
35 ఏళ్లొచ్చినా సరే గ్లామరస్ పాత్రలు చేస్తూ అలరిస్తున్న తమన్నా(Tamannaah Bhatia).. తొలిసారి డిఫరెంట్ గా కనిపించిన సినిమా ఓదెల 2(Odela 2 Movie). శివశక్తిగా నటించిన తమన్నా ఈ చిత్రంపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. అందుకు తగ్గట్లు ముంబై, హైదరాబాద్ లో తిరుగుతూ గట్టిగానే ప్రమోట్ చేసింది. మరి ఈ మూవీకి ఇప్పటివరకు వసూళ్లు ఎంతొచ్చాయ్?
తమన్నా, వశిష్ట సింహా నటించిన ఓదెల 2 మూవీ.. రీసెంట్ గా ఏప్రిల్ 17న థియేటర్లలోకి వచ్చింది. మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో తొలి రెండు రోజుల్లో రూ.2-3 కోట్ల మాత్రమే వచ్చాయనే టాక్ వినిపించింది. కానీ తాజాగా మూవీ టీమ్.. ఆదివారం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. వసూళ్లని(Movie Collection) అధికారికంగా ప్రకటించింది.
(ఇదీ చదవండి: స్టార్ హీరోకి ఐదేళ్ల తర్వాత హిట్.. కలెక్షన్ ఎంతొచ్చాయంటే?)
మూడు రోజుల్లో రూ.6.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఇదే కార్యక్రమంలో మాట్లాడిన నిర్మాత సంపత్ నంది.. విడుదలకు ముందే ఈ చిత్ర బ్రేక్ ఈవెన్ అయిందని చెప్పుకొచ్చారు. కానీ వసూళ్లు చూస్తుంటే మొత్తానికి మొత్తం రాబడతాయా అనే సందేహం కలుగుతోంది. ఈ వీకెండ్ గడిచిన తర్వాత ఓదెల 2 అసలు సంగతేంటనేది తెలుస్తోంది. వచ్చేవారం పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ లేకపోవడం ఈ చిత్రానికి ప్లస్ అవ్వొచ్చేమో చూడాలి.
ఓదెల 2 విషయానికొస్తే.. ఓదెలలో తిరుపతి(వశిష్ట సింహ) అనే కామాంధుడు.. కొత్తగా పెళ్లయిన అమ్మాయిల్ని మానభంగం చేస్తుంటాడు. దీంతో తిరుపతి భార్య అతడి తల నరికి జైలుకెళ్తుంది. కానీ తిరుపతి ఆత్మకు శాంతి కలగకుండా ఉండాలని.. సమాధిశిక్ష వేస్తారు. కొన్ని సంఘటనల వల్ల ఇతడి ప్రేతాత్మ తిరిగి ఊరిపై పడుతుంది. దీంతో శివశక్తి అలియాస్ భైరవి (తమన్నా) అనే ఓదెల ఊరికి వస్తుంది. ఆ తర్వాత దుష్టసంహారమే మిగిలిన స్టోరీ.
(ఇదీ చదవండి: చాలా అసహ్యంగా నటించా.. ఇప్పుడు చూస్తే సిగ్గేస్తుంది: సమంత)
