అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో తెలియజేశారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ కూడా బైడెన్ ఆరోగ్య వివరాలను తెలియజేశారు. జో బైడెన్ తన సోషల్ మీడియా ఖాతాలోలో ఇలా రాశారు. ‘ఈ రోజు మధ్యాహ్నం నేను కోవిడ్ -19 టెస్టులు చేయించుకున్నాను. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. నా శ్రేయస్సు కోరుకునేవారందరికీ ధన్యవాదాలు. నేను అనారోగ్యం నుంచి కోలుకునేవరకూ అందరికీ దూరంగా ఉంటాను. ఈ సమయంలోనూ అమెరికా ప్రజల కోసం పని చేస్తూనే ఉంటాను’అని పేర్కొన్నారు.
I tested positive for COVID-19 this afternoon, but I am feeling good and thank everyone for the well wishes.
I will be isolating as I recover, and during this time I will continue to work to get the job done for the American people.— President Biden (@POTUS) July 17, 2024
బైడెన్‌కు చికిత్స అందిస్తున్న వైద్యుడు కెవిన్ ఓ కానర్ మాట్లాడుతూ బైడెన్ ప్రస్తుతం ముక్కు కారటం, దగ్గు వంటి తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్నారన్నారు. అలసిపోయినట్లు కనిపిస్తున్నారని కూడా తెలిపారు. కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన దరిమిలా బైడెన్‌కు యాంటీ వైరల్ డ్రగ్ పాక్స్‌లోవిడ్ మొదటి డోస్ అందించాం. బైడెన్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం ఇస్తూనే ఉంటామని తెలిపారు.
లాస్ వెగాస్‌లో జరిగిన ఒక సదస్సులో ప్రసంగానికి ముందు బైడెన్‌కు కరోనా టెస్ట్ చేశారు. ఈ రిపోర్టుల ఆధారంగా ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు గుర్తించారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ మీడియాతో మాట్లాడుతూ జో బైడెన్ ప్రస్తుతం కరోనాలోని తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్నారు. ఆయన డెలావేర్‌కు చేరుకుని కరోనా తగ్గేవరకూ ఒంటరిగా ఉంటారన్నారు.
Earlier today following his first event in Las Vegas, President Biden tested positive for COVID-19. He is vaccinated and boosted and he is experiencing mild symptoms. He will be returning to Delaware where he will self-isolate and will continue to carry out all of his duties… pic.twitter.com/ka5hiBavTC
— ANI (@ANI) July 17, 2024
Comments
Please login to add a commentAdd a comment