
తక్కువ ధరకే విత్తనాలు అందించరూ
రాయచూరు రూరల్: త్వరలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న దృష్ట్యా జిల్లాలో రైతులకు తక్కువ ధరకే విత్తనాలు అందించాలని కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు శివపుత్ర గౌడ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాధికారి కార్యాలయం, ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి మాట్లాడారు. ఎరువులు, క్రిమి సంహారక మందుల దుకాణాల యజమానులు పత్తి విత్తనాలను అధిక ధరకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. పత్తి విత్తనాల ప్యాకెట్ ధర రూ.850 ఉంటే దుకాణాల వారు రూ.1500–రూ.2000 వరకు నల్లబజారులో విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై నిఘా ఉంచాలని కోరుతూ జిల్లాధికారి రితిష్‌కు, ఎస్పీ పుట్టమాదయ్యకు వినతిపత్రం సమర్పించారు. వీరనగౌడ, ఉమాదేవి, బసవరాజ్, జయప్ప, ఆంజనేయ, మల్లేష్ నాయక్‌లున్నారు.