
నందమూరి తారకరత్న క్రమంగా కోలుకుంటున్నారని నందమూరి రామకృష్ణ తెలిపారు. అతని ఆరోగ్యం మెరుగుపడిందని అయితే సిటీ స్కాన్ రిపోర్టు వచ్చాక బ్రెయిన్ పనితీరుపై క్లారిటీ వస్తుందన్నారు. తారకరత్నకు అసలు ఎక్మోనే పెట్టలేదు. అతని అవయవాలన్నీ చికిత్సకు స్పందిస్తున్నాయి. కొంత ఆక్సిజన్ సొంతంగానే తీసుకుంటున్నారు.
క్రమంగా కోలుకుంటున్నాడు. పూర్తిగా రికవర్ అయ్యేందుకు సమయం పడుతుంది అని ఆయన పేర్కొన్నారు. కాగా శుక్రవారం కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మొదలుపెట్టిన పాదయాత్రలో తారకరత్న ఉన్నట్లుండి కుప్పకూలిన సంగతి తెలిసిందే!