
కీవ్: ఉక్రెయిన్‌పైకి గురువారం రష్యా మరోసారి క్షిపణుల వాన కురిపించింది. దీంతో ఉదయం నుంచి 7 గంటలపాటు దేశమంతటా ముందు జాగ్రత్తగా సైరన్లు మోగుతూనే ఉన్నాయి. దేశంలోని 10 ప్రాంతాల్లోని నివాస భవనాలపై రష్యా జరిపిన దాడుల్లో కనీసం ఆరుగురు చనిపోయారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు.
గత మూడు వారాల్లో రష్యా జరిపిన అతిపెద్ద దాడి ఇదేనన్నారు. ‘ఆక్రమణదారులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది మాత్రమే వాళ్లు చేయగలరు’అని ఆయన ఆన్‌లైన్‌లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.