నటుడి పరిస్థితి విషమం.. కాలేయదానం చేస్తానన్న కూతురు.. అయినా! | Actor Vishnu Prasad in Critical Condition, Daughter ready to Donate Liver | Sakshi
Sakshi News home page

Vishnu Prasad: నటుడికి తీవ్ర అనారోగ్యం.. కాలేయ దానానికి ముందుకొచ్చిన కూతురు

Published Sat, Apr 19 2025 2:57 PM | Last Updated on Sat, Apr 19 2025 3:32 PM

Actor Vishnu Prasad in Critical Condition, Daughter ready to Donate Liver

సినీనటుడు విష్ణు ప్రసాద్‌ (Vishnu Prasad) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతడికి వీలైనంత త్వరగా కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు పేర్కొన్నారు. దీనికి రూ.30 లక్షల మేర ఖర్చవుతుందని, దయచేసి సాయం చేసి ఆదుకోమని విష్ణు ప్రసాద్‌ కుటుంబసభ్యులు అర్థిస్తున్నారు. నటుడి పరిస్థితి రోజురోజుకీ దిగజారుతుండటంతో అతడి కుటుంబసభ్యులే కాలేయదానానికి ముందుకొచ్చారు. 

అది సరిపోదు
విష్ణు కూతురు.. కాలేయం దానం చేసి తండ్రిని బతికించుకోవడానికి సిద్ధమైంది. కానీ ఈ మేరకు ఆపరేషన్‌ చేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరమని ఆత్మ సంస్థ (ద అసోసియేషన్‌ ఆఫ్‌ టెలివిజన్‌ మీడియా ఆర్టిస్ట్స్‌) పేర్కొంది. తమది చిన్న సంస్థ అని.. కొంత మొత్తం ఆర్థిక సాయం చేశామని.. చికిత్సకు అది సరిపోదని ఆత్మ వైస్‌ ప్రెసిడెంట్‌, నటుడు మోమన్‌ అయిరూర్‌ పేర్కొన్నాడు. సంస్థ సభ్యులను తోచినంత సాయం చేయాలని కోరినట్లు తెలిపాడు.

ఎవరీ విష్ణు ప్రసాద్‌?
విష్ణు ప్రసాద్‌.. కాశీ, కై ఎతుం దూరత్‌, రన్‌వే, మంగోకాళం, లయన్‌, లోకనాథన్‌ ఐఏఎస్‌, పటాకా, మరాఠా నాడు వంటి పలు మలయాళ చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం సీరియల్స్‌ చేస్తున్నాడు. ఇతడికి అభిరామి, అనానిక అని ఇద్దరు కూతుర్లున్నారు.

 

 

చదవండి: హీరో అజిత్‌కు మరోసారి కారు ప్రమాదం.. వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement