అప్పు తీర్చమన్నందుకు.. మహిళను దారుణంగా.. | - | Sakshi
Sakshi News home page

అప్పు తీర్చమన్నందుకు.. మహిళను దారుణంగా..

Published Tue, Apr 16 2024 1:05 AM | Last Updated on Tue, Apr 16 2024 1:13 PM

- - Sakshi

హత్యకేసులో భార్యాభర్తల అరెస్ట్‌

ఈనెల 10న హత్యకు గురైన మహిళ

నిజామాబాద్‌: నవీపేట మండలంలోని కోస్లీ శివారులో ఉన్న అలీసాగర్‌ కాలువలో ఈనెల 10వ తేదీన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు అప్పుతీర్చమన్నందుకు సదరు మహిళను హత్య చేశారని తేల్చారు. నిజామాబాద్‌ నార్త్‌ రూరల్‌ సీఐ సతీశ్‌, నవీపేట ఎస్సై యాదగిరిగౌడ్‌ సోమవారం కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

రెంజల్‌ మండలం బోర్గాం గ్రామానికి చెందిన చంద్రకళ వద్ద అదే గ్రామానికి చెందిన భార్యాభర్తలు గోదావరి, గంగాధర్‌ రూ.50వేలు అప్పుగా తీసుకున్నారు. గడువు సమీపిస్తున్న తరుణంలో డబ్బులు తిరిగిచెల్లించాలని చంద్రకళ వారిని కోరగా, వారు సమాధానం ఇవ్వలేదు. చంద్రకళను హతమార్చాలని పథకం పన్నిన గోదావరి, గంగాధర్‌ ఈనెల 10న ఆమెను డబ్బులు చెల్లిస్తామని ఇంటికి రప్పించి గొడ్డలితో దాడి చేసి హత్య చేశారు. ఆ తరువాత ద్విచక్రవాహనంపై చంద్రకళ మృతదేహాన్ని తీసుకువచ్చి అలీసాగర్‌ కాలువలో పారేశారు. నిందితులైన భార్యాభర్తలు గోదావరి, గంగాధర్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

ఇవి చదవండి: తండ్రి మరణం.. బెంగతో కూతురి విషాదం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement