
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న గద్దర్ అవార్డుల ఎంపికకు సంబంధించి జ్యూరీని ఏర్పాటు చేశారు. మొత్తం 15 మంది సభ్యులతో ఈ జ్యూరీ కమిటీని ప్రకటించారు. ఈ జ్యూరీకి ఛైర్మన్ టాలీవుడ్ సీనియర్ నటి జయసుధను ఎంపిక చేశారు. ఈ అవార్డులక వచ్చిన నామినేషన్లను ఈ కమిటీ సభ్యులు పరిశీలించనున్నారు.
ఈ జ్యూరీ ఉన్న సభ్యుల పేర్లను తాజాగా విడుదల చేశారు. ఇందులో రాజశేఖర్ సతీమణి జీవిత రాజశేఖర్ కూడా మెంబర్‌గా ఎంపికయ్యారు. వీరితో పాటు డైరెక్టర్లు దశరథ్, నందిని రెడ్డి, శ్రీనాథ్,ఉమామహేశ్వరరావు, శివ నాగేశ్వరరావు, వీఎన్ ఆదిత్య కూడా ఉన్నారు. ఎగ్జిబిటర్ విజయ్ కుమార్ రావు, ఫిల్మ్ అనలిస్ట్ ఆకునూరు గౌతమ్, లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్, నిర్మాత ఏడిద నాగేశ్వరరావు, జర్నలిస్టులు లక్ష్మీ నారాయణ, వెంకటరమణ కూడా సభ్యులుగా చోటు దక్కించుకున్నారు. టీజీఎఫ్‌డీసీ ఎండీ మెంబర్, కన్వీనర్‌గా ఉండనున్నారు.

ఈ అవార్డుల కోసం వ్యక్తిగత కేటగిరీలో 1172 నామినేషన్లు దాఖలయ్యాయి. చలన చిత్రాలు, డాక్యుమెంటరీలు, పుస్తకాల విభాగాల్లో 76 నామినేషన్లు వచ్చాయి. ఓవరాల్‌గా గద్దర్ అవార్డులకు 1248 నామినేషన్లు అందాయి. ఈ నెల 21 నుంచి జ్యూరీ సభ్యులు నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు.