
సాక్షి, బెంగళూరు: అనుమానిత ఉగ్రవాది ఒకరిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి తిలక్‌నగరలో ఉంటున్న అస్సాంకు చెందిన అఖ్తర్ హుస్సేన్ లష్కర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు.
పదో తరగతి వరకు చదువుకున్న అఖ్తర్ యువతకు ఉగ్రవాద సంస్థలతో గల సంబంధాలపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఇతడి నుంచి ల్యాప్‌ట్యాప్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, సోమవారం మరో అనుమానిత ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.