
ప్రియదర్శి (Priyadarshi Pulikonda).. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొమ్మిదేళ్లలోనే తనకంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. మొదట్లో హీరో స్నేహితుడిగా చిన్నచిన్న పాత్రలు చేసుకుంటూ పోయిన అతడు ప్రస్తుతం కథానాయకుడిగా సినిమాలు చేస్తున్నాడు. కోర్ట్‌తో సంచలన విజయాన్ని సాధించిన ప్రియదర్శి సారంగపాణి జాతకం (Sarangapani Jathakam Movie)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 25న విడుదల కానుంది.
ఎంజాయ్ చేస్తున్నానంతే..
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రియదర్శి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ప్రియదర్శి మాట్లాడుతూ.. నా తొమ్మిదేళ్ల ప్రయాణాన్ని చూసి నేను పూర్తిగా సంతృప్తి చెందలేదు. ఇంకా కూడా ఏదో చేయాలన్న తపన ఉంది. కాకపోతే ఈ జర్నీని ఎంజాయ్ చేస్తున్నాను. ఏమవ్వాలో తెలియదు కానీ ఎలా ఉండకూడదో మాత్రం బాగా తెలుసు.
నేను కమెడియన్ కాదు
అయితే నన్ను నేను కమెడియన్ (Comedian) అనుకోలేను. ఎందుకంటే సత్య, వెన్నెల కిశోర్‌లా కామెడీ చేయలేను. ఆ విషయం నాకు తెలుసు. నేను కమెడియన్ అవుతానని ఇండస్ట్రీలోకి రాలేదు. కోట శ్రీనివాసరావు, ప్రకాశ్‌రాజ్‌లను చూసి వీళ్లలా యాక్టింగ్ చేయాలనుకువాడిని. ఇన్నేళ్ల కెరీర్‌లో నేను తీసుకున్న మంచి నిర్ణయం కోర్ట్ సినిమా ఒప్పుకోవడమే! మిఠాయి సినిమా (Mithai Movie) చేయడం చెత్త నిర్ణయంగా భావిస్తాను.
(చదవండి: భరించలేని నొప్పితో ఆస్పత్రిలో.. యాంకర్ రష్మీకి ఆపరేషన్)
పొరపాట్ల నుంచే నేర్చుకోగలం
ఎందుకంటే ఈ సినిమాను నేను మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదు. అటు దర్శకుడు కూడా పూర్తిగా మనసు పెట్టి తీయలేదు. సినిమాలు ఎలాంటివి చేయాలి? ఎలాంటివి చేయకూడదు? అన్న విషయం నేర్పించింది మిఠాయి సినిమానే.. ఇలాంటి పొరపాట్లు చేయడం వల్ల ఎంతో నేర్చుకోగలం. ఉదాహరణకు గతంలో నేను చాలా సిగరెట్లు తాగేవాడిని. దానివల్ల వచ్చే ఇబ్బందులు తెలుసుకున్నాను కాబట్టే మానేశాను అని ప్రియదర్శి చెప్పుకొచ్చాడు.
సినిమా
ప్రియదర్శి.. 2016లో వచ్చిన టెర్రర్ సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేశాడు. తొమ్మిదేళ్ల ప్రయాణంలో 50కు పైగా సినిమాలు చేశాడు. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా తన ప్రయాణం కొనసాగిస్తున్నాడు. పెళ్లిచూపులు, బలగం, మల్లేశం, 35:చిన్న కథ కాదు, మంగళవారం, కోర్ట్ వంటి పలు హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
చదవండి: సౌత్‌లో ఆ పిచ్చి అలాగే ఉంది.. నన్నెంత దారుణంగా తిట్టారో!