ముస్లిం దేశాలు కూడా పలు చట్టాలు చేశాయి. వక్ఫ్ ఆస్తులను డిజిటైజ్ కూడా చేస్తున్నాయి. అదే పని భారత్‌లో చేస్తుంటే అభ్యంతరమెందుకు?’’ అని విపక్షాలను ప్రశ్నించారు. -
Bihar Diwas: బీహార్ @ 113.. ప్రముఖుల శుభాకాంక్షలు
బీహార్.. దేశంలో అభివృద్దికి ఆలవాలంగా నిలిచిన ఒక రాష్ట్రం. నేడు బీహార్ దినోత్సవం(Bihar Diwas). ప్రతి ఏటా మార్చి 22న బీహార్ ఆవిర్భావ వార్షికోత్సవాన్ని జరుపుకుంటారు. 1912, మార్చి 22న బెంగాల్ ప్రావిన్స్ నుంచి వేరు చేసి, బీహార్‌ను కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రం ఏర్పడి నేటికి 113 ఏళ్లు. బీహార్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.భారత చరిత్రలో బీహార్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడే బుద్ధుడు(Buddha) జ్ఞానోదయం పొందాడు. పురాతన కాలంలో నలంద విశ్వవిద్యాలయాన్ని ఇక్కడే నెలకొల్పారు. చంద్రగుప్త మౌర్య, అశోకుడు వంటి గొప్ప చక్రవర్తులు బీహార్‌ను ఏలారు. ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట కూడా బీహార్లోనే జన్మించాడు. బీహార్ అద్భుతమైన వారసత్వానికి చిహ్నంగా నిలిచింది. బీహార్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో జరిగే వేడుకల్లో కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు పాల్గొననున్నారు. బీహార్ దినోత్సవం సదర్భంగా ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.జ్ఞానానికి ఆలవాలం: రాష్ట్రపతి ముర్ము बिहार दिवस पर राज्य के सभी निवासियों को मैं हार्दिक बधाई देती हूं। बिहार की धरती प्राचीन काल से ही ज्ञान और विकास का केंद्र रही है। मेरा विश्वास है कि बिहार के निवासी अपनी प्रतिभा, दृढ़ संकल्प तथा परिश्रम के बल पर विकसित बिहार और विकसित भारत के निर्माण में अपना भरपूर योगदान देते…— President of India (@rashtrapatibhvn) March 22, 2025 బీహార్ రాష్ట్ర స్థాపన దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ఆమె ఇలా రాశారు బీహార్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. పురాతన కాలం నుండి బీహార్ భూమి జ్ఞానం, అభివృద్ధికి కేంద్రంగా వెలుగొందుతోంది. బీహార్ ప్రజలు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో తమ వంతు కృషిని కొనసాగిస్తారని నమ్ముతున్నానని అమె పేర్కొన్నారు. సర్వతోముఖాభిృద్ధికి ప్రయత్నిస్తాం: ప్రధాని మోదీ वीरों और महान विभूतियों की पावन धरती बिहार के अपने सभी भाई-बहनों को बिहार दिवस की ढेरों शुभकामनाएं। भारतीय इतिहास को गौरवान्वित करने वाला हमारा यह प्रदेश आज अपनी विकास यात्रा के जिस महत्वपूर्ण दौर से गुजर रहा है, उसमें यहां के परिश्रमी और प्रतिभाशाली बिहारवासियों की अहम भागीदारी…— Narendra Modi (@narendramodi) March 22, 2025 బీహార్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాశారు ‘బీహార్‌లోని నా సోదరులు, సోదరీమణులందరికీ బీహార్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. భారత చరిత్ర గర్వించేలా చేసిన మన రాష్ట్రం అభివృద్ధి ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశను దాటుతోంది. ఇందులో ప్రతిభావంతులైనవారు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి మేము నిరంతరం ప్రయత్నిస్తాం’ అని పేర్కొన్నారు. బీహార్ కలను సాకారం చేద్దాం: సీఎం నితీష్ కుమార్ वीरों और महान विभूतियों की पावन धरती बिहार के अपने सभी भाई-बहनों को बिहार दिवस की ढेरों शुभकामनाएं। भारतीय इतिहास को गौरवान्वित करने वाला हमारा यह प्रदेश आज अपनी विकास यात्रा के जिस महत्वपूर्ण दौर से गुजर रहा है, उसमें यहां के परिश्रमी और प्रतिभाशाली बिहारवासियों की अहम भागीदारी…— Narendra Modi (@narendramodi) March 22, 2025 బీహార్ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్(Chief Minister Nitish Kumar) రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘బీహార్ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. బీహార్‌కు అద్భుతమైన చరిత్ర ఉంది. మనం మన దృఢ సంకల్పంతో బీహార్‌కు అద్భుతమైన భవిష్యత్తును సిద్ధం చేస్తున్నాం. అభివృద్ధి చెందిన బీహార్ కలను సాకారం చేసుకోవడంలో మీరందరూ భాగస్వాములు కావాలని నేను పిలుపునిస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. నిట్ ప్రొఫెసర్ అరెస్ట్ -
మరో షాక్.. ఆప్ నేతలపై కేసు నమోదుకు రాష్ట్రపతి అనుమతి?
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలపై కేసుల నమోదుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. ఢిల్లీలోని పాఠశాలల్లో తరగతి గదుల నిర్మాణంలో రూ.1300 కోట్ల మేర కుంభకోణం జరిగిందనే ఆరోపణలపై మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్‌పై ఎఫ్ఐఆర్ నమోదుకు రాష్ట్రపతి అనుమతి లభించినట్లు సమాచారం.ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో పబ్లిక్ వర్క్స్ శాఖ 2400 తరగతి గదుల నిర్మాణంలో అవకతవకలు ఉన్నట్లు కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) 2020 ఫిబ్రవరి 17న తన నివేదికలో పేర్కొంది. ఈ క్రమంలోనే 2022లో ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ డైరెక్టరేట్ ఈ కుంభకోణం ఆరోపణలపై దర్యాప్తునకు సిఫారసు చేస్తూ ప్రధాన కార్యదర్శికి నివేదికను సమర్పించింది. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా ఉన్న వీరిపై ఎఫ్ఐఆర్ నమోదుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు సమాచారం. -
ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ట్రంప్ ఆగ్రహం !
వాషింగ్టన్:ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌదీ అరేబియాలో రష్యాతో జరుగుతున్న చర్చలకు తమను ఆహ్వానించలేదని జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ‘జెలెన్స్కీ ఒక అసమర్థ నేత. అసలు రష్యా,ఉక్రెయిన్ యుద్ధం మొదలవడానికి కారణమే జెలెన్స్కీ. యుద్ధానికి ముగింపు పలికేందుకు జెలెన్స్కీ రష్యాతో ఎప్పుడో డీల్ కుదుర్చుకోవాల్సింది.సౌదీలో చర్చలకు తమను పిలవలేదని జెలెన్స్కీ అంటున్నాడు. మూడేళ్ల నుంచి ఆయన ఏం చేస్తున్నాడు. ఈ నెలలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడతా. యుద్ధం ఆపేందుకు పుతిన్,జెలెన్స్కీ ఇద్దరితో సంప్రదింపులు జరుపుతున్నా’అని ట్రంప్ తెలిపారు.కాగా, రష్యా,ఉక్రెయిన్ల మధ్య యుద్ధంపై సౌదీఅరేబియాలో జరుగుతున్న చర్చలకు తమను పిలవకపోవంపై జెలెన్స్కీ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాము లేకుండా తమ దేశానికి సంబంధించిన చర్చలు ఎలా జరుగుతాయని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమెరికా మద్దతు లేకుండా తాము ఎక్కువ రోజులు మనుగడ సాధించలేమన్నారు. -
మేం బతికే అవకాశాలు తక్కువే: ఉక్రెయిన్ అధ్యక్షుడు
కీవ్:రష్యాతో యుద్ధంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు.అమెరికా మద్దతు లేకుండా రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్ బతికి బట్టకట్టడం కష్టమేనన్నారు.డొనాల్డ్ ట్రంప్,పుతిన్‌ల మధ్య ఇటీవల జరిగిన ఫోన్ చర్చలపై జెలెన్స్కీ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.అమెరికా మద్దతు లేకుండా తాము జీవించే అవకాశాలు చాలా తక్కువ అని జెలెన్స్కీ అన్నారు. తమతో యుద్ధాన్ని ముగించాలని పుతిన్ కోరుకోవడం లేదన్నారు. విరామ సమయంలో యుద్ధానికి ఆయన మరింతగా సంసిద్ధమవుతున్నారని చెప్పారు.ఇంతేకాక రష్యాతో యూరప్‌కు ప్రమాదం పొంచి ఉందన్నారు. యూరప్ ఇప్పటికైనా మేల్కొని,సొంతంగా సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. త్వరలో యూరప్‌పై రష్యా దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.మరోవైపు రష్యాతో ట్రంప్ జరుపుతున్న చర్చల్లో ఉక్రెయిన్ భాగస్వామ్యం లేకపోవడంపై జెలెన్స్కీ అసంతృప్తి వ్యక్తంచేశారు. -
వీణల విందుగా...
వీణ రాగాల వెన్నెలలో పులకించిపోయిన దీప్తికి– వీణ పాఠమేప్రాణమై పోయింది. వీణ విహంగ రెక్కలపై ఆమె కొత్త ప్రపంచాలను చూసింది. ‘ఈ తరం అమ్మాయిలు కూడా వీణ నేర్చుకుంటున్నారా!’ అనేది కొందరి ఆశ్చర్యం. నేర్చుకుంటే ఎంత బాగుంటుందో దీప్తిలాంటి అమ్మాయిలు తమ విజయాల ద్వారా నిరూపిస్తున్నారు...తాను ఒకటి తలిస్తే వీణ ఒకటి తల్చింది!అవును.. మచిలీపట్నానికి చెందిన మొదలి చంద్రశేఖర్ దగ్గర గాత్రం, కీబోర్డు నేర్చుకుందామని వెళ్లిన అప్పికట్ల దీప్తి అంతలోనే మనసు మార్చుకుంది. వీణపై ఆసక్తి పెంచుకుంది. పాఠాలు నేర్చుకోవడం మొదలు పెట్టింది. సాధారణంగా చాలామందికి నేర్చుకోవడంలో ఆరంభ శూరత్వం ఉంటుంది. అయితే దీప్తి విషయంలో అలా జరగలేదు. ‘ఇంకా ఏదో నేర్చుకోవాలి’ అనే తపనతో ఎప్పటికప్పుడు ఉత్సాహంగా పాఠాలు నేర్చుకునేది. దీప్తి ప్రస్తుతం విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ సీఎస్ఈ మూడో సంవత్సరం చదువుతోంది.‘ఇంజినీరింగ్ చదివే అమ్మాయికి వీణలెందుకు.. చదువు దెబ్బతింటుంది కదా!’ అనేది కొందరి సందేహం. ‘చదువు దెబ్బతినదు. మరింత చదువుకోవాలనిపిస్తుంది’ అంటుంది దీప్తి. ఎందుకంటే వీణరాగాల సాధనలో ఒత్తిడి తగ్గి మనసు తేలిక అవుతుంది. ఏకాగ్రత అంతకంతకూ పెరుగుతుంది. ఏది చదివినా ఇట్టే గుర్తుండి పోతుంది అంటుంది దీప్తి. నాలుగు సంవత్సరాలపాటు కర్ణాటక సంగీత సంప్రదాయ వీణ కోర్సును చదివి ఫస్ట్ క్లాస్‌లో సర్టిఫికెట్‌ను సాధించిన దీప్తి ఆ తరువాత పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో వీణలో డిప్లమో చేసింది.నేర్చుకోవడం ఒక ఎత్తయితే, ప్రేక్షకులు మెచ్చేలా ప్రదర్శన ఇవ్వడం మరో ఎత్తు. మొదటిసారిగా సంగీత కళాకచేరిలో మంచి మార్కులు కొట్టేసింది. ఆంధ్రా యూనివర్సిటీలో నిర్వహించిన ‘యువభేరి’ లో బహుమతులు సాధించింది. ఎన్నో పోటీల్లో మొదటి బహుమతి గెలుచుకుంది. తెలంగాణ రాజ్‌భవన్ లో వీణ వాద్య కచేరి చేసి గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మ ప్రశంసలు అందుకుంది. వీణ వాద్య ప్రతిభతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో పాటు త్రివిధ దళాధిపతుల ప్రశంసలు అందుకుంది. ‘రాష్ట్రపతి భవన్ లో వీణ ప్రదర్శన ఇవ్వడం, ప్రముఖులను దగ్గరి నుంచి చూడడం, వారి ఆశీర్వాదం అందుకోవడం మరచిపోలేని అనుభూతి’ అంటుంది దీప్తి. చదువూ, సంగీతంలోనే కాదు కరాటేలోనూ రాణిస్తున్న దీప్తి మరిన్ని కళలలో విజయాలు సాధించాలని ఆశిద్దాం. ధ్యానం లాంటి వీణవీణ అనేది కేవలం కచేరీల కోసం కాదు. నా దృష్టిలో వీణ వాద్య సాధన అనేది ఒకలాంటి ధ్యానం. వీణరాగాల వెలుగులో మనసు ఉత్తేజితం అవుతుందన్నది కాదనలేని సత్యం. – అప్పికట్ల దీప్తి – అంబటి శేషుబాబు సాక్షి, మచిలీపట్నం -
సంగమంలో ముర్ము పవిత్ర స్నానం
మహాకుంభ్ నగర్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. గంగా నదికి పూజలు చేసి, సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించారు. అనంతరం అక్షయవత్, బడే హనుమాన్ ఆలయాల్లో పూజలు చేశారు. అంతకు ముందు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం ఆదిత్యనాథ్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి ముర్ము, సీఎం ఆదిత్యనాథ్ పడవలో త్రివేణీ సంగమానికి వెళ్లారు. డిజిటల్ మహాకుంభ్ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ఆమె సందర్శించారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము ‘మహా కుంభ్‌కు తరలివస్తున్న జన సమూహం భారత దేశ గొప్ప వారసత్వానికి, నమ్మకానికి, విశ్వాసానికి సజీవ చిహ్నం అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ్ వేళ గంగ, యమున, అంతర్వాహిని సరస్వతీనదుల పవి త్ర సంగమ్లో స్నానమాచరించే భాగ్యం తనకు దక్కిందని తెలిపారు. గంగా మాత ఆశీస్సులు అందరికీ దక్కాలని, అందరి జీవితాల్లోనూ సుఖశాంతులు నింపాలని ప్రారి్థంచానన్నారు. -
అభిప్రాయం చెప్పకుండా గవర్నర్ బిల్లుల్ని ఆపరాదు
న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తొక్కిపెట్టడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి సందర్భాల్లో ప్రతిష్టంభన ఎలా తొలుగుతుందని ప్రశ్నించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై ఆమోద ముద్ర వేయడంలో గవర్నర్ ఆర్ఎన్ రవి జాప్యం చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘ఏదైనా బిల్లు కేంద్ర చట్టానికి విఘాతం కలిగిస్తుందని మీరు భావిస్తే, ఆ మేరకు మీరు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి. ఆ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపుతున్నట్లు గవర్నర్ చెప్పాలి. లేకపోతే ప్రతిష్టంభన తలెత్తుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టంభనను ఎలా అధిగమిస్తుందని మీరు భావిస్తున్నారు? ఇటువంటి ప్రతిష్టంభనను మీరే తొలగించాలి. ఈ విషయం గమనించండి’అని గవర్నర్ తరఫున వాదించిన అటార్నీ జనరల్ వెంకటరమణికి సూచించింది. అటార్నీ జనరల్ వినతి మేరకు తదుపరి విచారణను 10వ తేదీకి వాయిదా వేసింది. -
ఎవరైనా చార్జీలు చెల్లించాల్సిందే
పనామా సిటీ: పనామా కాలువ నుంచి అమెరికా యుద్ధనౌకలు ఉచితంగా రాకపోకలు సాగించేలా ఒప్పందం ఏదీ కుదరలేదని పనామా అధ్యక్షుడు జోస్రాల్ ములినో గురువారం స్పష్టంచేశారు. తమ యుద్ధ నౌకల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయకుండా పనామాతో ఒప్పందం కుదిరిందంటూ అమెరికా ప్రభుత్వం చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. పనామా కాలువ గుండా రాకపోకలు సాగించే నౌకలకు రుసుము ఖరారు చేయడం గానీ, మినహాయింపు ఇవ్వడం గానీ తాను చేయలేనని పేర్కొన్నారు. అమెరికా నౌకలకు ప్రత్యేక వెసులుబాటు లేదని వివరించారు. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం అన్ని దేశాల నౌకలు రుసుము చెల్లించాల్సిందేనని స్పష్టంచేశారు. ఇదే విషయాన్ని అమెరికా రక్షణ శాఖ మంత్రి హెగ్సెత్కు తెలియజేశానని చెప్పారు. అయితే, పనామా అధ్యక్షుడు జోస్రాల్ ములినో అమెరికా సర్కారు ఇంకా స్పందించలేదు. ‘‘అమెరికా ప్రభుత్వ నౌకలు ఇకపై పనామా కాలువలో ఉచితంగా రాకపోకలు సాగించవచ్చు. దీనివల్ల మనకు మిలియన్ డాలర్ల ఆదా అవుతుంది’’అని అమెరికా బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. -
తాజా కార్పొరేట్ నియామకాలు
ప్రపంచవ్యాప్తంగా మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్స్‌కు నేతృత్వం వహిస్తున్న జీఎస్ఎంఏ బోర్డ్ ఛైర్మన్‌గా ఎయిర్టెల్ వైస్ ఛైర్మన్, ఎండీ గోపాల్ విఠల్ ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ఆయన డిప్యూటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. టెలిఫోనికా ఛైర్మన్, సీఈవో పదవికి హొసే మరియా అల్వరేస్ ప్యాలే రాజీనామా చేయడంతో జీఎస్ఎంఏ ఛైర్మన్ పదవి కోల్పోయారు. జీఎస్ఎంఏ డిప్యూటీ ఛైర్మన్‌గా ఇటీవలే గోపాల్ విఠల్ తిరిగి నియమితులయ్యారు. అసోసియేషన్ బోర్డు సభ్యుడిగా 2019–20లో పనిచేశారు. 1,100లకుపైగా టెలికం, హ్యాండ్సెట్, డివైస్, సాఫ్ట్వేర్, ఎక్విప్మెంట్, ఇంటర్నెట్ రంగ కంపెనీలు జీఎస్ఎంఏలో సభ్యులుగా ఉన్నాయి.ఇదీ చదవండి: రేపు భారత్‌కు ఓపెన్ఏఐ సీఈఓ ఆల్ట్మన్టీవీఎస్ టూవీలర్స్ ప్రెసిడెంట్వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ టూవీలర్స్ బిజినెస్ ప్రెసిడెంట్‌గా గౌరవ్ గుప్తా నియమితులయ్యారు. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్, ఈవీ విభాగాలకు ఆయన నేతృత్వం వహిస్తారని కంపెనీ ఇటీవల తెలిపింది. గతంలో ఆయన ఎంజీ మోటార్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, డిప్యూటీ ఎండీ, చీఫ్ గ్రోత్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. -
రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు.. సోనియా గాంధీపై కేసు నమోదు
పట్నా: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోమారు చిక్కుల్లో పడ్డారు. ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ‘పేద మహిళ’(Poor Lady) అని అభివర్ణించినందుకు బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఆమెపై పోలీసు కేసు నమోదైంది. సుధీర్ ఓజా అనే న్యాయవాది సీజీఎం కోర్టులో ఈ ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిని కోర్టు స్వీకరించగా, ఈ కేసు ఫిబ్రవరి 10న విచారణకు రానుంది.ఈ కేసులో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాలను కూడా సహ నిందితులుగా పిటిషనర్ పేర్కొన్నారు. వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోనియా గాంధీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించడానికి ప్రయత్నించారని పిటిషనర్ సుధీర్ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగం అనంతరం సోనియా గాంధీ రాష్ట్రపతిపై చేసిన వ్యాఖ్య చాలా అభ్యంతరకరంగా ఉంది. రాష్ట్రపతి ఒక మహిళ అని, గిరిజన సమాజం నుండి వచ్చారని, ఆమెపై ఈ వ్యాఖ్య అభ్యంతరకరమని ఓజా పేర్కొన్నారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) ప్రసంగం తర్వాత సోనియా గాంధీ పాత్రికేయులతో మాట్లాడుతూ ‘చివరికి ఆ పేద మహిళ అలసిపోయింది’ అని అన్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీ రాష్ట్రపతి ప్రసంగాన్ని బోరింగ్‌గా అభివర్ణించారు. కాగా సోనియా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. సోనియా వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. ఇది దురదృష్టకర, అవమానకర వ్యాఖ్య అని రాష్ట్రపతి భవన్ పేర్కొంది. సోనియా గాంధీ వ్యాఖ్యపై ప్రధాని మోదీ(Prime Minister Modi) మాట్లాడుతూ నేడు దేశం మరోసారి కాంగ్రెస్ రాజకుటుంబ అహంకారాన్ని చవిచూసిందని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. అభివృద్ధి చెందిన భారతదేశం సాధించిన విజయాలు, దార్శనికత గురించి ఆమె దేశ ప్రజలకు తెలియజేశారు. హిందీ ఆమె మాతృభాష కాదు, అయినప్పటికీ ఆమె చాలా చక్కగా మాట్లాడారు. కానీ కాంగ్రెస్ రాజకుటుంబం ఆమెను అవమానించడం ప్రారంభించింది. ఇది దేశంలోని గిరిజన సోదరసోదరీమణులకు అవమానకరం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా.. మరో వీడియో వైరల్ -
మూడో పర్యాయం.. మూడింతల వేగం
న్యూఢిల్లీ: దేశ అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అసాధారణ వేగంతో పనిచేస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉద్ఘాటించారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు, యువత, మహిళలు, రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ కీలక నిర్ణయాలు, విధానాలను అమల్లోకి తీసుకొచ్చిందని చెప్పారు. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల్లో వేగంగా మూడు రెట్లు పెరిగిందని అన్నారు. ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా అంకితభావంతో ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా లోక్‌సభ చాంబర్లో పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. 60 నిమిషాలపాటు సాగిన ప్రసంగంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. దేశ ప్రగతి ప్రయాణంలో అమృతకాలం నడుస్తోందని, ఇప్పటిదాకా సాధించిన అపూర్వమైన విజయాలతో ప్రభుత్వం దేశానికి నూతన శక్తిని ఇచ్చిందని తెలిపారు. మహా కుంభమేళాలో మౌని అమావాస్య రోజు తొక్కిసలాటలో భక్తులు మరణించడం పట్ల రాష్ట్రపతి సంతాపం ప్రకటించారు. ఇటీవల కన్నుమూసిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు నివాళులరి్పంచారు. కేంద్ర ప్రభుత్వం సాధించిన ఘనతలను వివరించారు. ద్రౌపదీ ముర్ము ప్రసంగం ఆమె మాటల్లోనే... అప్పుడే అభివృద్ధికి సార్థకత శ్రీహరికోటలోని షార్ నుంచి ఇస్రో వంద రాకెట్ ప్రయోగాలు పూర్తిచేయడం ప్రశంసనీయం. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న గగన్‌యాన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లే రోజు ఇక ఎంతోదూరంలో లేదు. కోవిడ్–19 మహమ్మారి, ఇతర దేశాల్లో యుద్ధాలు, తద్వారా అంతర్జాతీయంగా అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ మన ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతోంది. మన బలాన్ని ఆర్థిక వ్యవస్థ చాటి చెబుతోంది. సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. ఒకే దేశం.. ఒకే పన్ను అనే విధానంతో జీఎస్టీని తీసుకొచ్చింది. దీనితో అన్ని రాష్ట్రాలూ ప్రయోజనం పొందుతున్నాయి. అభివృద్ధి ఫలాలు సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికి సైతం అందాలి. అప్పుడే ఈ అభివృద్ధికి ఓ సార్థకత ఉంటుంది. స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ప్రభుత్వం 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించింది. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద 10 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చింది. సౌభాగ్య యోజన కింద 80 కోట్ల మందికి రేషన్ సరుకులు అందజేస్తోంది. స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి జల జీవన్ మిషన్‌ను అమలు చేస్తోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలతో తాము గౌరవంగా జీవించగలమన్న విశ్వాసం ప్రజల్లో పెరిగింది. పేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందిస్తే.. పేదరికాన్ని జయించగలమన్న ధీమా వారిలో పెరుగుతుంది. ప్రభుత్వ కృషితో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. వారంతా ఒక నూతన మధ్యతరగతి వర్గంగా మారారు. దేశ పురోభివృద్ధికి వారు ఒక చోదకశక్తి. డిజిటల్ విప్లవంలో ముందంజ భారతదేశ సామాజిక, ఆర్థిక, జాతీయ భద్రతకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు, డీప్ ఫేక్ వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సమస్యను కలిసికట్టుగా పరిష్కరించుకోవాలి. భౌతికమైన మౌలిక వసతులను అభివృద్ధి చేస్తూనే సామాజిక మౌలిక సదుపాయాల విప్లవంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత పదేళ్లలో ప్రగతిలో కొత్త అధ్యాయం లిఖించింది. డిజిటల్ విప్లవంలో మనం ముందంజలో ఉన్నాం. డిజిటల్ టెక్నాలజీ రంగంలో ఇండియా అతిపెద్ద గ్లోబల్ ప్లేయర్‌గా అవతరించింది. మన దేశంలో ప్రజలకు 5జీ సరీ్వసులు అందుతున్నాయి. ఇక మన డిజిటల్ చెల్లింపులు ప్రపంచ దేశాలను అబ్బురపరుస్తున్నాయి. ప్రపంచం మొత్తంలో 50 శాతానికి పైగా రియల్–టైమ్ డిజిటల్ లావాదేవీలు మనదేశంలోనే జరుగుతున్నాయి. సామాజిక న్యాయం, సమానత్వానికి డిజిటల్ టెక్నాలజీని ప్రభుత్వం ఒక సాధనంగా వాడుకుంటోంది. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం ‘మహిళల సారథ్యంలో ప్రగతి’ అనేది ప్రభుత్వ విధానం. మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తోంది. 91 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 10 కోట్ల మంది మహిళలకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఆయా సంఘాలకు రూ.9 లక్షల కోట్లు అందజేసింది. వారు ఆర్థిక స్వాతంత్య్రం గణనీయంగా పెంచుకుంటున్నారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలన్న లక్ష్యంతో నారీశక్తి వందన్ అధినియంను ప్రభుత్వం తీసుకొచ్చింది. రైల్వే నెట్వర్క్ ద్వారా కన్యాకుమారితో కశీ్మర్ అనుసంధానమైంది. ఉధంపూర్–బారాముల్లా–శ్రీనగర్ రైలు ప్రాజెక్టు పూర్తయ్యింది. దేశవ్యాప్తంగా 71 వందేభారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ప్రధాన నగరాల సమీపంలో 100కుపైగా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం రూ.28,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద మెట్రో రైలు వ్యవస్థ దేశంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించాలని కేంద్రం సంకల్పించింది. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. 2023–14లో దేశంలో రికార్డు స్థాయిలో 322 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రభుత్వం రైతులకు రూ.41,000 కోట్లు అందజేసింది. పంటలకు కనీస మద్దతు ధరలను పెంచింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద మెట్రో రైలు వ్యవస్థ మన దేశంలోనే ఉంది. ఇప్పటికే వెయ్యి కిలోమీటర్ల మెట్రో రైలు నెట్వర్క్ అందుబాటులోకి వచ్చింది. రూ.8,000 కోట్లతో అదనంగా 52,000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నూతన పరిపాలనా విధానానికి సంస్కరణ, పనితీరు, మార్పు అనేవి పర్యాయ పదాలుగా మారాయి’’ అని రాష్ట్రపతి ముర్ము స్పష్టంచేశారు. జమిలి ఎన్నికలపై ముందడుగు‘‘బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం అహరి్నశలూ కృషి చేస్తోంది. పేద కుటుంబాలకు ఇళ్లు ఇవ్వబోతోంది. గ్రామీణులకు ప్రాపర్టీ కార్డులు అందజేసింది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం వేగంగా ముందుకు సాగుతోంది. 70 ఏళ్లు దాటినవారిలో 6 కోట్ల మందికి ఆరోగ్య బీమా పథకం వర్తింపజేస్తోంది. కీలకమైన జమిలి ఎన్నికలతోపాటు వక్ఫ్ సవరణ బిల్లుపై ప్రభు త్వం ముందడుగు వేసింది. అంతర్జాతీయంగా అస్థిర పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత్ మాత్రం ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థిరత్వంలో ఒక మూలస్తంభంగా నిలిచింది. ఈ విషయంలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మారింది. భారతదేశ బలాలు, విధానాలు, ఉద్దేశాల పట్ల ప్రపంచ దేశాలు విశ్వాసం కనబరుస్తున్నాయి. క్వాడ్, బ్రిక్స్, షాంఘై సహకార సంస్థతోపాటు జీ20లో ఇండియాదే కీలకపాత్ర. సమతుల్య అభివృద్ధి అత్యంత కీలకంఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధికి సానుకూల వాతావరణం ఏర్పడింది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈశాన్య రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలు ఏమిటో ప్రభుత్వానికి తెలుసు. తాము ఒంటరిమన్న భావనను వారిలో తొలగించడానికి కృషి చేస్తోంది. ఈశాన్యంలో శాంతి సాధన కోసం పదికిపైగా ఒప్పందాలు కుదిరాయి. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సమతుల్య అభివృద్ధి అత్యంత కీలకం. దేశమంతటా అన్ని ప్రాంతాలూ సమానంగా పురోగతి సాధించాలన్నదే కేంద్రం ఉద్దేశం. అండమాన్, నికోబార్ దీవులు, లక్షదీవుల్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రారంభించింది. అందరికీ నాణ్యమైన వైద్య సేవలుసమాజంలో అన్ని వర్గాలకు ప్రజలకు తక్కువ రుసుముతో నాణ్యమైన వైద్య సేవలు అందాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. ప్రభుత్వ చర్యలతో ఆరోగ్య సంరక్షణ ఖర్చులు క్రమంగా తగ్గుతున్నాయి. దేశవ్యాప్తంగా 1.75 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాబోయే ఐదేళ్లలో మెడికల్ కాలేజీల్లో కొత్తగా 75 వేల సీట్లు రాబోతున్నాయి. జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రభుత్వం అత్యాధునిక విద్యా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత పదేళ్లలో ఉన్నత విద్యా సంస్థల సంఖ్య భారీగా పెరిగింది. వాటిలో నాణ్యత కూడా మెరుగుపడింది.మధ్య తరగతికి సొంత గూడుప్రభుత్వ పథకాలతో దళితులు, గిరిజనులు, బీసీలు అత్యధికంగా లబ్ధి పొందుతున్నారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో వారు భాగస్వాములవుతున్నారు. సొంత గూడు కలిగి ఉండాలన్నది మధ్య తరగతి ప్రజల కల. దాన్ని నిజం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. గృహరుణాలపై వడ్డీ రాయితీని ప్రభుత్వం అందజేస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలకు తావులేకుండా ‘రెరా’ వంటి చట్టాలు తీసుకొచ్చింది. ‘అందరికీ ఇళ్లు’ అనేది ప్రభుత్వ లక్ష్యం. -
రాష్ట్రపతిపై సోనియా వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ:రాష్ట్రపతి ద్రౌపదిముర్ముపై సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బడ్జెట్ సమావేశాల తొలిరోజు రాష్ట్రపతి ప్రసంగం అనంతరం సోనియా,రాహుల్ పార్లమెంట్ ఆవరణలోకి వచ్చారు. అయితే ఇక్కడ రాహుల్‌గాంధీ మాత్రమే మీడియాతో మాట్లాడారు.రాష్ట్రపతి ప్రసంగం బోరింగ్‌గా ఉందని రాహుల్ అన్నారు. దీనికి సోనియా కల్పించుకుని ‘అన్నీ తప్పుడు హామీలే. రాష్ట్రపతి చివర్లో బాగా అలసిపోయారు. ఆమె అసలు మాట్లాడలేకపోయారు. పూర్ థింగ్’ అని అన్నారు. ఈ మాటలకు తల ఊపిన రాహుల్ రాష్ట్రపతి చెప్పిన విషయాన్నే మళ్లీ మళ్లీ చెప్పారన్నారు. రాష్ట్రపతినుద్దేశించి మీడియాతో సోనియాగాంధీ నేరుగా మాట్లాడకపోయినప్పటికీ బీజేపీ మాత్రం ఆమెపై విమర్శల దాడికి దిగింది. ‘సోనియాగాంధీ వెంటనే రాష్ట్రపతికి క్షమాపణలు చెప్పాలి. ఆమె మాటలు కాంగ్రెస్ పార్టీ గిరిజన,పేదల వ్యతిరేక వైఖరిని తెలియజేస్తోంది’అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా ఎక్స్(ట్విటర్)లో డిమాండ్ చేశారు.సోనియా వ్యాఖ్యలు రాష్ట్రపతి గౌరవాన్ని తగ్గిస్తున్నాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.కాగా, బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం(జనవరి31) పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఎన్డీఏ మూడో టర్ములో పనులు గతం కంటే మూడు రెట్ల వేగంతో జరుగుతున్నాయన్నారు. వక్ఫ్ బిల్లు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశాల్లో పురోగతే ఇందుకు నిదర్శనమన్నారు. -
అంగన్వాడీలను క్రమబద్దీకరించాలి
కార్వేటినగరం: అంగన్వాడీ కార్యకర్తలను సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం క్రమబద్దీకరించాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా బుధవారం చిత్తూరు జిల్లా కార్వేటినగరం ఐసీడీఎస్ ప్రాజెక్టు అంగన్వాడీ సిబ్బంది సిఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్రపతికి లేఖలు రాశారు. ఈ సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అలాగే హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) గౌరవ అధ్యక్షుడు వాడ గంగరాజు, ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు విజయ, మమత మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడిలను నిర్లక్ష్యం చేస్తున్నారని కోర్టు తీర్పు ప్రకారం ఐసీడీఎస్‌ను సంస్థాగతం చేయాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్లు అవుతున్న ఇప్పటివరకు సంస్థాగతం చేయకపోవడం దారుణమన్నారు. శిశు, మరణాలు రేటు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీల సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సరాల కొద్ది పని చేస్తున్న అంగన్వాడీలపై పనిభారం పెంచడంతో రకరకాల పద్ధతుల్లో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఆధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అంగన్వాడీల వద్ద డబ్బులు వసూలు చేసే కార్యక్రమం తీవ్రమైందన్నారు. చిత్తూరు జిల్లాలోనే అత్యధికంగా పోషణ వాటిక సెంటర్లను నిర్వహించడం అధికారులకు కాసుల పంటగా మారిందన్నారు. దీంతో అంగన్వాడీలు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని ఆరోపించారు. అధికారుల ఒత్తిడి మానక పోతే నిరంతరం పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రాజెక్టులో ఒకరిద్దరు నాయకులుగా చెలామణి అవుతూ అధికారులకు తొత్తులుగా ఉంటూ అంగన్వాడీలను బెదిరించే పనులు చేయడం మానుకోవాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు రెడ్డెమ్మ (శ్రీరంగరాజపురం) పలువురు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. -
Republic Day: ఇండోనేషియా ప్రతినిధి బృందం నోట ‘కుచ్ కుచ్ హోతాహై’ పాట
న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో భారత్ వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన విందులో ఇండోనేషియా ప్రతినిధి బృందం పాల్గొంది.ఈ సందర్భంగా ఇండోనేషియా ప్రతినిధి బృందం బాలీవుడ్ సినిమా 'కుచ్ కుచ్ హోతా హై'లోని పాటను ఆలపించింది. ఈ ప్రతినిధి బృందంలో ఇండోనేషియా సీనియర్ మంత్రులు ఉన్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. #WATCH | Delhi: A delegation from Indonesia sang Bollywood song 'Kuch Kuch Hota Hai' at the banquet hosted by President Droupadi Murmu in honour of Prabowo Subianto, President of Indonesia at Rashtrapati Bhavan. The delegation included senior Indonesian ministers. The… pic.twitter.com/VH6ZHRTbNS— ANI (@ANI) January 25, 2025కాగా భారతదేశం-ఇండోనేషియా రక్షణ, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో విస్తృతంగా చర్చలు జరిపారు. రెండు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి, రక్షణ తయారీ తదితర రంగాల్లో సంయుక్తంగా పనిచేయడానికి అంగీకరించాయి.ఇది కూడా చదవండి: దేశ ప్రజలకు ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు -
ఈ గణతంత్ర దినోత్సవం మనకు మరింత ప్రత్యేకం: రాష్ట్రపతి
ఢిల్లీ: గణతంత్ర దినోత్సవం మనకు మరింత ప్రత్యేకం అని.. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. దేశం మొత్తం గర్వించదగ్గ సందర్భం ఇదని.. మన లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం సాగుతోందన్నారు. అంతర్జాతీయంగా నాయకత్వం వహించేలా భారత్ ఎదిగిందన్న రాష్ట్రపతి.. భరతమాత విముక్తి కోసం త్యాగాలు చేసిన వారిని స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం ఎల్లప్పుడూ మన నాగరిక వారసత్వంలో భాగంగా ఉన్నాయి. మన వారసత్వ గొప్పతనానికి నిదర్శనం మహా కుంభమేళా. ఈ ఏడాది బిర్సా ముండా 150వ జయంతిని జరుపుకొన్నాం. వెలుగులోకి రాని మరికొందరు ధైర్యవంతులను స్మరించుకోవాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలు మార్చుకున్నాం. ఈ ఏడాది కొత్త చట్టాలు రూపొందించి అమల్లోకి తెచ్చాం. జమిలి ఎన్నికలు పాలనలో స్థిరత్వాన్ని అందించడంతో పాటు ఆర్థికపరమైన భారాన్ని కూడా తగ్గిస్తాయి’’ అని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. -
ట్రంప్ ఆదేశాలు.. అమెరికాలో ఎక్కడికక్కడ అరెస్టులు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై కొరడా ఝులిపిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న అక్రమ వలసదారుల్ని ఎక్కడికక్కడే అరెస్ట్‌లు చేయిస్తున్నారు. ఈ అరెస్ట్‌ల నుంచి తప్పించుకుని సరిహద్దులు దాటే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇందుకోసం సైనిక విమానాల్ని వినియోగిస్తున్నారు. ఈ అరెస్ట్‌లపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పందించారు. యుఎస్ అధికారులు ఇప్పటి వరకు 538 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేశారని, సైనిక విమానాల్ని ఉపయోగించి వందల మందిని బహిష్కరించినట్లు చెప్పారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సైనిక విమానం ద్వారా వందలాది అక్రమ వలస దారుల్ని బహిష్కరించింది. చరిత్రలో అక్రమ వలస దారుల బహిష్కరణ ఆపరేషన్ విజయవంతంగా కొనసాగుతోంది. అక్రమ వలసదారులపై చర్యలు తీసుకుంటామని ట్రంప్ మాట ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతున్నారని తెలిపారు. -
ట్రంప్ నిర్ణయాలు.. అంతర్జాతీయంగా అమెరికాకు దెబ్బ?
అమెరికా అధ్యక్ష పీఠాన్ని మరోమారు అధిరోహించిన ట్రంప్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ఒకటి పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి ఉపసంహరణ, మరొకటి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగడం... ఈ నిర్ణయాలతో ఆమెరికాలో పలు కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయని విశ్లేషకులు అంటున్నారు. పారిస్ ఒప్పందం అనేది ప్రపంచంలోని పలు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం. పారిశ్రామికీకరణ జరగక ముందున్నప్పటి కంటే 2 డిగ్రీల సెల్సియస్ తక్కువకు గ్లోబల్ వార్మింగ్‌ను పరిమితం చేయడం లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది. భారీ స్థాయిలో కర్బన ఉద్గారాలు విడుదలువుతున్న దేశాలలో అమెరికా ఒకటి. ఇప్పుడు పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగినందున వాతావరణ మార్పును ఎదుర్కొనే విషయంలో అంతర్జాతీయ సహకారానికి ఆ దేశం దూరమవుతుంది.ఆర్థిక పరిణామాలు:పెరుగుతున్న క్లీన్ ఎనర్జీ రంగంలో ఆర్థిక అవకాశాలను అమెరికా కోల్పోనుంది. కీలకమైన క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ ప్రపంచ మార్కెట్ 2035 నాటికి మూడు రెట్లు పెరిగి, రెండు ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా పెరుగుతుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనా వేస్తోంది.దౌత్య సంబంధాలు:ఈ ఉపసంహరణ అమెరికాను అంతర్జాతీయ మిత్రదేశాల నుండి దూరం చేస్తుంది. దౌత్య సంబంధాలను దెబ్బతీస్తుంది. వాతావరణ సమస్యలపై ప్రపంచ సహకారం నుండి అమెరికా దూరమవుతుంది.పర్యావరణ ప్రభావం:యూఎస్ భాగస్వామ్యం లేకుండా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాల ప్రభావం తగ్గే అవకాశం ఉంది. ఇది తీవ్రమైన వాతావరణ ప్రభావాలకు దారితీసే పరిస్థితులు ఏర్పాడనున్నాయి.ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి..ప్రపంచ ఆరోగ్య భద్రత:ఆరోగ్య అత్యవసర పరిస్థితులకు అంతర్జాతీయ ప్రతిస్పందనలను సమన్వయం చేయడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో అమెరికా ఉపసంహరణ ప్రపంచ ఆరోగ్య భద్రత, ప్రతిస్పందన సామర్థ్యాలను బలహీనపరుస్తుంది.నిధులు-వనరులు:ప్రపంచ ఆరోగ్య సంస్థకు భారీగా నిధులను అందించే దేశాలలో అమెరికా ఒకటి. దీని నుంచి అమెరికా వైదొలగడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఆ దేశపు ఆర్థిక చేయూత దూరమవుతుంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యక్రమాల నిర్వహణ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది.ప్రజారోగ్య సహకారం:వ్యాధి నివారణ, నియంత్రణతో సహా వివిధ ఆరోగ్య సమస్యలపై అమెరికా ప్రపంచ ఆరోగ్య సంస్థకు సహకారం అందిస్తుంటుంది. అయితే ఇప్పుడు అమెరికా తీసుకున్న నిర్ణయం ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యాల పురోగతికి ఆటంకం కలిగించే అవకాశం ఉంది.అమెరికా ఆరోగ్యంపై ప్రభావం:ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి సహకారం లేనప్పుడు అమెరికా వైద్యారోగ్యం విషయంలో ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇదేవిధంగా ప్రపంచ ఆరోగ్య డేటా, పరిశోధనలో అమెరికాకు స్థానం ఉండదు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు యునైటెడ్ స్టేట్స్ గణనీయమైన సహకారం అందిస్తోంది. 2022–2023 ద్వివార్షిక కాలంలో అమెరికా సుమారు 1.284 బిలియన్ అమెరిన్ డాలర్ల సాయాన్ని అందించింది. ఈ నిధులు అత్యవసర ప్రతిస్పందన, వ్యాధుల నివారణ, ఆరోగ్య వ్యవస్థ బలోపేతంతో సహా వివిధ ప్రపంచ ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణకు సహకారం అందిస్తున్నాయి.ఇది కూడా చదవండి: Mahakumbh: కుంభమేళాకు భయపడిన బ్రిటీష్ పాలకులు.. విప్లవగడ్డగా మారుతుందని.. -
గణతంత్ర వేడుకలకు అతిథిగా ఇండోనేసియా అధ్యక్షుడు
ఢిల్లీ: రిపబ్లిక్ డే-2025 వేడుకలకు ముఖ్యఅతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో హాజరుకానున్నారు రిపబ్లిక్ డే పరేడ్‌లో ఇండోనేషియా బృందం పాల్గొనుంది. యుద్ధ వీరుల స్మారక స్తూపం వద్ద ప్రధాని మోదీ నివాళులు అర్పించనున్నారు. 300 మంది కళాకారులతో సారే జహాసే అచ్చా సాంస్కృతిక నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించనున్నారు. వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన 31 శకటాలను ప్రదర్శించనున్నారు.స్వర్ణీం భారత్ విరాసత్ ఔర్ వికాస్ అనే థీమ్‌తో శకటాల ప్రదర్శన నిర్వహించనున్నారు. 75 ఏళ్ల రాజ్యాంగానికి సంబంధించిన రెండు ప్రత్యేక శకటాలను రూపకల్పన చేశారు. కర్తవ్య పత్‌లో 11 నిమిషాల పాటు జయ జయ భారతం సాంస్కృతిక నృత్య ప్రదర్శన, ఈనెల 29న విజయ్ చౌక్‌లో బీటింగ్ రిట్రీట్, వివిధ బెటాలియన్లకు సంబంధించిన మ్యూజిక్ బ్యాండ్ ప్రదర్శన, భారతీయ మ్యూజిక్ బ్యాండ్‌ను బెటాలియన్లు ప్రదర్శించర్శించనున్నారు. -
47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన ట్రంప్
-
డొనాల్డ్ ట్రంప్ దూకుడు..తొలి రోజే సంచలన..!
-
ట్రంప్ కీలక నిర్ణయాలు.. తొలి ఉత్తర్వులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తొలి రోజునే పలు కీలక నిర్ణయాలకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. వాటిలో ముఖ్యమైనవి ఇలా..క్షమాపణలు: 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ భవనం మీద దాడి చేసిన కేసులో దోషులుగా తేలిన 1,600 మందికి క్షమాభిక్ష పెడుతూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.నేషనల్ ఎమర్జెన్సీ: మెక్సికో నుంచి అక్రమ వలసలను అడ్డుకునేందుకు అమెరికా దక్షిణ సరిహద్దుల్లో నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ప్రకటించారు.ఇంధన శక్తి: ట్రంప్ ఇంధన అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. శిలాజ ఇంధన డ్రిల్లింగ్‌ను విస్తరించి, బైడెన్ విధించిన ఎలక్ట్రిక్ వాహన ఆదేశాన్ని తొలగిస్తానని హామీ ఇచ్చారు.పారిస్ ఒప్పందం: పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అందుకు సంబంధించిన ఫైల్ మీద సంతకం చేశారు.ప్రభుత్వ నియామకాలు: కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయిలో పట్టు సాధించే వరకూ ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలను నిలిపివేస్తూ, ట్రంప్ మరో ఆర్డర్ జారీ చేశారు. అయితే సైన్యంతో పాటు కొన్ని విభాగాల్లో నియామకాలకు మినహాయింపు ఉంటుంది.విధులకు తిరిగి హాజరు: ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులంతా ఆఫీసుల్లో విధులకు ప్రత్యక్షంగా హాజరు కావాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని కోరారు.భావప్రకటన స్వేచ్చ: భావప్రకటన స్వేచ్చ పునరుద్ధరణకు సంబంధించి ఆదేశాలను ట్రంప్ జారీ చేశారు. దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛను ప్రోత్సహిస్తానని అన్నారు.బర్త్‌రైట్ సిటిజన్‌షిప్: అమెరికాలో పుట్టిన వారికి అమెరికా పౌరసత్వం వస్తుందనే 150 ఏళ్ల క్రితం నాటి రాజ్యాంగబద్దమైన హక్కు హాస్యాస్పదమైనదని, దీనిని తొలగిస్తానని ట్రంప్ చెప్పారు. -
ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి అంబానీ హాజరు
అమెరికా 47వ అధ్యక్షుడిగా మరికొన్ని గంటల్లో డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ వేడుకలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani), ఆయన సతీమణి రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ(Nita Ambani) హాజరయ్యారు. 2025 జనవరి 20న(భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి) వాషింగ్టన్ డీసీలో జరిగే కార్యక్రమంలో ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.ట్రంప్ కుటుంబంతో సుదీర్ఘ అనుబంధం ఉన్న అంబానీ దంపతులను ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ ఈవెంట్‌కు ఆహ్వానం అందుకున్న అతికొద్ది మంది ప్రపంచ ప్రముఖుల్లో అంబానీ దంపతులున్నారు. అంబానీ ఆధ్వర్యంలోని చాలా వ్యాపారాలు అమెరికాలోనూ ఉన్నాయి. దాంతోపాటు భారత్, యునైటెడ్ స్టేట్స్ మధ్య వ్యాపార, ఆర్థిక సహకార రంగాల్లో బలమైన సంబంధాలున్నాయి.ఇదీ చదవండి: ఇంటి అద్దె చెల్లిస్తున్నారా.. ప్లాన్ చేసుకోండి..ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు అంబానీ దంపతులు ట్రంప్‌తో దిగిన ఫొటో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈమేరకు జనవరి 19న ఏర్పాటు చేసిన క్యాండిల్ లైట్ డిన్నర్లో వీరు పాల్గొన్నారు. ఉపాధ్యక్షుడిగా ఎన్నివైన జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్‌తో ముచ్చటించారు. టెక్ దిగ్గజాలు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్ బర్గ్, బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్ సహా పలువురు అమెరికాకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
Kumbh Mela: ప్రముఖుల రాక.. మరిన్ని మార్గదర్శకాలు జారీ
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా అత్యంత వేడుకగా జరుగుతోంది. కోట్లాదిమంది భక్తులు, స్వామీజీలు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహాకుంభమేళాలో మరిన్ని సన్నాహాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు.కుంభమేళాకు రాబోయే రోజుల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు ప్రయాగ్‌రాజ్‌కు రానున్నారని, దీనితో పాటు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కూడా ఇక్కడే జరగనుందని సీఎం మీడియాకు తెలిపారు.రాబోయే గణతంత్ర దినోత్సవం, మౌని అమావాస్య, వసంత పంచమి సందర్భంగా మహాకుంభమేళా ప్రాంతంలో జనసమూహ నిర్వహణ, కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత మెరుగుపరచడపై సీఎం అధికారులకు మార్గనిర్దేశం చేశారు. మౌని అమావాస్య, వసంత పంచమి సందర్భంగా అమృత స్నానాల సమయంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. రద్దీ నిర్వహణ దృష్ట్యా, ఈ ప్రత్యేక రోజులలో పాంటూన్ వంతెనపై ట్రాఫిక్‌ను వన్-వేగా ఉంచాలని అధికారులకు తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌కు వచ్చిన సీఎం యోగి మహా కుంభ్ ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం అధికారులతో జరిగిన సమావేశంలో పలు మార్గదర్శకాలు జారీ చేశారు.ఇది కూడా చదవండి: Delhi Election 2025: కేజ్రీవాల్, ఆతిశీ సహా ‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్లు వీరే -
Republic Day 2025: జయమ్మ విజయం
‘మన దేశంలో పేదలు కలలు కనగలరు. వాటిని నిజం చేసుకోగలరు’ అనే మాట ఎన్నో సందర్భాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నోటి నుంచి వినిపించింది. పేదరాలైన జయమ్మ కల కన్నది. ‘నా కష్టాన్ని చూసి నలుగురు మెచ్చుకుంటే చాలు’ నలుగురు ఏం ఖర్మ... సాక్షాత్తూ రాష్ట్రపతిభవన్ ఆమె కష్టాన్ని గుర్తించింది.‘నీ భర్త ఏం పనిచేస్తాడు?’ అనే ప్రశ్నకు... జయమ్మ చెప్పిన జవాబుకు అవతలి వ్యక్తి ముఖం అదోలా మారిపోయేది. మాటల్లో చిన్న చూపు కనిపించేది.నెల్లూరుకు చెందిన జయమ్మ ఔట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికురాలు. దీంతోపాటు భర్తతో కలిసి సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ పనులు చేస్తుంది.‘చేయడానికి మీకు ఈ పనే దొరికిందా తల్లీ’ అని వెక్కిరించిన వాళ్లు ఎందరో! అయితే ఏ రోజూ చేస్తున్న పనిపట్ల నిర్లక్ష్యం, విముఖత జయమ్మలో కనిపించలేదు. ఆమె రెక్కల కష్టం వృథా పోలేదు. వృత్తి పట్ల జయమ్మ అంకితభావానికి గుర్తింపుగా దిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ఆహ్వానం అందింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇస్తున్న విందులో పాల్గొనబోతోంది జయమ్మ.‘పెద్దోళ్లకు అందరూ చుట్టాలే. పేదోళ్లకు కష్టాలే చుట్టాలు’ అంటుండేది జయమ్మ తల్లి రాజమ్మ.ఆ ఇంటికి కష్టాలు కొత్త కాదు. కష్టపడడం కొత్త కాదు. నెల్లూరు నగరంలోని ఉమ్మారెడ్డిగుంట ప్రాంతానికి చెందిన జయమ్మ తన తల్లిదండ్రులకు సాయంగా రోజువారీ కూలిపనులకు వెళ్తుండేది. ‘ఏ పనీ లేకుండా ఇంట్లో కూర్చోవడం కంటే పనికి పోవడమే నాకు ఇష్టం’ అంటున్న జయమ్మకు ‘శ్రమ’ అనేది చిన్నప్పటి నేస్తం.జయమ్మకు రమేష్‌తో వివాహం జరిగింది. రమేష్ మొదట్లో సెప్టిక్‌ట్యాంక్ వాహనానికి డ్రైవర్‌గా వెళ్తుండేవాడు. పదేళ్లపాటు డ్రైవర్‌గా పనిచేసిన అనుభవంతో తానే సొంతంగా ఓ సెప్టిక్ ట్యాంకర్ సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేసి క్లీనింగ్ పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ చేసేవాడు. ఇద్దరు పిల్లలు స్కూల్‌కి వెళ్లే వయస్సు వచ్చేవరకు గృహిణిగా ఉన్న జయమ్మ ఆ తరువాత భర్త చేసే సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ పనులకు తాను కూడా తోడుగా వెళ్తుండేది.చిన్నచూపు చూసినా..భూగర్భ డ్రైనేజీ పారిశుధ్య పనులకు వెళ్లే జయమ్మను తోటివారే చిన్నచూపు చూసేవారు. అవేమీ పట్టించుకోకుండా భర్తకు చేదోడువాదోడుగా ఉండేది. క్లీనింగ్ సమయాల్లో చర్మవ్యాధుల బారిన పడేది. ఈ దంపతుల కష్టాన్ని చూసిన ‘నవజీవన్ ’ అనే స్వచ్ఛంద సంస్థ నాలుగేళ్ల క్రితం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ షూరిటీతోపాటు ఎన్ ఎస్కేఎఫ్డీ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకు రుణం మంజూరు చేయించింది. రూ.10 లక్షల సబ్సిడీతో రూ.32 లక్షలు విలువైన కొత్త సెప్టిక్ ట్యాంకర్ క్లీనింగ్ వాహనాన్ని మంజూరు చేయించడంతో వారికి సొంతవాహనం సమకూరింది. దీంతో దంపతులిద్దరూ సొంత వాహనంతో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కార్పొరేషన్ అధికారుల సహకారంతో నగరంలోని ఎన్నో నివాసాల్లో సెప్టిక్‌ట్యాంక్ క్లీనింగ్ పనులు చేస్తున్నారు.అన్ని అంశాల్లో మంచి మార్కులుకేంద్ర ప్రభుత్వ ఎన్ ఎస్కేఎఫ్డీసీ (నేషనల్ సఫాయి కర్మచారీస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్) పథకం లబ్ధిదారు అయిన జయమ్మ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనానికి యజమాని అయింది. పథకాన్ని ఏ మేరకు సద్వినియోగం చేసుకున్నారు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా, సకాలంలో ఈఎంఐ కడుతున్నారా, లోడ్‌ను ఎక్కడంటే అక్కడ డంప్ చేస్తున్నారా లేక ప్రభుత్వం చూపిన పాయింట్లోనే డంప్ చేస్తున్నారా... ఇలాంటి అంశాలతో పాటు తగినవిధంగా జీవనోపాధి పొందుతున్నారా.. పోలీస్ స్టేషన్లో ఏమైనా కేసులు నమోదయ్యాయా... ఇలా ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు ఎన్ఎస్కేఎఫ్డీసీ అధికారులు. అన్నింట్లో మంచి మార్కులు రావడంతో జయమ్మ కృషికి గుర్తింపు లభించింది. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనడానికి రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం వచ్చింది.ఆ నమ్మకంతోనే...‘నమ్మిన పని ఎప్పుడూ మోసం చేయదు అనే మాట ఎన్నోసార్లు విన్నాను. ఆ నమ్మకంతోనే ఎంతమంది వెక్కిరించినా పట్టించుకోలేదు. మా ఆర్థిక స్థాయికి సెఫ్టిక్ ట్యాంకర్ క్లీనింగ్ బండికి సొంతదారులమవుతామని అనుకోలేదు. కష్టపడితే ఆ కష్టమే మనల్ని ముందుకు తీసుకువెళుతుంది’ అంటూ ఆత్మవిశ్వాసం నిండిన గొంతుతో అంటుంది జయమ్మ.జీవితంలో మర్చిపోలేని రోజుమేము చేసే వృత్తి తప్పుడు పనేం కాదు. మా రెక్కల కష్టాన్నే నమ్ముకుని పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. అందులోనే మాకు సంతృప్తి ఉంది. ఎవరేమి అనుకున్నా మేము ఎప్పుడూ బాధపడలేదు. నా భర్తకు తోడుగా సాయంగా వెళ్లి క్లీనింగ్ పనులు చేస్తున్నా. గణతంత్ర వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వాన పత్రిక రావడం జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఎంతో సంతోషంగా ఉంది.– జయమ్మ– చిలక మస్తాన్‌రెడ్డి సాక్షి ప్రతినిధి, నెల్లూరు -
ట్రంప్ ప్రమాణ స్వీకారం.. 40 ఏళ్లలో ఇదే తొలిసారి!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. శనివారం నుంచి నాలుగు రోజుల పాటు అట్టహాసంగా పలు కార్యక్రమాలు ప్రారంభం కానుండగా 40 ఎళ్ల తరువాత ట్రంప్ సంప్రదాయానికి భిన్నంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ట్రంప్ జనవరి 20న(సోమవారం) అమెరికా 47వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ప్రమాణస్వీకార కమిటీ ఏర్పాటు ముమ్మరం చేసింది. అయితే, తీవ్రమైన మంచుతోపాటు రక్తం గడ్డకట్టే పరిస్థితులు నెలకొనడంతో ప్రమాణ స్వీకారం అవుట్‌డోర్‌లో కాకుండా యుఎస్ క్యాపిటల్లోనే చేస్తున్నట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో ట్వీట్ చేశారు.తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో ‘ప్రమాణ స్వీకారం రోజైన సోమవారం నాడు వాషింగ్టన్లో విపరీతమైన చలి ఉంటుందని అంచనా. ఉష్ణోగ్రతలు కనిష్టంగా మైనస్ 12 డిగ్రీల సెల్సియస్ ఉండగా గరిష్టంగా మైనస్ 5 డిగ్రీల సెల్సియస్‌ను తాకే అవకాశం ఉంది. అందుకే నా ప్రారంభోత్సవ ప్రసంగం, అలాగే ఇతర ప్రసంగాలు అమెరికా క్యాపిటల్ భవనం రోటుండా లోపల జరుగుతాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గడ్డకట్టే ఉష్ణోగ్రతల మధ్య ప్రజలు ఇబ్బంది పడకూడదు. ఉష్ణోగ్రతలను తీవ్ర రికార్డు స్థాయికి చేరుకోనున్నాయి. వణికించే మంచు తుపానుతో ప్రజలు ఇబ్బది పడటం నాకు ఇష్టం లేదు’అని ట్రంప్ పేర్కొన్నారు. 1985లో మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా చలి తీవ్రత కారణంగా అమెరికా క్యాపిటల్ భవనం రోటుండా లోపలే చివరిసారిగా ప్రారంభోత్సవం జరిగిందని ట్రంప్ గుర్తు చేశారు.మాజీ అధ్యక్షులంతా హాజరు సోమవారం ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, కమలతో పాటు మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జి డబ్ల్యూ.బుష్, బరాక్ ఒబామా కూడా పాల్గొంటారు. వీరిలో ఒబామా మినహా మిగతా వారంతా సతీసమేతంగా వస్తున్నారు. పలువురు దేశాధినేతలు, వీవీఐపీలు, ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా తరఫున ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు.అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో పాటు ఐటీ, ఇతర దిగ్గజ సంస్థల అధినేతలు కూడా హాజరవుతున్నారు. ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ (ఫేస్బుక్), జెఫ్ బెజోస్ (అమెజాన్) రూపంలో ప్రపంచ కుబేరుల్లో ముగ్గురు వేదికపై కనిపించనుండటం విశేషం.ట్రంప్ హయాంలో అమెరికా టెక్ బిలియనీర్ల అడ్డగా మారనుందని బైడెన్ తాజాగా తన వీడ్కోలు సందేశంలో హెచ్చరించడం తెలిసిందే. -
రాష్ట్రపతి చేతుల మీదుగా ఖేల్‌రత్న, అర్జున అవార్డుల ప్రదానం (ఫొటోలు)
-
సౌత్ కొరియా అధ్యక్షుడు అరెస్ట్
-
ట్రంప్ ప్రకటన: గ్రీన్‌ల్యాండ్ రేటెంతో తెలుసా?
అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) డెన్మార్క్‌లోని గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇదే నిజమైతే.. గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందనే విషయాన్ని న్యూయార్క్ ఫెడ్లో రియల్ ఎస్టేట్ డెవలపర్ & మాజీ ఆర్థికవేత్త 'డేవిడ్ బార్కర్' (David Barker) ఓ అంచనా వేశారు.గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయాలంటే 12.5 బిలియన్ డాలర్ల నుంచి 77 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని బార్కర్ వెల్లడించారు. అంటే ఈ విలువ భారతీయ కరెన్సీ ప్రకారం.. రూ.1 లక్ష కోట్ల నుంచి రూ. 6.5 లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయాలనే ఆసక్తి ట్రంప్‌కు కొత్తేమీ కాదు. 2016లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది. అంతకు ముందు కూడా 1946లో ప్రెసిడెంట్ హ్యారీ ట్రూమాన్ ఈ భూభాగాన్ని 100 మిలియన్ డాలర్ల విలువైన బంగారానికి కొనుగోలు చేయాలని అనుకున్నారు. కానీ దీన్ని డెన్మార్క్ తిరస్కరించింది.ఇదీ చదవండి: పాకిస్తాన్లో భారీగా బంగారు నిక్షేపాలు: ఏకంగా అన్ని టన్నులా..అమెరికా విదేశీ భూభాగాలను కొనుగోలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఫ్రాన్స్ నుంచి లూసియానా, డెన్మార్క్ నుంచి వర్జిన్ ఐలాండ్స్, రష్యా నుంచి అలస్కా వంటి భూభాగాలను యూఎస్ఏ కొనుగోలు చేసింది. కాగా ఇప్పుడు గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోంది. గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయడం అనేది అంత సులభమైన పనేమీ కాదు. అంతే కాకుండా అక్కడి ప్రధాన మంత్రి 'మ్యూట్ బౌరప్ ఎగెడే' (Mute Bourup Egede).. ఈ ద్వీపం అమ్మకం కోసం కాదు.. ఎప్పటికీ అమ్మకానికి ఉండదని పేర్కొన్నారు.గ్రీన్ల్యాండ్గ్రీన్ల్యాండ్ అనేది అత్యంత సుందరమైన ఐలాండ్. ఇక్కడ అపారమైన ఖనిజ (రాగి, లిథియం) సంపద ఉంది. లిథియం అనేది ఎలక్ట్రిక్ వాహనాలలో, ఎలక్ట్రానిక్స్ వంటి వాటిలో విరివిగా ఉపయోగిస్తారు. ఇక్కడి ఖనిజ సంపద విలువ సుమారు రూ. 94 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఇలాంటి ద్వీపాన్ని అమెరికా సొంతం కొనుగోలు చేయడం బహుశా అసాధ్యమే. -
ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం, వేదిక ఖరారు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (donald trump) ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు షురూ అయ్యాయి. ప్రమాణ స్వీకార మహోత్సవానికి సంబంధిత విభాగం ఆయా దేశాలకు ఆహ్వానం పంపుతోంది. తాజాగా భారత్ (india)కు సైతం ఆహ్వానం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొనాలంటూ భారత్‌కు ఆహ్వానం అందింది. భారత్ తరుఫున కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (S Jaishankar) హాజరు కానున్నారు.గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ జనవరి 20న అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ‘ట్రంప్-వాన్స్ ప్రారంభోత్సవ కమిటీ ఆహ్వానం మేరకు, విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో భారత ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహిస్తారు.’ అని కేంద్రం వెల్లడించింది. అమెరికా పర్యటనలో ట్రంప్‌తో పాటు, ఇతర నేతలు, రాజకీయేతర ప్రముఖుల్ని సైతం కలవనున్నారు. క్యాపిటల్ భవనం ముందు అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ట్రంప్ ప్రసంగిస్తారు. ప్రమాణ స్వీకారానికి జో బైడెన్ హాజరుకానున్నారు. కాగా, 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన ట్రంప్.. జోబైడెన్ ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారు. ట్రంప్ ప్రారంభోత్సవ వేడుకకు పలువురు ప్రపంచ నేతలను ఆహ్వానించినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంగీకరించినట్లు సమాచారం 👉చదవండి : నా ఉరిశిక్షను రద్దు చేయండి.. కోర్టుకు ట్విన్ టవర్స్ దాడి మాస్టర్‌మైండ్ -
రాష్ట్రపతి మెచ్చిన మిట్టీ కేఫ్..దివ్యాంగులకు చేయూత
కంటోన్మెంట్: దివ్యాంగుల సాధికారత కోసం కృషి చేస్తున్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థ మిట్టీ కేఫ్ ఆధ్వర్యంలో బొల్లారం రాష్ట్రపతి నిలయం ఆవరణలో నూతన కెఫే ఏర్పడింది. పూర్తిగా దివ్యాంగుల ఆధ్వర్యంలో నిర్వహణ సాగే ఈ కెఫే ఏర్పాటుకు తెలంగాణ సోషల్ ఇంపాక్ట్/ గ్రూప్ సిఎస్ఆర్ వింగ్ చేయూతను అందిస్తుంది. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది సందర్భంగా ఈ మిట్టీ కేఫ్‌ను అధికారికంగా ప్రారంభించారు. మానసిక, శారీరక ఆరోగ్య వైకల్యం కలిగిన వారి సమస్యలను సమాజం దృష్టికి తెచి్చ, స్పందించేలా చేసేందుకు ఈ మిట్టీ కేఫ్‌లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్, సుప్రీం కోర్టు కాంప్లెక్స్‌తో పాటు పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన 47కి పైగా ప్రదేశాల్లో మీట్టీ కేఫ్‌లు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకురాలు స్వర్ణభ మిత్ర వివరించారు. ఏమిటీ మిట్టీ కేఫ్? ఈ కేఫ్‌లలో ప్రత్యేకంగా నెలకొల్పిన స్టాల్లో దివ్యాంగులు స్వయంగా రూపొందించిన గృహాలంకరణ పరికరాలు, పిల్లల ఆట వస్తువులు, నోటు పుస్తకాలు, పెన్నులు విక్రయిస్తున్నారు. సామాజిక దృక్పథంతో ఏర్పాటు చేస్తున్న మిట్టీ కేఫ్ ఆలోచనను గుర్తించి, వాటి నిర్వహణకు సీఎస్ఆర్ కింద పలు ప్రభుత్వరంగ, ప్రయివేటు, కార్పొరేట్ సంస్థలు, జాతీయ, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు ఆర్థికంగా సహకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కేఫ్‌లను పలువురు సెలిబ్రిటీలు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. దివ్యాంగులకు ఉపాధి.. నగరంలోని రాష్ట్రపతి నిలయం అధికారులు ఉచితంగా కేటాయించిన స్థలంలో మిట్టీ కేఫ్‌ను నెలకొల్పారు. ఇందులో 15 మంది మానసిక, శారీరక వైకల్యం కలిగిన వ్యక్తులు ఈ కేఫ్‌ను స్వయంగా నడుపుతున్నారు. వీరికి నెలకు రూ.15 వేల నుండి రూ.50 వేల వరకూ వేతనంగా అందుతుంది. ఆర్థిక స్వావలంబన, ఆత్మ గౌరవంతో జీవించేందుకు మిట్టీ కేఫ్ అండగా ఉంటున్నట్లు నిర్వాహకురాలు స్వాతి తెలిపారు. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ.. మిట్టీ కేఫ్‌లలో సమోసా, చాట్, పకోడీ, మసాలా టీ, బిస్కెట్లు, కాఫీ, మ్యాగీ, శాండ్ విచ్, పలు రకాల ఐస్‌క్రీమ్స్, ఇతర చిరుతిండ్లు స్వయంగా తయారు చేసి విక్రయిస్తున్నారు. వీటికి అవసరమైన పెట్టుబడి, నిర్వహణా ఖర్చులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆ్రస్టేలియా–న్యూజిలాండ్ బ్యాంకింగ్ గ్రూపులు భరిస్తున్నాయి. దీనికి తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ సిఎస్ఆర్ వింగ్ చొరవ తీసుకుని ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుపుతోంది. రూ. 36–46 లక్షలు టర్నోవర్ దిశగా కృషి చేస్తున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవల శీతాకాల విడిదికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మిట్టి కేఫ్‌ను సందర్శించారు. పలు వస్తువులు కొనుగోలు చేసి నిర్వాహకులను, ఉద్యోగులను అభినందించారు. -
దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్ట్ విఫలం
సియోల్: అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ (Yoon Suk Yeol) అరెస్టు విఫలమైంది. కోర్టు నుంచి అంగీకారపత్రంతో శుక్రవారం తెల్లవారుఝామునే కరప్షన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(CIO) అధికారులు సియోల్‌లోని అధ్యక్ష భవనానికి చేరుకున్నారు. అయితే అక్కడ వాళ్లకు చాలా సమయం అడ్డగింత ఎదురైంది. దీంతో చేసేది లేక అధ్యక్ష నివాసం నుంచి అధికారులు వెనుదిరిగారు. ఎమర్జెన్సీ మార్షల్ లా(Martial Law)ను ప్రకటించిన కేసులో విచారణకు సహకరించకపోవడంతో యూన్ సుక్ యోల్‌పై అరెస్టు వారెంటు జారీ అయింది. అయితే విచారణాధికారులు యూన్ నివాసంలోకి వెళ్లకుండా సైన్య బృందంతో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఒకానొక టైంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు.. అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీఐవో చీఫ్ ఓహ్ డోంగ్ వున్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే అన్నివైపులా ప్రతిఘటన ఎదురుకావడంతో సుమారు ఆరు గంటలపాటు హైడ్రామా నడిచింది. చివరకు.. సీఐవో అధికారులు అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది .ఇక.. మార్షల్ లా ప్రకటించిన కేసులో.. అధ్యక్ష భవనంలో సోదాలకు విచారణ అధికారులు ప్రయత్నించినప్పుడు కూడా ఇలాంటి ప్రతిఘటనే ఎదురైంది. అయినప్పటికీ అధికారులు పోలీసుల సాయంతో బలవంతంగా లోపలికి వెళ్లి తనిఖీలు జరిపారు. మరోవైపు ఈ కేసులో మూడుసార్లు విచారణకు పిలిచినా ఆయన హాజరుకాకపోవడంతో అధికారులు అరెస్ట్ వారెంట్ కోరుతూ కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం అంగీకరించింది. అదే జరిగితే దక్షిణ కొరియా చరిత్రలో అరెస్ట్ అయిన తొలి అధ్యక్షుడిగా నిలుస్తారు.అరెస్ట్ జరిగితే.. కోర్టు 6వ తేదీ వరకూ గడువిచ్చిందని, ఆలోపే యూన్‌ను అరెస్టు చేస్తామని సీఐవో మరోమారు స్పష్టం చేశారాయన. యూన్ గనుక అరెస్ట్ అయితే.. ఆయన్ని గవాచియాన్‌లోని సీఐవో కార్యాలయానికి తరలించే అవకాశం ఉంది. మార్షల్ లా విధింపు కేసులో అక్కడ ఆయన్ని విచారణ జరపనున్నారు. అరెస్ట్ వారెంట్ నేపథ్యంతో.. 48 గంటలపాటు ఆయన్ని అదుపులో ఉంచుకునే అధికారం సీఐవోకు ఉంటుంది. అయితే అటుపై కస్టడీ కోసం కోర్టును అభ్యర్థించాల్సి ఉంటుంది.విఫలయత్నాలే..దక్షిణ కొరియాలో ఇలాంటి పరిణామాలు కొత్తేం కాదు. 2000, 2004 సంవత్సరాల్లో చట్ట సభ్యులను అరెస్ట్ చేయాలని ప్రయత్నించారు. అయితే.. రెండు సందర్భాల్లోనూ అరెస్ట్ వారెంట్ గడువు ముగిసేదాకా(ఏడురోజులపాటు) వాళ్ల పార్టీ సభ్యులు, మద్దతుదారులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో అది సాధ్యపడలేదు. హైటెన్షన్సెంట్రల్ సియోల్‌లో ఎటు చూసిన భారీగా బలగాలు కనిపిస్తున్నాయి. యూన్‌ను అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో ఆయన అనుచరులు భారీగా అధ్యక్ష భవనం వద్దకు చేరి మోహరించారు. గురువారం యూన్ వ్యతిరేకులకు, మద్దతుదారులకు మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో భద్రతా బలగాలు కొందరిని అదుపులోకి తీసుకున్నాయి. మరోవైపు.. యూన్ మద్దతుదారులు అమెరికా జెండాలతో నినాదాలు చేస్తూ కనిపించడం కొసమెరుపు. యూన్ అరెస్ట్ నేపథ్యంలో.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2,700 మంది పోలీసులు మోహరింపజేసినట్లు సమాచారం.మార్షల్ లాతో చిక్కుల్లో..ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ.. యూన్ ఇటీవల ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ విధించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రతిపక్షాలు ‘మార్షల్ లా’ అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం తీసుకురాగా.. పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో యూన్ తన అధ్యక్ష అధికారాలు, విధులకు తాత్కాలికంగా దూరమయ్యారు. యూన్‌ను పదవి నుంచి తప్పించాలా, కొనసాగించాలా అన్న అంశాన్ని కోర్టు 180 రోజుల్లోగా తేల్చనుంది.మరోవైపు యూన్ మద్దతుదారులు సియోల్‌లోని ఆయన నివాసం ఎదుట భారీగా మోహరించారు. వారిని ఉద్దేశిస్తూ యూన్ మాట్లాడారు. తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించి దేశాన్ని ప్రమాదంలో పడేసేందుకు పనిచేస్తున్న శక్తులపై చివరివరకు పోరాడతానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. మరోవైపు యూన్‌ను అరెస్టు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన తరఫు న్యాయబృందం హెచ్చరించింది. ఇంకోవైపు.. దక్షిణ కొరియాను మరో ఉత్తర కొరియాగా మార్చేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఆయన అరెస్టును అడ్డుకుని తీరతామంటూ నివాసం ఎదుట భారీగా మోహరించారు. అభిశంసన ఇలా.. మార్షల్ లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్(జాతీయ అసెంబ్లీ)లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేయగా.. 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో ఆయన తన అధ్యక్ష అధికారాలను, విధులను ప్రధానమంత్రి హన్ డక్ సూకీకి అప్పగించాల్సి ఉంటుంది. తీర్మానప్రతులను రాజ్యాంగ న్యాయస్థానానికి పార్లమెంటు పంపుతుంది. యూన్‌ను తప్పించాలా, కొనసాగించాలా అన్న అంశాన్ని ఈ కోర్టు 180 రోజుల్లోపు తేలుస్తుంది. మరోవైపు యూన్ స్వచ్ఛందంగా దక్షిణ కొరియా అధ్యక్ష పదవి నుంచి వైదొలిగే యోచనలో ఉన్నట్లు ఆయన సీనియర్ సలహాదారులు, కార్యదర్శులు చెబుతున్నారు. చదవండి👉🏻: కరోనా ప్యాటర్న్‌లోనే.. చైనా నుంచి మరో వైరస్ -
ఉక్రెయిన్ ప్రజలకు జెలెన్స్కీ కీలక సందేశం
కీవ్:కొత్త ఏడాది సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దేశ ప్రజలకు కీలక సందేశమిచ్చారు. రాజధాని కీవ్ నుంచి ఆయన మాట్లాడారు. మూడు సంవత్సరాలుగా తమ దేశంపై కొనసాగుతున్న రష్యా దురాక్రమణను అడ్డుకుని తీరుతామన్నారు.‘శాంతి మాకు బహుమతిగా రాదని తెలుసు. అన్ని వనరులున్న రష్యాను అడ్డుకుని శాంతిని సాధించేందుకు ఈ ఏడాది గట్టిగా పోరాడతాం.అమెరికాకు కొత్తగా రానున్న అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్‌కు అన్ని విధాలా అండగా ఉంటారని ఆశిస్తున్నా. పుతిన్ దురాక్రమణను ఆయన ఆపుతారనడంలో నాకెలాంటి సందేహం లేదు’అని జెలెన్స్కీ అన్నారు.కాగా, రష్యాతో జరుగుతున్న యుద్ధంలో 2023తో పోలిస్తే 2024లో ఉక్రెయిన్ ఏడు రెట్ల భూభాగాన్ని నష్టపోయింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టాక ఉక్రెయిన్‌కు సహకారం తగ్గొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తమకు సహకరిస్తారని జెలెన్స్కీ వ్యాఖ్యానించడం గమనార్హం. -
యూన్‌కు అరెస్ట్ వారెంట్
సియోల్: దక్షిణ కొరియా రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు సియోల్‌లోని జిల్లా కోర్టు సోమవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆయన ఆఫీసు, నివాసాల్లో సోదాలు చేపట్టాలని ఆదేశించిందని అవినీతి నిరోధక విభాగం వెల్లడించింది.. అయితే, అధికారికంగా యూన్‌ను పదవి నుంచి తొలగిస్తేనే తప్ప ఆయన నివాసం, కార్యాలయంలో తనిఖీలు చేపట్టేందుకు అవకాశాలు చాలా తక్కువని నిపుణులు అంటున్నారు. యూన్ ఈ సమన్లను పట్టించుకోరని చెబుతున్నారు.ఇప్పటికే విచారణకు రావాలంటూ అందిన సమన్లను ఆయన పక్కనబెట్టేశారని, అధ్యక్షునికి ఉన్న రాజ్యాంగపరమైన రక్షణలను చూపుతూ భద్రతా సిబ్బంది ఇతర దర్యాప్తు అధికారులెవరినీ ఆయన నివాసంలోకి గానీ ఆఫీసులోకి గానీ రానివ్వడం లేదని సమాచారం. యూన్ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం తిరుగుబాటు కిందికి వస్తుందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు అవినీతి వ్యతిరేక విభాగం తెలపడాన్ని ఆయన లాయర్లు తప్పుబడుతున్నారు. ఈ విభాగం సోమవారం జారీ చేసిన సమన్లకు ఎలాంటి చట్టబద్ధతా లేదని కొట్టిపారేస్తున్నారు. అరెస్ట్‌కు యూన్ అంగీకరిస్తే తప్ప తామేమీ చేయలేమని అవినీతి నిరోధక విభాగం సైతం అంగీకరించింది. అప్పటి వరకు తమ తదుపరి కార్యాచరణ ఏమిటనేది ఇంకా నిర్ధారణ కాలేదని తెలిపింది.అయితే, విచారణకు సహకరించేలా ఆయనపై ఒత్తిడి తెచ్చేందుకు అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లుగా నిపుణులు చెబుతున్నారు. గతంలో, అవినీతి ఆరోపణలెదుర్కొన్న 2017లో మాజీ అధ్యక్షుడు పార్క్ గుయెన్ హే కూడా ఇదే విధంగా విచారణ అధికారులకు సహకరించలేదని గుర్తు చేస్తున్నారు. అవినీతి నిరోధక విభాగం తిరుగుబాటు ఆరోపణలను రుజువు చేయగలిగిన పక్షంలో యూన్‌కు మరణ శిక్ష లేదా జీవితకాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇతర నేరారోపణలైతే ఆయనకు అధ్యక్ష హోదా కారణంగా మినహాయింపులు వర్తిస్తాయి. తిరుగుబాటు, దేశద్రోహం వంటి ఆరోపణలు రుజువైతే మాత్రం అధ్యక్షుడికి ఎలాంటి రక్షణలు, మినహాయింపులు ఉండవు.మార్షల్ లా విధించిన ఆరోపణలపై ప్రతిపక్షం మెజారిటీ ఉన్న పార్లమెంట్ డిసెంబర్ 14వ తేదీన యూన్‌ను అభిశంసించింది. అయితే, ఉత్తర కొరియాకు ప్రతిపక్షం అనుకూలంగా మారిందని యూన్ ఆరోపిస్తున్నారు. బడ్జెట్ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ, తరచూ ఉన్నతస్థాయి నేతలపై అభిశంసన తీర్మానాలను ప్రవేశపెడుతూ అడ్డుతగులుతోందని ఆయన విమర్శిస్తున్నారు. ఇటువంటి దేశ వ్యతిరేక శక్తులను అదుపు చేసేందుకే మార్షల్ లా పెట్టినట్లు యూన్ వాదనలు వినిపిస్తున్నారు. యూన్ అభిశంసన సరైనదా కాదా అనే అంశంపై దేశ రాజ్యాంగ కోర్టు విచారణ జరుపుతోంది. -
ద.కొరియా అధ్యక్షుడికి కోర్టు షాక్
సియోల్:సౌత్‌కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు అక్కడి కోర్టు షాక్ ఇచ్చింది. ఎమర్జెన్సీ విధించిన కేసులో యోల్‌ను అరెస్టు చేసేందుకు వారెంట్ జారీ చేసింది. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు వారెంట్ జారీ చేయాల్సిందిగా దర్యాప్తు అధికారులు తాజాగా కోర్టును కోరారు.పోలీసుల విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది. దీంతో యోల్‌ను త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యోల్ డిసెంబర్3న దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించడం సంచలనం రేపింది. ప్రస్తుతం ఈ కేసులో అధ్యక్షుడిని పోలీసులు,రక్షణ మంత్రిత్వశాఖ,అవినీతి నిరోధక శాఖల అధికారులతో కూడిన సంయుక్త బృందం విచారిస్తోంది.ఇప్పటికే ఈ కేసులో మూడుసార్లు పిలిచినప్పటికీ యోల్ విచారణకు హాజరుకాకపోవడంతో పోలీసులు కోర్టును అరెస్ట్ వారెంట్ కోరారని సమాచారం. విచారణలో నేరం రుజువైతే ఆయనకు జీవిత ఖైదు లేదా మరణశిక్షవిధించే అవకాశం ఉంది. మరోవైపు దేశంలో మార్షల్‌లా విధించినందుకు ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి.తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేయగా 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో యోల్ తన అధ్యక్ష అధికారాలను, ప్రధానమంత్రికి అప్పగించాల్సి ఉంటుంది. తీర్మానం కాపీని పార్లమెంట్ రాజ్యాంగ కోర్టుకు పంపుతుంది. యోల్ భవితవ్యాన్ని రాజ్యాంగ కోర్టు 180 రోజుల్లోపు తేలుస్తుంది. -
త్వరలో ద.కొరియా అధ్యక్షుడి అరెస్టు..?
సియోల్:ఎమర్జెన్సీ వివాదం దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను వెంటాడుతోంది. ఇప్పటికే అభిశంసనను ఎదుర్కొంటున్న యోల్‌కు అరెస్టు ముప్పు పొంచి ఉంది. యోల్‌ను అదుపులోకి తీసుకునేందుకు అనుమతివ్వాలని పోలీసులు ఇప్పటికే కోర్టును కోరినట్లు సమాచారం.కోర్టు అంగీకరిస్తే త్వరలోనే యోల్‌ను అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. యోల్ ఇటీవల దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించడం వివాదాస్పదమైంది. ప్రస్తుతం ఈ కేసులో అధ్యక్షుడిని పోలీసులు,రక్షణ మంత్రిత్వశాఖ,అవినీతి నిరోధక శాఖల అధికారులతో కూడిన సంయుక్త బృందం విచారిస్తోంది. ఇప్పటికే మూడుసార్లు పిలిచినప్పటికీ యోల్ విచారణకు హాజరుకాకపోవడంతో పోలీసులు కోర్టును అరెస్ట్ వారెంట్ కోరారని సమాచారం. విచారణలో నేరం రుజువైతే ఆయనకు జీవిత ఖైదు లేదా మరణశిక్షవిధించే అవకాశం ఉంది. కాగా, ఇటీవల అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశంలో మార్షల్‌లా విధించినందుకు ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేయగా 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో యోల్ తన అధ్యక్ష అధికారాలను, ప్రధానమంత్రికి అప్పగించాల్సి ఉంటుంది. తీర్మానం కాపీని పార్లమెంట్ రాజ్యాంగ కోర్టుకు పంపుతుంది. యూన్ భవితవ్యాన్ని రాజ్యాంగ కోర్టు 180 రోజుల్లోపు తేలుస్తుంది.ఇదీ చదవండి: నెతన్యాహుకు శస్త్ర చికిత్స..డాక్టర్ల కీలక ప్రకటన -
20 ఏళ్లకే గ్రేడ్ వన్ అధికారిగా.. ఉత్కర్ష్ శుక్లా సక్సెస్ స్టోరీ
జీవితంపై కోటి ఆశలతో కలలుగనేవారు వాటిని సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమిస్తుంటారు. అలాంటివారే విజయాలను అందుకుంటారు. దీనిని పలువురు రుజువు చేశారు. ఆ కోవలోకే వస్తాడు యూపీలోని అమేథీకి చెందిన ఉత్కర్ష్ శుక్లా. ఒకనాడు తనకు చదువుకునే పరిస్థితి లేకపోయినా పట్టుదలతో అనుకున్నది సాధించి చూపాడు.యూపీలోని అమేథీలో గల రాజీవ్ గాంధీ పెట్రోలియం ఇనిస్టిట్యూట్‌లో ఉత్కర్ష్ శుక్లా బీటెక్ కోర్సు పూర్తి చేశాడు. చదువులో అత్యుత్తమ ప్రతిభ చూపినందుకు ఉత్కర్ష్ శుక్లా డిగ్రీతోపాటు రాష్ట్రపతి బంగారు పతకం కూడా అందుకున్నాడు. చిన్నప్పటి నుండి ఉత్కర్ష్‌కు చదువులో ఘన విజయం సాధించాలనే తపనతో ఉండేవాడు. ఉత్కర్ష్ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి.బీటెక్ పూర్తి చేసిన ఉత్కర్ష్ ప్రస్తుతం భారత్ పెట్రోలియం కార్పొరేట్ లిమిటెడ్‌లో గ్రేడ్ వన్ అధికారిగా ఎంపికయ్యారు. 20 ఏళ్ల వయసులో ఉత్కర్ష్ ఇంతటి గొప్ప విజయాన్ని సాధించాడు. ఉత్కర్ష్ మీడియాతో మాట్లాడుతూ తాను సాధించిన విజయం తనకు ఎంతో ఆనందమిస్తున్నదని చెబుతూ, తాను గతంలో ఎదుర్కొన్న అనుభవాలను తెలిపాడు. కరోనా సమయంలో పుస్తకాలు దొరక్క చదువుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని, పోటీ పరీక్షల ప్రపరేషన్కు అనేక ఆటంకాలు ఎదురయ్యాయని తెలిపాడు. అయితే పట్టువదలక పోటీ పరీక్షల్లో ఘన విజయం సాధించానని అన్నాడు. ఇది కూడా చదవండి: ఎంఏ చాయ్‌వాలా.. ఏటా లక్షల సంపాదన -
ఉ.కొరియా సైనికుల మృతి..జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు
కీవ్:రష్యా తరపున యుద్ధం చేసేందుకు వచ్చిన ఉత్తరకొరియా(NorthKorea) సైనికులపై ఉక్రెయిన్(Ukraine) అధ్యక్షుడు జెలెన్స్కీ మరోసారి స్పందించారు. ఉత్తర కొరియా సైనికులకు కనీస రక్షణ సౌకర్యాలు కల్పించకుండా రష్యా వారిని యుద్ధరంగంలోకి దించిందని జెలెన్స్కీ ఆరోపించారు. యుద్ధంలో పోరాడుతూ గాయపడిన కొందరు ఉత్తర కొరియా సైనికులను తమ సైన్యం బంధించిందని,అయితే ఆ తర్వాత వారు చనిపోయారని తెలిపారు.తీవ్రంగా గాయపడిన ఉత్తరకొరియా సైనికులను తాము కాపాడలేకపోయామని జెలెన్స్కీ చెప్పారు. ఉత్తర కొరియా సైనికుడొకరు ఉకక్రెయిన్కు బందీగా చిక్కారని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సంస్థ వెల్లడించిన కొద్ది సేపటికే జెలెన్స్కీ స్పందించడం గమనార్హం.ఎంత మంది ఉత్తరకొరియా సైనికులు తమకు చిక్కి చనిపోయారన్నది మాత్రం జెలెన్ స్కీ వెల్లడించలేదు. సౌత్ కొరియా ఇంటెలిజెన్స్ తెలిపిన దాని ప్రకారం దాదాపు వెయయ్యి మంది దాకా ఉత్తరకొరియా సైనికులు ఉక్రెయిన్ చేతిలో చనిపోయారని తెలుస్తోంది. మొత్తం 3వేల మంది దాకా ఉత్తరకొరియా సైనికులు తమతో యుద్ధంలో పాల్గొని మరణించారని జెలెన్స్కీ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. -
జర్మనీ పార్లమెంట్‌కు ఫిబ్రవరిలో ఎన్నికలు
ఫ్రాంక్ఫర్ట్: జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్–వాల్టర్ స్టెయిన్‌మెయిర్ శుక్రవారం పార్లమెంట్(బుండెస్టాగ్)ను రద్దు చేశారు. చాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్‌కు చెందిన మూడు పార్టీల సంకీర్ణ కూటమి నుంచి ఓ కీలక పార్టీ వైదొలగడంతో నవంబర్ 6న ప్రభుత్వం పడిపోయింది. నిబంధనలను అనుసరించి ఈ నెల 16న పార్లమెంట్లో బల పరీక్ష చేపట్టగా షోల్జ్ ఓటమి పాలయ్యారు. దీంతో, నిర్దేశించిన సమయానికి ఏడు నెలలు ముందుగానే ఫిబ్రవరి 23న ఎన్నికలు నిర్వహించే విషయంలో పార్లమెంట్‌లోని ప్రధాన పార్టీలు ఒక అంగీకారానికి వచ్చాయి. తాజాగా అధ్యక్షుడు పార్లమెంట్‌ను రద్దు చేయడంతో ఫిబ్రవరి 23న ఎన్నికలకు మార్గం ఏర్పడినట్లయింది. రాజ్యాంగ ప్రకారం పార్లమెంట్ రద్దయిన 60 రోజుల్లోగా ఎన్నికలు జరపాల్సి ఉంది.ఇదీ చదవండి: అంత ప్రమాదంలో బతికి బట్టకట్టాడు.. మరో వీడియో వైరల్ -
జార్జియా అధ్యక్షునిగా సాకర్ ఆటగాడు.. ఈయూ అంశం ఇక లేనట్లేనా?
టిబిలిసీ: జార్జియాను ఈయూ(యూరోపియన్ యూనియన్)లో కలపాలనే తీవ్ర నిరసనల నడుమ జార్జియా అధ్యక్షుడిగా మాజీ సాకర్ ఆటగాడు మైకేల్ కవెలాష్విలి)53) ఎంపికయ్యారు. 1990 ప్రాంతంలో ఇంగ్లిష్ సాకర్ టీమ్ మాంచెష్టర్ సిటీకి ప్రాతినిధ్యం వహించిన కవెలాష్విలి.. తాజాగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రష్యా చేతిలో పావుగా మారే అధికార పార్టీ ఈయూలో జార్జియాను కలపడానికి నిరాకరిస్తుందనే తీవ్ర నిరసనల అనంతరం ఆ దేశంలో చోటు చేసుకున్న కీలక పరిణామం ఇది.అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా కవెలాష్విలి ఒక్కరే అధ్యక్షుడిగా నామినేషన్ వేశారు. మొత్తం 300(ఎంపీలు- స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులు)మంది సభ్యులకు గాను 225 మంది సభ్యులు పార్లమెంట్‌కు హాజరయ్యారు. ఈ మేరకు 224 మంది కవెలాష్విలి అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పడానికి అనుకూలంగా ఓటేయడం విశేషం. దాంతో కవెలాష్విలి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లయ్యింది. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఎన్నికను నిర్వహిస్తుందని ఆరోపిస్తూ ఈ ఏడాది అక్టోబర్ నుంచి నాలుగు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు సైతం పార్లమెంట్‌ను బహిష్కరించడం కూడా కవెలాష్విలి ఏకగీవ్రంగా ఎన్నిక కావడానికి ఒక రకంగా దోహదం చేసింది.అయితే పశ్చిమ దేశాల ఆధిపత్యంపై ఎప్పుడూ తీవ్రస్థాయిలో మండిపడే కవెలాష్విలికి రాబోయే కాలం మరింత కఠినంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవైపు రష్యా అనుకూల శక్తులు, మరొకవైపై యూరోపియన్ యూనియన్ అనుకూల నిరసనకారుల నడుమ ఉద్రిక్త పరిస్థితులను కవెలాష్విలి ఏ విధంగా నియంత్రిస్తారో అనేది వేచి చూడాల్సిందేనని అంటున్నారు.నేను ఇక్కడే ఉన్నా.. !మాజీగా మారిన అధ్యక్షురాలు సలోమ్ జౌరాబిచివలి మాత్రం అధికారిక ఫలితాలను తిరస్కరించారు. పార్లమెంటు చట్టబద్ధతను గుర్తించడానికి నిరాకరించారు. ఈ ఎన్నికలను దేశాన్ని ఐరోపా నుంచి, రష్యా వైపు తీసుకెళ్లేందుకు జరిగిన ‘తిరుగుబాటు’గా అభివర్ణించారు. దేశ భవిష్యత్తుపై పాలకపక్షం యుద్ధం చేస్తోందని ఆరోపించారు. తాను ఇక్కడే ఉన్నానని, మళ్లీ వస్తాననని యూరోపియన్ యూనియన్ నిరసనకారులకు అనుకూలంగా ఉన్న ఆమె అంటున్నారు.అసలు ఏం జరిగింది..?యురోపియన్ యూనియన్‌లో జార్జియా చేరే అంశాన్ని నాలుగేళ్లపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రధాని ఇటీవల ప్రకటించడంతో.. దేశంలో ఆగ్రహం వెల్లువెత్తింది. ప్రతిపక్షాలు పార్లమెంటును బహిష్కరించాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు.ఈయూ, జార్జియన్ జెండాలను ప్రదర్శిస్తూ పార్లమెంట్ వెలుపల ర్యాలీ నిర్వహించారు. కూటమి సిఫార్సులను నెరవేర్చాలనే షరతుతో ఈయూ 2023 డిసెంబరులో జార్జియాకు అభ్యర్థి హోదాను ఇచ్చింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ‘విదేశీ ప్రభావ’చట్టాన్ని ఆమోదించిన తరువాత దాని విలీనాన్ని నిలిపివేసింది. ఆర్థిక మద్దతును కూడా తగ్గించింది. ఈ నేపథ్యంలో జార్జియాలో అక్టోబర్ 26న ఎన్నికలు జరిగాయి.వీటిని యురోపియన్ యూనియన్‌లో చేరాలన్న దేశ ఆకాంక్షలకు రెఫరెండంగా భావించారు. అధికార జార్జియన్ డ్రీమ్ పార్టీనే ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే జార్జియాను తన అదీనంలోనే ఉంచుకోవాలనే రష్యా ప్రభావంతో ఓటింగ్‌లో రిగ్గింగ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.డబ్బు ప్రవాహం, డబుల్ ఓటింగ్, హింసాత్మక వాతావరణంలో ఓటింగ్ జరిగిందని యూరోపియన్ ఎన్నికల పరిశీలకులు సైతం తెలిపారు. అంతకుముందు, జార్జియన్ పార్లమెంటరీ ఎన్నికలు నిష్పాక్షికంగా జరగలేదని యురోపియన్ పార్లమెంటు గత నెలలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది.దీనికి అధికార జార్జియన్ డ్రీమ్ పార్టీదే పూర్తి బాధ్యతని తెలిపింది. ఏడాదిలోగా పార్లమెంటరీ ఓటింగ్‌ను పునఃసమీక్షించాలని, జార్జియాపై ఆంక్షలు విధించాలని, ప్రభుత్వంతో అధికారిక సంబంధాలను పరిమితం చేయాలని సభ్యులు ఈయూకు పిలుపునిచ్చారు. ఈయూ ఆరోపణలను జార్జియా ఖండించింది. ఇది బ్లాక్మెయిల్ రాజకీయాలని, జార్జియాను శాసించే అధికారం ఎవ్వరికీ ఇవ్వబోమని ప్రధాని ప్రకటించారు. -
దక్షిణ కొరియా అధ్యక్షుని అభిశంసన
సియోల్: ఎమర్జెన్సీ ప్రకటించినందుకు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ పర్యవసానాన్ని అనుభవించారు. ఆయనపై విపక్షాలు ప్రవేశపెట్టిన రెండో అభిశంసన తీర్మానం శనివారం పార్లమెంటు అమోదం పొందింది. 300 మంది సభ్యుల్లో అభిశంసన తీర్మానం నెగ్గాలంటే 200 ఓట్లు రావాల్సి ఉండగా 204 మంది ఓటేశారు. 85 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. దాంతో యోల్ పదవీచ్యుతుడయ్యారు. ప్రధాని హాన్ డక్ సో తాత్కాలిక దేశాధినేతగా వ్యవహరించనున్నారు. యోల్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలా, పూర్తిగా తొలగించాలా అన్నది రాజ్యాంగ న్యాయస్థానం నిర్ణయిస్తుంది. ఇందుకు ఆర్నెల్లు పట్టవచ్చు. తొలగించే పక్షంలో 60 రోజుల్లో ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. పీపుల్ పవర్ పార్టీ సభ్యుల గైర్హాజరీతో గత శనివారం తొలి అభిశంసన తీర్మానం నుంచి ఆయన గట్టెక్కారు. ఈసారి మాత్రం ఆయన సొంత పార్టీ సభ్యుల్లో పలువురు అభిశంసన తీర్మానం ఆమోదం పొందడానికి సహకరించారు. ఇది దక్షిణ కొరియా ప్రజలకు, ప్రజాస్వామ్యానికి దక్కిన విజయమని విపక్ష డెమొక్రటిక్ పార్టీ ఫ్లోర్ లీడర్ పార్క్ చాన్ డే అన్నారు. ఫలితాలపై యోల్ స్పందించలేదు. పాలనపై కోల్పోతున్న పట్టును నిలుపుకునేందుకు ఆయన ఇటీవల అనూహ్యంగా ‘మార్షల్ లా’ ప్రకటించడం, గంటల్లోనే పార్లమెంటు దాన్ని ఎత్తేయడం తెలిసిందే. యోల్, ఆయన భార్య, కుటుంబీకులు, సన్నిహితులపై భారీ అవినీతి ఆరోపణలున్నాయి. తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ప్రధాని హాన్ డక్–సో సాంకేతిక నిపుణుడు. పారీ్టలకతీతంగా వైవిధ్యమైన కెరీర్ ఆయనది. పాలనాపరంగా విస్తృతమైన అనుభవముంది. ఐదుగురు వేర్వేరు అధ్యక్షుల ఆధ్వర్యంలో మూడు దశాబ్దాలకు పైగా నాయకత్వ పదవుల్లో పనిచేశారు. -
దక్షిణ కొరియాలో రోజురోజుకూ ముదురుతున్న సంక్షోభం
-
దక్షిణ కొరియాలో ట్విస్ట్.. అధ్యక్ష ఆఫీసులో పోలీసుల సోదాలు
సియోల్: దక్షిణ కొరియాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. దేశంలో ఎమర్జెన్సీ విధించడానికి సంబంధించిన విషయాలను సేకరించేందుకు పోలీసులు తనిఖీలు చేపట్టినట్టు కొరియన్ టైమ్స్ తెలిపింది.వివరాల ప్రకారం.. ఇటీవల దక్షిణ కొరియాలో అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. అనంతరం, దేశవ్యాప్తంగా రాజకీయ సంక్షోభం నెలకొంది. ఈ క్రమంలో ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్టు యూన్ మరో ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు యూన్‌పై దక్షిణ కొరియా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే అధ్యక్ష కార్యాలయంలో.. నేడు సియోల్ మెట్రోపాలిటన్ పోలీసులు, నేషనల్ అసెంబ్లీ పోలీస్ గార్డ్స్ సోదాలు చేశారు. అయితే, అధ్యక్ష కార్యాలయంపై పోలీసులు సోదాలు చేసిన సమయంలో యూన్ ఆఫీసులో లేరని కొరియన్ టైమ్స్ వెల్లడించింది.ఇక, అంతకుముందు.. అంతకుముందు డిసెంబర్ 9న దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించారు. ఆయనపై దర్యాప్తు ప్రారంభించినందుకు గానూ అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. మరోవైపు.. ఎమర్జెన్సీ ప్రకటనలో మాజీ రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్ పాత్ర ఉందనే ఆనుమానంతో ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చదవండి: ఐసిస్ ఉగ్రభూతం మళ్లీ విజృంభిస్తుందా?ఇక, మార్షల్ లా ప్రకటన నేపథ్యంలో అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, కిమ్ యోంగ్ హ్యూన్లను పదవుల నుంచి తప్పించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలోనే హ్యూన్‌ను పదవి నుంచి తప్పిస్తున్నట్లు దేశాధ్యక్షుడే ప్రకటించారు. ఆయన స్థానంలో చోయ్ బ్యూంగ్ హ్యూక్‌ను నియమించారు. South Korean police raided President Yoon Suk Yeol's office and police headquarters on Wednesday as part of an investigation into the brief imposition of martial law, the Yonhap news agency reported.Raids were also carried out at the offices of the Seoul Metropolitan Police. pic.twitter.com/G5yLytJWJy— VIVERO del bosque (@viverodelbosque) December 11, 2024 -
సిరియా అధ్యక్షుడి ఆచూకీ గల్లంతు.. రష్యా కీలక ప్రకటన
డమాస్కస్: సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ చెందారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో రష్యా కీలక ప్రకటన చేసింది. బషర్ అల్-అసద్ బ్రతికే ఉన్నారంటూ పరోక్షంగా వ్యాఖ్యానించింది. కానీ ఆయన జాడ గురించి ప్రస్తావించలేదు. ఆదివారం సిరియా దేశం మొత్తాన్ని రెబల్స్ పూర్తిగా ఆక్రమించారు. దీంతో బషర్ ఆల్-అసద్ అధ్యక్ష పదవిని రెబల్స్‌కు అప్పగించారు. కుటుంబ సభ్యులతో కలిసి విమానంలో పరారయ్యారు. ఆ విమానాన్ని రెబల్స్ కూల్చి వేశారని, కూల్చి వేతతో బషర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరణించినట్లు అంతర్జాతీయ కథనాలు వెలుగులోకి వచ్చాయి.అయితే, అనూహ్యంగా రష్యా కీలక ప్రకటన చేసింది. శాంతియుతంగా అధికారాన్నిఅప్పగించాలని రెబల్స్ ఆదేశాలు ఇవ్వడంతో బషర్ అల్ అసద్ తన పదవిని విడిచిపెట్టారని, ఆపై దేశం విడిచి వెళ్లినట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.కానీ, అసద్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో రష్యా చెప్పలేదు. దేశం వదిలే వెళ్లే సమయంలో జరిపిన చర్చలలో తాము పాల్గొనలేదని పేర్కొంది. మరోవైపు, సిరియాని రెబల్స్ స్వాధీనం చేసుకున్న పరిణామల నేపథ్యంలో రష్యా సైనిక స్థావరాలను హై అలర్ట్‌లో ఉంచామని, అయితే ప్రస్తుతానికి వాటికి ఎలాంటి తీవ్రమైన ముప్పు లేదని పేర్కొంది.అసద్‌కు అండగా రష్యాసిరియాలో 2015లో తిరుగుబాటు దళాలకు వ్యతిరేకంగా అసద్ ప్రభుత్వానికి రష్యా అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రత్యర్థి వర్గంపై పెద్దఎత్తున దాడులకు పాల్పడింది. బషర్ ఆల్-అసద్ పదవి విడిచి పెట్టిన అనంతరం జరుగుతున్న వరుస పరిణామలపై రష్యా గమనిస్తుంది. -
నన్ను క్షమించండి: సౌత్‌కొరియా అధ్యక్షుడు
సియోల్:దేశంలో ఎమర్జెన్సీ విధించినందుకు దక్షిణ కొరియా అధ్యక్షుడు పశ్చాత్తాపపడ్డారు. ‘తల వంచి అడుగుతున్నాను. నన్ను క్షమించండి..మరోసారి దేశంలో ఎమర్జెన్సీ విధించను’అని యూన్ సుక్ యోల్ దేశ ప్రజలను విజ్ఞప్తి చేశారు. మార్షల్ లా విధించి ప్రజల్లో భయాందోళనలు సృష్టించానని యోల్ తన తప్పు ఒప్పుకున్నారు.ప్రభుత్వ పెద్దగా ఉన్న బాధ్యతతోనే ఎమర్జెన్సీ విధించానని వివరణ ఇచ్చుకున్నారు. ఎమర్జెన్సీ విధించినందుకు న్యాయపరమైన విచారణ ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇక నుంచి దేశ భవిష్యత్తు, తన భవిష్యత్తు తన పార్టీ నిర్ణయానికి వదిలేస్తున్నాన్నారు. దేశాన్ని పాలన విషయాన్ని తనపార్టీ, ప్రభుత్వం చూసుకుంటాయని తెలిపారు. ఇలాంటి తప్పు మరోసారి చేయనని యోల్ స్పష్టం చేశారు. యోల్‌పై మోపిన అభిశంసన తీర్మానంపై శనివారం దక్షిణ కొరియా పార్లమెంట్లో ఓటింగ్ జరగనుంది. ఈ ఓటింగ్‌కు ముందు శనివారం(డిసెంబర్ 7) ఓ టెలివిజన్ ఛానల్లో ప్రసంగిస్తూ బహిరంగ క్షమాపణ కోరడం గమనార్హం. ఇదీ చదవండి: నియంతకు పరాభవం -
ఊరు కాదిది... నా కుటుంబం!
రాయ్‌రంగ్‌పూర్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉద్వేగభరితమయ్యారు. తను పుట్టిన ఒడిశా రాష్ట్రం మయూర్భంజ్ జిల్లా ఉపర్బేడ గ్రామాన్ని శుక్రవారం ఆమె సందర్శించి, అక్కడి గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్ చేశారు. ఉపర్బేడ గ్రామాన్ని కేవలం ఒక ప్రదేశంగా తానెన్నడూ భావించలేదని, అదొక కుటుంబమని తన మూలాలను గుర్తు చేసుకుంటూ ఉద్వేగంతో అన్నారు. బమన్ఘటి సబ్ డివిజన్లోని ఉపర్బేడలోని సంతాలి కుటుంబంలో ముర్ము 1958 జూన్ 20న జన్మించారు. 2022 జూలై భారత ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాక ఈ గ్రామానికి రావడం ఇదే మొదటిసారి. గ్రామానికి చేరుకున్న వెంటనే ఆమె తను చదువుకున్న ఉపర్బేడ అప్పర్ ప్రైమరీ స్కూలుకు వెళ్లారు. రాష్ట్రపతి రాకను పురస్కరించుకుని ఆ పాఠశాలతోపాటు యావత్తు గ్రామాన్ని అందంగా మార్చారు. గ్రామస్తులు, స్కూలు టీచర్లు, విద్యార్థులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. తను పుట్టిన ఇంటికి వెళ్లే దారిలో సంతాలి మహిళలు ఆమెకు గిరిజన సంప్రదాయ వస్త్రధారణతో జానపద నృత్యం చేస్తూ పాటలు పాడుతూ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ముర్ము కూడా వారితో కాలు కదిపారు. గ్రామ దేవతకు పూజలు చేశారు. నేనిప్పటికీ ఇక్కడి విద్యార్థినే...స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ముర్ము విద్యార్థులతో ముచ్చటించారు. ‘‘నాకిప్పుడు 66 ఏళ్లు. అయినా మా స్కూల్లో చిన్న విద్యార్థిననే అనుకుంటున్నా. అప్పట్లో మట్టిగోడలుండేవి. మా ఏడో తరగతిలో ఉండగా స్కాలర్షిప్ పరీక్ష కోసం మదన్ మోహన్ సార్ వాళ్లింటికి తీసుకెళ్లారు. తన సొంత పిల్లలతోపాటు నన్ను కూడా పరీక్షకు ప్రిపేర్ చేశారు. ఈ గ్రామం, ఈ స్కూలు నాకు అందించిన అభిమానం మరువలేనిది’’ అంటూ ఉప్పొంగిపోయారు. తోటి వాళ్లు, ఉపాధ్యాయులు కూడా బయటి వ్యక్తిగా కాక, తనను సొంత కుటుంబసభ్యురాలిగా చూసుకునేవారన్నారు. ‘ఆ రోజుల్లో లాంతరు వెలుగులో చదువుకునేదాన్ని. ఆ లాంతరు గ్లాస్ పగిలిపోయి ఉండేది. చదువుకోవడానికి ఇబ్బందయ్యేది. సిరా పెన్నుతో రాయడం కష్టంగా ఉండేది. ఇంకుతో బట్టలు పాడయ్యేవి’’ అని గుర్తు చేసుకున్నారు. గురువులకు వందనం తనకు విద్య నేర్పిన గురువులను రాష్ట్రపతి ఘనంగా సన్మానించారు. స్కూల్ హెడ్మాస్టర్ బిశేశ్వర్ మహంత, క్లాస్ టీచర్ బాసుదేశ్ బెహెరె, 4, 5 తరగతుల్లో ఉండగా క్లాస్‌టీచర్ బసంత కుమార్ గిరిలను సన్మానించారు. ఉపర్బేడ అప్పర్ ప్రైమరీ స్కూల్లోని సుమారు 200 మందికి స్కూల్ బ్యాగులు, చాకెట్లు, టిఫిన్ బాక్సులు అందజేశారు. కష్టపడి చదువుకుని, ఉన్నతస్థానాలకు ఎదగాలని వారిని కోరారు. -
నౌకా నిర్మాణంలోనూ ఆత్మనిర్భర్
పూరీ: నౌకల తయారీలో 2047కల్లా ఆత్మ నిర్భరత సాధించడంపై నావికాదళం దృష్టి పెట్టాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు. నేవీ డే సందర్భంగా బుధవారం ఒడిశాలోని పూరీ సాగర తీరంలో జరిగిన వేడుకల్లో త్రివిధదళాధిపతి హోదాలో ఆమె పాల్గొన్నారు. మహిళా సాధికారతకు నేవీ తన వంతు కృషి చేస్తోందని ప్రశంసించారు. ‘‘ఐదు వేల ఏళ్ల పై చిలుకు ఘన చరిత్ర భారత నావికా రంగం సొంతం. దేశంలో తొలి మహిళా అగ్నివీర్లు నేవీలోనే చేరారు’’ అన్నారు. 15 యుద్ధనౌకలు, 37 వాయుసేన విమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఐఎన్ఎస్ జల్సా, మిసైల్, డి్రస్టాయర్ ఐఎన్ఎస్ ఢిల్లీ, ఐఎన్ఎస్ శక్తి, ఐఎన్ఎస్ సూర్య, ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ సతొపురా వంటి ప్రముఖ యుద్ధనౌకలతో పాటు జలాంతర్గాములూ ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. హాక్, సీ–కింగ్, మిగ్29కే వంటి యుద్ధవిమానాలు, చేతక్, ఎంఎస్ 60 హెలికాప్టర్లు, హాక్ విమానాల విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
దక్షిణ కొరియాలో బిగ్ ట్విస్ట్.. ఎమర్జెన్సీ ఉపసంహరణ
సియోల్: దక్షిణ కొరియాలో రాజకీయంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎమర్జెన్సీ విధించిన కొన్ని గంటల్లో దాన్ని ఉపసంహరించుకున్నట్టు మరో ప్రకటన చేశారు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్. దీంతో, ఎమర్జెన్సీ ప్రకటించిన ఆరు గంట్లలోనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.స్థానిక కాలమానం ప్రకారం తెల్లావారుజామున 4:30 గంటలను అధ్యక్షుడు యూన్ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘అత్యవసర పరిస్థితిని ఎత్తివేయాలని జాతీయ అసెంబ్లీ నుండి డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాము. మార్షల్ లా కార్యకలాపాల కోసం జాతీయ అసెంబ్లీ అభ్యర్థనను అంగీకరిస్తాము. కేబినెట్ సమావేశం ద్వారా ఎమర్జెన్సీని ఎత్తివేస్తాము అని ప్రకటించారు.South Korean President Yoon Suk Yeol said he will rescind his martial law decree, giving in to the parliament’s opposition just hours after his dramatic move imposing it that shook markets and surprised other world leaders.Listen to the story or get the full story in the 1st… pic.twitter.com/aKAvMczxqD— Bangkok Post (@BangkokPostNews) December 4, 2024అంతకుముందు.. అధ్యక్షుడి నిర్ణయాన్ని ఖండిస్తూ జాతీయ అసెంబ్లీ అర్ధరాత్రి సెషన్లో దక్షిణ కొరియా ఎంపీలు మార్షల్ లా విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా ఓటు వేశారు. 300 మంది చట్ట సభ్యుల్లో అధికార, ప్రతిపక్ష నేతలు 190 మంది ఎమర్జెన్సీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దీంతో, నాటకీయ పరిణామాల మధ్య ఎమర్జెన్సీని ఉపసంహరించుకుంటున్నట్టు అధ్యక్షుడు తెలిపారు. ఈ క్రమంలో, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే అభిశంసనను ఎదుర్కోవాలని డెమోక్రటిక్ పార్టీ సవాల్ చేసింది. మరోవైపు.. దక్షిణ కొరియాలో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్నామని పేర్కొన్న అమెరికా పేర్కొంది. ఎమర్జెన్సీ విధించిన అనంతరం.. దకక్షిణ కొరియాలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రతిపక్ష నేతలను ఆర్మీ.. అరెస్ట్ ప్రయత్నం చేసింది. దీంతో, తీవ్ర ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది. ఇక, దాదాపు ఐదు దశాబ్దాలలో దక్షిణ కొరియా ఎమర్జన్సీని విధించడం ఇదే మొదటిసారి. కొరియాలో చివరిసారిగా 1980లో ఎమర్జెన్సీ లాను ప్రయోగించారు.🚨BREAKING - The moment South Korean Special Forces stormed the interior of the Parliament building pic.twitter.com/EhGEu2xzPW— Gabriela Iglesias🇺🇲 (@iglesias_gabby) December 4, 2024 ఇదిలా ఉండగా.. మంగళవారం సాయంత్రం దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. దేశంలో సైనిక పాలన విధిస్తూ ప్రకటన చేశారు. టీవీ చానెల్ ద్వారా ఈ ప్రకటన చేసిన యూన్.. ఉత్తర కొరియా దాడుల భయం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఈ క్రమంలో ఆయన ప్రతిపక్షాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిపక్షాలు దేశానికి ద్రోహం చేశాయి. ఉత్తర కొరియాతో అవి చేతులు కలిపాయి. ఆ దేశం కోసమే పని చేస్తున్నాయవి. గత కొంతకాలంగా పార్లమెంట్‌ను విపక్షాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. తమ కుట్రలో భాగంగానే ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. వాటిని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నాం. దేశ భద్రత కోసమే అత్యవసర సైనిక పాలన నిర్ణయం అని ప్రకటించారు.SHOCK VIDEO: South Korean Army Blocks National Assembly After Martial Law Declared By Yoon Suk Yeol pic.twitter.com/4krlonyiQ9— Alex Dickerson (@wangzai266687) December 4, 2024పార్లమెంట్ వద్ద ఉద్రిక్తతసైనిక పాలన విధింపు ప్రకటనను వ్యతిరేకిస్తూ చట్ట సభ్యులు, భారీ ఎత్తున జనం పార్లమెంట్ వద్ద గుమిగూడారు. వాళ్లను లోపలికి వెళ్లనివ్వకుండా భద్రతా బలగాలు అడ్డుకుంటున్నాయి. 2022లో పీపుల్ పవర్ పార్టీ తరఫున యూన్ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి ప్రతిపక్షాల వైఖరితో ఆయన ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా వచ్చే ఏడాది కోసం బడ్జెట్ రూపకల్పన విషయంలో ప్రధాన ప్రతిపక్షం డెమోక్రటిక్ పార్టీని ఏకతాటిపైకి తెచ్చుకోలేకపోతున్నారు. ఇంకోవైపు.. అధ్యక్షుడి భార్య, ఆయన పేషీలో ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వాటిపై విచారణకు ప్రతిపక్షాలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నాయి. -
కుమారుడు హంటర్‌కు దేశాధ్యక్షుడి హోదాలో క్షమాభిక్ష పెట్టిన జో బైడెన్. విమర్శించిన డొనాల్డ్ ట్రంప్
-
రాష్ట్రపతి ముర్మును అవమానించిన రాహుల్.. బీజేపీ ఆరోపణలు
న్యూఢిల్లీ: రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అగౌరవపరిచారని బీజేపీ ఆరోపించింది. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్లో జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి ముర్ముకు శుభాకాంక్షలు చెప్పకుండా ఆమెను అవమానపరిచారని ఆరోపించింది. జాతీయ గీతం సమయంలో కూడా రాహుల్ పరధ్యానంలో ఉన్నారని మండిపడింది. ఈమేరకు సోషల్ మీడియాలో వరుస వీడియోలను షేర్ చేసింది.పాత పార్లమెంట్ భవనంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అందులో భాగంగా స్మారక నాణెం, స్టాంపులను రాష్ట్రపతి విడుదల చేశారు. అనంతరం స్టేజీపై ప్రధాని మోడీ, స్పీకర్ ఓం బిర్లా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు. राहुल गांधी को इतना घमंड है कि राष्ट्रपति जी का अभिवादन तक नहीं किया। सिर्फ इसलिए क्योंकि वो जनजातीय समाज से आती हैं, महिला हैं और राहुल गांधी कांग्रेस के राजकुमार? कैसी घटिया मानसिकता है ये? pic.twitter.com/shtP5s2dxs— Amit Malviya (@amitmalviya) November 26, 2024అయితే అక్కడే ఉన్న రాహుల్ గాంధీ మాత్రం రాష్ట్రపతి ముర్ముకు శుభాకాంక్షలు చెప్పకుండా వేదికపై నుంచి వెళ్లిపోయాడని ఎక్స్ వేదికగా బీజేపీ నేత అమిత్ మాల్వీయ విమర్శించారు. జాతీయ గీతం ప్లే అవుతున్న సమయంలో అందరూ ముందుకు చూస్తే.. రాహుల్ మాత్రం పక్కకు, కిందకు చూస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రపతి, ఇతర నాయకులు నిలబడి ఉండగానే గాంధీ కూర్చోవడానికి ప్రయత్నించారని విమర్శించారుCongress always disrespects President Smt Droupadi Murmu ji, because she is the first Tribal woman to occupy the highest office of the land. Rahul Gandhi and family despise SC, ST and OBCs. It shows. pic.twitter.com/CR3v8pAioL— Amit Malviya (@amitmalviya) November 26, 2024‘రాహుల్ గాంధీ తన దృష్టిని 50 సెకన్లు కూడా కేంద్రీకరించలేరు. కానీ యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిపై పూర్తిగా అసహ్యకరమైన వ్యాఖ్య చేసే ధైర్యం అతనికి ఉంది. జాతీయ గీతం ముగియగానే, వేదికపై ఉన్న రాహుల్ గాంధీ దిగిపోవడానికి ప్రయత్నిచారు. రాహుల్ ద్రౌపది ముర్మును ఎప్పుడూ అగౌరపరుస్తుంటారు. ఎందుకంటే ఆమె దేశ అత్యున్నత పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళ కాబట్టి. రాహుల్, గాంధీ కుటుంబం.. ఎస్సీ, ఎస్టీ,ఓబీలపై ప్రేమలేదు’ అని విమర్శలు గుప్పించారు.Rahul Gandhi can’t hold his attention for even 50 seconds and he had the audacity to make an absolutely distasteful comment on the President of United States. pic.twitter.com/TAesrKmrmS— Amit Malviya (@amitmalviya) November 26, 2024 అయితే ఈ వీడియోలపై పలువురు స్పందిస్తూ.. రాష్ట్రపతి పట్ల రాహుల్ అహంకారం ప్రదర్శించారని, మహారాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి తరువాత రాహుల్ నిరాశలో కూరుకుపోయారని, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. అయితే బీజేపీ ఆరోపణలపై రాహుల్ గాంధీ కానీ, ఇతర కాంగ్రెస్ నేతలు కానీ స్పందించలేదు. -
హైదరాబాద్ లో రాష్ట్రపతి
-
నాకు తెలుసు.. మీరు చాలా ఫేమస్: జైశంకర్‌తో ఇండోనేషియా అధ్యక్షుడు
బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో G20 శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకరర్‌పై ప్రశంసలు కురిపించారు. భారత్, ఇండోనేషియా మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఈ దృశ్యం చోటుచేసుకుంది.ఇండోనేషియా క్షుడు జైశంకర్ తనను తాను పరిచేయం చేసుకున్నారు. ఈ క్రమంలో సుబియాంటో కరచాలనం చేస్తూ ‘నువ్వు నాకు తెలుసు, నువ్వు చాలా ఫేమస్’ అంటూ పేర్కొన్నారు. దీంతో అక్కడున్న మోదీ వారి వైపు చూస్తూ చిరునవ్వులు చిందించారు. మరోవైపు ఇండోనేషియా అధ్యక్షుడితో జరిగిన భేటీలో ప్రధాని మోదీ వాణిజ్యం, వాణిజ్యం, ఆరోగ్యం, భద్రత వంటి రంగాల్లో సహకారంపై చర్చించారు. ఇండోనేషియా అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంటో ఎన్నికైన తర్వాత ఇరువురు నేతలు భేటీ కావడం ఇదే తొలిసారి."I know you, you are very famous", Indonesia Prez Prabowo tells EAM Dr S Jaishankar after the latter introduces himself. Location : Ahead of PM Modi, Indonesia Prez Prabowo bilateral at Brazil G20 summit Vdo Source: Indonesia Govt pic.twitter.com/fqXb3ZeA86— Sidhant Sibal (@sidhant) November 19, 2024కాగా మంగళవారం జరిగిన జీ 20 సదస్సులో భాగంగా చైనా విదేశాంగమంత్రి మంత్రి వాంగ్ యితో జైశంకర్ చర్చలు జరిపారు. భారత్, చైనా మధ్య నేరుగా విమానాలు నడపాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. కైలాష్ మానస్ సరోవర్ యాత్రను కూడా..తిరిగి ప్రారంభించాలని ఇరుదేశాల ప్రతిపాదించాయి. తూర్పు లద్దాఖ్‌లోని డెమ్చోక్ సెక్టార్లో భారత బలగాల పెట్రోలింగ్ ప్రారంభం తర్వాత రెండు దేశాల మధ్య జరిగిన మొదటి ఉన్నత స్థాయి సమావేశం. -
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షునిగా గడప రమేష్ బాబు ఎన్నిక
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) (TCSS) అధ్యక్షుడిగా వరుసగా రెండోసారి గడపా రమేష్ బాబు ఎంపికయ్యారు. నవంబర్ 17వ తేదీన జరిగిన పదకొండో వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. సభ ప్రారంభంలో సభ్యులందరు గోనె నరేందర్ రెడ్డి సొసైటీకి చేసిన సేవలను స్మరించుకుని నివాళులు అర్పించారు. అనంతరం 2023-2024 ఆర్థిక సంవత్సరపు రాబడి ఖర్చు వివరాలకు సభ ఆమోదం తెలిపింది.2023-2024 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లు గార్లపాటి లక్ష్మా రెడ్డి, బండారు శ్రీధర్‌కు సభ్యులు కృతజ్ణతలు తెలిపారు. అలాగే రెండోసారి అధ్యక్షుడిగా నామినేషన్ వేసిన గడప రమేశ్ బాబు, ఆయన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రతిపాదించడంతో పాటు నామినేషన్ గడువులోగా ఒకే టీమ్ నుండి నామినేషన్ రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల అధికారి దోర్నాల చంద్ర శేఖర్ ప్రకటించారు. తనకు రెండోసారి సేవచేసే అవకాశం ఇచ్చినందుకు గడప రమేష్ అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. నూతన కార్యవర్గం సహకారంతో సొసైటీని అభివృద్ధి చేయడానికి మరింత కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా కార్య, కార్యనిర్వాహక వర్గ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. దీనితో పాటు 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా కిరణ్ కైలాసపు , తెల్లదేవరపల్లి వెంకట కిషన్ రావును కొత్త ఆడిటర్లుగా ఎన్నుకున్నారు.ఈ సమావేశంలో ముఖ్యమైన మార్పులు గత 8 సంవత్సరాలుగా ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించిన బసిక ప్రశాంత్ కుమార్ ఈ సారి ఉపాధ్యక్షులుగా, ప్రాంతీయ కార్యదర్శులుగా సేవలు అందించిన బొందుగుల రాము, నంగునూరు వెంకట రమణ ఈ సారి ప్రధాన కార్యదర్శి మరియు కోశాధికారిగా, కోశాధికారిగా సేవలు అందించిన జూలూరి సంతోష్ కుమార్ ఈ సారి ఉపాధ్యక్షులుగా సేవలు అందించబోతున్నారు. దీంతో నూతన కార్యవర్గం మరియు కార్యనిర్వాహక వర్గంలో అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి నంగునూరి వెంకట రమణ, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త, బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, దుర్గ ప్రసాద్ ఎం, మిర్యాల సునీత రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శులు, శశిధర్ రెడ్డి, బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, సంతోష్ వర్మ మాదారపు మరియు రవి కృష్ణ విజ్జాపూర్ మరియు కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్, శివ ప్రసాద్ ఆవుల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రవి చైతణ్య మైసా, చల్లా క్రిష్ణ మరియు సుగుణాకర్ రెడ్డి మొదలగు వారు ఉన్నట్టు తెలిపారు. సొసైటీ వెన్నంటే ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న కార్యవర్గ సభ్యులు గర్రెపల్లి కస్తూరి శ్రీనివాస్, శ్రీధర్ కొల్లూరి, గింజల సురేందర్ రెడ్డి, ఆరూరి కవిత సంతోష్ రెడ్డి, నగమడ్ల దీప, కిరణ్ కుమార్ వీరమల్లు & రంగా పట్నాల గార్లకు కృతజ్ఞతలు తెలిపారు. -
ట్రంప్‌నకు పాలస్తీనా అధ్యక్షుడి ఫోన్.. ‘గాజాలో శాంతి కోసం రెడీ’
అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ శుక్రవారం యూఎస్‌కు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా గాజాలో న్యాయమైన, సమగ్రమైన శాంతి కోసం పని చేయడానికి సంసిద్ధతను ట్రంప్‌నకు తెలియజేసినట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఘన విజయానకి అబ్బాస్ అభినందనలు తెలియజేశారు.‘‘అంతర్జాతీయ చట్టాల ఆధారంగా న్యాయమైన, సమగ్రమైన శాంతిని సాధించేందుకు ట్రంప్‌తో కలిసి పని చేసేందుకు పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ సంసిద్ధతను వ్యక్తం చేశారు. గాజా ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి ప్రపంచంలోని సంబంధిత పార్టీలతో కలిసి పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నామని అబ్బాస్ ట్రంప్‌నకు తెలిపారు. దీంతో గాజాలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు కృషి చేస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. గాజాలో యుద్ధాన్ని ఆపేందుకు కృషి చేస్తానని ట్రంప్ తెలిపారు’’ అని పాలస్తీనా అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. అయితే ట్రంప్ తన ప్రచారం సమయంలో గాజాలో యుద్ధం ముగించడానికి కృషి చేస్తానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.గత ఏడాది అక్టోబర్ 7 నుంచి గాజాలో హమాస్, ఇజ్రాయెల్ బలగాల మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో 43,500 మంది గాజా ప్రజలు మృతిచెందినట్లు అధికారులు పేర్కొంటున్నారు.వేల మంది ప్రజలు గాజా నుంచి ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. -
షావోమి ఇండియా ప్రెసిడెంట్ మురళీకృష్ణన్ రాజీనామా
షావోమి ఇండియా ప్రెసిడెంట్.. బీ మురళీకృష్ణన్ ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఆరు సంవత్సరాలు కంపెనీలో పనిచేసిన మురళీకృష్ణన్ అకడమిక్ రీసెర్చ్ వైపు వెళ్తున్న కారణంగా షావోమికి రాజీనామా చేసినట్లు సమాచారం.షియోమీ ఇండియా అధ్యక్షుడిగా తన పదవికి రాజీనామా చేసినప్పటికీ.. స్వతంత్ర వ్యూహాత్మక సలహాదారుగా కొనసాగుతారని సంస్థ వెల్లడించింది. 2018లో షావోమి ఇండియాలో అడుగుపెట్టిన మురళీకృష్ణన్ 2022లో కంపెనీ ఇండియా ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించారు. అంతకంటే ముందు ఈయన సంస్థలో కీలక పదవులను చేపట్టారు.ఇదీ చదవండి: శుభవార్త.. మరోమారు తగ్గిన బంగారం, వెండి ధరలుఇటీవలే పది సంవత్సరాల వార్షికోత్సవాన్ని షావోమి ఇండియా పూర్తి చేసుకుంది. 2023లో మను కుమార్ జైన్ కంపెనీని వీడిన తరువాత.. సంస్థ నుంచి వెళ్తున్న వారిలో మురళీకృష్ణన్ రెండో వ్యక్తి. అయితే మురళీకృష్ణన్ స్థానంలోకి ఎవరు వస్తారనే విషయాన్ని కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతం కంపెనీ సీఓఓగా సుధీన్ మాథుర్, సీఎఫ్ఓగా సమీర్ రావు, సీపీఓగా వరుణ్ మదన్, సీఎమ్ఓగా అనుజ్ శర్మ ఉన్నారు. -
గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు
న్యూఢిల్లీ: భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు విదేశీ ప్రముఖులను అతిథులుగా ఆహ్వానించే సంప్రదాయం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. దీనిలో భాగంగా 2025 జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోను ఆహ్వానించనున్నారని సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.సుబియాంటో భారతదేశం-ఇండోనేషియా సంబంధాలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. భారత్‌కు చెందిన బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలు చేయడంతోపాటు పలు రక్షణ ఒప్పందాలపై ఆయన దృష్టి సారిస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒప్పందం ఖరారైతే ఫిలిప్పీన్స్ తర్వాత భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసిన రెండో దేశంగా ఇండోనేషియా అవతరిస్తుంది.1950లో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు నాటి ఇండోనేషియా మొదటి అధ్యక్షుడు సుకర్ణో మొదటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసారి ప్రబోవో భారత గణతంత్ర వేడుకలకు హాజరైన పక్షంలో ఇండోనేషియా సైనిక బృందం కూడా రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొంటుంది. ఈ నెలాఖరులో బ్రెజిల్లో జరగనున్న జీ-20 సదస్సు సందర్భంగా ప్రబోవో, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య భేటీ జరిగే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ స్పీకర్‌గా అబ్దుల్ రహీమ్ రాథర్ -
KR Narayanan: దళితునిగా పుట్టి.. రాష్ట్రపతిగా ఎదిగి..
ఈ రోజున అంటే అక్టోబర్ 27న దేశ మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ జన్మించారు. ఆయన భారత రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాలపై వివిధ రచనలు చేశారు. ఇంతేకాదు అతని మేధో పనితనం, నిర్ణయాలు దేశానికి ఎంతో మేలు చేశాయి. కేఆర్ నారాయణన్ జయంతి సందర్భంగా ఆయన జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...కేఆర్ నారాయణన్ 1921, ఫిబ్రవరి 4న జన్మించారు. ఇంటికి 8 కి.మీ దూరంలోని మిషనరీ పాఠశాలలో నారాయణన్ ప్రాథమిక విద్యను అభ్యసించారు. నారాయణన్ తెలివైన విద్యార్థి కావడంతో ట్రావెన్కోర్ రాజకుటుంబం అతనికి కాలేజీకి వెళ్లడానికి స్కాలర్షిప్ ఇచ్చింది. దీంతో ఆయన కొట్టాయంలోని సీఎంఎస్ కళాశాలలో 12వ తరగతి పూర్తి చేశారు. ఆ తర్వాత ఆంగ్ల సాహిత్యంలో ఆనర్స్ డిగ్రీని అందుకున్నారు. అనంతరం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకున్నారు.1948లో భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత కేఆర్ నారాయణన్ పండిట్ జవహర్లాల్ నెహ్రూను కలుసుకున్నారు. ఈ సమయంలో నెహ్రూ ఆయనను ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో చేరమని కోరారు. 1949లో నారాయణన్ ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో చేరారు. ఈ నేపధ్యంలోనే ఆయన టోక్యో, రంగూన్, లండన్, కాన్బెర్రా, హనోయిలలో రాయబారిగా పనిచేశారు. అనంతరం ఆయన టర్కియే, చైనాలలో భారత రాయబారిగా నియమితులయ్యారు.1980 నుండి 1984 వరకు అమెరికా రాయబారిగా ఉన్నారు. 1955లో కెఆర్ నారాయణన్‌ను దేశంలోనే అత్యుత్తమ దౌత్యవేత్తగా నెహ్రూ పేర్కొన్నారు. అదే సమయంలో ఆయన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా కూడా పనిచేశాడు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ప్రొఫెసర్‌గానూ సేవలందించారు. 1978లో పదవీ విరమణ తర్వాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు.1984లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ సమయంలో కేరళలోని ఒట్టప్పలం స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. నారాయణన్ కాంగ్రెస్ టికెట్‌పై వరుసగా మూడుసార్లు సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి, విజయం సాధించారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ప్రధాని ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వాలలో వివిధ మంత్రి పదవులు నిర్వహించారు.1992లో కేఆర్ నారాయణన్ భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1997లో దేశ 10వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. కేరళ నుంచి రాష్ట్రపతి పదవిని అధిష్టించిన మొదటి వ్యక్తి, మొదటి దళితునిగా పేరుగాంచారు.కేఆర్ నారాయణన్ తన 84వ ఏట 2005 నవంబర్ 9న కన్నుమూశారు.ఇది కూడా చదవండి: వంట నూనె ధరలకు రెక్కలు -
ప్రతిష్ఠాత్మక ఐబీఆర్‌వో అధ్యక్షురాలిగా శుభా టోలే రికార్డ్ : ఆసక్తికర సంగతులు
బ్రెయిన్ అనేది రహస్యాల గని. భావోద్వేగాల ఫ్యాక్టరీ.‘ సైన్స్ ఆఫ్ ది బ్రెయిన్’ గురించి ఎన్నో దశాబ్దాలుగా కృషి చేస్తోంది ‘ఐబీఆర్‌వో’ అలాంటి ప్రసిద్ధ అంతర్జాతీయ సంస్థకు తొలిసారిగా భారతీయ శాస్త్రవేత్త అధ్యక్షురాలిగా ఎంపికైంది. ఇంటర్నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఐబీఆర్‌వో) అధ్యక్షురాలిగా ప్రముఖ శాస్త్రవేత్త శుభ టోలే నియమితురాలైంది. అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అత్యున్నత స్థానానికి ఎంపికైన తొలి శాస్త్రవేత్తగా ప్రత్యేకత సాధించింది...ప్రపంచవ్యాప్తంగా 57 దేశాలకు చెందిన 69 సైంటిఫిక్ సొసైటీలు, ఫెడరేషన్లకు ఇంటర్నేషనల్ బ్రెయిన్ రీసెర్చి ఆర్గనైజేషన్ (ఐబీఆరోవో) ప్రాతినిధ్యం వహిస్తోంది. 1961లో ఏర్పాటైన ‘ఐబీఆర్‌వో’ నినాదం: ప్రొవైడింగ్ ఈక్వల్ యాక్సెస్ టు గ్లోబల్ న్యూరోసైన్స్ గతంలో ‘ఐబీఆర్‌వో’ అధ్యక్షులుగా యూరోపియన్, ఉత్తర అమెరికా దేశాల నుంచి ఎంపికయ్యారు. భౌగోళికంగా, జనాభాపరంగా ‘ఐబీఆర్‌వో’కు సంబంధించి అతిపెద్ద ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం శుభ టోలేకు వచ్చింది.‘అభివృద్ధి చెందుతున్న దేశాలలో పనిచేయడానికి ఎన్నో పరిమితులు ఉంటాయి. ప్రయోగాలు, నిధుల జాప్యం నుంచి కొన్ని దేశాలకు సంబంధించి అంతర్జాతీయ సదస్సులు, వీసా అపాయింట్మెంట్లకు హాజరు కావడం వరకు ఇబ్బందులు ఉన్నాయి. చర్చల ద్వారా వాటికి పరిష్కారం దొరుకుతుంది’ అంటుంది శుభ.శుభ ప్రస్తుతం ముంబైలోని ప్రముఖ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థ–టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో గ్రాడ్యుయేట్ స్టడీస్ డీన్‌గా పనిచేస్తోంది. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ‘ఉమెన్ ఇన్ సైన్స్’ కమిటీకి చైర్‌పర్సన్‌గా పనిచేసింది. విద్యావంతుల కుటుంబంలో ముంబైలో జన్మించింది శుభ. తల్లి అరుణ టోలే ఆక్యుపేషనల్ థెరపిస్ట్. తండ్రి ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ విభాగానికి చెందిన సంస్థకు డైరెక్టర్‌గా పనిచేశాడు. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో లైఫ్ సైన్సెస్, బయోకెమిస్ట్రీ చదివిన శుభ అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్, డాక్టోరల్ డిగ్రీ చేసింది. చికాగో యూనివర్శిటీలో పోస్ట్–డాక్టోరల్ రీసెర్చి చేసింది.వెల్కమ్ ట్రస్ట్ సీనియర్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్, భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నుంచి స్వర్ణజయంతి ఫెలోషిప్ తీసుకొంది. భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం నుంచి జాతీయ మహిళా బయోసైంటిస్ట్ అవార్డ్, సొసైటీ ఫర్ న్యూరోసైన్స్, యూఎస్ నుంచి రీసెర్చ్ అవార్డ్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ న్యూరోసైన్సెస్ అవార్డ్ అందుకుంది.కథక్ డ్యాన్సర్ కూడాశుభ టోలే శాస్త్రవేత్తే కాదు కథక్ శాస్త్రీయ నృత్యకారిణి కూడా. లాస్ ఏంజిల్స్‌లో పీహెచ్డీ చేస్తున్న కాలంలో గురు అంజనీ అంబేగావ్కర్ దగ్గర కథక్ నేర్చుకుంది. ‘కథక్ చేస్తుంటే ఒత్తిడి దూరం అవుతుంది. మనసు ఆహ్లాదంగా ఉంటుంది. నేను, నా పెద్ద కొడుకు కథక్ ప్రాక్టీస్ చేస్తుంటాం. నా భర్త, ఇద్దరు పిల్లలు తబలాప్రాక్టీస్ చేస్తుంటారు’ అంటుంది శుభ.శుభ భర్త సందీప్ కూడా శాస్త్రవేత్త. ఇద్దరూ శాస్త్రవేత్తలే కాబట్టి ఇంట్లో సైన్స్‌కు సంబంధించిన విషయాలే మాట్లాడుకుంటారనేది అపోహ మాత్రమే. పెయింటింగ్ నుంచి మ్యూజిక్ వరకు ఎన్నో కళల గురించి మాట్లాడుకుంటారు. ‘సైన్స్ అనేది ఒక సృజనాత్మక వృత్తి’ అంటుంది శుభ. -
మాల్దీవ్స్ అధ్యక్షుడి యూటర్న్.. భారత్‌తో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ మయిజ్జు భారత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా భారత్-మాల్దీవుల సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీతో మాల్దీవులు బలమైన, వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తుందని పేర్కొన్నారు. భారత్ తమకు విలువైన భాగస్వామి మాత్రమే కాకుండా మంచి స్నేహితుడని తెలిపారు. పరస్పర గౌరవంతో తమ సంబంధం ఏర్పడినట్లు చెప్పారు.తమ దేశ ‘ మాల్దీవ్స్ ఫస్ట్’ విధానం భారత్‌లో దాని దీర్ఘకాల సంబంధాలకు ఎలాంటి ఆటంకం కలిగించదని స్పష్టం చేశారు. ముఖ్యంగా భారత భద్రతా ప్రయోజనాలను దెబ్బతీసేలా మాల్దీవులు వ్యవహరించబోదని పేర్కొన్నారు. రక్షణ సహా పలు రంగాల్లో సహాకారానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.అంతర్జాతీయ సంబంధాల్లో వైవిధ్యతను చూపడం మాల్దీవులకు చాలా అవసరమని, అలాగే ఏ ఒక్క దేశంపైనా అతిగా ఆధారపడటం తగ్గించుకోవాల్సిఉందన్నారు. అయితే దాని వల్ల భారత ప్రయోజనాలు దెబ్బతినవని తెలిపారు. ఈ సందర్భంగానే భారత టూరిస్టులకు ఆహ్వానం పలికారు. భారత టూరిస్టులు తమ దేశంలో పర్యటించాలని, వారు తమ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతున్నారని తెలిపారు.చదవండి: ఇజ్రాయెల్ నగరంపై హెజ్బొల్లా వైమానిక దాడులు#WATCH | Delhi: Prime Minister Narendra Modi receives Maldives President Mohamed Muizzu at Hyderabad House. The two leaders are holding a meeting here.(Video: DD News) pic.twitter.com/P3oE9MVRay— ANI (@ANI) October 7, 2024 కాగా నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మయిజ్జు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. మాల్దీవుల ప్రథమ మహిళ సాజిదా మొహమ్మద్ కూడా మొయిజ్జు వెంట ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం రాష్ట్రపతి భన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజ్‌ఘట్ వద్ద మహాత్వాగాంధీకి నివాళులు అర్పించారు. తర్వాత హైదరాబాద్ హౌజ్‌లో ప్రధానితో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. కాగా నాలుగు నెలల్లో మొయిజ్జు భారత్‌కు రావడం ఇది రెండోసారి కాగా.. ఇదే తొలి ద్వైపాక్షిక పర్యటన. ఇక చైనా అనుకూలుడుగి పేరున్న మయిజ్జు హయాంలో రెండు దేశాల మద్య సంబంధాలు దెబ్బతిన్నాయి. గతేడాది నవంబర్‌లో మయిజ్జు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత్‌కు రావడం ఇది రెండోసారి. ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇతర దేశాధినేతలతో మయిజ్జు హాజరయ్యారు. ప్రస్తుతం మాల్దీవులు ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్నందుకున్న భారత్‌తో దెబ్బతిన్న సంబంధాలను తిరిగి గాడిన పెట్టేందుకు మయిజ్జు ప్రయత్నిస్తున్నారు. -
నల్సార్ స్నాతకోత్సవానికి హాజరైన రాష్ట్రపతి ముర్ము
హైదరాబాద్, సాక్షి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక రోజు పర్యటన నిమిత్తం నగరానికి వచ్చారు. శనివారం ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, అధికారులు తదితరులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి.. మేడ్చల్ జిల్లాలోని శామీర్‌పేట్‌లో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయాలనికి వెళ్లారు. అక్కడ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముర్ము ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమం తర్వాత బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి బయల్దేరారు. అక్కడ భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. -
రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 28న (శనివారం) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మినిస్టర్ ఇన్ వెయిటింగ్‌గా మంత్రి సితక్కను తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేసింది. రాష్ట్రపతికి స్వాగతం పలకడం నుంచి ఆమె నగరం విడిచి వెళ్లే వరకు రాష్ట్రపతి వెంటే వుండనున్నారు సీతక్క. రాష్ట్రపతి పర్యటనలో ఎక్కడా ఏ చిన్న అసౌకర్యం కలగకుండా కార్యక్రమాలను సమన్వయం చేయనున్నారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని అడిషనల్ సీపీ ట్రాఫిక్ విశ్వప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న ఉదయం 9 గంటల నుంచి బేగంపేట, హెచ్‌పీఎస్, పీఎన్టీ జంక్షన్, రసూల్‌పురా, సీటీవో ప్లాజా, టివోలి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, బొల్లారం రాష్ట్రపతి నిలయం ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని తెలిపారు.ఈ నేపథ్యంలో గురువారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పోలీస్, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక, అటవీ, విద్యుత్, తదితర శాఖల ఏర్పాట్లపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా భద్రతా ఏర్పాట్లు, బందోబస్తును పర్యవేక్షించాలని పోలీసులకు సూచించారు. -
ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనాలి
న్యూయార్క్: ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణపై, సాధారణ ప్రజల మరణాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ సాధ్యమైనంత త్వరగా యుద్ధం ముగిసిపోవాలని, శాంతియుత పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించారు. అమెరికాలోని న్యూయార్క్‌లో స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మోదీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై మూడు గంటలకుపైగా చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రధానంగా ఉక్రెయిన్‌లో సంక్షోభానికి త్వరగా తెరపడేలా తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చక్కటి పరిష్కార మార్గం కోసం అంకితభావంతో ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఉక్రెయిన్ విజ్ఞప్తితోనే మోదీ–జెలెన్స్కీ మధ్య ఈ సమావేశం జరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి. జెలెన్స్కీతో భేటీ అనంతరం మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. భారత్–ఉక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడమే లక్ష్యంగా గత నెలలో జరిగిన పర్యటనలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడంలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నామని వివరించారు.ఉక్రెయిన్‌లో సంక్షోభానికి తెరపడి, శాంతి, స్థిరత్వం నెలకొనాలని కోరుకుంటున్నామని, అందుకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. శాంతి కోసం దౌత్య మార్గాల్లో ప్రయత్నించాలన్నారు. ఉక్రెయిన్–రష్యా మధ్య శాంతి చర్చలు జరగాలని సూచించారు. తమ దేశ సార్వ¿ౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్మేనియా ప్రధానితో భేటీ ప్రధాని నరేంద్ర మోదీ న్యూయార్క్‌లో ఆర్మేని యా ప్రధానమంత్రి నికోల్ పాషిన్యాన్‌తో భేటీ అయ్యారు. భారత్– ఆర్మేనియా మధ్య సంబంధాలపై చర్చించారు. నికోల్తో అద్భుతమైన చర్చ జరిగిందని మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అలాగే వియత్నాం అధ్యక్షుడు టో లామ్‌ను సైతం మోదీ కలుసుకున్నారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. సిక్కులతో మోదీ సమావేశం ప్రధాని మోదీ న్యూయార్క్‌లో పలువురు సిక్కు పెద్దలతో సమావేశమయ్యారు. భారత్ లో సిక్కు సామాజిక వర్గం అభ్యున్నతికోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారంటూ మోదీకి సిక్కులు కృతజ్ఞతలు తెలిపారు. ముగిసిన మూడు రోజుల పర్యటన ప్రధానమంత్రి మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం న్యూయార్క్ నుంచి భారత్‌కు తిరుగుపయనమయ్యారు. పశ్చిమాసియాలో కాల్పుల విరమణ పాటించాలి: మోదీపశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండడం, పెద్ద సంఖ్యలో జనం మరణిస్తుండడం పట్ల ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన న్యూయార్క్‌లో పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్‌తో భేటీ అయ్యారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెరపడాలని, అన్ని పక్షాలు తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని చెప్పారు. చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలని హమాస్‌కు మోదీ విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయెల్–పాలస్తీనా మధ్య శాంతికి చర్చలే మార్గమని పునరుద్ఘాటించారు. -
శ్రీలంక నూతన అధ్యక్షుడిగా దిస్సనాయకే ప్రమాణ స్వీకారం
కొలంబో: శ్రీలంక నూతన అధ్యక్షుడిగా మార్క్సిస్ట్ నేత అనూర కుమార దిస్సనాయకే (56) సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి సచివాలంలో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య దస్సనాయకేతో ప్రమాణం చేయించారు .కాగా శ్రీలంకకు అనూర కుమార దిస్సనాయకే తొమ్మిదో అధ్యక్షుడు కాగా.. తొలి వామపక్ష అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు.ప్రమాణ స్వీకారం అనంతరం దిస్సనాయకే మాట్లాడుతూ.. రాజకీయ నాయకులపై ప్రజలకు పూర్తి విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు. ‘నేనేం మాంత్రికుడిని కాదు, నాకు తెలిసినవి, తెలియని విషయాలు ఉన్నాయి. ఉత్తమ సలహాలు తీసుకొని మంచి నేతగా పనిచేసేందుకు కృష్టి చేస్తాను, అందుకు నాకు అందరి సహాకారం అవసరం’ అని పేర్కొన్నారు.కాగా అదివారం వెలువడిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో జనతా విముక్తి పెరమున అధినేత అయిన దిస్సనాయ తన సమీప ప్రత్యర్థి, ఎస్‌జేబీ నేత సజిత్ ప్రేమదాసపై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే (75) తొలి రౌండ్లోనే వైదొలిగారు. చదవండి: ఇజ్రాయెల్ విధ్వంసం.. హమాస్ చీఫ్ మృతిశ్రీలంక అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శనివారం జరగ్గా.. ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో దిస్సనాయకే 42.31% ఓట్లతో తొలి స్థానంలో, ప్రేమదాస 32.8 శాతంతో రెండో స్థానంలో నిలవగా విక్రమసింఘే 17.27 శాతంతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. అయితే ఏ ఒక్కరికీ విజయానికి కావాల్సిన 50 శాతం రాకపోవడంతో ద్వితీయ ప్రాధమ్య ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతను తేల్చారు. శ్రీలంక 9వ అధ్యక్షుడిగా దిస్సనాయకే సోమవారం ప్రమాణం చేస్తారని నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) ప్రకటించింది. దిస్సనాయకేకు భారత ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. -
President Droupadi Murmu: మహిళా సాధికారతే దేశానికి బలం
న్యూఢిల్లీ: దేశంలో మహిళల సాధికారతే ఆ దేశానికి నిజమైన బలమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఏ ప్రాంతంలో అయినా, ఎలాంటి సమయంలోనైనా మహిళలు అభద్రతకు లోనవకుండా, వారి పట్ల గౌరవం చూపేలా ప్రజలకు అవగాహన కలి్పంచాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మన దేశంలో మహిళల గౌరవాన్ని, గౌరవాన్ని కాపాడతామని, వారి పురోభివృద్ధికి కృషి చేస్తామని ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఓ వార్తా సంస్థ సోమవారం నిర్వహించిన షిశక్తి సమ్మిట్–2024లో రాష్ట్రపతి మాట్లాడుతూ దేశంలో మహిళల భద్రతకోసం కఠినమైన చట్టాలను తీసుకొచ్చామన్నారు. అయినప్పటికీ అభద్రతా భావం కొనసాగుతుండటం దురదృష్టకరమని, మహిళలను బలహీనులుగా భావించే సామాజిక సంకుచిత మనస్తత్వం, ఛాందసవాదానికి వ్యతిరేకంగా నిరంతర పోరాటాలు చేయాల్సిన అవసరముందని ఆమె నొక్కి చెప్పారు. సమాజంలో ఎన్ని మార్పులొచి్చనా కొన్ని సామాజిక దురభిప్రాయాలు లోతుగా పాతుకుపోయాయని, ఇవి మహిళా సమానత్వానికి అవరోధాలను సృష్టిస్తున్నాయని తెలిపారు. ‘‘ఎక్కడ తప్పు చేశాం? మెరుగుపడటానికి మనం ఏమి చేయాలి?’’అని మహిళలు నిరంతరం ప్రశ్నించుకోవాలని సూచించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా శక్తి, ధైర్యసాహసాలు ప్రదర్శిస్తున్నారని మహిళలను కొనియాడారు. పితృస్వామిక దృక్పథాన్ని విడనాడాలి: సీజేఐ చట్టం మాత్రమే న్యాయమైన వ్యవస్థను తయారు చేయలేదని, సమాజం మహిళల పట్ల తన మైండ్‌సెట్‌ను మార్చుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సోమవారం నొక్కి చెప్పారు. ప్రతిఒక్కరూ పితృస్వామిక దృక్పథాన్ని విడనాడాలని సూచించారు. మహిళల ప్రయోజనాలను పరిరక్షించడానికి విధానపరమైన, చట్టపరమైన నిబంధనలు అనేకం ఉన్నాయని, కానీ కఠినమైన చట్టాలే సమ సమాజాన్ని నిర్మించలేవన్నారు. మహిళలకు రాయితీలు ఇవ్వడం నుంచి స్వేచ్ఛగా, సమానంగా జీవించే హక్కు వారికుందనే విషయాన్ని గుర్తించే దిశగా మన మనస్తత్వాలు మార్చుకోవాలని పిలుపునిచ్చారు. మహిళల హక్కుల గురించి మాట్లాడటమంటే మొత్తం సమాజం మార్పు గురించి మాట్లాడినట్లని వ్యాఖ్యానించారు. తన జీవితంలోని కొన్ని గొప్ప పాఠాలను మహిళా సహోద్యోగుల నుంచే నేర్చుకున్నానని, మెరుగైన సమాజానికి మహిళల సమాన భాగస్వామ్యం ముఖ్యమని తాను నమ్ముతానని చెప్పారు. దేశం రాజ్యాంగాన్ని ఆమోదించక ముందే ఇండియన్ ఉమెన్స్ చార్టర్ ఆఫ్ లైఫ్‌ను స్త్రీవాది అయిన హంసా మెహతా రూపొందించారని సీజే గుర్తు చేశారు. -
మదురో హత్యకు సీఐఏ కుట్ర!
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో హత్యకు అమెరికా నిఘా సంస్థ సీఐఏ కుట్ర పన్నిందా? అవునని వెనిజులా అంతర్గత వ్యవహారాల మంత్రి డియోస్డాడో కాబెల్లో ఆరోపించారు. తమ దేశాన్ని అస్థిరపరచడానికి కుట్ర పన్నారనే ఆరోపణలతో ఒక యూఎస్ నేవీ సీల్ ఆఫీసర్‌తో సహా ఆరుగురు విదేశీయులను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. వారిలో అమెరికన్లు ఇద్దరు స్పెయిన్, ఒక చెక్ పౌరుడు ఉన్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా 400 అమెరికా రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ కుట్రలో సీఐఏతో పాటు స్పెయిన్ జాతీయ నిఘా విభాగం కూడా పాలుపంచుకుందని కాబెల్లో ఆరోపించారు. వీటిని అమెరికా విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. మదురోను గద్దె దించే కుట్రలో తమ ప్రమేయముందన్న వాదనలు పూర్తిగా అవాస్తవమని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి ఒకరన్నారు. వెనిజులా రాజకీయ సంక్షోభానికి ప్రజాస్వామ్య పరిష్కారం కోసం అమెరికా మద్దతిస్తూనే ఉంటుందన్నారు. దీనిపై అదనపు సమాచారం కోరుతున్నట్లు తెలిపారు. తాము కూడా దీనిపై వెనిజులాను సమాచారం అడుగుతున్నట్లు స్పెయిన్ విదేశాంగ శాఖ తెలిపింది. మదురో ఇటీవలే అధ్యక్ష ఎన్నికల్లో వివాదాస్పద రీతిలో గెలవడం తెలిసిందే. ఆ విజయాన్ని గుర్తించడానికి వెనిజులా ప్రతిపక్షంతో పాటు అమెరికా కూడా నిరాకరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. – కారాకస్ -
భారత్‌లో మాల్దీవుల అధ్యక్షుని పర్యటన త్వరలో
మాలె: మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు మాల్దీవుల అధ్యక్ష కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అయితే ఆయన ఏ తేదీల్లో పర్యటించనున్నారన్నది వెల్లడించలేదు. గత ఏడాది మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొయిజ్జు భారత్‌కు రావడం ఇది రెండోసారి.ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం మొయిజ్జు తొలిసారి భారత్ వచ్చారు. చైనా అనుకూలుడిగా పేరున్న మొయిజ్జు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత్ బలగాలు మాల్దీవులు విడిచివెళ్లిపోవాలని షరతు విధించారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కాగా, ఈ ఏడాది ఆరంభంలో మోదీ లక్షద్వీప్‌లో పర్యటించినపుడు అప్పటి మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య మరింత దూరేం పెరిగింది. సోషల్ మీడియాలో బాయ్‌కాట్ మాల్దీవుల ఉద్యమం తీవ్రమైంది. మంత్రుల వ్యాఖ్యలతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మాల్దీవులు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. చివరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులను ప్రభుత్వం నుంచి తొలగించాల్సి వచ్చింది. -
వాహన పరిశ్రమ @ రూ. 20 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశీయ ఆటోమోటివ్ పరిశ్రమ టర్నోవర్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షల కోట్ల మార్కును దాటిందని వాహన తయారీదారుల సమాఖ్య సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ వెల్లడించారు. మొత్తం వస్తు, సేవల పన్నుల్లో (జీఎస్టీ) 14–15 శాతం వాటా ఆటో పరిశ్రమదే ఉంటోందని ఆయన చెప్పారు. అలాగే దేశీయంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా గణనీయంగా ఉపాధి కలి్పస్తోందని ఆటో విడిభాగాల సంస్థల సమాఖ్య ఏసీఎంఏ 64వ వార్షిక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అగర్వాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తిలో పరిశ్రమ వాటా 6.8 శాతంగా ఉండగా ఇది మరింత పెరగగలదని వివరించారు. అంతర్జాతీయంగా భారతీయ ఆటో రంగం పరపతి పెరిగిందని అగర్వాల్ చెప్పారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే దిశగా దేశీయంగా ఉత్పత్తి చేయగలిగే 50 క్రిటికల్ విడిభాగాలను పరిశ్రమ గుర్తించిందని ఆయన వివరించారు. 100 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం: కేంద్ర మంత్రి గోయల్ భారతీయ వాహన సంస్థలు 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకోవాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఏసీఎంఏ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సూచించారు. ఇందులో భాగంగా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని, స్థానికంగా ఉత్పత్తిని మరింతగా పెంచాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వాహన ఎగుమతులు 21.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. పరిశ్రమలకు ఉపయోగపడేలా ప్రభుత్వం 20 స్మార్ట్ ఇండస్ట్రియల్ నగరాలను అభివృద్ధి చేస్తోందని, వాహనాల విడిభాగాల పరిశ్రమ ఈ టౌన్íÙప్ల రూపంలో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని మంత్రి చెప్పారు. మరోవైపు, లోకలైజేషన్‌ను పెంచేందుకు సియామ్, ఏసీఎంఏ స్వచ్ఛందంగా లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు అగర్వాల్ పేర్కొన్నారు. -
మదురో విమానం సీజ్
వాషింగ్టన్: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో విమానాన్ని అమెరికా సీజ్ చేసింది. వెనిజులాపై అమెరికా విధించిన ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఈ విమానాన్ని సమకూర్చుకున్నారని, ఇతర క్రిమినల్ అభియోగాలతో మదురో విమానాన్ని డొమినికన్ రిపబ్లిక్లో అమెరికా స్వా«దీనం చేసుకుంది. దాన్ని సోమవారం ఫ్లోరిడాకు తరలించింది. వెనిజులా– అమెరికాల మధ్య చాలాఏళ్లుగా సంబంధాలు బెడిసికొట్టాయి. వెనిజులాపై ఆర్థిక ఆంక్షలే కాకుండా పలుఇతర ఆంక్షలను కూడా అమెరికా విధించింది. వెనిజులాలో బతుకు దుర్భరమై లక్షల మంది మెక్సికో– అమెరికా సరిహద్దు ద్వారా అగ్రరాజ్యంలోకి ప్రవేశిస్తున్నారు. ఇటీవలి వివాదాస్పద అధ్యక్ష ఎన్నికల్లో మదురో విజయానికి సంబంధించి సందేహాలను వ్యక్తం చేస్తూ అమెరికా వెనిజులా నుంచి నిర్దిష్ట పోల్ డేటాను కోరింది. వెనిజులాకు చెందిన ఈ డసాల్డ్ ఫాల్కన్ 900 విమానం ఖరీదు రూ.109 కోట్లు. కొద్దినెలలుగా ఇది డొమినికన్ రిపబ్లిక్లో ఉందనే సమాచారంతో రంగంలోకి దిగిన అమెరికాకు చెందిన వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు మదురో విమానాన్ని స్వా«దీనం చేసుకొని ఫ్లోరిడాకు తరలించాయి. అమెరికా దీన్ని జప్తు చేసుకొనేందుకు చర్యలు చేపట్టింది. -
నితీశ్‌కుమార్‌పై దాఖలైన పిటిషన్ కొట్టివేత
ఢిల్లీ: జనతాదళ్(యునైటెడ్)పార్టీ అధ్యక్షుడిగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఆగస్టు 29(గురువారం) ఈ ఫిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. జేడీయూ మాజీ సభ్యుడు గోవింద్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్‌కు అర్హత లేదని, అంతర్గత పార్టీ మార్పులపై కోర్టు జోక్యం చేసుకోవడానికి బలమైన కారణం లేదని జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్ అన్నారు. ‘‘ఈ పిటీషన్‌ను విచారించే మెరిట్ లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 అధికార పరిధికి సంబంధం లేకుండా ఉంది.పెండింగ్‌లో ఉన్న పిటిషన్లతో పాటు రిట్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం’’ అని ఢిల్లీ కోర్టు పేర్కొంది. 2016, 2019, 2022 సంవత్సరాల్లో జేడీయూ నిర్వహించిన పార్టీ అంతర్గత ఎన్నికలు పార్టీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించాయని ప్రకటించాలని గోవింద్ యాదవ్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇదే విషయాన్ని గతంలోనూ జేడీయూ పార్టీలోని ఒక వర్గం లేవనెత్తగా.. 2017లో ఎన్నికల సంఘం నితీశ్‌కుమార్‌కు అనుకూలంగా తీర్పునిచ్చిందని హైకోర్టు పరిశీలించింది. -
President Droupadi Murmu: ఆవేదనతో చలించిపోయా..
న్యూఢిల్లీ: పశి్చమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఆ భయానక సంఘటన గురించి తెలుసుకొని చలించిపోయానని చెప్పారు. ఇలాంటి దారుణాలు ఇకపై జరగడానికి వీల్లేదని స్పష్టంచేశారు. మహిళలపై నేరాల పట్ల మనమంతా ఆత్మపరిశీలన చేసుకోవాలని బుధవారం పీటీఐ వార్తా సంస్థకు రాసిన ప్రత్యేక ఆరి్టకల్‌లో రాష్ట్రపతి సూచించారు. జూనియర్ డాక్టర్ హత్యపై రాష్ట్రపతి స్పందించడం ఇదే మొదటిసారి. తల్లులు, అక్కచెల్లెమ్మలపై జరుగుతున్న అరాచకాలపై దేశం మేల్కోవాల్సిన సమయం వచ్చిందని ఆమె ఉద్ఘాటించారు. మహిళల పట్ల నీచమైన అభిప్రాయాలు ఉంటే వారిని ఒక వస్తువుగా చూసే అలవాటు పెరుగుతుందని తెలిపారు. స్త్రీలను బలహీనులుగా, తెలివిలేనివారుగా పరిగణించే ఆలోచనా ధోరణిని అందరూ మార్చుకోవాలని హితవు పలికారు. మహిళల పట్ల ప్రజల దృష్టికోణం మారితే సమాజంలో వారిపై నేరాలు జరగబోవని అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి ముర్ము ఇంకా ఏం చెప్పారంటే... మనం పాఠాలు నేర్చుకున్నామా? దేశంలో సోదరీమణులపై ఎన్నో నేరాలు జరుగుతున్నాయి. ఆగస్టు 9న కోల్‌కతాలో వైద్యురాలపై జరిగిన అఘాయిత్యం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. నాగరిక సమాజంలో ఆడబిడ్డలు ఇలాంటి అరాచకాల బారిన పడడానికి వీల్లేదు. జూనియర్ డాక్టర్ హత్య పట్ల దేశమంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అందులో నేను కూడా ఉన్నాను. కోల్‌కతాలో విద్యార్థులు, వైద్యులు, పౌరులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తుండగానే, మరోచోట నేరగాళ్లు చెలరేగిపోయారు. మహారాష్ట్రలో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డారు. 12 ఏళ్ల క్రితం జరిగిన నిర్భయ ఘటన తర్వాత మహిళలపై నేరాలు జరగకుండా వ్యూహాలు రూపొందించుకున్నాం. ప్రణాళిక అమల్లోకి తీసుకొచ్చాం. అయినా నేరాలు ఆగడం లేదు. గత 12 ఏళ్లలో లెక్కలేనన్ని దారుణాలు జరిగాయి. కొన్ని మాత్రమే అందరి దృష్టికి వచ్చాయి. మనం నిజంగా పాఠాలు నేర్చుకున్నామా? ఆందోళనలు ముగిసిపోగానే ఘోరాలు మరుగునపడిపోతున్నాయి. వాటిని మనం మర్చిపోతున్నాం. మరో ఘోరం జరిగాక పాత ఘోరాలను గుర్తుచేసుకుంటున్నాం. ఇది సరైన విధానం కాదు. మహిళలపై వక్రబుద్ధిని మొదట్లోనే అడ్డుకోవాలి మహిళలు తమ హక్కుల గురించి తెలుసుకోవాలి. వాటిని పోరాడి సాధించుకోవాలి. మహిళలకు మరిన్ని హక్కులు దక్కకుండా, హక్కుల విస్తరణ జరగకుండా కొన్ని సామాజిక అచారాలు, సంప్రదాయాలు అడ్డుపడుతున్నాయి. మహిళలను ప్రాణంలేని వస్తువుగా చూసే ధోరణి వారిపై నేరాలకు పురిగొల్పుతోంది. ఈ పరిస్థితిలో కచి్చతంగా మార్పురావాలి. వారి హక్కులను అందరూ గౌరవించాలి. స్త్రీల పట్ల జనంలో ఉన్న దురభిప్రాయాన్ని మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు, సమాజంపై ఉంది. చరిత్రను ఎదిరించే సమయం వచ్చింది. స్త్రీలపై నేరాల పట్ల నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. వారిపై అత్యాచారాలు, హత్యలు జరగకుండా మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. జరిగిన తప్పులను సరిదిద్దుకోకపోతే సమాజంలోని సగం జనాభా మిగతా సగం జనాభాలాగా నిర్భయంగా జీవించలేదు. మీడియా ధైర్యంగా పనిచేయాలి ప్రసార మాధ్యమాలు ధైర్యంగా పని చేయాలని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము సూచించారు. ఒత్తిళ్లకు లొంగకుండా, ఎవరికీ భయపడకుండా ప్రజలకు నిజాలు తెలియజేయాలని అన్నారు. దేశాన్ని, సమాజాన్ని సక్రమంగా తీర్చిదిద్దడంలో ఫోర్త్ ఎస్టేట్ పాత్ర అత్యంత కీలకమని వివరించారు. మీడియా ఎప్పటికీ సత్యానికే అండగా ఉండాలని చెప్పారు. సత్య మార్గం నుంచి పక్కకు మళ్లొద్దని కోరారు. ‘మనసు ఎక్కడ నిర్భయంగా ఉంటుందో’ అని రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన పద్యాన్ని రాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. పీటీఐ 77వ వార్షికోత్సవం సందర్భంగా వార్తాసంస్థల ఎడిటర్లు బుధవారం రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన దేశంలో మహిళలను దేవతలుగా పూజిస్తుంటామని, మరోవైపు మన రోజువారీ ప్రవర్తనలో ఆ భావన కనిపించకపోవడం తనను అప్పుడప్పుడు ఆవేదనకు గురి చేస్తోందని ముర్ము వ్యాఖ్యానించారు. -
స్పేస్ డే వేడుకల్ని ప్రారంభించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ: గతేడాది జులై 14న ఇస్రో చంద్రయాన్ 3 అంతరిక్ష యాత్ర చేపట్టింది. ఆగస్టు 23న ల్యాండర్‌ను చంద్రుడిపై దింపింది. ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించుకోవాలని కేంద్రం ప్రకటించింది. ఇందులో భాగంగా శుక్రవారం (ఆగస్ట్23న) న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించనున్నారు.ఈ ఏడాది థీమ్ ‘చంద్రుని తాకేటప్పుడు జీవితాలను తాకడం భారతదేశ అంతరిక్ష సాగా’ పేరుతో జాతీయ అంతరిక్ష దినోత్సవం జరగనుంది Chandrayaan-3 Mission:Updates:The communication link is established between the Ch-3 Lander and MOX-ISTRAC, Bengaluru.Here are the images from the Lander Horizontal Velocity Camera taken during the descent. #Chandrayaan_3#Ch3 pic.twitter.com/ctjpxZmbom— ISRO (@isro) August 23, 2023 -
నాస్కామ్ ప్రెసిడెంట్‌గా రాజేశ్ నంబియార్
న్యూఢిల్లీ: నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్, సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) నూతన ప్రెసిడెంట్‌గా కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్ రాజేశ్ నంబియార్ నియమితులయ్యారు. దేబ్జానీ ఘోష్ పదవీకాలం పూర్తయిన తర్వాత నవంబర్ 2024లో నాస్కామ్ ప్రెసిడెంట్‌గా నంబియార్ కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడైన ఆయన 2023లో నాస్కామ్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. టీసీఎస్, ఐబీఎం, సియెనా వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది. కాగా, రాజేశ్ నంబియార్ కాగ్నిజెంట్ సీఎండీ పదవికి రాజీనామా చేశారు. గ్లోబల్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్, ఇండియా సీఎండీగా రాజేశ్ వారియర్‌ను ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ నియమించుకుంది.సెప్టెంబర్ 2 నుంచి గ్లోబల్ హెడ్‌గా, అక్టోబర్ 1 నుంచి సీఎండీగా బాధ్యతలు అందుకుంటారు. కాగ్నిజెంట్‌లో చేరక ముందు హెడ్ ఆఫ్ గ్లోబల్ సర్వీసెస్, ఇన్ఫోసిస్ అమెరికాస్ ఈవీపీగా వారియర్ పనిచేశారు. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్, యాక్టివ్క్యూబ్స్ వంటి సంస్థల్లోనూ ఉద్యోగం చేశారు. -
రక్షాబంధన్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు
నేడు (ఆగస్టు 19) దేశవ్యాప్తంగా రక్షాబంధన్‌ను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య ఉండే అనుబంధం విశిష్టమైనదని, దీనికి ప్రతీకగా రాఖీ జరుపుకుంటారని అన్నారు. మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి రక్షాబంధన్ ఒక ప్రతీక అని, ఈ పండుగను మతపరమైన సరిహద్దులను దాటి జరుపుకోవడం విశేషమన్నారు.మహిళలకు గౌరవం అందించడంతోపాటు, వారి హక్కులను పరిరక్షించాలనే సంకల్పాన్ని బలోపేతం చేయడానికి ఈ పండుగ దోహదపడుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీ మెట్రో రక్షాబంధన్ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈరోజు (సోమవారం) అదనంగా మెట్రో రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఇదేవిధంగా ఉత్తర ప్రదేశ్ రవాణా శాఖ కూడా అదనంగా బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. President Droupadi Murmu extends Raksha Bandhan greetingsRead @ANI Story | https://t.co/NeXkXdRoLO#PresidentMurmu #RakshaBandhan #DroupadiMurmu pic.twitter.com/OFYFbD2UXm— ANI Digital (@ani_digital) August 18, 2024 -
President Droupadi Murmu: అసమానతలను రూపుమాపాలి
న్యూఢిల్లీ: సామాజిక అసమానతలను పెంచి పోషించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. ‘‘వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన విభజన ధోరణులను సమూలంగా పెకిలించాలి. అన్ని వర్గాలవారినీ కలుపుకుపోయేలా గట్టి కార్యాచరణ రూపొందించి అమలు చేసినప్పుడే అది సాధ్యం’’ అని స్పష్టం చేశారు. 78వ స్వాతంత్య్ర దినం సందర్భంగా మంగళవారం ఆమె జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత్‌లో రాజకీయ ప్రజాస్వామ్యం స్థిరమైన ప్రగతి సాధిస్తోందన్నారు. విస్తరిస్తున్న సామాజిక ప్రజాస్వామ్యానికి అది నిదర్శనమని చెప్పారు. భిన్నత్వం, బహుళత్వమే ఆభరణాలుగా దేశమంతా ఐక్యంగా ముందుకు సాగుతోందంటూ హర్షం వెలిబుచ్చారు. సామాజిక న్యాయానికి మోదీ సర్కారు అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఇతర అణగారిన వర్గాల అభ్యున్నతికి చేపట్టిన చర్యలను వివరించారు. మహిళల అభ్యున్నతికీ పెద్దపీట వేసిందన్నారు. దేశ విభజన సందర్భంగా జరిగిన అంతులేని అకృత్యాలు, మానప్రాణ నష్టం ఎన్నటికీ మర్చిపోలేనివంటూ ఆవేదన వెలిబుచ్చారు. స్ఫూర్తిదాయక ప్రసంగం: మోదీ భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో భాగంగా నవతరం ఆర్థిక సంస్కరణలకు రంగం సిద్ధమైందని రాష్ట్రపతి తెలిపారు. ఆర్థిక రంగంలో భారత్ దూసుకుపోతోందంటే దీర్ఘదృష్టితో కూడిన సారథ్యం, రైతులు, ఇతర సంపద సృష్టికర్తల నిరి్వరామ శ్రమే కారణమన్నారు. అద్భుతమైన మౌలిక సదుపాయాలు, ఏఐతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ, ఉరకలెత్తుతున్న ఆర్థిక రంగం భారత్‌ను ప్రపంచ పెట్టుబడిదారుల గమ్యస్థానంగా మారుస్తున్నాయన్నారు. రాష్ట్రపతి ప్రసంగం స్ఫూర్తిదాయకంగా ఉందంటూ మోదీ ప్రశంసించారు. -
President Droupadi Murmu: మీరే సంధానకర్తలు
న్యూఢిల్లీ: కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గవర్నర్లు అనుసంధానకర్తలుగా వ్యవహరించాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు. శనివారం ముగిసిన గవర్నర్ల రెండు రోజుల సదస్సులో ఆమె ప్రసంగించారు. శాఖల మధ్య మరింత సమన్వయానికి చర్యలపై సదస్సులో చర్చించినట్టు రాష్ట్రపతి భవన్ పేర్కొంది. మెరుగైన పనితీరుకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాచారాన్ని పొందేందుకు, నిరంతర సంప్రదింపులకు సాగించడంలో గవర్నర్లు సంశయించరాదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సూచించారు. రాజ్భవన్లలో ఆదర్శ పాలనా నమూనాను రూపొందించడానికి గవర్నర్లు కృషి చేయాలని ప్రధాని మోదీ సూచించారు. గవర్నర్లు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, డిజిటైజేషన్‌ను ప్రోత్సహించాలని కోరారు. -
తెలంగాణ బీజేపీ అధ్యక్షపదవి.. ఎంపీ అర్వింద్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: తెలంగాణలో బీజేపీని అధికారంలో తెచ్చే వారికే అధ్యక్ష పదవి ఇవ్వాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఈ విషయమై శుక్రవారం(ఆగస్టు2) ఢిల్లీలో అర్వింద్ మీడియాతో మాాట్లాడారు. నాకు సమర్థత ఉందని నేను అనుకుంటున్నా. కానీ అధిష్టానం గుర్తించాలి. రుణమాఫీ మొత్తం పూర్తయ్యే వరకు ఆగి మాట్లాడితే బాగుంటుంది. కేసీఆర్ పాలనలో అసెంబ్లీ జరగలేదు. ఇప్పుడు అసెంబ్లీలో అందరూ మాట్లాడుతున్నారు.గతంలో కొందరు కన్ను మిన్ను కానకుండా మాట్లాడారు. రేవంత్ రెడ్డిని అనేకసార్లు కేసీఆర్ జైల్లో పెట్టారు. రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎందుకు కేసీఆర్‌పై చర్యలు తీసుకోవడం లేదు అని అర్వింద్ ప్రశ్నించారు. -
తనకెంతో ఇష్టమైన టీచర్‌గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము: వీడియో వైరల్
భారత రాష్ట్రపతిగా నేటితో రెండేళ్లు పూర్తి చేసుకున్న ద్రౌపది ముర్ము తనకెంతో ఇష్టమైన టీచర్‌గా అవతరించారు. కొత్తఢిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలో కాసేపు ఉపాధ్యాయురాలిగా మారిపోయారు. 9వ తరగతి విద్యార్థులతో ముచ్చటిస్తూ ఉత్సాహంగా గడిపారు. గ్లోబల్ వార్మింగ్ , పర్యావరణం లాంటి వంటి ముఖ్యమైన సమస్యలను చర్చించారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి వివిధ మార్గాలను విద్యార్థులకు సూచించారు.ఈ సందర్భంగానీటి సంరక్షణ, అడవుల పెంపకం ప్రాముఖ్యతను వివరించారు. ఎక్కువ మొక్కలు నాటాలని, నీటి వృథాను అరికట్టాలని, వర్షపు నీటి సంరక్షణ ద్వారా వాటిని సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘ఏక్ పేడ్ మా కే నామ్ (అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి)’ ప్రతిపాదనను ద్రౌపది ముర్ము గుర్తు చేశారు. అలాగే ప్రతీ విద్యార్థి తమ పుట్టిన రోజున ఓ మొక్క నాటాలని పిలుపునిచ్చారు. వాయు కాలుష్యం గురించి కూడా ఆమె ప్రస్తావించారు. మీతో సంభాషించడం నిజంగా చాలా ఆనందాన్నించ్చిందనీ, మీ అందరి నుండి చాలా నేర్చుకునే అవకాశం తనకు లభించిందంటూ సంతోషాన్ని ప్రకటించారు LIVE: President Droupadi Murmu teaches the students of Class IX of Dr. Rajendra Prasad Kendriya Vidyalaya, President’s Estate, on completion of 2 year of Presidency https://t.co/FIrBrZp8qJ— President of India (@rashtrapatibhvn) July 25, 2024 -
కమలా హారీస్‌కు రాజయోగం?
రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించినంతనే ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బైడెన్ తన ప్రకటన అనంతరం అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ పేరును ఆమోదించారు. దీంతో భారత సంతతికి చెందిన కమలా హారీస్ అమెరికా అధ్యక్షురాలిగా కాబోతున్నారనే వాదన ఒక వర్గం నుంచి వినిపిస్తోంది.తాజాగా ప్రముఖ జ్యోతిష్యులు రాజీవ్ నారాయణ్ శర్మ అమెరికా అధ్యక్షురాలిగా హారీస్ ఎన్నిక కానున్నారని జోస్యం చెప్పడంతో ఈ తరహా ఊహాగానాలు మరింతగా జోరందుకున్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో రాజీవ్ నారాయణ్ శర్మ.. కమలా హారీస్ భవిష్యత్ గురించి తెలిపారు. ఆమె జాతకంలో ప్రస్తుతం రాహు, శుక్ర దశ జరుగుతోందని, ఆమెకు రాజయోగం ఈ ఏడాది జూలై 27 నుండి ప్రారంభం కానున్నదని తెలిపారు. ఈ సమయం కమలా హారీస్ జీవితంలో బంగారు దశ అవుతుందన్నారు.జ్యోతిష్కులు రాజీవ్ నారాయణ్ శర్మ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విషయమై కూడా జోస్యం చెప్పారు. బైడెన్ 1942, నవంబర్ 11న జన్మించారని, అతనిది వృశ్చిక రాశి అని, ప్రస్తుతం అతని జాతకంలో శని దశ నడుస్తున్నదన్నారు. అలాగే కుజుడు, బుధుడు పెన్నెండవ ఇంట కలిసి ఉన్నారని తెలిపారు. అటువంటి పరిస్థితిలో అది మనస్సును ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఈ నేపధ్యంలోనే అతను ఎన్నికల బరి నుంచి నుంచి తప్పుకుని ఉండవచ్చన్నారు. Kamla Devi Harris(20.10.64), has Gemini Lagna, Aries sign. Dasha running Rahu, Venus. From 27.07.24 her Rajyog is starting. This period will be a golden phase of her life.@ANI @DainikBhaskar @aajtak @BJP4India @INCIndia @the_hindu @NewYorkTimes_es @washingtonpost @timesofindia— Rajeev Narain Sharma (@AstroGuru_Rjv) July 21, 2024 -
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో తెలియజేశారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ కూడా బైడెన్ ఆరోగ్య వివరాలను తెలియజేశారు. జో బైడెన్ తన సోషల్ మీడియా ఖాతాలోలో ఇలా రాశారు. ‘ఈ రోజు మధ్యాహ్నం నేను కోవిడ్ -19 టెస్టులు చేయించుకున్నాను. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. నా శ్రేయస్సు కోరుకునేవారందరికీ ధన్యవాదాలు. నేను అనారోగ్యం నుంచి కోలుకునేవరకూ అందరికీ దూరంగా ఉంటాను. ఈ సమయంలోనూ అమెరికా ప్రజల కోసం పని చేస్తూనే ఉంటాను’అని పేర్కొన్నారు. I tested positive for COVID-19 this afternoon, but I am feeling good and thank everyone for the well wishes. I will be isolating as I recover, and during this time I will continue to work to get the job done for the American people.— President Biden (@POTUS) July 17, 2024 బైడెన్‌కు చికిత్స అందిస్తున్న వైద్యుడు కెవిన్ ఓ కానర్ మాట్లాడుతూ బైడెన్ ప్రస్తుతం ముక్కు కారటం, దగ్గు వంటి తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్నారన్నారు. అలసిపోయినట్లు కనిపిస్తున్నారని కూడా తెలిపారు. కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన దరిమిలా బైడెన్‌కు యాంటీ వైరల్ డ్రగ్ పాక్స్లోవిడ్ మొదటి డోస్ అందించాం. బైడెన్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం ఇస్తూనే ఉంటామని తెలిపారు. లాస్ వెగాస్‌లో జరిగిన ఒక సదస్సులో ప్రసంగానికి ముందు బైడెన్‌కు కరోనా టెస్ట్ చేశారు. ఈ రిపోర్టుల ఆధారంగా ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు గుర్తించారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ మీడియాతో మాట్లాడుతూ జో బైడెన్ ప్రస్తుతం కరోనాలోని తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్నారు. ఆయన డెలావేర్కు చేరుకుని కరోనా తగ్గేవరకూ ఒంటరిగా ఉంటారన్నారు.Earlier today following his first event in Las Vegas, President Biden tested positive for COVID-19. He is vaccinated and boosted and he is experiencing mild symptoms. He will be returning to Delaware where he will self-isolate and will continue to carry out all of his duties… pic.twitter.com/ka5hiBavTC— ANI (@ANI) July 17, 2024 -
ట్రంప్‌పై దాడి.. రీగన్‌ను గుర్తుచేసుకున్న కుమార్తె
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా నాటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్‌ను అతని కుమార్తె పాటీ డేవిస్ గుర్తు చేసుకుని, తన తండ్రి విషయంలోనూ ఇలాగే జరిగిందంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. రోనాల్డ్ రీగన్ 1981లో ఒకరోజు వాషింగ్టన్లో తన ప్రసంగం ముగించుకుని తన నివాసానికి వెళుతుండగా జాన్ హింక్లీ జూనియర్ అనే వ్యక్తి రీగన్‌పై కాల్పులు జరిపాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రీగన్ కొన్నాళ్లకు కోలుకున్నప్పటికీ, పాక్షికంగా పక్షవాతానికి గురయ్యడు. రోనాల్డ్ రీగన్ కుమార్తె పాటీ డేవిస్ నటి, రచయిత్రి. ఆమె న్యూయార్క్ టైమ్స్‌లో ఓ కథనం ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు.‘అది 1981, మార్చి 30.. నేను నా ఆస్పత్రి కార్యాలయంలో కూర్చున్నాను. ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ మా ఆఫీసు తలుపును తోసుకుంటూ లోనికి వచ్చాడు. దీంతో అతని మీద నాకు మొదట నాకు కోపం వచ్చింది. అయితే ఏదో జరగరానిది జరిగిందన్న భావన అతని ముఖంలో కనిపించింది. ఇంతలో అతను పాటీ.. అక్కడ కాల్పులు జరిగాయన్నాడు. ఆ రోజు నా జీవితంలో మరచిపోలేని రోజులలో ఒకటి. నా తండ్రి రోనాల్డ్ రీగన్ బతికి ఉంటారో ఉండరో తెలియదు. అతనికి చికిత్స అందిస్తున్న వైద్యులకు కూడా ఈ విషయం తెలియదు. మా అమ్మ.. మా నాన్నను తలచుకుంటూ రోదిస్తోంది. మా నాన్న హాస్పిటల్ బెడ్‌పై కదలలేని పరిస్థితిలో ఉన్నాడు.డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగినప్పుడు అతని కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. వారు అనుభవిస్తున్న వేదన ఎటువంటిదో నాకు తెలుసు. అధ్యక్షుడు లేదా అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్థి జీవితం ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. అమెరికాలో ప్రస్తుతం 1981కి మించిన హింసాత్మక స్థితి ఉంది. ఈ అనుభవం ట్రంప్‌ను ఎలా మారుస్తుందో నేను ఊహించలేను. సోవియట్ యూనియన్‌తో ప్రచ్ఛన్న యుద్ధాన్ని ముగించడానికి, అణ్వాయుధాలపై ఒప్పందాన్ని చేసుకునేందుకు దేవుడు తనను భూమిపైకి పంపాడని నా తండ్రి నమ్మాడు. సమయం అమూల్యమైనది. ఈ బహుమతిని అర్థవంతంగా ఉపయోగించడం అందరికీ తప్పనిసరి అని నాన్న గుర్తు చేసేవారని’ పాటీ డేవిస్ పేర్కొన్నారు. This is how the Secret Service reacted in 1981 when Ronald Reagan was shot.pic.twitter.com/N4GBoHqMWZ— Keith Boykin (@keithboykin) July 13, 2024 -
రాష్ట్రపతితో కలిసి బ్యాడ్మింటన్ ఆడిన సైనా నెహ్వాల్ (ఫొటోలు)
-
Jagannath Rath Yatra 2024: పూరీలో వైభవంగా రథయాత్ర
భువనేశ్వర్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరీలోని జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా మొదలైంది. సాయంత్రం లక్షలాది భక్తుల నినాదాల నడుమ జగన్నాథ ఆలయం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని గుండీచా ఆలయం దిశగా భారీ రథాలు ముందుకు సాగాయి. 5.20 గంటలకు రథాలు కదిలాయి. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మూడు రథాలకు పూజలు చేశారు. ఆమె, ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్, సీఎం మోహన్ చరణ్ మాఝి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జగన్నాథ రథం తాళ్లను లాగి యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. ముందున్న బలభద్రుని ప్రతిష్టించిన 45 అడుగుల ఎత్తైన రథాన్ని దేవీ సుభద్ర, జగన్నాథుని రథాలు అనుసరించాయి. రథయాత్రకు ముందు భక్తుల బృందాలు జగన్నాథుని కీర్తనలను ఆలపిస్తూ ముందుకు సాగారు. రెండు రోజులపాటు సాగే యాత్ర కోసం భారీగా బందోబస్తు చేపట్టారు.సాయంత్రం వేళ బలభద్రుని రథం లాగుతున్న చోట ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీంతో ఊపిరాడక తొమ్మిది మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకొచ్చేలోగా ఒడిశాలోని బాలాంగిర్ జిల్లాకు చెందిన లలిత్ బాగార్తి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. భక్తుని మృతి పట్ల సీఎం చరన్ మాఝీ సంతాపం వ్యక్తంచేశారు. అయితే 300 మందిదాకా గాయపడినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. -
ఇరాన్ నూతన అధ్యక్షుడిగా డాక్టర్ మసూద్ పెజెష్కియాన్
టెహ్రాన్: ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాద అభ్యర్థి మసూద్ పెజెష్కియాన్ విజయం సాధించారు. అధ్యక్ష ఎన్నికల్లో అతివాద అభ్యర్థి సయీద్ జలీలీని ఓడించి మసూద్ పెజెష్కియాన్ ఘన విజయం అందుకున్నారు. దీంతో, పెజేష్కియాన్ మద్దతుదారులు శనివారం ఉదయం వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు.వివరాల ప్రకారం.. ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా వైద్యుడు(హార్ట్ సర్జన్) మసూద్ పెజెష్కియాన్ ఎన్నికయ్యారు. ఇక, కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు దాదాపు 30 మిలియన్ల ఓట్లు పోలయ్యాయి. శుక్రవారం ఎన్నికల తర్వాత అధికారులు సమర్పించిన డేటా పెజెష్కియాన్‌ను 16.3 మిలియన్ ఓట్లతో విజేతగా ప్రకటించగా, జలీలీకి 13.5 మిలియన్ల ఓట్లు వచ్చినట్టు అక్కడి ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక, ఎంపీ మసూద్ పెజెష్కియాన్ ఎన్నికల ప్రచారంలో పశ్చిమ దేశాలతో సంబంధాలను బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రజలు మసూద్‌కు భారీ విజయాన్ని అందించారు.ఇదిలా ఉండగా.. ఇరాన్లో ఎవరు ఎన్నికల్లో పోటీ చేయాలన్నది ఆ దేశ గార్డియన్ కౌన్సిల్ నిర్ణయిస్తుంది. నలుగురు అభ్యర్థుల పేర్లను గార్డియన్ కౌన్సిల్ ఆమోదించింది. ఇక, పెజెష్కియాన్ ఎంపీగానే కాకుండా మహ్మద్ ఖతామీ ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా కూడా పనిచేశారు. 1980-89 వరకు డాక్టర్‌గా కొనసాగారు. ఇక, సయీద్ జలీలీ ఇరాన్ మాజీ చీఫ్ న్యూక్లియర్ నెగోషియేటర్.Masoud Pezeshkian wins Iran's presidential race with 16.3M votes, beating Saeed Jalili's 13.5M Pezeshkian promises outreach to the West. Analysts predict pragmatic foreign policy shifts. Known for his Pro-India & Anti-Pakistan standSupporters celebrate in Tehran & other… pic.twitter.com/n5JU2dtZgg— Nabila Jamal (@nabilajamal_) July 6, 2024మరోవైపు.. ఇరాన్ ఎన్నికల సంఘం నుంచి వచ్చిన డేటా ప్రకారం, ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించబడిన ఏకైక సంస్కరణవాద నాయకుడు పెజెష్కియాన్. ఆయన అభ్యర్థిత్వం గురించి ఇటీవల వరకు పెద్దగా చర్చ జరగలేదు. అయితే మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఖతామీ, ఉదారవాది హసన్ రౌహానీల మద్దతు అతని అభ్యర్థిత్వానికి బలాన్నిచ్చింది. ప్రచారం సందర్భంగా పెజెష్కియాన్.. ముఖ్యంగా పశ్చిమ దేశాలతో నిర్మాణాత్మక సంబంధాలను, ప్రపంచంలో ఒంటరిగా ఉన్న ఇరాన్ అణు ఒప్పందాన్ని పునరుద్ధరించాలని చెప్పుకొచ్చారు. దీంతో, ప్రజల్లో ఆయనపై ఓ నమ్మకం ఏర్పడింది. -
బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియామకం ఎటూ తేలలేదు. దీంతో పార్టీ నాయ కులు, కార్యకర్తల్లో స్తబ్దత నెలకొంది. కేంద్ర కేబినెట్ ఏర్పాటు, తదనంతర పరిణామాల్లో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక తెరపైకి వచ్చి హడావిడి జరిగినా, ఆ తర్వాత మళ్లీ సద్దుమణిగింది. కేంద్రమంత్రిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డిని జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్చార్జ్గా నియమించారు. దీంతో ఆయన అటు మంత్రిగా పార్లమెంట్ సమావేశాలు, కశ్మీర్ బాధ్యతలతో బిజీగా ఉంటున్నారు. కశ్మీర్ ఎన్నికలు వచ్చే సెపె్టంబర్ నెలాఖరులోగా జరిగే అవకాశాలు ఉండటంతో అప్పటి దాకా అధ్యక్షుడి గా ఆయన రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించే పరిస్థితులు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.అ యితే ఈ పదవిలో ఎవరిని నియమించాలనే దా నిపై బీజేపీ కేంద్రం నాయకత్వం ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రాలేదు. దీంతో ఈ అంశం కొంతకాలం పాటు పెండింగ్‌లో పడినట్టుగానే భావించాల్సి ఉంటుందని పారీ్టవర్గాలు పేర్కొంటున్నా యి. రాష్ట్రంలో అడపాదడపా యువమోర్చా, మహిళా మోర్చా ల వంటి విభాగాలు ఆయా అంశాలు, సమస్యలపై నిరసనలు, దీక్షలు వంటివి చేపడుతున్నా పెద్దనాయకులెవరూ పాల్గొనకపోవడంతో అవి పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి.అ«ధ్యక్ష పదవి కోసం పలువురు ముఖ్యనేతలు పోటీపడుతున్నా, చివరకు ఎవరిని నియమిస్తారనే దానిపై స్పష్టత కొరవడింది. పారీ్టలో ఉన్న ఇప్పటికే ఉన్న కొందరు ముఖ్యనేతలు, పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయలేమి, కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు పవర్సెంటర్లుగా మారడం వంటి కారణాలతో పారీ్టనాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికను వాయిదా వేస్తోందని పారీ్టనాయకులు భావిస్తున్నారు. జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలం ముగిసి, ఆయన్ను కూడా కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నందున, కొత్త జాతీయ అధ్యక్షుడి నియామకం తర్వాతే రాష్ట్ర అధ్యక్షుడిని నియమించే అవకాశాలున్నాయని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.కొనసాగుతున్న ఉత్కంఠ కొత్త అధ్యక్షుడి ఎంపికపై రాష్ట్ర బీజేపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, అర్వింద్ ధర్మపురి, ఎం.రఘునందన్‌రావు గట్టిగా పోటీపడుతున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. కేంద్రమంత్రిగా, బీజేఎలీ్పనేతగా రెడ్డి సామాజికవర్గానికి అవకాశం ఇచి్చనందున, బీసీ వర్గాల నుంచే అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. దీంతో ఈటల పేరు దాదాపుగా ఖరారై ప్రకటించాల్సిన దశలో మళ్లీ ఏవో కారణాలతో వాయిదా పడినట్టుగా ప్రచారం జరుగుతోంది.ఇదిలా ఉంటే ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి ఒకరి ఎంపిక ఉండొచ్చునని కొందరు అభిప్రాయపడుతున్నారు. పారీ్టపరంగా చూస్తే ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పార్టీ సీనియర్ నేతలు చింతా సాంబమూర్తి, మాజీ ఎమ్మెల్సీ ఎ¯న్.రామచంద్రరావు, టి.ఆచారి, ఎం.ధర్మారావు డా.జి. మనోహర్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, దుగ్యాల ప్రదీప్‌కుమార్, కాసం వెంకటేశ్వర్లు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఈ పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు.అధ్యక్ష పదవి కోసం పాత,కొత్త నాయకుల మధ్య తీవ్రస్థాయిలో పోటీ నెలకొనడంతో రాష్ట్ర పారీ్టలోనూ విచిత్ర పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంతకాలం క్రితమే పారీ్టలో చేరిన వారికి కీలకమైన అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారా అన్న చర్చ కూడా బలంగానే వినిపిస్తోంది. మరోవైపు 1951లో జనసంఘ్ కాలం, 1980లో బీజేపీగా ఏర్పడ్డాక ఇప్పటిదాకా రెండేళ్ల పాటు మాత్రమే బంగారు లక్ష్మణ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించారు. ఇదీగాకుండా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో దళిత సామాజికవర్గాల ఆదరణను పొందలేకపోయినందున ఈసారి ఓ సీనియర్ ఎస్సీ నేతను కొత్త అధ్యక్షుడిగా నియమించడం ద్వారా ఈ వర్గాల్లోనూ పార్టీ విస్తరణకు అవకాశం ఉంటుందని ఓ వర్గం నాయకులు గట్టిగా వాదిస్తున్నారు. -
వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు పెరిగాయి: రాష్ట్రపతికి అరకు ఎంపీ ఫిర్యాదు
సాక్షి,ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే వైఎస్ఆర్సీపీ నేతలపై వేధింపులు ఎక్కువయ్యాయని అరకు ఎంపీ తనూజారాణి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. మంగళవారం(జులై2) ఆమె రాష్ట్రపతిని కలిశారు. 15 నిమిషాల పాటు రాష్ట్రపతితో తనూజారాణి భేటీ అయ్యారు. వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులు, నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులు, ఆస్తుల విధ్వంసాలతో రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయన్నారు. జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలని లేదంటే ప్రత్యేక చట్టం ద్వారా గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్ని స్థానిక గిరిజనులకే కేటాయించాలి రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. అరకు కాఫీ రైతుల బాగు కోసం గిరిజన కాఫీ సొసైటీ స్థాపించాలని, ఈ సొసైటీ ద్వారా కాఫీ కొనుగోలు చేస్తే రైతులకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉందని రాష్ట్రపతి దృష్టికి తీసుకువచ్చారు. -
నినాదాల వివాదం.. ఒవైసీపై రాష్ట్రపతికి ఫిర్యాదు
న్యూఢిల్లీ: లోక్‌సభలో ఎంపీగా ప్రమాణం చేసిన తర్వాత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వివాదాస్పద నినాదాలపై ఇద్దరు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 103 కింద ఒవైసీపై అనర్హత వేటు వేయాలని రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్లు న్యాయవాది వినీత్ జిందాల్ ఎక్స్(ట్విటర్)లో తెలిపారు.పార్లమెంటులో ఇతర దేశానికి జై కొట్టినందుకు ఆయను డిస్క్వాలిఫై చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. మంగళవారం(జూన్25) లోక్‌సభలో ఎంపీగా ప్రమాణం ముగిసిన తర్వాత జై తెలంగాణ, జై భీం, జై పాలస్తీనా అని నినాదాలు చేసి ఒవైసీ వివాదానికి తెరలేపిన విషయం తెలిసిందే.ఒవైసీ చేసిన నినాదాలను లోక్‌సభ రికార్డుల నుంచి ప్రొటెం స్పీకర్ ఇప్పటికే తొలగించారు. అయితే పాలస్తీనాలో ప్రజలు అణచివేతకు గురవుతున్నందునే తాను ఆ నినాదం చేశానని ఒవైసీ మీడియాకు తెలిపారు. -
రాష్ట్ర బీజేపీలో ‘అధ్యక్ష’ పోరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో ఆధిపత్యపోరు మరోసారి తెరపైకి వచ్చింది. త్వరలోనే రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడి నియామకం జరగొచ్చుననే అంచనాల మధ్య అది తీవ్ర రూపం దాలి్చంది. ప్రధానంగా కొంతకాలం క్రితం కొత్తగా పార్టీలో చేరి ఎంపీ, ఎమ్మెల్యే ఇతర పదవుల్లో ఉన్న వారు, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వారి మధ్య తీవ్రపోటీ నెలకొంది. పార్టీ సిద్ధాంతాలు, విధానాలపై పూర్తి అంకితభావంతో ఉన్న పాత నాయకులకే ఈ పదవి దక్కాలంటూ బీజేపీలో ఓ వర్గం నాయకులు గట్టిగా ప్రయతి్నస్తున్నారు. అయితే పార్టీ విస్తరించాలంటే కొత్తవారు చేరడం ముఖ్యమని, కొత్త, పాత తేడాలు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అడ్డంకిగా మారకూడదని మరికొందరు వాదిస్తున్నారు. రాజాసింగ్ వర్సెస్ ఈటల దాదాపు రెండేళ్ల క్రితం పార్టీలో చేరి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి, ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి దాదాపు 4 లక్షల భారీ మెజారిటీతో విజయం సాధించిన ఈటల రాజేందర్ పేరు పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటున్నట్టుగా పార్టీలోని ఓ వర్గం గట్టిగా నమ్ముతోంది. కేంద్ర కేబినెట్లో మంత్రి పదవిని కోరుకున్న ఈటలకు.. రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తామని, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కచ్చితంగా అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని బీజేపీ అగ్రనేత అమిత్‌షా చెప్పినట్టు సమాచారం.మరోవైపు కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి వీలైనంత త్వరగా తనను తప్పించాలని కోరడంతో.. త్వరలోనే అంటే వారం, పది రోజుల్లోనే కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ దేశభక్తి కలిగి దూకుడుగా వ్యవహరించే (అగ్రెసివ్) నేతకే రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలంటూ అధిష్టానానికి విజ్ఞప్తి చేయడం పార్టీలో సంచలనం సృష్టించింది. రాజాసింగ్ విడుదల చేసిన వీడియోపై ఈటల ఘాటుగా స్పందించారు. గల్లీల్లో ఉన్నవారు కాదు కావాల్సింది‘ఫైటర్‌కు పదవిని ఇవ్వాలంటూ కొందరు మాట్లాడుతున్నారు.. ఎవరికి ఇవ్వాలి.. స్ట్రీట్ఫైటర్కు ఇవ్వాలా..’అంటూ నేతల పేరును ప్రస్తావించకుండా ఈటల వ్యాఖ్యానించారు. సందర్భం వచ్చినపుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్న వాడు కావాలని, గల్లీల్లో ఉన్న వారు కాదని రాజ్యాన్ని, అధికారంలో ఉన్న వారిని నిగ్గదీసి నిలదీయగలిగే వాడే ఫైటర్ అవుతాడని అన్నారు. తన లాంటి వారు ఊరికే మాట్లాడరని సందర్భం వచ్చినపుడు జేజమ్మతో కొట్లాడే సత్తా ఉన్న వారిమని ఓ సమావేశంలో పాల్నొన్న సందర్భంగా ఈటల వ్యాఖ్యానించారు. కొత్త, పాత నాయకులు అనే తేడాలు లేకుండా అందరినీ సమన్వయం చేసుకుని బీజేపీ ముందుకు వెళుతుందన్నారు. ఒక పార్టీ కొత్తగా ఎదిగి, అధికారంలోకి రావాలంటే కొత్త శక్తి, కొత్త నీరు జతకావాల్సిందేనన్నారు. కొత్త, పాత ఏమీ లేదన్న రఘునందన్ తాజాగా మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ రఘునందన్‌రావు వద్ద ఓ విలేకరి ఈ విషయాలు ప్రస్తావించగా.. ‘కొత్తగా వచి్చన నేతలకు పదవి రాదు అనేది ఏమీ లేదు. అలా అయితే హిమంత బిశ్వ శర్మ అసోం సీఎం అయ్యేవారు కాదు. ఒక పార్టీని వీడి మరో పార్టీలో చేరి కండువా కప్పుకున్న రోజునుంచే ఆ పార్టీ నాయకుడిగా సదరు వ్యక్తి చెలామణి అవుతారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా అభిప్రాయాలు చెప్పవచ్చు.. రాజాసింగ్ తన అభిప్రాయం చెప్పారు’అంటూ స్పందించడం గమనార్హం. పోటీలో పలువురు నేతలుమల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌తో పాటు ఎంపీలు డీకే అరుణ, అర్వింద్ ధర్మపురి, ఎం.రఘునందన్‌రావు, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, సీనియర్ నేతలు చింతా సాంబమూర్తి, చింతల రామచంద్రారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, జి.మనోహర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు అధ్యక్షుడి రేసులో ఉన్నట్టు సమాచారం. వీరిలో కొందరు ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో తమ వంతు లాబీయింగ్ కూడా మొదలుపెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల చివరి నాటికి బీజేపీ రాష్ట్ర కొత్త సారథిపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
నేటి నుంచి పార్లమెంట్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. 18వ లోక్‌సభకు ఎన్నికైన సభ్యులు సోమవారం, మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి వారితో మెహతాబ్ ప్రమాణం చేయిస్తారు. తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరితో ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం తొలుత ప్రధాని నరేంద్ర మోదీ, ఆ తర్వాత సీనియారిటీ ఆధారంగా మంత్రులు, ఎంపీలు ప్రమాణం చేస్తారు. ఆంగ్ల వర్ణక్రమంలో రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తారు. బుధవారం లోక్‌సభ సభ్యులందరూ కలిసి నూతన స్పీకర్‌ను ఎన్నుకుంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం వచ్చే నెల 3వ తేదీన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ముగియనున్నాయి. వర్షాకాల సమావేశాలు జూలై 22వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. స్పీకర్‌గా మళ్లీ ఓం బిర్లా! ప్రొటెం స్పీకర్ ప్యానెల్లో ఉండడానికి విపక్ష నేతలు విముఖత చూపడంతో స్పీకర్ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈసారి స్పీకర్ పదవిని ఎన్డీయేలో బీజేపీయేతర పక్షాలకు కేటాయిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో బీజేపీ నాయకత్వం స్పీకర్ పదవిని ఇతరులకు ఇచ్చే అవకాశం తక్కువేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. స్పీకర్ పదవిని మహిళలకు కేటాయించే పక్షంలో గుజరాత్‌కు చెందిన పూనంబెన్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దగ్గుబాటి పురందేశ్వరి పేర్లు వినిపిస్తున్నాయి. గత లోక్‌సభను తనదైన రీతిలో ముందుకు నడిపించిన ఓం బిర్లా పేరు కూడా తెరపైకి వచి్చంది. గత లోక్‌సభలో విపక్ష సభ్యులు తక్కువైనప్పటికీ వారు వినిపించిన ప్రభుత్వ వ్యతిరేక గళం అధికార పక్షంపై ప్రభావం చూపకుండా సభను నడిపించడంలో ఓం బిర్లా చాతుర్యం చూపించారు. -
ప్రపంచ శ్రేయస్సుకు యోగా శక్తివంతమైన సాధనం: మోదీ
శ్రీనగర్: యోగాను ప్రపంచ శ్రేయస్సుకు పనిచేసే శక్తివంతమైన ఉపకరణంగా నేడు అందరూ భావిస్తున్నా రని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మరింత మంది పర్యాటకులను ఆకర్షించడం ద్వారా జమ్మూకశ్మీర్ ఆర్థిక వ్యవస్థను మార్చే సామర్థ్యం యోగాకు ఉందన్నారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో యోగాను 50 వేల నుంచి 60 వేల మంది వరకు సాధన చేస్తుండటం సాధారణ విషయం కాదని తెలిపారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీనగర్‌లోని షేర్–ఇ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(ఎస్కేఐసీసీ)లో జరిగిన కార్యక్రమంలో మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘దేవుడు, ఈశ్వరుడు లేదా అల్లాను చేరుకునే ఆధ్యాత్మిక ప్రయాణంగా యోగా గురించి సాధారణంగా చెబుతుంటారు. ఆధ్యాత్మిక కోణాన్ని వదిలేసి ప్రస్తుతానికి, మనం వ్యక్తిగత అభివృద్ధి కోసం యోగాపై దృష్టి పెట్టి, దానిని జీవితంలో ఒక భాగంగా ఆచరించవచ్చు. అలా చేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయి. వ్యక్తిగత అభివృద్ధి సమాజ శ్రేయస్సుకు..అంతిమంగా అది మానవాళి శ్రేయస్సుకు దారితీస్తుంది’’ అని చెప్పారు.సియాచిన్‌లోనూ యోగా డేరాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, అధికారులు యోగా చేశారు. పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, ఎస్.జైశంకర్, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు దేశవ్యాప్తంగా పలుచోట్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. సియాచిన్‌లో, రాజస్తాన్‌లోని థార్ ఏడారిలో, సముద్రంలో విమానవాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై సైనికులు యోగా చేశారు. తమిళనాడులోని రామేశ్వరంలో సాయుధ సిబ్బంది జల యోగ చేశారు. ఈ ఏడాది యోగా డే ఇతివృత్తం ‘యోగా ఫర్ సెల్ప్ అండ్ సొసైటీ’. -
లోక్‌సభ పొట్రెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్.. నియమించిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: లోక్ సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌ను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 95(1) ప్రకారం ఎంపీ భర్తృహరి మహతాబ్‌ను ప్రోటెం స్పీకర్‌గా రాష్ట్రపతి ప్రమాణం చేయించారు.మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు తొలిసారి పార్లమెంట్ సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే. కొత్తగా ఎంపికైన ఎంపీలతో ఆయన ప్రమాణస్వీకారం చేయించనున్నారు. అనంతరం లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకోనున్నారు. అప్పటి వరకు ప్రొటెం స్పీకర్ తాత్కాలికంగా విధులు నిర్వహిస్తారు.కాగా భర్తృహరి మహతాబ్ ఒడిశాలోని కటక్ స్థానం నుంచి ఏడుసార్లు ఎంపీగా గెలుపొందారు. తొలుత బీజేడీ నుంచి పోటీ చేసిన ఆయన.. ఇటీవల ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. బీజేడీ అభ్యర్థి సంత్రుప్ట్ మిశ్రాపై విజయం సాధించారు. ఒడిశా మొదటి ముఖ్యమంత్రి హరేక్రుష్ణ మహతాబ్ కుమారుడే మహతాబ్, 2024లో కటక్‌లో మళ్లీ గెలుపొందారు. -
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పదవి కోసం తీవ్ర పోటీ
-
దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా మళ్లీ రామఫోసా
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్(ఏఎన్సీ)కు చెందిన సిరిల్ రామఫోసా(71) మళ్లీ ఎన్నికయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో దాదాపు 30 ఏళ్ల తర్వాత ఏఎన్సీ పార్లమెంట్లో మెజారిటీ కోల్పోయింది. దీంతో, డెమోక్రాటిక్ అలయెన్స్, ఇతర చిన్న పార్టీలతో కలిసి ఏఎన్సీ సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. శుక్రవారం పార్లమెంట్లో జరిగిన ఎన్నిక లో రామఫోసాకు 283 ఓట్లు పడగా, ప్రత్యర్థి మలేమాకు 44 ఓట్లే ద క్కాయి. రామఫోసా బుధవారం అధ్యక్షునిగా ప్రమాణం చేయనున్నారు. -
తెలంగాణ BJP కొత్త సారథి ఎవరు.. అధ్యక్ష పదవి రేసులో ఉన్నదెవరు?
సాక్షి, తెలంగాణ : తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని ఎప్పుడు నియమిస్తారు? కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు పూర్తయింది. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డి మరోసారి కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఎన్నికలన్నీ పూర్తయినందున ఇక పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించాల్సి ఉంది. జాతీయ అధ్యక్షుడిని కూడా మోదీ క్యాబినెట్లోకి తీసుకున్నారు. అందువల్ల ముందుగా ఆలిండియా పార్టీ అధ్యక్షుడిని నియమించి..ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని నియమిస్తారని అంటున్నారు. ఇంతకీ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి పోటీపడుతున్నదెవరో చూద్దాం.ఎన్నికలన్నీ పూర్తయ్యాయి. మంత్రి పదవుల పంపకమూ అయిపోయింది. ఇక పార్టీ పదవుల్లో నియామకాలే మిగిలాయి. కిషన్‌రెడ్డి ఇప్పటివరకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటుగా..కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. మోదీ మూడో మంత్రివర్గంలో కూడా కిషన్‌రెడ్డికి బెర్త్ ఇచ్చారు. ఇక ఆయన పూర్తిగా మంత్రి బాధ్యతలు నిర్వహించాల్సి ఉన్నందున.. ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొత్తనేతను నియమించాల్సి ఉంది. మరి తెలంగాణ కమల దళపతిగా ఎవరిని నియమిస్తారనేదానిపై బీజేపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ పదవి కోసం చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు.మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు తెలంగాణ బీజేపీ పగ్గాలు దక్కడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటల రాజేందర్‌ను పార్టీ ఫోకస్ చేసింది. గజ్వేల్, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఈటల పరాజయం పాలైనా... మల్కాజ్గిరి ఎంపీగా ఈటలకు పార్టీ మరో అవకాశం ఇచ్చింది. అక్కడ భారీ మెజారిటీతో ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు రాష్ట్ర పార్టీ పగ్గాలు ఈటలకు అప్పగించి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తే ఈటలకే పార్టీ పగ్గాలు అప్పగించవచ్చు. ఇప్పటికే ఆ దిశగా పార్టీ అధిష్ఠానం సంకేతాలు ఇచ్చినట్లు ఈటల వర్గీయులు చెబుతున్నారు.అయితే తెరవెనక మరికొంత మంది నేతలు కూడా తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు రాష్ట్ర పార్టీ పగ్గాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందిరా గాంధీ గతంలో ప్రాతినిథ్యం వహించిన పార్లమెంట్ నియోజకవర్గంలో గెలవడం, మాజీ సిఎం కెసిఅర్ సొంత ఇలాకాలో విజయం సాధించడం రఘునందన్‌కు కలిసి వచ్చే అంశాలుగా చెబుతున్నారు. మంచి వాగ్ధాటి కల్గిన నేతగా..ప్రత్యర్థి పార్టీల నేతల విమర్శలను సమర్థవంతంగా తిప్పకొట్టగల నేతగా రఘునందన్ ముందు వరుసలో ఉంటారు. ఇటువంటి అంశాలు కమలనాథులు పరిగణనలోకి తీసుకుంటే రఘునందన్ పేరును పరిశీలించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి వర్గంలో స్థానం ఆశించిన పాలమూరు ఎంపీ డీకే అరుణకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే దానిపై అధిష్ఠానం పెద్దలు సమాలోచనలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర తెలంగాణ నుంచి బండి సంజయ్ కు, రాజధాని నగరం నుంచి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి వర్గంలో ఛాన్స్ ఇచ్చారు. దక్షిణ తెలంగాణా నుంచి డికె అరుణకి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే... సిఎం రేవంత్ కు ధీటుగా రాష్ట్రంలో బీజేపీని ముందుకు తీసుకువెళ్లవచ్చని పలువురు రాష్ట్ర నేతలు అధిష్ఠానం ముందు పెట్టినట్లు సమాచారం. కేంద్ర మంత్రివర్గంలో మహిళల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి వర్గంలో డికె అరుణకు ఛాన్స్ ఇస్తారని కూడా మరో ప్రచారం జరుగుతోంది.నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా మంత్రి వర్గంలో స్థానం దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు రాష్ట్ర పార్టీ పగ్గాలు అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరమణ రెడ్డి సైతం అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. అయితే ఇప్పటికే బీజేఎల్పీ బాధ్యతలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర పార్టీ పగ్గాలు బిసి నేతకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ కు మంత్రి వర్గంలో ఛాన్స్ దక్కిన నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన అరవింద్ కు కొత్త బాధ్యతలు ఇస్తారా ? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.పార్టీలో చాలాకాలంగా పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, పేరాల చంద్ర శేఖర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జాతీయ పార్టీ అధ్యక్ష బాధ్యతలు కొత్త వారికి కేటాయించిన తర్వాతే తెలంగాణ పగ్గాలు ఎవరికిస్తారో తేలుతుంది. ఇదిలాఉంటే.. ఆషాడ మాసం ముగిసే వరకు కిషన్ రెడ్డి అటు కేంద్ర మంత్రిగా.. ఇటు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్ని కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఆషాడం ముగిసాకే కొత్త నేతకు రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. -
బీజేపీ జాతీయాధ్యక్ష పదవిపై కొనసాగనున్న సస్పెన్స్!
న్యూఢిల్లీ, సాక్షి: ఇటీవల కొలువు దీరిన కొత్త కేబినెట్లో జేపీ నడ్డాకు స్థానం దక్కింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలూ చేపట్టారు. ఈ తరుణంలో.. బీజేపీ జాతీయాధ్యక్షుడి బాధ్యతల నుంచి ఆయన తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నెలలో ప్రధాని మోదీ ఇటలీ పర్యటనకు వెళ్లి రానున్నారు. ఆయన వచ్చాక బీజేపీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.బీజేపీలో పార్టీ ప్రెసిడెంట్ ఎన్నిక అంత సులువుగా జరగదు. అందుకోసం సుదీర్ఘమైన ప్రక్రియ కొనసాగుతుంది. సాధారణంగా.. బీజేపీ పార్లమెంటరీ బోర్డు వర్కింగ్ ప్రెసిడెంట్‌ను ఎన్నుకుంటుంది. అయితే.. కనీసం సగం రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు ముగిశాకే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. జులైలో మెంబర్షిప్ క్యాంపెయిన్ మొదలవుతుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇది కనీసం ఆరు నెలపాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ లెక్కన డిసెంబర్-జనవరి మధ్యలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది.వాస్తవానికి జేపీ నడ్డా అధ్యక్ష కాలపరిమితి ఈ ఏడాది జనవరితోనే పూర్తైంది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన కాలపరిమితిని ఈ జూన్ దాకా పొడిగిచింది బీజేపీ హైకమాండ్. ఇక బీజేపీలో వన్ పర్సన్.. వన్ పోస్ట్ పాలసీ ఉన్నప్పటికీ అది కచ్చితంగా అమలు కావడం లేదు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి విషయంలో మాత్రం బీజేపీ తప్పుకుండా రూల్స్ పాటించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో.. కొత్త అధ్యక్షుడి ఎంపిక జరిగేదాకా నడ్డానే అధ్యక్షుడిగా కొనసాగమని బీజేపీ అధిష్టానం కోరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏడాది చివరికల్లా ఎన్నిక ప్రక్రియ పూర్తి అవుతుంది. కాబట్టి.. అప్పటిదాకా ఆయనే కొనసాగవచ్చని సమాచారం. దీంతో ఈ గ్యాప్‌లో పలువురి పేర్లను సైతం పరిశీలించేందుకు తమకు వీలుంటుందని హైకమాండ్ భావిస్తోంది.ఇక.. బీజేపీ తొలుత వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకుని.. ఆ తర్వాతే పూర్తిస్థాయి అధ్యక్షుడి బాధ్యతలు అప్పజెప్తుంది. జేపీ నడ్డా ఇంతకు ముందు ఇలాగే ఎన్నుకున్నారు. 2019 జూన్‌లో జేపీ నడ్డాకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పజెప్పారు. ఆపై 2020 జనవరి 20 నుంచి పూర్తి స్థాయి బీజేపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఆయన కొనసాగుతున్నారు.జేపీ నడ్డా నేపథ్యం.. జగత్ ప్రకాశ్ నడ్డా.. లాయర్ వృత్తి నుంచి క్రియాశీల రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. హిమాచల్ ప్రదేశ్ 1993 అసెంబ్లీ ఎన్నికల్లో బిలాస్పూర్ ఎమ్మెల్యేగా తొలిసారి నెగ్గారాయన. పదేళ్లపాటు ఎమ్మెల్యేగా కొనసాగిన ఆయన.. 2003 ఎన్నికల్లో మాత్రం ఓడారు. 2007లో మళ్లీ నెగ్గి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఆ తర్వాత 2012లో అసెంబ్లీ ఎన్నికలకు ఆయన పోటీ చేయలేదు. అయితే సీనియర్ కోటాలో రాజ్యసభకు మాత్రం ప్రమోషన్ దక్కించుకున్నారు. 2014లో కేంద్ర మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణలో భాగంగా జేపీనడ్డాకు ఆరోగ్య శాఖ దక్కింది. 2019లో అమిత్ షా కేంద్ర మంత్రి వర్గంలోకి వచ్చాక.. పార్టీ పగ్గాలు ఎవరికి అప్పజెప్పాలన్నదానిపై తర్జన భర్జనలు జరిగాయి. ఆ సమయంలో జేపీ నడ్డాకు బాధ్యతలు తప్పగించారు. ఇక.. 2024 మార్చిలో హిమాచల్ రాజ్యసభ సభ్యతానికి రాజీనామా చేసి.. గుజరాత్ రాజ్యసభ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మోదీ 3.0 కేబినెట్లో మళ్లీ ఆయనకు ఆరోగ్య మంత్రిత్వ శాఖనే దక్కింది. -
‘‘రాష్ట్రపతి భవన్‌లోకి వచ్చింది పులి కాదు.. పిల్లి’’
న్యూఢిల్లీ: మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమంలోకి వచ్చిన జంతువు చిరుతపులి కాదని కేవలం పిల్లి అని తేలింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు సోమవారం(జూన్10) క్లారిటీ ఇచ్చారు.మంత్రుల ప్రమాణస్వీకారం సందర్భంగా వెనుకాల కారిడార్‌లో నడుస్తూ లైవ్ కెమెరాలకు చిక్కింది ఇళ్లలో తిరిగే పిల్లి అని పోలీసులు స్పష్టం చేశారు. ప్రమాణస్వీకారం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లోకి చిరుత పులి వచ్చిందని సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొట్టింది.ఇది భద్రతా వైఫల్యమేనని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. అయితే ఇవేవీ నిజం కావని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అలాంటి రూమర్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. -
కన్నులపండువగా...
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం కన్నులపండువగా జరిగింది. దేశాధినేతల నుంచి రాజకీయ దిగ్గజాల దాకా వేడుకలో పాల్గొన్నారు. పారిశ్రామిక ప్రముఖులు మొదలుకుని సినీ తారల దాకా తళుక్కుమన్నారు. 8,000 మందికిపైగా వీవీఐపీలు, వీఐపీలతో రాష్ట్రపతి భవన్ ఆవరణ కళకళలాడింది. వరుసగా మూడోసారి ప్రధానిగా మోదీతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణస్వీకారం చేయిస్తుండగా ప్రాంగణమంతా కరతాళ ధ్వనులు, హర్షధ్వానాలతో మారుమోగింది. మాజీ రాష్ట్రపతులు ప్రతిభా పాటిల్, రామ్‌నాథ్ కోవింద్ తదితరులు పాల్గొన్నారు. షారుఖ్ ఖాన్ నుంచి రజనీకాంత్ దాకా పలువురు సినీ ప్రముఖులు కుటుంబ సమేతంగా హాజరై అలరించారు. పారిశ్రామికవేత్తలు గౌతం అదానీ దంపతులు, ముకేశ్ అంబానీ దంపతులు వేడుకకు హాజరయ్యారు. భిన్న మతాలకు చెందిన పెద్దలు పాల్గొనడం అందరినీ ఆకర్షించింది. బీజేపీ నుంచి తొలిసారి ఎంపీగా నెగ్గిన ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధానాకర్షణగా నిలిచారు. కేరళలోని త్రిసూర్ ఎంపీ, మలయాళ సినీ స్టార్ సురేశ్ గోపీ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అందరి దృష్టినీ ఆకర్షించింది. లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో బీజేపీకి ఇదే తొలి విజయమన్నది తెలిసిందే. మోదీకి పలు రంగాల ప్రముఖుల అభినందనలు, శుభాకాంక్షల సందేశాలతో ఎక్స్ తదితర సోషల్ సైట్లు హోరెత్తిపోయాయి. ఏడుగురు దేశాధినేతలు: మోదీ ప్రమాణ స్వీకారానికి 7 దేశాల అధినేతలు హాజరయ్యారు. బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవింద్ కు మార్ జగన్నాథ్, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు, నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ, భూటాన్ ప్ర ధానమంత్రి త్సెరింగ్ టాగ్బే, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫిఫ్ తదితరులు కార్యక్ర మంలో పాల్గొన్నారు. భారత్, మాల్దీవుల మ« ద్య సంబంధాలు బలహీనపడ్డ నేపథ్యంలో ముయిజ్జు హాజరు ప్రాధాన్యం సంతరించుకుంది. 2023 నవంబర్‌లో అధ్యక్షుడయ్యాకఆయన భారత్ రావడం ఇదే తొలిసారి.తెలుపు కుర్తా–చుడీదార్, నీలి రంగు జాకెట్లో... మెరిసిపోయిన మోదీవిశేష సందర్భాల్లో తన వస్త్రధారణతో ఆకట్టుకునే మోదీ ఈసారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలుపు కుర్తా, చుడీదార్, దానిపై నీలి రంగు జాకెట్ ఎంచుకున్నారు. 2014లో తొలిసారి ప్రధానిగా ప్రమాణ చేసిన సందర్భంగా ఆయన క్రీం కలర్ కుర్తా, తెల్ల పైజామా, బంగారు రంగు జాకెట్ ధరించారు. 2019లో రెండోసారి ప్రధాని అయినప్పుడు తెలుపు రంగు కుర్తా, పైజామా, వాటిపై బంగారు రంగు జాకెట్ ధరించి ప్రమాణస్వీకారం చేశారు. పంద్రాగస్టు, గణతంత్ర వేడుకలకు మోదీ రంగురంగుల తలపాగాలు ధరించి అలరిస్తుంటారు. -
మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం
న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా నరేంద్రమోదీ వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆదివారం(జూన్9) ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీతో సరిగ్గా 7 గంటల 23 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేయించారు. #WATCH | Narendra Modi takes oath for the third straight term as the Prime Minister pic.twitter.com/Aubqsn03vF— ANI (@ANI) June 9, 2024 నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ అంటూ మోదీ ప్రమాణాన్ని ప్రారంభించారు. ఈ ప్రమాణ స్వీకారంతో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టిన రెండో వ్యక్తిగా మోదీ కొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఓత్ ఆఫ్ ఆఫీస్‌తో పాటు ఓత్ ఆఫ్ సీక్రెసీ ప్రమాణాన్ని మోదీతో రాష్ట్రపతి చేయించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్,శ్రీలంక,మాల్దీవులు,మారిషస్ ప్రధానులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.పలువురు బీజేపీ అగ్ర నేతలకు మళ్లీ చోటు..గతంలో కీలక శాఖలు నిర్వహించిన బీజేపీ అగ్ర నేతలు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, పియూష్‌గోయెల్, నిర్మలాసీతారామన్, నితిన్ గడ్కరీ జితేంద్ర సింగ్ కేబినెట్ మంత్రులుగా మూడోసారి ప్రమాణం చేశారు. బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డాను ఈసారి కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. Amit Shah sworn in as Union minister in Prime Minister Modi's 3.0 CabinetRead @ANI Story | https://t.co/XtFeIoOQz1#AmitShah #Unionminister pic.twitter.com/kba9Jk43u0— ANI Digital (@ani_digital) June 9, 202472 మందితో మోదీ3.0 మంత్రి వర్గం.. 30 మందికి కేబినెట్ హోదామోదీ 3.0 ప్రభుత్వ మంత్రి వర్గంలో మొత్తం 72 మంత్రులున్నారు. వీరిలో 30 మంది కేబినెట్ మంత్రులుకాగా అయిదుగురు సహాయం(ఇండిపెండెంట్), 36 మంది సహాయ మంత్రి పదవులు దక్కాయి. కేబినెట్లో బీజేపీ కాకుండా ఎన్డీఏ మిత్రపక్షాలకు 11 మంత్రి పదవులు దక్కాయి. కేబినెట్లో సామాజిక వర్గాల వారిగా చూస్తే 20 మంది ఓబీసీలకు, కాగా, ఎస్సీలకు10,ఎస్టీలకు 6 మైనార్టీలకు 5 బెర్తులు కేటాయించారు. 30 మంది కేబినెట్ మంత్రులు వీళ్లే... 1.రాజ్‌నాథ్ సింగ్2.అమిత్ షా3.నితిన్ గడ్కరీ 4.జేపీ నడ్డా 5.శివరాజ్ సింగ్ చౌహాన్ 6.నిర్మలా సీతారామన్ 7.జై శంకర్ 8.మనోహర్‌లాల్ ఖట్టర్ 9.హెచ్డీ కుమార్ స్వామీ10.పియూష్ గోయల్11.ధర్మేంద్ర ప్రదాన్12.జితిన్ రామ్ మాంజీ13.రాజీవ్ రంజన్ సింగ్14.శర్వానంద్ సోనోవాల్15.వీరేంద్రకుమార్16.కింజరపు రామ్మోహన్ నాయుడు17.ప్రహ్లాద్ జోషి18.జువల్ ఓరం19.గిరిరాజ్ సింగ్20.అశ్వినీ వైష్ణవ్21.జ్యోతిరాధిత్య సింధియా22.భూపేందర్ యాదవ్23.గజేంద్ర సింగ్ షెకావత్24.అన్నపూర్ణాదేవి25.కిరణ్ రిజిజు26.హర్దీప్ సింగ్‌పూరి27.మన్సుఖ్ మాండవీయ28.జి.కిషన్ రెడ్డి29.చిరాగ్ పాశ్వాన్ 30.సీఆర్ పాటిల్తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి పదవులు..తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి నరసాపురం ఎంపీగా గెలుపొందిన బీజేపీ నేత శ్రీనివాస వర్మ, తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగు దేశం పార్టీ తరపున కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు మంత్రి వర్గంలో చోటు దక్కింది. మోదీ 3.0.. ఏ రాష్ట్రానికి ఎన్ని బెర్తులు.. యూపీ నుంచి 9 మందికి కేంద్ర మంత్రి పదవులు దక్కగా, మహారాష్ట్ర నుంచి ఆరుగురుకి కేంద్రమంత్రి పదవులు దక్కాయి. ఇక గుజరాత్ నుంచి ఐదుగురు, కర్ణాటక నుంచి ఐదుగురు, ఒడిశా నుంచి ముగ్గురు చోటు దక్కించుకున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లకు నాలుగు చొప్పున మంత్రి పదవులు, జార్ఖండ్ ,బెంగాల్ నుంచి ఇద్దరికి చొప్పున మంత్రి పదవులు, కేరళ, తమిళనాడు, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌లకు ఒక్కో మంత్రి పదవి దక్కింది. -
ఢిల్లీకి మాల్డీవుల అధ్యక్షుడు మయిజ్జు
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు(ఆదివారం) మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు దేశాధినేతలను ఆహ్వానించారు. ప్రస్తుతం వీరంతా రాజధాని ఢిల్లీకి తరలివస్తున్నారు.భారత ప్రభుత్వం ఆహ్వానం మేరకు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు ఆదివారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈయన ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. గతేడాది నవంబర్‌లో మాల్దీవుల అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా మహ్మద్ ముయిజ్జు భారత్‌కు వచ్చారు.‘నరేంద్ర మోదీతోపాటు ఆయన మంత్రివర్గమండలి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు న్యూఢిల్లీ చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘనస్వాగతం లభించింది’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వెంట్లో తెలియజేశారు.బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే తదితరులు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు. -
రేపే మోదీ ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనను ఆహా్వనించారు. ఆదివారం రాత్రి 7:15 గంటలకు మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ దిశగా శుక్రవారం హస్తినలో ఒకదాని వెంట ఒకటి పలు పరిణామాలు జరిగాయి. తొలుత ఉదయం 11.30కు నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) భాగస్వామ్య పక్షాలన్నీ సమావేశమై తమ పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. పార్లమెంటు పాత భవనం ‘సంవిధాన్ సదన్’ సెంట్రల్ హాల్లో జరిగిన ఈ భేటీలో బీజేపీతో పాటు టీడీపీ, జేడీ(యూ), ఎల్జేపీ తదితర ఎన్డీఏ భాగస్వామ్య పారీ్టల అధినేతలు, ఎంపీలు పాల్గొన్నారు. ఎన్డీఏపీపీ నేతగా మోదీ పేరును బీజేపీ అగ్రనేత రాజ్‌నాథ్‌సింగ్ ప్రతిపాదించగా కూటమి ఎంపీలంతా ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు. అనంతరం ఎంపీలందరినీ ఉద్దేశించి మోదీ, ఆయన నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ భాగస్వామ్య పక్షాల నేతలు ప్రసంగించారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా, లోక్‌సభలో బీజేపీ పక్ష నేతగా కూడా మోదీ ఎన్నికయ్యారు. తర్వాత ఆయన రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి ద్రౌపదీ ముర్ముతో సమావేశమయ్యారు. ఎన్డీఏ ఎంపీల నిర్ణయాన్ని ఆమెకు తెలియజేశారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మోదీని ముర్ము ఆహా్వనించారు. అనంతరం రాష్ట్రపతి భవన్ వెలుపల మోదీ మీడియాతో మాట్లాడారు. ‘‘నన్ను ఎన్డీఏ నేతగా ఎన్నుకున్నట్టు భాగస్వామ్య పక్షాలన్నీ రాష్ట్రపతికి తెలిపాయి. దాంతో ఆమె నన్ను ప్రధానిగా నియమించారు. ఆ మేరకు నాకు లేఖ అందజేశారు. ప్రమాణస్వీకారానికి అనువైన సమయం, నాతో పాటు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసే నేతల వివరాలు కోరారు. ఆదివారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేస్తామని తెలిపాను. కాబోయే మంత్రుల జాబితాను ఆదివారానికల్లా రాష్ట్రపతి భవన్‌కు అందజేస్తా’’ అని వివరించారు. 2047లో వందేళ్ల స్వాతంత్య్రోత్సవాల నాటికి జాతి కలలను సంపూర్ణంగా సాకారం చేసే ప్రస్థానంలో 18వ లోక్‌సభ కీలక మైలురాయిగా నిలవనుందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ‘‘ఇది నవ, యువ శక్తితో అలరారుతున్న సభ. దేశ ప్రజలు ఎన్డీఏకు మరోసారి అవకాశమిచ్చారు’’ అని చెప్పారు. ఎన్డీఏ పక్షాలన్నీ మోదీకి మద్దతుగా శుక్రవారం మధ్యాహ్నమే రాష్ట్రపతికి లేఖలు అందజేశాయి. జాతీయ ప్రయోజనాలు, ప్రాంతీయ ఆకాంక్షల మధ్య... సమతూకంగా పాలన: బాబు, నితీశ్ జాతీయ ప్రయోజనాలు, ప్రాంతీయ ఆకాంక్షల మధ్య సమతూకం పాటిస్తూ ఎన్డీఏ ప్రభుత్వ పాలన సాగాలని భాగస్వామ్య పక్షాలు టీడీపీ, జేడీ(యూ) ఆకాంక్షించాయి. ఎన్డీఏపీపీ నేతగా మోదీ పేరును రాజ్‌నాథ్ ప్రతిపాదించగా చంద్రబాబు (టీడీపీ), నితీశ్‌కుమార్ జేడీ(యూ), ఏక్నాథ్ షిండే (శివసేన), చిరాగ్ పాస్వాన్ (ఎల్జేపీ–ఆర్వీ), హెచ్.డి.కుమారస్వామి జేడీ(ఎస్), అజిత్ పవార్ (ఎన్సీపీ), జితిన్‌రాం మాంఝీ తదితరులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు సారథ్యం వహిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ‘‘ప్రపంచ సారథిగా ఎదిగేందుకు భారత్‌కు ఇదో అద్భుతమైన అవకాశం. సమాజంలోని అన్ని వర్గాల సమగ్రాభివృద్ధికి పెద్దపీట వేస్తూ పాలన సాగాలి’’ అని ఆకాంక్షించారు. రాష్ట్రాల అభివృద్ధిని చిన్నచూపు చూడొద్దని నితీశ్ సూచించారు. దేశాన్ని అద్భుతంగా వృద్ధి పథంలో నడిపించడంతో పాటు బిహార్‌పైనా మోదీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తారని ఆశాభావం వెలిబుచ్చారు. ‘‘వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ విపక్షాలకు ఓటమి తప్పదు. వాళ్లు పనికిరాని కబుర్లు చెప్పి అక్కడా, ఇక్కడా గెలిచారు. వచ్చేసారి వారంతా ఓడటం ఖాయం’’ అన్నారు. మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం దేశం ఎవరి ముందూ తలొంచబోదని పవన్ కల్యాణ్ అన్నారు.విరిసిన నవ్వులు... ఎన్డీఏ భేటీ పలు ఆహ్లాదకర సన్నివేశాలకు వేదికైంది. తమ కూటమిది పటిష్టమైన ఫెవికాల్ బంధం అని షిండే అభివరి్ణంచగా నవ్వులు విరిశాయి. తనకు పాదాభివందనం చేసేందుకు నితీశ్ ప్రయత్నించగా మోదీ వారిస్తూ ఆలింగనం చేసుకున్నారు. చిరాగ్నూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను భుజం తట్టారు. పవన్ కల్యాణ్ ‘పవనం కాదు, సుడిగాలి’ అంటూ మోదీ తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రశంసించారు.రాజ్యాంగ ప్రతికి నమస్సులు ఎన్డీఏ భేటీ కోసం సెంట్రల్ హాల్లోకి ప్రవేశించగానే మోదీ ముందుగా రాజ్యాంగ ప్రతిని తన నుదిటికి తాకించుకుని వందనం చేశారు. ఆ ఫొటోను ఎక్స్‌లో పెట్టి భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు. ‘‘తన జీవితంలో ప్రతి క్షణమూ రాజ్యాంగం ప్రవచించిన గొప్ప విలువల పరిరక్షణకే అంకితం. నా వంటి వెనకబడ్డ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి దేశానికి సేవ చేయగలుగుతున్నాడంటే అది కేవలం మన రాజ్యాంగం గొప్పదనమే. అది కోట్లాది ప్రజలకు ఆశ, శక్తియుక్తులు, గౌరవాదరాలు కలి్పస్తోంది’’ అని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పదేళ్లుగా అడుగడుగునా నిర్లక్ష్యం చేస్తూ వచి్చన మోదీ నేడిలా అదే రాజ్యాంగానికి ప్రణామాలు చేయడం విడ్డూరమంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ దుయ్యబట్టారు. -
వచ్చే ఐదేళ్లు దేశ సేవకే అంకితమవుతాం: నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ, సాక్షి: కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించారు. శుక్రవారం సాయంత్రం ఎన్డీయే పక్ష నేత నరేంద్ర మోదీ, భాగస్వామ్య పక్ష నేతలు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. రాష్ట్రపతి ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ఎన్డీయే పక్షనేతగా తనను ఎన్నుకున్నారని రాష్ట్రపతికి తెలిపారు. ఎన్డీయే కూటమి ఎంపీల మద్దతు లేఖను రాష్ట్రపతికి మోదీ అందజేశారు. అనంతరం మోదీ మీడియాతో మాట్లాడారు. ‘‘ 18వ లోక్‌సభ చాలా ప్రత్యేకం. ఎన్డీయేకు మూడో సారి దేశ సేవ చేసే భాగ్యం లభించింది. ఈ అవకాశం ఇచ్చిన దేశ ప్రజలకు ధన్యవాదాలు. వచ్చే ఐదేళ్లు దేశసేవకే అంకితమవుతాం. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు పూర్తి చేసేందుకు శ్రమిస్తాం. ఎన్డీయే నేతలు నన్ను మరోసారి పక్ష నేతగా ఎన్నుకున్నారు. ముమ్ముందు మరింత ఉత్సాహంతో పనిచేస్తాం. ఆజాదీగా అమృత్ ఉత్సవాల తర్వాత ఇదే తొలి ఎన్నిక. మంత్రి మండలి జాబితా ఇవ్వాలని రాష్ట్రపతి కోరారు. ఎల్లుండి సాయంత్రం ప్రమాణస్వీకారం సౌకర్యంగా ఉంటుంది. మంత్రుల జాబితాను రాష్ట్రపతికి అందజేస్తాను’ అని మోదీ తెలిపారు.NDA will form a strong, stable and growth-oriented government. Speaking outside Rashtrapati Bhavan. https://t.co/qstllaPjna— Narendra Modi (@narendramodi) June 7, 2024 భాగస్వామ్య పక్షాల నేతలు వెంటరాగా.. మోదీ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. తమ కూటమికి మద్దతు ఇస్తున్న పార్టీల లేఖలు, కొత్తగా ఎంపికైన మొత్తం ఎంపీల జాబితాను రాష్ట్రపతికి అందజేశారాయన. ఆ వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రపతి ముర్మును మోదీని ఆహ్వానించారు.జేపీ నడ్డా నివాసంలో మంత్రివర్గ కూర్పుపై కసరత్తుమంత్రివర్గ కూర్పుపై ఎన్డీయే భాగస్వామి పక్ష నేతలత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కసరత్తు జరుగుతోంది. జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌లు.. ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నేతలను ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతున్నారు. బీజేపీ అగ్ర నేతలు.. అజిత్ పవార్, ఏక్నాథ్ షిండేతో చర్చలు జరిపారు.ప్రభుత్వ ఏర్పాటుకు మోదీని ఆహ్వానించిన రాష్ట్రపతి ముర్ము -
ప్రభుత్వ ఏర్పాటుకు మోదీని ఆహ్వానించిన రాష్ట్రపతి ముర్ము
న్యూఢిల్లీ, సాక్షి: కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించారు. శుక్రవారం సాయంత్రం ఎన్డీయే పక్ష నేత నరేంద్ర మోదీ, భాగస్వామ్య పక్ష నేతలు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. రాష్ట్రపతి ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. భాగస్వామ్య పక్షాల నేతలు వెంటరాగా.. మోదీ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. తమ కూటమికి మద్దతు ఇస్తున్న పార్టీల లేఖలు, కొత్తగా ఎంపికైన మొత్తం ఎంపీల జాబితాను రాష్ట్రపతికి అందజేశారాయన. ఆ వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రపతి ముర్మును మోదీని ఆహ్వానించారు.#WATCH | Delhi: Narendra Modi meets President Droupadi Murmu at the Rashtrapati Bhavan and stakes claim to form the government. He was chosen as the leader of the NDA Parliamentary Party today. pic.twitter.com/PvlK44ZC2x— ANI (@ANI) June 7, 2024ఎన్డీయే పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని కావటం ఇప్పటికే ఖరారైంది. ఆదివారం సాయంత్రం మోదీ ప్రధానిగా కర్తవ్యపథ్‌లో ప్రమాణం చేయనున్నారు.ఎన్డీయే కూటమిలోని పార్టీల ఎంపీలు ఇవాళ ఎన్డీయే పక్ష నేతగా నరేంద్ర మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. బీజేపీ సొంతంగా 240 సీట్లు గెలువగా.. సొంతంగా మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లను దాటలేకపోయింది. దీంతో బీజేపీ కూటమిలోని మిత్ర పక్షాల మద్దతు మరోసారి కేంద్రంలో ప్రభుత్వం కొలుదీరనుంది.మరోవైపు.. కేంద్ర మంత్రి పదవులపై నిన్న ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. అయితే రాష్ట్రపతిని కలిసిన అనంతరం ఎన్డీయే నేతలు మరోసారి భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరగబోయే భేటీకి మిత్రపక్షాల నేతలంతా హాజరుకానున్నారు. ఇప్పటికే అమిత్ షా, అజిత్ పవార్లు నడ్డా నివాసానికి చేరుకున్నారు. మంత్రి వర్గ కూర్పుపై ఈ భేటీలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
రాష్ట్రపతి ముర్ముతో ఈసీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లతో కలిసి గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయ్యారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో సీఈసీ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సింగ్‌లు రాష్ట్రపతి ముర్మును కలిశారని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్ 73ను అనుసరించి సార్వత్రిక ఎన్నికల్లో 18వ లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికైన, నామినేట్ అయిన సభ్యుల వివరాలతో కూడిన ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ప్రతిని ఆమెకు అందజేశారని వివరించింది. -
Rahul Gandhi: ‘అగ్నిపథ్’లో వివక్షను అడ్డుకోండి
న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకం అమలులో జోక్యం చేసుకుని అమర జవాన్ల కుటుంబాలకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయమే అయినప్పటికీ జాతి భద్రతపై ప్రభావం కలిగించే ఈ అంశంపై సాయుధ బలగాల సుప్రీం కమాండర్‌గా ప్రత్యేక పరిస్థితుల్లో జోక్యం చేసుకోవచ్చన్నారు. ఈ మేరకు శనివారం రాహుల్ ఒక లేఖ రాశారు. దేశం కోసం జీవితాలనే త్యాగం చేస్తున్న అగ్నివీర్లకు మిగతా సైనికుల మాదిరిగానే ప్రయోజనాలను వర్తింపజేయాలని కోరారు. -
మెత్తబడ్డ తైవాన్.. చైనాకు స్నేహ హస్తం
తైపీ: చైనా భారీ ఎత్తున చేపట్టిన సైనిక విన్యాసాలతో తైవాన్ దిగొచ్చింది. తైవాన్ కొత్త అధ్యక్షుడిగా లాయ్ చింగ్-తె బాధ్యతలు స్వీకరిస్తూ చేసిన ప్రసంగంలో చైనాకు వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు. ఇది బీజింగ్‌కు ఆగ్రహం తెప్పించింది. దీనికి ప్రతిగా తైవాన్ చుట్టూ డ్రాగన్ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది.దీంతో లాయ్ చింగ్-తె దూకుడు తగ్గించారు. చైనాతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు సిద్ధమేనన్నారు. ఆదివారం తైపీలో ఓ సమావేశంలో పాల్గొన్న లాయ్‌చింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ సుస్థిరత చాలా ముఖ్యం. తైవాన్ జలసంధిలో అలజడులను ప్రపంచ దేశాలు అంగీకరించవు. చైనాతో కలిసి పని చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’అని లాయ్ చింగ్ అన్నారు.కాగా, ఇటీవల తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనా వ్యతిరేకిగా పేరొందిన లాయ్ చింగ్-తె విజయం సాధించిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడిగా ప్రమాణస్వీకార సందర్భంగా లాయ్‌చింగ్ మాట్లాడుతూ చైనా తమను బెదిరించడం ఆపాలని డ్రాగన్‌కు కాస్త గట్టిగానే చెప్పారు. దీంతో ఆగ్రహించిన చైనా, తైవాన్ చుట్టూ పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది. దీంతో దూకుడు తగ్గించిన లాయ్ చింగ్ మెత్తబడ్డారు. -
గైటీ థియేటర్ ప్రత్యేకత ఏమిటి? బ్రిటీషర్లు ఎందుకు నిర్మించారు?
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు, రేపు హిమాచల్‌లో పర్యటించనున్నారు. ఈరోజు (మంగళవారం) సాయంత్రం గైటీ థియేటర్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాన్ని ఆమె వీక్షించనున్నారు. గైటీ థియేటర్‌ను సందర్శించిన తొలి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డుకెక్కనున్నారు.గైటీ థియేటర్ చారిత్రాత్మక భవనం. దీనిని బ్రిటిష్ వారు నిర్మించారు. బ్రిటిష్ పాలనలో 1884లో సిమ్లా వేసవి రాజధానిగా ఉండేది. ఆ కాలంలో బ్రిటిష్ పాలకులు వినోదం కోసం ఇంగ్లండ్ నుండి కళాకారులను సిమ్లాకు పిలిపించేవారు. అయితే ఆ సమయంలో సిమ్లాలో థియేటర్ లేదు. ఫలితంగా కళాకారుల ప్రదర్శనలు బ్రిటిష్ పాలకుల ఇళ్లలో లేదా అన్నాడేల్ గ్రౌండ్లో జరిగేవి.గైటీ థియేటర్‌ను 1887లో హెన్రీ ఇర్విన్ నిర్మించారు. ఈ థియేటర్ నియో-విక్టోరియన్ గోతిక్ శైలిలో నిర్మించారు. బ్రిటిష్ పాలకులు సిమ్లాను సాంస్కృతిక కేంద్రంగా మార్చాలనుకున్నారు. గైటీ థియేటర్‌కు 137 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ థియేటర్లో పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలు జరిగాయి. ప్రపంచ స్థాయి కళాకారులు ఇక్కడ ప్రదర్శనలు నిర్వహించారు.గైటీ థియేటర్ నిర్మాణం యూ ఆకారంలో ఉంటుంది.ఈ థియేటర్ ప్రత్యేకత ఏమిటంటే స్టేజ్‌పై వినిపించే చిన్నపాటి శబ్దం కూడా చివరి వరుసలో కూర్చున్న ప్రేక్షకులకు వినిపిస్తుంది. ఇక్కడ ప్రదర్శన సమయంలో ఎలాంటి మైక్ ఉపయోగించరు. ప్రపంచంలో కేవలం ఆరు గైటీ థియేటర్లు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటే సిమ్లాలోని ఈ థియేటర్. దీనిని ప్రారంభించిన సమయంలో లాంతర్లను ఉపయోగించేవారు. దీనిలో ఉపయోగించే బ్యాటరీని ఇంగ్లండ్ నుంచి దిగుమతి చేసుకునేవారు.అనుపమ్ ఖేర్, నసీరుద్దీన్ షా తదితర ప్రముఖ బాలీవుడ్ నటులు ఇక్కడ ప్రదర్శనలు ఇచ్చారు. వీరితోపాటు కేఎల్ సెహగల్, టామ్ ఆల్టర్, పృథ్వీరాజ్ కపూర్ తదితరులు కూడా ఇక్కడ తమ ప్రతిభను చాటారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు శశికపూర్ తన భార్య జెన్నిఫర్‌కు ఇక్కడే పెళ్లికి ప్రపోజ్ చేశారు. -
Droupadi Murmu In Ayodhya: అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (ఫొటోలు)
-
Draupadi Murmu: అయోధ్యలో రాష్ట్రపతి
అయోధ్య: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం అయోధ్య సందర్శించారు. నూతన మందిరంలో ఇటీవలే కొలువుదీరిన బాలరామున్ని తొలిసారిగా దర్శించుకున్నారు. స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి హారతిచ్చారు. అంతకుముందు సరయూ నది హారతి కార్యక్రమంలో కూడా రాష్ట్రపతి పాల్గొన్నారు. అంగవస్త్రం ధరించి సంప్రదాయబద్ధంగా హారతిచ్చారు. అనంతరం నదికి పూలమాలలు సమరి్పంచి మొక్కుకున్నారు. తర్వాత ప్రఖ్యాత హనుమాన్ గఢి ఆలయాన్ని సందర్శించారు. పూజల్లో పాల్గొని ఆంజనేయునికి హారతిచ్చారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం రామాలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. రామజన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్రదాస్ రాష్ట్రపతికి దగ్గరుండి దర్శనం చేయించారు. రామ్ లల్లా పట్ల ఆమె భక్తిశ్రద్ధలు అపూర్వమని కొనియాడారు. ‘‘స్వామికి రాష్ట్రపతి హారతిచ్చారు. సాష్టాంగం చేసి భక్తిని చాటుకున్నారు. రాష్ట్రపతి, ప్రధాని ఇద్దరూ గొప్ప రామ భక్తులు కావడం నిజంగా గొప్ప విషయం’’ అని సత్యేంద్రదాస్ అన్నారు. అప్పట్లో విపక్షాల రగడ... అయోధ్యలో నూతన రామాలయం నిర్మాణానంతరం రాష్ట్రపతి అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. ఆలయం జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమవడం తెలిసిందే. బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. దేశవ్యాప్తంగా అన్ని రంగాలకు చెందిన వేలాది మంది ప్రముఖులను కార్యక్రమానికి ఆహా్వనించారు. రాష్ట్రపతి మాత్రం అందులో పాల్గొనలేదు. దీనిపై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు, విమర్శలు వెల్లువెత్తాయి. ప్రథమ పౌరుడైన రాష్ట్రపతిని పూర్తిగా పక్కన పెట్టి సర్వం మోదీమయంగా కార్యక్రమం జరిపించారని కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ తదితరులు దుయ్యబట్టారు. ముర్ము ఆదివాసీ కాబట్టే రాష్ట్రపతి అని కూడా చూడకుండా కావాలనే కార్యక్రమానికి దూరంగా ఉంచారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ బుధవారం ఆమె అయోధ్య వెళ్లి నూతన ఆలయాన్ని, బాలరామున్ని దర్శించుకోవడం విశేషం. -
మరోసారి మా అధ్యక్షునిగా మంచు విష్ణు!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్షునిగా మంచు విష్ణునే కొనసాగించాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఎన్నికలకు వెళ్లకుండా విష్ణు పేరును కమిటీ ఖరారు చేసింది. ఇప్పటికే విష్ణు మా అధ్యక్షునిగా ఉన్నారు. మా అధ్యక్ష భవన నిర్మాణం పూర్తయ్యే వరకు ఆయననే కొనసాగించాలని 26 మంది సభ్యుల కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. -
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫాలో అయ్యే డైట్ ఇదే!
భారత రాష్ట్రపతిగా ఆ అత్యున్నత పదవిని అలంకరించిన అతి పిన్న వయస్కురాలు ద్రౌపది ముర్ము. ప్రతిభా పాటిల్ తర్వాత ఈ పదవిని చేపట్టిన రెండో మహిళ ఆమె. అంతేగాదు ఈ పదవిని అలంకరించిన తొలి గిరిజన మహిళ కూడా ఆవిడే కావడం విశేషం. రాష్ట్రపతిగా అనునిత్యం బిజీగా ఉండే ఆమె ఎలాంటి ఆహారం తీసుకుంటారు? ఆమె డైట్ ఎలా ఉంటుందనే కుతుహలం ఉంటుంది. అయితే ఆమె ఏం డైట్ ఫాలో అవ్వుతారో రాష్ట్రపతి భవన్ చెఫ్‌లు వెల్లడించడమేగాక పలు ఆసక్తికర విషయాలు కూడా చెప్పుకొచ్చారు. అవేంటంటే.. ద్రౌపది ముర్ము సాత్విక ఆహారాన్నే ఇష్టపడతారని, ప్రధానంగా శాకాహారమే ఇష్టంగా తింటారని రాష్ట్రపతి భవన్ చెఫ్‌లు పేర్కొన్నారు. ఆమె 2022లో షెడ్యూల్డ్ తెగకు చెందిన మొదటి సభ్యురాలిగా, భారత రాష్ట్రపతిగా ఎన్నికైన రెండో మహిళగా చరిత్ర సృష్టించారు. అంతేగాదు ఆమె తన తెగకు చెందిన ప్రజల గొంతుకగా మారి వారి సంక్షేమం కోసం కృషి చేసి ప్రజల ఆదరాభిమానలను పొందారు. అలాంటి మహోన్నత వ్యక్తి ముర్ము తను తీసుకునే ఆహారం విషయంలో సాత్వికాహారానికే పెద్దపీట వేస్తారని చెఫ్‌లు చెబుతున్నారు. ముఖ్యంగా పసుపు, ఉప్పు, కొత్తిమీర, పచ్చి బొప్పాయితో చేసే వంటకాన్ని కచ్చితంగా చేయాల్సిందేనని అన్నారు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా వండిన భోజనాన్నే తినడానికి ఇష్టపడతారట ఆమె. ఇక ఆమె ఓట్స్, సంప్రదాయ పూరీ ఆలు సబ్జీ కలియకతో కూడిన అల్పాహారంతో రోజుని ప్రారంభిస్తారని సీనియర్ కుక్ చెఫ్ సంజయ్ కుమార్ చెప్పారు. ఆమెకు ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్‌లలో రైస్ చిల్లాస్ ఒకటని అన్నారు. తరచుగా ఆమె ఒడియా వంటకాలనే ఇష్టపడతారని తెలిపారు. 2000 నుంచి 2009 వరకు రాయ్‌రంగ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒడిశా శాసనసభ సభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా పనిచేయడంతో ఆ రాష్ట్రంతో ఆమెకున్న విడదీయరాని అనుబంధం అమె అభిరుచిలో ప్రతిబింబిస్తోందని అన్నారు. అందువల్లే ఆమె భోజనంలో ఒడియా వంటకాలైన దాల్మా, సంతులా వంటకాలు కచ్చితంగా ఉంటాయని చెప్పారు. దాల్మా అనే వంటకం చిక్పీస్, మునగకాయలు, బొప్పాయి వంటి కూరగాయాలతో కూడిన ఆహారం. ఇక సంతులా అంటే కాలానుగుణ కూరగాయాలతో చేసే మిశ్రమ వంటకం. ఈ రెండు సాత్వికాహారానికి చెందినవేనని చెబుతున్నారు చెఫ్‌లు. ఆమె కాలానుగుణ కూరగాయాలకు, పండ్లకు ప్రాముఖ్యత నిస్తారని తెలిపారు. కాగా, ద్రౌపది ముర్ము ఫాలో అయ్యే ఈ సాత్వికాహార డైట్ వల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. సాత్వికాహారంతో ఒనగురే ప్రయోజనాలు.. మెరుగైన జీర్ణక్రియ, పోషకాల శోషణ శరీరానికి అవసరమయ్యే శక్తి స్థాయిలు అందిస్తుంది మానసిక ఆరోగ్యం బాగుంటుంది. అద్భుతమైన ఏకాగ్రత ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనలను నివారిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది రోగనిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది బరువుని అదుపులో ఉంచుతుంది సుదీర్ఘ ఆయుర్ధాయం ఉంటుంది. (చదవండి: విమాన సిబ్బందిని చీరకట్టుకునేలా చేసింది, ఆ మహిళే) -
పీవీ, చరణ్ సింగ్ సహా నలుగురికి భారతరత్న ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్లకు మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం ప్రదానం చేశారు. పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్‌రావు, చరణ్ సింగ్ తరఫున ఆయన మనవడు జయంత్ చౌదరి, ఎంఎస్ స్వామినాథన్ తరఫున ఆయన కుమార్తె నిత్యా రావు, కర్పూరీ ఠాకూర్ తరఫున కుమారుడు రాంనాథ్ ఠాకూర్ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు. ఈ సందర్భంగా పీవీ సేవలను స్మరించుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బీజేపీ నేత ఎల్కే అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని ఆదివారం ఆయన నివాసంలో రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు. -
పెరూ అధ్యక్షురాలి ఇంట్లో ‘రోలెక్స్’ల కోసం సోదాలు!
లీమా: రోలెక్స్ గేట్ వ్యవహారం పెరూను కుదిపేస్తోంది. అధ్యక్షురాలు డినా బొలార్టీ వద్ద 10కి పైగా అతి ఖరీదైన లెక్స్ గడియారాలున్నాయన్న ఆరోపణలపై దర్యాప్తు మొదలైంది. వాటికోసం కోర్టు ఆదేశాలతో లిమాలోని ఆమె నివాసంలో పోలీసులు సోదా లు నిర్వహించారు! సోదాలను టీవీ చానల్లో ప్రసారం చేశారు. వాచ్‌లు దొరికాయో లేదో వెల్లడించలేదు. తనవద్ద 18 ఏళ్ల వయసులో సొంత డబ్బులతో కొనుక్కున్న ఒకే రోలెక్స్ ఉందని డినా అంటున్నారు. -
జెఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా ధనంజయ్
దేశరాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఇటీవల జరిగిన స్టూడెంట్స్ యూనియన్ (జేఎన్‌యూఎస్‌యూ) ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో వామపక్ష కూటమి విజయం సాధించింది. ఆదివారం అర్థరాత్రి ప్రకటించిన ఫలితాల్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ పదవుల్లో వామపక్ష అభ్యర్థులు గెలుపొందారు. బీఏపీఎస్ఏ ప్రధాన కార్యదర్శి పదవిని దక్కించుకుంది. శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో 73 శాతం ఓట్లు పోలయ్యాయి. జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడిగా బీహార్‌కు చెందిన పీహెచ్డీ విద్యార్థి ధనంజయ్ విజయం సాధించారు. జెఎన్యూఎస్యూ సెంట్రల్ ప్యానెల్లో అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ధనంజయ్ విజయం సాధించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) అభ్యర్థి ఉమేష్ చంద్ర అజ్మీరాపై ధనంజయ్ 922 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ధనంజయ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఈస్తటిక్స్ లో పీహెచ్డీ చేస్తున్నారు. ఆయన బీహార్‌లోని గయ జిల్లాకు చెందిన విద్యార్థి. ధనంజయ్ 1996 తర్వాత జెఎన్యూ స్టూడెంట్స్ యూనియన్‌కి ఎన్నికైన మొదటి దళిత అధ్యక్షుడు. 1996లో బత్తిలాల్ బైరవ విజయం సాధించారు. ధనంజయ్ మీడియాతో మాట్లాడుతూ క్యాంపస్‌లో విద్యార్థినుల భద్రత, స్కాలర్షిప్ పెంపు, మౌలిక సదుపాయాలు మొదలైనవి తన ప్రధాన అజెండా అని పేర్కొన్నారు. #WATCH नवनिर्वाचित JNU अध्यक्ष धनंजय ने कहा, "...अगर कोई है जिसने फीस वृद्धि के खिलाफ लड़ाई लड़ी है तो वह वामपंथी है। यह वामपंथ ही है जिसने सभी के लिए छात्रावास सुनिश्चित किया है और इसके लिए छात्रों ने हम पर अपना भरोसा दिखाया है..." pic.twitter.com/Wjo3X6OHac — ANI_HindiNews (@AHindinews) March 25, 2024 -
Maddali Usha Gayathri: నృత్య తపస్వి
ఆమె ప్రయాణం నాట్యం. ఆమె ప్రయత్నం నాట్యకళకు జీవం పోయడం. నాలుగేళ్ల వయసు నుంచి కూచిపూడిని జీవనాడిగా చేసుకుని., 69 ఏళ్ల వయసులోనూ కళను వీడలేదు హైదరాబాద్ వాసి మద్దాలి ఉషాగాయత్రి. సుదీర్ఘ నృత్య ప్రయాణంలో భారత్‌తోపాటు దేశ విదేశాల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. వందల మంది ఔత్సాహికులు కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇవ్వడమే కాకుండా 200కు పైగా నృత్యాంశాలకు సోలోగా కొరియోగ్రఫీ చేశారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలికి బ్యాలే చేసి, కేంద్ర ప్రభుత్వ అవార్డులు పొందారు. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మక కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్న డా. ఉషా గాయత్రి నృత్య ప్రయాణం తెలుసుకుంటే ఈ కళాసేవ ఒక తపస్సులా అనిపించకమానదు. ‘‘కూచిపూడి నృత్యానికి సంబంధించిన సాహిత్యం, రచనలు చాలా తక్కువగా ఉన్నాయి. దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పుస్తకాలుగా తీసుకురావాలనేది నా చిరకాల స్వప్నం. దానిని నిజం చేయాలనే ప్రయత్నంలో ఉన్నాను’’ అని తనను తాను పరిచయం చేసుకున్న తపస్వి ఉషాగాయత్రి తన నృత్య జీవన గమ్యాన్ని ఇలా మనముందుంచారు. ‘‘నాలుగేళ్ల వయసులో ఉదయ్ శంకర్ శిష్యుడైన దయాల్ శరణ్ వద్ద నాట్యాభ్యాసం మొదలుపెట్టాను. ఇక్కడే కథక్, ఒడిస్సీ, సంగీతం కూడా నేర్చుకున్నాను. ఆ తర్వాత ప్రఖ్యాత గురువు వేదాంతం జగన్నాథ శర్మ వద్ద కూచిపూడి, పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ, పద్మభూషణ్ డా.వెంపటి చినసత్యం, వేదాంతం ప్రహ్లాద శర్మ వద్ద యక్షగానాలు, ప్రఖ్యాత కళాక్షేత్ర గురువు కమలారాణి వద్ద నట్టువాంగం, పద్మశ్రీ డా.నటరాజ రామకృష్ణ వద్ద పదములు నేర్చుకున్నాను. 1988లో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.ఏ. పూర్తయ్యింది. అంతేకాకుండా ‘తెలుగు సాహిత్యంలో సత్యభామ పాత్ర వృద్ధి, వికాసం, నాట్యంలో అవతరణ‘ అనే అంశం మీద పరిశోధన చేసి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ పొందాను. రాజీవ్‌గాంధీ విశ్వవిద్యాలయంలోని నృత్య విభాగంలోనూ పనిచేశాను. ఆ తర్వాత దాదాపు పాతిక సంవత్సరాలు పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగం చేశాను. నాట్యానికే అంకితం అవ్వాలనే తపనతో ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. ‘నృత్యకిన్నెర‘ పేరుతో ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో వందల మందికి శిక్షణనిస్తూ వచ్చాను. ఇందులో 50 మంది శిష్యులు నృత్యంలో డిప్లొమా సర్టిఫికెట్లు పొందారు. 10 మంది చిన్నారులు భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీసీఆర్టీ స్కాలర్షిప్ పొందారు. నా శిష్యులు దేశవిదేశాల్లో స్థిరపడటమే కాకుండా నృత్యంలో పీహెచ్డీ, ఎం.ఏ. పట్టాలు పొంది గురువులు, నర్తకులుగా అభివృద్ధి చెందారని చెప్పుకోవడం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. పాదం కదపని వేదిక లేదు సంగీత నాటక అకాడమీ, సౌత్ జోన్ కల్చరల్ సెంటర్, టీటీడీ, రాష్ట్ర సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో ఎన్నో వందల ప్రదర్శనలు. దేశంలోని న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లోనే కాకుండా విదేశాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చాను. భారత స్వాతంత్య్ర దినోత్సవ నేపథ్యంలో 1997లో మారిషస్‌లో ఇచ్చిన ప్రదర్శనకుగాను ఆనాటి ప్రెసిడెంట్ సత్కరించడం ఒక గొప్ప జ్ఞాపకం. ప్రదర్శనల కోసం శిష్యులతోపాటు యూకే, యూరోప్‌లలో పర్యటించాను. యూకేటీఏ, జయతే కూచిపూడి, అంతర్జాతీయ కూచిపూడి ఫెస్టివల్లో భాగంగా ప్రదర్శనలు ఇవ్వడం మరో గొప్ప అనుభూతి. ప్రధానంగా దాదాపు 200 లకు పైగా సోలో నృత్యాంశాలకు కొరియోగ్రఫి చేయడంతో పాటు ప్రతిష్టాత్మకమైన 16 బ్యాలేలు చేశాను. ఇందులో భాగంగా రచయిత ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ చారిత్రక నవల శివభక్త మార్కండేయ, మా తెలుగుతల్లికి మల్లెపూదండ, స్వర్ణోత్సవ భారతి, వందేమాతరం, సంక్రాంతి లక్ష్మి, రుక్మిణీ సత్య, అలిమేలుమంగ చరిత్ర, యశోదకృష్ణ వంటి బ్యాలేలు ప్రదర్శించాను. రవీంద్రుని గీతాంజలి మాట నిజమైన వేళ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలికి బ్యాలే చేయడం నా అదృష్టంగా భావిస్తాను. కలకత్తా వేదికగా ఈ ప్రదర్శన చేసిన సమయంలో ఒక విషయం నన్ను అమితమైన ఆనందానికి లోను చేసింది. ‘ఏదో ఒకనాడు, ఎవరో ఒకరు నా సాహిత్యానికి నృత్య రూపాన్ని తీసుకువస్తారు’ అని ఆనాడే రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన మాటలను అక్కడి వారు ప్రస్తావించడం మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని, సంతృప్తినిచ్చింది. కావ్యాలకు, కథనాలకు, నృత్యానికి ఎంతటి అనుబంధం ఉంటుందో ఆ సంఘటన రుజువు చేసింది. 12 గంటలు 12 మంది శిష్యులు నృత్యం దర్శయామిలో భాగంగా 72 సోలో నృత్యాంశాలైన శబ్దాలు, తరంగములు, దరువులు, తిల్లానాలు, అష్టపదులు, కీర్తనలు.. తదితర అంశాలతో 12 మంది శిష్యురాళ్లతో కలిసి 12గంటల పాటు అవిరామంగా నృత్యప్రదర్శన చేశాం. 12గంటల పాటు నిరంతరాయంగా నట్టువాంగం నిర్వహించి దానిని గురువు వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రికి అంకితం చేశాం. చేసిన సోలో ప్రదర్శనలు, బ్యాలేలు న్యూ ఢిల్లీ దూరదర్శన్ తో పాటు విదేశీ ఛానళ్లలోనూ ప్రసారమయ్యాయి. ఎంతో ప్రోత్సాహం.. ఈ నృత్య ప్రయాణంలో నా జీవిత భాగస్వామి మద్దాళి రఘురామ్ ప్రోత్సాహం ఎనలేనిది. ఎన్నో పురస్కారాలు, సత్కారాలు అందుకున్నాను. వాటిలో .. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో 2001లో అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రీయ అవార్డు ‘హంస పురస్కారాన్ని’, 2004లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభా పురస్కారం, యూరప్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ నర్తకిగా, న్యూయార్క్‌లో ఉత్తమ నాట్యగురువుగా, సిలికాన్ ఆంధ్ర అంతర్జాతీయ కూచిపూడి కన్వెన్షన్ లో ఆనాటి ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు, మారిషస్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నృత్యరత్న బిరుదుతోపాటు, ఉత్తమ నర్తకి–నాట్యగురు అవార్డులను పొందాను. 1984లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (న్యూ ఢిల్లీ) ఆధ్వర్యంలో ఉత్తమ కళాకారిణిగానూ, భారత్‌తో పాటు విదేశాల్లో నిర్వహించిన పలు అంతర్జాతీయ కూచిపూడి నృత్యోత్సవాలకు న్యాయనిర్ణేతగా సేవలందించాను. గత డిసెంబర్లో స్ట్రోక్ వచ్చి వీల్‌చెయిర్‌లో ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. అయినా నా కళా తపన ఆగలేదు. వీల్ చెయిర్ నుంచే విద్యార్థులకు కూచిపూడి నృత్యంలో శిక్షణను అందిస్తున్నాను. ఈ నెల 6న రాష్ట్రపతి చేతుల మీదుగా కేంద్ర సంగీత నాటక పురస్కారాన్ని వీల్‌చెయిర్‌లో ఉండే అందుకున్నాను. నా శ్వాస ఉన్నంతవరకు కళాసేవలో తరించాలని, కళలో ఔత్సాహికులను నిష్ణాతులను చేయాలన్నదే నా తపన’ అంటూ ఉషాగాయత్రి తన సుదీర్ఘ నృత్య ప్రయాణాన్ని ఎంతో ఆనందంగా మన ముందు ఆవిష్కరించారు. – హనుమాద్రి శ్రీకాంత్, సాక్షి సిటీ, హైదరాబాద్ -
Daniel Jackson: పద్నాలుగేళ్ల వయసులోనే దేశాధ్యక్షుడు
ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుడి పేరు డేనియల్ జాక్సన్. ప్రస్తుతం ఇతడి వయసు పంతొమ్మిదేళ్లు. ఆస్ట్రేలియాలో పుట్టి, బ్రిటన్‌లో పెరిగిన డేనియల్ తన పద్నాలుగేళ్ల వయసులోనే ఒక దేశానికి అధ్యక్షుడయ్యాడు. అదెలా అని అవాక్కవుతున్నారా? ప్రస్తుతం ఉనికిలో ఉన్న దేశాలకు అధ్యక్షుడు కావడం సాధ్యం కాదని తెలిసిన ఈ బాల మేధావి ఏకంగా తనదైన సొంత దేశాన్నే ఏర్పాటు చేసుకున్నాడు. ఐదేళ్ల కిందట తన ఆరుగురు మిత్రులతో కలసి సెర్బియా–క్రొయేషియాల మధ్య డాన్యూబ్ నది మధ్యలో ఆ రెండు దేశాలకూ చెందని ఖాళీ భూభాగాన్ని గుర్తించి, లేతనీలం, తెలుపు చారలతో సొంత జెండాను తయారు చేసుకుని, అక్కడ తన జెండా నాటేశాడు. జెండా నాటడానికి ముందే చాలా పరిశోధన సాగించి, ఈ భూభాగం చారిత్రకంగా ఎవరికీ చెందనిదని తేల్చుకున్నాడు. ఈ దేశానికి ‘వెర్డిస్’గా నామకరణం చేసి, దానికి తనను తానే అధినేతగా ప్రకటించుకున్నాడు. దీని విస్తీర్ణం 0.2 చదరపు మైళ్లు–అంటే 128 ఎకరాలు మాత్రమే! ఈ లెక్కన వాటికన్ నగరం తర్వాత రెండో అతిచిన్న దేశం ఇదే! ప్రస్తుతం నాలుగువందల మంది ఉంటున్న ఈ చిరుదేశంలో పౌరసత్వం కోసం ఇప్పటికే దాదాపు పదిహేనువేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇవి చదవండి: మెదడును 10 శాతమే ఉపయోగించుకుంటున్నామా? ఈ చిరుదేశాధినేత డేనియల్ ఉక్రెయిన్ యుద్ధ బాధితుల కోసం తన దేశం తరఫున అధికారికంగా విరాళం పంపడం విశేషం. పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేయాలనుకుంటున్నామని, దేశాన్ని పౌరులతో కళకళలాడేలా తీర్చిదిద్దాలనేదే తన కోరిక అని డేనియల్ చెబుతున్నాడు. అయితే, పొరుగునే ఉన్న క్రొయేషియాతో ఈ చిరుదేశానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. క్రొయేషియా భూభాగంలో పొరపాటున అడుగుపెట్టిన వెర్డిస్ పౌరులను క్రొయేషియన్ పోలీసులు బందీలుగా పట్టుకున్నారు. అంతటితో ఆగకుండా, గత అక్టోబర్ 12న వెర్డిస్ భూభాగాన్ని తమ స్వాధీనంలోకి తీసుకుని, అక్కడ ఉన్న తమనందరినీ నిర్బంధంలోకి తీసుకుని, ఆ తర్వాత తమ భూభాగంలో విడిచిపెట్టారని, క్రొయేషియా చర్య అంతర్జాతీయ నిబంధనలకు వ్యతిరేకమని, దీనిపై తాము అంతర్జాతీయ వేదికలపై న్యాయపోరాటం సాగిస్తామని డేనియల్ చెప్పాడు. రానున్న ఐదేళ్లలో తమ దేశాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని అన్నాడు. బయటి నుంచి తమ దేశానికి చేరుకోవాలంటే, క్రొయేషియా భూభాగాన్ని దాటాల్సి ఉంటుందని, అందువల్లనే క్రొయేషియాతో వివాదాస్పద పరిస్థితులు నెలకొన్నాయని తెలిపాడు. View this post on Instagram A post shared by Daniel Jackson (Данијел Џексон) (@danieljacksonvs) -
ఆమెను కలవడం ఆనందంగా ఉంది: ఉపాసన పోస్ట్ వైరల్
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలతో సంబంధం లేకపోయినా.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో టచ్‌లోనే ఉంటోంది. ఇటీవలే అయోధ్యకు వెళ్లిన ఉపాసన కుటుంబం సభ్యులతో కలిసి బాలరామున్ని దర్శించుకున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ఈవెంట్‌కు ఉపాసన హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆమె కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. అంతే కాకుండా రాష్ట్రపతిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉపాసన తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' ఈరోజు అంతర్గత ప్రపంచశాంతి కోసం హార్ట్‌పుల్‌నెస్ గ్లోబల్ మహోత్సవ్ పాల్గొనడం గౌరవంగా ఉంది. ముఖ్యంగా భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము జీని నా కుమార్తె క్లీంకారతో సహా కలవడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా కమలేశ్ దాజీ నిజంగా ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చారు. నేను నా బిడ్డను అన్ని సానుకూలతలను స్వీకరించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను.' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. హార్ట్‌పుల్‌నెస్ గ్లోబల్ మహోత్సవ్ కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలోని నందిగామలో జరిగింది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
రెండు దశల్లో ‘జమిలి’ ఎన్నికలు
న్యూఢిల్లీ: ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’పై అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమరి్పంచింది. రామ్‌నాథ్ కోవింద్‌తోపాటు కమిటీ సభ్యులైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్మన్ ఎన్.కె.సింగ్, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్ సుభాష్ కాశ్యప్, లోక్‌సభలో మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ముర్మును నివేదిక అందజేశారు. జమిలి ఎన్నికలపై 18,629 పేజీల ఈ నివేదికలో ఉన్నత స్థాయి కమిటీ కీలక సిఫార్సులు చేసింది. రెండంచెల విధానాన్ని సూచించింది. తొలుత లోక్‌సభ, అన్ని రాష్ట్రాల శాసనసభలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత 100 రోజుల్లోగా అన్ని రకాల స్థానిక సంస్థలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంది. జమిలి ఎన్నికలతో అభివృద్ధి వేగవంతం అవతుందని, దేశానికి మేలు జరుగుతుందని ఉద్ఘాటించింది. ఈ ఎన్నికల కోసం కోవింద్ కమిటీ రాజ్యాంగానికి మొత్తం 18 సవరణలు సూచించింది. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే.... రామ్‌నాథ్ కోవింద్ కమిటీని 2023 సెప్టెంబర్ 23న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ 191 రోజులపాటు విస్తృత పరిశోధన సాగించింది. భాగస్వామ్యపక్షాలు, నిపుణులతో సంప్రదింపులు జరిపింది. దక్షిణాఫ్రికా, స్వీడన్, బెల్జియం, జర్మనీ, జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, బెల్జియం తదితర దేశాల్లో అమల్లో ఉన్న జమిలి ఎన్నికల ప్రక్రియలను అధ్యయనం చేసింది. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే కోవింద్ కమిటీ సిఫార్సుల చేసిందని అధికార వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఈ సిఫార్సుల ప్రకారం రాజ్యాంగానికి కనిష్ట సవరణలతో జమిలి ఎన్నికలు నిర్వహించవచ్చని పేర్కొన్నాయి. 32 పార్టీల మద్దతు జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోవింద్ కమిటీ సేకరించింది. అభిప్రాయం చెప్పాలంటూ 62 పార్టీలకు సూచించగా, 47 పార్టీలు స్పందించాయి. ఇందులో 32 పార్టీలు జమిలికి జైకొట్టాయి. 15 పార్టీలు వ్యతిరేకించాయి. మిగిలిన 15 పార్టీలు స్పందించలేదు. బీజేపీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఏఐఏడీఎంకే, బిజూ జనతాదళ్, మిజో నేషనల్ ఫ్రంట్, శివసేన, జనతాదళ్(యూ), శిరోమణి అకాలీదళ్ తదితర పార్టీలు మద్దతు ప్రకటించగా, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, సీపీఎం, సీపీఐ, ఎంఐఎం, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, నాగా పీపుల్స్ ఫ్రంట్, సమాజ్‌వాదీ పార్టీ వంటివి వ్యతిరేకించాయి. త్వరలో లా కమిషన్ నివేదిక ఏకకాలంలో ఎన్నికలపై లా కమిషన్ త్వరలో తన నివేదిక సమర్పించనున్నట్లు తెలిసింది. 2029 నుంచి జమిలి ఎన్నికలు ప్రారంభించాని లా కమిషన్ సిఫార్సు చేయబోతున్నట్లు సమాచారం. లోక్‌సభ, శాసనసభలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్ సూచించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కోవింద్ కమిటీ సిఫార్సులు ► లోక్‌సభలో హంగ్, అవిశ్వాస తీర్మానం వంటి సందర్భాలు ఎదురైనప్పుడు మళ్లీ తాజాగా ఎన్నికలు నిర్వహించాలి. కొత్త సభను ఏర్పాటు చేయాలి. ► ఎన్నికలు జరిగి కొత్తగా కొలువుదీరిన లోక్‌సభ ఐదేళ్లు కొనసాగదు. అంతకంటే ముందున్న సభ గడువు ఎన్నాళ్లు మిగిలి ఉంటుందో అప్పటివరకు మాత్రమే కొత్త సభ మనుగడ సాగిస్తుంది. ► రాష్ట్రాల శాసనసభలు లోక్‌సభ కాల వ్యవధి ముగిసేవరకు(ముందుగా రద్దయితే తప్ప) పనిచేస్తాయి. ► జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 83(పార్లమెంట్ కాల వ్యవధి), ఆర్టికల్ 172(శాసనసభ కాల వ్యవధి)కు సవరణ చేయాలి. ► ఆర్టికల్ 83, ఆర్టికల్ 172కు సవరణ చేయడానికి రాష్ట్రాల అమోదం అవసరం లేదు. ► జమిలి ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాల ఎన్నికల సంఘాలతో సంప్రదించి ఒక ఉమ్మడి ఓటరు జాబితా, ఓటరు గుర్తింపు కార్డులు రూపొందించాలి. ఇందుకోసం ఆర్టికల్ 325కి సవరణ చేయాల్సి ఉంటుంది. ► స్థానిక సంస్థలతో ఏకకాలంలో ఎన్నికల కోసం ఆర్టికల్ 324ఏను సవరించాలి. ► ఆర్టికల్ 325, ఆర్టికల్ 324ఏకు సవరణ చేయాలంటే రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి. ► ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతిఏటా ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడుతోంది. విలువైన సమయం వృథా అవుతోంది. జమిలి ఎన్నికలతో ఇలాంటి సమస్యలు పరిష్కరించవచ్చు. ► జమిలి ఎన్నికల కోసం ప్రభుత్వం ఒక పటిష్టమైన చట్టబద్ధ యంత్రాంగాన్ని రూపొందించాలి. -
Uttarakhand Ucc: ‘యూసీసీ’కి రాష్ట్రపతి ఆమోదముద్ర
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఫిబ్రవరిలో ఆమోదించిన యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం(మార్చ్ 13) ఆమోదముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడటంతో యూసీసీ బిల్లు చట్టంగా మారింది. వివాహం, విడాకులు, వారసత్వ హక్కులు వంటి పర్సనల్ చట్టాలన్నింటిని ఒకే గొడుగుకు కిందకు తీసుకువచ్చి ఉత్తరాఖండ్ ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ రూపొందించింది. తాజాగా ఈ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయడంతో యూసీసీ అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రికార్డు సృష్టించింది. యూసీసీ బిల్లు ముస్లింల సంప్రదాయ హక్కులను కాలరాసే విధంగా ఉందని, ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. సీఎం స్టాలిన్‌కు ఆ అధికారం లేదు -
International Womens Day 2024: రాజ్యసభకు సుధామూర్తి
సాక్షి, న్యూఢిల్లీ/బనశంకరి: ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణమూర్తి సతీమణి, ప్రముఖ సంఘ సేవకురాలు, రచయిత్రి డాక్టర్ సుధా నారాయణమూర్తి(73) రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమెను పార్లమెంట్ ఎగువ సభకు నామినేట్ చేశారు. సామాజిక, విద్యా రంగాల్లో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా పెద్దల సభకు పంపిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే రాజ్యసభకు నామినేట్ చేయడం తనకు డబుల్ సర్ప్రైజ్ అని సుధామూర్తి పేర్కొన్నారు. తాను ఏనాడూ పదవులు ఆశించలేదని చెప్పారు. రాష్ట్రపతి తనను పెద్దల సభకు నామినేట్ చేయడానికి గల కారణం తెలియదని అన్నారు. ఉన్నత చట్టసభకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని వెల్లడించారు. ఇది తనకు కొత్త బాధ్యత అని వ్యాఖ్యానించారు. రాజ్యసభ సభ్యురాలిగా తన వంతు సేవలు అందిస్తానని వివరించారు. ప్రధాని మోదీకి సుధామూర్తి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో పర్యటిస్తున్న సుధామూర్తి ఫోన్లో మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ హర్షం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సుధామూర్తిని రాష్ట్రపతిద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేయడం చాలా ఆనందంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అనాథ ఆశ్రమాలు ఏర్పాటు చేయడంతోపాటు వివిధ రంగాల్లో ఎన్నెన్నో సేవలు అందించిన సుధామూర్తి చట్టసభలోకి అడుగు పెడుతుండడం నారీశక్తికి నిదర్శనమని మోదీ ఉద్ఘాటించారు. ఆమెకు అభినందనలు తెలియజేశారు. టెల్కోలో తొలి మహిళా ఇంజనీర్ డాక్టర్ సుధామూర్తి 1950 ఆగస్టు 19న కర్ణాటకలోని హావేరి జిల్లా శిగ్గావిలో జని్మంచారు. ఆమె తల్లిదండ్రులు డాక్టర్ ఆర్‌హెచ్ కులకరి్ణ, విమలా కులకరి్ణ. సుధామూర్తి హుబ్లీలోని బీవీబీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బీఈ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి కంప్యూటర్స్‌లో ఎంఈ చేశారు. టాటా ఇంజినీరింగ్ లోకోమోటివ్ కంపెనీ(టెల్కో)లో ఉద్యోగంలో చేరారు. దేశంలోనే అతి పెద్దవాహన తయారీ కంపెనీలో మొదటి మహిళా ఇంజినీర్‌గా గుర్తింపు పొందారు. 1970 ఫిబ్రవరి 10న నారాయణమూర్తితో వివాహం జరిగింది. 1981లో స్థాపించిన ఇన్ఫోసిస్ కంపెనీకి సుధామూర్తి సహ వ్యవస్థాపకురాలు. సంస్థ ప్రారంభించే సమయంలో రూ.10వేలు తన భర్తకు ఇచ్చి ప్రోత్సహించారు. సేవా కార్యక్రమాలు.. పురస్కారాలు 1996లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌ను సుధామూర్తి ప్రారంభించారు. కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో పలు పుస్తకాలు రాశారు. సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. వరద బాధితుల కోసం 2,300 ఇళ్లు నిర్మించారు. పాఠశాలల్లో 70 వేల గ్రంథాల యాలు నిర్మించారు. భారత ప్రభుత్వం నుంచి 2006లో పద్మశ్రీ,, 2023లో పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. కర్ణాటక ప్రభుత్వం నుంచి చింతామణి అత్తిమబ్బే అవార్డు స్వీకరించారు. సాహిత్యంలో ఆమె చేసిన సేవకుగానూ ఆర్కే నారాయణ సాహిత్య పురస్కారం, శ్రీరా జా–లక్ష్మీ ఫౌండేషన్ అవార్డు అందుకున్నారు. భర్త నారాయణమూర్తి (2014)తో సమానంగా 2023లో గ్లోబల్ ఇండియన్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు ద్వారా తాను అందుకున్న మొత్తాన్ని టోరంటో విశ్వవిద్యాలయానికి విరాళంగా ఇచ్చారు. నాన్ఫిక్షన్ విభాగంలో క్రాస్‌వర్డ్ బుక్ అ వార్డు, ఐఐటీ–కాన్పూర్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. నారాయణమూర్తి, సుధామూర్తి దంపతులకు అక్షతామూర్తి, రోహన్‌మూర్తి సంతానం. అక్షతామూర్తి భర్త రిషి సునాక్ బ్రిటన్ ప్రధాన మంత్రి. వీరిది ప్రేమ వివాహం. రాజ్య సుధ – ప్రత్యేక కథనం ఫ్యామిలీలో.. -
Infosys Sudha Murty: రాజ్య సుధ
సాటి మనుషుల కోసం పని చేయడం సామాజిక సేవ ద్వారా పరిస్థితులను మెరుగుపరచడం యువతకు స్ఫూర్తిగా నిలవడం.. రచయితగా ఎదగడం ఇన్ఫోసిస్ దిగ్గజంగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందడం సుధామూర్తిని నేడు రాజ్యసభకు చేర్చాయి. ఉమెన్స్ డే రోజు ఆమెను రాష్ట్రపతి ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. సుధామూర్తి జీవన విశేషాలు. ► తొలి పాఠాలు సుధామూర్తి బాల్యం హుబ్లీలో గడిచింది. తండ్రి కులకర్ణి డాక్టర్. ఆయన రోజూ టీ సేవించేవాడు. ఒకరోజు పాలు రాలేదు. తండ్రి టీ తాగక వేరే ఏ పనీ మొదలుపెట్టలేక కూచుని ఉన్నాడు. ‘ఏంటి నాన్నా?’ అని అడిగింది సుధామూర్తి. ‘ఉదయాన్నే టీకి నేను అలవాటు పడ్డానమ్మా. ఇవాళ టీ తాగక తలనొప్పి వచ్చింది. నువ్వు మాత్రం దేనికీ అతిగా అలవాటు పడకు.. కాఫీ, టీలకైనా సరే’ అన్నాడు. సుధామూర్తి ఆ పాఠాన్ని గుర్తు పెట్టుకుంది. ఇవాళ ఆమెకు డెబ్బై నాలుగు ఏళ్లు. నేటికీ ఉదయాన్నే లేచి టీగానీ కాఫీ గాని తాగి ఎరగదు. సుధామూర్తి హుబ్లీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉండే షిగావ్‌లో పుట్టింది. అక్కడ ఆమె అమ్మమ్మ, తాతయ్య ఉండేవారు. తాతయ్య స్కూల్ టీచర్. ఆయన తనకంటే వయసులో ఎంత చిన్నవారినైనా ‘మీరు’ అని బహువచనం వాడేవారు. ‘నీ కంటే చిన్న కదా తాతయ్య’ అని సుధామూర్తి అంటే ‘లోపలి ఆత్మ పెద్దదే కదమ్మా’ అనేవారు. ఎదుటివారిని గౌరవించడం అలా నేర్చుకుందామె. తాతయ్య ఆమెకు మూడు జీవన పాఠాలు నేర్పారు. 1.సింపుల్‌గా జీవించు 2.జ్ఞానాన్ని సముపార్జిస్తూనే ఉండు 3. పుస్తకాలు చదువు. ఇవి సుధామూర్తి నేటికీ పాటిస్తూనే ఉంది. అమ్మమ్మ ‘ఆకలితో ఉన్నవారిని గమనించు’ అని చెప్పింది. వాళ్ల ఇంటికి రోజూ ఒక భిక్షకుడు వస్తే ఇంట్లో మంచి బియ్యం నిండుకుని ముతకబియ్యం ఉన్నా అమ్మమ్మ మంచి బియ్యమే భిక్షకుడికి వేసేది. ‘ముతక బియ్యం మనం తినొచ్చులే’ అనేది. ఇదీ సుధామూర్తికి తొలి పాఠమే. ఇక అమ్మ విమల నేర్పిన పాఠం– ‘ఎంతో అవసరమైతే తప్ప డబ్బు ఖర్చు పెట్టకు’ అని. అంతే కాదు నీకు బాల్యంలో మంచి అలవాట్లు ఉంటే అవే కాపాడతాయి అని కూడా ఆమె అనేది. ఉదయాన్నే లేచి కాగితం మీద 10 సార్లు ‘దేవుడికి నమస్కారం’ అని రాయించేదామె. నేటికీ సుధా మూర్తి ఆ అలవాటును మానలేదు. ఇక స్కూల్ టీచరు రాఘవేంద్రయ్య... ‘నీకు లెక్కలు భలే వస్తున్నాయి. లెక్కల్ని వదలకు. పైకొస్తావ్‘ అన్నాడు. ఆమె ఆనాటి నుంచి లెక్కల్నే రెక్కలుగా చేసుకుంది. ► కుతూహలమే గురువు చిన్నప్పుడు సుధామూర్తికి ప్రతిదీ కుతూహలమే. వీధుల్లో కొట్లాటలు అవుతుంటే అక్కడకు పరిగెత్తి వెళ్లి నిలబడేది. వినోదం కోసం కాదు. కారణం ఏమై ఉంటుందా అని. చిన్న ఊళ్లో ప్రతి ఇల్లూ అందరికీ పరిచయమే. అందరి జీవితాలనూ ఆమె పరిశీలిస్తూ ఉండేది. ఇక పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిగితే ఆమె తప్పని సరిగా ఒక స్టీలు క్యారేజీ తీసుకుని బయలుదేరేది. విందులో ఏ పదార్థాలు బాగున్నాయో ఏ పదార్థాలు బాగలేవో మొత్తం రుచి చూసి వస్తూ వస్తూ బాగున్న వాటిని క్యారేజీలో అడిగి తెచ్చుకునేది. కాలేజీ రోజుల వరకూ కూడా పెళ్ళిళ్లకు క్యారేజీ తీసుకోకుండా సుధామూర్తి వెళ్లేది కాదు. ‘ఎందుకో నాకు గిన్నెల క్యారేజీ అంటే నేటికీ ఇష్టం’ అంటుందామె. ► మసాలా దోసె పార్టీ లెక్కలు బాగా నేర్చుకున్న సుధా హుబ్లీలోని బి.వి.బి. కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో చేరింది. ఇక ఆ రోజు నుంచి ఊళ్లోని పెద్ద మనుషులంతా ఆమె తండ్రి దగ్గరకు వచ్చి వాపోవడమే. ‘అమ్మాయిని ఇంజనీరింగ్ చదివిస్తున్నావ్. పెళ్లెవరు చేసుకుంటారు’ అని బెంగపడటమే. తండ్రి కూడా ఒక దశలో తప్పు చేశానా అనుకున్నాడు. కాని సుధామూర్తి మొదటి సంవత్సరానికి ఫస్ట్ క్లాస్‌లో పాసైంది. తండ్రికి సంతోషం కలిగింది. ‘ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నావ్ కదా... పద మసాలా దోసె పార్టీ చేసుకుందాం’ అని తీసుకెళ్లాడు. ప్రతి సంవత్సరం ఆమె ఫస్ట్‌క్లాస్ తెచ్చుకోవడం.. తండ్రి తీసుకెళ్లి మసాలా దోసె తినిపించడం. ఆ తండ్రీ కూతుళ్ల జీవితంలో పార్టీ చేసుకోవడం అంటే అదే. అది కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే. ‘కాని ఆ పార్టీ ఎంతో సంతోషాన్ని ఇచ్చేది. అపురూపం అనిపించేది’ అంటుందామె. ► చరిత్ర మార్చిన కార్డు ముక్క 1974లో టాటా వారి ‘టెల్కో’ సంస్థలో ఇంజనీరింగ్ ఉద్యోగాలు పడ్డాయి. పేపర్లో ఆ యాడ్ చూసింది సుధామూర్తి. అర్హతలు అన్నీ ఆమెకు ఉన్నాయి. కాని యాడ్ కింద ‘స్త్రీలు అప్లై చేయాల్సిన పని లేదు’ అని ఉంది. అప్పుడు సుధామూర్తికి ఆగ్రహం వచ్చింది. రోషం కలిగింది. జె.ఆర్.డి.టాటాకు ఒక కార్డు గీకి పడేసింది. ‘దేశంలో ఉన్న ఇంతమంది స్త్రీలకు పని చేసే హక్కు లేకపోతే వారు ఎలా అభివృద్ధిలోకి వస్తారు?’ అని ప్రశ్న. ఆ కార్డు జె.ఆర్.డి. టాటాకు చేరింది. ఆ వెంటనే ఆమెకు ఇంటర్వ్యూకు పిలుపు, ఆపై ఉద్యోగం వచ్చాయి. పూణెలో సుధామూర్తి తొలి ఉద్యోగం చేసింది. ఆమె రాసిన లేఖను టాటా సంస్థ నేటికీ భద్రపరిచి ఉంచింది. 1974లో టెల్కోలో సుధామూర్తి ఒక్కతే మహిళా ఉద్యోగి. దాదాపు 50 ఏళ్ల తర్వాత సుధామూర్తి పూణెలో ఆ సంస్థను సందర్శిస్తే (ఇప్పుడు టాటా మోటార్స్) 900 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. ‘నేను అక్కడ నిలబడి మా తండ్రిని తలుచుకుని ఉద్వేగంతో కన్నీరు కార్చాను. ఎవరు భయపెట్టినా నన్ను ఆయన చదివించాడు. నా వల్ల ఇవాళ ఇంతమంది మహిళలు ఉద్యోగాల్లో ఉన్నారు అని’ అందామె. ► జీవితం అంతులేని పోరాటం ‘జీవితం అంటే అంతులేని పోరాటం. ఎవరికీ ఏ వయసులో ఉన్నా కన్సెషన్ ఉండదు. పోరాటం చేయాలి. ఓడిపోయినా పోరాట అనుభవం మిగులుతుంది. జీవితంలో ఎన్నో సంఘటనలు ఎదురవుతాయి. క్షమిస్తే మంచిది. మర్చిపోతే ఇంకా మేలు. కాని ముందుకు సాగడమే అన్నింటికన్నా ఉత్తమమైనది. చిన్న చిన్న ఆనందాలు జీవితాన్ని మెరిపిస్తాయి. ప్యాషన్‌తో పని చేయడంలో ఉన్న తృప్తి మరెందులోనూ లేదు. ఒక మనిషిని పైకి తెచ్చేది డబ్బు కాదు ప్యాషన్. నమ్మిన పనిని విలువలతో ఆచరిస్తే ఎవరైనా పైకి రావాల్సిందే’ అంటుందామె. ► రాజ్యసభ సభ్యురాలు ‘ఇది ఊహించలేదు. రాష్ట్రపతి నన్ను రాజ్యసభకు నామినేట్ చేశారు. దీని గురించి నేను కూచుని ఆలోచించాలి. అర్థం చేసుకోవాలి. ఏం చేయగలనో అంతా చేయాలి. ఇప్పుడు నేను భారత ప్రభుత్వ సేవకురాలిని’ అని కొత్త బాధ్యతకు సిద్ధమవుతోంది సుధామూర్తి. ఇల్లాలే శక్తి నారాయణ మూర్తితో వివాహం అయ్యాక ఇన్ఫోసిస్ సంస్థను ఆయన స్థాపించాలనుకున్నప్పుడు 10 వేల రూపాయలు పెట్టుబడి తనే ఇచ్చింది సుధామూర్తి. అయితే ఆమెను ఇన్ఫోసిస్‌కు బయటి వ్యక్తిగానే ఉండటం మంచిదని సూచించాడు నారాయణమూర్తి. ఆమె కొంచెం బాధపడింది. ఎప్పటికైనా ఇన్ఫోసిస్ సంస్థలో చేరతాననే భావించింది. అదే సమయంలో చాలా కాలం పాటు పిల్లల కోసం గృహిణిగా ఉండిపోయింది. ‘సంవత్సరంలో 200 రోజులు ప్రయాణాల్లో ఉండేవాడు నారాయణమూర్తి. ఆ రోజుల్లో ఫోన్ లేదు. కారు లేదు. పిల్లలకు ఆరోగ్యం బాగలేకపోతే ఒక్కదాన్నే వెళ్లాలి. సంస్థ ఆర్థిక కష్టాలు.. ఇంటి కష్టాలు.. అన్నీ తట్టుకుని నారాయణమూర్తికి వెన్నుదన్ను అందించాను. ఆ తర్వాత ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌కు చైర్మన్ అయ్యాను. ఆ ఫౌండేషన్‌తో వేలాది మంది జీవితాల్లో వెలుగు తెచ్చే వీలు నాకు కలిగింది. ఈ సంతృప్తి ఇన్ఫోసిస్ డైరెక్టర్‌గా పని చేసి ఉంటే నాకు దక్కేది కాదు’ అంటుందామె. -
రాజ్యసభ సభ్యులను ఎలా ఎన్నుకుంటారు?
భారత పార్లమెంట్ లోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. దీనినే పెద్దలసభ అని కూడా పిలుస్తారు. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల సభ్యులు ఎన్నుకుంటారు కాబట్టి దీన్ని రాష్ట్రాల సభ అని కూడా అంటారు. రాష్ట్రాల నుంచి , కేంద్రపాలిత ప్రాంతాల నుంచి , వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని రాష్ట్రపతి ఎంపిక చెయ్యడం ద్వారానూ, రాజ్యసభ సభ్యులు నియామకం అవుతారు.వీరి పదవీకాలం 6 సంవత్సరాలు ఉంటుంది.ప్రతి రెండేళ్లకొకసారి మూడో వంతు సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో, ఎన్నికలు నిర్వహించి సభ్యులనుఎన్నుకుంటారు. ఇదీ, రాజ్యసభ సభ్యులను ఎంపికచేసుకొనే విధానం. లోక్‌సభ సర్వశక్తివంతమైనది.రాజ్యసభతో పోల్చుకుంటే,ఎక్కువ హక్కులు లోక్ సభ కలిగి ఉంటుంది.ప్రజల నుంచి నేరుగా ఎన్నిక ద్వారానే లోక్ సభ సభ్యుల ఎంపిక జరుగుతుంది. ప్రజాప్రతినిధులుగా వీరు,వివిధ పార్టీల నుంచి ఎంపికవుతారు. ఇలా ఈ రెండు సభల నిర్మాణం వెనుకప్రజాహితమే ప్రధాన ఉద్దేశ్యంగా రాజ్యాంగ నిర్మాతలు రూపకల్పన చేశారు.రాజ్యసభను సెకండ్ ఛాంబర్ అనికూడా అంటారు.అంటే,సెకండ్ చెక్ అన్నమాట. రాజ్యసభకు కూడా శాసనాధికారం ఉంటుంది. వివిధ శాసనాలను తీర్మానం చేసే క్రమంలో రాజకీయాలకు,పార్టీలకు అతీతంగా దేశభక్తితో నిర్ణయాలు జరగాలనే గొప్ప ఉద్దేశ్యంతో,సమాంతర వ్యవస్థగా రాజ్యసభను ఏర్పాటుచేశారు.విజ్ఞాన ఖనులు, మేధావులు,సాంస్కృతిక ప్రేమికులు, గొప్ప ప్రజానాయకులు , పరమ దేశభక్తులు,సత్ శీలురు ఈ పెద్దల సభలో సభ్యులుగా ఎంపికవుతారు. లోక్ సభసభ్యులు పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా బిల్లులు ఆమోదించినప్పటికీ,వీటికి అతీతంగా,వీరు ప్రజాహితం కోరుకుంటూ,అవసరమైతే వీటిని అడ్డుకుంటారు. కొన్ని బిల్లుల విషయంలో,లోక్ సభ సభ్యులు ప్రజలకు ప్రయోజనకారిగా ఉన్నాయని భావించినా, సుదూర భవిష్యత్తు అలోచించి, రాజ్యసభ సభ్యులు వాటిని ఆమోదించకుండా తిప్పికొట్టే పరిస్థితులు వస్తూ ఉంటాయి. పెద్దలసభ,అని పేరు పెట్టుకున్నందుకు,నిజంగా పెద్దమనుషులతో ఈ సభలు శోభాయమానంగా ఉండేవి. దురదృష్టవశాత్తు,విలువలు తగ్గుముఖం పడుతూ,అధికారమే పరమావధిగా సాగుతున్న రాజకీయ వ్యవస్థల మధ్య పెద్దలసభలో పెద్దమనుషులు తగ్గుతూ వస్తున్నారు. రాజకీయ పునరావాస కేంద్రంగా,స్వప్రయోజనాల లక్ష్యంగా, ఇచ్చిపుచ్చుకొనే ధోరణుల మధ్య పెద్దలసభకు కొందరి నియామకాలు జరుగుతూ ఉన్నాయనేది, జారిటీ మేధావులు అభిప్రాయం. ఉభయసభల్లో బిల్లులు ఆమోదం పొందాలంటే,రాజ్యసభలోనూ అధికార పార్టీకి మెజారిటీ ఉండాలి. ఈ విషయంలో,చాలావరకూ, ప్రతిపక్ష పార్టీలకే మెజారిటీ ఎక్కువగా ఉండే పరిస్థితులను అధికారంలో ఉన్న పార్టీలు ఎదుర్కొంటూ ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో, రాజ్యసభలో మెజారిటీ కోసం,ప్రతిపక్ష సభ్యులకు ఎరవేసి, లాక్కొనే ప్రయత్నాలు అధికారంలో ఉన్న పార్టీలు చేస్తూ ఉంటాయి. రాజకీయక్షేత్రంలో,ఇది యుద్ధనీతిగా అభివర్ణించుకుంటున్నారు.ఈ అభ్యాసం కొన్నేళ్ల నుంచి పెరుగుతూ వస్తోంది. పెద్దలసభల్లోనూ బడా పారిశ్రామక వేత్తలు,వ్యాపారులు,స్వపక్షీయులు వచ్చి చేరుతున్నారు. ఈ క్రీడలో యుద్ధనీతి ఎలా ఉన్నా రాజనీతికి తూట్లు పడుతున్నాయి.లోక్ సభలో ఆమోదం పొందినప్పటికీ, రాజ్యసభలో ఆమోదం పొందక, సెలెక్ట్ కమిటీకి వెళ్లి,కాలయాపన జరిగి,ఏళ్ళు పూళ్ళు సాగి, త్రిశంకు స్వర్గంలో నిలిచిపోయిన బిల్లులు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు: మహిళాబిల్లు.ఈ విధంగా అధికారపార్టీలను ఇరకాటంలో పెట్టి,నైతికంగా గెలిచామనే ఆనందంతో ప్రతిపక్ష పార్టీలు తాండవం చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో,ఎన్నో సంస్కరణలకు నోచుకోవాల్సినవి,మెజారిటీ ప్రజలకుఎన్నో ప్రయోజనాలు చేకూర్చేవి, చారిత్రకమైన బిల్లులు కూడా ఉంటాయి.ఇదొక రాజకీయ చదరంగం.రాష్ట్ర పాలనకు సంబంధించి,రాష్ట్రాలలో ఉండే, శాసనమండలిని కూడా ఎగువసభ అంటారు. ఇక్కడ,అధికార పార్టీకి మెజారిటీ లేక,ప్రతిపక్షాలు బిల్లుల ఆమోదం విషయంలో ఇబ్బంది పెడితే, అధికారంలో ఉన్న పార్టీకి శాసనమండలిని రద్దు చేసుకొనే అధికారం ఉంది. కానీ,రాజ్యసభను రద్దు చేసే అధికారం కేంద్రంలో లేదు. అలా రాజ్యాంగం నిర్మాణం చేశారు. తమకు మెజారిటీ వచ్చిన దాకా ఆగి తీరాల్సిందే. రాష్ట్రాలకు సంబంధించిన పెద్దల సభల్లోనూ ఒకప్పుడు మహనీయులు ఉండేవారు.రాజకీయ సంస్కృతి మారుతున్న నేపథ్యంలో,ఇక్కడా పెద్దమనుషులు కరువవుతున్నారు. ప్రస్తుతం,దేశంలోని ఎక్కువ రాష్ట్రాలలో శాసనమండలి వ్యవస్థలు రద్దయ్యే ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ రాజ్యసభ ప్రస్థానాన్ని గమనిస్తే, నిత్యస్మరణీయులైన మహనీయులు సభ్యులుగా పనిచేశారు.శాసనాల రూపకల్పనలో అచంచలమైన దేశభక్తితో, నిస్వార్ధంగా వ్యవహరించారు. అటు ఎంపికచేసిన పార్టీకి,ఇటు రాజ్యసభకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టారు.నిజంగా దేశ ప్రయోజనాల గురించి ఆలోచించేవారికి ఇది గొప్ప అవకాశం.నియోజకవర్గాల్లోకి వెళ్ళి రాజకీయాలు చేసుకోనక్కర్లేదు.ఓట్ల భయం లేదు.ఖాళీ సమయాల్లో,అద్భుతమైన గ్రంథాలయాల్లో ఉన్న అపార జ్ఞాన సంపదను అక్కున చేర్చుకొని,దేశ ప్రతిష్ఠ పెంచే,సకల జనుల శ్రేయస్సు ప్రసాదించే అద్భుతమైన సలహాలు,సూచనలు పాలకులకు ఇవ్వవచ్చు.ఒకప్పుడు అలాగే సాగేది.నిన్న మొన్నటి వరకూ కూడా,ఎందరో పెద్దలు ఈ పెద్దలసభలకు ఎంపికయ్యారు. వాజ్ పెయి,పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్,ప్రణబ్ ముఖర్జీ, భూపేష్ గుప్తా,అల్లాడి కృష్ణస్వామి అయ్యర్,ఎన్. జి. రంగా, నీలం సంజీవరెడ్డి,బెజవాడ గోపాల్ రెడ్డి,బూర్గుల రామకృష్ణరావు,వల్లూరి బసవరాజు, కాసు వెంగళరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి,నార్ల వెంకటేశ్వరరావు,దేవులపల్లి రామానుజరావు, పి. కె. కుమరన్ మొదలైన పెద్దలెందరో ఈ పెద్దల సభలో ఉండేవారు. రాష్ట్రపతి ఎంపిక చేసినవారిలోనూ ఎందరో పెద్దలు ఉండేవారు.రాజా రామన్న, జాకీర్ హుస్సేన్,అబు అబ్రహాం, శంకర్ కురూప్,ఆర్.కె.నారాయణ్, పండిట్ రవిశంకర్,పృథ్వి రాజ్ కపూర్,లతా మంగేష్కర్,కులదీప్ నయ్యర్. సి.నారాయణరెడ్డి మొదలైన వాళ్ళు పెద్దల సభకు ఎంతో గౌరవాన్ని, వైభవాన్ని తెచ్చిన గొప్పవాళ్ళు. టెండూల్కర్,జయభాదురీ,రేఖ, హేమామాలిని మొదలైన వాళ్ళు కూడా ఎంపికయ్యారు.కళాకారులు, కవులు,శాస్త్రవేత్తలు,క్రీడాకారులకు గౌరవపూర్వకంగా రాజ్యసభకు ఎంపిక చెయ్యడం ఒక ఆనవాయితీ, ఒక మర్యాద.ఇందులో కొందరు అలంకారప్రాయంగా పదవికి పరిమితమైనవారు,కనీస హాజరు కూడా లేనివారు ఉన్నారు. జయభాదురీ,డాక్టర్ సి.నారాయణరెడ్డి వంటివారు తమ పదవిని,సమయాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకున్నారు.కొందరు పార్టీలకు, ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీలకు వివిధ రూపాల్లో ప్రయోజనాలు చేకూర్చి, తత్ఫలితంగా పదవులు దక్కించుకుంటున్నారనే విమర్శలు ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వస్తున్నాయి.చట్ట సభల్లో హుందాగా ప్రవర్తించడం,సర్వ ప్రజాహితంగా నిర్ణయాలు తీసుకోవడం,పదవీకాలాన్ని సద్వినియోగం చెయ్యడం, ప్రజాధనాన్ని వృధా కాకుండా చూడడం ఈ సభ్యుల బాధ్యత. రాజ్యాంగం అమలు అనేది,అమలు చేసే పాలకులమీదనే ఆధారపడుతుందని అంబేద్కర్ ఏనాడో చెప్పారు.ఆచరణలో, పెద్దలసభ రాజకీయాలకు అతీతంగా, సర్వ స్వతంత్య్రమైన వ్యవస్థగా నిలబడాలి. ఉభయ సభలు ఆదర్శవంతంగా సాగాలన్నది,నేటి కాలంలో అత్యాశే అయినప్పటికీ, అలా సాగాలని అభిలషిద్దాం. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
దేశాభివృద్ధిలో మహిళల శకం: ముర్ము
బెర్హంపూర్: దేశాభివృద్ధిలో మహిళల శకం మొదలైందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. జాతి నిర్మాణంలో నేడు బాలికలు అన్ని రంగాల్లో కీలకంగా మారారని, ఈ పరిణామం ఎంతో ప్రోత్సాహకరమైందని పేర్కొన్నారు. గంజాం జిల్లాలోని బెర్హంపూర్ యూనివర్సిటీ 25వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. సాహిత్యం, సంస్కృతి, సంగీతం వంటి రంగాల్లో మహిళ భాగస్వామ్యం ప్రశంసనీయమని తెలిపారు. ‘సైన్స్, టెక్నాలజీ మొదలుకొని పోలీసు, ఆర్మీ వరకు ప్రతి రంగంలోనూ మన కుమార్తెల సామర్థ్యం కనిపిస్తోంది. ఇప్పుడు మనం మహిళాభివృద్ధి దశ నుంచి మహిళల సారథ్యంలో అభివృద్ధి వైపు పయనిస్తున్నాం’అని రాష్ట్రపతి తెలిపారు. -
ఆ 553 పోస్టులను మెరిట్ ప్రకారం భర్తీ చేయండి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న 553 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టులను పరీక్షలు నిర్వహించిన వారితో భర్తీ చేయాలని తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్కంపెనీ లిమిటెడ్ (టీఎస్ఎస్పీడీసీఎల్)ను హైకోర్టు ఆదేశించింది. జేఎల్ఎం నియామకాలకు రాష్ట్రపతి ఉత్తర్వులు, ‘స్థానికత’లాంటి అంశాలు వర్తించవని తేల్చిచెప్పింది. ఇప్పటికే స్తంభం ఎక్కే పరీక్ష నిర్వహిస్తే వారితో పోస్టులను భర్తీ చేయాలని, ఒకవేళ ఆ పరీక్ష నిర్వహించిన వారు లేకుంటే వెంటనే నిర్వహించి ఖాళీలను భర్తీ చేయాలని స్పష్టం చేసింది. 2019లో టీఎస్ఎస్పీడీసీఎల్ 2,500 జేఎల్ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన తిరుమలేశ్ సహా మరికొందరు హైకోర్టులో 2020లో పిటిషన్లు దాఖలు చేశారు. జిల్లాల విభజన కారణంగా అటు ఉమ్మడి జిల్లాకు, ఇటు కొత్త జిల్లాకు కాకుండా తాము నష్టపోయామని పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై జస్టిస్ మాధవీదేవి విచారణ చేపట్టి గురువారం తీర్పు వెలువరించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి, న్యాయవాదులు సుంకర చంద్రయ్య, చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయూమూర్తి.. రాష్ట్రపతి ఉత్తర్వులను జేఎల్ఎం పోస్టులకు వర్తింపజేయలేరని టీఎస్ఎస్పీడీసీఎల్కు తేల్చిచెప్పారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాలను యూనిట్‌గా తీసుకొని 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు చేయడాన్ని తప్పుబడుతూ కొత్త జిల్లాల అభ్యర్థులు ఉమ్మడి జిల్లాకు నాన్ లోకల్ కారని చెప్పారు. ఇప్పటికే 1,900కుపైగా పోస్టులను అధికారులు భర్తీ చేయడంతో మిగిలిన ఖాళీలను మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని ఆదేశించారు. -
Maldives: ‘అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు చెప్పేవన్నీ అబద్ధాలే’
మాలె: భారత భద్రతా బలగాలపై మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు చేసిన వ్యాఖ్యలను మాల్దీవుల మాజీ విదేశాంగ మంత్రి, మాల్దీవీయన్ డెమోక్రటిక్ పార్టీ నేత అబ్దుల్లా షాహిద్ ఖండించారు. వేల సంఖ్యలో భారత భద్రత బలగాలు మాల్దీవులలో ఉన్నారని అధ్యక్షుడు మొయిజ్జు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అసలు విదేశాలకు చెందిన సాయుధ మిలిటరీ బలగాలు మాల్దీవులలో ఎవరూ లేరని తెలిపారు. పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫును అధ్యక్షుడిగా ఎన్నికైన మహ్మద్ మొయిజ్జు అధికారంలోకి వచ్చి వంద రోజులు అవుతోంది. అప్పటి నుంచి భారత భద్రతా బలగాలు విషయంలో అబద్ధాలు చేబుతున్నారని విమర్శించారు. తాజాగా వేలల్లో భారత భద్రత బలగాలు మాల్లీవులలో ఉన్నారంటూ మరో కొత్త అబద్ధానికి తెరతీశారని అబ్దుల్లా షాహిద్ దుయ్యబట్టారు. విదేశి భద్రత బలగాల సంఖ్య విషయంలో నిర్దిష్టమైన సమాచారాన్ని అందిచటంలో ప్రస్తుత ప్రభుత్వ అసమర్థత స్పష్టంగా తెలుస్తోందని ఎద్దేవా చేశారు. పారదర్శకత చాలా ముఖ్యమని.. నిజం గెలవాలని అన్నారు. ప్రస్తుతం 70 మంది భారత భద్రతా బలగాలు మాల్దీవులలో ఉన్నారు. అయితే.. మాల్దీవుల నుంచి భారత భద్రత బలగాల ఉపసంహరించుకోవాలనే నినాదంతో మహ్మద్ మొయిజ్జు పార్టీ గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ప్రచారం చేసి.. అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక.. భారత్-మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న వేళ ఇరుదేశాల మధ్య జరిగిన చర్చల్లో భాగంగా.. భారత దేశానికి చెందిన మూడు వైమానిక స్థావరాల్లోని భద్రతా బలగాల్లో ఒక స్థావరం సిబ్బందిని మార్చి 10 వరకు, మరో రెండు స్థావరాల సిబ్బందిని మే 10 వరకు భారత్ వెనక్కి తీసుకోవాలని అధ్యక్షుడు మొయిజ్జు కోరారు. ఇక..ఇటీవల భారత్ మాల్దీవులలో ఉన్న భద్రతా బలగాల బదులు నైపుణ్యం ఉన్న సిబ్బందని అక్కడికి బదిలీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. -
అత్యంత చెత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024, నవంబర్ 5న జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ నేత జో బైడెన్ మధ్యేనే ఈ అధ్యక్ష ఎన్నికల్లో ప్రధానంగా పోటీ కనిపిస్తోంది. ఇదిలావుండగా అమెరికాను ఇప్పటి వరకూ ఏలిన మొత్తం 45 మంది అధ్యక్షులలో డొనాల్డ్ ట్రంప్ అత్యంత చెత్త అధ్యక్షునిగా అభివర్ణిస్తూ ఒక సర్వే ఫలితాలు వెలువడ్డాయి. ఈ జాబితాలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 14వ స్థానంలో నిలిచారు. అంతర్యుద్ధాన్ని ఆపడంలో లేదా ఆ పరిస్థితి నుండి బయటపడేయడంలో విఫలమైన వారి కంటే కూడా డొనాల్డ్ ట్రంప్ వెనుకబడి ఉన్నారు. ఈ సర్వేను నిర్వహించిన రాజకీయ విశ్లేషకులు జస్టిన్ వాన్, బ్రాండన్ రోటింగ్హాస్ మాట్లాడుతూ బైడెన్ సాధించిన విజయాలలో.. ట్రంప్ నుండి అధ్యక్ష పదవిని కాపాడటమే ప్రధానమైనదని పేర్కొన్నారు. యూనివర్శిటీ ఆఫ్ కోస్టల్ కరోలినాకు చెందిన వాన్, హ్యూస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన రోటింగ్హాస్ తదితర 154 మంది రాజకీయ విశ్లేషకులు ఈ సర్వే నిర్వహించారు. వీరు అమెరికన్ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్‌తో సత్సంబంధాలు కలిగివున్నారు. అమెరికాలోని ఉత్తమ అధ్యక్షునిగా అబ్రహం లింకన్ నిలిచారు. ఆయన దేశంలో బానిసత్వాన్ని నిర్మూలించడంతోపాటు అంతర్యుద్ధం సమయంలో దేశాన్ని సమర్థవంతంగా నడిపించాడని విశ్లేషకులు పేర్కొన్నారు. మరో ఉత్తమ అధ్యక్షునిగా ఫ్రాంక్లిన్ డెలానో రూజ్వెల్ట్ నిలిచారు. ఆర్థిక మాంద్యం, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికాకు సరైన మార్గనిర్దేశం చేశాడని విశ్లేషకులు తెలిపారు. -
నాడు హత్యలకు అడ్డా.. నేడు అత్యంత సురక్షిత ప్రాంతం!
ఎల్ సాల్వడార్.. మధ్య అమెరికాలోని అత్యంత చిన్నదైన, అత్యధిక జనాభా కలిగిన దేశం. ఒకప్పుడు నేరాలు, అవినీతి, హత్యలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఈ దేశం రూపురేఖలు ఇప్పుడు సమూలంగా మారిపోయాయి. అధ్యక్షుడు నయూబ్ బకెలే దేశ అధికార పగ్గాలు చేపట్టడంతో దేశంలో నేరాలు, హత్యల సంఖ్య గణనీయంగా తగ్గింది. ‘కూల్ డిక్టేటర్’గా గుర్తింపు ఇటీవల జరిగిన ఎల్ సాల్వడార్ ఎన్నికల్లో నయీబ్ బుకెలే ఘనవిజయం సాధించి, అధ్యక్షపీఠం అధిరోహించారు. దేశంలో అంతకంతకూ దిగజారుతున్న ప్రజాస్వామ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, వీటిని నయూబ్ బుకెలే చక్కదిద్దుతారన్న నమ్మకంతో ఓటర్లు ఆయన పార్టీకి పట్టం కట్టారు. నయీబ్ బుకెలే దేశంలో పెరుగుతున్న హత్యల నియంత్రణకు తీసుకున్న కఠిన చర్యలపై ఎల్ సాల్వడార్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని కార్మికులైతే ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. నయీబ్ బుకెలే ఇప్పుడు ప్రపంచవ్యాపంగా ‘కూల్ డిక్టేటర్’గా గుర్తింపు పొందారు. గణనీయంగా తగ్గిన భద్రతా ముప్పు ఒక నివేదిక ప్రకారం నయీబ్ బుకెలే 2019లో తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎల్ సాల్వడార్లో శాంతిభద్రతల పరిస్థితిలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా దేశంలో భద్రతా ముప్పు గణనీయంగా తగ్గింది. తాజాగా 2024 అధ్యక్ష ఎన్నికల్లోనూ ఆయనే గెలవడంతో అతని ‘న్యూ ఐడియాస్ పార్టీ’ కార్యకర్తలు విజయోత్సాహంతో ర్యాలీలు చేపట్టారు. లెక్కలేనంతమంది బుకెలే అభిమానులు సాల్వడార్‌లోని సెంట్రల్ స్క్వేర్‌లో సమావేశమై, ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నీలి రంగు దుస్తులు ధరించి ఆనందంగా జెండాలు రెపరెపలాడించారు. ‘న్యూ ఐడియాస్ పార్టీ’ పాలన 42 ఏళ్ల అధ్యక్షుడు నయీబ్ బుకెలే తాను మరోమారు సాధించిన ఈ విజయాన్ని తన పరిపాలనకు ఇదొక ‘రిఫరెండం’గా అభివర్ణించారు. దేశ శాసనసభలో మొత్తం 60 స్థానాలను గెలుచుకున్న బుకెలేకి చెందిన ‘న్యూ ఐడియాస్ పార్టీ’ దేశాన్ని మరోమారు పాలించనుంది. ఈ ఎన్నికల తర్వాత దేశంలో బుకెలే ప్రభావం మరింతగా పెరిగింది. సాల్వడార్ చరిత్రలో బుకెలే అత్యంత ప్రభావవంతమైన నాయకునిగా ఎదిగారని విశ్లేషకులు చెబుతుంటారు. అసురక్షితం నుంచి సురక్షితానికి.. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన నేపధ్యంలో నయీబ్ బుకెలే తన భార్యతో కలిసి నేషనల్ ప్యాలెస్ బాల్కనీ నుండి మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘అందరూ కలిసి ప్రతిపక్షాన్ని కూల్చివేశారు. ఎల్ సాల్వడార్ అత్యంత అసురక్షిత దేశం అనే పేరు నుంచి అత్యంత సురక్షితమైన దేశమనే దిశకు చేరుకుంది. రాబోయే ఐదేళ్లలో మనం చాలా చేయాల్సివుంది’ అని ఆత్మవిశ్వాసంతో పేర్కొన్నారు. ఒకే వారంలో 80 మంది హత్య ఒక నివేదిక ప్రకారం బుకెలే దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎల్ సాల్వడార్లో హత్యల రేటు గణనీయంగా తగ్గింది. ‘మారా సాల్వత్రుచా గ్యాంగ్’ (ఎంఎస్-13)సభ్యులు దేశంలో పెద్ద సంఖ్యలో హత్యలు సాగిస్తూ వచ్చారు. 2022 మార్చి లో ఒకే వారంలో వీరు 80 మందిని హత్య చేశారు. బుకెలే ప్రభుత్వం నేరస్తుల ముఠాతో సంబంధం ఉన్న 75 వేల మందిని అరెస్టు చేసింది. El Salvador's President Nayib Bukele, who has described himself as the 'World's coolest dictator,' is all but certain to be re-elected in a presidential bid for another five-year term https://t.co/t7X5vV5VLq pic.twitter.com/1LmIt9aaVV — Reuters (@Reuters) January 30, 2024 70 శాతం మేరకు తగ్గిన హత్యల రేటు పెద్ద సంఖ్యలో అరెస్టులు జరిగిన తర్వాత ఎల్ సాల్వడార్‌లోని క్రిమినల్ ముఠాల వెన్ను విరిగినట్లయ్యింది. ఈ చర్య ఫలితంగా 2022లో హత్యలు దాదాపు 60 శాతం మేరకు తగ్గాయి. అయితే 2023 నాటికి దేశంలో అత్యధిక ఖైదు రేటు నమోదు కావడంతో ఇది మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలకు దారితీసింది. భద్రతా దళాల చర్యల అనంతరం 2023లో ఎల్ సాల్వడార్లో హత్యల రేటు 70 శాతం మేరకు తగ్గి, అది ఒక లక్షకు 2.4 శాతానికి చేరింది. ఈ సంఖ్య లాటిన్ అమెరికాలోని చాలా దేశాల కంటే అతి స్వల్పం నేరాలు, అవినీతి, అసమానతలతో పోరాటం 2019లో ఎల్ సాల్వడార్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సొంతం చేసుకున్న బుకెలే దేశంలో చోటుచేసుకున్న నేరాలు, అవినీతి, అసమానతలతో పోరాడతానని వాగ్దానం చేశారు. తన మద్దతుదారులతో మెరుగ్గా కమ్యూనికేట్ చేయడానికి, విమర్శకులను ట్రోల్ చేయడానికి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను సమర్థవంగంగా ఉపయోగించుకున్నారు. బుకెల్ తరచూ బేస్ బాల్ క్యాప్, లెదర్ జాకెట్, సన్ గ్లాసెస్ ధరిస్తారు. సెల్ఫీలు, మీమ్లను అమితంగా ఇష్టపడతారు. President Bukele takes a victory lap after El Salvador becomes the safest nation in the Western hemisphere He then tells foreign critics to go stuff it pic.twitter.com/iBNEPooXcP — Jack-of-all-trades (@Upliftingvision) February 13, 2024 -
హంగేరి అధ్యక్షురాలి రాజీనామా
హంగేరి అధ్యక్షురాలు కాటలిన్ నోవాక్ తన అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ఓ చిల్డ్రన్స్ హోమ్‌లోని చిన్న పిల్లలపై లైగింక వేధింపులకు పాల్పడిన కేసులో దోషిగా నిర్ధారించబడిన వ్యక్తికి క్షమాభిక్ష పెట్టడంపై తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అయింది. దోషి విషయంలో అధ్యక్షురాలు తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఖండిస్తూ.. నిరసన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో అధ్యక్షురాలు కాటలిన్ నోవాక్ రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శనివారం ఆమె స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను తప్పు చేశాను. అందుకే ఇదే అధ్యక్షురాలిగా ఇదే నా చివరి ప్రసగం. అధ్యక్షురాలి పదవికి నేను రాజీనామా చేస్తున్నా. బాధితులకు నేను సహకరించనందుకు క్షమాపణలు. నేను చిన్న పిల్లలు, వారి కుటుంబాలకు రక్షణకు కట్టుబడి ఉంటా’ అని ఆమె వెల్లడించారు. లైంగిక వేధింపుల కేసులో దోషిపై తీసుకున్న నిర్ణయంతో ప్రతిపక్షాలు, నిరసనకారుల శుక్రవారం అధ్యక్షురాలి నివాసం ముందు భారీగా చేరుకొని నిరసనలు తెలిపారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఆమెపై ఒత్తిడి పెంచారు. దీంతో ఆమె రాజీనామా ప్రకటించినట్లు సమాచారం. ఇక .. అధ్యక్షురాలి రాజీనామాపై మాజీ న్యాయ మంత్రి జుడిట్ వర్గా స్పందిస్తూ.. కాటలిన్ నోవాక్ ప్రజా జీవితం నుంచి తప్పుకుంటున్నారని ప్రకటించారు. 2022లో కటాలిన్ నోవాక్ హంగేరి దేశానికి తొలి అధ్యక్షురాలిగా ఎన్నికై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. చిల్డ్రన్స్ హోమ్ మాజీ డిప్యూటీ డైరెక్టర్‌కు క్షమాభిక్ష పెట్టడం వివాదం రేపింది. పిల్లలపై చిల్డ్రన్స్ హోమ్.. యజమాని లైంగిక వేధింపులను కప్పిపుచ్చడానికి దోషి సహాయం చేశాడని తెలుస్తోంది. దోషికి క్షమాభిక్ష నిర్ణయాన్ని గతేడాది ఏప్రిల్‌లో తీసుకున్నప్పటికీ.. గతవారం ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ప్రతిపక్షాలు కటాలిన్ నోవాక్ తన అధ్యక్షురాలి పదవికి రాజానామా చేయాలని డిమాండ్ చేశారు. చదవండి: పాక్‌లో సంకీర్ణం..! -
చిలీ మాజీ అధ్యక్షుడి మృతి
-
పంజాబ్ గవర్నర్ బన్వారీలాల్ రాజీనామా
చండీగఢ్: పంజాబ్ గవర్నర్, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ పరిపాలనాధికారిగా ఉన్న బన్వారీలాల్ పురోహిత్ పదవులకు రాజీనామా చేశారు. శనివారం ఆయన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమరి్పంచారు. ‘‘వ్యక్తిగత కారణాలతోపాటు కొన్ని ఇతర బాధ్యతలను నెరవేర్చాల్సిన దృష్ట్యా పంజాబ్ గవర్నర్ పదవితోపాటు, చండీగఢ్ పరిపాలనాధికారి బాధ్యతలకు రాజీనామా సమరి్పస్తున్నాను’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన మరునాడే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. పంజాబ్ గవర్నర్, చండీగఢ్ పాలనాధికారిగా 2021లో బన్వారీలాల్ బాధ్యతలు చేపట్టారు. -
ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా జై షా
-
President Droupadi Murmu: బలమైన దేశంగా ఎదిగాం!
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణం అనే శతాబ్దాల కల ఎట్టకేలకు నెరవేరిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ కృషితో బలమైన దేశంగా ఎదిగామని చెప్పారు. బాలరాముడి ప్రాణప్రతిష్ట నిర్వహించుకున్నామని, మరోవైపు ఆర్థిక సంస్కరణల్లో కీర్తిప్రతిష్టలు సాధించామని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సమావేశాలు బుధవారం నూతన భవనంలో ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము దాదాపు 75 నిమిషాలపాటు ప్రసంగించారు. పార్లమెంట్ కొత్త భవనంలో ఆమె ప్రసంగించడం ఇదే మొదటిసారి. గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన ఘనతలను ప్రస్తావించారు. ఉగ్రవాదం, విస్తరణవాదానికి మన సైనిక దళాలు తగిన సమాధానం చెబుతున్నారని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలతో మన దేశం ప్రపంచంలో మొదటి ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించిందని గుర్తుచేశారు. భారత్ బలమైన దేశంగా మారిందన్నారు. ప్రతిష్టాత్మక జి–20 సదస్సును కేంద్రం విజయవంతంగా నిర్వహించిందని, తద్వారా ప్రపంచంలో ఇండియా స్థానం మరింత బలోపేతమైందని వివరించారు. జమ్మూకశీ్మర్తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ మొదటిసారి అంతర్జాతీయ సమావేశాలు జరిగినట్లు తెలియజేశారు. పార్లమెంట్లో రాష్ట్రపతి ముర్ము ఇంకా ఏం మాట్లాడారంటే.. జనవరి 22 చిరస్మరణీయమైన రోజు ‘‘రాబోయే శతాబ్దాలకు సంబంధించి దేశ భవిష్యత్తు స్క్రిప్‌్టను రాసుకోవాల్సిన సమయం వచ్చింది. మన పూరీ్వకులు వేలాది సంవత్సరాల గొప్ప వారసత్వాన్ని మనకు వరంగా అందించారు. ప్రాచీన భారతదేశంలో అప్పటి మనుషులు సాధించిన విజయాలను ఇప్పటికీ సగర్వంగా గుర్తుచేసుకుంటున్నాం. రాబోయే కొన్ని శతాబ్దాలపాటు గుర్తుంచుకొనే ఘనమైన వారసత్వాన్ని ఇప్పటి తరం మనుషులు నిర్మించాలి. దేశ ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో ఎన్నో ఘనతలు సాధించింది. దశాబ్దాల, శతాబ్దాల ఆకాంక్షలను నెరవేర్చింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ప్రజలు శతాబ్దాలపాటు ఎదురుచూశారు. అది ఇప్పుడు నెరవేరింది. ఆలయం ప్రారంభమైన తర్వాత కేవలం ఐదు రోజుల్లో 13 లక్షల మంది దర్శించుకున్నారు. బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగిన జనవరి 22వ తేదీ నిజంగా చిరస్మరణీయమైన రోజు. నక్సల్స్ హింసాకాండ తగ్గుముఖం ఆర్టికల్ 370 రద్దుపై గతంలో ఎన్నో అనుమానాలు ఉండేవి. ఇప్పుడు ఆర్టికల్ 370 అనేది చరిత్రలో కలిసిపోయింది. ట్రిపుల్ తలాఖ్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకొచి్చంది. సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ భవిష్యత్తు నిర్మాణం కోసం మన శక్తిని గరిష్ట స్థాయిలో ఖర్చు చేసినప్పుడే దేశం ప్రగతి పథంలో వేగంగా ముందంజ వేస్తుంది. ప్రభుత్వం దేశ సరిహద్దుల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు కలి్పస్తోంది. సైనిక దళాలను బలోపేతం చేస్తోంది. అంతర్గత భద్రతకు సంబంధించిన ప్రభుత్వ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. జమ్మూకశీ్మర్‌లో మార్కెట్లు, వీధులు గతంలో నిర్మానుష్యంగా కనిపించేవి. ఇప్పుడు జనంతో అవి కిక్కిరిసిపోతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయి. ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాద ఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. శాంతియుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల సంఖ్య కూడా తగ్గిపోయింది. నక్సలైట్ల హింసాకాండ భారీగా తగ్గింది. అదుపులోనే ద్రవ్యోల్బణం ‘అభివృద్ధి చెందిన భారత్’ అనే మహాసౌధం నాలుగు మూల స్తంభాలపై స్థిరంగా ఉంటుందని ప్రభుత్వం నమ్ముతోంది. అవి యువశక్తి, మహిళా శక్తి, రైతులు, పేదలు. ఈ నాలుగు వర్గాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ‘గరీబీ హఠావో’ నినాదాన్ని మనమంతా చిన్నప్పటి నుంచి వింటున్నాం. పేదరికాన్ని పారదోలడాన్ని మన జీవితాల్లో మొదటిసారి చూస్తున్నాం. ఇండియాలో గత పదేళ్లలో ఏకంగా 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్ ప్రకటించింది. దేశంలో రక్షణ ఉత్పత్తుల విలువ రూ.లక్ష కోట్ల మార్కును దాటడం హర్షణీయం. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమాలు మన దేశ అభివృద్ధి ప్రయాణానికి బలాలుగా మారుతు న్నాయి. ప్రతికూల పరిస్థితులు, ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచింది. ప్రజలపై అదనపు భారం పడకుండా జాగ్రత్తవహించింది’’. మహిళలకు 15 వేల డ్రోన్లు ‘2014 తర్వాత గత పదేళ్లుగా ద్రవ్యోల్బణ రేటు సగటున కేవలం 5 శాతం ఉంది. ప్రభుత్వ చర్యలతో ప్రజల చేతుల్లో డబ్బు ఆడుతోంది. సామాన్య ప్రజలు కూడా పొదుపు చేయగలగుతున్నారు. మహిళలకు చేయూత ఇవ్వడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. బ్యాంకు రుణాలను అందుబాటులోకి తీసుకొచి్చంది. సైనిక దళాల్లో శాశ్వత మహిళా కమిషన్‌ను మంజూరు చేసింది. సైనిక స్కూళ్లతోపాటు నేషనల్ డిఫెన్స్ అకాడమీలోనూ మహిళలకు ప్రవేశం కల్పిస్తోంది. ఎయిర్‌ఫోర్స్, నావికాదళంలోనూ మహిళలను ఆఫీసర్లుగా నియమిస్తోంది. అలాగే 2 కోట్ల మంది అక్కాచెల్లెమ్మలను లక్షాధికారులను చేయాలని ప్రభుత్వం సంకలి్పంచింది. ‘నమో డ్రోన్ దీదీ’ పథకం కింద మహిళలకు 15 వేల డ్రోన్లు అందజేయాలని నిర్ణయించింది’. మహిళల సారథ్యంలో దేశాభివృద్ధి ‘మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత నారీశక్తి వందన్ అధినియం(మహిళా రిజర్వేషన్ చట్టం) పార్లమెంట్లో ఆమోదం పొందింది. ఈ చట్టంతో చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. మహిళల సారథ్యంలో దేశాభివృద్ధి జరగాలన్నదే ప్రభుత్వ ఆశయం. ఈ చట్టాన్ని తీసుకొచి్చనందుకు పార్లమెంట్ సభ్యులకు నా అభినందనలు తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతి తోడ్పాడునందిస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కూడా ఒకటి. రెండు వరుస త్రైమాసికాల్లో వృద్ధి రేటు 7.5 శాతానికిపైగానే నమోదైంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందిస్తోంది’. 25 వేల కిలోమీటర్లకు పైగా రైల్వే లైన్లు ‘రైల్వేశాఖ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గత పదేళ్ల కాలంలో వినూత్న చర్యలు చేపట్టింది. నమో భారత్, అమృత్ భారత్, వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. కొత్తగా 25 వేల కిలోమీటర్లకుపైగా రైల్వే లైన్లు వేసింది. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న మొత్తం రైల్వేట్రాక్ పొడవు కంటే ఇదే ఎక్కువ. రైల్వేశాఖలో 100 శాతం విద్యుదీకరణకు చాలా దగ్గరలో ఉన్నాం. దేశంలో తొలిసారిగా సెమీ–హైస్పీడ్ రైళ్లు ప్రారంభమయ్యాయి. 39 మార్గాల్లో వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 1,300 రైల్వేస్టేషన్లను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ప్రతి ప్రయాణికుడికి రైల్వేశాఖ 50 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. దీనివల్ల పేద, మధ్య తరగతి ప్రయాణికులకు ప్రతి ఏటా రూ.60 వేల కోట్ల సొమ్ము ఆదా అవుతోంది’. -
Maldives: మోదీకి క్షమాపణ చెప్పాల్సిందే!
మల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు భారతదేశా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారతీయులు క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష జుమ్‌హూరీ పార్టీ చీఫ్ గసుయిమ్ ఇబ్రహీం డిమాండ్ చేశారు. భారత్-మాల్దీవుల దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపరుకునే క్రమంలో అధ్యక్షుడు మొయిజ్జు ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పాలన్నారు. అధ్యక్షుడు మొయిజ్జు నేతృత్వంలోని మాల్దీవుల ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. చైనా అనుకూలమైన వ్యక్తిగా పేరున్న మొయిజ్జు ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలు సంబంధిత తీర్మాణంపై సంతకాల సేకరణకు కసరత్తు చేస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో జుమ్‌హూరీ పార్టీ చీఫ్ గసుయిమ్ ఇబ్రహీం భారత్‌కు క్షమాపణ చెప్పాలని చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అదేవిధంగా అక్కడి ప్రజలు కూడా సోషల్ మీడియాలో తమ అధ్యక్షుడు భారతీయులకు క్షమాపణలు చెప్పాలని ప్రచారం జరుగుతోంది. చైనా అనుకూల అధ్యక్షుడు ముయిజ్జు కేబినెట్లోకి నలుగురు మంత్రులను చేర్చుకునే అంశంపై ఆదివారం పార్లమెంట్లో ఓటింగ్ జరిగింది. అయితే నలుగురిలో ఒక్కరికి మాత్రమే పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ముగ్గురిని తిరస్కరించింది. దీంతో ఆగ్రహిస్తూ అధికార పక్షం ఎండీపీకి చెందిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్లపై అవిశ్వాసం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రతిపక్ష ఎంపీలు బాహాబాహీకి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు ఎంపీలు గాయపడ్డారు. ఈ పరిణామాలతో ఎండీపీ, మిత్రపక్షం డెమోక్రాట్లతో కలిసి ముయిజ్జుపై అవిశ్వాసం పెట్టాలని సోమవారం నిర్ణయించిన విషయం తెలిసిందే. పార్లమెంట్లో మొత్తం 80 మంది సభ్యులకుగాను ఎండీపీకి 45 మంది, డెమోక్రాట్లకు 13 మంది ఉన్నారు. -
రాజ్యసభకు సత్నామ్.. మోదీ అభినందనలు.. ఎవరీయన?
ప్రముఖ విద్యావేత్త, చండీగఢ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు సత్నామ్ సింగ్ సంధూను రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నామినేట్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సత్నామ్ సంధూ ఎగువసభకు నామినేట్ చేయడాన్ని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ స్వాగతించారు. సమాజ సేవ చేయడంలో సంధూ కృష్టి, విద్య, ఆవిష్కరణలపై ఆయనకున్న అభిరుచి రాజ్యసభ ఉన్నతికి ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. అతని పదవి కాలం ఉత్తమంగా సాగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా సంధూకు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. సత్నామ్ సింగ్‌ను రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసినందుకు సంతోషిస్తున్నట్లు తెలిపారు. ఆయన గొప్ప విద్యావేత్త అని, సామాజిక కార్యకర్తగా అభివర్ణించారు. అట్టడుగు స్థాయి ప్రజలకు సేవ చేస్తున్నారని పేర్కొన్నారు. దేశ సమైక్యత కోసం విస్తృతంగా పనిచేస్తున్నారని, ఆయన పార్లమెంటరీ ప్రయాణం ఉత్తమంగా సాగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆయన అభిప్రాయాలతో రాజ్యసభ కార్యకలాపాలు సుసంపన్నం అవుతాయని భావిస్తున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు. I am delighted that Rashtrapati Ji has nominated Shri Satnam Singh Sandhu Ji to the Rajya Sabha. Satnam Ji has distinguished himself as a noted educationist and social worker, who has been serving people at the grassroots in different ways. He has always worked extensively to… pic.twitter.com/rZuUmGJP0q — Narendra Modi (@narendramodi) January 30, 2024 రైతు కొడుకు నుంచి యూనివర్సిటీ ఫౌండర్‌గా.. పంజాబ్‌కు చెందిన సత్నామ్ సింగ్ సంధూ ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. తన చిన్నతనంలో చదువుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడిన సత్నామ్..తనలా ఎవరూ బాధలు పడకూడదని నిర్ణయించుకొని అత్యుత్తమ నైపుణ్యాలతో విద్యను అందించేందుకు 2001లో మొహాలిలోని లాండ్రాన్‌లో చండీగఢ్ గ్రూప్ ఆఫ్ కాలేజీలను స్థాపించాడు. 2012లో చండీగఢ్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఆసియాలోనే అత్యుత్తమ ప్రైవేటు వర్సిటీగా తొలి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ వర్సిటీకి ఆయన ఛాన్సలర్‌గా వ్యవహరిస్తున్నారు. దేశంలోనే ప్రముఖ విద్యావేత్తగా పేరు తెచ్చుకున్నారు సంధూ. ఇతరులకు సాయం చేయడంలోనూ ఆయన ముందుంటారు. ఇండియన్ మైనారిటీస్ ఫౌండేషన్,(IMF) న్యూ ఇండియా డెవలప్మెంట్ (NID) ఫౌండేషన్ పేరుతో రెండు ఎన్జీవోలను ఏర్పాటుచేసి ప్రజల ఆరోగ్యం, వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఆర్థికసాయం చేస్తున్నారు. విద్యా రంగంలో ఆయన సేవలను గుర్తించి కేంద్రం ఆయనకు రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యత్వం కల్పించింది. కాగా వివిధ రంగాకు చెందిన వారికి డైరెక్ట్ రాజ్యసభకు నామినేట్ చేసే హక్కు రాష్ట్రపతికి ఉంటుంది. భారత రాజ్యాంగంలోని నాల్గవ షెడ్యూల్ ప్రకారం.. కళలు, సాహిత్యం, సైన్స్ మరియు సామాజిక సేవలకు చేసిన సేవలకు గాను 12 మంది సభ్యులను ఆరేళ్ల కాలానికి రాజ్యసభకు రాష్ట్రపతికి ఉంటుంది. -
మాల్దీవుల అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం!
మాల్దీవుల అధికారపార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్(PNC)పై తీవ్రమైన అసమ్మతి పెరుగుతోంది. దీంతో దేశ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జుకు చెందిన అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్‌పై ప్రతిపక్ష మాల్దీవీయన్ డెమోక్రటిక్ పార్టీ అభిశంసన తీర్మానం ప్రవేశపట్టడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ దేశ మీడియా సోమవారం పలు కథనాలు ప్రచురించింది. ప్రతిపక్ష మాల్దీవీయన్ డెమోక్రటిక్ పార్టీ(ఎండీపీ), మరో భాగస్వామ్య పార్టీకి చెందిన ఎంపీలందరితో అభిశంసన తీర్మానంపై సంతకాలు చేయిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి ప్రతిపక్ష ఎండీపీ అభిశంసన తీర్మానాన్ని ఇంకా పార్లమెంట్లో సమర్పించలేదు. అయితే ఆదివారం మల్దీవుల పార్లమెంట్లో అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం ఘర్షణకు దారితీసింది. తీర్మానం ఓటింగ్‌ను ప్రతిపక్ష ఎంపీలు అడ్డుకున్నారు. అక్కడితో ఆగకుండా స్పీకర్‌కు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్‌లోనే తన్నుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రతిపక్ష పార్టీలు అన్ని మహ్మద్ మొయిజ్జు ప్రభుత్వంపై అభిశంసన తీర్మానం ప్రవేశపట్టడానికి సిద్ధమైనట్లు సమాచారం. చదవండి: Maldives: మాల్దీవుల పార్లమెంట్లో ఎంపీల కొట్లాట -
Republic Day 2024: నారీశక్తి విశ్వరూపం
న్యూఢిల్లీ: భారత 75వ గణతంత్ర వేడుకల్లో నారీ శక్తి వెల్లివిరిసింది. శుక్రవారం ఢిల్లీలో కర్తవ్య పథ్‌లో జరిగిన వేడుకలు మన సైనిక పాటవ ప్రదర్శనకు కూడా వేదికగా నిలిచాయి. దేశ ఘన సాంస్కృతిక చరిత్రకు అద్దం పట్టాయి. ఆర్మీ మిలిటరీ పోలీస్ విభాగానికి చెందిన కెపె్టన్ సంధ్య సారథ్యంలో తొలిసారిగా పూర్తిగా మహిళా సిబ్బందితో జరిగిన త్రివిధ దళాల కవాతు అందరినీ ఆకట్టుకుంది. నేవీ, డీఆర్డీఓ శకటాలతో పాటు మణిపూర్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, హరియాణా, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి పలు రాష్ట్రాల శకటాలు కూడా ఆసాంతం నారీ శక్తికి అద్దం పట్టేలా రూపొందాయి. 265 మంది మహిళా సిబ్బంది మోటార్ సైకిళ్లపై ఒళ్లు గగుర్పొడిచేలా డేర్‌డెవిల్ విన్యాసాలు చేశారు. సంప్రదాయ మిలిటరీ బ్యాండ్ స్థానంలో కూడా ఈసారి 112 మంది మహిళా కళాకారులు శంఖం, నాదస్వరాలతో పాటు గిరిజన తదితర సంగీత వాయిద్యాలతో అలరించారు. బీఎస్ఎఫ్, సీఆరీ్ప ఎఫ్ మొదలుకుని ఢిల్లీ పోలీస్, ఎన్సీసీ వంటి పలు విభాగాల కవాతులన్నీ పూర్తిగా నారీమయంగా మారి అలరించాయి. వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ వీటన్నింటినీ ఆసాంతం ఆస్వాదిస్తూ కని్పంచారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో కలిసి ఆయన సంప్రదాయ గుర్రపు బగ్గీలో ఆయన వేడుకలకు విచ్చేయడం విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం జరిగిన పరేడ్‌లో ముర్ము, మేక్రాన్ త్రివిధ దళాల వందనం స్వీకరించారు. 90 నిమిషాలకు పైగా జరిగిన వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు సైనిక దళాల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. వణికించే చలిని, దట్టంగా కమ్మేసిన పొగ మంచును లెక్క చేయకుండా భారీ జనసందోహం వేడుకలను తిలకించింది. ఈసారి ఏకంగా 75 వేల మందికి పైగా గణతంత్ర వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించారు. మోదీ వారితో కలివిడిగా మాట్లాడుతూ గడిపారు. ఫొటోలు, సెలీ్ఫలకు పోజులిచ్చారు. ఆయన ధరించిన రంగురంగుల బంధనీ తలపాగా ఆహూతులను ఆకట్టుకుంది. మోదీ రాక సందర్భంగా భారత్ మాతా కీ జై అంటూ వారు చేసిన నినాదాలతో కర్తవ్య పథ్ మారుమోగింది. ఫ్రాన్స్‌కు చెందిన 95 మంది సభ్యుల కవాతు దళం, 30 మందితో కూడిన సైనిక వాయిద్య బృందం కూడా వేడుకల్లో పాల్గొన్నాయి. చివరగా వాయుసేనకు చెందిన 29 యుద్ధ విమానాలు, ఏడు రవాణా విమానాలు, 9 హెలికాప్టర్లు, ఒక హెరిటేజ్ ప్లేన్‌తో పాటు ఫ్రాన్స్ వైమానిక దళానికి చెందిన ఎయిర్‌బస్ ఏ330 మల్టీ ట్యాంకర్ రావాణా విమానం, రెండు రాఫెల్ ఫైటర్ జెట్లు చేసిన ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ విన్యాసాల్లో కూడా 15 మంది మహిళా పైలట్లు పాల్గొనడం విశేషం. అలరించిన నాగ్ మిసైల్ వ్యవస్థ ► వేడుకల్లో ప్రదర్శించిన టీ–90 భీష్మ ట్యాంకులు, నాగ్ మిసైల్ వ్యవస్థ, తేజస్ వంటి యుద్ధ వాహనాలు, ఆయుధాలను గుర్తించే రాడార్ వ్యవస్థ స్వాతి, డ్రోన్లను జామ్ చేసే వ్యవస్థ, అత్యాధునిక ఎల్రక్టానిక్ వార్ఫేర్ వ్యవస్థ, క్యూఆర్ఎస్ఏఎం తదితర క్షిపణులు అలరించాయి. మోదీ నివాళులు శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ తొలుత నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించారు. దేశమాత రక్షణలో ప్రాణాలొదిలిన సైనిక వీరులకు ఘనంగా నివాళులరి్పంచారు. అనంతరం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ముర్ము, మేక్రాన్ గుర్రపు బగ్గీలో వస్తున్న దృశ్యాలను కెమెరాలు, సెల్ ఫోన్లలో బంధించేందుకు జనం పోటీ పడ్డారు. అనంతరం జెండా వందనం, జాతీయ గీతాలాపన, 105 ఎంఎం దేశీయ శతఘ్నులతో 21 గన్ సెల్యూట్ అందరినీ ఆకట్టుకున్నాయి. భారత కీర్తి పతాకను వినువీధిలో ఘనంగా ఎగరేసిన చంద్రయాన్ థీమ్‌తో రూపొందిన శకటం అలరించింది. దాంతోపాటు అయోధ్య రామాలయ ప్రారంభం నేపథ్యంలో కొలువుదీరిన బాలక్ రామ్ శకటం ప్రధానాకర్షణగా నిలిచింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 16 శకటాలు, కేంద్ర శాఖలకు సంబంధించి 9 శకటాలు పరేడ్‌లో పాల్గొన్నాయి. వేడుకలు ముగిశాక మోదీ కర్తవ్య పథ్ పొడవునా కాలినడకన సాగి ఆహూతులను అలరించారు. మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్లు, ముఖ్యమంత్రులు తదితరులు వాటిలో పాల్గొన్నారు. గొప్ప గౌరవం: మేక్రాన్ ‘‘గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడం నాతో పాటు ఫ్రాన్స్‌కు కూడా గొప్ప గౌరవం. థాంక్యూ ఇండియా. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీతో పాటు భారత ప్రజలందరికీ గణతంత్ర దిన శుభాకాంక్షలు’’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ పేర్కొన్నారు. వేడుకల అనంతరం ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. గణతంత్ర వేడుకల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా పాల్గొనడం ఇది ఆరోసారి కావడం విశేషం! ఈ వేడుకలకు దేశాధినేతలను ముఖ్య అతిథిగా ఆహా్వనించడం ఆనవాయితీగా వస్తోంది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నెల్సన్ మండేలా (1995లో) మొదలుకుని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా (2015లో) దాకా ఎందరో అధినేతలు వీటిలో భాగస్వాములయ్యారు. దేశాధినేతల అభినందనలు బ్రిటన్ రాజు చార్లెస్ 3 మొదలుకుని ఆ్రస్టేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు దాకా పలు దేశాల అధినేతలు భారత్‌కు 75వ గణతంత్ర దిన శుభాకాంక్షలు తెలిపారు. అభినందన సందేశాలతో సామాజిక వేదికల్లో పోస్టులు పెట్టారు. భారత్‌తో బ్రిటన్ సంబంధాలు నానాటికీ పటిష్టమవుతున్నాయని రాష్ట్రపతి ముర్ముకు పంపిన సందేశంలో కింగ్ చార్లెస్ హర్షం వెలిబుచ్చారు. -
ఖరీదైన బ్యాగ్ గిఫ్ట్.. దక్షిణ కొరియా రాజకీయాల్లో దుమారం
ఓ ఖరీదైన బ్యాగ్ దక్షిణ కొరియా రాజకీయాల్లో చిచ్చుపెట్టింది. దీనికి గల కారణం దక్షిణ కొరియా మొదటి మహిళ ఆ బ్యాగ్ గిఫ్ట్‌గా స్వీకరించటమని ఆరోపణలు వస్తున్నాయి. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ భార్య కిమ్ కియోన్ హీ(దక్షిణ కిరియా మొదటి మహిళా) రెవ్ అబ్రహం చోయ్ అనే ఓ పాస్టర్ నుంచి ఓ ఖరిదైన డియోర్ బ్యాగ్‌ను కానుకగా స్వీకరించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వ్యవహారం దక్షణి కొరియా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అక్కడి చట్టాల ప్రకారం ఒక మిలియన్ వాన్(రూ. 62,160) కంటే విలువైన వస్తువులు, కానుకలు, బహుమతుల స్వీకరించరాదు. అలా తీసుకుంటే దాన్ని అక్కడి చట్టాలు లంచంగా పరిగణిస్తాయి. దక్షిణా కొరియాలో లంచం వ్యతిరేక చట్టం చాలా కఠినంగా అమల్లో ఉంది. ఈ క్రమంలో దేశ మొదటి మహిళ సుమారు మూడు మిలియన్ వాన్స్( సుమారు రూ. 1,86,811) విలువైన డియోర్ బ్యాగ్‌ను అబ్రహం చోయ్ నుంచి ఆమె స్వీకరించటం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో దక్షిణ కొరియాలో జరగనన్ను అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ కిమ్ కియోన్ హీ ఖరిదైన బ్యాగ్ వ్యవహారం అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు తల నొప్పిగా మారింది. రెవ్ అబ్రహం చోయ్ నుంచి కిమ్ కియోన్.. ఓ ఖరిదైన డియోర్ బ్యాగ్‌ను బహుమతిగా తీసుకున్నట్లు గతేడాది నవంబర్‌లో ఓ రహస్య కెమెరా ఫుటేజీ ద్వారా బయటపడింది. అయితే రెవ్ అబ్రహం చోయ్ ఆ బ్యాగ్‌ను కొనుగోలు చేసి కిమ్ కియోన్కు తన ఆఫీసులో కలవటానికి వెళ్లి ఆమె ఇవ్వడాని ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఇక.. ఇలాంటి విలువైన వాటిని ఎందుకు తీసుకువస్తున్నారని ఆమె ప్రశ్నించినట్లు సమాచారం. మరోవైపు ఆమె ఆ బ్యాగ్‌ను కూడా తీసుకున్నట్లు ఆ వీడియోలో కనిపించటం లేదని స్థానిక మీడియా పేర్కొనటం గమనార్హం. అయితే ఈ బ్యాగ్ అధ్యక్ష కార్యాలయంలో గుర్తించబడింది. దీంతో ప్రతిపక్షాలు అధ్యక్షుడి భార్య చట్టవ్యతిరేకంగా బ్యాగ్ రూపంలో లంచం తీసుకుందని ఆరోపిస్తూ.. అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వటంతో పాటు క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇప్పటికే మైనార్టీ ప్రభుత్వంగా కొనసాగుతున్న అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది. అదీకాక ఈ వ్యవహారం.. ఏప్రిల్ 10న జరగబోయే అధ్యక్ష ఎన్నికలపై యూన్ సుక్ యోల్ చెందిన పీపుల్ పవర్ పార్టీ(PPP)పై ప్రతికూల ప్రభావం చూపనుందని చర్చ జరుగుతోంది. చదవండి: టెక్సాస్, ఫెడరల్ ప్రభుత్వాల మధ్య తీవ్రమవుతున్న సరిహద్దు గొడవ -
దాదాపు 40 ఏళ్ల తరువాత ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అలా...
#RepublicDay2024- MurmuHorsebuggy for parade రిపబ్లిక్ డే 2024 వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటి అంటే.. దాదాపు 40 సంవత్సరాల విరామం తర్వాత, రిపబ్లిక్ డే పరేడ్‌లో గుర్రపు బగ్గీ సంప్రదాయం మళ్లీ వచ్చింది. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ‘సాంప్రదాయ గుర్రపు బగ్గీ’ కర్తవ్య పథానికి చేరుకున్నారు.ప్రెసిడెంట్ ముర్ముతోపాటు ఫ్రెంచ్ అధ్యక్షులు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా ఈ ప్రత్యేక వాహనంలోనే గణతంత్ర దినోత్సవ వేడుకులకు హాజరయ్యారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ బగ్గీకి రాష్ట్రపతి అంగరక్షకుడు ఎస్కార్ట్ చేశారు. భారత సైన్యంలోని అత్యంత సీనియర్ రెజిమెంట్ రాష్ట్రపతి అంగరక్షకుడుగా ఉంటారు. అయితే భద్రతా కారణాల రీత్యా 1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత రిపబ్లిక్ డే కార్యక్రమాలకు అధ్యక్షుడి బగ్గీని ఉపయోగించడం నిలిపివేశారు. అప్పటిక అధ్యక్షులు వారి ప్రయాణానికి లిమోసిన్‌లను ఉపయోగిస్తున్నారు. అంతకుముందు 2014లో, బీటింగ్ రిట్రీట్ వేడుకలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరు గుర్రాల బగ్గీని నడిపి ఈ సంప్రదాయాన్నిపునరుద్ధరించిన సంగతి తెలిసిందే. #WATCH | President Droupadi Murmu and French President Emmanuel Macron riding in a special presidential carriage escorted by the President's Bodyguard make their way to Kartavya Path pic.twitter.com/F4hOovJoua — ANI (@ANI) January 26, 2024 కాగా 75వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో నారీశక్తి థీమ్‌కు అనుగుణంగా 26 శకటాలు దేశంలో మహిళా సాధికారతను ప్రదర్శిస్తూ కర్తవ్య పథంలో కవాతు చేశాయి. అగే తొలి సారి మహిళా అధికారుల సారధ్యంలో త్రివిధ దళాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 105 హెలికాప్టర్ యూనిట్‌కు చెందిన నాలుగు Mi-17 IV హెలికాప్టర్లు కర్తవ్య పథంలో హాజరైన ప్రేక్షకులపై పూల వర్షం కురిపించాయి. 100 మంది మహిళా కళాకారులు నారీ శక్తికి ప్రతీకగా వివిధ రకాల తాళ వాయిద్యాలను వాయిస్తూ ‘ఆవాహన్’ బ్యాండ్ ప్రదర్శన నిర్వహించారు. ఈ వేడుకలకు గాను దేశ రాజధాని నగరం న్యూఢిల్లీ అంతటా 70వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. -
Republic Day 2024: గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం
న్యూఢిల్లీ: దేశ సైనిక శక్తిని, గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ఘనంగా చాటే 75వ గణతంత్ర వేడుకలకు ఢిల్లీ సిద్ధమైంది. కర్తవ్యపథ్‌లో గంటన్నరపాటు సాగే పరేడ్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సారథ్యం వహించనున్నారు. ఈ ఏడాది వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్సు అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ హాజరు కానున్నారు. పరేడ్‌లో క్షిపణులు, డ్రోన్జా మర్లు, నిఘా వ్యవస్థలు, సైనిక వాహనాలపై అమర్చిన మోర్టార్లు, పోరాట వాహనాలను ప్రదర్శించనున్నారు. మొట్టమొదటిసారిగా పూర్తిగా మహిళా అధికారులతో కూడిన త్రివిధ దళాల కంటింజెంట్ కవాతులో పాల్గొననుంది. గత ఏడాది ఆర్టిలరీ రెజిమెంట్‌లో విధుల్లో చేరిన 10 మహిళా అధికారుల్లో లెఫ్టినెంట్లు దీప్తి రాణా, ప్రియాంక సెవ్దా సహా మొట్టమొదటిసారిగా స్వాతి వెపన్ లొకేటింగ్ అండ్ పినాక రాకెట్ సిస్టమ్‌కు సారథ్యం వహించనున్నారు. సంప్రదాయ మిలటరీ బ్యాండ్లకు బదులుగా ఈసారి భారతీయ సంగీత పరికరాలైన శంఖ, నాదస్వరం, నాగడ వంటి వాటితో 100 మంది మహిళా కళాకారుల బృందం పరేడ్‌లో పాల్గొననుంది. భారత వైమానిక దళానికి చెందిన 15 మంది మహిళా పైలట్లు వైమానిక విన్యాసాల్లో పాల్గొంటారు. ఉదయం 10.30 గంటలకు మొదలయ్యే పరేడ్ 90 నిమిషాల పాటు కొనసాగనుంది. -
President Droupadi Murmu: వారసత్వ ప్రతీక రామమందిరం
న్యూఢిల్లీ: భారత్ తన పురాతన నాగరికత వారసత్వాన్ని పునరుజ్జీవింపజేసుకున్న అద్భుత ఘడియగా ‘రామ మందిర నిర్మాణ ఘట్టం’ నిలిచిపోతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వ్యాఖ్యానించారు. భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతినుద్దేశిస్తూ రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. ‘‘ అయోధ్యలో రామమందిర దివ్యధామం ప్రజల విశ్వాసాలను మాత్రమే కాదు న్యాయవ్యవస్థ పట్ల ప్రజలకున్న అచంచల విశ్వాసానికీ నిలువెత్తు నిదర్శనం’’ అని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పనితీరునూ ఆమె ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మధ్య రగులుతున్న ఘర్షణలు, మానవీయ సంక్షోభాలు, యుద్ధాలపై ఆందోళన వ్యక్తంచేశారు. ఘర్షణలకు మూలాలను వెతక్కుండా భయాలు, విద్వేషంతో ఆయా దేశాల ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు కొన్ని ఆమె మాటల్లోనే.. జీ20 ఆతిథ్యం ఎన్నో నేరి్పంది ‘‘న్యాయ ప్రక్రియ, సుప్రీంకోర్టు సముచిత తీర్పుల తర్వాతే అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బాటలు పడ్డాయి. ఈ ఆలయం నిర్మాణం ద్వారా భారత్ తన నాగరికత వారసత్వ పరంపరను కొనసాగిస్తున్నట్లు మరోమారు ప్రపంచానికి చాటింది. ప్రజల విశ్వాసం మాత్రమే కాదు వారు న్యాయవ్యవస్థ మీద వారికున్న నమ్మకానికి నిదర్శనం ఈ ఆలయం. ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించి భారత్ తన పౌరుల భాగస్వామ్యంలో ఎంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలనైనా నిర్వహించగలదని రుజువు చేసింది. వ్యూహాత్మక, దౌత్య అంశాలపై ఏకాభిప్రాయాన్ని సాధించి చూపింది. ప్రజలు తమ సొంత భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోగలరో ప్రపంచ దేశాలకు నేరి్పంది. గ్లోబల్ సౌత్‌కు భారత్ గొంతుకగా నిలిచింది. ఆర్థిక వ్యవస్థ పరిపుష్టితో ధృఢ విశ్వాసంతో భారత్ అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులేస్తోంది’’ అని అన్నారు. అభివృద్ధి భారత్ బాధ్యత పౌరులదే ‘‘ స్వతంత్రభారతావని 75 వసంతాలు పూర్తిచేసుకుని శత స్వాతంత్రోత్సవాల దిశగా అడుగులేస్తోంది. రాబోయే పాతికేళ్ల అమృత్‌కాలంలో సర్వతోముఖాభివృద్ధి సాధించి అభివృద్ధి చెందిన భారత్‌గా దేశాన్ని నిలపాల్సిన బాధ్యత పౌరులదే. ఇప్పుడు మహాత్ముని మాటలు గుర్తొస్తున్నాయి. దేశంలో ప్రజలు ప్రాథమిక హక్కులు గురించి మాత్రమే మాట్లాడితే సరిపోదు. ప్రాథమిక విధులు సైతం ఖచి్చతంగా నిర్వర్తిస్తూ బాధ్యతగా మెలిగినప్పుడే భారత్ అభివృద్ది చెందుతుందని గాం«దీజీ ఉపదేశించారు’’ అని ముర్ము గుర్తుచేశారు. -
Hetvi Khimsuriya: బంగారంలాంటి బిడ్డ
గుజరాత్‌లోని వడోదరకు చెందిన హెత్వి ఖిమ్సూరియా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పీఎం నేషనల్ చైల్డ్ అవార్డ్ (ప్రధాన్‌మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్–పీఎంఆర్బీపి) అందుకుంది. వివిధ రంగాలలో పిల్లలు సాధించిన అద్భుత విజయాలకు గుర్తింపుగా ఇచ్చే పురస్కారం ఇది. పదమూడు సంవత్సరాల హెత్వి సెరిబ్రల్ పాల్సీని అధిగమించి పెయింటింగ్, పజిల్ సాల్వింగ్‌లో అసా«ధారణ ప్రతిభ చూపుతోంది. తనకు వచ్చే పెన్షన్‌ను దివ్యాంగుల సంక్షేమ నిధికి ఇస్తోంది. తన ఆర్ట్‌పై యూట్యూబ్ చానల్ నడుపుతోంది.... వడోదరలోని 8–గ్రేడ్ స్టూడెంట్ హెత్వి ఖిమ్సూరియాకు పురస్కారాలు కొత్త కాదు. ప్రశంసలు కొత్తకాదు. గత సంవత్సరం ఫ్రీహ్యాండ్ పెయింటింగ్, క్రాఫ్ట్, పజిల్ సాల్వింగ్‌లో చూపుతున్న ప్రతిభకు ‘గుజరాత్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదించింది. ‘వరల్డ్స్ ఫస్ట్ సీపీ గర్ల్ విత్ ఎక్స్ట్రార్డినరీ స్కిల్స్’ టైటిల్ సాధించింది. వంద ఎడ్యుకేషనల్ పజిల్స్ సాల్వ్ చేసిన ఫస్ట్ సీపీ గర్ల్‌గా ఆమెను ‘ది లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ గుర్తించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డ్లు సాధించిన హెత్వి గీసిన చిత్రాలు యాభై ఆర్ట్ గ్యాలరీలలో ప్రదర్శితమయ్యాయి. చిత్రకళలపై పిల్లల్లో ఆసక్తి కలిగించడానికి ‘స్పెషల్ చైల్డ్ ఎడ్యుకేషన్ యాక్టివిటీ–హెత్వి ఖిమ్సూరియా’ అనే యూట్యూబ్ చానల్ ప్రారంభించింది. హెత్వి విజయాల వెనుక ఆమె తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంది. కూతురు ప్రస్తావన వచ్చినప్పుడు ‘అయ్యో! మీ అమ్మాయి’ అంటూ ఎంతోమంది సానుభూతి చూపే సమయాల్లో ‘బాధ పడాల్సిన అవసరం ఏముంది. మా అమ్మాయి బంగారం. భవిష్యత్‌లో ఎంత పేరు తెచ్చుకుంటుందో చూడండి’ అనేవారు. ఆ మాట అక్షరాలా నిజమైంది. చిన్నప్పటి నుంచి బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. హెత్విని చూసుకోవడానికి ఆమె తల్లి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసింది. రంగులు, పజిల్స్‌తో బేసిక్స్ ప్రారంభించారు. రంగులు, పజిల్స్ అంటే హెత్విలో ఇష్టం ఏర్పడేలా చేశారు. బొమ్మలు వేస్తున్నప్పుడు, పజిల్స్ పరిష్కరిస్తున్నప్పుడు ఆ అమ్మాయి కళ్లలో శక్తి కనిపిస్తుంది. ఆ శక్తితో ఏదైనా సాధించవచ్చు అనే నమ్మకాన్ని తల్లిదండ్రులలో నింపింది. హెత్వి మోములో ఎప్పుడూ చెరగని చిరునవ్వు కనిపిస్తుంది. ఆ చిరునవ్వే ఈ చిన్నారి బలం. హెత్వి ఖిమ్సూరియా మర్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. -
ఫ్లయిట్ అటెండెంట్‌కు ప్రెసిడెంట్ హోదా
టోక్యో: జపాన్‌కు చెందిన అంతర్జాతీయ విమానయాన సంస్థ ‘జపాన్ ఎయిర్ లైన్స్’అరుదైన నిర్ణయం తీసుకుంది. సంస్థలో రెండో అత్యున్నత స్థాయి హోదా అయిన ప్రెసిడెంట్‌గా మాజీ మహిళా ఫ్లయిట్ అటెండెంట్‌ను నియమించింది. ఈమె ఏప్రిల్ ఒకటిన ప్రస్తుత ప్రెసిడెంట్ యూజి అకసావ స్థానంలో బాధ్యతలు చేపడతారు. ప్రస్తుత చైర్మన్ యోషిహరు స్థానంలో అకసావ చేరుతారు. 1985లో ఫ్లయిట్ అటెండెంట్‌గా సంస్థలో కెరీర్‌ను ప్రారంభించిన మిట్సుకో టొట్టొరీ 2015లో క్యాబిన్ క్రూ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. తనకు లభించిన ఉద్యోగోన్నతి ఇతర మహిళలు తమ కెరీర్లో పైకెదిగేందుకు ప్రోత్సాహంగా నిలుస్తుందని మిట్సుకో చెప్పారు. టోక్యోలోని హనెడా ఎయిర్‌పోర్టులో ఇటీవల జపాన్ ఎయిర్ లైన్స్ విమానం చిన్నపాటి కోస్ట్‌గార్డ్ విమానాన్ని ఢీకొన్న ఘటన నేపథ్యంలో మిట్సుకోను నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రయాణికుల భద్రత, సేవల విభాగంలోనే తన కెరీర్లో అత్యధిక భాగం గడిపానని చెప్పారు. ఇకపై కూడా భద్రతకే అధిక ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ప్రపంచంలోని టాప్–100 విమానయాన సంస్థల్లో ఉన్నత స్థాయి హోదాల్లో కేవలం 12 మంది మహిళా అధికారులు మాత్రమే ఉన్నట్లు ఫ్లయిట్ గ్లోబల్ వెబ్సైట్ 2022లో చేపట్టిన సర్వేలో తేలింది. -
Davos: బ్యాంకులతో ఉక్రెయిన్ అధ్యక్షుడి కీలక చర్చలు
జ్యురిచ్: రష్యాతో యుద్ధంలో చితికిపోయిన ఉక్రెయిన్ దేశాన్ని పునర్నిర్మించేందుకు ఆ దేశ అధ్యకక్షుడు జెలెన్స్కీ నానా తిప్పలు పడుతున్నారు. ప్రస్తుతం దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు ఆయన స్విట్జర్లాండ్ వెళ్లారు. సదస్సులో పాల్గొనేందుకు అక్కడికి వచ్చిన ప్రపంచ బ్యాంకింగ్ దిగ్గజాలు, అగ్రశ్రేణి ప్రైవేట్ ఈక్విటీ(పీఈ) సంస్థల యాజమాన్యాలను జెలెన్స్కీ కలుస్తున్నారు. తమ దేశాన్ని పునర్నిర్మించేందుకు అప్పులివ్వడంతో పాటు పెట్టుబడులు పెట్టాల్సిందిగా జెలెన్స్కీ వారిని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికా బ్యాంకింగ్ దిగ్గజం జేపీ మోర్గాన్ చేస్ సీఈవో జేమీ డైమన్తో జెలెన్స్కీ సమావేశమయ్యారు. డైమన్తోనే కాక ప్రముఖ పీఈ సంస్థలు బ్లాక్‌రాక్, బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్, కార్లైల్ గ్రూపు, బ్లాక్‌స్టోన్ సంస్థల యాజమాన్యాలతోనూ జెలెన్స్కీ చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా జెలెన్స్కీ మాట్లాడుతూ ‘2023లో ఉక్రెయిన్ ఎకానమీ 5 శాతం వృద్ధి చెందింది. ఈ ఏడాది మరో 4.6 శాతం వృద్ధి చెందుతుందని భావిస్తున్నాం. ఈ సమయంలో మాకు ప్రభుత్వ పెట్టుబడితో పాటు ప్రైవేటు పెట్టుబడి కూడా ఎంతో ముఖ్యం’అని జెలెన్ స్కీ తెలిపారు. కాగా, తాజాగా ఐక్యరాజ్యసమితి ఉక్రెయిన్‌కు తక్షణమే 4.2 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం కావాలని తన భాగస్వామ్య దేశాలను కోరడం గమనార్హం. ఇదీచదవండి.. చైనాను వణికిస్తున్న మంచు తుఫాన్లు -
‘ఇండియా’కు ఖర్గే సారథ్యం!
న్యూఢిల్లీ/పట్ని/కోల్‌కతా/ముంబై: విపక్ష ‘ఇండియా’ కూటమి చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరు తెరపైకి వచ్చింది. శనివారం జరిగిన కూటమి వర్చువల్ భేటీలో ఈ విషయమై భాగస్వామ్య పక్షాల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. మొత్తం 28 పక్షాల్లో తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, శివసేన (ఉద్ధవ్) మినహా మిగతా పార్టీల నేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీలో పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల సన్నద్ధత, సీట్ల సర్దుబాటుతో పాటు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా కూటమి సారథిగా ఎవరుండాలన్నదీ చర్చకు వచ్చింది. ఖర్గే సారథ్యానికి నేతలంతా సమ్మతించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కూటమి చైర్‌పర్సన్‌గా ఆయన నియామకం దాదాపుగా ఖరారైనట్టేనని, అధికారిక ప్రకటనే తరువాయి అని చెబుతున్నారు. ఇక కూటమి కన్వినర్ పదవిని నితీశ్‌కు కట్టబెట్టాలన్న భావన వ్యక్తమైనట్టు తెలిసింది. తృణమూల్, సమాజ్‌వాదీలతో చర్చించాక దీనిపై తుది నిర్ణయానికి రావాలని నిర్ణయించారు. కానీ నితీశ్ ఆ పదవిపై ఆసక్తిగా లేరని, కాంగ్రెస్ నేతకే ఆ బాధ్యత కూడా అప్పగించాలని సూచించారని తెలుస్తోంది. విపక్ష కూటమిలో అంతర్గత పోరుకు ఈ పరిణామాలు తాజా నిదర్శనమంటూ బీజేపీ ఎద్దేవా చేయగా, కన్వినర్‌తో సహా ఏ విషయంలోనూ కూటమిలో విభేదాల్లేవని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. భావి కార్యాచరణ ఖరారుకు త్వరలో సమావేశమై మరో దఫా చర్చించాలని కూటమి నేతలంతా నిర్ణయానికి వచ్చారు. డీకే శుభాకాంక్షలు! : ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి రేసులో చైర్పర్సన్, కన్వినరే ముందుంటారని భావిస్తున్న నేపథ్యంలో ఆ పదవులు ఎవరికి దక్కుతాయన్న దానిపై భాగస్వామ్య పక్షాల్లో ఆసక్తి నెలకొంది. కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ గత భేటీలోనే ప్రతిపాదించడం తెలిసిందే. కాంగ్రెస్ నేతను చైర్పర్సన్ చేసేందుకు జేడీ(యూ) అధ్యక్షుడు, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ కూడా సుముఖంగానే ఉన్నట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్ ఝా తాజాగా తెలిపారు. ఆ పదవికి ఖర్గే పేరు ప్రతిపాదించడంపై నితీశ్ అసంతృప్తిగా ఉన్నారన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో, చైర్‌పర్సన్‌గా ఖర్గే పేరుపై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టు వర్చువల్ భేటీ అనంతరం సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా వెల్లడించారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ అయితే ఏకంగా ఖర్గే నియామకం జరిగిపోయిందని ప్రకటించేశారు! ‘‘ఖర్గే కర్ణాటకకే కాదు, దేశానికే గర్వకారణం’’ అంటూ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు! కన్వినర్‌గా నితీశ్ పేరు ప్రతిపాదనకు వచ్చిందని పవార్ ధ్రువీకరించారు. కానీ, ‘‘కూటమికి కన్వినర్ అవసరమే లేదు. అన్ని పార్టీల అధ్యక్షులతో టీమ్ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. నితీశ్దీ ఇదే అభిప్రాయం’’ అని ఆయన చెప్పుకొచ్చారు. తాజా భేటీలో కన్వినర్‌గా నితీశ్ పేరు ప్రతిపాదనకు రావడం నిజమేనని ఝా కూడా ధ్రువీకరించారు. కన్వినర్ విషయమై మమత, ఎస్పీ చీఫ్ అఖిలేశ్‌తో ఖర్గే చర్చిస్తున్నట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ పరిమితులు గుర్తెరగాలి: తృణమూల్ కూటమి ధర్మానికి కట్టుబడ్డామని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అయితే కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్లో ముందుగా తన పరిమితులేమిటో తెలుసుకుంటే మంచిదని హితవు పలికింది. రాష్ట్రం వరకు ఎన్డీఏపై లోక్‌సభ ఎన్నికల పోరుకు తామే సారథ్యం వహిస్తామని పునరుద్ఘాటించింది. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు కేవలం 2 సీట్లే ఇస్తామని తృణమూల్ ఇప్పటికే పేర్కొనడం తెలిసిందే. కాదంటే మహా అయితే మరో 2 స్థానాల దాకా ఇచ్చే యోచనలో పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఉన్నట్టు చెబుతన్నారు. బెంగాల్లో 2001, 2011 అసెంబ్లీ ఎన్నికల్లో, 2009 లోక్‌సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌తో తృణమూల్ పొత్తు పెట్టుకుంది. వర్చువల్ కూటమి, వర్చువల్ భేటీలు: బీజేపీ న్యూఢిల్లీ: ఇండియా కూటమిపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యంగ్యా్రస్తాలు విసిరారు. క్షేత్రస్థాయిలో ఎక్కడా బలం లేని వర్చువల్ కూటమి వర్చువల్ సమావేశాల్లో బిజీగా ఉందంటూ ఎద్దేవా చేశారు. ‘‘అవి ఊహాత్మక కూటమే తప్ప వ్యూహాత్మక కూటమి కాదు. సొంత కుటుంబాలను, ఆస్తులను కాపాడుకోవడమనే ప్రధాన అజెండాగా విపక్షాలన్నీ మల్లగుల్లాలు పడుతున్నాయి. సోనియా, రాహుల్ సహా నేతలంతా అవినీతిలో పీకలదాకా కూరుకుపోయారు’’ అన్నారు. -
parliament session 2024: 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ వర్గాలంటున్నాయి. 31న ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు ఫిబ్రవరి 9 వరకు కొనసాగనున్నాయని సమాచారం. సమావేశాల తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించనున్నారు. తర్వాతి రోజు ఫిబ్రవరి ఒకటిన ఆరి్ధక మంత్రి నిర్మలా సీతారామన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడతారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అవసరమైన ఖర్చులకు పార్లమెంట్ ఆమోదం తీసుకునేందుకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చే ప్రభుత్వం తిరిగి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుత ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మహిళా రైతులను ఆకట్టుకునేలా కీలక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని రెట్టింపు చేసే ప్రతిపాదన ఉండొచ్చని సమాచారం. మహిళా రైతులకు కిసాన్ నిధిని పెంచితే ప్రభుత్వానికి అదనంగా రూ.12,000 కోట్లు రావచ్చని లెక్కలు వేస్తున్నాయి. ఈ ప్రకటనను ఆరి్ధక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో హైలైట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నాయి. -
టీవీ స్టూడియోలో దుండగుల దాడి.. లైవ్‌లో వీక్షించిన ప్రేక్షకులు!
ఈక్వెడార్ అధ్యక్షుడు డేనియల్ నోబోవా తాజాగా క్రిమినల్ గ్రూప్ ‘ఈక్వెడార్ గ్యాంగ్స్టర్స్ స్టార్మ్ స్టూడియో’పై సైనిక చర్యకు ఆదేశించారు. హుడ్ ధరించిన ఈ గ్రూప్‌నకు చెందిన ముష్కరులు టెలివిజన్ స్టూడియోపై దాడి చేయడంతో పాటు భద్రతా బలగాలను, పౌరులను చంపుతామని బెదిరించడంతో అధ్యక్షుడు ఇటువంటి ఆదేశాలు జారీచేశారు. ఈక్వెడార్‌లో పేరుమోసిన నేరస్తుడు జోస్ అడాల్ఫో ఇటీవల మాసియాస్ జైలు నుండి తప్పించుకోవడంతో దేశంలో భద్రతా సంక్షోభం తలెత్తింది. దేశంపై గ్యాంగ్స్టర్లు యుద్ధం ప్రకటించారు. దీంతో దేశం అంతర్గత సాయుధ సంఘర్షణలో ఉందని అధ్యక్షుడు నోబోవా ప్రకటించారు. శాంతియుత స్వర్గధామంగా ఉన్న ఈక్వెడార్‌పై పట్టుసాధించేందుకు ఇటీవలి కాలంలో మెక్సికన్,కొలంబియన్ కార్టెల్స్‌తో సంబంధం కలిగిన ప్రత్యర్థి ముఠాలు పోటీ పడుతున్నాయి. తాజాగా ఈ క్రిమినల్ గ్రూపులను మట్టుబెట్టేందుకు సైనిక చర్య చేపట్టాలని దేశ సాయుధ బలగాలను అధ్యక్షుడు నోబోవా ఆదేశించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. పోర్ట్సిటీలోని టీసీ టెలివిజన్ స్టూడియోలో తుపాకులు, గ్రెనేడ్లతో దుండగులు దాడికి పాల్పడిన దరమిలా అధ్యక్షుడు ఈ ప్రకటన చేశారు. కాగా స్టూడియోలో తుపాకీ కాల్పుల మధ్య ఒక మహిళ.. ‘షూట్ చేయవద్దు, దయచేసి కాల్చకండి’ అని వేడుకుంది. అయితే ముష్కరులు వార్తలు చదువుతున్న వ్యక్తితో పాటు అక్కడున్న ఇతర ఉద్యోగులను నేలపై కూర్చోమని ఆదేశించి, తలపై తుపాకీ ఎక్కుపెట్టారు. తమ వద్ద బాంబులు ఉన్నాయని బెదిరించారు. ఈ ఉదంతమంతా టీవీ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారమైంది. లైవ్‌లో తుపాకీ శబ్దాలూ వినిపించాయి. దీనిని ప్రేక్షకులు ఆసక్తిగా వీక్షించారు. సుమారు 30 నిమిషాల గందరగోళం తర్వాత అధికారులు స్టూడియోలోకి ప్రవేశించడం కనిపించింది. దీనికి ముందు గ్యాంగ్స్టర్లు పోలీసు అధికారులను కిడ్నాప్ చేశారు. అధ్యక్షుడు నోబోవా ప్రకటించిన 60 రోజుల అత్యవసర పరిస్థితి, రాత్రిపూట కర్ఫ్యూకి నిరసనగా గ్యాంగ్స్టర్లు దేశంలోని పలు నగరాల్లో పేలుడు పదార్థాలతో విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నించారు. కాగా 36 ఏళ్ల నోబోవా దేశంలో మాదకద్రవ్యాల సంబంధిత నేరాలు, హింసకు వ్యతిరేకంగా పోరాడతానని డేనియల్ నోబోవా ప్రతిజ్ఞ చేసిన దరిమిలా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. -
National Sports Awards: రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానం (ఫొటోలు)
-
India-Maldives Row: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుపై అవిశ్వాసానికి పిలుపు
మాలే: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జును తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆ దేశ పార్లమెంటరీ మైనారిటీ నాయకుడు అలీ అజీమ్ కోరారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలని సభ్యులకు పిలుపునిచ్చారు . మాల్దీవుల మంత్రులు ప్రధాని నరేంద్ర మోదీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. " స్థిరమైన విదేశాంగ విధానాన్ని పెంపొందిచడానికి డెమొక్రాట్లమైన మేము ప్రయత్నించాం. పొరుగు దేశాలతో సత్సంబంధాలను నెలకొల్పాము. అధ్యక్షుడు @MMuizzu ను అధికారం నుండి తొలగించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మాల్దీవుల సెక్రెటేరియట్ సిద్ధంగా ఉందా? విశ్వాసం లేదా?" అని నాయకుడు ఎక్స్‌లో పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఇది ఇరుదేశాల మధ్య వివాదాస్పద వాతావరణం ఏర్పడటానికి కారణమైంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేశారు. మాల్దీవుల పర్యాటకంపై ప్రముఖులు నిరసన వ్యక్తం చేశారు. బైకాట్ మాల్దీవులు అంటూ నినాదాలు విస్తృతంగా వ్యాప్తి చేశారు. ఈ వివాదంపై ఇరుదేశాలు ఇప్పటికే హైకమిషనర్లకు సమన్లు జారీ చేశారు. ఇదీ చదవండి: PM Modi Maldives Controversy: మోదీ పర్యటన తర్వాత లక్షద్వీప్ వైపే అందరి చూపు! -
దేశ ప్రజలకు రాష్ట్రపతి కొత్త ఏడాది శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సమసమాజ స్థాపనకు, దేశం సర్వతోముఖాభివృద్ధిని సాధించేందుకు పౌరులంతా ప్రతిజ్ఞచేయాలని ఆమె పిలుపునిచ్చారు. కొత్త ఆశలు, ఆకాంక్షల సాధన కోసం సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ముందడుగువేయాలని ఆమె అభిలషించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఆదివారం ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ కొత్త ఏడాదిలో దేశ పౌరులందరికీ సంతోషం, శాంతి, సౌభ్రాతృత్వాలు దక్కాలి. దేశ పురోగతికి మనందరం పాటుపడదాం. అభివృద్ధి భారత్ కోసం కొత్త తీర్మానాలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. నూతన సంవత్సరం సందర్భంగా దేశ, విదేశాల్లో నివసిస్తున్న భారతీయులందరికీ నా శుభాకాంక్షలు’’ అని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. -
అర్జెంటీనాను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?
అర్జెంటీనా నూతన అధ్యక్షుడు జేవియర్ మిలీ.. ఇలా అధికారం చేపట్టారో లేదో అంతలోనే అనూహ్య నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఏడాది ఐదు వేల మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రాక్టులను రద్దు చేస్తున్నట్లు జేవియర్ మిలీ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. జేవియర్ మిలీ డిసెంబర్ 10న అర్జెంటీనా నూతన అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. సంక్షోభంలో కూరుకున్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దిశగా చర్యలు ప్రారంభించారు. దేశంలోని ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు పలు రంగాలలో కోతలు, పెట్టుబడుల తగ్గింపులకు శ్రీకారం చుట్టారు. జేవియర్ మిలీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలి కోహెన్ పాల్గొన్నారు. కాగా 2023కు ముందు నియమితులైన ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రాక్టులను సమీక్షించనున్నట్లు మిలీ ప్రభుత్వ అధికారులు తెలిపారు. అర్జెంటీనాలో త్వరలో ద్రవ్యోల్బణం దాదాపు 200 శాతానికి చేరుతుందనే అంచనాలున్నాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వ నిబంధనలు, ఎగుమతులు, పెట్టుబడులను సవరించేందుకు ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలోని పలు పరిశ్రమలను ప్రైవేటీకరించేందుకు అనుమతిస్తానని మిలే ప్రకటించారు. దేశాన్ని పునర్నిర్మాణ మార్గంలో తీసుకెళ్లడం, ప్రజలకు స్వేచ్ఛ, స్వయంప్రతిపత్తి కల్పించడం, దేశ ఆర్థికాభివృద్ధికి ఆటంకంగా ఉన్న నిబంధనలను సవరించడమే తన లక్ష్యమని మిలీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం పలు ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటీకరణపరం చేయనుందని నూతన అధ్యక్షుడు జేవియర్ మిలీ తెలిపారు. ఈ చర్యలలో పెసా (అర్జెంటీనా కరెన్సీ) విలువను 50 శాతం మేరకు తగ్గించడం, ఇంధనం, రవాణా సబ్సిడీలపై కోత, కొన్ని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు స్వస్తి పలకడం వంటివి ఉన్నాయి. 53 ఏళ్ల మైలీ తన ఎన్నికల ప్రచారంలో తాను దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతానని, ఇందుకోసం పలు మార్పులు చేస్తానని పేర్కొన్నారు. దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రస్తుత తరుణంలో నిరాశ చెందిన అర్జెంటీనా ప్రజలకు ఆయన ఆశాజ్యోతిగా కనిపించారు. ఈ నేపధ్యంలో ప్రజా మద్దతుతో ఆయన ఆ కొత్త అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుని నిర్ణయాలివే.. తన 21 క్యాబినెట్ పదవులలో 12 పదవులను తొలగించారు. ఐదువేల మంది మంది ప్రభుత్వ ఉద్యోగులను ఇంటికి పంపించారు. లెక్కలేనన్ని ప్రభుత్వ నిబంధనలకు ముగింపు పలికారు. మిలిటరీలో అనేక మార్పులు చేశారు. ఆత్మరక్షణ హక్కును నిర్ధారించే బిల్లుకు మద్దతు పలికారు. చిన్నారుల ఇంటి విద్యను చట్టబద్ధం చేసే బిల్లును ప్రవేశపెట్టనున్నారు. బిట్‌కాయిన్‌లో చట్టబద్ధమైన చెల్లింపు ఒప్పందాలకు శ్రీకారం పలికారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ దిశగా ముందడుగు వేశారు. సొంత చమురు పరిశ్రమను తెరిచే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్ భీకర దాడులు.. 24 గంటల్లో 200 మంది మృతి