
బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ ప్రదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన మాటతీరుతో ఏ షోనైనా సరే ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీగా అందిస్తాడు. ఆయన వేసే పంచ్‌లు, జోకులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే కాక, మనసు నిండా ఆనందాన్ని పంచుతాయి. అందుకే యాంకర్లలో ప్రదీప్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ టాలెంటెడ్ యాంకర్ వెండి తెర ప్రేక్షకులను కూడా అలరించబోతున్నాడు. నాలుగేళ్ల కిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేసేందుకు వచ్చేస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. లో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది. ఏప్రిల్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రదీప్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి.. హీరోగా మారారు. ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది?
చాలా హ్యాపీగా అనిపిస్తోంది. సరైన సమయంలో మంచి అవకాశాలు వచ్చాయి. ప్రేక్షకుల నుంచి మంచి సపోర్టు లభించింది. ఆర్జేగా, టెలివిజన్ యాంకర్ గా యాక్టర్ గా ఇన్నోవేటివ్ గా వర్క్ చేసే అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు మంచి కథ చెప్పే చాన్స్ కుదిరింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు నాపై మరింత బాధ్యత పెరిగిందని భావిస్తున్నాను. లక్షల్లో ఒక్కరికి మాత్రమే లభించే అవకాశంగా భావిస్తున్నాను.
మీ ఫ్రెండ్స్ అంతా కలిసి ఈ సినిమాను నిర్మించారట కదా..కారణం ఏంటి?
నా స్నేహితులకు నాలాగే సినిమా అంటే పిచ్చి. అందరికి మంచి చాన్స్‌లు వస్తున్నాయి. కానీ మేమంతా కలిసి ఓ సినిమా చేయలాని ఎప్పుటి నుంచో అనుకుంటున్నాం. ఇప్పుడు కుదిరింది. మంచి కథ ఉంది. అందరం కలిసి చేస్తే బాగుంటందని అనుకొని.. సినిమాను స్టార్ట్ చేశాం.ఈ కథకి ఫౌండేషన్ నుంచి వర్క్ చేసాం. అందుకే కొంచెం టైం పట్టింది. ఫ్యామిలీ అంతా కూర్చుని సమ్మర్లో హ్యాపీగా చూసే సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ మా నుంచి ఎలాంటి కంటెంట్ ని ఆశిస్తారో అలాంటి కంటెంట్ ఇందులో ఉంది. ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చి హాయిగా ఎంజాయ్ చేయొచ్చు.
‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ఎలాంటి కథ అంటే..?
మా సినిమాలో కథే మంచి ఎంటర్‌టైన్‌మెంట్. దీన్ని ఒక చందమామ కథల చూడొచ్చు. అనగనగా ఒక ఊరు. అక్కడ ఓ అమ్మాయి. ఆ ఊరికి వెళ్ళిన ఒక సివిల్ ఇంజనీర్. ఆ ఊర్లో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఆ రూల్స్ మధ్య హీరో ఎలా ఇరుక్కున్నాడు? అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రజెంట్ చేయడం జరిగింది.
పవన్ కల్యాణ్ సినిమా టైటిల్‌ని హైప్ కోసమే పెట్టారా?
లేదండి. మా కథ అనుకున్నప్పుడే లక్కీగా ఈ టైటిల్ ని అనుకున్నాం . పవన్ కళ్యాణ్ గారి డెబ్యు సినిమా టైటిల్ తో ఒక సినిమా చేస్తున్నామంటే మాపై బాధ్యత పెరిగింది. అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమా చేయడం జరిగింది. టైటిల్ కు తగ్గట్టు చాలా చక్కని అచ్చ తెలుగు సినిమా ఇది. సినిమా చూసిన తర్వాత ఈ టైటిల్ పర్ఫెక్ట్ అని ఆడియన్స్ ఫీల్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారి టైటిల్ తో ఒక సినిమా చేయడం మా అదృష్టం. చిన్న సినిమా కదా.. ఆ టైటిల్ పెడితే జనాల్లోకి ఈజీ వెళ్లొచ్చు అనిపించింది. కానీ కేవలం పబ్లిసిటీ కోసం అయితే ఈ టైటిల్ పెట్టలేదు.
ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ?
-ఇందులో కృష్ణ అనే పాత్రలో కనిపిస్తాను. చాలా స్మార్ట్ క్యారెక్టర్. ఈ సినిమాలో నేను ఎంత చిరాకు పడతానో ఆడియన్స్ అంత ఎంటర్టైన్ అవుతారు. ఆ క్యారెక్టర్ పడే కష్టాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. డైరెక్టర్స్ నితిన్ భరత్ భరత్ కు నాతో ఎప్పటినుంచో జర్నీ చేస్తున్నారు. నా టైమింగ్ వాళ్ళకి తెలుసు. దానికి తగ్గట్టుగా ఈ కథని చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు.
దీపికా పిల్లి ఈ ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చింది?
ఈ సినిమా హీరోయిన్ పాత్రకు ఒక తెలుగు అమ్మాయి కావాలి. ఆడిషన్స్, లుక్ టెస్ట్, వర్క్ షాప్ అన్నీ చేసిన తర్వాతే దీపికని హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది. తను చాలా అద్భుతంగా పెర్ఫర్మ చేసింది. ఆడియన్స్ డెఫినెట్ గా సర్ప్రైజ్ అవుతారు.
మ్యూజిక్ డైరెక్టర్ రదన్ గురించి ?
ఈ సినిమాలో మ్యూజిక్ కి చాలా మంచి స్కోప్ ఉంది. ప్రతి సాంగ్ ఒక డిఫరెంట్ జోనర్ లో చేయడం జరిగింది. రదన్ బ్యూటీఫుల్ ఆల్బమ్ ఇచ్చారు. ఈ సినిమా మ్యూజిక్ ఆడియన్స్ కి చాలా అలరిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సినిమాని చాలా క్వాలిటీ గా తీసాం. బాల్ రెడ్డి గారు బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. క్వాలిటీ పరంగా సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది.
డైరెక్టర్స్ నితిన్ భరత్ గురించి ?
నితిన్ భరత్ నన్ను సర్ప్రైజ్ చేశారు.డెబ్యూ డైరెక్టర్స్ లాగా అనిపించలేదు. డేఫినెట్ గా చాలామంది యంగ్ డైరెక్టర్స్ కి నితిన్ భరత్ ఇన్స్పిరేషన్ అవుతారు. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఎక్కడ కూడా కొత్తవారితో పని చేసిన ఫీలింగ్ రాలేదు. సినిమాని చాలా అద్భుతంగా తీశారు.
కామెడీ సినిమా కదా.. సెన్సార్ యూ/ఏ ఇచ్చారేంటి?
ఈ సినిమా సెన్సార్ సభ్యులు చూసిన తర్వాత చాలా కాలం తర్వాత హాయిగా నవ్వుకునే సినిమా తీశారని చెప్పారు. అది మాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. సినిమాకి ఎలాంటి కట్స్ లేకుండా యూ/ఏ ఇచ్చారు. రెండున్నర గంటల పాటు ఆడియన్స్ హాయిగా నవ్వుకునే సినిమా ఇది. మైత్రి మూవీ మేకర్స్ సినిమా చూశారు. సినిమా పూర్తవ్వగానే డీల్ క్లోజ్ చేశారు. ఇది సమ్మర్ కి ఫ్యామిలీ అంతా కలసి చూడాల్సిన సినిమా అని రిలీజ్ డేట్ ని వారే లాక్ చేశారు. ఇది మాకు మరింత కాన్ఫిడెన్స్ ని ఇచ్చింది.