
ఆర్. మాధవన్(R. Madhavan) హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు ‘జి.డి.ఎన్’ అనే టైటిల్‌ను ఇప్పటికే ఖరారు చేశారు. భారత ప్రముఖ ఇంజనీరు జి.డి. నాయుడు జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో రాజశేఖర్, జీవితల కుమార్తె కూడా నటిస్తున్నారు. ‘ఎడిసన్ ఆఫ్ ఇండియా, మిరాకిల్ మేన్, వెల్త్ క్రియేటర్ ఆఫ్ కోయంబత్తూరు’ వంటి పేర్లను గడించిన గోపాల స్వామి దొరైస్వామి నాయుడు(Gopala Swamy Doraiswamy Naidu) షార్ట్‌గా జి. డి. నాయుడు అని కూడా అంటారు. ఇప్పుడు ఆయన జీవితం ఆధారంగా ‘జి.డి.ఎన్’(GDN) మూవీ తెరకెక్కుతోంది. ఈ బయోపిక్‌కు కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లోగోను మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేశారు. ప్రియమణి, జయరాం, యోగిబాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటించనున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు.

జీడీ నాయుడు బయోపిక్‌లో టాలీవుడ్ హీరోయిన్ శివానీ రాజశేఖర్ కూడా నటించనుంది. ఇందులో మాధవన్‌తో పాటుగా బిగ్ స్క్రీన్‌పై ఆమె కనిపించనున్నారు. త్వరలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్తుండటంతో ఏర్పాట్లు స్పీడ్‌గా చేస్తున్నారు. కోయంబత్తూరుకు చెందిన జి.డి నాయుడు కేవలం మూడో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. కానీ, ఆటోమొబైల్, అగ్రికల్చర్, టెక్స్‌టైల్, ఫొటోగ్రఫీ వంటి సెక్టార్స్‌లో కొన్ని పరికరాల ఆవిష్కరణలు చేశారు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ ఫీల్డ్‌లో విప్లవం సృష్టించారని చెప్పవచ్చు. భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌ను రూపొందించింది ఆయనే కావడం విశేషం. అందుకే ఆయన్ను ఎడిసన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. 1893లో జన్మించిన ఆయన 1974లో మరణించారు.
ఈ మధ్యకాలంలో మాధవన్ నటిస్తున్న రెండో బయోపిక్ ఇది. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమా (2022)లో నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేసి మెప్పించారు మాధవన్. ఈ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. ఇప్పుడు మళ్లీ మరో బయోపిక్‌లో మాధవన్ నటిస్తుండటం విశేషం. మరి... వెండితెరపై మిరాకిల్ మేన్‌గా మాధవన్ ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి.