
మాస్ కా దాస్ 'విశ్వక్ సేన్ మరో మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ ఏడాది లవర్స్ డే కానుకగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో అభిమానులను పలకరించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ రెండో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇచ్చుకుందాం బేబీ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ను విశ్వక్ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ మూవీలో తన పాత్ర గురించి మాట్లాడారు. ముఖ్యంగా అమ్మాయి గెటప్‌లో ఉన్న ఫోటోను దేనికి పడితే దానికి వాడకండి అని అభిమానులకు సలహా ఇచ్చారు. పర్లేదు.. కత్తిలా ఉందని పొగిడి కామెంట్ చేసి అక్కడికి వదలేయండి అంటూ నవ్వుతూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
కాగా.. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రానుంది.
#Vishwaksen about #Laila Make-over 😂🖤 pic.twitter.com/2BQYHIq1po
— Rebel 🦁 (@Setti_Tweetz) January 23, 2025