
ఆడపిల్లలంటే మన సమాజంలో చిన్నచూపు. ఇక అరుదైన వైకల్యంతో పుట్టిన చిన్నారి పరిస్థితి గురించి చెప్పాల్సిన పనిలేదు. అందుకే పుట్టిన వెంటనే తల్లిదండ్రులు అనాథాశ్రమంలో వదిలివేశారు. కానీ భారతదేశంలో నివసిస్తున్న అమెరికాకు చెందిన దంపతులు పెద్ద మనసు చేసుకున్నారు. రెండేళ్లుగా అనాథాశ్రమంలో ఉంటున్న చిన్నారి నిషాని ఇంటికి తెచ్చుకున్నారు. ఎంతో ప్రేమగా ఒక బిడ్డకు కొత్త జీవితాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఒక అందమైన పోస్ట్‌ద్వారా ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకు న్నారు. ప్రస్తుతం ఈ కథ నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది.
భారతదేశంలో నివసిస్తున్న ఒక అమెరికన్ జంట క్రిస్టెన్, టిమ్ ఫిషర్ శ్రీమతి ఫిషెర్. ఈ దంపతులకు ఇప్పటికే ముగ్గురు కుమార్తెలున్నారు. నాలుగో కుమార్తెగా రెండేళ్ల నిషాను దత్తత తీసుకున్నారు. నిషాను పరిచయం చేస్తూ ఒక వీడియోలో ఆనందకరమైన క్షణాన్ని పంచుకున్నారు. 2023 అక్టోబర్‌లో దత్తత ప్రక్రియను ప్రారంభించి, 2024 సెప్టెంబర్‌లో నిషా తమకు నచ్చిందని, 2025 ఏప్రిల్ నాటికి దత్తతను పూర్తి చేశామంటూ ఈ వీడియోలో వివరించారు. ఇది నిజంగా బిగ్ న్యూస్.. ఇన్నాళ్లూ ఈ రహస్యాన్ని దాచిపెట్టాం. ఈ రోజుకోసం ఎంతగానో కలలు కన్నాం. మజీవితంలో ఈ ప్రత్యేకమైన అమ్మాయి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్లకు మా కల ఫలించిందంటూ ఫిషర్ రాసుకొచ్చారు.
అనేక కారణాల వల్ల స్పెషల్ నీడ్స్ బేబీని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాము. ప్రధానంగా బేలేట్రల్ లోయర్ లింబ్ వైకల్యం (bilateral lower limb deformities) బిడ్డకు కొత్త జీవితాన్ని ఇవ్వాలను కున్నాము. పాపాయి చిరునవ్వు, ఆనందం, సంతోషంతో ఎంతో అందంగా ఉంటుంది. ఇంత కాలం ఆమె నిర్లక్ష్యానికి గురైనా, ఆమె ఈ ప్రపంచానికి చాలా అవసరం అంటూ రాశారు.
ఫిషర్స్ దత్తత ప్రకటన చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారులను ఆకర్షించింది. ప్రత్యేక అవసరాలున్న ఆడబిడ్డ నిషాను దత్తత తీసుకోవడానికి ఈ జంట తీసుకున్న నిస్వార్థ నిర్ణయాన్ని చాలా మంది ప్రశంసించారు. "మాటల్లో వర్ణించలేం. ఆమెకు శాశ్వత ఇల్లు ఇచ్చినందుకు మీ కుటుంబానికి చాలా ఆశీర్వాదాలు! నిజంగా మీరు చాలా అభినందనీయులు!" అన్నారొకరు. ‘‘అద్భుతం , మీమాది అపారమైన గౌరవం ఏర్పింది అభినందనలు!" అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.
కాగా 2021లో భారతదేశానికి మకాం మార్చారు క్రిస్టెన్, ఫిషెర్ దంపతులు. వారి అనుభవాలను పంచు కోవడం ద్వారా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. ఇపుడు ముగ్గురు అమ్మాయిలున్న ఈ దంపతులు భారతీయ అమ్మాయిని అదీ స్పెషల్లీ నీడ్ బేబీని దత్తత తీసుకోవడం విశేషంగా నిలిచింది.
ఇదీ చదవండి: అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి