త్వరలో పెళ్లి, అంతలోనే కాబోయే భార్యభర్తలు జలసమాధి | Two People Lost Bearth Drowning in Kelamangala | Sakshi
Sakshi News home page

త్వరలో పెళ్లి, అంతలోనే కాబోయే భార్యభర్తలు జలసమాధి

Published Fri, Apr 22 2022 6:57 AM | Last Updated on Fri, Apr 22 2022 7:32 AM

Two People Lost Bearth Drowning in Kelamangala  - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

నిశ్చితార్థం జరిగింది, మే నెలలో పెళ్లి నిర్ణయించారు. బుధవారం ఉరిగంలో మారియమ్మ జాతరలో పాల్గొనేందుకు అభి వెళ్లింది. గురువారం ఉదయం శివ, అభి దగ్గరిలోని వాగులో ఈతకెళ్లారు. అభి నీటిలో మునిగిపోతుండగా శివ ఆమెను రక్షించేందుకు యత్నించారు.

కెలమంగలం (కర్ణాటక): మరికొద్దినెలల్లో ఇద్దరూ మూడుముళ్లతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సి ఉంది. కానీ విధి వైపరీత్యానికి బలయ్యారు. నీట మునిగి కాబోయే భార్యభర్తలు మృతి చెందారు. అంచెట్టి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘోరం చోటు చేసుకొంది. వివరాల మేరకు అంచెట్టి తాలూకా ఉరిగంకు చెందిన శివమాదన్‌ కొడుకు శివ (21), డెంకణీకోట అణ్ణానగర్‌కు చెందిన  చిన్నరాజ్‌ కూతురు అభి (18)లకు నిశ్చితార్థం జరిగింది. మే నెలలో పెళ్లి నిర్ణయించారు.

బుధవారం ఉరిగంలో మారియమ్మ జాతరలో పాల్గొనేందుకు అభి వెళ్లింది. గురువారం ఉదయం శివ, అభి దగ్గరిలోని వాగులో ఈతకెళ్లారు. అభి నీటిలో మునిగిపోతుండగా శివ ఆమెను రక్షించేందుకు యత్నించారు. ఇరువురికీ ఈతరాకపోవడంతో నీట మునిగి మృతి చెందారు. ఇరుకుటుంబాల వారి రోదనలు మిన్నంటాయి. అంచెట్టి పోలీసులు కేసు నమోదు చేశారు.   

చదవండి: (ఘనంగా మంత్రి కుమారుడి వివాహం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement