
సుహాస్, మాళవికా మనోజ్ జంటగా నటించిన చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. రామ్ గోధల దర్శకత్వంలో హరీష్ నల్ల నిర్మించారు. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని ఈ వేసవిలో విడుదల చేయనుంది. కాగా ‘ఎలాగుండే వాడ్నే... ఎలాగా అయిపోయానే...’ అంటూ సాగే ఈ చిత్రం టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను గురువారం విడుదల చేశారు.
చిత్రసంగీత దర్శకుడు రథన్ స్వరాలందించిన ఈ పాటకు శ్రీహర్ష ఈమని సాహిత్యం అందించగా శరత్ సంతోష్ ఆలపించారు. మొయిన్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ‘‘యూత్‌ఫుల్‌గా సాగే ఈ పాటలో హీరో, హీరోయిన్ ఎనర్జీ ప్లస్ అయ్యే విధంగా ఉంటుంది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అని హరీష్ నల్ల పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాలోని ప్రతి పాత్ర బాగుంటుంది’’ అని రామ్ గోధల అన్నారు.