
తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith Kumar) కారుకు మరోసారి ప్రమాదం జరిగింది. బెల్జియం కారు రేసింగ్‌లో అజిత్ నడుపుతున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జవగా అజిత్ సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
కారు రేసింగ్‌లో అజిత్ పలుమార్లు ప్రమాదానికి గురయ్యాడు. ఇటీవల మార్చిలో స్పెయిన్‌లో జరిగిన రేసింగ్‌లో కారు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ రేసింగ్‌లో.. మరో కారును తప్పించే క్రమంలో అజిత్ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఆయన కారు ట్రాక్ తప్పి పల్టీలు కొట్టింది. అక్కడున్న సిబ్బంది వెంటనే అలర్ట్ అవడంతో అజిత్ సురక్షితంగా బయటకు వచ్చాడు.
సినిమా
అజిత్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly Movie) బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. తొమ్మిది రోజుల్లోనే రూ.200 కోట్ల కలెక్షన్స్ రాబట్టి అజిత్ కెరీర్‌లోనే టాప్ మూవీగా రికార్డు సృష్టించింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించింది. ప్రియ ప్రకాశ్ వారియర్, సునీల్, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషించారు.
தல அஜீத்குமார் அவர்கள் கார் பந்தயத்தில் விபத்தில் சிக்கி நலமுடன் மீண்டு வந்தார் 🔥#Ajithkumar𓃵 #AjithKumar #AjithKumarRacing #GoodBadUgly pic.twitter.com/3RR4g5p8Up
— Aadhi Shiva (@aadhi_shiva1718) April 19, 2025
చదవండి: నెలసరి నొప్పులు.. అబ్బాయిలు అస్సలు భరించలేరు: జాన్వీ కపూర్