యాపిల్స్‌లోని ఈ రకాలు ట్రై చేసి చూశారా..! | Learn More About Different Types Of Apples | Sakshi

యాపిల్స్‌లోని ఈ రకాలు ట్రై చేసి చూశారా..!

Oct 22 2024 11:50 AM | Updated on Oct 22 2024 12:50 PM

Learn More About Different Types Of Apples

యాపిల్స్‌ అంటే ఇష్టపడని వారు ఉండరు. అందరికి తెలిసిన సాధారణ యాపిల్స్‌ గాక అందులో చాలా వెరైటీలు ఉంటాయననే విషయం తెలుసా. వీటిని ఎప్పుడైన తిని చూశారా..!. తెలియకపోతే ఆలస్యం చెయ్యకుండా త్వరగా తెలుసుకుని ట్రై చేసి చూడండి. 

యాపిల్స్‌లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. రోజూ ఒక యాపిల్ తింటే మనం డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పని ఉండదు. ఒక యాపిల్ ఎన్నో రోగాలు బారిన పడకుండా కాపాడుతుంది. అలాంటి యాపిల్స్‌లో మొత్తం ఎనిమిది రకాలు ఉన్నాయి. అవేంటంటే..

అంబ్రి యాపిల్
జమ్మూ కాశ్మీర్‌కు చెందిన అంబ్రి రకం యాపిల్‌. ఒకప్పుడూ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన యాపిల్‌ రకంలో ఇది ఒకటి. దీనిని కాశ్మీర్‌ రాజు అనిపిలుస్తారు. ఇది చక్కటి ఆకృతి, తీపి వాసనతో మంచి రుచిని కలిగి ఉంటుంది. ఇవి సుదీర్ఘకాలం పాడవ్వకుండా ఉండటంలో ప్రసిద్ధి చెందినవి. వీటటిని డెజర్ట్‌లోల ఉపయోగిస్తారు. 

చౌబత్తియా అనుపమ్ 
ఇది ఎరుపురంగులో పండిన యాపిల్‌లా ఉంటుంది. మద్యస్థ పరిమాణంఓ ఉంటుంది. ఇది హైబ్రిడ్‌​ యాపిల్‌ రం. వీటిని ఎర్లీషాన్‌బరీ, రెడ్‌ డెలిషియన్‌ మధ్య క్రాస్‌ చేసి పడించిన యాపిల్స్‌. దీన్ని ఉత్తరాఖండ్‌లో విస్తారంగా సాగు చేస్తారు. 

గోల్డెన్ ఆపిల్‌
దీన్ని గోల్డెన్‌ డెలిషియస్‌ అని కూడా పిలుస్తారు. పసుపు పచ్చని రంగుతో మృదువైన ఆకృతిలో ఉంటాయి. ఇవి అమెరికాకు చెందినవి. ఇప్పుడు వీటిని హిమచల్‌ ప్రదేశ్‌లో కూడా పండిస్తున్నారు. తేలికపాటి రుచితో మంచి సువాసనతో ఉంటాయి. వీటిని ఎక్కువగా యాపిల్‌ సాస్‌, యాపిల్‌ బటర్‌, జామ్‌ల తయారీకి అనువైనది. 

గ్రానీ స్మిత్
యాపిల్‌కి పర్యాయపదంలా ఉంటాయి ఈ గ్రానీ స్మిత్‌ యాపిల్స్‌. వీటిని హిమాచల్ ప్రదేశ్‌లో ఎక్కువగా సాగు చేస్తారు. అయితే భారతదేశంలో పెరిగే ఈ రకం యాపిల్స్‌ మమ్రాతం ఇక్కడ ప్రత్యేక వాతావరణానికి  కాస్త తీపిని కలిగి ఉండటం విశేషం. వీటిని ఎక్కువగా సలాడ్‌లు, జ్యూస్‌లు, బేకింగ్‌ పదార్థాల్లో ఉపయోగిస్తారు. 

సునేహరి యాపిల్
ఇది కూడా హైబ్రిడ్‌ యాపిల్‌కి సంబంధించిన మరో రకం. అంబ్రి యాపిల్స్ క్రాసింగ్ నుంచి వస్తుంది. యాపిల్ క్రిమ్సన్ స్ట్రీక్స్‌లా పసుపు తొక్కను కలిగి ఉంటుంది. ఆకృతి క్రంచీగా ఉంటుంది. తీపితో కూడిన టార్ట్ రుచిని కలిగి ఉంటాయి. 

పార్లిన్‌ బ్యూటీ 
ఈ యాపిల్స్‌ భారతదేశంలోని తమిళనాడుకి చెందింది. ఈ రకానికి చెందిన యాపిల్స్‌  కొడైకెనాల్ కొండల్లో ఉండే వెచ్చని శీతాకాల పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయి. ఆగస్టు, సెప్టెంబర్‌లో ఈ రకం యాపిల్స్‌ వస్తుంటాయి. ఇవి మధ్యస్థం నుంచి పెద్ద పరిమాణం వరకు వివిధ ఆకృతుల్లో లభిస్తాయి.

ఐరిష్ పీచ్
అత్యంత చిన్న యాపిల్స్‌. ఇవి లేత పసుపు గోధుమ ఎరుపు రంగులతో ఉంటుంది. పరిమాణంలో చిన్నది. విలక్షణమైన తీపి టార్ట్‌ రుచిని కలిగి ఉంటుంది. వీటిని పచ్చిగానే తీసుకుంటారు. అధిక పీచుతో కూడిన యాపిల్స్‌ ఇవి. 

స్టార్కింగ్ 
ఈ యాపిల్స్‌ తేనె లాంటి సువాసనతో అత్యంత తియ్యగా ఉటాయి. వీటని ప్రధానంగా హిమాచల్‌ ప్రదేశ్‌లో పండిస్తారు. వీటిని తాజాగా తింటారు. అధిక చక్కెర కంటెంట్‌ ఉంటుంది. ఎక్కువగా జ్యూస్‌ల తయారీలో ఉపయోగిస్తారు. 

ఈ ఎనిమిది రకకాల యాపిల్స్‌ దేనికదే ప్రత్యేకమైనది. ప్రతి రకం యాపిల్‌ రుచి, ఆకృతి పరంగా మంచి పోషకవిలువలు కలిగినవి. ఏ యాపిల్స్‌లో ఏదో ఒకటి తీసుకునేందుకు ప్రయత్నించినా.. మంచి ప్రయోజనాలను పొందగలరని నిపుణులు చెబుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement