రాళ్ల దాడులు, లాఠీచార్జి... ర్యాలీ హింసాత్మకం | Kolkata protesters clash with police at rally | Sakshi
Sakshi News home page

రాళ్ల దాడులు, లాఠీచార్జి... ర్యాలీ హింసాత్మకం

Aug 28 2024 5:59 AM | Updated on Aug 28 2024 5:59 AM

Kolkata protesters clash with police at rally

అట్టుడికిన కోల్‌కతా 

విద్యార్థులపై విరిగిన లాఠీ 

పోలీసులపైకి రాళ్లు, ఇటుకలు 

ఇరు వర్గాల వారికి గాయాలు 

అణచివేత అమానుషం: బీజేపీ 

మమత రాజీనామాకు డిమాండ్‌ 

నేడు బెంగాల్‌ బంద్‌కు పిలుపు 

జరగనిచ్చేది లేదన్న సర్కారు 

ర్యాలీ వెనక బీజేపీ: తృణమూల్‌ 

కోల్‌కతా: ఆర్‌జీ కర్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో యువ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు బాధ్యత వహిస్తూ పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కోల్‌కతాలో మంగళవారం విద్యార్థులు చేపట్టిన ‘నబన్నా అభియాన్‌ (చలో సచివాలయ ర్యాలీ)’ హింసాత్మకంగా మారింది. ఇటు ఇసుక వేస్తే రాలనంత మంది విద్యార్థి నిరసనకారులు, అటు వారిని అడ్డుకునేందుకు వేలాదిగా మోహరించిన పోలీసులతో పరిస్థితి యుద్ధరంగాన్ని తలపించింది. నగరవ్యాప్తంగానే గాక సమీపంలోని హౌరాలో కూడా వారికి, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. 

సచివాలయానికి దారితీసే మార్గాలన్నింటినీ పోలీసులు బారికేడ్లతో దిగ్బంధించారు. వాటిని బద్దలు కొట్టుకుంటూ దూసుకెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. దాంతో ఖాకీలు లాఠీలకు పని చెప్పారు. గాల్లోకి కాల్పులు జరపడంతో పాటు వాటర్‌ క్యానన్లు, బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. రాళ్ల దాడి, లాఠీచార్జిలో ఇరువైపులా చాలామంది గాయపడ్డారు. శాంతియుత ర్యాలీపై ఇదెక్కడి అమానుషత్వమంటూ బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. మహిళలపై అకృత్యాలను అడ్డుకోవడం చేతగాని మమతా సర్కారు విద్యార్థులపై మాత్రం ప్రతాపం చూపుతోందంటూ దుయ్యబట్టింది.

‘‘పోలీసు హింసాకాండకు బాధ్యత వహి స్తూ మమతా బెనర్జీ తక్షణం రాజీనామా చేయాలి. వైద్యురాలి హత్యలో నిజాలు వెలు గు చూసేందుకు వీలుగా పాలీ టెస్టులకు సిద్ధపడాలి’’ అని డిమాండ్‌ చేసింది. లేదంటే రా ష్ట్రాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించింది. బుధవారం 12 గంటల పాటు బెంగాల్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. దీన్ని అధికార తృణ మూల్‌ కాంగ్రెస్‌ తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘ర్యాలీ బీజేపీ గేమ్‌ప్లానేనని చెప్పేందుకు ఇదే నిదర్శనం. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులను దిగజార్చేందుకే ఆ పార్టీ కంకణం కట్టుకుంది’’ అంటూ మండిపడింది. బంద్‌ జ రగనిచ్చే ప్రసక్తే లేదని మమత ముఖ్య సలహాదారు ఆలాపన్‌ బంధోపాధ్యాయ్‌ కుండబద్దలు కొట్టారు! 

ఉదయం నుంచే... 
విద్యార్థి సంఘమైన పశ్చిమ్‌ బంగా ఛాత్ర సమాజ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు సచివాలయ ర్యాలీ తలపెట్టారు. మరోవైపు డీఏ తదితర డిమాండ్లతో రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల అసమ్మతి వేదిక ‘సంగ్రామీ జౌతా మంచా’ కూడా మంగళవారమే చలో సచివాలయానికి పిలుపునిచ్చింది. నిరసనకారులంతా కోల్‌కతాలో పలు ప్రాంతాల నుంచి ఒక్క ఉదుటున సచివాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వీటిని భగ్నం చేసేందుకు ఏకంగా 6,000 మందికి పై చిలుకు బలగాలు రంగంలోకి దిగాయి. హౌరా బ్రిడ్జి, సంత్రాగచ్చి రైల్వేస్టేషన్‌తో పాటు నగరంలో పలుచోట్ల బారికేడ్లతో పోలీసులు ముందుగానే రోడ్లను దిగ్బంధించారు. 

బారికేడ్లపైకెక్కి దూకేందుకు ప్రయత్నించిన నిరసనకారులను నిలువరించేందుకు లాఠీచార్జీ చేయ డంతో చాలామంది గాయపడ్డారు. కోపోద్రిక్తులైన నిరసనకారులు రాళ్లతో పాటు ఇటు కలు కూడా విసరడంతో 30 మంది దాకా పోలీసులు గాయపడ్డారు. ఎంజీ రోడ్, హేస్టి ంగ్స్‌ రోడ్, ప్రిన్సెప్‌ ఘాట్‌ తదితర ప్రాంతాలన్నీ ఘర్షణలకు వేదికగా మారాయి. ఈ దృశ్యాలన్నీ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారా యి. 

‘‘మేమేమీ చట్టాలను అత్రికమించలేదు. శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే విచక్షణారహితంగా కొట్టారు’’ అంటూ విద్యార్థులు మండిపడ్డారు. 33 మంది మహిళలతో పాటు మొత్తం 126 మంది ఛాత్ర సమాజ్‌ సభ్యులను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. వాస్తవానికి 200 పైచిలుకు మందిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. 

రేపిస్టులకు మమత అండ: నడ్డా 
విద్యార్థుల శాంతియుత ర్యాలీపై పోలీసులు జులుం ప్రదర్శించారని బీజేపీ అధ్యక్షుడు జే పీ నడ్డా ఆరోపించారు. ‘‘మమత పాలనలో రేపిస్టులు, క్రిమినల్స్‌కు వ్యవస్థే అన్నివిధాలా అండగా నిలుస్తోంది. మహిళల భద్రత కో సం గళమెత్తడం బెంగాల్లో క్షమించరాని నేరంగా మారింది’’ అంటూ ఎక్స్‌ పోస్టులో ఎద్దేవా చేశారు. వైద్యురాలిపై హత్యాచారానికి పాల్ప డ్డ వారిని మమత సర్కా రే కాపాడుతోందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా ఆరోపించారు. 

చెవిటి సర్కారు: బీజేపీ 
మమతను కరడుగట్టిన నియంతగా బెంగాల్‌ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్‌ అభివర్ణించారు. న్యాయం కావాలంటూ ప్రజలు చేస్తున్న ఆక్రందనలు ఆమె చెవిటి సర్కారుకు విన్పించడం లేదని మండిపడ్డారు. అరాచక ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకే బంద్‌కు పిలుపునిచి్చనట్టు తెలిపారు. 

విద్యార్థుల ర్యాలీపై పోలీసుల అణచివేతకు నిరసనగా పార్టీ కార్యకర్తలతో కలిసి లాల్‌ బజార్‌ ప్రాంతంలో బారికేడ్లను బద్దలు కొట్టేందుకు ఆయన విఫలయత్నం చేశారు. టియర్‌ గ్యాస్‌ ధాటికి స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. అరెస్టు చేసిన విద్యార్థులందరినీ బేషరతుగా విడుదల చేయాలంటూ సాయంత్రం దాకా అక్కడే బైఠాయించారు. 

మరోవైపు బుధవారం రాష్ట్రమంతటినీ స్తంభింపజేయడంతో పాటు సెపె్టంబర్‌ 6 దాకా పలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు విపక్ష నేత సువేందు అధికారి ప్రకటించారు. బీజేపీకి చెందిన నలుగురు విద్యార్థి నేతలను మంగళవారం రాత్రే పోలీసులు మాయం చేశారని ఆయన ఆరోపించారు. వాటిని పోలీసులు ఖండించారు. వాళ్లను హత్యాయత్నం అభియోగాలపై అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. 

డీఎన్‌ఏ, ఫోరెన్సిక్‌ సాక్ష్యాలపై...ఎయిమ్స్‌ వైద్యుల అభిప్రాయం 
వైద్యురాలి కేసులో సీబీఐ నిర్ణయం 
కోల్‌కతా: కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం కేసుకు సంబంధించిన డీఎన్‌ఏ, ఫోరెన్సిక్‌ సాక్ష్యాలపై ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్య నిపుణుల అభిప్రాయాలు తీసుకోవాలని సీబీఐ నిర్ణయించింది. ప్రధాన నిందితు డు సంజయ్‌ రాయ్‌ తనంత తానుగా నే ఘోరానికి పాల్పడ్డాడా, అతని వెనక ఎవరన్నా ఉన్నారా అన్నదానిపై పక్కాగా నిర్ధారణకు వచ్చేందుకు వారిచ్చే నివేదిక ఉపయోగపడొచ్చని భావిస్తోంది. 

సంజయ్‌కి సన్నిహితుడైన ఏఎస్సై అనూప్‌ దత్తా కూడా ఈ ఘోరంలో అతనికి సా యపడ్డట్టు సీబీఐ అనుమానిస్తోంది. దత్తాకు పాలి టెస్టులు చేసేందుకు కోర్టు ను ఇప్పటికే అనుమతి కోరింది. మరో వైపు ఘోష్‌ హయాంలో ఆస్పత్రిలో ఆర్థిక అవకతవకలపై తాజాగా ఈడీ కూడా మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసింది.  

‘కమిషనర్‌’ బైక్‌పై నిందితుడు! 
కోల్‌కతా: అత్యాచారం, హత్య జరిగిన రాత్రి ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌ కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ పేరిట రిజిస్టరైన బైక్‌ను వాడినట్టు తేలడం ఆందోళనకరమని బీజేపీ ఐటీ విభాగం చీఫ్‌ అమిత్‌ మాలవీయ అన్నారు. 

వైద్యుల భద్రతపై టాస్‌్కఫోర్స్‌ తొలి సమావేశం 
భాగస్వామ్యపక్షాలతో విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరపాలని నిర్ణయం   
న్యూఢిల్లీ:  పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బంది భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలను సిఫార్సు చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన జాతీయ టాస్‌్కఫోర్స్‌ తొలి సమావేశం మంగళవారం జరిగింది. భద్రతపై ప్రొటోకాల్‌ రూపొందించడానికి భాగస్వామ్యపక్షాలతో విస్తృత స్థాయిలో సంప్రదింపులు చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. 

సుప్రీంకోర్టు ఆదేశాలతో 10 మంది సభ్యులతో ఈ టాస్‌్కఫోర్స్‌ ఏర్పాటైన సంగతి తెలిసిందే. కేంద్ర కేబినెట్‌ సెక్రెటరీ నేతృత్వంలో జరిగిన తొలి సమావేశానికి సభ్యులందరితోపాటు కేంద్ర హోం శాఖ, ఆరోగ్య శాఖ కార్యదర్శులు సైతం హాజరయ్యారు. వైద్యులు, వైద్య సిబ్బంది భద్రతపై చర్చించారు. తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. ఇప్పటికే వివిధ భాగస్వామ్యపక్షాలతో మాట్లాడామని, తమకు దాదాపు 400 సలహాలు సూచనలు అందాయని టాస్‌్కఫోర్స్‌ సభ్యులు ఈ సందర్భంగా చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement