Nizamabad District Latest News
-
మొక్కజొన్న పంట దగ్ధం
పెద్దకొడప్గల్(జుక్కల్): మండలంలోని వడ్లం గ్రామ శివారులో ఓ రైతు సుమారు రెండు ఎకరాల్లో వేసిన మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని వడ్లం గ్రామానికి చెందిన మల్లయ్యల హన్మండ్లు తనకున్న 2.20 ఎకరాలల్లో మొక్కజొన్న పంటను సాగుచేశాడు. సోమవారం పొలం దగ్గరకు వెళ్లి చూడగా చేతికొచ్చిన పంటంతా కాలిపోయింది. పంటను అమ్మి అప్పులు తీర్చుకుందామంటే అగ్ని ప్రమాదంతో కష్టమంతా బూడిదపాలయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు రూ.లక్ష 50వేల నష్టం అయిందని, ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నాడు. రేపల్లెవాడలో గుడిసె.. ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని రేపల్లెవాడలో గ్యాస్ సిలెండర్ పేలి గుడిసె దగ్ధమైనట్లు గ్రామస్తులు సోమవారం తెలిపారు. గ్రామంలోని కుమ్మరి తిరుపతికి చెందిన గుడిసెలో అకస్మాత్తుగా గ్యాస్ సిలెండర్ పేలడంతో మంటలు అంటుకున్నాయి. ప్రమాదంలో ఇంట్లోని దుస్తులు, వంటసామగ్రి, అరతులం బంగారం, 20 తులాల వెండి కాలిబూడిదైనట్లు బాధితుడు తెలిపారు. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నాడు. -
రాజ్యాంగ స్ఫూర్తితో అభివృద్ధి దిశగా పయనం
నిజామాబాద్ అర్బన్: భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగ స్ఫూర్తితో భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తోందని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు పేర్కొన్నారు. అన్నివర్గాల ప్రజలకు రాజ్యాంగబద్ధ హక్కులు కల్పించిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని ఫులాంగ్ చౌరస్తా వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాజ్యాంగం ఆధారంగానే ప్రస్తుతం శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు పని చేస్తున్నాయని, అందరికీ సమాన హక్కులు, సంక్షేమ ఫలా లు అందుతున్నాయన్నారు. సమానత్వం, సామాజిక న్యాయంతోపాటు అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం, ఆయన విలువల ఆధారంగానే జిల్లా యంత్రాంగం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అనంతరం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ అంకిత్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంతోనే సమా జంలో ప్రతి ఒక్కరూ హక్కులు, బాధ్యతలు, పదవులను చేపట్టగలుతున్నారని అన్నారు. మహనీయుని ఆశయ సాధన కోసం అంకితభావంతో కృషి చేయా లని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారిణి నిర్మల, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల సంఘాలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు -
అక్రమార్కుల్లో వణుకు
● జిల్లాపై కొత్వాల్ ప్రత్యేక నజర్ ● తనదైన మార్క్ పాలన సాగిస్తోన్న సీపీ సాయిచైతన్య ● పేకాట, బెట్టింగ్‌పై ఉక్కుపాదం ● గంజాయి, ఇసుక రవాణాకు అడ్డుకట్ట ● వీడీసీల ఆగడాలకు చెక్‌పెట్టేలా కేసులు ● డివిజన్ల వారీగా పోలీస్‌బాస్ సమీక్షలు సుదీర్ఘ సమీక్ష కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు ఆ యా డివిజన్ల సీఐలు, ఎస్సైలతో సీపీ ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారు. ఇటీవల బోధన్, నిజామా బాద్ డివిజన్లలోని పీఎస్‌లలో కేసుల వివరాలు, పెండింగ్ కేసులు, ఛార్జ్‌షీట్ వేయాల్సి కేసులు, కోర్టులో కొనసాగుతున్న కేసుల వివరాలను కూలంకషంగా తెలుసుకున్నారు. ఒక్కో కేసును పరిశీలిస్తూ జాప్యానికి కారణాలను తెలుసుకొని సూచనలు జారీ చేశారు. ఒక్కో డివిజన్‌పై సీపీ చేపట్టిన సమీక్ష ఉదయం 11 గంటలకు ప్రారంభమై రాత్రి 8 గంటల వరకు కొనసాగడం గమ నార్హం. ఇదిలా ఉండగా పలు వివాదాల్లో తలదూర్చే సిబ్బందిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది. ఖలీల్‌వాడి: అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతూ అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు నిజామాబాద్ సీపీ పోతరాజు సాయి చైత న్య. కమిషనరేట్ పరిధిలో తనదైన మార్క్ పాలన సాగిస్తూ నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీ సుకుంటున్నారు. అక్రమ ఇసుక రవాణా, పేకాట, బెట్టింగ్, మత్తు పదార్థాల సరఫరాపై కొరఢా ఝళిపిస్తున్నారు. సీపీగా బాధ్యతలు చేపట్టిన అనంత రం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. మొదట ఆ యా పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగే అక్రమ కార్యకలాపాలపై నివేదిక తెప్పించుకున్నారు. నేరాలు, నేరస్తులు, అక్రమదందాల స్థితిగతులపై అధ్యయనం చేసిన సీపీ..వాటికి చెక్‌పెట్టేలా చర్యలు ప్రారంభించారు. బెట్టింగ్ నిర్వాహకులపై కేసులు ఐపీఎల్ బెట్టింగ్‌పై కఠినంగా వ్యవహరిస్తానని ముందుగా చెప్పిన సీపీ సాయి చైతన్య.. ఆ దిశగా నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ నగర పరిధిలో బెట్టింగ్ ఆడుతున్న, నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నారు. వీడీసీలపై.. గ్రామాల్లో వీడీసీల ఆగడాలకు కళ్లెం వేస్తున్నారు. నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్ల పరిధిలో కుల, గ్రామ బహిష్కరణలు చేస్తున్న వీడీసీలపై కేసులు నమోదు చేయాలని పోలీసులను సీపీ ఆదేశించారు. ఇటీవల వేల్పూర్ మండలం వెంకటాపూర్, ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్, జక్రాన్‌పల్లి వీడీసీలపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. అక్రమ దందాపై.. అక్రమ దందాపై సీపీ ఉక్కుపాదం మోపుతున్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లు, టిప్పర్లు, పొక్లెయిన్లను సీజ్ చేయడంతోపాటు నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తున్నారు. అదేవిధంగా మొరం అక్రమ రవాణా, పీడీఎస్ బియ్యం, గంజాయి, మత్తు పదార్థాలు రవాణా చేసే వారిని పట్టుకుంటూ హడలెత్తిస్తున్నారు. మత్తు వదిలేలా.. నగరంలోని పలు హాస్టళ్లపై ఇటీవల స్పెషల్ పోలీసు బృందాలు, డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. మత్తు పదార్థాలైన గంజాయి, డ్రగ్స్ బారిన యువత పడకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రాత్రిపూట అనవసరంగా రోడ్లపై తిరుగుతూ, వాహనాలతో ప్రమాదకర విన్యాసాలు చేసే పోకిరీలపై కొరఢా ఝళిపిస్తున్నారు. తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్లకు పిలిపించి వారి ముందే కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. -
రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు
● డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి వేల్పూర్: రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేశామని డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ మా ట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో 1,250 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నా రు. నిజామాబాద్ జిల్లాలో 2 లక్షల క్వింటాళ్ల సన్నరకాలు, 50 వేల క్వింటాళ్ల దొడ్డురకం, కామారెడ్డి జిల్లాలో లక్షా 60 వేల క్వింటాళ్ల సన్నరకం, 40 వేల క్వింటాళ్ల దొడ్డురకం ధా న్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సన్నరకాలు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తోందన్నారు. ఈ నెల 11 వరకు ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల లో డబ్బులు జమ అయినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. నేడు బాన్సువాడకు ఎమ్మెల్సీ కవిత రాక బాన్సువాడ : బాన్సువాడకు మంగళవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రానున్నారు. పట్టణంలోని భారత్ గార్డెన్లో నిర్వహించే పార్టీ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో వారు పాల్గొంటారని బీఆర్ఎస్ పట్టణ నాయకులు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. -
అంబేడ్కర్ ఆలోచనలను సమాజానికి అందించాలి
తెయూ(డిచ్పల్లి): ప్రపంచ మేధావి అంబేడ్కర్ ఆలోచనలను పూర్తిస్థాయిలో సమాజానికి వర్తింపజేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ లింబాద్రి అన్నారు. మహనీయుల జయంతి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ యూనివర్సిటీలో సోమవారం ఎస్సీ సెల్ డైరెక్టర్ వాణి నేతృత్వంలో ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనలో సామాజిక న్యాయం– విద్య, యువత సాధికారత’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి లింబాద్రి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత భారత పౌరులు ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు, ఎన్నికలు, రిజర్వేషన్లను అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల పని విధానాలు ఆవిష్కరించబడి అవి భారత ప్రజలను సమున్నతులుగా మార్చినట్లు తెలిపారు. ఇది కేవలం అంబేద్కర్ రచించిన అత్యుత్తమ రాజ్యాంగం ద్వారానే సాధ్యమైందన్నారు. తెయూ వీసీ యాదగిరిరావు మాట్లాడుతూ.. రాజ్యాంగం భారతీయులందరికీ పవిత్ర గ్రంథం అని పేర్కొన్నారు. అంతకుముందు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రిజిస్ట్రార్ యాదగిరి, వర్సిటీ ప్రిన్సిపాల్ ప్రవీణ్, డీన్ ఘంటా చంద్రశేఖర్, అధ్యాపకులు కనకయ్య, మోహన్ బాబు, సంపత్, స్వప్న, కిరణ్ రాథోడ్ పాల్గొన్నారు. బెటాలియన్‌లో.. డిచ్పల్లి: మండల పరిధిలోని ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్‌లో సోమవారం అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కమాండెంట్ సత్యనారాయణ ఆధ్వర్యంలో అసిస్టెంట్ కమాండెంట్ ఏడుకొండలు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బెటాలియన్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సీపీ కార్యాలయంలో.. ఖలీల్‌వాడి: నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి సీపీ సాయిచైతన్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. అంబేడ్కర్ సామాన్య నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ తన అపార మేధాశక్తులతో సమాజంలోని రుగ్మతలను దూరం చేసేందుకు పాటుపడిన మహనీయుడన్నారు. అగ్రవర్ణాల దాడులకు గురైన బాధితులకు సత్వరన్యాయం అందించుటకు ‘ పోలీస్ శాఖ‘ నిరంతరం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. అదనపు డీసీపీ శ్రీనివాస్ రావు, ఏసీపీ రాజావెంకట్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీశైలం, ఆఫీస్ సూపరింటెండెంట్ శంకర్, బషీర్, వనజ రాణి, రిజర్వు సీఐలు శేఖర్ బాబు, శ్రీనివాస్, తిరుపతి, సతీష్ పాల్గొన్నారు. -
ఉత్తరాది కార్మికులు
నిజామాబాద్మన పనుల్లోతీరనున్న గల్ఫ్ కార్మికుల.. గల్ఫ్ బాట పట్టిన తెలంగాణ వలస కార్మికుల ఆశలు నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.మంగళవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 8లో uఉమ్మడి జిల్లాలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కార్మికులు గణనీయంగా పెరిగారు. ప్రతి రంగంలో వారి ఉనికి కనిపిస్తోంది. సుమారు ఐదువేల మంది వరకు కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నట్లు అంచనా. హోటళ్లలో కార్మికులుగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. వ్యవసాయం, నిర్మాణ రంగం, ఇంటీరియర్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, టైల్స్, కార్పెంటర్ కార్మికులుగా బీహార్, ఉత్తరప్రదేశ్,ఢిల్లీ వాళ్లు పని చేస్తున్నారు. బొటిక్స్, డిజైనింగ్ వంటి మహిళల వస్త్రాల పనులు పశ్చిమబెంగాల్ కార్మికులే చేస్తున్నారు. బంగారం పనులను బెంగాల్ వాళ్లే చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కార్మికులు రోజురోజుకూ పెరుగుతున్నారు. దీంతో ప్రతి రంగంలోనూ ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బీహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు, పనివాళ్లే కనిపిస్తున్నారు. గతంలో ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి ముంబయి, సూరత్, గల్ఫ్ దేశాలకు పనుల కోసం ఎక్కువగా వలసలు వెళ్లేవారు. ఇప్పటికీ ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళుతున్నప్పటికీ గతంతో పోలిస్తే సంఖ్య తగ్గింది. వివిధ రంగాల అభివృద్ధితో జిల్లాలోనూ ఉపాధి అవకాశాలు పెరిగాయి. స్థానికంగానూ ఎకానమీ పెరిగింది. అయితే స్థానికుల కంటే ఉత్తరాది రాష్ట్రాల వారినే పనిలో పెట్టుకునేందుకు జిల్లాలోని రైతులు, వ్యాపారులు మొగ్గు చూపుతున్నారు. నిర్దేశించుకున్న సమయానికి, తక్కువ వేతనాలతోనే ఉత్తరాది రాష్ట్రాల కార్మికులు పనులు చేస్తున్నారని, పైగా నైపుణ్యం ఎక్కువగా చూపిస్తున్నారని పలువురు చెబుతున్నారు. ఉత్తర భారతం నుంచి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు వివిధ పనుల నిమిత్తం సుమారు ఐదువేల మంది వరకు కార్మికులు వచ్చినట్లు అంచనా. ముఖ్యంగా హోటళ్లలో కార్మికులుగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన సుమారు 500 మంది కార్మికులు ఉన్నారు. ఇటుక బట్టీలు మొదలు నిర్మాణరంగంలో బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుమారు 1,500 మంది కార్మికులు ఇంటీరియర్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, టైల్స్, కార్పెంటర్ కార్మికులుగా పని చేస్తున్నారు. సెలూన్స్‌లో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వాళ్లు పనిచేస్తున్నారు. వ్యవసాయ రంగంలో బీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల కార్మికులు సుమారు 1,000 మంది వరకు పనిచేస్తున్నారు. వరినాట్ల సీజన్లో బీహార్ కూలీలు పనిచేస్తున్నారు. డెయిరీ పనితోపాటు చేపలు పట్టే పనులు సైతం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీలుగా చేస్తున్నారు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, బేకరీలు, స్వీట్హోంలలో ఒడిశా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ వాళ్లు పనిచేస్తున్నారు. బొటిక్స్, డిజైనింగ్ వంటి మహిళల వస్త్రాల పనులు పశ్చిమబెంగాల్ కార్మికులే చేస్తున్నారు. బంగారం పనులను బెంగాల్ వాళ్లే చేస్తున్నారు. వీరు 1,000 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. బీహార్‌కు చెందిన కూలీలు ఇటుకబట్టీలో సుమారు 500 మంది వరకు పనిచేస్తున్నారు. బోర్ డ్రిల్లింగ్, పొక్లెయిన్ ఆపరేటింగ్ పనుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్‌కు చెందిన వాళ్లు పనిచేస్తున్నారు. ఇందులో కొందరు సీజన్‌ను బట్టి పనుల కోసం వచ్చి వెళుతుండగా, ఎక్కువమంది పనిచేసుకుంటూ కూలీలుగా జీవిస్తూ ఇక్కడే స్థిరపడినవారు సుమారు 3వేల మంది వరకు ఉండడం గమనార్హం. రాజస్తాన్‌కు చెందిన కొందరు నిజామాబాద్‌తో పాటు వివిధ మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీ గ్రామాల్లో స్వీట్‌హోమ్‌లు నిర్వహిస్తూ స్థిరపడ్డారు. కొన్ని ప్రైవేట్ పరిశ్రమలు, వాణిజ్య కేంద్రాల్లో సెక్యూరిటీ గార్డులుగా బీహార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు పనిచేస్తున్నారు. పెద్ద హోటళ్లలో వర్కర్లుగా అస్సాంకు చెందిన యువకులు పనిచేస్తున్నారు. న్యూస్‌రీల్ అన్నిరంగాల్లో వారి ఉనికి నగరం నుంచి గ్రామం వరకు విస్తరించిన వలస కార్మికులు సుమారు ఐదు వేల మంది ఉన్నట్లు అంచనా హోటళ్లు, నిర్మాణ రంగం, వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వారే.. బంగారం పని, మహిళల వస్త్రాల డిజైనింగ్ పనుల్లోనూ వారి మార్క్ -
దురలవాట్లకు దూరంగా ఉండాలి
డిచ్పల్లి: విద్యార్థులు దురలవాట్లకు దూరంగా ఉండాలని, బాగా చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య సూచించారు. మండలంలోని సుద్దపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను ఆదివారం రాత్రి ఆయన తనిఖీ చేశారు. పిల్లలకు భోజనం వడ్డించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. మహనీయుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని, ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకుని పట్టుదలతో చదివి లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు. డిచ్పల్లి సీఐ మల్లేష్, ఎస్సై ఎండీ షరీఫ్, ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ ధనుంజయ్, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు. -
సీఎం సమీక్షలో పాల్గొన్న కలెక్టర్
నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, వేసవి తాగునీటి ప్రణాళికలపై సీఎం దిశానిర్దేశం చేశారు. భూ భారతి చట్టాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలన్నారు. వేసవిలో తాగునీటి సమ స్య తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సీఎం సూచించారు.జింక పిల్ల లభ్యం ● అటవీశాఖ సిబ్బందికి అప్పగింత రుద్రూర్: పోతంగల్ మండలం కల్లూర్ గ్రా మశివారులో సోమవారం రైతులకు కనిపించిన జింకపిల్లను స్థానికులు అటవీశాఖ సి బ్బందికి అప్పగించారు. తప్పిపోయి వచ్చిన జింకపిల్ల వ్యవసాయ పనులు చేస్తున్న రై తుల కంట పడింది. సమాచారం అందుకు న్న అటవీశాఖ సిబ్బంది కల్లూర్‌కు చేరుకొని జింక పిల్లను వర్ని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించి చికిత్స చేయించారు. జింక పిల్ల వయస్సు వారం రోజుల్లోపే ఉంటుందని, ఆరోగ్యంగా తయారైన అనంతరం అడవిలో వదిలిపెడతామని అధికారులు తెలిపారు. డంపింగ్ యార్డులో కమిషనర్ తనిఖీలు నిజామాబాద్ సిటీ: నగర శివారులోని నాగా రం డంపింగ్‌యార్డును సోమవారం రాత్రి 10 గంటలకు ఇంజినీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ దిలీప్‌కుమార్ ఆకస్మిక తని ఖీ చేశారు. యార్డులో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా నిరంతరం వాటర్ పంపింగ్ చేయాలని ఇన్చార్జి ప్రభుదాస్, జవాన్ బజరంగ్‌కు సూచించారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఈఈ మురళీమోహన్‌రెడ్డి, ఏఎంసీ జయకుమార్, శానిటరీ సూపర్వైజర్ సాజిద్, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. భూ భారతితో రైతుల సమస్యలు తీరుతాయి నిజామాబాద్ రూరల్: ‘భూ భారతి’తో రా ష్ట్రంలో ఉన్న రైతుల సమస్యలు తీరుతాయని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. సోమవారం గుండారం రైతు వేదికలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో ప్రారంభించిన భూభారతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వర్చువల్‌గా వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ కేవలం కల్వకుంట్ల కుటుంబానికే అన్ని విధాలుగా ఉపయోగపడిందన్నారు. ధరణితో బీ ఆర్ఎస్ నేతలు కబ్జాలకు పాల్పడుతూ కోట్ల రూపాయాల భూములు వారి పట్టాదారు పాసుపుస్తకాల్లో నమోదు చేయించుకున్నార ని ఆరోపించారు. ప్రస్తుతం భూ భారతిలో భూముల వివరాలు సమగ్రంగా ఉండి రై తులు, యజమానులకు అన్ని విధాలుగా అ నుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. రైతుల విశ్వసనీయతను భూ భారతి చూర గొంటుందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే భూపతిరెడ్డిని గజమాలతో సన్మానించారు. ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డేలిగేట్ శేఖర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాగిర్తి బాగారెడ్డి, అగ్గు భోజన్న, మునిపల్లి సాయారెడ్డి, గుండారం సింగిల్ విండో చైర్మన్ దాసరి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. -
ఫ్లెక్సీ వివాదం.. ఐదు గంటల నిరసన
లింగంపేట: మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సోమవారం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదానికి దారితీశాయి. సుమారు ఐదు గంటల పాటు లింగంపేటలో ఉద్రిక్తత నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. సోమవారం కాంగ్రెస్ నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విగ్రహం వద్ద దళిత సంఘాలు ఏర్పాటు చేసిన ఫెక్సీలో మాజీ ఎమ్మెల్యే జాజాల, ఎమ్మెల్సీ కవిత ఫొటోలు ముద్రించి ఉండడాన్ని గమనించారు. అందులో ప్రస్తుత ఎమ్మెల్యే మదన్మోహన్రావు ఫొటో ముద్రించకపోవడంతో కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. ఆ ఫెక్సీలు తొలగించాలని పంచాయతీ కార్యదర్శి శ్రవణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన విగ్రహం వద్దకు చేరుకొని ఫెక్సీలను తొలగించాలని అంబేడ్కర్ సంఘం నాయకులకు సూచించారు. నిబంధనల ప్రకారం 50 ఫీట్ల దూరంలో ఎలాంటి ఫెక్సీలు ఉండవద్దన్నారు. ఫ్లెక్సీలను తొలగించడానికి అంగీకరించకపోవడంతో లింగంపేట ఎస్సై వెంకట్రావు ఈ విషయాన్ని ఎస్సై ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్ దృష్టికి తీసుకువెళ్లారు. సీఐ ప్రవర్తనతో పెరిగిన ఉద్రిక్తత సీఐ రవీందర్‌నాయక్ లింగంపేటకు వచ్చి దళిత సంఘాల నేతలతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సీలు కూడా తొలగించాలని వారు పేర్కొన్నారు. ఈ క్రమంలో సీఐ సూచనతో గ్రామ పంచాయతీ సిబ్బంది కొన్ని ఫ్లెక్సీలు తొలగించి ట్రాక్టర్లో తరలిస్తుండగా దళిత సంఘాల నాయకులు వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ ఫ్లెక్సీలు కూడా తొలగించాలని పట్టుబట్టారు. కాంగ్రెస్ ఫ్లెక్సీలు తొలగించనంటూనే ఏం చేసుకుంటారో చేసుకోండంటూ సీఐ అసభ్య పదజాలంతో దూషించారని దళిత సంఘాల నాయకులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో రాస్తారోకో చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మండల అంబేడ్కర్ సంఘం గౌరవ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ ముదాం సాయిలును అరెస్టు చేసే క్రమంలో ఆయన చొక్కా చిరిగిపోగా ప్యాంటు ఊడిపోయింది. అర్ధనగ్నంగా ఉన్న సాయిలును పోలీసులు లాక్కెళ్లి పోలీసు వాహనంలోకి ఎక్కించారు. విషయం తెలుసుకున్న మండలంలోని దళిత సంఘాల నేతలంతా వచ్చి ధర్నాకు దిగారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ లింగంపేటకు చేరుకొని కామారెడ్డి –ఎల్లారెడ్డి చౌరస్తాలో బైఠాయించారు. దళితులను అవమానించిన సీఐ రవీందర్ నాయక్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ, కామారెడ్డి సీఐ చంద్రశేఖర్‌రెడ్డితోపాటు పలువురు ఎస్సైలు, పోలీసులు లింగంపేటకు చేరుకుని పరిస్థితి అదుపు తప్పకుండా చూశారు. డీఎస్పీ సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌తో చర్చలు జరిపారు. దళిత సంఘాల నేతల డిమాండ్ మేరకు అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేస్తామని పేర్కొన్నారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఎల్లారెడ్డి సీఐపై ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని పేర్కొనడంతో దళిత సంఘాల నాయకులు శాంతించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సురేందర్, మాజీ ఎంపీపీ ముదాం సాయిలు, దళిత సంఘాల నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నలుగురు దళిత నాయకులను అరెస్టు చేసిన పోలీసులు సీఐ క్షమాపణ చెప్పాలంటూ దళిత సంఘాల పట్టు డీఎస్పీ చొరవతో ఆందోళన విరమణ -
ట్రాక్టర్ ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు
మాక్లూర్: మండలంలోని చిక్లీ గ్రామ శివారులో రోడ్డు పక్కన ఉన్న ఓ వ్యక్తిని ట్రాక్టర్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని చిక్లీ గ్రామానికి చెందిన ర్యాపని ఒడ్డె గంగాధర్(48) ఆదివారం సాయంత్రం గ్రామ శివారులో రోడ్డు పక్కన తన బైక్‌ను నిలిపి, కూర్చున్నాడు. అదే గ్రామానికి చెందిన కారం నవీన్ ట్రాక్టర్ నడుపుతూ వేగంగా వచ్చి గంగాధర్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం అతడు మృతిచెందాడు. ఇదిలా ఉండగా ట్రాక్టర్ నడిపిన కారం నవీన్ ట్రాక్టర్‌తోపాటు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఇద్దరి మధ్య భూ తగాదాలు.. నవీన్‌కు, మృతుడు గంగాధర్‌కు మధ్య కొంతకాలంగా భూ తగాదాలు నడుస్తున్నాయి. ఆదివారం సాయంత్రం గ్రామ శివారులోని కొనుగోలు కేంద్రం వద్ద ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈక్రమంలో నవీన్ ట్రాక్టర్‌తో కావాలనే అతడిని ఢీకొట్టాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు ముందస్తు చర్యగా చిక్లీలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటుచేసి, ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి కుమారుడు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు నవీన్‌పై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. చికిత్స పొందుతూ మృతి పోలీసులకు లొంగిపోయిన నిందితుడు -
కల్యాణలక్ష్మి లబ్ధిదారులను ఇబ్బంది పెట్టొద్దు
● చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని రద్దు చేయడం సరికాదు ● బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డివేల్పూర్: బాల్కొండ నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో జాప్యం చే స్తూ లబ్ధిదారులను ఇబ్బంది పెట్టొదని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. చెక్కుల పంపిణీ ఇప్పటికే నెల రోజులు ఆపడమే కాకుండా, మంత్రి జూపల్లి కృష్ణారావుచే ఏర్పా టు చేయించిన పంపిణీ కార్యక్రమాన్ని కూడా రద్దు చేయడం దురదృష్టకరమన్నారు. వేల్పూర్‌లోని బాల్కొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ జీవో18 ప్రకారం కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసే అధికారం పూర్తిగా ఎమ్మెల్యేలకు మాత్రమే ఉందని, సంబంధిత జీవోను ప్రదర్శించారు. అయినప్పటికీ మంత్రితో కలిసి మంగళవారం చెక్కుల పంపిణీకి సిద్ధం కాగా, కార్యక్రమం రద్దయినట్లు అధికారులు చెప్పారన్నారు. తనకున్న అధికారంతో చెక్కులు పంపిణీ చేస్తానని కలెక్టర్, ఆర్మూర్ ఆర్డీవోకు తెలుపగా, మంత్రి చేతనే పంపిణీ చేస్తారని తెల్పడం హాస్యాస్పదమన్నారు. ఇప్పటికే ఆలస్యం అయినందున నేరుగా చెక్కులను జీపీ కార్యదర్శుల ద్వారా లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు చెక్కుతోపాటు తులం బంగారం ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
బార్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం
ఖలీల్‌వాడి: నగరంలో సోమవారం నిజామాబా ద్ బార్ అసొసియేషన్ నూతన కార్యవర్గం ప్ర మాణ స్వీకారం నిర్వహించారు. అధ్యక్షుడు సా యరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్‌రాజు, మహి ళా ప్రతినిధి రమాదేవి, కోశాధికారి నారాయణ దాస్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల అ ధికారి వెంకటేశ్వర్, కమిటీ సభ్యులు ఆకుల రమే ష్, నరసింహరెడ్డి, బాస రాజేశ్వర్, మాజీ అ ధ్యక్షుడు జగన్మోహన్గౌడ్, సుదర్శన్ పాల్గొన్నా రు. ఎన్నికలు ఆలస్యంగా జరిగినందున నలుగురితో ప్రమాణ స్వీకారం చేయించారు. మిగితా వారితో త్వరలో ప్రమాణ స్వీకారం చేయి స్తామని అధ్యక్షుడు సాయ రెడ్డి తెలిపారు. ‘భూభారతి’ ప్రారంభ కార్యక్రమాన్ని తిలకించిన రైతులు సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి రైతు వేదికలో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూ భారతి పోర్టల్ ప్రారంభ కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు తిలకించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ప్రజాపతి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగారెడ్డి, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు లింగాగౌడ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మద్దెల బాగయ్య, సీడీసీ చైర్మన్ ఇర్షాదొద్దిన్, విండో చైర్మన్ సదాశివరెడ్డి, సాదీక్ అలీ, తదితరులు పాల్గొన్నారు. మహమ్మద్ నగర్ రైతువేదికలో.. నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్‌లోని రైతువేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూ భారతి పోర్టల్ ప్రారంభ కార్యక్రమాన్ని పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్‌కుమార్, అధికారులతో కలిసి తిలకించారు.కార్యక్రమంలో మహమ్మద్ నగర్, నిజాంసాగర్ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్‌రెడ్డి, ఏలే. మల్లికార్జున్, మహమ్మద్ నగర్ మండల వ్యవసాయశాఖ అధికారిణి నవ్య, ఏఈవోలు మధుసూదన్, రేణుక, రైతులు ఉన్నారు. కల్తీ కల్లు బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలిబాన్సువాడ : కల్తీ కల్లు సేవించి ఆస్పత్రి పాలైన బాధితులందరికి నష్టపరిహారం ఇవ్వాలని పౌరహక్కులసంఘం నిజనిర్ధారణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం నస్రుల్లాబాద్ మండలం దుర్కి, అంకోల్, అంకోల్‌తండా గ్రా మాల్లో కమిటీ సభ్యులు పర్యటించారు. ఇటీ వల కల్తీకల్లు సేవించి ఆస్పత్రి పాలైన బాధితులను కలిసి వివరాలు సేకరించారు. కల్లు బాధితులందరికి ఒక్కొక్కరికి రూ. లక్ష నష్టపరిహారాన్ని కల్తీ కల్లు కాంట్రాక్టరు వద్ద ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. మత్తు, పదార్థాలైన డైజోఫాం, క్లోరోఫాం రవాణాను అరికట్టాలన్నా రు.అర్హులైన గీత కార్మికులకు మాత్రమే లైసెన్సు లు ఇవ్వాలని, గీత కార్మికులందరికి నెలకు రూ. 3 వేల పింఛను ఇవ్వాలని, గీత పారిశ్రామిక సహకార సొసైటీలను ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. కల్తీ కల్లు తయారు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభ్యులు అల్గోట్ రవీందర్, సంగం, ఎడ్ల రాజు, గైని శ్రీనివాస్ తదితరులున్నారు. -
తీరనున్న గల్ఫ్ కార్మికుల ఆశలు!
మోర్తాడ్(బాల్కొండ): గల్ఫ్ బాట పట్టిన తెలంగాణ వలస కార్మికుల ఆశలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సమగ్ర ప్రవాసీ విధానానికి రూపకల్పన చేసి తద్వారా గల్ఫ్ బోర్డుకు అంకురార్పణ చేయడానికి ప్రభుత్వం చొరవ తీసుకుంది. గల్ఫ్ వలసదారుల ఆశలను సజీవం చేయడానికి తొలి మెట్టుగా ఇటీవల అధ్యయన సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటి పథకాల కంటే మెరుగ్గా.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని కొన్ని కార్యక్రమాలను అమలులోకి తీసుకువచ్చారు. గల్ఫ్ దేశాల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా, వలస కార్మికుల కష్టాలు, సమస్యలను తెలుసుకోడానికి ప్రవాసీ ప్రజావాణి నిర్వహిస్తోంది. వలస కార్మికుల కుటుంబాలకు గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం ప్రత్యేక కోటా కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్మికుల్లో నైపుణ్యత.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వలస వెళుతున్న కార్మికుల్లో అనేక మందికి ఎలాంటి నైపుణ్యం లేదు. నైపుణ్యం లేని కారణంగా అనేక మంది కార్మికులు తక్కువ జీతాలకు పని చేయడం, ఉద్యోగ భద్రత లేక అవస్థలు పడుతున్నారు. కేరళలో వలస వెళ్లేవారికి వారు ఎంచుకున్న రంగంలో కనీసం ఆరు నెలల శిక్షణ కోర్సులను అక్కడి ప్రభుత్వం అందిస్తుంది. గల్ఫ్ బోర్డు ఏర్పడితే శిక్షణ శిబిరాలను నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. మోసాలను అరికట్టే విధంగా.. గల్ఫ్ వెళ్లే ప్రయత్నంలో వీసాల కోసం డబ్బులు, ఒరిజినల్ పాస్‌పోర్టులను నకిలీ ఏజెంట్ల చేతుల్లో పెట్టి చాలామంది మోసపోతున్నారు. వలసదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల నకిలీ ఏజెంట్ల ఆటలు కట్టించడం, గుర్తింపు ఉన్న రిక్రూటింగ్ ఏజెన్సీల ద్వారానే వలస వెళ్లేలా గల్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తే వలస మోసాలను అరికట్టే అవకాశం ఉంటుంది.తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు అత్యధికంగా వలస వెళ్తుండగా కొంతకాలం నుంచి మలేషియా, సింగపూర్, యూరప్ దేశాలకు వలస వెళ్లే వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. ఆయా దేశాల్లోను కార్మికులుగానే మెజార్టీ వలసదారులు పని చేస్తున్నారు. దీంతో గల్ఫ్ యేతర దేశాల వలస కార్మికులకు ప్రయోజనాలు కల్పించేలా ప్రవాసీ విధానం అమలు చేయాలనే డిమాండ్ ఉంది. గత ప్రభుత్వ హయాంలో సమగ్ర ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ), గల్ఫ్ బోర్డు ఏర్పాటుకు అధ్యయనం చేసినా చిత్తశుద్ధి లేకపోవడంతో ఆ ప్రక్రియ మరుగునపడిపోయింది. ఇప్పుడు సలహా కమిటీ ఇతర రాష్ట్రాలలో అమలవుతున్న ప్రవాసీ విధానంపై అధ్యయనం చేసి మన రాష్ట్రంలో అమలు చేయాల్సిన పాలసీ ఎలా ఉండాలి అనే అంశంపై తుది నివేదికను అందించాల్సి ఉంది.గల్ఫ్ యేతర కార్మికులకు..వైఎస్సార్ హయాంలో..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బాధ్యతలను స్వీకరించిన తర్వాత గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. అప్పట్లో గల్ఫ్ దేశాల్లో కాని గల్ఫ్ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకున్నారు. కొన్ని విపత్కర పరిస్థితుల్లో ఇంటికి వచ్చిన వలస కార్మికులకు ఆయా కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాలను అందించి అండగా ఉన్నారు. ఏది ఏమైనా అధ్యయన సలహా కమిటీ ఇచ్చే నివేదికపైనే గల్ఫ్ వలస కార్మికులు కొండంత ఆశతో ఉన్నారు. సమగ్ర ప్రవాసీ విధానం రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటుకు బాటలు వేయనున్న ‘సలహా కమిటీ’ త్వరలో కార్యరూపం దాల్చనున్న గల్ఫ్ బోర్డు -
అనర్హులకు కార్డులిస్తే ఉద్యోగం ఊస్ట్
మోర్తాడ్(బాల్కొండ): ఆహార భద్రత కొత్త కార్డులు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్య లు చేపడుతోంది. రేషన్‌కార్డుల కోసం అందిన దరఖాస్తులను ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా పరిశీలించాలని ఉద్యోగులను ఆదేశించింది. అనర్హులకు రేషన్‌కార్డులు అందకుండా మరోసారి సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వే నిర్వహించే ఉద్యోగులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని, అనర్హులకు రేషన్‌కార్డులు జారీ అయితే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందంటూ హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. గతంలో జారీచేసిన రేషన్‌కార్డులలో అనేక మంది అనర్హులు స్థానం సంపాదించుకొని ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతున్నారు. వారి నుంచి కార్డులను స్వాధీనం చేసుకునే విషయం ఎలా ఉన్నా ఇప్పుడు కొత్తగా జారీ చేసే కార్డుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. నేటి నుంచి కొనసాగనున్న సర్వే గణతంత్ర దినోత్సవం రోజున జిల్లాలోని ఒక్కో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి పలువురికి కొత్త కార్డులను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. కాగా, ప్రజాపాలన, మీ సేవ కేంద్రాల నుంచి వచ్చి న మెజార్టీ దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడంతో వీటిపై మరోమారు సర్వే నిర్వహిస్తోంది. గడిచిన వారంలోనే సర్వే నిర్వహించాల్సి ఉన్నా రెవెన్యూ అధికారుల మొబైల్ యాప్‌లలో లాగిన్ ఇవ్వడం, ఇతరత్రా అంశాల విషయంలో కొంత జాప్యం జరిగింది. వరుసగా సెలవులు రావడంతో ఈ నెల 15 నుంచి పక్కాగా సర్వే నిర్వహించాలని అధికారులు క్షేత్రస్థాయి ఉద్యోగులకు నిర్దేశించారు. జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ ఉద్యోగులతోపాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు ఈ సర్వే బాధ్యత అప్పగించారు. కాగా, జిల్లాలో ఇప్పటి వరకు కొత్త కార్డుల కోసం 81,148 దరఖాస్తులు రాగా, 1,066 కుటుంబాలకే కొత్త కార్డులను అందజేశారు. ఇంకా 80వేలకు మించి దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడం గమనార్హం. రేషన్‌కార్డు దరఖాస్తుల వడపోత అర్హుల ఎంపికకు పకడ్బందీ చర్యలు క్షుణ్ణంగా సర్వే నిర్వహించాలని ఉద్యోగులకు సర్కారు ఆదేశాలు సర్వే పక్కాగా నిర్వహించాలి కొత్త రేషన్‌కార్డుల జారీకి ముందు ఉద్యోగులు పక్కాగా సర్వే నిర్వహించాలి. ఎవరైనా ఒత్తిడి చేస్తే ఆ విషయం మా దృష్టికి తీసుకురావాలి. తప్పుడు వివరాలను సర్వేలో నమోదు చేయొద్దు. కొత్తగా జారీ చేసే కార్డులు నూటికి నూరు శాతం అర్హులకే దక్కాలి. – కృష్ణ, తహసీల్దార్, మోర్తాడ్నిబంధనలు కారు ఉండొద్దు. సాగు భూమి 3.50 ఎకరాలలోపు ఉండాలి. సాగుకు యోగ్యంకాని భూమి 7.50 ఎకరాల వరకు ఉండొచ్చు. సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాలకు రూ.2లక్షలకు మించొద్దు. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబసభ్యులు, ఉద్యోగ విరమణ పింఛన్ పొందుతున్నవారు అనర్హులు. -
అంబేడ్కర్‌ను కాంగ్రెస్ అవమానించింది
నిజామాబాద్ సిటీ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్‌ను కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వాడుకుని మానసికంగా హింసించిందని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన అంబేడ్కర్ విగ్రహాన్ని శుద్ధిచేసే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంబేడ్కర్ చావుకు మొట్టమొదటి కారణం కాంగ్రెస్సేనని, ఆయనను రెండుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో ఓడించిందని ఆరోపించారు. బీజేపీ ఒత్తిడితోనే ప్రధాని పీవీ నర్సింహారావు హయాంలో అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చారన్నారు. అంబేడ్కర్ పేరుతో కాంగ్రెస్ ఓట్లు అడగడం సిగ్గుచేటన్నారు. అంబేడ్కర్ పుట్టిన స్థలం, చదువుకున్న స్థలం, దీక్షతీసుకున్న స్థలం, మరణించిన స్థలాన్ని పంచతీర్థాలుగా మార్చి పర్యాటక ప్రాంతంగా ప్రధాని నరేంద్రమోడీ మార్చారని గుర్తుచేశారు. పవన్‌ను విమర్శించడం తగదు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఎమ్మెల్సీ కవిత విమర్శించడం తగదని అర్వింద్ అన్నారు. రాజకీయాల్లోకి రాకముందే ఆయనకు ఎంతో ఫేమ్ ఉందని, సినిమాల్లో వచ్చే సంపాదనను పక్కనపెట్టి ప్రజలకు సేవ చేస్తున్నారన్నారు. కవిత ఎలా ఫేమ్ అయ్యారని ప్రశ్నించారు. సంచులు మోసే సంస్కృతి కవిత, రేవంత్రెడ్డిలదేనని ఘాటుగా విమర్శించారు. కార్యక్రమంలో అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ ఒత్తిడితోనే భారతరత్న ఎంపీ ధర్మపురి అర్వింద్ -
పాత డిజైన్ ప్రకారమే మంచిప్ప
డిచ్పల్లి/నిజామాబాద్ సిటీ: ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులో భాగంగా మంచిప్ప ప్రాజెక్టు నిర్మాణ పనులను పాత డిజైన్ ప్రకారం చేపట్టి రెండు సంవత్సరాల్లో లక్షా 82 వేల ఎకరాలకు సాగునీరందించాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టుల పనులపై ఆదివారం హైదరాబాద్‌లోని జలసౌధలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. శాఖ ఉన్నతాధికారులతోపాటు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తాను ప్రతిపాదించిన విధంగా మంచిప్ప ప్రాజెక్టు పనులను పాత డిజైన్ ప్రకారం పూర్తి చేయడంతోపాటు రూరల్ నియోజకవర్గంలోని అన్ని నీటిపారుదల శాఖ ప్రతిపాదనలపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తెలిపారు. వ్యవసాయానికి పెద్దపీట ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామని, సకాలంలో నీటి పంపిణీకి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ప్రభు త్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. మునిపల్లి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పెండింగ్‌లో ఉ న్న బకాయిలను మంజూరు చేస్తామని, ఆర్మూర్ నియోజకవర్గంలోని నాలుగు చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల పునరుద్ధరణ పనులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. చౌట్పల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లో పైపులైన్ లీకేజీలకు తక్షణమే మరమ్మతులు చేయాలని, సిద్ధాపూర్ రిజర్వాయర్‌ను త్వరగా పూర్తి చే యాలని మంత్రి ఆదేశించినట్లు షబ్బీర్ తెలిపారు. రెండేళ్లలో లక్షా 82వేల ఎకరాలకు సాగునీరందించాలి ప్యాకేజీ – 21 పనులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ సమీక్ష హాజరైన షబ్బీర్, భూపతిరెడ్డి, మహేశ్‌గౌడ్ -
ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఈగ సంజీవ్‌రెడ్డి
నిజామాబాద్ నాగారం: ఆర్చరీ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. జిల్లా కేంద్రంలోని సంజీవరెడ్డి నగర్ కాలనీలో ఆదివారం అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. ఒక్కో పదవికి ఒక్కో నామినేషన్ రావడంతో కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి గంట ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా ఈగ సంజీవరెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఎంవీ సుబ్బారావు, కోశాధికారిగా మంథని బాలగంగాధర్, ప్రధాన కార్యదర్శిగా కే గంగరాజు, సంయుక్త కార్యదర్శిగా ఈగ పోతన్న, సభ్యుడిగా బదావత్ గణేశ్ ఎన్నికయ్యారు. నూతన కమిటీ నాలుగేళ్లపాటు కొనసాగనున్నది. ఎన్నికల అబ్జర్వర్లుగా అరవింద్‌కుమార్, అంద్యాల లింగన్న, మీసాల ప్రశాంత్‌కుమార్ వ్యవహరించారు. ఈగ సంజీవరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానని, క్రీడాకారులకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఆర్చరీ క్రీడాకారుడినైన తాను జిల్లాకు చెందిన క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దుతానని ప్రధాన కార్యదర్శి గంగరాజు పేర్కొన్నారు. కార్యక్రమంలో బోర్గాం సొసైటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, గాధరి సంజీవరెడ్డి, సయ్యద్ నబీ తదితరులు పాల్గొన్నారు. ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం ఎన్నిక -
భూ భారతి వచ్చే..!
మా మామ పేరుపై సిర్నాపల్లి రెవెన్యూ శివారులోని 226 సర్వే నంబర్లో ఎకరన్నర, అలాగే నల్లవెల్లి రెవెన్యూ శివారులో 30 గుంటల భూమి ఉంది. ధరణి వచ్చిన తరువాత అసలు రికార్డుల్లోనే వివరాలు లేకుండాపోయాయి. ఇప్పటివరకు కొత్త పాస్‌పుస్తకాలు రాలేదు. రైతుబంధుతోపాటు పంటరుణం పొందలేకపోయాం. ఐదు సంవత్సరాలుగా రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. భూభారతితోనైనా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. – నాందేడపు రాజన్న, నల్లవెల్లిసోమవారం శ్రీ 14 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 8లో uఅగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ ఖలీల్‌వాడి: అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను సీపీ పోతరాజు సాయిచైతన్య ఆదివారం ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీ మాట్లాడారు. అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 14 నుంచి 20 వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ సూపరింటెండెంట్ నవాజ్‌ఖాన్, ఫైర్ ఆఫీసర్ నర్సింగ్ రావు, సిబ్బంది పాల్గొన్నారు. కాకతీయ కాలువకు నిలిచిన నీటి విడుదలబాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా విడుదలవుతున్న నీటిని ఆదివారం ప్రాజెక్ట్ అధికారులు నిలిపివేశారు. యాసంగి సీజన్ కోసం విడుదలవుతున్న నీటిని ఈ నెల 9వ తేదీనే నిలిపివేయాల్సి ఉంది. కానీ, కాకతీయ కాలువ జోన్–2 ఆయకట్టు కోసం ప్రాజెక్ట్ అధికారులు మూడు రోజులపాటు నీటి విడుదలను కొనసాగించారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ నుంచి అన్ని కాలువలు, లిఫ్టులకు నీటి విడుదల నిలిచిపోగా, ఆదివారం నాటికి ప్రాజెక్ట్‌లో 11.44 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నిలిచిన విద్యుదుత్పత్తి కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల నిలిపివేయడంతో జల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. మళ్లీ వచ్చే ఖరీఫ్ సీజన్లో కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల చేపట్టే వరకు విద్యుదుత్పత్తి జరిగే అవకాశం ఉండదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 3.44 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగినట్లు జెన్కో అధికారులు వెల్లడించారు. 33కేవీ, 11కేవీ ఫీడర్లపై ఎఫ్పీఐలుసుభాష్నగర్: విద్యుత్ సరఫరా వ్యవస్థలో 33కేవీ, 11కేవీ దూరమైన లైన్లలో ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లు (ఎఫ్‌పీఐ)లను పెడుతున్నామని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రాపెల్లి రవీందర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాంకేతిక కారణాలు, బ్రేక్ డౌన్, ప్రకృతి వైపరీత్యాల సమయంలో లైన్ మొత్తం తనిఖీ చేసే అవసరం లేకుండా, సమస్య ఏర్పడిన ప్రాంతాన్ని ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్ విభజిస్తుందని పేర్కొన్నారు. అంతరాయం ఏ భాగంలో జరిగిందనే విషయాన్ని వెంటనే విశ్లేషించి నేరుగా అక్కడికే వెళ్లి పునరుద్ధరణ చర్యలు చేపట్టడం ద్వారా విద్యుత్ అంతరాయ సమయాన్ని గణనీయంగా తగ్గించొచ్చని తెలిపారు. ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లను 33కేవీ, 11కేవీ విద్యుత్ లైన్లలో అంతరాయాల గుర్తింపు, వాటి నివారణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలోని 50 విద్యుత్ ఫీడర్లలో, ఎఫ్‌పీఐలను బిగించేందుకు సాంకేతికంగా వ్యూహాత్మక ప్రదేశాలను గుర్తించామని తెలిపారు. 21 నుంచి పరివర్తన్ సమ్మర్ క్యాంప్నిజామాబాద్ రూరల్: నగరంలోని శ్రీరామకృష్ణ విద్యానికేతన్ హైస్కూల్లో ఈ నెల 21 నుంచి పరివర్తన్ – సమ్మర్‌క్యాంప్‌ను నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు మధుసూదనచారి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్యాంప్‌లో యోగా, మెడిటేషన్, భగవద్గీత, భజన్, చెస్, డ్రాయింగ్ తదితర వాటిపై విద్యార్థులకు శిక్షణ ఉంటుందని అన్నారు. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 9290449389, 9848225409, 7396994484 నంబర్లను సంప్రదించాలని కోరారు.ఇందల్వాయి: ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ‘భూ భారతి’ పోర్టల్‌తో రైతుల్లో ఆశలు చిరుగురించాయి. రైతులు, ప్రజలకు సులభంగా, వేగంగా సేవలందిస్తూ భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే ఉద్దేశంతో భూ భారతిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. వ్యవసాయభూముల రికార్డుల్లో నెలకొన్న గందరగోళం, పాస్‌పుస్తకాల జారీలో జాప్యం కారణంగా ఎంతో మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ధరణిలోని 33 మాడ్యుళ్లను భూ భారతికి వచ్చేసరికి ఆరుకి కుదించారు. పేరుకుపోయిన దరఖాస్తులు.. ధరణి వెబ్సైట్ ద్వారా ఎంతో మంది రైతుల భూ రికార్డులు ఆన్లైన్లో నమోదు కాకపోగా, నమోదైనవి తప్పుల తడకగా ఉన్నాయి. వాటిని సరిదిద్దుకునేందుకు రైతులు ఏళ్ల తరబడి తహసీల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయితే సమస్యలను పరిష్కరించే అధికారం తహసీల్దార్ స్థాయిలో లేకపోవడం, వెబ్సైట్ నిర్వహణ, సమస్యల పరిష్కారం సక్రమంగా లేకపోవడంతో దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. ఈ కారణంగా ధరణి వెబ్‌సైట్‌పై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది.భూ భారతి వచ్చేదాక ఆగమన్నారు నా భర్త చనిపోయి మూడు నెలలు అవుతోంది. తన పేరుపై ఉన్న భూమిని నా పేరు మీదికి మార్చమని వెళ్తే సర్వే నంబర్లలో విస్తీర్ణం వ్యత్యాసం ఉంది. ఇప్పుడు చేయడం కుదరదు. భూ భారతి వచ్చేదాకా ఆగమన్నారు. ఇప్పుడేమో భూ భారతి కేవలం మూడు మండలాల్లోనే అంటున్నారు. త్వరగా భూ భారతిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి నాలాంటి వారి సమస్యలను పరిష్కరించాలి. – కుంటజంగుల పద్మ, నల్లవెల్లితగిన ఆప్షన్లు ప్రవేశపెట్టాలి రైతులు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా పరిష్కరించే ఆప్షన్లను భూ భారతిలో ప్రవేశ పెట్టాలి. చిన్నచిన్న సమస్యలు తహసీల్ కార్యాలయాల్లోనే పరిష్కారమయ్యేలా అధికారాలు బదిలీ చేయాలి. ఏళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి. రికార్డులను తారుమారు చేసే, లోసుగులను అడ్డు పెట్టుకొని భూములను అక్రమంగా మార్పిడి చేసే అధికారులను కఠినంగా శిక్షించాలి. – నోముల రాజులు, రైతు, నల్లవెల్లిపరిష్కారం లభిస్తుంది రైతులు ఎదుర్కొంటున్న అన్ని భూ సమస్యలకు నూతన ఆర్వోఆర్ చట్టం–2025 భూ భారతితో తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. సీనియర్ ఐఏఎస్‌లు, విశ్రాంత రెవెన్యూ అధికారులు, భూ చట్టాల నిపుణులు, రైతు సంఘాల నేతలతో విస్తృతంగా చర్చించి రూపొందించిన భూ భారతి ద్వారా రైతులకు మేలు జరుగుతుంది. భూ రికార్డుల పటిష్టానికే భూభారతిని తీసుకొస్తోంది. – సుంకెట అన్వేష్‌రెడ్డి, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్న్యూస్రీల్రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలివే.. పొజిషన్లో ఉన్నా ఇప్పటి వరకు ఆన్లైన్లో భూముల వివరాలు లేకపోవడం, నూతన పట్టా పాస్‌పుస్తకాలు రాకపోవడం. నూతన పాస్‌పుస్తకాలు వచ్చినా పూర్తి స్థాయిలో విస్తీర్ణం నమోదు కాకపోవడం. పట్టా భూములు అసైన్డ్గా, అసైన్డ్ భూములు పట్టాలుగా నమోదవడం. ఆబాది భూములు వ్యవసాయ భూము లుగా, వ్యవసాయ భూములు ఆబాదిగా నమోదవడం. ఒకరికి చెందిన భూములు మరొకరి పేరు మీద నమోదవడం. తద్వారా గ్రామాల్లో భూ పంచాయితీలు పెరగడం. భూ విస్తీర్ణం రికార్డుల్లో హెచ్చుతగ్గుల(ఆర్ఎస్ఆర్) సమస్య కారణంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం, స్లాట్ రద్దయితే చెల్లించిన డబ్బులు తిరిగి రాకపోవడం. కారణాలు చెప్పకుండా దరఖాస్తుల తిరస్కరణ. ధరణి స్థానంలో నూతన పోర్టల్ సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న రైతులు నేడు అధికారికంగా ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి -
పొగాకు రైతుల్లో టెన్షన్
రెంజల్(బోధన్): పొగాకు బీట్లు ప్రారంభించకపోవడంతో రైతులు టెన్షన్ పడుతున్నారు. ఓ పక్క అ కాల వర్షాల భయం వెంటాడుతుండగా, మరోపక్క అధిక వేడితో తేమ వచ్చి పొగాకు బూజు పడుతున్న ట్లు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ర్చి నెలలోనే ప్రారంభించాల్సిన బీట్లు ఆలస్యం కా వడంతో ఆర్థికంగా అదనపు భారం పడుతుందంటున్నారు. బీట్లు ఎప్పుడెప్పుడా అని కంపెనీ ప్ర తినిధుల రాక కోసం రైతులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మహారాష్ట్రలో తక్కువ ధరకు కొనుగోళ్లు సరిహద్దున గల మహారాష్ట్రలో రైతుల నుంచి పొగాకు కొనుగోళ్లను ఆయా కంపనీలు ప్రారంభించగా, తెలంగాణలో ఎందుకు జాప్యం చేస్తున్నారో ఇక్కడి రైతులకు అంతుచిక్కడంలేదు. ధరలో వ్యత్యాసం ఉండటంతో ముందుగా అక్కడ కొనుగోళ్లు చేపడుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర కమీషన్ ఏజెంట్ల ద్వార కొనుగోళ్లు చేపడుతూ ఇక్కడి రైతులను ఉద్దేశ్య పూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. గత సంవత్సరం వీఎస్‌టీతో సహా పలు కంపెనీలు క్వింటా పొగాకుకు రూ.13,500 చెల్లించాయని రైతులు పేర్కొంటున్నారు. కానీ ఈ సీజన్లో కమీషన్ ఏజెంట్ల ద్వార మహారాష్ట్రలో క్వింటా పొగాకును రూ. 9వేల నుంచి రూ.11వేల వరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు 12వేల ఎకరాల్లో సాగు..ఉమ్మడి జిల్లాలోని బోధన్, బాన్సువాడ డివిజన్లలోనే పొగాకును అత్యధికంగా రైతులు సాగు చేస్తారు. సుమారు ప్రతి సంవత్సరం 10నుంచి 12వేల ఎకరాల్లో పంట సాగవుతుంది. గత 50 సంవత్సరాలుగా ఇక్కడి రైతులు వీఎస్టీ(వజీర్ సుల్తాన్ట్యూబాకో) కంపెనీతో ముందస్తు ఒప్పందం చేసుకుని పంట సాగు చేస్తారు. ఇటీవల వీఎస్‌టీతో పాటు పీటీపీ, ఐటీసీ, కేఆర్కే కంపెనీలు ముందుకు వచ్చి పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాయి. కంపెనీ ప్రతినిధులు ముందుగా రైతులతో బాండ్లు (ఓప్పంద పత్రం) రాయించుకుని పర్యవేక్షణ చేస్తారు. కానీ రెండు సంవత్సరాలుగా ఒప్పందం లేకుండానే వీఎస్టీపై ఆధారపడి నమ్మకంతో రైతులు పంటను సాగు చేస్తున్నారు. గత సంవత్సరం పొగాకుకు మార్కెట్లో డిమాండ్ ఉండటంతో కంపెనీలు మంచి ధర చెల్లించాయి. ఈయేడు అదే ధర చెల్లిస్తారని రైతులు ఆశించి అధికంగా సాగు చేశారు. ప్రతీ సంవత్సరం కంపెనీలు రూ.200 నుంచి 5 వందల వరకు ధరను పెంచుతూ వస్తున్నాయి. ఇప్పటికై నా ఆయా కంపెనీలు త్వరగా బీట్లు ప్రారంభించాలని అన్నదాతలు కోరుతున్నారు. బీట్ల ప్రారంభంలో కంపెనీల జాప్యం వాతావరణ పరిస్థితులతో ఆందోళన వెంటనే బీట్లు ప్రారంభించాలి 16 ఎకరాల్లో పొగాకు పండించాను. యేటా పంట పెట్టుబడులు పెరుగుతున్నాయి. వీఎస్టీ కంపెనీ ప్రకటించిన ధరనే మిగిలిన కంపెనీలు అనుసరిస్తాయి. ఎప్పుడైనా మార్చిలో కొనుగోలు చేసి, ఏప్రిల్‌లో బిల్లులు చెల్లించేవారు. ప్రస్తుతం బీట్ల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. కంపెనీలు స్పందించి బీట్లను ప్రారంభించాలి. –దేవేందర్, రైతు, కందకుర్తి నిర్లక్ష్యం చేస్తున్నారు పొగాకు కంపెనీలు కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నాయి. కమీషన్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని మహారాష్ట్రలో కొనుగోలు చేప ట్టి అక్కడి రైతులను నిలువు నా ముంచుతున్నారు. జిల్లా అధికారును కలిసి ఫిర్యాదు చేస్తాం, మహారాష్ట్ర నుంచి పొగాకు లారీలు తెలంగాణ మీదుగా ఆంధ్ర కు తరలిస్తున్నారు. సరిహద్దుల్లో పొగాకు లారీలను అధికారులు నియంత్రించాలి. అప్పడే కంపెనీలు ముందుకు వస్తాయి. –సిరాజ్బేగ్, రైతు, కందకుర్తి -
నందిపేటలో ధాన్యం బస్తాల చోరీ
నందిపేట్(ఆర్మూర్): వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం నుంచి రైస్‌మిల్‌కు లారీ తరలిస్తుండగా మార్గమధ్యలో డ్రైవర్ చోరీ చేసిన ఘటన నందిపేట మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. నందిపేట మండలం చింరాజ్‌పల్లి సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఆదివారం డొంకేశ్వర్ మండలం నూత్పల్లి గ్రామంలోని రాజరాజేశ్వర రైస్‌మిల్‌కు తరలించారు. మార్గమధ్యలో నందిపేట వద్ద డ్రైవర్ లారీని నిలిపి, కొన్ని ధాన్యం బస్తాలను ఆటోలో ఎక్కించాడు. ఈ తతంగాన్ని స్థానికులు అనుమానంతో వీడియో తీసి, సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్ అయింది. వీడియోను చూసిన రైతులు సొసైటీకి వెళ్లి అధికారులను అడగడంతో తాము కూడ లారీ ఇంకా రైస్‌మిల్‌కు చేరలేదని ఆందోళన చెందుతున్నామన్నారు. అనంతరం అధికారులు రైతులతో కలిసి ఘటన స్థలానికి వెళ్లి లారీ డ్రైవర్‌ను నిలదీయగా, చోరీని ఒప్పుకున్పాడు. గత మూడు రోజుల నుంచి ఇలాగే లారీలో బస్తాలు తక్కువగా రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
బడిలో చోరీకి యత్నించిన దుండగులు
కామారెడ్డి రూరల్: పాఠశాలలో చొరబడిన ముగ్గురు దొంగలు చోరీకి యత్నించగా గ్రామస్తులు వారిని వెంబడించి, ఒకరిని పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా.. టేక్రియాల్ జెడ్పీహెచ్ఎస్లో ఆదివారం పాఠశాల వెనకాల ఉన్న ప్రహరీ నుంచి గుర్తుతెలియని ముగ్గురు దుండగులు బడిలోకి ప్రవేశించారు. వరండాలోని ఓ సెల్ఫ్ పైన ఉన్న ఫ్యాన్లు, ఇతర ఎలక్ట్రికల్ వస్తువులను సంచిలో వేసుకొని ఎత్తుకెళ్తుండగా స్థానికులు గమనించి వెంబడించారు. ఇద్దరు దుండగులు ప్రహరీ దూకి పారిపోగా, ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్‌రూం తాళాన్ని కూడా పగలగొట్టడానికి దొంగలు యత్నించినట్లు తెలిపారు. -
51ఏళ్ల తర్వాత కలిసిన బాల్య మిత్రులు
డిచ్పల్లి: వారంతా పూర్వ విద్యార్థులు. 51ఏళ్ల క్రితం పదోతరగతి చదివి ఎక్కడెక్కడో స్థిరపడిన వారు. మళ్లీ ఇన్నాళ్లకు కలిశారు. గత మధురస్మృతులను నెమరువేసుకుని పరవశించి పోయారు. జిల్లా కేంద్రంలోని మాణిక్ భవన్ పాఠశాలలో 1973–74 పదోతరగతి బ్యాచ్ విద్యార్థులు డిచ్పల్లిలోని ఫాంహౌస్‌లో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆటపాటలతో అలరించారు. హైదరాబాద్, విశాఖపట్నంతో పాటు అమెరికాలో స్థిరపడిన ఒకరు సమ్మేళనానికి తరలివచ్చారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఈగ సంజీవ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా ఆటపాటలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. డిచ్పల్లి సొసైటీ మాజీ చైర్మన్ గజవాడ జైపాల్, నాగరాజు, అశోక్, చిరంజీవి, ఉమాపతి, చంద్రసేన్, సుబ్రహ్మణ్యం, రాజేశ్వర్, జనార్ధన్ యాదవ్, వీరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డిలో 22ఏళ్లకు.. కామారెడ్డి రూరల్: కామారెడ్డిలోని వివేకనంద పాఠశాలలో 2002–2003 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు 22 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. 60 మంది విద్యార్థులకుగాను 45 మంది పూర్వ విద్యార్థులు ఆదివారం పట్టణంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరై, ఆనాటి తీపి గుర్తులను గుర్తుచేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆనాటి గురువులను సన్మానించారు. అనంతరం ఆటపాటలు, వింధుభోజనంతో ఆహ్లాదంగా గడిపారు. నగేష్గుప్తా, మహేశ్వరీ, బబిత, జ్యోతి, దొడ్లె సంజీవ్‌కుమార్, సుధాకర్, భాస్కర్, రణధీర్ తదితరులు ఉన్నారు. ఎల్లారెడ్డిలో ముప్పై ఏళ్లకు.. ఎల్లారెడ్డిరూరల్: పట్టణంలోని జిల్లా పరిషత్ బాలు ర ఉన్నత పాఠశాలకు చెందిన 1994–95 బ్యాచ్ ఎస్సెస్సీ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి 30 ఏళ్ల తరువాత విద్యార్థులంతా కలుసుకున్నారు. అనంతరం వారికి పాఠాలను బోధించిన ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పద్మ శ్రీకాంత్, వెంకట్రాములు, వెంకటేశం, దత్తు, విజయ్, నర్సింలు తదితరులున్నారు. పెద్దవాల్గోట్‌లో 21ఏళ్లకు.. సిరికొండ: మండలంలోని పెద్దవాల్గోట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం 2003–04 ఎస్సెస్సీ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వారు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకొని సరదాగా గడిపారు. ఆనాడు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. పద్మాజీవాడిలో 25ఏళ్లకు.. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని పద్మాజీవాడిలో ఆదివారం మాతృశ్రీ జూనియర్ కళాశాలకు చెందిన 1998–2000 బ్యాచ్ ఇంటర్ విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత ఒక్కచోట చేరారు. పద్మాజీవాడి శివారులో ఓ వ్యవసాయ క్షేత్రంలో కలుసుకుని గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆనాటి గురువులను సన్మానించారు. గురువులు రాజ గంబీర్రావు, గోపాల్‌రెడ్డి, లింగారెడ్డి, కృష్ణ, కృష్ణ ప్రసాద్, పూర్వ విద్యార్థులు శ్రీధర్ రెడ్డి, కృష్ణరెడ్డి, సంతోష్, రాజేందర్, శ్రీకాంత్, మోహన్, గంగాధర్, సురేందర్, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనదే
తెయూ(డిచ్పల్లి): బీఆర్ అంబేడ్కర్ భారతదేశాన్ని కేవలం రాజకీయంగా కాకుండా ప్ర జాస్వామ్యంగా మార్చాలనే లక్ష్యంతో ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం రూపొందించారని తెలంగాణ యూనివర్సిటీ వీసీ యాదగిరిరావు అన్నారు. మహనీయుల జయంతి ఉ త్సవాలలో భాగంగా ఆదివారం తెయూ ఎస్సీ సెల్ డైరెక్టర్ వాణి నేతృత్వంలో ‘21వ శతాబ్దంలో అంబేడ్కర్ ఆలోచనల ఔచిత్యం’ అనే అంశంపై వెబినార్ నిర్వహించారు. ఈసందర్భంగా వీసీ మాట్లాడుతూ.. వర్తమాన సమాజంలో భారతదేశానికి అంబేడ్కర్ ఆలోచనలు అనుసరనీయమన్నారు. తెయూ రిజిస్ట్రార్ యాదగిరి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని, అంబేడ్కర్‌ను వేరువేరుగా చూడలేమన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుకుమార్ మాట్లాడుతూ.. ఆధునిక భారతదేశంలో రాజ్యాంగం ప్రా ముఖ్యత గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సి టీ ప్రొఫెసర్ నాగరాజు, కేఆర్ఈఏ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాంబయ్య మాట్లాడారు. ప్రి న్సిపాల్ మామిడాల ప్రవీణ్, డీన్లు ఘంటాచంద్రశేఖర్, రాంబాబు గోపిశెట్టి, పీఆర్వో పున్నయ్య, అధ్యాపకులు నాగరాజు, జెట్లింగ్ ఎల్లోసా, ప్రసన్నరాణి, సంపత్ తదితరులు పాల్గొన్నారు. ముదక్‌పల్లిలో కుస్తీపోటీలు మోపాల్: మండలంలోని ముదక్‌పల్లిలో హను మాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివా రం వీడీసీ ఆధ్వర్యంలో కుస్తీపోటీలు నిర్వహించారు. పోటీల్లో చుట్టుపక్కల గ్రామాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి మల్లాయోధులు భారీగా తరలివచ్చారు. విజేతలకు నిర్వాహకులు వెండి కడియం, నగదు ప్రోత్సహక బహుమతులు అందజేశారు. వీడీసీ ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కలప లారీ బోల్తా నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని మాగి గ్రామ శివారులో ఆదివారం కలప లారీ బోల్తాపడింది. పిట్లం వైపు నుంచి నిజాంసాగర్ వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. ప్రమాదంలో డ్రైవర్‌కు ఎటువంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటు మద్నూర్(జుక్కల్): మద్నూర్ ఎస్సై విజయ్‌కొండ సహకారంతో మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారయణ గోశాలలో ఆదివారం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గోశాలలో ఆవులు చోరీకి గురికాకుండ ఉండేందుకు సీసీ కెమెరాలను ఎస్సై ఏర్పాటు చేయించారు. అనంతరం ఆవులను ఎలా రక్షించుకోవాలో గోశాల కమిటీకి ఎస్సై పలు సూచనలు సలహాలు అందించారు. అనంతరం ఎస్సైని గోశాల కమిటీ అధ్యక్షుడు సంజయ్ సన్మానించారు. -
పన్ను చెల్లింపుల్లో నాగాపూర్ ఆదర్శం
బాల్కొండ: మండలంలోని నాగాపూర్ గ్రామం ఇంటి పన్ను చెల్లింపుల్లో ఆదర్శంగా నిలుస్తుంది. గ్రామస్తులంతా ఇరవై ఏళ్లుగా నూరుశాతం ఇంటి పన్నులు చెల్లిస్తూ ఐక్యతకు మారుపేరుగా నిలుస్తున్నారు. నాగాపూర్ గ్రామం ఎస్సారెస్పీలో పాక్షికంగా ముంపుకు గురైన గ్రామం. గ్రామస్తుల భూములు మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణంలో కోల్పోయారు. అయినా ధైర్యం కోల్పోకుండా తమ గ్రామాన్ని పున:నిర్మాణం చేసుకుని పూర్వ వైభవం కోసం కృషి చేశారు. ఏటా ఆర్థిక సంవత్సరం ముగింపునకు ముందే నూరు శాతం ఇంటి పన్నును చెల్లిస్తున్నారు. ప్రస్తుత సంవత్సరం కూడా పన్నులను చెల్లించారు. ఇంటి పన్ను చెల్లింపులోనే కాదు రాజాకీయంగా కూడ చైతన్యవంతమైన గ్రామం. గ్రామంలో ఎలాంటి సమస్య వచ్చిన కలిసి కట్టుగా ఉండి పరిష్కరించుకుంటారు. ఎవరికి సమస్య వచ్చిన గ్రామ సమస్యగా భావిస్తారు. జీపీ వద్దకు రావాలని ఒక్కసారి మైక్‌లో ప్రకటిస్తే చాలు ఇంటికి ఇద్దరు చొప్పున వచ్చి వాలుతారని గ్రామస్తులు అంటున్నారు. మురికి కాలువలు, సీసీ రోడ్లు, తాగునీటి వసతిని కల్పించాల్సి ఉంది. ప్రభుత్వం స్పందించి తమ గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయుటకు నిధులను మంజూరు చేయాలని కోరుతున్నారు. ఒక్కసారి చెబితే.. గ్రామస్తులు ఇరవై ఏళ్ల నుంచి నూరు శాతం ఇంటి పన్ను చెల్లిస్తున్నారు. ఒక్కసారి చెబితే చాలు కార్యాలయానికి వచ్చి పన్ను చెల్లిస్తారు. ప్రజలు అధికారులతో ఎప్పుడూ సహకరిస్తునే ఉంటారు. – అబ్దుల్ కలీం, కారోబార్, నాగాపూర్ అందరూ ముందే చెల్లిస్తారు.. ఇంటి పన్ను చెల్లింపులో మా గ్రామస్తులు ఆదర్శంగా ఉంటారు. ఇంటి పన్ను ఏడాది అయ్యేలోపు అడగ కుండానే చెల్లిస్తారు. గత ఇరవై ఏళ్లు నూరు శాతం పన్ను లు చెల్లించడం గ్రామానికే గర్వంగా ఉంది. – వెంకటేశ్‌గౌడ్, మాజీ సర్పంచ్, నాగాపూర్ రెండు దశాబ్దాలుగా వంద శాతం పన్నులు చెల్లిస్తున్న గ్రామస్తులు -
ఉపాధ్యాయ ఉద్యమనేతకు కన్నీటి వీడ్కోలు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఉపాధ్యాయ ఉద్యమాల తో పాటు తెలంగాణ ఉద్యమంలో, అనేక సామాజిక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని క్యాన్సర్‌తో చనిపోయిన టీపీటీఎఫ్ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి రమణ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం కామారెడ్డి పట్టణంలో జరిగాయి. రాష్ట్రం నలు మూలల నుంచి ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉ పాధ్యాయులు, ప్రజాసంఘాల నేతలు తరలివచ్చా రు. ఆయనకు ఘన నివాళులు అర్పించారు. హౌ సింగ్ బోర్డులోని ఆయన నివాసం నుంచి పెద్ద చె రువు దిగువన ఉన్న శ్మశాన వాటిక వరకు జరిగిన అంతిమయాత్రలో వందలాది మంది పాల్గొన్నారు. పలువురు ఆయన చేసిన పోరాటాలు, త్యాగాలను స్మరించుకున్నారు. కందుకూరి రమణ అంత్యక్రియలకు తరలివచ్చిన టీచర్లు, ప్రజాసంఘాల నేతలు -
కల్వర్టు గుంతలో పడి ఇద్దరికి గాయాలు
ఎల్లారెడ్డి: మండలంలోని తిమ్మారెడ్డి గ్రామ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. అన్నాసాగర్ గ్రామానికి చెందిన బాలరాజు, తన కూతురు భావనతో కలిసి ఆదివారం బైక్‌పై ఎల్లారెడ్డికి బయలుదేరారు. తిమ్మారెడ్డి గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదవశాత్తు కల్వర్టు గుంతలో వారు పడిపోయారు. ఈ ఘటనలో తండ్రి, కూతురికి గాయాలు కావడంతో స్థానికులు ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలరాజుకు తీవ్రగాయాలు కావడంతో కామారెడ్డికి రిఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు. రోడ్డు పనులు జరుగుతున్న సమయంలో ఎలాంటి ప్రమాద సూచికలు ఏర్పా టు చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నా యని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మీనయ్య మృతి ఉద్యమానికి తీరని లోటు
మోపాల్: సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు గడపురం మీనయ్య మృతి పేదలు, ఉద్యమానికి తీరని లోటని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన గడపురం మీన య్య అంత్యక్రియలు నగరశివారులోని బోర్గాం(పి)లో శనివారం నిర్వహించారు. మీనయ్య భౌతికకాయానికి న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, వేల్పూర్ భూమయ్య, ప్రజాసంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాయకులు కంజర భూమయ్య, నాగభూషణం, పరుచూరి శ్రీధర్, నీలం సాయిబాబా, రమేశ్, ఎర్రన్న, చిన్నయ్య, నర్సయ్య, మల్లికార్జున్, భుజేందర్, లక్ష్మి, రాజశేఖర్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కూలీ డబ్బులు చెల్లించాలి సిరికొండ: ఉపాధి హామీ కూలీలకు కూలి డబ్బులు చెల్లించాలని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి బాలయ్య డిమాండ్ చేశారు. గడ్కోల్‌లో ఉపాధి హామీ కూలీలతో శనివారం సమావేశమయ్యారు. కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పది వారాల నుంచి కూలి డబ్బులు రావడం లేదని కూలీలు వాపోయారు. ప్రభుత్వం వెంటనే కూలీలకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాయకులు భూమేశ్, ఎల్లయ్య, చిన్న గంగాధర్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
సిరికొండ: మండలంలోని గడ్కోల్, పెద్దవాల్గోట్, సర్పల్లి తండాలో బాధితులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు శనివారం పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో ఏఎంసీ డైరెక్టర్ సంపత్‌రెడ్డి, భానుచందర్, గాదారి నర్సారెడ్డి, రాంరెడ్డి, నర్సింగ్, నర్సారెడ్డి, లియాఖత్ అలీ, భాస్కర్‌రెడ్డి, గవాస్కర్, హేమంత్, అఖిల్, రంజిత్, సుమన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వనజీవి రామయ్య మృతి బాధాకరం నిజామాబాద్ రూరల్: పర్యావరణ పరిరక్షణకు కోటి మొక్కలు నాటిన వనజీవి రామయ్య మృతి పర్యావరణ ఉద్యమానికి లోటు అని తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామిడి సతీశ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు బానోత్ ప్రేమ్‌లాల్ అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ రామయ్య ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఆలయానికి ఇత్తడి మకర తోరణాల వితరణ సిరికొండ: మండలంలోని గడ్కోల్‌లో హనుమాన్ ఆలయానికి ఇత్తడితో చేసిన మకర తోరణాలను గ్రామానికి చెందిన పీఎంపీ వైద్యుడు అమరవాజీ జీవన్, ప్రమీల దంపతులు వితరణ చేశారు. రూ. నలభై వేల విలువ గల శివ లింగానికి నాగ తోరణం, హనుమాన్ విగ్రహనికి మకర తోరణాలను వారు అందచేశారు. దాతలను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తీగల నరేశ్, మామిడి రాములు, మల్లెల లింబాద్రి, సండ్ర శంకర్, నిమ్మల భాస్కర్, రఘురాజ్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ ఉత్సవాల నిర్వహణకు అనుమతి ఇవ్వండి ఖలీల్‌వాడి: నగరంలోని వర్ని చౌరస్తాలో ఈనెల 14న నిర్వహించే అంబేడ్కర్ జయంతి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వర్ని రోడ్ మాల సంఘం సభ్యులు ఏసీపీ, రెండో టౌన్ ఎస్సైకు శనివారం వినతిపత్రం అందజేశారు. దీనికి ఏసీపీ సానుకూలంగా స్పందించి ఉత్సవాలు జరుపుకోవడానికి అనుమతి ఇచ్చినట్లు వారు తెలిపారు. నాయకులు రామచంద్ర గైక్వాడ్, ముత్యాల మారుతి ఉన్నారు. కానూరి, పైలా వర్ధంతి సభ సిరికొండ: మండలంలోని తూంపల్లిలో కానూరి వెంకటేశ్వర్లు, పైలా వాసుదేవరావుల వర్ధంతి సభను శనివారం నిర్వహించారు. సభకు న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి భాస్కర్ హాజరై మాట్లాడారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యను అభివృద్ధి చేయడంలో కానూరి క్రీయాశీలక పాత్ర పోశించారని అన్నారు. భూమి భుక్తి విముక్తి కోసం సాగిన శ్రీకాకుళ సాయుధ పోరాటంలో పైలా వాసుదేవరావు అగ్ర భాగాన నిలిచిన యోధుడని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు గంగారెడ్డి, బైరయ్య, చిన్నక్క, రాజగంగు, సాయవ్వ, లక్ష్మి, సాయిలు తదితరులు పాల్గొన్నారు. ‘వచనాలయ సలహాదారుల నియామకం చెల్లదు’ నిజామాబాద్ సిటీ: బాపూజీ వచనాలయంలో నూతనంగా నియమించిన సలహాదారుల నియామకం చెల్లదని, అది బైలాస్కు విర్ధుమని పరిరక్షణ పోరాట సమితి కన్వీనర్ కోనేరు సాయికుమార్ మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని బాపూజీ వచనాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాపూజీ వచనాలయ అధ్యక్షుడిగా చెలామణి అవుతున్న ఢిల్లీ భక్తవత్సలం నాయుడు కొంతమందిని సలహాదారులుగా నియమించుకున్నారని అది చెల్లదని తెలిపారు. ఎన్నికలు ఆపాలని తాను హైకోర్టులో కేసు వేశానని, అది పెండింగ్‌లో ఉందని గుర్తుచేశారు. బాపూజీ వచనాలయ ఆస్తులను పరిరక్షించాలని కోరారు. -
గీతకార్మికులపై వీడీసీ ఆగడాలు ఆపాలి
నిజామాబాద్ సిటీ : కల్లుగీత కార్మికులపై వీడీసీ సభ్యులు చేస్తున్న ఆగడాలను వెంటనే ఆపాలని కల్లుగీత సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. గీత కా ర్మికులపై వీడీసీ వారు గత ఆరు నెలలుగా అనేక ఇ బ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ చర్యలు మధ్యయుగం నాటి రాజరిక వ్యవస్థలు గుర్తొస్తున్నాయన్నారు. గీత కార్మికులు పెంచుతున్న ఈత చెట్లను కాల్చివేస్తున్నారని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి తగు చర్య లు తీసుకోవాలని కోరారు. సమావేశంలో శేఖర్ గౌడ్, పెద్ది వెంకట్రాములు, నరసింహులు గౌడ్, శేఖర్ గౌడ్, శ్రీరామ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ధర్పల్లిలో గావ్ చలో అభియాన్ కార్యక్రమం
ధర్పల్లి: బీజేపీ ఆధ్వర్యంలో చేపడుతున్న గావ్ చలో అభియాన్ కార్యక్రమం శనివారం ధర్పల్లి మండల కేంద్రంలో కొనసాగింది. పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు దళితవాడలను సందర్శించారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని, ప్రధాని మోదీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం బీజేపీలోకి దళితవాడ నుంచి 20 మంది చేరగా వారికి మహిపాల్‌యాదవ్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. నాయకులు సుమన్, దేవేందర్ నాయక్, గంగాదాస్, కర్క గంగారెడ్డి, మహేశ్, జ్ఞానేశ్వర్, మల్లయ్య, నరేశ్, సందీప్, చందు తదితరులు పాల్గొన్నారు. -
భక్తులతో పులకించిన ఇందూరు
● హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు ● విజయయాత్ర నిర్వహించిన భక్తులు ● బందోబస్తు నిర్వహించిన పోలీసులు హనుమాన్ జయంతి సందర్భంగా నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లోని హనుమాన్ ఆలయాలు భక్తులతో శనివారం పులకరించాయి. స్వామి వారి దర్శనానికి ఆలయాల్లో భక్తులు క్యూ కట్టారు. జై హనుమాన్.. జైజై హనుమాన్ అంటూ భక్తులు స్వామి వారి నామస్మరణ చేశారు. భక్తులకు ఆలయ, గ్రామ కమిటీ సభ్యులు అన్నదానం నిర్వహించారు. జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్, హిందూ సంఘాలు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు చేపట్టిన హనుమాన్ విజయయాత్ర విజయవంతంగా సాగింది. ప్రజలంతా విజయయాత్రలో పాల్గొని జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ నామస్మరణ చేశారు. యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు. – సాక్షి నెట్వర్క్ -
స్నేహితుడి కుటుంబానికి ఆర్థికసాయం
నిజామాబాద్ నాగారం: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ స్నేహితుడి కుటుంబాన్ని పాఠశాల మిత్రు లు అండగా నిలిచి ఆర్థికసాయం అందించారు. నగ రంలోని చంద్రనగర్‌కు చెందిన కొండలివాడి నవీన్ కొంత కాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నా డు. దీనికి తోడు వీరి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గుర్తించిన మాడ్రన్ పబ్లిక్ స్కూల్లో చదివిన మిత్రులు అండగా నిలిచారు. మిత్రులు నవీన్ కుమార్తెల పేరిట పోస్టాఫీస్‌లో రూ. లక్ష డిపాజిట్ చేసి ఆ ప్రతులను కుటుంబ స భ్యులను శనివారం అందజేశారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తమను గుర్తించి ఆదుకున్న మిత్రులకు బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. -
పాఠశాలకు క్రీడా సామగ్రి వితరణ
జక్రాన్‌పల్లి: మండలంలోని తొర్లికొండ జెడ్పీ ఉన్నత పాఠశాలకు క్రీడా సామగ్రిని దాతలు వేంకటేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ సాయిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఉత్కం శ్రీనివాస్‌గౌడ్ వితరణగా అందజేశారు. క్రీడా పరికరాలను హెచ్ఎం, ఇన్చార్జి ఎంఈవో శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తామని దాతలు తెలిపారు. కార్యక్రమంలో బ్రాహ్మణ్‌పల్లి సొసైటీ చైర్మన్ నర్సారెడ్డి, వెల్మ గంగారెడ్డి, కనక రవి, గంగారెడ్డి, రాజేశ్‌గౌడ్, రాజేశ్‌ఖన్నా, సన్యాదవ్, ప్రసాద్, రణదీర్గౌడ్, మర్కంటి గంగామోహన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మహిళలే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాతలు
తెయూ(డిచ్పల్లి): మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని పాలమూరు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మనోజ పేర్కొన్నారు. మహనీయుల జయంతి వేడుకలను పురస్కరించుకొని తెలంగాణ వర్సిటీ ఉమెన్ సెల్ డైరెక్టర్ భ్రమరాంబిక అధ్యక్షతన ‘సీ్త్రల హక్కులు– లింగ న్యాయం’ అనే అంశంపై శనివారం కార్యశాల నిర్వహించారు. ప్రధాన వక్తగా హాజరైన ప్రొఫెసర్ మనోజ మాట్లాడుతూ.. మహిళల హక్కులు, రక్షణ చట్టాలు, హిందూ వివాహ వ్యవస్థపై అంబేడ్కర్ చేసిన కృషితోనే దేశంలో మహిళల పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. కుటుంబ వ్యవస్థలో సమానమైన ఆస్తి మహిళలకు లభించాలన్న హిందూ కోడ్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టగా, బిల్లు వీగిపోవడంతో నిరసనగా అంబేడ్కర్ తన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. పురుషులతో సమానంగా సీ్త్రలకు వేతనాలు చెల్లించే చట్టాలు, సీ్త్రలను గౌరవించి ప్రసూతి సెలవులను ఇప్పించే చట్టాలను చేయడంలో ఆయన కృషి ఎనలేనిదన్నారు. యువత పెడధోరణులు పడుతున్న నేపథ్యంలో వర్తమాన సమాజంలో సీ్త్రల హక్కులు, లింగ న్యాయం అనే అంశం చర్చించడం అత్యవసరమని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీ యాదగిరి రావు పేర్కొన్నారు. వర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచనలను అధ్యయనం చేయాలన్నారు. అనంతరం ప్రొఫెసర్ మనోజను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ మామిడాల, రిసోర్స్ పర్సన్ స్రవంతి, కామర్స్ డీన్ ప్రొఫెసర్ రాంబాబు, సీవోఈ ప్రొఫెసర్ సంపత్‌కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పాలమూరు వర్సిటీ ప్రొఫెసర్ మనోజ -
16 నుంచి ఎంఈడీ పరీక్షలు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఎంఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు ఈ నెల 16 నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్ ప్రొఫెసర్ కే సంపత్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ www. telangana university.ac.inను సందర్శించాలని ఆయన సూచించారు. 23 నుంచి ఇంటిగ్రేటెడ్ పీజీ పరీక్షలుతెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ (ఏపీఈ, ఐఎంబీఏ, ఐపీసీహెచ్) 6, 8, 10వ సెమిస్టర్ థియరీ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్ ప్రొఫెసర్ కే సంపత్‌కుమార్ తెలిపారు. కొనుగోలు కేంద్రాల తనిఖీ నవీపేట: మండలంలోని నవీపేట, నాగేపూర్, బినోల, నిజాంపూర్, నాళేశ్వర్ గ్రామాలలో సొసైటీలు, ఐకేపీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ కిరణ్‌కుమార్ శనివారం తనిఖీ చేశారు. హమాలీ, గన్నీ బ్యాగ్, లారీల కొరత తదితర సమస్యలను రైతులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వాతావరణం ప్రతికూలంగా ఉన్న నేపథ్యంలో తూకం చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్‌మిల్లులకు పంపాలని సూచించారు. డీసీవో శ్రీనివాస్‌రావు ఉన్నారు. మున్సిపల్ సిబ్బంది హక్కులను హరించొద్దునిజామాబాద్ సిటీ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో సెలవు రోజుల్లో కూడా సిబ్బందితో పనిచేయిస్తూ వారి హక్కులను హరిస్తున్నారని మానవ హక్కుల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మానవ హక్కుల నాయకుడు పులి జైపాల్ మాట్లాడుతూ బల్దియాలో పన్నుల వసూళ్ల పేరిట కార్మికులు, సిబ్బందిని సెలవు రోజుల్లో సైతం పనులు చేయాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారన్నారు. నెలంతా పనులు చేయించుకుంటూ కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్నారన్నారు. ఇకనైనా అధికారులు లేబర్ చట్టాలను గౌరవించాలన్నారు. సమావేశంలో నాయకులు జగన్, నీలగిరి రాజు, మల్లాని శివ తదితరులు పాల్గొన్నారు. -
జై శ్రీరాం.. వీర హనుమాన్
నిజామాబాద్ రూరల్: హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హిందూవాహిని, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో శనివారం నగరంలో హనుమాన్ విజయయాత్రను ఘనంగా నిర్వహించారు. నీలకంఠేశ్వర ఆలయం వద్ద శోభాయాత్ర రథానికి ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. కంఠేశ్వర్, సుభాష్‌నగర్, హమాల్‌వాడీ, దేవీరోడ్, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్ చౌరస్తా మీదుగా ఆర్ఆర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. విజయయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ధార్మిక పాటలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. జై శ్రీరాం.. వీర హనుమాన్ నినాదాలు మార్మోగాయి. హనుమా న్ శోభాయాత్రతో ఇందూరు వీధులన్నీ కాషాయమయం అయ్యాయి. హనుమాన్, శ్రీ రాముడు, పరమశివుడు, ఛత్రపతి శివాజీ మహరాజ్, దత్తాత్రేయ స్వామి, భరతమాత భారీ ప్రతిమలు శోభాయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రోటరీ క్లబ్ జేమ్స్ ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ నిర్వహించారు. ర్యాలీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నుడా చైర్మన్ కేశ వేణు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రత్నాకర్, విశ్వహిందూ పరిషత్ విభాగ్ కార్యదర్శి దయానంద్, జిల్లా సహాయ కార్యదర్శి దాత్రిక రమేశ్, బజరంగ్దళ్ జిల్లా అధ్యక్షుడు అరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.● ఏర్పాట్లను పరిశీలించిన సీపీ1500 మంది పోలీసులతో బందోబస్తుఖలీల్వాడి: నగరంలో శనివారం నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర ర్యాలీ ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ పీ సాయిచైతన్య పరిశీలించారు. సీపీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్లో ఏర్పాటు చేసిన 225 సీసీ కెమెరాల ఫుటేజీ విభాగాల ద్వారా హనుమాన్ శోభాయాత్రను వీక్షించారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 34 హనుమాన్ జయంతి ర్యాలీలు జరిగినట్లు చెప్పారు. శోభాయమానంగా విజయయాత్ర కాషాయమయమైన ఇందూరు వీధులు -
నంబర్ ప్లేట్ మార్చాల్సిందే!
● పాత వాహనాలకు హెచ్ఎస్ఆర్పీ ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం ● సెప్టెంబర్ 30 వరకు గడువుఖలీల్వాడి: ఓల్డ్ వెహికిల్ వాడుతున్నారా? ఆ వా హనం 2019 ఏప్రిల్ 1కి కంటే ముందు తయారైందా? అయితే.. దీనికి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లే ట్ (హెచ్ఎస్ఆర్పీ) పెట్టుకోవాల్సి వస్తుంది. బైక్‌ల నుంచి ఫోర్ వీల్స్ వరకు ఏదైనా తప్పనిసరిగా ఈ నంబర్ ప్లేట్‌ను పెట్టుకోవాలి. ఈమేరకు రాష్ట్ర రవాణాశాఖ ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే గడువును ఈ ఏడాది సెప్టెంబర్ 30న చి వరి తేదిగా నిర్ణయించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ దేశాల మేరకు రవాణాశాఖ ఈ ఉత్తర్వులు జారీ చే సింది. నకిలీ నంబర్ ప్లేట్లను, వాహనాల చోరీలను అరికట్టడంతోపాటు రహదారి భద్రత లక్ష్యంగా నెంబర్ ప్లేట్లను ఏర్పాటు చేయనున్నారు. లేకుంటే కేసులే.. పాత వాహనాలకు కొత్త నంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. లేకుంటే సదరు వాహనం అమ్మాలన్నా...కొనాలన్నా ఆర్టీఏ ఆఫీసులో పేరు మార్చుకోవడానికి వీలు ఉండదు. ఈ వాహనానికి ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ ఇవ్వరు. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేకుంటే కేసు నమోదు చేస్తారు. జిల్లాలో 10, 700లకు పైగా వాహనాలు జిల్లాలో 2019, ఏప్రిల్ 1కంటే ముందు 10,700 లకుపైగా వాహనాలు ఉన్నాయి. ఇందులో ద్విచక్రవాహనాలు, ఫోర్‌వీలర్స్, త్రీవీలర్స్, కమర్షియల్ వెహికిల్స్ ఉన్నాయి. ఈ వాహనాలన్నింటికీ హైసెక్యూరిటీ నంబర్ప్లేట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వివిధ రకాల వాహనాలకు ధరలు ఇలా.. ఆన్లైన్లో బుకింగ్.. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ కోసం www. siam.in వెబ్సైట్లో వెహికిల్ వివరాలు నమోదు చేసి బుక్ చేసుకోవాలి. కొత్త ప్లేట్ బిగించాక ఆ ఫొటోను వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటిని ఆర్టీఏ కార్యాలయంలో అందుబాటులో ఉంచి నంబర్ప్లేట్లను బిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై జిల్లా రవాణాశాఖ అధికారి ఉమమహేశ్వర్రావును వివరణ కోరగా రాష్ట్ర రవాణాశాఖ నుంచి ఎలాంటి ఉత్తర్వులు అందలేవన్నారు. ఉత్తర్వులు అందిన వెంటనే హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు బిగించేందుకు ప్రత్యేకంగా కౌంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. -
ఇంటి ఆవరణలో గంజాయి సాగు
పెద్దకొడప్గల్(జుక్కల్): గంజాయి మొక్కలు పెంచుతున్న వారి ఇళ్లపై ఎకై ్సజ్ పోలీసులు శనివారం దాడి చేసి ఒకరిని అరెస్టు చేశారు. ఎకై ్సజ్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కాటేపల్లి తండాలో ఇద్దరు వ్యక్తులు ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు సాగు చేస్తూ అమ్ముతున్నారనే విశ్వసనీయ సమాచారంతో సీఐ సత్యనారాయణ బృందంతో కలిసి తనిఖీ చేపట్టారు. భామన్ మధుసింగ్ ఇంటి ఆవరణలో 16 గంజాయి మొక్కలను కనుగొని వాటిని తొలగించి స్వాధీనం చేసుకోగా, నిందితుడు పరారయ్యాడు. మరో వ్యక్తి బర్ధవాల్ రాయిలా ఇంట్లో తనిఖీ చేయగా 200 గ్రాముల ఎండు గంజాయి లభించింది. ఇద్దరిపై కేసు నమోదు చేసి, బర్ధవాల్ రాయిలాను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. గంజాయి మొక్కలు పెంచినా, విక్రయించినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎకై ్సజ్ పోలీసుల దాడి ఒకరి అరెస్టు.. పరారీలో మరొకరు -
ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకుడి అరెస్ట్
ఖలీల్‌వాడి: నగరంలోని ఆరో టౌన్ పరిధి లతీఫ్ కాలనీకి చెందిన ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకుడు షేక్ ఆసిఫ్ అలీని పోలీసులు పట్టుకున్నారు. సీఐ సురేశ్‌కుమార్ శనివారం వివరాలు వెల్లడించారు. అర్సపల్లి బైపాస్ రోడ్డులోని ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద ఆసిఫ్ అలీని పట్టుకోగా, అప్పటికే నిందితుడు ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా, కొంత మంది యువకులకు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని ఆశ చూపి వారితో క్రికెట్ బెట్టింగ్ ఆడించేవాడినని ఒప్పుకున్నట్లు తెలిపారు. ఆసిఫ్ అలీపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. సీఐ వెంట ఎస్సై వెంకట్రావు, సిబ్బంది ఉన్నారు. కార్లను ఢీ కొట్టిన ఆటో డ్రైవర్భిక్కనూరు: మద్యం మత్తులో ఇంటి ముందు నిలిపిన కార్లను శనివారం ఓ ఆటో డ్రైవర్ ఢీ కొట్టినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. భిక్కనూరులో జరుగుతున్న పెద్దమ్మ ఉత్సవాలకు గ్రామానికి చెందిన పున్న లక్ష్మీనారాయణ బంధువులు వచ్చారు. వారికి చెందిన రెండు కార్లను ఇంటి ఎదుట నిలిపి ఉంచగా, మండల కేంద్రానికి చెందిన బాబు అనే ఆటో డ్రైవర్ మద్యం సేవించి అజాగ్రత్తగా ఆటో నడిపి కార్లను ఢీకొట్టాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. ఒకరిపై ఇసుక మాఫియా దాడిరెంజల్(బోధన్): మండలంలోని పేపర్‌మిల్ గ్రామంలో ఇసుక మా ఫియా ఓ వ్యక్తిని తీవ్రంగా చితకబాదింది. ఈ నెల 3న నిజామాబాద్ రూ రల్ పోలీసులు అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెంజల్ మండలానికి చెందిన మూడు టిప్పర్లను పట్టుకున్నారు. టిప్పర్లు పట్టుబడేందుకు గ్రామానికి చెందిన వ్యక్తి కారణమని అనుమానించిన మాఫియా శనివారం అతన్ని పట్టుకొని దాడిచేశారని గ్రామస్తుల ద్వారా తెలిసింది. కొందరు పోలీసులు ఉప్పందించడంతో దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ విషయమై ఎస్సై చంద్రమోహన్‌ను వివరణగా కోరగా పరస్పరం దాడి చేసుకొని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.ఈత వనం దగ్ధంమోర్తాడ్: ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్‌లో శనివారం ఈత వనం దగ్ధమైంది. గౌడ సంఘం ఆధ్వర్యంలో వారి సొంత భూమిలో ఈత చెట్లను పెంచుతున్నారు. కాపలా ఉన్న వ్యక్తి భోజనం చేసేందుకు ఇంటికి వెళ్లగా తిరిగి వచ్చేంతలోపే ఈత వనానికి నిప్పంటుకుంది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఈత వనంలో దాదాపు 100 చెట్లు కాలిపోయాయి. చెట్లు కాలిపోవడంతో తమ ఉపాధిపై దెబ్బ పడిందని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధి కమిటీతో వివాదం కొనసాగుతున్న ఈ తరుణంలో ఈతవనం దగ్ధంపై అనేక సందేహాలు నెలకొన్నాయి. గీత కార్మికుల ఫిర్యాదు మేరకు భీమ్‌గల్ సీఐ సత్యనారాయణ, ఏర్గట్ల ఎస్సై రాము, ఎకై ్సజ్ సీఐ గుండప్ప, ఎస్సై మానస ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
జక్రాన్‌పల్లి: జక్రాన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న రాంచందర్ (50) గుండెపోటుతో శనివారం మృతి చెందాడు. నిజామాబాద్‌లో నివాసం ఉంటున్న రాంచందర్ నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురికాగా చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. కాగా చికి త్స పొందుతున్న రాంచందర్‌కు శనివారం గుండెపోటు రావడంతో మరణించాడు. మూడేళ్లుగా జక్రాన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. రాంచందర్ స్వస్థలం కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మాపూర్ తండా. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. రాంచందర్ మృతి పట్ల జక్రాన్‌పల్లి ఎస్సై తిరుపతి, ఏఎస్సైలు వెంకట్‌కుమార్, సుశీల్‌కుమార్, సిబ్బంది వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. బాలికకు చిత్రహింసలు● తండ్రి, సవతి తల్లిపై కేసు నమోదు ఖలీల్‌వాడి: రెండో భార్యతో కలిసి కన్న కూతురిని చిత్రహింసలకు గురిచేసిన ఘటన నగరంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ కేసులో తండ్రితోపాటు సవతి తల్లిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గంగాధర్ శనివారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. నాగారం గోశాలకు చెందిన షేక్ హుస్సేన్ మొదటి భార్య అహ్మదీ బేగం నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. వీరికి ఒక కుమార్తె(13) ఉంది. రిజ్వానా బేగంను హుస్సేన్ రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. రెండో వివాహం అయినప్పటి నుంచి బాలికను బడి మాన్పించి, ఇంటి పనులు చేయిస్తూ నరకం చూపిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 5 గంటలకే నిద్రలేపి ఇంటి పని చేయించేవారు. పాచిపోయిన అన్నం పెడుతూ కొట్టేవారు. బంధువుల ఇంటికి కూడా వెళ్లనిచ్చేవారు కాదు. ఈ నెల 8న హుస్సేన్, రిజ్వానా బేగంలు బాలికను భైంసాలోని వరసకు అత్తమ్మ అయిన వజీర్‌బీ ఇంటి ఎదుట వదిలేసి వెళ్లిపోయారు. దీంతో వజీర్‌బీ ప్రస్తుతం ఆ బాలికను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. బాలిక మామ షేక్ హయాత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగాధర్ వెల్లడించారు. -
ప్రాణాలు తీసిన చేపల వేట
నందిపేట్(ఆర్మూర్): చేపల వేట సరదా ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ప్రమాదవశాత్తు బావాబామ్మర్దులు ఇద్దరు నీట మునిగి చనిపోయిన ఘటన నందిపేట మండలం సిద్దాపూర్లో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నిర్మల్ జిల్లాకు చెందిన షేక్ షాదుల్లా(46) తన కుటుంబంతో కలిసి 18 ఏళ్ల క్రితం ఆలూర్ మండలం మచ్చర్ల గ్రామానికి వచ్చి మేసీ్త్ర పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కడప జిల్లా పొద్దుటూర్‌కు చెందిన అతని బావమరిది మహమ్మద్ రఫీక్(47) రంజాన్ పండుగ సందర్భంగా వారం క్రితం మచ్చర్లకు వచ్చాడు. కాగా, శుక్రవారం సాయంత్రం సరదాగా చేపలు పట్టేందుకు ఇద్దరూ కలిసి నందిపేట మండలంలోని సిద్దాపూర్ గ్రామ శివారులోని చిన్నవాగు సంబంధించిన మునికుంటకు వెళ్లారు. చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు రఫీక్ కాలు జారి కుంటలో పడిపోయాడు. దీంతో అతనిని రక్షించేందుకు షాదుల్లా కుంటలోకి దిగాడు. ఇద్దరికీ ఈత రాకపోవడం, మునికుంటలో లోతు ఎక్కువగా ఉండడంతో నీట మునిగి మృతి చెందారు. మృతుడు షేక్ షాదుల్లా కొడుకు షేక్ సులేమాన్ శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. ప్రమాదవశాత్తు కుంటలో పడి ఇద్దరి దుర్మరణం మృతులిద్దరూ బావాబామ్మర్దులు -
హార్వెస్టర్ ఢీకొని ఒకరి మృతి
డిచ్పల్లి: డిచ్పల్లి మండలం ఘన్పూర్ గ్రామంలో శనివారం హార్వెస్టర్ ఢీకొని అరిగెల గంగాధర్ (59) మృతి చెందినట్లు ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని అరిగెల గంగాధర్ రాజారాం నగర్‌కు చెందిన సోనారి గోవింద్‌తో కలిసి బైక్‌పై గ్రామంలోని హనుమాన్ ఆలయానికి వెళుతున్నారు. మార్గమధ్యలో వీరి ముందు వెళుతున్న హార్వెస్టర్‌ను డ్రైవర్ సింహాద్రి నిర్లక్ష్యంగా వెనక్కి తీయడంతో బైక్‌ను ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న గోవింద్ పక్కకు దూకగా, వెనుక కూర్చున్న గంగాధర్ హార్వెస్టర్ కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో డిచ్పల్లి 30 పడకల ఆస్పత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు గంగాధర్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య బాలమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
తప్పని ఎదురుచూపులు
ఆలస్యంపై ఆందోళన ప్రభుత్వం పరిధిలో పని చేయాలని ఆశించిన వారు మెరిట్ జాబితా రూపకల్పన జాప్యం కా వడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. ఏడాది గడిచినా స్టాఫ్‌నర్స్, ఏఎన్ ఎం పోస్టుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్‌లో కన్నా ప్రభుత్వ శాఖలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అయినా ఉద్యోగానికి కొంత భరోసా ఉంటుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. నిజామాబాద్‌నాగారం: వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్టాఫ్‌నర్స్, ఏఎన్ఎం పోస్టుల భర్తీ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది. 30 స్టాఫ్‌నర్స్, మూడు ఏఎన్ఎం పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు గతేడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ అయ్యింది. స్టాఫ్‌నర్స్ పోస్టులకు 876 మంది. ఏఎన్ఎం పోస్టులకు 328 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారందరూ 14 నెలలుగా వైద్యారోగ్యశాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అప్పటి డీఎంహెచ్‌వో సుదర్శనం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పేరుతో కాలయాపన చేశారని, మెరిట్ జాబితాను రూపొందించలేదనే ఆరోపణలున్నాయి. ఆ తరువాత సుదర్శనం రిటైర్ కావడం, పార్లమెంట్ ఎన్నికల కోడ్, మూడు నెలలపాటు ఇన్చార్జి డీఎంహెచ్‌వో కొనసాగడం తదితర కారణాలతో పోస్టుల భర్తీ ప్రక్రియలో జాప్యం నెలకొంది. 2024 ఆగస్టులో డీఎంహెచ్‌వోగా రాజశ్రీ బాధ్యతలు చేపట్టినప్పటికీ.. ఉద్యోగుల బదిలీలు, పట్టభద్రుల ఎన్నికల కోడ్ కారణంగా పోస్టుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగలేదు. మాకు అవకాశం ఇవ్వండి.. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో సేవలందించిన తమకు అవకాశం కల్పించాలని తొమ్మిది మంది స్టాఫ్ నర్సులు కోరుతున్నారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులను కలిసి విన్నవించగా వారు ఓకే చెప్పారు. ఆ తరువాత జి ల్లా కలెక్టర్‌తోపాటు డీఎంహెచ్‌వోను సైతం నర్సు లు కలిసి విన్నవించారు. ఐదేళ్లపాటు జీజీహెచ్‌లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించామని, కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పని చేసినందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూనే ఉన్నారు. కరోనా సమయంలో విధులు నిర్వర్తించిన వారికి వేరే జిల్లాల్లో అవకాశం ఇచ్చారని, ఇక్కడ కూడా ఇవ్వాలని అంటున్నారు. ముందుకు సాగని కాంట్రాక్ట్ స్టాఫ్‌నర్స్, ఏఎన్ఎం పోస్టుల భర్తీ మరింత ఆలస్యమవుతున్న నియామకాల ప్రక్రియ కరోనా కాలంలో సేవలందించిన వారికి అవకాశం ఇవ్వాలని వినతి అనుమతి రాగానే భర్తీ చేస్తాం మెరిట్ జాబితా సిద్ధం చేశాం. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతా ఏడాది గడిస్తే ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే అనుమతి కోసం లేఖ రాయడం జరిగింది. కరోనా సమయంలో విధులు నిర్వర్తించిన వారి విషయాన్ని కూడా ఉన్నతాధికారులకు విన్నవించాం. అనుమతి రాగానే వెంటనే భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తాం. – బద్దం రాజశ్రీ, డీఎంహెచ్‌వో -
ఆదాయంపైనే దృష్టి!
● ఎల్ఆర్ఎస్ ఫీజు జమ చేయించుకుంటున్న ప్రభుత్వం ●● జిల్లాలో ఇప్పటికే ఎల్ఆర్ఎస్ ఆదాయం రూ.46.23 కోట్లు జమ మోర్తాడ్(బాల్కొండ): లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీం అమలు చేస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం మూడు దశల్లో దరఖాస్తులను పరిశీలించిన తరువాత ఎల్ఆర్ఎస్ ఫీజును వసూలు చేయాలి. అయితే ఆదాయం దండిగా ఉండడంతో అసలు విషయాన్ని మరిచి ఫీజు వసూలుపైనే దృష్టి సారించిన ప్రభుత్వం ఇప్పుడిప్పుడే దరఖాస్తుల పరిశీలనను పూర్తి చేయిస్తుండటం గమనార్హం. ఈనెల 30వ తేదీ వరకూ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఫీజులో 25 శాతం రాయి తీ ని పొందే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలో 15,212 దరఖాస్తుల ద్వారా రూ.46.23 కోట్ల ఆ దాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది. జిల్లాలో ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తుల సంఖ్య 20వేలకు మించి ఉంటుందని అంచనా. ఇప్పుడిప్పుడే మొదలవుతున్న పరిశీలన మార్చి 31 వరకు ఫీజులో 25 శాతం రాయితీని పొంది ప్రభుత్వ ఖజానాకు సొమ్ము జమ చేసిన వారి దరఖాస్తుల పరిశీలన క్షేత్ర స్థాయిలో మొదలైంది. మొదటి దశలో గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఉద్యోగులు దరఖాస్తులను పరిశీలించి ఇంటి స్థలం ఫొటోను తీసుకుని రెండో దశ పరిశీలన కో సం రెవెన్యూ అధికారులకు పంపిస్తున్నారు. రెండో దశలో రెవెన్యూ ఇన్స్పెక్టర్, నీటిపారుదల శాఖ ఏఈలు పరిశీలించి నివేదికను అందించాల్సి ఉంది. ఈ రెండు దశలు పూర్తయిన తరువాత జిల్లా స్థా యిలో పరిశీలన చేపట్టి ప్రొసిడింగ్‌ను జారీ చేయనున్నారు. రెండు దశల్లో పరిశీలన, మూడో దశలో ప్రొ సిడింగ్ను జారీ చేసిన తరువాతనే ఫీజును దర ఖాస్తుదారులు ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉండ గా, ప్రభుత్వం మూడు దశల పరిశీలనను పక్కన పెట్టి ఫీజు జమ చేయించుకోవడం గమనార్హం. మొదటి దశ సర్వే పూర్తి చేస్తున్నాం ఫీజు చెల్లించిన వారికి సంబంధించి మొదటి దశ పరిశీలన పూర్తి చేస్తున్నాం. రెండో దశలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పరిశీలన చేసి క్లీన్‌చీట్ ఇ వ్వాల్సి ఉంది. మూడో దశలో మరోసారి దరఖాస్తులను పరిశీలించి ప్రొసిడింగ్ కాపీలను అందించనున్నారు. మరోసారి రాయితీ అవకాశం కల్పించినందున ఫీజు చెల్లించని వారు సద్వినియోగం చేసుకోవాలి. – శ్రీధర్, ఎంపీవో, మోర్తాడ్తిరస్కరిస్తే 10 శాతం నష్టం ఎల్ఆర్ఎస్ ఫీజు ముందస్తుగా చెల్లించగా, ఏ ఒక్క దశలో దరఖాస్తు తిరస్కరించినా ఫీజులో 10 శాతం మినహాయించుకొని మిగతా మొ త్తాన్ని ప్రభుత్వం రిఫండ్ చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ముందుగానే దరఖాస్తులను పరిశీలించి ఆ తరువాత ఫీజు వసూలు చేస్తే దర ఖాస్తుదారులకు ఎలాంటి నష్టం ఉండేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
హిందువుగా పుట్టడం అదృష్టం
సుభాష్‌నగర్: హిందువుగా పుట్టడం అదృష్టంగా భావించాలని, ఇందూరు గడ్డపై హిందుత్వం ఎంత బలంగా ఉందో విజయయాత్రతో మరోసారి నిరూపితమైందని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. నగరంలోని ఆర్ఆర్ చౌరస్తాలో శనివారం రాత్రి నిర్వహించిన ముగింపు సభకు ముఖ్యఅతిథిగా అర్వింద్ హాజరై మాట్లాడారు. హిందూ ధర్మానికి రక్షణ కవచంగా ఆంజనేయస్వామిని భావిస్తామన్నారు. సనాతన ధర్మం గొప్పదని, హిందువులందరం ధర్మం, దేశాన్ని కాపాడుకోవడానికి ఒక్కటిగా నిలబడాలని పిలుపునిచ్చారు. శంభుని గుడి కబ్జాలను తొలగిస్తాం నగరంలోని శంభునిగుడి వద్ద కబ్జాలను తొలగించి తీరుతామని, అందుకు హిందూ బంధువులందరి సహకారం కా వాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అ న్నారు. ఎక్కడైనా దేవాలయాలకు నష్టం కలిగిస్తే హిందువులంతా సంఘటితమై అక్కడికి చేరుకోవాలని, ఇందూరులోని శంభుని గుడి, ఖిల్లా రామాలయం అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. యాత్రలో పాల్గొని వి జయవంతం చేసిన ప్రతి హిందువుకు ధన్యవాదాలు తె లుపుతున్నామన్నారు. హిందూ సంఘాల ప్రతినిధు లు కాపర్తి గురుచరణం, గుమ్మళ్ల సత్యం, తమ్మల కృష్ణ, కిర ణ్ తోటావార్, రెంజర్ల నరేశ్, బ్రహ్మానంద సర స్వతి, ఇ ప్పకాయల హరిదాసు, దినేశ్ ఠాకూర్, కమ్మరి లక్ష్మణ్, ధాత్రిక రమేశ్, నాగోళ్ల లక్ష్మీనారాయణ, వీహెచ్ పీ, బజ రంగ్దళ్, హిందూవాహిని ప్రతినిధులు పాల్గొన్నారు.ముగింపు సభకు హాజరైన ప్రజలు -
డిగ్రీ ప్రాక్టికల్స్ బహిష్కరిస్తాం
● ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 16 నుంచి నిర్వహించే డిగ్రీ ప్రాక్టికల్స్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల సంఘం ప్రతినిధులు శనివారం ఒక ప్రకటనలో తెలి పారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల విషయమై ప్రభుత్వానికి విన్నవించినా ప ట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రభు త్వం చేస్తున్న జాప్యంతో ప్రైవేట్ కళాశాలల భవనాల అద్దెలు చెల్లించలేక, లెక్చరర్ల జీ తభత్యాలు ఇవ్వలేక యాజమాన్యాల బతుకులు అగమ్యగోచరంగా మారాయన్నా రు. ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ డిగ్రీ ప్రాక్టికల్స్ బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు తెయూ రిజిస్ట్రార్, పరీక్షల నియంత్రణాధికారికి లేఖ అందజేసినట్లు పేర్కొన్నారు. పసుపు రైతుల స్టాల్‌ను సందర్శించిన మంత్రి సుభాష్‌నగర్: హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించిన రైతు మహోత్సవ మేళాలో జిల్లా తరఫున జేఎంకేపీఎం పసుపు రైతుల ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సందర్శించారు. విలువ ఆధారిత పసుపు ఉత్పత్తులను చూసి రైతులను అభినందించారు. ఈ నెలలోనే నిజామాబాద్‌లో కూడా రైతు మహోత్సవ మేళాను ఏ ర్పాటు చేయాలని అధికారులకు మంత్రి సూ చించారు. ఈ సందర్భంగా రైతులు పండించిన పసుపును జేఎంకేపీఎం అధ్యక్షుడు పా ట్కూరి తిరుపతిరెడ్డి మంత్రికి అందజేశారు. కార్యక్రమంలో వారాహమూఖి ఎఫ్‌పీవో ఫెడరేషన్ తెలంగాణ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, ఫెడరేషన్ కార్యదర్శి ఏవీ రావు, జేఎంకేపీఎం సూపర్వైజర్ కంఠం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. నందిపేట పోలీస్ స్టేషన్ తనిఖీ నందిపేట్ (ఆర్మూర్): పోలీస్ కమిషనర్ సాయిచైతన్య నందిపేట పోలీస్ స్టేషన్‌ను శనివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్సై చిరంజీవితో మాట్లాడి నందిపేట, డొంకేశ్వర్ మండలాలకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. రెండు మండలాల ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, కమ్యూనల్ షీట్స్‌పై నిఘా ఉంచాలని సూ చించారు. దొంగతనాల నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి ప్రశ్నించారు. -
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
పెర్కిట్(ఆర్మూర్): అనేక సంవత్సరాలుగా గల్ఫ్ కార్మికులు ఎదురు చూస్తున్న ఎన్ఆర్ఐ పాలసీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సలహా కమిటీ ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ప్రవాస భారతీయుల హక్కులు, సంక్షేమ వేదిక వ్యవస్థాపకుడు కోటపాటి నర్సింహ నాయుడు అన్నారు. మామిడిపల్లిలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ప్రభుత్వం నియమించిన సలహా కమిటీలో గల్ఫ్ కార్మికుల కష్టాలు తెలిసిన నిపుణులను చేర్చుకుంటే బాగుండేదన్నారు. అలాగే గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. న్యాయ సలహాదారుడు బాలయ్య పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా ఆస్పత్రులకు రూ.85కోట్ల నిధులునిజామాబాద్ నాగారం: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.85కోట్ల నిధులు మంజూరు అయినట్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని సెక్రటేరియట్లో శుక్రవారం రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ హాజరయ్యారు. ఈసందర్భంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల సమస్యలు, అభివృద్ధి కోసం మంత్రిని షబ్బీర్ అలీ విన్నవించి, నిధులు మంజూరు చేసేలా కృషి చేశారు. జిల్లాలో ఆస్పత్రి మౌలిక సదుపాయాలు, సిబ్బంది ఇతర నిత్యావసర అవసరాల కోసం మొత్తం రూ.63 కోట్లు మంజూరు చేశారు. సివిల్ పనులు, పరికరాల కోసం రూ. 22 కోట్లు మంజూరు చేశారు. కొత్తగా మంజూరైన అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసేందుకు ఆరోగ్య మంత్రి త్వరలో జిల్లాను సందర్శిస్తారని షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా వైద్యశాఖ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వచనాలయ అభివృద్ధికి సహకరించాలి నిజామాబాద్ అర్బన్: నగరంలోని బాపూజీ వచనాలయం అభివృద్ధికి సహకరించాలని వచనాలయం కమిటీ ప్రతినిధులు కోరారు. బాపూజీ వచనాలయం కమిటీలో నూతనంగా సలహాదారులు, కోఆప్షన్ సభ్యుల నియామకం చేపట్టగా శుక్రవారం వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కమిటీ అధ్యక్షుడు భక్తవత్సలం మాట్లాడుతూ.. బాపూజీ వచనాలయాన్ని డిజిటల్ మాధ్యమంలోకి తీసుకెళ్లే ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. ఇకపై పుస్తకాలతో పాటు డిజిటల్ చదువుకు కూడా ఇది అనుకూలంగా ఉంటుందన్నారు. ఇందుకోసం సభ్యులు, సలహాదారులు, కోప్షన్ సభ్యులు ఆలోచనలు, సూచనలు అందించాలని కోరారు. అనంతరం నూతన సలహాదారులు తాహెర్ బిన్ హందన్, గడుగు గంగాధర్, కేశవేణు, శేఖర్ గౌడ్, దినేష్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, ధర్మపురి సురేందర్, కోప్షన్ సభ్యులుగా బంటు రాజేశ్వర్, మాస్టర్ శంకర్, శ్రీహరి ఆచార్య, మెగా సుబేధర్, సాయిబాబా గౌడ్‌ను సన్మానించారు. ప్రధాన కార్యదర్శి మీసాల సుధాకర్, కోశాధికారి గంగాధర్‌రావు, ఉపాధ్యక్షుడు దాస్, సంయుక్త కార్యదర్శి సాంబయ్య, దత్తాత్రి, సభ్యులు పాల్గొన్నారు. -
ముందస్తుగానే లారీలు
● ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచుతున్న పౌర సరఫరాల శాఖ ● ధాన్యం బస్తాలను ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించడానికి ముమ్మర ఏర్పాట్లుమోర్తాడ్: కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యంను మిల్లులకు తరలించడానికి అధికారులు ముందస్తుగానే లారీలను అందుబాటులో ఉంచుతున్నారు. గతంలో ధాన్యం తూకం వేసిన తర్వాత లారీలు రావాలంటే నాలుగైదు రోజుల సమయం పట్టేది. దీనివల్ల ధాన్యం మిల్లులకు సకాలంలో చేరకపోవడం, తూకం వేసిన ధాన్యం ఎండలో ఎండటం, లేదా అకాల వర్షాల వల్ల తడిసి ముద్దయ్యేది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ధాన్యంను తూకం వేసిన వెంటనే తరలించడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేయడం విశేషం. పౌర సరఫరాల శాఖ లారీల టెండర్లను పూర్తి చేయడంతోపాటు కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసే ధాన్యం లెక్కలను పరిగణలోకి తీసుకుని లారీలను అందుబాటులో ఉంచుతున్నారు. మోర్తాడ్ పరిధిలో ఇప్పటికే 25 లారీల ధాన్యంను మిల్లులకు తరలించారు. ఆరు ఖాళీ లారీలను కొనుగోలు కేంద్రాల వద్ద నిలిపి ఉంచారు. మిల్లులోనూ అన్లోడింగ్ వేగంగా సాగంతో వాహనాలను వెంటవెంటనే కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. మోర్తా డ్, వడ్యాట్, దోన్పాల్, పాలెం, తిమ్మాపూర్ సహా పలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం ఎప్పటికప్పుడు తరలిస్తుండటంతో రైతులకు ఊరట లభిస్తుంది. -
ఉత్కంఠగా సాగిన బార్ అసొసియేషన్ ఎన్నికలు
ఖలీల్‌వాడి: నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం ఉత్కంఠ భరితంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో 392 ఓట్లలో 322 ఓట్లు పోలయ్యాయి. ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన దిలీప్, రెంజర్ల సురేష్‌లకు సమానంగా 157 ఓట్లు వచ్చాయి. ఇద్దరిని ఉపాధ్యక్షులుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ప్రధాన కార్యదర్శిగా బట్టు మాణిక్ రాజు, సంయుక్త కార్యదర్శిగా ఝాన్సీరాణి గెలుపొందారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ పూర్తిస్థాయిలో ఆఫీస్ బేరర్స్, కార్యవర్గం ఏర్పడినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అధ్యక్షుడిగా మామిల్ల సాయరెడ్డి ఎన్నికయ్యారని వివరించారు. కోశాధికారిగా నారాయణ దాసు, సాంస్కృతిక, క్రీడా కార్యదర్శిగా మంజిత్ సింగ్, లైబ్రరీ కార్యదర్శిగా శ్రీమాన్, మహిళ ప్రతినిధిగా రమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. కార్యవర్గ సభ్యులుగా మద్దెపల్లి శంకర్, భిక్షపతి, ఆయూబ్, మోబిన్, అరేటి నారాయణ, సయ్యద్ ఇంతియాజ్, సుజిథ్ కుమార్, ప్రవీణ, వెంకటేష్, అఖిల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. నూతన బార్ కార్యవర్గానికి న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు. సెలవు రోజుల్లోనూ దరఖాస్తుల స్వీకరణ నిజామాబాద్ సిటీ: రాజీవ్ యువ వికాసం పథకం కోసం దరఖాస్తుల సమర్పణకు ఇంకా మూడు రోజుల గడువే ఉంది. అయితే ఈనెల 12, 13, 14 రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు రోజులు. అయినప్పటికీ సెలవు రోజుల్లోనూ బల్దియా కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీపీఆర్వో చిదుర రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి, దరఖాస్తులు కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. దరఖాస్తుల కోసం బల్దియా కార్యాలయంతోపాటు నగరంలోని 5 జోన్ కార్యాలయాల్లో కూడా దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. -
కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయాలి
నిజామాబాద్ రూరల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ఇంటింటా ప్రచారం చేయాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి పేర్కొన్నారు. రూరల్ మండలంలోని మాధవనగర్ గ్రామంలో ‘గావ్ చలో– బస్తీ చలో’ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రీయ విద్యాలయాలతోపాటు ఏడు నవోదయ పాఠశాలలు మంజూరు చేయించామని, అందులో రెండు నవోదయ పాఠశాలలు జిల్లాకు కేటాయించినట్లు తెలిపారు. పార్టీలకతీతంగా నవోదయ పాఠశాలల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, సీ్ట్రట్ లైట్లు, రేషన్ బియ్యం పంపిణీ తదితర వాటిలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, నాయకులు పద్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలకు బీజేపీ నాయకులు వివరించాలి ఎంపీ అర్వింద్ ధర్మపురి -
సాఫీగా ధాన్యం తరలింపు
గతంలో ధాన్యం తూకం వేసిన తర్వాత కొనుగోలు కేంద్రాల వద్దనే నాలుగైదు రోజుల పాటు నిలువలు ఉండేవి. ఇప్పుడు పౌర సరఫరాల శాఖ తీసుకున్న చర్యలతో లారీలు అందుబాటులో ఉంటున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం తరలింపు సాఫీగా సాగుతుంది. – కుంట రవిశంకర్ రెడ్డి, రైతు, పాలెం రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం... ధాన్యం తరలించే విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ధాన్యంను కొనుగోలు కేంద్రాల వద్ద అలాగే ఉంచితే అకాల వర్షాల వల్ల తడిసిపోయే అవకాశం ఉంది. నష్టం జరిగితే అందరికి ఇబ్బంది. ఇంతకుముందు లారీలు రావాలంటే నిరీక్షించాల్సి వచ్చేది. ఇప్పుడు లారీలను ముందస్తుగానే అందుబాటులో ఉంచుతున్నాం. – బూత్‌పురం మహిపాల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్, మోర్తాడ్ -
పూలే జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలి
తెయూ(డిచ్పల్లి): నేటి యువత మహాత్మా జ్యోతి బాపూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజంలోని దురాచారాలను రూపుమాపడానికి కృషి చేయాలని హైకోర్టు రిటైర్డ్ జడ్జి మాంధాత సీతారామమూర్తి పిలుపునిచ్చారు. తెలంగాణ యూనివర్సిటీలో శుక్రవారం జ్యోతి బాపూలే జయంతి సందర్భంగా తెయూ బీసీ సెల్ డైరెక్టర్ సీహెచ్ ఆరతి అధ్యక్షతన ‘భారతదేశ సామాజిక సమ్మిళిత అభివృద్ధిలో పూలే పాత్ర’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పూలే 1873లో సత్యశోధక్ సమాజ్ స్థాపించి సమానత్వ సమాజం కోసం పోరాడారన్నారు. తెయూ రిజిస్ట్రార్ యాదగిరి మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు చరిత్రను చదవడం కాదు.. చరిత్రను సృష్టించాలన్నారు. రిసోర్స్ పర్సన్ సీహెచ్ ఆంజనేయులు మాట్లాడుతూ.. భారతదేశంలో మహిళల విద్యకు అడ్డంకులను తొలగించడానికి పోరాడిన మహనీయుడన్నారు. పీఆర్వో పున్నయ్య, ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్, అధ్యాపకులు స్వప్న, నీలిమ ప్రసంగించారు. అనంతరం సీతారామమూర్తిని, రిజిస్ట్రార్ యాదగిరి, సదస్సు నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో వివిధ విభాగాల అధ్యాపకులు, సిబ్బంది, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
అడుగులన్నీ కొండగట్టు వైపే..
మహిమాన్విత పుణ్యక్షేత్రం..ఆర్మూర్: హనుమాన్ మాలధారులు, భక్తుల అడుగులన్నీ కొండగట్టు వైపే వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో భక్తులు ఇటీవల పాదయాత్రగా వెళ్లగా ఈ నెల 12న హనుమాన్ జయంతి పురస్కరించుకొని స్వామివారి దర్శనం చేసుకోనున్నట్లు వారు తెలిపారు. జై శ్రీరాం.. జై హనుమాన్ అంటూ గుంపులుగా పాదయాత్రగా వెళ్లడం ద్వారా అంజన్న కరుణ తమపై ఉంటుందన్నది భక్తుల నమ్మకం. జిల్లా కేంద్రం నుంచి 113కి.మీ. జిల్లా కేంద్రం నుంచి కొండగట్టు 113 కిలో మీటర్ల దూరం రాగా.. ఆర్మూర్ పట్టణం పెర్కిట్ నుంచి 85 కిలో మీటర్ల దూరంలో ఉంది. జిల్లాలోని నలుమూలల నుంచి హనుమాన్ మాలధారణ చేసిన భక్తులతో పాటు మాలధారణ చేయని భక్తులు సైతం తమ మొక్కలు తీర్చుకోవడానికి కొండగట్టుకు పాదయాత్రగా వెళ్లడం ప్రారంభించారు. అలాగే దీక్ష విరమణ కోసం ఎక్కువగా కొండగట్టుకు వెళ్తుంటారు. జిల్లా నుంచి భక్తుల పాదయాత్ర సుమారు మూడు నుంచి నాలుగు రోజుల వరకు సాగనుంది. పాదయాత్ర విడతల వారిగా చేపడతారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు పాదయాత్ర నిర్వహిస్తారు. విశ్రాంతి తర్వాత వేకువజామున ప్రారంభించి ఉదయం 10గం.వరకు చేపడతారు. అనంతరం సాయంత్రం వరకు విశ్రాంతి తీసుకుంటారు. పాదయాత్రలో భక్తులు కొందరు ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. మరికొందరు పండ్లు, పాలు మాత్రమే తీసుకుంటారు. మండుటెండలో వేసవి తాపాన్ని భరిస్తూ 63వ నెంబర్ జాతీయ రహదారి పొడవునా భక్తులు పాదయాత్రను కొనసాగిస్తున్నారు. 2017 నుంచి.. ఆర్మూర్ పట్టణం పెర్కిట్ శివారులోని హనుమాన్ మందిరం నుంచి హనుమాన్ భక్తులు 2017 నుంచి పాదయాత్రగా కొండగట్టుకు వెళ్లడం ప్రారంభించారు. కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలు వీరికి అనుమతి లభించకపోవడంతో ఈ పర్యాయం ఏడోసారి కాలినడకన కొండగట్టు అంజన్నను చేరడానికి పాదయాత్రగా బయల్దేరారు. బుధవారం వారు పాదయాత్ర చేపట్టగా నేడు కొండగట్టు చేరుకోనున్నారు. మాల ధారణ చేయకుండా మండల దీక్ష, అర్ధ మండల దీక్ష, 11 రోజుల దీక్షను నిష్టతో పూర్తి చేసుకొని సుమారు 20 మందితో కూడిన భక్త బృందం ప్రతీ ఏటా పాదయాత్రగా వెళ్లి అంజన్న దర్శనం చేసుకుంటున్నారు.జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి దగ్గరలో కొండగట్టు పుణ్యక్షేత్రం ఉంది. వందల ఏళ్ల నుంచి ఇక్కడ హనుమంతుడిని కొలుస్తుంటారు. ఇక్కడ స్వయంభువుగా హనుమంతుడు వెలిశాడని చెబుతుంటారు. అంజనీపుత్రుడు సంజీవని పర్వతం చేతుల్లో పట్టుకుని గాల్లో వస్తుంటే. ముత్యంపేట దగ్గరలో ఓ ముక్క పడిందని ఇక్కడ ఓ కథ ప్రసిద్ధి. ఆ భాగాన్నే కొండగట్టుగా పర్వత భాగంగా చెబుతుంటారు. ఇక్కడి కొండల్లో ఎన్నో ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. కోతుల దండు కూడా ఎక్కువగానే ఉంటుంది. జిల్లావ్యాప్తంగా పాదయాత్రగా వెళుతున్న హనుమాన్ భక్తులు హనుమాన్ జయంతి రోజున అంజన్న దర్శనం కోసమే.. -
శోభాయాత్రకు సర్వం సిద్ధం
ఖలీల్‌వాడి: హనుమాన్ జయంతి వేడుకలకు సర్వం సిద్ధమయ్యింది. ఏటా నిర్వహించే భారీ శోభాయాత్రకు ఇందూరు నగరం ముస్తాబైంది. బజరంగ్దళ్, హిందూవాహిని ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 10 గంటలకు కంఠేశ్వర్ నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర రాత్రి 10 గంటలకు ఆర్ఆర్ చౌరస్తాకు చేరుకుంటుంది. రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన హనుమాన్ శోభాయాత్రకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ర్యాలీకి ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా దారిమళ్లింపు చేపట్టారు. శోభాయాత్రకు 15 ఏళ్లు.. నగరంలో హనుమాన్ జయంతి శోభాయాత్రను 2009లో ప్రారంభించారు. మొదట 25 మంది మాత్రమే ర్యాలీలో పాల్గొనగా, ఏటా పెరుగుతూ వస్తోంది. గతేడాది 1.50 లక్షల మంది భక్తులు హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈసారి 2 లక్షలకు పైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సంస్థలు అంచనా వేస్తున్నాయి. 1300 మంది పోలీసులతో బందోబస్తు నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో శనివారం నిర్వహించే హనుమాన్ జయంతి, శోభాయాత్ర, అన్నదాన కార్యక్రమాలు శాంతియుతంగా నిర్వహించా లని సీపీ సాయి చైతన్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 1300 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నగరంలో జరిగే హనుమాన్ శోభాయాత్రను సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, బైనాక్యులర్లతో పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. పుకార్లను నమ్మొద్దని పోలీసులకు సహకరించాలని పేర్కొన్నారు. నేడు ఇందూరులో హనుమాన్ జయంతి ర్యాలీ రెండు లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం పోలీసుల భారీ బందోబస్తు -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
● ఏడుగురు సభ్యుల మహారాష్ట్రకు చెందిన పార్థి గ్యాంగ్ ● జాతీయ రహదారిపై దారిదోపిడీలు ● వివరాలు వెల్లడించిన కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర కామాడ్డి క్రైం: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని జాతీయ రహదారి 44 వెంబడి ఆగి ఉన్న వాహనాలను టార్గెట్ చేస్తూ దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా (పార్థి గ్యాంగ్)ను కా మారెడ్డి పోలీసులు పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలు వెల్లడించారు. నెల రోజుల వ్యవధిలో కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్, దేవునిపల్లి పీఎస్‌ల పరిధిలో రెండు దారి దోపిడీ ఘటనలు వెలుగు చూ శాయి. వాటిలో ఒకటి ఈ నెల 2 న టేక్రియాల్ వద్ద జరిగింది. ఆదిలాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి తన కుమారుడిని హైదరాబాద్‌లోని హాస్టల్ నుంచి కారు లో ఇంటికి తీసుకుని వస్తూ తెల్లవారు జామున టేక్రి యాల్ సమీపంలోని దాబా వద్ద రోడ్డు పక్కన కారు నిలిపి విశ్రాంతి తీసుకుంటున్నారు. గమనించిన దుండగులు కారు అద్దాలు పగులగొట్టి కత్తులతో బెదిరించి ల్యాప్‌టాప్, మరో బ్యాగును ఎత్తుకెళ్లా రు. కేసు నమోదు చేసి విచారణ జరుపగా ఇలాంటి ఘటనలు ఎన్‌హెచ్–44 వెంబడి తరచుగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను ప ట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ ముమ్మరం చేసినట్లు ఎస్పీ తెలిపారు. పంక్చర్ షాప్ యజమాని ఇచ్చిన క్లూతో.. మహారాష్ట్ర లోని వార్దా జిల్లాకు చెందిన కులీ కిషన్ పవార్, జాకీ గుజ్జు భోంస్లే, పవార్ హరీష్, అతని భార్య హౌరా పవార్, అనురాగ్ రత్నప్ప భోంస్లే, అతని భార్య అంచనా భోంస్లే, చూడీ లను ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. చిరంజీవి, గుండా, సాంబ భోంస్లే, బంగారు భోంస్లేలు పరారీలో ఉన్నారు. వీరంతా వార్దా జిల్లాలోని ఓలాంనగర్, సముద్రాపూర్, శివగ్రాం గ్రామాలకు చెందిన వారు. వారంతా ముఠాగా ఏర్పడి దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. పంక్చర్ షాప్ యజమాని ఇచ్చిన క్లూతో నిందితులను గుర్తించడం సాధ్యమయిందని ఎస్పీ తెలిపారు. టేక్రియాల్ వద్ద దుకాణం నడుపుతున్న షకీల్ పోలీసులకు యేడాది క్రితం జరిగిన ఓ దారి దోపిడీ ఘటనను వివరించి బాధితుడి అడ్రస్ ఇచ్చాడు. అతని ద్వారా నిందితుల ఆనవాళ్లు తెలుసుకున్నామని తెలిపారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన ఏఎస్పీ చైతన్య రెడ్డి, సీఐలు శ్రీనివాస్, రామన్, సంతోష్ కుమార్, ఎస్సైలు రాజు, రంజిత్, ఉస్మాన్, సిబ్బంది రవి కిరణ్, రవి లను ఎస్పీ అభినందించారు. -
జిల్లా ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేదు..
ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు విషయమై జిల్లా ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేదు. చిన్నచిన్న జిల్లాలకు ఇంజినీరింగ్ కళాశాలలు మంజూరయ్యాయి. వసతి, సౌకర్యాలపరంగా అన్ని విధాలా అనుకూలంగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఇంజినీరింగ్ కాలేజీ లేకపోవడం దురదృష్టకరం. ఇంజినీరింగ్ కాలేజ్ ఏర్పాటుపై అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఒక్కరే మాట్లాడారు. ఉమ్మడి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ మాట్లాడిన పాపాన పోలేదు. ఇంజినీరింగ్ కాలేజీ విషయంలో ఐక్యంగా పోరాడాలి. – పిల్లి శ్రీకాంత్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు -
కలిసికట్టుగా పోరాటం
● విద్యార్థి సంఘాలు, పూర్వ విద్యార్థుల డిమాండ్ ● త్వరలో కార్యాచరణ ● ‘సాక్షి’ చర్చాగోష్టిలో ముక్తకంఠంతో వెల్లడి తెయూలో ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయాల్సిందే తెయూ(డిచ్పల్లి)/నిజామాబాద్ అర్బన్: తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాల్సిందేనని విద్యార్థి సంఘాల నాయకులు, పూర్వ విద్యార్థులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. తెయూలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం జి ల్లా కేంద్రంలోని కార్యాలయంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చాగోష్టిలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, వర్సిటీ పూర్వ విద్యార్థులు పా ల్గొని తమ అభిప్రాయాలు పంచుకున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందే ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసి యూనివర్సిటీ సాధించుకున్నామని పే ర్కొన్నారు. జిల్లా ప్రజలు, విద్యార్థుల మనోభావాలను గుర్తించి దివంగత సీఎం, మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రం పేరుతో తెలంగాణ యూనివర్సిటీ మంజూరు చేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలోనే ఓయూ, కేయూ తర్వాత మూడో అతిపెద్ద యూనివర్సిటీ తెయూ అని, 577 ఎకరాల సువిశాల ప్రాంగణం వర్సిటీ సొంతమన్నారు. తెయూ ఏర్పడి 18ఏళ్లు గడిచినా జిల్లా ప్రజాప్రతినిధుల అసమర్థతతోనే ఇంతవరకు ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు కాలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు అంశాన్ని ఓట్ల కోసం రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయని అన్నారు. వర్సిటీలో ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేసే వరకు విద్యార్థి సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి కలసికట్టుగా పోరాడాలని, త్వరలోనే కార్యాచరణ రూపొందించుకోవాలని నిర్ణయించారు. -
సమానత్వమే పూలే అభిమతం
నిజామాబాద్ అర్బన్: అన్నివర్గాల సమానత్వమే మహాత్మా జ్యోతీబాపూలే అభిమతమని, ఆ దిశగా తుది వరకు తన కృషి కొనసాగించారని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు కొనియాడారు. జ్యోతీబాపూలే జయంతి వేడుకల్లో భాగంగా జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో న్యూ అంబేడ్కర్ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఉత్సవాలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక రుగ్మతలను, దురాచారాలను పారద్రోలేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన మహనీయుడు జ్యోతీబాపూలే అని అన్నారు. పూలే ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వీడీసీలపై ఫిర్యాదులొస్తున్నాయి జిల్లాలోని పలు ప్రాంతాల్లో గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)ల పేరిట సాంఘిక బహిష్కరణలు విధిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, అలాంటి వీడీసీలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ పూలే ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి పాటుపడుతోందన్నారు. అంతకుముందు వినాయక్‌నగర్‌లోని పూలే విగ్రహానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, బీసీ సంఘాల ప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారిణి స్రవంతి, సహాయ అధికారి నర్సయ్య, వివిధ సంఘాల ప్రతినిధులు గైని గంగారాం, బుస్స ఆంజనేయులు, నరాల సు ధాకర్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సాంఘిక బహిష్కరణలు విధించే వీడీసీలపై కఠిన చర్యలు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఘనంగా జ్యోతీబాపూలే జయంతి -
ఒకే ఎజెండాతో పోరాడాలి
రాజకీయ అనుబంధ సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు పార్టీల జెండాలు పక్కన పెట్టి ఒకటే ఎజెండాతో ఉద్యమించాలి. వర్సిటీలో ఇంజినీరింగ్ కాలేజీ సాధించే వరకు జేఏసీగా ఏర్పడి పోరాడాలి. యంగ్ ఇండియా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ఏఐ కోర్సులు, సాంకేతిక విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తోంది. అయితే జిల్లాకు ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేయడంలో తీవ్ర వివక్ష చూపుతోంది. అన్నివర్గాల ప్రజలు, మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు ఒకే ఎజెండాతో పోరాడాలి. – రమావత్ లాల్‌సింగ్, తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ -
విద్యకు దూరమవుతున్నారు
తెయూలో ఇంజినీరింగ్ కాలేజీ లేకపోవడవంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతోపాటు ఆదిలాబా ద్ జిల్లాకు చెందిన ఎంతోమంది గ్రామీణ ప్రాంత వి ద్యార్థులు సాంకేతిక విద్య కు దూరమవుతున్నారు. సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి రెండుసార్లు హామీ ఇచ్చినా జిల్లాకు ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు కాకపోవడం జిల్లా ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే. మంత్రి పదవుల్లో ఉన్నవారు తమ జిల్లాలకు ఇంజినీరింగ్ కాలేజీలు తెచ్చుకుంటున్నారు. జిల్లాకు మంత్రి పదవి లేకపోవడంతో ఈ విషయమై పట్టించుకునే వారు కరువయ్యారు. – జే రాజేశ్వర్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు -
రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
డిచ్పల్లి(నిజామాబాద్‌రూరల్): ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభు త్వం పూర్తిగా విఫలమైందని, హామీలన్నీ అమలు చేయాలనే డిమాండ్‌తో ఏడాదిపాటు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వద్ద నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ నుంచే కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలుపై బీఆర్ఎస్ పోరాటం ప్రారంభమవుతుందన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో అమలు చేస్తామని చె ప్పిన హామీలు, 15 నెలలు గడిచినా అమలు చేయ లేకపోయిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని, ని రంతర విద్యుత్, సాగు, తాగునీటికి ఇబ్బందుల్లేకుండా పాలన సాగిందని, దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ మోసాలపై బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెద్ద సంఖ్యలో తరలివెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ధర్పల్లి మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, డీసీసీబీ డైరెక్టర్ శేఖర్‌రెడ్డి, మండల నాయకులు శక్కరికొండ కృష్ణ, నల్లవెల్లి సాయిలు, ఒడ్డెం నర్సయ్య, నీరడి పద్మారావు, రమే శ్ నాయక్, హన్మంత్‌రెడ్డి, ధీకొండ శ్రీనివాస్, మొ చ్చ శీను, ముత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ హామీల అమలుపై పోరాడతాం బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్15న డిచ్‌పల్లిలో సన్నాహక సభ బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయడంలో భాగంగా ఈ నెల 15న డిచ్పల్లి మండల కేంద్రంలో సన్నాహక సభ నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. సభకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి హాజరవుతారని వివరించారు. -
అకాల వర్షంతో ఆగమాగం
డొంకేశ్వర్(ఆర్మూర్) : జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం కురిసిన అకాల వర్షం అన్నదాతలను ఆగమాగం చేసింది. మధ్యా హ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశాన్ని నల్లని మబ్బులు కమ్మేశాయి. అకాల వర్షం భయంతో రైతులంతా కల్లాలకు పరుగులు తీశారు. ఆరబోసిన వడ్లు తడవకుండా కుప్పలపై టర్పాలిన్లు కప్పారు. బోధన్, సాలూర, పొతంగల్, రెంజల్, నవీపేట్, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల్లో స్వల్పంగా వర్షం కురిసింది. బలమైన గాలులకు టార్పాలిన్లు ఎగిరిపోయాయి. బోధన్: బోధన్, సాలూర మండలాల్లో చిరుజల్లులకు కురిశాయి. దీంతో ధాన్యం స్వల్పంగా తడిసింది. ఆరబెట్టిన ధాన్యాన్ని కుప్పులుగా పోసి, టార్పాలిన్లు కప్పేందుకు అవస్థలు పడ్డారు. ఎడపల్లి(బోధన్) : ఎడపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో వడగళ్ల వాన కురిసింది. వేగంగా వీచిన గాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వర్షంతో అనేకచోట్ల ధాన్యం తడిసిపోయింది. రెంజల్(బోధన్) : రెంజల్ మండలంలో అరగంటపాటు వాన దంచికొట్టింది. కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. ధాన్యం రాశుల చుట్టూ చేరిన నీటిని తొలగించేందుకు రైతులు ఇబ్బందిపడ్డారు. నీలా గ్రామంలో వడగళ్ల వర్షం కురిసింది. బాల్కొండ : ముప్కాల్ మండల పరిధిలో బుధవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి ఆరబెట్టిన ధాన్యం తడిసిముద్దయ్యింది. గాలి వాన బీభత్సానికి రోడ్లపై, కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసింది. బోధన్, బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో తడిసిన ధాన్యం కల్లాలకు పరుగులు తీసిన రైతులు -
కల్లుదుకాణంపై ఎన్ఫోర్స్మెంట్ దాడులు
ఎడపల్లి(బోధన్): మండలంలోని జానకంపేట్ గ్రామంలో అనుమతి లేకుండా కల్లు విక్రయిస్తున్న దుకాణంపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. అర్సపల్లి గ్రామానికి చెందిన అమర శ్రీనివాస్‌గౌడ్ లైసెన్స్ లేకుండా కల్లు విక్రయించడంతో కేసు నమోదు చేసి బోధన్ ఎకై ్సజ్ పోలీసులకు అప్పగించారు.దుకాణంలో నిల్వ ఉన్న 350 లీటర్ల కల్లును అధికారులు పారబోసారు. సీఐ స్వప్న,హెడ్ కానిస్టేబుల్ రాజన్న, కానిస్టేబుళ్లు హమీద్, ఉత్తం, శ్యామ్, ఆశన్న పాల్గొన్నారు. వివాహిత అదృశ్యం రెంజల్(బోధన్): మండలంలోని నీలా గ్రామానికి చెందిన సుల్తానా అనే వివాహిత అదృశ్యమైనట్లు ఎస్సై చంద్రమోహన్ గురువారం తెలిపారు. ఆమెకు సాటాపూర్ గ్రామానికి చెందిన యువకుడితో కొన్ని నెలల క్రితం వివాహం జరిగింది. కుటుంబ కలహాలతో ఇటీవల పుట్టింటికి వచ్చింది. ఈ నెల 8న ఆమె స్నేహితురాలిని కలిసి వస్తానని కుటుంబీకులకు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లింది. ఇప్పటి వరకు తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల గాలించారు. అయినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
నగరంలో ఆపరేషన్ ఛబుత్రా
ఖలీల్‌వాడి: నగరంలోని మూడో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి 11 గంటల నుంచి రాత్రి 1:30 వరకు ఆపరేషన్ ఛబుత్రాను పోలీసులు నిర్వహించారు. ఈక్రమంలో ట్రాఫిక్ నిబంధనలు పా టించని 18మంది వాహనదారులను పట్టుకున్నా రు. వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే బహిరంగ ప్రదేశాలలో మద్యం తా గుతున్న ముగ్గురిపై పిటీ కేసు నమోదు చేశారు. ఎ స్హెచ్వో రఘుపతి, ఎస్సై హరిబాబు మాట్లాడుతూ.. రాత్రి 10:30 తర్వాత నగరంలో ఎలాంటి షా పులు ఓపెన్ చేసినా, రోడ్లు, వీధుల్లో ఎవరైనా సంచరించినా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
వేగవంతంగా ధాన్యం సేకరించాలి
జక్రాన్‌పల్లి/ పెర్కిట్/ మోర్తాడ్: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని నిర్వాహకులను కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఆదేశించారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు. జక్రాన్‌పల్లి మండలం కేశ్‌పల్లి, ఆర్మూర్ మండలం మంథని, మోర్తాడ్ మండల కేంద్రంలో ఐకేపీ, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ గురువారం పరిశీలించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యం వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లోని సదుపాయాలను పరిశీలించారు. అనంతరం రైతులను పలకరిస్తూ.. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులున్నాయా? తూకంలో ఏమైనా తేడాలు ఉంటున్నాయా? అని ఆరా తీశా రు. గ్రెయిన్ క్యాలిపర్ ద్వారా నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా సన్న ధాన్యం ఉందా లేదా అని కలెక్టరే స్వయంగా పరిశీలించారు. బాగా ఆరబెట్టి, శు భ్రపర్చిన ధాన్యాన్ని తరలించి ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తిస్థాయి మద్దతు ధర పొందాలని, సన్నధాన్యానికి అదనంగా క్వింటాలుకు రూ.500 ల చొప్పున బోనస్ చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. తేమ 17 శాతానికి మించకుండా ఎఫ్ఏక్యూ (ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ) ప్రమాణాల మేరకు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చేలా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తద్వారా పూర్తిస్థాయి లో రైతులకు మద్దతు ధర అందడమే కాకుండా, రైస్‌మిల్లుల వద్ద ఎలాంటి ఇబ్బందులుండవని హితవు పలికారు. కొనుగోలు కేంద్రాల వద్ద మాయిశ్చర్ యంత్రాలు, టార్పాలిన్లు, వెయింగ్ మెషిన్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. అకాల వర్షాలు కురిసేందుకు అవకాశాలు ఉన్నందున వేగవంతంగా ధాన్యం సేకరిస్తూ, నిర్దేశిత రైస్ మిల్లుల కు తరలించాలన్నారు. రైస్‌మిల్లుల నుంచి ఎప్పటికప్పుడు ట్రక్ షీట్లు తెప్పించుకొని ట్యాబ్ ఎంట్రీలు చేయాలని ఆదేశించారు. ధాన్యం కొన్న వెంటనే రైతులకు పూర్తి వివరాలతో కూడిన రసీదును తప్పనిసరిగా అందజేయాలన్నారు. కలెక్టర్ వెంట డీఆర్డీవో సాయాగౌడ్, ఆర్డీవో రాజాగౌడ్, డీసీవో ఎన్ శ్రీనివాస్‌రావు, డీఎస్వో అరవింద్‌రెడ్డి, సివిల్ సప్లై డీఎం శ్రీకాంత్‌రెడ్డి, తహసీల్దార్లు సత్యనారాయణ, కృష్ణ, ఎంపీడీవోలు తదితరులు ఉన్నారు. ఎఫ్ఏక్యూపై రైతులకు అవగాహన కల్పించాలి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జక్రాన్‌పల్లి, ఆర్మూర్, మోర్తాడ్‌లో కొనుగోలు కేంద్రాల పరిశీలన -
ధాన్యం రక్షణ కోసం రైతుల పాట్లు
రైతులు తమ పంటల(ధాన్యం, పసుపు)ను విక్రయించడానికి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఇటీవల పెద్ద ఎత్తున తీసుకువచ్చారు. గురువారం సాయంత్రం వాతావరణం మార్పుల కారణంగా నిజామాబాద్ జిల్లాకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. వర్షంనుంచి పంటను కాపాడుకోవడానికి ముందస్తు జాగ్రత్తగా మార్కెటింగ్ శాఖ రైతులకు టార్ఫాలిన్లను పంపిణీ చేసింది. దీంతో రైతులు పంటలు తడవకుండ టార్ఫాలిన్లను కప్పుతున్న దృశ్యాలను సాక్షి క్లిక్ మనిపించింది. –సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
కుంటలో పడి ఇద్దరు బాలురు మృతి
క్రైం కార్నర్కామారెడ్డి క్రైం: ఇద్దరు బాలురు సరదాగా స్నానం చేసేందుకు వెళ్లి కుంటలో మునిగి మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి తండా కు చెందిన తెజావత్ సాయి కుమార్ (16), భుక్యా సురేష్ (15) చదువు మానేసి కొద్ది రోజులుగా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలోని ఓ కల్లు దుకాణంలో పని చేస్తున్నారు. వారిద్దరూ మంగళవారం సాయంత్రం వరకు కల్లు దుకాణంలో పనులు చేసి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం వారిద్దరి మృతదేహాలు సమీపంలో ఉండే రాఘవాపూర్ గ్రామ శివారు లోని ఓ కుంటలో తేలాయి. సమాచారం తెలియగానే కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున కుంట వద్దకు చేరుకున్నారు. దేవునిపల్లి పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. ఎస్సై రాజు విచారణ జరిపి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి బట్టలు గట్టుపై ఉండటంతో వారిద్దరూ స్నానం చేయడానికి కుంటలోకి దిగి ఉంటారని భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కామారెడ్డి మండలం క్యాసంపల్లి తండాలో చోటుచేసుకున్న ఘటన -
రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా
ఖలీల్‌వాడి : రౌడీషీట్ ఉన్నవారిపై పోలీసుల ప్రత్యే క నిఘా ఉంటుందని, రౌడీషీటర్లలో మార్పు రాకుంటే పీడీయాక్ట్ అమలు చేస్తామని ఏసీపీ రాజావెంక ట్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో రౌడీషీటర్ల ప్రవర్తనలో మార్పు కోసం గురువారం కౌన్సెలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్ల నేర చరిత్ర, వారిపై ఉన్న కేసుల వివరాలు, ప్రస్తుత జీవన విధానం, స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ.. రౌ డీషీటర్లు గ్రూపు తగాదాలు, నేరాలలో పాల్గొనవద్ద న్నారు. నేరప్రవృత్తిని వీడి కుటుంబ సభ్యులతో కలి సి ఉండాలన్నారు. ఉపాధి పొంది సత్ప్రవర్తనతో ఉంటే రౌడీషీట్ తొలగిస్తామని తెలిపారు. చెప్పుడు మాటలు విని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పా ల్పడితే జైలుపాలవ్వడం తప్పదన్నారు. రౌడీషీటర్ల ఇళ్ల ను రాత్రి, పగలు తేడా లేకుండా ఎప్పుడైనా తనిఖీ చేస్తామన్నారు. ఏదైనా సమస్య, అపాయం ఉంటే పోలీసులను సంప్రదిస్తే సహాయం అందజేస్తారని సూచించారు. కార్యక్రమంలో నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై గంగాధర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మార్పు లేకుంటే పీడీయాక్ట్ అమలు సత్ప్రవర్తనతో ఉంటే రౌడీషీట్ ఎత్తేస్తాం ఏసీపీ రాజా వెంకట రెడ్డి -
అడిగే అధిపతులు లేరు..
నిజామాబాద్ నగరపాలక సంస్థలోని ప్రధాన విభాగాల్లో ఖాళీ పోస్టులతో అభి వృద్ధి పనులకు అవరోధాలు ఏర్పడుతున్నాయి. అధికారులు, ఉద్యోగులు బదిలీ అయినా, పదవీ విరమణ పొందినా వారి స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ ఇవ్వడం లేదు. కమిషనర్ దిలీప్‌కుమార్ తర్వాత మిగతా ప్రధాన పోస్టులు, విభాగాల అధిపతులు లేకపోవడంతో పురపాలన సక్రమంగా సాగడం లేదు. నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ బల్దియాలో ప్రధాన అధికారి కమిషనర్. ఆ స్థానం తర్వాత డిప్యూటీ కమిషనర్, అడిషనల్ కమిషనర్, ము న్సిపల్ వైద్యాధికారి (ఎంహెచ్వో), డిప్యూటీ సి టీ ప్లానర్, డిప్యూటీ ఈఈ వంటివి ప్రధానమైన పోస్టులు. కొన్ని నెలలుగా ఈ పోస్టులన్నీ ఖాళీ గానే ఉన్నాయి. డిప్యూటీ కమిషనర్ రాజేంద్రకుమార్, జిల్లా చీఫ్ ప్లానర్ శ్యాంకుమార్ పదవీ విరమణ పొందారు. అడిషనల్ కమిషనర్ ఎన్ శంకర్ బదిలీపై వెళ్లగా, ఎంహెచ్వో పోస్టు రెండేళ్లుగా ఖాళీగా ఉంటోంది. టౌన్‌ప్లానింగ్‌లో డీసీ పీ, ఏసీపీ, టీపీవో–1, టీపీఎస్–3, టీపీబీవో త దితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెవెన్యూ వి భాగంలోనూ ఖాళీలు ఉన్నాయి. ప్రధాన పోస్టు లన్నీ ఖాళీగా ఉండడంతో ఉన్నవారితోనే నెట్టుకొస్తున్నారు. పర్మినెంట్ ఉద్యోగులు లేకపోవడంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగులపైనే ఆధారపడా ల్సి వస్తుంది. దీంతో పైసలు లేనిదే ఏ ఫైలూ క దలలేని స్థితిలోకి వెళ్లింది. బల్దియా అవినీతికి కే రాఫ్గా మారిందంటూ స్థానిక ఎమ్మెల్యే ధన్‌పా ల్ సూర్యనారాయణ చేసిన బహిరంగ వ్యాఖ్యలే ఇందుకు అద్దం పడుతున్నాయి. ఉన్నతోద్యోగు లు లేకపోవడంతోనే పాలన గాడితప్పుతోంద న్న చర్చ సాగుతోంది. అవుట్ సోర్సింగ్ సిబ్బందికే అందలం రాష్ట్రంలోనే మూడో పెద్ద కార్పొరేషన్ నిజామా బాద్ మున్సిపల్ కార్పొరేషన్. రెండేళ్లుగా ఎంహెచ్‌వోను నియమించలేదు. హోటళ్లు, తినుబండా రాలపై తనిఖీలు లేవు. కల్తీ ఆహారంపై, అపరిశుభ్రతపై దృష్టి సారించడం లేదు. శానిటరీ ఇన్స్పెక్టర్లు నలుగురూ అవుట్‌సోర్సింగ్‌కి చెందినవారే. ఇద్దరు పర్మినెంట్ ఉద్యోగుల్లో ఒకరిని డంపింగ్‌యార్డు, ఒకరిని కుక్కల నియంత్రణ విభాగానికి కేటాయించారు. మిగతా విభాగాల్లో అవు ట్ సోర్సింగ్ వారే పెత్తనం చెలాయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ము డుపులు ముట్టనిదే పనులు కావడం లేదు. ఆ క్రమణలపై చర్యలు లేకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ విభాగానికి అధిపతి పో స్టుతోపాటు టీపీవో పోస్టూ ఖాళీగానే ఉంది. కేవ లం ఇద్దరు టీపీఎస్‌లు రాజేంద్రప్రసాద్, రాజేశ్ ఉన్నారు. టీపీఎస్ రాజేంద్రప్రసాద్ డిప్యుటేషన్ పై ఒకరోజు మాత్రమే విధులు నిర్వహిస్తున్నా రు. చైన్మన్లు కూడా లేరు. ఉన్న ఒకరిద్దరిపైన అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నారని ఇప్పటికే కమిషనర్‌కు పలు ఫిర్యాదులు వెళ్లాయి. పాలనపై దృష్టి సారిస్తున్నా.. కార్పొరేషన్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నా యి. ఇద్దరు అధికారులు పదవీవిరమణ పొందా రు. ఎంహెచ్వో పోస్టు కావాలని సీడీఎంఏకు లేఖ రాశాం. అవుట్సోర్సింగ్ అధికారుల పనితీరుపై దృష్టిసారించాను. శానిటేషన్‌ను రోజూ పరిశీలిస్తున్నా. త్వరలోనే ప్రక్షాళన ఉంటుంది. – దిలీప్‌కుమార్, కమిషనర్పాతుకుపోయిన సిబ్బందిబల్దియాలో దాదాపు 1300 మంది వరకు కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తున్నారు. అధికారులు కేవలం ఫైళ్ల మీద సంతకాలకే పరిమితం కాగా, మిగతా పనులన్నీ కాంట్రాక్టు ఉద్యోగులే చేస్తుంటారు. ప్రతి ఫైలుకు ఇంత అని వసూలు చేసేదీ వారే. ముఖ్యంగా టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్ విభాగాల్లో కంప్యూటర్ ఆపరేటర్లుగా చెలామణి అవుతున్న వీరు ఏళ్లుగా ఒకే విభాగంలో పాతుకుపోయారు. బల్దియాలో ప్రధాన పోస్టులు ఖాళీ డీసీ, ఏసీ, ఎంహెచ్వోల భర్తీ ఎప్పుడో? రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్, శానిటేషన్‌లో వేధిస్తున్న అధికారుల కొరత అవుట్సోర్సింగ్ సిబ్బందితోనే పనులు గాడితప్పుతోన్న పాలన -
‘సలహా కమిటీ’ లో జిల్లాకు ప్రాధాన్యం
మోర్తాడ్/నిజామాబాద్ రూరల్: సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీ అమలు, గల్ఫ్ బోర్డులను ఏర్పాటు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. ఇందుకోసం రెండేళ్ల పాటు అధ్యాయనం చేయడానికి ఒక సలహా కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ కమిటీలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్‌ను గౌరవ సభ్యులుగా నియమించారు. అలాగే సభ్యుడిగా దుబాయ్‌లో ఉండే జక్రాన్‌పల్లి మండలం కలిగోట్వాసి సత్యం నారాగౌ డ్ సభ్యుడిగా నియమితులయ్యారు. 15 మందితో కూడిన కమిటీలో జిల్లా నుంచి కీలక నేతలకు స్థానం దక్కడం విశేషం. కమిటీ చైర్మన్‌గా మాజీ రాయబారి వినోద్ కుమార్‌ను ఎంపిక చేయగా వైస్ చైర్మన్‌గా గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకుడు మంద భీంరెడ్డిని ఎంపిక చేశారు. గౌరవ సభ్యులుగా జిల్లా నేతలను నియమించడంతో ప్రాధాన్యం దక్కిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వలస కార్మికుల సంక్షేమం కోసం సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీని రూపొందించడమా? లేదా గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేయడమా? ఇందు కోసం అధ్యయనం చేయాలని ప్రభుత్వం కమిటీకి నిర్దేశించింది. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డితోపాటు, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్‌ను ఎంపిక చేసిన ప్రభుత్వం -
ధాన్యం కొనుగోళ్లకు ఆటంకం
సుభాష్‌నగర్: జిల్లాలో ఊపందుకున్న ధాన్యం కొనుగోళ్లకు అకాల వర్షాలు బ్రేక్ వేశాయి. గురువారం సాయంత్రం వర్షం కురవడంతో కల్లాలు, రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. దీంతో జిల్లావ్యాప్తంగా కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి. మరో రెండ్రోజులపాటు వడగళ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోళ్లు ఊపందుకున్న సమయంలోనే.. కొనుగోళ్లు ఊపందుకుంటున్న సమయంలోనే అకాల వర్షాలు ఆటంకంగా మారాయి. అకాల వర్షంతో మరో రెండు, మూడు రోజులపాటు ధాన్యం కొనుగోళ్లకు బ్రేక్ పడే అవకాశముంది. గడిచిన పదిరోజుల్లోనే లక్షకుపైనే మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పోటెత్తింది. దీంతో ధాన్యం సేకరణ మందకొడిగా సాగనున్నాయని సివిల్ సప్లై అధికారులు పేర్కొంటున్నారు. 1.05 లక్షల టన్నుల సేకరణ జిల్లా వ్యాప్తంగా 698 కొనుగోలు కేంద్రాలకు 458 ప్రారంభమయ్యాయి. 309 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తున్నారు. 291 కేంద్రాలు సన్నరకం, 18 దొడ్డురకం ధాన్యం సేకరణ కేంద్రాలున్నాయి. 9500 మంది రైతుల నుంచి ఇప్పటికే 1.03 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం, 2వేల మెట్రిక్ టన్నుల దొడ్డురకాలను సేకరించి రైస్‌మిల్లులకు తరలించారు. రూ.70కోట్లకుపైనే చెల్లింపులు.. ధాన్యం రైస్‌మిల్లుకు చేరిన వెంటనే ట్రక్ షీట్ తీసుకొచ్చి ట్యాబ్ ఎంట్రీ పూర్తయిన రెండ్రోజులకే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. 2,680 మంది రైతులకు చెందిన 30,262 మెట్రిక్ టన్నులకు సంబంధించి రూ.70.21 కోట్లకుపైనే రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. బోనస్ డబ్బుల విషయమై సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారుల వివరణ కోరగా, త్వరలోనే జమ అవుతాయని సమాధానమిచ్చారు. రైతన్నపై అదనపు భారం ధాన్యం కొనుగోళ్లు ఊపందుకునే సమయంలో అకాల వర్షాలు అన్నదాతను ఆగమాగం చేస్తున్నాయి. జిల్లాకు రెండ్రోజుల రోజుల వర్షసూచన ప్రకటించడంతో రైతులు ధాన్యం తడవకుండా టార్ఫాలిన్లు అద్దెకు తీసుకొచ్చి కప్పుతున్నారు. ఇది వరకు తడిసిపోయిన ధాన్యాన్ని తేమశాతం కోసం మళ్లీ ఆరబెట్టాల్సి వస్తోంది. దీంతో రైతులపై అదనపు భారం పడనుంది. అకాల వర్షంతో మందకొడిగా సేకరణ మరో రెండ్రోజులు వర్ష సూచన ఆందోళనలో రైతాంగం -
గౌరవప్రదమైన జీవనం సాగించాలి
నిజామాబాద్‌అర్బన్: వివిధ పరిస్థితుల కారణంగా సమాజంలో దుర్భర స్థితిలో జీవనం సాగిస్తున్న వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న చేయూతను సద్వినియోగం చేసుకుని గౌరవప్రదంగా జీవించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మినీ మోడ్యూల్ క్యాంపు నిర్వహించారు. జిల్లా జడ్జితోపాటు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సీపీ సాయి చైతన్య తదితరులు పాల్గొన్నారు.ఈసందర్భంగా దాతల సహకారంతో పలువురికి కుట్టు మిషీన్లు, ప్రభుత్వ బాలికల పాఠశాలలు, డిచ్పల్లి మానవతా సదన్, కస్తూర్బా విద్యాలయాలకు సానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషీన్లు పంపిణీ చేశారు. లేబర్ డిపార్ట్మెంట్ తరపున అసంఘటిత రంగ కార్మికులకు గుర్తింపు కార్డులను, మెప్మా ఆధ్వర్యంలో 21 స్వయం సహాయక సంఘాలకు రూ. 2.50 కోట్ల విలువ గల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును అందజేశారు. అనంతరం జిల్లా జడ్జి మాట్లాడుతూ.. డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించామని గుర్తు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. లబ్ధిదారులు చేయూతను సద్వినియోగం చేసుకున్నప్పుడే సేవా కార్యక్రమాలకు సార్థకత చేకూరుతుందన్నారు. సీపీ మాట్లాడుతూ.. లబ్ధిదారులు స్వయం ఉపాధి దిశగా ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. దాతలను సన్మానించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి, హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్‌రెడ్డి, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరు కారణాలతో పలువురి ఆత్మహత్య
వేల్పూర్: మండలంలోని మోతె గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై సంజీవ్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన ప్రియాంక(25)కు మోతె గ్రామానికి చెందిన కల్ల భాస్కర్‌తో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. భర్తతోపాటు అత్తమామలు తరచూ ఆమెను వేధించేవారు. గురువారం ఉదయం భర్త, అత్తా, మామ ఆమెతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో ప్రియాంక తీవ్ర మనస్థాపం చెంది ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తండ్రి నడ్పిసాయన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎల్లారెడ్డి మండలంలో.. ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై మ హేష్ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన బోండ్ల నర్సింలు (35) మద్యానికి బానిసై గురు వా రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. కుటుంబ స భ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. భిక్కనూరు మండలంలో.. భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన పోచమ్మల నర్సింలు (45) కుటుంబ కలహాలతో విరక్తి చెందాడు. ఈక్రమంలో గురువారం వేకువజామున అతడు తన బంగ్లా పైనుంచి విద్యుత్తు స్తంభం ఎక్కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. సిరికొండ మండలంలో.. సిరికొండ: మండలంలోని తాటిపల్లి గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై రామ్ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన మలావత్ అన్వేష్ (26) సిరికొండలో ట్రాన్స్‌కో అసిస్టెంట్ లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం అతడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి తండ్రి మదన్‌లాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బాలుడి ఆత్మహత్యాయత్నం రాజంపేట: మండ ల కేంద్రంలో ఓ బాలుడు ఆత్మహత్యకు యత్నించాడు. గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా.. రాజంపేటకు చెందిన కడమంచి స్వామి కుమారుడు శ్రీహరి(17) రూ. 30వేల మొబైల్ ఫోన్ కొనివ్వాలని ఇంట్లో గొడవ పడ్డాడు. అంత ఖరీదైన మొబైల్ కొనే స్థోమత లేదంటూ తండ్రి నిరాకరించాడు. దీంతో మనస్థాపానికి గురైన శ్రీహరి గురువారం ఎలుకలు మందు(బిస్కెట్లు) తిన్నాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలపడంతో వారు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీహరి ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. -
వీడీసీల కార్యకలాపాలను అణిచివేస్తాం
ఖలీల్‌వాడి: గ్రామాల అభివృద్ధి అంశాలను పక్కనపెట్టి సివిల్ వివాదాలు, భూ తగదాలు తదితర పంచాయితీలు చేసే వీడీసీలను ఉక్కుపాదంతో అణిచివేస్తామని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. చట్టాన్ని వీడీసీలు తమ చేతుల్లోకి తీసుకుంటున్నాయని, బా ధితులు పోలీస్‌స్టేషన్, న్యాయస్థానాన్ని ఆశ్రయించొద్దని, తాము చెప్పిన విధంగా వినాలని ఒత్తిడి చేయడం సరికాదని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి పేరుతో బెల్ట్‌షాపులు, కోడిగుడ్లు, కూల్ డ్రింక్స్ తదితర అమ్మకాలకు వేలం నిర్వహించడం చట్టరీత్య నేరమని తె లిపారు. ప్రజలు ఎలాంటి సమస్య వచ్చినా సంబంధిత శాఖలను సంప్రదించి ఆ శాఖ నుంచి సహాయసహకారాలు తీసుకోవాలని, తాము చెప్పే వి శాసనమని, చట్టామని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే తగు చర్యలు తీసుకుంటామని వీడీసీలను సీపీ హెచ్చరించారు. వీడీసీలు ఇబ్బందులకు గురి చేస్తే దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. గ్రామాల్లో పంచాయితీలు చేస్తే చర్యలు తప్పవు పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్య హెచ్చరిక -
తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి
డిచ్పల్లి: వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్య తలె త్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రావు సిబ్బందిని ఆదేశించారు. డిచ్పల్లి మండలంలోని నడిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని బుధవారం తనిఖీ చేశా రు. సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. పంచాయతీ పరిధిలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. అనంతరం డీపీవోను ఇన్చార్జి ఎంపీడీవో, గ్రామ ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌గౌడ్, కార్యదర్శి రాధిక, జూనియర్ అసిస్టెంట్ రజత్‌కుమార్, సిబ్బంది సన్మానించారు. ప్రజావాణి ఫిర్యాదుపై విచారణ.. డిచ్పల్లి మండలం నడిపల్లి గ్రామశివారులో పెట్రోల్ బంక్ సమీపంలో తన పట్టా భూమిలోకి కల్వర్టు నుంచి నీళ్లు వస్తున్నాయని నిజామాబాద్‌కు చెందిన ఉప్పల అంజయ్య ఇటీవల ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా, ఈ విషయమై డీపీవో విచారణ చేపట్టారు. ఫిర్యాదుదారుడి భూమిని పరిశీలించిన అనంతరం నీటి పారుదల, రెవెన్యూ శాఖలకు చెందిన సమస్య కావడంతో సంబంధిత అధికారులకు లేఖ రాసి సమస్య పరిష్కరించాలని సూచించినట్లు తెలిపారు. బాధితుడి భూమిలో తాత్కాలికంగా నీళ్లు నిలువకుండా చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులను డీపీవో ఆదేశించారు. డీపీవో శ్రీనివాస్‌రావు నడిపల్లి పంచాయతీ తనిఖీ -
డిజిటల్ లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నూతనంగా అందుబాటులోకి తీసుకువచ్చిన డిజిట ల్ లైబ్రరీ విభాగాన్ని ఉద్యోగార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అన్నారు. ఇంటర్నెట్ సేవలతో కూడిన డిజిటల్ లై బ్రరీ కోసం ప్రత్యేకంగా రూ.5 లక్షలు సమకూర్చ గా, పది కంప్యూటర్లతో డిజిటల్ లైబ్రరీని నెల కొల్పారు. దీనిని కలెక్టర్ బుధవారం ప్రారంభించా రు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న జిల్లాకు చెందిన యువతతోపాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు జిల్లా కేంద్ర గ్రంథాలయం సేవలను వినియో గించుకుంటున్నారని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేశామన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారు స్టడీ మెటీరియల్‌ను ఆన్లైన్ ద్వారా సేకరించుకునేందుకు డిజిటల్ లైబ్రరీ ఉపయోగపడుతుందన్నారు. గ్రంథాలయంలో స్థలం సరిపోవడం లేదని, ఈ స మస్యను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే పాత డీఈఓ కార్యాలయంలోని గ దులను రీడింగ్ రూమ్‌లుగా వినియోగించుకుంటున్నట్లు తె లిపారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, తదితరులు చొరవ చూపి గత నెలలో మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేశ్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుగ్గారెడ్డి, అధికారులు, సిబ్బంది రాజారెడ్డి, నరేశ్‌రెడ్డి, తారకం, రాజేశ్వర్, శ్రీకాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు -
మంచిప్ప ప్రాజెక్టు పూర్తి చేయిస్తా
జక్రాన్‌పల్లి: ప్రాణహిత చేవెళ్ల పథకంలో భాగంగా మంచిప్ప ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని నిజా మాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. మండలంలోని పుప్పాలపల్లి, గన్యాతండా, మా దాపూర్, సికింద్రాపూర్, పడకల్, కలిగోట్, చింతలూర్ గ్రామాల్లో రూ.6 కోట్ల 74లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూపతిరెడ్డి బుధ వారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆ యా చోట్ల ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.90 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి సాగునీరు అందివ్వలేదన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ కలిసి అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని విమర్శించారు. రూరల్ నియోజక వర్గానికి 7వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. మొదటి విడతలో ప్లాట్లు ఉన్న లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. రెండో విడతలో అర్హులైన వారికి 75 గజాల ఇంటి స్థలం కేటాయించి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఎక్కడా లేని విధంగా రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతు న్నాయని, సుద్దులంలో ఇంటిగ్రేటేడ్ స్కూల్, జ క్రాన్‌పల్లి మండలంలో నవోదయ పాఠశాల ఏ ర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. యువత రాజీవ్ యువవికాస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. డీసీసీబీ చైర్మన్ రమేశ్‌రెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సా యారెడ్డి, మాజీ ఎంపీపీ అప్పాల రాజన్న, పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి, నాయకులు ఉమ్మాజీ నరే శ్, చిన్న సాయారెడ్డి, వినోద్, పురుషోత్తంరెడ్డి, రాజేందర్, విఠల్, అరుణ్, రవిగౌడ్, గణేశ్, గంగారెడ్డి, నర్సారెడ్డి, నాగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రెండేళ్లలో నియోజకవర్గం సస్యశ్యామలం ఏడు వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు మొదటి విడతలో ప్లాట్లు ఉన్న వారు ఇళ్లు నిర్మించుకోవాలి రెండో విడతలో స్థలం కేటాయించి ఇళ్లు నిర్మిస్తాం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి -
మోర్తాడ్ ముందుంది
త్వరలో అవార్డులు మోర్తాడ్‌కు రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానం దక్కడంతో ప్రత్యేకాధికారికి, కార్యదర్శికి, ఎంపీడీవోకు అవార్డులను అందించే అవకాశం ఉంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో అవార్డులను త్వరలోనే అందించే అవకాశం ఉందని పంచాయతీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను మోర్తాడ్‌కు అవార్డు దక్కగా అప్పట్లో సర్పంచ్‌లు ఉన్నారు. మాజీ ప్రజాప్రతినిధులకు కాకుండా అధికారులకే అవార్డులను అందించాలని కేంద్రం నిర్ణయించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మోర్తాడ్: కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నిర్దేశించిన ప్రకారం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించిన గ్రామంగా మోర్తాడ్ జిల్లాస్థాయిలో వందమార్కులు సాధించి ప్రథమస్థానంలో నిలిచింది. అలాగే రాష్ట్ర స్థాయిలో 81.29 మార్కులతో నాలుగో స్థానంలో నిలవడం విశేషం. 2022–23లో కేంద్ర ప్రభుత్వం పలు అంశాల్లో గ్రామాల అభివృద్ధిపై నివేదికను కో రింది. ప్రతి పంచాయతీతో సెల్ఫ్ అప్రైజల్ రిపోర్టు ను ఆన్లైన్లో నమోదు చేయించారు. ఇందులో భాగంగానే మోర్తాడ్ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నిర్దేశించిన ప్రకారం అన్ని రంగాల్లో మంచి ఫలితాలను సాధించడంతో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి లో సత్తా చాటింది. మౌలిక వసతులు, ప్రజారోగ్యం, పేదరిక నిర్మూలన, చిన్నారులు, మహిళలకు సౌకర్యాలు, పారిశుధ్యం, పచ్చదనం, సామాజిక భద్రత ఇలా అనేక అంశాలపై గ్రామంలోని వాస్తవ పరిస్థితులను అద్దం పట్టేలా రిపోర్టును తయారు చేసి ఆన్లైన్లో నమోదు చేశారు. జిల్లా స్థాయిలో రిపోర్టులను పరిశీలించి రాష్ట్రస్థాయికి పంపించగా అక్క డ పరిశీలన అనంతరం కేంద్రానికి పంపించారు. రాష్ట్ర స్థాయిలో 25 గ్రామ పంచాయతీలకు చోటు దక్కగా అందులో మోర్తాడ్‌కు నాలుగో స్థానం లభించడం గమనార్హం. మోర్తాడ్ జిల్లా స్థాయిలో వంద మార్కులను సాధించింది. రాష్ట్ర స్థాయిలో మాత్రం 81.29 మార్కులను పొందింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించిన గ్రామంగా వంద మార్కులు జిల్లా స్థాయిలో ప్రథమ.. రాష్ట్రస్థాయిలో నాలుగో స్థానం అవార్డు అందించనున్న కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ మా శ్రమకు గుర్తింపు లభించింది జిల్లా స్థాయిలో మోర్తాడ్ వంద మార్కులు, రాష్ట్ర స్థాయి లో 81.29 మార్కులతో నా లుగో స్థానంలో నిలవడం సంతోషంగా ఉంది. మా శ్ర మకు గుర్తింపు లభించింది. గ్రామంలో సుపరిపాలన ఇతర అంశాల విషయంలో ప్రజలు, అధికారుల సహకారంతో ముందుకు సాగాం. అవార్డు లభించినందుకు సంతృప్తిగా ఉంది. – భోగ ధరణి, మాజీ సర్పంచ్, మోర్తాడ్ -
చెరువు పనైతేనే వస్తాం!
జిల్లాలో ఉపాధి కూలీల వివరాలుడొంకేశ్వర్(ఆర్మూర్): వేసవి సీజన్ ప్రారంభమైనప్పటికీ గ్రామాల్లో ఉపాధిహామీ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. చెరువుల్లో పూడికతీసే పనులు లేకపోవడంతో కూలీల హాజరు గణనీయంగా తగ్గిపోయింది. కొత్త పనులు చేసేందుకు కూలీలు అంతగా ఆసక్తి చూపకపోగా, చెరువు పనులైతేనే వస్తామంటున్నారు. దీంతో కూలీల హాజరును పెంచడానికి ఫీల్డ్ అసిస్టెంట్లు తిప్పలు పడుతున్నారు. లక్ష్యానికి అనుగుణంగా పనిదినాలు పూర్తి చేయలేకపోతున్నారు. ఉపాధిహామీ పనుల్లో కొన్ని మార్పులు జరగడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పొచ్చు. గతేడాది వరకు చెరువుల్లో పూడికతీత, కెనాల్ పనులు ఉండేవి. చెరువుల్లో గుంతలు తవ్వే పనులకు కూలీలు ఎక్కువ సంఖ్యలో వచ్చేవారు. వేసవిలో నాలుగు నెలలపాటు దండిగా ఉపాధి లభించేది. కేంద్ర ప్రభుత్వం కొత్త ఏడాది నుంచి చెరువుల్లో పూడికతీసే పనులను రద్దు చేసింది. కేవలం ఫిష్ పాండ్లు, అడవులు, గుట్టల్లో కందకాల తవ్వకం అలాగే వ్యవసాయ భూముల అభివృద్ధి, ఇతర పనులు చేయడానికి అనుమతి ఇచ్చింది. అలవాటు లేని, ఎక్కువ శ్రమతో కూడిన ఈ పనులను చేయడానికి కూలీలు పెద్దగా ముందుకు రావడం లేదు. పోయిన ఏడాది ఇదే సమయానికి జిల్లా వ్యాప్తంగా రోజుకు 50వేల మందికి పైగా కూలీలు పనులకు రాగా, ఇప్పుడు 25వేలు కూడా దాటడం లేదు. ఒక్కోసారి కొన్ని గ్రామాల్లో పదిమందికి మించి రావట్లేదు. అదే విధంగా నూతన ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు 29.60 లక్షల పనిదినాలు మాత్రమే ప్రభుత్వం అనుమతినిచ్చింది. గతేడాది 50లక్షల పనిదినాలకు అవకాశం ఇచ్చింది. పనిదినాలు కూడా కోతకు గురయ్యాయి. మండలాలు 27 గ్రామ పంచాయతీలు 530 జాబ్ కార్డులు 2.56 లక్షలు కూలీలు 4.86 లక్షలురుద్రూర్ 310 డిచ్పల్లి 1020 నిజామాబాద్ 567 మెండోరా 308 మోపాల్ 525 కోటగిరి 536 చందూర్ 84 బోధన్ 384 మొత్తం 23164 నవీపేట్ 1649 కమ్మర్పల్లి 713 రెంజల్ 850 ధర్పల్లి 1034 వేల్పూర్ 846 సిరికొండ 1212 మోస్రా 189 వర్ని 809 ముప్కాల్ 249 ఎడపల్లి 603మండలం హాజరైన కూలీలు ఆర్మూర్ 1475మోర్తాడ్ 724మాక్లూర్ 2006భీమ్‌గల్ 1787ఇందల్వాయి 1310జక్రాన్‌పల్లి 1173బాల్కొండ 554నందిపేట్ 1815ఏర్గట్ల 432బుధవారం మండలాల వారీగా హాజరైన కూలీలు -
ఆగడాలకు చెక్
నిజామాబాద్ఆకతాయిల న్యాయం చేయడమే.. వినియోగదారులకు న్యాయం చేయడమే ఫోరం లక్ష్యమని సీజీఆర్ఎఫ్–2 టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్ నారాయణ అన్నారు.గురువారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 8లో uమంగళవారం రాత్రి సిబ్బందికి సూచనలు చేస్తున్న నార్త్ సీఐ శ్రీనివాస్అర్ధరాత్రి వేళ ఛబుత్రా(అరుగు)ల మీద కూర్చుని గప్పాలు కొట్టే.. బైక్‌లపై రయ్‌మని దూసుకెళ్లే ఆకతాయిల ఆగడాలకు ‘ఆపరేషన్ ఛబుత్రా’ చెక్ పెడుతోంది. జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి వేళ పోలీసులు గతకొద్ది రోజులుగా విస్తృతంగా తనిఖీలు, పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. సరైన కారణం చూపకుండా రోడ్లపై కనిపించిన వారిని విచారిస్తూ స్టేషన్లకు తరలిస్తున్నారు. మరుసటి రోజున కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు జరిమానా విధిస్తున్నారు. సీఎస్ఆర్గా అంబులెన్స్ అందజేత నిజామాబాద్‌అర్బన్: కార్పొరేట్ సోషల్ రె స్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)గా అథాంగ్ టోల్‌ప్లాజా ఆధ్వర్యంలో జిల్లా వైద్యారోగ్యశాఖకు రూ.30లక్షల విలువ చేసే అంబులెన్స్‌ను అందజేశారు. జిల్లా సమీకృత కార్యాలయా ల సముదాయంలో బుధవారం కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుకు అంబులెన్స్‌ను అ ప్పగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. అంబులెన్స్‌ను జిల్లా ప్రజలకు ఉపయోగపడేలా వినియోగించుకోవాలని, మరిన్ని కంపెనీలు ముందుకు వచ్చి సీఎస్ఆర్ కింద ప్రజలకి ఉపయోగపడేలా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్, డీఎంహెచ్‌వో రాజశ్రీ, జిల్లా ఇన్ఫర్మాటిక్స్ అధికారి మధు, ఐరాడ్ మేనేజర్ వర్ష, టోల్ గేట్ మేనేజర్ అనిల్, సిబ్బంది విరాజ్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. రైతులు మోసపోవద్దు సుభాష్‌నగర్: దళారులకు ధాన్యం విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని మార్కెటింగ్‌శాఖ గ్రేడ్–2 సెక్రటరీ శ్రీధర్ రైతులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మా ర్కెట్ కమిటీలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం సన్నర కాలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తోందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చే సుకోవాలని శ్రీధర్ సూచించారు. మార్కెట్‌యార్డులో ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో మెప్మా ప్రతినిధులు, మహిళా సమాఖ్య స భ్యులు, మార్కెట్‌యార్డు సూపర్వైజర్ కిషన్, సిబ్బంది శంకర్‌దాస్, హమాలీలు, దడువాయిలు పాల్గొన్నారు. చిన్నారులకు పోషకాహారం అందించాలి ధర్పల్లి(నిజామాబాద్‌రూరల్): శారీరక, మా నసిక ఎదుగుదల కోసం చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని జిల్లా శిశు సంక్షేమ అధికారిని రసూల్ బీ పేర్కొన్నారు. ధర్పల్లి మండల కేంద్రంతోపాటు దమ్మన్నపేట్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షోత్సవాల్లో భాగంగా బుధవారం గర్భిణులు, బాలింత లు, కిశోర బాలికలకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రసూ ల్ బీ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో తల్లీబిడ్డల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. పుట్టిన బిడ్డకు మొ దటి ఆరు నెలలపాటు తల్లిపాలు మాత్రమే పట్టించాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో తుకారాం, మెడికల్ ఆఫీసర్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఖలీల్‌వాడి: అర్ధరాత్రి వేళ ఛబుత్రాల(అరుగు)పై కూర్చుని గప్పాలు కొట్టే, రోడ్లపై తిరిగి ఆకతాయిల ఆటకట్టించేందుకు పోలీసులు జిల్లా కేంద్రంలో ‘ఆపరేషన్ ఛబుత్రా’ నిర్వహిస్తున్నారు. నగరంలోని రోడ్లపై అర్ధరాత్రి వేళ తిరిగే వారికి చెక్ పెడుతున్నారు. ఇటీవల నాలుగు రోజుల్లో సుమారు వంద మందికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. గతంలో సీపీగా పని చేసిన కార్తికేయ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ నగరంతోపాటు ఆర్మూర్, బోధన్ పట్టణాల్లో ‘ఆపరేషన్ ఛబుత్రా’ అమలు చేశారు. అప్పటి ఏసీపీ వెంకటేశ్వర్లు ‘ఆపరేషన్ ఛబుత్రా’ను పక్కాగా అమలు చేశారు. ఆ తరువాత నాగరాజు, సత్యనారాయణ, కల్మేశ్వర్ సీపీలుగా పనిచేసిన కాలంలో నిర్వహించలేదు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించిన సీపీ కొత్తగా వచ్చిన సీపీ పోతరాజు సాయిచైతన్య ఇటీవల నగరంలో రాత్రివేళల్లో పెట్రోలింగ్ వెళ్లిన సందర్భంగా యువకులు బైక్‌లపై తిరగడం, ఛబుత్రాలపై కూర్చుని ముచ్చట్లు పెట్టడాన్ని గమనించారు. వెంటనే ఆపరేషన్ ఛబుత్రా అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో గత నాలుగు రోజులుగా నిజామాబాద్ నగరంలో ఆపరేషన్ ఛబుత్రా కొనసాగుతోంది. రాత్రివేళలలో బైక్‌లపై తిరిగే వారిని సంబంధిత పోలీస్స్టేషన్లకు తరలించి వాహనాల పత్రాలను పరిశీలిస్తున్నారు. కుటుంబసభ్యుల సమక్షంలో యువకులకు కౌన్సెలింగ్ ఇస్తూ జరిమానా విధిస్తున్నారు. మరోసారి పట్టుబడితే కేసులు నమో దు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. అత్యవసరమైతేనే రాత్రి వేళ బయటికి రావాలని సూచిస్తున్నారు. గొడవలకు చెక్ పెట్టేందుకు.. నగరంలోని పలు ప్రాంతాల్లో యువకుల మధ్య ఇటీవల గొడవలు చోటుచేసుకున్న ఘటనలు ఉన్నాయి. కొన్ని చోట్ల పరస్పరం దాడులు చేసుకోగా, మరికొన్ని చోట్ల కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ పరిస్థితికి ఆపరేషన్ ఛబుత్రాతో చెక్ పెట్టే అవకాశం ఉండడంతో సీపీ ఆదేశాల మేరకు పోలీసులు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆపరేషన్ ఛబుత్రా నిర్వహిస్తున్నారు. కౌన్సెలింగ్.. జరిమానాలు అర్ధరాత్రి వేళల్లో రోడ్లపై తిరిగినా, ఛబుత్రాలపై కూర్చున్నా పోలీసులు స్థానిక స్టేషన్లకు తరలిస్తారు. ఆ తరువాత వాహనాల పత్రాలు, వ్యక్తిగత వివరాలను పరిశీలించి తరువాతి రోజు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తారు. జరి మానాలు విధిస్తారు. రెండోసారి పట్టుబడితే కేసు లు తప్పవని స్పష్టం చేసి పంపిస్తారు.● వేరే పనులకు ముందుకురాని ఉపాధి కూలీలు ● గతేడాదితో పోలిస్తే సగానికి తగ్గిన హాజరు ● చెరువుల్లో పూడికతీత పనులు లేకపోవడమే కారణం న్యూస్రీల్శాంతినగర్లో..ఖలీల్‌వాడి: నిజామాబాద్ నగరంలోని ఐదో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న శాంతినగర్‌లో మంగళవారం రాత్రి 12 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఆపరేషన్ ఛబుత్రా నిర్వహించారు. సరైన డాక్యుమెంట్లు లేని 25 ద్విచక్రవాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ట్రిపుల్ రైడింగ్ కేసులో ఓ వాహనాన్ని సీజ్ చేశారు. రోడ్లపై, గ్రౌండ్లో తిరుగుతున్న 25 మంది యువకులను స్టేషన్‌కు తీసుకెళ్లి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. నార్త్ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు గంగాధర్, రాజశేఖర్, లక్ష్మయ్య, 50 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఆపరేషన్ ఛబుత్రా రెండేళ్ల తర్వాత జిల్లా కేంద్రంలో మళ్లీ ప్రారంభించిన పోలీసులు రాత్రి వేళల్లో గుంపులుగా తిరిగే వారిపై చర్యలు -
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందరివాడు
తెయూ(డిచ్పల్లి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందరివాడని తెలంగాణ ప్రాంత సామాజిక సమరసత వేదిక కన్వీనర్ అప్పాల ప్రసాద్ పేర్కొన్నారు. అంబేడ్కర్ రీసెర్చ్ అండ్ స్టడీ సెంటర్, తెలంగాణ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘అంబేద్కర్ జీవితం – నేటి యువతకు ఆదర్శం’ అనే అంశంపై బుధవా రం క్యాంపస్ కళాశాల సెమినార్ హాల్లో సదస్సు నిర్వహించారు. సదస్సుకు ప్రధాన వక్తగా హాజరైన అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ.. బాల్యం నుంచి ఉద్యోగం చేసే వరకు కుల వివక్షను ఎదుర్కొన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వాటిని నిర్మూలించడానికి చివరి వరకు పోరాటం చేశారని తెలిపారు. భవిష్యత్ తరాలకు ఇబ్బంది రావొద్దని భావించి, దేశ పౌరులందరికీ ఒకే రాజ్యాంగం ఉండాలని రాజ్యాంగ రూపకల్పన చేశారని పేర్కొన్నారు. అంబేడ్కర్ హిందూమతానికి వ్యతిరేకం కాదని, కేవలం హిందూమతంలో ఉన్న సామాజిక వివక్షపై విసుగుచెంది సమరసతను బోధించే బౌద్ధ మతాన్ని స్వీకరించి గౌతమబుద్ధుని మార్గంలో నడిచారని తెలిపారు. కానీ కొందరు అంబేడ్కర్‌ను ఒక కులానికే పరిమితం చేసే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. విద్యార్థులందరూ అంబేడ్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని సమాజంలో నెలకొన్న సమస్యలపై బాధ్యతాయుతంగా పోరాడాలని తెయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి సూచించారు. కార్యక్రమంలో వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ మామిడాల, కమిటీ అధ్యక్షుడు పృథ్వీ, నరేందర్, అశోక్, మనో జ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ ప్రతినిధులతో సమావేశం
నిజామాబాద్ సిటీ: నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల నా యకులతో బుధవారం కమిషనర్ దిలీప్‌కుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా తయారీ, జాబితాలో తప్పుల సవరణలు వంటి అంశాలపై చర్చించారు. స మావేశంలో మున్సిపల్ అధికారులు, పార్టీల నాయకులు షకీల్ అహ్మద్ పాల్గొన్నారు. వీహెచ్‌పీ ప్రచార రథాలు ప్రారంభం నిజామాబాద్ రూరల్: వీర హనుమాన్ జయంతి శోభాయాత్ర కోసం తయారు చేసిన ప్రచార రథాలను నగరంలోని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ గౌడ్ బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో హిందూ వాహిని రాష్ట్ర టోలి సభ్యులు ప్రసాద్ జి, ఏబీవీపీ రాజ్ సాగర్ జి, నవీన్, ఆర్య సమాజ్ రాజేశ్వర్, ఇందూర్ విభాగ్ ప్రముఖ్ తమ్మల కృష్ణ, జిల్లా అధ్యక్షుడు దినేశ్ ఠాకూర్ , కార్యదర్శి గాజుల దయానంద్ తదితరులు పాల్గొన్నారు. బెట్టింగ్‌కు దూరంగా ఉండాలి డిచ్పల్లి: బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండాలని తెలంగాణ యూనివర్సిటీ అధ్యాపకు డు జెట్లింగ్ ఎల్లోసా సూచించారు. సుద్దపల్లి గ్రామంలో తెయూ ఎన్ఎస్ఎస్ యూనిట్ –1, యూనిట్–4ల సంయుక్త ఆధ్వర్యంలో కొనసాగుతున్న వేసవికాల ప్రత్యేక శిబిరంలో బుధవారం ఆన్లైన్ బెట్టింగ్తో నష్టాలపై ఆయన అవగాహన కల్పించారు. తెలంగాణ గేమింగ్ నిరోధక చట్టం 1974పై వివరించారు. కార్యక్రమంలో డిచ్పల్లి హెడ్‌కానిస్టేబుల్ ఏవీ రమణ సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్లు స్వప్న, స్రవంతి, పంచాయతీ కార్యదర్శి కవిత, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
నీటి విడుదల నిలిపివేత
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి యాసంగి సీజన్ కోసం కాలువలు, లిఫ్టుల ద్వారా నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు బుధవారం నిలిపివేశారు. డిసెంబర్ 25 నుంచి ఆయకట్టుకు ప్రాజెక్ట్ అధికారులు నీటి విడుదలను ప్రారంభించారు. వారబంధీ ప్రకారం కాలువల ద్వారా నీటి విడుదల చేపట్టారు. యాసంగి సీజన్ కోసం 63.5టీఎంసీల నీటిని కేటాయించగా, ఇప్పటి వరకు 68 టీఎంసీల నీటి వినియోగం జరిగింది. నీటి విడుదల సమయంలో ప్రాజెక్ట్‌లో 80.5 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ప్రస్తుతం 12.5 టీఎంసీల నీరుంది. కాకతీయకు కొనసాగింపు.. కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదలను మరో మూడు రోజులు కొనసాగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీంతో కాలువ ద్వారా 3,500 క్యూసెక్కుల నీరు జోన్–2 ఆయకట్టుకు ప్రవహిస్తోంది. రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రాజెక్ట్ ఎస్ఈ శ్రీనివాస్ గుప్తా తెలిపారు. కాగా, ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1062.00(12.5 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. గతేడాది ఇదే రోజున ప్రాజెక్ట్‌లో 9.7 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాకతీయ కాలువ ద్వారా కొనసాగింపు ఎస్సారెస్పీ లక్ష్మి, సరస్వతి కాలువలతోపాటు లిఫ్టులకు బ్రేక్ -
కల్తీ కల్లు కేసులో ఒకరి రిమాండ్
బాన్సువాడ: నస్రుల్లాబాద్ మండలంలోని దుర్కి, అంకోల్ గ్రామాల్లో కల్తీ కల్లు కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు బాన్సువాడ రూరల్ సీఐ రాజేశ్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కల్లులో ఆల్ప్రాజోలం అనే మత్తు పదార్థం కలపడం వల్ల 69 మంది ఆస్పత్రి పాలయ్యారన్నారు. ఈ కల్లు విక్రయించిన కేసులో దుర్కి గ్రామానికి చెందిన లక్ష్మాగౌడ్ను ప్రధాన నిందితుడిగా గుర్తించామన్నారు. నిందితుడిని జుడీషియల్ రిమాండ్‌కు తరలించామన్నారు. ఆయన వెంట ఎస్సై లావణ్య, కానిస్టేబుల్స్ శ్రీనివాస్, హరిచంద్ పాల్గొన్నారు. -
మద్యం తాగొద్దంటే కత్తితో పొడుచుకున్నాడు
ఖలీల్‌వాడి: నిత్యం మద్యం తాగివస్తే కుటుంబ పోషణ ఎలా గడుస్తుందని భార్య అడగడంతో భర్త కత్తితో పొడుచుకున్న ఘటన నగరంలో చోటు చేసుకుంది. రెండో టౌన్ ఎస్సై యాసీన్ ఆరాఫత్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అహ్మద్పుర కాలనీకి చెందిన షేక్ రఫత్ (43), రేష్మాబేగం దంపతులు. రఫత్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. నిత్యం మద్యం సేవిస్తే ఆటో ఫైనాన్స్, పిల్లల చదువుతోపాటు కుటుంబం ఎలా గడుస్తుందని రఫత్‌ను మంగళవారం భార్య ప్రశ్నించింది. దీంతో ఇంట్లో ఉన్న మామిడికాయలు కోసే కత్తితో రఫత్ పొడుచుకున్నాడు. గమనించిన భార్య జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ రఫత్ బుధవారం మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఒంటరి జీవితంపై విరక్తితో మహిళ..దోమకొండ: మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన కొత్తపల్లి మల్లవ్వ (52) మంగళవారం గ్రామ శివారులోని పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై స్రవంతి తెలిపిన వివరాల ప్రకారం.. మల్లవ్వ భర్త ఎల్లయ్య 2001 నుంచి కనిపించడం లేదు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కూతురికి పెళ్లి చేయగా కుమారుడు నరేశ్ ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లాడు. అప్పటి నుంచి మల్లవ్వ ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. కుటుంబీకులు ద గ్గర లేకపోవడంతో ఒంటరి జీ వితంపై విరక్తి చెంది మంగళవారం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని బుధవారం చెరువులో నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై స్రవంతి వివరించారు. కుటుంబ కలహాలతో ఒకరు.. ఇందల్వాయి: చంద్రాయన్పల్లి గ్రామానికి చెందిన తూర్పు రాజన్న (48) కుటుంబ లహాలతో మంగళవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మనోజ్ తెలిపారు. రాజన్న నెల రోజుల క్రితమే గల్ఫ్ నుంచి ఇంటికి వచ్చాడని, ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడినట్లు పేర్కొన్నారు. మృతుడికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారని, భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
బాలుడి అదృశ్యం.. అరగంటలో గుర్తించిన పోలీసులు
కామారెడ్డి క్రైం: కామారెడ్డి బస్టాండ్‌లో నాలుగేళ్ల బాలుడు తప్పిపోగా పోలీసులు అరగంటలో గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. మాచారెడ్డి మండలం పోతారం గ్రామానికి చెందిన వల్లపు నర్సవ్వ తన నాలుగేళ్ల మనువడు ఈశ్వర్‌ను వెంట తీసుకొని బుధవారం జిల్లా కేంద్రానికి వచ్చి తిరుగు ప్రయాణంలో కొత్త బస్టాండ్‌కు చేరుకుంది. జ్యూస్ కొనుక్కుని వస్తానని బస్టాండ్‌లో మనువడిని కూర్చోబెట్టి పక్కనే ఉన్న స్టాల్‌కు వెళ్లింది. 5 నిమిషాల తర్వాత వచ్చి చూడగా బాలుడు కనిపించలేదు. ఆందోళనకు గురైన నర్సవ్వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే ప్రాంతంలో విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ శిరీష, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి బాలుడి ఆచూకీ కోసం గాలించారు. అరగంట తర్వాత అశోక్‌నగర్ చౌరస్తా వద్ద బాలుడిని గుర్తించారు. పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి బాలుడిని తండ్రి అలకుంట ఎల్లయ్య, అమ్మమ్మ నర్సవ్వకు అప్పగించారు. పోలీసు సిబ్బందిని పట్టణ ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పట్టణంలోని సిద్ధులగుట్ట వెనుకాల ఓ హోటల్ పక్కన ఖాళీ స్థలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. మృతుడికి సుమారు 15– 25 సంవత్సరాల వయస్సు ఉంటుందని, ఒంటిపై ఎరుపు రంగు టీషర్టు, బ్లూకలర్ జీన్స్ ప్యాంటు ఉందని పేర్కొన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌కు సంప్రదించాలని పేర్కొన్నారు. -
యువ వికాసానికి దరఖాస్తుల జోరు
నిజామాబాద్‌అర్బన్: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువ తకు రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు రాయి తీతో కూడిన రుణాలు ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. జిల్లాలోని నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ పథకానికి మార్చి 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. మొదట ఈ నెల 5వ తేదీ దరఖాస్తులకు తు ది గడువు ప్రకటించిన ప్రభుత్వం.. గడువు తేదీని ఈ నెల 14కు పొడిగించింది. దీంతో మరింత మంది దరఖాస్తు చేసుకునేందుకు ముందుకొస్తున్నారు. ఆఫ్లైన్లోనూ దరఖాస్తులకు అవకాశం రాజీవ్ యువ వికాసం పథకానికి ప్రభుత్వం మొదట ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించింది. ఇటీవల ఆఫ్‌లైన్(ఫారం రూపం)లోనూ దరఖాస్తులను తీసుకుంటోంది. ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచింది. అక్కడే దరఖాస్తు ఫారాలను నింపి సంబంధిత ధ్రువపత్రాలు జత చేసి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. దరఖాస్తుదారులు పూరించిన ఫారాలను సంబంధిత మండల కేంద్రాల్లో ఎంపీడీవో కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. కాగా, సంబంధిత శాఖల అధికారులు అర్హులందరికీ ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చాలని భావిస్తున్నారు. అందులో భాగంగా విస్తృత ప్ర చారం నిర్వహిస్తున్నారు. ధ్రువీకరణ పత్రాల కోసం బారులు జిల్లా వ్యాప్తంగా మీ సేవ కేంద్రాల్లో నిరుద్యోగ యువత కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు అప్లయ్ చేసుకునేందుకు బారులు తీరుతున్నారు. యువవికాసం పథకానికి రెండు సర్టిఫికెట్లు ప్రధా నం కావడంతో మీ సేవలో దరఖాస్తు చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంత యువతకు సంవత్సర ఆదాయం రూ.1,50,000, మున్సిపల్ పరిధిలోని పట్టణ ప్రాంతాల వారికి రూ.2,00,000 ఆదాయం మించకూడదని పథకం గైడ్‌లైన్స్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. జతచేయాల్సిన ధ్రువీకరణ పత్రాలు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో ఆధార్ పాన్ కార్డు రేషన్‌కార్డు (లేనివారు ఆదాయ ధ్రువీకరణ పత్రం) కుల ధ్రువీకరణపత్రం బ్యాంకు ఖాతా జిరాక్స్ విద్యార్హతల సర్టిఫికెట్లు శిక్షణ సర్టిఫికెట్ (శిక్షణ పొంది ఉంటే) బల్దియాలో ప్రత్యేక కౌంటర్లునిజామాబాద్ సిటీ: రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల స్వీకరణకు నగర బల్దియాలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అర్హులైన యువత ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. సంబంధిత ధ్రువీకరణ పత్రాలు తీసుకొని మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు ఫారాన్ని పూరించి నేరుగా అధికారులకు ఇచ్చే వెసులుబాటును కల్పించింది. 7వ తేదీ వరకు 28,828 అప్లికేషన్లు ఈ నెల 14 వరకు అవకాశం ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ బల్దియా, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు సద్వినియోగం చేసుకోవాలి జిల్లాలోని నిరుద్యోగులు రా జీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకొని నచ్చి న రంగాల్లో ఉపాధి పొందే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోంది. సకాలంలో దరఖా స్తు చేసుకుంటే ఎంతో మేలు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – రమేశ్, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి -
ఆర్టీసీ సిబ్బందికి ‘ప్రగతి చక్రం’ పురస్కారాలు
ఖలీల్‌వాడి: నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ‘ప్రగతి చక్రం‘ పురస్కారాలను అందజేసినట్లు ఆర్ఎం జ్యోత్స్న మంగళవారం తెలిపారు. ఉత్తమ సిబ్బందికి త్రైమాసిక పురస్కారాలను అందజేశామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం ఎస్ మధుసూదన్, డిపో మేనేజర్లు, పర్సనల్ ఆఫీసర్, సూపర్ వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. జాతీయస్థాయి ఉషూలో కాంస్య పతకం నిజామాబాద్‌నాగారం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్పూర్లో గత నెల 24 నుంచి 28వ తేదీ వరకు జాతీయ ఉషూ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో నగరంలోని కేర్ డిగ్రీ కళాశాల విద్యార్థి బిలాల్ కాంస్య పతకం సాధించాడు. తెలంగాణ తరఫున సీనియర్ స్థాయి పోటీల్లో ప్రాతినిథ్యం వహించిన బిలాల్‌ను కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్, ప్రిన్సిపల్ బాలకృష్ణ సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రోత్సహించడంలో తమ కళాశాల ఎప్పుడూ ముందుంటుందన్నారు. క్రీడాకారులకు సహాయసహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా బిలాల్ కళాశాల యాజమాన్యానికి బిలాల్ కృతజ్ఞతలు తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ నరేశ్, కళాశాల ప్రతినిధులు కొయ్యాడ శంకర్, సందేశ్, సందీప్ పాల్గొన్నారు. వీడీసీపై చర్యలు తీసుకోవాలి ఖలీల్‌వాడి: ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ వీడీసీపై చర్యలు తీసుకోవాలని ఆ గ్రామానికి చెందిన గౌడకులస్తులు పెద్దసంఖ్యలో పోలీస్ కమిషనరేట్‌కు తరలివచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పాత ఎంపీడీవో కార్యాలయం నుంచి సీపీ కార్యాల యం వరకు జిల్లా గౌడ సంఘం, జిల్లా యు వజన గౌడ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ ని ర్వహించగా, తాళ్ల రాంపూర్‌కు చెందిన మ హిళలు, గౌడకులస్తులు పాల్గొని సీపీ కార్యాలయం గేటు వద్ద బైటాయించారు. తాళ్లరాంపూర్ వీడీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. శ్రీరామనవమి సందర్భంగా కుంకు మార్చనకు వెళ్లిన తమను ఆలయం నుంచి బయటికి పంపించిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. అనంతరం గౌడ కులస్తులు మాట్లాడుతూ.. గత ఆరు నెలలుగా గ్రామంలో కల్లు తాగేందుకు ఎవరూ రావడం లేదన్నారు. దీంతోపాటు వీడీసీ సభ్యులు గౌడకులస్తులను లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ట్లు చెప్పారు. రామా గౌడ్, సుదర్శన్, సతీశ్, సత్యనారాయణగౌ డ్, సారా సురేశ్, దేగాంయాదగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అధికారులు వేధిస్తున్నారు నిజామాబాద్ రూరల్: ట్రేడ్ లైసెన్స్ ఫీజు పేరుతో వ్యాపారులను అధికారులు వేధిస్తున్నారని, నోటీసులు ఇవ్వకుండా ఇష్టం వ చ్చినట్లు ఫీజులు వసూలు చేస్తున్నారని చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు ఆరోపించారు. హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నా అధికారులు వేధిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కు చాంబర్ అధ్యక్షుడు రావులపల్లి జగదీశ్వర్‌రావు నేతృత్వంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుల ఐడెంటిటీ స ర్టిఫికెట్ చూయిస్తే హై కోర్టు ఆర్డర్ ప్రకారం ప్రస్తుతానికి ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూలు చేయబోమని స్పష్టం చేశారు. కమిషనర్‌ను కలిసిన వారిలో కార్యదర్శి కమల్ ఇనాని, ని శిత రాజు, మోహన్‌రెడ్డి, భక్తవత్సలం, శ్యా మ్ అగర్వాల్, వెంకటగౌడ్, దినేశ్‌రెడ్డి, నర్సింహరెడ్డి, శ్రీనివాసరావు, గంగాధర్రా వు, జమీల్, హరి ప్రసాద్, ప్రసాద్, దాస్, పటేల్, కౌలయ్య, దర్శన్‌సింగ్ ఉన్నారు. -
ధాన్యం సేకరణను వేగవంతం చేయాలి
ధర్పల్లి: అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా వెంటవెంటనే రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంతోపాటు హోన్నాజిపేట్ లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన మంగళవారం పరిశీలించారు. తూకం యంత్రాలు, గన్నీ బ్యాగులు, ధాన్యం సేకరణ, మిల్లులకు తరలింపునకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. రైస్ మిల్లుల్లో వెంటవెంటనే అన్లోడ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు . జిల్లా వ్యాప్తంగా 700కుపైగా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేపడుతున్నామని, 250 వరకు కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఈ సీజన్లో ఇప్పటివరకు 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు వెల్లడించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కలెక్టర్ వెంట డీఆర్డీవో సాయాగౌడ్, ఆర్డీవో రాజేంద్రకుమార్, డీసీవో శ్రీనివాసరావు, డీఎస్వో అరవింద్, సివిల్ సప్లయీస్ డీఎం శ్రీకాంత్‌రెడ్డి, తహసీల్దార్ మాలతి, ఎంపీడీవో బాలకృష్ణ తదితరులు ఉన్నారు. రైస్‌మిల్లుల్లో వెంటవెంటనే అన్లోడ్ చేయాలి రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు -
‘ట్రామా కేర్’పై చిగురించిన ఆశలు
ఇందల్వాయి: ప్రమాదాల్లో క్షతగాత్రులకు సత్వరమే అత్యవసర చికిత్సలు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 90 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్‌ను నెలకొల్పేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నిజామాబాద్ జిల్లా పరిధిలో సుమారు 75 కి.మీల మేర జాతీయ రహదారి ఉంది. దీనికి అనుసంధానంగా రాష్ట్ర రహదారులు కూడా ఉన్నాయి. వీటిపై నిత్యం ఏదో చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో అత్యవసర చికిత్స అందక కొందరి ప్రాణాలు పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇందల్వాయి, బాల్కొండ, ఆర్మూర్ ప్రాంతాల్లో ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుపై ఆశలు చిగురించాయి. అనుకూలంగా ఇందల్వాయి పీహెచ్సీ జిల్లాలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఒక్క ట్రామా కేర్ సెంటర్ కూడా లేదు. కామారెడ్డిలో ఓ సెంటర్ ఉన్నా నిర్దేశిత వైద్యసేవలందక పోవడంతో క్షతగాత్రులు ఇబ్బందులుపడుతున్నారు. జాతీయ రహదారిని ఆనుకొని కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కేంద్రాలకు సమాన దూరంలో ఉన్న ఇందల్వాయి పీహెచ్‌సీని ట్రామా కేర్ సెంటర్‌గా మార్చి నిరంతర వైద్య సేవలందిస్తే క్షతగాత్రులకు దోహదపడే అవకాశం ఉంది.ఇందల్వాయి పరిధిలో రోడ్డు ప్రమాదాలు జిల్లా పరిధిలోని జాతీయ రహదారిపై లేని సెంటర్ క్షతగాత్రులకు గోల్డెన్ అవర్‌లో అందని చికిత్స రాష్ట్ర వ్యాప్తంగా 90 కేంద్రాల ఏర్పాటుకు సర్కారు కసరత్తు అత్యవసర చికిత్స ఆలస్యం అవదు రాష్ట్రంలో సగటున రోజుకు 21 మంది రోడ్డు ప్రమాదా ల్లో చనిపోతున్నారు. ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుతో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డవారికి త్వరగా చికిత్స అందే అవకాశం ఉంటుంది. దీంతో రోడ్డు ప్రమాద మరణాలు తగ్గుతాయి. ట్రామాకేర్లను వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తే రోడ్డు ప్రమాద బాధితులకు ఊరట కలుగుతుంది. – కే మల్లేశ్, సీఐ, డిచ్పల్లిప్రతిపాదనలు అందించాం మంత్రి దామోదర రాజనరసింహ జనవరిలో నియోజకవర్గంలో ప ర్యటించినప్పుడు ఇందల్వాయి లో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు అవశ్యకతపై వివరించి ప్రతిపా దనలు అందజేశాం. అత్యవసర చికిత్సల కోసం డీఎంహెచ్‌వోతో మాట్లాడి ఇద్దరు అదనపు డాక్టర్లను డిచ్పల్లి సీహెచ్‌సీ కేటాయించాం. ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తా. – ఆర్ భూపతిరెడ్డి, ఎమ్మెల్యే, నిజామాబాద్ రూరల్ -
హాస్టళ్లలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని వసతిగృహాలు, కళాశాలల్లో పోలీసు డాగ్‌స్క్వాడ్ బృందాలు, స్పెషల్ టీములు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టిన పోలీసు సిబ్బంది విద్యార్థులకు, యువకులకు డ్రగ్స్ వాడకంతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. 11న అర్సపల్లిలో టేకు చెట్ల వేలం డొంకేశ్వర్(ఆర్మూర్): నగరంలోని అర్సపల్లి మత్స్య శాఖకు చెందిన ప్రాంగణంలో మార్క్ చేసిన పన్నెండు టేకు చెట్లను ఈ నెల 11న ఉదయం 10గంటలకు వేలం వేయనున్నట్లు మత్స్య శాఖ అధికారి ఆంజనేయులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ అనుమతితో అటవీ శాఖ అధికారులు నిర్ణయించిన ధరకు వేలం వేస్తామని పేర్కొన్నా రు. ఆసక్తిగలవారు రూ.5వేలు చెల్లించి వేలంలో పాల్గొనాలని, వేలంలో చెట్లను దక్కించుకున్నవారు అటవీ అధికారులతో పర్మిట్‌తో దుంగలను తీసుకెళ్లాలని సూచించారు. వేలంలో పాల్గొనేందుకు చెల్లించిన రూ.5వేలు తిరిగి ఇవ్వబడవని స్పష్టం చేశారు. -
ఎస్సెస్సీ మెరిట్ విద్యార్థులకు ఫీజు రాయితీ
నిజామాబాద్‌అర్బన్: పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కాకతీయ ఐఐటి, మెడికల్ అకాడమిలో ఫీజు రాయితీ ఇవ్వనున్నట్లు కాకతీయ ఐఐటీ మెడికల్ అకాడమీ చైర్పర్సన్ విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాసంస్థ స్థాపించబడి 35 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఫీజు రాయితీ అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. మెరిట్ విద్యార్థులకు ఇంటర్ విద్యతోపాటు ఐఐటీ, మెడికల్ కోచింగ్‌లో ఫీజు రాయితీ ఇవ్వనున్నుట్లు తెలిపారు. ప్రతీ తరగతిలో ఐదుగురికి మాత్రమే ఈ అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. 575కు పైగా మార్కులు వచ్చిన వారికి 100 శాతం ఫీజు రాయితీ, 565కు పైగా మార్కులు వచ్చిన వారికి 75 శాతం, 555కు పైగా మార్కులు వచ్చిన వారికి 60 శాతం, 545కు పైగా మార్కులు వచ్చిన వారికి 50 శాతం, 535కు పైగా మా ర్కులు వచ్చిన వారికి 45 శాతం, 525కు పైగా మార్కులు వచ్చిన వారికి 40 శాతం, 500లకు పైగా మార్కులు వచ్చిన వారికి 30 శాతం ఫీజు రాయితీ కల్పించనున్నట్లు తెలిపారు. మెరిట్ ప్రోత్సాహకాలు రెండు సంవత్సరాలకు వర్తిస్తుందని ఆమె తెలిపారు. పూర్తి వివరాలకు 91820 29525, 91775 56270 నెంబర్లను సంప్రదించాలని ఆమె అన్నారు. అంబేడ్కర్ జయంతి బ్రోచర్ ఆవిష్కరణ తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో ఈనెల 14న అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెయూ వీసీ యాదగిరిరావు అన్నారు. ఈమేరకు మంగళవారం తెయూలో కార్యక్రమ బ్రోచర్లను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా వీసీ మాట్లాడుతూ.. కార్యక్రమంలో కీలకోపన్యాసం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ లింబాద్రి హాజరవుతున్నారని తెలిపారు. ప్రిన్సిపల్ ప్రవీణ్ మామిడాల, ఎస్సీ సెల్ డైరెక్టర్ వాణి, ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఇంటిని కూల్చిన కేసులో నలుగురి రిమాండ్ వేల్పూర్: మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో గత నెలలో బచ్చు గంగాధర్ అనే వ్యక్తి ఇంటిని అక్రమంగా కూల్చిన కేసులో మంగళవారం నలుగురు గ్రామస్తులను రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై సంజీవ్ తెలిపారు. మచ్చర్ల నర్సారెడ్డి, ఏనుగు మోహన్‌రెడ్డి, రిక్క రాజేశ్వర్, ఏనుగు నర్సారెడ్డి లను రిమాండ్‌కు తరలించామన్నారు. ఈ కేసులో ఇప్పటికే నిజామాబాద్ జైల్లో కొందరు రిమాండ్‌లో ఉండగా, మరికొంత మంది పరారీలో ఉన్నారని వెల్లడించారు. వృద్ధుడి అదృశ్యం మాచారెడ్డి: ఎల్లంపేట గ్రామానికి చెందిన మాలోత్ రాజ్య(60) అనే వృద్ధుడు అదృశ్యమైనట్లు ఎస్సై అనిల్ మంగళవారం తెలిపారు. మార్చి 31న మహారాష్ట్రలోని పౌరాదేవి దర్శనం కోసం వెళ్లిన రాజ్య ఇప్పటికీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయొద్దు
తెయూ(డిచ్పల్లి): రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయొద్దని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర సహాయ కార్యదర్శి దామెర కిరణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీలో మంగళవారం ఎస్ఎఫ్ఐ ఆరవ మహాసభ నిర్వహించారు. ఈసందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. యూనివర్సిటీలకు పెద్దపీట వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చినా ఇప్పటి వరకు ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. వెంటనే తెలంగాణ యూనివర్సిటీలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. అనంతరం 15మంది సభ్యులతో కూడిన తెయూ ఎస్ఎఫ్ఐ నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా శివ, అధ్యక్షుడిగా జీషణ్, వర్సిటీ ఆఫీస్ బేరర్స్‌గా నాగేంద్ర, నిరంజన్, సంధ్య ఎన్నికయ్యారు. జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్, జిల్లా ఉపాధ్యక్షుడు దినేష్, కమిటీ సభ్యులు సంతోష్, కొండల్ పాల్గొన్నారు. -
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఆక్రమణ
ధర్పల్లి: మండలకేంద్రంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయకపోవడంతో ప్రజలు మంగళవారం ఆగ్రహించి, ఇళ్ల తాళాలు తొలగించి, ఆక్రమించుకున్నారు. ధర్పల్లిలో మూడేళ్ల క్రితం 48 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. వీటికోసం పలువురు నిరుపేదలు దరఖాస్తు చేసుకున్నారు. ఏళ్లు గడుస్తున్నా ఇళ్లను పంపిణీ చేయకపోవడంతో 30 మంది నిరుపేద కుటుంబాలు ఆగ్రహించి ఇళ్లలోకి ప్రవేశించి, సామగ్రిని భద్రపరుచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇళ్ల పంపిణీ చేయకుండా చొరబడడం చట్టా విరుద్ధమని తహసీల్దార్ మాలతి వారికి తెలిపారు. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని త్వరలో లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లను కేటాయిస్తామన్నారు. ఇళ్లలోకి చొరబడిన వారిని అధికారులు సముదాయించి బయటకు పంపించారు. -
మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్టు
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని మేడిపల్లి అటవీ శివారులో జరిగిన అమీనాబేగం అనే మహిళ హత్యకేసులో నిందితుడు కేతావత్ పీరాజీని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సదాశివనగర్ సీఐ సంతోష్‌కుమార్ మంగళవారం తెలిపారు. వివరాలు ఇలా.. పీరాజీ మేడిపల్లి గ్రామ పరిసరాల్లో తిరుగుతుండగా అరెస్టు చేసి పోలీస్టేష్న్కు తీసుకొచ్చామన్నారు. అతడిని విచారించగా అమీనా బేగంపై దాడి చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. మహిళపై దాడి చేసిన కర్రను స్వాధీనం చేసుకొని పీరాజీని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. గాంధారి ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది ఉన్నారు. -
చెరువులో పడి ఒకరి మృతి
ఇందల్వాయి: మండలంలోని గండి తండాలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని గండితండాకు చెందిన విస్లావత్ నరేందర్ (43) సోమవారం రాత్రి తన పొలం వద్ద ఉన్న బర్రెలకు నీరు పెట్టడానికి ఇంటి నుంచి వెళ్లాడు. ఈక్రమంలో పొలం పక్కన ఉన్న చెరువులో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. ఈమేరకు మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బావిలో పడి వృద్ధుడు.. కామారెడ్డి క్రైం: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి శివారులో ఓ వృద్ధుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా.. లింగాపూర్ గ్రామానికి చెందిన చెట్కూరి ఎల్లయ్య (85) కొద్ది రోజులుగా వృద్ధాప్య కారణాలతో మతిస్థిమితం కోల్పోయాడు. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేడు. కుటుంబ సభ్యులు చాలాచోట్ల గాలించిన ఆచూకీ దొరకలేదు. దేవునిపల్లి శివారులోని బండారి రాజిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న బావిలో ఎల్లయ్య మృతదేహం మంగళవారం తేలింది. సమాచారం అందుకున్న దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి భార్య మల్లవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి.. డిచ్పల్లి: డిచ్పల్లి రైల్వేస్టేషన్ వద్ద సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి పట్టాలు దాటుతూ రైలు ఢీకొని మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయారెడ్డి మంగళవారం తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. మృతుడు సుమారు 35 సంవత్సరాల వయస్సు ఉంటాడన్నారు. నిజామాబాద్ స్టేషన్ మేనేజర్ దుర్గాప్రసాద్ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే నిజామాబాద్ రైల్వే పోలీస్ ఫోన్ నంబర్ 8712652591కు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు. చికిత్స పొందుతూ ఒకరు.. రెంజల్(బోధన్): రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై చంద్రమోహన్ మంగళవారం తెలిపారు. వివరాలు ఇలా.. నవీపేట మండలం నాగేపూర్ గ్రామానికి చెందిన మద్దెల మదారి(41)అనే వ్యక్తి సోమవారం అర్ధరాత్రి అత్తగారి ఊరైన రెంజల్ మండలంలోని నీలా గ్రామానికి బైక్‌పై బయలుదేరాడు. మార్గమధ్యలో తాడ్‌బిలోలి గ్రామం వద్ద వడ్ల బస్తాలను ఢీకొనడంతో కిందపడి గాయపడ్డాడు. స్థానికులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి బిచ్కుంద(జుక్కల్): వాహదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపారు. బిచ్కుంద అంబేడ్కర్ చౌరస్తాలో మంగళవారం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించి, ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. వాహనదారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. తల్లింద్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దన్నారు. -
బంగారం దుకాణంలో చోరీ
పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద ఉన్న ఓ బంగారం దుకాణంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రంలోని బంగారు దుకాణాన్ని మంగళవారం ఉదయం నిర్వాహకులు తెరచి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. గుర్తుతెలియని దుండగుడు సోమవారం అర్ధరాత్రి దుకాణం వెనుక ఉన్న తలుపులు పగలగొట్టి లోపలికి చొరబడి సొత్తును దొంగలించినట్లు తెలిపారు. సుమారుగా 17కిలోల వెండి, 6తులాల బంగారం చోరీ చేసినట్లు బాధితుడు తెలిపాడు. ఈమేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినల్లు ఎస్సై రాజు తెలిపారు. ఆలయంలో చోరీకి విఫలయత్నం నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గోపాల్పేట పోలీస్‌స్టేషన్ సమీపంలోని రేణుకామాత ఆలయంలో సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి విఫలయత్నం చేశారు. ఆలయంలోని హుండీని పగులగోట్టేందుకు వారు ప్రయత్నించినప్పటికీ హుండీ తలుపు తెరుచుకోకపోవడంతో దుండగులు వెనుదిరిగారు. మంగళవారం ఉదయం ఆలయాన్ని శుభ్రపర్చేందుకు వచ్చినవారు హుండీ తలుపు ధ్వంసమై ఉండడాన్ని గమనించి ఆలయకమిటీ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఆలయకమిటీ సభ్యులు అక్కడికి చేరుకొని, నాగిరెడ్డిపేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆలయానికి చేరుకొని హుండీని పరిశీలించి, వివరాలు సేకరించారు. -
కల్తీ కల్లుతో ప్రయోగాలు!
నిజామాబాద్‌నాగారం: సంపాదనే ధ్యేయంగా కల్లు వ్యాపారులు ఇష్టారీతిన కల్తీ కల్లు తయారు చేస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కల్లీ కల్లు తయారు చేయడంలో ప్రయోగాలు చేస్తూ ఏళ్ల తరబడిగా క్లోరోహైడ్రేట్, అల్ప్రాజోలం, డైజోఫామ్ తదితర మత్తు పదర్థాలు వాడుతున్నారు. దీంతో ఆ కల్తీకల్లు తాగిన ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇటీవల నస్రూల్లాబాద్ మండలం దుర్కీలో కల్తీకల్లు తాగి పలువురు అస్వస్థతకు గురయ్యారు. వారిలో కొంతమందిని చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆస్పత్రికి తరలించగా, మరికొంతమందిని నిజామాబాద్ జీజీహెచ్‌కు తరలించారు. 72గంటలు వైద్యుల పర్యవేక్షణలోనే.. దుర్కిలో కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన వారిలో శివలక్ష్మి, బుజ్జీ, లక్ష్మణ్, నరేష్, తులసవ్వ, అర్వింద్, లచ్చవ్వ, కాశీరాం, రవి, మారుతి, మోహన్, బాలమణి, మధు, నాగర్జున్లు జీజీహెచ్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. బాధితులను వైద్యులు పరీక్షించగా, కల్లు వ్యాపారులు ప్రయోగాలు చేయడానికి యాంటి సైకియాట్రిక్ గ్రూప్స్‌కు సంబంధించిన కొత్త మందును కలిపినట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. అందువల్లే బాధితులు తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో కోలుకోవడానికి 72గంటల సమయం పడుతుందని మంగళవారం తెలిపారు. ఈ కల్తీ కల్లు తాగడం వల్ల బాధితులకు గంటల వ్యవధిలోనే నాలుక దొడ్డుగా మారడం, సిరలు పడిపోవడం, నొప్పులు తదితర వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు వారిని హుటాహుటిన ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు. కల్తీ వ్యాపారులకు, అక్రమార్కులకు పేదల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయిందని పలువురు మండిపడుతున్నారు. కల్లులో ప్రయోగాలు చేయడంలో ఎవరైనా చనిపోతే రూ. 20వేల నుంచి రూ. 80వేల వరకు కుటుంబ సభ్యులకు ముట్టజెప్పి చేతులు దులుపుకున్న ఘటనలు కోకొల్లాలుగా ఉన్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి, కల్తీకల్లు విక్రయాలను అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని పలువురు కోరుతున్నారు.ప్రజల ప్రాణాలతో చెలగాటం దుర్కిలో కల్తీకల్లు తాగి పలువురికి అస్వస్థత జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్న వైద్యులుమాట్లాడ రాలేదు.. కల్తీకల్లు తాగిన కొద్దిసేపటికే నాలుక దొడ్డుగా అయ్యింది. మాట్లాడటం రాలే దు. సిరలు మొత్తం పడిపోయాయి. మా నాన్న చూసి వెంటనే నన్ను ఆస్పత్రికి తీసుకవచ్చి చికిత్స అందించారు. – అర్వింద్, కల్తీకల్లు బాధితుడు -
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
● కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ● ప్రజావాణికి 70 వినతులునిజామాబాద్అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 70 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, మెప్మా పీడీ రాజేందర్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.బకాయిలు ఇప్పించండిగత కొన్ని సంవత్సరాలుగా బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు నిధులు మంజూరు కావడంలేదు. దీంతో విద్యార్థులకు విద్య అందించడం చాలా ఇబ్బందిగా మారింది. కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేయాలి. – జయసింహ గౌడ్, విజ్ఞాన్ హైస్కూల్ కరస్పాండెంట్ -
కామారెడ్డిలో ఒకరి ఆత్మహత్య
కామారెడ్డి క్రైం: జిల్లాకేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. కాలనీకి చెందిన బోదాసు రాజు (35) కూలీ పని చేసుకుంటూ జీవించేవాడు. అతడికి లక్ష్మీతో 13 ఏళ్ల క్రితం వివాహం జరుగగా, ఇద్దరు సంతానం ఉన్నారు. దంపతుల మధ్య గొడవలు జరుగడంతో లక్ష్మి కొద్దిరోజులుగా తన తల్లిగారింటి వద్దనే ఉంటోంది. దీంతో రాజు మద్యానికి బానిసై, భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపం చెందేవాడు. ఈక్రమంలో ఆదివారం అర్ధరాత్రి అతడు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు అతడిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి అన్న యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి.. కామారెడ్డి క్రైం: రైలు కింద పడి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన వడియారం– మిర్జాపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ప్రాంతంలో సోమవారం ఉదయం వెలుగుచూసింది. పట్టాలపై మృతదేహం పడి ఉందని సమాచారం రావడంతో కామారెడ్డి రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడి ఎడమ చేతికి వెండి కడియం, ఛాతిపై కుడి వైపున పుట్టు మచ్చ ఉన్నాయని రైల్వే పోలీసులు తెలిపారు. ఆనవాళ్లు తెలిసిన వారు కామారెడ్డి రైల్వే పోలీసులను సంప్రదించాలని, కేసు విచారణ అధికారి హన్మాండ్లు కోరారు. -
మహిళపై వ్యక్తి దాడి
గాంధారి(ఎల్లారెడ్డి): తన కొడుకును కిడ్నాప్ చేసి, దాచిందనే అనుమానంతో ఓ మహిళపై నిందితుడు దాడి చేయగా, తీవ్ర గాయాలతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా.. చందానాయక్ తండాకు చెందిన కేతావత్ పిరాజీ గత కొన్నేళ్లుగా హైదరాబాద్ బేగంపేట్‌లో ఉంటూ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతంలో అమీనాబేగం (35) కూడా భిక్షాటన చేస్తూ జీవనం సాగించేది. పిరాజీ కుమారుడు నాలుగేళ్ల వయస్సుగల శ్రీకాంత్ కొన్ని రోజులుగా కనిపించకుండా పోయాడు. అమీనా బేగం తన కుమారుడిని కిడ్నాప్ చేసి దాచిందనే అనుమానంతో పిరాజీ ఆమెను ఇటీవల చందానాయక్ తండాకు తీసుకొచ్చాడు. ఆమెను తన కొడుకును ఎక్కడ దాచావో చెప్పాలని ప్రశ్నించాడు. ఆమె వివరాలు చెప్పలేదు. ఈక్రమంలో తండా సమీపంలోని మేడిపల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి విచక్షణా రహితంగా కర్రలతో కొట్టాడు. అనంతరం అక్కడి నుంచి అతడు వెళ్లిపోయాడు. ఆమెకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు గమనించి గాంధారి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె సోమవారం మృతి చెందింది. మేడిపల్లి మాజీ సర్పంచ్ నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్ విచారణ చేస్తున్నారని ఎస్సై తెలిపారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి కొడుకును కిడ్నాప్ చేసిందనే అనుమానంతో ఘాతుకానికి పాల్పడిన నిందితుడు చందానాయక్ తండాలో ఘటన -
పచ్చిధాన్యం కొనుగోళ్లకు వ్యాపారులు సై
మోర్తాడ్(బాల్కొండ): పచ్చి ధాన్యంను సైతం కొనుగోలు చేయడానికి వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. పచ్చి ధాన్యంను కొనుగోలు చేస్తామని వ్యాపారులు తమ ఏజెంట్ల ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. దొడ్డు రకాలైతే రూ.2,200, సన్న రకా లైతే రూ.2,300 ధరను క్వింటాలుకు చెల్లిస్తామని వ్యాపారులు చెబుతున్నారు. పొలాల వద్దకే వచ్చి ధాన్యం తూకాలు చేస్తున్నారు. ప్రభుత్వం సన్నాలకు బోనస్ ప్రకటించడంతో.. యాసంగి సీజనులోని సన్న రకాలకు బోనస్ చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో రైతులు తమ పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించడానికి మొగ్గుచూపుతున్నారు. దీంతో దళారులు, వ్యాపారులు తమ వ్యాపారం కోసం వరి ధాన్యంను సేకరించుకోవడానికి ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసే వరి ధాన్యంకు తేమ శాతం 17కు మించి ఉండకూడదనే నిబంధన ఉంది. తేమ శాతం తక్కువగా ఉండాలంటే ధాన్యంను ఎండబెట్టాల్సి ఉంటుంది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటే చేతికి వచ్చిన ధాన్యం నీటిపాలై నష్టపోతామని కొందరు రైతులు భావిస్తున్నారు. దీంతో పలువురు రైతులు పొలాల వద్దనే పచ్చి ధాన్యంను వ్యాపారులకు విక్రయిస్తున్నారు. రైతుల నుంచి పచ్చి ధాన్యంను సేకరిస్తే తూకం వేసిన ధాన్యానికి సొమ్మును 15 రోజుల నుంచి 25 రోజుల గడువులోగా చెల్లించడానికి వ్యాపారులు అంగీకరిస్తున్నారు. జిల్లాలో సన్న రకాలే ఎక్కువ.. యాసంగి సీజనులోనూ సన్న రకాలకు బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం వెల్లడించడంతో జిల్లాలో 80 శాతం సన్న రకాలే సాగు చేశారు. దొడ్డు రకాలు కేవలం 20 శాతం మాత్రమే ఉంది. విదేశాలకు బాయిల్డ్ బియ్యంను ఎగుమతి చేసే వ్యాపారులు తమ వ్యాపారం కోసం పచ్చి ధాన్యంను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించే ధాన్యం మిల్లర్ల వద్దకు చేరాలంటే ఎక్కువ సమయం పడుతుంది. పచ్చి ధాన్యంను కొనుగోలు చేస్తే వెంటవెంటనే బాయిల్డ్ మిల్లులకు తరలించుకోవచ్చని వ్యాపారులు భావిస్తున్నారు. దొడ్డు రకాలకు రూ.2,200, సన్న రకాలకు రూ.2,300గా ధర నిర్ణయం పొలాల వద్దనే తూకం చేస్తున్న వైనం -
నల్లమడుగులో క్షుద్ర పూజల కలకలం
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని నల్లమడుగు ఉన్నత పాఠశాలలో క్షుద్రపూజల కలకలం రేపింది. పాఠశాలకు శని, ఆదివారాలు సెలవులు రావడంతో గుర్తుతెలియని వ్యక్తులు పాఠశాలలోని ఓ గది వద్ద ముగ్గు వేసి పసుపు, కుంకుమ, అరటిపండ్లు, నిమ్మకాయలతో పట్టు వేసినట్లు బొమ్మలను వేశారు. సోమవారం ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ఈ దృశ్యాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం గ్రామంలో తెలియడంతో చర్చనీయాంశంగా మారింది. గ్రామస్తులు, కార్యదర్శి, మాజీ సర్పంచ్, గ్రామ పెద్దలతో చర్చించి లింగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు హెచ్ఎం కోటేశ్వర్రావు తెలిపారు. రెండు స్కూల్ బస్సులు ఢీ: తప్పిన పెను ప్రమాదం మోపాల్: మండలంలోని కులాస్పూర్ తండా శివారులో సోమవారం ఉదయం రెండు స్కూల్ బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. కంజర్ గ్రామంలోని శ్రీసాయి విద్యానికేతన్ బస్సు, డిచ్పల్లి మండలంలోని వివేకానంద స్కూల్ బస్సు సోమవారం పిల్లలను తీసుకొచ్చేందుకు వెళ్లగా, కులాస్పూర్ తండా వద్ద ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. స్వల్ప ప్రమాదం చోటుచేసుకుందని, బస్సులో పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రోడ్డుపై ధాన్యం ఆరబెట్టడంతో రోడ్డు ఇరుకుగా మారడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఇదేవిషయమై ఎస్ఐ యాదగిరి గౌడ్‌ను వివరణ కోరగా, ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత పెద్దకొడప్గల్(జుక్కల్): మండలంలోని కాటేపల్లి గ్రామ శివారు మీదుగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై మహేందర్ సోమవారం తెలిపారు. కేసు నమోదు చేసి, ట్రాక్టర్లను తహసీల్దార్ దశరథ్కు అప్పగించినట్లు పేర్కొన్నారు. హాస్టల్ నుంచి ఇద్దరు విద్యార్థుల మిస్సింగ్ బాన్సువాడ: బీర్కూర్‌లోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల– హాస్టల్ నుంచి 8వ తరగతి చదివే ఇద్దరు విద్యార్థులు మిస్సింగ్ అయినట్లు ప్రిన్సిపాల్ శివకుమార్ తెలిపారు. ఈమేరకు అతడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తోటి స్నేహితులను విచారించగా సదరు విద్యార్థులు కిష్టాపూర్‌లో యూనిఫామ్ మార్చుకుని గౌరారం గ్రామంలోని తోటి స్నేహితుడి దగ్గరకు వెళ్లినట్లు తెలిపారు. ఆ గ్రామం పరిసర ప్రాంతంలో వెతుకగా వారి ఆచూకీ దొరకలేదన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆకట్టుకున్న ఆర్మీ పారా గ్లైడింగ్
నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం సాయంత్రం ఆర్మీ అధికారుల నేతృత్వంలో నిర్వహించిన పారా గ్లైడింగ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 250వ ఏవోసీ కార్ప్స్ డేను పురస్కరించుకుని సికింద్రాబాద్ ఆర్మీ కంటోన్మెంట్ ఆధ్వర్యంలో పారా మోటార్ ఎక్స్‌పెడిషన్– 2025 యాత్ర చేపట్టారు. ఢిల్లీ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఆగ్రా, కాన్పూర్, ఝాన్సీ, సాగర్, జబల్పూర్, పుల్గాం మీదుగా సోమవారం సాయంత్రం నిజామాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా వారికి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆర్మీ కంటోన్మెంట్ లెఫ్టినెంట్ కల్నల్ అమత్ నేతృత్వంలో నిర్వహించిన పారా గ్లైడింగ్ విన్యాసాలు అలరించాయి. ఎన్సీసీ కెడెట్లు, యువతీయువకులకు పారా గ్లైడింగ్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎస్వో అరవింద్ రెడ్డి, సివిల్ సప్లై డీఎం శ్రీకాంత్ రెడ్డి, పోలీసు, ఎన్సీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
కల్తీ కల్లుతో పలువురికి అస్వస్థత
బాన్సువాడ/నస్రుల్లాబాద్: కల్తీ కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ జీజీహెచ్‌కు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని దుర్కి కల్లు డిపోనుంచి పలు గ్రామాలకు కల్లు సరఫరా అవుతుంది. సోమవారం ఈ కల్లు తాగిన అంకోల్, దుర్కి, దామరంచ గ్రామవాసులు అస్వస్థతకు గురయ్యారు. కల్లు తాగిన తర్వాత కళ్లు తేలేయడం, మెడలు వెనక్కి పడేయడం చేస్తుండడంతో వారిని కుటుంబ సభ్యులు బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్రమంగా బాధితులు పెరుగుతుండడంతో డిప్యూటీ డీఎంహెచ్‌వో విద్య అంకోల్ గ్రామానికి వెళ్లి వైద్య సిబ్బందికి సూచనలు ఇచ్చారు. కల్తీ కల్లు బాధితులను వెంటనే ఆస్పత్రికి పంపించాలని ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలకు సూచించారు. ఆరోగ్య సిబ్బంది స్థానిక గ్రామ పంచాయతీ వద్ద మందులను అందుబాటులో ఉంచారు. బాధితులకు ప్రథమ చికిత్స అందించిన తర్వాత అంబులెన్సులో బాన్సువాడకు పంపిస్తున్నారు. కాగా సోమవారం రాత్రి వరకు 60 మంది కల్తీ కల్లు బాధితులు బాన్సువాడ ఆస్పత్రిలో చేరారు. మెరుగైన వైద్యం కోసం 12 మందిని నిజామాబాద్ జీజీహెచ్‌కు రిఫర్ చేశారు. పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చినవారు కల్లు తాగుతారు. ఈ నేపథ్యంలో బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. డిపోలోని కల్లును పరీక్షించామని, అందులో సీహెచ్ శాతం లేదని బాన్సువాడ ఎకై ్సజ్ సీఐ యాదిరెడ్డి తెలిపారు. ఇంకా ఏదైనా మత్తు పదార్థం ఉందేమో తెల్చడానికి శాంపిల్స్ సేకరిస్తున్నామని పేర్కొన్నారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ కల్తీ కల్లు అమ్మి అమయాకుల ప్రాణాలతో చెలగాటమడుతున్న కల్లు దుకాణం నిర్వాహకుల లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశించారు. చికిత్స నిమిత్తం బాన్సువాడ, నిజామాబాద్ ఆస్పత్రులకు తరలింపు దుర్కి కల్లు డిపో పరిధిలో ఘటన -
చెత్త వాహనాల అడ్డగింత
నిజామాబాద్ సిటీ: డంపింగ్ యార్డుకు చెత్తను తరలిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ వాహనాలను నగర శివారులోని నాగారం వద్ద స్థానికులు అడ్డుకున్నారు. 300, 80 క్వార్టర్స్ వాసులు వాహనాలకు అడ్డుగా నిలిచి ఆందోళన చేశారు. డంపింగ్‌యార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రభుదాస్ స్థానికులను సముదాయించినా వినలేదు. చివరికి మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ వచ్చి స్థానికులతో మాట్లాడారు. డంపింగ్ యార్డులో తరచూ నిప్పంటుకోవడంతో పొగ ఇళ్లలోకి వ్యాపిస్తోందని స్థానికులు తెలిపారు. కళ్ల మంటతోపాటు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని తెలుపగా, డంపింగ్ యార్డు నుంచి పొగ రాకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. కమిషనర్ వెంట శానిటరీ సూపర్వైజర్ సాజిద్ అలీ, ఏఎంసీ జయకుమార్ ఉన్నారు. డంపింగ్‌యార్డు వద్ద స్థానికుల ఆందోళన -
మాతా శిశు మరణాలు తగ్గించాలి
నిజామాబాద్‌నాగారం: మాతా శిశు మరణాలను తగ్గించాలని, గర్భిణులు, బాలింతలకు అందించే సేవలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు సూచించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమంపై ముద్రించిన కరదీపికలను కలెక్టర్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిస్క్‌లో ఉన్న గర్భిణులను ముందే గుర్తించి బర్త్ ప్లానింగ్ నిర్వహించడంతో మాతా శిశు మరణాలను తగ్గించొచ్చన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, ఆర్డీవో రాజేంద్రకుమార్, మెప్మా పీడీ రాజేందర్, డీపీవో శ్రీనివాస్, ఏసీపీ రాజావెంకటరెడ్డి, మున్సిపల్ కమిషనర్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య సేవలను ఉపయోగించుకోవాలి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో అందించే ఉచిత సేవలను మహిళలు ఉపయోగించుకోవాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ సూచించారు. నగరంలోని మాలపల్లి ఆరోగ్య కేంద్రంలో సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. మహిళలు రక్తహీనతను అధిగమించాలని, గర్భధారణ సమయంలో ప్రభుత్వ వైద్యులతో కనీసం ఆరుసార్లు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యురాలు సహిస్తా పర్వీన్, డీపీహెచ్‌ఎన్‌వో స్వామి సులోచన, డీహెచ్ఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు -
త్వరలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయానికి త్వరలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్లు రానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 12 ఏళ్లుగా యూనివర్సిటీల్లో నెలకొన్న సమస్య ఈ నిర్ణయంతో పరిష్కారం కానుంది. నియామకాలకు సంబంధించిన మార్గదర్శకాలను విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి యోగితారాణా ఆదివారం విడుదల చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన కామన్ రిక్రూట్మెంట్ గైడ్‌లైన్స్‌ను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి నేతృత్వంలోని కమిటీ సిఫార్సు చేసిన మార్గదర్శకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. మరోవైపు కాంట్రాక్ట్ ప్రాతిపదికన యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫె సర్లు (అకడమిక్ కన్సల్టెంట్లు)గా విధులు నిర్వర్తిస్తున్న అధ్యాపకులు ఆందోళన చెందుతున్నారు. ప్రభు త్వం జారీచేసిన మార్గదర్శకాల్లో కాంట్రాక్టు అధ్యాపకుల ఊసే లేకపోవడంతో రెగ్యులరైజ్ కోసం పోరాడుతున్న వారికి ఎదురుదెబ్బ తగిలినట్లయిందని చెప్పొచ్చు. దీంతో ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ కోసం సోమవారం ఓ యూలో సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రభుత్వం కేవలం అసిస్టెంట్ ప్రొ ఫెసర్ నియామకాలకు మాత్రమే మార్గదర్శకాలు జారీచేయడం, అసోసియేట్, ప్రొఫెసర్ పోస్టుల భ ర్తీ ఊసే లేకపోవడంతో నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెయూలో ఖాళీలు ఇలా.. నియామకాలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ తెయూలో 42 ఖాళీలు నిరుద్యోగుల్లో ఆశలు కాంట్రాక్ట్ అధ్యాపకుల్లో ఆందోళన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకమెన్నడో? పాలకమండళ్ల ఆమోదం తర్వాతే.. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను పాలకమండళ్ల సమావేశంలో ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ప్రభుత్వం నియామకాల నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అనంతరం రిజర్వేషన్, రోస్టర్ విధానాలు తయారు చేస్తారు. రెండు, మూడు నెలల్లో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. – టీ యాదగిరిరావు, వీసీ, తెయూ -
వివాదాల వీడీసీలు
నిజామాబాద్ఇంటిని కూల్చేశారువాతావరణం ఉదయం ఆహ్లాదకరంగా ఉంటుంది. క్రమంగా ఎండ తీవ్రత పెరుగుతుంది. వాతావరణం పొడిగా మారుతుంది. ఉక్కపోతగా ఉంటుంది. పచ్చిధాన్యం కొనుగోళ్లకు.. పచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. తమ ఏజెంట్ల ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. మంగళవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 8లో uనూతన కార్యవర్గం ఎన్నిక సుభాష్‌నగర్: తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ (బీఎంఎస్) జిల్లా నూ తన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నా రు. నగరంలోని విద్యుత్ భవన్లో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శశికుమార్ నూతన కమిటీని ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా బదావత్ సంతోష్‌నాయక్, ప్ర ధాన కార్యదర్శిగా టీ మహేందర్‌గౌడ్, వ ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎండీ మొయినుద్దీన్‌తోపాటు 20 మంది విద్యుత్ కార్మికులతో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో ఎన్పీడీసీఎల్ కంపెనీ ప్రెసిడెంట్ రమణారెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అశోక్, బాలరాజు, విద్యుత్ కార్మికులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో అంబలి కేంద్రంనిజామాబాద్అర్బన్: తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసి న అంబలి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు సోమవారం ప్రారంభించారు. తాగునీటితోపాటు ఉచితంగా అంబలి పంపిణీకి చొరవచూపడం అభినందనీయమని టీఎన్జీవో ప్రతినిధులను కలెక్టర్ అభినందించారు. ఉద్యోగులతోపాటు వివి ధ పనుల కోసం కలెక్టరేట్‌కు వచ్చే వారికి అంబలి కేంద్రం ఎంతో ఉపశమనాన్ని అందిస్తుందని అన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు సుమన్, కార్యదర్శి శేఖర్, రాష్ట్ర నాయకుడు గైని గంగారాం తదితరులు పాల్గొన్నారు. నగరంలో బాలిక కిడ్నాప్ ఖలీల్‌వాడి: నగరంలోని గాంధీచౌక్ ప్రాంతం నుంచి మూడేళ్ల బాలిక కిడ్నాప్ అయినట్లు ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి సోమ వారం తెలిపారు. వివరాలు ఇలా.. నగరంలోని నాగారం కె నాల్ కట్టకు చెందిన కొండవ్వ తన కుతూరు, మనవడు, మనవరాలు రమ్యతో కలిసి గాంధీచౌక్ ప్రాంతంలో భిక్షాటన చేస్తూ జీవించేది. గాంధీచౌక్ ప్రాంతంలో ఆదివారం రాత్రి కొండవ్వ తన మనవరాలు రమ్య(3)తో కలిసి నిద్రపోయింది. కొద్దిసేపటి తర్వాత నిద్రనుంచి మేల్కొనగా రమ్య కనిపించకపోవడంతో చుట్టుపక్కల ఎంతవెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు గాంధీచౌక్ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కి డ్నాప్ చేసినట్లు గుర్తించారు. రెండు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గత నెల 27వ తేదీన నగరంలో ఓ బాలుడిని కిడ్నాప్ చేసిన తల్లీకొడుకులు రాయితోమోది హత్య చేసిన ఘటననను మరువకముందే మరో బాలిక కిడ్నాప్‌కు గురైంది. అభివృద్ధిని మరిచి ఆగడాలు ● జిల్లాలో మితిమీరుతున్న వైనం ● మాట వినకుంటే బహిష్కరణే ● లక్షల్లో జరిమానాలు.. బహిష్కరణలు ● రాజకీయ ఒత్తిళ్లతో ఏమీ చేయలేకపోతున్న అధికారులు 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఇంటిని అక్రమమంటూ వేల్పూర్ మండలం వెంకటాపూర్ వీడీసీ సభ్యులు కూల్చివేశారు. ఏళ్లు ఇంటికి ట్యాక్స్ కడుతూ వస్తున్నానని, అన్ని లీగల్‌గానే ఉన్నాయని బాధితుడు మొత్తుకున్నా వీడీసీ వినలేదు. చివరకు ఇంటిని కూల్చివేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా వీడీసీపై కేసు నమోదైంది.ఖలీల్‌వాడి: పల్లెల అభివృద్ధికి పాటుపడాల్సిన గ్రామాభివృద్ధి కమిటీ(వీడీసీ)లు వ్యక్తిగతంగా, కుల సంఘాల పరంగా కక్షసాధింపులకు పాల్పడుతున్నాయి. కమిటీల్లో మెంబర్లుగా చలామణి అవుతున్నవారు తమ కన్నింగ్ ఆలోచనలను గ్రామస్తుల అందరి అభి ప్రాయంగా పేర్కొంటూ అమలు చేస్తున్నారు. తమ మాట వినని వారిని వెంటాడుతున్నారు. ఇళ్లను కూల్చడం, భూ ములను లాక్కోవడం, లక్షల్లో జరిమానాలు, బహిష్కరణలు.. ఇలా తమ ఆగడాలను వీడీసీలు కొనసాగిస్తున్నాయి. ఎలాంటి గుర్తింపులేని కమిటీలు గ్రామాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. కోడిగుడ్డు నుంచి బెల్ట్‌షాపు వరకు గ్రామాల్లో కోడి గుడ్డు నుంచి బెల్ట్‌షాపులో మద్యం వరకు ఏది విక్రయించాలన్నా వీడీసీలు టెండర్లు నిర్వహిస్తున్నాయి. కోడిగుడ్లు, మద్యం, కూల్‌డ్రింక్స్ విక్రయాలను వేలంపాట ద్వారా అప్పగిస్తున్నాయి. వేలంపాటలో పాడిన మొత్తాన్ని వీడీసీకి చెల్లించి దుకాణాలను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. దీంతో ఎక్కువ ధరలకు ఆయా వస్తువులను విక్రయించినా పట్టించుకునే వారు లేరు. నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తారు. ప్రజా ప్రతినిధులూ వీడీసీకి దాసోహమే..! తమను వ్యతిరేకించిన ప్రజాప్రతినిధులనూ వీడీసీలు బహిష్కరించిన ఘటనలున్నాయి. ఆర్మూర్ మండలం పెర్కిట్ వీడీసీ అప్పటి ఆర్మూర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను బహిష్కరించింది. వీడీసీలు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్లొద్దు, న్యాయస్థానాలను ఆశ్రయించొద్దు. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులు వీడీసీలకు దూరంగా ఉంటూనే తమ పనులను చక్కబెట్టుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో ఇళ్ల నిర్మాణానికి సైతం వీడీసీల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. గ్రామ పంచాయతీల కార్యదర్శులు సైతం ఇళ్ల నిర్మాణదారులను వీడీసీల వద్దకు వెళ్లాలని సూచిస్తుండడం గమనార్హం. 1970లో ఏర్పాటైన కమిటీలు ప్రజల భాగస్వామ్యంతో పల్లెల అభివృద్ధికి కృషి చేయాలనే ఉద్దేశంతో 1970లో గ్రామాభివృద్ధి కమిటీలు ఏర్పడ్డాయి. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి వాటిపై చర్చించి పరిష్కార మార్గాలు చూపాలనే ఉద్దేశంతో గ్రామంలోని అన్ని వర్గాల నుంచి ఒక్కో సభ్యుడితో కమిటీలు ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. వీడీసీలు ప్రధానంగా నీరు, మురికి కాలువలు, వీధి దీపాలు తదితర పనులపై దృష్టి సారించాలి. ప్రారంభంలో వీడీసీల ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రతి ఇంటి నుంచి కొంత డబ్బును సేకరించి వాటితో గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించేవారు. జక్రాన్‌పల్లి వీడీసీ తీరే వేరు జక్రాన్‌పల్లి వీడీసీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. మహిళ ఇంటి నిర్మాణాన్ని అడ్డుకోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా, అట్రాసిటీ కేసు నమోదైంది. అలాగే గ్రామంలోని రజకులకు చెందిన భూమిలో అంగడి (సంత) ఏర్పాటు చేయాలని వీడీసీ నిర్ణయించడంతో రజకులు అభ్యంతరం తెలిపారు. దీంతో రజకులను వీడీసీ బహిష్కరించగా వారు కోర్టును ఆశ్రయించారు. కోర్టు వీడీసీపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. న్యూస్రీల్తాటి చెట్ల వివాదం ఆలయానికి చేరిందిఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌లో గౌడ కులస్తులు, వీడీసీ మధ్య తాటిచెట్ల విషయంలో నెలకొన్న వివాదం ఆలయానికి చేరింది. గౌడ కులానికి చెందిన మహిళలు శ్రీరామనవమి సందర్భంగా కుంకుమార్చన చేసేందుకు ఆలయానికి వెళ్లారు. అయితే అప్పటికే గౌడకులస్తులపై వీడీసీ కఠినంగా ఉండడంతో పూజకు వచ్చిన మహిళలకు ఆలయ పూజారి అభ్యంతరం తెలిపారు. అవమానానికి గురైన సదరు మహిళలు పూజారితోపాటు వీడీసీలోని కీలక వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదం పోలీస్ స్టేషన్ ముట్టడికి దారి తీసింది. ఏర్గట్ల పోలీస్‌స్టేషన్ ముట్టడి వీడీసీ సభ్యులపై కేసు నమోదు.. తాళ్లరాంపూర్ గ్రామస్తుల ఆగ్రహం మేం చెప్పిందే చట్టం అంటున్నారు మల్లాపూర్ వీడీసీపై ప్రజావాణిలో ఫిర్యాదుతెయూలో ఖాళీలు ఇలా.. డిచ్పల్లి: తాము చెప్పిందే చట్టమని దౌర్జన్యం చేస్తూ తన సొంత భూమిలోకి రానివ్వడం లేదని మండలంలోని మల్లాపూర్ వీడీసీపై రాంపూర్ గ్రామానికి మహ్మద్ షేర్‌ఖాన్ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ హనుమంతుకు ఫిర్యాదు చేశారు. తన తండ్రి మహమ్మద్ మీర్‌సాబ్ 1988లో మల్లాపూర్‌కు చెందిన గోద ఒడ్డెన్న వద్ద సర్వే నంబర్ 262/అ లో 3.2750 ఎకరాలు, సర్వే నెంబర్ 263లో 2.20 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడని, తన తండ్రి మరణం తరువాత ఆ భూమిలో తాను పంటలు సాగు చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. గత కొద్ది రోజులుగా మల్లాపూర్ వీడీసీ సభ్యులు పది మంది తన భూమిలోకి దౌర్జన్యంగా ప్రవేశించారని, భూమి తమ గ్రామానికి చెందిన వారిదని, ఇటువైపు రావొద్దని బెదిరిస్తున్నాడని తెలిపాడు. ఈ భూమిని తన తండ్రి కొనుగోలు చేశాడని, మీ వద్ద రిజిస్ట్రేషన్ పత్రాలు ఉంటే చూయించాలని వీడీసీ సభ్యులను తాను అడిగితే.. తాము ఏది చెబితే అదే చట్టమని బెదిరిస్తున్నారని వీడీసీపై ఫిర్యాదు చేశాడు.మోర్తాడ్(బాల్కొండ): గ్రామంలోని తాటి చెట్లను గీయించాలని లేని పక్షంలో వాటిని తమకు స్వాధీనం చేయాలని మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామాభివృద్ధి కమిటీ పట్టుబట్టింది. దీన్ని గౌడకులస్తులు వ్యతిరేకించడంతో వివాదం ఏర్పడింది. శ్రీరామ నవమి సందర్భంగా కుంకుమ పూజలో పాల్గొనేందుకు గుడికి వెళ్లిన తమను వెళ్లగొట్టారని గౌడ కులానికి చెందిన మహిళలు వీడీసీతోపాటు పూజారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో పూజారితోపాటు ముగ్గురు వీడీసీ సభ్యులపై కేసు నమోదైంది. దీన్ని వ్యతిరేకిస్తూ గౌడ కులస్తులను మినహాయించి మిగతా గ్రామస్తులు ఇంటికి ఇద్దరి చొప్పున తరలివెళ్లి ఏర్గ ట్ల పోలీస్ స్టేషన్‌ను సోమవారం ముట్టడించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. భీమ్‌గల్ సీఐ సత్యనారాయణ, ఏర్గట్ల ఎస్సై రాము తాళ్లరాంపూర్ గ్రా మస్తులతో చర్చలను జరిపారు. వీడీసీ సభ్యులతోపాటు పూజారిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేయొద్దని గ్రామస్తులు పట్టుబట్టారు. రెండు వర్గాల వాదనలను విన్న పోలీసులు గ్రామంలోనే శాంతియుత వాతావరణంలో చర్చలను జరిపిస్తామని, అప్పటి వరకూ ఒకరి జోలికి ఒకరు వెళ్లి వివాదం పెద్దది చేయొద్దని సూచించారు. దీంతో తాళ్లరాంపూర్ గ్రామస్తులు వెనుదిరిగారు. -
అప్రమత్తతతోనే నివారణ
ఖలీల్‌వాడి: జిల్లాలో అగ్ని ప్రమాదాల సంఖ్య ప్రతి యేడాది పెరుగుతునే ఉన్నాయి. ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండటంతో ఈ కాలంలో అగ్నిప్రమాదాలు అధికంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఘటనల్లో వల్ల రూ.లక్షల్లో నష్టం వాటిల్లుతోంది. పలు సందర్భాల్లో ప్రాణనష్టం కూడా జరుగుతుంది. ప్రమాదాలను నివారించడానికి అప్రమత్తతే ముఖ్యమని పలువురు పేర్కొంటున్నారు. జిల్లాలో అపార్ట్మెంట్లు, ఆస్పత్రులు, దుకాణ సముదాయాల సంఖ్య పెరిగిపోతున్నాయి. కానీ వీటి యాజమాన్యాలు అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టడం లేదు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ సిబ్బంది ఇచ్చిన సూచనలు తప్పక పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలో ఏడు ఫైర్ స్టేషన్లు ప్రమాదాలను నివారించడానికి అగ్నిమాపకశాఖ అప్రమత్తంగా ఉంటోంది. జిల్లాలో ఏడు ఫైర్ స్టేషన్లో ఉన్నాయి. దీంతో ప్రమాదాలు సంభవించిన సమయంలో ఫైర్ సిబ్బంది వెంటనే ఫైరింజన్‌తో ఘటన స్థలాలకు వెళ్లి మంటలను ఆర్పివేయడానికి కృషి చేస్తున్నారు. జిల్లాలో నందిపేట్, బాల్కొండ ఫైర్ స్టేషన్లు కొత్తగా ఏర్పాటు చేశారు. నిర్లక్ష్యంతోపాటు అవగాహన లేకపోవడంతో అగ్ని ప్రమాదా లు సంభవిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీ టిపై అవగాహన ఉంటే 80నుంచి 90శాతం వరకు ప్రమాదాలను నివారించడానికి అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ఇటీవల జరిగిన ప్రమాదాలు.. ● జిల్లా కేంద్రంలోని పూలాంగ్ చౌరస్తా వద్ద ఉన్న రెండు సామిల్ల్లో శుక్రవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే స్థానికులు ఫైరింజన్ కు సమాచారం అందించడంతో 4 ఫైరింజన్లు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అ ర్పివేశాయి. ఈఘటనలో సుమారు రూ.20 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. ● జిల్లా కేంద్రంలోని మార్కండేయ గుడి పక్కన ఫిబ్రవరి 11న ఓ పెంకుటిల్లులోని పూజ గదిలో దీపంతో పక్కన ఉన్న వస్తువులకు మంటలు వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలు అ ర్పివేశారు. ఇంట్లోని నగదు, బంగారం కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. ఇవే కాకుండా జిల్లావ్యాప్తంగా చాలా చోట్ల ఇటీవల అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో పలువురు సర్వస్వం కోల్పోయి, నిరాశ్రయులుగా మారారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ● దుకాణాలలో మండే స్వభావం ఉన్న వస్తువులను పెట్టవద్దు. ● ఇంట్లో ఉండే సిలెండర్లకు వేడి తగలకుండా జాగ్రత్తలు పాటించాలి. ● దుకాణాలు, ఇళ్లలో విద్యుత్ తీగలను ఎలుకలు కొరకకుండా జాగ్రత్తలు చేపట్టాలి. అలాగే కరెంట్‌వైర్లు ఒకేచోట ఎక్కువగా ఉంచకుండా, వదులుగా ఉండేలే చర్యలు చేపట్టాలి. ● ఇళ్లు, దుకాణాల్లో వెంటిలేషన్ సరిగా ఉండాలి. ● అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదాలు సంభవించినప్పడు అగ్నిమాపక వాహనాలు తిరిగే విధంగా ఉండాలి. అలాగే అన్ని ఫ్లాట్లకు నీరు అందేలా పైపులైన్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ● పంటపొలాల్లో వ్యర్థాలకు నిప్పుపెట్టవద్దు.జాగ్రత్తలు పాటించాలి అగ్నిప్రమాదాలపై ఫైర్ సిబ్బంది ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలని ప్రయోగాత్మకంగా వివరిస్తున్నాం. ఇండ్రస్టీస్ల యాజమాన్యాలు, పెద్ద హోటళ్లు, ఆస్పత్రుల నిర్వాహకులకు, అక్కడ పని చేసే సిబ్బందికి పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నాం. ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎన్వోసీ తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలి. – నర్సింగ్‌రావు, ఫైర్ ఆఫీసర్, నిజామాబాద్జిల్లాలోని ఫైర్ స్టేషన్ల నంబర్లునిజామాబాద్ 8712699225 ఆర్మూర్ 8712699229 భీమ్‌గల్ 8712699223 బాల్కొండ 8712685797 నందిపేట్ 8712685799 ఇందల్వాయి 8712699231 బోధన్ 8712699227సంవత్సరాల వారీగా ప్రమాదాలుసంవత్సరం ప్రమాదాలు ఆస్తినష్టం ప్రాణనష్టం 2023 252 రూ.4.28 కోట్లు 9 2024 228 రూ.2.78 కోట్లు 21 2025(మార్చ్) 80 రూ.80లక్షల వరకు 1 జిల్లాలో ప్రతియేటా పెరుగుతున్న అగ్నిప్రమాద ఘటనలు రూ.లక్షల్లో నష్టం సంభవిస్తున్న వైనం -
వేర్వేరు కారణాలతో ఇద్దరి ఆత్మహత్య
నస్రుల్లాబాద్(బాన్సువాడ): మండలంలోని మైలారం గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై లావణ్య తెలిపిన వివరాలు ఇలా.. మైలారం గ్రామానికి చెందిన దూళి గంగారాం(73) చాలా రోజులు గా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కొన్ని నెలల క్రితం ఎడమ కాలుకు గాయం కావడంతో షుగర్వ్యాధి కారణంగా నడవలేక పోయేవాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది శనివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బీబీపేట మండలంలో.. బీబీపేట: మండలంలో ఇటీవల ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై ప్రభాకర్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని తుజాల్పూర్ గ్రామానికి చెందిన కన్న బాల్‌రాజ్‌గౌడ్ (54)కు కొద్ది నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా నొప్పి తగ్గలేదు. దీంతో అతడు జీవితంపై విరక్తి చెంది ఈనెల 5న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు అతడిని గమనించి, వెంటనే ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి కుమారుడు సాయికృష్ణాగౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నవీపేటలో సైబర్ మోసం
నవీపేట: మండల కేంద్రంలో ఓ వ్యక్తి సైబర్ మోసానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై వినయ్ తెలిపిన వివరాలు ఇలా.. నవీపేట శివారులోని సాయికృప పెట్రోల్ బంక్‌లో ఈనెల 1న ఓ వ్యక్తి డీజిల్ పోయించుకొని, రూ.3370ను ఫోన్‌పే చేశాడు. కానీ ట్రాన్సక్షన్ ఫెయిల్ అయిందని క్యాషియర్ సైబా వెంకటేశ్వర్ సదరు వ్యక్తికి తెలిపాడు. డబ్బులు కట్ అయ్యాయని, త్వరలో వస్తాయని అతడు క్యాషియర్‌ను నమ్మించాడు. అనంతరం క్యాషియర్ ఫోన్‌కు ఓ వ్యక్తి కాల్ చేసి ఎస్బీఐ నుంచి మాట్లాడుతున్నట్లు తెలిపాడు. డబ్బుల కోసం ఒక ఫైల్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించగా, వారు చెప్పిన విధంగా ప్రాసెస్ చేశాడు. కొద్దిసేపటికీ విడతల వారీగా అతడి అకౌంట్ నుంచి రూ.70వేలు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో కాల్ చేసిన వారిని సంప్రదించడానికి ప్రయత్నించగా రిప్లయ్ రాలేదు. వెంటనే మోసపోయానని గుర్తించి, సైబర్‌క్రైమ్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. ఆదివారం పోలీసులకు ఫిర్యాద చేయగా వారు కేసు నమోదు చేసుకున్నారు. న్యూసెన్స్ చేసిన యువకులపై కేసు నమోదు ఎల్లారెడ్డి: పట్టణంలోని నడి రోడ్డులో శనివారం రాత్రి బర్త్‌డే పార్టీ పేరిట కేక్ కట్ చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేసిన యువకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. రోడ్డుపై కేక్ కట్ చేసిన వారితోపాటు వారి తల్లిదండ్రులకు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. రోడ్డుపై న్యూసెన్సు చేస్తే కఠిన చర్యలుంటాయని, కేసులు నమోదు చేస్తామని ఎస్సై అన్నారు. -
మీ ఆరోగ్యం.. మీ చేతుల్లోనే..
నిజామాబాద్‌నాగారం: ప్రస్తుతం అందరూ ఈజీ ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. జంక్‌ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. దీనికితోడు మొబైల్స్‌తో ఎక్కువగా గడుపుతుండటంతో ప్రజలు ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారు. అనారోగ్యాలకు గురికాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే అది మీ చేతుల్లోనే ఉందంటున్నారు నిపుణులు. నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం.. సమాజంలో చాలామంది ఆరోగ్యంపై అశ్రద్ధ వల్ల అనర్థాలను కొని తెచ్చుకుంటున్నారు. చిన్న వయస్సులోనే రోగాల బారిన పడుతున్నారు. ము ఖ్యంగా మందు, సిగరెట్, గుట్కా, గంజాయి, డ్రగ్స్ వంటివి సేవిస్తూ ఎంజాయ్ చేస్తూ, ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలాగే కొందరు ఒత్తిడితో కూడా రోగాల బారిన పడుతున్నారు. ప్రస్తుత కాలంలో బీపీ, షుగర్ వయస్సుతో సంబంధం లేకుండా వస్తుంది. జన్యుపరమైన రోగాలు చిన్నచిన్న పిల్లలో కూడా వస్తున్నాయి. ఆహారపు అలవాట్లలో తేడాలు రావడంతో క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రతి ఏడాది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్య విషయాలపై నివేదిక విడుదల చేస్తుంది. ఈ ఏడాది మహిళల్లో వచ్చే అనారోగ్య సమస్యలు బ్రెస్ట్‌క్యాన్సర్, సర్వేకల్ క్యాన్సర్, పిల్లలో వచ్చే సమస్యలపై ప్రత్యేక దృష్టిపెట్టి పరిష్కరించాలని సూచించారు. దురలవాట్లకు దూరంగా ఉండాలి ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాలి నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవంరెగ్యులర్ హెల్త్చెకప్ తప్పనిసరి ప్రతిఒక్కరూ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. బీపీ, షుగర్ ఉంటే అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిడికి గురికావద్దు. ప్రతినిత్యం వ్యాయామం చేయాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. వయస్సుతో సంబంధం లేకుండా రోగాలు వస్తున్నాయి. అందుకే రెగ్యులర్‌గా హెల్త్ చెకప్ చేయించుకోవాలి. – చిటిమెల్ల సంతోష్‌కుమార్, జనరల్ ఫిజీషియన్, ఎండీ -
బైక్ అదుపుతప్పి ఒకరి మృతి
మోర్తాడ్(బాల్కొండ): భీమ్‌గల్ మండలంలో బైక్ అదుపుతప్పడంతో ఒకరు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. జక్రాన్‌పల్లి మండలం కలిగోట్‌కు చెందిన గండికోట మహేష్(42) కొన్నేళ్ల నుంచి మోర్తాడ్‌లో ఒంటరిగా జీవిస్తున్నాడు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడు సొంత పనిపై ఆదివారం భీమ్‌గల్‌కు బైక్‌పై వెళ్లి, తిరిగి వస్తుండగా భీమ్‌గల్ మండలం జాగిర్యాల్ రోడ్డు మార్గంలో బైక్ అదుపుతప్పింది. దీంతో అతడు బైక్ పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడటంతో మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి.. ఇందల్వాయి: జిల్లాకేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి ఎల్లమ్మ గుడి దగ్గర ఆదివారం ఒక గుర్తుతెలియని వ్యక్తి నిస్సహాయస్థితిలో ఉండటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని అతడిని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 65 నుంచి 70ఏళ్ల లోపు ఉంటుందని, తెలుపు చొక్కా ధరించి ఉన్నాడన్నారు. ఎవరైనా అతడిని గుర్తిస్తే ఇందల్వాయి ఎస్సై ఫోన్ నంబర్ 8712659854, సీఐ ఫోన్‌నంబర్ 8712659851ను సంప్రదించాలన్నారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత రుద్రూర్: పోతంగల్ మండలం సుంకిని గ్రామంలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారం అందడంతో సుంకినికి వెళ్లగా రెండు ట్రాక్టర్లు పట్టుబడ్డాయన్నారు. వాటిని పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. మహిళ అదృశ్యం కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని గొల్లవాడకు చెందిన కొట్టూరి లక్ష్మి అనే మహిళ అదృశ్యమైనట్లు పట్టణ ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఈనెల 5న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె ఇప్పటికీ తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు చాలా చోట్ల గాలించినా ఆమె ఆచూకీ దొరకలేదు. దీంతో ఆమె భర్త పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. -
రసవత్తరంగా కుస్తీ పోటీలు
రెంజల్(బోధన్): మండలంలోని కందకుర్తి గ్రామంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఆదివారం నిర్వహించిన కుస్తీపోటీలు రసవత్తరంగా సాగాయి. పోటీలకు మహారాష్ట్రకు చెందిన మల్లయోధులు పె ద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరి కుస్తీకి పది తులా ల వెండి కడియం, ద్వితీయ కుస్తీకి ఐదు తుల వెండి కడియాన్ని విజేతలకు అందించారు. మాజీ స ర్పంచ్ ఖలీమ్బేగ్, మాజీ ఉప సర్పంచ్ యోగేష్‌లు మల్లయోధులకు బహుమతులను అందజేశారు. రుద్రూర్: కోటగిరి మండల కేంద్రంలో మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో కుస్తీపోటీలు నిర్వహించారు. కుస్తీ పోటీలకు వివిధ గ్రామాల నుంచి మల్లయోధులు తరలివచ్చి హోరాహోరీగా తలపడ్డారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. వర్ని: మండలంలోని గోవూరు గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కుస్తీపోటీలను నిర్వహించారు. పోటీలలో పాల్గొనటానికి చుట్టుపక్కల గ్రామాల మల్లయోధులు, మహారాష్ట్రకు చెందిన మల్లయోధులు పాల్గొన్నారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులను అందజేశారు. -
వెదురుబొంగుల షాపులో అగ్నిప్రమాదం
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని ఓ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. వర్ని చౌరస్తా వద్ద ఓ వెదురు బొంగుల షాపులో ఆదివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. అ క్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సీఐ ప్రసాద్ అక్కడి చేరుకుని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. రెండు ఫైర్ ఇంజిన్లు ఘటన స్థలా నికి చేరుకోగా, ఫైర్ ఆఫీసర్ నర్సింగ్‌రావు ఆఽధ్వర్యంలో సిబ్బంది మంటలను అర్పివేశారు. షార్ట్‌సర్క్యూట్‌తో ప్రమాదం జరిగినట్లు, సుమారు రూ.10లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. -
ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
డిచ్పల్లి/ ఇందల్వాయి/ ధర్పల్లి/ మోపాల్/ సిరికొండ: బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాలను ఆవిష్కరించారు. డిచ్‌పల్లిలో నిర్వహించిన వేడుకల్లో పార్టీ మండల అధ్యక్షుడు కర్ని చంద్రకాంత్, వెంకటరమణ, సతీశ్‌రెడ్డి, నాయకులు రవీందర్‌గౌడ్, శ్యాంరావు, శ్రీనివాస్ గౌడ్, రమణ, విఠల్, సురేశ్, గంగారెడ్డి పాల్గొన్నారు. ఇందల్వాయిలో పార్టీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, కన్నె చిన్ను, నాయుడు రాజన్న, కుంట మోహన్ రెడ్డి, విష్ణు, భగత్ సింగ్, కేపీ రెడ్డి, సక్కీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ధర్పల్లిలో బీజేపీ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, పాల్ది గంగాదాస్, కర్క రంగారెడ్డి, పెంటన్న, మహేశ్, గంగాధర్, శ్రీకాంత్, నరేశ్, గణేశ్, సురేశ్, విఠల్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 5వ డివిజన్ బోర్గాం(పి)లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ యువ నాయకుడు దండు శ్రీకాంత్, రాజశేఖర్‌రెడ్డి, యాదల నరేశ్, తోట శాస్త్రి, గణేశ్ రెడ్డి, శివ శంకర్, రచ్చ ఆనంద్, సునీల్‌కుమార్, చంద్రకాంత్‌రెడ్డి, కల్లెడ గంగాధర్, రాకేశ్ గౌడ్, వెంకన్న, కల్లెడ సాయివర్ధన్ పాల్గొన్నారు. సిరికొండలో నిర్వహించిన వేడుకల్లో పార్టీ మండలాధ్యక్షుడు సంజీవ్‌రెడ్డి, రామస్వామి, నక్క రాజేశ్వర్, లింబాగౌడ్, బాబురా వు, కిరణ్, రంజిత్‌రెడ్డి, లింబాద్రి, ప్రభాకర్, రాజేందర్, మారుతి, అజయ్, ఒడ్డెన్న పాల్గొన్నారు. -
అన్నివర్గాల సంక్షేమానికి బీజేపీ కృషి
సుభాష్‌నగర్: అన్నివర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఏకై క పార్టీ బీజేపీ అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాలన్న శ్యామప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, అటల్ జీ ఆశయాలు సాధిద్దామని పిలుపునిచ్చారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి అధ్యక్షతన నగరంలోని కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ.. ఏడు దశాబ్దాల నుంచి ఎందరో మహనీయుల జీవితాల త్యాగఫలంతోనే బీజేపీ రాజకీయంగా ఎదురులేని శక్తిగా ఎదిగిందన్నారు. పదేళ్లలో ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక విప్లవాత్మక విజయాలు సాధించిందన్నారు. బీజేపీ నాయకుల పార్టీ కాదని.. కార్యకర్తల పార్టీ అని దినేశ్ పటేల్ కులాచారి అన్నారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు న్యాలం రాజు, లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీనారాయణ, స్రవంతిరెడ్డి, ఆయా మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎదురులేని శక్తిగా పార్టీ ఎదిగింది అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఘనంగా ఆవిర్భావ దినోత్సవం -
ఆలయ శిఖరానికి పూజలు
● ఎస్సారెస్పీ నీటిలో నుంచి తేలిన కుస్తాపురం ఆలయ శిఖరం డొంకేశ్వర్(ఆర్మూర్): ఎస్సారెస్పీ నీటి మట్టం తగ్గుతుండడంతో కుస్తాపురం రామలింగేశ్వర స్వామి ఆలయ శిఖరం తేలింది. డొంకేశ్వర్ మండలం చిన్నయానం బ్యాక్ వాటర్ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం కొన్నేళ్లుగా ముంపులోనే ఉంది. చివరిసారిగా 2019లో గుడి పూర్తిగా తేలగా ఇప్పటి వరకు బయటపడలేదు. నీటి మట్టం తగ్గగా ప్రతి ఏడాది మే నెలలో గుడి శిఖరం తేలేది. కానీ, ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలోనే బయటపడింది. ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా జీజీ నడ్కుడకు చెందిన చిన్న గంగారాంతోపాటు మరికొందరు జాలర్లు తెప్పపై నీటిలో రెండు కిలోమీటర్లు ప్రయాణించి గుడి శిఖరం వద్దకు చేరుకున్నారు. శిఖరానికి సున్నం వేసి కొబ్బరియలు కొట్టి పూజలు నిర్వహించారు. వేగంగా తగ్గుతున్న నీటిమట్టంబాల్కొండ: కాలువల ద్వారా ఆయకట్టుకు నీటి విడుదల కొనసాగుతుండటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటి మట్టం వేగంగా తగ్గుతోంది. ఎండల తీవ్రత పెరగడంతో నీరు భారీగా ఆవిరవుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1062.80(13 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. నేటి నుంచి ఎస్సెస్సీ మూల్యాంకనం నిజామాబాద్ అర్బన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకనం సోమవారం నుంచి ప్రారంభం కానున్నది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను విద్యాశాఖ అధికారులు పూర్తి చేశారు. నగరంలోని నిర్మల హృదయ పాఠశాలలో ఎస్సెస్సీ మూల్యాంకనం జరగనుంది. రెండు లక్షలకు పైగా జవాబుపత్రాలను మూల్యాంకనం చేయనున్నారు. అందుకోసం 631 మంది ఏఈలు, 222 మంది స్పెషల్ అసిస్టెంట్లు, 104 మంది సీఈలను నియమించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జవాబుపత్రాల మూల్యాంకనం కొనసాగనుంది. సాటాపూర్ రైల్వేగేటు మూసివేత ఎడపల్లి(బోధన్): మండలంలోని సాటాపూర్ రైల్వేగేటును సోమవారం నుంచి తాత్కాలికంగా మూసి వేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్ మరమ్మతులు, అభివృద్ధి పనుల్లో భాగంగా గేటును మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. పనులు పూర్తయిన తరువాత యథావిధిగా వాహనాల రాకపోకలు సాగించవచ్చని తెలిపారు. కాగా, ముందస్తు సమాచారం లేకుండా ఆదివారమే గేటు మూసివేయడంతో ఆయా గ్రామాల ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. దీంతో గేటును తీశారు. రాష్ట్ర నెట్‌బాల్ సంఘంలో జిల్లా వాసులు నిజామాబాద్‌నాగారం: హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఆదివారం రాష్ట్ర నెట్‌బాల్ అ సో సియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో జిల్లా కార్యవర్గ సభ్యులకు పలు పదవులు దక్కాయి. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వెంకటేశ్వర్రావు(తిర్మన్‌పల్లి పాఠశాల పీడీ), రాష్ట్ర జాయింట్ సెక్రటరీలుగా ఎ రమేష్(జన్నెపల్లి పాఠశాల పీడీ), రఘురాం(హస్గుల్ పాఠశాల పీడీ)లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
భక్తలోకం మురిసే..
కనుల పండువగా జగదభిరాముడి కల్యాణంలొద్దిరామన్న కల్యాణం..జగదభిరాముడి కల్యాణోత్సవాన్ని కనులారా వీక్షించిన భక్తలోకం తన్మయత్వంతో మురిసిపోయింది. జిల్లా వ్యాప్తంగా శ్రీరామ నవమి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఖిల్లా, సుభాష్‌నగర్ రామాలయాలతోపాటు బడారాం మందిర్, అయోధ్యనగర్ కోదండరామాలయం, సారంగాపూర్‌లోని హరిహరాత్మక బాలకరామ్ రామానంద ఆశ్రమంతోపాటు ఆలయాల్లో జిల్లా వ్యాప్తంగా నవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. జైశ్రీరాం నినాదాలతో ఆలయాల పరిసరాలు మారుమోగాయి. సాయంత్రం నిర్వహించిన శోభాయాత్రల్లో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. – సాక్షి నెట్వర్క్ మోర్తాడ్(బాల్కొండ): భీమ్‌గల్ మండలం పిప్రి అటవీ ప్రాంతంలోని లొద్ది రామన్న ఆలయంలో ఆదివారం సీతారాముల కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. టీపీసీసీ అ ధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, బాల్కొండ ని యోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ముత్యాల సునీల్‌రెడ్డి దంపతులు వేడుకల్లో పాల్గొన్నారు. మహేశ్‌కుమార్‌గౌడ్ దంపతులు కల్యాణోత్సవానికి త లంబ్రాలు సమర్పించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు. మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, వినయ్‌రెడ్డి, నరాల రత్నాకర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఆలయాలకు నిధులు రహత్‌నగర్‌లో కాళీమాత, లలిత మాత ఆలయాల నిర్మాణం కోసం రూ.50లక్షల ప్రొసీడింగ్‌లు అందజేయడంతోపాటు లొద్ది రామాలయ అభివృద్ధి కోసం సొంతంగా రూ.2లక్షల నగదును మహేశ్‌కుమార్‌గౌడ్ అందజేశారు. అలాగే రోడ్డు నిర్మాణానికి హామీ ఇచ్చారు. -
సీఎంను డిచ్పల్లి ఖిల్లాకు తీసుకొస్తా..
డిచ్పల్లి(నిజామాబాద్‌రూరల్): చారిత్రక డిచ్పల్లి ఖిల్లా రామాలయానికి సీఎం రేవంత్‌రెడ్డిని త్వరలో తీసుకొస్తానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. సీతారాముల కల్యాణ వేడుకల్లో పాల్గొన్న అనంతరం డిచ్‌పల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సుద్దులం వద్ద మంజూరైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపనకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతారని, అదే సమయంలో సీఎంను రామాలయానికి తీసుకువస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఎకో టూరిజంలో భాగంగా రామాలయం వద్ద పార్కు, పక్కనే ఉన్న చెరువులో బోటింగ్, గుట్టపై ఉన్న ఆలయం వరకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు టూరిజం శాఖకు ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, ఆలయ కమిటీ చైర్మన్ శాంతయ్య, బూస సుదర్శన్, మహేందర్‌రెడ్డి, రాములు, ఏజీ దాస్, నర్సారెడ్డి తదితరులున్నారు. -
కమనీయం.. రాములోరి కల్యాణం
సాక్షి నెట్వర్క్: శ్రీరామ నవమి సందర్భంగా నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో సీతారాముల కల్యాణ మహోత్సవం ఆదివారం కనుల పండువగా జరిగింది. నగరంలోని ఖిల్లా రామాల యం, సుభాష్‌నగర్ రామాలయం, న్యాల్కల్ రోడ్డు లో ఉన్న అయోధ్యనగర్ కోదండ రామాలయం, ఆర్యనగర్ రామాలయం, జెండా బాలాజీ ఆలయం, మాధవనగర్‌లోని సాయిబాబా ఆలయం, మోపాల్ మండలం నర్సింగ్‌పల్లిలో ఉన్న ఇందూరు తిరుమల క్షేత్రంలో, డిచ్పల్లి ఖిల్లా రామాలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి దంపతులు డిచ్పల్లి ఖిల్లా రామాలయంలో నిర్వహించిన స్వామి వారి కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. సాయిబాబా జన్మదినం సందర్భంగా మాధవనగర్‌లోని సాయి బాబా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశా రు. డిచ్పల్లి, మోపాల్, ధర్పల్లి, సిరికొండ మండలా ల్లో సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామాలయాల్లో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు -
వీకెండ్ డాక్టర్లు!?
కంటి వైద్య నిపుణుడు కృష్ణమూర్తి మూడు రోజులపాటు అందుబాటులో లేకున్నా ఆయనకు చెందిన శ్రీరామ, గిరిజ నేత్ర వైద్యశాలల్లో రోగులకు ఏ ఆటంకం లేకుండా చికిత్స కొనసాగింది. కాంపౌండర్లే ఒక్కో రోగి వద్ద రూ.350కిపైగా వసూలు చేస్తూ టెస్టులు రాస్తూ వైద్యం అందిస్తున్నారని వైద్యారోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో శనివారం రాత్రి వైద్యారోగ్యశాఖ అధికారులు రెండు ఆస్పత్రుల్లో తనిఖీలు చేశారు. నవీపేట్ మండలం నాళేశ్వర్‌కు చెందిన లక్ష్మి నరాల సంబంధిత సమస్యతో బాధపడుతూ గతేడాది డిసెంబర్ 30వ తేదీన నగరంలోని ఖలీల్వాడిలో ఉన్న విజయ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చింది. ఆ సమయంలో డాక్టర్ అందుబాటులో లేకున్నా కాంపౌండర్లు రూ.400 ఫీజు వసూలు చేసి, తాను సూచించిన టెస్టులు చేయించుకుని రావాలని చీటీ ఇవ్వడంతో ఆమె విస్తుపోయింది. డాక్టర్ చూడకుండానే టెస్ట్‌లు ఎందుకు చేయించుకోవాలని ప్రశ్నించగా, ఆమెను బయటికి గెంటేసే ప్రయత్నం చేశారు. దీనిపై లక్ష్మితోపాటు ఆమె కుటుంబ సభ్యులు వైద్యారోగ్యశాఖ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కాంపౌండర్‌కు కాదేదీ అసాధ్యం! డాక్టర్లు స్థానికంగా లేనిసమయంలో అంతా వారే.. సూపర్, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్యం చేస్తున్న వైనం -
స్వీపర్లు, స్కావెంజర్లను కార్మికులుగా గుర్తించాలి
నిజామాబాద్ సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లు స్కావెంజర్లను ప్రభుత్వం కార్మికులుగా గుర్తించి వారికి ప్రతినెలా మొదటి వారంలో వేతనాలు ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా ఓమయ్య, అధ్యక్షుడిగా టి చక్రపాణి, ఉపాధ్యక్షులుగా రాధా, స్రవంతి, ప్రధాన కార్యదర్శిగా వసంత, కార్యదర్శిగా సోఫియా, ఉదయ ఎన్నికయ్యారు. సమావేశంలో కార్మికులు, సభ్యులు పాల్గొన్నారు. సన్నబియ్యం పంపిణీతో ప్రజల్లో సంతోషం నిజామాబాద్ సిటీ: పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్‌ను తెలంగాణ ఎరుకల గిరిజన కుల పోరాట సాధన సమితి నాయకుడు కోనేరు సాయికుమార్ కలిశారు. ఆదివారం జిల్లా పర్యటనలో ఉన్న ఆయనను కలిసి పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నగరంలో విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మైనారిటీ నాయకుల పాదయాత్ర నిజామాబాద్ సిటీ: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో మైనారిటీ నాయకులు ఆదివారం నిర్వహించారు. నగరంలోని 46, 47, 48 డివిజన్లలో పాదయాత్రలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు,అభివృద్ధి పనులను, కేంద్ర ప్రభు త్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను స్థానికులకు వివరించారు. కార్యక్రమంలో నాయకులు సయ్యద్‌ఖైసర్, అక్బర్ హుస్సేన్, ఆయూబ్ ఖురేషీ, సాబేర్ అలీ, మహ్మద్ ఇసా, రాంచందర్ గైక్వాడ్, దత్తు పాల్గొన్నారు. బీటీ రణదీవే స్ఫూర్తితో ఉద్యమాలు నిజామాబాద్ సిటీ: అఖిల భారత కార్మిక ఉద్యమ నేత బీటీ రణదీవే స్ఫూర్తితో కార్మికులు తమ హక్కుల సాధనకు ఉద్యమాలు సిద్ధం కావాలని సీఐటీయూ నాయకులు రమేశ్‌బాబు, నూర్జహాన్ అన్నారు. బీటీ రణదీవే వర్ధంతిని నగరంలోని సీటీయూ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్మికుల కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ికటారి రాములు, రాములు, ఇమామ్, కేద్రమ్మ, సురేశ్, విజయ్ పాల్గొన్నారు. హిమోఫీలియా వ్యాధిపై అవగాహన నిజామాబాద్‌నాగారం: హిమోిఫీలియా వ్యాధి పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రెడ్‌క్రాస్ జిల్లా మాజీ చైర్మన్ నీలీ రాంచందర్ అన్నారు. ఆదివారం నగరంలోని మారుతినగర్లో ఉన్న స్నేహ సొసైటీలో హిమోిఫీలియా సొసైటీ ఆధ్వర్యంలో వ్యాధితో బాధపడుతున్న వారికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అనంతరం హిమోఫిలియా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. అనంతరం వైద్యుడు విజయానందరా వు హిమోఫిలియాపై రాసిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధ య్య, కరుణాకర్, రామకృష్ణ, మహమ్మద్ ఎజాజ్, గంగారాం, అంబరీష్ పాల్గొన్నారు. ఆకుల కొండూర్‌లో ఎన్ఎస్ఎస్ శిబిరం నిజామాబాద్ రూరల్: మండలంలోని ఆకుల కొండూర్‌లో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు ఆదివారం శ్రమదానం చేశారు. రహదారి వెంట ఉన్న పిచ్చి మొక్కలు, గ్రామ శివారులోని పల్లె ప్రకృతి వనంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, ఎండిన ఆకులను తొలగించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ వెంకటరమణ, వలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
హెచ్‌సీయూపై మాట్లాడటం విడ్డూరం
ఆర్మూర్‌టౌన్: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో విలువైన 20వేల ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పనంగా అప్పజెప్పిన మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)కి సంబంధం లేని భూములపై రాద్ధాంతం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్‌గౌడ్ మండిపడ్డారు. ఆర్మూర్ పట్టణంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌తోపాటు పరిసర ప్రాంతాల ప్రభుత్వ భూములు ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేశారని, అందుకు హైదరాబాద్‌లో వెలసిన బహుళ అంతస్తుల భవన నిర్మాణాలే నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్ హెచ్‌సీయూ విద్యార్థులు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో చర్చలు జరిపి సముచిత నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఆర్మూర్ నవనాథ సిద్దుల గుట్టను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డిని గుట్టకు తీసుకొస్తానని తెలిపారు. సమావేశంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మార చంద్రమోహన్, ఏఎంసీ చైర్మన్ సాయిబాబాగౌడ్, నాయకులు పాల్గొన్నారు. వేలాది ఎకరాల భూములను ధారాదత్తం చేసిన బీఆర్ఎస్ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ -
పిల్లల పెంపకంలో జాగ్రత్తలు తప్పనిసరి
మోపాల్: ప్రస్తుత రోజుల్లో పిల్లల పెంపకంపై తల్లిదండ్రులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ గురూజీ అన్నారు. ఆదివారం మోపాల్ మండలం మంచిప్పలో ఉన్న జ్ఞానోదయ హైస్కూల్లో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో పిల్లల పెంపకంపై ప్రేరణ సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జగన్ గురూజీ, మోటివేటర్ తిరునగిరి శ్రీహరి, మదం మహిపాల్ పిల్లల పెంపకం, పరీక్షల విషయంలో అపోహలు, భయం, పలు అంశాలపై వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దేవ శంకర్, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. వాల్మీకి రామాయణ గ్రంథాల పంపిణీ నిజామాబాద్ రూరల్: నగరంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న రామాలయంలో ఆదివారం శ్రీరామనవమిని పుస్కరించుకొని శ్రీ రామకృష్ణ సేవా సమితి సభ్యులు భక్తులకు వాల్మీకి రామాయణం గ్రంథాలను పంపిణీ చేశారు. ఆలయ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు. -
రాముని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి
బాల్కొండ: కోందడ రాముని ఆశీస్సులు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మెండోరా మండలం పోచంపాడ్‌లోని కోదండ రామాలయంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో ఎమ్మెల్యే సతీసమేతంగా పాల్గొని పట్టువ స్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని భగవంతుడిని వేడుకున్నానని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సొంత ఖర్చుతో ఏర్పాటు చేసిన అన్నదానంలో పాల్గొన్నారు. -
కారులో చెలరేగిన మంటలు
● సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు కామారెడ్డి క్రైం: ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన కామారెడ్డి సమీపంలోని క్యాసంపల్లి శివారు జాతీయ రహదారిపై శనివారం వేకువజామున చోటు చేసుకుంది. భువనగిరి నుంచి నిజామాబాద్ జిల్లా వర్ని మండలం బడాపహాడ్‌కు ఓ కుటుంబం స్కార్పియోలో వస్తున్నారు. అకస్మాత్తుగా మంటలు వ్యాప్తి చెందడాన్ని గమనించిన డ్రైవర్, వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి అందరినీ కిందికి దింపాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆర్పారు. అప్పటికే వాహనం పూర్తిగా దగ్ధమైంది. -
జల్సాలకు అలవాటుపడి చోరీలు
ఖలీల్శాడి: జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఏసీపీ మాట్లాడారు. మాక్లూర్ మండలం మాదాపూర్ గ్రామంలోని పరుశు దేవానందం ఇంట్లో ఇటీవల చోరీ జరగగా, బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించామన్నారు. మాదాపూర్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, ఇతర ఆధారాలతో మాణిక్‌బండార్(చెక్క) వద్ద అనుమానాస్పందంగా తిరుగుతున్న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కార్లకు చెందిన నాందేవ్ ఆనందరావు ముండాకర్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. విచారణ అనంతరం పరుశు దేవానందం ఇంట్లో చోరీకి పాల్పడినట్లు నాందేవ్ ఒప్పుకున్నాడని తెలిపారు. నిందితుడి నుంచి 65 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నిందితుడు గతంలో నందిపేట్ పీఎస్ పరిధిలోని ఐలాపూర్, వెల్మల్ గ్రామాల్లో దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. వెల్మల్‌లో శ్రీనివాస్, అయిలాపూర్‌లో సందీప్ అనే వ్యక్తులతో కలిసి చోరీకి పాల్పడగా, అందుకు సంబంధించి 26 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శ్రీనివాస్, సందీప్‌లు గతంలోనే అరెస్టయినట్లు పేర్కొన్నారు. కాగా, నిందితుడు నాందేవ్ జక్రాన్‌పల్లి, బాల్కొండ, వేల్పూర్ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి ఆరునెలల క్రితం జైలుకు వెళ్లి మార్చి నెలలో బెయిల్‌పై వచ్చినట్లు తెలిపారు. ఈ నెల 3న మాదాపూర్‌లో దొంగతనం చేసినట్లు చెప్పారు. మొత్తం 91 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకొని, నిందితుడు నాందేవ్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ వివరించారు. 48 గంటల్లోనే కేసును ఛేదించిన నార్త్ సీఐ శ్రీనివాస్, మాక్లూర్ ఎస్సై రాజశేఖర్, సిబ్బందిని అభినందించారు. నిందితుడి అరెస్ట్..బంగారం స్వాధీనం ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి -
బీజేపీ విజయయాత్రను వివరించాలి
సుభాష్‌నగర్: బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లాలోని అన్ని పోలింగ్ బూత్‌లలో పార్టీ జెండా ఆవిష్కరించి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి పేర్కొన్నారు. బూత్‌ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ సిద్ధాంతాలు, విజయయాత్రను ప్రజలకు వివరించాలని సూచించారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లాస్థాయి పదాధికారుల సమావేశాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘ సంస్కర్త బాబూ జగ్జీవన్ రామ్ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పోలింగ్ బూత్‌ల ఆధ్వర్యంలో నిర్వహించే జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ నెల 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు వడ్డే మోహన్‌రెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతన్కర్ లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, రాష్ట్ర, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, కన్వీనర్లు, కో కన్వీనర్లు, వివిధ మోర్చాల నాయకులు పాల్గొన్నారు. కలెక్టర్ సతీమణికి భగవద్గీత అందజేతసుభాష్నగర్: నగరంలోని నీల కంఠేశ్వరాలయంలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు సతీమణి విజయలక్ష్మీకి మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ దంపతులు భగవద్గీత, వారాహి మాతా చిత్రపటాన్ని శనివారం అందజేశారు. నగర శివారులోని అమ్మనగర్లో నిర్మిస్తున్న వారాహి మాతా ఆలయాన్ని సందర్శించాలని ఆహ్వానించారు. అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడతాడిచ్పల్లి: అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నిజామామాబాద్ రూరల్ నియోజకవర్గాన్ని జిల్లాలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పేర్కొన్నారు. డిచ్పల్లి మండలంలోని కొరట్పల్లి తండా, కొరట్పల్లి, సుద్దులం, యానంపల్లి, సాంపల్లి, సుద్దపల్లి గ్రామాల్లో రూ.12.50 కోట్ల నిధులతో శనివారం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అప్పటి సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పులపాలు చేశారని విమర్శించారు. వాటికి నెలానెలా వడ్డీ చెల్లిస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ శేఖర్‌గౌడ్, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, తారాచంద్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్, సొసైటీ చైర్మన్లు రాంచందర్‌గౌడ్, చింత శ్రీనివాస్‌రెడ్డి, రామకృష్ణ, మాజీ ఎంపీపీలు కంచెట్టి గంగాధర్, చిన్నోల్ల నర్సయ్య, నాయకులు సురేందర్‌రెడ్డి, సేవాలాల్, మహేశ్, మహిపాల్, అంకం నరహరి తదితరులు పాల్గొన్నారు. -
కొత్త రేషన్‌కార్డులపై మళ్లీ సర్వే
మోర్తాడ్(బాల్కొండ): కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో అందించిన దరఖాస్తులపై మరోసారి సర్వే మొదలైంది. రెండు, మూడు రోజుల్లో సర్వే పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ రెవెన్యూ ఉద్యోగులకు నిర్దేశించింది. ఈ మేరకు శుక్రవారం పౌర సరఫరాల శాఖ రెవెన్యూ ఉద్యోగుల మొబైల్ ఫోన్లకు ఒక లింకును పంపించి ఆ యాప్‌లోనే కొత్త కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులపై సర్వే నిర్వహించాలని స్పష్టం చేసింది. ఏడేళ్లుగా నిలిచిన రేషన్‌కార్డుల జారీకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోక్షం లభిస్తుందని అంతా ఊహించారు. కానీ, గడిచిన ఏడాది నుంచి రేషన్ కార్డులు అందిస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదు. గణతంత్ర దినోత్సవం రోజు మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి కొత్త కార్డులను జారీ చేశారు. మిగిలిన గ్రామాల్లో పంపిణీకి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. కోడ్ ముగిసినా కార్డుల జారీలో వేగం పెరగలేదు. ప్రజాపాలనలో కొత్త రేషన్ కా ర్డుల కోసం 81,148 దరఖాస్తులు అందగా, జనవరి 26న 31 గ్రామాల నుంచి ఎంపిక చేసిన 1066 కు టుంబాలకు కొత్త కార్డులను జారీ చేశారు. మరో 80వేలకు పైగా కుటుంబాలు కొత్త కార్డుల కోసం ని రీక్షిస్తున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించేందుకు రేషన్‌కార్డు ప్రామాణికం కావడంతో కొత్త కార్డుల కోసం అర్హులు ఎదురుచూస్తున్నారు. రేషన్‌కార్డులు లేకపోవడంతో సన్నబియ్యం పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ ఉద్యోగులకు పౌర సరఫరాల శాఖ ఆదేశాలు సర్వే అనంతరం కొత్త కార్డుల జారీకి అవకాశంజాప్యం చేస్తున్నారు కొత్త రేషన్‌కార్డుల జారీకి మరోసారి సర్వే నిర్వహించాలని నిర్ణయించడం సరైంది కాదు. సర్వేల పేరిట కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కొత్త కార్డులను అర్హులైన కుటుంబాలకు వెంటనే అందించాలి. – ఏనుగు రాజేశ్వర్, మోర్తాడ్ నిర్లక్ష్యం తగదు ఎంతో మంది అర్హులు కొత్త కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు. కార్డులను జారీ చేయకుండా నిర్లక్ష్యం చేయడం తగదు. ప్రభుత్వం స్పందించి వెంటనే కార్డులను జారీ చేయాలి. – తక్కూరి సాగర్, మోర్తాడ్ -
సామిల్లో అగ్ని ప్రమాదం
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని ఫూలాంగ్ చౌరస్తా వద్ద ఉన్న రెండు సామిల్స్‌లో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. మొదట శంకర్ సామిల్, సాగ్వాన్ సామిల్లో మంటలు అంటుకోగా, పక్కన ఉన్న పద్మారావు సామిల్లోకి మంటలు వ్యాపించాయి. రెండు సామిల్స్‌లో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దట్టమైన పొగలు వ్యాపించడంతో ఫైరింజన్‌కు సమాచారం అందించారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ పరమేశ్వర్ పర్యవేక్షణలో ఘటనా స్థలానికి నాలుగు ఫైరింజన్లు చేరుకోగా, ఫైర్ ఆఫీసర్ నర్సింగ్‌రావు, సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అదే సమయంలో పెట్రోలింగ్‌కు వెళుతున్న సీపీ పోతరాజు సాయిచైతన్య ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ట్రాఫిక్ ఏసీపీ నారాయణ అక్కడికి చేరుకొని ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా చూశారు. ఈ రెండు సామిల్స్‌లో దుంగలన్నీ కాలిబూడిదకాగా, సుమారు రూ.20 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులకు యజమానులు తెలిపినట్లు తెలిసింది. ఫైర్ సిబ్బంది సుమన్, కిరణ్‌కుమార్, ప్రశాంత్, సురేందర్, ప్రశాంత్ గౌడ్, సాయిరెడ్డి, సూరజ్ తదితరులు మంటలను ఆర్పారు. రెండు దుకాణాల్లో మంటలు రూ. 20 లక్షల వరకు ఆస్తినష్టం నాలుగు ఫైరింజన్లతో మంటలార్పిన సిబ్బంది -
అణగారినవర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్‌రామ్
తెయూ(డిచ్పల్లి): బాబూ జగ్జీవన్‌రామ్ అట్టడుగు, అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి అని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి పేర్కొన్నారు. తెయూ ఎస్సీ సెల్ డైరెక్టర్ వాణి అధ్యక్షతన బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి ఉత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రిజిస్ట్రార్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, కేంద్రంలో వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా కూడా వ్యవహరించి దళిత హక్కుల రక్షణ కోసం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ మామిడాల ప్రవీణ్, ప్రొఫెసర్ కనకయ్య, బీ అంజయ్య, వైస్ ప్రిన్సిపల్ లక్ష్మణచక్రవర్తి, కిరణ్ రాథోడ్, బీఆర్‌నేత, విద్యార్థులు పాల్గొన్నారు. యువత ఆదర్శంగా తీసుకోవాలినిజామాబాద్ సిటీ: స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ జయంతిని కాంగ్రెస్ నాయకులు శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ అంటరానితనానికి వ్యతిరేకంగా జగ్జీవన్‌రామ్ పోరాడారని, నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మీసాల సుధాకర్ రావు, జావేద్ అక్రమ్, ప్రొఫెసర్ విద్యాసాగర్, నరేందర్ గౌడ్, కోనేరు సాయికుమార్, గోపి, సంతోష్, ప్రమోద్, బొబ్బిలి రామకృష్ణ, వినయ్, సుభాష్ జాదవ్, నరేందర్‌సింగ్, స్వామి గౌడ్, సంగెం సాయిలు, చాంగూబాయి, అపర్ణ తదితరులు పాల్గొన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి -
రాములోరి కల్యాణానికి పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శ్రీరామనవమి పురస్కరించుకొని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ దంపతులు ఆదివారం జిల్లాలోని భీమ్‌గల్ మండలం పిప్రి, రహత్‌నగర్ గ్రామాలకు రానున్నారు. రహత్‌నగర్ సమీపంలోని పిప్రి వద్ద ఉన్న లొద్ది రామన్న ఆలయంలో నిర్వహించనున్న శ్రీ సీతారాముల కల్యాణంలో పాల్గొననున్నారు. రహత్‌నగర్ మహేశ్ కుమార్‌గౌడ్ సొంత గ్రామం కాగా సరిహద్దులో ఉన్న పిప్రి వద్ద ఆయన తండ్రి బొమ్మ గంగాధర్‌గౌడ్ 1969లో ఈ రామాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం వారి కుటుంబానికి సెంటిమెంట్ కావడంతో చిన్ననాటి నుంచి నేటి వరకు సేవలు చేస్తూ వస్తున్నారు. సీతారాముల కల్యాణ క్రతువులో మహేశ్ గౌడ్ కుటుంబసమేతంగా పాల్గొననున్నారు. పీసీసీ అధ్యక్షుడు అయ్యాక మొదటిసారి గ్రామ కమిటీ ఆహ్వానం మేరకు మహేశ్ గౌడ్ రానున్నారు. నేడు వైన్ షాపులు బంద్ఖలీల్వాడి: శ్రీ రామనవమి సందర్భంగా జిల్లాలోని వైన్స్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లను నేడు(ఆదివారం) మూసివేయాల ని సీపీ పోతరాజు సాయిచైతన్య శనివారం ఆదేశించారు. ఆదివారం ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 వరకు మూసి ఉంచాలని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించి దుకాణాలు తెరిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి నిజామాబాద్‌అర్బన్: భారత మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కంఠేశ్వర్ కమాన్ వద్ద ఉన్న పాత అంబేడ్కర్ భవన్లో నిర్వహించిన ఉత్సవాల్లో ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్ పాల్గొని జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాత అంబేడ్కర్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొని బాబూ జగ్జీవన్‌రామ్ సేవలను కొనియాడారు. బా బూ జగ్జీవన్ రామ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు ప్రత్యేకించి యువత రం, విద్యార్థుల్లో స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ హనుమంతు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారిణి నిర్మల, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్, నిజా మాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, ఏసీపీ రాజావెంకట్ రెడ్డి, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు సుమన్, ఆయా శాఖల అధికారులు, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
అందుబాటులోకి ఎల్సీ యాప్
యాప్‌తో ప్రమాదాల నివారణ! విద్యుత్ లైన్ క్లియర్‌లో ఒక ఫీడర్ బదులు మరో ఫీడర్‌ను ఎంచుకోవడం, పంపిణీ వ్యవస్థ సరిగ్గా గుర్తు చేసుకోకపోవడం, సమాచార లోపం, తదితర కారణాలతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఉద్యోగులు, కిందిస్థాయి సిబ్బంది, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. వీటి నివారణ కోసం ఆన్లైన్ ఎల్సీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. యాప్ ద్వారా మానవ తప్పిదాలను పూర్తిగా నివారించొచ్చు. అలాగే అనవసరమైన ఎల్సీలు తగ్గించొచ్చు. ఎల్సీల సమయాలను గణనీయంగా తగ్గించడమే కాకుండా ఎల్సీ తీసుకున్న సమాచారం పైఅధికారులకు వెంటనే తెలిసిపోతుంది. సంబంధిత ఏఈ అనుమతి లేకుండా తీసుకునే ఎల్సీలను ఈ యాప్ ద్వారా నివారించొచ్చు. సుభాష్‌నగర్: విద్యుత్ వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు ఎన్పీడీసీఎల్ మరో యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆన్లైన్ ఎల్సీ (లైన్ క్లియర్) యాప్‌ను ప్రవేశపెట్టింది. ఎల్సీలు తీసుకుని పని చేసే సమయంలో మానవ తప్పిదాలు జరుగుతున్న నేపథ్యంలో నూతనంగా తీసుకొచ్చిన యాప్ అటు వినియోగదారులకు.. ఇటు ఎన్పీడీసీఎల్కు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. విద్యుత్ సరఫరాలో భద్రతా ప్రమాణాలను పెంచేందుకు, విద్యుత్ అంతరాయ సమయాలు, మానవ తప్పిదాలను నివారించేందుకు లైన్ క్లియర్ (ఎల్సీ) యాప్‌ను రూపొందించామని ఎన్పీడీసీఎల్ నిజామాబాద్ ఎస్ఈ రాపెల్లి రవీందర్ తెలిపారు. లైన్ క్లియర్ యాప్ అమలు విధానం విద్యుత్ సరఫరాలో ఎల్సీ తీసుకోవాలనుకున్న లైన్మెన్ మొదటగా లైన్ క్లియర్ యాప్ ఓపెన్ చే యాలి. సంబంధిత ఫీడర్లో ఎల్సీ కావాలని ఏఈకి విన్నవిస్తారు. ఏఈ లైన్మెన్ విన్నపాన్ని పరి శీలించి ఆ ఫీడర్లో ఎల్సీ ఇవ్వొచ్చా.. లేదా అని, అత్యవసర అవసరాలు ఏమైనా ఉన్నాయా లేదా మరే ఇతర షెడ్యూల్ చేసిన పనులు ఉన్నాయా అని సమీక్షించుకుంటారు. దాని ప్రకారం ఏఈ ఎల్సీ ఇవ్వొచ్చు లేదా నిరాకరించవచ్చు.. ఏఈ ఎల్సీకి అనుమతి ఇవ్వగానే సంబంధిత లైన్మెన్కు సమాచారం అందుతుంది. అలాగే సబ్‌స్టేషన్ ఆపరేటర్‌కు ఏ ఫీడర్ ఇవ్వాలో యాప్ ద్వారా మెసేజ్ వస్తుంది. సబ్‌స్టేషన్ ఆపరేటర్‌కు ఎల్సీ ఇవ్వాల్సిన సమయంలో పొరపాట్లు లేకుండా తగిన సూచనలు, జాగ్రత్తలు హెల్మెట్ పెట్టుకోవడం, హ్యాండ్ గ్లౌజ్ వేసుకోవడం, ఎర్త్ రాడ్ వేయాలని, ఏబీ స్వీచ్ ఓపెన్ చేస్తారా లేదా అని యాప్ గుర్తు చేస్తుంది. వీటన్నింటిని సబ్‌స్టేషన్ ఆపరేటర్ చేసి ఫొటో తీసి యాప్‌లో అప్లోడ్ చేస్తే ఆ ఫొటోను యాప్ ద్వారా లైన్మెన్ చూసి.. ఆ ఫొటోలో కనిపిస్తున్న ఫీడర్, ఏబీ స్విచ్ ఓపెన్ చేసారా.. లేదా.. అని ధ్రువీకరించుకుని పనికి ఉపక్రమిస్తాడు. లైన్మెన్ ఎంతమంది సిబ్బందితో పని చేయిస్తున్నాడో వారి పేర్లు యాప్‌లో పొందుపర్చాలి. లైన్మెన్ పని పూర్తి కాగానే ఈ పనికి సంబంధించి ఫొటో, సిబ్బంది వచ్చారా.. లేదా అని యాప్‌లో పొందుపర్చి ఎల్సీని రిటర్న్ చేస్తారు. సబ్‌స్టేషన్ ఆపరేటర్‌కు యాప్ ద్వారా ఎల్సీ రిటర్న్ చేయాలని ఆదేశాలు వెళ్తాయి. రిటర్న్ చేసిన ఎల్సీ సమాచారం ఏఈకి అందుతుంది. ఏఈ ఆదేశాల మేరకు ఆ ఫీడర్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ఎన్పీడీసీఎల్ సేవలు లైన్ క్లియర్ అనుమతి నుంచి రిటర్న్ వరకు యాప్‌లోనే.. అనవసర ఎల్సీలకు చెక్ -
డాక్టర్ అవతారమెత్తిన కాంపౌండర్లు
నిజామాబాద్ నాగారం: పవిత్రమైన వైద్య వృత్తికే కళంకం తెస్తున్నాయి కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు. జిల్లా కేంద్రంలో వరుసగా వెలుగులోకి వస్తున్న ఘటనలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నగరంలోని ఓ ఆస్పత్రిలో ఇటీవల న్యూరో వైద్యుడు లేకపోవడంతో కాంపౌండరే వైద్యుడిగా అవతారమెత్తి సేవలందించడంపై అధికారులకు ఫిర్యాదు వెళ్లిన విషయం తెలిసిందే. అది మరువకముందే తాజాగా మరో రెండు ఆస్పత్రుల్లో కాంపౌండర్లు వైద్య నిపుణుల అవతారమెత్తారు. నగరంలోని శ్రీరామ నేత్ర వైద్యశాల, గిరిజా కంటి ఆస్పత్రులకు చెందిన వైద్యుడు కృష్ణమూర్తి గత మూడు రోజులుగా అందుబాటులో లేరు. దీంతో కంటి సమస్యలతో ఈ ఆస్పత్రులకు వచ్చే రోగులకు కాంపౌండర్లు పరీక్షలు నిర్వహిస్తూ మందులు సైతం రాస్తున్నారు. ఈ విషయమై శనివారం రోగులు ఫిర్యాదు చేయడంతో డీఎంహెచ్‌వో రాజశ్రీ స్పందించారు. డాక్టర్ సుప్రియ, అధికారులు వేణు తదితరులు కలిసి రాత్రి 7 గంటల నుంచి 9.30 గంటల వరకు రెండు ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. ఎంత మంది రోగులకు పరీక్షలు నిర్వహించి, మందులు రాశారో పరిశీలించారు. తనిఖీల విషయం తెలుసుకున్న డాక్టర్ కృష్ణమూర్తి ఆస్పత్రులకు చేరుకున్నారు. కాగా, పూర్తి నివేదిక అనంతరం చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో రాజశ్రీ ‘సాక్షి’తో తెలిపారు. ప్రముఖ కంటి వైద్యుడు కృష్ణమూర్తి ఆస్పత్రుల్లో ఘటన ఫిర్యాదు రావడంతో వైద్యాధికారుల తనిఖీలు -
వేడుక చూద్దాం
రారండోయ్..ఇందూరు రఘునాథుడు విద్యుత్ దీపాల వెలుగులో సుభాష్‌నగర్ రామాలయంసత్యం, దయ, ప్రేమ, ధర్మం మూర్తీభవించిన శ్రీరాముడి జన్మదిన వేడుకలకు జిల్లా ముస్తాబైంది. సీతారాముల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా కేంద్రంలోని రఘునాథ ఆలయం, బడా రాంమఠం, సుభాష్‌నగర్ రామాలయం, ఖిల్లా డిచ్పల్లి, శక్కర్‌నగర్ కోదండరామాలయం, ఆర్మూర్‌లోని సిద్దులగుట్ట, అంకాపూర్, కందకుర్తి, తాడ్‌బిలోలి రామాలయాలు నవమి వేడుకలకు ముస్తాబయ్యాయి. లక్షలాది మంది భక్తులు రాములోరిని దర్శించుకుని కల్యాణోత్సవంలో పాల్గొననున్నారు. సుభాష్‌నగర్‌లోని రామాలయంలో సీతమ్మవారికి ఓ భక్తుడు బంగారు పట్టుచీర కానుకగా అందించగా, అంకాపూర్‌లో ప్రత్యేక రథాన్ని తయారు చేయించారు. ఇలా ఎక్కడ చూసినా శ్రీరామనవమి వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆలయాలను విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. – నిజామాబాద్ రూరల్సుభాష్నగర్ రామాలయంలో దేవతామూర్తులు ● నేడు శ్రీరామనవమి ● సుగుణాభిరాముడి కల్యాణానికి ఏర్పాట్లు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నాలుగు దశాబ్దాల చరిత్రి ఉన్న ఇందూరు నగరంలోని సుభాష్‌నగర్ రామాలయానికి ఓ భక్తుడు అపురూపమైన కాను క ఇచ్చారు. నగరానికి చెందిన జ్యూయెలరీ షాపు యజమాని మనోహర్ దంపతులు రామలక్ష్మ ణులకు, హనుమంతులవారికి పట్టు వస్త్రాలు బ హూకరించడంతోపాటు సీతమ్మ తల్లికి బంగారు పట్టు చీరను బహూకరించారు. అత్యంత నాణ్యమైన పట్టుతోపాటు 7 గ్రాముల బంగారం కలిపి ఈ చీరను తయారు చేశారు. దేశంలోనే ప్రఖ్యాతి కలిగిన సిరిసిల్లకు చెందిన ప్రముఖ నేత కళా కారుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ప్రధాని మో దీతో ప్రశంసలు పొందిన హరిప్రసాద్ ఈ చీరను తయారు చేశారు. అగ్గిపెట్టెలో పట్టేంత పట్టుచీర, దబ్బణంలో దూరే చీర వంటివి అనేకం తయారు చేసిన హరిప్రసాద్.. భారతదేశం, అశోకచక్రం, జాతీయగీతం, జీ20 సదస్సు ప్రత్యేకతలను తెలుపుతూ చీరలను తయారు చేశారు. అయోధ్య బాలరాముడికి పట్టు వస్త్రాలు, భద్రాచలం సీత్మమ్మవారికి పట్టు చీర అందించిన హరిప్రసాద్‌తో ఈ చీరను తయారు చేయించారు. శనివారం బంగారు పట్టు చీరను ఆలయ కమిటీకి మనోహర్ దంపతులు అందజేశారు. సీతారాముల కల్యా ణోత్సవంలో ఈ చీర తో సీతమ్మను అలంకరించనున్నారు. ఆలయ 40వ వార్షిక బ్రహ్మోత్సవాలను, సీతారాముల క ల్యాణాన్ని పురస్కరించుకుని ఇంత అపురూపమై న కానుక అందించడం సంతోషంగా ఉందని ఆలయ కమిటీ చైర్పర్సన్ సరళామహేందర్రెడ్డి అన్నారు. దాతల సహకారంతో కచ్చితమైన విధానంలో సుభాష్‌నగర్ రామాలయంలో క్రతువులు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆలయ 40వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 3వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈ నెల 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవ కార్యక్రమ క్రతువులు నిర్వహించనున్నారు. 1986 ఏప్రిల్ 14వ తేదీన ఆలయ ప్రతిష్ఠ జరిగింది. 40వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఆలయంలో ప్లాస్టిక్ రహితంగా అన్ని కార్యక్రమాలు చేసేందుకు స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం దాతలు స్టీల్ వస్తువులు సమకూరుస్తున్నారు.సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శ్రీరాముడు, హనుమంతుడి భక్తుడైన సమర్థ రామదాసు 17వ శతా బ్దంలో నిర్మింపజేసిన ఆలయాలు ఇందూరు జిల్లా ఘనమైన చరిత్రను ఠీవిగా నిలబెడుతున్నాయి. మహారాష్ట్ర పక్కనే ఉండడంతో ఇందూరు జిల్లాలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ ప్ర భావం ఎక్కువగా ఉంది. ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసుచే నిర్మితమైన పెద్దరామమందిర్, విస్తరించబడిన రఘునాథ ఆలయం గత చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఈ ఆలయాలకు, డిచ్పల్లిలోని రామాలయానికి అనుసంధానంగా భూగర్భంలో సొరంగ మార్గాలు ఉన్న ట్లు రఘునాఽథ ఆలయ గోడలపై సూచికలు ఉన్నాయి. రఘునాఽథ ఆలయాన్ని గుట్టపై 914–928 సంవత్సరాల మధ్య రాష్ట్రకూట రాజవంశానికి చెందిన ఇంద్రుడు అనే రాజు 3,900 గజాల కోటను నిర్మించాడు. అదేవిధంగా ఇక్కడ 53 అడుగుల ఎల్తైన అఖండ శిలాఽధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. దీనిపై గరుడదీపం వెలిగిస్తే చుట్టుపక్కల ఊర్ల ప్రజలు దీపాలు వెలిగించుకునేవారు. కాగా రఘునాథుడనే మహర్షి ఖిల్లాలోని ప్రత్యేక సొరంగ మార్గం గుండా బొడ్డెమ్మ చెరువుకు వెళ్లి స్నానం చేసి వచ్చేవారని చరిత్ర చెబుతోంది. తరువాత 17వ శతాబ్థంలో సమర్థ రామదాసు శ్రీరాముడి ఆలయాన్ని నిర్మింపజేశారు. అదేవిధంగా ఇక్కడ ధాన్యమందిరం నిర్మించారు. ఇందులో సమర్థ రామదాసుతో పాటు ఛత్రపతి శివాజీ సైతం ధాన్యం చేసుకున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న పెద్ద రామమందిర్‌ను 17వ శతాబ్థంలో సమర్థ రామదాసు నిర్మింపజేశారు. ఇక్కడ శ్రీరాముడు, హనుమాన్ మంది రాలు ఎదురెదురుగా ఉంటాయి. శ్రీరాముడి విగ్ర హం పాదాల నుంచి సమాంతరంగా హనుమంతు డి తలభాగం ఉండేలా నిర్మాణం చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ ప్రాంగణంలో ఉన్న కోనేరు ఆకట్టుకుంటుంది. ఇందులో గోశాల చక్కగా నిర్వహిస్తున్నారు. ‘బడా రామ్ మఠం్’ ఆధ్వర్యంలో ఈ ఆల యం నిర్వహిస్తున్నారు. మఠాఽధిపతులుగా 1632 నుంచి ఉద్ధవ్ స్వామి, 1656 నుంచి మాధవ్ స్వా మి, 1687 నుంచి గోవింద్ స్వామి, 1725 నుంచి అ నంత్ స్వామి, 1739 నుంచి నృసింహ స్వామి, 1754 నుంచి రామకృష్ణ స్వామి, 1778 నుంచి రా మచంద్ర స్వామి, 1804 నుంచి జయరామ్ స్వామి, 1834 నుంచి ఆత్మారాం స్వామి, 1848 నుంచి వామన్ స్వామి, 1853 నుంచి రాజారాం స్వామి, 1866 నుంచి కేశవ్ స్వామి, 1904 నుంచి కల్యాణ్ స్వామి, 1905 నుంచి దినకర్ స్వామి 1983 నుంచి యశోజీ స్వామి మఠాధిపతులుగా ఉన్నారు. ఛత్రపతి శివాజీ ఈ ఆలయాన్ని సందర్శించారు. సమర్థ రామదాసు నిర్మించిన ఆలయాల్లో కొలువుదీరిన కోదండరాముడు ఠీవిగా వెలుగుతున్న ఆలయాలు నాటి చారిత్రక వైభవాన్ని సజీవంగా నిలబెట్టిన పెద్దరామమందిర్, రఘునాథ ఆలయాలు జిల్లాపై ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసు ముద్ర -
మూడురోజులపాటు ఉత్సవాలు..
భక్తుల కొంగు బంగారం కోదండ రామాలయం డిచ్పల్లి: జిల్లాలోనే చారిత్రక ఆలయమైన డిచ్పల్లి ఖిల్లా రామాలయంలో మూడు రోజులపాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. కాకతీయుల కాలం నాటి అపురూప శిల్పకళా నిలయంగా ఉన్న రామాలయానికి వేలాది సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం హనుమంత సేవ, ఆదివారం ఉదయం 11 గంటలకు శ్రీరాముని జననం, 12.01 గంటలకు శ్రీసీతారామచంద్ర స్వామి కల్యాణం, రాత్రి 7 గంటలకు స్వామి వారికి అశ్వవాహన సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సోమవారం ఉదయం 11 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం, రాత్రి 7 గంటలకు హనుమంతుని సేవతో నవమి ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ కమిటీ చైర్మన్ శాంతయ్య, ప్రధానార్చకులు సుమిత్ శర్మ దేశ్‌పాండే తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ, వీడీసీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ ధర్మకర్త గజవాడ రాందాస్‌గుప్తా కుటుంబ సభ్యులు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. బోధన్‌టౌన్(బోధన్): జిల్లా కేంద్రానికి 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న బోధన్‌లోని శక్కర్‌నగర్ కోదండ రామాలయం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ఈ ఆలయాన్ని 1951లో నిర్మించారు. పాలరాతిపై చెక్కిన సీతారామ లక్ష్మణ విగ్రహాలను అప్పట్లో ప్రతిష్టించారు. 74 యేళ్ళు గడుస్తున్నా దేవతా మూర్తుల పాలరాత్రి విగ్రహాలు వన్నె తగ్గకపోవడం విశేషం. ఆలయప్రాంగణం 2 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. కలియుగ వైకుంఠమైన భద్రాద్రిలో నిర్వహించే రాములోరి పెళ్లిలాగే ఇక్కడ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణుల దేవతా విగ్రహాలు పశ్చిమాభిముఖంలో ఉండటం కారణంగా రెండో భద్రాద్రిగా ప్రఖ్యాతిపొందింది. ప్రతియేటా శ్రీరామనవమి ఉత్సవాలను వారంరోజులపాటు నిర్వహిస్తారు. ఆదివారం రాములోరి కల్యాణోత్సవం, సోమవారం పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. -
కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి
సిరికొండ: ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. సిరికొండ మండలం ముషీర్‌నగర్, గడ్కోల్, తాళ్లరామడుగు, హుస్సేన్‌నగర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. ముషీర్‌నగర్‌లో వర్షానికి తడిచిన ధాన్యాన్ని పరిశీలించారు. దళారులను ఆశ్రయించొద్దు నిజామాబాద్ రూరల్: రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని గుండారం సింగిల్ విండో చైర్మన్ దాసరి శ్రీధర్ అన్నారు. రూరల్ మండలంలోని గుండారంలో ఏర్పాటు చేసిన కొనుగొలు కేంద్రాన్ని గ్రామ ప్రత్యేకాధికారి, తహసీల్దార్ అనురుద్తో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని వి క్రయించాలని కోరారు. బర్ధిపూర్‌లో.. డిచ్పల్లి: డిచ్పల్లి మండలం బర్ధిపూర్, డిచ్పల్లి సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ ప్రభాకర్, మండల వ్యవసాయాధికారి సుధామాధురి, సొసైటీ చైర్మన్లు రామకృష్ణ, రాంచందర్‌గౌడ్ శుక్రవారం ప్రారంభించారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
డిచ్పల్లి: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ యూనిట్–4, యూనిట్–1 ప్రోగ్రాం ఆఫీసర్లు స్రవంతి, స్వప్న పేర్కొన్నారు. డిచ్పల్లి మండలం సుద్దపల్లిలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వేసవి కాల ప్రత్యేక శిబిరంలో భాగంగా శుక్రవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. గిరిరాజ్ కాలేజ్ ఆధ్వర్యంలో.. డిచ్పల్లి మండలం ధర్మారం(బి)లో శుక్రవారం జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్–3 ఆధ్వర్యంలో వేసవి ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించారు. ఆకుల కొండూర్‌లో.. నిజామాబాద్ రూరల్: రూరల్ మండలంలోని ఆకుల కొండూరు గ్రామంలో గిరిరాజ్ కళాశాల ఎన్ఎస్ఎస్ వలంటీర్లు ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభించారు. నర్సింగ్‌పల్లి, మోపాల్‌లో.. మోపాల్: మండలంలోని నర్సింగ్‌పల్లిలో గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల జాతీయ సేవా పథకం యూనిట్–2 ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో వేసవి శిబిరాన్ని నిర్వహించారు. అలాగే ఎన్ఎస్ఎస్ యూనిట్–5 ఆధ్వర్యంలో మోపాల్‌లో వేసవి శిబిరాన్ని ఏర్పాటు చేశారు. -
డాక్టరేట్ సాధించిన రాంప్రసాద్
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో పరిశోధక విద్యార్థి కొంగల రాంప్రసాద్ పీహెచ్డీ డాక్టరేట్ సాధించారు. అసోసియేట్ ప్రొఫెసర్ రాజేశ్వరి పర్యవేక్షణలో ‘టాలెంట్ అక్వేషన్స్ అండ్ టాలెంట్ మేనేజ్మెంట్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ –ఏ సెలెక్ట్ స్టడీ’ అనే అంశంపై రాంప్రసాద్ పరిశోధన జరిపి సిద్ధాంత గ్రంథం సమర్పించారు. శుక్రవారం జరిగిన బహిరంగ మౌఖిక పరీక్షకు బెంగుళూరు సిటీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ముని నారాయణప్ప ఎక్స్టర్నల్ ఎగ్జామినర్‌గా వ్యవహరించారు. -
రెండేళ్లలో ప్రాణహిత చేవెళ్ల పూర్తి చేయిస్తా
సిరికొండ: ప్రాణహిత చేవెళ్ల ప్యాకేజీ 21, 22 పనులను రెండేళ్లలో పూర్తి చేయించి మండలానికి సాగు నీరందిస్తానని ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు. సిరికొండ మండలం మెట్టుమర్రి తండా, గడ్డమీది తండా, కొండాపూర్, గోప్య తండా, గడ్కోల్, హు స్సేన్నగర్, తాళ్లరామడుగు గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లను, గడ్కోల్‌లో రూ. మూడు కోట్లతో విస్త రించిన డబుల్ రోడ్డును, రూ. 12 లక్షలతో నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించా రు. గడ్కోల్ కప్పలవాగుపై రూ.2.46 కోట్ల తో ని ర్మించనున్న చెక్‌డ్యాం, లొంక రోడ్డులో రూ. మూడు కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి పనులకు, కొండాపూర్ వడ్డెర కాలనీ నుంచి కార్నర్ తండా వరకు రూ. రెండున్నర కోట్లతో నిర్మించనున్న డబుల్ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దివంగత వైఎస్సార్ హ యాంలో 90 శాతం పూర్తయిన మంచిప్ప ప్రాజెక్టు పనులను పూర్తి చేయకుండా గత ప్రభుత్వం రీడిజై న్ పేరిట పైపులైన్లు అంటు కాలయాపన చేసింద న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీలను అమలు చేస్తూ పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తోందని అన్నారు. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన బీసీ బిల్లుకు కేంద్రం మోకాలడ్డుతోందని విమర్శించారు. కార్యక్రమాల్లో ఏఎంసీ చైర్మన్ ము ప్ప గంగారెడ్డి, శేఖర్‌గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్కోల్ భాస్కర్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు బాకా రం రవి, గొల్ల ఎర్రన్న, చందర్‌నాయక్, సొసైటీ చైర్మన్ గంగాధర్, ఏఎంసీ డైరెక్టర్లు సంపత్‌రెడ్డి, ముత్తెన్న, దేగాం సాయన్న, భానుచందర్, బాల్సింగ్, సంతోష్, కుందేళ్ల శ్రీనివాస్, జగన్, శ్రీధర్, సంతోష్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పలు అభివృద్ధి పనులకు భూమిపూజ -
ఇందూరు పసుపునకు జియో ట్యాగింగ్ ఇవ్వాలి
సుభాష్‌నగర్: అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఇందూరు పసుపునకు కూడా జియో ట్యాగింగ్ భౌగోళిక గుర్తింపు తీసుకురావాలని జేఎంకేపీఎం డైరెక్టర్ పాట్కూరి తిరుపతిరెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామ సరిహద్దు ప్రాంతాల్లో పండించే చపాట మిర్చికి జియో ట్యాగింగ్ భౌగోళిక గుర్తింపు రావడం చాలా సంతోషకరమైన విషయమని ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా జిల్లాలో పండే పసుపునకు కూడా అంతర్జాతీయ భౌగోళిక గుర్తింపు కోసం ఫిబ్రవరిలో ఉద్యానవన శాఖ ద్వారా దరఖాస్తు చేశామన్నారు. భౌగోళిక గుర్తింపు వస్తే ఇక్కడి పసుపు రైతులకు కూడా మంచి రోజులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. తిమ్మంపేట్ మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో భౌగోళిక గుర్తింపు కోసం కృషి చేసిన సంఘం అధ్యక్షుడు రాజ్కుమార్రెడ్డితోపాటు ప్రతిఒక్కరికి పసుపు రైతుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
డిచ్పల్లి: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ యూనిట్–4, యూనిట్–1 ప్రోగ్రాం ఆఫీసర్లు స్రవంతి, స్వప్న పేర్కొన్నారు. డిచ్పల్లి మండలం సుద్దపల్లిలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వేసవి కాల ప్రత్యేక శిబిరంలో భాగంగా శుక్రవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. గిరిరాజ్ కాలేజ్ ఆధ్వర్యంలో.. డిచ్పల్లి మండలం ధర్మారం(బి)లో శుక్రవారం జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్–3 ఆధ్వర్యంలో వేసవి ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించారు. ఆకుల కొండూర్‌లో.. నిజామాబాద్ రూరల్: రూరల్ మండలంలోని ఆకుల కొండూరు గ్రామంలో గిరిరాజ్ కళాశాల ఎన్ఎస్ఎస్ వలంటీర్లు ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభించారు. నర్సింగ్‌పల్లి, మోపాల్‌లో.. మోపాల్: మండలంలోని నర్సింగ్‌పల్లిలో గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల జాతీయ సేవా పథకం యూనిట్–2 ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో వేసవి శిబిరాన్ని నిర్వహించారు. అలాగే ఎన్ఎస్ఎస్ యూనిట్–5 ఆధ్వర్యంలో మోపాల్‌లో వేసవి శిబిరాన్ని ఏర్పాటు చేశారు. -
పదోన్నతి బాధ్యతను పెంచుతుంది
నిజామాబాద్ రూరల్: పదోన్నతులు ఉద్యోగ జీవితంలో మధుర జ్ఞాపకాలని, ఉపాధ్యాయులకు మరింత బాధ్యతను పెంచుతాయని ఉపాధ్యాయుల కోర్సు డైరెక్టర్, జడ్పీహెచ్ఎస్ గూపన్పల్లి హెచ్ఎం ఎ శకుంతలా దేవి అన్నారు. శుక్రవారం గూపన్పల్లి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందిన తెలుగు ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఉపాధ్యాయులకు పాఠ్యపుస్తకాల తాత్వికత, బోధన వ్యూహాలు, సామర్థ్యాల సాధన, అభ్యసన ఫలితాలు, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ప్రశ్నాపత్రాలు, మూల్యాంకనం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. విద్యార్థులు మాతృభాషలో ధారాళంగా చదవగలగడం, అర్థం చేసుకొని రాయగలడం, తెలుగు సాహిత్య ప్రక్రియలు రూపొందించగలగడం స్వయంగా చేయాలని సూచించారు. ఈ జ్ఞానం ఇతర విషయాలు నేర్చుకోడానికి దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఘనపురం దేవేందర్, శ్రీనివాస్‌గౌడ్, డాక్టర్ గంట్యాల ప్రసాద్, ప్రవీణ్ శర్మ, కేసీ లింగం, అజయ్ పాల్గొన్నారు. -
కొనుగోళ్లను త్వరగా చేపట్టాలి
సుభాష్‌నగర్: జిల్లాలో అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి శుక్రవారం ప్రకటనలో డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంలో ఆలస్యం కావడంతోనే కళ్లాల్లో ఉన్న పంట అకాల వర్షానికి తడిసిందన్నారు. ప్రభుత్వం రైతు ఉత్పిత్తిదారుల సంఘాలు, సొసైటీలు, డీసీఎంఎస్, ఐకేపీల ద్వారా కొనుగోలు చేయాలని ఆదేశాలిస్తే.. అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన గ్రామాల్లో ఐకేపీ ద్వారా కొనుగోళ్లు చేపడుతూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. అధికార యంత్రాంగం వెంటనే తీరు మార్చుకుని కొనుగోళ్లను త్వరగా చేపట్టాలని డిమాండ్‌చేశారు. తడిసిన ధాన్యం పరిశీలనధర్పల్లి: మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రాల వద్ద అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని బీజేపీ కిసాన్ మోర్చ రాష్ట్ర నాయకుడు నూతల శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రాల వద్ద అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. బీజేపీ మండలాధ్యక్షుడు మహిపాల్ యాదవ్, రైతులు ఉన్నారు. లబ్ధిదారులు పనులు ప్రారంభించాలి మోపాల్: ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే పనులు ప్రారంభించాలని మండల ప్రత్యేకాధికారి గోవింద్ సూచించారు. శుక్రవారం మోపాల్ మండలంలోని నర్సింగ్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో రాములు నాయక్, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్, లబ్ధిదారులు ఉన్నారు. పీహెచ్సీ తనిఖీ మండలంలోని ముదక్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల ప్రత్యేకాధికారి గోవింద్, ఎంపీడీవో రాములు నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. వారి వెంట డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో తుకారాం రాథోడ్, సిబ్బంది ఉన్నారు. గురుకుల సందర్శన డిచ్పల్లి: జిల్లా కేంద్రంలోని కోటగల్లి శంకర్‌భవన్ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ట్విన్నింగ్ ప్రోగ్రాం పీఎంశ్రీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం డిచ్పల్లి మండలం ధర్మారం(బి)లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలను సందర్శించారు. సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం డిచ్పల్లి మండలం రాంపూర్ శివారులోని విశ్వ ఆగ్రోటెక్ను సందర్శించారు. ఉపాధ్యాయులు శైలేష్, గంగాకిషన్, గోపి, రాములు, స్వర్ణలత, విద్యార్థులు పాల్గొన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి నిజామాబాద్ రూరల్: విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా పయనించాలని కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు బాగిర్తి బాగారెడ్డి అన్నారు. రూరల్ మండలంలోని మల్కాపూర్‌లో ఉన్న ప్రభుత్వ పాటశాలలో ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు. విద్యార్థుల డ్యాన్స్‌లు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీ రామనారాయణ, నోడల్ ఆఫీసర్ అమరనాథ్, సీతాదేవి, చక్రపాణి ,శ్రీనివాస్, రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. -
రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ లక్ష్యం
మోపాల్: భారతదేశ రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను అందించే లక్ష్యంతో ముందుకెళ్తుందని టీపీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం మోపా ల్ మండలం కులాస్పూర్, చిన్నాపూర్, బాడ్సి గ్రామాల్లో కాంగ్రెస్ జాతీయ నాయకత్వ సూచనల మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమ పాదయాత్ర నిర్వహించారు. గ్రామాల్లో అంబేడ్కర్, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాడ్సి శేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి రూపకల్పన చేశారన్నారు. కార్య క్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లోల్ల సాయిరెడ్డి, బాడ్సి సొసైటీ చైర్మన్ మోహన్‌రెడ్డి, చిన్నాపూర్ పోశెట్టి, దిలావర్ హుస్సేన్, ఆకుతోట సాయన్న, లక్ష్మారెడ్డి, ఈరమ్మ జగదీశ్, రవి, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఇందూరు అభివృద్ధికి సహకరిస్తాం
సుభాష్‌నగర్: నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీలు, ఇందూరు నగర అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తా మని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రధాన కార్యదర్శి కటికితల శ్రీనివాస్ పే ర్కొన్నారు. ఢిల్లీలోని నిర్మాణ్ భవన్లో ఆయనను ఎంపీ అర్వింద్ , ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, డాక్టర్ సంజయ్‌కుమార్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలు, ఇందూరు అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి లో భాగంగా నగర సుందరీకరణ, రోడ్లు, పార్కులు తదితర నిర్మాణాలపై చర్చించినట్లు ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే ధన్పాల్ తెలిపారు. అభివృద్ధి పనులకు కేంద్ర నిధులు వచ్చేలా కృషి చేస్తానని శ్రీనివాస్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు మోరెపల్లి సత్యనారాయణ, జ్యోతి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ సీఎంను కలిసిన ఎంపీ, ఎమ్మెల్యే ఢిల్లీ సీఎం రేఖా గుప్తాను ఎంపీ అర్వింద్ ధర్మపురి, ఎమ్మెల్యే ధన్పాల్ ఢిల్లీ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఢిల్లీలో కలిసిన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు -
రికార్డులు పక్కాగా నమోదు చేయాలి
● సగం కొనుగోలు కేంద్రాలు మహిళా సంఘాలకు కేటాయింపు ● కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ● రెంజల్లో కేంద్రాల పరిశీలనరెంజల్(బోధన్): కొనుగోలు కేంద్రాల్లో ధా న్యం సేకరణకు సంబంధించిన రికార్డులను పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు నిర్వాహకులకు సూచించారు. జిల్లాలో 50 శాతం కేంద్రాలను మహి ళా సంఘాలకు కేటాయించినట్లు తెలిపారు. రెంజల్ మండలం దూపల్లి, దండిగుట్ట, రెంజల్ గ్రామంలోని కొనుగోలు కేంద్రాలను శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. కేంద్రాల నిర్వహణ, రికార్డుల నమోదులను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 700 కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించామని, ఇప్పటి వరకు 100 కేంద్రాల్లో కొనుగోళ్లు మొదలైనట్లు తెలిపారు. రైతులకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నా రు. దూపల్లి, దండిగుట్ట, రెంజల్ కేంద్రాల్లో ట్రక్షీట్లు అందించకపోవడం, రిజిస్టర్లలో వివరాలు సక్రమంగా నమోదు చేయకపోవడంపై కలెక్టర్ అ సంతృప్తి వ్యక్తం చేశారు. ట్రక్షీట్లు వచ్చిన వెంటనే ట్యాబ్‌లో ఎంట్రీ చేసి రైతుల నుంచి సేకరించిన ధాన్యం రకం, ఎన్ని క్వింటాళ్లో స్పష్టంగా తెలిసేలా రసీదులు అందించాలన్నారు. దీంతో బిల్లుల చెల్లింపుల్లో తేడా లు రాకుండా ఉంటుందన్నారు. మహిళా సంఘాలకు కేటాయించిన కొనుగోలు కేంద్రాల్లో విండో సీఈవోలు, ఏఈవోలు సహకరించాలన్నారు. ధాన్యం లోడింగ్, అన్లోడింగ్, హమాలీలు, లారీల కొరత రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట డీఆర్డీవో సాయాగౌడ్, డీఎస్వో అరవింద్‌రెడ్డి, డీసీవో శ్రీనివాస్, డీపీఎం సాయిలు, ఇన్చార్జి తహసీల్దార్ శ్రావణ్‌కుమార్, ఏపీఎం చిన్నయ్య ఉన్నారు. -
మహిళ హత్యకేసులో ఒకరి అరెస్ట్
ఖలీల్‌వాడి: ఇటీవల పాంగ్రాలో జరిగిన ఒంటరి మహిళ హత్య ఘటనలో నిందితుడిని పట్టుకొని, అరెస్టు చేసినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నగరంలోని పాంగ్రాలో చారుగొండ చంద్రకళ(55) ఒంటరిగా నివసిస్తుండగా, ఆమెకు కల్లు దుకాణంలో కామారెడ్డి జిల్లాలోని హరిజనవాడకు చెందిన శంషాబాద్ విజయ్ ఆలియాస్ విష్ణు ఆలియాస్ చింటూ పరిచయమయ్యాడు. గతనెల 23న ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించడానికి ఇంటికి వెళ్లి కల్లు తాగించాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు చెవికమ్మలు, మాటీలు, వెండి ఆభరణాలతోపాటు సెల్‌ఫోన్‌ను నిందితుడు తీసుకొని, వెంటతెచ్చుకున్న కత్తితో గొంతు కోసి హత్యచేశాడు. అదే గ్రామంలోని ఓ ఇంటి ఎదుట పార్క్ చేసిన బైక్‌పై పారిపోయాడు. కేసు నమోదు చేసి, విచారణ చేపట్టగా, నిందితుడిని పట్టుకున్నట్లు తెలిపారు. అలాగే అతడి వద్ద నుంచి ఏడు గ్రాముల బంగారం, 75 గ్రాముల వెండి, హత్యకు ఉపయోగించిన కత్తి, బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును చేధించిన సీఐ శ్రీనివాసరాజు, ఎస్సై శ్రీకాంత్, సిబ్బందిని సీపీ అభినందించారు.