
మెగాస్టార్ చిరంజీవిని మరో అత్యున్నత పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. సినీరంగానికి చేసిన సేవతో పాటు కరోనా, లాక్‌డౌన్‌లో సినీ కార్మికులను, సామాన్యులను ఆదుకునేందుకు చిరంజీవి చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్‌తో సత్కరించింది.
(ఇది చదవండి: మెగాస్టార్.. ఇకపై పద్మ విభూషణ్ చిరంజీవి)
తాజాగా మెగాస్టార్‌కు పద్మ విభూషణ్ రావడం పట్ల మెగా కోడలు ఉపాసన హర్షం వ్యక్తం చేసింది. చిరంజీవికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసింది. కంగ్రాట్స్ మామయ్య అంటూ పద్మ విభూషణ్‌కు అవార్డులు పొందిన వారి లిస్ట్‌ను పోస్ట్ చేసింది.ఇది చూసిన అభిమానులు సైతం మెగాస్టార్‌కు అభినందనలు చెబుతున్నారు.
కాగా.. ఈ ఏడాది పద్మ అవార్డుల జాబితాలో చిరంజీవి పేరు ఉందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా అది నిజమేనంటూ పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే చిరంజీవి 2006లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు.
Congratulations dearest Mamaya ❤️❤️❤️❤️ @KChiruTweets pic.twitter.com/4AtL1e7mJf
— Upasana Konidela (@upasanakonidela) January 25, 2024