
న్యూఢిల్లీ: ఎన్‌ఎస్‌ఈ మాజీ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ షాక్ ఇచ్చింది. ఎన్‌ఎస్‌ఈలో పాలనా లోపాల కేసులో రూ.3.12 కోట్లు చెల్లించాలంటూ ఆమెకు డిమాండ్ నోటీస్ జారీ చేసింది. 15 రోజుల్లో ఈ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైతే అరెస్ట్ తప్పదని సెబీ హెచ్చరించింది. అలాగే ఆస్తులు, బ్యాంక్ ఖాతాల జప్తు తప్పదని స్పష్టం చేసింది. ఎన్‌ఎస్‌ఈ కో–లొకేషన్ అవినీతి కేసు, ఇతర పాలనా లోపాలతో ముడిపడి ఉన్న దర్యాప్తులో మార్చి 6న సీబీఐ అరెస్టు చేసిన తరువాత చిత్రా రామకృష్ణ ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు.
చదవండి: Chitra Ramkrishna: కీలక ఆదేశాలు..చిత్రా అప్పీలుపై శాట్ విచారణ